
నేపిడా: తన నోటిదురుసుతో తాను కైవసం చేసుకున్న అందాల కిరీటాన్ని మయన్మార్ బ్యూటీ క్వీన్ కోల్పోయింది. రోహింగ్యా సంక్షోభంపై వ్యాఖ్యానించి మిస్ గ్రాండ్ మయన్మార్ టైటిల్‌ను షుయెన్ సి(19) పోగొట్టుకుంది. మయన్మార్‌లో రోహింగ్యా మిలిటెంట్లు అశాంతిని ప్రేరేపించారనే వీడియోను ఆమె తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. రోహింగ్యాలు, వారి మద్దతుదారులు మీడియాలో పథకం ప్రకారం ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. దీంతో షుయెన్ సి మిస్ గ్రాండ్ మయన్మార్ టైటిల్‌ను రద్దు చేస్తున్నట్టు టైటిల్ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఆమె దిగజారుడు వ్యాఖ్యలతో రోల్‌మోడల్‌గా విఫలమయ్యారని చెప్పారు. వివాదాలతో బ్యూటీ టైటిల్‌ను కోల్పోవడం సీ ఒక్కరికే అనుభవంలోకి రాలేదు. గత నెలలో టర్కీ నేషనల్ బ్యూటీ 2017 టైటిల్‌ను దక్కించుకున్న ముద్దుగుమ్మ కూడా ఓ వివాదాస్పద ట్వీట్‌ను పోస్ట్ చేయడంద్వారా తన టైటిల్‌కే ఎసరు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment