marriage anniversary
-
నీ రెండేళ్ల ప్రేమ.. నా జీవితకాలం సరిపోదు: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండేళ్ల క్రితం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. గతేడాది ఈ జంటకు ఓ కుమార్తె కూడా జన్మించింది. మార్చి 3వ తేదీ 2023లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహా వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు ఆశీర్వదించారు.మౌనికతో పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. రెండో వివాహా వార్షికోత్సవం వేళ మౌనికలో ఉన్న సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. మౌనికను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని పోస్ట్ చేశారు.(ఇది చదవండి: నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్)మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' రెండు సంవత్సరాల క్రితం నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయం తీసుకున్నా. నా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నా. మౌనిక నా జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి నాకు తెలియని కొత్త ప్రేమను అందించావు. నేను విధిని నమ్మడానికి కారణం నువ్వు నా కష్టాల్లో నా వాయిస్‌గా, గందరగోళంలో నా ప్రశాంతతగా నిలిచావు. కేవలం రెండేళ్లలో ప్రేమ, సంతోషం, నవ్వులతో ఇద్దరు అందమైన చిన్న పిల్లలతో ఇంటిని తీర్చిదిద్దావు. మన పిల్లల పట్ల ఒక తల్లిగా నీ అనంతమైన ప్రేమను చూసి.. ప్రతిరోజూ నీతో ప్రేమలో పడిపోతున్నా. ఈ రెండేళ్లలోనే ఎన్నో ఎత్తులు, పతనాలు, విజయాలు, పోరాటాలను ఎదుర్కొన్నాం. కానీ వీటన్నింటిలో ఒకటి మాత్రం స్థిరంగా ఉంది. అదే మనం. నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్, నాకు అతిపెద్ద సపోర్టర్. ఈ రెండేళ్లు నాపై నువ్వు చూపించిన ప్రేమకు.. నా జీవితకాలం సరిపోదు. హ్యాపీ వార్షికోత్సవ శుభాకాంక్షలు మున్నీ. మన కలలు, సాహసాలు, ప్రేమ, సమయంతో పాటు మరింత బలంగా పెరుగుతుంది. ఇట్లు నీ మను' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. అంతకుముందే మౌనిక కూడా సోషల్ మీడియా వేదికగా తన భర్త మంచు మనోజ్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
భార్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన రాకింగ్ రాకేశ్.. పోస్ట్ వైరల్
గతేడాది కేశవ చంద్రా రమావత్ (కేసీఆర్) మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్. ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవితం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేశ్. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సుజాతను పెళ్లాడిన రాకేశ్..అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే యాంకర్ జోర్దార్ సుజాతను ఆయన పెళ్లాడారు. 2023 ఫిబ్రవరి 24న తిరుమలలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. జోర్దార్ సుజాత టాలీవుడ్ రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌తో గుర్తింపు వచ్చిన తర్వాత జోర్దార్ సుజాత ఒక కామెడీ షోలో నటించింది. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్‌తో జంటగా ఆమె కొన్ని ప్రొగ్రామ్స్ చేసింది. అలా వారి ప్రేమకు తొలి అడుగులు పడ్డాయి.పెళ్లి రోజు శుభాకాంక్షలు..అయితే తాజాగా ఈ టాలీవుడ్ బుల్లితెర జంట తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు రాకింగ్ రాకేశ్. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా వారి పెళ్లి ఫోటోను పంచుకున్నారు.ట్విటర్లో రాకింగ్ రాకేశ్ రాస్తూ..'పెళ్లిరోజు ఓ మధుర జ్ఞాపకం.. ప్రేమగా మొదలై.. బంధంగా ముడిపడి.. బాధ్యతగా జీవితంలో సగభాగంగా అన్ని తనై నడిపిస్తూ మా ఇంటి మహాలక్ష్మికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.. మీ అందరి ఆశీస్సులతో మా పెళ్లి బంధానికి రెండు సంవత్సరాలు' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాతకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. గతేడాది అక్టోబర్‌లో ఈ జంటకు కుమర్తె జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లిరోజు ఓ మధుర జ్ఞాపకం❤️ప్రేమగా మొదలై బంధంగా ముడిపడి బాధ్యతగా జీవితంలో సగభాగంగా అన్ని తనై నడిపిస్తూ మా ఇంటి మహాలక్ష్మికి మా పెళ్లి బంధానికి రెండు సంవత్సరాలు శుభాకాంక్షలు మీ అందరి ఆశీస్సులతో🙏🌹 pic.twitter.com/Lfs9N1kWZz— RockingRakesh (@RockingrakeshJB) February 24, 2025 -
'26 ఏళ్లుగా ఈ ట్రెండ్‌ను అధిగమిస్తున్నాం'.. భార్యకు అజయ్ దేవగణ్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. తాజాగా ఈ జంట తమ 26వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు అజయ్ దేవగణ్ మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో దిగిన పాత ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '26 ఏళ్లుగా ఈ ట్రెండ్‌ను అధిగమిస్తున్నాం.. మనిద్దరికీ హ్యాపీ యానివర్సరీ' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు స్టార్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మొదట వీరిద్దరు 1995లో వచ్చిన హల్చల్ అనే మూవీ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో జంటగా కనిపించారు. అదేక్రమంలోనే అజయ్, కాజోల్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 1999లో ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు ఇష్క్, ప్యార్ తో హోనా హి థా, యు మే ఔర్ హమ్, తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్ లాంచి చిత్రాలలో జంటగా నటించారు. వీరిద్దరి నైసా దేవగణ్, యుగ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే కాజోల్ చివరిసారిగా దో పట్టిలో కనిపించింది. మరోవైపు అజయ్ దేవగణ్ చివరిసారిగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం ఎగైన్‌లో కనిపించారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
'ఆ బాధేంటో నాకు మాత్రమే తెలుసు'.. అత్తారింటికి దారేది నటుడు ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్లో అత్తారింటికి దారేది చిత్రంతో అభిమానులను సంపాదించుకున్న నటుడు బోమన్ ఇరానీ. ఆ తర్వాత తెలుగులో బెంగాల్ టైగర్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హిందీ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. బోమన్ ఇరానీ చివరిసారిగా షారూఖ్ ఖాన్ మూవీ డుంకీలో కనిపించారు. ప్రస్తుతం ది మెహతా బాయ్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా బోమన్ ఇరానీ తన వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. తన భార్య జెనోబియా ఇరానీతో కలిసి 40వ పెళ్లి రోజును ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బోమన్ ఇరానీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఫరా ఖాన్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపింది.బోమన్ ఇరానీ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఈ ప్రపంచం మొత్తం నిన్ను దేవదూత అని పిలిచినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే దీని వెనుక ఉన్న నిజమైన బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. మన 40 సంవత్సరాల బంధమే దీనికి నిదర్శనం. కానీ ఇప్పుడు ఆ దేవదూతనే నన్ను ఇంతలా తీర్చిదిద్దింది. అంతేకాదు మా కుటుంబాన్ని తీర్చిదిద్ది మాలో నవ్వులు పూయించి ముందుండి నడిపించింది. 40 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న నా పాత స్నేహితుడిని ఎప్పటికీ ప్రేమిస్తున్నా ఉంటా.' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు విషెస్ తెలిపారు.కాగా.. బోమన్ ఇరానీ టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్లో 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, ఖోస్లా కా ఘోస్లా లాంటి సూపర్ హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ది మెహతా బాయ్స్ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్‌లో మోస్ట్ ఫేమ్ ఉన్న ఫేమ్ ఉన్న జంటల్లో నయనతార- విఘ్నేశ్ శివన్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు జూన్ 9, 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసి పద్ధతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. తాజాగా ఇవాళ రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా నయన భర్త విఘ్నేశ్ శివన్ స్పెషల్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలోకి అతి గొప్పవిషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా. నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే ఆశయం. ఆలాగే మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. నయన్ గతేడాది జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన అన్నపూరణి చిత్రం విమర్శల పాలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
భార్యకు స్పెషల్‌గా విష్ చెప్పిన టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం హరోం హర. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మాళవిక శర్మ జంటగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మే 31న రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. వచ్చేనెల జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు సుధీర్‌బాబు ప్రకటించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే సుధీర్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శినిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి మే 29,0 2006లో ఘనంగా జరిగింది. తాజాగా వివాహా వార్షికోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు సుధీర్. తన భార్య ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. అంతేకాదు పెళ్లిచూపుల ఫోటో అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు హీరో జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. Happy Anniversary my love 'Priya' 💐 You complete me 😘🤗…. First pic of hers I have with me. Pellichoopulu photo 😄 pic.twitter.com/005YWnBIzZ— Sudheer Babu (@isudheerbabu) May 29, 2024 -
