
బాలీవుడ్ హీరోయిన్ దీపీకా పదుకోన్
సాక్షి, ముంబై : అందరిలాగా తాను కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అనేక వేధింపులు ఎదుర్కొన్నానని బాలీవుడ్ బ్యూటీ దీపీకా పదుకోన్ చెప్పారు. ఇటీవల ఓ ప్రముఖ మేగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం కొంత మంది తనకు బూబ్ జాబ్ అడ్వైజ్ చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు. డైరెక్టర్, నిర్మాతల దృష్టిలో పడటానికి ఇది మంచి మార్గమని వారు తెలిపారని చెప్పారు. మరి కొందరు బ్యూటీపజెంట్ కాంటెస్టుల్లో పాల్గొనాలని సూచించారని, ఇలాంటివి చేయడం వలన తొందరగా గుర్తింపు పొంది మీరు అనుకున్న లక్ష్యాన్ని తక్కువ సమయంలోనే చేరుకుంటారని సలహా ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కానీ అలాంటి అసభ్యకరమైన పనులు నేను చేయను.. నేను అలాంటి దాన్ని కాదు.. ఆత్మవిశ్వాసంతో నాకు నచ్చిన దారిలోనే ధైర్యంగా ముందుకు వచ్చానని దీపిక చెప్పారు.
అదేవిధంగా దీపికా 2014 సమయంలో ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నా.. కొంత నిరాశలో ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో నాకు కొంత మంది ధైర్యం చెప్పి ముందుకు నడిపించారని పేర్కొన్నారు. ఎంతటి విజయం సాధించినా మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యమని ఆమె అన్నారు. 2014 నా జీవితంలో అద్భుతమైన సంవత్సరమని అన్నారు. అయితే దీపికా, హీరో రణ్‌వీర్‌సింగ్‌లు ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment