కేప్ కెనావెరల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) వ్యోమగాములతో కలకలలాడుతుంది. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారి సంఖ్య 10కు పెరిగింది. ఇది దశాబ్ద కాలంలో ఈ సంఖ్యలో ఉండడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 23 శుక్రవారం ఉదయం 5.49 గంటలకు అమెరికా ఫ్లోరిడా స్టేట్ లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ -9 రాకెట్‌ను ఉపయోగించి స్పేస్ ఎక్స్ నలుగురు ఆస్ట్రోనాట్స్‌లను పంపిన విషయం తెలిసిందే. వారు శనివారం రోజున ఐఎస్ఎస్ డ్రాగన్ క్యాప్సూల్ ఉదయం 5 గంటలకు చేరుకుంది. వీరి రాకతో ఒక్కసారిగా ఐఎస్ఎస్‌లో ఉన్నవారి సంఖ్య పెరిగింది.
ప్రస్తుతం పంపిన ఈ మిషన్ లో నాసాకు చెందిన షేన్ కింబ్రో, మేగన్ మెక్ ఆర్థర్, జపాన్‌కు చెందిన హోషిడే, ఫ్రాన్స్ కు చెందిన పీస్కెట్ ఉన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో బాధ పడుతున్న ఈ సమయంలో మాకు ఒక్కింతా ధైర్యాన్ని, ఆశను ఇస్తార’ని జపనీస్ స్పేస్ ఏజెన్సీ ప్రెసిడెంట్ హిరోషి యమాకవా ఐఎస్‌ఎస్ సిబ్బందితో తెలిపారు. నాసా స్పేస్ షటిల్ చరిత్రలో అంతకుముందు ఐఎస్‌ఎస్‌లో 13 మంది వ్యోమగాములు ఉండి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ఆరుగురు అమెరికన్లు, ఇరువురు రష్యన్లు, ఇరువురు జపాన్ శాస్త్రవేత్తలు, ఒక ఫ్రెంచి దేశానికి చెందిన వారు ఉన్నారు. వీరిలో నలుగురు శాస్త్రవేత్తలు వచ్చే బుధవారం రోజున భూమి మీదకి రానున్నారు.
కాగా ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ప్రయోగించిన రెండు డ్రాగన్ క్యాప్సూల్స్ ఐఎస్‌ఎస్‌తో కలిసి ఉన్నాయి. డ్రాగన్ క్యాప్సూల్‌ను తిరిగి ఈ మిషన్‌కు వాడటం రెండోసారి. రి యూసబుల్ రాకెట్లను వాడటంలో స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: అంగారక గ్రహంపై ఆక్సిజన్...!
Comments
Please login to add a commentAdd a comment