Suresh Raina Marriage Anniversary: "మిస్టర్ ఐపీఎల్"కు పెళ్లి రోజు శుభాకాంక్షలు
-
వారి లోటును భర్తీ చేయలేను.. కానీ మాటిస్తున్నా: మంచు మనోజ్ ఎమోషనల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్‌బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. తాజాగా తమ మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మనోజ్ తన భార్యకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతి రోజు ప్రేమ, ఆనందంతో నిండిన అద్భుతమైన ప్రయాణమిది. ధైరవ్, మనకు పుట్టబోయే బిడ్డ కోసం ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ ఉనికి నా జీవితాన్ని ప్రేమ, సాంగత్యంతో అసాధారణంగా మార్చేసింది. మీ తల్లిదండ్రుల లోటును ఎన్నటికీ భర్తీ చేయలేనప్పటికీ.. వారి జీవితంలో అత్యంత విలువైన వారిని సంరక్షిస్తానని వాగ్దానం చేస్తున్నా. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని కాపాడతానని మాటిస్తున్నా. ఇక్కడ మాకు, మా కుటుంబానికి అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నా భార్యమణికి పెళ్లి రోజు శుభకాంక్షలు. మీరు నా హృదయం, ఆత్మలో అత్యంత విలువైన భాగం. ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమించే మను' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే మౌనిక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఏడాదిలోనే మనోజ్- మౌనిక తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. మౌనిక సైతం పెళ్లి రోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. Happy Anniversary to my beloved wife @bhumamounika . Every day with you is a cherished journey, filled with love and joy. I am deeply grateful to God for you, Dhairav, and our little one on the way this May. 🙌🏽 Your presence has transformed my life into an extraordinary… pic.twitter.com/vQtos5jyTx — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2024 -
భార్యకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మంచు విష్ణు.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. ఇటీవలే న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం కన్నప్ప రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. ఇవాళ తన 15వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా భార్య విరానికా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్‌లో ఆమెను తీసుకెళ్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కన్నప్ప షూట్లో ఉన్న మంచు విష్ణు భార్య కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి సర్ ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను విరానికా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు టాలీవుడ్ జంటకు పెళ్లి రోజు విషెస్ చెబుతున్నారు. కాగా.. మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విరానికా రెడ్డిని మార్చి 1, 2009న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు అరియానా, వివియానా, ఐరా, అర్వం అనే నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మరో వైపు.. విష్ణు భార్య విరానికా ఫ్యాషన్ డిజైనర్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) -
పొరపాటున ఒక చుక్క చూపించా.. అంతే: బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్
బిగ్‌బాస్ సీజన్- 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి ఇటీవలే తండ్రి అయిన సంగతి తెలిసిందే. అర్జున్ భార్య సురేఖ జనవరి 9న పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన కూతురుకి ఆర్ఖా అని నామకరణం చేశాడు. గతేడాది వెల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ టాప్-6 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచారు. అర్జున్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే ఆయన భార్య సురేఖ కూడా వచ్చింది. ఆ సమయంలో హౌస్‌లో సీమంతం వేడుక కూడా నిర్వహించారు. (ఇది చదవండి: తండ్రి అయిన ‘బిగ్‌బాస్’ అర్జున్.. ఏం పేరు పెట్టారంటే..?) తాజాగా అర్జున్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన పెళ్లి రోజును గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా తన భార్యకు విషెస్ తెలిపారు. పొరపాటున ఒక్కరోజు ఒక చుక్క చూపించా.. కానీ నాకు మాత్రం జీవితాంతం చుక్కలు చూపిస్తున్నావ్.. మనకు ప్రత్యేకమైన రోజున శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. బుధవారం అర్జున్- సురేఖ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఇలా తన భార్యపై ప్రేమను చాటుకున్నారు. కాగా..అంబటి అర్జున్ ప్రస్తుతం బుల్లితెరపై షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun) -
భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన స్టార్ హీరో.. ఫోటో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అతనికి జోడీగా నటించింది. ఈ ఏడాది సిటాడెల్-2తో పాటు కోలీవుడ్‌లో మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా దలాల్‌ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వరుణ్, నటాషా దలాల్ జనవరి 24, 2021న అలీబాగ్‌లో జరిగిన వివాహా వేడుకలకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ జంట వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు స్పెషల్ విషెస్ చెప్పారు బాలీవుడ్ హీరో. పెళ్లికి ముందు తనకు ప్రపోజ్ చేసిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. హ్యాపీ త్రీ బేబీ అంటూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర ఏళ్ల క్రితం మార్క్ ఆంథోనీ పాట ప్లే అయినప్పుడు ప్రపోజ్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. గతేడాది వరుణ్ నటించిన బవాల్ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
'నా జీవితంలో మార్పు తెచ్చిన క్షణమిదే'.. సింగర్ సునీత పోస్ట్ వైరల్!
సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా తెలుగువారి గుండెల్లో ఆమె స్థానం సంపాదించుకున్నారు. 17 ఏళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించిన సునీతకు 19 ఏళ్లకే పెళ్లయింది. చిన్న వయసులోనే సంపాదిస్తూ.. కుటుంబానికి నేనే పెద్ద దిక్కుగా నిలిచారు. ఇద్దరు పిల్లలు పుట్టాక.. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. అయినప్పటికీ సునీత తన కెరీర్‌ను కొనసాగించింది. అటు సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. జీవితంలో అన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్న సింగర్ సునీత మరోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత సునీత రెండో పెళ్లి చేసుకుంది. జనవరి 9న, 2021లో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడింది. ఆమెకు రెండో పెళ్లయ్యాక మూడో వివాహా వార్షికోత్సవం ఇవాళ జరుపుకోనుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నా జీవితం మొత్తంలో అద్భుతమైన క్షణమిదే అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం సునీత పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే స్టార్ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సర్కారు నౌకరి అనే చిత్రంలో నటించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Singer_Sunitha_Official (@singer_sunitha_official) -
#Virushka: విరాట్ కోహ్లి- అనుష్క శర్మ పెళ్లి బంధానికి ఆరేళ్లు (ఫొటోలు)
-
భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన రంగం హీరో.. పోస్ట్ వైరల్!
రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జీవా. ఆసాయ్ ఆసాయి అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించారు. 2011లో వచ్చిన రంగం సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌తో గుర్తింపు దక్కించుకున్నారు. 1983 ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కించి మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో మెరిశారు. ప్రస్తుతం మహీ వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న యాత్ర-2 చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ తన వివాహా వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేశారు. తన భార్యకు విషెస్ చెబుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోలు పంచుకున్నారు. కాగా.. 2007లో సుప్రియను ఆయన పెళ్లి చేసుకున్నారు. (ఇది చదవండి: 'యాత్ర 2' సినిమా... చంద్రబాబు పాత్రలో ఆ విలన్!) కాగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'యాత్ర- 2'. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై వచ్చిన 'యాత్ర' చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ చిత్రానికి మహీ వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. జగన్ పాత్రలో తమిళ హీరో జీవా, వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Jiiva (@actorjiiva) -
భార్యకు జెర్సీ నటుడు స్పెషల్ విషెస్.. వీడియో రిలీజ్!
సింధు సమవేలి అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యువ హీరో హరీశ్ కల్యాణ్. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించారు. కాదలి, జైశ్రీరామ్, నాని జెర్సీ లాంటి టాలీవుడ్ చిత్రాల్లో కనిపించారు. ఇటీవలే విడుదలైన ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కించిన ఎల్జీఎం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. అయితే గతేడాదే హరీష్ కల్యాణ్ వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. నర్మద అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. చెన్నైలో జరిగిన వీరి పెళ్లికి కోలీవుడ్ సినీతారలు, ప్రముఖులు సైతం హాజరయ్యారు. తాజాగా హరీశ్ కల్యాణ్ దంపతులు తమ మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య నర్మద పట్ల ప్రేమను చాటుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తన భార్యతో కలిసి ఉన్న ఆనందకరమైన క్షణాలను పంచుకుంటూ స్పెషల్ విషెస్ తెలిపారు. ఒకవైపు సినిమాలతో పాటు బిజీగా ఉంటూ.. మరోవైపు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం హరీశ్ కల్యాణ్ నటిస్తోన్న నూరు కోడి వానవిల్, డీజిల్ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. అనంతరం మరో ప్రయోగాత్మక చిత్రంలో కూడా నటించనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Harish Kalyan (@iamharishkalyan) View this post on Instagram A post shared by Dhoni Entertainment Pvt Ltd (@dhoni.entertainment) -
నేచురల్ స్టార్ నాని పెళ్లి.. లవ్ స్టోరీ మామూలుగా లేదుగా?
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగిన హీరో నాని. కెరీర్ తొలినాళ్లలో రేడియో జాకీగా అలరించారు నాని. నాని పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు. రాంబాబు, విజయ లక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించారు. నానికి అక్క కూడా ఉన్నారు. పేరు దీప్తి. స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామం. కొన్నాళ్లు బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. అష్టా చెమ్మా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదిగారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అలా మొదలైంది నాని సినీ ప్రయాణం. ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు, ఈగ, జెర్సీ, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తోన్న నాని.. ఇటీవలే సరిపోదా శనివారం అనే టైటిల్లో కొత్త మూవీని ప్రకటించారు. (ఇది చదవండి: ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్ .. ఎమోషనల్ అయిన జ్యోతిరాజ్) అయితే 2012లో అక్టోబర్ 27న అంజనా ఎలవర్తి అనే అమ్మాయిని పెళ్లి హీరోకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లి జరిగిన నేటికి 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నాని తన ఇన్‌స్టాలో ఓ అరుదైన ఫోటోను పంచుకున్నారు. తన భార్య అంజనకు నుదుటిన బొట్టు పెడుతున్న పిక్ షేర్ చేశారు. మా బంధానికి 11 సంవత్సరాలు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే నానికి ఫేస్ బుక్ ద్వారా అంజనా పరిచయమైనట్లు తెలుస్తోంది. అయిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారు. కాగా.. విశాఖపట్నానికి చెందిన అంజనా కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తోంది. అయితే మొదట నానితో పెళ్లికి అంజనా ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదని సమాచారం. దీంతో ఐదేళ్ల పాటు రిలేషన్లో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. (ఇది చదవండి: పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్) View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
'నాకంటే వీడియో గేమ్స్ ఎక్కువయ్యాయా?'
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వీడియో గేమ్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సమయంలోనూ ధోని విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు హోటల్ రూమ్స్‌లో ఎక్కువగా వీడియో గేమ్స్‌తోనే కాలక్షేపం చేసేవాడు. ఇటీవలే ఐపీఎల్ సందర్భంగా ధోని ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ క్యాండీ క్రష్ ఆడుతున్న వీడియోనూ షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. తాజాగా మంగళవారం(జూన్ 4న) ధోని, సాక్షిసింగ్ తమ 13వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోని.. ''ధోని బెడ్‌రూంలోనూ ఏం చేస్తున్నాడో చూడండి'' అంటూ ఒక పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్ చేసింది. ఆ ఫోటోలో ధోని మంచంపై పడుకొని ట్యాబ్‌లో వీడియో గేమ్ ఆడుతూ చాలా బిజీగా కనిపించాడు. ఇది చూసిన సాక్షి.. ''బెడ్రూంలో కూడా వీడియో గేమ్స్ ఆడతావా.. నాకంటే నీకు వీడియో గేమ్ ఎక్కువయిందా'' అంటూ ధోని కాళ్లను కొరుకుతున్నట్లుగా ఉంది. ''మిస్టర్ స్వీటీ నుంచి అటెన్షన్ పక్కకు తప్పిన సమయంలో.. వీడియో గేమ్స్ వర్సెస్ వైఫ్(ముఖ్య గమనిక: ఈ ఫోటోకు అసలైన అర్థం కేవలం మా ఇద్దరి క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే అర్థమవుతుంది)'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక 2010లో డెహ్రాడూన్‌లో ధోని, సాక్షి సింగ్‌ల పెళ్లి జరిగింది. 2015లో ఈ జంటకు జీవా పుట్టింది. ఇక ధోని నాయకత్వంలోని సీఎస్కే ఐపీఎల్ 2023 సీజన్లో విజేతగా నిలిచింది. అయితే ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరిగినా.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మరో ఏడు, ఎనిమిది నెలల్లో ప్రకటిస్తానని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొన్నాడు. చదవండి: #Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా ICC Rankings: వరల్డ్ నెం1 టెస్టు బ్యాటర్‌గా విలియమ్సన్.. భారత్ నుంచి ఒకే ఒక్కడు -
డైరెక్టర్ సుకుమార్- తబితల వివాహబంధానికి 14 ఏళ్లు, అరుదైన ఫోటోలు
-
12 ఏళ్ల నుంచి నా బెస్ట్ ఫ్రెండ్.. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది: విఘ్నేశ్ శివన్
సౌత్ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్‌లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే వీరి వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ జంటకు విఘ్నేశ్ శివన్ చిన్ననాటి స్నేహితుడు సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు) చెన్నైలోని వీరి నివాసంలో జరిగిన వార్షికోత్సవంలో ఫ్లూట్ వాయించి మరీ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. బాల్య స్నేహితుడు ఇచ్చిన సర్ప్రైజ్కు నయన్- విఘ్నేశ్ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విక్కీ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. వీడియోనూ షేర్ చేస్తూ స్నేహితునిపై ప్రశంసలు కురిపించారు. విఘ్నేశ్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..'మాకు ఇవీ ప్రత్యేకమైన క్షణాలు. మా మొదటి వివాహా వార్షికోత్సవ వేడుక. నా 12 ఏళ్ల వయస్సు నుంచి నవీన్ బెస్ట్ ఫ్రెండ్. నీతో కలిసి ఒకే వేదికపై డ్రమ్స్ వాయించడం.. చాలాసార్లు నీతో వేదికను పంచుకున్నా. నా జీవితంలో నిన్ను చూస్తూనే ఎదిగా. కానీ ఈరోజు మర్చిపోలేనిది. అలాగే చాలా ప్రత్యేకమైనది కూడా. ఈ రోడు మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నువ్వు నా స్నేహితుడిగా ఉండటం నాకు గర్వంగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !
సౌత్ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్‌లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే ఈ శుభ సందర్భంలో అమ్మా-నాన్నకు సర్ప్రైజ్ ఇచ్చారు ట్విన్స్. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?) నయన్- విఘ్నేశ్ ఇద్దరు పిల్లలు వివాహా వార్షికోత్సవానికి అమ్మా-నాన్నకు సర్ప్రైజ్ ఇచ్చారు. హ్యాపీ యానివర్శరీ అంటూ బెలూన్లతో అలంకరించిన ఫోటోను విక్కీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన ఇద్దరు పిల్లల గురించి విక్కీ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ధన్యవాదాలు బాయ్స్. ఇంత చక్కని వివాహ వార్షికోత్సవ వేడుకను మాకు అందించినందుకు లవ్ యూ టూ ఉయిర్, ఉలగం. ఇంత చిన్న వయసులో మాకోసం మీరిద్దరు ఎంతగా ఆలోచించారు. మేము మీ ఇద్దరినీ ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం'. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇద్దరు పిల్లల ఫోటోను షేర్ చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇంత చిన్న వయసులోనే ఇంతలా డేకరేషన్ ఎలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో సూపర్బ్ అంటూ విషెష్ చెబుతున్నారు. కాగా.. జూన్ 9, 2022న మహాబలిపురంలో నయనతార- విఘ్నేశ్ శివన్ వివాహా ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి రజనీకాంత్, షారూఖ్ ఖాన్, అనిరుధ్ రవిచంద్రన్‌తో పాటు సినీ పరిశ్రమకు పలువురు తారలు, స్నేహితుల హాజరయ్యారు. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా గతేడాది అక్టోబర్‌లో కవలలకు స్వాగతం పలికారు. (ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
వెకేషన్లో దిల్ రాజు కుమార్తె.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్!
టాలీవుడ్ నిర్మాతల్లో దిల్ రాజు గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉంటారు. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నిలబడే వారిలో దిల్ రాజు ముందు వరుసలో ఉంటారు. ఇటీవల ఆయన నిర్మించిన శాకుంతలం మూవీ పెద్ద షాకిచ్చిందని వెల్లడించారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. (ఇది చదవండి: ఆ సినిమా నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది: దిల్ రాజు) వేకేషన్లో దిల్ రాజు డాటర్ అయితే దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డిని కూడా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇటీవలే సూపర్ హిట్‌గా నిలిచిన బలగం సినిమాకు దిల్ రాజు కుమార్తె నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా దిల్ రాజు కూతురు వేకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 2014లో మే 4 వ తేదీన అర్చిత్ రెడ్డిని విహహం చేసుకుంది. ఇవాళ హన్షిత పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి వేకేషన్లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: శరత్‌బాబుకు సంతాపం తెలిపిన కమల్‌హాసన్.. కాసేపటికే ట్వీట్ డిలీట్) View this post on Instagram A post shared by Hanshithareddy (@hanshithareddy) -
ఆలియాకు రణ్‌బీర్ ఖరీదైన గిఫ్ట్.. స్పెషల్ ఏంటో తెలుసా?
బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట ఒకటి. గతేడాది వివాహాబంధంతో ఒక్కటైన ఈ జంటకు నవంబర్‌లో పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దురు కూతురుకు రాహా అని నామకరణం కూడా చేశారు. ఏప్రిల్ 14, 2022న సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితమే మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. మొదటి వివాహా వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ఆలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. దాదాపు రూ.10 లక్షల విలువ చేసే హ్యాండ్‌బ్యాగ్ ఇచ్చి భార్యపై ప్రేమను చాటుకున్నాడు. కాగా.. బాలీవుడ్ జంట బాంద్రాలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. తమ కలల ఇంటి పనులను పర్యవేక్షించేందుకు రాగా.. ఆలియా, రణ్‌బీర్ కెమెరాలకు చిక్కారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా బ్యూటీఫుల్ కపుల్స్ అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
విశ్వం ఇచ్చిన అతిగొప్ప వరం.. మధుమిత ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ జంటల్లో నటుడు శివ బాలాజీ, మధుమిత ముందువరుసలో ఉంటారు. హీరో, హీరోయిన్లుగా నటించిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2004లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇంగ్లీస్ కారన్’ షూటింగ్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. అనంతరం పెద్ద అంగీకారంతో 2009 మార్చి 1న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక వివాహం అనంతరం నటకు గుడ్‌బై చెప్పేసింది మధుమిత. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇవాళ వారి వివాహా వార్షికోత్సవం సందర్భంగా మధుమిత తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. మధుమిత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా జననం నేను ఎంచుకోలేనిది. ఆలాగే నా మరణం కూడా నేను ఎంచుకోలేనిదే. ఎనలేని ప్రేమతో నేను ఎంచుకున్న మీతో.. నా జీవితాన్ని అమితమైన ప్రేమతో అత్యద్భుతంగా మలిచారు. ఈ అనంత విశ్వం నాకు ఇచ్చిన అతిగొప్ప వరం మీరు. మీరు నా శివ. నేను మీ మధు. సదా ప్రేమలో పద్నాలుగేళ్ల శివ-మధు పెళ్ళిరోజు శుభాకాంక్షలు.' అంటూ లవ్ ఎమోజీలు జత చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. శివ బాలాజీ తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. 2003లో విడుదలైన ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివ బాలాజీ సినీ రంగంపై ఆసక్తితో ప్రవేశించారు. View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) -
24 ఏళ్ల బంధం.. ఆన్లైన్లో ఇలా: సుమ కనకాల
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ ఎవరంటే మొదట వినిపించే పేరు సుమ. అంతలా ఫేమ్ సంపాదించుకుంది కేరళ అమ్మాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ సుమ మాత్రం లోకల్ అన్న విధంగా ఉంటుంది. ఏ ఈవెంట్ అయినా సరే సుమ ఉందంటే ఆ రేంజే వేరు. తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగులో గలగల మాట్లాడడం, సమాయానుకూలంగా పంచ్‌లు వేయడంలో ఆమెకు ఆమె సాటి. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లోనే స్థిరపడిపోయింది. ఇక టాలీవుడ్లో రాజీవ్ కనకాల గురించి పరిచయం అక్కర్లేదు. ఏ పాత్రలోనైనా మెప్పించడం ఆయనతే సొంతం. ఇక వీరిద్దరి ప్రేమ పెళ్లి సంగతులు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్లయి వీరికి 24 ఏళ్లు పూర్తయింది. వివాహా వార్షికోత్సావాన్ని కాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సుమ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెడుతున్నారు. సుమ షేర్ చేసిన ఆ వీడియో కాల్లో ఇద్దరు పాట పాడుతూ ప్రత్యేక రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటక్కడ.. పలుకిక్కడ అంటూ సుమ పాట పాడగా.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా' అంటూ రాజీవ్ కనకాల పాడుతూ వీడియో కాల్లో కనిపించారు. ఏదేమైనా సుమక్క యాంకరింగే కాదు.. ఇలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
భార్యతో స్టార్ హీరో రొమాంటిక్ డేట్, ఫస్ట్‌టైం పబ్లిక్‌గా..
ఓ సౌత్ స్టార్ కపుల్ రొమాంటిక్ డేట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి రోజు సందర్భంగా ఈ కపుల్స్ పబ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్యయంగా ఆ స్టార్ హీరో భార్య షేర్ చేయడంతో బయటకు వచ్చాయి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. ఇంతకి ఆ స్టార్ కపుల్ ఎవరో కాదు అజిత్-షాలినిలు. సోమవారం వారి 23వ పెళ్లి రోజు సందర్భంగా అజిత్, షాలినిలు రొమాంటిక్ డిన్నర్ డేట్‌కు వెళ్లారు. చదవండి: సీక్రెట్ రివీల్ చేసిన హెబ్బా పటేల్ అక్కడ బ్లూ లైట్లో డాన్స్ చేస్తూ అజిత్ భార్య షాలికి వెనక నుంచి హగ్ చేసుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. ఈ ఫొటో చూసిన వారి ఫ్యాన్స్ మురిసిపోతూ వారికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ ఫొటోలో అంత ప్రత్యేకత ఏం ఉందంటే.. పెళ్లైన తర్వాత ఇలా వీరిద్దరూ ఇలా కనిపంచడం తొలిసారి. అజిత్ హీరోగా ఎంత బిజీ ఉన్న ఫ్యామిలీకి మాత్రం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తాడు. స్టార్ హీరో అయిన అజిత్.. కుటుంబం, వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు ఇష్టపడడు. పిల్లలు, భార్యతో అజిత్ పబ్లిక్‌లోకి రావడం చాలా అరుదు. చదవండి: హీరోగా డీవీవీ దానయ్య తనయుడు ఎంట్రీ, డైరెక్టర్ ఎవరంటే! షాలిని, అజిత్లది ప్రేమ పెళ్లి అయినప్పటికీ వీరిద్దరూ ఇలా ఎన్నడూ క్లోజ్‌గా కనిపించింది లేదు. వారి 23 ఏళ్ల వైవాహిక బంధంలో ఈ దంపతులు రొమాంటిక్ డేట్ రావడం, ఆ ఫొటోలు షేర్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఫొటో ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే వారిద్దరూ జంటగా నటించిన ‘అద్భుతం’ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇరు కుటుంబాలను ఒప్పించి 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అనంతరం షాలిని సినిమాలకు గుడ్‌బై చెప్పి గృహిణిగా కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. View this post on Instagram A post shared by Shamlee (@shamlee_official) -
అత్యంత వృద్ధ జంట...వాళ్లుకు ఇది ఎన్నో వివాహ వార్షికోత్సవమో తెలుసా!
వివాహలు స్వర్గంలో నిర్ణయించడబడతాయని, అప్పుడే ఆ జంట ఈ భూమ్మీద ఒకట అవుతారని పెద్దలు చెబుతుంటారు. ఇంది ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఇటీవల పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటలాగా అయిపోతున్నాయి. అలాంటి ఈ ఆధునిక కాలంలో ఈ వృద్ధ జంట వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరచడమే కాక ఆదర్శంగా నిలిచారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) వివరాల్లోకెళ్తే...చైనాకి చెందిన వృద్ధ జంట 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇంతకి వారు వయుసు ఎంతో తెలసుసా...అతని వయసు 109 ఏళ్లు, ఆ వృద్ధ మహిళ వయసు 108 ఏళ్లు. పైగా ఇద్దరు మంచి పెళ్లి దుస్తులు ధరించి తమ గతం తాలుకు జ్ఞాపకాలకు వెళ్లిపోయారేమో అన్నట్లుగా ఉన్నారు. అంతేకాదు ఇన్నేళ్ల తమ దాపత్యంలోని మధురానుభూతులు నెమరు వేసుకుంటూ కెమరా ముందు చక్కగా ఫోజులిచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఆశ్చర్యం: మనిషి నాలుకపై వెంట్రుకలు.. ఎందుకలా!) -
సీఎం జగన్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు: ఏపీ గవర్నర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్ పేజీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శనివారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్- వైఎస్ భారతి రెడ్డిలకు 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ దంపతులకు జగన్నాధుడి, బాలాజీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితం గడపాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్ ద్వారా తెలియజేశారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. I convey my greetings to @AndhraPradeshCM Sri @ysjagan and Smt. Y.S. Bharathi Reddy on their 25th wedding anniversary. I pray Lord Jagannath & Lord Balaji to shower their blessings on them for a long, healthy, happy and prosperous life. pic.twitter.com/HZmecpTICe — Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) August 28, 2021 క్లిక్ చేయండి: సిమ్లాలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం -
నదాల్‌కు మళ్లీ పెళ్ళా.. ఫేస్బుక్ అప్డేట్ చూసి షాక్ తిన్న అభిమానులు
పారిస్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, ప్రపంచ నంబర్ 3 ఆటగాడు, స్పెయిన్ బుల్ రఫేల్ నదాల్ సోమవారం చేసిన ఓ ఫేస్బుక్ అప్డేట్ అతని అభిమానులను అయోమయానికి గురి చేసింది. గాట్ మ్యారీడ్ అంటూ రఫా తన రిలేషన్షిప్ స్టేటస్‌ను పొరపాటున అప్డేట్ చేయడంతో ఈ గందరగోళం మొదలైంది. ఇది చూసి కొందరు ఫ్యాన్స్ ఆనందపడగా.. మరికొందరు నదాల్‌కు మళ్లీ పెళ్ళా అంటూ కామెంట్లు పోస్ట్ చేశారు. నిజానికి నదాల్‌కు 2019 అక్టోబర్‌లోనే ప్రేయసి మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లోతో పెళ్ళైంది. అయితే ఈ అప్డేట్ చూసిన కొందరు అభిమానులు నదాల్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడనుకుని పొరబడి, అతనికి శభాకాంక్షలు తెలిపారు. కాగా, నదాల్ పొరపాటున ఫేస్బుక్లో రిలేషన్షిప్ స్టేటస్‌ను అప్డేట్ చేయడంతో అది కాస్తా అతను ఆదివారమే పెళ్లి చేసుకున్నట్లుగా చూపించింది. ఇదిలా ఉంటే ఈ స్పెయిన్ బుల్ ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఈ రౌండ్లో అతను ఇటలీకి చెందిన 19 ఏళ్ల జన్నిక్ సిన్నర్‌తో తలపడనున్నాడు. కాగా, రఫా ప్రస్తుతానికి 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్లు సాధించి స్విస్ యోధుడు రోజర్ ఫెదరర్‌తో(20) సమానంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే నదాల్‌కు మట్టి కోర్టుపై తిరుగులేని రికార్డు ఉంది. అతను 2005లో అరంగేట్రం చేసిన నాటి నుంచి కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయి 103 విజయాలు సాధించాడు. చదవండి: శ్రీలంకలో టీ20 ప్రపంచకప్..? -
పెళ్ళిలో అజయ్ దేవ్‌గణ్ డబ్బులు ఆఫర్ చేశాడు!
పెళ్ళి అనేది అందరి జీవితంలో ఒక తియ్యని అనుభూతి. బాలీవుడ్లో కొన్ని జంటలను చూస్తే ఒకరి కోసమే మరొకరు పుట్టారా! అనిపిస్తుంది. బీ టౌన్ జంట కాజోల్, అజయ్‌దేవ్‌గణ్ ఈ కోవలోకే వస్తుంది. వీరి పెళ్ళి జరిగి నేటితో 22 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కాజోల్ తమ పెళ్ళి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నారింజ రంగు డ్రెస్సులో ఉన్న కాజోల్, తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతున్న అజయ్ దేవ్గన్ ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో కాజోల్ తమ పెళ్ళినాటి మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. పెళ్లయి ఇన్నేళ్లవుతున్నా ఏరోజు కూడా ఒంటరిగా ఫీలవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి నాడు అజయ్ దేవ్గన్ ఫెరాస్(అగ్ని చుట్టూ తిరగడం) విషయంలో తొందర పెట్టాడని, వీలైనంత త్వరగా పెళ్ళితంతు ముగించడానికి పురొహితుడికి డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్దపడ్డాడని సరదాగా గుర్తుచేసుకున్నారు. కాగా 1995 సంవత్సరంలో 'హల్చల్' సినిమాలో ఈ జంట తొలిసారిగా కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. పెద్దల అంగీకారంతో 1999లో సరిగ్గా ఇదే రోజు పంజాబీ, మహారాష్ట్ర సాంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు న్యాసా, కొడుకు యుగ్ ఉన్నారు. వీరిద్దరు కలిసి గుండరాజ్, ఇష్క్, దిల్క్యాకరే, రాజుచాచా, ప్యార్థోహోనాహిథా సినిమాల్లోనూ కలిసి నటించారు. ఈ మధ్యే వచ్చిన 'తానాజీ: ది అన్సంగ్ వారియర్'లోనూ భార్యాభర్తలుగా కనిపించారు. చదవండి: మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్ -
పెళ్లిరోజు: భార్యకు మహేష్ రొమాంటిక్ విష్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, నమ్రత శిరోద్కర్ దాంపత్య జీవితానికి నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్యూట్ కపుల్ బుధవారం 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి రోజు సందర్భంగా నమ్రతకు విషెస్ చెబుతూ భార్యపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు మహేష్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్ పోస్టు పెట్టారు. నమ్రతకు ప్రేమతో నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ. ‘16 ఏళ్ల ప్రేమకు శుభాకాంక్షలు మై లవ్.. జీవితాంతం నీతో కలిసి ఉంటాను’ అంటూ పేర్కొన్నారు. చదవండి: స్నేహితుడికి అండగా మహేష్.. ట్రైలర్ రిలీజ్ నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత.. అచ్చం ఇలాగే నమ్రత కూడా మహేష్ బుగ్గలపై కిస్ చేస్తున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘16 ఏళ్లు త్వరగా గడిచిపోయాయి. ఇన్నేళ్ల జీవితంలో అమితపైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలగలిసి ఉన్నాయి. పెళ్లి రోజు శుభాకాంక్షలు మహేష్.. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను’. అని భర్తపై ప్రేమను కురిపించారు. కాగా వంశీ సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు.. ఆ సమయంలోనే ప్రేమలో పడి 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.. కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్నారు. ఇక ప్రస్తుతం మహేష్ తన కుటుంబంతో కలిసి దుబాయిలో ఉన్నాడు. అక్కడ సర్కారు వారి పాట షూటింగ్లో పాల్గొంటున్నాడు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఎమ్మెల్యే పెళ్లిరోజు.. 101 కొబ్బరికాయలు కొట్టిన కార్యకర్త
సాక్షి, వరంగల్ / జనగామా: కోరుకున్న కోర్కెలు తీర్చితే దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం చూశాం. అభిమాన తారలకు, నాయకులకు పాలాభిషేకాలు చేయడం చూశాం. ఇవన్ని రోటిన్‌గా అనిపించాయో ఏమో తెలియదు కానీ తాజాగా ఓ కార్యకర్త ఎమ్మెల్యే మీద అభిమానం చాటుకోవడం కోసం మోకాళ్ల మీద గుడి మెట్లు ఎక్కి.. 101 కొబ్బరికాయలు కొట్టాడు. ఆ వివరాలు.. జనగామా జిల్లా చిల్పూర్ గుట్ట వాసి మూల నాగరాజు.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు వీరాభిమాని. ఈ నేపథ్యంలో నేడు తన అభిమాన నాయకుడి పెళ్లి రోజు సందర్భంగా చిల్లూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 101 కొబ్బరి కాయలు కొట్టి.. మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కి అభిమానం చాటుకున్నాడు నాగరాజు. రాజయ్య పేరు మీద ప్రత్యేక పూజలు చేయించాడు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ‘రాజయ్య అంటే నాకు ఎంతో ఇష్టం. రాబోయే రోజుల్లో ఆయనను మంత్రిగా చూడాలని దేవుడిని కోరుకున్నాను’ అని తెలిపాడు. ఇక నాగరాజు చిల్పూర్ గుట్ట దేవస్థానంలో మూడు పర్యాయాలు చైర్మన్‌గా కొనసాగాడు. -
విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన భూమిక
'యువకుడు' సినిమాతో తెలుగు తెరపై అడుగు పెట్టిన హీరోయిన భూమిక చావ్లా. ఖుషీ, వాసు, ఒక్కడు, సింహాద్రి వంటి సినిమాలతో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తన పాత్రలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కానీ ఆ పాపులారిటీని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయారు. వరస సినిమాలు చేశారన్న మాటే కానీ కెరీర్లో డల్ అయిపోయారు. 2007లో తన యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరికి ఒక బాబు పుట్టారు. అయితే సోషల్ మీడియాలో భర్తతో కలిసి దిగిన ఫొటోలు పెట్టనందుకు, బయట పబ్లిక్‌లో ఒంటరిగా కనిపించినంత మాత్రానికే ఆమె విడాకులు తీసుకుందంటూ పుకార్లు మొదలయ్యాయి. (చదవండి: బాలయ్య సినిమాలో లేడీ విలన్?) తాజాగా ఈ వార్తలకు భూమిక చెక్ పట్టారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.. ఆ ఒక్క అడుగు ప్రేమే.., ఒకరి గురించి ఒకరం మరింత లోతుగా అర్థం చేసుకోవడమే. మన గురించి మనం ఇంకా తెలుసుకోవడమే. మనల్ని, మన జంట ప్రయాణాన్ని ఆ దేవుడు ఆశీర్వదించాలి. నిన్ను, నీ అంకితభావాన్ని, కష్టపడే మనస్తత్వాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది" అని రాసుకొచ్చారు. ఈ పోస్టుతోనైనా ఆమె విడాకులు తీసుకుంటుందనే రూమర్లకు స్వస్తి పలకాలని ఆశిద్దాం.. (చదవండి: అంత్యక్రియలకు కూడా అడ్డుపడుతోంది - భూమిక) View this post on Instagram A journey of a thousand miles begins with a single step .... LOVE ....... and it’s love , learning , understanding , a journey of laughter and moments .... discovering more about each other And ourselves ... Thank you for Everything 🌺 ...... may God bless us and our journey together .. Proud of you and your hard work and your dedication to whatever you do in life 😊 .. 🌸💕💐 Happy Anniversary 💐🌻 A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on Oct 20, 2020 at 6:30pm PDT -
అభిమానితో పెళ్లయ్యి 20 ఏళ్లు
ఆగస్ట్ 25న తమిళ సూపర్‌స్టార్ విజయ్ తన 21వ పెళ్లిరోజు జరుపుకున్నారు. అభిమానులను పెళ్లి చేసుకున్న కళాకారులు చాలామంది ఉన్నారు. విజయ్ కూడా తన కరడు గట్టిన అభిమాని సంగీతను పెళ్లి చేసుకోవడం విధి రాసిపెట్టి ఉండటం వల్లే సాధ్యమైందని భావిస్తారు. విజయ్, సంగీతాల పెళ్లి 1999లో జరిగింది. వారిద్దరికి పెళ్లి జరుగుతుందని వారికే తెలియదు. సంగీతా లండన్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబం అమ్మాయి. అయితే విజయ్ సినిమాలు చూసి అతడికి వెర్రి ఫ్యాన్‌గా మారింది. విజయ్‌ని చూడటానికే 1996లో లండన్ నుంచి చెన్నైకి వచ్చింది. ఎవరో తెలిసినవారి ద్వారా విజయ్‌ని కలిసింది. ‘నన్ను చూడటానికి లండన్ నుంచి వచ్చారా’ అని విజయ్ ఆశ్చర్యపోయారు. అంత దూరం నుంచి వచ్చినందుకు సంగీతాను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఇంటికి వచ్చిన సంగీతాను విజయ్ తల్లిదండ్రులు (తండ్రి ప్రసిద్ధ సినీ దర్శకుడు చంద్రశేఖర్) గమనించి ఇష్టపడ్డారు. ‘ఈసారి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులతో రామ్మా’ అన్నారు. సంగీతా రెండు మూడేళ్లలో తల్లిదండ్రులతో విజయ్ ఇంటికి వచ్చింది. విజయ్ తల్లిదండ్రులే ‘అమ్మాయి లక్షణంగా ఉంది. పెళ్లి చేసుకోరా’ అని విజయ్‌కు చెప్పారు. విజయ్‌కు కూడా మెల్లగా సంగీతా అంటే అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి. సంగీతాకు ఎలాగూ తెగ ఇష్టమే. చివరకు మూడేళ్ల తర్వాత పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు జేసన్ సంజయ్. కుమార్తె దివ్య శాషా. సంగీతా ఎక్కువగా సినిమా వర్గాల మధ్య కనిపించరు. కుటుంబ బాధ్యత, పిల్లల పెంపకం గురించి శ్రద్ధ పెడతారు. గృహశాంతి ఉంటే మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉంటే విజయమూ ఉంటుంది. విజయ్ విజయాల వెనుక సంగీతా ఉన్నారు. -
'అప్పుడే పదేళ్లయిందా.. నమ్మలేకపోతున్నా'
రాంచీ : ఎంఎస్ ధోని.. టీమిండియా జట్టుకు ఒక కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎంత సక్సెస్ అయ్యాడో.. వైవాహిక జీవితంలోనూ అంతే విజయం సాధించాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన సాక్షి సింగ్‌ను ప్రేమించిన ధోని 2010 జూలై 4న పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం జరిగి సరిగ్గా పదేళ్లు. ఈ పదేళ్లలో వారి జీవితంలో ఆనంద క్షణాలే తప్ప ఎటువంటి గొడవలు లేవు. ఆనందంగా గడుపుతున్న వీరి జీవితంలోకి జీవా వచ్చి ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది. తాజాగా పెళ్లి రోజును పురస్కరించుకొని ధోని భార్య సాక్షి ధోని గత పదేళ్లలో వారి మధ్య చోటుచేసుకున్న మధుర క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా సాక్షి తన భర్త ధోనితో పాటు తమ గారాల పట్టి జీవాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంది. (క్రికెటర్ కుశాల్ మెండిస్ అరెస్ట్) 'మా వైవాహిక జీవితానికి అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. పదేళ్లుగా ఇద్దరం కలిసి ఒక ఆనంద జీవితం గడిపాం. ఎన్నోసార్లు మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేవాళ్లం. మా ఇద్దరి జీవితాల్లోకి జీవా రావడం ఒక మధురమైన క్షణం. జీవితంలో నిజాయితీగా ఉన్నాం కాబట్టే మా బంధం మరింత బలపడింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నామంటే ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ' అంటూ రాసుకొచ్చారు. అంతకముందు ధోని, సాక్షిల పెళ్లి రోజు పురస్కరించుకొని బంధువులు, స్నేహితులు, అభిమానులు విషెస్ చెప్పారు. దానికి బదులుగా.. 'మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన బంధువులు, స్నేహితులు, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.' అంటూ సాక్షి స్పందించారు. -
47 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు..
ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బుధవారం 47వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1973 జూన్ 3వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అమితాబ్, జయ బచ్చన్ వివాహ బంధంతో ఒకటయ్యారు. నేటితో వీరి మూడుముళ్ల దాంపత్యానికి సరిగ్గా 46 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీగ్‌బీ తన పెళ్లినాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే తన కో-స్టార్ జయ బచ్చన్‌ను ఎలా వివాహానికి కారణమైన లండన్ పర్యటన గురించి ట్విటర్లో రాసుకొచ్చారు. (‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’) ‘జూన్ 3, 1973.. 47 సంవత్సరాల క్రితం సరిగ్గా ఈ రోజు !!. 'జంజీర్' సినిమా భారీ విజయం సాధించడంతో వేడుకలు చేసుకునేందుకు జయ, కొద్దిమంది స్నేహితులతో లండన్ వెళ్లాలనుకున్నాం. ఈ విషయాన్ని ముందుగా నాన్న హరివంశ్రాయ్ బచ్చన్‌కు చెప్పాను. ఎవరితో వెళుతున్నావని ఆయన అడిగారు. జయతో అని చెప్పినప్పడు.. నువ్వు ముందు ఆమెను పెళ్లి చేసుకో ఆ తరువాత లండన్ వెళ్లండి. లేకపోతే వెళ్లకండి అన్నారు. దానిని నేను అంగీకరించాను. జూన్3, 1973న కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జయను వివాహం చేసుకున్నాను. అనంతరం ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి లండన్‌కు బయలుదేరాం’. అంటూ పెళ్లి నాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు. (‘రవి మోహన్ సైనీ’ గుర్తున్నాడా?) T 3550 - 47 years .. today .. June 3, 1973 .. !! Had decided if 'Zanjeer' succeeded we, with few friends would go to London, first time, to celebrate .. Father asked who you going with ? When I told him who he said, you will marry her then go .. else you don't go .. I obeyed ! pic.twitter.com/2l15GRMH6s — Amitabh Bachchan (@SrBachchan) June 2, 2020 కాగా అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ మొదట 1972 చిత్రం ‘బన్సీ బిర్జు’లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత అభిమాన్, ఏక్ నజర్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. బిగ్‌బీ, జయకు ఇద్దరు సతానం అభిషేక్, శ్వేతా బచ్చన్. అభిషేక్ బచ్చన్.. హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ను 2007లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె ఉంది. శ్వేతా బచ్చన్ పారిశ్రామికవేత్త నిఖిల్ నందను వివాహం చేసుకున్నారు. వీరికి నవ్య నవేలి, అగస్త్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. (నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు) View this post on Instagram Namaste .. a wish for a day filled with love attention compassion and fulfilment .. A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Jan 4, 2018 at 8:10pm PST View this post on Instagram The daughter clicks the parents as they prepare to set off for the French ballet performance !! A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Jan 13, 2018 at 1:46pm PST View this post on Instagram At the Premiere of SHOLAY .. 15th August 1975, at the Minerva .. Ma, Babuji, Jaya and a bow tied moi .. how pretty Jaya looks .. This was the 35 mm print at the Premiere .. the 70mm Stereo sound print , first time in India was stuck in Customs.. but after the Premiere got over by midnight, we got news that the 70mm print was out of Customs .. we told Ramesh ji to get it to the Minerva .. it came .. the first Indian film on 70mm Stereo .. and I sat on the floor of the Balcony with Vinod Khanna and finished seeing this amazing result till 3 in the morning 🎥 A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Apr 17, 2020 at 3:26am PDT -
లీప్ ఇయర్..సమ్‌థింగ్ స్పెషల్
కుత్బుల్లాపూర్: నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ప్రత్యేకమైన సంవత్సరం.. ఏడాదికి 365 రోజులకు గాను ఒక్క రోజు అదనంగా చేరి కేలెండర్లో 366 రోజులు కనిపించే ఏకైక సంవత్సరం. ఏడాదికి ఉన్న రోజులలో అదనంగా ఒక రోజు చేరిన సంవత్సరాన్నే లీప్ ఇయర్ అంటారు. ఈ సంవత్సరం (2020) లీప్ ఇయరే.. లీప్ ఇయర్ ఆ సంవత్సరంలో పుట్టే వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఎన్నో అపోహలు.. నమ్మకాలు.. లీప్ ఇయర్ కొందరికి ప్రత్యేకంగా ఉంటే కొందరిలో అపోహలు మరికొందరిలో నమ్మకాలు కలిగిస్తుంది.. 2012లో వచ్చిన లీప్ ఇయర్ అనంతరం అదే ఏడాది డిసెంబరు 21న ప్రళయం వస్తుందని, భూమి వినాశనం తప్పదని కొందరు భావించారు. అదే తరహాలో ప్రచారం కూడా తీవ్రస్థాయిలో జరిగింది. ఇదే విధంగా ప్రతి లీప్ సంవత్సరంలో అనేకానేక అపోహలు ప్రజలలో కలుగుతున్నాయి. అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం లీప్ ఇయర్ అందరికి కలిసి వస్తుందని, లీప్ ఇయర్లో ప్రత్యేకంగా వచ్చి చేరే ఫిబ్రవరి 29వ తారీఖు విశేషంగా భావిస్తారు. ఈ రోజున పుట్టిన వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారనేది నమ్మకం. కాని కొందరు చెప్పేది ఏమిటంటే లీప్ ఇయర్లో ఒక రోజు మాత్రమే అదనంగా వచ్చి చేరుతుందని ఇంకెలాంటి విశేషం ఉండదని చెబుతారు. అసలేంటిఈ లీప్ఇయర్.. ప్రతి ఏడాది 365 రోజులు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఏడాది 365 రోజుల 6 గంటలు ఉంటుంది. 365 రోజలనే పరిగణలోకి తీసుకుని మిగిలిన ఆరు గంటలను ఏ విధంగా లెక్కించాలో మీమాంసలో ఏడాదికి మిగిలిపోయిన ఆరు గంటల సమయాన్ని నాలుగు సంవత్సరాల పాటు లెక్కించి వచ్చిన 24 గంటల సమయాన్ని ఒక రోజుగా గుర్తించడంతో ఫిబ్రవరి నెలలో 29వ తారీఖుగా పరిగణిస్తున్నారు. ఇలా ఫిబ్రవరి నెలలో అదనంగా వచ్చి చేరే ఒక రోజును లీప్ సంవత్సరంగా పిలుస్తుంటారు. ఆత్రుతగా ఎదురుచూస్తాం 1996 ఫిబ్రవరి 29వ మా విహాహం జరిగింది. 24 సంవత్సరాల మా దాంపత్య జీవితంలో ఆరు సార్లు పెళ్లి రోజులను జరుపుకున్నాం. నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మా పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడానికి మాతో పాటు మా కుటుంబ సభ్యులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. ఈ సారి 2020లో వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాం. – శైలజ, సునీల్, జగద్గిరిగుట్ట ఫిబ్రవరి29న పుట్టిన వారు ప్రత్యేకం.. ముఖ్యంగా లీప్ సంవత్సరంలో వచ్చే ఫిబ్రవరి 29 ఆ రోజు ‘పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతరత్రా శుభాకార్యాలు జరిపిన వారికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫిబ్రవరి 29న పుట్టిన వారు నాలుగు సంవత్సరాలకు వచ్చే లీప్ సంవత్సరంలో వేడుకలు నిర్వహించుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. 2020 ఫిబ్రవరి 29న కొందరు గర్భీణీలు డెలివరీ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. లీప్ ఇయర్లోనే పుట్టిన రోజు, వివాహం.. నేను పుట్టింది ఫిబ్రవరి 29.. నా ఎంగేజ్మెంట్ ఉమారాణితో అయింది ఫిబ్రవరి 29 నాడే. 2012 ఫిబ్రవరి 29న నా ఎంగేజ్మెంట్, మార్చి నెలలో వివాహం జరిగింది. అయితే మా వివాహ రోజు కన్నా ఫిబ్రవరి 29న నాడు జరిగిన ఎంగేజ్మెంటే నాకు ప్రత్యేకం. 2020లో నా పుట్టిన రోజుతో పాటు మరో వేడుక చేసుకోవడానికి ఎంతో ఎదురు చూస్తున్నా. – శ్రవణ్, ఉమారాణి, చింతల్.. -
