samosa
-
సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
భారత సంతతికి చెందిన నాసా(Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తొమ్మిది నెలల తరువాత ఎట్టకేలకు సురక్షితంగా భూమి మీదకి చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ఫ్లోరిడా తీరంలో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీతా విలియమ్స్‌తో కలిసి ల్యాండ్ అయ్యారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కూడా అమితానందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీతా సమీప బంధువు ఫల్గుణి పాండ్యా ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన సంతోషాన్ని ప్రకటించారు అంతేకాదు ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ త్వరలో భారతదేశంలో సునీతా పర్యటిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలోని గుజరాత్‌లోని ఆమె తండ్రి దీపక్ పాండ్యాకు పూర్వీకుల ఇల్లు ఉందని గుర్తు చేశారు. 286 రోజుల అంతరిక్షయానం తర్వాత నాసా వ్యోమగామి ఇంటికి తిరిగి రావడం గురించి ఆమె మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి ఆమె తిరిగి వస్తుందని తెలుసు. తన మాతృదేశం, భారతీయుల ప్రేమను పొందుతుందని కూడా తనకు తెలుసన్నారు.కలిసి సెలవులకు రావాలని కూడా ప్లాన్ చేస్తున్నాం, కుటుంబ సభ్యులతో గడబబోతున్నామని చెబతూ త్వరలో ఇండియాను సందర్శిస్తామని ఫల్గుణి ధృవీకరించారు. సునీత విలియమ్స్ మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తారా లేదా అంగారకుడిపైకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి అవుతారా అని అడిగినప్పుడు, అది ఆమె ఇష్టం అన్నారు. వ్యోమగామిగా తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ది బెస్ట్‌గా పనిచేస్తుందని,"ఆమె మనందరికీ రోల్ మోడల్" ఆమె ప్రశంసించారు. సెప్టెంబర్ 19న అంతరిక్షంలో ఆమె 59వ పుట్టినరోజును జరుపుకున్నారనీ, ఈసందర్భంగా భారతీయ స్వీట్ కాజు కట్లిని పంపినట్లు కూడా ఆమె చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాను అంతరిక్షంనుంచి వీక్షించినట్టు కూడా చెప్పారన్నారు.సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో సమోసాలు తీసుకెళ్లిన తొలి వ్యోమగామి కాబట్టి, ఆమె కోసం 'సమోసా పార్టీ' ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని కూడా చమత్కరించడం విశేషం. గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ వెళ్లారు. రౌండ్‌ట్రిప్‌గా భావించారు. అయితే, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ సమస్యలను నేపథ్యంలో అది వెనక్కి తిరిగి వచ్చేసింది. చివరకు ఇద్దరు వ్యోమగాములను NASA-SpaceX Crew-9 మిషన్ ద్వారా భూమికి చేరిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌పోర్ట్‌లో రూ.10కే టీ, రూ20కే సమోసా!
ఎయిర్‌పోర్ట్‌లో స్నాక్స్ ధర రూ.వందల్లో ఉంటుందని తెలుసుకదా. అయితే కొత్తగా ప్రారంభించిన కేఫ్‌లో మాత్రం కేవలం రూ.10కే టీ, వాటర్ బాటిల్, రూ.20కే సమోసా, స్వీటు లభిస్తుంది. ‘అదేంటి.. షాపింగ్ మాల్స్‌లోనే వాటర్ బాటిల్ రూ.80 వరకు ఉంది. మరి ఎయిర్‌పోర్ట్‌లో ఇంత తక్కువా..?’ అని ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను ప్రారంభించింది. విమాన ప్రయాణికులకు చౌకగా స్నాక్స్ అందించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్ పుణ్యమా అని సరసమైన స్నాక్స్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. 2024 డిసెంబర్ 21న పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కేఫ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సుమారు 900 మంది ప్రయాణీకులు ఈ కేఫ్ సేవలు వినియోగించుకుంటున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీని ఆవిష్కరణ సమయంలో మంత్రి మాట్లాడుతూ..విమానాశ్రయంలో ఆహార ధరల పెరుగుదలపై దీర్ఘకాలంగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.No more overpriced food at the airport. Now you can have affordable snacks at airports at Udaan Yatri Cafe.Tea : ₹10Water : ₹10Samosa : ₹20Sweet : ₹20 pic.twitter.com/SGEsKGjEf8— Aaraynsh (@aaraynsh) January 23, 2025ఇదీ చదవండి: 2,000 ఐడీలను బ్లాక్ చేసిన రైల్వేశాఖధరలిలా..ఉడాన్ యాత్రి కేఫ్‌లో ప్రయాణికులు రూ.10కే టీ, రూ.10కే వాటర్ బాటిల్, కేవలం రూ.20కే సమోసా, రూ.20కు స్వీట్లు వంటి స్నాక్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ధరలు విమానాశ్రయంలోని ఇతర ఆహార దుకాణాలు వసూలు చేసే అధిక రేట్లకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రయాణీకుల నుంచి ఈ కేఫ్‌కు సానుకూల స్పందన వస్తోంది. కేఫ్ ప్రారంభించిన మొదటి నెలలో సుమారు 27,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించింది. ఇతర విమానాశ్రయాల్లో ఈ నమూనా కేఫ్‌లను ప్రారంభించాలని ప్రయాణికుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. -
సీఎం ‘సమోసా’ వివాదం.. దర్యాప్తు ఏం లేదు: సీఐడీ
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ‘సమోసా’ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఐడీ కార్యాలయంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ హాజరైన ఓ కార్యక్రమంలో ఆయనకు ఇవ్వాల్సిన సమోసాలు మాయం అయినట్లువార్తలు రావడంతో..ఈ అంశంపై వివాదం చెలరేగింది.. దీనిపై సీఐడీ దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు ఆరోపణలు రావడంతో.. తాజాగా దర్యాప్తు సంస్థ స్పందించింది. తాము ఎలాంటి విచారణ చేపట్టలేదని స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే వాటిని సెక్యూరిటీ స్టాఫ్ తినేశారని వార్తలు వచ్చాయి. సీఎం వద్దకు చేరాల్సిన అవి ఎవరి వల్ల మధ్యలో మిస్ అయ్యాయే గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సీఐడీ డైరెక్టర్ జనరల్ సంజీవ్ రంజన్ ఓజా మాట్లాడుతూ.. సమోసాలు కనిపించకుండా పోవడంపై ఎలాంటి దర్యాప్తు జరపడం లేదని తెలిపారు. ఇది అంతర్గత విషయమని చెప్పారు. అయితే అధికారుల సమావేశానికి ఆర్డర్ చేసిన స్నాక్స్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంపై ఆశ్చర్యం వేయడం చాలా సాధారణమైన విషయమని అన్నారు.దీనిపై విచారణ ఏం లేదని, కేవలం బాక్సుల గురించి తెలుసుకోవడానికి ఒక విజ్ఞప్తి మాత్రమే జరిగిందని చెప్పారు.మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిందిు. ఇదంతా హాస్యాస్పదమైన వ్యవహారమని, సమోసాలను ఎవరు తింటే ఏమవుతుందని ప్రశ్నించింది. ‘సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరు..? సీఐడీ తేల్చనుంది..’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుండటంతో సీఎం కార్యాలయం కూడా స్పందించింది. ప్రభుత్వం అటువంటి విచారణకు ఆదేశించలేదని, ఈ విషయంతో సంబంధం లేదని చీఫ్ మీడియా అడ్వైజర్ నరేష్ చౌహాన్ వెల్లడించారు. ఇది సీఐడీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. -
సీఎం సమోసాలు ఎవరు తిన్నారు? సీఐడీ దర్యాప్తు..
-
ముఖ్యమంత్రి సమోసాలు ఎవరు తీసుకున్నారు?.. సీఐడీ దర్యాప్తు
‘నేను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నేనొచ్చిన కార్యక్రమానికి నాకు సమోసాలు పెట్టకుండా.. నా సిబ్బందికి పెడతారా? వెంటనే ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారెవరో గుర్తించి, కఠిన చర్యలు తీసుకోండి’ అని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమోస స్కామ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించేందుకు వెళ్లారు. సీఎం సుక్కు పర్యటన రాక నేపథ్యంలో ఐజీ ర్యాంక్ అధికారి.. సీఎం వస్తున్నారు. వెంటనే స్నాక్స్ ఏర్పాటు చేయండి అంటూ ఎస్సైని ఆదేశించారు. దీంతో సదరు ఎస్సై (సమోసాలు సీఎం కోసమని చెప్పకుండా) .. తన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), హెడ్ కానిస్టేబుల్‌ను సమోసాలు తీసుకుని రావాలని పురమాయించారు. ఎస్సై ఆదేశాలతో ఏఎస్ఐ, కానిస్టేబుల్ స్థానిక లక్కర్ బజార్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి మూడు పెట్టెల సమోసాలను తీసుకొచ్చారు. సీఎం సుక్కు కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడే ఉన్న ఏఎస్సై, కానిస్టేబుల్ తెచ్చిన సమోసాల్ని పక్కనే ఉన్న మహిళా ఎస్సైకి అందించారు. స్నాక్స్ పెట్టాలని కోరారు. మహిళా ఎస్సై ఆ సమోసాలను సీఎం కోసం తెచ్చినవే అని తెలియక బదులుగా సీఎం సిబ్బందిలోని మెకానికల్ ట్రాన్స్పోర్ట్ (ఎంటీ) విభాగానికి పంపించారు. ఆ విభాగంలోని ఉద్యోగులే ఆ సమోసాల్ని తిన్నారు.మీటింగ్‌లో ఉన్న సీఎంతోపాటు, సీఐడీ బాస్, ఇతర ఉన్నతాధికారులు ఆకలితోనే వెనుదిరిగారు. అధికారుల తీరుపై సీఎంతో పాటు సీఐడీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశాలకు జారీ చేశారు. -
ఒత్తిడికి గురైనప్పుడు జంక్ ఫుడ్ తినడకూడదా?
సాధారణంగా దైనందిన జీవితం లేదా కెరీర్లో రకరకాల ఒత్తిడులను ఎదుర్కొనాల్సి వస్తుంటంది. ఈ ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో రిలీఫ్ కోసం కొన్ని రకాల అలవాట్లకు లోనవ్వుతుంటాం. అవి మంచివి అయితే పర్లేదు. అదే కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి అవి మనషులను ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఆ దిశగా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే చాలామంది ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటారని వాటివల్ల వారి ఆరోగ్యం ఎలా ప్రమాదంలో పడుతుందో సవివరంగా వెల్లడించారు. అదెలాగో తెలుసుకుందామా..!బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం..ఒత్తిడికి గురైనప్పుడూ చాలామంది సమోసా లేదా బర్గర్ వంటి జంక్ ఫుడ్ తినేందుకు మొగ్గు చూపుతారట. ఇలా తినడం వల్ల ఆందోళన స్థాయిలు పెరుగుతాయే గానీ ప్రయోజనం ఉండదని పరిశోధనలో తేలింది. అందుకోసం జంతువులపై జరిపిన అధ్యయనంలో పల ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆందోళనలో ఉన్నప్పుడూ అవి అధిక కొవ్వుతో కూడిన జంక్ ఫుడ్ తీసుకోవడంతో వాటి శరీరంలోని గట్ బ్యాక్టీరియాకి అంతరాయం కలిగించి వాటి ప్రవర్తనను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది మెదుడు రసాయనాలన ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధన పేర్కొంది కూడా. ఈ మేరకు ప్రొఫెసర్ క్రిస్టోఫర్ లోరీ మాట్లాడుతూ..అధిక కొవ్వు మెదుడులోని జన్యువుల వ్యక్తీకరణనే మార్చేయడం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని అన్నారు. అంతేగాదు తమ పరిశోధనలో ఈ అధిక కొవ్వు ఆహారం తప్పనిసరిగా మెదుడులో ఆందోళన స్థితి మరింత పెంచుతున్నట్లు వెల్లడయ్యింది. పైగా ఇలా జంక్ఫడ్ ఎక్కువగా తీసుకున్న జంతువుల్లోని మైక్రోబయోమ్ లేదా గట్ బ్యాక్టీరియాని అంచనా వేయగా తక్కువ వైవిధ్యాన్ని చూపించాయని, పైగా వాటి బరువు కూడా పెరిగినట్లు తెలిపారు. అంతేగాదు ఈ అధిక కొవ్వుతో కూడిన ఆహారం కారణంగా మెదడులో న్యూరోట్రాన్స్మీటర్ సెరోటోనిన్ ఉత్పత్తికి సంబంధించిన సిగ్నలింగ్‌లో మూడు జన్యువులు అధిక వ్యక్తీకరణనను చూపించడం గుర్తించామన్నారు పరిశోధకులు. ఇది ఒత్తిడి, ఆందోళనను పెంచే సంకేతమని చెబుతున్నారు. ఇక్కడ ఈ సెరోటోనిన్న ఫీల్ గడ్ బ్రెయిన్ కెమికల్ అని పిలుస్తారు. అయితే పరిశోధనలో జంతువుల్లోని ఈ సెరోటోనిన్ న్యూరాన్లలోని కొన్ని ఉపసమితులను సక్రియం చేయండంతో ఆందోళన వంటి ప్రతిస్పందనలు వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అంటే ? ఇక్కడ.. శరీరంలోని అనారోగ్యకరమైన మైక్రోబయోమ్ గట్ లైనింగ్(మనం తీసుకున్న ఆహారం)తో రాజీపడి శరీర ప్రసరణలో కలిసిపోతుంది. దీంతో జీర్ణశయాంతర ప్రేగు నుంచి మెదడుకు వెళ్లే వాగస్ నరాల ద్వారా మెదడుతో కమ్యూనికేట్ అయ్యి ప్రవర్తనను లేదా మూడ్‌ని మారుస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం మనకు అనారోగ్యం కలిగించే విషయాలను గుర్తించి తద్వారా భవిష్యత్తులో వాటిని నివారించేలా చేసే మరిన్ని ప్రయోగాలకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే ఇక్కడ అన్ని కొవ్వులు చెడ్డవికావని చేపలు ఆలివ్ నూనె వంటి మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు.(చదవండి: డిప్రెషన్‌తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?) -
లోక్‌సభ ఎన్నికల బరిలో సమోసా బాబా
ఛత్తీస్‌గఢ్‌లో పలు దుకాణాలకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయించే అజయ్ పాలి అలియాస్ సమోసా బాబా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. కవర్ధా జిల్లాకు చెందిన సమోసా బాబా.. రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ ఫారమ్‌ను కొనుగోలు చేశారు. కవర్ధా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఈ సమోసా బాబా 20 ఏళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. నగరంలోని జనం అజయ్పాలిని సమోసా బాబా అని పిలుస్తుంటారు. మొదట్లో ఒక సమోసా 50 పైసలకు విక్రయించే ఈయన ఇప్పుడు నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రూ. 5కు ఒక సమోసా విక్రయించే అతని దుకాణం ముందు జనం క్యూ కడుతుంటారు. ఈ సమోసా బాబా ఇప్పటివరకు 12కి పైగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో కౌన్సిలర్, ఎంపీ వరకు జరిగిన పలు ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇప్పుడు రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నుంచి నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడి జనం బీజేపీ, కాంగ్రెస్‌ల పాలనను చూసి విసిగిపోయారని, ఇప్పుడు తనకు అవకాశం కల్పిస్తారని సమోసా బాబా చెబుతున్నారు. బడా నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోరని సమోసా బాబా ఆరోపిస్తున్నారు. తనను ఇక్కడి జనం గెలిపిస్తే, తనకు వచ్చే ఎంపీ జీతాన్ని ప్రజా సేవకు ఖర్చు చేస్తానన్నారు. అజయ్ పాలీ 2008 నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపాలిటీ అధ్యక్ష, కౌన్సిలర్ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో సమోసా బాబా పోటీ చేశారు. తాజాగా ఆయన రూ. 25 వేలు వెచ్చించి లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ఫారం కొనుగోలు చేశారు. ఎన్నికల ఫలితాల గురించి పట్టించుకోకుండా సమోసా బాబా పోటీ చేస్తూ వస్తున్నారు. -
Holi 2024: స్పెషల్ సమోసా, ఒక్కసారి తింటే.. వీడియో వైరల్
భారతీయులకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ , ఈవినింగ్ టీ టైంలోబెస్ట్ ఆప్షన్ సమోసా. సాధారణంగా సమోసా అంటే మనకి త్రిభుజాకారంలో, లోపల్ ఏదో ఒక స్టఫ్పింగ్తో ఉంటుంది. తాజాగా ఒక వెరైటీ సమోసా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. హోలీ స్పెషల్‌గా ‘థ్రెడ్ సమోసా’ నెటిజనులను ఆకట్టుకుంటోంది. గుండ్రగా చేసిన ఒక చపాతీలో నాలుగ్గు భాగాల్లోని ఒక భాగంలో ఆలూ, బఠానీ కూరను స్టఫ్ చేసి దానిక ఎదురుగా ఉన్న భాగంతో కవర్ చేసింది.మిగిలిన రెండు భాగాలను మళ్లీ రిబన్స్లాగా కట్ చేసి, ఒకదాని దాని తరువాత ఒకటి సమోసా చుట్టూ థ్రెడ్లాగా చక్కగా అల్లింది. దీన్ని జాగ్రత్తగా నూనెలో వేయించింది. ఈ థ్రెడ్ సమోసా రెసిపీని plumsandpickle ఇన్స్టాగ్రామ్ ఖాతా షేర్ చేయగా ఇప్పటికే ఇది 95 మిలియన్లగా వ్యూస్‌ను సాధించడం విశేషం. రెసిపీ, కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన బంగాళాదుంపలు, ఉడికించిన పచ్చి బఠానీలు, మిరపకాయ, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి , కొత్తిమీర. పిండి కోసం : 2 కప్పులు ఆల్-పర్పస్ పిండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె, 1/2 టీస్పూన్, వామ్ము, ఉప్పు ,నీరు. ముందుగా పిండి కలుపుకొని ఒక అరగంట సేపు నాన బెట్టుకోవాలి. తరువాత ఆటూ, బఠానీ కూరను తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చపాతీ చేసుకొని, థ్రెడ్ సమోసాను సిద్ధం చేసుకోవడమే. View this post on Instagram A post shared by Megha Mahindroo | Recipe Video Creator (@plumsandpickle) -
సమోసా, కచోరీ ఏం పాపం చేశాయ్..! ఇదీ లెటెస్ట్ ట్రెండ్ వైరల్ స్టోరీ
ఇప్పుడంటే బఫేలు, కేటరింగ్లు వచ్చాయి గానీ, గతంలో విందు భోజనాల్లో కొసరి కొసరి వడ్డించడం అలవాటు. ఏమండీ... ఇది రుచి చూశారా.. మీ కోసమే స్పెషల్‌గా చేయించా... అసలు ఈ పనస పొట్టు బిర్యానీ తిని చూడండి.. హా.. ములక్కాడ, జీడిపప్పు అబ్బ.. ఒక్కసారి రుచి చూడండి... ఇంకో పూర్ణ బూరె వేసుకోండి.. వేడి వేడిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే బ్రహ్మాండం కదా..! అన్నట్టు చివర్లో తాంబూలం మర్చిపోకండి సుమా! ఇదీ పెళ్లిళ్లు, పేరంటాల్లో అతిథులకు లభించే మర్యాద. కానీ ప్రస్తుత బిజీ లోకంలో ఆ అప్యాయతలు మర్యాదలు అన్నీ మారిపోయాయి. ట్రెండ్ మారింది. చుట్టాలు, బంధువుల ప్లేస్‌లోకి చిన్న చిన్న రెస్టారెంట్లు వచ్చి చేరాయి. దీన్ని అందిపుచ్చుకున్న చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటల్స్ వ్యాపారంలో ట్రెండ్ మార్చేశాయి. ప్రస్తుత బిజీ లోకంలో ఆనాటి అప్యాయతలు మర్యాదలు అన్నీ మారిపోయాయి. ట్రెండ్ మారింది. దీన్నే చిన్నా, పెద్దా రెస్టారెంట్లు, హోటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. చుట్టాలు, బంధువుల ప్లేస్‌లోకి చిన్న చిన్న రెస్టారెంట్లు వచ్చి చేరాయి. రా రామ్మని ఊరించేలా కస్టమర్లను వినూత్నంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటిదాకా సరికొత్త రుచులు, వివిధ ప్రాంతాల వంటకాలను అందించిన హోటళ్లు భోజన ప్రియుల్ని, కొత్తగా తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించడమే కాకుండా చుట్టాల్లా ఆదరిస్తున్నాయి. ( శివారులో వినూత్న హోటళ్లు) ఇక ఆ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేలా తమ హోటళ్ల పేర్లను పెట్టుకోవడంలో మరో అడుగు ముందుకేశాయి. తినేసి పో.., ఉలవచారు, కోడికూర-చిట్టిగారె,రాజుగారి పులావ్ లాంటి పేర్లతో తమ హోటళ్ళకు రప్పించుకుంటున్నాయి. (ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను! ) సమోసాను, కచోరీని మర్చిపోతే ఎలా? ఎప్పటికపుడు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ కొంత పుంతలు తొక్కుతున్నాయి. ఈక్రమంలోనే ఇపుడు నయా ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అయ్యా , మా హోటల్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సారి మాత్రం ఇవి మర్చిపోవద్దు అంటూ గుర్తు చేయడం విశేషంగా నిలిచింది. రెస్టారెంట్ బిల్లుపై సమోస, కచోరీ తినడం మర్చిపోకండి.. వాటిలో ఫిల్లింగ్ ఉంటుంది. కడుపు నిండుతుంది అన్నట్టు ఒక మెసేజ్ ఉండటం లేటెస్ట్ ట్రెండ్. దీనికి సంబంధించిన రిసీట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఔరా అంటున్నారు భోజన ప్రియులు. (హంగూ, ఆర్బాటంలేదు, గుర్రమెక్కలేదు.. మూడు ముళ్లు వేయలేదు.. సింపుల్‌గా సెలబ్రిటీ పెళ్లి) -
నోరూరించే.. ఈ గరం గరం సమోసాల తయారీ ఎలాగో తెలుసా?
స్వీట్ కోవా సమోసా.. కావలసినవి: మైదా – రెండు టీస్పూన్లు; సమోసా పట్టి షీట్లు – పన్నెండు(రెడీమేడ్); వేరు శనగ నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా; పిస్తా – గార్నిష్‌కు సరిపడా. స్టఫింగ్: నెయ్యి – టీస్పూను; జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; పిస్తా పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీస్పూను; ఉప్పు – ముప్పావు టీస్పూను; కోవా తురుము – కప్పు. సిరప్: పంచదార – అరకప్పు; యాలకుల పొడి – పావు టీస్పూను; నీళ్లు – అరకప్పు; కుంకుమ పువ్వు– చిటికెడు. తయారీ: జీడిపప్పుని నెయ్యిలో వేసి బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించాలి. జీడిపప్పు వేగిన తరువాత పిస్తా, కొబ్బరి తరుము, పంచదార, కోవా తురుము వేయాలి. ఇవన్నీ దోరగా వేగిన తరువాత రుచికి సరిపడా ఉప్పు, యాలకులపొడి వేసి కలిపి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత అరగంట రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙బాణలిలో కుంకుమ పువ్వును దోరగా వేయించాలి. ఇది వేగిన తరువాత పంచదార, అరకప్పు నీళ్లు, యాలకుల పొడి వేసి, సిరప్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. మైదాలో కొద్దిగా నీళ్లుపోసి గమ్‌లా తయార చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన మిశ్రమాన్ని.. సమోసా పట్టి షీట్‌పైన టేబుల్ స్పూను వేసి సమోసాలా చుట్టుకోవాలి. లోపల స్టఫింగ్ బయటకు రాకుండా ఉండేలా మైదా గమ్‌ను రాసుకుంటూ సమోసాను చుట్టుకోవాలి. సమోసాలన్నీ రెడీ అయ్యాక బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన వేడివేడి సమోసాలను సుగర్ సిరప్‌లో అరనిమిషం ఉంచాలి. సుగర్ సిరప్ నుంచి తీసిన సమోసాపై పిస్తా పప్పు తురుము వేస్తే స్వీట్ సమోసా రెడీ. చికెన్ సమోసా.. కావలసినవి: మైదా – కప్పు; వాము – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు. ఖీమా ఫిల్లింగ్: నెయ్యి – టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – టీస్పూను; క్యారట్ ముక్కలు – అరకప్పు (చిన్నముక్కలు); వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం – అంగుళం ముక్క; చికెన్ ఖీమా – పావు కేజీ; కారం – అర టీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; గరం మసాలా – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; పచ్చిబఠాణి – అరకప్పు; స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: మైదాలో వాము, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలిపాక, నీళ్లు పోసి ముద్ద చేయాలి. ఈ పిండి ముద్దపైన తడి వస్త్రాన్ని కప్పి అరగంట నానబెట్టుకోవాలి. టేబుల్ స్పూను నెయ్యిలో జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తరువాత అల్లం, వెల్లుల్లిని సన్నగా తరగి వేయాలి. వీటితోపాటే క్యారట్ ముక్కలు వేసి వేయించాలి. క్యారట్ వేగిన తరువాత చికెన్ ఖీమా వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి గరిటతో కలిపి, మూతపెట్టి మగ్గనివ్వాలి. ఆరు నిమిషాల తరువాత స్ప్రింగ్ ఆనియన్ తరుగు, పచ్చిబఠాణి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలు వేయించి దించేయాలి. మైదాముద్దను చిన్న ఉండలుగా చేసి, చపాతీలా వత్తుకోవాలి. చపాతీని కోన్ ఆకారంలో మడిచి, మధ్యలో చికెన్ ఖీమా మిశ్రమంతో నింపాలి. మిశ్రమం బయటకు రాకుండా కోన్‌ను మూసివేయాలి. ఇలా అన్ని సమోసాలు రెడీ అయిన తరువాత బేకింగ్ ట్రేలో పెట్టాలి. ఈ ట్రేను అవెన్‌లో పెట్టి 350 ఫారిన్ హీట్స్ వద్ద ఇరవై నిమిషాల పాటు బేక్ చేస్తే చికెన్ సమోసా రెడీ. ఎగ్ సమోసా.. కావలసినవి: గుడ్లు – ఆరు; పచ్చి బంగాళ దుంపల తురుము – కప్పు; క్యారట్ ముక్కలు – అరకప్పు; ఉల్లిపాయలు – నాలుగు; పచ్చిమిర్చి – మూడు; నూనె – ఐదు టేబుల్æస్పూన్లు; వంటసోడా – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; వాము – అరటీస్పూను; కొత్తి మీర – చిన్న కట్ట; మైదా – రెండున్నర కప్పులు; రిఫైన్డ్ నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి ∙మైదాలో వంటసోడా, వాము, అరటీస్పూను ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. నీళ్లుపోసి ముద్దచేసి గంటపాటు నానపెట్టుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత క్యారట్ ముక్కలు, బంగాళ దుంప తురుము వేసి వేయించాలి. నిమిషం తరువాత కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. మిశ్రమం మెత్తబడిన తరువాత గుడ్ల సొన వేసి వేయించాలి. గుడ్ల సొన వేగిన తరువాత దించేసి చల్లారనివ్వాలి. మైదా ముద్దను చిన్న ఉండలుగా చేసి, చపాతీల్లా వత్తుకోవాలి. ఈ చపాతీలను త్రికోణాకృతిలో మడతపెట్టి మధ్యలో ఒక టీ స్పూన్ గుడ్డు మిశ్రమాన్ని పెట్టి మిశ్రమం బయటకు రాకుండా అంచులకు కొద్దిగా తడిచేసి అతుక్కునేటట్లు వేళ్లతో మెల్లగా నొక్కాలి ఇలా అన్ని తయారయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేస్తే ఎగ్ సమోసా రెడీ. ఇవి కూడా చదవండి: క్యాబేజ్‌తో ఎగ్ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది -
తోటకూరతో.. హెల్దీగా సమోసా చేసుకోండి ఇలా!
తోటకూర సమోసా కావలసినవి: తోటకూర తురుము – ఒకటిన్నర కప్పులు టొమాటో గుజ్జు – పావు కప్పు (నిప్పులపై కాల్చి, దాన్ని మిక్సీ పట్టుకోవాలి) స్వీట్ కార్న్ – పావు కప్పు (ఉడికించుకోవాలి) తాలింపు సామాన్లు – కొన్ని మైదా పిండి – 2 కప్పులు గోధుమ పిండి – 1 కప్పు. ఉప్పు – సరిపడా, నూనె – తగినంత తయారీ: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, కొద్దిగా ననె, సరిపడా నీళ్లు, ఉప్పు వేసుకుని చపాతీ ముద్దలా చేసుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు తాలింపు పెట్టుకుని.. అందులో టొమాటో గుజ్జు, తోటకూర తురుము వేసుకుని చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి. మొత్తం దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. అనంతరం చపాతీ పిండిని ఉండల్లా చుట్టుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, చిన్న చిన్న సమోసాల్లా చుట్టుకోవాలి. తర్వాత ప్రతి సమోసాలో.. కొద్దికొద్దిగా తోటకూర మిశ్రమంతో పాటు ఒక టీ స్పూన్ స్వీట్ కార్న్ వేసుకుని.. ఫోల్డ్ చెయ్యాలి. వాటిని కాగిన ననెలో వేయించి తీసి.. సర్వ్ చేసుకోవాలి. (చదవండి: పిల్లలు ఇష్టపడేలా..చాక్లెట్ పాక్ చేసుకోండి ఇలా..!) -
ఆ సమోసాల అమ్మే వ్యక్తి..ఓ గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాడు!
మనకు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే.. మేధావులు, జీనియస్‌లు, పండుతుల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన చుట్టూ జరుగుతున్న వాటిని గమనించినా.. లేదా కష్టజీవులను చూసినా ఎంతో నేర్చుకోవచ్చు. మనం పడుతున్నదే కష్టం కాదు అంతకు మించి ఉందని అర్థం అవుతుంది. అందుకు ఉదహరణే ఈ ఉదయ్‌పూర్ వృద్ధుడు. ఆ వృద్ధుడు ఉదయ్‌పూర్‌లోని కోర్టు సర్కిల్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డుపక్కనే సమోసాలు అమ్ముతుంటాడు. సరిగ్గా ఆ సమయానికి అటుగా ఆర్యాన్ష్ అనే వ్యక్తి కారులో వస్తున్నాడు. కరక్ట్‌గా ఆ టైంలో మంచి జోరుగా వర్షం వస్తుంది. దీంతో ఆర్యాన్ష్ కారు పక్కకు పార్క్ చేసి నేరుగా అతని వద్దకు వచ్చాడు. గట్టిగా వర్షం కురుస్తుండటంతో ఏదైనా తిందామనిపించి చూడగా ఆ వృద్ధుడు అక్కడే సమోసాలు, పోహా అమ్మడం చూసి అతని దగ్గరకు వెళ్లాడు. కొన్ని సమోసాలు ఆర్డర్ చేసి తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ వయసులో ఇంకా ఎందుకు కష్టపడుతున్నావు అని ఆర్యాన్ష్ ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి బదులుగా..ఈ వయసులో డబ్బు సంపాదించేందుకు కష్టం పడటం లేదు బేటా!. నా మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నాకు నచ్చిన పని చేస్తున్నాను. ఇలా నేను వండిన వంటకాల రుచిని ఆస్వాదించిన ముఖాలను చూస్తే నా మనసు సంతోషంతో నిండిపోతుంది. నేను ఒంటరిగా ఇంటి వద్ద కూర్చొవడం కంటే ఇదే మేలని చెబుతాడు ఆ వృద్ధుడు. దానికి రియలైజ్ అయిన అర్యాన్ష్ ఇది జీవితానికి ఉపయోగపడే విలువైన పాఠం ఇది. వయసులో ఉన్న యువత సైతం ఒళ్లు వంచడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇంతటి పండు ముదుసలి వయసులో ఎంతో ఉషారుగా పనిచేస్తున్నాడు. పైగా పనిచేస్తేనే సంతోషంగా ఉంటుందని చెబుతున్నాడు. అతని దృక్పథాన్ని వింటే ఎందరో యువత తమ జీవన విధానాన్ని మార్చుకుంటారు కదా అని ట్విట్టర్ వేదికగా ఈ విషయన్ని నెటిజన్లతో పంచుకున్నాడు ఆర్యాన్ష్. దీంతో నెటిజన్లు సదరు వృద్ధుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. It was raining heavily when I parked my car beside a traffic signal near court circle udaipur, where I saw an old uncle selling hot samosa and poha. I placed an order and curiously asked him why he didn't take a rest today, considering his age. He told me something that… pic.twitter.com/CCIutZv23Z — Aaraynsh (@aaraynsh) July 25, 2023 (చదవండి: 600 మిలియన్ల ఏళ్ల నాటి సముద్రం..భూమి పుట్టుకకు ముందు..) -
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
మటన్ ఖీమా సమోసా తయారీ ఇలా! పుదీనా చట్నీతో తిన్నారంటే..
Mutton Keema Samosa: మటన్ ఖీమా సమోసా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండిలా! కావలసినవి: ►మటన్ కీమా – అర కేజీ ►పచ్చి బఠాణీ– 100 గ్రాములు ►ఉల్లిపాయ – 1 (తరగాలి) ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ►పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి) ►మిరప్పొడి– టీ స్పూన్ ►ధనియాల పొడి– టీ స్పూన్ ►జీలకర్ర పొడి – టేబుల్ స్పూన్ ►బంగాళ దుంపలు – 2 ►కొత్తిమీర తరుగు – కప్పు ►నూనె – పావు కేజీ ►గోధుమ పిండి – పావు కేజీ. తయారీ: ►గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, వేడి నీటిని పోసి చపాతీలకు కలుపుకున్నట్లు ముద్దలా కలుపుకుని తడి వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి. ►బంగాళదుంపలను కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. ►పచ్చి బఠాణీలను కడిగి చిటికెడు చక్కెర వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టాలి. ►ఖీమాను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరోసారి కడగాలి. ►మందపాటి పెనంలో టీ స్పూన్ నూనె వేసి ఖీమా వేసి రంగు మారేవరకు సన్నమంట మీద వేయించాలి. ►ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, బఠాణీ, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, మిరప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ►పదిహేను నిమిషాల సేపు సన్న మంట మీద ఉడికించాలి. ►ఖీమా, బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి ఒకసారి రుచి చూసి అవసరం అనిపిస్తే మరికొంత ఉప్పు, మిరప్పొడి కలుపుకోవాలి. ►చివరగా కొద్దిసేపు మూత తీసి మంట పెంచి కలుపుతూ ఉడికించాలి. ►తేమ ఆవిరై పోయి ఖీమా కర్రీ సమోసా స్టఫ్ చేయడానికి తగినట్లు రావాలి. ►గోధుమ పిండిని చపాతీల్లా వత్తుకుని ఒక్కో చపాతీని సగానికి కట్ చేసుకోవాలి. ►ఒక ముక్కని ఐస్‌క్రీమ్ కోన్లాగ చేసుకోవాలి. ►టీ స్పూన్ ఖీమా కర్రీ పెట్టి అంచులను అతికిస్తే సమోసా ఆకారం వస్తుంది. ►ఒక చపాతీతో రెండు సమోసాలన్నమాట. ►అన్నింటినీ ఇలాగే చేసుకుని ఆ తర్వాత బాణలిలో నూనె వేడి చేసి సమోసాలను దోరగా కాల్చుకోవాలి. ►ఈ సమోసాల్లోకి పుదీనా చట్నీ మంచి కాంబినేషన్. ట్రై చేయండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా -
తోపుడు బండి మీద సమోసాలు అమ్మి.. రోజుకు రూ.12 లక్షలు సంపాదిస్తున్న క్యూట్ కపుల్!
Ghar, Padosi, Bacche Hi Rishtedar Ek Samosa Toh Banta Hai Yaar నవ్వొస్తుంది కదా. బట్ ఇదే ట్యాగ్ లైన్‌తో సమోసా సింగ్ అనే కంపెనీ మొత్తం మార్కెట్‌నే క్యాప్చర్ చేస్తోంది. ఇప్పటికే వందల కోట్ల సమోసా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పింది. భవిష్యత్‌లో ప్రపంచ దేశాల్లో సైతం సమోసాలు అమ్మి వేలకోట్ల టర్నోవర్ సాధించేలా ప్రణాళికలు రచిస్తుంది. తోపుడు బండి మీద సమోసాలు అమ్మిన నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్..వందల కోట్ల వ్యాపారంగా ఎలా తీర్చిదిద్దారు. పూలమ్మిన చోటే కట్టెలమ్మే అనే సామెతను తిరగరాసిన ఈ దంపతులిద్దరూ సమోసాలు ఎందుకు అమ్మాలనుకున్నారో తెలుసుకుందాం పదండి. కరణ్ జోహార్ సినిమా తరహాలో రియల్ లైఫ్‌లో హీరో శిఖర్ వీర్ సింగ్, హీరోయిన్ నిధి సింగ్ బ్యాచిలర్ బయోటెక్నాలజీ డిగ్రీని పూర్తి చేసేందుకు 2004లో థానేలోని కురకేత్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే? రీల్ లైఫ్ తరహాలో రియల్ లైఫ్‌లో శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్‌లు స్నేహితులు కాస్త ప్రేమికులుగా మారారు. అలా అని చదువును ఆటకెక్కించలేదు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం నిధి బయోటెక్నాలజీ చదవనైతే చదివింది కానీ మనసంతా మార్కెటింగ్ వైపే మళ్లింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా థానే నుంచి ఢిల్లీకి పయనమైంది. ఢిల్లీలో అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో జాయిన్ అయింది. లైఫ్ సైన్సెస్ అమితంగా ఇష్టపడే శిఖర్ మాస్టర్స్ చేసేందుకు ఉన్నత చదువుల కోసం థానే నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. లైఫ్ సైన్సెస్ చదివే సమయంలో శిఖర్ ఫాస్ట్ ఫుడ్ తరహాలో స్నాక్ ఐటమ్స్ అమ్మకాల్లో శుభ్రత లేకపోవడాన్ని గమనించాడు. అన్నీ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలలో పిజ్జాలు, బర్గర్లను అమ్మితే.. అదే ఇండియన్ స్నాక్స్, సావీరస్ (సాల్టీగా-స్పైసీగా) ను వీధుల్లో అమ్మడాన్ని గమనించాడు. సమోసాలు అమ్ముదాం నిధి అదిగో అప్పుడే శిఖర్‌కు దిగ్గజ రెస్టారెంట్లకు పోటీగా సమోసా వ్యాపారం చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. తన ఐడియాను నిధికి షేర్ చేశాడు. వ్యాపార మెళుకువలు తెలియని శిఖర్.. కియోస్కోలో సమోసా అమ్మితే ఎలా ఉంటుందని నిధికి తన మనసులో మాట చెప్పాడు. శిఖర్ 2009లో సైంటిస్ట్‌గా బయోకాన్ కంపెనీలో చేరాడు. కొంత కాలానికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి, నచ్చిన జీతం ఇంతకంటే ఏం కావాలి? కానీ వాళ్లు అలా అనుకోలేదు. ఉద్యోగాల నిమిత్తం దేశాలు పట్టుకొని తిరిగినప్పటికీ సమోసా వ్యాపారం చేయాలన్న ఆశ పోలేదు. ఇంకా రెట్టింపు అయ్యింది. వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. శుభ్రత (hygiene)తో పాటు సమోసాను వినూత్నంగా తయారు చేయాలని అనుకున్నారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. జాబ్‌కు రిజైన్ చేసి సంవత్సరాలు గడిచాయి. చివరికి 2015 అక్టోబర్ నెలలో బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. బిజినెస్ కోసం ఎవరు ఏం చేయాలో డిసైడ్ అయ్యారు. అందుకు నిధి అమోదం తెలపడంతో తన స్టార్టప్ ప్రయత్నాల్ని ప్రారంభించాడు శిఖర్. అక్టోబర్ 13, 2015లో శిఖర్ తాను చేస్తున్న జాబ్‌కు రిజైన్ చేశాడు. నిధి తాను కూడా జాబ్‌కు రిజైన్ చేస్తానంటే కంపెనీ ఒప్పుకోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ స్టార్టప్ ప్రారంభించుకోమని ఆఫర్ ఇచ్చింది. వెంటనే వాళ్లిద్దరూ కలిసి రెండు చిన్న కిచెన్ రూమ్‌లు అద్దెకు తీసుకున్నారు. వంట చేసే వాళ్లను నియమించుకున్నారు. పరిశోధన- అభివృద్ధి (Research and Development)లో నిమగ్నమయ్యారు. నాలుగు నెలల కష్టం 4 నెలల పాటు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని వినూత్నంగా పలు షేపుల్లో సమోసాను తయారు చేశాడు శిఖర్. బిజినెస్ ప్రారంభించాలన్న తమ ప్రయత్నాల్లో ఎట్టకేలకు మరో అడుగు ముందుకు వేశారు. ఆర్ అండ్ డీలో రకరకాల రుచులతో సమోసాలు వేయించాలి. కాల్చకూడదు, జిడ్డు లేకుండా ఆరోగ్యం ఉండాలన్న ఆలోచన శిఖర్ బయోటెక్ అనుభవం నేర్పిచ్చింది. రకరకాల ఫ్లేవర్లతో ప్రత్యేకంగా తయారు చేసిన పిండితో సమోసాపై భాగంగా గట్టిగా ఉండేలా చూసుకున్నారు. అలా సంప్రదాయ సమోసా షేప్ కంటే వీళ్లు తయారు చేసిన సమోసా చూడటానికి బాగుంది. సమోసా ఆకారం ఇలా ఉండడం (కింద ఇమేజ్‌లో చూపించినట్లుగా) వల్ల నూనెను పీల్చుకోదని తెలిపారు. చికెన్ మఖానీ (బటర్ చికెన్), కడాయి పనీర్ నుండి చాక్లెట్ వరకు రకరకాల రుచుల్లో సమోసాలు అందించేందుకు సిద్ధమయ్యారు. సమోసా సింగ్ పేరు భలే ఉందే అమ్మేందుకు సమోసా సిద్ధమైంది. ప్రొడక్ట్ ఉంటే సరిపోదు కదా. దానికంటూ పేరుండాలి. అందుకే అందరి నోళ్లలో నానేలా మా సంస్థకు సమోసా సింగ్ అని పేరుపెట్టాం. ఓ రోజు శిఖర్ నా దగ్గరకు వచ్చి కంపెనీ పేరు సమోసా సింగ్ అని చెప్పడంతో ‘అరె ఈ పేరేదో భలే ఉందే అని’ నవ్వుకున్నట్లు నిధి వివరించారు. తోపుడుబండి మీద సమోసాలు ప్రొడక్ట్ (సమోసా),పేరు రెడీ. మార్కెటింగ్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. ముందుగా తాము తయారు చేసిన సమోసా గురించి కస్టమర్ల నుంచి అభిప్రాయం తెలుసుకునేందుకు తోపుడుబండి మీద సమోసాలు అమ్మారు. రద్దీ ఉండే ఏరియాల్లో కియోస్కోలు ఏర్పాటు చేసి సమోసా గురించి కస్టమర్ల అభిప్రాయాలు సేకరించారు. ఫీడ్‌బ్యాక్ పాజిటీవ్‌గా రావడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బెంగళూరులో సమోసా సింగ్ పేరుతో క్యూఎస్ఆర్ అవుట్ లెట్‌ను ప్రారంభించారు. నిధి బిల్ కౌంటర్‌ను నిర్వహిస్తుండగా, శిఖర్ కొంతమంది వర్కర్లతో కలిసి సమోసాలు తయారు చేసి అమ్మడం, హోమ్ డెలివరీలు చేయడం ప్రారంభించారు. టేస్ట్ అదిరింది. ధర రీజనబుల్‌గా ఉంది. రెండు సమోసాలు రూ.20, చికెన్ మఖానీ సమోసాలు (రెండు) రూ. 55కే ధర తక్కువగా ఉండడం సమోసా సింగ్‌కు కలిసి వచ్చింది. మౌత్ పబ్లిసిటీ పెరిగి రెండు నెలల్లో ఆర్డర్లు రోజుకు 500 సమోసాలు అమ్మే స్థాయికి ఎదిగారు. భారీ ఆర్డర్ దశ తిరిగింది బిజినెస్ ఊహించని విధంగా సాగుతుండడంతో నిధి క్యాష్ కౌంటర్ నుంచి..కార్పొరేట్ ఆర్డర్ల కోసం మార్కెటింగ్ విభాగంలో అడుగు పెట్టింది. అలా తనకున్న మార్కెటింగ్ అనుభవంతో జర్మన్ కంపెనీ నుంచి 8వేల సమోసాలను తయారు చేసి ఇచ్చే ఆర్డర్‌ను సంపాదించింది. ఆర్డర్ అయితే వచ్చింది. చేయడం,వాటిని నిల్వ చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉందని భావించారు. సదరు సంస్థను వారం రోజుల సమయం అడిగారు. వారంలో మళ్లీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్‌పై పనిచేశారు. సమోసా చెప్పిన టైంకు చేసి ఆర్డర్ ఇవ్వాలి. ప్రొడక్ట్ చెడిపోకుండా తయారు చేసేలా రీసెర్చ్ చేశారు. షిప్ట్‌ల వారీగా సమోసాలు తయారు చేసి చెప్పిన టైం కంటే ముందే ఆర్డర్ సిద్ధం చేశారు. ఇల్లు అమ్మి జర్మనీ ఆర్డర్ తర్వాత సమోసా సింగ్ మారు మ్రోగింది. ఆర్డర్ల సంఖ్య పెరిగింది. వివిధ నగరాల్లో అవుట్ లెట్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కానీ చేతిలో సరిపడ డబ్బు లేకపోవడంతో బెంగళూరులో ఉన్న ఇల్లును అమ్మి వ్యాపారానికి అనువుగా ఉండేలా అవుట్ లెట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం బెంగళూరు,హైదరాబాద్, పూణేతో పాటు ఇతర నగరాల్లో సమోసాలు అమ్ముతున్నారు. ఇలా సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.12 లక్షల నుంచి సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సిద్ధాంతం తమను ఇక్కడికి దాకా తీసుకొచ్చిందని, భవిష్యత్‌లో విదేశీయులతో తమ సమోసాను టేస్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు నిధిసింగ్, శిఖర్ సింగ్‌లు విజయ గర్వంతో చెబుతున్నారు. -
మన టీ, సమోసాకు ఆ దేశంలో యమా క్రేజ్..! విజయసాయి రెడ్డి ట్వీట్
లండన్: సాయంత్రమయ్యేసరికి వేడి వేడి సమోసా తిని, పొగలు గక్కే టీ ఒక కప్పు లాగిస్తే ఎలాగుంటుంది. ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది కదా. మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ చాయ్, సమోసా కాంబినేషన్‌కి ఇప్పడు బ్రిటన్ యువతరంలో యమా క్రేజ్ పెరుగుతోంది. సాధారణంగా తెల్లవారు టీతో పాటు బిస్కెట్లు తింటారు. ఇప్పుడు వారి జిహ్వలు కొత్త రుచులు కోరుకుంటున్నాయని యునైటెడ్ కింగ్డమ్ టీ అండ్ ఇన్ఫ్యూజన్స్ అసోసియేషన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. వెయ్యి మందితో ఈ సర్వేని నిర్వహిస్తే సాయంత్రం స్నాక్‌గా గ్రానోలా బార్స్ (ఓట్స్‌తో చేసేది) చాలా బాగుంటుందని మొదటి స్థానం ఇచ్చారు. ఇక రెండోస్థానాన్ని మన సమోసా కొట్టేసింది. సర్వేలో పాల్గొన్న యువతరంలో 8 శాతం మంది సమోసాకి మొగ్గు చూపించారు. విజయసాయి రెడ్డి ట్వీట్ యూకే పేవరేట్ మెనూలో మన చాయ్, సమోసా చేరడంపై ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బ్రిటన్ యువత తమ స్నాక్స్ లో స్వీట్లకు బదులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. 16-24 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగానికిపైగా.. టీతో కలిపి స్వీట్ బిస్కెట్ రుచిని ఆస్వాదిస్తున్నారని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. It is happy to note that tea and samosa have become favourite menu in UK. The young there prefer them instead of sweets as snacks. 16 to 24-year-olds are half as likely to enjoy a sweet biscuit with their tea as those over 55. #indianculture #foodie #uk #india pic.twitter.com/bRTlbIZq1W — Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2023 -
సమోసాలో చిట్టెలుక.. అప్పటికే 130 సమోసాలు..!
సాక్షి, సిద్ధిపేట: ఓ హోటల్లో కొన్న సమోసాలో చనిపోయిన చిట్టెలుక బయటపడ్డ ఘటన సిద్దిపేటలోని రాఘవాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అధికం వెంకటస్వామి హోటల్లో సమోసాలు కొన్నాడు. తింటున్న క్రమంలో చనిపోయిన ఎలుక వచ్చింది. దీంతో వినియోగదారుడు హోటల్ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరికొంతమంది గొడవకు దిగడంతో నిర్వాహకుడు మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పడంతో గొడవ సర్దుమనిగింది. అప్పటీకే 130 సమోసాలు అమ్మినట్లు నిర్వాహకుడు తెలిపారు. చదవండి: వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే.. -
చాయ్, సమోసా రూ.490.. షాకవుతున్న నెటిజన్లు..!
వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఉదయం లేవగానే టీ తాగాల్సిందే లేదంటే ఏం తోచదు. ఇంట్లో అయినా, బయట అయినా రోజుకు నాలుగు కప్పుల టీ అయినా లాగించేస్తుంటారు. ఇక చాయ్, సమోసా ఆ కాంబినేషనే వేరు. చాలా మంది టీ తాగిన తర్వాత స్నాక్స్‌లా సమోసా తింటుంటారు. సాధారణంగా వీటి ధర కూడా ఎంతనుకున్న రూ. 50కు మించదు. అయితే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం ధరలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబై ఎయిర్‌పోర్టులో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసినందుకు రూ. 499 బిల్ వేశారు.. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు ఫరా ఖాన్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. డిసెంబర్ 28న రెండు ఫోటోలను షేర్ చేస్తూ.. ముంబై చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్ టీ, ఒక వాటర్ బాటిల్ ధర 490’ గా పేర్కొంది. దీనికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో 'అచ్ఛే దిన్ ఆనే వాలే హై' (మంచి రోజులు రాబోతున్నాయి' అని మోదీ చేసిన నినాదాన్ని గుర్తు చూస్తూ వ్యంగ్యంగా జర్నలిస్ట్ ఈ విధంగా క్యాప్షన్ జోడించింది. Two samosas, one chai and one water bottle for 490 Rs at Mumbai airport!! Kafi ache din aa gae hain. #Vikas pic.twitter.com/aaEkAD9pmb — Farah khan (@farah17khan) December 28, 2022 ఇందులో ఇందులో సాధారణ సైజ్ కలిగిన రెండు సమోసాలు ఒక చాయ్ కప్పు కనిపిస్తోంది. చాయ్ సమోసాపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా వేలల్లో లైక్‌లు వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్లు ‘ముంబై కండివాలీ రైల్వే స్టేషన్లో 52 రూపాయలకు రెండు సమోసాలు, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకొందరు ‘ఏంటి విమానశ్రయంలో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ రూ.490నా’ అంటూ షాక్ అవుతున్నారు. చదవండి: ‘ముంబై మహారాష్ట్రదే.. ఎవడబ్బ సొత్తు కాదు’ -
Garath Wynn Owen: హైదరాబాద్ తిండి తెగ నచ్చేసింది!
ఇంటికొచ్చిన అతిథి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం... నచ్చిన వంట వండి పెట్టడం... భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు! మరి.. మన దేశానికో కొత్త అతిథి వస్తే...? వారికేమిష్టమో కూడా తెలుసుకోవాలి కదా... అందుకే.. ‘ఫ్యామిలీ’ గారెత్ ఓవెన్ కు హలో చెప్పింది! ఎవరీయన అనుకునేరు... నిత్యం మీటింగ్‌లు, చర్చల్లో బిజిబిజీగా గడిపే బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఈయన! చిరంజీవి పెట్టిన ఆవకాయ అన్నం రుచినీ.. మిర్చిబజ్జీలు, హైదరాబాద్ బిర్యానీ వెరైటీలనూ నెమరేసుకున్న ఆయన ఇంకా ఏమన్నారంటే.... సమోసా, బోండాలు నచ్చేశాయి ‘‘హైదరాబాద్ వచ్చి రెండు నెలలే అయ్యింది. కానీ.. ఉదయాన్నే ఫ్యామిలీతో కలిసి నడక సాగిస్తూంటా. నేనో భోజనప్రియుడిని. థాయ్‌లాండ్‌లో రెడ్ కర్రీ తదితర స్ట్రీట్‌ఫుడ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశా. హైదరాబాద్ ఫుడ్ కూడా బాగా నచ్చేసింది. ముఖ్యంగా చెప్పాల్సింది బోండాల గురించి! పిల్లలు వాటిని డోనట్లని పిలుస్తున్నారు. సమోసాలు, మిర్చిబజ్జీలూ రుచి చూశా. బోర్ కొట్టినప్పుడల్లా మసాలా చాయ్‌లు లాగించేస్తున్నా. ఇక హైదరాబాదీ బిర్యానీల్లో ఉన్న వెరైటీకి ఇప్పటికే ఫిదా అయిపోయా’’ ఆంధ్ర కారం పరీక్ష పెట్టింది ‘‘ఈమధ్యే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రితో భోంచేస్తున్నా. రకరకాల వంటలు వడ్డించారు. బ్రిటిష్ వాడిని, నా శరీరం అన్నింటినీ బాగానే తట్టుకుంటుందని అనుకున్నా కానీ, అక్కడ వడ్డించిన ఓ వంటకం నిజంగానే నాకు పరీక్ష పెట్టింది. కొంచెం రుచి చూడగానే అర్థమైపోయింది. అది మన తాహతుకు మించి మరీ కారంగా ఉందీ అని. అక్కడితో ఆపేశా. ఏమాటకామాట చెప్పుకోవాలి. మంత్రితో సమావేశం, విందూ రెండూ తృప్తినిచ్చాయి’’ హైదరాబాదీ హడావుడి బాగుంది ‘‘రోజంతా హడావుడిగా ఉండే నగరం తెగనచ్చేసింది. స్ట్రీట్‌ఫుడ్ కోసం లేదా వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఒకచోట నిలబడి చుట్టూ జరుగుతున్న హడావుడిని గమనిస్తూ ఉండిపోవడం చాలా ఇష్టం. కొన్ని రోజుల క్రితం చార్మినార్‌కు వెళ్లా. ఓల్డ్సిటీలోనూ తిరిగా... వెస్ట్ మిడ్‌ల్యాండ్ మేయర్‌తో కలిసి వెళ్లా అక్కడికి! అబ్బో.. ఎంత కళకళలాడుతుంటుందో అక్కడ. భలే బాగుంటుంది. ఇంకో మూడేళ్లు ఇక్కడే ఉంటాను కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలన్నీ తిరగాలి.’’ చిరంజీవి ఆవకాయ అన్నం వడ్డించారు ‘‘సినిమాలు, సంగీతం, నాట్యం వంటివి ఇష్టమైనప్పటికీ హైదరాబాద్‌లో ఇంకా వాటిని పెద్దగా ఆస్వాదించలేదు. కాకపోతే... ఈ మధ్యే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశా. ఆయన నాకు స్వయంగా వడ్డించారు కూడా. అందులో ఆవకాయ బాగా నచ్చింది. నాలుగు గంటలపాటు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నిజం చెప్పాలంటే అతిపెద్ద టాలీవుడ్ స్టార్‌తో గడిపానని అస్సలు అనిపించలేదు’’ నా సైకిల్ వచ్చేస్తోంది ‘‘కోవిడ్ నేర్పిన అతిపెద్ద పాఠం శారీరక వ్యాయామాన్ని అస్సలు మరచిపోవద్దూ అని. నాకూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం అంటే ఇష్టం కూడా. హైదరాబాద్‌లో బోలెడన్ని సైక్లింగ్ గ్రూపులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా నా సైకిల్ కూడా లండన్ నుంచి వస్తోంది. ఆ తరువాత నేనూ హైదరాబాద్ రోడ్లపై సైకిల్లో తిరిగేస్తా. హుస్సేన్ సాగర్ చుట్టూ రౌండ్లు కొట్టేస్తా. ఫిట్నెస్ కోసం నేను చేసే ఇంకో పని పంచింగ్ బ్యాగ్‌తో బాక్సింగ్ చేయడం! నిరాశా, నిస్పృహలను వదిలించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది’’ పిల్లలూ కలిసిపోయారు ‘‘నాకు పదకొండేళ్ల అలిసియా, తొమ్మిదేళ్ల థామస్‌లు ఉన్నారు. ఇక్రిశాట్లో ఉన్న స్కూల్లో చేరారు. ఈ ఏడాది కొంచెం ఆలస్యంగానే స్కూలుకెళ్లారు కానీ.. వెళ్లిన వెంటనే పిల్లలతో కలిసిపోయారు. ఉదయాన్నే ఏడు గంటలకల్లా వాళ్లను స్కూల్‌కు వదిలేస్తూంటాం. కొంచెం దూరమే కానీ.. అక్కడి వాతావరణం బాగా నచ్చింది.’’ -
వైరల్ వీడియో.. 5 నిమిషాల్లో 3 కేజీల సమోసా తినేశాడు..
న్యూఢిల్లీ: ఆహార పోటీల గురించి చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆహార పదార్థాలను చెప్పిన సమయంలోపు పూర్తి చేస్తే నగదు బహుమతులు సైతం ఇస్తుంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ బహుమతులు ఇస్తున్నారు. అలాంటి.. సంఘటనే తాజాగా వైరల్‌గా మారింది. రాజ్నీశ్ జ్ఞాని అనే వ్యక్తి ‘ఆర్ యూ హంగ్రీ’ అనే పేరుతో ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఆహార పోటీలకు వెళ్లటం.. ఇచ్చిన ఛాలేంజ్‌ను పూర్తి చేసి నగదు గెలుచుకోవటమే పనిగా పెట్టుకున్నాడు. గత నెలలో 30 నిమిషాల్లోనే 21 ప్లేట్ల ‘చోలే కుల్తే’ తిని వైరల్‌గా మారాడు. ఆ ఛాలేంజ్ పూర్తి చేయటం ద్వారా బులెట్ బైక్ గెలుచుకున్నాడు. అయితే, ఆ బైక్‌ను తిరిగి ఇచ్చేసి ఛాలెంజ్‌ను కొనసాగించాలని సూచించాడు. ఆ వీడియోను ఫేస్బుక్లో 12 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు మరోమారు ఈ బ్లాగర్ వీడియో వైరల్‌గా మారింది. స్ట్రీట్ ఫుడ్ ఛాలేంజ్‌లో పాల్గొని కేవలం 5 నిమిషాల్లోనే 3 కిలోల సమోసా లాగించేశాడు. ఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన ఈ సంఘటన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా 1 మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో.. ఛాలెంజ్‌ను బ్లాగర్‌తో పాటు రెస్టారెంట్ ఓనర్ వివరించారు. ఆ తర్వాత బాహుబలి సమోసాను తింటున్న వీడియోను ప్లే చేశారు. అయితే, ఇలాంటి ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు ముందు 1-2 రెండు రోజులు ఏమీ తినకుండా ఉంటాడు. కొంచెం చట్నీ, నీళ్లతో స్నేహితుల ప్రోత్సాహంతో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు బ్లాగర్. అందుకు గానూ రెస్టారెంట్ ఓనర్ వద్ద రూ.11వేల నగదు బహుమతి అందుకున్నాడు. ఇదీ చదవండి: Bahubali Samosa Challenge: తిన్నారంటే రూ. 51,000 మీవే.. కానీ ఒక్క షరతు! -
Recipe: మటన్ కీమా- చీజ్ సమోసా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోండి!
ఆలూ సమోసా, ఆనియన్ సమోసా, కార్న్ సమోసా.. ఎప్పుడూ ఇలా రోటీన్‌గా కాకుండా కాస్త భిన్నమైన సమోసా రుచి ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, మటన్ కీమా– చీజ్‌తో సమోసా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి! కీమా– చీజ్ సమోసా తయారీకి కావలసినవి: ►మటన్ కీమా – 1 కప్పు (కొద్దిగా మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి) ►మైదా పిండి – పావు కిలో, వాము – అర టీ స్పూన్ ►చీజ్ తురుము – అర కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ ►రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, సోయాసాస్ – 2 టీ స్పూన్లు ►ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు, పెరుగు – 1 టేబుల్ స్పూన్ ►మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత తయారీ: ►ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ►అందులో కీమా, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, వాము వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. ►అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి, పెరుగు వేసి తిప్పుతూ ఉండాలి. ►స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో గిన్నె తీసుకుని, అందులో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ.. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ►దీనిని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ►ఆ ముద్దను చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. ►పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల కొద్దిగా కీమా మిశ్రమాన్ని, కొద్దిగా చీజ్ తురుము పెట్టి.. అంచులు మూసేయాలి. ►అన్నీ అలాగే చేసుకుని.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Kala Mutton Recipe Telugu: కాలా మటన్ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి! Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి! -
బాహుబలి సమోసా.. తిన్నారంటే రూ. 51,000 మీవే.. కానీ ఒక్క షరతు!
సమోసా.. భారతీయులు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్‌లో మొదటి వరుసలో ఉంటుంది. స్నేహితులతో సరదాగా బేకరీకి వెళ్లిన, ఆఫీస్‌లో క్యాంటీన్‌కు వెళ్లినా ఆర్డర్ చేసే ఫుడ్ ఐటమ్స్‌లో సమోసా తప్పక ఉంటుంది. ఆలు, ఆనియన్, కార్న్ సమోసా.. పేర్లు ఏవైనా చాలా మందికి ఇది ఫేవరెట్ స్నాక్. తాజాగా ఉత్తర ప్రదేవ్లోని మీరట్‌లో బహుబలి సమోసా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అసలు దీని స్టోరి ఏంటో తెలుసుకుందాం మీరట్‌లోని లాల్కుర్తి బజార్లో కౌశల్ స్వీట్స్ పేరుతో షాపు నిర్వహిస్తున్న శుభం.. బహుబలి సమోసా పేరుతో ఫుడ్ చాలెంజ్ విసిరారు. అది మనం తినే సాధారణ సమోసాల్లా ఉండదు. ఏకంగా 8 కేజీల బరువు ఉంటుంది. ఇత పెద్ద సమోసాను తిన్న వారికి రూ. 51,000 అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ సమోసాను కేవలం 30 నిమిషాల్లో మాత్రమే పూర్తి చేయాలి. చదవండి: భారీ వర్షాలతో జనాలు బెంబేలెత్తిపోతుంటే.. అతను మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాడు ఈ విషయంపై షాప్ యజమాని మాట్లాడుతూ.. నిత్యం ఏదో కొత్తదనాన్ని తీసుకురావాలనే ఉద్ధేశ్యంతోనే సమోసా చాలెంజ్‌ను విసురుతున్నట్లు తెలిపారు. అందుకే బాహుబలి సమోసాను తయారు చేసినట్లు పేర్కొన్నారు. ముందుగా నాలుగు కిలోల సమోసాతో చాలెంజ్ ప్రారంభించామని ఇప్పుడు 8 కిలోలకు పెంచినట్లు వెల్లడించారు. ఎనిమిది కిలోల సమోసా ధర దాదాపు రూ. 1,100 ఉంటుందని, ఇందులో ఆలు, చీజ్, డ్రరై ఫ్రూట్స్ నింపినట్లు తెలిపారు. అంతేగాక త్వరలో 10 కిలలో సమోసా చేయనున్నట్లు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. మీకు ఓ విషయం చెప్పలేదు కదూ.. ఇప్పటి వరకు ఈ చాలెంజ్‌ను చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరూ గెలవలేదట. ఆరగంటలో తినలేకపోయి ఓడిపోయారట. మరి మీరు కూడా ప్రయత్నించాలనుకుంటే మీరట్ వెళ్లాల్సిందే. -
ఛీ ఛీ! 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసా, వాష్‌రూమ్‌లో భోజనాల తయారీ
సమోసా.. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్. ఆలు సమోసా, ఆనియన్ సమోసా, కార్న్ సమోసా ఇలా ఎన్నో రకాలున్నా.. ఆవురావురంటూ తినాల్సిందే. మరీ ముఖ్యంగా సాయంత్రం వేళల్లో స్నాక్ ఐటమ్‌గా సమోసాను తెగ లాగించేస్తుంటారు. అయితే ఆహార ప్రియులకు ఎంతో ప్రియమైన సమోసాకు సంబంధించిన ఓ చేదు వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సౌదీ అరేబియాలో ఓ రెస్టారెంట్లో ఒకటి కాదు రెండు కాదు గత 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసాలు, ఇతర స్నాక్స్ తయారు చేస్తోస్తోంది. అంతేకాదు రెస్టారెంట్లో కుళ్లిపోయిన మాంసాన్ని, ఇతర ఆహార పదార్థాలను కూడా వినియోగిస్తున్నారు. జెబ్బా నగరంలోని రెసిడెన్షియల్ భవనంలోని రెస్టారెంట్లో ఆహార భద్రత నియమాలు, పరిశుభ్రత పాటించం లేదని స్థానికుల అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే సదరు రెస్టారెంట్‌పై దాడి చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.. గత 30 ఏళ్లుగా టాయిలెట్లో స్నాక్స్ తయారుచేస్తున్నారని అధికారులు గుర్తించారు. అదే విధంగా, వాష్ రూమ్ లో భోజనాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. స్నాక్స్‌లో కాలపరిమితి ముగిసిన మాంసం, చీజ్ వంటి ఆహార పదార్ధాలను వాడుతున్నట్లు తెలిసింది. వీటిలో కొన్ని రెండు సంవత్సరాల కిందటివి కూడా ఉన్నాయి. రెస్టారెంట్లో పురుగులు, ఎలుకలు, బొద్దింకలు తిరగడం అధికారులకు కనిపించింది. దీంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. చదవండి👉 నీ ఇల్లు బంగారం గానూ.. ఇంటి గోడలో రూ.10 కోట్లు, 19 కేజీల వెండి ఇటుకలు 30 ఏళ్ల నుంచి హోటల్ లో పనిచేసే వారికి కనీస నివాస సదుపాయాలు, కార్మికులకు హెల్త్ కార్డులు లేవని అధికారులు తెలిపారు. కాగా సౌదీ అరేబియాలో యితే సౌదీ అరేబియాలో అపరిశుభ్రత కారణంగా రెస్టారెంట్‌ను మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. జనవరిలో షావర్మా స్కేవర్‌పై ఎలుక మాంసం తింటూ కనిపించడంతో జెడ్డాలోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ కూడా మూతబడింది. కాగా సౌదీ వ్యాప్తంగా 2,833 రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జెడ్డా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43 చోట్ల ఉల్లంఘనలు గుర్తించామని, ఇందులో 26 మూసివేసినట్లు పేర్కొన్నారు. చదవండి👉 కారు నడిపిన ఎనిమిదేళ్ల బాలుడు.. రోడ్డుపై రయ్యిమంటూ -
సమోసా తిన్నందుకు కొట్టి చంపేశాడు
భోపాల్: మానవత్వం మంటగలిసింది. డబ్బులివ్వకుండానే సమోసా తిన్నాడనే చిన్న కారణంతో దుకాణదారు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం ఈ దారుణం జరిగింది. చోళా ప్రాంతంలోని శంకర్‌నగర్‌లో హరిసింగ్ అహిర్వార్ దుకాణంలోకి మద్యం మత్తులో ఉన్న వినోద్ అహిర్వార్ (40) ప్రవేశించి సమోసాను తీసుకుని తినడం మొదలుపెట్టాడు. హరిసింగ్ కోపంతో తలపై కర్రతో కొట్టడంతో చనిపోయాడని పోలీసులు చెప్పారు. -
సులువులైన చిట్కాలతో చాక్లెట్ సమోసా-అంజీర్ హల్వా
చాక్లెట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 1 కప్పు, పంచదార పొడి – 5 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, డార్క్ చాక్లెట్ పౌడర్ – 1 కప్పు, పిస్తా ముక్కలు – 1 టేబుల్ స్పూన్ పంచదార పాకం – అభిరుచిని బట్టి (అప్పటికప్పుడు కావాల్సినంత పంచదార, నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్లో మైదాపిండి, నెయ్యి, 4 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, నీళ్లు పోసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని ఓ పావు గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ సమయంలో ఒక బౌల్ తీసుకుని అందులో చాక్లెట్ పౌడర్, పంచదార పౌడర్, పిస్తా ముక్కలు వేసుకుని అటు ఇటుగా కలిపి.. పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఫ్రిజ్‌లోంచి మైదా ముద్దను తీసి.. చిన్న చిన్న పూరీల్లా చేసుకుని.. ప్రతి పూరీలో కొంత చాక్లెట్ మిశ్రమం పెట్టుకుని సమోసాలా చుట్టుకోవాలి. అనంతరం రెండు స్టవ్‌లు ఆన్ చేసుకుని.. ఒకవైపు నూనె కళాయి, మరోవైపు పంచదార పాకం ఉన్న కళాయి పెట్టుకుని సమోసాలను నూనెలో దోరగా వేయించి.. వెంటనే పాకంలో వేసి తీసుకోవాలి. ఒకవేళ పాకంలో వేసుకోవడం ఇష్టం లేకుంటే చాక్లెట్ సాస్ని పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంజీర్ హల్వా కావలసినవి: డ్రై అంజీర్ – 400 గ్రా.(నానబెట్టి, ముక్కలు చేసుకోవాలి) బియ్యప్పిండి/మొక్కజొన్న పిండి – 5 టేబుల్ స్పూన్లు(5 టేబుల్ స్పూన్ల నీళ్లనూ జతచేసి బాగా కలుపుకోవాలి), నెయ్యి – 9 టేబుల్ స్పూన్లు లేదా అంతకు మించి, పచ్చిపాలు – అర కప్పు, పంచదార – అభిరుచిని బట్టి, ఫుడ్ కలర్ – కొద్దిగా (గ్రీన్ కలర్), యాలకుల పొడి – కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ ముక్కలు – కొద్దిగా తయారీ: ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, వేడి కాగానే.. అందులో బియ్యప్పిండి/మొక్కజొన్నపిండి మిశ్రమం వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు పోసుకుని చిన్న మంటపైన గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదార వేసుకుని కరిగే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో అంజీర్ ముక్కలు, ఫుడ్ కలర్ వేసుకుని మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత ఒకసారి తీపి సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొద్దిగా పంచదార వేసుకుని, మిగిలిన నెయ్యి కూడా వేసుకుని గరిటెతో కలుపుతూ దగ్గర పడే సమయంలో యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవచ్చు లేదా.. నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్‌తో కలిసి తింటే భలే రుచిగా ఉంటుంది ఈ హల్వా. -
గులాబ్ జామూన్ సమోసా రెసిపీ ట్రై చేసే ధైర్యం ఉందా మీకు?
సాక్షి, హైదరాబాద్: వంటల్లో రకారకాల కాంబినేషన్లు, ప్రయోగాలు చాలామందికి తెలుసు. దాదాపు చాలావరకు ఇలాంటి మిక్స్డ్ రెసిపీస్, వినూత్నమైన వంటకాలు బాగానే క్లిక్అవుతాయి. కానీ ఒక్కోసారి మాత్రం దారుణంగా బెడిసి కొడతాయి. తాజాగా గులాబ్ జామూన్ సమోసా వంటకం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. కమెంట్లు, లైక్‌లతో ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (Salman Khan Birthday: జెనీలియా, సల్మాన్ డ్యాన్సింగ్ వీడియో వైరల్) అభిషేక్ అనే ఫుడ్ బ్లాగర్ వెరైటీగా సమోసా విత్గులాబ్ జామూన్ ట్రైస్ చేశాడు. ఢిల్లీలోని రోడ్డు పక్కన తినుబండారాలు అమ్మే ఒక దుకాణం వద్ద గులాబ్ జామూన్ సమోసాను తయారు చేయించాడు. అయితే గులాబ్ జామూన్ సమోసా టేస్ట్ చేసిన అభిషేక్ ఫీలింగ్స్ చూసి నెటిజన్లు పడీ పడీ నవ్వుతున్నారు.‘‘కనీసం ట్రై కూడా చేయొద్దు.. అతని కోతి మొఖం చూస్తే అర్థం కావడం లేదా. దాని టేస్ట్ ఎలా ఉందో’’ అని ఒకరు, నీ కరేజ్కి హేట్సాఫ్ భయ్యా అని మరొకరు ‘‘చండాలంగా ఉంది’’ అని ఇంకో యూజర్ కమెంట్ చేశారు. గత వారం అప్లోడ్ చేసిన వీడియోకు వ్యూస్ ఇప్పటికే 2 మిలియన్లు దాటేసాయి. View this post on Instagram A post shared by KOMAL || ABHISHEK (@thefoodiehat) -
Swiggy Delivery: తెగ లాగించేశారట..!!
-
నిమిషానికి 115 ఆర్డర్స్..! 2021లో భారతీయులు ఎగబడి లాగించేసిన ఫుడ్ ఇదే...!
2021గాను ఆన్లైన్లో అత్యధికంగా ఆర్డర్స్ చేసిన ఫుడ్ డిషెస్ వివరాలను ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రిలీజ్ చేసింది. నిమిషానికి 115 ప్లేట్ల ఆర్డర్స్‌తో బిర్యానీ టాప్ పొజిషన్లో నిలిచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఆరో వార్షిక నివేదిక StatEATstics రిపోర్ట్‌లో పలు విషయాలను కంపెనీ పేర్కొంది. అగ్రస్థానం బిర్యానీదే..! భోజన ప్రియులు 2021లో స్విగ్గీ ప్లాట్‌ఫాంను భారీగానే తలుపుతట్టారు. ఈ ఏడాదిలో సుమారు 4.25 లక్షల మంది కొత్త యూజర్లు స్విగ్గీలో చేరినట్లు కంపెనీ ప్రకటించింది. వీరు మొదటి ఆర్డర్‌గా చికెన్ బిర్యానీనే పెట్టినట్లు స్విగ్గీ వెల్లడించింది. అదే సమయంలో ఈ ఏడాదిలో ఎక్కువగా ఆర్డర్ చేసిన స్నాక్ ఐటమ్‌గా సమోసా నిలిచింది. 2021లో సుమారు 50 లక్షల సమోసా ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఆర్డర్స్ దాదాపు న్యూజిలాండ్ దేశ జనాభాతో సమానం. గత ఏడాది 2020లో, నిమిషానికి 90పైగా బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఏడాదిలో ఫుడ్ లవర్స్ ఒక సెకనులో సుమారు రెండు బిర్యానీలను ఆర్డర్స్ చేసినట్లు పేర్కొంది. చికెన్ బిర్యానీ, సమోసాల తరువాత చికెన్ వింగ్స్, పావ్ భాజీ నిలిచాయి. 21 లక్షల ఆర్డర్స్‌తో ఇండియా సెకండ్ ఫేవరెట్ స్నాక్ పావ్‌బాజీ నిలిచింది. స్విట్స్లో 21 లక్షల ఆర్డర్స్‌తో గులాబ్ జామూన్ నిలవగా, తరువాతి స్థానంలో రస్మలై సుమారు 12 లక్షల ఆర్డర్స్‌ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. హెల్త్‌పై ఎక్కువ.. కరోనా రాకతో చాలా మంది హెల్తీ డైట్‌పై అవగాహన పెంచుకున్నారు. స్విగ్గీలో హెల్తీ డైట్‌ను వెతికిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత పెడాదితో పోలీస్తే 200 శాతం మేర ఆర్డర్స్ పెరిగాయని స్విగ్గీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అత్యంత ఆరోగ్య స్పృహ కలిగిన నగరంగా తొలిస్థానంలో బెంగుళూరు నిలవగా, తరువాతి స్థానంలో హైదరాబాద్, ముంబై నగరాలు నిలిచాయి. గ్రాసరీ బిజినెస్ విషయానికి వస్తే..! స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలతోపాటుగా ఇన్‌స్టామార్ట్ పేరుతో గ్రాసరీ డెలివరీ సేవలను మొదలుపెట్టింది. ఈ ఏడాదిలో 28 మిలియన్ ప్యాక్‌ల పండ్లు , కూరగాయలను డెలివరీ చేసింది. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేసిన మొత్తం అరటిపండ్ల పరిమాణం అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే 2.6 రెట్లు అధికం. చదవండి: జనవరి 1 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ధరలు పెరగనున్నాయి? -
స్వీట్ కార్న్ లాలీపాప్స్, చికెన్ బీట్రూట్ సమోసా తయారీ ఇలా..
వెరైటీగా ఈ వంటకాలు ట్రై చేయండి. మీ కుటుంబానికి కొత్త రుచులు పరిచయం చేయండి. స్వీట్ కార్న్ లాలీపాప్స్ కావలసిన పదార్థాలు చిల్లీ ఫ్లేక్ మిరియాల పొడి జీలకర్ర ధనియాలు – అర టీ స్పూన్ చొప్పున పచ్చిమిర్చి – 2 స్వీట్ కార్న్ – ఒకటిన్నర కప్పులు ఉప్పు – తగినంత కార్న్ ఫ్లేక్స్ – ముప్పావు కప్పు (మరీ మెత్తడి పొడిలా కాకుండా.. చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) బంగాళ దుంప తురుము – అర కప్పు మొక్కజొన్న పిండి – 2 టీ స్పూన్లు మైదా పిండి – 1 టీ స్పూన్ నీళ్లు – కొద్దిగా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. చిన్న మంటపైన జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ వేసుకుని బాగా వేయించాలి. అందులో చిల్లీ ఫ్లేక్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీపట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని, అందులో బంగాళదుంప తురుము, అర కప్పు కార్న్ ఫ్లేక్స్ వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకుని, చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో మైదా పిండి, మొక్కజొన్న పిండి వేసుకుని నీళ్లతో కాస్త పలచగా కలపాలి. ఆ మిశ్రమంలో బాల్స్ ముంచి, మిగిలిన కార్న్ ఫ్లేక్స్ ముక్కలని పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ లాలీపాప్స్. చికెన్ బీట్రూట్ సమోసా కావలసిన పదార్థాలు బోన్‌లెస్ చికెన్ – పావు కప్పు (ఉప్పు, కారం, పసుపుతో పాటు మసాలా వేసి, మెత్తగా ఉడికించి, తురుములా చేసుకోవాలి) బీట్రూట్ తురుము – 4 టేబుల్ స్పూన్లు సోయా సాస్, టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్ బీట్రూట్ రసం – సరిపడా (చపాతీ ముద్ద కోసం నీళ్లకు బదులుగా బీట్రూట్ రసం కలుపుకోవాలి) ఉప్పు – సరిపడా నూనె – తగినంత తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో బీట్రూట్ తురుము, మిరియాల పొడి, చికెన్ తురుము, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దికొద్దిగా బీట్రూట్ రసం పోసుకుంటూ, ఉప్పు వేసి చపాతీ ముద్దలా చేసుకోవాలి. దానిపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా వత్తి, సమోసాలా చుట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని వేసి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని నూనెలో వేయించి తీస్తే.. సరిపోతుంది. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
సమోసా కోసం వెళ్లింది.. రూ.20 దొంగిలించిందని మైనర్‌ను తాళ్లతో కట్టేసి...
లక్నో: సమోసా కోసం దుకాణానికి వెళ్లిన బాలిక డబ్బులు దొంగతనం చేసిందనే కారణంతో తాళ్లతో మంచానికి కట్టేశారు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హాపూర్ జిల్లాలో ఏడేళ్ల బాలిక సమోసాల కోసం షాప్‌కు వెళ్లింది. అక్కడ సమోసా కొనుక్కొని వస్తుండగా దుకాణంలో 20 రూపాయల నగదును బాలిక దొంగిలించిందని షాప్ యాజమాని రాకేష్ కుమార్ ఆమెపై ఆరోపణలు చేశాడు. అంతటితో ఆగకుండా మైనర్ బాలికను లాక్కెళ్లి రెండు చేతులను తాళ్లతో మంచానికి కట్టేశాడు. చదవండి: హైదరాబాద్: సినిమాలో చూసి కారు దొంగిలించిన బీటెక్ విద్యార్థి.. బాలికకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె అక్కడే ఏడుస్తూ ఉండిపోయింది. ఈ విషయంపై బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన కూతురు సమోసాల కోసం దుకాణంలోకి వెళ్లిందని, దొంగతనం పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. బాలిక తరుపున మాట్లాడటానికి వచ్చిన వారిని యాజమాని అసిస్టెంట్ బయపెట్టినట్లు తెలిపారు. ఈ విషయం చివరికి పోలీసుల వరకు చేరడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అతనితోపాటు షాప్ అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: పెళ్లైన రెండు నెలలకే భార్యను రూ. లక్షా 80 వేలకు అమ్మేసిన మైనర్ -
Navratri Special 2021: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ..
దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక వంటకాలతో మీ ఇంటి అథిదులకు మరింత దగ్గరవ్వండి. పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ మీ కోసం.. పనీర్ సమోసా కావలసినవి: ►మైదా పిండి – పావు కిలో ►పనీర్ తురుము – 2 కప్పులు ►వాము – అర టీ స్పూన్ ►అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ ►క్యాబేజీ, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున ►రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, ►సోయాసాస్ – 2 టీ స్పూన్లు ►ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు ►మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్ ►పెరుగు – 1 టేబుల్ స్పూన్ ►నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత తయారీ విధానం ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, పనీర్ తురుము, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, వాము వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి, పెరుగు వేసి తిప్పుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో గిన్నె తీసుకుని, అందులో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ.. చపాతి ముద్దలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల పనీర్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ అలాగే చేసుకుని.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరమరాల వడ కావలసిన పదార్ధాలు ►మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్‌ల్లోకి తీసుకోవాలి) ►పెరుగు – 3 టేబుల్ స్పూన్లు ►గోధుమ పిండి – పావు కప్పు ►మైదా పిండి – పావు కప్పు ►అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్ చొప్పున ►తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్ + గార్నిష్‌కి ►కారం – ఒకటిన్నర టీ స్పూన్, నీళ్లు – కొన్ని ►ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానం ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! -
సమోస.. కచొరికి చట్నీ రుచిగా వండలేదని భార్యపై..
భోపాల్: దుకాణంలో విక్రయించే సమోస, కచొరికి భార్య చేసిన చట్నీని రుచి చూసిన భర్త రుచిగా రాలేదని చెప్పాడు. మళ్లీ చేసుకురా అని చెప్పడంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఆమెపై తీవ్రంగా దాడి చేసి భర్త పరారయ్యాడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె చివరకు ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధాటియా జిల్లా ఉపరాయంగావ్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా సమోస కచోరి దుకాణాన్ని ఆనంద్ గుప్తా నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య ప్రీతి. అయితే సమోస.. కచోరి కోసం చట్నీ తయారు చేయమని ఆనంద్ ఆదివారం ఇంట్లో ఉన్న భార్యకు చెప్పాడు. కొద్దిసేపటి అనంతరం భార్య చట్నీ తయారుచేసి భర్తకు రుచి చూపించింది. అయితే రుచి లేకపోవడంతో భర్త ఆమెకు మళ్లీ చేయమని చెప్పాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. క్షణికావేశానికి లోనైన భర్త భార్యపై దాడి చేశాడు. కోడలిని కొడుతుండడంతో భర్త తల్లి వచ్చి వారించింది. ఆమెను పక్కకు నెట్టి కర్రతో తలపై గట్టిగా బాదాడు. తీవ్ర గాయాలపాలైన భార్య ప్రీతిని వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దాడి చేసిన అనంతరం భర్త ఆనంద్ గుప్తా పరారయ్యాడు. సమాచారం అందుకున్న గోరాఘాట్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు అనంతరం నిందితుడు ఆనంద్ కోసం గాలిస్తున్నారు. -
ప్రాణం తీసిన రెండున్నర రూపాయల సమోస
ఇండోర్: ‘గోటితో పోయి దాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు’.. అనే సామెత వినే ఉంటారు. చిన్న సమస్యను పెద్దదిగా చేసి చివరికి ఊహించని నష్టం జరిగిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అచ్చం ఈ సామెతలాగానే ఓ వ్యక్తి చిన్న విషయంలో ఏర్పడిన గొడవలో పోలీసులు, షాప్ యాజమాని వేధింపుల కారణంగా తన ప్రాణాలనే బలితీసుకున్నాడు. ఇంతకీ అతనికి వాగ్వాదం ఏర్పడింది ఓ రెండున్నర రూపాయల సమోస ధర విషయంలో.. అవును ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో చోటుచేసుకుంది. జూలై 24న జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమర్కాంటక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంధ గ్రామంలో బజ్రు జైవాల్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి జూలై 22వ తేదీన ఓ సమోసా స్టాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ రెండు సమోసాలను తిన్నాడు. షాప్ మహిళా యాజమాని అయిన కంచన్ సాహు.. అతడిని రెండు సమోసాలకు 20 రూపాయలు అడిగింది. అయితే ఒక్కో సమోసా ఇంతకుముందు కేవలం రూ.7.50 ఉండేదని, ఇప్పుడు ఎందుకు రూ.20 ఇవ్వాలని ఆమెను జైవాల్ ప్రశ్నించాడు. సరుకుల ధరలు పెరగడంతో సమోస ధర పెంచినట్లు యజమాని బదులిచ్చింది. అయితే ఈ విషయంలో ఆమెకు అతడికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఓనర్ పోలీసులను సంప్రదించింది. పోలీసులు కస్టమర్ జైవాల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించారు. అయితే సమోసా స్టాల్ యాజమాని, పోలీసులు తనను వేధిస్తున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు జైవాల్. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూలై 24వ తేదీన మృతి చెందాడు. కాగా షాప్ యాజమానియే తనపై నిప్పంటించిందని పోలీసులు దాడి చేశారని జైవాల్ చనిపోయేముందు తీసుకున్న వీడియోలో ఆరోపించాడు. జైవాల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Madhya Pradesh | Dispute over price of Samosa leads to death of a man in Anuppur Probe ordered into the matter. Eyewitness has claimed that Bajru Jaiswal had allegedly poured petrol on him & set himself afire. He was referred to hospital where he died: Ashish Bharande, SDOP pic.twitter.com/hSJz82hHXx — ANI (@ANI) July 27, 2021 -
నూడుల్స్‌తో సమోసా ట్రై చేశారా?
నూడుల్స్ సమోసా కావలసినవి: మైదా పిండి – పావు కిలో, ఉడికించిన నూడుల్స్ – 2 కప్పులు, వాము – అర టీ స్పూన్, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, సోయాసాస్ – 2 టీ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, ఉల్లికాడ ముక్కలుతె పాటు వాము కూడా వేసుకుని, గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి తిప్పుతూ ఉండాలి. అవి వేగాక ఉడికించిన నూడుల్స్ కూడా వేసుకుని కాసేపు వేయించి, బయటికి తీసి ప్లేటులో పరిచినట్లుగా వేసి... కాస్త ఆరనివ్వాలి. తర్వాత మరో గిన్నె తీసుకుని, అందలో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు వేసి బాగా కలుపుతూ.. చపాతి ముద్దలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ ఇలాగే చేసుకుని... వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పుచ్చకాయ హల్వా కావలసినవి: పుచ్చకాయ జ్యూస్ – 2 కప్పులు(వడకట్టుకుని రసం మాత్రమే తీసుకోవాలి), పంచదార పొడి – రుచికి సరిపడా, మొక్కజొన్న పొడి – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్ ముక్కలు – అభిరుచిని బట్టి(నేతిలో వేయించినవి) తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో పుచ్చకాయ రసంలో పంచదార పొడి, మొక్కజొన్న పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్‌లో ఆ మిశ్రమాన్ని వేసుకుని.. చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి. బాగా దగ్గర పడే సమయంలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ.. మరింత దగ్గరపడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి.. ఒక బౌల్‌కి అడుగు భాగంలో నెయ్యి లేదా నూనె రాసి.. అందులోకి ఆ మిశ్రమాన్ని మొత్తం తీసుకుని, దానిపైన డ్రై ఫ్రూట్స్ ముక్కలు గార్నిష్ చేసుకుని, 2 గంటల తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. బనానా ఎగ్ కేక్ కావలసినవి: అరటిపండ్లు – 2(మీడియం సైజ్‌వి తీసుకుని, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), చిక్కటి పాలు – 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు – 4, పంచదార, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, ఎండుద్రాక్ష, జీడిపప్పు – గార్నిష్‌కి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని గుడ్లు, పాలు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, వేడి చేసి, అందులో ఎండుద్రాక్ష, జీడిపప్పు వేయించి పక్కకు తియ్యాలి. ఇప్పుడు ఆ పాన్‌లో అరటిపండ్ల ముక్కలు వేసుకుని చిన్న మంట మీద 3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత ఆ ముక్కల్ని పాలు–గుడ్ల మిశ్రమంలో వేసి గరిటెతో అటు ఇటుగా తిప్పి.. పంచదార, ఏలకుల పొడి వేసుకుని మరో సారి అలానే కలపాలి. ఇప్పుడు పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. గుడ్లు–అరటిపండ్ల మిశ్రమాన్ని దిబ్బరొట్టెలా వేసుకుని.. నేతిలో వేయించిన ఎండుద్రాక్ష, జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని, చిన్న మంట మీద మూతపెట్టి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే బనానా ఎగ్ కేక్ రెడీ. -
2020లో అతి జుగుప్సాకరమైన క్రైం ఇదే!
లండన్ : అవును! మీరు చదివింది అక్షరాల నిజం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే నేరస్తుడు అంత ప్రత్యేకమైన వాడు. అతడు చేసిన నేరం నిజంగా అతి జుగుప్సాకరమైనదే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని బర్మింగ్‌హాం పోలీసులు కూడా ధ్రువీకరించారు. 2020లో తమ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ వింతైన, జుగుప్సాకరమైన కేసుగా దాన్ని పరిగణించారు. మరి పోలీసులనే బెంబేలెత్తించిన ఆ నేరం ఏంటంటే.. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హాంకు చెందిన ఓ నేరస్తుడు సమోసా స్మగ్లింగ్ చేయటం. సమోసా స్మగ్లింగ్ నేరమా? అని అనుకుంటున్నారా. అయితే ఈ వార్త చదవండి. ( ఆల్రెడీ పెళ్లైన ప్రేయసి ఇంటికి సొరంగం) 2020లో వెస్ట్ మిడ్‌ల్యాండ్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతడ్ని సెల్లో వేయటానికి ముందు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతడు తన పిరుదుల మధ్యలో సమోసాను ఉంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై అతడ్ని ప్రశ్నించగా.. సదరు పోలీస్‌స్టేసన్‌లో ఆహారం ఏమీ బాగుండదని, అందుకే స్నాక్‌లా తినటానికి సమోసాను తెచ్చుకున్నానని సమాధానం ఇచ్చాడు. దీంతో సమోసా స్మగ్లింగ్ ఘటన వెస్ట్ మిడ్‌ల్యాండ్ పోలీసులకు బాగా గుర్తుండిపోయింది. 2020లో తాము చూసి అతి విచిత్రమైన, జుగుప్సాకరమైన నేరం అంటూ దాని గురించి చెప్పుకొచ్చారు. స్టేషన్ ఇన్స్పెక్టర్ మంజ్ అహిర్ దీన్ని మర్చిపోలేని కేసుగా అభివర్ణించారు. -
మోదీతో వీటిని పంచుకోవాలనుకున్నా: మోరిస్
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీతో జూన్ 4న వీడియో భేటీలో పాల్గొననున్న సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస్ ఆదివారం సమోసాల ఫొటోలను కొన్నింటిని ట్వీట్‌చేశారు. వీటిని మోదీతో కలిసి ఆస్వాదించాలని ఉందని వ్యాఖ్యానించారు. వాటికి 'స్కమోసా'లని కొత్త పేరు పెట్టారు. ‘ఆదివారం మామిడికాయ చట్నీతో స్కమోసాలు. భారత ప్రధానితో వీటిని పంచుకోవాలనుకున్నా.. కానీ దురదృష్టవశాత్తూ అది వీడియో లింక్ భేటీ’ అని మోరిసన్ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా మోదీ ‘హిందూ మహాసముద్రం ద్వారా అనుసంధానం.. భారతీయ సమోసాల ద్వారా అనుబంధం’ అని ట్వీట్ చేశారు. Connected by the Indian Ocean, united by the Indian Samosa! Looks delicious, PM @ScottMorrisonMP! Once we achieve a decisive victory against COVID-19, we will enjoy the Samosas together. Looking forward to our video meet on the 4th. https://t.co/vbRLbVQuL1 — Narendra Modi (@narendramodi) May 31, 2020 -
కరోనా : వేడి వేడి సమోసా కావాలా నాయనా!
మహమ్మారి కరోనాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అయితే ఇలాంటి కష్ట సమయంలో కూడా ఒక ఆకతాయి తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. బాధితులకోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి ఒక వింత కోరిక కోరాడు. దీంతో అప్పటికే ఇలాంటి అసంబద్ద కాల్స్ తో విసుగు చెందిన జిల్లా ఉన్నతాధికారి సదరు వ్యక్తికి తగిన రీతిలో బుద్ధి చెప్పారు. అంతేకాదు సంక్షోభ సమయంలో కీలకమైన సేవలందిస్తున్న సమయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి కాల్స్ తో విసిగిస్తే.. ఇలాంటి గుణపాఠమే చెబుతామంటూ హెచ్చరించారు. కరోనా బాధితుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాంపూర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసిన ఒక వ్యక్తి తనకు వేడి వేడి సమోసాలు కావాలని కోరాడు. అంతకు ముందు పిజ్జా డెలివరీ కావాలని అడిగాడు. పలుమార్లు ఇలాగే చేయడంతో చిర్రెత్తుకొచ్చిన డిఎం ఆంజనేయ కుమార్ సింగ్ అతగాడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతను అడిగినట్టుగానే సమోసాలను అతనికి పంపించి, అనంతరం సదరు వ్యక్తిచేత డ్రైనేజీ శుభ్రం చేయించారు. దీనికి సంబంధించి ఆయనొక పోస్ట్ షేర్ చేశారు. తమ అమూల్య సమయాన్నివృధా చేస్తే ఇలానే వుంటుందనేసందేశాన్నిచ్చారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సురక్షితంగా వుండాలని సూచించారు. దీంతో డీఎం చర్యను పలువురు నెటిజన్లు అభినందించారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న వారిని ఇలా విసిగించడం తగదని మండిపడుతున్నారు. కలిసికట్టుగా పోరాడి కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునివ్వడం విశేషం. नाली साफ कर सामाजिक कार्य में योगदान देकर प्रशासन को सहयोग देते व्यवस्था का दुरुपयोग करने वाले व्यक्ति। राष्ट्रीय आपदा के समय आप सभी का सहयोग प्रार्थनीय है। जिम्मेदार नागरिक बनें। स्वस्थ रहें। सुरक्षित रहें। pic.twitter.com/4vMMp97OLp — DM Rampur (@DeoRampur) March 29, 2020 -
వేయించుకు తినండి
ఇలా అయినా వానలు బాగా పడతాయని కిచెన్‌లో చేస్తున్న హోమమిది. తిన్నంతసేపూ ఎండని మరచిపోతాం. ఎందుకంటే వేయించుకుని తింటే వేడివేడిగా ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు వానపడాలని కోరుకుంటాం కదా...మీ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు! మూంగ్ దాల్ సమోసా కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; చల్లటి నీళ్లు – తగినన్ని (పిండి కలపడానికి). ఫిల్లింగ్ కోసం: పొట్టు పెసర పప్పు – 3 కప్పులు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; గరం మసాలా – 3 టీ స్పూన్లు; మిరప కారం – 3 టీ స్పూన్లు; మెంతి పొడి – 1 టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి -చల్లటి నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి – పిండిని ఉండలు చేసుకుని, చపాతీలా గుండ్రంగా ఒత్తి, రెండు భాగాలు అయ్యేలా మధ్యకు కట్ చేయాలి –ఒక భాగాన్ని తీసుకుని అంచుల దగ్గర తడి చేసి, కోన్ ఆకారంలో చుట్టి, అంచుల దగ్గర గట్టిగా అదమాలి -పొట్టు పెసర పప్పును మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా అయ్యేలా మిక్సీ పట్టాలి -స్టౌ మీద బాణలి వేడయ్యాక నూనె వేయాలి -జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి -మిక్సీ పట్టిన పెసర పప్పు రవ్వను జత చేసి దోరగా వేయించాలి -గరం మసాలా, మిరప కారం, మెంతి పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఆమ్చూర్ పొడి జత చేసి మరోమారు వేయించి దింపి చల్లారనివ్వాలి -తయారుచేసి ఉంచుకున్న సమోసా మౌల్డ్‌లోకి ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి -ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి -స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి - పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి. రా బనానా అండ్ కోకోనట్ కచోరీ కావలసినవి: అరటికాయలు – 4 (పెద్దవి); బియ్యప్పిండి – 3 టేబుల్‌స్పూన్లు; ఉప్పు – తగినంత; పచ్చి మిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్ ఫిల్లింగ్ కోసం: వేయించిన పల్లీల పొడి – 4 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూను; తాజా కొబ్బరి తురుము – ఒక కప్పు; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. యోగర్ట్ కోసం: పెరుగు – 100 గ్రా.; ఉప్పు – తగినంత; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన నువ్వులు – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూను; దానిమ్మ గింజలు – కొద్దిగా తయారీ: -అరటి కాయలను ఉడికించి తొక్క తీసి చేతితో మెత్తగా మెదపాలి -ఒక పాత్రలో అరటి కాయ ముద్ద, బియ్యప్పిండి, పచ్చి మిర్చిపేస్ట్, ఉప్పు, ఒక టేబుల్ స్పూను నూనె వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ఫిల్లింగ్ తయారీ: - ఒక పాత్రలో కొబ్బరి తురుము, పచ్చి మిర్చి పేస్ట్, పల్లీల పొడి, వేయించిన నువ్వులు, కిస్మిస్, జీలకర్ర, కరివేపాకు, పంచదార, నిమ్మ రసం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి - అరటి కాయ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి - చేతికి నూనె పూసుకుని, ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని కచోరీ ఆకారంలో చేయాలి - ఫిల్లింగ్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా కచోరీ లో నింపి, గుండ్రంగా చే సి, పైన బియ్యప్పిండి అద్ది పక్కన ఉంచాలి -ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి -స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కచోరీలను వేసి దోరగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి -యోగర్ట్‌లో ముంచి అందించాలి. బ్యాంగ్ బ్యాంగ్ కావలసినవి:బేబీ పొటాటోస్ – పావు కేజీ; ఉప్పు – తగినంత; – 2 (ముక్కలు చేయాలి); పసుపు – అర టీ స్పూను; బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – మూడు; వెల్లుల్లి తరుగు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు. తయారీ: ∙బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించాలి ∙చల్లారాక తొక్క తీయాలి -ఒక పాత్రలో ఉప్పు, పంచదార, ఎండు మిర్చి ముక్కలు, పసుపు, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ∙బంగాళ దుంపలను అందులో వేసి దొర్లించాలి -స్టౌ మీద బాణలిలో పాన్ ఉంచి వేడయ్యాక పచ్చి మిర్చి వేసి వేయించాలి -బేబీ పొటాటోలను వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి -మధ్యమధ్యలో కలుపుతుండాలి -బంగాళ దుంపలు బంగారు రంగులోకి మారగానే దింపేయాలి. – నిర్వహణ వైజయంతి -
‘ఫ్రూటీ, సమోసా ఇచ్చి చెడగొడుతున్నారు’
లక్నో : మథుర బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమా మాలిని ఎన్నికల ప్రచారంలో భాగంగా సుధామ కుతిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో ముచ్చటించిన హేమా మాలిని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోతుల సమస్య గురించి చర్చిస్తూ.. ‘కోతులు ఎక్కడికి వెళ్తాయి. అవి కూడా మనతోపాటే ఉండాలి. అసలు సమస్య ఏంటంటే.. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కోతులకు సమోసా, ఫ్రూటీ ఇచ్చి వాటిని చెడగొడుతున్నారు. కోతులకు ఇలాంటి ఆహారం ఇవ్వకూడదు. కేవలం పండ్లు మాత్రమే ఇవ్వండి’ అని పేర్కొన్నారు. #WATCH Vrindavan: BJP MP Hema Malini at Sudama Kuti answers a question on monkey menace in the area. She says, "Coexistence hai na. Monkey kahan jaega? Problem kya hai, yahan aane waale yaatri Frooti dete hain, samosa de de ke unko kharab kar diya. Unko sirf phal dijiye." pic.twitter.com/NJzJvEE6nA — ANI UP (@ANINewsUP) April 11, 2019 అంతేకాక కోతుల సమస్య అంతటా ఉందని హేమా మాలిని తెలిపారు. ఓమాక్స్ హౌసింగ్‌లో తనకొక చిన్న ఇల్లు ఉందని.. అక్కడ కూడా కోతుల సమస్య చాలా ఎక్కువగా ఉందన్నారు. ఈ నెల 1న ఎన్నికల ప్రచారం ప్రారంభించిన హేమా మాలిని..దానిలో భాగాంగా వ్యవసాయ క్షేత్రంలో మహిళా కూలీలతో కలిసి గోధుమ పంటని కోసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కోతల మాలిని అంటూ నెటిజన్లు ఆమెని ట్రోల్ చేశారు. -
సమోసా, టీ, దిల్పసంద్..
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తోంది. పదోతరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో అభ్యాసనకు ఎక్కువ సమయం కేటాయించేలా సంక్షేమ శాఖలు ప్రణాళికలు రూపొందించాయి. దీనిలో భాగంగా రాత్రి 11 గంటల వరకు స్టడీ అవర్స్ కొనసాగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ అదనంగా స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాన్ని ఇస్తున్నారు. మధ్యాహ్నం పూట మాత్రం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఇస్తున్నారు. విద్యార్థులకు రాత్రి భోజనం సాయంత్రం 7 గంటలకు ఇస్తుండటంతో 9 గంటల ప్రాంతంలో నిద్రకు ఉపక్రమిస్తారు. టెన్త్ విద్యార్థులకు అదనం.. పదో తరగతి విద్యార్థులకు మాత్రం అదనంగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మరోసారి ఇవ్వనున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యే టెన్త్ విద్యార్థులకు సమోసా, దిల్పసంద్, టీ, పండ్లు తదితరాలు రోజుకో రకం చొప్పున ఇవ్వనుంది. ఇలా పరీక్షలు ముగిసే వరకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక బడ్జెట్‌ను ఎస్సీ అభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ. 15 చొప్పున వంద రోజుల పాటు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 715 సంక్షేమ హాస్టళ్లున్నాయి. వీటిలో పదో తరగతి చదువుతున్న వారు 22 వేలకుపైగా ఉన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో రెండ్రోజుల నుంచి కొత్త మెనూను అమలు చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. విద్యార్థులు కూడా ఉత్సాహంతో స్టడీ అవర్స్‌లో కొనసాగుతున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. త్వరలో ఎస్టీ, బీసీ హాస్టళ్లలోనూ.. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని హాస్టళ్లలో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రత్యేక మెనూను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన అభివృద్ధి శాఖలో కూడా అమలు చేసేందుకు ఆయా శాఖ చర్యలు తీసుకుంటున్నాయి. అత్యుత్తమ ఫలితాల కోసం వినూత్న కార్యక్రమాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
సమోసా తీసుకో.. పేటీఎం చేసుకో..
సూరారం: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది.. సినిమా, రైల్, బస్సు టికెట్లతో పాటు హోటల్ ఆహారం ఇలా అన్ని ఆన్లైన్, పేమెంట్ య్యాప్ల ద్వారా కొనుగోలు జరుగుతున్నాయి. కొబ్బరి బొండం, పానీపూరి, చెరుకు రసం, టీస్టాల్, సమోసా విక్రయదారులు పేటీఎం క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసుకుని విక్రయాలు చేపడుతున్నారు. మంగళవారం చింతల్ శ్రీనివాస్‌నగర్‌లో ఓ సమోసా వ్యాపారి సైకిల్‌కు పేటీఎం క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి వీధుల్లో తిరుగుతూ విక్రయాలు చేపడుతుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. -
ఐకియా స్టోర్ : వెజ్ బిర్యానీ, సమోసా అమ్మకం బంద్
హైదరాబాద్ : నెల రోజుల క్రితమే హైటెక్‌సిటీ ప్రాంతంలో గ్రాండ్‌గా ప్రారంభమైన ప్రఖ్యాత అంతర్జాతీయ ఐకియా స్టోర్‌కు చెందిన ఫుడ్‌కోర్టులో వెజిటేబుల్ బిర్యానీలో గొంగళిపురుగు వచ్చిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితుడు సామాజిక మాధ్యమం ద్వారా చేసిన ఫిర్యాదుకు స్పందించి జీహెచ్ఎంసీ అధికారులు నిర్వాహకులకు రూ.11,500 జరిమానా కూడా విధించారు. తాజాగా ఐకియా ఇండియా, తన స్టోర్‌లో వెజిటేబుల్ బిర్యానీని, సమోసాను అమ్మడం నిలిపివేసింది. తనకు తానుగా వీటి విక్రయాలను ఐకియా స్టోర్ క్లోజ్ చేసింది. నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించేందుకు బలమైన అంతర్గత ప్రక్రియను పాటిస్తున్న ఐకియా, తన సప్లయ్ చైన్ పూర్తి బాధ్యతను తన తలపైనే వేసుకుంది. ఈ క్రమంలోనే వెజిటేబుల్ బిర్యానీని, సమోసాను అమ్మడం మానేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సరియైన పరిష్కార చర్యలు తీసుకోవడానికి అంతర్గత సమీక్ష చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతేకాక తమ లోపాలను సరిచేసుకుంటామని ఐకియా తెలిపింది. రివ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ రెండింటి అమ్మకాలను చేపడతామని కంపెనీ తెలిపింది. ఆహారంలో నాణ్యతను, భద్రతను ఈ కంపెనీ చాలా సీరియస్‌గా తీసుకుంది. వినియోగదారుల ఆరోగ్యానికి ఇది పెద్ద పీట వేస్తుంది. తొలి నెల కార్యకలాపాల్లో భాగంగా ఐకియా ఇండియాకు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. -
ఆహా ఏమి రుచి...తినరా సమోసా మైమరచి!
ఆహా ఏమి రుచి.. తినరా సమోసా మైమరచి.. అంటూ బ్రిటన్ వాసులు పాడేసుకుంటున్నారు. కాస్త కరకరలాడుతూ, కాస్త మెత్తమెత్తగా ఉండే సమోసాకు బ్రిటన్ వాసులు ఫిదా అయిపోయారు. ఏకంగా సమోసా వారోత్సవాలనే నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 9 నుంచి 13 వరకు యూకేలోని ఆరు నగరాల్లో జాతీయ సమోసా వారోత్సవాలు జరిగాయి. అందులో సమోసా ఈటింగ్ పోటీలు, ఉత్తమ సమోసాకు అవార్డులు, కొత్త కొత్త సమోసా రెసీపీల పరిచయం వంటి కార్యక్రమాలూ జరిగాయి. కేవలం ఆలూ సమోసాయే కాదు ఉల్లి, బఠాణి, పంజాబీ చోలే సమోసా, హైదరాబాదీ కీమా సమోసా వంటి 20 రకాల సమోసాలెన్నో అందుబాటులో ఉన్నాయి. అసలు ఈ సమోసా చుట్టూ అల్లుకున్న వింతలు, విశేషాలు ఎంతో ఆసక్తికరం.. అవేమిటో తెలుసుకుందామా? - సమోసా అంటే మనందరికీ ఇష్టమే. అయితే ఇది భారతీయ వంటకం కాకపోవడం గమనార్హం. పదో శతాబ్దానికి ముందు మధ్య ప్రాచ్య దేశాల్లో సమోసా పుట్టింది. అక్కడి నుంచి మధ్య ఆసియా దేశాల మీదుగా 14వ శతాబ్దంలో భారత్‌కు పరిచయమైంది. అంతే అప్పట్నుంచి భారతీయుల మెనూలో శాశ్వతంగా చేరిపోయింది. - సమోసా అన్న పదం పర్షియన్ భాషలోని సంబోసాగ్ అన్న పదం నుంచి వచ్చింది. అఫ్గాన్లు సంబోసా అని పిలిస్తే, తజికిస్తాన్లో సంబూసా అని, టర్కీలో సంసా అని అంటారు. - మొఘల్ చక్రవర్తి అక్బర్ నుంచి.. ఇప్పటి అబ్దుల్ కలామ్ వరకు ఎందరో ప్రముఖులు సమోసా రుచికి మైమరచిపోయిన వారే. అక్బర్ తన రాజధాని ఫతేపూర్ సిక్రీలోని ఒక భవనానికి ఏకంగా సమోసా మహల్ అని పేరు పెడితే... భారత్‌కున్న బలాల్లో సమోసా కూడా ఒకటంటూ కలాం తన అడ్వాంటేజ్ ఇండియా పుస్తకంలో శ్లాఘించడం గమనార్హం. - చరిత్రలోనే కాదు.. అంతరిక్షంలోనూ సమోసా ఘుమఘుమలాడిపోయింది. వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు తన వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాల్లో సమోసా కూడా ఉంది. - సమోసా చిరు తిండా లేదా ఒక వంటకమా అన్న అంశంపై వివాదం నెలకొని కోర్టుకు కూడా చేరింది. ఉత్తరాఖండ్‌లో ఒక దుకాణదారు సమోసా అన్నది చిరుతిండేనని, అందువల్ల దానిపై పన్ను ఐదు శాతం మాత్రమే ఉండాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ వాణిజ్య పన్నుల శాఖ అదొక వంటకమని, దానిపై ఎనిమిది శాతం పన్ను ఉండాలంటూ వాదించింది. చివరికి న్యాయస్థానం సమోసా చిరుతిండి కాదని తేల్చేసింది. - ఇక సమోసా పేరు చెబితే బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పేరు చటుక్కున గుర్తుకొస్తుంది. ‘జబ్‌తక్ రహేగా సమోసామే ఆలూ.. తబ్‌తక్ బిహార్‌లో రహేగా లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. బిహార్‌లో లాలూ ఉంటారు)’అంటూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు గుర్తుండిపోతాయి మరి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అదే లాలూ మిత్రపక్షంగా ఉన్నప్పుడు బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం సమోసాలపై 13.5 శాతం లగ్జరీ పన్ను విధించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. - గతేడాది కొందరు సమోసా ప్రియులు లండన్‌లో 153 కేజీల అతి పెద్ద సమోసాను తయారు చేసి గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించారు. -
సమోసా ఇచ్చి.. మతం మారాలన్నారు!
సాక్షి, లక్నో: బస్తీలో నివసించే కొందరికి సమోసాలు ఇచ్చి, క్రైస్తవమతంలోకి మార్పించే యత్నం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆగ్రాలోని జగదీశ్ పురలో మూడురోజుల కిందట జరిగిన దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. జగదీశ్ పురలోని సెక్టార్-4 వికాస్ కాలనీలో మురికివాడల్లో కొందరు నివాసం ఉంటున్నాం. గురువారం రోజు కొందరు క్రైస్తవమత ప్రచారకులు మా వద్దకు వచ్చారు. వారిలో ఓ పాస్టర్, నలుగురు సిస్టర్స్ ఉన్నారు. మొదట మమ్మల్ని కలిసిన వెంటనే వారు మాకు, మా పిల్లలకు సమోసాలు పంచిపెట్టారు. సమోసాలు తింటుంటూ క్రైస్తవ మతంలోకి మారాలంటూ సూచించారు. తాము ఆశ్చర్యపోయి చూస్తుంటే మీరే ఆందోళన చెందొద్దు.. మీకు ఎన్నో వసతులు కల్పిస్తాం. మీ పిల్లలకు చదువు చెప్పిస్తామని ఆ పాస్టర్, సిస్టర్స్ చెప్పారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఏం జరుగుతుందని ప్రశ్నించాడు. పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే పాస్టర్ తన దుస్తులు మార్చుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారని మాయా అనే స్థానికురాలు తెలిపారు. ఆగ్రా ఎస్పీ సన్వార్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ.. ఓ సంస్థ నుంచి ఫిర్యాదు అందగా విచారణ చేపట్టాం. చిన్నారుల విద్య గురించి బస్తీ వారికి అవగాహన కల్పించడానికి మహిళా దినోత్సవరం రోజు వెళ్లినట్లు క్రైస్తవ మిషనరీ పేర్కొంది. అవగాహన కల్పించి అక్కడినుంచి వెళ్లిపోయామని వారు చెప్పారు. కాగా, మురికివాడ నుంచి మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వివరించారు. అయితే ఓ వర్గం మాత్రం మత మార్పిడి యత్నం జరిగిందని ఆరోపించింది. -
మన సమోసాకు అరుదైన గౌరవం
జోహాన్స్‌బర్గ్: ప్రముఖ భారతీయ స్నాక్ సమోసాకు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ కాంటెస్ట్‌లో నోరూరించే మన వంటకం చిల్లీ చికెన్ సమోసా నెగ్గింది. భారతీయ సంతతి కోసం నిర్వహించే పత్రిక వీక్లీ పోస్ట్ నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో చాక్లెట్, జీడిపప్పు, ఇతర నోరూరించే వంటకాలతో పోటీ పడి చిల్లీ చికెన్ సమోసా భోజనప్రియుల మన్ననలు పొందింది. బాదంపప్పు, జీడిపప్పులు సహా పలు రుచులతో చిల్లీ చికెన్ సమోసాను తయారు చేశారు. ట్రెడిషనల్ పంజాబీ స్నాక్‌గా పేరొందిన సమోసా వంటకాన్ని పోటీకి నిలిపిన సల్మా అజీ కాంటెస్ట్‌లో గెలుపొందారు. తాను వంట చేయడాన్ని ఇష్టపడతాననీ, ప్రతి వంటకానికీ మరింత మెరుగులు దిద్ది మరింత రుచికరంగా చేస్తానని సల్మా చెప్పారు. తాను మొదట పిల్లల కోసం చికెన్ శాండ్విచ్ చేశానని ఆ తర్వాత చిల్లీ చికెన్ సమోసాను కనిపెట్టానన్నారు. కాశ్మీరీ కారం పొడితో చికెన్‌ను వండినట్టు చెప్పారు. ఇదే కాంటెస్ట్ మరో క్యాటగిరీలో ఒకే నిమిషంలో పది సమోసాలు తిన్న ఇబ్రహీం బక్స్ ఫాస్టెస్ట్ సమోసా ఈటర్ టైటిల్ గెలుచుకున్నారు. -
'సమోసాలో ఆలూ ఉన్నంత కాలం..'
ఆలూ సమోసాలో ఆలూ ఎంతకాలం ఉంటుంది? అసలు ఆలూ లేకుండా ఎక్కడైనా ఆలూ సమోసా ఉంటుందా? అదే ఉదాహరణగా చెప్తుంది ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. సమంతకు తెలుగులో డబ్బింగ్ చెప్తానంటోంది. సమంత హీరోయిన్గా నటించిన 'జనతా గ్యారేజ్' విడుదల సందర్భంగా విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది చిన్మయి. 'ఏ మాయ చేశావే' లో జెస్సీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరినీ నిజంగానే మాయ చేసింది సమంత. జెస్సీ క్యారెక్టర్ అంతగా ఆకట్టుకోవడానికి ఆమెకు చెప్పిన డబ్బింగ్ ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు. సమంతకు గాత్రదానం చేసింది సింగర్ చిన్మయే. ఇక అప్పటినుంచి తెలుగులో సమంతకు చిన్మయే డబ్బింగ్ చెప్తూ వస్తుంది. ఆమె గొంతు సమంత రూపానికి చక్కగా సరిపోయి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచేసింది. ప్రస్తుతం సమంత టాప్ హీరోయిన్గా ఉన్న సంగతి తెలిసిందే. సమంత కూడా పలుమార్లు చిన్మయి డబ్బింగ్ తన విజయానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. అంటూ చిన్మయి చేసిన ట్వీట్‌కు 'థాంక్యూ పాపా' అంటూ సమంత ముద్దులతో స్పందించింది. Wishing Sam papa the best for Janatha Garage. As saying goes, Jab tak rahega samose mein aaloo (God-willing) I’ll dub for Sam in Telugu.😜 — Chinmayi Sripaada (@Chinmayi) 31 August 2016 😋😋😋😋ha ha Muah thanks Paapa https://t.co/vFgjIdcpIR — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 31 August 2016 -
టీ, సమోసాలకు రూ. 9 కోట్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రులు తమ అతిథులు, అధికారులకు టీ, సమోసా, గులాబ్ జామూన్ వంటి అల్పాహారం ఇవ్వడానికి నాలుగేళ్లలో రూ.9 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న ప్రజాధనంతో వారీ పనిచేశారు. విషయాన్ని సీఎం అఖిలేష్ శాసనసభలో చెప్పారు. 2012 మార్చి 15న అఖిలేష్ అధికార పగ్గాలు చేపట్టగా 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారానికి రూ.8,78,12,474 ఖర్చయిందన్నారు. అల్పాహారం కోసం రూ.21 లక్షలకు పైగా వెచ్చించిన మంత్రులు ఆరుగురు. సహాయ మంత్రి అరుణ్ కోరి అత్యధికంగా రూ.22,93,800 ఖర్చు చేశారు. -
కేవలం సమోస కోసం సవతి తల్లి..!
బరేలి(ఉత్తరప్రదేశ్): బడి నుంచి ఆకలితో ఇంటికొచ్చిన ఆ చిన్నారిని 'సమోసల' గొడవ బలితీసుకుంది. ఆకలితో ఉన్న అతను సమోసాలన్నింటినీ తానే తినేయడంతో విచక్షణ కోల్పోయిన సవతి తల్లి అతన్ని గొంతు నులిమి చంపేసింది. ఈ కిరాతక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలోని కౌంటాండ గ్రామంలో జరిగింది. షాహీద్ ఆలీ మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ద్వారా అతనికి ఇద్దరు పిల్లలు కలిగారు. అతని ఆరేళ్ల కొడుకు పాఠశాల నుంచి తిరిగొచ్చి.. అన్నం పెట్టాల్సిందిగా సవతి తల్లిని కోరాడు. ఆ చిన్నారికి ఆమె కొంత డబ్బు ఇచ్చి.. సమీపంలోని దుకాణంలో సమోసాలు తీసుకురమ్మని పంపింది. అయితే, ఆకలితో ఉన్న ఆ బాలుడు సమోసాలు ఇంటికి తీసుకురాకుండా.. అన్నీ తానే తినేశాడు. దీంతో కోపంలో విచక్షణ కోల్పోయిన ఆమె చిన్నారిని గొంతు నులిమి చంపేసింది. ఇంటికి వచ్చి జరిగిన కొడుకు చనిపోయిన విషయాన్ని గుర్తించిన షాహిద్ ఆలీ పోలీసులకు ఫిర్యాడు చేశాడు. దీంతో నిందితురాలైన సవతి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. -
మ్యాంగో సమోసా!
రోహిణీ వంటకం మండే ఎండలు తెచ్చిన రోహిణీకార్తెలో కాసింత సరదాను వెతుక్కుందాం. పచ్చిమామిడికి కాసింత పచ్చిమిర్చి కలిపి సూర్యుణ్ణి ఢీ కొడదాం. ఈ సమోసాతో ఎండ నసను తరిమి కొడదాం! కావల్సినవి: మామిడికాయ ముక్కలు - కప్పు; బంగాళదుంప ముక్కలు - కప్పు పచ్చిబఠాణీలు - కప్పు, పనీర్ ముక్కలు - కప్పు, రిఫైండ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, జీలకర్ర - టీ స్పూన్, వాము - టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు - కప్పు, పసుపు - అర టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్, మొక్కజొన్న పిండి - టీ స్పూన్, క్యారట్ తరుగు - కప్పు, బీన్స్ తరుగు - కప్పు, మైదా - కప్పు, ధనియాల పొడి - టీ స్పూన్, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: మైదాలో వేడి నీళ్లు, ఉప్పు, వాము, నెయ్యి కలిపి, ముద్ద చేసి, పైన మూత పెట్టి పక్కన పెట్టాలి మూకుడులో జీలకర్ర, సోంపు, ధనియాలు, పల్లీలు వేయించి పక్కన పెట్టాలి కడాయిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించి, బంగాళదుంప, మామిడిముక్కలు, క్యారట్, పచ్చిబఠానీలు, బీన్స్, పనీర్, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో కొత్తిమీర, ధనియాల పొడి వేసి కొద్దిసేపు సన్నని మంట మీద ఉంచాలి పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని, పూరీలా ఒత్తుకోవాలి. చేత్తో కోన్ షేప్‌లో తయారుచేసుకొని, దీంట్లో ఉడికిన మిశ్రమాన్ని నింపి, నీళ్లు అద్దుకుంటూ చివర్లు సీల్ చేయాలి ఇలా అన్నీ తయారుచేసుకున్నాక కాగుతున్న నూనెలో వేసి, అన్ని వైపులా బంగారు రంగు వచ్చేదాకా వేయించి, తీసి పక్కన ఉంచాలి. ఇలా తయారుచేసుకున్న సమోసాలను ఏదైనా గ్రేవీ లేదా సాస్‌తో సర్వ్ చేయాలి. -
సమోసా తిరుగుబాటు
బైలైన్ సమోసా తిరుగుబాటు కంటే కఠోర దండన రాజకీయాల్లో మరొకటి లేదు. ప్రతి రాజకీయ వేత్తకూ ఆ మాత్రం తెలుసు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆయనకు పెద్ద దిక్కు, సూపర్ ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్‌లు ఎన్నో ఎన్నికల సమరాలలోనూ, పరిపాలనలోనూ కూడా ఆరితే రిన అనుభవజ్ఞులే. అయినా వారు, పేద వాడి నోటి తిండి నుంచి డబ్బు పిండి ఖజానా కడుపు నింపే పని ఎన్నడూ చేయరాదనే ప్రాథమిక ప్రజాస్వామిక సూత్రాన్ని మరిచి పోవడం ఆశ్చర్యకరం. రోజంతా కష్టపడ్డ పేదవారికి తక్కువ ఖర్చుకే దొరికే కొన్ని క్షణాల సంతోషపు విలాసం... సమోసా, అలాంటి ఇతర సాయంకాలపు చిరు తిండ్లే. బడ్జెట్ పరిభాషలో ‘‘పాపం పన్ను’’గా పిలిచేది ప్రభు త్వానికి క్రమం తప్పక ఆదాయాన్ని సమకూర్చే వనరు. అది, లిక్కరు, సిగరెట్లు వంటి వస్తువులపై విధించే పన్ను. అవును, పరిశుద్ధాత్మకమైన స్థితిలో ఖరీదైన హోటళ్లవంటి విలాసాలకు కూడా వర్తించేలా మీరు ఆ పాపాల జాబి తాను సాగదీయవచ్చు. అంతేగానీ మతి స్తిమితంగా ఉన్న ఏ ఆర్థిక మంత్రీ ఎన్నడూ బీడీ నుంచి డబ్బు పిండడు. బిహార్ ప్రజలు ఇటీవలే తాము అధి కారంలోకి తెచ్చిన ప్రభుత్వం మీద అప్పుడే ఆగ్రహం చెం దరు. కానీ, సమోసా, భుజియా(కారప్పూస వంటిది)ల మీద 13.5 శాతం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) విధించడం ఆగ్రహం కంటే మరింత ప్రమాద కరమైన అవహేళనకు తలుపులు తెరుస్తుంది. వ్యంగ్య పరిహాసానికి బిహారీల తర్వాతే ఎవరైనా. సమోసాకు ఉన్న ఆకర్షణే వేరు. వర్గ, జాతి, కుల భేదాలకు అతీతమైన నిజమైన జనబాహుళ్యపు వినియోగ వస్తువు అది. కాబట్టి దాని మీద విధించిన పన్నుపై బిహారీ పరిహాసం కూడా అంత సార్వత్రికంగా వ్యాపించేదే. బహుళజాతి సంస్థల కంటే చాలా ముందే మనవాళ్లు ఫాస్ట్‌ఫుడ్‌ను కనిపెట్టారు. అంతేకాదు దాన్ని గృహ పరిశ్రమగా ఉంచాలనే మంచి ఇంగితం కూడా మనకుంది. పేదవాడికి కూడా ఆ వ్యాపారం బతుకు తెరువు కల్పిస్తుంది. సాధారణంగా వాటి ఉత్పత్తిదారు, వినియోగదారు ఇద్దరూ ఒకే సామాజిక ఆర్థిక అంతస్తుకు చెందినవారై ఉంటారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకున్న దేననేది నిర్వివాదం. అయినా నితీశ్ , లాలూ యాదవ్‌లు ఇద్దరూ వెక్కిరింతలను ఎదుర్కోక తప్పదు. పైగా బిహార్ ఆర్థికమంత్రి పదవి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ చేతుల్లోనే ఉంది. నితీశ్ బహిరంగంగా చేసే పనులను గురించి లాలూ జనాంతికంగా బిగ్గరగా నవ్వలేని సంద ర్భాల్లో ఇది ఒకటి. సమోసా ప్రతీకారం అతి త్వరగానే బయటపడింది. నితీశ్ ప్రస్తుతం దాన్ని చల్లార్చడం కోసం, ఖరీదైన ప్యాకే జ్డ్ సమోసా మీద పన్ను విధించాలనేదే తమ అభిమత మంటూ రాజకీయ ప్రతిదాడిని రేకెత్తించాలని యత్ని స్తున్నారు. అయితే ప్రజలకు గుర్తుండిపోయేది.... తొలుత పుట్టిన ఆలోచనే తప్ప, ఆ తర్వాత వచ్చినది కాదు. అయినా ఈ సవరణ వంచనేననేది స్పష్టంగానే కనిపి స్తోంది. భుజియా కూడా శిక్షపడ్డ వాటి జాబితాలో ఉంది. తరచి చూస్తే ఈ వ్యవహారం ఇంకా ఇంకా ఆసక్తి కరంగా మారుతోంది. ఉదారణకు, దోమలను పారదోలే మస్కిటో రిపెల్లంట్స్పై పన్ను ఎందుకు విధించినట్టు? దోమలు ఓటు వేయవు, కాటేస్తాయి. ఒక్కోసారి అవి ప్రాణాంతకం అవుతాయి కూడా. బిహార్‌లో మస్కిటో రిపెల్లంట్స్కు భారీ మార్కెట్ ఉంది, ప్రభుత్వం వాటి నుంచి భారీగా రాబడిని ఆశిస్తోంది. ఒక్క పాట్నా అమ్మ కాల నుంచి లభించే రాబడే ఒక భారీ ప్రభుత్వ శాఖ ఖర్చుకు సరిపోతుంది. రాష్ట్రం అంతటా దోమల స్వైర విహారం సాగుతోంది. బిహార్‌లో పన్నుల రాబడిని కల్పించే పరిశ్రమలంటూ పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేవు. కాబట్టి పన్ను వేయడానికి వేరే ఏవీ లేవు. అందువలన, ప్రభుత్వం తన గత వైఫల్యాల నుంచే లబ్ధి పొందాలని చూస్తోంది. మాట కూడా దోమలంత వేగంగానే వ్యాపిస్తుంది. రాజకీయాల్లోనైనా లేదా పరిపాలనలోనైనా అనుభ వజ్ఞులైనవారు కూడా ఇంత తెలివిమాలిన పొరపాట్లెలా చేస్తారా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు చేస్తా రంటే, అధికారంలో ఉండగా సమోసాలకు, కారప్పూసకు డబ్బులు చెల్లించేది వారు కాదు కాబట్టి. వారి సాయం కాలపు టీ, దానితో పాటూ ఉండే ఫలహారాల ఖర్చును పరిపాలన బడ్జెట్ నుంచి చెల్లిస్తారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ నాగరికంగా భోజ నం చేసే ఉన్నత సమాజానికి చెంది నవారు. మానసికో ల్లాసం కోసమని ఆయన ఒకసారి ప్రజలు ఆరుబయట నిలుచుని తినే ఒక బడ్డీ దగ్గరకు వెళ్లి... మన సమోసాకు సమానమైన ‘కార్నిష్ పై’ తినాలనుకున్నారు. ముందస్తు ఏర్పాట్లతో సాగిన ఆ కార్యక్రమలో కామెరూన్... దాన్ని తినడం ఎలాగో తెలి యక రసాభాస చేశారు. ఆ ప్రజా సంబంధాల కార్య క్రమం అభాసుపాలైంది. బడ్జెట్‌ను సంతులనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న జార్జ్ ఆస్బోర్న్ తనకు ఆర్థిక మంత్రిగా ఉన్నా, కామెరూన్‌కు ‘పై’ మీద పన్ను వేయాలనే ఆలోచన ఎన్నడూ రాలేదు. ఆస్బోర్న్ తన లక్ష్య సాధనలో పూర్తిగా సఫలం కాకున్నా, ప్రయత్నమైతే చేశారు. కాబట్టి ఆయనను ఎవరూ తప్పు పట్టలేరు. లాలూ-నితీశ్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వెలుగును కోల్పోతున్న సమయంలో సమోసా-భుజియా విషాద ప్రహసనం ప్రదర్శితం కావడానికి కారణాలు హాస్యా స్పదమైనవి మాత్రం కావు. నేరస్తులకు రాజకీయ ఆశ్రయం లభిస్తుండటంతో నేరాలు ప్రతీకారం తీర్చు కోడానికన్నట్టు తిరిగి పేట్రేగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో భయం పెంపొందుతోంది. అధికారులకు లాలూ సమాంతర యంత్రాంగం నుంచి ఆదేశాలు అందుతున్నాయి. నిజమైన అధికార పీఠం ఎక్కడ ఉందో వారికంటే బాగా అర్థం చేసుకోగలవారు మరె వరూ ఉండరు. ఈ సమోసా తిరుగుబాటును అదుపు చేయవచ్చు. కానీ గత జ్ఞాపకాలకు సమోసా తోడు కావడం, నితీశ్ కుమార్ పేరుప్రతిష్టలకు గణనీయమైన నష్టాన్ని కలుగజేస్తుంది. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
సమోసాపై 13.5 శాతం పన్ను
-
సమోసా, కచోరీలపై భారీ పన్ను!
పాట్నా: కప్పు చాయ్, ఒక సమోసా తింటే కడుపు నిండిన సంతృప్తి సామాన్యుడికి. కానీ రానురాను ఖరీదైన ఆహార పదార్థాల జాబితాలో చేరిపోయి.. అవి కూడా సామాన్యుడికి అందని ద్రాక్షల్లా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా బిహార్‌లోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం సమోసా, కచోరీలను విలాస వస్తువుల జాబితాలో చేర్చి.. వాటిపై ఏకంగా 13.5శాతం పన్ను విధించింది. అభివృద్ధి అజెండాతో ముందుకుసాగుతున్న నితీశ్ సర్కార్ అందుకు తగిన నిధులను పన్నులరూపంలో సమకూర్చుకోవాలని తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగా విలాస వస్తువులపై 13.5 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. కిలోకు రూ. 500 కన్నా అధికంగా ధర కలిగిన మిఠాయిలు, దోమల్ని నిరోధించే మస్కిటో కాయిల్స్ వంటివాటిని ఈ విలాస వస్తువుల జాబితాలో చేర్చింది. సీఎం నితీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిఠాయిలతోపాటు సాల్టీ ఆహార పదార్థాలైన సమోసా, కచోరీలపైనా 13.5 శాతం పన్ను విధిస్తున్నామని కేబినెట్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రజేశ్ మెహోత్రా తెలిపారు. అదేవిధంగా అన్ని రకాల యూపీఎస్ వస్తువులపైనా ఈ విలాస పన్ను ఉంటుందని, ఇసుక, సౌందర్య సాధన ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, తలనూనె వంటివాటిపై కూడా 13.5శాతం పన్ను విధించనున్నామని ఆయన చెప్పారు.