Disney+ Hotstar
-
ఎట్టకేలకు ఓటీటీకి గోపిచంద్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అభిమానులు అంతా భావించారు. గతవారమే ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో భీమా ఓటీటీ కొత్త తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఉగాది సందర్భంగా అఫీషియల్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 25 నుంచి భీమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. Surprise surprise! Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024 -
This Week OTT Releases: అసలే పండుగ సీజన్.. ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు. అంతే కాకుండా వరుసగా ఉగాది, రంజాన్ పండుగలు వస్తున్నాయి. దీంతో సినీ ప్రియులు కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అలాంటి వారి కోసం ఓటీటీలు సైతం రెడీ అయిపోయాయి. ఈ వారం మిమ్మల్ని అలరించేందుకు సరికొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ నటించిన గామి ఈ వారంలోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ప్రేమలు మూవీ సైతం స్ట్రీమింగ్కు సిద్ధమైంది. వీటితో పాటు బాలీవుడ్లో పరిణీతి చోప్రా నటించిన మూవీ అమర్ సింగ్ చమ్కిలా ఓటీటీలో రిలీజ్ కానుంది. అంతే కాకుండా హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, యానిమేషన్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ స్పిరిట్ రేంజర్స్- సీజన్- 3 (కిడ్స్ యానిమేటెడ్ సిరీస్)- ఏప్రిల్ 08 నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్ (స్టాండ్-అప్ కామెడీ స్పెషల్)- ఏప్రిల్ 09 ఆంత్రాసైట్- (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10 ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ 601 -(కొలంబియా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10 అన్లాక్డ్: ఏ జైల్ ఎక్స్పెరిమెంట్- (డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 10 జెన్నిఫర్ వాట్ డిడ్ - (బ్రిటిష్ రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 10 యాజ్ ది క్రో ఫైల్స్- సీజన్ 3- (టర్కిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11 హార్ట్‌బ్రేక్ హై -సీజన్ 2 (ఆస్ట్రేలియన్ టీన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11 మిడ్ సమ్మర్ నైట్ -సీజన్ 1 -(నార్వే థ్రిల్లర్ సిరీస్)- ఏప్రిల్ 11 అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12 గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్కామ్)- ఏప్రిల్ 12 లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12 స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12 ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్) జీ5 గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు(మలయాళ వర్షన్)- ఏప్రిల్ 12 అమెజాన్ ప్రైమ్ అన్‌ఫర్‌గాటన్ సీజన్-5(వెబ్ సిరీస్) - ఏప్రిల్ 08 ది ఎక్సార్సిస్ట్: బిలీవర్(హారర్ మూవీ)- ఏప్రిల్ 09 ఫాల్ అవుట్(అమెరికన్ సిరీస్)- ఏప్రిల్ 11 ఎన్డబ్ల్యూఎస్ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12 -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్!
మహి వీ రాఘవ్ డైరెక్షన్లో వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్-2. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు ఇండియాలోనే టాప్-3 ప్లేస్ దక్కించుకుంది. ఓటీటీల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన జాబితాలో టాప్-3లో నిలిచింది. ఈ విజయం పట్ల మహి వి రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్ మాట్లాడుతూ..'సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను మీరంతా ఆదరించి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి విజయాలను సాధిస్తాయని మరోసారి రుజువైంది. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరింది’’ అని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సేవ్ ది టైగర్ రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతోసీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైయాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్- 3 సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ వాకి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ కోరింది. వారు పంపిన ఆలోచనలు, రచనలు బాగుంటే రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని పేర్కొన్నారు. -
ఓటీటీకి సూపర్ హిట్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం కేవలం మలయాళంలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో ప్రేమలు థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 15 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఇక రాబోయే రెండు నెలల్లో విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. ఈ హాలీడేస్‌లో ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేది ఒక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ముఖ్యంగా సినీ ప్రియుల కోసం ఈ వారంలో అలరించేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ వారం థియేటర్లలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం మాయవన్ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్లో ప్రాజెక్ట్-జెడ్ పేరుతో రిలీజవుతోంది. వీటితో పాటు భరతనాట్యం, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బహుముఖం లాంటి చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అయితే ఈ వారంలో ఓటీటీలోనూ సందడి చేసేందుకు పలు చిత్రాలు వచ్చేస్తున్నాయి. గోపీచంద్ నటించిన భీమా, టాలీవుడ్ భామ దివి చిత్రం లంబసింగి, హనుమాన్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. దీంతో పాటు బాలీవుడ్ మూవీ ఫర్రీ ఓటీటీకి వచ్చేస్తోంది. అంతే కాకుండా పలు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ టుగెదర్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 02 ఫైల్స్ ఆప్ ది ఆన్ఎక్స్ప్లెయిన్డ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03 రిప్ లే(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 04 పారాసైట్- ది గ్రే(కొరియన్ సిరీస్)- ఏప్రిల్ 05 స్కూప్- హాలీవుడ్ సినిమా- ఏప్రిల్ 025 అమెజాన్ ప్రైమ్ మ్యూజికా(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 04 యే మేరీ ఫ్యామిలీ(వెబ్ సిరీస్)- సీజన్ 3- ఏప్రిల్ 04 హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్- (హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లంబసింగి- (తెలుగు సినిమా)- ఏప్రిల్ 02 భీమా (టాలీవుడ్ చిత్రం) ఏప్రిల్ 5 హనుమాన్(తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05 జీ5 ఫర్రీ- (బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05 యాపిల్ టీవీ ప్లస్ లూట్ సీజన్- 2(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03 సుగర్(హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05 సోనీలివ్ ఫ్యామిలీ ఆజ్ కల్(హిందీ సినిమా)- ఏప్రిల్ 03 -
ఓటీటీల్లో ఒక్క రోజే పది సినిమాలు.. ఆ రెండే కాస్తా స్పెషల్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. అసలే వేసవి సెలవుల కాలం. ఇక ఫ్యామీలీ అంతా సినిమా చూసేందుకు ఓటీటీలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ శుక్రవారం థియేటర్లలోనూ టిల్లు స్క్వేర్, కలియుగం పట్టణంలో లాంటి చిత్రాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయోనని సినీ ప్రియులు ఆరా తీస్తున్నారు. ఈ వీకెండ్లో టాలీవుడ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషితో పాటు అభినవ్ గోమటం నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయి రా స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ రెండు కాస్తా అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు ఆసక్తికర చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. మరి ఏయే సినిమా ఏ ఓటీటీల్లో వస్తుందో మీరు ఓ లుక్కేయండి. ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన సినిమాలివే.. అమెజాన్ ప్రైమ్ ఇన్స్పెక్టర్ రిషి (వెబ్ సిరీస్) - మార్చి 29 మస్తు షేడ్స్ ఉన్నాయి రా(టాలీవుడ్ సినిమా)- మార్చి 29 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పట్నా శుక్లా (హిందీ చిత్రం) - మార్చి 29 మధు (డాక్యుమెంటరీ) - మార్చి 29 రెనెగడె నెల్ల్ (వెబ్ సిరీస్) - మార్చి 29 ద బ్యూటిఫుల్ గేమ్ - మార్చి 29 నెట్‌ఫ్లిక్స్ ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) - మార్చి 29 హార్ట్ ఆఫ్ ది హంటర్ (హాలీవుడ్) - మార్చి 29 ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ) - మార్చి 30 బుక్ మై షో ది హోల్డోవర్స్ (హాలీవుడ్) - మార్చి 29 జియో సినిమా ఎ జెంటిల్మెన్ ఇన్ మాస్క్ (వెబ్ సిరీస్) - మార్చి 29 -
ఏకంగా మూడు ఓటీటీల్లోకి హనుమాన్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి సినిమాలతో పోటీపడి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చిన హనుమాన్ పలు రికార్డులు కొల్లగొట్టింది. స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటల్లోనే అత్యధిక వ్యూయర్షిప్ సాధించింది. ప్రస్తుతం జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వర్షన్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. అయితే దక్షిణాది భాషల్లోనూ హనుమాన్ చిత్రాన్ని తీసుకురావాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ అప్డేట్ ఇచ్చారు. తమిళ, కన్నడ, మలయాళంలోనూ హనుమాన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూడు భాషల్లోని సినీ ప్రియులకు ఏప్రిల్ 5 నుంచి అందుబాటులోకి రానుందని ట్వీట్ చేశారు. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ లెక్కన హనుమాన్ ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది అన్నమాట. Tamil, Malayalam and Kannada versions of #HanuMan premieres April 5th on @DisneyPlusHS 😃#HanuManOnHotstar pic.twitter.com/PQvJWoTvZb — Prasanth Varma (@PrasanthVarma) March 26, 2024 -
సేవ్ ది టైగర్స్ సీజన్-2.. అది చెప్పేందుకు ప్రయత్నిస్తా : మహి వి రాఘవ్
ఫిల్మ్ మేకర్ మహి వి.రాఘవ్ రూపొందించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. సీజన్-1కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వతా వచ్చిన సైతాన్ సైతం సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆయన సేవ్ ది టైగర్ సీజన్ -2 ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సేవ్ ది టైగర్స్ సీజన్- 1, సైతాన్ సూపర్ హిట్, సేవ్ ది టైగర్స్ సీజన్ -2 సక్సెస్‌తో హ్యాట్రిన్ తన ఖాతాలో వేసుకున్నారు. ఓటీటీలో హ్యాట్రిక్ విజయంపై మహి వి.రాఘవ్ మాట్లాడుతూ.. 'ఇంత మంచి విజయాలు అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిరోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. నటీనటులు అద్భుతంగా నటించారు. దీంతో ఎంటర్టైన్మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి నేను ప్రయత్నిస్తా. అలా చేశాను కాబట్టే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది' అని అన్నారు. వెబ్ సిరీస్ గురించి చెబుతూ.. 'సేవ్ ది టైగర్స్ సీజన్- 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే.. సీజన్- 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సేవ్ ది టైగర్స్ పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్- 2పై కాస్త ఒత్తిడిగా ఫీలయ్యా. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం. అలాగే సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. త్వరలోనే మరికొన్ని వెబ్ సిరీస్‌లతో మీ ముందుకు వస్తా' అని అన్నారు. -
ఓటీటీలో హైజాక్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. సముద్రంలో షిప్పులను హైజాక్ చేసే నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించిన లూటేరే వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రెండు ఎపిసోడ్లను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ హైజాక్ థ్రిల్లర్ సిరీస్ లూటేరే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధానంగా షిప్ హైజాక్ నేపథ్యంలోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. సోమాలియా సముద్రపు దొంగల చుట్టూ తిరిగే ఈ సిరీస్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వచ్చే వారంలో మిగిలిన ఎపిసోడ్లను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. లూటేరే వెబ్ సిరీస్‌ను ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా క్రియేట్ చేయగా.. ఆయన తనయుడు జై మెహతా డైరెక్షన్లో తెరకెక్కించారు . సోమాలియా పైరేట్స్ ఓ షిప్‌ను హైజాక్ చేయడం.. దానిని విడిపించడానికి జరిగే ప్రయత్నాలు చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, ప్రీతికా చావ్లా, చందన్ రాయ్ సన్యాల్ ప్రధాన పాత్రలు పోషించారు. Time to drop the anchor! ⚓🚢#HotstarSpecials #Lootere is now streaming. Watch now: https://t.co/KnAtofkAqW pic.twitter.com/NSqwm5GUnG — Disney+ Hotstar (@DisneyPlusHS) March 21, 2024 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే సినిమాలు రిలీజ్‌కు సిద్ధమైపోతాయి. ఈ వారంలో థియేటర్లలో చిన్న సినిమాలే ఉన్నాయి. వీటిలో వెయ్ దరువెయ్, రజాకార్, లంబసింగి, తంత్ర, యోధ అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. మరి ఈ వీకెండ్లో సందడి చేసేందుకు క్రేజీ చిత్రాలు రెడీ ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో హనుమాన్ వచ్చే అవకాశముంది. కానీ ఇప్పటికే హిందీ వర్షన్ అధికారికంగా ప్రకటించగా.. దక్షిణాది భాషల్లో ఎప్పుడనేది క్లారిటీ లేదు. మరోవైపు మమ్ముట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు వస్తున్నాయి. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీల్లోకి రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 14 గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) - మార్చి 15 ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) - మార్చి 15 మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) - మార్చి 15 అమెజాన్ ప్రైమ్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14 ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 హాట్‌స్టార్ గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 15 టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 జీ5 మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14 సోనీ లివ్ భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15 ఆపిల్ ప్లస్ టీవీ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 లయన్స్ గేట్ ప్లే నో వే అప్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 15 బుక్ మై షో ద డెవిల్ కాన్స్పరసీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 15 జియో సినిమా హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) - మార్చి 16 ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 17 -
ఓటీటీకి వచ్చేసిన రొమాంటిక్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. భాష ఏదైనా సరే సబ్ టైటిల్స్‌తోనే కంటెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సరికొత్త కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందిస్తున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన మలయాళ వెబ్ సిరీస్ పోచర్కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా మరో సరికొత్త కంటెంట్‌తో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ అదేంటో చూద్దాం. అయాలి నటి అనుమోల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ హార్ట్ బీట్. మెడికల్ జానర్లో దీపక్ సుందర్రాజన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో చాలామంది కొత్తవారు నటించారు. ఈ రొమాంటిక్ యూత్‌పుల్ సిరీస్ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను అమెరికన్ షో గ్రేస్ అనాటమీ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో యోగలక్ష్మి, థాపా, దీపా బాలు, చారుకేష్, జయరావు, గిరి ద్వారకేష్, దేవిశ్రీ, కవితాలయ కృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil) -
శివరాత్రికి ఓటీటీల్లో సినిమాల జాతర.. ఒక్క రోజే 9 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ సారి ఏకంగా వీకెండ్ సెలవులు వచ్చేస్తున్నాయి. అంతే కాకుండా మహాశివరాత్రికి కూడా సెలవు రావడంతో మూడు రోజులు ఇక పండగే. ఈ నేపథ్యంలో వీకెండ్ ప్లాన్ ఇప్పటికే వేసుకుని ఉంటారు. ఏయే సినిమాలు చూడాలి? ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? థియేటర్లకు రానున్న చిత్రాలేంటి? అనే తెగ వెతికేస్తుంటారు. మీరు ఆశించినట్టే ఈ సెలవుల్లో ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. టాలీవుడ్లో భీమా, గామి లాంటి పెద్ద చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. మరో రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. మరీ ఓటీటీల సంగతేంటీ అనుకుంటున్నారా? థియేటర్ల మాదిరే సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీల్లో సందడి చేసేందుకు స్పెషల్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్, మలయాళ హిట్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. కానీ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హనుమాన్ ఈనెల 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరీ సడన్‌గా స్ట్రీమింగ్ చేసి సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. లేదంటే నెక్ట్స్ వీకెండ్ దాకా ఆగాల్సిందే. వీటితో రజినీకాంత్ లాల్ సలామ్, సందీప్ కిషన్ మూవీ ఊరు పేరు భైరవకోన కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. నెట్‌ఫ్లిక్స్ మేరీ క్రిస్మస్(హిందీ సినిమా)- మార్చి 08 లోన్ అవే(వెబ్ సిరీస్)- సీజన్ 4- మార్చి 08 డామ్ సెల్ (యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 08 అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళ డబ్బింగ్ మూవీ)- మార్చి 08 లాల్ సలామ్(తమిళ సినిమా)- మార్చి 08 ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)- మార్చి 09 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్రూ లవర్(తమిళ సినిమా)- మార్చి 08 షోటైమ్ (హిందీ సినిమా)- మార్చి 08 అమెజాన్ ప్రైమ్ ఊరుపేరు భైరవకోన(తెలుగు సినిమా)- మార్చి 08 జీ5 హనుమాన్(తెలుగు సినిమా)- మార్చి 08 (రూమర్ డేట్) -
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికా లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అకాడమీ అవార్డ్స్ వేడుకలను హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ నాల్గవ సారి హోస్ట్ చేయనున్నారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారతీయులకు లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. తాజాగా ఈ ఈవెంట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలతో వీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది అవార్డులకు కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఓపెన్‌హైమర్, బార్బీ, మాస్ట్రో, పూర్ థింగ్స్, అమెరికన్ ఫిక్షన్ వంటి లాంటి పోటీ పడుతున్నాయి. ఇండియా నుంచి పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పరర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఓటీటీకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తాజాగా రివీల్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జయరామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. pic.twitter.com/zMSmETJMBw — Disney+ Hotstar (@DisneyPlusHS) March 1, 2024 -
ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజే ఏకంగా 12 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు గతవారంలాగే చిన్న సినిమాలు రెడీ అయ్యాయి. థియేటర్లలో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్', ఆర్జీవీ 'వ్యూహం కాస్తా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఒకటి, రెండు చిన్న సినిమాలు వస్తున్నప్పటికీ అంతగా ఆసక్తి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సినీ ప్రియులు ఓటీటీవైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో ఓటీటీల్లో సందడి చేసేందుకు చిత్రాలు కూడా సిద్ధమైపోయాయి. ఈ వీకెండ్లో తెలుగు సినిమాలు పెద్దగా లేవు. తమిళ డబ్బింగ్ సినిమా 'బ్లూ స్టార్', 'ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ' డాక్యుమెంటరీ చిత్రాలు మాత్రమే కాస్త ఆసక్తి పెంచేస్తున్నాయి. వీటితో పాటు ఇంగ్లీష్, హిందీ చిత్రాలున్నాయి. మరీ ఏయే ఓటీటీల్లో ఏ సినిమా వస్తుందో మీరు ఓ లుక్కేయండి. ఈ వీకెండ్ ఓటీటీకి వచ్చేస్తోన్న సినిమాలివే.. నెట్‌ఫ్లిక్స్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) - ఫిబ్రవరి 29 మన్ సూఆంగ్ (థాయ్ సినిమా) - ఫిబ్రవరి 29 ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) - ఫిబ్రవరి 29 ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఫిబ్రవరి 29 మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) - మార్చి 01 మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ మూవీ) - మార్చి 01 షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్ట్రీమ్ (తగలాగ్ సినిమా) - మార్చి 01 సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01 స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 01 ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ సినిమా) - మార్చి 01 ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 03 అమెజాన్ ప్రైమ్ బ్లూ స్టార్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 29 పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 29 రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 29 నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వండర్ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) - మార్చి 01 జీ5 సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మార్చి 01 ఆపిల్ ప్లస్ టీవీ నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01 ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01 ముబీ ప్రిసిల్లా (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01 -
డిస్నీ, రిలయన్స్ ఒప్పందం?
న్యూఢిల్లీ: వాల్ట్ డిస్నీ భారత వ్యాపార విభాగ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగం కార్యకలాపాలను విలీనం చేసేందుకు ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. విలీన సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన మీడియా విభాగం, ఇతర అనుబంధ సంస్థలకు 61 శాతం వాటా ఉంటుందని, మిగతా వాటాలు డిస్నీకి ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ వారం వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టాటా ప్లే సంస్థలో డిస్నీకి ఉన్న మైనారిటీ వాటాలను కూడా రిలయన్స్ కొనుగోలు చేయొచ్చని వివరించాయి. సంక్లిష్టంగా మారిన తమ భారత విభాగాన్ని వీలైతే పూర్తిగా విక్రయించేందుకు లేదా ఇతర సంస్థలతో జట్టు కట్టి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు గతేడాది నుంచి డిస్నీ కసరత్తు చేస్తోంది. డిస్నీ, రిలయన్స్ ఒప్పందం? -
అఫీషియల్: ఓటీటీకి స్టార్ హీరో డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం మలైకోట్టై వాలిబన్. జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ తక్కువ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లిజో దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోను స్ట్రీమింగ్ చేయనున్నారు. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. మోహన్ లాల్ కెరీర్లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే రిలీజైంది. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. An epic tale of a warrior overcoming every challenge thrown his way - Malaikottai Vaaliban streaming from 23rd Feb in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada. https://t.co/zHnUR7TwM4 — Disney+ Hotstar (@DisneyPlusHS) February 19, 2024 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్!
మరో వారం వచ్చేసింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. ఈ వీక్‌లోనూ థియేటర్లలో సందడి చేసేందుకు చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ వీక్‌లో ఏయే సినిమాలు వస్తున్నాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ ప్రేక్షకుల కోసం ఎప్పటిలాగే సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. అయితే ఈ వీక్‌లో పెద్ద సినిమాలేం లేనప్పటికీ.. ఆ మూడు చిత్రాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఆలియా భట్ నిర్మించిన క్రైమ్ సిరీస్ పోచర్, మోహన్ లాల్ మూవీ మలైకొట్టై వాలిబన్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా తెరకెక్కించిన ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్ మూవీ కాస్తా ఇంట్రెస్టింగ్ కనిపిస్తున్నాయి. మరీ ఏయే ఓటీటీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో మీరు ఓ లుక్కేయండి. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్కు రానున్న చిత్రాలివే.. నెట్‌ఫ్లిక్స్ రిథమ్ ప్లస్ ఫ్లో ఇటలీ(రియాలిటీ సిరీస్)- ఫిబ్రవరి 19 ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం)- ఫిబ్రవరి 19 మైక్ ఎప్స్: రెడీ టు సెల్ అవుట్(కామెడీ సిరీస్)- ఫిబ్రవరి 20 క్యాన్ ఐ టెల్ యు ఏ సీక్రెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 21 అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22 సౌత్ పా(ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 22 త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23 మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23 ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23 ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23 ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్- ఫిబ్రవరి 23 మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ - ఫిబ్రవరి 24 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్(ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)- ఫిబ్రవరి 21 విల్ ట్రెంట్ సీజన్-2 (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 21 అమెజాన్ ప్రైమ్ పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23 మలకోట్టై వాలిబన్- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23(రూమర్ డేట్) -
మరో ఓటీటీలోకి వచ్చేసిన సలార్.. కానీ అదే ట్విస్ట్!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సలార్: పార్ట్-1 సీజ్ఫైర్'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన సలార్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చిన సలార్ ఓటీటీలో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే తెలుగులో కూడా వచ్చి ఉంటే బాగుండేదని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ రాబోయే రోజుల్లో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందేమో వేచి చూడాల్సిందే. Jab bhi Deva bulayega, Hum aayenge! #SalaarHindi Now Streaming #Salaar #SalaarOnHotstar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84 @vchalapathi_art @anbariv @SalaarTheSaga pic.twitter.com/pZfK2LVagB — Disney+ Hotstar (@DisneyPlusHS) February 16, 2024 -
డైరెక్ట్‌గా ఓటీటీ స్టార్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించిన చిత్రం తాజా చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని షాకిచ్చింది. మోహన్‌లాల్, లిజో కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. మోహన్‌లాల్ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళం భాషలో మాత్రమే రిలీజైంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోనే రిలీజ్‌కు మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ హిస్టారికల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని లేటేస్ట్ టాక్. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో.. మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. మోహన్ లాల్ కెరీర్లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది, కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
ఓటీటీల్లో సినిమాల జాతర.. ఈ వారంలో ఏకంగా 21 సినిమాలు!
మరో వారం వచ్చేసింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద ఈగల్ లాంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. అంతే కాకుండా సంక్రాంతికి రిలీజైన చిత్రాలు సైతం ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. మరీ ఈ వారంలో ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో తెలుసుకోవాలని ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేదుకు నాగార్జున వచ్చేస్తున్నాడు. సంక్రాంతికి సందర్భంగా రిలీజైన నా సామిరంగ ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోయింది. ఆ రెండు సినిమాలే ప్రేక్షకులకు కాస్తా ఇంట్రెస్ట్ పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఈ వారంలో అలరించనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ కిల్ మీ ఇఫ్ యూ డేర్(నెట్‌ఫ్లిక్స్ మూవీ) - ఫిబ్రవరి 13 సదర్లాండ్ టిల్ ఐ డై -సీజన్-3(డాక్యుమెంటరీ సిరీస్) - ఫిబ్రవరి 13 టేలర్ టామ్లిన్సన్ : హ్యావ్ ఇట్ ఆల్(కామెడీ సిరీస్) - ఫిబ్రవరి 13 ఏ సోవేటో లవ్ స్టోరీ - ఫిబ్రవరి 14 గుడ్ మార్నింగ్ వెరోనికా- సీజన్-3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14 ది హార్ట్ బ్రేక్ ఏజెన్సీ - ఫిబ్రవరి 14 లవ్ ఇజ్ బ్లైండ్- సీజన్ 6(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14 ప్లేయర్స్(నెట్‌ఫ్లిక్స్ మూవీ) - ఫిబ్రవరి 14 ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 హోస్ ఆఫ్ నింజాస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15 ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15 క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15 ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 కామెడీ చావోస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) - ఫిబ్రవరి 16 ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నా సామిరంగ(తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17 జీ5 ది కేరళ స్టోరీ(బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16 -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ మూడు మాత్రం స్పెషల్!
మరోవారం రానే వచ్చింది. వీకెండ్ ముగియడంతో సినీ ఆడియన్స్ ఎప్పటిలాగే వర్క్ మోడ్‌లోకి వెళ్లిపోతారు. దీంతో ఓటీటీల్లో వచ్చే సినిమాల కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. కాగా.. గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఒకటి, రెండు చిత్రాలు మినహా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వచ్చేవారంలో ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో అన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారంలో ముఖ్యంగా సంక్రాంతికి సందడి చేసిన సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులో మహేశ్ బాబు గుంటూరు కారం, కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ కెప్టెన్ మిల్లర్, కన్నడ స్టార్ దర్శన నటించిన కాటేరా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. వీటితో భూమి ఫెడ్నేకర్ క్రైమ్ థ్రిల్లర్ భక్షక్, సుస్మితా సేన్ ఆర్య-3 వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతున్నాయి. అంతే కాకుండా ఈ వారంలో మాస్ మహారాజా నటించిన ఈగల్ థియేటర్ల వద్ద సందడి చేయనుంది. మరీ ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05 ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్డమ్ - ఫిబ్రవరి 05 మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05 మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05 ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05 లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)- ఫిబ్రవరి 07 రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07 లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07 వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-0 9 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా ది ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్) - ఫిబ్రవరి 6 ది నన్ 2 - ఫిబ్రవరి 7 హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8 -
ఓటీటీకి 'నా సామిరంగా'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన కింగ్ నాగార్జున నా సామిరంగా చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పొంగల్ బరిలో గుంటూరు కారం, హనుమాన్,సైంధవ్ చిత్రాలతో పోటీపడి బ్రేక్ ఈవెన్ సాధించింది. తొలి రోజే రూ.5 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం అదే జోరును కొనసాగించింది. ఈ మూవీని మలయాళ చిత్రానికి రీమేక్‌గా విజయ్ బిన్నీ దర్శకత్వంతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సరిగ్గా నెల రోజుల తర్వతే స్ట్రీమింగ్ కానున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ లెక్కన ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్కు అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించాడు. కాగా.. ఇటీవలే నాసామిరంగా సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్రబృందం. ఈ ఈవెంట్‌కు సినిమా టీమ్ అంతా హాజరయ్యారు. -
వీకెండ్లో సినిమా పండగ.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు!
కొత్త ఏడాదిలో అప్పుడ మరో నెల ముగుస్తోంది. సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు సందడి చేయగా.. ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక సంక్రాంతి చిత్రాల హడావుడి అంతా అయిపోయింది. అయితే జవవరి చివరి వారంలోనూ మరికొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాయి. కోలీవుడ్‌లో ఇప్పటికే రిలీజైన ధనుశ్ కెప్టెన్ మిల్లర్, అయలాన్ తెలుగులోనూ రిలీజవుతున్నాయి. అయితే ఈ సినిమాలపై తెలుగు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ వారం వీకెండ్‌పై కొత్త సినిమాల ప్రభావం పెద్దగా లేనట్లే. అందుకే సినీ ప్రియులు ఓటీటీలవైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ ప్రియుల కోసం ఈ వీకెండ్లో సందడి చేసే సినిమాల లిస్ట్ మీకోసమే. మీ అభిమాన హీరోల చిత్రాలు ఓటీటీలో చూసేయండి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ మీరు లుక్కేయండి. ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే నెట్‌ఫ్లిక్స్ గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25 మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25 బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) - జనవరి 26 క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28 అమెజాన్ ప్రైమ్ కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 25 హస్లర్స్ (హిందీ సిరీస్) - జనవరి 24 ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26 పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 26 హాట్‌స్టార్ ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) - జనవరి 26 కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) - జనవరి 26 ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) - జనవరి 27 జీ5 సామ్ బహుదూర్ (హిందీ సినిమా) - జనవరి 26 ఆపిల్ ప్లస్ టీవీ మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26 -
కేవలం రూ.5 కోట్ల బడ్జెట్.. బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్.. ఆర్నెళ్ల తర్వాత ఓటీటీకి!
Baipan Bhari Deva on OTT: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. చిన్న సినిమాలు సైతం ఓటీటీల్లో అదరగొట్టేస్తున్నాయి. థియేటర్స్‌లో పెద్దగా ఆదరణ లభించని చిత్రాలకు సైతం.. ఓటీటీకి వచ్చేసరికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం.. థియేట్రికల్ రిలీజ్‌లోనే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ బైపన్ భారీ దేవ మూవీ దాదాపు రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరాఠీ భాషలో తెరకెక్కిన బైపన్ భారీ దేవ చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రెండో స్థానంలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఒకటి కాదు.. ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది జూన్ 30న విడుదలైన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా.. మరొకటి హులు యాప్‌లో అందుబాటులో ఉంది. హాట్ స్టార్‌లో మరాఠీతోపాటు హిందీ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులు మాత్రం సబ్ టైటిల్స్‌లో మాత్రమే చూసే వెసులుబాటు ఉంది. ఈ సినిమాను ప్రస్తుతం హిందీ, మరాఠీ భాషల్లోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం మరో ఓటీటీ హులు యాప్‌లో కేవలం అమెరికాలో మాత్రమే ఉంది. అక్కడ ఉన్న వారికి మాత్రమే బైపన్ భారీ దేవ చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంది. కాగా.. బైపన్ భారీ దేవ అంటే స్త్రీతత్వం కఠినమైనది అనే అర్థం వస్తుంది. ఈ చిత్రంలో రోహిణి హట్టంగడి, వందనా గుప్తే, సుకన్య కులకర్ణి, శిల్పా నవల్కర్, సుచిత్ర బాండేకర్, దీపా పరాబ్ ప్రధాన పాత్రలు పోషించారు. బైపన్ భారీ దేవ చిత్రానికి కేదార్ షిండే దర్శకత్వం వహించారు. అలాగే జీ స్టూడియోస్, ఎమ్వీబీ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ఆరుగురు అక్కాచెల్లెళ్లకు సంబంధించిన విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించారు. -
పెళ్లి తర్వాత తొలిసారి.. లావణ్య త్రిపాఠి టీజర్ చూశారా?
గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ తాజాగా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా అభిజిత్, లావణ్య లీడ్ రోల్స్‌లో నటించిన మిస్ ఫర్పెక్ట్ అనే సిరీస్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి.. ఓవర్ క్లీన్‌నెస్ (ఓసీడీ) కలిగిన పాత్రని పోషిస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేష్ విట్టా, హర్ష రోషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే రిలీజ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. -
OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
సినీ ఆడియన్స్ ప్రస్తుతం ఓటీటీల పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే వారంలో సంక్రాంతి సందడి మొదలు కానుంది. ఇప్పటికే పొంగల్‌కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. ఈ వారంలో దాదాపు థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రం రిలీజ్ కానున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయో తెలుసుకోవాలనే ఆరాటంతో ఉన్నారు. ఈ వీకెండ్లో మిమ్మల్ని అలరించేందుకు పలు చిత్రాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ వారంలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ -2 లాంటి సినిమాలు కాస్తా ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీకీ రానుందో ఓ లుక్కేద్దాం. ఈ వీకెండ్లో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04 హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04 సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04 ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04 కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05 గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియోంగ్‌సోంగ్ క్రియేచర్ పార్ట్ 2(దక్షిణ కొరియా సిరీస్)- జనవరి 5 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03 పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05 అమెజాన్ ప్రైమ్ ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05 లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05 జీ5 తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05 బుక్ మై షో ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05 వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియో సినిమా మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03 సోనీ లివ్ క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05 సైనా ప్లే ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05 క్రంచీ రోల్ సోలో లెవెలింగ్- (సౌత్ కొరియా సిరీస్)- జనవరి 6 -
Vaazhai In OTT: ఆ హిట్ డైరెక్టర్ మూవీ.. నేరుగా ఓటీటీకేనా!
మామన్నన్ మూవీతో హిట్ అందుకు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వాజై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కలైయరాసన్, నిఖిలా విమల్, ప్రియాంక, దివ్య, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మూడు సూపర్ హిట్ చిత్రాల తర్వాత మారి సెల్వరాజ్ తెరకెక్కించిన నాలుగో చిత్రం వాజై ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్‌కు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మామన్నన్ కంటే ముందే వచ్చిన పెరియారుమ్ పెరుమాల్, కర్ణన్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకున్నారు మారి సెల్వరాజ్. దీంతో వాజై మూవీని కూడా థియేటర్లలోనే రిలీజ్ చేస్తారని కోలీవుడ్ ఫ్యాన్స్ భావించారు. అదే తరహాలోనే వాజై చిత్రాన్ని కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అసలు కారణమిదేనా? అయితే ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నవ్వి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అందువల్లే ఈ మూవీని థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. కాగా.. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. நீளும் நீச்சலில் என் நா கேட்கும் ஒரு சொட்டுத் தேன் . —வாழை 🌴 This year belongs to #Vaazhai Team Vaazhai welcomes 2024 with warm hands!! Hitting theatres soon!! 🌴@disneyplusHSTam @navvistudios @mari_selvaraj @Music_Santhosh @thenieswar @KalaiActor @Nikhilavimal1… pic.twitter.com/CKrQNimnt7 — Mari Selvaraj (@mari_selvaraj) January 1, 2024 -
రిలయన్స్- డిస్నీ డీల్‌లో మరో కీలక పరిణామం!
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియా రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ డిస్నీ–స్టార్ ఇండియాను విలీనం చేసుకునే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన నాన్–బైండింగ్ టర్మ్ షీటుపై సంతకాల కోసం లండన్‌లో జరిగిన భేటీలో డిస్నీ ప్రతినిధి కెవిన్ మేయర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన మనోజ్ మోదీ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదరడంతో వ్యాపార విలువ మదింపు తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 45–60 రోజుల గడువు విధించుకున్నారు. అవసరమైతే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. జనవరి ఆఖరు నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయాలని రిలయన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తిగా స్టాక్, నగదు రూపంలో ఉండగలదని వివరించాయి. ఇరు సంస్థలు టర్మ్ షీటుపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను విలీనం చేస్తారు. విలీన సంస్థలో రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటాలు ఉండనున్నాయి. ఇందులో స్టార్ ఇండియాకు చెందిన 77 చానల్స్, వయాకామ్18కి చెందిన 38 చానల్స్ కలిపి మొత్తం 115 చానల్స్ ఉంటాయి. వీటితో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భాగమవుతాయి. జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 25 సినిమాలు!
ఈ వారం ఓటీటీ సినిమాల కంటే ప్రభాస్ సలార్ చిత్రంపైనే అందరి దృష్టి ఉందనడంలో సందేహం లేదు. మరోవైపు సలార్‌తో పోటీ పడేందుకు షారుక్ ఖాన్ డంకీ సైతం ఈ నెల 21న థియేటర్లలోకి రానుంది. బాక్సాఫీస్ బరిలో రెండు పెద్ద హీరోల చిత్రాలో కావడంతో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ వారంలో ఓటీటీల్లోనూ సందడి చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ వీకెండ్లో ఏకంగా 25 సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ వారంలో టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన 'ఆదికేశవ', రక్షిత్ శెట్టి, రుక్మిణి నటించిన 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' అలరించనున్నాయి. ఈ సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు, బాలీవుడ్ చిత్రాలు సందడి చేసేందుకు వస్తుండగా.. ఇప్పటికే కొన్ని మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి. ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 20 మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 20 ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా) - డిసెంబరు 20 అల్హమర్ H.A (అరబిక్ మూవీ) - డిసెంబరు 21 లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 21 రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 21 ఆదికేశవ (తెలుగు మూవీ) - డిసెంబరు 22 కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్) - డిసెంబరు 22 యోంగ్సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 22 కుయికో (తమిళ మూవీ) - డిసెంబరు 22 ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా) - డిసెంబరు 24 పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 24 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 20 డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 20 పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 20 వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22 అమెజాన్ ప్రైమ్ వీడియో ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 21 డ్రై డే (హిందీ సినిమా) - డిసెంబరు 22 సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 22 సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22 జీ5 అడి (మలయాళ మూవీ) - డిసెంబరు 22 హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబరు 22 జియో సినిమా బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 21 హే కమీని (హిందీ మూవీ) - డిసెంబరు 22 లయన్స్ గేట్ ప్లే ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22 -
‘డిస్నీ–స్టార్’పై రిలయన్స్ కన్ను!
న్యూఢిల్లీ: భారత్‌లో డిస్నీ–స్టార్ వ్యాపారాన్ని దక్కించుకోవడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింతగా దృష్టి పెట్టింది. 51% మెజారిటీ వాటా కొనుగోలుకు సంబంధించి వచ్చే వారం ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నగదు, స్టాక్ రూపంలో ఈ డీల్ ఉండొచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయమేదీ తీసుకోలేదని వివరించాయి. ఒప్పందం కుదుర్చుకున్నాక ఇరు సంస్థలు వ్యాపార మదింపు ప్రక్రియ చేపడతాయని తెలిపాయి. ఒప్పందం సాకారమైతే మీడియా రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింతగా విస్తరించేందుకు దోహదపడనుంది. పలు సవాళ్ల నేపథ్యంలో భారత విభాగాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్లు వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్ ఇటీవల సంకేతాలిచ్చిన నేపథ్యంలో తాజా డీల్ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కన్సాలిడేషన్ దిశగా .. ఇప్పటికే జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని ఎలార క్యాపిటల్ ఎస్వీపీ కరణ్ తౌరానీ తెలిపారు. రెండు మీడియా దిగ్గజాలకు (సోనీ/రిలయన్స్) టీవీ/ఓటీటీ మార్కెట్లో సింహభాగం వాటా ఉంటుందని పేర్కొన్నారు. డిస్నీ–స్టార్ భారత వ్యాపార విభాగంలో స్టార్ ఇండియా తదితర టీవీ చానళ్లు, డిస్నీప్లస్‌హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఉన్నాయి. డీల్ అనంతరం డిస్నీ–స్టార్‌కు దేశీ వ్యాపారంలో మైనారిటీ వాటాలు ఉంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం అమలైతే విలీన సంస్థ దేశంలోనే అతి పెద్ద మీడియా సంస్థల్లో ఒకటిగా ఆవిర్భవించనుంది. రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18కి చెందిన 38 చానళ్లు, స్టార్ ఇండియాకి ఎనిమిది భాషల్లో ఉన్న చానళ్లతో కలిపి మొత్తం 70 టీవీ చానళ్లు ఉంటాయి. వాటితో పాటు 2 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు–డిస్నీప్లస్‌హాట్‌స్టార్, జియోసినిమా కూడా ఉంటాయి. 2019లో స్టార్‌ను ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ నుంచి డిస్నీ కొనుగోలు చేసింది. -
యూత్ కలల రాణికి నిశ్చితార్ధం.. త్వరలో పెళ్లి
భాషతో సంబంధం లేకుండా గుడ్‌నైట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ ఏడాదిలో చిన్న సినిమా వచ్చిన గుడ్‌నైట్ భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్మార్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై వచ్చిన ఈ చిత్రంలో కె. మణికంఠన్, మీతా రఘునాథ్ జోడీ చాలా బాగా మెప్పిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గుడ్‌నైట్ చిత్రంలో ఎలాంటి మేకప్ లేకుండా 'అను' పాత్రలో మీతా రఘునాథ్ ప్రేక్షకులను చాలా బాగా మెప్పించింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా ఈ ఏడాది హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. నిద్ర, గురక వంటి సాదాసీదా విషయాలను కథావస్తువుగా తీసుకుని అద్భుతమైన స్క్రీన్ ప్లేగా అభిమానులకు అందించారు దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్. మీతా రఘునాథ్ పెళ్లి ఈ చిత్రంలో మణికందన్, మీతా రఘునాథ్ నటనకు భారీ స్పందన లభించింది. మీతా రఘునాథ్ తన సహజ నటనతో అభిమానులను ఆకట్టుకుంది. 2022లో "సా నీ నిధూమ్ నీ" చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసిన ఆమెకు 'గుడ్ నైట్' చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన అభిమానులు తనలాంటి భార్య కావాలని సోషల్ మీడియాలో ఎందరో యూత్ మాట్లాడుకునేలా చేసింది. భర్త కోసం దేన్నైనా భరించే భార్యగా ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమా వల్ల ఆమెకు కోలీవుడ్‌లో భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. ఈ సందర్భంలో మీతాకు పెళ్లి నిశ్చయమైంది. తాజాగా ఆమె నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనుండగా, అభిమానులు మీతాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
ఓటీటీకి వివేక్ అగ్నిహోత్రి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అదే జోరుతో వివేక్ ది వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఏడాది సెప్టెంబరు 28 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొవిడ్ టైంలో వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు ఎలా అభివృద్ధి చేశారనేది ఈ చిత్రంలో చూపించారు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 24న తేదీ నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ హిందీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. దక్షిణాది భాషల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మేకర్స్ వెల్లడించలేదు. కాగా.. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీలో 20 సినిమాలు.. ఆ హిట్ సినిమా ఉచితం కాదు!
ప్రతి వారంలో శుక్రవారం వస్తోందంటే చాలు సినీ ప్రియులకు పండగే. ఒకవైపు థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన హీరోల చిత్రాలు ఓటీటీకి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికోసమే సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా.. గురు, శుక్రవారాల్లో మరిన్నీ సందడి చేయనున్నాయి. ఓటీటీలతో పాటు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన ఆదికేశవ, శ్రీకాంత్, శివాని రాజశేఖర్ నటించిన కోటబొమ్మాళి పీఎస్, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ధృవనక్షత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ లియో- (తెలుగు డబ్బింగ్ సినిమా)- నవంబర్- 24 స్క్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22 మై డామెన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 23 పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23 ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) - నవంబరు 24 ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) - నవంబరు 24 లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) - నవంబరు 24 గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 24 ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 26 అమెజాన్ ప్రైమ్ ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) - నవంబరు 24 ది విలేజ్ (తమిళ వెబ్ సిరీస్) - నవంబరు 24 ఒపెన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 22(రెంట్- RS.149) అమెజాన్ మినీ టీవీ స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) - నవంబరు 22 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21 జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 24 జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23 బుక్ మై షో UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) - నవంబరు 24 సోనీ లివ్ చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24 సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24 ఆపిల్ ప్లస్ టీవీ హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - నవంబరు 22 -
ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ మూడు మాత్రమే స్పెషల్!
దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజైన జపాన్, జిగర్తండ డబుల్ ఎక్స్, టైగర్-3 వచ్చిన సినిమాల సందడి అయిపోయింది. మరోవైపు ఓటీటీల్లోనూ కొన్ని చిత్రాలు సందడి చేస్తున్నాయి. అలాగే ఈ వారంలోనూ థియేటర్లలోకి వచ్చేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో మంగళవారం, మై నేమ్ ఇజ్ శృతి, స్పార్క్: ది లైఫ్, సప్తసాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అలాగే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీకెండ్స్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేందుకు వస్తోన్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ సినిమా) - నవంబరు 16 మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 నెట్‌ఫ్లిక్స్ బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 16 ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా) - నవంబరు 16 లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 16 ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 16 సుకీ- (హిందీ సినిమా)నవంబరు 17 రస్టిన్-(ఇంగ్లీష్ సినిమా) నవంబరు 17 ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 17 బిలీవర్ 2 (కొరియన్ సినిమా) - నవంబరు 17 కోకమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 సుఖీ (హిందీ చిత్రం) - నవంబరు 17 ద డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 17 ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) - నవంబరు 18 వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17 కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 17 షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్: బిలీవర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 జీ5 ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 -
Vadhuvu OTT Web Series: అప్పుడు చిన్నారి పెళ్లి కూతురు.. ఇప్పుడేమో వధువుగా!
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న నటి అవికా గోర్. ఆ తర్వాత తెలుగులో ఉయ్యాలా జంపాలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది పాప్ కార్న్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌లో ఓటీటీ అభిమానులను అలరించేందుకు వస్తోంది. హోయ్‌చాయ్ ఓటీటీలో ఇందు పేరుతో స్ట్రీమింగ్ అయిన బెంగాలీ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేశారు. వధువు పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సిరీస్‌లో అవికా గోర్, అలీ రెజా, నందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే జేడీ చక్రవర్తి నటించిన దయా థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తోన్న వధువు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎలాంటి రహస్యాలు ఉంటాయి? అవి బయటపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకవేళ బయటకు వస్తే జరిగే పరిణామాలేంటి? వంటి ఆసక్తికర అంశాలతో వధువు వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న చిత్రాలు.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
ప్రస్తుత రోజుల్లో సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. సినిమాలు కుటుంబంతో కలసి ఇంట్లోనే చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రతివారంలో రిలీజయ్యే సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా చిన్న చిత్రాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతే కాకుండా దక్షిణాదిలో మలయాళంలోనూ ప్రతివారం సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్లు ఉన్న సినిమాలకు మరింత ఆదరణ లభిస్తోంది. అలాగే ఈ వారంలో మిమ్మల్ని అలరించేదుకు వస్తోన్న మాలీవుడ్ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. ఓటీటీలో అలరిస్తోన్న మాలీవుడ్ సినిమాలు ఇవే! 1. కన్నూరు స్క్వాడ్ - మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన చిత్రం కన్నూరు స్క్వాడ్. ఈ మూవీ మలయాళంలో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సూపర్ హిట్ మూవీ ఈ శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2.మాస్టర్‌పీస్ వెబ్ సిరీస్ - నిత్య మీనన్ ప్రధాన పాత్రలో వచ్చిన మలయాళ కామెడీ వెబ్ సిరీస్ ఇది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లనే అందుబాటులో ఉంది. 3.కాసర్ గోల్డ్ - రెండున్నర కోట్ల విలువైన బంగారం చోరీ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కాసర్ గోల్డ్ తెరకెక్కించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 4.వాలట్టీ - రెండు కుక్కల చుట్టూ తిరిగే ఎమోషనల్ కథే వాలట్టీ. కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం నవంబర్ 7 నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 5.18 ప్లస్ - ప్రేమ, స్నేహం, కుటుంబ మద్దతు లేకుండా లేచిపోయి పెళ్లి చేసుకునే జంట ఇబ్బందులే కథాంశంగా తీసిన చిత్రమిది. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఫీల్ గుడ్ మూవీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. 6.నెయ్మార్ - మనషులు, జంతువుల మధ్య ఉండే రిలేషన్స్‌ను చాటి చెప్పే సినిమా నెయ్మార్. నెయ్మార్ అనే ఓ కుక్క ఇద్దరు స్నేహితుల జీవితాలను ఎలా మార్చిందనేది కథాంశాన్నే తెరకెక్కించారు. ఈ సినిమా కూడా హాట్‌స్టార్‌లో అలరిస్తోంది. -
ఓటీటీకి మా ఊరి పొలిమేర-2.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
సత్యం రాజేశ్, డా.కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అదేస్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లో లవ్ బర్డ్స్.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆడియన్స్ ఊహించని విధంగా ఈ నెలాఖరులోనే ఓటీటీకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా జరిగితే.. నవంబర్ 3న విడుదలైన ఈ సినిమా నెల కాకముందే ఓటీటీలోకి రానుంది. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మరో వార్త వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ తేదీపై కాస్తా సస్పెన్ష్ కొనసాగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మా ఊరి పొలిమేర పార్ట్-1 ఇందులోనే స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. పార్ట్-2 కూడా హాట్‌స్టార్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: 'నా జీవితంలో ఇలా మొదటిసారి చూశా'.. పుష్ప చిత్రంపై బిగ్ బీ కామెంట్స్ వైరల్!) -
ఓటీటీకి వచ్చేస్తోన్న మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే అఖిల్ ఏజెంట్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాది మలయాళంలో ఆయన నటించిన తాజా చిత్రం 'కన్నూర్ స్క్వాడ్'. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన కన్నూర్ స్క్వాడ్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా వచ్చిన ఈ చిత్రానికి రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తన స్వీయ నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. (ఇది చదవండి: ఆ ఓటీటీకి వరుణ్- లావణ్య పెళ్లి వేడుక!!) కథ ఏంటంటే.. కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్‌కు సవాల్‌గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఎలాంటి ఆధారాలు లేని ఈ క్రైమ్‌ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్‌పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకు తెస్తుంది. -
ఓటీటీకి స్కంద మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. (ఇది చదవండి: 40 ఏళ్ల బ్యూటీ.. లిప్‌లాక్ సీన్.. ఇంకా అవుట్ కాలేదు..!) అయితే ఈ సినిమా మొదట అక్టోబర్ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. కానీ అలా జరగలేదు. ఓటీటీకి రిలీజ్‌పై సస్పెన్ష్ నెలకొంది. స్కంద స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల కొత్త తేదీని హాట్‌స్టార్ ప్రకటించింది. నవంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
రిలయన్స్ చేతికే డిస్నీ?, డీల్ విలువ రూ.80,000 కోట్లు
దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్,అమెరికన్ ఎంటర్టైన్మెంట్ జెయింట్ వాల్ట్ డిస్నీల మధ్య నగదు బదిలి, స్టాక్ కొనుగోలు ఒప్పందం చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లోని వాల్ట్ డిస్నీ తన డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్ల నియంత్రిత వాటాను అమ్మేందుకు సిద్ధమైంది. అయితే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ల డాలర్ల మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇక డిస్నీస్టార్‌ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్ మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నారు. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. డిస్నీ ఆస్తులన్నీ తన వద్దే ఇక డిస్నీస్టార్‌ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్ మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నారు. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. చర్చల్లో భాగంగా డిస్నీ తన మైనారిటీ వాటాను అలాగే ఉంచుకుని మిగిలిన మేజర్ వాటాను నగదు బదిలి, స్టాక్స్‌ను కొనుగోలు చేసేలా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. డీల్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు. డిస్నీ ఆస్తులను కొంత కాలం పాటు ఉంచుకోవాలని వాల్ట్ డిస్నీ అనుకుంటుందని సమాచారం. ఐపీఎల్ దెబ్బ.. ఆపై 2022లో ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను 2.7 బిలియన్ డాలర్లకు అంబానీ సొంతం చేసుకున్నారు. జియో సినిమా ఫ్లాట్‌ఫారమ్‌లో ఐపీఎల్ ప్రసారాల్ని ఉచితంగా యూజర్లకు అందించారు. ఆ తర్వాత వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్‌బీవో షోలను భారత్‌లో ప్రసారం చేసేందుకు గాను ఆ హక్కుల్ని రిలయన్స్ సొంతం చేసుకోవడం వంటి వరుస పరిణామాలతో వాల్ట్‌డిస్నీ స్టార్ డిస్నీని అమ్మేలా నిశ్చయించుకుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 43 మిలియన్ల వ్యూస్ వచ్చాయని డిస్నీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 35 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. -
ICC World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌లకు స్పాన్సర్ల క్యూ..
న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లను స్పాన్సర్ చేసేందుకు కంపెనీలు భారీ ఎత్తున క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 26 స్పాన్సర్లు, 500 ప్రకటనకర్తలు నమోదు చేసుకున్నట్లు టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మ్యాచ్‌ల ప్రసార హక్కులను దక్కించుకున్న డిస్నీ స్టార్ స్పోర్ట్స్ విభాగం హెడ్ సంజోగ్ గుప్తా తెలిపారు. వీటిలో చాలా స్పాన్సర్లు టీవీ, డిజిటల్ ఫార్మాట్లను ఎంచుకోగా, కొన్ని కంపెనీలు కేవలం డిజిటల్ లేదా టీవీని మాత్రమే ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా నిర్వహించే 48 మ్యాచ్‌లను డిస్నీ స్టార్ తమ టీవీ చానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు తొమ్మిది భాషల్లో 100 పైచిలుకు కామెంటేటర్స్‌తో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. వీటిలో తెలుగు, తమిళం తదితర భాషలు కూడా ఉన్నాయి. పన్నెండేళ్ల తర్వా త వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యమిస్తోంది. భారత్‌పై అంచనాలు.. పండుగ సీజన్ దన్ను ఆసియా కప్‌లో భారత మెరుగైన పనితీరు, పండుగ సీజన్, భారత్ టీమ్‌పై భారీ అంచనాలు తదితర సానుకూలాంశాల కారణంగా అడ్వరై్టజర్లు భారీగా ఆసక్తి చూపుతున్నట్లు గుప్తా చెప్పారు. అన్ని కేటగిరీల కంపెనీలూ స్పాన్సర్ చేసేందుకు లేదా ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. సాధారణంగా పండుగ సీజన్లో కంపెనీలు ప్రకటనలపై భారీగా వెచ్చిస్తుంటాయని తెలిపారు. స్పాన్సర్ల జాబితాలో కోకాకోలా, ఫోన్‌పే, మహీంద్రా అండ్ మహీంద్రా, డ్రీమ్11, హెచ్‌యూఎల్, హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్నాడ్ ఇండియా, బుకింగ్‌డాట్‌కామ్, పీటర్ ఇంగ్లాండ్, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మాండెలీజ్, ఎమిరేట్స్, డయాజియో, ఎంఆర్ఎఫ్, లెండింగ్‌కార్ట్, బీపీసీఎల్, హెర్బాలైఫ్, హయర్, యాంఫీ, గూగుల్ పే, పాలీ క్యాబ్, అమూల్, విడా, అమెజాన్ మొదలైన సంస్థలు న్నాయి. కోకా–కోలా, ఫోన్‌పే, హెచ్‌యూఎల్ వంటి పలు కంపెనీలు ఇటు టీవీ, అటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్పాన్సర్ చేస్తున్నాయి. అనువైన ప్యాకేజీలు.. ప్రకటనకర్తల బడ్జెట్, అవసరాలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను రూపొందించినట్లు గుప్తా చెప్పారు. ‘పండుగ సీజన్ సందర్భంగా.. ఎవరైనా అడ్వరై్టజరు దీపావళి సమయంలో ఎక్కువ మంది కస్టమర్లు తమ ఉత్పత్తులపై మక్కువ చూపుతారనే ఉద్దేశంతో పండుగకి ముందు ఓ రెండు వారాలపాటు ప్రకటనలు ఇవ్వదల్చుకున్నారనుకుందాం. కాస్త ప్రీమియం చెల్లించి ఆ వ్యవధిలో మాత్రమే తమ ప్రకటనలను ప్రసారం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా వారికోసం కస్టమైజ్డ్ ప్యాకేజీని అందిస్తున్నాం’ అని తెలిపారు. వరల్డ్ కప్‌లో మరింత మంది ప్రకటనకర్తలు భాగమయ్యేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లో ‘‘సెల్ఫ్–సర్వ్ ఫ్రేమ్‌వర్క్’ను ప్రవేశపెట్టినట్లు గుప్తా తెలిపారు. ఏజెన్సీలు, అడ్వరై్టజర్లు సేల్స్ టీమ్స్ జోక్యం లేకుండా, తమకు అవసరమైన వాటిని స్వయంగా బుక్ చేసుకునే వీలుంటుందని వివరించారు. -
డిస్నీ+ హాట్‌స్టార్ యూజర్లకు షాక్! నవంబర్ 1 నుంచే..
నెట్‌ఫ్లిక్స్ బాటలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) కూడా తమ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పాస్వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పాస్వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలియజేస్తూ సబ్‌స్క్రైబర్ ఒప్పందానికి సంబంధించిన అప్డేట్లను కెనడాలోని సబ్స్క్రైబర్లకు ఈ-మెయిల్ చేసింది. ది వెర్జ్ కథనం ప్రకారం.. అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్‌పై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కఠిన ఆంక్షలను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి దాని వెబ్‌సైట్‌లోని హెల్ప్ సెంటర్‌ను కూడా అప్డేట్ చేసింది. యూజర్లు నిబంధనలను ఉల్లంఘించి పాస్వర్డ్ షేర్ చేయకుండా వారి అకౌంట్లను పర్యవేక్షించనుంది. కెనడియన్ సబ్‌స్క్రైబర్ ఒప్పందంలో "అకౌంట్ షేరింగ్"పై కొత్త నిబంధనను చేసింది. అందులో సబ్స్క్రయిబ్ అయిన యూజర్ల ఖాతాలను పర్యవేక్షిస్తామని కంపెనీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, సబ్‌స్క్రిప్షన్‌ను శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పాస్వర్డ్ షేరింగ్ ఆంక్షలు కెనడాలో 2023 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. భారత్‌తో సహా ఇతర దేశాల్లో కూడా ఈ ఆంక్షలను అమలు చేయాలని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భావిస్తోంది. -
సినీ ప్రియులకు పండగే.. ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు!
సినీ ప్రియులకు ఈ వారంలో సందడే సందడి. ముఖ్యంగా మిమ్మల్ని అలరించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాల జాతర కొనసాగనుంది. ఈసారి ఏకంగా 20 సినిమాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఓటీటీ రిలీజెస్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మీకిష్టమైన సినిమాలేవీ? ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేయండి. అలాగే ఓటీటీతో పాటు థియేటర్లలోనూ నాలుగు చిన్న సినిమాలు ఈ వారంలో సందడి చేయనున్నాయి. పెద్ద సినిమాలు అన్ని సెప్టెంబర్ చివరి వారానికి మారిపోవడంతో చిన్న సినిమాల హవా నడవనుంది. అందులో సప్త సాగారాలు దాటి, నెల్లూరి నెరజాణ, చీటర్, నేనే సరోజ లాంటి చిత్రాలు ఈనెల 22న రిలీజ్ కానున్నాయి. నెట్ ఫ్లిక్స్ 1. ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ - సెప్టెంబరు 19 (స్ట్రీమింగ్ అవుతోంది) 2. లవ్ ఎగైన్ - సెప్టెంబరు 20 (స్ట్రీమింగ్ అవుతోంది) 3. జానే జాన్- సెప్టెంబరు 21 4. కెంగన్ అసుర సీజన్ 2 - సెప్టెంబరు 21 5. సిజర్ సెవన్ సీజన్ 4 - సెప్టెంబరు 21 6. సెక్స్ ఎడ్యుకేషన్- సీజన్ 4 - సెప్టెంబరు 21 7. హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ - సెప్టెంబరు 22 8. లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 - సెప్టెంబరు 22 9. సాంగ్ ఆఫ్ బండిట్స్ - సెప్టెంబరు 22 10. స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ - సెప్టెంబరు 22 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 11. అతిథి - సెప్టెంబరు 19 (స్ట్రీమింగ్ అవుతోంది) 12. దిస్ ఫుల్ సీజన్ 2 - సెప్టెంబరు 20( స్ట్రీమింగ్ అవుతోంది) 13. కింగ్ ఆఫ్ కొత్త - సెప్టెంబరు 22 14. నో వన్ విల్ సేవ్ యూ - సెప్టెంబరు 22 15. ద కర్దాషియన్స్ సీజన్ 4 - సెప్టెంబరు 23 అమెజాన్ ప్రైమ్ 16. కసండ్రో - సెప్టెంబరు 22 17. ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్విక్ - సెప్టెంబరు 22 18. బ్లడ్ అండ్ చాక్లెట్- సెప్టెంబర్ 19 (స్ట్రీమింగ్ అవుతోంది) ఆపిల్ ప్లస్ టీవీ 19. స్టిల్ అప్ - సెప్టెంబరు 22 లయన్స్ గేట్ ప్లే 20. హీల్స్ సీజన్-2- సెప్టెంబర్ 22 హోయ్‌చోయ్ 21. శిబ్పూర్ - సెప్టెంబర్ 22 -
ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి!