భర్తకి స్వీట్ విషెస్ చెప్పిన సన్నీ
ఒకప్పుడు పోర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ నటిగా ప్రయాణం కొనసాగిస్తుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు ఆమె తన సహనటుడు డానియల్ వెబర్‌ని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సన్నీ బుధవారం తమ వివాహ వార్షికోవత్సం సందర్భంగా ట్విటర్ వేదికగా భర్త వెబర్‌కి స్వీట్ విషెస్ తెలిపారు. ‘ఏడేళ్ల కిందట దేవుడి సన్నిధిలో ఒక్కటయ్యాం. ఎప్పుడూ ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతూనే ఉన్నాం. పెళ్లి నాటి కన్నా ఇప్పుడు నిన్ను అమితంగా ఇష్టపడుతున్నాను. చివరివరకు ఇలాంటి జీవితమే కొనసాగిద్దాం. లవ్ యూ వెబర్, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ’ అంటూ తమ పెళ్లి నాటి ఫొటోని ట్వీట్ చేశారు సన్నీ. ప్రస్తుతం ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. అందులో నిషా వెబర్‌ని ఏడాది క్రితం ఈ జంట దత్తత తీసుకుంది. గత నెల మార్చిలో సన్నీ సరోగసి ద్వారా మగ కవలలకు జన్మనిచ్చింది. వీరికి అపెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్గా పేర్లు పెట్టారు. చివరిసారిగా తెరా ఇంతిజార్ సినిమాలో కనిపించిన సన్నీ, ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి యత్నిస్తున్నారు. 7yrs ago we vowed in front of God to always love each other no matter what life throws at us!I can say that I love you more today then I did that day!We are on this crazy journey of life together!Love you so much @DanielWeber99 Happy Anniversary!! pic.twitter.com/mo45C75xq4 — Sunny Leone (@SunnyLeone) April 11, 2018 -
రాజమండ్రిలో మిస్టర్ & మిసెస్ 'సి'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెళ్లి రోజును రంగస్థలంలో షూటింగ్ లోకేషన్ లోనే జరుపుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. 1985 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ పల్లెటూరి యువకుడిగా నటిస్తున్నాడు. షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్న చరణ్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. అందుకే పెళ్లి రోజుకు బ్రేక్ తీసుకోలేదు. అయితే ఈ స్పెషల్ డేను తన భర్తతో కలిసి గడిపేందుకు ఉపాసన రాజమండ్రికి వెళ్లింది. ఈ సందర్భంగా ' 'మిస్టర్ అండ్ మిసెస్ సి'కి ఐదేళ్లు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సపోర్ట్, ప్రేమ కారణంగా ఇన్ని రోజులు ఇంత అద్భుతంగా గడిచాయి.' అంటూ తమ శ్రేయోభిలాషులకు కృతజ్ఙతలు తెలియజేసింది ఉపాసన. En route #Rajamundry -
పెళ్లిరోజున చివరి ఫొటో తీసి.. భార్యను తోసేశాడు!
తన మొదటి భార్య చనిపోయినప్పుడు హరాల్డ్ హెన్థ్రాన్ ఓ పిట్టకథ చెప్పాడు. కళ్లముందే తన భార్య ప్రమాదం బారినపడి ప్రాణాలు విడిచిందని, తాను సంఘటనాస్థలంలో ఉన్నప్పటికీ చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయానని కథలు అల్లి చెప్పాడు. అంతా నమ్మారు. అతని పట్ల సానుభూతి చూపారు. ఓదార్చారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మరో మహిళను అతను ప్రేమించి పెళ్లాడాడు. 17 ఏళ్ల దాంపత్య జీవితం అనుభవించకా.. ఇప్పుడు రెండో భార్య మృతి విషయంలోనూ హరాల్డ్ అదే కట్టుకథను అల్లి చెప్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికా కోలరాడోలోని డెన్వర్ ప్రాంతానికి చెందిన హరాల్డ్ హెన్థ్రోన్ ఒక వ్యాపారవేత్త. అతని మొదటి భార్య సాండ్రా లీన్. 1995లో ఆమె ఒక విస్మయకర ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. ఆ రోజు రాత్రి భార్యాభర్తలు ఇద్దరు కలిసి డిన్నర్‌కు వెళ్లారు. డిన్నర్ అయిన తర్వాత తిరిగి వస్తుండగా కారు టైరు ఒకటి పగిలిపోయింది. దీంతో కారును జాక్ మీద నిలిపి మార్చేందుకు హరాల్డ్ ప్రయత్నిస్తుండగా ఒక నట్టు.. ఊడిపోయి కారు కిందకు వెళ్లింది. దీంతో లీన్‌ను కారు కిందకు వెళ్లి నట్టు తీసుకురమ్మని చెప్పాడు. ఆమె కారు కిందకు వెళ్లిందో లేదో జాక్ సాయంతో ఉన్న కారు కిందకు కుప్పకూలింది. ఆమె సంఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు హెన్థ్రోన్ ఒక్కడే సాక్షి. అతడే ఈ కథను అందరికీ చెప్పి నమ్మించాడు. ఆ ఘటన జరిగిన ఐదేళ్లకు ఓ క్రైస్తవ డేటింగ్ వెబ్సైట్లో పరిచయమైన టోనీ బెర్టోలెట్ను హరాల్డ్ వివాహం చేసుకున్నాడు. అతడు వ్యాపారం చేస్తూనే స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు సేకరించేవాడు. టోనీ నేత్ర వైద్యురాలు. తనకు కుటుంబానికి చెందిన చమురు కంపెనీలో ఆమెకు భారీగా వాటా ఉంది. ఈ దంపతులకు ఓ కూతురు హేలే ఉంది. వీరి దాంపత్యం జీవితం 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 2012 వేసవిలో హరాల్డ్ ఓ సర్ప్రైజ్ విహారయాత్రకు ప్లాన్ చేశాడు. పెళ్లి రోజును జరుపుకొనేందుకు దంపతులు ఇద్దరు కలిసి రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ కు వెళ్లారు. అక్కడ 130 అడుగుల పర్వతం మీద దంపతులు ఇద్దరు సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. ఈ క్రమంలో 130 అడుగుల పర్వత శిఖరాగ్రం నుంచి టోనీ కిందకు పడిపోయిందని హరాల్డ్ పోలీసులకు ఫోన్ చేశాడు. టోనీ చనిపోయిన ప్రమాదానికి కూడా హరాల్డ్ ఒక్కడే సాక్షి. 50 ఏళ్ల టోనీ కీళ్లనొప్పులతో బాధపడుతున్నా అతి కష్టంమీద ఆ పర్వతాన్ని ఎక్కింది. ఆమె శిఖరాగ్రం వద్ద తన ఫొటో తీస్తూ.. ఒక్కసారిగా జారి కిందపడిపోయిందని, తనకు తన భార్య దూరమైందని బంధువుల ముందు వాపోతూ హరాల్డ్ చెప్తున్నాడు. కానీ మొదటిసారి గుడ్డిగా అతన్ని నమ్మిన బంధువులు ఇప్పుడు మాత్రం నమ్మడం లేదు. టోనీ మరణంపై ఆమె కుటుంబసభ్యులు అతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి ఇద్దరి భార్యల మరణంతోనూ హరాల్డ్ భారీగా లబ్ధిపొందాడు. మొదటి భార్య లీన్ మరణంతో అతనికి 3.50 పౌండ్ల బీమా పరిహారం అందగా.. రెండో భార్య మరణం వల్ల మిలియన్ పౌండ్ల పరిహారం అతనికి అందే అవకాశముంది. అంతేకాకుండా గతంలోనూ ఓ సారి తన ఇంట్లో రెండో భార్యను చంపడానికి అతను ప్రయత్నించాడని, ఆ ప్రమాదం నుంచి ఆమె తృటిలో బయటపడిందని పోలీసులు విచారణలో కనుగొన్నారు. ఇప్పుడు కోర్టు ముందు టోనీ మృతి కేసు నడుస్తోంది. రెండో భార్య మరణమే కాదు మొదటి భార్య మృతి విషయంలోనూ హరాల్డ్ పై పోలీసులు మోపిన అభియోగాలను కోర్టు ఇప్పుడు విచారిస్తోంది. అయితే అతని న్యాయవాదులు మాత్రం ఈ రెండు ఘటనలూ ప్రమాదాలేనంటూ కోర్టు ముందు వాదిస్తున్నారు.