beauty pageants
-
మిస్ ఇండియా మిస్సవ్వదు..
బ్యూటీ పేజెంట్స్, ఫ్యాషన్ కాంపిటీషన్స్ అంటే కేవలం అందం, సౌందర్యం మాత్రమే కాదని.., నిత్య జీవితంలో మన ఆలోచనా విధానం, సామాజిక అవగాహన, మానవీయ విలువలు తదితర అంశాలతో సంపూర్ణ వ్యక్తిత్వమే ‘మిస్ క్రౌన్’కు ఎంపిక చేస్తాయని తెలుగు రాష్ట్రాల నుంచి ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్టులు ప్రకృతి, భవ్య రెడ్డి తెలిపారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్, లండన్ ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ వీక్, లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటిన ప్రముఖ సంస్థ ఎన్‌ఐఎఫ్‌డీ గ్లోబల్ ఆధ్వర్యంలో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ప్రకృతి కంభం, ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ భవ్య రెడ్డిలతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీల్లో ఈ ఇరువురూ తెలుగు రాష్ట్రాల తరపున పోటీ పడనున్న నేపథ్యంలో ఫ్యాషన్, అందం, లైఫ్‌స్టైల్ తదితర అంశాలపై వారి అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. ఈ రంగంలో రాణించడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన తమ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఇరువురినీ ఎన్‌ఐఎఫ్‌డీ గ్లోబల్ సెంటర్ డైరెక్టర్ సంజయ్ సరస్వత్ ప్రత్యేకంగా అభినందించారు. డ్రెస్‌లు వ్యక్తిత్వానికి ప్రతీక కాదు.. దక్షిణాది అమ్మాయిలకు బ్యూటీ పేజెంట్స్‌లో గుర్తింపు పెరిగింది. హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి ఈ రంగంలో అద్భుత నైపుణ్యాలున్న అమ్మాయిలు రాణిస్తున్నారు. యువతలో పరిపక్వత పెరిగింది. కానీ అవగాహన పెరగాలి. పిల్లలు ఫ్యాషన్ రంగంలో ఆసక్తి చూపిస్తుంటే ఇబ్బందిగా భావిస్తున్నారు. మంచి చెడులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి. కానీ ఫ్యాషన్, మోడలింగ్, సినిమాలు అనే సరికి సమాజం సులభంగా జడ్జ్ చేస్తున్నారు. మోడ్రన్ డ్రెస్‌లు మా వ్యక్తిత్వానికి ప్రతీక కాదు. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి రాగలిగాము. మా సోషల్ మీడియా అకౌంట్స్‌లో చూస్తే తెలుస్తుంది.. సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తున్నామనేది. నార్త్ ష్యాషన్ ఔత్సాహికులను సైతం హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది. దక్షిణాదిలో సృజనాత్మకత, ఐడియాలజీ, నైపుణ్యాలను వారు అద్భుతంగా వాడుకుంటారు. అదే రీతిలో మనవారినీ ప్రోత్సహించాలి. ఈ రంగంలో బాహ్య, అంతర సౌందర్యం రెండూ ముఖ్యమే. మన రంగూ, రూపు మాత్రమే విజేతగా నిలబెట్టలేవు. ఆలోచనా విధానం, అవగాహన ఇందులో కీలకాంశాలు. – ప్రకృతి కంభం.అలాంటి రోజులు రావాలి..ఈ రోజు సెషన్లో ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికులు.. వారి ప్రయాణాన్ని తమ కుటుంబ సభ్యులే ఒప్పుకోవట్లేదని, ఫ్యాషన్, మోడలింగ్ అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారని వారిస్తున్నారు. కానీ మాలాంటి అవగాహన, పరిపక్వత, నైపుణ్యాలు ఉన్న అమ్మాయిలు దొరకడం వారి అదృష్టం అని తెలుసుకునే రోజులు రావలి. వ్యవస్థనో, ఫ్యాషన్ పరిశ్రమపై పడిన ముద్ర మమ్మల్ని డిసైడ్ చేయలేవు. కళాత్మకత, సేవ, విద్య, సామాజిక విలువలు తదితర అంశాల్లో మేమెంతో ఉన్నతంగా ఆలోచిస్తాం. కెమెరా, వీఎఫ్ఎక్స్, డైరెక్షన్, సినిమాలు, యాక్టింగ్ అంటూ బాలీవుడ్ వరకూ ఎందరో నగరానకి వస్తున్నారు. కొందరి లోపాలు ఎంచుకుని పరిశ్రమను నిర్ధారిస్తున్నారంటే అది అవగాహనా లోపమే. అందుకే ఎంతో ఇష్టమున్నా రాణించలేకపోతున్నారు. పరిమితులు లేకుండా నచ్చగలిగింది చేయగలిగినప్పుడే మహిళా సాధికారత వస్తుంది. ఒకప్పటిలా స్టిగ్మా లేకపోయినప్పటికీ, పూర్తిగా లేదు అనలేము. గతంలో ఒక ఆటో డ్రైవర్ కూతురు సైతం విజేతగా నిలిచిన సందర్భాలున్నాయి. పోటీలు పారదర్శకంగా జరుగుతున్నాయి. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్‌గా స్థిరంగా ఉంటూ, గ్లోబల్ వేదికపై సత్తా చాటడానికి వినూత్నంగా ప్రయతి్నస్తున్నాం. దేశంలో ఫెమినా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇండియా వేదికలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయి. సాధారణంగా జరిగే పేజెంట్‌లో పాల్గొనే సమయంలో ఇంతకు ముందు విజేతల ప్రొఫైల్స్ తప్పకుండా గమనించాలి. – భవ్య రెడ్డి -
అవకాశాల కోసం.. ఆ పనులు చేయాలన్నారు!
సాక్షి, ముంబై : అందరిలాగా తాను కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అనేక వేధింపులు ఎదుర్కొన్నానని బాలీవుడ్ బ్యూటీ దీపీకా పదుకోన్ చెప్పారు. ఇటీవల ఓ ప్రముఖ మేగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం కొంత మంది తనకు బూబ్ జాబ్ అడ్వైజ్ చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు. డైరెక్టర్, నిర్మాతల దృష్టిలో పడటానికి ఇది మంచి మార్గమని వారు తెలిపారని చెప్పారు. మరి కొందరు బ్యూటీపజెంట్ కాంటెస్టుల్లో పాల్గొనాలని సూచించారని, ఇలాంటివి చేయడం వలన తొందరగా గుర్తింపు పొంది మీరు అనుకున్న లక్ష్యాన్ని తక్కువ సమయంలోనే చేరుకుంటారని సలహా ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కానీ అలాంటి అసభ్యకరమైన పనులు నేను చేయను.. నేను అలాంటి దాన్ని కాదు.. ఆత్మవిశ్వాసంతో నాకు నచ్చిన దారిలోనే ధైర్యంగా ముందుకు వచ్చానని దీపిక చెప్పారు. అదేవిధంగా దీపికా 2014 సమయంలో ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నా.. కొంత నిరాశలో ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో నాకు కొంత మంది ధైర్యం చెప్పి ముందుకు నడిపించారని పేర్కొన్నారు. ఎంతటి విజయం సాధించినా మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యమని ఆమె అన్నారు. 2014 నా జీవితంలో అద్భుతమైన సంవత్సరమని అన్నారు. అయితే దీపికా, హీరో రణ్‌వీర్‌సింగ్‌లు ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. -
మళ్లీ నోరుపారేసుకున్న ముఖ్యమంత్రి
అగర్తల : వివాదాలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ ఆదేశించినా.. బీజేపీ నేతలు మాత్రం పాటించటం లేదు. గత కొన్ని రోజులుగా త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మహాభారతకాలంలో ఇంటర్నెట్, శాటిలైట్ వ్యవస్థ కామెంట్లు చేసిన ఆయన.. మమతా బెనర్జీకి మతి చెడిందంటూ తాజాగా వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారం రేపారు. ఇక ఇప్పుడు మరోసారి అందాలపోటీలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గురువారం ప్రజ్ఞా భవన్లో చేనేత, హస్త కళాకృతుల అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విప్లవ్ కుమార్ దేవ్‌ను ముఖ్య అతిధిగా హాజరయి ప్రసంగించారు. ‘విదేశీ వస్త్ర వ్యాపారులు అందాల పోటీల నిర్వహణ నెపంతో తమ సౌందర్య ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటున్నారు. ఈ అందాల పోటీల్లో విజేతను ముందుగానే నిర్ణయిస్తారు. ఏ దేశ వస్త్రాలను, సౌందర్య సాధనాలను ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారో.. ఆ దేశానికి చెందిన వారినే విజేతలుగా నిర్ణయిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ మహిళలు పోటీల్లో గెలుస్తున్నారు. ఇది మంచి విషయమే ఎందుకంటే మన దేశంలో స్త్రీని లక్ష్మీ, సరస్వతి వంటి దేవతా మూర్తులకు సమానంగా భావిస్తాము. ఐశ్వర్య రాయ్ భారతీయ మహిళల ప్రతినిధిగా పోటిల్లో పాల్గొని.. కిరీటం గెలుచుకుంది. అందుకు ఆమె అర్హురాలు. కానీ, డయానా హెడెన్ ఎవరు? ఎవరికి ప్రతినిధిగా ఈ పోటిల్లో పాల్గొంది? నిర్వహకులకు ఆమెలో ఏం అందం కనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఇదంతా అంతర్జాతీయ వస్త్ర వ్యాపారుల మాఫియా’ అంటూ తీవ్రంగా విమర్శించారు. ‘గతంలో భారతీయ మహిళలు ఎటువంటి సౌందర్య సాధనాలను ఉపయోగించేవారు కాదు. స్నానం చేయడం కోసం మట్టిని, తలను శుభ్రపరుచుకోవడం కోసం మెంతులను వాడేవారు. ఎప్పుడైతే విదేశీ వస్త్ర వ్యాపారులు తమ ఉత్పత్తులను మన దేశంలో మార్కెట్ చేయడం మొదటుపెట్టారో అప్పటి నుంచి మన దేశంలో కూడ ఈ సౌందర్య సాధనాల వినియోగం ప్రారంభమైంది. ఇప్పుడు మనదేశంలో ప్రతి వీధిలో ఒక బ్యూటీ పార్లర్ ఉంది’ అన్నారు. విప్లవ్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ‘మీ వ్యాక్యలు మిమ్మల్ని ఒక పిచ్చివాడిగా.. రేపిస్టుగా చూపిస్తున్నాయి’ అని అనిత అనే సామాజిక కార్యకర్త విమర్శించారు. -
నోటిదురుసుతో అందాల కిరీటం మిస్
నేపిడా: తన నోటిదురుసుతో తాను కైవసం చేసుకున్న అందాల కిరీటాన్ని మయన్మార్ బ్యూటీ క్వీన్ కోల్పోయింది. రోహింగ్యా సంక్షోభంపై వ్యాఖ్యానించి మిస్ గ్రాండ్ మయన్మార్ టైటిల్‌ను షుయెన్ సి(19) పోగొట్టుకుంది. మయన్మార్‌లో రోహింగ్యా మిలిటెంట్లు అశాంతిని ప్రేరేపించారనే వీడియోను ఆమె తన ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. రోహింగ్యాలు, వారి మద్దతుదారులు మీడియాలో పథకం ప్రకారం ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. దీంతో షుయెన్ సి మిస్ గ్రాండ్ మయన్మార్ టైటిల్‌ను రద్దు చేస్తున్నట్టు టైటిల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆమె దిగజారుడు వ్యాఖ్యలతో రోల్‌మోడల్‌గా విఫలమయ్యారని చెప్పారు. వివాదాలతో బ్యూటీ టైటిల్‌ను కోల్పోవడం సీ ఒక్కరికే అనుభవంలోకి రాలేదు. గత నెలలో టర్కీ నేషనల్ బ్యూటీ 2017 టైటిల్‌ను దక్కించుకున్న ముద్దుగుమ్మ కూడా ఓ వివాదాస్పద ట్వీట్‌ను పోస్ట్ చేయడంద్వారా తన టైటిల్‌కే ఎసరు తెచ్చుకున్నారు. -
అక్కడి అందాల పోటీల్లోనూ...!
న్యూఢిల్లీ: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లో ముందున్నారు. అదేవిధంగా అందాల పోటీల్లోనూ భారత సంతతి అమ్మాయిలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా న్యూజెర్సీలో నిర్వహిస్తున్న రెండు వార్షిక అందాల పోటీల్లో ఏడుగురు భారత సంతతి సుందరీమణులు పోటీ పడుతున్నారు. న్యూజెర్సీ రాష్ట్రం ప్రతి ఏడాది 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ', 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ' పోటీలను నిర్వహిస్తున్నది. ఇందులో 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ' పోటీలలో ఆరుగరు భారత సంతతి అమ్మాయిలు పోటీపడుతుండగా.. 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ' పోటీలో ఒకరు పోటీపడుతున్నారు. వనితా బుధాన్ (22), నికోల్ పటేల్ (23), నిహారా చక్రాల (24), సౌమ్యశర్మ (23), సుచిత్ర సింగ్ (24), ఛావి వర్గ్ (18)లు 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ'లో అదృష్టం పరీక్షించుకుంటుండగా.. 14 ఏళ్ల నేహా పసుపులేటి ఎడిసన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ'లో పోటీపడుతున్నారు. ఈ పోటీలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు గత శుక్రవారం, శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ అభివృద్ధి, ప్రేరణ, నైపుణ్య విశిష్టత వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారు అమెరికా జాతీయ అందాల పోటీలైన 'మిస్ యూఎస్ఏ', 'మిస్ టీన్ యూఎస్ఏ'లో పాల్గొంటారు. మిస్ యూఎస్ఏలో విజయం సాధిస్తే.. మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొనవచ్చు.