బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత హీరామండితో ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయన వాలీ బిన్ జాయెద్-ఏఐ మహమ్మద్‌గా నటించి మెప్పించాడు. ఇటీవల ఒక ఇంటర్యూలో తన జీవితంలో ఒకనొక దశలో ఎదుర్కొన్న గడ్డు రోజులు గురించి చెప్పుకొచ్చారు. తాను డిప్రెషన్ గురై బాధపడుతుండే వాడనని, దాని నుంచి బయటపడేందుకు ఎంతలా ప్రయత్నించేవాడినో షేర్ చేసుకున్నారు. దాన్ని మరణం, పునరుద్ధానం మధ్య జరిగే ఒక విధమైన యుద్ధంగా అభివర్ణించారు. నిజానికి డిప్రెషన్ అంత భయంకరమైనదా? ఏం చేస్తే ఈజీగా బయటపడగలం..?
ఫర్దీన్ తాను కొన్ని రోజు డిప్రెషన్‌తో చాల బాధపడ్డానని అన్నారు. ఆ టైంలో రోజుల ఎంత కఠినంగా అనిపిస్తాయంటే.. ప్రతి నిమిషం ఓ యుగంలా ఉంటుందని చెబుతున్నారు ఫర్దీన్. ఆ క్రమంలో ఒక్కోసారిగా పూర్తిగా నిరాశ, నైరాశ్యంలోకి కూరుకుపోయి, ఒంటిరిగా ఉండేందుకు ఇష్టపడతామని అన్నారు. అయితే తాను ఎందుకిలా బాధపడుతున్నానని గంటలు తరబడి ఆలోచిస్తాను, కానీ బయటపడలేకపోయే వాడినని చెప్పారు. ఒక్కోసారి ఒంటరిగా గదిలో కూర్చొని ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుండే వాడనని, ఐతే అదెలా అనేది తెలియక చాలా సతమతమయ్యేవాడనని అన్నారు ఫర్దీన్. చివరికీ ఎలాగైతే దేవుడి దయ వల్ల తన కుటుంబం సహకారంతో ఈ సమస్య నుంచి బయటపడగలిగానని చె ప్పుకొ చ్చారు
ఎందువల్ల వస్తుందంటే..
నిరుత్సాహ పరిచే సంఘటనలు లేదా మనం అనుకున్నట్లు జరగకపోవడం వల్ల లేక తమకు నచ్చనట్లు జరగుతున్నట్లు అనిపించినప్పుడూ ఈ సమస్య ఎదురవ్వుతుంది. కొందరూ లైట్‌గా తీసుకోగలిగితే, మరికొందరూ మాత్రం నాకే ఎందుకు అని మనసుకి తీసుకుంటారో అక్కడ నుంచి ఓ నీడలా వెంటాడేస్తుంది ఈ డిప్రెషన్. ఎంతలా అంటే మంచి జరిగిన విషయం కూడా చెడ్డగా భయపెట్టేదిగా మారి పూర్తిగా డౌన్ చేసేస్తుంది మనిషిని.
అందుకే నటుడు ఫర్దీన్ దీన్ని మనసుతో చేసే కఠినమైన యుద్ధంగా అభివర్ణించాడు. దీన్ని నుంచి బయటపడాలనుకునే వ్యక్తికి మరణంతో సాగిస్తున్న యుద్ధంలా ఉంటుంది. ఇక్కడ ఆ వ్యక్తి మనసులో బయటపడాలని ఎంత బలంగా అనుకుంటే అంత ఈజీగా బయటపడి మనుగడ సాగించగలుగుతాడు. లేదంటే అంతే సంగతులు అని చెబుతున్నారు మానసిక నిపుణులు.
బయటపడేందు సింపుల్ మార్గాలు..
డిప్రెషన్‌కి గురయ్యే బాధితుడు వేదనాభరితంగా చెప్పుకుంటున్న అతని గోడుని ఆశాంతం శ్రద్ధగా వినాలి. ఓపికగా వారి వేదనను అర్థం చేసుకుంటున్నామనే భరోసా అందించాలి.
సంకోచించకుండా తమ ఆలోచనలు బయటపెట్టే అవకాశం ఇవ్వాలి.
అలాగే వారికి మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేలా ప్రోత్సహిచడం, వారిని ఈ సమస్య నుంచి బయటపడేలా మోటీవేట్ చేస్తూ సలహాలు, సూచనలు ఇవ్వాలి.
వారిని ఒంటిరిగా వదిలేయకుండా మేమున్నామనే మద్దతు, భరోసా ఇవ్వాలి.
థెరపీ సెషన్‌లు తీసుకుంటూ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యేలా చేయాలి.
అలాగే దేనివల్ల ఈ సమస్యతో బాధపడుతున్నారో తెలుసుకుని అందుకు తగ్గరీతిలో సాయం అందించి వారిలో భారం దిగేలా చేసి కుదుటపడనీయాలి. ఇలా చేస్తే తనని ప్రేమించేవాళ్లు, ఆదరించే వాళ్లు ఉన్నారనే ధైర్యంతో ఉండగలుగుతారు. పైగా దీనికి బలవ్వకుండా సులభంగా బయటపడతారని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment