అభిషేక్‌ బచ్చన్‌ అలరించిన ఓటీటీ చిత్రాలు ఇవే.. | Abhishek Bachchan Direct OTT Release Movies Web Series | Sakshi
Sakshi News home page

Abhishek Bachchan: అభిషేక్‌ బచ్చన్‌ అలరించిన ఓటీటీ చిత్రాలు ఇవే..

Published Sat, Apr 9 2022 6:22 PM | Last Updated on Sat, Apr 9 2022 7:15 PM

Abhishek Bachchan Direct OTT Release Movies Web Series - Sakshi

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ తనదైన నటనతో విభిన్న కథలను ఎంచుకుంటూ బిజీగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల బిగ్‌ బుల్‌, బాబ్‌ బిస్వాస్‌ చిత్రంతో అలరించిన అభిషేక్‌ తాజాగా 'దస్వీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన తాజాగా నటించిన 'దస్వీ' మూవీ చదువు గొప్పతనం, పొలిటికల్ సెటైరికల్‌ డ్రామాగా తెరకెక్కింది. ఈ నెల 7న నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే గత రెండు సంవత్సరాలుగా చూసుకుంటే అభిషేక్‌ బచ్చన్‌ ఒక వెబ్‌ సిరీస్‌, 4 సినిమాల్లో నటించాడు. ఇవన్ని నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్‌ కావడం విశేషం. కాగా అభిషేక్‌ తన నటనతో మెప్పించిన ఆ వెబ్ సిరీస్‌, సినిమాలేంటో చూసేద్దాం !  

చదవండి: ముఖ్యమంత్రి పదో తరగతి చదివితే.. 'దస్వీ' రివ్యూ

1. దస్వీ
నిరాక్షరాస్యుడైన రాజకీయ నాయకుడు జైలు శిక్ష సమయంలో చదువుకున్న విలువ గురించి  ఎలా తెలుసుకున్నాడేది పూర్తి వినోదభరితంగా చూపించిన మూవీ 'దస్వీ'. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి, నిరక్షరాస్యుడైన గంగారామ్‌ చౌదరి పాత్రలో అభిషేక్‌ బచ్చన్‌ తన నటనతో మెప్పించాడు. అభిషేక్‌ బచ్చన్‌తోపాటు యామీ గౌతమ్‌, నిమ్రత్ కౌర్‌ నటించిన ఈ మూవీ ఏప్రిల్‌ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌, జియో సినిమాలలో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

2. బాబ్‌ బిస్వాస్‌
2012లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ మూవీ 'కహాని' డైరెక్టర్ సుజోయ్‌ ఘోష్‌ కథ అందించిన సీరియల్‌ కిల్లర్‌ క్రైమ్‌ డ్రామా చిత్రం 'బాబ్‌ బిస్వాస్‌'. ఈ సినిమాకు సుజోయ్‌ ఘోష్‌ కుమార్తె దియా అన్నపూర్ణ ఘోష్‌ దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. అభిషేక్ బచ్చన్‌.. బాబ్‌ బిస్వాస్‌ పాత్రలో నటించిన ఈ చిత్రం జీ5లో డిసెంబర్‌ 3, 2021 నుంచి ప్రసారం అవుతోంది. 

3. ది బిగ్ బుల్‌
ప్రముఖ స్టాక్ బ్రోకర్‌ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ 'ది బిగ్‌ బుల్‌'. ఇందులో హేమంత్‌ షా అనే లీడింగ్ రోల్‌లో అభిషేక్‌ బచ్చన్‌ నటించాడు. ఏప్రిల్ 8, 2021 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. హర్షద్‌ మెహతా ఫైనాన్షియల్ కుంభకోణానికి ప్రేరణగా వచ్చిన 'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌ వచ్చిన తర్వాత ఈ మూవీ వచ్చింది. 

4. లూడో
రాజ్‌ కుమార్‌ రావు, ఆదిత్య రాయ్‌ కపూర్, పంకజ్‌ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్‌లతోపాటు అభిషేక్‌ బచ్చన్‌ నటించిన డార్క్‌ క్రైమ్‌ కామెడీ చిత్రం 'లూడో'. ఈ మూవీకి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్‌ 12, 2020 నుంచి ప్రదర్శించబడుతున్న ఈ చిత్రంలో 'బటుకేశ్వర్‌ బిట్టు తివారీ' అనే గూండా పాత్రలో అలరించాడు అభిషేక్‌ బచ్చన్‌. 

5. బ్రీత్‌: ఇన్‌టు ది షాడోస్‌
జూలై 10, 2020న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైన సైకలాజికల్‌ క్రైమ్‌ డ్రామా వెబ్ సిరీస్ 'బ్రీత్‌: ఇన్‌టు ది షాడోస్‌'. ఈ వెబ్‌ సిరీస్‌తోనే అభిషేక్ బచ్చన్‌ ఓటీటీలోకి అరంగేట్రం చేశాడు. ఇందులో అతి భయంకరమైన కిడ్నాపర్‌ నుంచి తన కుమార్తెను రక్షించడానికి ఎంతకైనా తెగించే డాక్టర్ అవినాష్‌ సబర్వాల్‌ పాత్రలో ఆకట్టుకున్నాడు అభిషేక్‌ బచ్చన్‌. ఇది 2018లో వచ్చిన 'బ్రీత్‌' సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కింది. 


చదవండి: ఓటీటీల్లో మిస్‌ అవ్వకూడని టాప్‌ 6 సినిమాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement