Depression
-
డిప్రెషన్ లో అల్లు అర్జున్..?
-
రిటైర్మెంట్ డిప్రెషన్ డేంజర్ బెల్స్ : ఏం చేయాలి?!
రిటైర్మెంట్, పదవీ విరమణ తరువాతి జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా గడపొచ్చని దాదాపు అందరూ భావిస్తారు. నిజానికి ఇది అవసరం కూడా. కానీ ఇండియాలో పదవీ విరమణ తరువాత చాలా మందిని డిప్రెషన్ బాధిస్తోందట. శూన్యత, ఒంటరితనం, నేను ఎందుకూ పనికి రానా? అనే ఆందోళన క్లినికల్ డిప్రెషన్‌కు దారితీస్తోందని సమాచారం. దీన్నే రిటైర్మెంట్ డిప్రెషన్ అంటున్నారు. ఒకప్పుడు చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండేవారు కూడా రిటైర్మెంట్ తరువాత చాలా స్వల్ప భావోద్వేగాలను కూడా తట్టుకోలేక పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మరి దీన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?రిటైర్మెంట్ డిప్రెషన్‌కి అనేక సమస్యలు, సవాళ్ల వల్ల ఏర్పడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, మనవలు, మనవరాళ్లతో కాలం గడుపుతూ, ఉన్న చిన్నకొద్దిపాటి, వ్యవసాయాన్ని, గొడ్డూ, గోదా సంరక్షణ, లేదా వ్యాపారం నిర్వహణతోపాటు సమాజంలో అందరూ సామూహికంగా కలిసి ఉండటం లాంటి వల్ల పదవీ విరమణ ద్వారా వచ్చిన ఆకస్మిక మార్పులను సర్దుబాటు చేసుకునేలా ఉండేవి. అయితే ఉద్యోగ విరమణ తరువాత వయసుతో వచ్చే సమస్యలతోపాటు, ఉద్యోగ రీత్యా పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉండటంతో విచారం, ఆందోళన, నిస్సహాయత వారిని చుట్టుముడుతోంది. అయితే సరైన ప్రణాళిక, నిపుణుల సలహాతో వీటన్నింటినుంచి బయటపడవచ్చు అంటున్నారు మానసిక వైద్యులు. రిటైర్మెంట్ డిప్రెషన్‌ను ఎలా గుర్తించాలిఅలసట, ఏ పనీ చేయాలని అనిపించకపోవడం, నిస్సత్తువగా, విచారంగా అనిపించడం, ఒంటరివాళ్లమనే ఆందోళన లాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ నిష్థా జైన్. అలాగే ఆ ఉద్యోగం తప్ప మరే హాబీలు లేకపోవటం కూడా రిటైర్మెంట్ డిప్రెషన్‌కు ప్రధాన కారణమంటారు.ఉద్యోగ విరమణ తరువాత ప్రతీ నెలా వచ్చే జీతం రాదు కేవలం పెన్షన్మీదే ఆధారపడాలి. దీంతో ఆర్థికంగా ఎలా అందోళన మొదలవుతుంది.(పెన్షన్ సరిపడా వచ్చేవారి పరిస్థితి వేరు) ఆరోగ్య సమస్యలు , ఒంటరితనం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. వీటికి తోడు రక్తపోటు, మధుమేహం, మతిమరుపులాంటివి కూడా మరింత ఆజ్యం పోస్తాయి. దీంతో స్వేచ్ఛగా, రిలాక్స్‌గా ఉండాల్సిన వారిలోనిరాశ ఏర్పడుతుంది. పాత జీవితాన్ని కోల్పోయా మనే బాధ, ఒత్తిడి పెరుగుతాయి. రోజంతా ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయనే ఆందోళన చెందుతారని చెబుతున్నారు మానసిక వైద్యులుమరి ఏం చేయాలి? పదవీ విరమణ చేయడానికి ముందే ఆలోచనాత్మక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, దినచర్యలు, అభిరుచులు , రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి? ఆర్థిక అవసరాల నిమిత్తం ఏం చేయాలి లాంటి యాక్షన్ ప్లాన్ కచ్చితంగా ఉండాలి. పలు సామాజిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పర్చుకోవాలి. అంతకుముందే ఏదైనా వ్యాధి ఉంటే క్రమం తప్పకుండా మందులు వాడటం, వైద్య పరీక్షలపై దృష్టిపెట్టాలి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, నడక లాంటి వ్యాయామాలు చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. చక్కటి పుస్తకాలను చదవాలి. అనుభవాలను పంచుకోవడానికి, ఒంటరితనాన్నిబయటపడటానికి సపోర్ట్ గ్రూపుల్లో చేరాలి. అందరితనూ కలిసిపోయేందుకు ప్రయత్నించాలి.వీలైనన్ని సార్లు ఆధ్యాత్మిక , లేదా పర్యాటకు ప్రదేశాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో మరింత దగ్గరగా వ్యవహరించాలి. కుమార్తెలు, కోడళ్లు, కొడుకులపట్ల విశాల దృక్పథంతో వ్యవహరించాలి. పరస్పరం మనసు విప్పి, మాట్లాడుకోవాలి. చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. మనకువచ్చిన విద్యను వారికి నేర్పించవచ్చు. అపార్టమెంట్లలోని పిల్లలకు చెస్, పెయింటింగ్, ఇలా ఏదో ఒకటి నేర్పిస్తూ వాళ్లతో సమయం గడపాలి.అన్నింటికంటే ముఖ్యంగా పరిస్థితులను అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని పదవీ విరమణ అనేది ఒక ముఖ్యమైన జీవిత మార్పు అని గమనించి ముందుకు సాగిపోవాలి. -
డిప్రెషన్‌తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!
ఐఏఎస్ సాధించటం చాలామంది యువత కల. అయితే కొందరు మాత్రమే ఆర్థికంగా, వ్యక్తిగతంగా.. ఎదరయ్యే సవాళ్లను అధిగమించి విజయం సాధించగలుగుతారు. అలాంటి కోవకు చెందిందే అలంకృత. డిప్రెషన్ అనేది ఎంత భయానక మానసిక వ్యాధి అనేది తెలిసిందే. దీన్ని అధిగమించడం అంత సులభం కాదు. అలాంటి సమస్యతో పోరాడుతూనే క్లిష్టతరమైన సివిల్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారి అయ్యింది. ఈ క్రమంలో ఆమె చేసిన అలుపెరగని పోరాటం అసామాన్యమైనది. వ్యక్తిగతంగా క్షోభను అనుభవిస్తూనే..తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించి అందర్నీ విస్తుపోయేలా చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన అలంకృత పాండే ఎంఎన్ఎన్ఐటీ అలహాబాద్ నుంచి ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులోని ఐటీ కంపెనీలో పనిచేసింది కూడా. ఇంకా ఏదో సాధించాల్సింది మిగిలిపోయిందన్న ఫీల్‌తో 2014లో ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షకు సన్నద్ధం కావాలనుకుంది. అయితే ఆ ఏడాదే ఆమె తీవ్రమైన డిప్రెషన్‌తో మనో వ్యధను అనుభవించింది. తన స్నేహితులు, కుటుంబసభ్యుల మద్దతతుతో అధిగమించే యత్నం చేసింది. అయితే తీవ్రమైన డిప్రెషన్ ప్రభావంతో..ఆ ఏడాది ఫ్రిలిమ్స్కు హాజరు కావడం కూడా మానుకోక తప్పలేదు. అయినప్పటికీ అలంకృత అంతు చూసేంత వరకు తగ్గేదే లే..అంటూ వెనుకడుగు వేయలేదు. ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు ప్రిపరేషన్ సాగించేలా ప్రణాళిక వేసుకుని మరీ కష్టపడి చదివేది. సరిగ్గా 2015లో ఆమె కష్టానికి ఫలితం దక్కింది. ఆ ఏడాది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యింది. తొలి పోస్టింగ్ పశ్చిమబెంగాల్ కేడర్ కేటాయించడంతో అక్కడ నుంచి ఐఎఏస్గా బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత తన తోటి ఐఏఎస్ అధికారి అన్షుల్ అగర్వాల్‌ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె బీహార్‌లో ఐఏఎస్‌గా విధుల నిర్వర్తిస్తోంది. ఇక్కడ అలంకృత డిప్రెషన్‌పై సడలని అలుపెరగని పోరాడటమే ఐఏఎస్ సాధించేలా చేసింది. సడలని స్థిరమైన స్థైర్యంతో కష్టతరమైన సవాళ్లను అధిగమించి అద్భుతాలను సృష్టించొచ్చని చూపించి..ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. సాధించాలన్న దృఢ సంకల్పం ముందు ఎంతటి అనారోగ్య సమస్య అయినా కతం కావాల్సిందే కదూ..!.(చదవండి: బెట్టింగ్ పిచ్చి తగ్గేదెలా?) -
ఏళ్లతరబడి ఫ్లాప్స్.. డిప్రెషన్లో హీరో.. జనాలు ఆదరిస్తారా అని..?
బాలీవుడ్ హీరో కమ్ విలన్ అర్జున్ కపూర్ హిట్ అందుకుని చాలాకాలమే అయింది. 2017 తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత సింగం అగైన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అయితే చాలాకాలంగా అతడు మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడట!నా పరిస్థితి దారుణం..దీనిగురించి తాజా ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. సింగం అగైన్ సినిమాకు సంతకం చేసినప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, శారీరకంగా, మానసికంగా అన్ని కోణాల్లోనూ బాధలో కూరుకుపోయాను. డైరెక్టర్ రోహిత్ శెట్టి నా లుక్ మార్చుకునేందుకు కొంత టైమ్ ఇచ్చాడు. అప్పటికే సినిమాపై నాకు ప్రేమ పోయింది. జనాలు ఆదరిస్తారా?ఇప్పుడీ సినిమా చేయాలా? మళ్లీ సినిమాతో ప్రేమలో పడాలా? జనాలు నిజంగా నన్ను ఆదరిస్తారా? లేదంటే తిరస్కరిస్తారా? ఇలా ఉండేవి నా ఆలోచనలు. హిట్టు అందుకుని ఏళ్లు గడిచిపోతుంటే మనపై మనకే అనుమానం రావడం సహజమే కదా! పైగా లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాడిని. డిప్రెషన్ సినిమానే జీవితం అనుకున్న నేను మూవీస్ చూసి ఎంజాయ్ చేయలేకపోయాను. పైగా ఇతరుల సినిమాలు చూస్తూ నాకిలాంటి ఛాన్స్ వస్తుందా? అని ఆలోచించేవాడిని. నిద్ర రావడానికి యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు చూసేవాడిని. గతేడాదే డిప్రెషన్ నుంచి బయటపడేందుకు థెరపీ తీసుకోవడం మొదలుపెట్టాను.హషిమోటో వ్యాధి ఎప్పుడూ చెప్పలేదు కానీ నాకు హషిమోటో అనే వ్యాధి ఉంది. మా అమ్మకు, సోదరి అన్షులాకు కూడా ఉంది. ఈ వ్యాధి వల్ల నా బరువు అదుపులో ఉండేది కాదు అని చెప్పుకొచ్చాడు. హషిమోటో అనేది ఆటోఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధి. ఇది థైరాయిడ్ గ్రంధిని డ్యామేజ్ చేస్తుంది.చదవండి: భార్య కాళ్లు మొక్కినందుకు ట్రోలింగ్.. హీరో ఏమన్నాడంటే? -
నిశ్శబ్ద మహమ్మారి : కనిపెట్టకపోతే కాటేస్తుంది!
National Stress Awareness Day 2024 జీవితంలో ప్రతీ వ్యక్తికి ఎంతో కొత్త ఒత్తిడి ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక కారణానికి ఒత్తిడిని అనుభవిస్తారు. కానీ ఒత్తిడికి మనం ప్రతిస్పందిస్తున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒత్తిడి తీవ్రమైతే మాత్రమే ముప్పే. ఈ నిశ్శబ్ద మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. ప్రతీ ఏడాది నవంబరు 6న నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ డే జరుపు కుంటారు. ఈ సందర్భంగా ఒత్తిడి, అవగాహన విషయాలను తెలుసుకుదాం.దీర్ఘకాలిక ఒత్తిడి ఆందోళన, నిరాశలను కారణం. ఇది అనేక శారీరక అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే దీనిపై అవగాహన పెంచుకుని, అప్రమత్తంకావాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన పెంచుకోవాలి.జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం 2024: థీమ్నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ డే 2024 థీమ్ "ఒత్తిడిని తగ్గించేందుకు, వారి సంరణక్షను మెరుగుపరచడానికి ప్రచారం చేయడం". ఇది ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం , స్వీయ సంరక్షణను ప్రోత్సహించేలా చేస్తుంది. విశ్రాంతి, సంపూర్ణత, సామాజిక సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహిస్తుంది.ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావాలు ఏమిటి?ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం శారీరకంగా, మానసికంగా గణనీయంగా ఉంటుంది. పని, ఆర్థిక వ్యవహారాలు, మానవ సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అనారోగ్యం, ప్రియమైన వ్యక్తి మరణం, లాంటి అంశాలు ఒత్తిడికి కారణమవుతాయి. ఇవి హార్మోన్లు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్‌ను పెరుగుదలకు దారి తీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఫలితంగా సాధారణ జలుబు నుండి మరింత తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది. జలుబు, ఫ్లూ, వైరస్లు , ఇతర వ్యాధులుడిప్రెషన్ , ఆందోళన, అలసటతలనొప్పి, గుండె సమస్యలు లేదా గుండెపోటు, నిద్రలేమి చిరాకు , కోపం, అతిగా తినడం, కడుపు, జీర్ణశయాంతర సమస్యలుఏకాగ్రతలోపించడం,బయటపడేదెలా?ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఎవరికి వారు ప్రయత్నించాలి. ఒత్తిడికి కారుణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.మన చేయి దాటిపోతోంది అనిపించినపుడు థెరపిస్ట్ లేదా కౌన్సెలర్‌తో మాట్లాడి, వారి సలహాలను పాటించాలి. గిన చికిత్స తీసుకోవాలి.వ్యాయామం చేస్తూ మనసుని, శరీరాన్నిఉత్సాహంగా ఉంచుకోవాలి.నడవడం, జాగింగ్ బైక్ నడపడం, గార్డెనింగ్, యోగా లేదా వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేయాలి. ఈ సందర్భంగా వెలువడిన హార్మోన్లు మెదడుకి మంచిది. సంతోషకరమైన అనుభూతినిస్తాయి.ధ్యానం,మెడిటేషన్ టెక్నిక్‌ని ప్రయత్నించవచ్చు. ధ్యానం రక్తపోటును తగ్గిస్తుంది. నచ్చిన పనిపై దృష్టిపెట్టాలి. తద్వారా మనసుకు ప్రశాంతత తనిస్తుంది. -
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే తెలుసా? సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే!
ప్రసవం తరువాత మహిళలకు భర్తతో పాటు, కుటుంబ సభ్యుల తోడు, సహకారం చాలా అసవరం. బిడ్డల సంరక్షణలో ఇంట్లోని పెద్దల మద్దతు కీలక పాత్ర పోషిస్తుంది. లేదంటే కొంతమందిలోఅనేక సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు:డాక్టరు గారూ! మా అమ్మాయికి 24 ఏళ్లు. నాలుగు వారాల కిందట సిజేరియన్ ద్వారా మొదటి కాన్పులో మగబిడ్డను ప్రసవించింది. పిల్లవాడు కొంచెం బరువు తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందీ లేదని డాక్టర్ చెప్పారు. అయినా మా అమ్మాయి మొహంలో సంతోషం లేదు. తరచూ ఏడవటం, కంటినిండా నిద్రపోకవడం, ఆ బిడ్డను సరిగా పెంచలేనని బాధపడటం, భారంగా భావించడం, బిడ్డను ఏమైనా చేసి తాను కూడా చనిపొతే బాగుండునని మాటిమాటికీ దుఃఖించడం చేస్తోంది. మా అల్లుడు, మేమంతా కూడా ఆమెకు ఎంత ధైర్యం చెప్పినా, అలాగే బాధపడుతోంది. తను ఎందుకు ఇలా ఉంటోందో, ఏం చేయాలో అర్థం కావడం లేదు. – పి. విజయలక్ష్మి, హైదరాబాద్మీ కూతురి విషయంలో మీరు పడే బాధ నేనర్థం చేసుకోగలను. మీ అమ్మాయి ‘పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అనే మానసిక రుగ్మతకు లోనయినట్లు అర్థమవుతుంది. ప్రసవానంతరం 15 శాతం మంది స్త్రీలలో ఈ సమస్య వచ్చే అవకాశముంది. ప్రసవం తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, మెదడులో వచ్చే రసాయనిక మార్పులు, వారసత్వ లక్షణాలూ ఇందుకు ముఖ్య కారణాలు. ప్రసవం తర్వాత ఒకటి రెండువారాలు కొంచెం డల్‌గా దిగాలుగా ఉండటం (పోస్ట్ పార్టమ్ బ్లూస్) కొంత సాధారణమైనప్పటికీ, మీ అమ్మాయికి వచ్చిన సమస్యను తీవ్రంగానే పరిగణించాల్సి వస్తుంది.మీరు వెంటనే దగ్గర్లోని మానసిక వైద్యునికి చూపిస్తే వారు కౌన్సెలింగ్, మందుల ద్వారా చికిత్స చేస్తారు. ఆమెలో ఆత్మహత్య భావాలున్నాయన్నారు కాబట్టి, అవసరమైతే అలాంటి వారిని కొన్నాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేయించి మరింత గట్టి వైద్యం చేయించాల్సి ఉంటుంది. ఆమె పూర్తిగా కోలుకునేంతవరకు బిడ్డ సంరక్షణ మీరు తీసుకుని, తల్లి నుంచి బిడ్డకు ఎలాంటి హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వైద్య చికిత్స, కుటుంబ సభ్యుల సహకారంతో మీ అమ్మాయి పూర్తిగా కోలుకుంటుంది. డోన్ట్ వర్రీ! -
గాయాలు నన్ను అచేతనం చేశాయి.. మోడలింగ్‌లోకి వెళ్తా (ఫొటోలు)
-
నరకప్రాయం.. నాకే ఎందుకిలా అనే భావన : ఊతప్ప
ఒకానొక దశలో తాను కూడా తీవ్రమైన ఒత్తిడితో సతమతమయ్యానని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. నిరాశ నిస్పృహలో కూరుకుపోయి.. అసలు ఎందుకు బతికి ఉన్నానో తెలియని మానసిక స్థితిలోకి వెళ్లిపోయానన్నాడు. దాదాపు ఏడాది పాటు తన ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడిపోయానంటూ 2011 నాటి తన దుస్థితిని వివరించాడు.కాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్ ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం విదితమే. అయితే, అతడిది సహజ మరణం కాదని.. బలవన్మరణానికి పాల్పడ్డాడని గ్రాహమ్ భార్య అమెండా వెల్లడించారు. ఒత్తిడిని తట్టుకోలేకే ప్రాణాలు తీసుకున్నాడంటూ ఉద్వేగానికి లోనయ్యారు.డిప్రెషన్.. నరకప్రాయం ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. డిప్రెషన్, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో వివరించే ప్రయత్నం చేశాడు. కారణం లేకుండానే తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం నరకప్రాయంగా ఉంటుందని తెలిపాడు. అంతబాగానే ఉన్నా మనల్ని ప్రేమిస్తున్న వారికి భారంగా మారామనే ఆలోచన కుంగిపోయేలా చేస్తుందని వాపోయాడు.అయితే, ఇలాంటి సమయంలో బలహీనపడకుండా కాస్త స్థిమితంగా ఉంటే.. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు.. మనల్ని ప్రేమించే వాళ్లకూ గుండెకోత లేకుండా చేయగలమని ఊతప్ప పేర్కొన్నాడు. తన జీవితంలోని చేదు అనుభవాలు గుర్తు చేసుకుంటూ.. ‘‘2011... అసలు నేను ఎందుకు మనిషి జన్మ ఎత్తానా? అనే భావనలో ఉండిపోయేవాడిని. నన్ను నేను అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడే వాడిని కాదు.అద్దం చూడలేదుఆ ఏడాదంతా అస్సలు అద్దం వైపే చూడలేదు. నా ఉనికి నా చుట్టూ ఉన్నవాళ్లకు భరించలేనిదిగా మారిందేమోనని సతమతమయ్యేవాడిని. నాకసలు విలువ లేదని అనిపించేది. నిస్సహాయత, నిరాశలో కూరుకుపోయాను. వారాలు.. నెలల.. సంవత్సరాల పాటు నా గదికే పరిమితమైతే బాగుంటుందని అనుకునేవాడిని.త్వరలోనే కష్టకాలం ముగిసిపోతుందిఅయినా.. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బాధ ఒక్కరోజు ఉంటుందేమో!.. ఆ మరుసటి రోజు బాగుండవచ్చు కదా!.. మనం సాగుతున్న దారిలో చివరికంటా వెలుగు ఉండాలని ఆశించకూడదు. మరో అడుగు ముందుకు వేయడానికి దారి కనిపిస్తే చాలనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే.. గడ్డుకాలం ఎల్లకాలం ఉండదు. త్వరలోనే కష్టకాలం ముగిసిపోతుంది అని అనుకుంటూ ముందుకు సాగితే మంచిది’’ అని రాబిన్ ఊతప్ప ఒత్తిడిని అధిగమించే మార్గం కూడా చెప్పాడు. కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు.టీమిండియాలో రాని అవకాశాలుటీమిండియా తరఫున 46 వన్డేలు ఆడి 934, 13 టీ20లు ఆడి 249 పరుగులు చేసిన ఊతప్ప.. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఇంటర్నేషనల్ కెరీర్ ఆరంభించిన రెండేళ్లపాటు వరుస అవకాశాలు అందుకున్న ఈ కర్ణాటక క్రికెటర్.. 2009 నుంచి గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నాడు. జట్టులో చోటు కరువుకాగా.. 2015లో భారత్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన ఊతప్ప రెండుసార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడు.చదవండి: ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనే లేదు.. ఒలింపిక్స్‌లో ఆడతా: స్మిత్ -
డిప్రెషన్‌తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?
బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత హీరామండితో ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయన వాలీ బిన్ జాయెద్-ఏఐ మహమ్మద్‌గా నటించి మెప్పించాడు. ఇటీవల ఒక ఇంటర్యూలో తన జీవితంలో ఒకనొక దశలో ఎదుర్కొన్న గడ్డు రోజులు గురించి చెప్పుకొచ్చారు. తాను డిప్రెషన్ గురై బాధపడుతుండే వాడనని, దాని నుంచి బయటపడేందుకు ఎంతలా ప్రయత్నించేవాడినో షేర్ చేసుకున్నారు. దాన్ని మరణం, పునరుద్ధానం మధ్య జరిగే ఒక విధమైన యుద్ధంగా అభివర్ణించారు. నిజానికి డిప్రెషన్ అంత భయంకరమైనదా? ఏం చేస్తే ఈజీగా బయటపడగలం..?ఫర్దీన్ తాను కొన్ని రోజు డిప్రెషన్‌తో చాల బాధపడ్డానని అన్నారు. ఆ టైంలో రోజుల ఎంత కఠినంగా అనిపిస్తాయంటే.. ప్రతి నిమిషం ఓ యుగంలా ఉంటుందని చెబుతున్నారు ఫర్దీన్. ఆ క్రమంలో ఒక్కోసారిగా పూర్తిగా నిరాశ, నైరాశ్యంలోకి కూరుకుపోయి, ఒంటిరిగా ఉండేందుకు ఇష్టపడతామని అన్నారు. అయితే తాను ఎందుకిలా బాధపడుతున్నానని గంటలు తరబడి ఆలోచిస్తాను, కానీ బయటపడలేకపోయే వాడినని చెప్పారు. ఒక్కోసారి ఒంటరిగా గదిలో కూర్చొని ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుండే వాడనని, ఐతే అదెలా అనేది తెలియక చాలా సతమతమయ్యేవాడనని అన్నారు ఫర్దీన్. చివరికీ ఎలాగైతే దేవుడి దయ వల్ల తన కుటుంబం సహకారంతో ఈ సమస్య నుంచి బయటపడగలిగానని చె ప్పుకొ చ్చారుఎందువల్ల వస్తుందంటే..నిరుత్సాహ పరిచే సంఘటనలు లేదా మనం అనుకున్నట్లు జరగకపోవడం వల్ల లేక తమకు నచ్చనట్లు జరగుతున్నట్లు అనిపించినప్పుడూ ఈ సమస్య ఎదురవ్వుతుంది. కొందరూ లైట్‌గా తీసుకోగలిగితే, మరికొందరూ మాత్రం నాకే ఎందుకు అని మనసుకి తీసుకుంటారో అక్కడ నుంచి ఓ నీడలా వెంటాడేస్తుంది ఈ డిప్రెషన్. ఎంతలా అంటే మంచి జరిగిన విషయం కూడా చెడ్డగా భయపెట్టేదిగా మారి పూర్తిగా డౌన్ చేసేస్తుంది మనిషిని. అందుకే నటుడు ఫర్దీన్ దీన్ని మనసుతో చేసే కఠినమైన యుద్ధంగా అభివర్ణించాడు. దీన్ని నుంచి బయటపడాలనుకునే వ్యక్తికి మరణంతో సాగిస్తున్న యుద్ధంలా ఉంటుంది. ఇక్కడ ఆ వ్యక్తి మనసులో బయటపడాలని ఎంత బలంగా అనుకుంటే అంత ఈజీగా బయటపడి మనుగడ సాగించగలుగుతాడు. లేదంటే అంతే సంగతులు అని చెబుతున్నారు మానసిక నిపుణులు. బయటపడేందు సింపుల్ మార్గాలు..డిప్రెషన్‌కి గురయ్యే బాధితుడు వేదనాభరితంగా చెప్పుకుంటున్న అతని గోడుని ఆశాంతం శ్రద్ధగా వినాలి. ఓపికగా వారి వేదనను అర్థం చేసుకుంటున్నామనే భరోసా అందించాలి. సంకోచించకుండా తమ ఆలోచనలు బయటపెట్టే అవకాశం ఇవ్వాలి. అలాగే వారికి మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేలా ప్రోత్సహిచడం, వారిని ఈ సమస్య నుంచి బయటపడేలా మోటీవేట్ చేస్తూ సలహాలు, సూచనలు ఇవ్వాలి. వారిని ఒంటిరిగా వదిలేయకుండా మేమున్నామనే మద్దతు, భరోసా ఇవ్వాలి. థెరపీ సెషన్లు తీసుకుంటూ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యేలా చేయాలి. అలాగే దేనివల్ల ఈ సమస్యతో బాధపడుతున్నారో తెలుసుకుని అందుకు తగ్గరీతిలో సాయం అందించి వారిలో భారం దిగేలా చేసి కుదుటపడనీయాలి. ఇలా చేస్తే తనని ప్రేమించేవాళ్లు, ఆదరించే వాళ్లు ఉన్నారనే ధైర్యంతో ఉండగలుగుతారు. పైగా దీనికి బలవ్వకుండా సులభంగా బయటపడతారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
Lavender : అద్భుతమైన ప్రయోజనాలు
వర్షాలు మొదలయ్యాయంటే చాలు దోమలు, కీటకాల బెడద ఎక్కువ అవుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, చుట్టు పక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమ తెరలు వాడటంతో పాటు, ఇంట్లో కొన్ని రకాలు మొక్కల్ని పెంచుకోవడం ద్వారా దోమలు, పురుగుల బాధనుంచి తప్పించు కోవచ్చు. తులసి, పుదీనా, గోధుమ గడ్డి, లావెండర్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. లావెండర్ మొక్కను ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంతేకాదు లావెండర్ ఆయిల్, పువ్వుల వలన ఆరోగ్యప్రయోజనాలు లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.లామియాసి లేదా పుదీనా కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కను లావెండర్ అని పేరు. దీని బొటానికల్ పేరు లావెండర్ అఫిసినాలిస్. లావెండర్ అందమైన పుష్పాలనిస్తుంది. లావెండర్ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి పురుగుల, కీటకాలు రావు. ఈగలు, దోమల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. చీమలు, సాలె పురుగులు కూడా కనిపించవు. ఎందుకంటే ఈ మొక్క నుంచి వచ్చే వాసన వాటికి పడదట. లావెండర్ మొక్క, దాని వాసన మనకు మాత్రం ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రత్యేకమైన రుచి కోసం కుకీలు, కేకుల్లో వీటిని వాడతారు. టీ, సిరప్ లలో ఈ లావెండర్ పువ్వులను వినియోగిస్తారు. అలాగే తీపి కాస్త పులుపు రుచితో ఉండే పువ్వులను చక్కగా తీసుకొని తినవచ్చు. పచ్చిగా తినలేనివారు టీ రూపంలో లావెండర్ పువ్వులను తింటారు కూడా. లావెండర్ మొక్కలతో మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అంతేకాదు ఈ మొక్కనుంచి తీసిన ఆయిల్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆయిల్ ఒకటి. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, అరోమాథెరపీలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో మొటిమలను తగ్గించడంలో సహాయ పడుతుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన నూనె బ్యాక్టీరియాను చంపడానికి పని చేస్తుంది. లావెండర్ ఆయిల్‌లోని యాంటీ ఫంగల్ లక్షణం మంటను, వాపును తగ్గిస్తుంది. ఇది ఎగ్జిమాను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు సంరక్షణలో కూడా పనిచేస్తుంది. -
టెన్షన్.. టెన్షన్!
కర్నూలు (హాస్పిటల్): వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టెన్షన్ ఉంటోంది. పిల్లలకు చదువుపై టెన్షన్. ఇన్‌టైమ్‌లో హోమ్ వర్క్ చేయడం, చెప్పిన పాఠాలు అర్థం చేసుకోవడం, హోమ్‌వర్క్ చేయకపోతే టీచర్ కొడుతుందేమోనని భయం వారిది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం యువత టెన్షన్. ఉద్యోగం వస్తేనే అమ్మాయిని ఇస్తారనేది ఇంకో టెన్షన్. ఇలా ఉద్యోగం లేక, పెళ్లి కాని యువత చాలామందే ఉన్నారు. తీరా ఉద్యోగం వచ్చాక ఆయా సంస్థలు, ఉన్నతాధికారులు ఇచ్చే లక్ష్యాలు నెరవేర్చాలంటే మరో టెన్షన్. వీకెండ్ వస్తే ఇంట్లో భార్యాపిల్లల ఇష్టాలు తీర్చేందుకు అవసరమైన డబ్బు లేదనేది మరికొందరి టెన్షన్. పిల్లలు పెద్దయ్యాక వారికి వివాహాలు చేయడం మరో టెన్షన్. దీంతోపాటు ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయాలు, వారి ఆలనాపాలనా చూసేవారు కరువు కావడం, అందరూ ఉన్నా అనాథలు కావడం ఇంకో టెన్షన్. ఇలా ఎవరి స్థాయిలో వారికి టెన్షన్ ఉంటోంది. ఈ క్రమంలో టెన్షన్‌తో పాటు ఆందోళన, డిప్రెషన్ వస్తున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇటీవల మానసిక వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఓపీ పెరుగుతోంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీకి ప్రతిరోజూ 75 నుంచి 90 మంది వరకు రోగులు వస్తుండగా.. అందులో 40 శాతం కొత్తవారు ఉండటం గమనార్హం. వీరిలో 40 నుంచి 50 శాతం వరకు ఆందోళన, కుంగుబాటు(డిప్రెషన్)కు గురై చికిత్స కోసం వస్తున్న వారే ఉంటున్నారు. వీరు గాక నగరంలోని ప్రైవేటు మానసిక వైద్యుల వద్దకు, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైతం ప్రతిరోజూ 220 నుంచి 250 మంది దాకా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఇందులో జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైకోసొమాటిక్ (శారీరక, మానసిక) జబ్బులతో బాధపడే వారే ఎక్కువ. దీంతోపాటు 30 శాతం మద్యం, సిగరెట్ అలవాట్లు, 20 నుంచి 30 శాతం మంది తీవ్రమైన మానసిక సమస్యలు (స్క్రిజోఫీనియా, మానియా, డిల్యూషన్ డిజార్డర్లు, బైపోలార్, సివియర్ డిప్రెషన్)తో వస్తున్నారు. వృద్ధుల్లో 5 శాతం మంది నిద్రలేమి, మతిమరుపు సమస్యలతో వస్తున్నారు. చిన్నపిల్లల్లోనూ 5శాతం మంది మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. 2021లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక జబ్బుల విభాగానికి ఓపీ 15,942, ఇన్పేషెంట్లుగా 92 మంది చికిత్స పొందగా.. 2022లో ఈ సంఖ్య ఓపీలో 19,475కి, ఇన్పేòÙంట్లు 175కి, 2023లో ఓపీ 20,323, ఇన్పేòÙంట్ల సంఖ్య 245కు పెరిగింది. నిద్ర లేకపోవడంతోనే సమస్యలు కొంతమంది కొద్దిపాటి సమయం లభించినా కూర్చున్న చోటే ఒక కునుకు తీస్తారు. మరికొందరు అర్ధరాత్రి దాటినా కళ్లు తెరుచుకుని అటూఇటూ చూస్తూనే ఉంటారు. ఇంకొందరు నిద్రపట్టక నిశాచర జీవుల్లా రాత్రిళ్లు ఊరంతా చుట్టేస్తుంటారు. పట్టణాల్లో అధికంగా రాత్రివేళ టీ స్టాల్స్ వద్ద ఇలాంటి వారే మనకు కనిపిస్తుంటారు. ఎప్పుడో తెల్లవారుజామున మూడు, నాలుగు సమయంలో వీరు ఇళ్లకు చేరుకుని నిద్రించి, మరునాడు ఉదయం 10 గంటల వరకు లేవడం లేదు. దీనికి మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్, ఆందోళనతో పాటు శారీరక వ్యాయామం లేకపోవడం, అధికంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువగా మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోవడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మరుసటిరోజు శరీరం ఉత్సాహంగా గడిపేందుకు సహకరించడం లేదు. నిరుత్సాహం, నిస్సత్తువ ఆవహిస్తున్నట్టు ఉంటుంది. ఫలితంగా వీరికి గ్యాస్ట్రబుల్, గుండె దడ, ఊబకాయం, మలబద్దకం, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు కొత్తగా తలెత్తుతాయి. మానసిక ఆరోగ్యానికి సూత్రాలు » ఇష్టమైన పనులు చేయాలి » బాధలు, కష్టాలను కుటుంబసభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి » భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకూడదు » ఉదయాన్నే వాకింగ్ చేయడం, ధ్యానం, యోగా చేయాలి. దీనివల్ల డిప్రెషన్, మానసిక ఒత్తిడి అదుపులోకి వస్తాయి. » వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర, సినిమాలు, షాపింగ్‌కు వెళ్లాలి. » అందుబాటులో ఉంటే రోజులో ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలి. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు »తెలివి తక్కువ, బుద్దిమాంద్యంతో కూడిన మానసిక వ్యాధులు » చదువుపై ఏకాగ్రత లేకపోవడం, ఎక్కువగా బయట తిరగటం, బంధువులతో కలవలేకపోవడం, తనలోకంలో తానుండటం » చదువులో వెనుకబడటం, చెడు సహవాసాలు, చెడు అలవాట్లకు గురవడం నిద్రలో మల, మూత్ర విసర్జనాలు చేయడం తినకూడని పదార్థాలు తినడం (ఉదా: మట్టి, సున్నం మొదలైనవి)మానసిక వ్యాధుల లక్షణాలు» ఆందోళన, భయం, గుండెదడ, అధికంగా చెమట పట్టడం, కాళ్లు, చేతులు వణకడం » గుండె ఆగినట్లు అనిపించడడం, ఛాతినొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, భయం, ఆందోళన » అనవసర ఆలోచనలు మళ్లీ మళ్లీ రావడం, అనవసర పనులు మళ్లీ మళ్లీ చేయడం, చేతులు అదే పనిగా కడగటం » అకస్మాత్తుగా మాట రాకపోవడం, కాళ్లు చేతులు పడిపోవడం, మూర్ఛలాగా రావడం » విచారంగా, పనిలో ఉత్సాహం లేకపోవడం » ఆకలి, నిద్ర లేకపోవుట, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం » మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గటం, ప్రవర్తనలో మార్పు, సంధి ప్రేలాపనలు » అధికంగా ఆల్కహాల్, మాదకద్రవ్యాల అలవాటు » మూర్ఛ వ్యాధితో వచ్చే మానసిక, దీర్ఘకాక వ్యాధులతో బాధలు, పక్షవాతం తర్వాత వచ్చే మార్పులు » తనలో తాను నవ్వుకోవటం, మాట్లాడుకోవడం, చెవిలో మాటలు వినబడటం, ఇతరులను అనుమానించడం, భర్తలేక భార్య శీలాన్ని శంకించడం » ఎక్కువగా మాట్లాడటం, తిరుగుట, అతి ఆనందం, అతి ధైర్యం లేదా అతికోపం, అతిగా డబ్బు ఖర్చు చేయడం » పూనకాలు రావటం, తనకు తాను గుర్తుకు లేకుండా తిరుగుట » ముసలితనంలో వచ్చే అనారోగ్య సమస్యలు » అనవసరంగా భయాలు, అనుమానాలు పెంచుకోవడం » అకస్మాత్తుగా గతంలో జరిగిన ఘటనలు మరిచిపోవడం » బహిష్టు ముందు, తర్వాత వచ్చే మానసిక మార్పులు » కాన్పు ముందు, తర్వాత వచ్చే మానసిక మార్పులు »ఆకలి లేకపోవడం, నాజూకుతనానికై తినకపోవడం, అదుపు లేకుండా తినడం »కలత నిద్ర, నిద్ర పట్టకపోవడం, నిద్రలో నడవటం, మాట్లాడటం, మూత్రవిసర్జన చేయడం, భయంకర కలవరింతలు, అతి నిద్ర, నిద్రలో పళ్లు కొరకడం » నిగ్రహ శక్తి కోల్పోవడం, జూదానికి బానిసవటం, పరుల వస్తువులను అపహరించడం, అదే పనిగా షాపింగ్ చేయడం మానసిక రోగుల సంఖ్య పెరిగిందికొంతకాలంగా మానసిక వ్యాధుల విభాగానికి బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్–19 పరిస్థితుల అనంతరం మానసిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల, జన్యుపరంగా, వ్యక్తిగత సమస్యల వల్ల, సమాజంలో పలు కారణాల వల్ల స్క్రిజోఫీనియా, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం అన్నిరకాల మానసిక సమస్యలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నాం. అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నాం. – డాక్టర్ గంగాధర్‌నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వ్యాధుల విభాగం, జీజీహెచ్, కర్నూలు -
సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
విచక్షణ లేకుండా, చేతికొచ్చినట్టు కమెంట్లు చేయడం, సూటిపోటి మాటలతో ఎదుటివారిని చిత్రవధ చేయడం సోషల్ మీడియా ట్రోలర్లకు పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా పెద్ద ప్రమాదం నుంచి బిడ్డ బయటపడిందన్న సంతోషం ఒక తల్లికి ఎంతో సేపు నిలవనీయలేదు. వేధించి, వేధించి ఆమె ఉసురు తీసిన ఘటన విషాదం నింపింది.ఇటీవలి ప్రమాదవశాత్తు తల్లి చేతుల్లోంచి జారి సన్‌షేడ్‌పై పడిన పాపను రక్షించిన సంఘటన గుర్తుందా?ఎనిమిది నెలల పాపను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి బిడ్డను కాపాడారు. కానీ ఇపుడా పాపకు తల్లిని దూరం చేసింది మాయదారి సోషల్ మీడియా. కోయంబత్తూర్‌లో పాపను రక్షించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విడియో చూసిన నెటిజన్లు "బిడ్డను చూసుకోవటం చేత కాదా?" అని ఆ తల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కి గురైన ఆమె కోయంబత్తూర్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.కాగా చెన్నైలోని తిరుముల్లైవాయల్‌లోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నాలుగో అంతస్తులో నివసించే రమ్య, వెంకటేష్‌లకు ఇద్దరు పిల్లలు, నాలుగేళ్ల అబ్బాయి, ఏడు నెలల పాప ఉన్నారు. ఏప్రిల్ 28న, ఐటీ ఉద్యోగి రమ్య తన ఫ్లాట్‌లోని బాల్కనీలో తన పసికందుతో ఆడుకుంటూ ఉండగా, పాప ఆమె చేతుల్లోంచి జారి కింద ఉన్న తాత్కాలిక సన్షేడ్లో పడింది. దీంతో పొరుగువారు కింద దుప్పట్లు పట్టుకోగా, ఒక వ్యక్తి సన్‌షేడ్ నుండి పాపను పట్టుకుని సురక్షితంగా క్రిందికి తీసుకు రాగలిగాడు. ఈ ఘటన తర్వాత రమ్య తల్లిగారింటికి వెళ్లింది. అక్కడికి వెళ్లినా ఆమెకు ఉపశమనం లభించలేదు. దీంతో శనివారం కారమడైలోని తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉసురు తీసుకుంది. -
అనిషా పదుకోన్: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..
పట్టణాలలో, నగరాలలో మానసిక సమస్యలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. పల్లెల్లో ఎలా? ముఖ్యంగా మహిళలకు మానసిక సమస్యలు వస్తే? డిప్రెషన్‌తో బాధ పడ్డ నటి దీపికా పదుకోన్ గ్రామీణ మహిళల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్’ అనే సంస్థను స్థాపించింది. దాని బాధ్యతను చెల్లెలు అనిషా పదుకోన్‌కు అప్పజెప్పింది. అనిషా నిర్వహణలో ఆ సంస్థ ఆరు రాష్ట్రాలలో గ్రామీణ మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. చెన్నైకి గంటన్నర ప్రయాణ దూరంలో ఉండే తిరువళ్లూరులో శశికళ అనే మహిళకు మతి చలించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెను తీసుకొచ్చి చెన్నైలో చూపిస్తే మందులు వాడాలన్నారు. చెకప్‌ల కోసం, మందుల కోసం నెలకోసారి చెన్నై రావాలంటే డబ్బులు ఖర్చవుతాయి. ఆమె అంత డబ్బు ఖర్చు పెట్టలేని పేద మహిళ. మందులు మానేసింది. మానసిక స్థితి ఇంకా దెబ్బ తిని ఊళ్లో దిమ్మరిగా తిరగడం మొదలెట్టింది. గ్రామీణ స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్న ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థ ప్రతినిధులకు ఈ సంగతి తెలిసింది. తమతో కలిసి పని చేస్తున్న చెన్నైకి చెందిన వసంతం ఫౌండేషన్‌కు ఈ సంగతి తెలియపరిచారు. ఆ ఫౌండేషన్ వారు ఆమెను తరచు వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. కావలసిన మందులు కొనిచ్చారు. కేర్‌గివర్‌గా పని చేస్తున్న తల్లికి దారి ఖర్చులు సమకూర్చారు. శశికళకు పూర్తిగా నయమైంది. ఆ తర్వాత ఆమె చిన్న చిల్లరకొట్టు నడుపుకోవడానికి 5000 రూపాయల సహాయం అందించారు. శశికళ ఇప్పుడు తన పిల్లలను చూసుకుంటూ జీవిస్తోంది. ‘ఇలా సహాయం అందాల్సిన వారు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అంటుంది అనిషా పదుకోన్. ఆమె ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థకు సి.ఇ.ఓ. దీపిక స్థాపించిన సంస్థ తాను డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్టు దీపికా పదుకోన్ 2015లో లోకానికి వెల్లడి చేసింది. స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చింది. అంతే కాదు తన బాధ్యతగా 2016లో బెంగళూరు కేంద్రంగా స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ను స్థాపించింది. దానికి తన చెల్లెలు అనిషా పదుకోన్‌ను సి.ఇ.ఓగా నియమించింది. అనిషా ఈ సంస్థ కోసం చురుగ్గా పని చేస్తోంది. ఇప్పటికి ఈ ఫౌండేషన్ సేవలను ఆరు రాష్ట్రాలకు విస్తరించింది. ఆ ఆరు రాష్ట్రాలలోని 13 జిల్లాల్లో ఈ సంస్థ వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరివల్ల 15,000 మంది గ్రామీణ మహిళలు ఇప్పటి వరకూ మానసిక చికిత్స పొందారు. అంతే కాదు 26,000 మంది సంరక్షకులు, అంగన్వాడి కార్యకర్తలు మానసిక చికిత్సలో ప్రాథమిక అవగాహనకై ట్రయినింగ్ కూడా ఈ సంస్థ వల్ల పొందారు. గోల్ఫ్ ప్లేయర్ అనిషా పదుకోన్ తండ్రి ప్రకాష్ పదుకోన్ ప్రఖ్యాత బాడ్మింటన్ ప్లేయర్ కావడం వల్ల అనిషా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి కనపరిచింది. ఆమె గోల్ఫ్ క్రీడను ప్రొఫెషనల్ స్థాయిలో నేర్చుకుని మన దేశం తరఫున అమెచ్యుర్ లెవల్లో ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ ఆటను కొనసాగించే సమయంలోనే దీపికా పడుకోన్ సూచన మేరకు ఫౌండేషన్ బాధ్యతలు తీసుకుంది. ‘ఇక్కడ పని చేయడం మొదలెట్టాక మానసిక సమస్యల తీవ్రత అర్థమైంది. మన దేశంలో 20 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో గ్రామీణ స్త్రీలు ఎక్కువ శాతం ఉన్నారు. వీరి కోసం మందులు, వైద్యం, పెన్షన్, సంరక్షకుల ఏర్పాటు, ఉపాధి... ఇవన్నీ సాధ్యం కావాలంటే పెద్ద ఎత్తున సాయం కూడా అందాలి. వాలంటీర్లు ముందుకు రావాలి. కలిసి పని చేయాలి’ అంటుంది అనిషా. స్త్రీలు వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకుంటూ తగినంత నిద్ర పోవడం అవసరం అంటుందామె. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని పిలుపునిస్తోంది. ఇవి చదవండి: చదువు శక్తినిస్తుంది -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
వేలేరు/తలమడుగు: రాష్ట్రంలో ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. నీరు తడి లేక పంట ఎడిపోయి ఒకరు.. పంట దిగుబడి సరిగా రాక అప్పుల్లో కూరుకుపోయి తీర్చే దారిలేక మరొక రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండ్రోజుల వ్యవధిలో జరిగిన ఈ రైతుల ఆత్మహత్య లకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన పిట్టల సుధాకర్(43)కు మూడెకరాల వ్యవ సాయ భూమి ఉంది. కొంతభాగం మొక్కజొన్న సాగుచేశాడు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో అప్పులు చేసి బావిలో సైడ్ బోర్లు వేయించాడు. అయినా నీరు పడకపోవడంతో పంట చేతికందే సమయంలో ఎండిపోయింది. బోర్లు వేసేందుకు, పంట పెట్టుబడికి, రెండేళ్ల క్రితం కూతురు పెళ్లికి తెచ్చిన అప్పు మిత్తి కలిపి రూ.12లక్షల వరకు ఉంది. ఇటు పంట ఎండిపోవడం, అటు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందాడు. సోమవారం మధ్యాహ్నం చేలోకి వెళ్లిన సుధాకర్ ఎండిన పంటలను చూసి తీవ్ర మనోవేదనతో పురుగుల మందుతాగాడు. చుట్టు పక్కల రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా.. అప్పటికే సుధాకర్ మృతి చెందాడు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. పొలానికి వెళ్లొస్తానని చెప్పి... ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాకర్ల ఆశన్న (43)కు రెండెకరాల 19 గుంటలతో పాటు తన భార్య సుచరిత పేరిట మూడెకరాల 30 గుంటల పొలం ఉంది. మొత్తం ఆరెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సీజన్లో అందులో పత్తి, కంది పంటలు సాగు చేశాడు. పత్తి పెట్టుబడి కోసం ఆదిలాబాద్‌లోని ఎస్బీఐలో భార్యాభర్తల ఇద్దరు పేరుమీద రూ.4లక్షలు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి మరో రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు సంతానం. కుమార్తె డిగ్రీ, కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇటీవలే కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగా రాక, తెచ్చిన అప్పు తీర్చే దారిలేక మనస్తాపం చెందిన ఆశన్న మంగళవారం ఉదయం పొలానికి వెళ్లొస్తానని చెప్పి ఇంటినుంచి బయల్దేరాడు. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా...వారు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఆశన్న మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
నేను ఫొటోలు దిగి చాన్నాళ్లయింది: ఇలియానా
‘‘నేను ఫొటోలు దిగి చాన్నాళ్లయింది. అలాగే ఈ ప్లాట్ఫామ్లో నా అబీప్రాయాలు షేర్ చేసి కూడా చాలా రోజులైంది. తల్లయ్యాక బిడ్డను చూసుకోవడం, ఇల్లు చక్కబెట్టుకోవడంతోనే సరిపోతోంది. నాకోసం టైమ్ కేటాయించుకోలేకపోతున్నాను’’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నారు ఇలియానా. గత ఏడాది ఆగస్టులో ఒక బాబుకి జన్మనిచ్చారు ఇలియానా. ప్రెగ్నెసీ తర్వాత సహజంగా కొందరికి ఏర్పడే డిప్రెషన్లాంటిది ఇలియానాకి కూడా ఏర్పడిందట. సినిమా స్టార్‌గా కొన్నేళ్లు మేకప్‌కి దగ్గరగా ఉన్న ఇలియానాకి ఇప్పుడు మేకప్ బాక్స్ తెరిచే సమయం కూడా లేదు. ఇక హెయిర్ స్టయిల్ అంటారా? గట్టిగా ముడి వేసుకునే ఉంటున్నారట. తల్లయ్యాక వచ్చిన ఆ మార్పులు గురించి ఇలియానా మాట్లాడుతూ – ‘‘మా చిన్నోడి చేతికి జుట్టు దొరికితే అంతే సంగతులు. అందుకే దాదాపు ముడి వేసుకునే ఉంటున్నాను’’ అంటూ ఆ ఫొటోను కూడా షేర్ చేశారు. ఇంకా చెబుతూ – ‘‘అమ్మ అయ్యాక నా లైఫ్ స్టయిల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పటివరకూ ఒక రకంగా.. ఇప్పుడు ఒక రకంగా. నాకు నేనే పరాయిదానిలా అనిపిస్తున్నాను. తల్లయ్యాక కొంతమంది త్వరగా కోలుకుని, పనిలో (కొందరు హీరోయిన్లు సినిమాలు చేయడం గురించి) పడిపోతారు. కానీ నేను అంత త్వరగా కమ్‌బ్యాక్ కాలేను. అయితే ఎప్పటికైనా రావడం ఖాయం. కాకపోతే త్వర త్వరగా కాకుండా నాకు కుదిరినట్లు మెల్లిగా వర్కవుట్స్ చేసుకుంటూ, పూర్వపు శక్తి తెచ్చుకున్నాకే వస్తాను. ఇలా ఇంటికి, నా బిడ్డకి అంకితం కావడం నాకు ఏమాత్రం బాధగా లేదు. ఎందుకంటే అన్నింటికన్నా నా జీవితంలోకి వచ్చిన ఈ అందమైన చిన్నోడు ముందు నాకు ఏదీ పెద్దగా అనిపించడంలేదు. ఇప్పుడైతే ప్రతి రోజూ ఓ 30 నిమిషాలు వర్కవుట్ చేస్తున్నాను. ఆ తర్వాత జస్ట్ ఓ ఐదు నిమిషాలు స్నానం చేసి, నా ఇంటి పనులతో బిజీ అవుతున్నాను. ఒక్కోసారి వర్కవుట్ చేసే వీలు కుదరడంలేదు. అయినా ఫర్వాలేదు. నేను చెప్పాచ్చేదేంటంటే కచ్చితంగా ‘బౌన్స్ బ్యాక్’ అవుతా. అయితే కొంత ఆలస్యంగా..’’ అన్నారు ఇలియానా. ఇదిలా ఉంటే... గత ఏడాది మైఖేల్ డోలన్‌ని పెళ్లాడారు ఇలియానా. అయితే కొన్నాళ్ల పాటు రహస్యంగా ఉంచారు. కుమారుడు పుట్టాక మైఖేల్ పూర్తి ఫొటోను షేర్ చేశారు ఇలియానా. -
ఆన్లైన్ ప్రేమలు.. డేటింగ్ విత్ డిప్రెషన్!
ఆన్లైన్ ప్రపంచంలో ప్రేమలను వెతుక్కోవడం అంటే సముద్రంలో పారబోసుకున్న మంచినీళ్లను దోసిళ్లతో పట్టుకోవాలనుకోవడం లాంటిది. డిజిటల్ యుగంలో ప్రపంచం చిన్నదైనప్పటికీ మనుషుల మధ్య పెరుగుతున్న అంతరాలు ఒంటరితనం వైపుగా పయనిస్తున్నాయి. ఫలితంగా ఒంటరి మనసులు భావోద్వేగాల జడిని కనపడని వ్యక్తులతో పంచుకుంటున్నారు. డేటింగ్ యాప్‌లలో మహిళలు భాగస్వాముల కోసం వెతుకుతూ, వారితో మానసిక అనుబంధాలను పెంచుకొని, కొంతకాలానికి డిప్రెషన్‌కు గురవుతున్నారని, వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది అంటున్నారు మానసిక నిపుణులు. పెరుగుతున్న సమస్య... 35 ఏళ్లు దాటిన వసు (పేరుమార్చడమైనది) లక్షల వ్యాపారాన్ని సులువుగా నిర్వహించే స్టార్టప్‌ను రన్ చేస్తుంది. కానీ, మానసిక సంబంధాన్ని సరిగా నిర్వహించలేక డిప్రెషన్ బారిన పడింది. వసు తల్లి ఈ విషయాన్ని చెబుతూ ‘నా కూతురు సొంతంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతో పెళ్లి విషయంలో ఆలస్యం చేసింది. సెటిల్ అయ్యాక ఇక పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో డేటింగ్ యాప్‌లో ఒక అబ్బాయిని ఇష్టపడింది. అతను కూడా నా కూతురితో రోజూ ఆన్లైన్లో మాట్లాడుతుండేవాడు. ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్, వీడియో కాల్స్ చేసుకునేవారు. కానీ, కలవడానికి దూరంగా ఉండేవాడు. నా కూతురు అతనితో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యింది. కానీ, ఆ అబ్బాయి సరైనవాడు అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే, కలుద్దామంటే అతను చూడటానికి రావడం లేదు. నా కూతురిని అతని నుంచి దూరంగా ఉంచాలంటే ఏం చేయాలో తెలియట్లేదు’అనేది ఆమె ఆవేదన.‘వర్చువల్ ప్రపంచంలో ప్రేమలు వెతికేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతున్న ఈ సమయంలో కూతుళ్ల పట్ల తల్లుల ఆందోళన కూడా పెరుగుతోంది’ అంటున్నారు రిలేషన్షిప్ కౌన్సెలర్ డాక్టర్ మాధవీ సేథ్. ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు. తెలివిగా వ్యవహరించాలి... ఈ రోజుల్లో తల్లులు చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కూతుళ్లు బాగా చదువుకుంటూ, బిజినెస్ ఉమెన్‌గా నిలదొక్కుకుంటున్నవారున్నారు. వారికి తమ మంచి చెడులు బాగా తెలుసు. అందుకని, వాళ్లు చాటింగ్ చేయడాన్ని లేదా అబ్బాయితో మాట్లాడడాన్ని నిషేధిస్తే మీ మాట వినరు. నిఘా పెడితే మీ పై నమ్మకం కోల్పోతారు. నమ్మకాన్ని గెలుచుకోవడం ద్వారా మాత్రమే మీరు మీ కూతురిని అర్థం చేసుకోగలరు. సమయం ఇవ్వండి.. స్త్రీ ఎంతటి సమర్థత, విజయం సాధించినా ప్రేమ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కాబట్టి ఆమె అవతలి వ్యక్తి లోపాలను చూడలేదు. కానీ, తెలివిగా ఆమెకు నిజం చెప్పాలి. దీని కోసం మీరు మీ కుమార్తెతో సమయం గడపడం అవసరం. మొదట ఆమె ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అవును అయితే ఆ విషయం గురించి ప్రేమగానే మాట్లాడాలి. అబ్బాయిని ఇంటికి పిలవమని, అతని తల్లిదండ్రులను కలవడానికి ప్లాన్ చేయమని చెప్పాలి. తర్వాత నెమ్మదిగా సాక్ష్యాధారాలతో ఆ అబ్బాయి గురించి నిజాలను కూతురికి చెప్పాలి. నిజానికి ఈ విషయాలు చెప్పాలంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ‘ఆమె’ ఒంటరితనం ఫీలవుతుంది. ఆమెకు మీ ప్రేమపూర్వక మద్దతు అవసరం. ప్రతి పరిస్థితిలో మీరు ఆమెతో ఉన్నారని మీ కుమార్తెకు భరోసా ఇవ్వండి. వీలైతే మీ కూతురిని కొంతకాలం దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్లండి. దీనివల్ల ఆమె మానసిక స్థితిలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. వర్చువల్ ప్రపంచం నుండి బయటకు రండి... ఆన్లైన్ ప్రేమ కోసం వెతుకుతున్న యువత వర్చువల్ ప్రపంచం నుండి బయటపడి జనంతో కలిసి΄ోవాలి. ఒకటి లేదా రెండు రోజులు ఆన్లైన్ చాటింగ్ అవతలి వ్యక్తి గురించి ఎక్కువ సమాచారాన్ని అందివ్వవు. డేటింగ్‌యాప్‌లలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాస్తవ ప్రపంచంలో నిజమైన ప్రేమలను వెతుక్కోవాలి. ఒకరికొకరు పరస్పరం కలిసి మాట్లాడుకోవడంలో సాంత్వన ΄÷ందుతారు. ఇటువంటి వాటిలో మోసం, భయం ఉండవు. ప్రేమ సంబంధాలలో నమ్మకం ముఖ్యం. వర్చువల్... నిజాలు... లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధన ప్రకారం దాదాపు 70 శాతం మంది డేటింగ్ యాప్‌లలో భాగస్వాముల కోసం వెతుకుతున్న వ్యక్తులు డిప్రెషన్‌కు గురవుతున్నారనీ, అది వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోందని తేలింది. ఈ రోజుల్లో వ్యక్తులు తరచుగా సంబంధాలను వదులుకోవడానికి చాలా త్వరపడుతుంటారు. ఎందుకంటే, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఆ దిశగా అన్వేషణ చేయడం కూడా ఇందుకు కారణం అవుతుంటుంది. కోవిడ్ లాక్డౌన్ మార్పులు కూడా ఈ స్థితికి బాగా కారణమైంది. ఇంటి నుండి పని మొదలు డేటింగ్ యాప్‌లో రొమాన్స్ చేయడానికి ఓ కొత్తమార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. మరికొన్ని సూచనలు.. ∙ఒంటరిగా ఉండటం వల్ల కలిగే ప్రతికూలతలపై దృష్టి సారించే బదులు మీరు ఆనందించే అంశాలు, అది తెచ్చే స్వేచ్ఛపై దృష్టి పెట్టాలి ∙జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం, అభిరుచులవైపు మనసును మళ్లించాలి. కుటుంబం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సామాజికంగా కలవాలి... ► ఆన్లైన్ డేటింగ్లో మరొక వ్యక్తి జీవితాన్ని, సంబంధాలను, వివరాలను ఎప్పటికీ తెలుసుకోలేరు. సోషల్ మీడియా ΄ోస్ట్‌లో సంతృప్తికరమైన సంబంధంలా కనిపించేది నిజ జీవితంలో చాలా భిన్నంగా కనిపించవచ్చు ► ఒంటరిగా ఉన్నప్పుడు వర్చువల్ మీట్–అప్‌లను కూడా స్నేహితులతోప్లాన్ చేయడం మంచిది ►వారానికి కొన్నిసార్లు మీ ప్రియమైన వారితో ఫోన్లో చాట్ చేసినా, ఆన్లైన్లో ఇంటరాక్ట్ అవుతున్నా మీ ఒంటరితనం అనే భావన దూరం అవుతుంటుంది ►స్వచ్ఛంద సేవ, స్థానిక స్పోర్ట్స్ క్లబ్‌లలో పాల్గొనడం, రీడర్స్ క్లబ్.. వంటివి ఏర్పాటు చేయడం వల్ల ఒంటరితనం దూరం అవడమే కాదు, మనసులో ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం కూడా దొరకవచ్చు ► జీవితం ఒక రేస్ కాదు. ఒక నిర్దిష్ట వేగంతో జీవితంలోని మైలురాళ్లను చేరుకోవాల్సిన అవసరం లేదు. అన్నింటికన్నా ముందు మీకు మీరే ప్రియమైనవారని గుర్తుచేసుకోండి. డేటింగ్ యాప్‌లలోనే కాదు మీ ఆసక్తులు, లక్ష్యాలు, విలువలు పంచుకునే ఒంటరి వ్యక్తులు మీ చుట్టూ పుష్కలంగా ఉన్నారనే విషయం గ్రహించాలి. – డాక్టర్ మాధవీ సేథ్, రిలేషన్షిప్ కౌన్సెలర్ -
ముంచెత్తుతున్న మాంద్యం
ఒకవైపు యుద్ధాలు. మరోవైపు పర్యావరణ మార్పులు. కారణాలేమైతేనేం... ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవరపరుస్తోంది... ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తగ్గుదల నమోదైతే సాంకేతికంగా దాన్ని మాంద్యం కిందే పరిగణిస్తారు. 2023 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి జపాన్, బ్రిటన్ రెండూ ఈ మాంద్యం బారిన పడ్డాయి. ఇవి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో ఈ పరిణామం సర్వత్రా చర్చనీయంగా మారింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు ప్రస్ఫుటమవున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే మాంద్యం బారిన పడ్డవి కొన్ని కాగా మరికొన్ని అతి త్వరలో ఆ ముప్పు దిశగా సాగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. జపాన్, బ్రిటన్‌తో పాటు ఐర్లండ్, ఫిన్లండ్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో సాంకేతిక ఆర్థిక మాంద్యం బారిన పడ్డాయి. ఐర్లండ్ జీడీపీ మూడో త్రైమాసికంలో 0.7 శాతం తగ్గగా నాలుగో త్రైమాసికంలో ఇప్పటికే ఏకంగా 1.9 శాతం తగ్గుదల నమోదు చేసింది! ఫిన్లండ్ జీడీపీలో వరుసగా 0.4, 0.9 శాతం తగ్గుదల నమోదైంది. నిజానికి చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చాలా దేశాల నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. అవి వెల్లడయ్యాక సాంకేతిక మాంద్యం జాబితాలోని దేశాల సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోంది. అయితే కనీసం మరో 10 దేశాలు జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ తగ్గుదలను చవిచూశాయి. ఈ జాబితాలో కెనడా, న్యూజిలాండ్‌తో పాటు డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా, ఈక్వెడార్, బహ్రయిన్, ఐస్లాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. వీటిలో డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా మూడో త్రైమాసికంలోనే ఆర్థిక మాంద్యం నమోదు చేశాయి! ఇవేగాక తాజాగా నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదలైన మరో 9 దేశాల్లో కూడా జీడీపీ తగ్గుదల నమోదైంది. వీటిలో ఆరు దేశాల్లో ఇటీవలి కాలంలో జీడీపీ తగ్గుదల నమోదవడం ఇదే తొలిసారి! జీడీపీ తగ్గుదల జాబితాలో జర్మనీ వంటి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉండటం యూరప్‌ను మరింత కలవరపెడుతోంది. ఇది మొత్తం యూరప్ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగో త్రైమాసికంలో యూరో జోన్ జీడీపీ వృద్ధి సున్నాగా నమోదవడం వాటికి మరింత బలం చేకూరుస్తోంది. ఫ్రాన్స్ కూడా మాంద్యం బాట పడుతున్న సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ భారత్‌పై ప్రభావమెంత...? ఆర్థిక వృద్ధి విషయంలో భారత్‌కు ప్రస్తుతానికి పెద్ద సమస్యేమీ లేదు. మూడో త్రైమాసికంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. నాలుగో త్రైమాసిక అంచనా 6 శాతంగా ఉంది. కాకపోతే ప్రపంచీకరణ యుగంలో ప్రపంచవ్యాప్త పరిణామాలు భారత్‌పైనా కచి్చతంగా ప్రభావం చూపనున్నాయి. పైగా మన మొత్తం ఎగుమతుల్లో 10 శాతం వాటా మాంద్యం జాబితాలోని ఆరు పెద్ద దేశాలదే! వీటిలో బ్రిటన్‌కు 11 బిలియన్ డాలర్లు, జర్మనీకి 10 బిలియన్ డాలర్ల మేరకు మన ఎగుమతులున్నాయి. సేవలు, ఐటీ రంగంలో అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటన్నది తెలిసిందే. ఇక మాంద్యం కారణంగా ఆయా దేశాల్లో నమోదయ్యే ధరల పెరుగుదల మన దిగుమతులపైనా ప్రభావం చూపనుంది. మన దిగుమతుల్లో మాంద్యం బారిన పడ్డ జపాన్, ఆ ముప్పున్న జర్మనీ వాటా చెరో 17 బిలియన్ డాలర్లు! -
Moushmi Kapadia: ఎడారి చీకటి నుంచి వెన్నెల వెలుగులోకి...
‘మీ బిడ్డ నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని వైద్యులు చెప్పినప్పుడు ఎత్తైన చోటు నుంచి చీకటిలోయల్లో పడిపోయినట్లు తల్లడిల్లి పోయింది . మూడు సంవత్సరాలు డిప్రెషన్ చీకట్లో కూరుకుపోయిన మౌష్మి ఒక్కొక్క అడుగు వేస్తూ వెలుగుదారిలోకి వచ్చింది. ఆట–పాటలతో తనలో ఉత్సాహాన్ని నింపుకొంది. ఆ ఉత్సాహాన్ని శక్తి చేసుకుంది. గా దేశాన్ని చుట్టి వచ్చింది. గా ఎన్నో సాహసాలు చేసింది ఇంటి గడప దాటలేడు అనుకున్న కుమారుడికి ప్రపంచం చూపుతూ ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తోంది మౌష్మి కపాడియా... మౌష్మి కపాడియా కుమారుడు ఆర్ఎస్ఎమ్డీ) అని నిర్ధారించిన వైద్యులు ‘ఇది నయం చేయలేని వ్యాధి’ అన్నారు. ఆ బాధ మాటలకు అందనిది. తట్టుకోలేనిది. తనలో తాను ఎంతో కుమిలిపోయింది మౌష్మి. పిల్లాడికి సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు, ఎలా కేర్ తీసుకోవాలో వివరించారు వైద్యులు. వేదాన్షును తీసుకొని దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త ప్రియేష్ దగ్గరకు వెళ్లింది. మూడేళ్ల వయసులో వేదాన్ష్ కు గురయ్యాడు. ఐసీయూలో ఉన్న తన బిడ్డను చూసి కుప్పకూలిపోయింది మౌష్మి. ఆ భయానకమైన రోజు ఇప్పటికీ తన కళ్లముందే కదలాడుతున్నట్టు ఉంటుంది. బిడ్డ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియదు. తాను చేయగలిగిందల్లా దూరం నుంచి బిడ్డను చూస్తూ మనసులో ఏడ్వడం మాత్రమే. ఆశ కోల్పోయిన వైద్యులు... ‘దేవుడిని ప్రార్థించండి. మేము మా వంతు ప్రయత్నం చేశాం’ అన్నారు. ఈ మాటలు తనను మరింత కృంగిపోయేలా చేశాయి. వెంటిలేటర్‌పై అయిదురోజులు ఉన్నాడు వేదాన్షు. ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఒకరు మెరుగైన చికిత్స కోసం ఇండియాకు వెళితే మంచిది అని సలహా ఇచ్చాడు. అతడి సలహా ప్రకారం బిడ్డను తీసుకొని భర్తతో కలిసి ముంబైకి వచ్చింది మౌష్మి. అబ్బాయిని ఇంటికి తీసుకువెళ్లిన రోజును గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ వణికిపోతుంది మౌష్మి. ‘ఇరవై ఏళ్ల క్రితం దుబాయ్‌లో వైద్యసదుపాయాలు అంత బాగాలేవు. శ్వాస తీసుకోవడానికి అవసరమైన ప్రత్యేక యంత్రాలు లేవు’ అని దుబాయ్‌లో ఆనాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. ముంబైలోని హాస్పిటల్లో కొన్నిరోజులు ఉన్న తరువాత వేదాన్షు పరిస్థితి మెరుగుపడింది. ఆశాదీపం ఏదో కనిపించి ఆ క్షణంలో ధైర్యం ఇచ్చింది. అయితే వైద్యులు మాత్రం... ‘నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని చెప్పారు. బలహీనమైన ఊపిరితిత్తుల వల్ల వేదాన్షు ఎన్నోసార్లు నిమోనియా బారిన పడ్డాడు. ‘ఇంటి నుంచి ఆస్పత్రి–ఆస్పత్రి నుంచి ఇంటికి’ అన్నట్లు ఉండేది పరిస్థితి. కొంత కాలం తరువాత మరో బిడ్డకు జన్మనిచ్చింది మౌష్మి. ఇది మౌష్మి జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. డిప్రెషన్ అనే చీకట్లోకి తీసుకెళ్లింది. ‘అకారణంగా కోపం వచ్చేది. చీటికిమాటికి చిరాకు పడేదాన్ని. తలుపులు గట్టిగా వేసేదాన్ని. నేను డిప్రెషన్లో ఉన్నాను అనే విషయం అప్పుడు తెలియదు. ఇలా ఎందుకు చేస్తున్నాను? అని నా గురించి నేను ఆలోచించే పరిస్థితిలో లేను. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒకరు కౌన్సిలింగ్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. అయితే మందుల ప్రభావంతో ఆమె బరువు పెరిగింది. ఆ బరువు మోకాళ్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి’ అని చెప్పారు వైద్యులు. అలా తన ఫిట్నెస్ జర్నీ మొదలైంది. కొత్త జీవితానికి మొదటి అడుగు పడింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆడడం మొదలు పెట్టింది. ఆడుతున్న సమయంలో తన మూడ్ చేంజ్ అవుతున్నట్లు, ఉత్సాహం వచ్చి చేరుతున్నట్లు అనిపించింది. జుంబా క్లాసులలో కూడా చేరి మరింత ఉత్సాహాన్ని పెంచుకుంది. మూడేళ్లపాటు డిప్రెషన్‌తో పోరాడి బయట పడిన మౌష్మి ఇద్దరు బిడ్డలను కంటి పాపల్లా చూసుకోవాలనుకుంది. ‘గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని బెస్ట్ మామ్ కావాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. మూడు సంవత్సరాలుగా తనను వెంటాడిన నిరాశానిస్పృహలు, విషాదం కోపం లాంటి వాటి నుంచి బయటపడిన తరువాత పిల్లలతో హాయిగా గడిపే కాలం, పిల్లలే నా ప్రపంచం అనే కల కన్నది. బైక్‌పై దేశాన్ని చుట్టి రావాలి... ఎత్తైన పర్వతశిఖరాలను అధిరోహించాలి అనేది తన కల. పీడకలలాంటి జీవితం నుంచి బయటపడ్డ మౌష్మి కపాడియా తన కలను నిజం చేసుకుంది. పర్వతారోహణకు సంబంధించి ఎన్నో సాహసాలు చేసింది. ఇంటికే పరిమితం అవుతాడనుకున్న వేదాన్షుకు ప్రపంచాన్ని చూపింది. ‘విషాదం తప్ప అతడికి తోడు ఏదీ లేదు’ అని ఇతరులు సానుభూతి చూపే సమయంలో ‘నిరంతరం ఆనందమే నా బలం’ అని ధైర్యంగా ముందుకువెళ్లేలా చేసింది. బిడ్డతో కలిసి 21 దేశాలకు వెళ్లి వచ్చిన మౌష్మి కపాడియా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంది. సవాళ్లను అధిగమించేలా... వేదాన్ష్లో వయసుకు మించిన పరిణతి కనిపిస్తుంది. ఓటమికి తలవంచని వేదాన్షు నోటి నుంచి తరచుగా వచ్చే మాట ‘హ్యాపీ ఎబౌట్ ఎవ్రీ థింగ్ అండ్ శాడ్ ఎబౌట్ నథింగ్’ ‘జీవితం మన ముందు ఎన్నో సవాళ్లు పెడుతుంది. వాటిని అధిగమిస్తామా లేదా అనేదానిపైనే మనం ముందుకు వెళ్లే దారి నిర్ణయం అవుతుంది’ అంటాడు వేదాన్ష్. -
overthinkers club: అతిగా ఆలోచన ఆనందానికి శత్రువు
‘నేను చేసింది తప్పేమో’ ‘నేను చేసిన పని వల్ల ఇలా అవుతుందేమో’ ‘వాళ్లు అలా చేస్తే ఏం చేయాలి?’ ‘నా పరువు పోతుందేమో’... చిన్న చిన్న కారణాలకు కూడా ఎంతో ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు కొందరు. దీనిని ‘ఓవర్‌థింకింగ్’ అంటారు మానసిక నిపుణులు. ‘ఇలాంటివారిని ఒకచోట చేర్చి ఆలోచనలు పంచుకుంటే ధైర్యం వస్తుంది’ అంటుంది వర్షా విజయన్. ఈమె మొదలు పెట్టిన ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ ఇలాంటి క్లబ్‌ల అవసరాన్ని తెలియచేస్తోంది. ‘ఓ మీరూ అంతేనా?’ అంది ఒక మహిళ ఆ పార్క్‌కు వచ్చిన మరో మహిళతో. తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వర్షా విజయన్ ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ను ప్రారంభించింది. ఇదేదో ఒక భవంతో, క్లినిక్కో కాదు. పార్కులో కొంతమంది కలవడమే. సోషల్ మీడియా ద్వారా ఈ క్లబ్ గురించి ఆమె ప్రచారం చేసింది. ‘ప్రతి దానికీ తీవ్రంగా ఆలోచించే మనం ఈ ఆలోచనల నుంచి బయటపడదాం రండి’ అనే ఆమె పిలుపునకు స్పందించిన స్త్రీ, పురుషులు రకరకాల వయసుల వాళ్లు వారానికి ఒకసారో నెలలో రెండుసార్లు కలవసాగారు. ‘జీవితంలో మార్పులు సహజం. కాని జరగబోయే మార్పు గురించి చదువు, ఉద్యోగం, వివాహం, విడాకులు, పిల్లల ఆరోగ్యం లేదా తల్లిదండ్రుల చివరి రోజులు... వీటి గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. ఆ ఆలోచనలు పాజిటివ్ వైపు కాకుండా నెగెటివ్ వైపుగా వెళ్లడంతో ఆందోళన చెందుతుంటారు. దాని వల్ల డిప్రెషన్ వస్తుంది. అన్నింటికీ మించి ఏ నిర్ణయమూ జరక్క ఏ పనీ ముందుకు కదలదు. వర్తమానంలో ఉండే ఆనందాన్ని అనుభవించక ఎప్పుడో ఏదో నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనతో బాధ పడుతుంటారు ఓవర్‌థింకర్లు’ అంటుంది వర్షా విజయన్. ఆలోచన.. అతి ఆలోచన ‘ఆలోచన మంచిదే. కాని అతి ఆలోచన మంచిది కాదు’ అంటుంది వర్షా విజయన్. ఓవర్‌థింకర్ల క్లబ్‌కు హాజరైన వారు ఒకరి మాటల్లో మరొకరు తెలుసుకునే విషయం ఏమిటంటే తమ చేతుల్లో లేని వాటి గురించి కూడా అధికంగా ఆలోచించడం. ఉదాహరణకు ఎప్పుడో పెట్టుకున్న శుభకార్యం రోజు వాన పడితే... వాన పడితే... వాన పడితే అని ఆలోచించడం. వానను ఆపడం మన చేతుల్లో లేదు. పడితే పడుతుంది... లేకపోతే లేదు. పడినప్పుడు అందుకు తగ్గ సర్దుబాట్లతో పనులు అవసరం అవుతాయి. అలా అనుకుని వదిలేయాలిగాని అదే పనిగా ఆలోచించడం ఆరోగ్యం కాదు. దాని వల్ల ఇవాళ్టి ఆనందాలు మిస్ అవుతాయి. ధ్యాస మళ్లించాలి ఓవర్‌థింకర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెరుగ్గా ఉండొచ్చు అంటుంది వర్షా విజయన్ ► అతిగా ఆలోచించే చాలా విషయాలు పడే భయాలు దాదాపుగా నిజం కావు. పిల్లల్ని స్కూల్‌బస్ ఎక్కించాక దానికి ప్రమాదం జరిగితే.. ప్రమాదం జరిగితే అని ఆలోచించడం మంచిది కాదు. అలా లక్షసార్లలో ఒకసారి జరుగుతుంది. ఆ ఒకసారి గురించి అతి ఆలోచన చేయకూడదు ► ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఏదో ఉన్నంతలో బెస్ట్ చేద్దాం... చేశాం అని ముందుకెళ్లాలి. ఏదో ఒక మేరకు సంతృప్తి చెంది పని జరిగేలా చూడాలి ► ఆలోచనలు శ్రుతి మించుతుంటే స్నేహితులతో మాట్లాడాలి. చెప్పుకోవాలి. కొత్త పనులేవైనా నేర్చుకుని ధ్యాస మళ్లించాలి ∙సోషల్ మీడియాలో పనికిమాలిన పరిజ్ఞానం, వీడియోలు తగ్గించాలి ► ఈ క్షణంలో ఉండటం ప్రాక్టీస్ చేయాలి. అందుకు యోగా ఉపయోగపడుతుంది ► అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు అనే వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. సమస్య ఎదురైనప్పుడు చూసుకుందాంలే అనుకుని ధైర్యంగా ఉండాలి. ఓవర్‌థింకర్ల లక్షణాలు ► ఆత్మవిమర్శ అధికంగా చేయడం ► ఒక పని పూర్తిగా లోపరహితంగా చేయాలనుకోవడం (పర్ఫెక్షనిజం) ► జరిగిపోయిన ఘటనలు, మాటలు తలచుకుని వాటిలో ఏమైనా తప్పులు జరిగాయా, పొరపాట్లు జరిగాయా, వాటి పర్యవసానాలు ఏమిటి అని తల మునకలు కావడం ► ప్రయాణాల్లో ప్రమాదాలు ఊహించడం ► శుభకార్యాలప్పుడు అవి సరిగ్గా జరుగుతాయో లేదోనని ఆందోళన చెందడం ► చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పర్యవసానాలు ఊహించడం ► ఎవరికీ చెప్పుకోక ఆ ఆందోళనల్లోనే రోజుల తరబడి ఉండటం. -
Funday: ఏళ్ల తరబడి వదలని దిగులు.. పరిష్కారం ఏమిటి?
సాగర్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. చాలా చలాకీగా, చురుగ్గా ఉండేవాడు. సేల్స్ టార్గెట్స్ అందుకోవడంలో ముందుండేవాడు. పెళ్లయ్యాక కూడా ఆ ఉల్లాసం, ఉత్సాహం కొనసాగింది. తర్వాతే మెల్లమెల్లగా దూరమవసాగింది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లే కారణమనుకున్నాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా తన మానసిక పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రమోషన్ వచ్చినా, ఇల్లు కట్టుకున్నా, కార్ కొనుక్కున్నా, ఆఖరుకు బిడ్డ పుట్టినా సాగర్‌లో ఎలాంటి ఆనందం లేదా సంతృప్తి లేదు. క్రమంగా తన పనితీరు కూడా దెబ్బతినసాగింది. టార్గెట్స్ అందుకోలేక పోతున్నాడు. అలా నిరాశ, నిస్పృహలతో మూడేళ్లు తనలో తానే మథనపడ్డాడు. దానివల్ల భార్యాపిల్లలతో కూడా సంతోషంగా ఉండలేకపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్న సాగర్ ఒంటరిగా మారిపోయాడు. దాంతో మరింత నలిగిపోయాడు. ఎప్పుడూ నిస్సత్తువగా అనిపించసాగింది. చిన్నపనికే అలసిపోతున్నాడు. మానసిక గందరగోళానికి లోనవుతున్నాడు. అతని మనసొక యుద్ధభూమిగా మారింది. నిరంతరం నెగటివ్ ఆలోచనల్లో మునిగిపోతున్నాడు. వీటన్నింటివల్ల తనపై తనకు నమ్మకం పోయింది. ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. ఈ లక్షణాలను బట్టి సాగర్ పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్ (పీడీడీ)తో బాధపడుతున్నాడని అర్థమైంది. ఏళ్ల తరబడి దిగులే దీని ప్రధాన లక్షణం. అనేక కారణాలు... మేజర్ డిప్రెసివ్ డిజార్డర్‌కు పీడీడీకి ఉన్న ప్రధానమైన తేడా.. కాలం. కనీసం రెండేళ్లపాటు డిప్రెషన్ ఉంటే దాన్ని పీడీడీగా పరిగణిస్తారు. దీనికి కచ్చితమైన కారణం తెలియదు. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్లానే వివిధ కారణాలుంటాయి. ♦ పీడీడీ ఉన్నవారి మెదడు నిర్మాణంలో, న్యూరో ట్రాన్స్మిటర్లలో మార్పులు ఉండవచ్చు. ముఖ్యంగా ఎమోషన్స్, ఫీలింగ్స్‌ను నియంత్రించే సెరటోనిన్ తగ్గుదల దీనికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ♦ కుటుంబ హిస్టరీ ఉన్న వ్యక్తుల్లో ఇది కనిపిస్తుంది. డిప్రెషన్‌కు కారణమయ్యే జన్యువులను కనుగొనడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ♦ ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం, ఆర్థిక సమస్యలు లేదా అధికస్థాయి ఒత్తిడి వంటి బాధాకరమైన సంఘటనలు కొంతమందిలో పీడీడీని ప్రేరేపిస్తాయి. ♦ నిత్యం తనను తాను విమర్శించుకోవడం, తనపై తనకు నమ్మకం లేకపోవడం, ఇతరులపై ఆధారపడటం, ఎప్పుడూ చెడు జరుగుతుందని ఆలోచించడం వంటి వ్యక్తిత్వ లక్షణాలు, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. నివారణ లేదు, నియంత్రణే మార్గం... పీడీడీని నివారించడానికి కచ్చితంగా మార్గం లేదు. ఇది తరచుగా బాల్యంలో లేదా యుక్తవయస్సులో మొదలవుతుంది. కాబట్టి ఈ పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉన్న పిల్లలను గుర్తించడం వారికి ముందస్తు చికిత్సను అందించడంలో సహాయపడుతుంది. లక్షణాలను తగ్గించడానికి లేదా నిరోధించడానికి సహాయపడే వ్యూహాలు... ♦ ఒత్తిడిని నియంత్రించడానికి, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, ఆత్మగౌరవాన్ని పెంచడానికి చర్యలు మొదలుపెట్టాలి ♦ సంక్షోభ సమయాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు తీసుకోవాలి ♦ వాస్తవిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి ♦ దిగులుగా ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు ♦ తమను తాము ఉత్సాహపరచుకునేందుకు సెల్ఫ్ హెల్ప్ బుక్స్, జీవిత చరిత్రలు చదవాలి ♦ మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ♦ మంచి ఆహారం తీసుకోవాలి, వీలైనంత వరకు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచే ప్రయత్నం చేయాలి ♦ సమస్య ముదిరేవరకు ఆలస్యం చేయకుండా లక్షణాలు కనిపించగానే సైకాలజిస్ట్‌ను కలసి చికిత్స పొందాలి ♦ సైకోథెరపీ ద్వారా మీ ప్రతికూల నమ్మకాలు, ప్రవర్తనలను గుర్తించి, వాటిని సానుకూలమైన వాటితో భర్తీ చేయాలి. నిరాశ, నిస్సహాయత... పీడీడీ లక్షణాలు కనిపించడానికి సాధారణంగా సంవత్సరాలు పడుతుంది. అలాగే ఆ లక్షణాలు పోవడానికీ సంవత్సరాలు పట్టవచ్చు. లక్షణాల తీవ్రత కాలక్రమేణా మారవచ్చు. ఆ లక్షణాలేంటంటే... ♦ నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, విచారం, శూన్యత ♦ రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం. ♦ అలసట, శక్తి లేకపోవడం. ♦ తనను తాను గౌరవించుకోకపోవడం, తనను తాను విమర్శించుకోవడం ♦ ఫోకస్ చేయడంలో సమస్య, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది. ♦ పనులు సక్రమంగా లేదా సమయానికి పూర్తి చేయడంలో సమస్యలు. ♦ చిరాకు, అసహనం లేదా కోపం. ♦ సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం. ♦ గతం గురించి చింత, అపరాధ భావాలు ♦ ఆకలి లేకపోవడం లేదా అతిగా తినడం. ♦ నిద్ర సమస్యలు. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
ఆ సమయంలో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యా: పోకిరి భామ
పోకిరి భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. అయితే గతేడాది పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత ఆగస్టులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడితో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అంతే కాకుండా తన కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు కూడా పెట్టింది. అయితే ప్రస్తుతం బిడ్డతో మాతృత్వం ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా.. ప్రసవం తర్వాత ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపింది. ఆ సమయంలో తన భాగస్వామి మైఖేల్ డోలన్‌కు సపోర్ట్‌గా ఉన్నారని వివరించింది. ఇలియానా మాట్లాడుతూ.. 'ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యా. కానీ ఇంట్లో నాకు మంచి సపోర్ట్ ఉన్నందుకు సంతోషిస్తున్నా. నేను నా గదిలో ఒంటరిగా ఉంటూ ఏడ్చాను. ఇది నిజంగా తెలివి తక్కువ పని నాకు తెలుసు, కానీ నా కొడుకు వేరే గదిలో నిద్రిస్తున్నాడు. అందుకే నేను అతన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. తనను బాగా చూసుకున్నందుకు వైద్యులకు ధన్యవాదాలు చెప్పా' అని అన్నారు. తన భాగస్వామిని గురించి మాట్లాడుతూ.. 'బిడ్డ పుట్టిన తర్వాత మేము కూడా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాం. నేను ఇప్పటికీ వాటిని అనుభవిస్తున్నా. మైక్ ఇంత అద్భుతమైన భాగస్వామి అయినందుకు నేను నిజంగా లక్కీ. అతనికి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి.. ఆ తర్వాత తనే బిడ్డను చూసుకుంటూ ఉంటాడు." అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అయితే పర్సనల్ విషయాల్లో ప్రైవసీ మెయింటెన్ చేస్తున్న ఇలియానా.. తన పార్ట్నర్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కాగా.. ఇలియానా చివరిసారిగా ది బిగ్ బుల్లో అభిషేక్ బచ్చన్‌తో కలిసి కనిపించింది. ప్రస్తుతం ఆమె రణదీప్ హుడా సరసన అన్‌ఫెయిర్ అండ్ లవ్లీలో నటించనున్నట్లు తెలుస్తోంది. -
ఎక్కువగా ఏడుస్తున్నారా? హార్ట్ ఎటాక్ రావొచ్చు, జాగ్రత్త!
కొన్ని మానసిక సమస్యలు శారీరక లక్షణాలతో వ్యక్తమవుతాయి. అయితే ప్రతి శారీరక లక్షణమూ మానసిక సమస్య కారణంగా కాకపోవచ్చు. కానీఙో రిపోర్ట్ ప్రకారం ఔట్ పేషెంట్ విభాగానికి వచ్చే బాధితుల్లో 15 శాతం మందికి అవి మానసిక సమస్యలతో వచ్చిన లక్షణాలు కావచ్చేమోనని గణాంకాలు పేర్కొంటున్నాయి. మానసిక సమస్యలు ఇలా శారీరక లక్షణాలతో ఎందుకు కనిపిస్తాయి, అనేకసార్లు చికిత్స తీసుకున్న తర్వాత కూడా పదే పదే లక్షణాలు కనిపిస్తుంటే కొన్నిసార్లు అది మానసికమైన కారణాల వల్ల కావచ్చేమోనని ఎలా అంచనా వేయవచ్చు లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మానసిక సమస్యలు అనేక శారీరక వ్యవస్థలపై తమ ప్రభావాలను చూపవచ్చు. మానసిక సమస్యల కారణంగా కొన్ని శరీరంలో కనిపించే లక్షణాలెలా ఉంటాయో చూద్దాం. జీర్ణవ్యవస్థ పైన... గట్ ఫీలింగ్ అనే మాటను చాలామంది ఉపయోగిస్తుంటారు. ఫీలింగ్స్ మనసుకు సంబంధించిన భావన కదా... మరి జీర్ణవ్యవస్థ అయిన శారీరకమైన అంశంతో దాన్ని ముడిపెట్టడం ఎందుకు అని అనిపించవచ్చు. ఒక చిన్న పరిశీలనతో దీన్ని తెలుసుకోవచ్చు. ‘సెరిటోనిన్’ అనే స్రావం మానసిక ఉద్వేగాలకు కారణమవుతుంది. నిజానికి మానసిక అంశాలకోసం స్రవించడం కంటే... సెరిటోనిన్ అనేది జీర్ణవ్యవస్థలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆందోళన, వ్యాకులత జీర్ణవ్యవస్థలో మార్పులకు దారితీస్తాయి. దాంతో ఎసిడిటీ, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఆకలి వేయకపోవడం, వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రసరణ వ్యవస్థపై... మనసుకు తీవ్రమైన దుఃఖం కలిగినప్పుడు అది గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన దుఃఖం, ఉద్వేగాలు కొందరిలో గుండెజబ్బులకు దారితీస్తాయి. ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో మానసిక సమస్యలు ఉంటే అది మళ్లీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. మానసిక ఒత్తిడి కలిగినప్పుడు రక్తపోటులోనూ తేడాలు రావడం తెలిసిన విషయమే. ఒళ్లునొప్పులు... మానసిక సమస్యలు కొన్నిసార్లు ఒళ్లునొప్పులు, కండరాల నొప్పుల రూపంలోనే వ్యక్తమవుతుంటాయి. మానసిక సమస్యలకూ, ఒంటినొప్పులకూ సంబంధమేమిటనే కోణంలో పరిశీలించినప్పుడు కొన్ని అంశాలు అబ్బురపరుస్తాయి. ఉదాహరణకు సెరిటోనిన్, అడ్రినలిన్ వంటి రసాయన స్రావాలు మానసిక సమతౌల్యతకు దోహదపడుతుంటాయి. ఈ రసాయనాలను ‘కెమికల్ గేట్స్’గా పరిగణిస్తారు. గేట్ అనేది అనవసరమైన వాటిని రాకుండా నిరోధించడం కోసం అన్నది తెలిసిందే. అలాగే ఈ రసాయన గేట్స్... అనవసరమైన అనేక సెన్సేషన్స్‌ను నివారించి, అవసరమైన వాటినే మెదడుకు చేరవేసేలా చూస్తాయి. కానీ డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు సెరిటోనిన్ వంటి ఈ ద్రవాలు తగ్గడంతో కెమికల్ గేట్స్ తమ కార్యకలాపాలను నిర్వహించలేవు. ఫలితంగా అవసరమైనవే కాకుండా అనవసరమైన సెన్సేషన్లు కూడా ఫిల్టర్ కాకుండా మెదడుకు చేరతాయి. దాంతో డిప్రెషన్ వంటి సమస్యలున్నప్పుడు... కొద్దిపాటి నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉన్నట్లు తోచవచ్చు. చిన్న నొప్పి కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు. ఇలాంటి ఈ పరిణామాన్నే ‘అన్ ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్ సిండ్రోమ్’ అని అంటారు. ఇలాంటప్పుడు దీర్ఘకాలిక వెన్నునొప్పి (క్రానిక్ బ్యాక్ పెయిన్), శరీరంలోని అనేక భాగాల్లో నొప్పులు, మెడనొప్పి, కండరాల నొప్పి వంటివి కలిగే అవకాశముంది. శరీరం లాగే మనసుకూ జబ్బూ.. మన సమాజంలో మానసిన సమస్యలను బయటకు చెప్పుకోలేని సమస్య (స్టిగ్మా)గా చూస్తుంటారు. మానసిక సమస్య అని చెప్పుకోవడం కష్టం కాబట్టి... మనసు వాటిని శారీరక లక్షణాలుగా మార్చి వ్యక్తం చేస్తుంటుంది. అయితే ఇది కాన్షియస్గా జరిగే ప్రక్రియ కాదు. బాధితులకూ / పేషెంట్లకూ ఇలా జరుగుతుందని తెలియదు. అధిక ఒత్తిడి వంటి కొన్ని మానసిక సమస్యలు ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ పనితీరూ తగ్గి అది శారీరక లక్షణాలుగా వ్యక్తమవుతుంది. అందుకే పరీక్షల సమయంలో లేదా పరీక్షలకు ముందు పిల్లల్లో / పెద్దల్లోనూ జ్వరాలు, జీర్ణ సమస్యలు, తలనొప్పి, కడుపునొప్పి, నిద్రలేమి... వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శరీరానికి లాగే మనసుకూ జబ్బు వచ్చే అవకాశముందని గుర్తించి, అది ఏమాత్రం తప్పు కాదని గ్రహించి, తగిన మందులు తీసుకుంటే... ఈ సమస్యలు రావడం తగ్గిపోయి, మాటిమాటికీ డాక్టర్ షాపింగ్ చేస్తూ, డబ్బు, ఆరోగ్యం వృథా చేసుకునే అవస్థలూ తగ్గుతాయి. ∙ -
యువకుడి సెల్ఫ్ ‘రిప్’ పోస్టు..వెంటనే సూసైడ్
కొచ్చి: ఓ ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు బతికుండగానే తనకు తానే శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. అనంతరం కొద్దిసేపట్టికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషాదకర ఘటన కేరళలోని ఆలువాలో చోటు చేసుకుంది. ‘అజ్మల్ షరీఫ్(28) అనే యువకుడు తన ఫొటోకు రిప్(రెస్ట్ ఇన్ పీస్)అని క్యాప్షన్ పెట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తర్వాత కాసేపటికి ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజ్మల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 14 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. సరైన ఉద్యోగం రాలేదన్న కారణంగా అజ్మల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశాం’ అని పోలీసులు తెలిపారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి -
రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్!
స్ట్రాబెర్రీ అంటే ఇష్టంగా తినే వాళ్లకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో రోజూ స్ట్రాబెర్రీలు కనీసం ఎనిమిది తింటే డిప్రెషన్, డిమెన్షియా దరిదాపుల్లోకి కూడా రాదని చెబుతున్నారు. అందుకు సంబంధించిన పరిశోధనలు న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలను సిన్సినాటి యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. వారి పరిశోధనల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలెంటంటే.. సిన్సినాటి యూనివర్సిటీ పరిశోధకుల బృందం సుమారు 50 నుంచి 65 ఏళ్లు ఉన్న వ్యక్తుల సముహాలను రెండు గ్రూప్‌లుగా విడగొట్టారు. ఒక గ్రూప్ మొత్తానికి స్టాబెర్రీలు ఇవ్వగా, ఇంకో గ్రూప్‌కి సాధారణమైన రోజూవారి పళ్లను ఇచ్చారు. అయితే స్ట్రాబెర్రీలు క్రమతప్పకుండా తీసుకున్న గ్రూప్‌లో మెరుగైన జ్ఞాపకశక్తి, మానసిక స్థితి ఉన్నట్లు గుర్తించారు. అలాగే నిస్ప్రుహ లక్షణాలను అధిగమించినట్లు తెలిపారు. మిగతా సముహంలో మానసిక స్థితి చాలా అధ్వాన్నంగా ఉండటమే గాక డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. మెరుగైన ఫలితాలు కనిపించిన సముహంలో కేవలం ఐదుగురు పురుషులు, సుమారు 25 మంది దాక మహిళలు ఉన్నారని. వారిందరూ మెరుగైన మానసిక స్థితి, మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నారని అన్నారు. 12 వారాల పాటు ఎనిమిది చొప్పున స్ట్రా బెర్రీలు ఇస్తేనే ఇంత మెరుగైన ఫలితం కనిసించిందంటే ఓ కప్పు స్ట్రాబెర్రీలు రోజూ తీసుకుంటే ఇంకెంతో ఫలితం ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ డిమెన్షియా అనేది వ్యాధి కాదు. ఇది ఒకరకమైన మానసిక చిత్త వైకల్యం. సింపుల్‌గా చెప్పాలంటే మెమరీ నష్టం అనొచ్చు. మెదడు గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని కోల్పోవడం. దీనివల్ల దైనందిన జీవితం గందరగోళంగా మారిపోతుంది. ఇది పార్కిన్సన్, అల్జీమర్స్ లాంటిదే కానీ దీనికి చికిత్స లేదు. జస్ట్ మందులతో నిర్వహించగలం అంతే. ఇది తగ్గటం అంటూ ఉండదు. చివరికి ఒకనొక దశలో ఆయా పేషెంట్లకు తినడం అనేది కూడా కష్టమైపోతుంది. ప్రస్తుతం యూకేలో 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి 11 మందిలో ఒకరు ఈ డిమెన్షియా బారినపడుతున్నట్లు సిన్సినాటి పరిశోధకుడు రాబర్ట్ క్రికోరియన్ తెలిపారు. అయితే మనకు అందుబాటులో ఉండే ఈ స్ట్రా బెర్రీ పళ్లల్లో విటమిన్ సీ, మాంగనీస్, ఫోలేట్ (విటమిన్ B9), పోటాషియంలు ఉంటాయి. వీటితో మానసిక సమస్యలకు సంబంధించిన రుగ్మతలను నుంచి సునాయసంగా బయటపడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మందుల కంటే కూడా ఇలా ప్రకృతి ప్రసాదించినవే ప్రభావంతంగా పనిచేస్తాయని, పైగా మన ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు. (చదవండి: ధూమపానంతో క్యాన్సర్ గాక ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!) -
పిల్లల్లో కూడా యాంగ్టయిటీ డిజార్డర్స్ ఉంటాయా?
కవిత, కృష్ణలకు స్వీటీ ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. హైదరాబాద్‌లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది స్వీటీ. అయితే గత నెలరోజులుగా కడుపు నొప్పి అంటూ బాధపడుతోంది. ముద్దుల కూతురు బాధపడుతుంటే చూడగలరా? వెంటనే కార్పొరేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ అన్ని పరీక్షలూ చేశాక ఏమీ లేదని చెప్పి, నాలుగు టాబ్లెట్లు ఇచ్చి పంపారు. ఆ తర్వాత మరో రెండుసార్లూ అలాగే జరిగింది. నాలుగోసారి హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు అక్కడి చైల్డ్ స్పెషలిస్ట్ అసలు సమస్యను గుర్తించారు. పాప ఏ విషయంలోనో ఆందోళన పడుతోందని, అందుకే కడుపునొప్పితో బాధపడుతోందని, సైకాలజిస్ట్‌ని కలవమని చెప్పారు. పిల్లల్లో కూడా యాంగ్టయిటీ డిజార్డర్స్ ఉంటాయా? అని విస్తుపోతూ.. అలా పిల్లలు బాధపడుతుంటే చూడలేమని .. ఏం చేయాలో చెప్పమంటూ కవిత, కృష్ణల్లాగే చాలామంది పేరెంట్స్ సైకాలజిస్ట్ సాయం కోరుతుంటారు. పిల్లల్లో కూడా యాంగ్జయిటీ డిజార్డర్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మంది పిల్లల్లో యాంగ్జయిటీ లక్షణాలు ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. పిల్లలు ఆందోళన ఎదుర్కోవడంలో తల్లిదండ్రులదే ప్రధానపాత్రనీ చాలా అధ్యయనాల్లో స్పష్టమైంది. మీ పిల్లల్లో ఆందోళన కనిపిస్తే మీరేం చేయాలో తెలుసుకుని, ఆచరించండి. తప్పకుండా ఫలితాలు కనిపిస్తాయి. ఆందోళన చెందే పిల్లల్లో కనిపించే లక్షణాలు కడుపునొప్పి, తలనొప్పి అంటూ ఫిర్యాదు చేయడం.. చిన్న చిన్న పనులకు లేదా అసలు ఏ పనీ చేయకపోయినా అలసిపోవడం.. చిరాకు, కోపం ఎక్కువగా ఉండటం.. నిద్రపోవడానికి కష్టపడటం.. ఏకాగ్రత లేకపోవడం.. చిన్న చిన్న విషయాలకే మితిమీరిన ఆందోళన.. కొన్ని విషయాలు లేదా పనులను నివారించడం.. నొప్పులుగా కనిపించే ఆందోళన పిల్లల్లో భయాలు సహజం. కొందరు చీకటికి భయపడితే, మరికొందరు పేరెంట్స్‌కి దూరంగా ఉండాలంటే భయపడతారు. అయితే ఈ భయాలు స్కూలుకు వెళ్లడానికి, ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి, నిద్రపోవడానికి ఎలాంటి ఇబ్బందులూ కలిగించవు. వయసు పెరిగేకొద్దీ చాలామంది పిల్లలు ఈ భయాలను అధిగమిస్తారు. కానీ కొందరిలో అలాగే కొనసాగుతాయి. పిల్లలు తమ భయాలను, ఆందోళనను వివరించలేరు. తమ ఆలోచనల్లోని అహేతుకతను గుర్తించలేరు, నియంత్రించలేరు. దాంతో కడుపునొప్పి, తలనొప్పి, అలసటరూపాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. చిరాకు, కోపం పెరుగుతాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలు ఆందోళన చెందుతున్నారని పేరెంట్స్ గుర్తించాలి. 1. ఇంట్లోని అలారం కొన్నిసార్లు తప్పుగా మోగినట్లే, మెదడులోని అలారం కూడా కొన్నిసార్లు అవసరం లేకపోయినా ఆందోళన చెందేలా చేస్తుందని వివరించండి. అందులో పిల్లల తప్పేమీ లేదని, ఆందోళన చెందడం ‘చెడు’ కాదని చెప్పండి. 2. బిడ్డ ఆందోళన చెందుతున్నప్పుడు పదేపదే ‘ఏమీ కాదు’అని అతిగా భరోసా ఇవ్వకండి. దేనివల్ల ఆందోళన చెందుతున్నారో గుర్తించి, వాటిని నివారించడానికి సహాయం చేయండి. 3. స్కూలు ఎగ్గొట్టడానికి దొంగ వేషాలు వేస్తున్నావంటూ తిట్టకుండా, కొట్టకుండా వాళ్ల బాధ నిజమైనదేనని గుర్తించండి. తన బాధను మీరు అర్థం చేసుకున్నారని తెలపండి. 4. పిల్లల ఆందోళనను గుర్తించి, సానుభూతి అందించిన తర్వాత, వారు ఆ భయాలను ఎదుర్కొనేందుకు అడుగులు వేసేలా చూడండి. అందుకోసం బిడ్డతోపాటు మీరూ పనిచేయండి. 5. పిల్లలు తమ భయాలను విజయవంతంగా ఎదుర్కొన్నప్పుడు లేదా భయాలను ఎదుర్కోవడానికి అడుగులు వేసినప్పుడు మెచ్చుకోండి. ఒక్కొక్క అడుగుతో ఆందోళనను ఎదుర్కోగలవనే భరోసా ఇవ్వండి. 6. చాలామంది పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణంలోని అనిశ్చితిని తగ్గించడం ద్వారా ఆందోళనను నివారించడానికి ప్రయత్నిస్తారు. అందుకే పిల్లల చుట్టూ ఉన్న వాతావరణంలో అనిశ్చితిని వివరిస్తూ దాన్ని వాళ్లు ఎదుర్కొనేందుకు, తట్టుకునేందుకు మీ పిల్లలకు సహాయపడండి. 7. మితిమీరిన నియంత్రణను పాటిస్తున్న తల్లిదండ్రులకు ఆందోళనతో కూడిన బిడ్డ పుట్టే అవకాశం ఉందని పరిశోధన కనుగొంది. మితిమీరిన క్రమశిక్షణ పిల్లల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మీ బిడ్డ రిస్క్ తీసుకోవడానికి, తప్పులు చేయడానికి, సరిదిద్దుకోవడానికి స్వేచ్ఛనివ్వండి. 8. ఇవన్నీ చేశాక కూడా మీ బిడ్డలో ఆందోళన తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని కలవండి. కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా మీ బిడ్డకు సహాయపడతారు. సెకాలజిస్ట్ విశేష్ (చదవండి: చిన్నారులే నడుపుతున్న న్యూస్ చానెల్! వాళ్లే రిపోర్టింగ్, యాంకరింగ్..) -
భార్య కాపురానికి రావడం లేదని.. పురుగుల మందు తాగి..
నల్గొండ: భార్య కాపురానికి రావడం లేదని పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈ ఘటన చందంపేట మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటిగానితండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటిగానితండాకు చెందిన సపావత్ చీన్య(35)కు 13ఏళ్ల క్రితం పోల్యనాయక్తండాకు చెందిన సునీతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సునీత తన తల్లిగారింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన చీన్య మంగళవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా బుధవారం మృతిచెందాడు. జీవితంపై విరక్తితో.. జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన బత్తుల భద్రయ్య(75) 5 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. జీవితం మీద విరక్తి చెంది మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి కుమారుడు బత్తుల సోమరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్. ధర్మ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉరేసుకొని ఆత్మహత్య పెళ్లి కాలేదని జీవితంపై విరక్తితో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలంలోని లింగాల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల గ్రామానికి చెందిన తడకమళ్ల మధుకుమార్(53)కు పెళ్లి కాకపోవడంతో తన ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేకుకొని వివరాలు సేకరించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితో చనిపోతున్నానని మృతుడు రాసిన సూసైడ్ నోట్ లభించినట్లు ఏఎస్ఐ తెలిపారు. మృతుడి సోదరుడు యాదగిరి లక్ష్మీనరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి బలవన్మరణం ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని కేటీ అన్నారం రోడ్డులో గల జాహ్నవి టౌన్షిప్ వద్ద బుధవారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాల కోసం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు?
హైదరాబాద్‌లో గ్రూప్–2 విద్యార్థిని ప్రవల్లిక మరణం ఆత్మహత్యల అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. పరీక్షల్ని ప్రభుత్వం వాయిదా వేయడం వల్లనే ఆమె నిరాశకు గురై చనిపోయిందని కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. పోలీసుల కథనం ప్రకారం శివరామ్ అనే మిత్రునితో ప్రవల్లిక కొన్నాళ్ళుగా ప్రేమలో వుంది. అతను మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యి, నిశ్చితార్థం చేసుకున్నాడు. అది ఆమె మనసును గాయపరిచింది. మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారూ? అనే ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో ముందుకు వస్తుంటుంది. ప్రతి ఆత్మహత్యకూ ఏదో ఒక కారణం వుంటుంది. అలా అనుకుంటే ప్రతి ఆత్మహత్య ప్రత్యేక మైనదే అవుతుంది. వ్యక్తిగతం అవు తుంది. అప్పుడు ఆత్మహత్యలను సూత్రీకరించడం కుదరదు. చర్చించడమూ కుదరదు. ఆత్మహత్యలకు సమాజమే కారణం అని నిర్ధారించినవాడు ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త ఎమిలి డర్ఖేమ్ (1858 – 1917). సామాజిక సంక్షోభం కారణంగానే మను షులు ఆత్మహత్యలు చేసుకుంటారని నిర్ధారిస్తూ 1897లో ఆయన ‘లా సూసైడ్’ శీర్షికతో ఓ ఉద్గ్రంథాన్ని రాశాడు. మనుషులు ఏం కోరుకుంటారూ? అని అడిగితే ఒక్కొ క్కరూ ఒక్కో సమాధానం చెపుతారు. భారీ ఆదాయం వచ్చే ఉద్యోగం, విలాసవంతమైన ఇల్లు, అందమైన భార్య, మొన గాడైన భర్త, రాజ్యసభ సీటు, కేబినెట్లో స్థానం... ఇలా సాగుతుంది కోరికల జాబితా. వీటన్నింటినీ డర్ఖేమ్ కొట్టి పడేస్తాడు. ఈ కోరికలన్నీ పైకి కనిపించే అంశాలు; సారాంశంలో ప్రతి మనిషీ సంఘీభావాన్ని కోరుకుంటాడని చెబుతాడు. అదే మనిషి ప్రాథమిక కోరిక. సమాజంలో సంఘీభావం ఏ స్థాయిలో వుందో కొలవడానికి డర్ఖేమ్ ఒక పరికరాన్ని కనిపెట్టాడు. దానిపేరే ‘ఆత్మహత్య’. సంఘీభావానికీ ఆత్మ హత్యలకూ విలోమానుపాత సంబంధం వుంటుందని ఆయన తేల్చాడు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటే అక్కడ సంఘీభావం తక్కువగా వున్నట్టు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు తక్కువగా వుంటే ఆ సమాజంలో సంఘీభావం ఎక్కువగా వున్నట్టు భావించాలన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాదీ దేశాల వారీగా ఆత్మహత్యల నివేదికను ప్రకటిస్తూ వుంటుంది. వివిధ దేశాల్లో ఏడాదికి లక్ష మందికి 10 నుండి 40 మంది వరకు ఆత్మ హత్యలు చేసుకుంటారు. అయితే ఈ గణాంకాలను కచ్చితమై నవని అనుకోలేము. అనేక కుటుంబాలు ఆత్మహత్యను సామా జిక అవమానంగా భావిస్తాయి. జీవిత బీమా తదితర టెక్నికల్ కారణాల వల్లనూ కొందరు ఆత్మహత్యల్ని దాచిపెడతారు. కొన్ని దేశాల్లో ఆత్మహత్య అనేది శిక్షించదగ్గ నేరం. ఇన్ని కారణాల వల్ల ఆత్మహత్యల గురించి కచ్చితమైన నివేదికలు రావు. అయితే, కొన్ని నిర్ధారణలు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు పనికి వస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం ఆత్మ హత్య చేసుకోవాలని అనుకుంటారు; కానీ పురుషులు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటారు. చదువుకోనివారికన్నా చదువుకున్నవారు, కుటుంబ వ్యవస్థలో వున్నవారికన్నా కుటుంబ వ్యవస్థలో లేనివారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసు కుంటారట! జంతువులు ఒంటరిగా జీవించగలవుగానీ మనుషులు ఒంటరిగా జీవించలేరు. యుద్ధ సమయాల్లో, ఉద్యమాల సందర్భాల్లో మనుషుల మధ్య సంఘీభావం వున్నత స్థాయిలో వుంటుంది. అప్పుడు ఆ సమాజాల్లో ఆత్మహత్యల రేటు చాలా తక్కువగా వుంటుంది. ఆ దశ దాటిపోగానే ఆ స్థాయి సంఘీభావాన్ని పొందలేక గొప్ప నైరాశ్యానికి గురయ్యి చని పోవాలనుకుంటారు. ఎమిలి డుర్ఖేమ్ దృష్టిలో ఆత్మహత్యలకు రెండే కారణాలుంటాయి. మొదటిది అనుబంధాలు; రెండోది ఆంక్షలు. అనుబంధాల వల్ల రెండు రకాలు ఆత్మహత్యలు, ఆంక్షల వల్ల మరో రెండు రకాల ఆత్మహత్యలు జరుగుతాయంటాడు. మొత్తం ఆత్మహత్యలు నాలుగు రకాలని ఆయన వర్గీకరించాడు. మను షుల మీద ప్రేమాభిమానాలు చాలా ఎక్కువయినపుడు వారి కోసం కొందరు స్వచ్ఛందంగా చనిపోవడానికి సిద్ధపడతారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారూ, నక్సలైట్ ఉద్యమ అమరులూ ఈ కోవలోనికి వస్తారు. మనం ఇలాంటి చావుల్ని బలిదానాలు(ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్) అంటాము. మనుషుల మీద ప్రేమాభిమానాలు బొత్తిగా లేన ప్పుడూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. మనుషుల మీద ప్రేమాభిమానాలు లేని మనిషి ఒక అహంతో బతుకుతుంటాడు. బయటి నుండి సంఘీభావం అందక చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి చావును అహంభావ ఆత్మహత్య (ఈగోయిస్టిక్ సూసైడ్) అంటారు. కొందరి మీద ఇంటాబయట ఆక్షలుంటాయి. బట్టలు ఎలా వేసుకోవాలి, తల ఎలా దువ్వుకోవాలి, ఎలా నడవాలి, ఏం చదవాలి, ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి వరకు తల్లిదండ్రులే శాసిస్తుంటారు. కొందరిని ఆఫీసులో పైఅధికారులు వేధిస్తుంటారు. వీటిని తట్టుకోలేక కొందరు మరణానికి సిద్ధపడతారు. వీటిని నిర్బంధ మరణం (ఫాటలిస్టిక్ సూసైడ్) అంటారు. కొన్ని సందర్భాల్లో ‘ప్రభుత్వం చేసిన హత్య’ అంటుంటాం. ఇలాంటివి ఈ కోవలోనికే వస్తాయి. ఆంక్షల్ని, నియమ నిబంధనల్ని అస్సలు పట్టించుకోని వారు కొందరుంటారు. వీరిలోనూ ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటుంది. వీటిని క్రమ శిక్షణ రహిత ఆత్మహత్యలు (అనామిక్ సూసైడ్) అనవచ్చు. ఆత్మహత్యల్ని నివారించడానికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి కొన్ని యాప్‌లు కూడా వున్నాయి. ఆత్మహత్యల్ని నివారించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనది సంఘీభావం. అది వర్తమాన సమాజంలో క్రమంగా కను మరుగైపోతున్నది. ఇది అమానవీయమైన పరిణామం. మను షుల మధ్య సంఘీభావాన్ని నెలకొల్పడానికి అందరూ పూను కోవాల్సిన సందర్భం ఇది. డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు మొబైల్: 90107 57776 -
ఒంటరితనం వేధిస్తుందా? మానసిక ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?
రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) జోడెద్దులా పల్లెల్లో సవారీ చేస్తుండగా.. ఇప్పుడు మానసిక రుగ్మతలూ వెంటాడుతున్నాయి. నిన్నా మొన్నటిదాకా పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ తాజాగా గ్రామీణ ప్రాంతాలకూ తాకడం ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నట్టే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మానసిక ఇబ్బందులతో వస్తున్న వారు ఎక్కువయ్యారని వైద్యులు తెలియజేస్తున్నారు. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం స్క్రీనింగ్ పరీక్షల్లో తేలిందని వారు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో రకరకాల మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వారు వేలాదిమంది ఉన్నట్టు బయటపడింది. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్ వంటి మానసిక జబ్బులతో సతమతమవుతున్నారు. సగటున చూస్తే పురుషుల్లోనే ఎక్కువ మంది బాధితులున్నట్టు వెల్లడైంది. స్కిజోఫ్రీనియా..యాంగ్జైటీలే ఎక్కువగా.. స్కిజోఫ్రీనియా (మనో వైకల్యం), యాంగ్జైటీ (ఆందోళన) ఎక్కువ మందిలో ఉన్నాయి. ప్రతి దానికీ డీలా పడిపోవడం, ఏమవుతుందోనని భయం, ఆందోళన వంటి జబ్బులతో సతమతమవుతున్నారు. వైద్యుల వద్దకు చికిత్సకు వెళ్లాలంటే కూడా ఆత్మన్యూనతగా భావిస్తున్నారు. ఇలాంటి మానసిక వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండటంతో వృత్తిపరంగానూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండోనేషియలో స్కిజోఫ్రెనియా కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక మనదేశంలో సుమారు 3 మిలియన్ల కంటే ఎక్కువమంది స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు. పనిఒత్తిడి, చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందడం వంటివన్నీ మానిసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మానసిక రుగ్మతలకు ప్రధాన కారణాలు ► ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్నకుటుంబాలు రావడంతో వేధిస్తున్న ఒంటరితనం. ► ఆరు సంవత్సరాల వయసు నుంచే సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉండటం. ► మద్యం, ఇతర మత్తుపదార్థాల వినియోగంతో యువకుల్లో మానసిక రుగ్మతలు పెరగడం. ► ప్రైవేటు లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో విపరీతమైన ఒత్తిడి. ► సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ వంటి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరగడం. ► వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే జీవనశైలి జబ్బులకు గురవడం. ► ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో చిన్నారుల్లో మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం. ఒత్తిడిని అధిగమిద్దాం ఇలా.. మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిడులకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వృత్తిపరమైన శిక్షణతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు. వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వృత్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకుని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చికాకులను దూరం పెట్టడం ద్వారా సంతోషమైన జీవితాన్ని గడపాలి. -
'సలార్' బ్యూటీ.. డిప్రెషన్ సమస్యకి చిట్కాలు చెప్పింది!
మానసిక ఒత్తిడి(డిప్రెషన్).. ప్రస్తుతం చాలామందిని బాధిస్తున్న సమస్య ఇది. కారణాలు ఏంటనేది పక్కనబెడితే దీని బారిన పడి ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు హీరోయిన్ శ్రుతిహాసన్ అద్భుతమైన చిట్కాలు చెప్పింది. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మానసిక ఒత్తిడి గురించి ఎవరూ బయటకు చెప్పడం లేదు. నేను మాత్రం వీటి గురించి డైరీలో రాసుకుంటాను. రోజూ జిమ్ చేస్తారు. దీని వల్ల శరీరంలోని రసాయనాలు, హార్మోనులు సమతుల్యం అవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి సహకరిస్తుంది. రోజూ నచ్చిన వారితో మాట్లాడతాను. వారి మనసుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో నా గురించి మాట్లాడుకునే విషయాల్లో మంచి-చెడు గురించి ఆలోచిస్తానని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ప్రభాస్ 'సలార్'లో హీరోయిన్. అలానే హాలీవుడ్ మూవీ 'ది ఐ'లోనూ యాక్ట్ చేసింది. (ఇదీ చదవండి: అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్) సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
ఆ తిండితో మానసికంగానూ ముప్పే!
సాక్షి, హైదరాబాద్: అ్రల్టా–ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్) (ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) తరచుగా తీసుకోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలకు దోహదం చేస్తుందని గతంలో చేసిన అధ్యయనాలు తేల్చాయి. అయితే వీటి వల్ల మానసిక సామర్థ్యం సైతం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజుకు పలుమార్లు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారు.. ఈ ఆహారాలను అరుదుగా లేదా ఎప్పుడూ తీసుకోని వారితో పోలిస్తే మానసిక ఆరోగ్యంతో బాధపడే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని మన దేశానికి చెందిన 30 వేల మంది వ్యక్తులను భాగస్వాముల్ని చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక శ్రేయస్సును అధ్యయనం చేసే అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్‌లో ఈ అధ్యయనం ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అధ్యయన ఫలితాలతో ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు. డిప్రెషనే కాదు అంతకు మించి.. ‘ఈ తరహా ఆహారానికి ఉన్న మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని, దీని అధిక వినియోగం వల్ల డిప్రెషన్ మాత్రమే కాదు అంతకు మించిన మానసిక ఆరోగ్య క్షీణత సంభవిస్తున్నట్టుగా గమనించాం..’అని సేపియ¯న్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిస్ట్ తారా త్యాగరాజన్ చెబుతున్నారు. వీటి వినియోగం వల్ల కలిగే మానసిక సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 18–24 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతిరోజూ అలాంటి ఆహారాన్ని తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. యూపీఎఫ్ అంటే ఏమిటి? యూపీఎఫ్‌ను సరైన విధంగా నిర్వచించడం కొంతవరకు కష్టమే. అయితే సగటు గృహాలలో తయారు కాని, ఇంటి వంటగదికి ఆవల ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలను యూపీఎఫ్‌గా తారా త్యాగరాజన్ నిర్వచిస్తున్నారు. ఎరేటెడ్ డ్రింక్స్ (కొన్నిరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, ప్యాక్ చేసిన చిప్స్, స్నాక్స్, మిఠాయిలు ఈ కోవలోకి వస్తాయి. దీర్ఘకాలం మన్నేందుకు గాను సాల్ట్, సుగర్, ఫ్యాట్ వంటివి అధికంగా కలిపేవి ప్రాసెస్డ్ ఫుడ్ కాగా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్లు ఇతరత్రా కూడా జత కలుస్తాయి. రెడీ టూ ఈట్ మీల్స్, తీపి పానీయాలు వంటివన్నీ వీటిలో భాగమే. పెరుగుతున్న వినియోగం మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో యూపీఎఫ్ కూడా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్‌తో కలిసి గత ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక వీటి వినియోగం ఎంతలా ఉందో స్పష్టం చేసింది. కోవిడ్ సందర్భంగా 2020లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత అంతకు ముందుకన్నా రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఈ విజృంభణ ఇలాగే కొనసాగితే 2032 కల్లా పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న రకరకాల ఆరోగ్య సమస్యలతో మన దేశం కూడా సతమతమవడం తథ్యమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలల్లో నిషేధించాలి గత నెలలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సంస్థలు సంయుక్తంగా.. మన దేశంలో యూపీఎఫ్‌ల వినియోగం–ప్రభావంపై నిర్వహించిన పరిశోధన పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థలు రూపొందించిన నివేదిక.. అన్ని రకాల జంక్ ఫుడ్స్, కుకీస్, చాకొలెట్స్, కన్ఫెక్షనరీ, హెల్త్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా వంటి ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి విక్రయాలను నిషేధించాలని, ఈ ఉత్పత్తులపై భారీ జీఎస్టీని విధించాలని కూడా నివేదిక సూచించింది. -
విపరీతమైన మూడ్ స్వింగ్స్.. బైపోలార్ డిజార్డర్‌కి కారణం అదేనా?
గోపీనాథ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య సునీత కూడా అదే కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలు. హైదరాబాద్ శివార్లలోని గేటెడ్ కమ్యూనిటీలో ప్రశాతంగా ఉంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో గోపీనాథ్ ప్రవర్తనలో విపరీతమైన మార్పు కనిపిస్తోంది. తాను చేస్తున్న జాబ్ తన సామర్థ్యానికి ఏమాత్రం సరిపోనిదని, త్వరలోనే తాను సొంత కంపెనీ మొదలుపెట్టి బిల్ గేట్స్‌తో పోటీ పడతానని చెప్తున్నాడు. మొదట్లో సునీత.. సరదాగా అంటున్నాడనుకుంది. కానీ ఒకరోజు హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. అదేంటని అడిగితే కంపెనీ మొదలు పెడుతున్నానని చెప్పాడు. స్నేహితులు కొందరిని కూడగట్టుకుని కంపెనీ మొదలుపెట్టాడు. దానికోసం పలుమార్లు అమెరికా, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా తిరిగి వచ్చాడు. ఆ క్రమంలో సేవింగ్స్ అన్నీ ఖర్చుపెట్టేశాడు. కూడగట్టుకున్న ఆస్తులు కూడా అమ్మేశాడు. స్నేహితులతో పెట్టుబడులు పెట్టించాడు. అతనూ భారీగా అప్పులు చేశాడు. సునీత వారిస్తున్నా, గొడవపడినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆర్నెల్ల తర్వాత గోపీనాథ్ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోయింది. కంపెనీ ఆలోచన పక్కకు పడేశాడు. ఎక్కడికీ వెళ్లడంలేదు, ఎవ్వరితోనూ కలవడం లేదు. తన గదిలో కూర్చుని దిగులు పడుతున్నాడు. సమస్య ఏమిటని సునీత అడిగినా సమాధానం లేదు. ఈ దశలో ఫ్రెండ్స్ సలహా మేరకు అతన్ని కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చింది సునీత. విపరీతమైన మూడ్ స్వింగ్స్.. గోపీనాథ్ బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని మొదటి సెషన్లోనే అర్థమైంది. సైకో డయాగ్నసిస్ అనంతరం అది నిర్ధారణైంది. వెంటనే సైకో ఎడ్యుకేషన్, సైకోథెరపీ ప్రారంభించి, మందులకోసం సైకియాట్రిస్ట్‌కి రిఫర్ చేశాను. విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఈ వ్యాధి లక్షణం. మేనియా ఎపిసోడ్లో ప్రపంచాన్ని జయిస్తాం, కొండలనైనా పిండి చేస్తామనే ఉత్సాహం చూపిస్తారు. డిప్రెసివ్ ఎపిసోడ్లో అంతా కోల్పోయినట్లు, ఇక జీవితమే లేనట్లు బాధపడుతుంటారు. ఈ స్వింగ్స్ అరుదుగా జరగొచ్చు లేదా తరచుగా జరగవచ్చు. వాటి తీవ్రత కూడా వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటుంది. సాధారణంగా టీనేజ్‌లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఏ వయసులోనైనా రావచ్చు. బైపోలార్ డిజార్డర్‌కి కచ్చితమైన కారణం తెలియదు. కానీ ఈ డిజార్డర్ ఉన్నవారి మెదడులో మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ డిజార్డర్‌తో ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, సన్నిహిత బంధువులు గలవారిలో ఈ రుగ్మత కనిపిస్తోంది. అందుకు కారణమయ్యే జీన్స్‌ని కనుగొనడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. బైపోలార్ లక్షణాలు బైపోలార్ డిజార్డర్‌లో రెండు దశలుంటాయి. మేనియా, డిప్రెషన్. మేనియా దశలో మేనియా, హైపోమేనియా అనే రెండు విభిన్నమైన ఎపిసోడ్స్ ఉంటాయి. మేనిక్ ఎపిసోడ్ లక్షణాలు.. ► అసాధారణ ఉల్లాసం ► పెరిగిన కార్యాచరణ లేదా ఆందోళన ► విపరీతమైన ఆత్మవిశ్వాసం, ఆనందాతిరేకం (యుఫోరియా) ► నిద్ర అవసరం తగ్గిపోవడం ► అసాధారణమైన మాటకారితనం ► రేసుగుర్రాల్లా పరుగెత్తే ఆలోచనలు ► పేలవమైన నిర్ణయాధికారం మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్ లక్షణాలు.. విచారంగా, ఖాళీగా, నిస్సహాయంగా ఉండటం కారణం లేకుండానే ఏడవడం ఏ విషయంలోనూ ఆసక్తి లేకపోవడం డైటింగ్ చేయనప్పటికీ గణనీయంగా బరువు తగ్గడం లేదా పెరగడం, ఆకలి తగ్గడం లేదా పెరగడం నిద్రలేమి లేదా ఎక్కువగా నిద్రపోవడం చంచలత్వం లేదా మందగించిన ప్రవర్తన అలసట లేదా నీరసం విలువ లేని ఫీలింగ్ లేదా తగని అపరాధ భావన. ఆలోచించే సామర్థ్యం లేదా ఏకాగ్రత తగ్గడం ఆత్మహత్య గురించి ఆలోచించడం, ప్లాన్ చేయడం లేదా ప్రయత్నించడం జీవితకాల చికిత్స అవసరం.. ►బైపోలార్ డిజార్డర్ అనేది జీవితకాల పరిస్థితి. ప్రాథమిక చికిత్సలలో లక్షణాలను నియంత్రించడానికి మందులు, సైకోథెరపీ, సైకోఎడ్యుకేషన్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, సపోర్ట్ గ్రూప్‌లు ఉంటాయి. ► బైపోలార్ ట్రీట్మెంట్లో మందులు ప్రధానపాత్ర పోషిస్తాయి. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ► బైపోలార్ ఎపిసోడ్లను ప్రేరేపించే ట్రిగ్గర్స్‌ని గుర్తించడంలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) సహాయపడుతుంది. అనారోగ్యకరమైన, ప్రతికూల నమ్మకాలు, ప్రవర్తనలను గుర్తించి, వాటి స్థానంలో ఆరోగ్యకరమైన, సానుకూలమైన వాటితో భర్తీ చేస్తుంది. ► బైపోలార్ గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిస్థితిని అర్థం చేసుకోవడంలో, బాధితుడికి సపోర్ట్ ఇవ్వడంలో సైకో ఎడ్యుకేషన్ సహాయపడుతుంది. ► ట్రీట్మెంట్ ప్లాన్‌ని పాటించడంలో కుటుంబ సభ్యుల మద్దతు అవసరం. అందుకు ఫ్యామిలీ ఫోకస్డ్ థెరపీ సహాయపడుతుంది. ► నిద్ర, ఆహారం, వ్యాయామం కోసం రోజువారీ దినచర్యను ఇంటర్ పర్సనల్, సోషల్ రిథమ్ థెరపీ (ఐ్క ఖఖీ) ఏర్పాటు చేస్తుంది. మూడ్ మేనేజ్మెంట్కి ఇది సహాయపడుతుంది. -
ఇంటి ప్రేమే అసలు వైద్యం
సమాజంలో టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్ పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆత్మహత్యలు తార్కాణాలుగా నిలుస్తూనే ఉన్నాయి. కాని తల్లిదండ్రులు మేల్కొనడం లేదు. టీనేజ్‌లో ఉన్న పిల్లల మూడ్స్‌ను గమనించి వారిని అక్కున చేర్చుకోవాల్సింది మొదట తల్లిదండ్రులే. వైద్యం మొదలవ్వాల్సింది ఇంటి నుంచే. డిప్రెషన్ సూచనలు కనిపించే పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం. ఏదో భయం. ఆందోళన. తల్లిదండ్రుల అంచనాకు తగినట్టు లేనని భయం. మార్కులు తగినన్ని తేలేకపోతున్నానని భయం. పాఠాలంటే భయం. పరీక్షలంటే భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. స్నేహితులు లేరని భయం. స్నేహితులతో స్నేహం చెడుతుందేమోనని భయం. ఎవరితో చెప్పుకోవాలో తెలియని భయం. ఎవరితోనూ చెప్పుకోలేనేమోనని భయం. టీనేజ్ పిల్లలు ఎదిగీ ఎదగని లేత వయసు పిల్లలు. వారికి అన్నీ సందేహాలే. ఆందోళనలే. మన దేశంలో 13–17 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు కోటిమంది టీనేజ్ పిల్లలు డిప్రెషన్ బారిన పడుతున్నారని ఒక అంచన. డిప్రెషన్లో భయం, ఆందోళన ఉంటాయి. ఈ వయసులో మొదలైన డిప్రెషన్ కొందరిని ముప్పైల్లో, నలబైల్లో ప్రవేశించే వరకు వెంటాడుతుంది. కొందరిని జీవితాంతం వెంటాడవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న పిల్లలు చీమను కూడా భూతద్దంలో చూసి భయపడతారు. తమ సమస్యకు సమాధానం లేదేమో, ఎవరి నుంచీ దొరకదేమో అనిపించడమే డిప్రెషన్ అత్యంత ప్రమాదకరమైన స్థితి. సమస్యకు పరిష్కారం చావు అనిపించడం దీని పర్యవసానం. ఇంతవరకూ వచ్చే లోపు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని కాపాడుకుంటే వారు ఆ స్థితిని దాటుతారు. లేదంటే అపాయంలో పడతారు. కారణాలు టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ రావడానికి కారణాలు ఇదమిత్థంగా తేల్చలేము. చదువుకు సంబంధించిన ఒత్తిడి, తల్లిదండ్రులతో బలమైన అనుబంధం మిస్ కావడం, ర్యాంకుల బరువు, భవిష్యత్తుపై బెంగ, రూపం గురించిన చింత, మెదడులో అసమతుల్యత... ఏమైనా కావచ్చు. మనదేశంలోని సీబీఎస్ఈ స్కూళ్లల్లో సర్వే చేస్తే చాలామంది పిల్లలు తమకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరని చెప్పారు. లక్షణాలు ఉత్సాహం చూపకపోవడం, చిరాకు, కోపం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, నిద్ర సరిగా ఉండకపోవడం, అలసట, ధ్యాస లేకపోవడం, సరిగా చదవలేక పోవడం... ఏం చేయాలి? ముందు తల్లిదండ్రులు, తదుపరి స్కూళ్లు శ్రద్ధ వహించాలి. ► తల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న పిల్లలతో నిత్యం సంభాషణ జరపాలి. వారితో కూచుని వారు నిస్సంకోచంగా తమ సమస్యలు చెప్పుకోనివ్వాలి. వారు చెప్పేది కొట్టేయకుండా, బదులు తిట్టకుండా అర్థం చేసుకోవాలి. సమస్య మూలాల వరకూ వెళ్లాలి. వారికి చాలా ప్రేమను ఇస్తూ కౌన్సిలింగ్ చేయాలి. రెండు శాతం కంటే తక్కువ మంది పిల్లలకు మందులతో వైద్యం అవసరం కావచ్చు. ► తల్లిదండ్రులు పిల్లల శ్రద్ధ, శక్తిని అంచనా వేస్తూ వారికి లక్ష్యాలు ఇవ్వాలి. వారికి పూర్తిగా ఇష్టం లేని, వారు చేయలేని చదువులో ప్రవేశ పెట్టరాదు. వారు గట్టి స్నేహితులు కలిగి ఉండేలా చూడాలి. ఆ స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పిల్లలు వారితో గడిపేలా చేయాలి. పిల్లలను గాయపరిచే మాటలు తల్లిదండ్రులు మాట్లాడటం బొత్తిగా మానుకోవాలి. మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. ► స్కూళ్లు విధిగా కౌన్సిలర్లను ఉంచాలి. తరగతి వారీగా, ప్రతి విద్యార్థిని మెంటల్ హెల్త్ విషయంలో అంచనా కట్టాలి. వారి సమస్యను అర్థం చేసుకుని టీచర్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించడమే కాక తల్లిదండ్రులకు సమస్య తెలపాలి. అసలు సమస్య మనదేశంలో దాదాపు 4 వేల మంది సైకియాట్రిస్ట్‌లు, వెయ్యి మంది క్లినికల్ సైకాలజిస్ట్‌లు ఉన్నారు. వీరంతా పెద్ద ఆస్పత్రుల్లో లేదా సొంత క్లినిక్‌లలో ఉంటారు. టీనేజ్ పిల్లలకు వీరితో యాక్సెస్ ఉండదు. స్కూళ్లల్లో మానసిక సమస్యలు గమనించి భరోసా ఇచ్చే కౌన్సెలర్ల వ్యవస్థ ఇప్పటికీ ఏర్పడలేదు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు తమకు మానసికంగా ఇబ్బంది ఉన్నట్టు గ్రహించడం కూడా తెలియదు. కనుక పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళుతున్నారు. -
డిప్రెషన్, ఒత్తిడితో చిత్తవకండి.. ఈ పనులు చేయండి
ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులు మొదలు. చేయాల్సిన పనుల చిట్టా చాంతాడంత. దీంతో హడావుడి, ఆందోళన. ఫలితం ఒత్తిడి. అందుకనే ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఆందోళనతో చిత్తవుతున్నారు. వీటి వల్ల వచ్చే శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకు ఇంట్లో మనంతట మనం పాటించగల చిన్న చిట్కాలను చెబుతున్నారు. అవేంటో చూద్దామా..? గోరు వెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచిది. శరీరంలో ఎక్కడైనా నొప్పులుగా అనిపిస్తే చిన్నగా మసాజ్ చేసుకోవడం, కండరాలన్నీ సాగేలా ఒళ్లు విరుచుకోవడం లాంటి పనుల వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బాత్ రూమ్‌లో కూనిరాగాలు తీయడం లేదా ఏదైనా లైట్ మ్యూజిక్‌ని పెట్టుకుని, గోరువెచ్చని నీటితో శరీరం, మనస్సు తేలిక పడేంతవరకు టబ్ బాత్ చేయాలి. అందుకు మంచి సువాసన ఉన్నసహజమైన సబ్బును ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. డ్యాన్స్ నృత్యం చేయడం అనేది ఒత్తిడి నివారిణిలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి సంగీతాన్ని పెట్టుకుని దానికి తగినట్లుగా డ్యాన్స్ చేయవచ్చు. ఎవరైనా ఉన్నప్పుడు చేయడం మొహమాటం అయితే ఎవరూ లేనప్పుడు ఆ పని చేయండి. దీనివల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఇష్టమైన వారితో ప్రేమగా... ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడుఇష్టమైన వారితో ప్రేమగా...సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. అందువల్ల శరీరంలో డోపమైన్ లాంటి హ్యాపీ హార్మోన్ లు విడుదలవుతాయి. దీంతో మీరు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బబుల్ ర్యాప్‌లను పగలగొట్టడం... బబుల్ ర్యాప్ కవర్లను చూడగానే అంతా వాటిని పగలగొట్టాలని ఉవ్విళ్లూరతారు. అందుకు కారణాలు లేక΄ోలేదు. అలా వాటిని పేల్చడం వల్ల మనలో ఓ రకమైన ఆనందం కలుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. అందువల్లనే మనం వాటిని పేల్చేందుకు ఇష్టపడుతుంటాం. మంచి పుస్తకాలు చదవడం... మంచి పుస్తకాలు, పేపర్లు చదవడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు నచ్చిన పుస్తకం తీసి చదవండి. వెంటనే తగ్గుముఖం పడుతుంది ఆ ఒత్తిడి. అలాగే రోజూ దినపత్రికలను చదవడం కూడా ఒత్తిడి నివారణలో ఒక భాగం. దినపత్రికలు చదవడమనగానే నేరవార్తలు, హత్యావార్తలు కాదు. మనసుకు కాస్తంత ఆహ్లాదం కలిగించే వార్తలు చదవడం మేలు. ఆలయ సందర్శనం... మీ మతాన్ని అనుసరించి మీరు ప్రార్థనామందిరాలను సందర్శించడం మంచిది. రోజూ కాసేపు పూజామందిరంలో గడపడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగని దేనినీ అతిగా చేయరాదు. గంటలు గంటలు పూజలు చేస్తూ గడపడం కూడా మంచిది కాదు. క్రమం తప్పకుండా ఆలయానికి లేదా మసీద్‌కు లేదా చర్చికి వెళ్లడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. మీరు ఒత్తిడిలో ఉన్నారు అనుకున్నప్పుడువీటిలో మీకు వీలైనవాటిని పాటించి చూడండి. అన్నింటికన్నా ముఖ్యం ఒత్తిడి వచ్చాక బాధ పడేకంటే ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఒత్తిడి ఎందువల్ల వస్తుందో తెలుసుకుంటే నివారించుకోవడం సులభం కాబట్టి. ముందుగా మీ పనులను ప్రశాంతగా పూర్తి చేయడం ఆరంభించండి. ధ్యానం... ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం అద్భుతమైన మార్గం అని చాలా అధ్యయనాల్లో తేలింది. శ్వాస మీద ధ్యాస పెట్టి కేవలం రెండు నిమిషాలు కళ్లు మూసుకున్నా సరే అది మీ శరీరంలో స్ట్రెస్ హార్మోన్ స్థాయుల్ని తగ్గిస్తుంది. -
విజయ్ ఆంటోని కూతురు సూసైడ్.. టీనేజీ వయసులోనే డిప్రెషన్
ఈ మధ్య కాలంలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. జీవితంలో ఏదో కోల్పోయిన పీలింగ్‌తో డిప్రెషన్‌కు లోవుతున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకసారి ఒంటితనంతో బాధపడ్డవాళ్లే. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామనో, పేదరికం, ప్రేమలో విఫలమవ్వడం, ఉద్యోగం లేకపోవడం, పనిలో ఒత్తిడి.. ఇలా ఎన్నో కారణాలు డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. ప్రపంచంలో సగటున 40 శాతం మంది ‘డిప్రెషన్’ డిజార్డర్స్‌తో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదో జరిగిపోతుందని, తమతో ఎవరూ లేరన్న ఒంటిరి ఫీలింగ్ మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించడమే అతిపెద్ద తప్పు. మీలాగే లక్షలాది మంది ఏదో ఒక కారణంతో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంతమాత్రాన ప్రాణం తీసుకోకూడదు. సాధారణంగా సినిమా స్టార్స్‌ని చూడగానే,వాళ్లకేంటి సంతోషంగా ఉన్నారని అనుకుంటాం. కానీ యటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల వాళ్లు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. దీపికా పదుకొణె దగ్గర్నుంచి కాజల్ అగర్వాల్ వరకు డిప్రెషన్ నుంచి బయటపడినవాళ్లే. ఇదేం అంత పెద్ద సమస్య కాదు, అలా అని తేలిగ్గా తీసుకునే విషయం కూడా కాదు. సమస్యను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డాం అనేది ముఖ్యం. తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ ఆత్యహత్యతో కోలీవుడ్ ఇండస్ట్రీ షాక్‌కి గురయ్యింది. టీనేజీ వయసులోనే డిప్రెషన్‌తో మీరా సూసైడ్ చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న మీరా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. గత కొన్నాళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న మీరా అందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. కానీ అంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మీరా డిప్రెషన్‌కు చదువల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ర్యాంకుల వెంట పడిపోయి పేరెంట్స్ పిల్లలను ప్రెజర్ చేయొద్దని సూచించారు. అలాంటిది ఈరోజు ఆయన కూతురే డిప్రెషన్‌తో చనిపోవడం తీరని విషాదాన్ని నింపుతుంది. Stay strong @vijayantony brother#VijayAntony| #Meera| #MeeraVijayAntonypic.twitter.com/01Fbf3RtvN — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 మీరా ఆ నిర్ణయం తీసుకునేముందు ఒక్కసారి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే బాగుండేదని, చిన్న వయసులోనే మీరా కఠిన నిర్ణయం తీసుకుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా విజయ్ ఆంటోని ఓ సందర్భంలో.. ఏడేళ్ల వయసులోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడని, దీంతో తన తల్లి ఎంతో కష్టపడి తనను పెంచిందని, ఆత్మహత్య సమస్యకు ఎప్పుడూ పరిష్కారం కాదని విజయ్ పేర్కొన్నారు. కానీ విధి ఎంత విచిత్రమో.. ఆరోజు తండ్రి సూసైడ్ చేసుకోగా, ఇప్పుడు కూతురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కొన్ని సార్లు జీవితం మనల్ని పరీక్షిస్తుందో, శిక్షిస్తుందో అర్ధం కాదు, స్టే స్ట్రాంగ్ విజయ్ సార్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. #VijayAntony lost his father to suicide when he was just 7 years old 🥹💔 Tragically, today, his own daughter has also taken her life 😭 being @vijayantony is not easy 😢#Meera| #MeeraVijayAntonypic.twitter.com/EqEEfet3Ta — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 ఒత్తిడి.. ఎలా బయటపడాలి? ఒంటరితనం వల్ల రకరకాల ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు ఫ్రెండ్స్, ఫ్యామిలితో సమయం గడపండి. ఏదో సాధించాలని తపన అందరిలో ఉంటుంది. కానీ దానికి టైం కూడా రావాలి. కష్టపడిన వెంటనే ఫలితం ఆశించకండి. సమయంతో పాటూ అన్నీ సర్దుకుంటాయి అని పాజిటివ్‌గా ఉండండి. ఖాళీగా ఉండకుండా ఏదైనా కొత్త హాబీని ఏర్పరుచుకోండి. సంగీతం, డ్యాన్స్, మ్యాజిక్.. ఇలా ఏదో ఒక వ్యాపకాన్ని ఇష్టంతో చేయండి. ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నించినా ఒంటరితనం, డిప్రెషన్ నుంచి బయటరాలేమనుకుంటే వెంటనే సైకాలజిస్ట్‌ని సంప్రదించండి. Disclaimer: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మనోవేదనకు గురై.. 'వీఆర్ఏ' మృతి!
ఆదిలాబాద్: వీఆర్ఏలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే.. పెంబి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహించిన ఇటిక్యాల్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఆయిండ్ల బుచ్చన్న సర్దుబాటులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్లో రికార్డు అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. విధుల్లో చేరిన నాటి నుంచి దివ్యాంగుడైన బుచ్చన్న ఇంత దూరం బదిలీ చేశారని మనోవేదనకు గురికావడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో 15 రోజుల క్రితం నిజామాబాద్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. బీపీ ఎక్కువ కావడంతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. -
డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కుమ్మరిగా మారిన సివిల్ ఇంజనీర్
ఏదైనా సమస్య ఎదురైతే చాలామంది దాని నుంచి దూరంగా పారిపోవడానికి చూస్తారు. కొంతమంది మాత్రం సమస్యను అధిగమించేందుకు రకరకాల మార్గాలు వెదుకుతారు. అలా వెతికిన వారికి .. పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని చెబుతోంది సైమాషఫీ. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సైమా చేసిన ప్రయత్నం నేడు మరికొంతమందికి ఉపాధి కల్పించడంతోపాటు, కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తోంది. కశ్మీర్‌కు చెందిన 33 ఏళ్ల సైమాషఫీ జమ్ము అండ్ కశ్మీర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎందుకో తనకి తెలియకుండానే మనసులో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. వాటి నుంచి ఎలాగైనా బయట పడాలని రకరకాలుగా ప్రయత్నించేది. ఒకరోజు చైనా తత్త్వవేత్త చెప్పిన ‘‘మట్టిని పాత్రగా మలిచినప్పటికీ, మనం ఏం కోరుకుంటామో దానితోనే ఆ పాత్రలోని శూన్యం నిండుతుంది’’ అన్న కొటేషన్ గుర్తుకొచ్చింది. దీంతో తన డిప్రెషన్‌ను కుండలో నింపాలని నిర్ణయించుకుంది సైమా. చిన్నప్పటి నుంచి మట్టి అంటే సైమాకు ఇష్టం. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు.. మట్టితో కుండలేగాక, బొమ్మలు కూడా తయారు చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న వెంటనే మట్టి కుండల తయారీకి పూనుకుంది. కశ్మీరి వ్యాలీలో కుండల తయారీ శిక్షణ ఇచ్చేవారు లేరు. పైగా కుండల తయారీ, కుండలకు వేసే రంగులకు సైతం అధునాతన పద్ధతులను జోడించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. కుండల తయారీ ఒక కళే కాదు సంప్రదాయంలో భాగం. అది అంతరించకూడదు అనుకుని... కుండల తయారీకి ఎలక్ట్రిక్ చక్రం, గ్యాస్ బట్టీ తీసుకురావాలనుకుంది. కానీ కశ్మీర్‌లోయలో అవి ఎక్కడా దొరకలేదు. బెంగళూరులో శిక్షణ కుండల తయారీలో శిక్షణ తీసుకునేందుకు బెంగళూరు వెళ్లింది. అక్కడ కుండల తయారీలో క్రాష్ కోర్సు చేసి వివిధ ఆకారాల్లో కుండలు ఎలా తయారు చేయాలో నేర్చుకోవడంతోపాటు, కశ్మీరీలు వాడే సంప్రదాయ పాత్రల తయారీని సైతం నేర్చుకుని అధునాతన సాంకేతికత జోడించి కుండల తయారీని ప్రారంభించింది. రకరకాల కుండలను తయారు చేసి విక్రయిస్తూనే, మరోపక్క కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న కుండల తయారీ కేంద్రాలను సందర్శించి అనుభవం కలిగిన నిపుణులతో వర్క్‌షాపులు నిర్వహించేది. ఇలా కుండల తయారీలో సరికొత్త పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తోంది. వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కశ్మీరి కుండలను ఎలా పరిరక్షించుకోవాలో చెబుతోంది. తన కుండల తయారీ జర్నీ గురించి వివరిస్తూ... అందరిలో స్ఫూర్తి నింపుతోంది. ప్రభుత్వ సహకారంతో.. కశ్మీరీ సనాతన కుండల తయారీని కాపాడుతోన్న విషయం అక్కడి ప్రభుత్వానికి తెలియడంతో స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్స్ విభాగం సైమాతో.. తన అనుభవాలను ఇతర కళాకారులకు చెబుతూ సలహాలు సూచనలు ఇప్పిస్తోంది. దీంతో కుండల పునరుద్ధరణకు మంచి స్పందన లభిస్తోంది. అంతేగాక నైపుణ్యం గల కళాకారుల డేటాను హస్తకళల శాఖాధికారులు సేకరిస్తున్నారు. సైమా గురించి తెలిసిన చాలామంది యువతీయువకులు కుండల తయారీ మొదలు పెట్టి ఉపాధి పొందుతున్నారు. -
డిప్రెషన్ బారిన పడ్డా.. ఆ విషయం బయటపెట్టిన కాజల్!
సాధారణంగా సినిమా నటీనటులని చూడగానే, వాళ్లకేంటి సంతోషంగా ఉన్నారని అనుకుంటాం. కానీ అది అన్నిసార్లు నిజం కావాలని రూలేం లేదు. పలువురు హీరోయిన్లు.. బయటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల పలు సమస్యలతో బాధపడుతుంటారు. సందర్భం వచ్చినప్పుడే వాటిని చెబుతుంటారు. అలా హీరోయిన్ కాజల్ అగర్వాల్, తనకు ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి ఇప్పుడు బయటపెట్టింది. కాజల్ కెరీర్ 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. కెరీర్ ప్రారంభంలో పలు చిన్న సినిమాల్లో నటించింది. ఎప్పుడైతే 'మగధీర' చేసిందో ఆమె దశ తిరిగిపోయింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి లాక్డౌన్ ముందు వరకు దక్షిణాదిలో స్టార్ హీరోలతో కలిసి చాలా సినిమాలు చేసింది. 2020లో బిజనెస్మ్యాన్ గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. గతేడాది ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో చాట్ చేస్తూ తన డిప్రెషన్ గురించి బయటపెట్టింది. (ఇదీ చదవండి: తెలుగు యువ నటుడు మృతి.. విడుదలకి ముందే విషాదం) ఫ్యామిలీ అండతో 'ప్రసవం తర్వాత నేను కూడా డిప్రెషన్‌ని ఎదుర్కొన్నాను. అది సర్వసాధారణమైన విషయం. మహిళలు ఎవరైనా సరే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో ఇబ్బందిపడితే ఫ్యామిలీ వాళ్లకు అండగా నిలబడాలి. అలానే ఆడవాళ్లు.. పిల్లలు పుట్టిన తర్వాత తమకంటా కొంత టైమ్‌ని కేటాయించుకోవాలి. ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేయడం, ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని ఆస్వాదించడం, ఇలా కొన్ని పనులు చేసి డిప్రెషన్ దశని దాటొచ్చు. నన్ను ఎంతగానే అర్ధం చేసుకునే కుటుంబం ఉండటంతో దాన్ని దాటి త్వరగా బయటకొచ్చేశాను. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ టైంలో నా వల్ల భర్త గౌతమ్ కిచ్లూ చాలా క్లిష్టమైన పరిస్థితులు చూశారు' అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఆ సినిమాలతో బిజీ ప్రస్తుతం కమల్‌హాసన్ 'ఇండియన్ 2'లో హీరోయిన్గా చేస్తున్న కాజల్.. బాలకృష్ణ 'భగవంత్ కేసరి'లోనూ నటిస్తోంది. మరోవైపు 'సత్యభామ', 'ఉమ' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తోనూ బిజీగా ఉంది. ఇవన్నీ రాబోయే కొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో కొన్ని హిట్ అయినాసరే కాజల్.. మళ్లీ పుంజుకోవడం గ్యారంటీ. (ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?) -
డిప్రెషన్ లో ఎలాన్ మస్క్...
-
బోయిన్‌పల్లిలో తీవ్ర విషాదం.. కుటుంబం ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: బోయినపల్లి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి.. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల్ని స్వస్థలానికి పంపించినట్లు సమాచారం. తూర్పు గోదావరికి చెందిన విజయలక్ష్మీ భర్త, తన ఇద్దరు కూతుళ్లతో బోయినపల్లిలోని భవానీపురంలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే ఆమె భర్త చనిపోగా.. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆ బాధలో కూతుళ్లు చంద్రకళ, దివ్యాంగురాలైన మరో కూతురు సౌజన్య పాలు పంచుకున్నారు. అంతా కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారే ఏమో పాపం.. వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రకళ ఎంబీఏ చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదీ చదవండి: కాపీ కొడుతూ దొరికిన దీపిక!.. అందుకే సూసైడ్ చేసుకుందా? -
దిగులొద్దు తల్లీ!
సాక్షి, అమరావతి: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల మధ్య వారిలో మనస్థితి ఊగిసలాట (మూడ్ స్వింగ్స్), ఒత్తిడి, కోపం, నిరాశ (డిప్రెషన్) వంటివి కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు మరీ తీవ్రంగా మారితే తల్లీ, బిడ్డ ఇద్దరికీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంటుంది. ఇదిలావుంటే.. గర్భధారణ సమయంలో తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైతే ప్రసవానంతరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెంచుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. 1.20 లక్షల మంది గర్భిణులపై అధ్యయనం అధ్యయనంలో భాగంగా 2007 నుంచి 2019 మధ్య ప్రసవించిన 1.20 లక్షల మంది స్త్రీల ఆరోగ్య వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. అధిక రక్తపోటు కలిగిన గర్భిణులను అధ్యయనం నుంచి మినహాయించారు. ఈ క్రమంలో గర్భధారణ సమయంలో తీవ్ర డిప్రెషన్‌తో బాధపడిన మహిళల్లో 6 రకాల గుండె సంబంధిత జబ్బులు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. ఇస్కీమిక్ గుండె జబ్బు (గుండె రక్తనాళాల సంకోచ వ్యాధి) ప్రమాదం 83 శాతం అధికంగా ఉందని గుర్తించారు. అదేవిధంగా కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి) బారినపడే ప్రమాదం 61 శాతం, అరిథ్మియా/కార్డియాక్ అరెస్ట్ (రక్తప్రసరణ లోపం/గుండెపోటు) ప్రమాదం 60 శాతం ఉన్నట్టు నిర్థారించారు. కొత్తగా అధిక రక్తపోటు నిర్థారణకు 32 శాతం, పక్షవాతం వచ్చే ప్రమాదం 27 శాతం ఉన్నట్టు తేల్చారు. ఈ నేపథ్యంలో గర్భధారణ సమయంలో స్త్రీలు వివిధ జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. తద్వారా తమకు దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా, ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని తెలియజేశారు. గర్భంతో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ మధుమేహం, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుని, వాటిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మన దగ్గర కూడా ప్రసవానంతర కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి) కేసులు చూస్తుంటాం. గర్భధారణ సమయంలో తీవ్ర ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు లోనవడం వల్ల ఇది సంభవిస్తుంది. గర్భిణుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆ సమయంలో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. దీంతో గర్భిణులు ఆందోళన, ఒత్తిడి, నిరాశకు గురవుతుంటారు. దీనికి తోడు ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతుంటాయి. ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తుండాలి. ప్రస్తుతం ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్యులు గ్రామాలకు నెలలో రెండుసార్లు వెళుతున్నారు. దీంతో గర్భిణులు తమ సొంత ఊళ్లలోనే వైద్యుల సేవలు పొందొచ్చు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకుని మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఇష్టమైన సంగీతం వినాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు -
ముక్కు సర్జరీ వికటించింది.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌కు ఎక్కువ ప్రాధన్యత ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెరపై మరింత అందంగా కనిపించేందుకు హీరో,హీరోయిన్లు చాలా ప్రయోగాలు చేస్తుంటారు. జిమ్‌లో గంటలకొద్దీ వర్కవుట్స్, స్క్రిక్ట్ డైట్..ఇలా ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఏకంగా సర్జీరల బాట కూడా పట్టారు. ఇలా ఒకరిద్దరు కాదు, బోలెడంత మంది హీరోయిన్లు కృత్రిమ పద్దతులను ఉపయోగించి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వారిలో కొందరు సర్జరీ తర్వాత మరింత అందంగా తయారైతే, మరికొందరికి ఆ సర్జరీలు వికటించి ఉన్న అందం పోగోట్టుకున్నారు. గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన ముక్కు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే ముక్కు సర్జరీ మాత్రం వికటించి డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రానే ఒప్పుకుంది. ఇటీవల ఓ షోకు హాజరైన ప్రియాంక తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ''ఇది జరిగి సుమారు 20ఏళ్లవుతుంది. ఒకానొక సమయంలో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. జలుబు కూడా చాలాకాలం వరకు తగ్గలేదు. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే నాసికా కుహరంలో పాలిప్‌ను తొలగించాలని సిఫార్సు చేశారు. అయితే అనుకోకుండా ముక్కు పైన ఉన్న చిన్న భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు. దీంతో నా ముఖం అంతా మారిపోయింది. అప్పటికే నేను కొన్ని సినిమాలు సైన్ చేశాను. కానీ నా ముఖంలో సర్జరీ తాలూకూ మార్పులు స్పష్టంగా తెలిసిపోయి కాస్త అందవిహీనంగా తయారయ్యాను. దీంతో నన్ను 3 సినిమాల్లో తీసేశారు. అంతేకాకుండా ఓ సినిమాలో హీరోయిన్ రోల్‌కు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాల్సి వచ్చింది. ఇలా చేతికి వచ్చిన అవకాశాలు అన్నీ పోతున్న సమయంలో చాలా డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. కెరీర్ ముగుస్తుందని చాలా బాధపడ్డాను. అప్పుడు మా నాన్న నాకు అండగా నిలిచారు. ముక్కును కరెక్ట్ చేసుకునేందుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకోమని నన్ను ప్రోత్సహించారు. అలా మళ్లీ ఆ సర్జరీతో కాన్ఫిడెన్స్ వచ్చింది'' అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. -
Vijayalakshmy Subramaniam: సరిగమలే ఔషధాలు
ఆమె సంగీత విద్వాంసురాలు. అంతేకాదు... వైద్యరంగంలో ప్రొఫెసర్. వృత్తిని ప్రవృత్తిని మేళవించారామె. సరిగమలు వైద్యానికి ఔషధాలయ్యాయి. రాగాలు ఆరోగ్యాన్నిచ్చే టానిక్లవుతున్నాయి. తీయని కృతులు షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాయి. సంగీత లయ బీపీకి గిలిగింత పెడుతోంది. ప్రొఫెసర్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యమ్... కర్ణాటక సంగీతంలో రాగాల మీద పరిశోధన చేశారు. ఆ రాగాలు డిప్రెషన్‌ను దూరం చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తాయనే విషయాలను శాస్త్రబద్ధం చేశారు. సంగీతం అనారోగ్యాన్ని మాయం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం తానేనని కూడా చెబుతారామె. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీలో గడిపిన సమయంలో సంగీత సాధన ద్వారా వేగంగా సాంత్వన పొందిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్‌గా తన వృత్తిని సంగీతం పట్ల మక్కువతో మేళవించి రాగాలతో చేస్తున్న వైద్యం గురించిన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ► తంజావూరు సరస్వతి మహల్ ‘‘నేను పుట్టింది బెంగళూరు, కర్నాటకలో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాలో సంగీతాభిలాష ఎలా మొదలైందని చెప్పడం కష్టమే. ఎందుకంటే మా ఇల్లే ఒక సంగీత నిలయం. నానమ్మ గాత్రసాధనతోపాటు వయొలిన్ సాధన కూడా చేసేవారు. అమ్మ ఉద్యోగపరంగా సైన్స్ టీచర్, కానీ ఆమె కూడా సంగీతంలో నిష్ణాతురాలు. మా నాన్న శిక్షణ పొందలేదనే కానీ సంగీతపరిజ్ఞానం బాగా ఉండేది. అలా నాకు మా ఇంటి గోడలే సరిగమలు నేర్పించాయి. నాన్న ఉద్యోగరీత్యా దేశంలో అనేకచోట్ల పెరిగాను. గుజరాత్, బరోడాలో ఉన్నప్పుడు సంగీతంతోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. సంగీతం నాకు ధారణ శక్తికి బాగా ఉపకరించింది. దాంతో చదువులోనూ ముందుండేదాన్ని. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిన తర్వాత నా చదువు, అభిరుచి రెండు వేర్వేరు ప్రపంచాలయ్యాయి. రెండింటినీ వేరుగా చూడడం నాకు సాధ్యపడలేదు. నాకు తెలియకుండానే కలగలిపి చూడడం మొదలైంది. సంగీతాన్ని ఒక కళగా సాధన చేయడంతో సరిపెట్టకుండా ఒక శాస్త్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నాదయోగ, రాగచికిత్సల గురించి అప్పుడు తెలిసింది. తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో సంగీతంతో వైద్యవిధానాల గురించి గ్రంథాలున్నాయి. మెడిసిన్‌తోపాటు మ్యూజిక్‌ని కూడా విపరీతంగా చదివాను. రాష్ట్రంలో మూడవ ర్యాంకుతో కర్ణాటక సంగీతంలో కోర్సు పూర్తి చేశాను. మన దగ్గరున్న పురాతన రాతిశాసనాలతోపాటు విదేశాల్లో ఉన్న మ్యూజిక్ థెరపీలను తెలుసుకున్నాను. వైద్యానికీ– సంగీతానికీ మధ్య ఉన్న, మనం మరిచిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే ఆకాంక్ష కలిగింది. ► మతిమరపు దూరం మ్యూజిక్ థెరపీ అనగానే అందరూ ఇక మందులు మానేయవచ్చని అపోహపడుతుంటారు. అలాగే మందులు కొనసాగించాల్సినప్పుడు ఇక మ్యూజిక్‌తో సాధించే ప్రయోజనం ఏముంది అని తేలిగ్గా తీసేస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే... మా దగ్గరకు వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ మూడు వందలకు పైగా డయాబెటిస్తో ఇన్సులిన్ తీసుకునేవాడు. మ్యూజిక్ థెరపీతో ఇన్సులిన్ అవసరం లేకుండా మందులు సరిపోయే దశకు తీసుకురాగలిగాం. నత్తితో ఇబ్బంది పడే పిల్లలు అనర్గళంగా మాట్లాడేటట్లు చేసింది సంగీతం. రెండు రోజులకోసారి డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్న పేషెంట్‌కి ఉపశమనం దొరికింది. ఇక నరాలు, నాడీ సంబంధ సమస్యలను నయం చేసి చూపిస్తున్నాం. ప్రతి పేషెంట్‌నీ వాళ్ల ఆహారవిహారాలు, ఇతర ఆరోగ్య సమస్యల ఆధారంగా విశ్లేషించి ప్రతి ఒక్కరికీ వారికి మాత్రమే ఉపకరించే సంగీత విధానాన్ని సూచిస్తాం. కొంతమంది కోసం ప్రత్యేకంగా పాటలు రాసి కంపోజ్ చేసి ఇస్తాం. పేషెంట్ ఇష్టాలు, మత విశ్వాసాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని డిజైన్ చేస్తున్నాం. అయితే దీనికి ప్రత్యామ్నాయ వైద్యవిధానం అర్హత ఉన్నప్పటికీ ఇంకా ధృవీకరణ రాలేదు. కాంప్లిమెంటరీ మెడిసిన్గానే ఆచరణలో పెడుతున్నాం. వార్ధక్యం కారణంగా అల్జైమర్స్, డిమెన్షియాతో బాధపడుతున్న వాళ్లకు మ్యూజిక్ థెరపీతో అద్భుతాలు సాధించామనే చెప్పాలి. ఓ పెద్దాయన అయితే... భార్య పేరు కూడా మర్చిపోయాడు. నేను స్వయంగా పాట పాడుతూ ఆయన ప్రతిస్పందించే తీరును గమనిస్తున్నాను. ఆశ్చర్యంగా పాటలో తన భార్య పేరు రాగానే చిన్న పిల్లవాడిలాగ ‘యశోదా’ అంటూ పెద్దగా అరిచాడు. మా పరిశోధనాంశాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని శాస్త్రబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అని చెప్పారు ప్రొఫెసర్ విజయలక్ష్మి. ఇదీ ఆమె మొదలు పెట్టిన ‘ఇల్నెస్ టూ వెల్నెస్ ’ జర్నీ. సరిగమలతో రాగాల వైద్యం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షిద్దాం. రాగాల చికిత్స సంగీతం ఆరోగ్యప్రదాయినిగా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఆకాంక్షలున్న వాళ్లందరం ఇండియన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఐఎమ్‌టీఏ)గా సంఘటితమయ్యాం. ఇలాంటి సమూహాలు ఇంకా ఉన్నాయి. కానీ మనదేశంలో మ్యూజిక్ థెరపీ శాస్త్రబద్ధంగా, ఒక వ్యవస్థీకృతమైన అధీకృత సంస్థ ఏదీ లేదు. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇటీవల మంగళూరులో మా ఎనెపోయా మెడికల్ యూనివర్సిటీలో ఆన్లైన్ కోర్సు ప్రారంభించాం. ఇది డాక్టర్ల కోసం మాత్రమేకాదు, వైద్యరంగంలో పని చేసే అందరూ ఈ కోర్సు చేయవచ్చు. ఇక నా ప్రయత్నంలో స్పెషల్ చిల్డ్రన్‌కి మ్యూజిక్ థెరపీ కోర్సు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ ఫెయిలయ్యి డయాలసిస్‌తో రోజులు గడుపుతున్న పేషెంట్లకు మెరుగైన ఫలితాన్ని చూశాను. – ప్రొ‘‘ విజయలక్ష్మి సుబ్రమణ్యమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓటోరైనోలారింగాలజీ, ఎనెపోయా మెడికల్ కాలేజ్, మంగళూరు, కర్ణాటక – జనరల్ సెక్రటరీ, ఐఎమ్‌టీఏ – వాకా మంజులారెడ్డి. -
కరోనాతో ఆనందం ఆవిరి.. హ్యాపీనెస్–2023 నివేదికలో వెల్లడి
గువాహటి: కరోనా మహమ్మారి మన భావోద్వేగాలతో ఒక ఆటాడుకుంది. మన ఆనందాలను ఆవిరి చేసేసింది. కోవిడ్ సోకిన భారతీయుల్లో 35 శాతం మంది ఇంకా తీవ్ర నిరాశ నిస్పృహల్లోనే ఉన్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒత్తిడి, కోపం, విచారం, ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలు కోవిడ్ బాధితుల్లో అధికంగా ఉన్నాయని హ్యాపీప్లస్ సంస్థ విడుదల చేసిన హ్యాపీనెస్–2023 నివేదికలో వెల్లడైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కోవిడ్ బాధితుల్లో అత్యధికంగా 60 శాతం మంది తాము ఆనందంగా లేమని చెప్పారు. 58 శాతంతో మధ్యప్రదేశ్, 51 శాతంతో గుజరాత్, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కరోనాతో నిమిత్తం లేకుండా కూడా భారతీయుల్లో సంతోషం పాలు కాస్త తగ్గుతోందని నివేదిక తేల్చింది. తాము ఆనందంగా ఉన్నామని గతేడాది 70 శాతం మంది చెప్పగా ఇప్పుడది 67 శాతానికి తగ్గిందట! ప్రజల శ్రేయస్సును లెక్కల్లోకి తీసుకుంటే గతేడాది 10కి 6.84 పాయింట్లుంటే 6.08కి తగ్గింది. భారతీయ ప్రజల్లో సంతోషం తగ్గిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, సామాజిక సంబంధాల్లో క్షీణత, ఒంటరితనం కారణాలని అధ్యయనం పేర్కొంది. -
ఇంత బరువున్నావ్.. ఎక్కువ రోజులు బతకవ్.. దెబ్బకు 165 కిలోలు తగ్గాడు..
వాషింగ్టన్: బరువు విపరీతంగా పెరిగిపోయి సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తికి డాక్టర్లు చెప్పిన విషయం దిమ్మతిరిగేలా చేసింది. ఇలాగే ఉంటే 3-5 ఏళ్లకు మించి బతకవు, నీ టైం బాంబ్ కౌంట్ డైన్ స్టార్ట్ అయింది.. అనే మాట అతడి జీవితాన్ని మార్చేసింది. అమెరికా మిసిసిప్పికి చెందిన 42 ఏళ్ల ఈ వ్యక్తి పేరు నికోలస్ క్రాఫ్ట్. 2019లో ఇతని బరువు 294 కిలోలు. వైద్యులు షాకింగ్ విషయం చెప్పిన తర్వాత ఎలాగైనా బరువు తగ్గాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే డైట్ మొదలుపెట్టాడు. నెల రోజుల్లోనే 40 కిలోలు తగ్గాడు. దీంతో అతడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అప్పటి నుంచి డైట్‌తో పాటు వ్యాయామం చేస్తూ 165 కిలోల బరువు తగ్గాడు క్రాఫ్ట్. ప్రస్తుతం ఇతని బరువు 129 కేజీలు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడటమే గాక ఆరోగ్యంగా తయారయ్యాడు. అయితే తాను డిప్రెషన్లోకి వెళ్లి అధికంగా తినడం వల్లే బరువు పెరిగినట్లు క్రాఫ్ట్ చెప్పుకొచ్చాడు. తనకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని పేర్కొన్నాడు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతోనే ఒత్తిడి నుంచి బయటపడి బరువు తగ్గినట్లు చెప్పకొచ్చాడు. 165 కిలోల బరువు తగ్గడంతో క్రాఫ్ చర్మమంతా వదులైంది. దీంతో నొప్పి వచ్చి అతను ఇబ్బందిపడుతున్నాడు. శస్త్రచికిత్స చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే దీనికి ఇన్సూరెన్స్ వర్తించదని, ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు. చదవండి: ఆమె పోరాడింది.. టాప్‌లెస్ సమానత్వం సాధించింది -
ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..?
ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కారణం సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడమే. డైట్ నుంచి కొన్ని ఆహారాలని మినహాయించడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం... చక్కెర మీరు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ముందుగా ఆహారం నుంచి చక్కెరను మినహాయించండి. ఎందుకంటే తీపి పదార్థాలు మీ శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతను కలిగిస్తాయి. దీనివల్ల మనిషిలో టెన్షన్ పెరగడం మొదలవుతుంది. అందుకే డిప్రెషన్‌తో బాధపడేవారు చక్కెరను ఎక్కువగా తినకూడదు. ఆల్కహాల్ ఆల్కహాల్ కాలేయానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఆల్కహాల్ మెదడులోని సెరోటోనిన్ చర్యను మారుస్తుంది. ఇది ఆందోళనను పెంచుతుంది. అందుకే మద్యం తాగకూడదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ∙ఆందోళన పెరుగుతుంది. కెఫిన్ కెఫిన్ కలిగిన పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి కారణమవుతాయి. కెఫిన్ అనేది కాఫీలోనే కాదు, టీలో కూడా ఉంటుంది. అందువల్ల కాఫీ, టీ, చాక్లెట్లు, కొన్ని రకాల శీతల పానీయాలలో కూడా కెఫిన్ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటివల్ల డిప్రెషన్‌కు గురవుతారు. ఉప్పు ఉప్పు మానసిక స్థితిని పాడు చేస్తుంది. మీరు అలసిపోయేలా చేస్తుంది. అలాగని ఉప్పు తీసుకోవడాన్ని పూర్తిగా మానేయకూడదు. తగ్గించి తీసుకుంటే ఉత్తమం. కొందరికి మజ్జిగన్నంలో ఉప్పు తప్పనిసరి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. -
జీవితంలో సుడిగుండం.. మానసిక శక్తిని దెబ్బతీసిన కరోనా
‘కరోనాతో రెండేళ్ల పాటు ఇంట్లోనే ఆన్లైన్ క్లాస్‌లకు అటెండ్ అయ్యాను. అప్పట్లో సరిగా చదువుపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఆఫ్‌లైన్ క్లాస్‌లు నడుస్తున్నాయి. రోజూ కాలేజీకి వెళుతున్నాను. కానీ టీచర్ చెప్పేది అర్థం కావడం లేదు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయి. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు’ – ఓ ఇంటర్ విద్యార్థి ‘ఓ వైపు ఆఫీస్, మరోవైపు ఇల్లు.. ఇలా రెండు చోట్లా సమస్యలు వేధిస్తున్నాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత కోల్పోతున్నాను. ఒంటరిగా జీవించాలనే భావన పెరుగుతోంది’ – ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సాక్షి, అమరావతి: వివిధ మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు వైద్య శాఖ ఏర్పాటు చేసిన ‘టెలీ మానస్’ కాల్ సెంటర్‌ను సంప్రదిస్తున్నారు. సమస్యలను వివరంగా తెలుసుకుంటున్న కాల్ సెంటర్లోని కౌన్సిలర్లు బాధితులకు సాంత్వన చేకూరుస్తున్నారు. అవసరం మేరకు దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్యులకు రిఫర్ చేసి వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. కరోనా మహమ్మారి, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ చాలా మందిలో మానసిక శక్తిని దెబ్బతీసింది. దీనికి తోడు వివాహ బంధాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యా, ఉద్యోగం, అనారోగ్యం ఇతరత్రా కారణాలతో మానసిక సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దేశంలో సుమారు 15 కోట్ల మంది మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతేడాది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) సర్వే వెల్లడించింది. డిప్రెషన్‌కు లోనై.. రాష్ట్రంలో మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, సలహాలు, సూచనలివ్వడం కోసం గతేడాది అక్టోబర్‌లో వైద్య శాఖ కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో కాల్ సెంటర్ ఉంది. ఈ కాల్ సెంటర్‌కు ఇప్పటి వరకూ వివిధ సమస్యలతో 2,452 మంది ఫోన్ చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 30 వరకూ కాల్స్ వస్తున్నాయి. కాల్ సెంటర్‌ను సంప్రదించిన వారిలో ఎక్కువ మందిలో డిప్రెషన్ సమస్య ఉన్నట్టు కౌన్సెలర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి భయం, లాక్డౌన్ కారణంగా ఎక్కువ రోజులు ఒంటరిగా గడపడం, కుటుంబ సభ్యులు, సన్నిహతులు మృత్యువాత పడటం.. ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి డిప్రెషన్‌కు ముఖ్య కారణాలుగా బాధితులు చెబుతున్నట్టు వెల్లడైంది. కొందరిలో ఈ సమస్య ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నట్టు తెలిసింది. మరికొందరిలో సమస్య తీవ్రమై.. తమ చుట్టూ ఉండే కుర్చీలు, బల్లలు, ఇతర వస్తువులు మాట్లాడుతున్నాయన్న భావన కలుగుతోందని చెబుతున్నారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు సైతం కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారే. కరోనా కారణంగా రెండేళ్ల పాటు అకడమిక్ ఇయర్ దెబ్బతింది. దీనికి తోడు, కొందరు తల్లిదండ్రులు పిల్లల అభిరుచులు, సామర్థ్యాలు పట్టించుకోకుండా పదో తరగతి, ఇంటర్లో మంచి మార్కులు రావాలి, ఐఐటీ, నీట్లో ర్యాంక్‌లు సాధించాలి.. అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం మార్కులు, ర్యాంక్‌ల కోణంలోనే విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ ధోరణుల మధ్య తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక దశలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం మానసిక సమస్యలు ఉన్నవారు ప్రాథమిక దశలోనే కౌన్సెలర్లు, వైద్యులను సంప్రదిస్తే మంచిది. అయితే చూసే వాళ్లు ఏమనుకుంటారోనని కౌన్సిలర్లు, వైద్యులను సంప్రదించడానికి విముఖత వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారు 14416 లేదా 180089114416 నంబర్‌కు కాల్ చేసి మానసికంగా ఉపశమనం పొందుతున్నారు. నచ్చిన పాటలు వినడం, సినిమాలు చూడటం, విహార యాత్రలకు వెళ్లడం వంటి కార్యకలాపాలు చేస్తే మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు. – ఎ.అనంత్‌కుమార్, కౌన్సెలర్, సూపర్వైజర్ టెలీ మానస్ కాల్‌సెంటర్ -
ప్రతికూల ఆలోచనల వల్లే ఆందోళన, కుంగుబాటు
లండన్: వృద్ధుల్లో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడికి ప్రతికూల భావోద్వేగాలు, ఆలోచనలే కారణమని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలైతే ఆందోళన పెరుగుతున్నట్లు తేల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని సూచించారు. పెద్దల్లో మెదడుపై ప్రతికూల ఆలోచనల ప్రభావం, మానసిక ఆందోళనకు మధ్య గల సంబంధాన్ని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఇతరుల మానసిక వ్య«థ పట్ల యువకులు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? వారి మెదడు ఎలా ఉత్తేజితం చెందుతుంది? వారిలో ఎలాంటి భావోద్వేగాలు తలెత్తుతాయి? అనే దానిపై పరిశోధన చేశారు. మొదటి గ్రూప్‌లో 27 మందిని(65 ఏళ్లు దాటినవారు), రెండో గ్రూప్‌లో 29 మందిని(25 ఏళ్ల యువకులు), మూడో గ్రూప్‌లో 127 మంది వయో వృద్ధులను తీసుకున్నారు. విపత్తుల వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసికంగా బాధపడుతున్న వారి వీడియో క్లిప్పులను, తటస్థ మానసిక వైఖరి ఉన్నవారి వీడియో క్లిప్పులను చూపించారు. యువకులతో పోలిస్తే వయో వృద్ధుల మెదడు త్వరగా ఉత్తేజితం చెంది, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతున్నట్లు ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా గమనించారు. వారి మనసులో సైతం ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి విపరీత భావాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అలాంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆందోళన, ఒత్తిడి సైతం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపెట్టారు. అధ్యయనం వివరాలను నేచర్ ఏజింగ్ పత్రికలో ప్రచురించారు. -
అటెన్షన్‌గా లేకపోతే టెన్షనే! బయటపడటం కష్టమా? డాక్టర్లు ఏమంటున్నారు?
మారుతున్న కాలానికి అనుగుణంగా మానసిక జబ్బులకు గురవుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా కలత చెందుతున్నట్లు వైద్యుల పరిశీలనలతో వెల్లడింది. ఎప్పుడూ ముభావంగా ఉండటం, నలుగురితో కలవకపోవడం, పలకరించినా స్పందించకపోతుండటంతో సదరు వ్యక్తులను తీసుకొని బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురంలోని సర్వజనాసుపత్రికి మానసిక రుగ్మతలతో వస్తున్న వారిని పరిశీలించగా.. మానసిక ఒత్తిళ్లు, మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్న వారిలో మహిళల కంటే పురుషులే అధికంగా ఉన్నారు. సగటున 45 ఏళ్ల వయసు వారు ఎక్కువగా మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు తేలింది. చాలా మంది మహిళలు లేదా పురుషులు ఈ రుగ్మతలు ఉన్నట్లు కూడా తెలుసుకోలేక నిర్లక్ష్యం చేస్తుండటంతో తీవ్రత పెరిగాక వస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యలతో.. మగవాళ్లు ఎందుకు ఎక్కువ మానసిక రుగ్మతల బారిన పడుతున్నారన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యల్లో ఎక్కువ జోక్యం చేసుకోవడం, చెడు అలవాట్లకు బానిస కావడం ప్రధాన కారణాలని చెబుతున్నారు. అలాగే సరైన వ్యాయామం లేకపోవడంతో చిన్న చిన్న శారీరక సమస్యలకు కూడా మానసికంగా కుంగిపోతున్నారని తేల్చారు. జలుబు, దగ్గు లాంటివి ఎక్కువ రోజులు వేధించినా వారు తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. చిన్న విషయానికే నిరాశ.. వాస్తవానికి చెడు అలవాట్లు ఆడవాళ్లలో చాలా తక్కువ. అయినా సరే నిరాశకు గురై మానసిక ఆందోళన చెందుతున్న ఆడవాళ్ల సంఖ్య కూడా ఎక్కువేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ (నిరాశ)కు గురవున్నారు. మహిళలు చిన్న చిన్న కుటుంబ విషయాలకు కూడా తీవ్రంగా స్పందించడం, ఆలోచించడం వల్ల మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటు న్నారని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఇమడలేక.. ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఆందోళన చెందుతున్నారనేది వైద్యుల అభిప్రాయం. పట్టించుకోకపోతే ముప్పే.. మానసిక రుగ్మతలను పట్టించుకోకపోయినా ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటివి పెరిగిపోవడంతో అసిడిటీ, అల్సర్ లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తాయని స్పష్టం చేస్తున్నారు. రాయదుర్గానికి చెందిన 42 ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 21వ తేదీన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు పరిశీలించారు. అతను పనిచేసే ఆఫీసులో తీవ్ర ఒత్తిడి ఉంది. బాస్ నిత్యం వేధిస్తున్నారన్న భావన నెలకొంది. దీంతో రోజు రోజుకూ మానసికంగా కుంగిపోయి సొంతవూరికి వచ్చేశారని వైద్యులు తేల్చారు. ఉరవకొండకు చెందిన 36 ఏళ్ల మహిళ కొంతకాలంగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఏమి చెప్పినా ఆలకించే స్థితి దాటిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. గత ఏడాది ఎస్ఎస్సీ పరీక్షల్లో కూతురుకు తక్కువ మార్కులు రావడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్లు డాక్టర్ తెలిపారు. బాధితులు ఎక్కువవుతున్నారు ఫలానా మానసిక రుగ్మత అందరికీ ఉండాలని లేదు. మగవాళ్లలో స్కిజోఫినియా ఎక్కువగా ఉంటుంది. అదే ఆడవాళ్ల విషయంలో డిప్రెషన్ ఎక్కువ. సోషియల్ ఎలిమెంట్స్ అంటే సామాజిక కారణాలు.. కుటుంబ, ఆర్థిక సమస్యలు వంటివి ఒక కారణం. చిన్న చిన్న సమస్యలకు కూడా కొందరు కుంగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి కౌన్సిలింగ్ కావాలి. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, జాతీయ హెల్త్‌మిషన్ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతింటోంది ప్రధానంగా చిన్న చిన్న విషయాలకు కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు. పిల్లలకు చదువులో మంచి మార్కులు రాకపోయిన, తమ గోల్ సాధించకపోయిన ఇలా ప్రతి అంశానికి సంబంధించి ఒత్తిడి ఉంటోంది. అన్ని వయస్సుల వారు ఒత్తిడి బారిన పడుతున్నారు.అలాగే వ్యసనాలకు అలవాటు పడటం, కుటుంబంలో ఒకరిపై ఒకరు ఆ«ధిపత్యం వంటి ఎన్నో ఒత్తిడికి కారణమవుతున్నాయి. సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నాం. – డాక్టర్ అనిల్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ మానసిక ఒత్తిడికి చెక్‌పెట్టండిలా... ► కనీసం మనిషి రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి. ► కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. 45 నిముషాల పాటు వాకింగ్, రన్నింగ్ చేసినా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ► యోగా, ధ్యానం చేస్తూ ఒత్తిడిని జయించవచ్చు. ► తీసుకునే ఆహారం కూడా ఒత్తిడిని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాజా కూరగాయలు, పండ్లు, చేపలు, చిరు ధాన్యాల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, పొటీన్స్, విటమిన్స్‌తో పాటు మినరల్స్ ఉంటాయి. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. -
చీకటిపై రణం చేసిన... గెలుపు వ్యాకరణం
చిన్నవయసులోనే డిప్రెషన్ బారిన పడిన షర్మిన్ తల్లిదండ్రుల సహాయంతో ఆ చీకటి నుంచి బయటపడింది. ‘ఆట–మాట–పాట’లలో తన ప్రతిభ చూపింది. సృజనాత్మకతకు మెరుగులు దిద్దే ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టోరీడ్’తో ఇన్స్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకుంది. ‘కస్టమర్స్ కొనుగోలు నిర్ణయాలు లాజిక్ మీద కాదు ఎమోషన్స్‌పై ఆధారపడి ఉంటాయి’ అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టోరీడ్’ను ప్రారంభించింది షర్మిన్ అలి. ఈ ప్లాట్‌ఫామ్ సోలోప్రెన్యూర్స్, ఫ్రీలాన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్, క్లయింట్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేసే ఏజెన్సీలకు బాగా ఉపయోగపడుతుంది. ‘కంటెంట్ రైటర్స్ కస్టమర్ మనసులోకి పరకాయప్రవేశం చేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది’ అంటున్న షర్మిన్ ‘ఇన్‌స్టోరీడ్’ ప్రారంభించడానికి ముందు ఎంతోమంది న్యూరో మార్కెటర్స్, న్యూరో సైంటిస్టులతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఏఐ పవర్డ్ టూల్‌ను రూపొందించడానికి పద్దెనిమిది నెలల కాలం పట్టింది.ఇంతకీ ఈ టూల్ చేసే పని ఏమిటి? మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు, మన కంటెంట్ మనకు బాగానే ఉంటుంది. ‘నిజంగా ఈ కంటెంట్ బాగుందా? మార్పు, చేర్పులు ఏమైనా చేయాలా?’ అనే సందేహం వచ్చినప్పుడు ఈ టూల్‌కు పనిచెప్పవచ్చు. ‘ఈ వాక్యం సరిగ్గా లేదు’ ‘ఈ పదానికి బదులు మరో పదం వాడితే బాగుంటుందేమో’ ‘ఇలాంటి హెడ్‌లైన్స్ చాలా వచ్చాయి. వేరే హెడ్‌లైన్‌కు ప్రయత్నించండి’ ‘టు మెనీ నెగెటివ్ వర్డ్స్. మీ భావం సరిగ్గా చేరడం లేదు’ ‘ఇందులో భాషా దోషాలు కనిపిస్తున్నాయి’.....ఇలాంటి సలహాలు ఎన్నో ఇస్తుంది ఈ ఏఐ టూల్. కొన్నిసార్లు అనుకోకుండా మనం రాసిన వాక్యం, ఎవరో రాసిన వాక్యంలా ఉండి కాపీ కొట్టారు అనే ముద్ర పడడానికి అవకాశం ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూడా ‘ఇన్‌స్టోరీడ్’ టూల్ హెచ్చరించి వేరే వాక్యాలు రాసుకునేలా చేస్తుంది. ‘చాలామంది నన్ను అడిగే ప్రశ్న...మీ ప్లాట్‌ఫామ్ ద్వారా కాపీరైటర్స్ అవసరం లేకుండా చేయవచ్చా? అది అసాధ్యం అని చెబుతాను. మానవసృజనకు ప్రత్యామ్నాయం లేదు. మా ప్లాట్‌ఫామ్ సృజనకు మెరుగులు పెట్టి మరింత చక్కగా తీర్చిదిద్దేలా చేస్తుంది’ అంటోంది షర్మిన్. షర్మిన్ ‘ఇన్‌స్టోరీడ్’కు శ్రీకారం చుట్టినప్పుడు ‘ఇది సక్సెస్ అవుతుందా?’ అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే తన ప్రాజెక్ట్ మీద ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు షర్మిన్. ఆమె నమ్మకం నిజమైంది. బెంగళూరు కేంద్రంగా మొదలుపెట్టిన ‘ఇన్‌స్టోరీడ్’కు వేలాది మంది యూజర్స్ ఉన్నారు. ‘ఇన్‌స్టోరీడ్’కు ముందు అమెరికాలో డాటాసైన్స్, ఎనలటిక్స్ రంగాలలో పనిచేసింది షర్మిన్ పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహార్లో పుట్టిన షర్మిన్ అహ్మదాబాద్‌లో పెరిగింది. ‘ఆడుతూ పాడుతూ పెరిగినదే అందమైన బాల్యం’ అంటుంటారు. అయితే షర్మిన్ మాత్రం చిన్న వయసులోనే డిప్రెషన్ బారిన పడింది. భూకంపం, వరదలు, మతకలహాలు....మొదలైన వాటి ప్రభావంతో కుంగుబాటు అనే చీకట్లోకి వెళ్లిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేసి ఆ చీకటి నుంచి షర్మిన్ను బయటికి తీసుకువచ్చారు తల్లిదండ్రులు. అది మొదలు...ఆటలు, పాటలు, నృత్యాలలో చురుగ్గా పాల్గొనేది. ఇంజనీరింగ్ ఫైనలియర్లో ఉన్నప్పుడు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ ఎలక్టివ్‌గా తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనేది తన కలగా మారింది. ‘ఇన్‌స్టోరీడ్’తో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసింది. ఎంటర్ప్రెన్యూర్గానే కాదు నటి, రచయిత్రి, మోటివేషనల్ స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది షర్మిన్ అలి. -
వివాహిత ఆత్మహత్య.. కారణం అదేనా?
కృష్ణరాజపురం: భర్త మరణాన్ని తట్టుకోలేక ఆవేదనకు లోనైన వివాహిత యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర సంఘటన బెంగళూరు మహాదేవపురలోని కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో సౌందర్య (24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే ఆమె భర్త కూడా బలవన్మరణానికి పాల్పడడం గమనార్హం. అప్పుల బాధతో భర్త.. వివరాలు ప్రకారం.. సౌందర్య భర్త నగరంలోని మాగడి రోడ్డులో ఒక ఆడిటర్ వద్ద జీఎస్టీ వ్యవహారాలు చూసేవాడు. అతడు పలు కారణాల వల్ల రూ. 3 కోట్ల వరకూ అప్పులు చేసి ఆ బాధలు పడలేక 15 రోజుల క్రితం తన ఆఫీసులో ఉరి వేసుకొన్నాడు. భర్త శాశ్వతంగా దూరం కావడంతో అప్పటినుంచి సౌందర్య లోలోపలే కుమిలిపోతోంది. ఓఫారం సమీపంలోని పుట్టింటికి వెళ్లి నివసిస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకొని తనువు చాలించింది. మృతురాలికి యేడాదిన్నర కుమారుడు ఉన్నాడు. తల్లీతండ్రీ దూరమై అనాథగా మిగిలాడు. కాడుగోడి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి! ఎందుకిలా చేసింది?
ఆనంది అందమైన అమ్మాయి. ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్‌గా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ తెచ్చిన సంబంధాలన్నీ వద్దంటోంది. క్రమేపీ ఇంట్లో వాళ్లతో మాట్లాడటం తగ్గించింది. ఆస్పత్రినుంచి రాగానే తన గదిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుంటోంది. మెల్లగా ఆస్పత్రికి వెళ్లడం కూడా తగ్గించింది. కారణమేంటని అడిగితే ఏడుస్తోంది. తను ఆలా ఎందుకు ఏడుస్తోందో పేరెంట్స్‌కు అర్థం కావడం లేదు. అడిగితే ఏమీ చెప్పడం లేదు. ఒకరోజు హఠాత్తుగా చెయ్యి కోసుకుంది. పేరెంట్స్ సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెను కాపాడుకున్నారు. తనకు అంత పని చేయాల్సినంత కష్టం ఏమొచ్చిందో అర్థం కాక తల్లడిల్లుతున్నారు. డిప్రెషన్ ఆనందిలా నిద్రాహారాలకు దూరమై, బంధాలన్నింటికీ స్వస్తిచెప్పి, నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయి, ఒంటరిగా కూర్చుని కుమిలిపోవడాన్నే డిప్రెషన్ అంటారు. డిప్రెషన్‌కు లోనైన వ్యక్తుల్లో కొందరికి బలవన్మరణ ఆలోచనలూ రావచ్చు. కొందరు ఆనందిలా ప్రయత్నాలు కూడా చేస్తారు. జనాభాలో దాదాపు ఐదుశాతం డిప్రెషన్‌తో బాధపడుతుంటారు. ఈ డిప్రెషన్ మహిళల్లో ఎక్కువ. తల్లిదండ్రుల్లో డిప్రెషన్ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకు వస్తుంది? డిప్రెషన్ ఎప్పుడు, ఎవరికి వస్తుందో చెప్పడం కష్టమే. సకల సౌకర్యాలతో జీవిస్తున్న వ్యక్తులూ హఠాత్తుగా డిప్రెషన్లో పడిపోవచ్చు. తామెప్పుడో చేసిన చిన్న తప్పును భూతద్దంలో చూడటం, తన జీవితమే తప్పు దారిలో వెళ్తోందని అతిగా ఆలోచించడం, తప్పు చేసిన తాను ఎందుకూ పనికిరాననే ఆత్మన్యూనతకు లోనవ్వడం వంటివన్నీ.. డిప్రెషన్‌కు కారణమవుతాయి. ఆనంది విషయంలో జరిగిందదే. తన టీనేజ్ అఫైర్‌ను ఇప్పుడు గుర్తు చేసుకుని, అతిగా ఆలోచించి, తాను తప్పు చేశా కాబట్టి పెళ్లికి అర్హురాలిని కాదని, తనను తాను తక్కువ చేసుకుని, ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేక డిప్రెషన్లోకి జారిపోయింది. మరికొన్ని సందర్భాల్లో జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు డిప్రెషన్‌కు వెళ్లిపోతారు. ఆ కోల్పోవడం ఆర్థికంగా లేదా మానసికంగా లేదా సామాజికంగా కావచ్చు. ఒక్కోసారి ఆర్థికంగా, వస్తురూపంగా ఎలాంటి నష్టం లేకపోయినా అహం దెబ్బతినడం, అవమానం పాలవ్వడం కూడా డిప్రెషన్‌కు కారణం కావచ్చు. ఒక్కోసారి ఎలాంటి ప్రత్యేక కారణాలు లేకుండానే డిప్రెషన్‌కు లోనుకావచ్చు. మెదడులోని సెరటోనిన్ అనే రసాయనంలో హెచ్చుతగ్గుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. గుర్తించడం ఎలా? డిప్రెషన్‌ను గుర్తించడం కొంచెం సులభం, మరికొంచెం కష్టం కూడా. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఆనందిలా సరిగా నిద్రపోలేరు. తిండిపై ఆసక్తి ఉండదు. ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారో కూడా ఆలోచించరు. చిన్న చిన్న పనులకే అలసిపోతారు. హఠాత్తుగా బరువు తగ్గుతారు. మద్యం తాగడం పెంచుతారు. కొందరిలో తరచూ తలనొప్పి, ఒళ్లునొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి శారీరక లక్షణాలూ కనిపిస్తాయి. డాక్టర్ దగ్గరకు వెళ్తే అన్ని పరీక్షలు చేసి ఎలాంటి సమస్యా లేదని చెప్తారు. కానీ అసలు సమస్య మాత్రం అలాగే ఉంటుంది. మందులు వాడినా శారీరక బాధలు తగ్గనప్పుడు, దీర్ఘకాలం దిగులుగా ఉన్నప్పుడు అది డిప్రెషన్ అని గుర్తించాలి. ఏం చేయాలి? ►డిప్రెషన్‌కు లోనయ్యామని తెలుసుకున్నప్పుడు మొదట దానికి దారితీసిన కారణాలను వెదకాలి. ఆ కారణాలకు దిగులుపడాల్సిన అవసరం ఉందా, లేదా అనే విషయాన్ని విశ్లేషించుకోవాలి. ►పని ఒత్తిడి భరించలేని స్థాయికి వచ్చినందువల్ల కూడా డిప్రెషన్‌కు లోనయ్యే చాన్స్ ఉంది కాబట్టి వీలైనంత వరకు పని ఒత్తిడి తగ్గించుకోవాలి. ►హెల్తీ బాడీ, హెల్తీ మైండ్ అంటారు. అలాగే యాక్టివ్ బాడీ, యాక్టివ్ మైండ్. శరీరం చురుగ్గా ఉంటేనే మనసూ ఉత్సాహంగా ఉంటుంది. అందుకే శరీరానికి పనిపెట్టండి. వాకింగ్, ఏరోబిక్ ఎక్సర్ సైజ్లు, యోగ వంటివి ప్రాక్టీస్ చేయాలి. ►ఒంటరిగా కూర్చుంటే దిగులు మరింత పెరుగుతుంది. కాబట్టి ఒంటరిగా కూర్చోకుండా బయటకు కదలాలి. స్నేహితులను కలవాలి. వాళ్లతో నవ్వుతూ కబుర్లు చెప్పుకోవాలి. హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ ఉండే వాతావరణంలో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలి. ►మీ స్నేహితుడో, సన్నిహితురాలో డిప్రెషన్‌తో బాధపడుతున్నారని అనిపించినప్పుడు వారికి సపోర్ట్‌గా నిలవండి. వారిని సంతోషపెట్టే మార్గాలు అన్వేషించండి. ►మీ కుటుంబంలో ఎవరైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు.. ఏమీ చేయకుండా కూర్చున్నారని తిట్టకండి. వారి మనసులోని బాధేమిటో తెలుసుకుని అనునయించండి. ►అవసరమైతే వారితో సన్నిహితంగా ఉండేవారి సహాయం తీసుకోండి. ►మీ ప్రయత్నాలేవీ ఫలించనప్పుడు సైకాలజిస్ట్‌ను కలవండి. ఆయన పరీక్షించి మైల్డ్, మోడరేట్ లెవెల్లో ఉంటే కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడటానికి సహాయం చేస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్‌కు రిఫర్ చేస్తారు. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం? -
కోలుకోవడం సాధ్యం కాలేదు, బతకాలనిపించలేదు : దీపికా పదుకొణె
‘‘కనీసం ఒక్క ప్రాణాన్నైనా కాపాడలన్నది నా లక్ష్యం. అప్పుడే ఈ జీవితానికి సార్థకత’’.. ఏళ్లపాటు మనోవ్యాకులత సమస్యను ఎదుర్కోవడమే కాకుండా దాన్నుంచి విజయవంతంగా బయటపడి అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దీపికా పదుకునె ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. ఓ కార్యక్రమంలో దీపిక మనోవ్యాకులత సమస్యను ఎలా ఎదుర్కొన్నది వివరించారు. ‘‘2014లో మొదటిసారి సమస్యను గుర్తించారు. అకస్మాత్తుగా చిత్రంగా అనిపించేది నాకు. పనిచేయాలని అనిపించేది కాదు. ఎవర్నీ కలవాలనిపించేది కాదు. బయటికి వెళ్లాలన్నా చిరాకు వచ్చేది. అసలు ఏమీ చేయకుండా ఉండిపోవాలనిపించేది. చాలాసార్లు ఈ జీవితానికి ఓ అర్థం లేదని, ఇంకా బతికి ఉండకూడదని అనిపించేది’’ అని తెలిపారు. ఈ సమయంలోనే తన తల్లిదండ్రులు తనను చూసేందుకు బెంగళూరు నుంచి ముంబై వచ్చారని చెబుతూ.. ‘‘వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో ఉన్నట్టుండి ఏడ్చేశా. ఏదో తేడాగా ఉందని అమ్మ గుర్తించింది. అది మామూలు ఏడుపు కాదని అనుకుంది. ఓ సైకియాట్రిస్ట్‌ను కలవమని సూచించింది. ఆ తర్వాత కొన్ని నెలలకు కానీ కోలుకోవడం సాధ్యం కాలేదు’’ అని దీపిక తెలిపారు. ‘‘మనోవ్యాకులత సమస్య నాకే అనుభవమైందంటే నాలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారో? అని అప్పట్లో నాకనిపించింది. అందుకే ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ఈ జీవితానికి సార్థకత ఏర్పడినట్లే అనుకుంటున్నా..’’ అని దీపిక తెలిపారు. -
రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..
సాక్షి, బెంగళూరు: విధానసౌధలో బాంబు పెట్టామని శుక్రవారం బెదిరింపులకు పాల్పడిన టెక్కీని విధానసౌధ పోలీసులు అరెస్ట్‌చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి ఫోన్ చేసిన టెక్కీ సౌధలో బాంబు పెట్టామని, త్వరలో పేలిపోతుందని పదే పదే చెప్పాడు. సౌధలో పోలీసులు సోదాలు చేయగా ఎలాంటి బాంబు కనబడలేదు. ఊరికే బెదిరించడానికి పోన్ చేశాడని అనుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఫోన్ నంబర్ ఆధారంగా నిందితున్ని గుర్తించారు. హెబ్బగోడికి చెందిన 41 ఏళ్ల ఐటీ ఇంజనీరు ప్రశాంత్ ఈ బెదిరింపు కాల్ చేసినట్లు తెలిసింది. పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో టెక్కీని అరెస్ట్ చేశారు. కాగా, రెండుసార్లు ప్రేమలో విఫలం చెంది ఆ డిప్రెషన్లో నకిలీ బాంబు కాల్స్ చేసినట్లు చెప్పాడు. అతడు గతంలోనే ఉద్యోగం కూడా కోల్పోయాడని తెలిసింది. చదవండి: (స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలిసి..) -
నాన్నల కంటే అమ్మల్లోనే ఈ సమస్య ఎక్కువ..ఇవీ కారణాలు! ఎలా నివారించాలి?
అమ్మకు మతిమరుపు ఎక్కువవుతోంది. అమ్మలో అయోమయం పెరుగుతోంది. అమ్మలో ఆ మార్పు ఎందుకు? అల్జైమర్స్ కావచ్చు. World Alzheimer Day 2022: ఒక వయసు దాటాక అమ్మా నాన్నల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్నల కంటే అమ్మలే ఎక్కువగా అల్జైమర్స్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి సందర్భంలో వారితో ఎలా మెలగాలి? వారికి ఎలాంటి సపోర్ట్ అందించాలి? పెద్దల మీద ఒక కన్ను వేసి వారికి వచ్చే ఈ ఇబ్బందిని సకాలంలో ఎలా గుర్తించాలి?తెలుసుకోక తప్పదు. ‘అల్జైమర్స్ అండ్ రిలేటెడ్ డిజార్డర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ (ఏ.ఆర్.డి.ఎస్.ఐ) ప్రకారం 2030 నాటికి 75 లక్షల మంది భారతదేశంలో అల్జైమర్స్ బారిన పడి ఉంటారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే 65 ఏళ్లు దాటిన తర్వాత ఆరుమంది మహిళలలో ఒకరికి ఈ రుగ్మత సోకే అవకాశం ఉంటే పురుషులలో 11 మందిలో ఒకరికి దీని ప్రమాదం పొంచి ఉంటుంది. అంటే స్త్రీలలోనే ఎక్కువమంది అల్జైమర్స్ బారిన పడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయే. స్త్రీలే ఎందుకు? ఇవీ కారణాలు: ►డిప్రెషన్‌కు, అల్జైమర్స్‌కు నేరుగా సంబంధం ఇంకా తేలాల్సి ఉన్నా డిప్రెషన్ స్త్రీలలో ఎక్కువ కనుక వారికి ఈ రుగ్మత సోకుతున్నదనేది నిపుణుల పరిశీలన. డిప్రెషన్ వల్ల జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడు రసాయనాలు ప్రభావితమయ్యి మతిమరుపు, జ్ఞాపకాలు నశించడం జరుగుతున్నదని అంటున్నారు. ►అలాగే వ్యాయామం లేకపోవడం. పురుషుల కంటే స్త్రీలకు వ్యాయామం తక్కువ కావడం కూడా అల్జైమర్స్‌కు కారణం. పురుషులు ఎంతో కొంత వ్యాయామం కోసం బయటకు వెళతారు. కాని స్త్రీలు ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. వారికి వ్యాయామం చేసే సమయం కూడా ఉండదు. ►ఆరోగ్యకరమైన శరీరం మెదడును కూడా చురుగ్గా ఉంచుతుంది కనుక అల్జైమర్స్ పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఇంట్లో బాధ్యతలు కూడా స్త్రీలను తెలియని ఒత్తిడికి గురి చేస్తాయి. కుటుంబ సభ్యులలో ఎవరి ఆరోగ్యం బాగలేకపోయినా వారిని చూసుకోవాల్సిన, ఎవరికి ఏ సమస్య వచ్చినా దాని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత స్త్రీలలో ఎక్కువ కనిపిస్తుంది. ►వారికి తప్పని ఈ పని వల్ల కూడా మెదడుపై అనవసర ఒత్తిడి పడి అల్జైమర్స్‌కు కారణం కావచ్చు. ఇవి కాకుండా స్త్రీలలో రెండు ‘ఎక్స్’ క్రోమోజోములు ఉంటాయి. ఇందువల్ల కూడా అల్జైమర్స్ వస్తున్నదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ►మెదడు నిర్మాణం కూడా పురుషులకు, స్త్రీలకు కొద్దిపాటి వ్యత్యాసమూ ఒక కారణం కావచ్చు. మరో విషయం ఏమంటే చురుగ్గా ఉండే మెదడు కలిగిన వారికి అల్జైమర్స్ తక్కువగా వస్తుంది. అంటే మెదడు నిరంతరం పని చేసేవారికి ఈ రుగ్మత సమస్య తక్కువ. ►కాని తరాల వెంబడి స్త్రీలను విద్యకు దూరం చేయడం, వారి ఆలోచనలు పరిమితం చేయడం, కూరా నారకు మాత్రమే ఆలోచిస్తే చాలు అన్నట్లుగా చూడటం వల్ల కూడా స్త్రీలకు ఈ రుగ్మత వస్తున్నదని అంటున్నారు. ►పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవించడం వల్ల కాలం గడిచే కొద్ది ఈ రుగ్మత బారిన వీరు పడుతుండటం మరో అనివార్యత. కాబట్టి 65 ఏళ్లు దాటాక పురుషుల గురించి కంటే అల్జైమర్స్ విషయంలో స్త్రీల గురించి మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదాన్ని ఎలా నివారించవచ్చు? ►యాభైలకు సమీపిస్తున్నప్పుడే జీవన విధానాలను మార్చుకోవడం, కళాత్మకమైన పనుల్లో నిమగ్నమవడం, పజిల్స్ నింపడం, సమతుల ఆహారం తీసుకోవడం, బరువు పెరక్కుండా చూసుకోవడం, మంచి పోషకాలుండే పండ్లు తినడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం. ►నిద్రలేమి మెదడు పై ప్రభావం చూపుతుంది. ఏ వయసులో అయినా ఏదో ఒక కోర్సు చదవడం. లేదా ఏదో ఒక క్లాసుకు (ఇంగ్లిష్, డాన్స్, పెయింటింగ్) హాజరు కావడం. బి.పి, డయాబెటిస్లను అదుపులో పెట్టుకోవడం. ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, నలుగురితో ఎక్కువ కలవడం. సహాయం ►ఈ రుగ్మత ఉన్నవారిని కనిపెట్టుకుని ఉండటమే అసలైన సహాయం. వైద్యపరంగా చేసేది పెద్దగా లేకపోయినా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల, వాళ్లున్న గదుల్లో పోస్టర్లు ఫొటోలు పెట్టడం వల్ల, బాత్రూమ్లో సూచనలు అంటించడం వల్ల, అలారంలు పెట్టి వారిని ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకునేలా చేయడం వల్ల, పగటి పూట ఎండలో తిప్పుతూ నిద్ర తక్కువ పోయేలా చేసి రాత్రిళ్లు త్వరగా నిద్రపోయేలా చేయడం వల్ల ఇలాంటి బాధితులకు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ►అల్జైమర్స్ అంటే పెద్దలు మళ్లీ పసిపాపలుగా మారడం. పిల్లలు వారికి తల్లిదండ్రుల అవతారం ఎత్తడం. సమాధానం లేని ఈ రుగ్మతను ప్రేమ, బాధ్యతలతోనే జయించాలి. ఎలా గుర్తించాలి? అల్జైమర్స్ సూచనలు ఎలా గమనించాలి? అల్జైమర్స్ వచ్చిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ►తరచూ మతిమరుపు ►స్థలకాలాల ఎరుక తగ్గుతుంది. ►మూడ్స్ తరచూ స్థిరంగా మారుతుంటాయి. ►ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తికమక ►నలుగురితో కలవకపోవడం ►రోజువారి పనులు చేసుకోవడంలో కూడా అయోమయం చదవండి: Urinary Problems: గర్భసంచి జారిందన్నారు.. ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గుతుందా? -
ఆ బాధకు కారణం తెలియదు..ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: దీపికా పదుకోన్
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ డిప్రెషన్‌కి లోనై, ఆ తర్వాత సరైన చికిత్సతో తిరిగి కోలుకున్న సంగతి తెలిసిందే. తన జీవితంలోని అప్పటి రోజులను దీపికా పదుకోన్ అప్పుడప్పుడూ గుర్తు చేసుకుంటుంటారు. ఇటీవల మానసిక ఆరోగ్యం గురించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీపిక తన డిప్రెషన్ రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘‘నటిగా నా కెరీర్ చాలా బాగుండేది. కానీ నాకెందుకో బాధగా ఉండేది. ఆ బాధకు కారణం తెలిసేది కాదు. కానీ ఏడుపొచ్చేది. దాంతో నిద్రపోవాలనుకునేదాన్ని. ఎందుకంటే బాధ నుంచి తప్పించుకో డానికి నిద్ర ఒక మార్గం అనిపించేది. ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు కూడా నన్ను వేధించాయి. మా అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు నన్ను చూసేందుకు ముంబై వచ్చేవారు. వారు వచ్చినప్పుడల్లా నేను వారి ముందు ఉత్సాహంగా ఉండేదాన్ని. ఓసారి మాత్రం ఉన్నట్లుండి మా అమ్మ దగ్గర బయటపడిపోయాను. ‘వృత్తిపరమైన సమస్యలా?’, ‘బాయ్‌ఫ్రెండ్ విషయంలో ఏవైనా ఇబ్బందులా? అని మా అమ్మ ఆందోళనగా అడిగారు. ఏం చెప్పాలో నాకు తెలియలేదు. ఎందుకంటే అవేవీ నా బాధకు కారణాలు కాదు. నాలో తెలియని శూన్యత ఏర్పడిందని మా అమ్మ అర్థం చేసుకుని, డిప్రెషన్ నుంచి నేను బయటపడేలా చేశారు. ఆ సమయంలో ఆ దేవుడే మా అమ్మను నా వద్దకు పంపాడా అనిపించింది’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య) -
Commonwealth Games 2022: న్యూస్ మేకర్.. జూడో ధీర
కామన్వెల్త్ క్రీడలలో సుశీలా దేవి లిక్మబమ్ రజత పతకం సాధించింది. 48 కేజీల జూడో ఫైనల్స్‌లో హోరాహోరీ పోరాడి రెండో స్థానంలో నిలిచింది. సుశీలా దేవి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. డిప్రెషన్‌ను జయించి ప్రత్యర్థిని గెలిచింది. మణిపూర్ ఖ్యాతిని పెంచిన మరో వనిత సుశీలా దేవి పరిచయం... ప్రత్యర్థిని నాలుగు వైపుల నుంచి ముట్టడించాలని అంటారు. జూడోలో కూడా నాలుగు విధాలుగా ప్రత్యర్థిని ముట్టడించవచ్చు. త్రోయింగ్, చోకింగ్, లాకింగ్, హోల్డింగ్ అనే నాలుగు పద్ధతులతో ప్రత్యర్థిపై గెలుపు సాధించాల్సి ఉంటుంది. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్– 2022లో మహిళా జూడో 48 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ఫైనల్స్‌లో సుశీలా దేవి లిక్మబమ్ తన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జూడో క్రీడాకారిణి మిషిలా వైట్బూయీ మీద ఈ నాలుగు విధాలా దాడి చేసినా ప్రత్యేక పాయింట్ల విషయంలో వెనుకబడింది. ఫలితంగా రెండో స్థానంలో నిలబడింది. అయినప్పటికీ భారత దేశానికి మహిళా జూడోలో రజతం సాధించిన క్రీడాకారిణిగా ఆమె ప్రశంసలను పొందుతోంది. అయితే ఈ రజతంతో ఆమె సంతోషంగా లేదు. ‘నేను అన్ని విధాలా గోల్డ్ మెడల్‌కు అర్హురాలిని. మిస్ అయ్యింది’ అని కొంత నిరాశ పడుతోంది. కాని సుశీలా ఎదుర్కొన్న ఆటుపోట్లను చూస్తే దాదాపుగా జూడో నుంచి బయటికొచ్చేసి తిరిగి ఈ విజయం సాధించడం సామాన్యం కాదని అనిపిస్తుంది. మేరీకోమ్ నేల నుంచి మణిపూర్ అంటే మేరీకోమ్ గుర్తుకొస్తుంది. 27 ఏళ్ల సుశీలా దేవిది కూడా మణిపూరే. తండ్రి మనిహర్, తల్లి చవోబి. నలుగురు పిల్లల్లో రెండో సంతానం సుశీలాదేవి. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే సుశీలాను చూసి ఆమె మేనమామ దినిక్ తనలాగే అంతర్జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణి చేయాలనుకున్నాడు. అప్పటికే సుశీలాదేవి అన్న శైలాక్షి కూడా జూడో నేర్చుకుంటూ ఉండటంతో ఎనిమిదేళ్ల వయసు నుంచే సుశీలకు జూడో మీద ఆసక్తి పుట్టింది. ప్రాక్టీసు కోసం మేనమామ ఇంఫాల్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రానికి రోజూ రమ్మంటే సుశీల వాళ్ల ఇంటి నుంచి అది సుమారు 10 కిలోమీటర్లు అయినా రోజూ అన్నా చెల్లెళ్లు సైకిల్ తీసుకుని కొండలు, గుట్టలు దాటుతూ సాయ్ కేంద్రానికి చేరుకునేవారు. అలా ఆమె శిక్షణ మొదలయ్యింది. చెప్పాల్సిన విషయం ఏమంటే అన్న క్రమంగా జూడోలో వెనకబడితే చెల్లెలు పేరు తెచ్చుకోవడం మొదలెట్టింది. దానికి కారణం మహిళా జూడోలోకి ప్రవేశించే క్రీడాకారిణులు తక్కువగా ఉండటమే. పాటియాలా శిక్షణ సుశీల శిక్షణ ఇంఫాల్ నుంచి పాటియాలాలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలె¯Œ ్సకు మారింది. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఆడే మేరీకోమ్ వంటి ఆటగాళ్లను చూశాక ఆమెలో స్ఫూర్తి రగిలింది. తాను కూడా విశ్వవేదికపై మెరవాలని కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేసింది. కోచ్ జీవన్ శర్మ ఆమెకు ద్రోణాచార్యుడి గా మారి శిక్షణ ఇచ్చాడు. 2008 జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్లో పతకం సాధించడంతో ఆమె పేరు జూడోలో వినిపించడం మొదలెట్టింది. కొనసాగింపుగా ఆసియా యూత్ చాంపియన్ షిప్లో కూడా సుశీల పతకాలు సాధించింది. కారు అమ్ముకుంది క్రికెట్ తప్ప వేరే క్రీడలను పెద్దగా పట్టించుకోని స్పాన్సర్లు భారత్‌లో అంతగా తెలియని జూడోను అసలు పట్టించుకోనేలేదు. పైగా మహిళా జూడో అంటే వారికి లెక్కలేదు. ప్రభుత్వం కూడా ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు తప్ప వరల్డ్ ఛాంపియ¯Œ ్సకు పెద్దగా స్పాన్సర్షిప్ చేయదు. స్పాన్సర్లు లేకపోవడంతో తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న మొదటి కారును అమ్ముకుని ఆ పోటీలలో పాల్గొన్నది సుశీల. ‘నేను సంపాదించిందంతా జూడోలోనే ఖర్చు చేశాను. ఇంక నా దగ్గర అమ్ముకోవడానికి ఏమీ మిగలలేదు. కానీ ఈ ఆటను నేను వీడను..’ అంటుంది సుశీల. ఈ మెడల్‌తో ఆమె ఖ్యాతి మరింత పెరిగింది. ఇక ఆట కొనసాగింపు చూడాలి. సుశీల ప్రస్తుతం మణిపూర్ పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్గా పని చేస్తోంది. 2014 కామన్వెల్త్ విజయం 2014లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించడంతో సుశీల మీద అందరి అంచనాలు పెరిగాయి. ఆమె నుంచి ఒక ఒలింపిక్ పతకం ఖాయం అని భావించారు. అందుకు రిహార్సల్స్ వంటి 2018 ఆసియా క్రీడల్లో పాల్గొనాలని ఉత్సాహపడుతున్న సుశీలను గాయం బాధ పెట్టింది. ఆమె ఆ గేమ్స్‌లో పాల్గొనలేకపోవడంతో డిప్రెషన్ బారిన పడింది. ఆ తర్వాత వచ్చిన లాక్డౌన్, టోర్నీలు రద్దుకావడం ఇవన్నీ ఆమెను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటానో లేదోననే స్థితికి తీసుకెళ్లాయి. టోక్యో ఒలింపిక్స్‌లో అదృష్టవశాత్తు కాంటినెంటల్ కోటాలో స్థానం దొరికితే దేశం తరపున ఏకైక జూడో క్రీడాకారిణిగా పాల్గొన్నా ఫస్ట్ రౌండ్లోనే వెనుదిరగాల్సి వచ్చింది. 2019 ఆసియన్ ఓపెన్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్, 2019 లో కామన్వెల్త్ జూడో ఛాంపియన్ షిప్లో స్వర్ణం నెగ్గింది. అయితే 2018 కు ముందు ఆమె చేతికి గాయమైంది. దీంతో ఆమె ఏడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న ఆశలు ఆవిరవుతున్నట్టు అనిపించింది. కానీ ఆమె కుంగిపోలేదు. ఇంటికి వెళ్లి మూడు నెలలు విరామం తీసుకుంది. తిరిగి 2018లో ఆసియా గేమ్స్ లో పాల్గొనలేకపోయినా 2019 లో హాంకాంగ్ వేదికగా జరిగిన హాంకాంగ్ ఓపెన్ లో బరిలోకి దిగింది. -
ఐ లవ్యూ డాడీ.. అమ్మను చంపేశా!
ముంబై: మానసిక కుంగుబాటు.. మనిషిని తీవ్ర నిర్ణయాల వైపు అడుగులు వేయిస్తుంటుంది. అందుకే.. సమస్యలను ఇతరులతో పంచుకోవడం ద్వారా భారం దించుకోవడమో, కౌన్సెలింగ్ ద్వారా ఉపశమనం పొందడమో చేస్తుండాలి. కానీ, కొందరు అలాంటివేం చేయకుండా.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఓ తనయుడు కన్నతల్లినే హతమార్చాడు. ఒంటరితనంతో మానసికంగా కుంగిపోయిన కొడుకు.. కన్నతల్లినే హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఆపై పశ్చాత్తాపం చెంది.. ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. తండ్రికి భావోద్వేగమైన లేఖ రాసి.. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దిగ్భ్రాంతికి గురి చేసే ఈ ఘటన ముంబై(మహారాష్ట్ర) ములుంద్‌లో చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన మహేశ్‌పంచల్ కుటుంబం.. వర్ధమాన్ నగర్లో స్థిరపడింది. వ్యాపారం రిత్యా ఊళ్లు పట్టుకుని తిరుగుతుంటాడు మహేష్. ఇదిలా ఉంటే.. ఇంజినీరింగ్ చదివిన మహేశ్ కొడుకు జయేశ్ పంచల్(22) చాలా కాలంగా డిప్రెషన్లో ఉన్నాడు. ఒంటరితనం భరించలేక.. సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక సతమతమయ్యాడు. నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ.. విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఘటన జరిగిన ప్రాంతం ఇదే ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లి ఛాయా పంచల్ కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది అతన్ని. అయితే హఠాత్తుగా తనకు డబ్బు కావాలని, ఆస్తిలో వాటా పంచాలంటూ తల్లితో గొడవకు దిగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో.. మానసిక ఆరోగ్యం బాగోలేని కొడుకును మందలిస్తూ వస్తోందామె. అయితే శనివారం రాత్రి తల్లి నిద్రలో ఉండగా.. కత్తితో గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు జయేశ్. ఆపై తాను చేసిన తప్పు గుర్తించి.. ‘‘ఐ లవ్యూ డాడీ.. అమ్మ చావుకు నేనే కారణం.. నేనే చంపేశా. నన్ను క్షమించూ’’ అంటూ గుజరాతీలో ఓ లేఖ రాసి ములంద్ రైల్వే స్టేషన్ దగ్గర లోకల్ ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఛాయా ఒంటిపై 12 కత్తి పోట్లు ఉన్నాయని, కేసులో అనుమానితుడిగా భావిస్తున్న జయేష్ కోలుకుంటే తప్ప కేసు చిక్కుముడి వీడదని పోలీసులు చెప్తున్నారు. కన్నబిడ్డ చేతిలో భార్య మృతి చెందడంతో మహేశ్ పంచల్ విలపిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: తల్లి శవం ఓ గదిలో.. దోస్తులతో ఎగ్ కర్రీ దావత్ -
ఆవేశం క్షణికం.. ఆవేదన శాశ్వతం
ఆయుష్షు ఇంకా ఉందని తెలిసినా అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. సమస్యలు శాశ్వతం కాదని తెలిసినా పరిష్కారం వెతకలేక ఊపిరి ఆపుకుంటున్నారు. క్షణికమైన ఆవేశంలో నిర్ణయాలను తీసుకుని అయిన వారికి శాశ్వతమైన వేదన మిగులుస్తున్నారు. కష్టాలను ఎదుర్కోలేని బలహీనత, బాధలను భరించలేని నిస్సహాయత, ఆలోచనలను అదుపు చేసుకోలేని మనస్తత్వం.. కలగలిపి ఆత్మహత్య అనే విపరీత నిర్ణయాలను తీసుకుంటున్నారు. జిల్లాలో ఈ తరహా ఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ఎచ్చెర్ల క్యాంపస్: హైస్కూల్ పిల్లల నుంచి మధ్య తరగతి ఇంటి యజమానుల వరకు, బాలికల దగ్గర నుంచి తల్లుల వరకు అందరూ ఈ భూతానికి బాధితులే. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న వారి జాబితా పరిశీలిస్తే.. ఆడ, మగ బేధం లేకుండా అందరి చావు కేకలు వినిపిస్తాయి. అందరి మరణాల వెనుక కారణాలు వేరైనా వారిని ఉసిగొల్పిన మానసిక భావన మాత్రం ‘క్షణికావేశం’. దీన్ని అధిగమించగలిగితే బతుకులు బాగు పడతాయని వైద్య నిపుణులు, మానసిక వేత్తలు సూచిస్తున్నారు. వీరంతా బతకాల్సిన వారే.. ►జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు పరిశీలిస్తే.. అందరి సమస్యలకు పరిష్కారం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ నిజాన్ని వారే తెలుసుకోలేకపోయారు. కుటుంబంతో కలిసి హాయిగా జీవించేందుకు అన్ని అవకాశాలు, అర్హతలు ఉన్నా చావు దారిని ఎంచుకున్నారు. ఎచ్చెర్ల అంబేడ్కర్ గురుకులంలో ఓ విద్యార్థిని చిన్న వ్యక్తిగత కారణంతో ఉరి వేసుకుని చనిపోయింది. కుమార్తెపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు వేదన మాత్రమే మిగిలింది. ►ఎస్ఎం పురం ఏపీ గురుకులంలో 10వ తరగతి విద్యార్థి ఓ ప్రత్యేక పరీక్ష సరిగా రాయలేదని, జవాబు పత్రం మార్చేద్దామని ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఈ అవమాన భారం భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిన్న తప్పునకు పెద్ద శిక్ష విధించుకున్నాడు. ► చిలకపాలెం సమీపంలో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థి తన పరీక్షను స్నేహితుడితో రాయించాడు. ఇది సిబ్బందికి తెలిసి విచారణ చేయించారు. దీన్ని అవమానంగా భావించిన విద్యార్థి ట్రైన్ కింద పడి మృతి చెందాడు. విచారణను ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్లి ఉంటే తల్లిదండ్రులకు వేదన మిగిలేదని కాదని తోటి విద్యార్థులు అంటున్నారు. ► శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రీయూనివర్సిటీ కోర్సు మొదటి సంవత్సరం విద్యార్థిని హాస్టల్లో ఉరి వేసుకుంది. ఈ అమ్మాయి చావు వెనుక కారణం కేవలం హోమ్ సిక్నెస్. ఇంటిని వద్దలి ఉండలేక ఏకంగా ప్రాణాలే వదిలేసింది. ► ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థి తనకు నచ్చని కోర్సులో జాయిన్ చేశారని ఏకంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మానాన్నలతో ఓ క్షణం మాట్లాడినా, వేరే ఆలోచన చేసి ఉన్నా ఈ రోజుకు విద్యార్థి నవ్వు తూ తిరిగేవాడని స్నేహితులు చెబుతున్నారు. ► యలమంచిలిలో అప్పులు, ఆస్తులపై బెంగ పెట్టుకున్న ఓ తల్లి తాను ఆత్మహత్యకు పాల్పడడమే కాకుండా ముగ్గురు పిల్లలను కూడా తనతో తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకుని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు చూడాలి పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. పిల్లల శక్తి సామర్థ్యాలు అంచనా వేసి వారికి నచ్చిన కోర్సుల్లో చేర్చాలి. సొంత ఇష్టాలను పిల్లలపైరుద్దకూడదు.విద్యార్థుల్లో మాన సిక ఒత్తిడి వల్ల ప్రతికూల ఆలోచనలు వస్తాయి. – ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, వైస్ చాన్స్‌లర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ప్రతికూల ఆలోచనలు వద్దు 14–20 ఏళ్ల మధ్య ఉన్న వారిలో ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. దీంతో మానసిక సంఘర్షణ తట్టుకోలేక విపరీత నిర్ణయా లు తీసుకుంటారు. ఆ క్షణంలో ఆత్మహత్య నిర్ణ యం వెనక్కి తీసుకుంటే మళ్లీ ఆ ఆలోచన రాదు. ఇలాంటి వారిని గుర్తించాలి. వారిని ఒంటరిగా వదలకూడదు. విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ కేంద్రాల నిర్వహణ కీలకం. – డాక్టర్ జేఎల్ సంధ్యారాణి, సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, కౌన్సిలర్ డాక్టర్ బీఆర్‌ఏయూ చదవండి: వివస్త్రను చేసి.. కళ్లల్లో, నోట్లో హిట్ కొట్టి... -
ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. 10 ఏళ్లు యవ్వనంగా..
ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. చాలా మంది నిత్యం అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకు చాలామంది ఆహార నియమాలు పాటిస్తారు. వ్యాయామం, యోగా, డైట్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కానీ ఓ వ్యక్తి చాలా విచిత్రంగా మూత్రం(యూరిన్) తాగడం వల్ల తన వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నాడు. మానసిక ఒత్తిడిని సైతం జయించినట్లు పేర్కొన్నాడు. అతనే ఇంగ్లాండ్‌కు చెందిన 34 ఏళ్ల హ్యారీ మెటాడీన్.. యూకేలోని హాంప్‌షైర్‌కు చెందిన హ్యారీ 2016 నుంచి ఇప్పటి వరకు రోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. ఇలా చేయడం వల్ల దాదాపు 10 ఏళ్లు యంగ్‌గా కనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు. గతంలో తనకు మానసిక సమస్యలను ఎదురవ్వగా వాటి నుంచి బయట పడేందుకు ఈ ’యూరిన్ థెరపీ’ ప్రారంభించినట్లు తెలిపాడు. దీంతో తనకు శాంతి, ప్రశాంతత వంటి కొత్త అనుభూతిని ఇచ్చిందని వెల్లడించాడు. అప్పటి నుంచి సొంత మూత్రాన్ని తాగుతున్నట్లు చెప్పాడు. తన మూత్రాన్ని బాటిల్స్‌లో స్టోర్ చేసుకొని.. రోజుకో 200 మి. లీ చొప్పున తాగుతుంటాడు. మూత్రాన్ని బాటిల్స్‌లో నింపి.. రెండు మూడు నెలల తర్వాత తాగుతున్నట్లు తెలిపాడు. దీనిని తాగినప్పుడు ఎంతో శక్తివంతంగా ఉంటుందని, ఒత్తిడి దూరమై, మెదడు చురుకుగా పనిచేస్తుందని హ్యరీ తెలిపాడు. అలాగే మూత్రాన్ని మాయిశ్చరైజర్‌గా తన ముఖానికి మసాజ్ చేస్తానని కూడా వెల్లడించాడు. ఇలా చేయడం వల్ల తన చర్మం యవ్వనంగా, మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుందంటున్నాడు. ఇక 90 శాతం నీరు ఉన్న మూత్రానికి శరీరంలో ఉన్న అన్ని రోగాలను నయం చేసే శక్తి ఉందని హ్యారీ విశ్వసిస్తున్నాడు. చదవండి: Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్ షాక్ మూత్రం తాగడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అలవాటును మార్చుకోనని చెబుతున్నాడు. దీనిని తయారు చేసేందుకు ఖర్చుకూడా లేకపోవడంతోపాటు నిత్య మూత్రం తాగడం వల్ల శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయని చెప్పారు. కాగా గతంలో సింగర్స్ మడోన్నా, కేషా కూడా మూత్రం తాగుతామని వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. మూత్రం తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ పెరుగుతుందని.. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని హెచ్చరిస్తున్నారు. -
ఆడవాళ్లదీ.. అదే దైన్యం!
సాక్షి నెట్వర్క్: ‘ప్రసూతి కోసం వెళ్లినా జీతం కట్.. పిల్లకు పాలిద్దామన్నా గంట సమయం కూడా ఇవ్వరు. పనిచేస్తున్న ప్రదేశంలోనే పాలిచ్చే పరిస్థితి. ఊరందరి సమస్యను మా సమస్యగా భావించే మేము, మా సమస్య వచ్చే సరికి ఎవరికీ కాకుండా పోయాం..’ఇదీ రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు రెండువేల మంది మహిళా వీఆర్ఏల మనోవేదన. 2014లో నిర్వహించిన వీఆర్ఏ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సుమారు 55 శాతం మంది మహిళలే ఎంపికయ్యారు. తాజాగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, వీఆర్ఏలకు సర్వీస్ రూల్స్, డ్యూటీ చార్ట్‌లేవీ అమల్లోకి రాలేదు. దీంతో మహిళా వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు, ఇసుక రవాణాను అడ్డుకునే డ్యూటీలు వేస్తుండటం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న వీఆర్ఏపై కొందరు దాడికి దిగారు. జీతాల్లో కోత పెడుతున్నారు.. వీఆర్ఏల సర్వీస్ క్రమబద్ధీకరణ ఆలస్యం అవుతుండటంతో సెలవులు, పని గంటలు అనేవి ఏవీ లేకుండాపోయాయి.పై అధికారి అనుమతితో సెలవుపై వెళితే జీతంలో కోత విధిస్తున్నారని చెబుతున్నారు. తల్లులు చంటిపిల్లలతో విధుల్లో పాల్గొనాల్సి వస్తోందని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళా వీఆర్ఏ శుక్రవారం సాక్షి ప్రతినిధితో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే జిల్లాలోని కొందరు తహశీల్దార్లు తమతో కొప్పులు, జడలు వేయించుకుంటున్నారని మరో మహిళా వీఆర్ఏ వాపోయారు. -
గుండె జబ్బుల బాధితుల్లో కుంగుబాటు ముప్పు
డబ్లిన్: మనిషి శరీరానికి, మనసుకు సంబంధం ఉంటుందన్న సంగతి తెలిసిందే. శారీరక, మానసిక ఆరోగ్యానికి మధ్య గల సంబంధంపై పరిశోధకులు చాలాఏళ్లుగా లోతైన అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఆరోగ్యకరమైన మనసు శారీరక ఆరోగ్యానికి సూచిక అని చెబుతున్నారు. అలాగే మనిషిలో కుంగుబాటు(డిప్రెషన్) అనేది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని గుర్తించారు. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే గుండె జబ్బులతో బాధిపడుతున్నవారిలో కుంగుబాటు అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు 55 నుంచి 75 ఏళ్లలోపు వయసున్న 6,500 మందిపై నిర్వహించిన ఈ నూతన అధ్యయనం ఫలితాలను ప్లోస్‌వన్ పత్రికలో ప్రచురించారు. ఆరోగ్యవంతుల్లో క్రమంగా డిప్రెషన్ లక్షణాలు బయటపడితే వారికి గుండెజబ్బుల ముప్పు పొంచి ఉన్నట్లేనని అధ్యయనంతో తేలింది. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతోపాటు కుంగుబాటు కూడా ఉంటే త్వరగా మరణించే అవకాశాలు పెరుగుతున్నట్లు వెల్లడయ్యింది. మనుషుల్లో కుంగుబాటును సృష్టించడంలో మెటబాలిక్ సిండ్రోమ్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధికంగా చక్కెర, నడుము చుట్టూ అధిక కొవ్వు, రక్తంలో అధికంగా చెడు కొలెస్టరాల్‌ను మెటబాలిక్ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు. గుండె జబ్బులు, కుంగుబాటు నుంచి విముక్తి పొందాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి. రోజువారీ దినచర్యలో శారీరక వ్యాయామాన్ని ఒక భాగంగా మార్చుకోవాలి. -
Russia-Ukraine war: రెచ్చిపోతున్న రష్యా
కీవ్: నెల రోజుల యుద్ధంలో సాధించిందేమీ లేదన్న నిస్పృహతో రష్యా నానాటికీ మరింత హేయంగా ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. నిర్బంధంతో అల్లాడుతున్న మారియుపోల్ నగరానికి బుధవారం ఆహారం తదితర అత్యవసరాలను తీసుకెళ్తున్న హ్యుమానిటేరియన్ కాన్వాయ్‌ని, 15 మంది రెస్క్యూ వర్కర్లను రష్యా సైన్యం నిర్బంధించిందని ఆరోపించింది. ఇరుపక్షాలూ అంగీకరించిన మానవీయ కారిడార్లను గౌరవించడం లేదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దుమ్మెత్తిపోశారు. నగరంపై భూ, గగనతల దాడులకు తోడు నావికా దాడులకూ రష్యా తెర తీసింది. అజోవ్ సముద్రం నుంచి ఏడు యుద్ధ నౌకల ద్వారా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజులుగా ఐదు సెకన్లకో బాంబు చొప్పున పడుతున్నట్టు నగరం నుంచి బయటపడ్డవారు చెప్తున్నారు. కీవ్‌లో ప్రతిఘటన కీవ్‌పైనా రష్యా దాడుల తీవ్రత బుధవారం మరింత పెరిగింది. నగరం, శివార్లలో ఎటు చూసినా బాంబు, క్షిపణి దాడులు, నేలమట్టమైన నిర్మాణాలు, పొగ తప్ప మరేమీ కన్పించని పరిస్థితి. కానీ ఉక్రెయిన్ దళాల ప్రతిఘటన నేపథ్యంలో రష్యా సేనలు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉండిపోయాయని చెప్తున్నారు. ఉత్తరాది నగరం చెర్నిహివ్‌ను కీవ్‌కు కలిపే కీలక బ్రిడ్జిని రష్యా సైన్యం బాంబులతో పేల్చేసింది. దాంతో నగరానికి అత్యవసరాలను చేరేసే మార్గం మూసుకుపోయింది. తిండీ, నీరూ కూడా లేక నగరవాసుల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధం ఉక్రెయిన్ సైన్యం దూకుడు మరింతగా పెరిగిందని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. పలు నగరాల్లో రష్యా సైన్యాన్ని విజయవంతంగా నిలువరిస్తున్నట్టు చెప్పారు. వారి గెరిల్లా యుద్ధరీతులకు రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోందన్నారు. దక్షిణాదిన రష్యా ఆక్రమించిన ఖెర్సన్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఉక్రెయిన్ను రోజుల వ్యవధిలోనే ఆక్రమించేస్తామన్న అతివిశ్వాసమే రష్యాను దెబ్బ తీసిందని పాశ్చాత్య సైనిక నిపుణులు అంటున్నారు. ‘‘పరాయి దేశంలో తీవ్ర ఆహార, ఇంధన కొరతతో రష్యా సైన్యం అల్లాడుతోంది. అతి శీతల వాతావరణం సమస్యను రెట్టింపు చేస్తోంది. మంచు దెబ్బ తదితర సమస్యలతో సైనికులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వేలాదిమంది చనిపోయారు’’ అని చెబుతున్నారు. మొత్తమ్మీద రష్యా తన యుద్ధపాటవంలో పదో వంతు దాకా కోల్పోయిందని అమెరికా అంచనా. ఆకలికి తాళలేక రష్యా సైనికులు దుకాణాలు, ఇళ్లను లూటీ చేస్తున్నారని ఉక్రెయిన్ చెబుతోంది. చర్చల్లో పురోగతి రష్యాతో చర్చల్లో కాస్త పురోగతి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. పలు కీలకాంశాలపై రెండువైపులా ఏకాభిప్రాయం దిశగా పరిస్థితులు సాగుతున్నాయన్నారు. పశ్చిమ దేశాలు మాత్రం రష్యా దిగొస్తున్న సూచనలేవీ ఇప్పటిదాకా కన్పించడం లేదంటున్నాయి. జీ–20 నుంచి రష్యాకు ఉద్వాసన! ఆంక్షలతో అతలాకుతలమవుతున్న రష్యాను ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక శక్తుల బృందమైన జీ–20 గ్రూప్ నుంచి తొలగించడంపై మిత్రపక్షాలతో అమెరికా చర్చలు జరుపుతోందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ తెలిపారు. ‘‘ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా అన్యాయమైన యుద్ధానికి దిగినందుకు పర్యవసానాలను రష్యా అనుభవించాల్సి ఉంటుంది. ఇకపై అది అంతర్జాతీయంగా ఏకాకిగానే మిగిలిపోతుంది’’ అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల మద్దతును మరింతగా కూడగట్టేందుకు నాలుగు రోజుల యూరప్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం బయల్దేరారు. తొలుత బ్రెసెల్స్‌లో దేశాధినేతలతో ఆయన వరుస చర్చలు జరుపుతారు. నాటో అత్యవసర శిఖరాగ్ర భేటీలో, యూరోపియన్ యూనియన్, జీ–7 సమావేశాల్లో పాల్గొంటారు. శుక్రవారం పోలండ్ వెళ్లి మర్నాడు అధ్యక్షుడు ఆంద్రే డూడతో భేటీ అవుతారు. -
ఒత్తిడిని తగ్గించుకోవడానికి... వాడండి.. ఈ అరుపు మాత్రలు
Scream To Release Stress: డాక్టర్ రాసే మాత్రలు వేరు. మనం వాడుకోవాల్సిన మాత్రలు కూడా ఉంటాయి. అమెరికాలో స్త్రీలు ఇప్పుడు ‘స్క్రీమ్ గేదరింగ్స్’లో పాల్గొంటున్నారు. అంటే ఒక మైదానంలో చేరి పెద్ద పెద్దగా అరిచి తెరిపిన పడుతున్నారు. ఎందుకు? ఒత్తిడి దూరం చేసుకోవడానికి. మన దేశంలో కూడా కోవిడ్ వల్ల, కుటుంబ సభ్యుల అనారోగ్యాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల స్త్రీలు లోలోపల వొత్తిడి పేరబెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు. డాబా మీదకో, గ్రౌండ్లోకో వెళ్లి ‘స్క్రీమ్’ చేయడం ఒత్తిడికి ఒక మందు. ‘లాఫింగ్ థెరపీ’లా ఈ థెరపీ ఇప్పుడు అవసరమే సుమా. సంప్రదాయ చైనీయ వైద్యంలో కొండ చిటారుకో, ఏదైనా ఏకాంత ప్రదేశానికో వెళ్లి పెద్ద పెద్దగా అరవడం కూడా ఒక ఆరోగ్య సాధనం అని నమ్ముతారు. చైనా సంగతేమో కాని అమెరికాలోని స్త్రీలు మా అసహనాన్ని పెద్దగా అరచి పారదోలుతాం అని ఇటీవల ఏదో ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్లోనో పార్క్‌లోనో ‘స్క్రీమ్ గేదరింగ్స్’ నిర్వహిస్తున్నారు. అంటే ఒక పదీ పదిహేను నిమిషాల సేపు పెద్దగా అరిచి తమ మనసులో, శరీరంలో ఉన్న అలజడిని తగ్గించుకోవడం అన్నమాట. దానికి కారణం గత రెండేళ్లుగా కోవిడ్ వారిపై ఏర్పరుస్తున్న ఒత్తిడిని వాళ్లిక సహించలేని స్థాయికి చేరడమే. కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించే వాక్సిన్ ఇంకా రాకపోవడం, వాక్సిన్ వేసుకున్నా దాని బారిన పడుతూ ఉండటం, చంటి పిల్లలకు ఇంకా వాక్సిన్ లేకపోవడం, కోవిడ్ వల్ల అందరూ ఇంట్లో ఉండిపోవాల్సి రావడం, ఉద్యోగాలు ఊడటం, రెట్టింపు పని చేయాల్సి రావడం... ఇవన్నీ పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా గూడు కట్టుకుని పోతున్నాయి. అవి అలాగే లోపల సాంద్రపడటం ప్రమాదం అని నిపుణులు అంటారు. వొత్తిడిని సాటివారితో పంచుకుని రిలీఫ్ పొందాలి. కాని సాటివారు కూడా అలాంటి వొత్తిడిలో ఉంటే ఏమిటి చేయడం. ‘పదండి... అందరం కలిసి అరుద్దాం’ అని అమెరికాలోని స్త్రీలు స్క్రీమ్ థెరపీని సాధన చేస్తున్నారు. అయితే ఈ అరుపులు ఇతరులు వినకపోవడమే మంచిది. పెద్దగా గట్టిగా అరిచే మనిషిని చూడటం, వినడం ఎదుటి వారికి ఆందోళన కలిగించవచ్చు. అందుకే వీలైనంత ఏకాంత ప్రదేశంలో వీటిని సాధన చేయడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. యోగాలో కూడా ‘జిబ్రిష్’ వంటివి సాధన చేయిస్తుంటారు. అంటే ఒక ఐదు పది నిమిషాలు గొంతులో నుంచి ఏ పిచ్చి అరుపులు వస్తే ఆ అరుపులను అలౌ చేస్తూ వెళ్లడం. దీని వల్ల సబ్కాన్షియస్ మైండ్‌లో గూడు కట్టుకుని ఉన్న గాఢమైన భావాలు వదిలిపోతాయని చెబుతారు. మరో పద్ధతి ‘ట్రీ షేక్’. అంటే ఒక చెట్టు గాలికి ఎలా గలగలలాడిపోతుందో అలా మూడు నాలుగు నిమిషాలు నిటారుగా నిలబడి ఒళ్లంతా గలగలలాడించాలి (కదిలించాలి). దాని వల్ల ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు అంటారు. మన దేశంలో అమ్మలు, పెద్దవాళ్లు ఏదైనా ఒత్తిడి పెరగడం వల్ల గట్టిగా తిట్టడం, అరవడం చూస్తూ ఉంటాం. అది ఒక రకంగా స్ట్రెస్ నుంచి దూరమవడమే. ఎన్నో చేదు సంఘటనలు, అయిష్టమైన పరిణామాలు చూసిన స్త్రీలు ‘గయ్యాళి’ ముద్రతో ఉండటం కూడా మన సమాజంలో ఉంది. నిజానికి అదంతా లోపలి ఒత్తిడికి ఒక బయటి ప్రతిఫలనం. ఆ ఒత్తిడి ఏమిటో కనుక్కుని దూరం చేయగలిగితే వారు కూడా శాంత స్వభావులు అవుతారు. గత రెండేళ్లుగా ఇళ్లల్లో ఉగ్గ పట్టుకుని ఉన్న స్త్రీలు ఏ మేరకు ఒత్తిడిలో ఉన్నారో కుటుంబం మొత్తం పట్టించుకోవాలి. ఇవాళ రేపూ అంటూ కోవిడ్ ముగింపు వాయిదా పడే కొద్దీ వారి మనసులో ఎలాంటి భావాలు చెలరేగుతున్నాయో కూడా పరిశీలిస్తూ ఉండాలి. వారు విసుక్కుంటూ ఉంటే, ఒక్కోసారి పని వైముఖ్యం చూపుతుంటే కుటుంబం సంపూర్ణంగా ఆ మూడ్స్‌ను అర్థం చేసుకోవాలి. మగవాళ్లు స్ట్రెస్‌ను తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. వారికి కనీసం బయట ఒకరిద్దరు స్నేహితులను కలిసే వీలు ఉంటుంది. స్త్రీలు ఇళ్లకే పరిమితమయ్యే అనివార్య పరిస్థితులు ఈ రెండేళ్లలో వచ్చాయి. అందుకే వారి మానసిక ఆరోగ్యం కూడా శ్రద్ధ పెట్టక తప్పదు. మంచి నిద్ర, ఉల్లాసం, ఆశావహమైన భవిష్యత్తు కనిపించకనే తాము పార్కుల్లో చేరి కేకలేస్తున్నాం అంటున్నారు అమెరికా వనితలు. ‘మా మీద మేము అరుచుకోలేము. కుటుంబం మీద అరవలేము. పిల్లల చదువు సరిగ్గా సాగకపోవడం మాకు చాలా వొత్తిడి కలిగిస్తోంది. వాళ్ల మూడ్స్ కూడా మాకు కష్టమే. మాకు వొత్తిడిగా ఉంది. అందుకే ఏడ్చి తెప్పరిల్లే బదులు అరిచి తెరిపిన పడుతున్నాం’ అని బోస్టన్‌లో స్క్రీమ్ థెరపీలో పాల్గొన ఒక గృహిణి అంది. ‘కోపం పోవడానికి పంచింగ్ బ్యాగ్‌ను పంచ్ చేయడం ఎలాగో ఒత్తిడి పోవడానికి ఇలా పెద్దగా అరవడం అలాగా’ అని కొందరు నిపుణులు అంటున్నారు. యుద్ధ సైనికుడు గెలుపు నినాదం ఇచ్చినట్టు, కుంగ్‌ఫూ ఫైటర్ పంచ్ ఇచ్చే ముందు అరిచినట్టు, కింగ్ కాంగ్ శత్రువు మీద దాడి చేసే ముందు గుండెలు చరుచుకున్నట్టు మామూలు మనుషులు కూడా ఏదో ఒక పార్కులో చేరి తమ లోపల ఉన్న ఒత్తిడి అనే శత్రువును ఈ పద్ధతుల్లో ఓడించవచ్చని నిపుణులు అంటున్నారు. స్క్రీమ్ థెరపీ వల్ల ప్రయోజనం ఎలా ఉన్నా దాని వంకతో తమ లాంటి కొంతమంది స్త్రీలతో ఏదో ఒక మేరకు కొత్త స్నేహం, సంభాషణ కూడా ఒత్తిడి తగ్గిస్తాయి. కాబట్టి కొత్త మార్గాలు వెతకండి. ఆరోగ్యంగా ఉండండి. ఒత్తిడిని ఒంట్లో నుంచి ఖాళీ చేయండి. -
మనసు మాట విందాం.. మీకు అండగా మేమున్నాం!
‘నాకు బతకాలని లేదు’ ఒక నిస్సహాయ స్వరం. ఆ స్వరానికి ఓ ఆలంబన కావాలి. ‘ఎందుకలా’ అని చేతి మీద చెయ్యి వేసి అడిగే ఓ ఆత్మీయత కావాలి. ‘నీకేం తక్కువ... నువ్వు సాధించినవి తరచి చూసుకో’ అనే ధైర్యవచనం కావాలి. ‘ఉద్యోగంలో కష్టం వస్తే నీ ప్రాణం తీసుకోవడమా!! కాదు.. కాదు... ఉద్యోగం మారాలి’ అని ప్రత్యామ్నాయం చూపించే భరోసా కావాలి. పరీక్ష ఫెయిల్ అయితే ‘ఉందిగా సెప్టెంబరు’ అనే చమత్కారపు స్నేహం కావాలి. మామూలు రోజుల్లో ఈ ఆత్మీయత, స్నేహం, ధైర్యవచనం, ఆలంబన మన పక్కనే ఉండేవి. అవేవీ సమయానికి అందని వాళ్లు మాత్రమే నిస్సహాయంగా మిగిలేవాళ్లు. గడచిన రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని కబళించేసింది. ఈ మాత్రపు ఆత్మీయవచనం చెప్పే వాళ్లను దూరం చేసింది. ఐసోలేషన్... ఐసోలేషన్... ఐసోలేషన్. కూరగాయల బండి దగ్గర కనిపించిన పక్కింటి వాళ్లను పలకరించాలంటే భయం. మనిషి కనిపిస్తే మాస్కును సరిచేసుకోవడమే దినచర్య అయింది. ఉద్యోగం ఉంటుందో పోతుందోననే భయం. వర్క్ ఫ్రమ్ హోమ్ వరమా శాపమ తెలియని ఆందోళన. ఇంట్లో ప్రతి పని సొంతంగా చేసుకోవాల్సి రావడంతో చిరాకులు. మనసులో సుడులు తిరుగుతున్న భయాలకు, చిరాకులకు అవుట్లెట్ కూడా ఇంట్లో ఒకరికొకరే అయ్యారు. మనుషులు దగ్గరగా ఉన్నారు, మానసికంగా దూరమయ్యారు. దూరమైన సంగతి కూడా తెలియనంతగా దూరమైపోయారు. స్మార్ట్ఫోన్లకు, సోషల్ మీడియాకు బానిసలైపోయారు. మగవాళ్లలో వీటన్నింటితోపాటు ఆల్కహాలు సేవనం ఎక్కువైంది. వయసు మీరిన పెద్దవాళ్లలో తమకేదైనా జరిగితే అంత్యక్రియలు కొడుకులు, కూతుళ్ల చేతుల మీదుగా సవ్యంగా సాగుతాయో లేదోననే బెంగ. పిల్లల్లో బడి గంట మోగితే పాఠాలు ఎలా చదవాలోననే బెరుకు. ఇన్ని ఆందోళనల మధ్య సాగుతోంది జీవనం. మానసిక స్థితిని అదుపులో పెట్టుకోగలిగిన వాళ్లు సంయమనం తో గడపగలిగారు. ఫ్రస్టేషన్‌ను భరించలేని వాళ్లు అరచి గోల చేసి శాంతించారు. ఆ అరుపులను భరిస్తూ, బాధితులైన బలహీనులు ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ బలిదానాలు ఎక్కువగా అల్పాదాయ వర్గాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. పని దొరక్కపోవడం ఒక కష్టం, ఉన్న నాలుగు రూపాయలు మద్యానికి ఖర్చు చేయడం, తాగిన మత్తులో గొడవలు పడడం, భర్త తన ఆధిపత్య ప్రదర్శన కోసం భార్యను రోడ్డు మీదకు లాక్కు వచ్చి మరీ కొట్టడం... కరోనా కాలంలో కరాళనృత్యం చేసిన కష్టాలు. ఈ గడ్డు పరిస్థితులు జీవితాన్ని అంతం చేసుకునే దారులుగా మాత్రం మారకూడదు, అందుకే శనివారం(8–1–2022) నాడు ‘సైకియాట్రీయట్ డోర్‌స్టెప్’ అనే కార్యక్రమం మొదలు పెట్టాం... అని చెప్తున్నారు రోష్ని వ్యవస్థాపకురాలు శశి. ప్రాణాలను నిలిపే ప్రయత్నమిది ‘‘ఆత్మహత్యలను నివారించడానికి గడచిన 24 ఏళ్లుగా పని చేస్తోంది రోష్ని సంస్థ. ‘నీ బాధ వినడానికి మేమున్నాం’ అంటూ హైదరాబాద్, బేగంపేటలో 1997లో హెల్ప్‌లైన్‌తో మొదలైన రోష్ని ఇప్పటి వరకు 98వేల ఫోన్ కాల్స్‌కు స్పందించింది. ‘తమ సమస్య ఇదీ’ అని బయటకు చెప్పుకోలేని మధ్యతరగతి మహిళలు తమ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఫోన్ చేసి సహాయం కోరుతున్నారు. అలా సహాయం కోరిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ వాళ్లు మానసికంగా దృడంగా మారేవరకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు రోష్ని వాలంటీర్లు. అలాగే పన్నెండేళ్ల కిందట మొదలు పెట్టిన కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ముఖాముఖి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లో వాళ్ల కోసం ఫ్రీ మెంటల్హెల్త్ క్యాంప్‌లు మొదలు పెట్టి 33 వేలకు పైగా పేషెంట్లకు వైద్యం చేశాం. ఇటీవల గణాంకాలు, వార్తా కథనాలను, మాకు వచ్చే ఫోన్ కాల్స్‌ను కలిపి విశ్లేషించుకున్నప్పుడు మా సేవలను మరింత గా విస్తరించి తీరాలని అర్థమైంది. 2020లో ఆత్మహత్యలు విపరీతం గా పెరిగాయి. వీటన్నింటికీ పైకి కనిపించే తక్షణ కారణాలు ఎలా ఉన్నప్పటికీ వాటన్నింటి వెనుక ప్రధాన కారణం కోవిడ్ అని చెప్పక తప్పదు. తాము మానసిక వేదనకు లోనవుతున్న విషయాన్ని గ్రహించని వాళ్లే ఎక్కువ, కొందరు గ్రహించినప్పటికీ సైకాలజిస్టును, సైకియాట్రిస్టును సంప్రదించే పరిస్థితులు ఉండడం లేదు. అంతంత ఫీజులు ఇచ్చుకోలేకపోవడం, సైకాలజిస్టు ఎక్కడ ఉంటారో తెలియకపోవడం కూడా కారణమే. కాలనీకి ఒక గైనకాలజిస్టు కనిపిస్తారు, కానీ మన దగ్గర సైకాలజిస్టులు తగినంత మంది లేరు. ఉన్న వాళ్లు కూడా ఈ కాలనీలకు అందుబాటులో లేరు. అందుకే మేమే ఆ సర్వీసుని వాళ్ల ఇంటి ముంగిటకు తీసుకువెళ్తున్నాం. ఈ వైద్యానికి దూరంగా ఉండడానికి ‘పిచ్చి’ అని ముద్ర వేస్తారనే భయం కూడా కారణమే. మానసిక ఆందోళన పిచ్చి కాదని, మానసిక ఆవేదన, ఆందోళన, దిగులు, బెంగ వంటి స్థితిని సరిచేసుకుని జీవితాన్ని ఆరోగ్యవంతంగా, ఆనందకరంగా మార్చుకోవాలని పదే పదే చెప్తున్నాం. సమాజంలో మెంటల్హెల్త్ పట్ల ఉన్న అతిపెద్ద మానసిక అడ్డంకిని ఛేదించడానికి దాట్ల ఫౌండేషన్‌తో కలిసి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారామె. – వాకా మంజులారెడ్డి బిడియం వీడండి గొంతు విప్పండి ‘సైకియాట్రీ యట్ డోర్‌స్టెప్’ వాహనంలో ఒక సైకియాట్రిస్ట్, కౌన్సెలర్, కో ఆర్డినేటర్‌తోపాటు సాధారణ మానసిక సమస్యలకు అవసరమయ్యే మందులు ఉంటాయి. ఈ సర్వీస్‌కంటే ప్రధానంగా వారిని చైతన్యపరచడం పనిగా పెట్టుకున్నాం. ఒంట్లో బాగా లేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి ఏ మాత్రం బిడియపడం, అలాగే మనసు బాగాలేనప్పుడు సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్‌ను సంప్రదించడానికి కూడా ఏ మాత్రం బిడియపడకూడదని చెప్పడం ప్రధాన కర్తవ్యం. – శశి, ‘రోష్ని’ వ్యవస్థాపకురాలు -
Jr NTR: 'ఆ టైంలో డిప్రెషన్‌కు లోనయ్యా.. రాజమౌళి బయటకు తీసుకొచ్చాడు'
Jr NTR Depression: ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తుంది మూవీ టీం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ తన డిప్రెషన్ గురించి బయటపెట్టాడు. 17ఏళ్లకే హీరోగా తెరంగేట్రం చేశాను. రెండవ సినిమాకే స్టార్ స్టేటస్ చూశాను. అయితే కొన్నాళ్ల తర్వాత వరుస డిజాస్టర్లు పలకరించాయి. ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా. ఏం చేస్తున్నానో తెలియని అయోమయంలో పడిపోయాను. అలాంటి గందరగోళ పరిస్థిత్లుల్లో ఉన్నప్పుడు ఆత్మపరిశీలన చేసుకునేందుకు జక్కన్న సాయం చేశాడు. వరుస ఫ్లాపులతో ఉన్న నాతో యమదొంగ లాంటి సూపర్ హిట్ ఇచ్చి మళ్లీ నన్ను సక్సెస్ ట్రాక్‌లో నిలబెట్టారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు నా స్నేహితుడిగా రాజమౌళి ఎప్పుడూ నాకు అండగా నిలబడ్డారు. అయితే ఆ విజయాలతో నేను పెద్దగా సంతృప్తి చెందలేదు. కానీ ఆర్ఆర్ఆర్లో నటించడం సంతృప్తినిస్తుంది. నటుడిగా ఎంతో నేర్చుకున్నాను అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపిస్తే, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. -
అమ్మ మనసెరిగి ..
అమ్మాయి జీవితంలో తల్లికావడం అనేది మహత్తర ఘట్టం. గర్భం దాల్చామని తెలియగానే అమ్మాయితోపాటు, అత్తింటివారి నుంచి పుట్టింటిదాక, అంతా అంతో సంబర పడిపోతుంటారు. అయితే ‘‘ఇవి తినండి, అవి తినండి’’ అని చెప్పేవాళ్లే గానీ, గర్భిణి మానసికస్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఆలోచించేవారు తక్కువ. కాబోయే తల్లి ఆనందంతోపాటు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతుంది. ఆ ప్రభావం పుట్టిన బిడ్డపై పడుతుంది. దీనిపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని గొంతెత్తి చెబుతోంది అన్వితా నాయర్. ఇంజినీరింగ్ పూర్తి చేసిన 22 ఏళ్ల యంగ్ అండ్ డైనమిక్ మిస్ అన్విత ఇలా చెప్పడానికి తనకెదురైన ఓ దుర్ఘటనకు పడిన సంఘర్షణ, కుంగుబాటులే కారణం. బెంగళూరుకు చెందిన అన్వితా నాయర్‌కు 2017లో ఒకసారి బాగా జ్వరం వచ్చింది. ఒళ్లంతా జ్వరంతో కాలిపోతుంటే నీరసంగా పడుకుని ఉంది. ఇది చాలదన్నట్టు తనకెంతో ఇష్టమైన ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న విషాదకర వార్త వినింది. ఈ విషయం తెలిసినప్పుడు అన్విత వయసు 17 ఏళ్లు. తన ప్రాణ స్నేహితురాలు అలా చనిపోవడం జీర్ణించుకోలేక పోయింది. అసలు తను ఎందుకు అలా చేసుకుంది? స్నేహితురాలు లేని లోకాన్ని ఊహించుకోలేక, బాగా కృంగిపోయింది. అలా నాలుగు నెలలపాటు సరిగా నిద్రకూడా పోలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందుతూ డిప్రెషనకు లోనైంది. అన్ని రోగాల్లా కాదు.. నెలలతరబడి డిప్రెషన్ లో ఉన్న అన్విత చదువులో బాగా వెనుబడిపోతుండేది. ఫలితంగా ఇంజినీరింగ్ సెమిస్టర్‌ను రాయలేకపోయింది. ‘‘ఇది అన్ని రోగాలలా కాదు. మానసిక వ్యాధి. దీనిలో ఉంటే మరింత దిగజారిపోతావు. మందులు వాడితే బయటపడవచ్చు’’ అని అంతా సలహా ఇవ్వడంతో సైకాలజిస్టుని కలిసి, థెరపీ తీసుకుంది. థెరపీతో త్వరగానే అన్విత మానసిక ఆరోగ్యం కుదుటపడింది. ఒకపక్క ఇంజినీరింగ్ సిలబస్ చదువుతూనే మరోపక్క మానసిక ఆరోగ్యం గురించిన పుస్తకాలు చదివేది. అలా మానసిక సమస్యలపై చక్కటి అవగాహన పెంచకున్న అన్విత..తను ఎదుర్కొన్న మానిసిక సంఘర్షణ, కుంగుబాటులను ఎవరూ ఎదుర్కోకూడదని అందరి దగ్గర డిప్రెషన్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి అవగాహన కల్పిస్తుండేది. కేసు స్టడీల ద్వారా... మానసిక సమస్యలపై అవగాహన కల్పిస్తూనే, మానసిక ఆరోగ్యం గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు నెట్లో వెతికేది. ఈ క్రమంలో ‘‘12–25 శాతం మంది మహిళలు మాతృసంబంధమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో యాభైశాతంమందికి కూడా తాము మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలియదు. దీని ప్రభావం తల్లీ్లబిడ్డలపై పడుతుంది’’ అని తెలుసుకుంది. అది అలాగే కొనసాగితే పిల్లల భావోద్వేగ, శారీరక, నాడీ సంబంధిత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్రహించింది. ప్రెగ్నెంట్ మహిళ గైనకాలజిస్టుని సంప్రదించినప్పుడు తల్లీ, కడుపులో ఎదుగుతున్న బిడ్డ ఆరోగ్యంపైనే దృష్టి కేంద్రీకరిస్తారుగానీ, తల్లి మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అందువల్ల ఈ విషయం ఎవరికి తెలియదు. ఈ సమస్య గురించి వెలుగులోకి తెచ్చి అవగాహన కల్పించాలనుకుని అప్పటి నుంచి తల్లి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతోంది. వెబ్సైట్ ద్వారా... గతేడాది ‘ప్యాట్రనస్ మెంటల్హెల్త్ డాట్‌కమ్’ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించి.. మానసిక ఆరోగ్యంపై కంటెంట్‌ను పోస్టు చేస్తుంది. అంతేగాక ఈ ఏడాది జూన్ లో చేంజ్‌డాట్ ఓఆర్జీ వేదికగా, మాతృ సంబంధమైన మానసిక సమస్యలను గుర్తించాలని కోరింది. అంతేగాక కర్ణాటక మానసిక ఆరోగ్యం విభాగం డిప్యూటీ డైరెక్టర్ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఈ విషయంపై ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని, మాత్ర సంబంధ మానసిక సమస్యలను ఏర్పాటు చేసి, వాటికి ప్రచారం కల్పించాలని ప్రభుత్వాలను కోరుతోంది. నేను తల్లయ్యేనాటికి.. ‘‘ఈ రోజు నేను తల్లిని కాకపోవచ్చు. భవిష్యత్‌లో తల్లినవుతాను. అప్పుడు నెలవారి చెకప్‌లలో భాగంగా ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్లు మానసిక సమస్యలపై కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాను. శారీరక ఆరోగ్యంపై మానసిక సమస్యల ప్రభావం తప్పకుండా పడుతుంది. అమ్మాయిలు విషయాన్ని త్వరగా బయటకు చెప్పుకోలేరు. తమలో తామే కృంగిపోతుంటారు. ఇది అమ్మాయికి గానీ, తన భవిష్యత్ కుటుంబానికిగానీ మంచిది కాదు. అందుకే అందరూ మానసిక సమస్యలపై బాహాటంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి’’ అని అన్విత చెప్పింది. అన్వితా నాయర్ -
వర్ధమాన షూటర్ కోనికా ఆత్మహత్య
జాతీయ స్థాయి షూటర్, జార్ఖండ్‌కు చెందిన 26 ఏళ్ల కోనికా లాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల ఆశించిన స్థాయి ప్రదర్శన లేకపోవడంతో ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కోల్‌కతాలో మాజీ ఒలింపియన్ జాయ్దీప్ కర్మాకర్ వద్ద కోనికా శిక్షణ పొందుతోంది. సొంత రాష్ట్రం తరఫున మంచి ప్రదర్శన ఇవ్వడంతో నటుడు సోనూసూద్ ఆమెకు ప్రత్యేక రైఫిల్ కొనిచ్చి ప్రోత్సహించాడు. ఇటీవల అనూహ్య రీతిలో నలుగురు షూటర్లు ఆత్మహత్యకు పాల్పడటం చర్చకు దారి తీస్తోంది. -
కోరుకున్న ఉద్యోగం రాలేదు, ఏజెన్సీ మోసం.. రెండు నెలలుగా..
సాక్షి,ఇల్లెందు(ఖమ్మం): కొలువు వేటలో విసిగి వేసారిన ఓ యువకుడు తనువు చాలించాడు. కట్టుకున్న భార్యకు, కన్న తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చాడు. ఈ విషాదకర సంఘటన ఆదివారం ఇల్లెందు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ అక్కిరాజు గణేష్ పెద్ద కుమారుడు అజయ్(30) బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీకి రూ. 3 లక్షలు చెల్లించాడు. కానీ ఓ కంపెనీలో తాత్కాలిక పద్ధతిన ఉద్యోగం కల్పించారు. రెండు నెలల నుంచి ఆ కంపెనీ పైసా వేతనం చెల్లించలేదు. గడిచిన మే నెలలో అజయ్‌కు వివాహం కూడా జరిగింది. భార్య దుర్గాభవాని ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. నాలుగు రోజుల క్రితమే ఆస్పత్రికి వెళ్లేందుకు పట్టణంలోనే సుభాష్‌నగర్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కాగా అజయ్ వర్క్ ఫ్రం హోమ్‌లో భాగంగా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నాడు. కోరుకున్న ఉద్యోగం రాకపోవడం, ఏజెన్సీ మోసం చేయడం, రెండు నెలలుగా పనిచేసిన కంపెనీ కూడా వేతనం చెల్లించకపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో తన గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. ఎంతకు బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెళ్లి తలుపులు తెరిచి చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పుట్టింటి నుంచి వచ్చిన భార్య విగతజీవిగా మారిన భర్తను చూసి గుండెలవిసేలా రోదించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సాఫ్ట్వేర్ కంపెనీ మోసం వలే తన కుమారుడు మృతి చెందాడని తండ్రి వాపోయాడు. గోవాలో ఉన్న ఎమ్మెల్యే హరిప్రియ, మార్కెట్ చైర్మన్ బాణోతు హరిసింగ్ నాయక్, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఫోన్లో గణేష్‌ను పరామర్శించారు. టీఆర్ఎస్ నేతలు గుండా శ్రీకాంత్, మహేందర్, పీవీ కృష్ణారావు, హరికృష్ణ, హరినాథ్‌బాబు, సన రాజేష్, రాజు తదితరులు మృతదేహాన్ని సందర్శించి, సంతాపం తెలిపారు. చదవండి: రెండురోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు.. గుట్టుగా ఒకటి.. దర్జాగా మరొకటి -
టిక్‌టాక్‌తో చిత్ర విచిత్రంగా కన్ను కొట్టేస్తున్నారు
టిక్ టాక్ ప్రపంచ దేశాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ ఆకర్షణే భారత్ మినహా మిగిలిన దేశాలకు చెందిన పిల్లల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా టిక్ టాక్ వినియోగంతో అనారోగ్యానికి గురై పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. భారత కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్‌పై నిషేదం విధించింది. కానీ మిగిలిన దేశాల్లో ఆ యాప్ వినియోగంలో ఉండడం, ఆ యాప్‌ను ఉపయోగించి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. టిక్ టాక్ వినియోగిస్తున్న వారిలో 'టూరెట్ సిండ్రోమ్' అనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తేలింది. ముఖ్యంగా పిల్లల నాడీ వ్యవస్థపై ప్రభావం, చిత్ర విచిత్రంగా కన్ను కొట్టడం, ఎక్స్ ప్రెషన్స్, సౌండ్స్ చేయడం లాంటి రుగ్మతలు ఎక్కువయ్యాయి. ఇటీవల జర్మనీకి చెందిన పలు ఆస్పత్రులకు ఈ తరహా సమస్యలతో బాధపడే యువతీ యువకులు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారని వాల్‌స్ట్రీట్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ పలు మెడికల్ రిపోర్ట్‌ల ప్రకారం..లాక్ డౌన్‌కు ముందు టిక్ టాక్ వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురై ట్రీట్మెంట్ కోసం నెలకు ఒకరు లేదా ఇద్దరు వచ్చే వాళ్లు. కానీ ఇప్పుడు వారి సంఖ్య 10 మంది నుంచి 20 మందికి పెరిగినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. టూరెట్ సిండ్రోమ్‌కు ట్రీట్మెంట్ చేయడంలో 25 ఏళ్ల అనుభవం ఉన్న జర్మనీలోని హనోవర్‌కు చెందిన డాక్టర్ కిర్‌స్టెన్ ముల్లర్ మాట్లాడుతూ..''టీనేజర్స్,యువతీ యువకులు ఎక్కువ మంది టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. వారిలో టూరెట్ సిండ్రోమ్ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు ఎక్కువైనట్లు తెలిపారు. ఈ రుగ్మత ఎక్కువగా అబ్బాయిల్ని ప్రభావితం చేస్తుంది. అనారోగ్య సమస్యలు యవ్వనంలో ఉన్నప్పుడు మొదలవుతాయి. తరువాత కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయని"అన్నారు.అయితే మరికొంత మంది డాక్టర్లు టీనేజర్స్ ఎదురవుతున్న సమస్య టూరెట్ సిండ్రోమ్ కాదని అంటున్నారు. ఫంక్షనల్ మూవ్మెంట్ డిజార్డర్ అని చెబుతున్నారు. అదిగమించడం ఎలా టిక్ టాక్ వల్ల ఎదురయ్యే సమస్యలకు ట్రీట్మెంట్ చేయవచ్చని తెలుస్తోంది. పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ వారు వీడియోలు చేస్తుంటే ఏ తరహా వీడియోలు చూస్తున్నారో తల్లిదండ్రులు గుర్తించాలని అంటున్నారు. ప్రతిరోజు అదే పనిగా టిక్‌టాక్ వీడియోలు చేస్తుంటే తల్లిదండ్రులు వైద్య నిపుణుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. చదవండి: Apple Fired Janneke Parrish: లీకుల పేరుతో ఉద్యోగులపై ఆపిల్ వేటు -
Mental Health: మంచి మ్యూజిక్, యోగా, డాన్స్, స్విమ్మింగ్.. వీటితో ఒత్తిడి హుష్!!
ఇటీవలి కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న సమస్య మానసిక ఒత్తిడి. మన శక్తి సామర్థ్యాల గురించి మనం ఉన్నదానికన్నా బాగా ఎక్కువగా లేదా బాగా తక్కువగా ఊహించుకోవడం... ఫలితంగా నిరాశకు గురికావడం, మన గురించి మనం ఆలోచించడం కన్నా ఇతరులలో తప్పులు ఎన్నడం, సమయానికి తిండి, నిద్ర లేకపోవడం, ఎక్కువగా పని చేస్తూ తీవ్రమైన అలసటకు గురికావడం ఒత్తిడికి గురి చేస్తుంది. ఒత్తిడి వల్ల మన నాడీవ్యవస్థలోనూ, నరాల్లోనూ రసాయనాల మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల వల్ల రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌తో పాటు చక్కెర పాళ్లు పెరుగుతాయి. ఇది ఎక్కువయితే కుంగుబాటు లేదా డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. కనుక ఒత్తిడికి గురికాకుండా ముందే జాగ్రత్త పడటం, ఒత్తిడి ఎక్కువయినప్పుడు వాటినుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం అవసరం. చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు.. ఇలా అధిగమిద్దాం.. ►ఒక విషయం గురించి ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అవతలి వారు చెప్పేదానిని వినడం, తక్కువ మాట్లాడటం మంచిది. ►విషయాలను మన కోణం నుంచి మాత్రమే కాకుండా ఎదుటి వారి కోణం నుంచి కూడా చూసి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ►మన భావోద్వేగాలను బలవంతంగా అణిచేసుకోకుండా సన్నిహితులతో పంచుకోవడం వల్ల ఒత్తిడిని దూరం పెట్టవచ్చు. ►దేనికి ఒత్తిడికి గురి అవుతున్నామో గమనించుకుని రెండోసారి దానికే మళ్ళీ గురి కాకుండా ఉండేలా చూసుకోవాలి. ►సానుకూల దృక్పథంతో ఉండటం, మనసుకు సంతోషాన్నిచ్చే పనులు చేయడం వల్ల ప్రశాంతత కలుగుతుంది. ►మన ప్రవర్తనను ప్రభావితం చేసే ధూమపానానికీ, మద్యానికి, మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ►సంపాదనలో కనీసం పది శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యడం వల్ల కలిగే మానసిక తృప్తి ఒత్తిడికి గురి కాకుండా చేస్తుంది. ►నాకు వద్దు, నాకు రాదు, నాకు చేతకాదు అనే మాటలను చెప్పడం మానుకోవాలి. ►ఎప్పుడూ ఇంట్లోనే లేదా ఒక గదిలోనే కూర్చుండి పోవడం కన్నా బయటకు వెళ్లడం, స్నేహితులతో, బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం, సత్సంగం చేయడం ఒత్తిడిని తగ్గిస్తుంది. చదవండి: World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు.. మంచి మ్యూజిక్ వినడం, యోగా, ఇంకా.. ►ఇష్టమైన సంగీతం వినడం, పాటలు వింటూ కూనిరాగాలు తీయడం కూడా ఒత్తిడి తగ్గిస్తుంది. ►వారానికి ఒకసారి ఉపవాసం చేయడం, ఉదయం సూర్యోదయంలోని లేత కిరణాలు ఒంటికి తగిలేలా కూర్చోవడం; సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడడం మంచిది. ►మన ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ, సజావుగా కానీ పూర్తి కావని గుర్తించటం, నవ్వుతూ ఉండటం, ఈ ప్రపంచం అనే అందమైన ప్రకృతిలో మనమూ ఒక భాగమేనని గుర్తించటం, యోగ, ప్రాణాయామం చేయడం ఒత్తిడిని దూరంగా ఉంచుతాయి. ►గాఢంగా ఊపిరి పీల్చి వదలడం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం... ►ప్రతి రోజు ఒక గంట ఏరోబిక్స్ లేదా టి.విలో చూస్తూ డాన్స్ చేయడం, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటి వాటిలో ఏదో ఒకటి క్రమం తప్పకుండా చేయడం వల్ల గుండె , ఊపిరితిత్తులు, రక్తనాళాలు ఆరోగ్యకరంగా పనిచేస్తాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. వ్యాయామంలో స్ట్రెస్‌ని కలిగించే హార్మోన్లు నశించి, మంచి హార్మోన్లు, ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. అవి ఒత్తిడిని దూరం చేస్తాయి. ►టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, హాకీ లేదా క్రికెట్ వంటి ఆటలు ఆడుతుండాలి. ►ఉద్యోగంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుంది. నాయకత్వపు లక్షణాలు అలవడతాయి. ►ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోవడం ఒత్తిడి నుంచి బయట పడేందుకు దోహదం చేస్తుంది. చివరగా ఒక్క విషయం... ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కారణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని మనం సర్దిచెప్పుకోవడం, పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యలను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని సులువుగా అధిగమించవచ్చు. చదవండి: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! -
డిప్రెషన్‌ను మాయం చేసే డివైజ్!
మానసికంగా/శారీరకంగా గాయపరిచే ఘటనలు, జన్యు సంబంధిత కారణాలు, ఒత్తిడి.. ఇలా మనిషి కుంగుబాటుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒక్కోసారి మెదడులో కెమికల్ ఇంబ్యాలెన్స్తోనూ డిప్రెషన్లోకి వెళ్లొచ్చు. డిప్రెషన్.. ఎంతకాలంలో క్యూర్ అవుతుందనేది.. మనిషి మానసిక స్థితిని బట్టి, చుట్టూ నెలకొనే పరిస్థితులను బట్టి ఉంటుంది. అయితే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో డిప్రెషన్‌ను దూరం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఊహకందని ఈ ఆలోచనను.. ఆచరణలో పెట్టి విజయం సాధించారు రీసెర్చర్లు. ఓ డివైజ్‌ను ఉపయోగించి డిప్రెషన్‌ను దూరం చేయొచ్చని శాన్ ఫ్రాన్సిస్కో రీసెర్చర్లు నిరూపించారు. కాలిఫోర్నియాకు చెందిన సారా అనే 36 ఏళ్ల మహిళ ఐదేళ్లుగా నిరాశనిస్పృహ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు ఈ టూల్‌ను బ్రెయిన్లో ప్రవేశపెట్టడం ద్వారా సత్ఫలితం రాబట్టారు. మూర్ఛ వ్యాధిలో ఉపయోగించే డివైజ్ అది. సారా బ్రెయిన్ సర్క్యూట్లలో బయోమార్కర్లను గుర్తించి.. ఆ స్పాట్‌లలోకి ఎలక్ట్రోడులను పంపించి చికిత్స(Deep brain stimulation) అందించారు. కేవలం ఆరు సెకండ్లపాటు సాగే ట్రీట్మెంట్ను.. పన్నెండు రోజుల్లోనే ఫలితం వచ్చిందని పేర్కొన్నారు. సారాకి సంబంధించిన వివరాలను ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 4న ‘నేచర్ మెడిసిన్’ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన ఓ కథనం కూడా పబ్లిష్ అయ్యింది. చదవండి: సోషల్ మీడియాలో ‘దమ్ మారో దమ్’కి చెక్ -
పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా?
దాదాపు ఏడాదిన్నర కింద మొదలైన కరోనా విలయం ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది. కానీ దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ ప్రమాదకరంగానే కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా సోకి తగ్గినవారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. అంతర్గతంగా అవయవాల పనితీరును దెబ్బతీస్తోందని, మెదడుపైనా ప్రభావం చూపుతోందని తాజాగా గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఏమిటో తెలుసుకుందామా? - సాక్షి సెంట్రల్ డెస్క్ మానసిక సమస్యలను ముందే గుర్తించినా.. కరోనా కారణంగా శారీరకంగానే కాకుండా మానసికంగా పలు సమస్యలు ఎదురవుతున్నట్టు శాస్త్రవేత్తలు ఇంతకుముందే గుర్తించారు. కరోనా వచ్చి తగ్గిపోయాక (పోస్ట్ కోవిడ్ సమయంలో) చిన్న విషయాలకే ఆందోళనకు లోనవడం, కుంగుబాటు (డిప్రెషన్), స్వల్పస్థాయి మతిమరుపు, గందరగోళానికి లోనవడం లక్షణాలు కనిపిస్తున్నట్టు తేల్చారు. అందులోనూ 45-50 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే కరోనా సోకి ఒంటరిగా క్వారంటైన్లో ఉండాల్సిరావడం, తమకు ఏదైనా అవుతుందేమోనన్న భయం, కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడం వంటివి ఈ మానసిక సమస్యలకు కారణమన్న నిర్ధారణకు వచ్చారు. అయితే కరోనా వైరస్ వల్ల మెదడు కుంచించుకుపోతోందని, ఇది కూడా సమస్యలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ 45 వేల మందిపై పరిశోధన కరోనా వల్ల మెదడు, నాడీ మండలంపై ప్రభావంపై అమెరికాలోని టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆగస్టులో విస్తృతమైన పరిశోధన మొదలుపెట్టారు. ‘యూకే బయోబ్యాంక్’ సంస్థ వద్ద ఉన్న సుమారు 45 వేల మంది మెదడు స్కానింగ్ డేటాను తీసుకుని అధ్యయనం. కరోనా సమయంలోనేగాకుండా అంతకుముందటి పరిస్థితిని పోల్చి చూసేందుకు.. 2014 నాటి నుంచి 2021 జూలై వరకు నమోదు చేసిన అన్ని వయసుల వారి డేటాను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనాకు ముందు, తర్వాత మెదడులో జరిగిన మార్పులను పరిశీలించారు. స్వల్ప స్థాయి కోవిడ్ ఉన్నా.. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతం వంటివన్నీ దాదాపు ఒకేలా ఉండి.. కరోనా సోకిన, సోకని వ్యక్తుల మెదడు స్కానింగ్‌లను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. కరోనా సోకనివారితో పోలిస్తే.. సోకినవారి మెదడులోని కొంతభాగం లో గ్రే మేటర్ (మెదడు కణాలైన న్యూరాన్ల సమూహం) మందం తగ్గిపోయినట్టు గుర్తించారు. తీవ్రస్థాయి కరోనా సోకినవారిలోనే కాకుండా.. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నవారిలోనూ మెదడు కుంచించుకుపోతోందని తేల్చా రు. ఆ మేరకు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) పరిమాణం పెరుగుతోందని గుర్తించారు. సాధారణంగా 40 సంవత్సరాల వయసు దాటాక ఏళ్లు గడిచినకొద్దీ మెదడులో గ్రేమేటర్ కుంచించుకుపోతూ ఉంటుందని.. కానీ కరోనా సోకినవారిలో తక్కువ వయసులోనే, ఎక్కువ వేగంగా కుంచించుకుపోతోందని గుర్తించారు. ముఖ్యంగా 45-50 ఏళ్ల వయసు దాటినవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. ఆలోచన శక్తి, మానసిక సామర్థ్యాలకు దెబ్బ కరోనా సోకినవారిలో మొదటినుంచీ కనిపిస్తున్న ముఖ్య లక్షణం వాసన, రుచి చూసే సామర్థ్యం కోల్పోవడం. మెదడు ముందుభాగంలో ఉండే ‘ఆల్ఫాక్టరీ బల్బ్’గా పిలిచే ప్రాంతం ద్వారా.. మిగతా భాగాలకు వాసనకు సంబంధించిన సిగ్నల్స్ వెళతాయి. ఈ భాగంపై కరోనా వైరస్ ప్రభావం చూపడం వల్లే వాసన చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ‘ఆల్ఫాక్టరీ బల్బ్’తోపాటు మెదడులోని టెంపోరల్ లోబ్, హిప్పోకాంపస్ భాగాలకు అనుసంధానం ఉంటుంది. మన జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తికి ఈ భాగాలే కీలకం. కరోనా సోకినవారిలో ఈ భాగాలు కూడా కుంచించుకుపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్లే ఆలోచన శక్తిపై ప్రభావం పడుతోందని, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా.. కొన్నిసార్లు తెలిసినవారి పేర్లు, చిన్నచిన్న ఘటనలు కూడా కాసేపు గుర్తురాని పరిస్థితి ఉంటోందని వివరిస్తున్నారు. ఇంకా తేల్చాల్సినవీ ఉన్నాయి వయసు మీద పడినకొద్దీ మెదడులో జరిగే మార్పుల తరహాలో కోవిడ్ బారినపడ్డవారిలో మార్పులు కనిపిస్తున్నాయని.. దీని ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జెస్సికా బెర్నార్డ్ తెలిపారు. కోవిడ్ వల్ల దెబ్బతిన్న మెదడు మళ్లీ కోలుకుంటుందా? ఈ సమస్య ఎంతకాలం ఉంటుందన్నది తేలాల్సి ఉందని వెల్లడించారు. -
లక్ష్యసాధనకు స్వీయ నియంత్రణ
నేటితరంలో యువతను సునిశితంగా పరికిస్తే, కొందరిలో ఒక రకమైన నిరుత్సాహ ధోరణి కనబడుతుంది. ‘‘నేను పెద్ద చదువులు చదువుదామని అనుకున్నా, కానీ అది నాకు సాధ్యం కాని పని కదా’’, ‘‘నేను సివిల్ సర్వీస్ అంటే విపరీతంగా అభిమానిస్తా.. కానీ నాకది సాధ్యం కాదు సుమా..’’ వంటి సంభాషణలు తరచు వింటూ ఉంటాం. కానీ, ఆ ధోరణిలో మాట్లాడే యువతీ యువకుల మాటలను విని వదిలేయడం కాకుండా, వీలున్నంత వరకు వారిని సంస్కరించడానికి యత్నించాలి. మానవుడు సాధించలేనిది ఏముంది? మహితమైన, జగతికి హితమైన ఎన్నో కార్యాలను మన తోటి మానవులే సాధించారు. వారికి, సామాన్యమైన రీతిలో సాగేవారికి తేడా ఏమిటి? కారణాలు ఎన్నైనా, ప్రధాన సూత్రం ఒక్కటే..!! వారు తమపై తమకు అపురూపమైన రీతిలో నమ్మకాన్ని కలిగి ఉండడమే గాకుండా, తగిన రీతిలో పరిశ్రమించడమనేదే, వారు కోరుకున్నది సాధించగలగడానికి సహకరించిన విశేషమైన అంశం. వ్యక్తి అస్థిత్వాన్నీ, గుర్తింపును నిర్వచించే వాటిలో మొదటిది వారికి తమపై తమకున్న అవగాహన. వర్తమానంలో తానే స్థితిలో ఉన్నాడు, భవిష్యత్తులో తాను చేరాలనుకునే ఉన్నతస్థానం ఏమిటి అన్నది స్థిరంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలి. ఆ విధంగా తనను తాను ముందుగా అంచనా వేసుకోవడం ప్రతివారికీ అవసరం. స్వీయ పరిశీలన చేసుకుని తన భవిష్యత్తును నిర్ణయించుకోవడం వ్యక్తి పురోగతి సాధించడంలో తీసుకోవవలసిన అత్యంత సమంజసమైన విధిగా నిస్సందేహంగా చెప్పవచ్చు. విద్యలోనూ, విషయ గ్రాహ్యతలోనూ అంతగా రాణించే శక్తిలేని మనిషి, తాను ఎంత దృఢమైన రీతిలో ఉన్నతస్థానాన్ని అధిరోహించాలని భావించినా, సాధారణ పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. ఎందుకంటే, వారికున్న మానసిక బలం, శారీరక బలం కార్యసాధనకు సహకరించాలి కదా..!! అయితే, ఇది దుస్సాధ్యమైన విషయంగా పరిగణించవలసిన పనిలేదు. మనం అనుకున్నదానికంటే, మన అవగాహన గుర్తించినదానికంటే, ఎంతో అధికమైన శక్తి ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. కృతనిశ్చయంతో ‘‘నేను నా రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించగలను’’ అని భావించి, ఉద్యమిస్తే, ఉత్తమ ఫలితాలను సాధించడం కష్టమైన విషయమేమీ కాదు. అంతే కాదు.. అదే కృషిని త్రికరణశుద్ధిగా కొనసాగిస్తే, ఉన్నతస్థానంలో నిలకడను సాధించి నిలబడగలగడమూ కష్టమేమీ కాదు. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో ప్రతి వ్యక్తీ స్వీయ క్రమశిక్షణ పాటించడం అవసరం. ఆత్మనియతితో తమపై తాము విధించుకుని అమలుపరచే జీవన విధానమే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో అనుకున్న రీతిలో విజయం సాధించాలంటే నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవితాన్ని అనుసరించాలి. స్వీయనియంత్రణ అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తీ తాను రోజుకు ఎంత సమయాన్ని కార్యసాధన కోసం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాడనేది ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. కాసేపు మొక్కుబడిగా పనిచేసి, అనుకున్న ఫలితం రాలేదని భావించడంవల్ల ప్రయోజనం లేదుకదా..!! ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తి ఎటువంటి దురలవాట్లకూ బానిస కాకుండా ఉండడమూ స్వీయ నియంత్రణలో అంతర్భాగమే..!! తనను తాను సరిచేసుకుని ముందుకు సాగే విధానంలో సాధకుడు సానుకూలమైన ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలి. మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలకూ చోటు ఇవ్వకూడదు. సానుకూల, ప్రతికూల ఆలోచనా ధోరణిని సూచించే ఒక చిన్న ఉదంతాన్ని ప్రస్తావించుకుందాం. ఒకచోట ఒక వక్త చక్కని ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని ఇస్తున్నాడు. ఇద్దరు మిత్రులు ఆ ఉపన్యాసాన్ని వినగోరి అక్కడకు వచ్చారు. వక్త తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంటే, ఆయన మెడలో ఉన్న గులాబీ దండలోని రేకులు ఒక్కటొక్కటిగా రాలి పడుతున్నాయి. మిత్రుల్లో ఒకడు రెండోవాడితో ‘‘చూశావా.. ఆయన వేసుకున్న దండలోని గులాబీరేకులు ఎలా రాలి పడుతున్నాయో..!! కాసేపటికి రేకులన్నీ రాలిపోగా చివరికి లోపలున్న దారం ఒక్కటీ ఆయన మెడలో మిగులుతుంది’’ అంటూ ఎకసెక్కపు ధోరణిలో నవ్వాడు. రెండోవ్యక్తి అతని మాటలకు ప్రతిస్పందిస్తూ, ‘‘నువ్వు ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తు్తన్నావు మిత్రమా.. ఆయన అమృతమయ వాక్కులకు పరవశించి, ఆ గులాబీ రేకులు పూజిస్తున్న చందాన, పవిత్రమైన ఆయన పాదాలను తాకుతున్నాయని భావించవచ్చు కదా’’ అన్నాడట. మనిషిలోని సానుకూల, ప్రతికూల ఆలోచనా ధోరణులకు ఈ మిత్రుల మాటలే అద్దం పడతాయి. సమస్త శక్తీ మనలోనే నిబిడీకృతమై ఉంది. మనసారా పరిశ్రమిస్తే, తలపెట్టిన ఏ పనైనా సమర్థవంతంగా పూర్తి చేయగలడు. అద్వితీయమైన తన చేతలతోనే దైవత్వాన్నీ ప్రదర్శించగలడు. నిద్రావస్థను వదిలి జాగ్రదావస్థలోకి రాగలిగితే మానవమేధ దారిలోఎదురయ్యే అన్ని అవరోధాలను తొలగిస్తుంది... అన్ని అవసరాలనూ తీర్చగల, అన్ని ఆకాంక్షలనూ ఈడేర్చగల అపూర్వమైన శక్తి మనిషిలో దాగి ఉంది. అయితే, ఆ శక్తి తనలో ఉందని గ్రహించగలగడమే వివేకవంతుడు చేయగలిగిన పని. జీవితంలో లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎంతోమంది ఓటమి పాలవ్వడం లేదా ఆశించిన గమ్యాన్ని అందుకోకపోవడానికి స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే కారణం. జీవులందరూ ఒకేరకమైన రీతిలో జనించినా, అందులో కొంతమంది వ్యక్తులు మాత్రమే అసాధారణమైన విజయాలను అందుకోవడానికి, తాము అనుకున్న ఎత్తుకు ఎదగడానికి కారణం వారు పాటించే స్వీయ నియంత్రణ లేదా క్రమశిక్షణ అని చెప్పవచ్చు. ప్రతి మనిషీ తన లక్ష్యాన్ని సాధించడానికి కొందరినుంచి స్ఫూర్తిని పొందుతూ ముందుకు సాగుతాడు. తనకు స్ఫూర్తిదాతయైన వ్యక్తి ఆధ్యాత్మికంగా శక్తిమంతుడు కావచ్చు, లేదా ఒక జనహితం కోసం కృషి చేసే నాయకుడో, సమాజ సేవకుడో లేక క్రీడాకారుడో కావచ్చు. అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్న వారో, తమ చేతలద్వారా చరిత్రలో నిలిచిపోయిన ఏ వ్యక్తి నుంచైనా స్ఫూర్తిని పొందవచ్చు. తాను పొందిన అమేయమైన స్ఫూర్తిని, అమలుపరచడంలో ఎడతెగని ఆర్తిని కనబరచి, త్రికరణశుద్ధిగా కృషి చేస్తే, భవిత సాధకునికి తప్పనిసరిగా దీప్తిమంతమవుతుంది. –వ్యాఖ్యాన విశారద+ .++000000000 వెంకట్ గరికపాటి -
కత్తికి రెండవ వైపు కూడా పదును
రోజా (పేరు మార్చడమైనది) ఆఫీసుకు వస్తూనే కొలీగ్ సురేష్ (పేరు మార్చడమైనది) సీట్ వద్దకు విసురుగా వెళ్లింది. సురేష్ ఆమెను చూస్తూనే సీటులో నుంచి లేచి నుంచున్నాడు. ‘అసలు నీకు బుద్ధుందా! నువ్వు మనిషివేనా!?’ అని సురేష్‌పై విరుచుకుపడింది. ఏం జరిగిందో అక్కడ ఎవ్వరికీ అర్ధం కాలేదు. నువ్వీ ఆఫీసులో ఎలా ఉంటావో చూస్తా! నన్నే కామెంట్ చేసేంత సీనుందా!? నీకు’ ఫ్రెండ్ వీణ వచ్చి నచ్చజెప్పి, తీసుకెళ్లేంతవరకు సురేష్‌ని తిడుతూనే ఉంది రోజా. ‘‘నిన్న ఆఫీసుకు నువ్వు శారీలో వచ్చావు. డ్రెస్‌లో కన్నా చీరలో సూపర్‌గా ఉన్నావ్!’ అంటూ సోషల్‌మీడియా వేదికగా రోజా ఫొటోకు రకరకాల కామెంట్స్ పెట్టాడు సురేష్. దీంతో ఆఫీసులో పెద్ద రాద్ధాంతమే జరిగింది.‘సురేష్ తననే టార్గెట్ చేశాడని, అందుకే తనను నలుగురిలో చులకన చేయడానికే రకరకాల కారణాలు వెతుకుతున్నాడంటూ రుజువులు చూపించింది రోజా. ఈ సంఘటన తర్వాత సురేష్ జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆఫీసులో అంతా ప్రశాంతం అనుకున్న రోజాకు నాలుగో రోజు నుంచి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు, మెసేజ్‌లు కనపడటంతో తలకొట్టేసినట్టుగా ఉంది. ఆఫీసు టీమ్‌లో ఉన్నప్పుడు సురేష్‌తో సాధారణంగా షేర్ చేసుకున్న విషయాలు, కలివిడిగా దిగిన ఫొటోలు, తన అకౌంట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టాడు.సురేష్ చేసిన ఈ పని మూలంగా రోజాకు వచ్చిన పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యింది. సురేష్ చర్యలకు తీవ్ర మానసిక వేదనకు గురైన రోజా, డిప్రెషన్‌కు లోనై ఆఫీసు పనిలో చురుగ్గా పాల్గొనలేకపోయింది. రోజాలో వచ్చిన ఈ మార్పేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. భావ వ్యక్తీకరణకు కళ్లెం తప్పదు సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణకు, ప్రత్యేకించి గొంతుక లేని వ్యక్తులకు చాలా శక్తివంతమైన సాధనం. సమాజంలోని వ్యక్తులతో కలిసిపోవడానికి తమ వ్యక్తిగత వివరాలు, నమ్మకాలు, ప్రాధాన్యతలను స్వచ్ఛందంగా వెల్లడిస్తారు. మనలో చాలామంది సాధారణంగా స్టేటస్‌లను అప్డేట్ చేస్తారు. ఆన్లైన్లో తమ వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేస్తారు. అయితే, మీ ఆన్లైన్ చర్యలు భవిష్యత్తులో విద్యా, వ్యక్తిగత, వృత్తిపరమైన అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇతరులను ఇబ్బంది పెట్టే ఏ వేధింపు అయినా అది నేరమే. ► వ్యక్తులు, రాజకీయ నాయకులతో సహా సమాజంలోని అన్ని వర్గాల నుండి సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పెరుగుతున్నాయనేది వాస్తవం. భద్రత దృష్ట్యా సామాజిక మాధ్యమాలను సెన్సార్ చేసే ఆలోచనలకు పునాది పడిందనే విషయాన్ని విస్మరించకూడదు. ► యూజర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్వేచ్ఛగా ఇచ్చేస్తుంటారు. దీంతో తమ సైట్లలో ఉపయోగించే అన్ని చర్యలను ఇతరులు ట్రాక్ చేస్తారు. తర్వాత ఉపయోగించుకోవడానికి వీలుగా వాటిని దాచిపెట్టుకుంటారు. అంటే మన ప్రతి ప్రవర్తనా అంశం ఇతరులు తమ ఉపయోగాల కోసం సేకరిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా మర్యాదలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం ఆఫ్‌లైన్ – ఆన్‌లైన్‌ని ఒకే విధంగా పరిగణించాలి. ► సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది యూనివర్సల్ – ఎక్స్ప్రెషన్ కాదు. మీకు హాస్యం కలిగించేది ఇతరులకు హాస్యం కాకపోవచ్చు, కాబట్టి సోషల్ మీడియాలో వ్యక్తీకరణలు జాగ్రత్తగా చేయాలి. ► ఉపయోగంలో లేని మీ అన్ని సోషల్ మీడియా అప్లికేషన్లను లాగ్ ఆఫ్ చేయాలి, మీ స్మార్ట్‌ఫోన్ లో ఇతర నోటిఫికేషన్ ఫీడ్లు వ్యసనాలకు దారి తీయడమే కాకుండా ఇతరత్రా ఆటంకాలకు కారణాలవుతాయి. ► చెడు భావాలను పెంచే, పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించడం వలన మీరు సోషల్ మీడియాలో ప్రతికూల అనుభవాన్ని పొందే అవకాశం ఉంది. ► ఇప్పటికే మన నిజ జీవితంలో ఎంతో పోటీని ఎదుర్కొంటున్నాం. ఆన్లైన్ ప్రపంచంలో మనకు అంతకన్నా ఎక్కువ పోటీ అవసరం లేదని గుర్తించాలి. ► ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలని మీరు కోరుకుంటున్నారో, మీ సోషల్ మీడియా కార్యకలాపాల ఆధారంగా ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారో కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ► సోషల్ మీడియాలో మిమ్మల్ని ఇష్టపడని వారు మీ జాబితాలో ఉండవచ్చు. మీరు అలాంటి వారితో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యారనే విషయాన్ని నిర్ధారించుకోండి. ► ఆన్లైన్ ప్రపంచంలో విహరిస్తూ మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదాహరణకు.. మీ పుట్టినరోజున 100 లైక్‌లు పొందవచ్చు. కానీ, మీ ఇంట్లో ఒక స్నేహితుడు మాత్రమే మిమ్మల్ని కలిసి అభినందనలు చెప్పచ్చు. ► స్మార్ట్‌ఫోన్ లకు బదులుగా సోషల్ మీడియా ఖాతాలకు లాగిన్ అవ్వడానికి ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం మేలు. ఎందుకంటే ఇది వ్యసనంగా మారే అవకాశాన్ని తగ్గిస్తుంది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
పెళ్లి కావడం లేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
సాక్షి, కాచిగూడ(హైదరాబద్): పెళ్లి కావడం లేదని జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగార్జున్‌రెడ్డి వివరాల ప్రకారం.. నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న మైనుద్దీన్ కుమారుడు సయ్యద్ మోహినుద్దీన్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లికావడం లేదని జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మోహినుద్దీన్ ఫిర్యాదుతో కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Raja Raja Chora: కథ లేకుండా కామెడీ నడిపించలేం! -
రియల్టీ భవిష్యత్తు ఏంటో?
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికం నిరాశపరిచింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో రియల్టీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని నైట్‌ఫ్రాంక్–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడించింది. వచ్చే ఆరు నెలలలో ఆశాజనక రియల్టీ మార్కెట్‌పై డెవలపర్లు గంపెడాశలతో ఉన్నారని 29వ ఎడిషన్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ క్యూ2–2021 తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 57గా ఉన్న సెంటిమెంట్ స్కోర్ క్యూ2 నాటికి 35కి పడిపోయిందని పేర్కొంది. అయితే గతేడాది క్యూ2లో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరిన 22 స్కోర్‌తో పోలిస్తే ప్రస్తుత క్షీణత తీవ్రత తక్కువేనని తెలిపింది. ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్‌ను పరిశీలిస్తే.. ఈ ఏడాది క్యూ1లో 57గా ఉండగా.. క్యూ2 నాటికి స్వల్పంగా తగ్గి 56 స్కోర్‌కు చేరిందని.. అయినా ఇది ఆశావాద జోన్లోనే కొనసాగుతుందని పేర్కొంది. రియల్టీ మార్కెట్లో సెంటిమెంట్ స్కోర్ 50ని దాటితే ఆశావాదం జోన్‌గా, 50గా ఉంటే తటస్థం, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద జోన్‌గా పరిగణిస్తుంటారు. ఈ సర్వేను డెవలపర్లు, బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థల సరఫరా మీద ఆధారపడి జరుగుతుంటుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం, నిరంతర ఆర్ధిక కార్యకలాపాల మీద ఆధారపడి భవిష్యత్తు రియల్టీ సెంటిమెంట్ స్కోర్ ఆశాజనకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. కరోనాతో రియల్టీ మార్కెట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. నివాస, కార్యాలయ విభాగాలకు అంతర్లీన డిమాండ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. -
‘అప్పుడు డిప్రెషన్లోకి వెళ్లిపోయా, సినిమాలు వదిలేయాలనుకున్నా’
హీరో శ్రీకాంత్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టిన శ్రీకాంత్ స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు పరిశ్రమంలో విలన్‌గా, నటుడిగా, హీరోగా అలరించాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సహజమైన నటన, స్టైల్‌తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలా సోలోగా వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు శ్రీకాంత్. కనీసం ఏడాదికి 5 నుంచి 6 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే శ్రీకాంత్ గత కొద్ది రోజులు సినిమాలు చేయడం లేదు. ఈ మధ్య కాస్తా సినిమాలు తగ్గించిన ఆయన ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. గతంలో తాను డిప్రెషన్‌కు గురయ్యానని చెప్పాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రమంలో ఒక్కసారిగా డౌన్ అయ్యానంటూ గతంలో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘అప్పుడు హీరోగా నా కెరీర్ పీక్స్‌లో ఉంది. అలాంటి సమయంలో ఒకే ఏడాది నేను నటించిన 7 సినిమాలు పరాజయం అయ్యాయి. నా కెరీర్ అప్పుడే ముగిసిందా అని భయం వేసింది. హీరోగా నా ప్రయాణం ముగిసిపోయిందా?, నా సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు నాలో తలెత్తాయి. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను. దీంతో ఇలా ఉంటే కష్టమని నిర్ణయించుకుని తిరిగి మా ఊరెళ్లిపోవాలనుకున్న. అక్కడ వ్యవసాయం చేసుకుని సెటిలైపోయిదామని డిసైడ్ అయ్యాను. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నన్ను ఓదారుస్తూ ధైర్యం చెప్పాడు. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు నాకు ఓదార్పునిచ్చాయి. ఆయన ఇచ్చిన ప్రేరణతోనే మళ్లీ సినిమాలు చేస్తూ నా కెరీర్‌ను కొనసాగించాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా పరిశ్రమలో తను అత్యంత ఇష్టపడే వ్యక్తి, సన్నిహితుడు మెగాస్టార్ చిరంజీవి అని శ్రీకాంత్ ఇప్పటికే పలు ఈవెంట్స్, సినీ వేడుకల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ను శ్రీకాంత్ అన్నయ్య అని పిలుస్తుంటాడు. ఇదిలా ఉండగా తన పెద్ద కుమారుడు రోషన్ ‘నిర్మల కాన్వెంట్’ మూవీతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం రోషన్ రాఘవేంద్ర రావు డైరెక్షన్లో ‘పెళ్లి సందD’ మూవీ చేస్తున్నాడు. ఇది శ్రీకాంత్ గతంలో నటించిన ‘పెళ్లి సందడికి’ సిక్వెల్‌గా తెరకెక్కుతోంది. -
టెకీకి నరకం చూపిన ‘వరుడు’: మెసేజుల్లో మాత్రమే మర్యాద!
‘సంధ్యా.. (పేరుమార్చడమైనది) ఎంతసేపు కూర్చుంటావే అలా. నెలరోజులుగా చూస్తున్నాను. సరిగా తినడం లేదు. నిద్రపోవడం లేదు. ఆఫీసుకు కూడా వెళ్లడం లేదు. ఎందుకీ ఆలోచన’ గట్టిగానే మందలిస్తున్నట్టుగా అంది తల్లి. ‘అదేం లేదమ్మా!’ సర్దిచెబుతున్నట్టుగా అంది సంధ్య. ‘చూడమ్మా! నీవు ఆ కార్తీక్ (పేరు మార్చడమైనది)ని మర్చిపోలేకుంటే చెప్పు. అయిందేదో అయ్యింది. వాళ్ల వాళ్లతో మాట్లాడి,పెళ్లి చేస్తాం’ అనునయిస్తూ చెప్పింది తల్లి. ‘వద్దమ్మా! పెళ్లొద్దు. నే చచ్చిపోతాను’ అంటూ ఏడుస్తూ తల్లిని చుట్టేసింది. ‘ఏమైంద’ని తల్లీ తండ్రి గట్టిగా అడిగితే అసలు విషయం బయటపెట్టింది సంధ్య. ∙∙ సంధ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెళ్లిసంబంధాలు చూస్తూ సంధ్య ప్రొఫైల్‌ని మ్యాట్రిమోనియల్ సైట్లో పెట్టారు పేరెంట్స్. వచ్చిన ప్రొఫైల్స్‌లో కార్తీక్‌ది సంధ్యకి బాగా నచ్చింది. సంధ్య కూడా కార్తీక్‌కు నచ్చడంతో ఇంట్లోవాళ్లతో మాట్లాడారు. ఇరువైపుల పెద్దలు ఓకే అనుకున్నారు. నెల రోజుల్లో పెళ్లి అనుకున్నారు. దాంతో ఇద్దరూ రోజూ కలుసుకునేవారు. సినిమాలు, షికార్లకు వెళ్లేవారు. త్వరలో జీవితం పంచుకోబోతున్నవారు అనే ఆలోచనతో పెద్దలూ అడ్డుచెప్పలేదు. పెళ్లి తర్వాత ఇద్దరూ విదేశాల్లో స్థిరపడాలనుకున్నారు. అందుకు ముందస్తుగా కావాల్సిన ప్రయత్నాలూ మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే కార్తీక్ పాస్‌పోర్ట్ చూసింది సంధ్య. అందులో అతని పుట్టినతేదీ వివరాలు చూసి, ఆశ్చర్యపోయింది. అదే విషయాన్ని కార్తీక్‌ని అడిగింది. ‘మ్యాట్రిమోనియల్ సైట్ ప్రొఫైల్‌లో వేరే వివరాలున్నాయి. పాస్‌పోర్టులో వేరేగా ఉన్నాయి’ అని నిలదీసింది. ‘అదేమంత పెద్ద విషయం కాదు. డేటాఫ్ బర్త్‌లో కొంచెం తేడా అంతేగా!’ అన్నాడు కొట్టిపారేస్తూ కార్తీక్. ఇదే విషయాన్ని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించింది సంధ్య. ప్రొఫైల్‌లో తప్పుడు వివరాలు ఇవ్వడం, ఇన్ని రోజులూ అసలు విషయం చెప్పకుండా దాచడంతో సంధ్య తల్లిదండ్రులు కార్తీక్‌ని, అతని తల్లిదండ్రులను నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు కార్తీక్. ‘ఇంకా ఎన్ని వివరాలు దాస్తున్నారో.. ఈ సంబంధం మాకొద్దు’ అని చెప్పేశారు సంధ్య అమ్మనాన్నలు. సంధ్య కూడా తల్లిదండ్రులతో ‘మీ ఇష్టమే నా ఇష్టం’ అనేసింది. దీంతో అనుకున్న పెళ్లి ఆగిపోయింది. ∙∙ నెల రోజులుగా తిండీ, నిద్రకు దూరమైన సంధ్య ఆ కొద్ది రోజుల్లోనే ఐదు కేజీల బరువు తగ్గిపోవడంతో భయపడిన సంధ్య తల్లిదండ్రులు డాక్టర్ని సంప్రదించారు. సంధ్య ఏదో మానసిక సమస్యతో బాధపడుతోందని చెప్పారు డాక్టర్. కార్తీక్‌ని మర్చిపోలేకనే ఇదంతానా అని తల్లి కూతురుని నిలదీయడంతో అదేం కాదంటూ అసలు విషయం చెప్పింది సంధ్య. ‘డియర్.. నీవెప్పుడూ ఆనందంగా ఉండాలి’ వచ్చిన మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు సంధ్య. నెల రోజులుగా వాట్సప్ మెసేజ్‌లతో తల తిరిగిపోతోంది సంధ్యకి. ఆ వెంటనే వాట్సప్ కాల్. ‘నిన్నెలా ప్రశాంతంగా ఉండనిస్తాను. నీ ఫొటోలు అడల్ట్స్ ఓన్లీ సైట్లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్నిక ఎవ్వరూ పెళ్లి చేసుకోనివ్వకుండా చేస్తా’ అంటూ బూతులు మాట్లాడుతూ ఫోన్. ఎత్తకపోతే బెదిరింపులు, ఎత్తితే బయటకు చెప్పనలవికాని మాటలతో వేధింపులు. డిప్రెషన్‌తో బయటకు రాలేకపోతోంది. ఇన్నాళ్లూ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పడం, నేనే పరిష్కరించుకుంటాను అనుకున్న సంధ్య.. ఇక వేగలేక ‘చచ్చిపోతాను’ అంటూ తల్లి వద్ద ఏడ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ‘అమ్మా, కార్తీక్‌ని మర్చిపోలేక కాదు. అతన్ని పెళ్లి చేసుకున్నా నిజంగానే చచ్చిపోతాను. ఈ వేధింపులు నా వల్ల కాదు’ అనడంతో సంధ్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తెలివిగా ఎదుర్కోవాలి... దొరికితే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని మెసేజుల్లో చాలా అందమైన, మర్యాదపూర్వకమైన భాష వాడేవాడు కార్తీక్. కానీ, ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడే వాడు. వాట్సప్ కాల్ అయితే రికార్డ్ కాదని అతని ప్లాన్. నిపుణుల సాయం తీసుకున్న సంధ్య, వారిచ్చిన సూచన మేరకు ఒక రోజు కార్తీక్ వాట్సప్ కాల్ చేసినప్పుడు స్పీకర్ ఆన్ చేసి, మరో ఫోన్లో అది రికార్డ్ చేసింది. ఆ వాయిస్‌ను పోలీసుల ముందు పెట్టింది. దీంతో వేధింపులకు చెక్ పడింది. కేసు ఫైల్ అయ్యి, అతను విదేశాలకు వెళ్లడం కూడా ఆగిపోయింది. తెలివిగా సమస్యను ఎదుర్కోవాలి. అవగాహన లేకుండా జీవితాలను చేజార్చుకోకూడదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ ధైర్యంగా ఉండాలి మ్యారేజీ బ్యూరోలు, డేటింగ్ సైట్స్‌లలో వివరాలతో పాటు, తప్పుడు ఫోటోలు కూడా పెడుతుంటారు. తెలిసి, తెలియక వారితో క్లోజ్ అయినప్పుడు ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. పూర్తి ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క అభిరుచులు తెలుసుకోవడం మాత్రమే కాదు అతని గురించి పూర్తి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకొని, మూవ్ అవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదు. తమకు అన్యాయం జరిగిందని అర్ధమైతే, ధైర్యంగా దగ్గరలోని పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
పక్కింటివాళ్లతో గొడవ.. 12వ అంతస్తు నుంచి దూకిన మహిళ
ముంబై: అసలే భర్తను కోల్పోయి బాధలో ఉంది. ఏడేళ్ల కుమారుడిని ఒంటరిగా ఎలా పెంచాలా అని భయపడుతుంది. ఈ సమయంలో మద్దతుగా నిలవాల్సిన ఇరుగుపొరుగు వారు.. ఆమెను ఇబ్బందులకు గురి చేయసాగారు. దాంతో డిప్రెషన్‌కు గురైన బాధితురాలు కొడుకుతో కలిసి 12వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ముంబై, చండీవాలి అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చండీవాలి అపార్ట్మెంట్లో నివసిస్తున్న ట్రెంచిల్ అనే మహిళ భర్త కొద్ది రోజుల క్రితం కోవిడ్ వల్ల మరణించాడు. ఈ క్రమంలో ట్రెంచిల్ తన ఏడేళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా నివస్తుంది. భర్తను కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ సమయంలో మద్దతుగా ఉండాల్సిన ఇరుగుపొరుగు వారు ఆమెతో గొడవకు దిగారు. ట్రెంచిల్ కుమారుడు గొడవ చేస్తూ.. తమను ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. అప్పటికే విషాదంలో ఉన్న ట్రెంచిల్ వారి మాటలతో మరింత బాధపడింది. డిప్రెషన్‌కు గురయ్యింది. ఈ క్రమంలో సోమవారం ఆమె, ఏడేళ్ల కుమారుడితో కలిసి తాను ఉంటున్న అపార్టమెంట్‌లోని 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పొరుగింట్లో ఉండే వ్యక్తి తనను సతాయిస్తున్నాడని.. ప్రతి దానికి తనతో గొడవపడుతున్నాడని.. అతడి వేధింపులు తట్టుకోలేకే ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసి పెట్టింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉన్న దాని ప్రకారం ట్రెంచిల్ పొరుగింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: పీటర్ పాన్ సిండ్రోమ్: అత్యాచార నిందితుడికి బెయిల్ -
Covid: ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తున్నారా? అయితే ఓసీడే
కరోనా రాకముందే... అలాగే, దాని గురించి తెలిసిన కొత్తలో దాని కారణంగా చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు కనిపించడం వైద్యులు గమనించారు. ఉదాహరణకు... యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కొన్ని. అలాగే ఇప్పుడు రెండో వేవ్ కొనసాగుతూ ఉండగా... ఇందులోనూ తమకు సన్నిహితులూ... కొందరైతే తమ సొంత కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మరింత తీవ్రమైన మానసిక సమస్యలను చవిచూశారూ...చూస్తున్నారు. అందులో ప్రధానమైనది ‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’. దాని గురించి తెలుసుకుందాం. గత ఏడాది మొదటి కరోనా వేవ్ సీజన్లో దాని గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని మానసిక లక్షణాలూ కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు తొందరగానే తగ్గిపోవచ్చు. అలా వచ్చి తగ్గిపోయిన సమస్యలను ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు. మరికొందరిలో అవి తీవ్రమైన ఒత్తిడి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, ఫోబియా, ఓసీడీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలుగా మారే అవకాశమూ ఉండింది. అప్పుడూ ఇప్పుడు కూడా కరోనా విషయమై బాగా టెన్షన్‌గా ఉండటం, తీవ్రమైన ఆందోళన, విపరీతమైన బెంగ... వ్యాధి వస్తుందా, వస్తే తగ్గుతుందా, లేక మరణానికి దారితీస్తుందా లాంటి సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటి రెండో సీజన్లోనూ అలా అవుతున్నారు. దాన్ని కరోనా ఫోబియాగా చెప్పవచ్చు. వాళ్లలో కరోనా లేకపోయినా... లేదా వచ్చి తగ్గిన వారిలోనూ మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. వారిలో ఆ వ్యాధి లేదనీ... ఒకసారి వచ్చి తగ్గినందున మళ్లీ ఆ వెంటనే సాధారణంగా రాదని చెప్పినా భయం పోదు. ఇలా తమకు దూరంగా ఉన్న రక్తసంబంధీకులు, కావాల్సినవారు ఎలా ఉన్నారో అంటూ ఆందోళన పడవచ్చు. ఇలాంటి ఆందోళనతో టెన్షన్ పడటాన్ని ‘జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్ (జీఏడీ)’గా చెప్పవచ్చు. టెన్షన్‌తోపాటు విపరీతంగా భయపడటాన్ని ప్యానిక్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. అంటే వీళ్లు కరెన్సీనీ, కూరగాయలనూ, తమ ఇంటిలోని సొంత ఆత్మీయులనూ తాకడానికి కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ప్యానిక్ అవుతుంటారు. దీన్ని ‘ప్యానిక్ డిజార్డర్’గా చెప్పవచ్చు. ఇక చేతులకు మళ్లీ మళ్లీ శానిటైజర్ పూసుకోవడం, చేతులు అదేపనిగా కడుక్కోవడం చేస్తూ ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌కూ లోను కావచ్చు. ఒకసారి చేతులు కడుక్కున్నా లేదా శానిటైజర్ పూసుకున్నా దాదాపు గంటపాటు రక్షణ ఉందని తెలిశాక కూడా ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తుంటే ఓసీడీగా పేర్కొనవచ్చు. సెకండ్‌వేవ్‌లో కనిపిస్తున్న ప్రధాన మానసిక సమస్య... అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ మొదటివేవ్‌తో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్‌లో... కుటుంబ సభ్యులూ, తమకు కావాల్సిన సన్నిహితులు, ఆత్మీయులు మరణించడంతో... చాలామంది ఇప్పుడు ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ మానసిక సమస్యతో బాధపడుతుండటాన్ని చాలామంది సైకియాట్రిస్టులు చూస్తున్నారు. ఈ సమస్య తాలూకు కొన్ని కేస్ స్టడీలు కేస్ స్టడీ 1: డెబ్బయి ఏళ్ల పెద్దవయసు దంపతులు సొంతకూతుర్ని పోగొటుకున్నారు. యూఎస్‌లో ఉండే వారి కుమారుడు ఇక్కడికి వచ్చేసి వాళ్లకు చికిత్స అందిస్తున్నాడు. అతడు తన ఉద్యోగం కోసం యూఎస్‌కు వెళ్లే పరిస్థితి లేదు. కేస్ స్టడీ 2: మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్న ఓ యువకుడు ఇటీవల కరోనాతో మరణించాడు. దాంతో 58 ఏళ్ల వయసున్న అతడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. వీళ్లంతా ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’’ గురైనట్లు తేలింది. అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే... అంతకు ముందు ఉన్న సాకుకూల స్థితి తొలగిపోయి ఒకేసారి కొత్త పరిస్థితులకు ఎక్స్పోజ్ అయినప్పటుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దానికి తగినట్లుగా తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో వ్యక్తులు తీవ్రమైన వ్యాకులతకూ, కుంగుబాటుకు గురియ్యే అవకాశం ఉంది. దాన్నే ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’’గా పేర్కొనవచ్చు. లక్షణాలు: అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అవే లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. బాగా దగ్గరివారు ఆ లక్షణాలను గమనిస్తూ ఉండటం అవసరం. అవి... ∙ఏదో తెలియని భయం/ఆందోళన/గుబులు/గాభరా ∙గుండెవేగంగా కొట్టుకోవడం/గుండెదడ/గుండెల్లో మంట / గుండె బిగబట్టినట్టుగా ఉండటం/ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ∙ అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్ అటాక్) ∙విపరీతంగా చెమటలు పట్టడం ∙ఛాతీ బిగబట్టినట్టుగా అనిపించడం / ఛాతీలో మంట ∙శ్వాససరిగా అందకపోవడం లేదా బలంగా ఊపిరి తీసుకోవడం / ఆయాస పడటం ∙నోరు తడారిపోవడం ∙ఒళ్లు జలదరించడం ∙అయోమయం ∙కడుపులో గాభరా కడుపులో మంట ∙ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తూ ఉండటం ∙చేతులు, కాళ్లు వణకడం, ఒకచోట నిలకడగా ఉండలేకపోవడం ∙నిత్యం అలజడిగా ఉండటం ∙తీవ్రమైన నిద్రలేమి, నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ పాట్రన్స్), అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం ఇక ఆ తర్వాత నిద్రపట్టకపోవడం... పై లక్షణాలతో పాటు కొత్త పరిస్థితులకు అడ్జెస్ట్ అయ్యేందుకు పడే ప్రయాసలో డిప్రెషన్‌కు గురైన వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలూ కనిపించడంతో పాటు ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలూ (సూసైడల్ టెండెన్సిస్) కూడా కనిపిస్తాయి. ఆత్మహత్యకు చేసుకోవలన్న ఆలోచనలు మాటిమాటికీ వస్తుంటాయి. దీని నుంచి బయటపడటం ఎలా? ► మీ ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తెలిసినవారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారితో భౌతికంగా కాకపోయినా... వర్చువల్‌గా (అంటే మొబైల్ లేదా ఫేస్‌టైమ్‌తో) వారితో సన్నిహితంగా ఉండండి. వారితో మీ సంతోషదాకయమైన క్షణాలను స్మరిస్తూ... ఆ ఆనందకరమైన సమయాలు మళ్లీ త్వరలోనే వస్తాయనే ఆశాభావంతో కూడిన సంభాషణలు చేయండి. ► మీ దగ్గరివారు కూడా కోవిడ్‌ను ఎదుర్కోవడమో, తమకు ఆత్మీయులైనవారిని కోల్పోవడమో చేసి ఉండవచ్చు. వారు ఈ క్రైసిస్‌ను ఎలా ఎదుర్కొన్నారు అనే లాంటి అంశాలను మాట్లాడుతూ... మీరూ ఆ మాటలతో మోటివేట్ అయ్యేలా మీ సంభాషణలు ఉండాలి. వారి నుంచి మీరు స్ఫూర్తి పొందేలాంటి సంభాషణలే వినండి. వారి ధైర్యసాహసాలను మెచ్చుకోండి. వాటిని మీరు మీలోనూ నింపుకోండి. ► మీకు ఇష్టమైనవారి ధైర్యసాహసాలను, వారు వారి క్రైసిస్ నుంచి బయటపడ్డ తీరును, వారి మంచి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచండి. దాంతో ఇతరులూ స్ఫూర్తి పొందుతారు. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచినప్పుడు ఇతరులు వాటిని లైక్ చేస్తే... మీరు వాటిని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు మీరూ ఉత్తేజితులవుతారు. ► మీ అనుభవాలను ఉత్తరాలుగా రాసుకోండి. వాటిని మీరు మళ్లీ చదువుకోండి లేదా ఇష్టమైనవారికి పంపండి లేదా మీరే చించివేయండి. ► మీకు ఇష్టమైన హాబీలలో నిమగ్నం కావాలి. గతంలో మీరు ప్రదర్శించిన నైపుణ్యాలను మళ్లీ వెలికి తీయాలి. అంటే పెయిటింగ్, డాన్స్ వంటి వాటిలో నిమగ్నమవుతూ... వాటిని ఆస్వాదిస్తూ ఉండాలి. మీరు బాగా ప్రదర్శించిన వాటికి మీకు మీరే బహుమతులు ఇచ్చుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేవ్ చేసుకోవడమూ అవసరం. ► గతంలో మీరు ప్రదర్శించిన ధైర్యసాహసాలు మాటిమాటికీ తలచుకోవాలి. ‘అప్పుడు వాటిని చేసింది కూడా నేను కదా. మరలాంటప్పుడు నేను ఇప్పుడూ అవే ధైర్యసాహసాలను ప్రదర్శించగలను కదా’ అంటూ ధైర్యం చెప్పుకోవాలి. ► ఆటలూ, క్రీడలూ వంటివి క్రీడా స్ఫూర్తి పెంచుతూ... ఓటమిని తేలిగ్గా తీసుకునే అడ్జస్ట్మెంట్ బిహేవియర్‌ను వేగవంతం చేయడమే కాకుండా... కొత్త పరిస్థితులకు తేలిగ్గా సర్దుకుపోయే గుణాన్ని పెంపొందిస్తాయి. డిప్రెషన్ నుంచి వేగంగా బయటపడేస్తాయి. ► ఇంట్లోనే వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్ వంటి సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి ఆనందాన్ని పెంచి డిప్రెషన్‌ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. ఇవి కూడా చేయండి: ► రోజూ అన్ని పోషకాలు ఉండే సమతులాహారం, మంచి పౌష్టికాహారం తీసుకోండి. ► టీవీలో మీకు విపరీతమైన ఆందోళన కలిగించే వార్తలను చూడకండి, వినకండి. ► మీకు చాలా ఇష్టమైనవారితోనే సమయం గడపండి. ∙ఆహ్లాదకరమైన సంగీతం/పాటలు వినండి. ► ఇంట్లోనే మీకు ఇష్టమైన సినిమాలు చూడండి. ముఖ్యంగా హాస్యచిత్రాలు. ► బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు... యోగా, ప్రాణాయామ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ► ఈ పరిస్థితేమీ ప్రమాదకరం కాదంటూ మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ ఉండండి. ఒకవేళ అది సాధ్యపడకపోతే... టెలిఫోన్లోనే మీ కుటుంబ డాక్టర్‌తో లేదా సైకియాట్రిస్ట్‌తో మాట్లాడి, ప్రొఫెషనల్స్ సలహా తీసుకోండి. అలాంటివారిలోనూ మీ పట్ల సహానుభూతితో ఉండేవారినే ఎంచుకుని వారిని సంప్రదించండి. - డాక్టర్ చరణ్ తేజ కోగంటి కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్