
భారత సంతతికి చెందిన నాసా(Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తొమ్మిది నెలల తరువాత ఎట్టకేలకు సురక్షితంగా భూమి మీదకి చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ఫ్లోరిడా తీరంలో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి సునీతా విలియమ్స్‌తో కలిసి ల్యాండ్ అయ్యారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కూడా అమితానందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సునీతా సమీప బంధువు ఫల్గుణి పాండ్యా ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ తన సంతోషాన్ని ప్రకటించారు అంతేకాదు ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ త్వరలో భారతదేశంలో సునీతా పర్యటిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలోని గుజరాత్‌లోని ఆమె తండ్రి దీపక్ పాండ్యాకు పూర్వీకుల ఇల్లు ఉందని గుర్తు చేశారు. 286 రోజుల అంతరిక్షయానం తర్వాత నాసా వ్యోమగామి ఇంటికి తిరిగి రావడం గురించి ఆమె మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి ఆమె తిరిగి వస్తుందని తెలుసు. తన మాతృదేశం, భారతీయుల ప్రేమను పొందుతుందని కూడా తనకు తెలుసన్నారు.
కలిసి సెలవులకు రావాలని కూడా ప్లాన్ చేస్తున్నాం, కుటుంబ సభ్యులతో గడబబోతున్నామని చెబతూ త్వరలో ఇండియాను సందర్శిస్తామని ఫల్గుణి ధృవీకరించారు. సునీత విలియమ్స్ మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తారా లేదా అంగారకుడిపైకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి అవుతారా అని అడిగినప్పుడు, అది ఆమె ఇష్టం అన్నారు. వ్యోమగామిగా తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ది బెస్ట్‌గా పనిచేస్తుందని,"ఆమె మనందరికీ రోల్ మోడల్" ఆమె ప్రశంసించారు. సెప్టెంబర్ 19న అంతరిక్షంలో ఆమె 59వ పుట్టినరోజును జరుపుకున్నారనీ, ఈసందర్భంగా భారతీయ స్వీట్ కాజు కట్లిని పంపినట్లు కూడా ఆమె చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాను అంతరిక్షంనుంచి వీక్షించినట్టు కూడా చెప్పారన్నారు.సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో సమోసాలు తీసుకెళ్లిన తొలి వ్యోమగామి కాబట్టి, ఆమె కోసం 'సమోసా పార్టీ' ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని కూడా చమత్కరించడం విశేషం.
గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ వెళ్లారు. రౌండ్‌ట్రిప్‌గా భావించారు. అయితే, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ సమస్యలను నేపథ్యంలో అది వెనక్కి తిరిగి వచ్చేసింది. చివరకు ఇద్దరు వ్యోమగాములను NASA-SpaceX Crew-9 మిషన్ ద్వారా భూమికి చేరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment