47 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. | Amitabh Bachchan Shares Wedding Pictures On 47th Anniversary | Sakshi
Sakshi News home page

47 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు..

Published Wed, Jun 3 2020 11:20 AM | Last Updated on Wed, Jun 3 2020 11:53 AM

Amitabh Bachchan Shares Wedding Pictures On 47th Anniversary - Sakshi

ముంబై : బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ బుధవారం 47వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1973 జూన్‌ 3వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అమితాబ్‌, జయ బచ్చన్‌ వివాహ బంధంతో ఒకటయ్యారు. నేటితో వీరి మూడుముళ్ల దాంపత్యానికి సరిగ్గా 46 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీగ్‌బీ తన పెళ్లినాటి ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అలాగే తన కో-స్టార్‌ జయ బచ్చన్‌ను ఎలా వివాహానికి కారణమైన లండన్‌ పర్యటన గురించి ట్విటర్‌లో రాసుకొచ్చారు. (‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’)

‘జూన్ 3, 1973.. 47 సంవత్సరాల క్రితం సరిగ్గా ఈ రోజు !!. 'జంజీర్' సినిమా భారీ విజయం సాధించడంతో వేడుకలు చేసుకునేందుకు జయ, కొద్దిమంది స్నేహితులతో లండన్‌ వెళ్లాలనుకున్నాం. ఈ విషయాన్ని ముందుగా నాన్న హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌కు చెప్పాను. ఎవరితో వెళుతున్నావని ఆయన అడిగారు. జయతో అని చెప్పినప్పడు.. నువ్వు ముందు ఆమెను పెళ్లి చేసుకో ఆ తరువాత లండన్‌ వెళ్లండి. లేకపోతే వెళ్లకండి అన్నారు. దానిని నేను అంగీకరించాను. జూన్‌3, 1973న ‌కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జయను వివాహం చేసుకున్నాను. అనంతరం ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి లండన్‌కు బయలుదేరాం’. అంటూ పెళ్లి నాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు. (‘రవి మోహన్‌ సైనీ’ గుర్తున్నాడా?)

కాగా అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ మొదట 1972 చిత్రం ‘బన్సీ బిర్జు’లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత అభిమాన్‌, ఏక్‌ నజర్‌ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. బిగ్‌బీ, జయకు ఇద్దరు సతానం అభిషేక్‌‌, శ్వేతా బచ్చన్‌. అభిషేక్ బచ్చన్..‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ను 2007లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె ఉంది. శ్వేతా బచ్చన్‌ పారిశ్రామికవేత్త నిఖిల్‌ నందను వివాహం చేసుకున్నారు. వీరికి నవ్య నవేలి, అగస్త్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. (నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement