ISS astronauts
-
సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunitha villiams) ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల కోసమని అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు బారీ విల్మోర్, సునీత విలియమ్స్‌లు ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారిని స్పేస్ఎక్స్ డ్రాగన్‌లో భూమిపైకి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది. అయితే ఇటీవల సునీతాకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ కావడంతో ఆమె అనారోగ్యానికి గురయ్యిందని పలు కథనాలు రావడం మొదలయ్యాయి. ఈ తరుణంలో తన ఆరోగ్య పరిస్థితిపై ఐఎస్ఎస్ నుంచి సునీతా స్వయంగా అప్ డేట్ ఇచ్చారు. తన శారీరక పరిస్థితి, బరువు తగ్గడం తదితర ఊహగానాలకు చెక్‌పెట్టేలా తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అలాగే తాను బరువు కోల్పోలేదని పెరిగానని చెప్పారు. తాను అంతరిక్షం కేంద్రవ వద్దకు వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నానో అంతే ఉన్నానని అన్నారు. అంతేగాదు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా చంద్రుడు, అంగారక గ్రహంపై భవిష్యత్తులో మానవ అన్వేషణ లక్ష్యంగా చేస్తున్న ఈ మిషన్ కొనసాగుతుందని ధీమాగా చెప్పారు. అలాగే అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ కారణంగానే తన శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయే తప్ప బరువు కోల్పోలేదని వివరించారు. మైక్రోగ్రామిటీ వల్లే ఇదంతా..అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీకి శరీరంమంతా ఉండే ద్రవాలు పునః పంపిణీ అవుతుంటాయి. దీంతో తమ తలలు చాలా పెద్దవిగా కనిపిస్తాయని అన్నారు సునీతా. అలాగే ఈ అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వ్యాయామాలు, వర్కౌట్లు వంటివి అత్యంత అవసరమని అన్నారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వారి తుంటి, వెన్నుమకల్లో ప్రతి నెల రెండు శాతం వరకు ఎముక సాంద్రతను కోల్పోతారని అన్నారు. అలా జరగకుండా ఉండేందుకు తాము వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్లు, ట్రెడ్మిల్ వర్కౌట్లతో సహా రోజువారీ ..వ్యాయామం రెండు గంటలకు పైగా చేస్తామని చెప్పారు. విపరీతంగా చేసిన వ్యాయమాల కారణంగానే శరీరాకృతిలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. అలాగే తాను బాగానే తింటున్నాని, ముఖ్యంగా..ఆలివ్‌లు, అన్నం, టర్కిష్ చేపల కూర తింటున్నట్లు చెప్పారు. (చదవండి: క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం.. నాసా ఏం చెప్పింది?) -
క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం.. నాసా ఏం చెప్పిందంటే?
వాషింగ్టన్: బోయింగ్ తయారీ స్టార్‌లైనర్ సంస్థ పంపిన రాకెట్లో ప్రొపల్షన్ వ్యవస్థలో లోపం కారణంగా భూమికి తిరిగిరాలేక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉండిపోయిన భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎస్ఎస్కు వెళ్లేటపుడు పుష్టిగా ఉన్న సునీత తర్వాత బక్కచిక్కిపోయారని వార్తలొచ్చాయి. బుగ్గలు నొక్కుకుపోయిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో చివరకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురైంది. ముందస్తు సన్నద్ధత లేకుండా సుదీర్ఘకాలంపాటు భారరహిత స్థితిలో గడపడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నదని మీడియాతో కథనలు వెలువడటం తెల్సిందే. ఈ వార్తలను నాసా తాజాగా తోసిపుచ్చింది.‘‘అక్కడి వ్యోమగాముల ఆరోగ్యస్థితిని ఫ్లైట్ సర్జన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని నానా స్పేస్ ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్ అధికార ప్రతినిధి జిమ్మీ రస్సెల్ అన్నారు. ‘‘ఎనిమిది రోజుల్లో తిరిగొస్తారనుకుంటే ఆరునెలలపాటు అక్కడే ఉంచుతున్నారు. సుదీర్ఘకాలం భారరహిత స్థితిలో ఉంటే కండరాల క్షీణత బారిన పడే వీలుంది. ఎముకల పటిష్టత తగ్గుతుంది. పోషకాలలేమి సమస్యలు వస్తాయి’’ అని కొందరు వైద్యనిపుణలు అభిప్రాయపడటం తెల్సిందే. సునీతతోపాటు బేరీ బుచ్విల్మోర్ సైతం అదేరోజున ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం విదితమే.చదవండి: అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన ఎన్నారైలు.. ఎంతమంది గెలిచారంటే? కాగా, అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ ఎప్పుడు తిరిగొస్తారనే దానిపై స్పష్టత కరువైంది. ఈ సంవత్సరంలో ఆమె భూమికి తిరిగొచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆమె అంతరిక్షం నుంచి రావొచ్చని నాసా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్
ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేస్తామని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతావిలియమ్స్,బుచ్విల్మోర్తెలిపారు. అంతరిక్షంనుంచిసునీత,విల్మోర్ శుక్రవారం(సెప్టెంబర్13)మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ‘పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నా. ఐఎస్ఎస్లో ఉండి నా కుటుంబాన్ని, నా రెండు కుక్కలను చాలా మిస్సవుతున్నా.నాకే కాదు ఇది నా కుటుంబ సభ్యులకు కఠినమైన సమయం. అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారు’అని సునీత అన్నారు.మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను తన బ్యాలెట్ రిక్వెస్ట్ పంపినట్లు చెప్పారు.జూన్5న బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత, విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం భూమికి తిరిగి రాలేకపోయారు.వీరిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ మాత్రం సెప్టెంబర్ 6న భూమిపై దిగింది. ఇద్దరు వ్యోమగాములను స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకువస్తుందని నాసా వర్గాలు చెబుతున్నాయి.ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ప్రత్యక్షంగా ఓటు వేయలేని వారి కోసం ఆబ్సెంటీ ఓటింగ్‌తో పాటు ఓట్ బై మెయిల్ విధానాలు అందుబాటులో ఉన్నాయి.వీటిలో ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో అర్హత కలిగిన ఓటర్లు బ్యాలెట్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఓట్ బై మెయిల్ విధానం అందుబాటులో ఉంది. ఈ విధానంలో రిజిస్టర్ ఓటర్లందరికీ ఎన్నికల మందే మెయిల్ పంపుతారు. దీని ద్వారా పౌరులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పోలింగ్ తేదీ కంటే ముందుగానే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇదీ చదవండి.. అంతరిక్షం నుంచి ఐక్య గీతం -
Florida: ఐఎస్ఎస్కు వ్యోమగాముల ప్రయాణం వాయిదా
ఫ్లోరిడా: అంతర్జాతీయ స్పేస్ సెంటర్‌కు(ఐఎస్ఎస్) ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్లాల్సిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఎండీవర్’ ప్రయాణం శనివారం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే ప్రయాణం వాయిదా పడిందని ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ వెల్లడించింది. పై గాలులు వీయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. అన్నీ అనుకూలిస్తే ఆదివారం రాత్రి రాకెట్‌ను నింగిలోకి పంపించేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్లో క్రూ డ్రాగన్ ఎండీవర్‌ను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు పంపించనున్నారు. ఈ ప్రయాణం ఇప్పటికే ఫిబ్రవరి22న తొలిసారి వాయిదా పడింది. స్పేస్ఎక్స్ కంపెనీ 2020 నుంచి వ్యోమగాములను ఐఎస్ఎస్కు పంపిచే విషయంలో నాసాకు వాణిజ్యపరమైన సేవలందిస్తోంది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్‌తో ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్ త్వరలో పోటీపడనుంది. ఇదీ చదవండి.. అమెరికాలో భారతీయుని హత్య -
అద్భుతం: 'లక్షల కోట్లను సేవ్ చేసిన టీ బ్యాగ్'
మనకో కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే .. గడ్డిపోచని సైతం బ్రహ్మస్త్రంగా మార్చుకోవచ్చు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడొచ్చు. వీళ్లు కూడా అదే చేశారు. అది భూమి మీద కాదు. భూమి నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేషన్లో. ఓ చిన్న టీ బ్యాగ్ లక్షల కోట్లకు పైగా నష్టాన్ని, అందులో ఉన్న ఆస్ట్రానాట్స్ ప్రాణాల్ని కాపాడగలిగింది. అదెలా అంటారా? వరుస ప్రమాదాలు ఇటీవల కాలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాలం చెల్లిన హార్డ్‌వేర్, సిస్టమ్స్ కారణమనే ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. అయినా ఆస్ట్రోనాట్స్ ఎప్పటికప్పుడు ఆ ప్రమాదాల్ని నివారిస్తూనే ప్రయోగాల్ని కొనసాగిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో స్పేస్ స్టేషన్‌లోని ఓ విభాగంలో రంధ్రం పడింది. ఈ స్పేస్ స్టేషన్ ప్రతి రోజూ భూమి చుట్టూ 15.5 సార్లు ప్రయాణిస్తుంది. ఒక్కో కక్ష్య చుట్టి రావడానికి 93 నిమిషాల సమయం పడుతుంది. అయితే మాడ్యుల్లో పడిన ఈ రంధ్రం వల్ల ప్రతి రోజూ 250 గ్రాముల (0.6 పౌండ్ల) కంటే ఎక్కువ గాలిని కోల్పోయింది. లీకవుతున్న గాలిని ఎలా గుర్తించారు. స్పేస్ స్టేషన్లో యూఎస్ఏ, జపాన్, రష్యా, కెనడా, యూరప్ దేశాలకు చెందిన ఆస్ట్రోనాట్స్ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో రంధ్రం పడిన మరుసటి రోజు స్పేస్ స్టేషన్‌కి ఏదో ప్రమాదం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే స్పేస్ స్టేషన్లో ప్రమాదాన్ని గుర్తించే పనిలో పడ్డారు. ప్రతి సెక్షన్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇలా ఒక్కోస్టేషన్లో ప్రమాదాన్ని గుర్తించేందుకు నాలుగురోజులు సమయం పట్టింది. అయినా వాళ్లకు నిరాశే ఎదురైంది. ఇక అన్ని మాడ్యుల్స్‌ను క్లోజ్ చేస్తూ చివరిగా స్పేస్ స్టేషన్లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఉండే రష్యా ఆస్ట్రోనాట్స్ ఉండే విభాగం 'జ్వెజ్డా'లోకి వచ్చారు. లక్షల కోట్ల నష్టం నుంచి గట్టెక్కించిన టీ బ్యాగ్ జ్వెజ్డా విభాగంలోకి వచ్చిన ఆస్ట్రోనాట్స్ కి అక్కడే లీకేజీ అవుతున్న విషయాన్ని గుర్తించారు. గుర్తించిన వెంటనే స్పేస్ స్టేషన్ ప్రమాదానికి గురవుతుందని, ప్రమాదం వల్ల జరిగే నష్టం గురించి ఇలా అనేక భయాలు ఆస్ట్రోనాట్స్ మెదడులను తొలిచివేస్తున్నాయి. అదే సమయంలో రష్యన్ ఆస్ట్రోనాట్ 'అనాటోలీ ఇవానిషిన్' కు మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిచన్ విభాగంలో ఉన్న టీ బ్యాగ్ ను తెచ్చు. వెంటనే అందులో ఉన్న టీ పొడిని రధ్రం పడిన ప్రాంతాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించారు. అద్భుతం. గాలి లీక్ అవ్వడం ఆగిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్స్ ఆ ప్రాంతాన్ని శాస్వతంగా కవర్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చివరకు ప్రత్యేకంగా తయారు చేసిన ద్రావాన్ని ఆ హోల్లో పోసి సీల్ వేశారు. దీంతో లక్షల కోట్లకు పైగా విలువ చేసే స్పేస్ స్టేషన్‌ను, అందులో పనిచేస్తున్న ఆస్ట్రోనాట్స్ ప్రాణాల్ని కాపడగలిగారు. రంధ్రం పడితే ఏమవుతుంది నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్పేస్ స్టేషన్‌కు రంధ్రం పడడం వల్ల లోపలి గాలి బయటకు విడుదలవుతుంది. ఆ సమయంలో స్పేస్ లోపల ఉన్న అంతరిక్షంలో ఉన్నపుడు వ్యోమగాముల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. కాళ్లలోని ఎముకలు, వెన్నెముకపై శరీరబరువు పడదు. దాంతో కాల్షియం విడుదలపై ప్రభావం పడి ఎముకలు, వెన్నుపూస విరిగే ప్రమాదం ఉంది. వీటితో పాటు రక్త ప్రసరణ ఇతర శరీర భాగాలకు వెళ్లకుండా ఆగిపోతుంది. ఐఎస్ఎస్.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)ను 1998లో ప్రారంభించారు. దీని విలువ భారత కరెన్సీ ప్రకారం లక్షకోట్లకు పై మాటే. భూమిపై సాధ్యం కాని పరిశోధనలను అంతరిక్షంలో నిర్వహించేందుకు ఈ కేంద్రాన్ని శాస్త్రవేత్తలు వినియోగించుకుంటుంటారు. ఇప్పటివరకు ఈ కేంద్రంలో 108 దేశాలకు చెందిన పరిశోధకులు 3 వేలకు పైగా పరిశోధనలు జరిపారు. మరి లక్షకోట్ల విలువైన స్పేస్ స్టేషన్‌ను ప్రమాదం నుంచి కాపాడేందుకు చాకిచక్యంగా ఓ చిన్న టీ బ్యాగ్‌ను వినియోగించడంపై సహచర ఆస్ట్రోనాట్స్ అనాటోలీపై ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి : నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...! -
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
అంతరిక్షంలో వ్యామోగాముల నివాసమైన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు భారీ ప్రమాదం తప్పింది. రష్యా కొత్తగా పంపిన రష్యన్ రీసెర్చ్ "నౌకా మాడ్యూల్" అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) డాక్ చేసిన కొన్ని గంటల తర్వాత అనుకోకుండా మండటంతో కొద్దిసేపు ఐఎస్ఎస్ పై నియంత్రణ కోల్పోయినట్లు నాసా అధికారులు తెలిపారు. ఇలా మండటం వల్ల అది కక్ష్య నుంచి 45 నిమిషాలపాటు కొద్దికొద్దిగా చలించింది. ఈ సంఘటన వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని నాసా తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఏడుగురు వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం లేదని నాసా, రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ ఆర్ఐఎ తెలిపింది. నాసా బోయింగ్ కొత్త సీఎస్ టి-100 స్టార్ లైనర్ క్యాప్సూల్ నేడు(జూలై 30) ఐఎస్ఎస్ తో కనెక్ట్ కావాల్సి ఉండేది. కానీ, ఈ సమస్య వల్ల ఆ ప్రయోగాన్ని ఆగస్టు 3 వరకు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. 25 టన్నుల "నౌకా" అనే కొత్త మాడ్యూల్ ను రష్యా కజకిస్తాన్ లోని బైకనూర్ నుంచి లాంచ్ చేసింది. అది నిన్న(జూలై 29)న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానితో అనుసంధానం అయ్యే సమయంలో అందులో స్వయం చాలక వ్యవస్థ పనిచేయక పోవడంతో రష్యాకు చెందిన ఒలేగ్ నోవిట్స్కీ వ్యోమగామి ఆ ప్రక్రియను మాన్యూవల్ గా చేపట్టారు. మొత్తం ఈ ప్రక్రియ పూర్తయిన 3 గంటల తర్వాత నౌకా మాడ్యూల్ జెట్ థ్రస్టర్లు ఒక్కసారిగా మండటంతో అది అదుపు తప్పింది. కొద్ది సేపటి వరకు భూమితో ఐఎస్ఎస్ కు సంబంధాలు తెగిపోయాయి. అప్పటికే ఐఎస్ఎస్ భ్రమణం సెకనుకు అర డిగ్రీ చొప్పున మారింది. అలాగే, మరో 12 నిమిషాలు కనుక జరిగి ఉంటే పూర్తి వ్యతిరేక దిశలో వచ్చేది అని శాస్త్రవేత్తలు చెప్పారు. టగ్ ఆఫ్ వార్ అయితే, కక్ష్యలో ఉన్న ప్లాట్ ఫామ్ లోని మరో మాడ్యూల్ థ్రస్టర్లను యాక్టివేట్ చేయడం ద్వారా నాసా బృందాలు స్పేస్ స్టేషన్ ఓరియెంటేషన్ ను పునరుద్ధరించగలిగినట్లు అధికారులు తెలిపారు. అంతరిక్ష కేంద్రంపై నియంత్రణను తిరిగి పొందడానికి రెండు మాడ్యూల్స్ మధ్య జరిగిన పోరాటాన్ని "టగ్ ఆఫ్ వార్"గా నాసా అభివర్ణించింది. అంతరాయం సమయంలో సిబ్బందితో కమ్యూనికేషన్ రెండుసార్లు అనేక నిమిషాలపాటు కోల్పోయినట్లు, "సిబ్బందికి ఏ సమయంలోనూ ప్రమాదం జరగలేదు" అని మోంటాల్బానో తెలిపారు. వ్యోమగాములకు అక్కడి నుంచి రక్షించాల్సిన అవసరం వచ్చి ఉంటే, ఐఎస్ఎస్ అవుట్ పోస్ట్ వద్ద ఉన్న స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సూల్ ను "లైఫ్ బోట్"గా రూపొందించినట్లు నాసా వాణిజ్య సిబ్బంది కార్యక్రమం మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు -
వ్యోమగాములను సైతం అవాక్కయేలా చేయనున్న టైడ్!
వాషింగ్టన్: టైడ్... అవాక్కయారా... అంటూ వచ్చే యాడ్ మనందరికీ సుపరిచితమే.. మీ దుస్తుల్లో మురికిని తొలగించి, తెల్లగా చేసే ఈ డిటర్జెంట్ ఇప్పుడు మీ ఇంట్లోనే కాకుండా, అంతరిక్షంలో కూడా వ్యోమగాములు ధరించే దుస్తుల్లో కూడా మురికిని తొలగించనుంది. భవిష్యత్తులో టైడ్ డిటర్జెంట్ మెరుపు శుభ్రతతో.. వ్యోమగాములను కూడా అవాక్కయేలా చేయనుంది. అందుకోసం టైడ్ డిటర్జెంట్‌ను ఉత్పత్తి చేస్తోన్న కంపెనీ ప్రోక్టర్ అండ్ గాంబుల్(పీ అండ్ జీ) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్షంలో ఉతకడం కష్టం...! అంతరిక్షంలో నీటికి ఎక్కువగా కొరత ఉంటుంది. దీంతో వ్యోమగాములు ధరించిన దుస్తులను వాష్ చేయరు. వాటిని స్పేస్ స్టేషన్లో ఒక కవర్లో ఉంచి తిరిగి కొన్ని రోజుల తరువాత ధరిస్తారు. ఎక్కువగా మురికి అయితే వాటిని అంతరిక్షంలోనే వదులుతారు. దీంతో టన్నుల కొద్ది దుస్తులు వృథా అవుతాయి. కాగా ప్రస్తుతం పీ అండ్ జీ సంస్థ అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే దుస్తుల మురికిని తొలగించడానికి ఒక డిటర్జెంట్ ఫార్ములాపై పనిచేస్తోంది. ఈ డిటర్జెంట్ ఫార్ములాతో సుమారు 15 లీటర్ల నీరును వాడి దుస్తుల మురికి తొలగించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నీటి వాడకాన్ని ఇంకా తగ్గించి దుస్తుల మురికి తీసే డిటర్జెంట్పై పీ అండ్ జీ పనిచేస్తోంది. అంతేకాకుండా అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని చోట డిటర్జెంట్ ఏవిధంగా పనిచేస్తాయో విషయంపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధించనున్నారు. కొత్త డిటర్జెంట్ ఫార్ములాతో భారీగా నీరు పొదుపు.. సాధారణంగా డిటర్జెంట్‌తో మురికిని తొలగించడానికి సుమారు 70 లీటర్ల నీరు అవసరమౌతుందని పీ అండ్ జీ కంపెనీ తెలిపింది. వ్యోమగాములకు తయారుచేసే డిటర్జెంట్‌తో భూమ్మీద కూడా అతి తక్కువ నీటితో దుస్తుల మురికిని తీయవచ్చునని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా నీటిని పొదుపు చేయవచ్చునని పేర్కొంది. నాసా అంగారక గ్రహంపైకి మానవసహిత అంతరిక్షనౌకలను ప్రయోగించాలని చూస్తోంది. ప్రయోగ సమయంలో వ్యోమగాములు సుదీర్ఘకాలం పాటు ప్రయాణించాలి. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అంతరిక్షనౌకలో దుస్తులను తీసుకెళ్లడం అంతా సులువుకాదు. దీంతో నాసా ప్రముఖ డిటర్జెంట్ కంపెనీ పీ అండ్ జీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే టైడ్ డిటర్జెంట్ వ్యోమగాములను కూడా అవ్వాకయ్యేలా చేస్తుంది. చదవండి: మార్స్ పై రోవర్ నిజంగానే సెల్ఫీ తీసుకుందా..! -
దశాబ్ద కాలం తరువాత అంతరిక్షకేంద్రంలో రద్దీ...!
కేప్ కెనావెరల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వ్యోమగాములతో కలకలలాడుతుంది. ప్రస్తుతం ఐఎస్ఎస్లో ఉన్న వారి సంఖ్య 10కు పెరిగింది. ఇది దశాబ్ద కాలంలో ఈ సంఖ్యలో ఉండడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 23 శుక్రవారం ఉదయం 5.49 గంటలకు అమెరికా ఫ్లోరిడా స్టేట్ లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ -9 రాకెట్‌ను ఉపయోగించి స్పేస్ ఎక్స్ నలుగురు ఆస్ట్రోనాట్స్లను పంపిన విషయం తెలిసిందే. వారు శనివారం రోజున ఐఎస్ఎస్ డ్రాగన్ క్యాప్సూల్ ఉదయం 5 గంటలకు చేరుకుంది. వీరి రాకతో ఒక్కసారిగా ఐఎస్ఎస్లో ఉన్నవారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం పంపిన ఈ మిషన్ లో నాసాకు చెందిన షేన్ కింబ్రో, మేగన్ మెక్ ఆర్థర్, జపాన్‌కు చెందిన హోషిడే, ఫ్రాన్స్ కు చెందిన పీస్కెట్ ఉన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో బాధ పడుతున్న ఈ సమయంలో మాకు ఒక్కింతా ధైర్యాన్ని, ఆశను ఇస్తార’ని జపనీస్ స్పేస్ ఏజెన్సీ ప్రెసిడెంట్ హిరోషి యమాకవా ఐఎస్ఎస్ సిబ్బందితో తెలిపారు. నాసా స్పేస్ షటిల్ చరిత్రలో అంతకుముందు ఐఎస్ఎస్లో 13 మంది వ్యోమగాములు ఉండి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఐఎస్ఎస్లో ఆరుగురు అమెరికన్లు, ఇరువురు రష్యన్లు, ఇరువురు జపాన్ శాస్త్రవేత్తలు, ఒక ఫ్రెంచి దేశానికి చెందిన వారు ఉన్నారు. వీరిలో నలుగురు శాస్త్రవేత్తలు వచ్చే బుధవారం రోజున భూమి మీదకి రానున్నారు. కాగా ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ప్రయోగించిన రెండు డ్రాగన్ క్యాప్సూల్స్ ఐఎస్ఎస్తో కలిసి ఉన్నాయి. డ్రాగన్ క్యాప్సూల్‌ను తిరిగి ఈ మిషన్‌కు వాడటం రెండోసారి. రి యూసబుల్ రాకెట్లను వాడటంలో స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: అంగారక గ్రహంపై ఆక్సిజన్...! -
జుకర్ బర్గ్ లైవ్ చాట్ చేస్తారట!
వాషింగ్టన్ : అంతరిక్షంలోనే ఉంటూ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో పనిచేస్తున్న వ్యోమగాములతో ప్రముఖ సోషల్ నెట్ వర్క్ దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఓ కొత్త పద్ధతిలో కనెక్ట్ కానున్నారు. 2016 జూన్ 1న ముగ్గురు వ్యోమగాములతో జుకర్ బర్గ్ , ఫేస్ బుక్ లైవ్ చాట్ చేయనున్నట్టు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ ప్రకటన విడుదల చేసింది. నాసా ఫేస్ బుక్ పేజ్ లో ఎర్త్ టూ స్పేస్ కాల్ లైవ్ ను యూజర్లు వీక్షించవచ్చని తెలిపింది. ఫేస్ బుక్ లైవ్ వీడియో కాల్ ద్వారా 20 నిమిషాల పాటు ఆ వ్యోమగాములతో జుకర్ బర్గ్ చాట్ చేయనున్నారు. ఈ చాట్ లో నాసా వ్యోమగాములు టిమ్ కోప్రా, జెఫ్ విలియమ్స్ తో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి టిమ్ పీక్ తో జుకర్ బర్గ్ మాట్లాడనున్నారు. అయితే ఎవరైనా ఔత్సాహికవంతులు వ్యోమగాములను ఏమైనా అడగదలుచుకుంటే, జుకర్ బర్గ్ లైవ్ చాట్ కు ప్రశ్నలు పంపించవచ్చని, వారి తరుఫున కూడా జుకర్ బర్గే వ్యోమగాములతో మాట్లాడనున్నట్టు నాసా తెలిపింది. ప్రశ్నలు పంపించాలనుకున్న వారు నాసా ఫేస్ బుక్ పేజీకి సమర్పించగలరని పేర్కొంది. వ్యోమగాములను తాను అడిగే ప్రశ్నలను జుకర్ బర్గ్, ఇప్పటికే నాసా పేస్ బుక్ పేజ్ కి సమర్పించారు. యూజర్ల కోసం కొన్ని ప్రశ్నలను నాసా పేస్ బుక్ పేజీలో పొందుపరిచింది. On @Facebook? Mark Zuckerberg asks your Qs to @Space_Station astronauts on Jun 1. Submit Qs: https://t.co/5rBSi1fQQ0 pic.twitter.com/4VhV6nzMk1 — NASA (@NASA) May 27, 2016