
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన 'బి హ్యాపీ' డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు. ఈ చిత్రం చాలామంది హృదయాన్ని కదిలించేలా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. రెమో డిసౌజా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై లిజెల్ రెమో డిసౌజా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. ఇందులో అభిషేక్ బచ్చన్‌తో పాటు అమితాబ్ బచ్చన్, నోరా ఫతేహి, ఇనాయత్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. నాసర్, జానీ లివర్ మరియు హర్లీన్ సేథి సహాయక పాత్రల్లో నటించారు.
'బి హ్యాపీ' చిత్రాన్ని మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని అభిషేక్ బచ్చన్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ తండ్రి, కూతురు మధ్య ఉన్న అమితమైన ప్రేమను చూపుతుంది. ఒంటరి గా ఉన్న తండ్రి శివ్ ( అభిషేక్ బచ్చన్ ) అతని చురుకైన కుమార్తె ధారా (ఇనాయత్ వర్మ) మధ్య విడదీయరాని బంధానికి ప్రేక్షకులు ఫిదా అవుతారని చిత్ర యూనిట్ పేర్కొంది.

దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో వేదికపై డ్యాన్స్ చేయాలనే ఆశతో ఉన్న కూతురి కలను ఒక తండ్రి ఎలా నెరవేర్చాలనుకుంటాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. కానీ, ఊహించని సంక్షోభం వల్ల వారిద్దరికి ఎదురయ్యే కష్టాలు ఏంటి..? తన కూతురి ఆశయాన్ని నిజం చేసేందుకు ఆ తండ్రి ఏం చేశాడు..? విధిని కూడా సవాల్ చేసిన ఒక తండ్రి కథే 'బి హ్యాపీ' చిత్రం. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మార్చి 14న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment