
పట్నా: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) తొమ్మిది నెలల తరువాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగివచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె అంతరిక్ష ప్రయాణాన్ని వర్ణిస్తూ బీహార్‌లోని సమస్తీపూర్‌కు చెందిన కుందన్ కుమార్ రాయ్ అద్భుత రీతిలో మిథిలా పెయింటింగ్ రూపొందించారు.
కుందన్ కుమార్ రాయ్(Kundan Kumar Roy) మిథిలా పెయింటింగ్‌లను తీర్చిదిదద్డంలో ఎంతో పేరు గడించారు. ఆయన తాజాగా రూపొందించిన పెయింటింగ్‌లో సునీతా విలియమ్స్‌తో పాటు ఆమె సహచరులు కూడా ఉన్నారు. వారంతా ఒక చేప లోపల ఉన్నట్లు కుందన్ రాయ్ చిత్రీకరించారు. సునీతా విలియమ్స్ గౌరవార్థం రూపొందించిన ఈ పెయింటింగ్ కారణంగా కుందన్ రాయ్ మరోమారు వార్తల్లో నిలిచారు. టోక్యో ఒలింపిక్ సమయంలో కుందర్ రాయ్ రూపొందించిన భారతీయ క్రీడాకారుల చిత్రాలు ఎంతో ఆదరణ పొందాయి.
కుందర్ రాయ్ కలర్ బ్లైండ్‌నెస్ బాధితుడు. అయితే అతని కళాభిరుచికి ఈ లోపం అతనికి అడ్డుకాలేదు. సాధారణంగా మిథిలా పెయింటింగ్‌లో నలుపు, తెలుపు రంగులనే వినియోగిస్తుంటారు. అయితే కుందన్ రాయ్ ఇతర వర్ణాలను కూడా వినియోగిస్తూ ఎన్నో అద్భుత చిత్రాలను రూపొందించారు. ఈయన రూపొందిన చిత్రాలు పలు ప్రదర్శనల్లో ప్రదర్శితమయ్యాయి. తాజాగా ఆయన రూపొందించిన సునీతా విలియమ్స్ పెయింటింగ్ అందరి అభినందనలను అందుకుంటోంది.
ఇది కూడా చదవండి: Rajasthan: కారుపై డంపర్ బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
Comments
Please login to add a commentAdd a comment