
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండేళ్ల క్రితం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. గతేడాది ఈ జంటకు ఓ కుమార్తె కూడా జన్మించింది. మార్చి 3వ తేదీ 2023లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహా వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు ఆశీర్వదించారు.
మౌనికతో పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. రెండో వివాహా వార్షికోత్సవం వేళ మౌనికలో ఉన్న సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. మౌనికను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని పోస్ట్ చేశారు.
(ఇది చదవండి: నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్)
మంచు మనోజ్ తన ట్వీట్‌లో రాస్తూ..' రెండు సంవత్సరాల క్రితం నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం తీసుకున్నా. నా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నా. మౌనిక నా జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి నాకు తెలియని కొత్త ప్రేమను అందించావు. నేను విధిని నమ్మడానికి కారణం నువ్వు నా కష్టాల్లో నా వాయిస్‌గా, గందరగోళంలో నా ప్రశాంతతగా నిలిచావు. కేవలం రెండేళ్లలో ప్రేమ, సంతోషం, నవ్వులతో ఇద్దరు అందమైన చిన్న పిల్లలతో ఇంటిని తీర్చిదిద్దావు. మన పిల్లల పట్ల ఒక తల్లిగా నీ అనంతమైన ప్రేమను చూసి.. ప్రతిరోజూ నీతో ప్రేమలో పడిపోతున్నా. ఈ రెండేళ్లలోనే ఎన్నో ఎత్తులు, పతనాలు, విజయాలు, పోరాటాలను ఎదుర్కొన్నాం. కానీ వీటన్నింటిలో ఒకటి మాత్రం స్థిరంగా ఉంది. అదే మనం. నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్, నాకు అతిపెద్ద సపోర్టర్. ఈ రెండేళ్లు నాపై నువ్వు చూపించిన ప్రేమకు.. నా జీవితకాలం సరిపోదు. హ్యాపీ వార్షికోత్సవ శుభాకాంక్షలు మున్నీ. మన కలలు, సాహసాలు, ప్రేమ, సమయంతో పాటు మరింత బలంగా పెరుగుతుంది. ఇట్లు నీ మను' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. అంతకుముందే మౌనిక కూడా సోషల్ మీడియా వేదికగా తన భర్త మంచు మనోజ్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలను షేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment