
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారి రాక కోసం అంతా నిరీక్షించారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడేలా మరికొద్దిగంటల్లో భూమ్మీదకు రానున్నారు. వారు అన్నిరోజులు అంతరిక్షంలో ఎలా గడిపారు, వారి మానసికస్థితి వంటి వాటి గురించి తెలుసుకోవాలనే కుతుహలంతో ఉన్నారు అంతా. ఒకరకంగా ఈ పరిస్థితి వల్ల భవిష్యత్తు అంతరిక్షంలో మానువుని మనుగడ గురించి కొత్త విషయాలు తెలుసుకునే అనుభవం దొరికిందని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆ ఇరువురు చిక్కుపోయిన సమయంలో ఎప్పటికప్పుడూ వారెలా ఉన్నారనే దాని గురించి ఫోటోల రూపంలో అప్‌డేట్ ఇచ్చేది. ఆ ఫోటోల్లో సునీతా ఎప్పుడు వదులుగా ఉన్న జుట్టుతోనే కనిపించేవారు. నిజానికి ఆ చిత్రాలు చాలామందిలో ఓ ఉత్సుకతను రేకెత్తించింది. అసలు ఎందుకని మహళా వ్యోమగాములు అంతరిక్షంలో జుట్టుని ముడివేసుకోరనే ప్రశ్నను లేవెనెత్తింది. మరీ దీని వెనుకున్న రీజన్, ఆ సైన్సు ఏంటో చూద్దామా..!.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ వదులుగా ఉన జుట్టుతో కనిపించేవారు. ఆమె జుట్టు అంతరిక్షంలో గాల్లో ఎగురుతున్నట్లుగా కనిపించేది. అదిగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు చిక్కుపోయిన ఈ ఇరువురు వ్యోమగాముల గురించి మాట్లాడుతూ..సునీతా విలియమ్స్ జుట్టుపై వ్యాఖ్యలు చేశారు. అడవిలా గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తున్న ఆ ధృడమైన జుట్టుని చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎంత ధైర్యవంతురాలేనది అని హాస్యాస్పదంగా అన్నారు.
ఆ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలకుగానూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కి గురయ్యారు కూడా. ఆ నేపథ్యంలోనే వ్యోమగాములు, ముఖ్యంగా మహిళలు అంతరిక్షంలో తమ జుట్టును ఎలా నిర్వహిస్తారనే విషయం హైలెట్ అయ్యింది.అదీగాక సునీతా విలియమ్స్‌లాంటి వ్యోమగాములంతా కూడా తమ జుట్లుని ముడివేయడం లేదా రబ్బర్‌తో కట్టేయడం వంటివి ఎందుకు చెయ్యరు అని అంశంపై చర్చించడం ప్రారంభించారు అంతా. అందుకు సైన్సు పరంగా పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
అవేంటంటే..
గురుత్వాకర్షణ శక్తి శూన్యం కాబట్టి.. జుట్టును క్రిందికి లాగదు కాబట్టి ముడివేయడం లేదా కట్టేయడం వంటివి చేయాల్సిన పనిలేదు. సులభంగా వాషింగ్ చేసుకోవచ్చట. ఎలాంటి షాంపులతో పనిలేకుండానే వాష్ చేయొచ్చట. పైగా టవల్‌తో తుడుచుకోవాల్సిన పని ఉండదట. ఇక డ్రైయర్‌లతో అస్సలు పని ఉండదట. ఎందకంటే జుట్టులోని నీరంతా ఆవిరి అయిపోతుందట . అలాగే అక్కడ ఉంటే జీరో గ్రావిటేషన్ కారణంగా ఇలా జుట్టు ఫ్రీగా వదిలేసినా..ముఖం మీదకి వచ్చి ఇబ్బంది పడే సమస్య ఉండదట.
దీనిపై నాసా వ్యోమగామి కరెన్ నైబర్గ్ సోషల్ మీడియా వేదికగా తన అంతరిక్ష అనుభవాలను షేర్ చేసుకుంటూ..ఆ అంతరిక్షంలో తన హెయిర్ కేర్ రొటీన్ గురించి కూడా మాట్లాడారు. 2013లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నప్పుడు తన పొడవాటి జుట్టుని ఎలా వాష్ చేసుకుందో వివరించింది.
తాము నీటిని చిమ్ముకుంటూ వాష్ చేసుకుంటామని తెలిపింది. తమకు షాంపుల వాడకం, అలాగే తడిచిన జుట్టుని పిండాల్సిన పని గానీ ఉండదని చెప్పింది. ఎందుకంటే తలపై ఉన్న నీరంతా అంతరిక్షంలో ఘనీభవించి త్రాగునీరుగా మారిపోతుందని చెప్పుకొచ్చింది.
(చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?)
Comments
Please login to add a commentAdd a comment