సాధారణంగా దైనందిన జీవితం లేదా కెరీర్‌లో రకరకాల ఒత్తిడులను ఎదుర్కొనాల్సి వస్తుంటంది. ఈ ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో రిలీఫ్ కోసం కొన్ని రకాల అలవాట్లకు లోనవ్వుతుంటాం. అవి మంచివి అయితే పర్లేదు. అదే కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి అవి మనషులను ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఆ దిశగా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే చాలామంది ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటారని వాటివల్ల వారి ఆరోగ్యం ఎలా ప్రమాదంలో పడుతుందో సవివరంగా వెల్లడించారు. అదెలాగో తెలుసుకుందామా..!
బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం..ఒత్తిడికి గురైనప్పుడూ చాలామంది సమోసా లేదా బర్గర్ వంటి జంక్ ఫుడ్ తినేందుకు మొగ్గు చూపుతారట. ఇలా తినడం వల్ల ఆందోళన స్థాయిలు పెరుగుతాయే గానీ ప్రయోజనం ఉండదని పరిశోధనలో తేలింది. అందుకోసం జంతువులపై జరిపిన అధ్యయనంలో పల ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆందోళనలో ఉన్నప్పుడూ అవి అధిక కొవ్వుతో కూడిన జంక్ ఫుడ్ తీసుకోవడంతో వాటి శరీరంలోని గట్ బ్యాక్టీరియాకి అంతరాయం కలిగించి వాటి ప్రవర్తనను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది మెదుడు రసాయనాలన ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధన పేర్కొంది కూడా.
ఈ మేరకు ప్రొఫెసర్ క్రిస్టోఫర్ లోరీ మాట్లాడుతూ..అధిక కొవ్వు మెదుడులోని జన్యువుల వ్యక్తీకరణనే మార్చేయడం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని అన్నారు. అంతేగాదు తమ పరిశోధనలో ఈ అధిక కొవ్వు ఆహారం తప్పనిసరిగా మెదుడులో ఆందోళన స్థితి మరింత పెంచుతున్నట్లు వెల్లడయ్యింది. పైగా ఇలా జంక్‌ఫడ్ ఎక్కువగా తీసుకున్న జంతువుల్లోని మైక్రోబయోమ్ లేదా గట్ బ్యాక్టీరియాని అంచనా వేయగా తక్కువ వైవిధ్యాన్ని చూపించాయని, పైగా వాటి బరువు కూడా పెరిగినట్లు తెలిపారు.
అంతేగాదు ఈ అధిక కొవ్వుతో కూడిన ఆహారం కారణంగా మెదడులో న్యూరోట్రాన్స్‌మీటర్ సెరోటోనిన్ ఉత్పత్తికి సంబంధించిన సిగ్నలింగ్‌లో మూడు జన్యువులు అధిక వ్యక్తీకరణనను చూపించడం గుర్తించామన్నారు పరిశోధకులు. ఇది ఒత్తిడి, ఆందోళనను పెంచే సంకేతమని చెబుతున్నారు. ఇక్కడ ఈ సెరోటోనిన్‌న ఫీల్ గడ్ బ్రెయిన్ కెమికల్ అని పిలుస్తారు. అయితే పరిశోధనలో జంతువుల్లోని ఈ సెరోటోనిన్ న్యూరాన్‌లలోని కొన్ని ఉపసమితులను సక్రియం చేయండంతో ఆందోళన వంటి ప్రతిస్పందనలు వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అంటే ? ఇక్కడ.. శరీరంలోని అనారోగ్యకరమైన మైక్రోబయోమ్ గట్ లైనింగ్(మనం తీసుకున్న ఆహారం)తో రాజీపడి శరీర ప్రసరణలో కలిసిపోతుంది.
దీంతో జీర్ణశయాంతర ప్రేగు నుంచి మెదడుకు వెళ్లే వాగస్ నరాల ద్వారా మెదడుతో కమ్యూనికేట్ అయ్యి ప్రవర్తనను లేదా మూడ్‌ని మారుస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం మనకు అనారోగ్యం కలిగించే విషయాలను గుర్తించి తద్వారా భవిష్యత్తులో వాటిని నివారించేలా చేసే మరిన్ని ప్రయోగాలకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే ఇక్కడ అన్ని కొవ్వులు చెడ్డవికావని చేపలు ఆలివ్ నూనె వంటి మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
(చదవండి: డిప్రెషన్‌తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?)
Comments
Please login to add a commentAdd a comment