Disney India: అమెరికన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'డిస్నీ' (Disney) ఇండియన్ మార్కెట్లో తన వ్యాపారానికి సంబంధించిన ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే భారతదేశంలో డిస్నీ ఒక ప్రముఖ కంపెనీ సొంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముందు వరుసలో రిలయన్స్.. నివేదికల ప్రకారం.. డిస్నీ ఇండియాను ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ కొనుగోలు చేయనున్నట్లు.. ఈ వరుసలో ఇదే ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ డిస్నీని సొంతం చేసుకుంటే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో సరైన కొనుగోలుదారు లభిస్తే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ వంటి వాటిని ఒకేసారి విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ IPLకి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ కోల్పోయింది. ఈ హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది. దీంతో భారతదేశంలో ఈ బిజినెస్ మరింత డెవలప్ చేయడానికి కంపెనీ అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. ఇదీ చదవండి: వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. డిస్నీ ఇండియా వ్యాపారానికి సమందించిన చర్చలు ఇప్పటికే జరుపుతున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. కాగా ఈ చర్చలు డీల్ వరకు వెళ్లే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. అంతే కాకుండా ప్రస్తుతం ఐపీఎల్ స్ట్రీమింగ్‌తో జియో టీవీకి సబ్స్క్రైబర్స్ సంఖ్య భారీగా పెరిగింది. ఈ సమయంలో డిస్నీ ఇండియాను రిలయన్స్ సొంతం చేసుకుంటే.. ఈ రంగంలో కూడా అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. -
పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్ బ్యాక్ ఇస్తాడా?
స్వయంవరం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటుడు వేణు తొట్టెంపూడి. ఆ తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించిన వేణు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత గతేడాది రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. తెలుగులో చెప్పవే చిరుగాలి, పెళ్లాం ఊరెళితే, దమ్ము, గోపి గోపిక గోదావరి, హనుమాన్ జంక్షన్, శ్రీకృష్ణ 2006, చిరునవ్వుతో లాంటి చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: 'జవాన్' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే) అయితే ఈ ఏడాది ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. 2013 తర్వాత ఏ చిత్రంలోనూ లీడ్ రోల్లో కనిపించని వేణు.. ప్రస్తుతం గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా వేణు ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చివరగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో పోలీస్ అధికారిగా కనిపించిన వేణు 'అతిథి' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో అతనికి జోడీగా అవంతిక మిశ్రా నటిస్తోంది. (ఇది చదవండి: షారుఖ్ ఖాన్ మేనేజర్ ఎవరో తెలుసా? జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!) అయితే ఈ సిరీస్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తాజాగా అతిథి వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. ఈనెల 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. అయితే హీరోగా ఎమోషనల్, కామెడీ తరహా సినిమాలు చేసిన వేణు.. ఇప్పుడు మాత్రం సరికొత్తగా హారర్ కాన్సెప్ట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. A mansion full of secrets, an unexpected guest and the story unfolds… with a twist you’ll never see coming! Are you ready for it. #ATHIDHI TRAILER OUT NOW! WATCH NOW: https://t.co/0iuJpChB9c#Athidhi streaming from SEP 19 only on @DisneyPlusHSTel #AthidhiOnHotstar… pic.twitter.com/I8XIjwVSpw — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 8, 2023 -
డిస్నీ స్టార్‌లో క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్‌గా మహీంద్రా
న్యూఢిల్లీ: డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రసారానికి అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు ఆటోమేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఒక ప్రకటనలో తెలిపింది. కీలక టార్గెట్ మార్కెట్లలోని వినియోగదారుల దృష్టిలో పడేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వివరించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ కోసం మహీంద్రా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎస్‌యూవీలు, ట్రాక్టర్ బ్రాండ్లకు..భారతీయ క్రికెట్ స్ఫూర్తికి మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని సంస్థ ఈడీ రాజేశ్ జెజూరికర్ చెప్పారు. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. -
అభిమానులకు గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఆసియాకప్ మ్యాచ్‌లు చూడొచ్చు!
క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తన్న ఆసియాకప్-2023కు సమయం దగ్గరపడుతోంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇక ఈ టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వగా.. యువ సంచలనం తిలక్ వర్మకు తొలిసారి వన్డే జట్టులో చోటుదక్కింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆసియాకప్ మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్ ఇవ్వనుంది. అభిమానులు మ్యాచ్‌లను తమ మొబైల్లో ఉచితంగా చూసుకోవచ్చు. అయితే ఫ్రీ ఉచిత స్ట్రీమింగ్‌ను హైలైట్ చేస్తూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓ వీడియోను రీలీజ్ చేసింది. భారత్‌లో మొబైల్ వాడకందారులకు తమ ఫ్లాట్‌ఫామ్‌ను మరింత చేరువ చేయడమే హాట్‌స్టార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కడిగా వెళ్లినా క్రికెట్‌ను ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడవచ్చని అర్ధం వచ్చేలా హాట్‌స్టార్ ఈ వీడియోను రూపొందించింది. ఆసియా కప్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ. చదవండి: CSK To Release Ben Stokes: చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం.. 16 కోట్ల ఆటగాడికి గుడ్‌బై -
'ఇది నాకు చాలా ప్రత్యేకం'.. జేడీ చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్!
సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య , విష్ణుప్రియ, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ దయా. ఉత్కంఠ భరితమైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్ట్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌తో ఓటీటీ అరంగేట్రం చేసిన జేడీ చక్రవర్తి వైజాగ్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా డిస్నీ+ హాట్‌స్టార్ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. (ఇది చదవండి: 'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) జేడీ మాట్లాడుతూ.. 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కుటుంబంలో భాగమైనందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ క్రైమ్ థ్రిల్లర్ నాకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. ప్రతి పాత్రతో నన్ను సవాలు చేసుకోవడం, తిరిగి ఆవిష్కరించుకోవడం చేస్తుంటాను. ఈ సిరీస్‌లో నాకు అది దక్కింది.' అని అన్నారు. ఈ కార్యక్రమంలో, జేడీ చక్రవర్తి ప్రేక్షకులతో ఆప్యాయంగా పలకరించారు. తన పాత్రపై అభిమానుల్లో ఉన్నా సందేహాలను సమాధానాలిచ్చారు. ఆ తర్వాత అభిమానులతో సెల్ఫీలు దిగారు. (ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!) -
డిస్నీప్లస్ హాట్‌స్టార్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇకపై ఫ్రీగా చూసేయండి!
భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిందనే చెప్పాలి. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఈ రిచ్ లీగ్‌ను ప్రసార హక్కులు కోసం ఎగబడుతుంటాయి. ఈ ఏడాది ఐపీఎల్2023 స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో సినిమా సొంత చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించడం, దాంతో పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల కారణంగా జియో సినిమా రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ ( వీక్షకులు) సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా డిస్నీ+ హాట్‌స్టార్ తమ మొబైల్ వినియోగదారులు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బంఫర్ ఆఫర్ ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు హిట్ ఫార్ములాను అనుసరిస్తూ పోతుంటాయి. ఇటీవల ఐపీఎల్-2023 సీజన్‌ను రిలయన్స్ జియో ఆధీనంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్.. జియో సినిమాలో ఉచితంగా ప్రసారం చేయడం ద్వారా లక్షల మంది వీక్షకులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే బాటలో డిస్నీ హాట్‌స్టార్ కూడా నడవనుంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లను మొబైల్ ఫోన్లలో ఉచితంగా స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా తమ యూజర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ఇటీవల హాట్‌స్టార్ నుంచి ఐపీఎల్ ఇంటర్నెట్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న జియో..కేవలం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, రుసుము చెల్లించకుండా ప్రపంచ కప్ మ్యాచ్‌లను వీక్షించవచ్చని ప్రకటించింది. దీంతో ఐపీఎల్ టోర్నీ జరిగిన ఐదు వారాల్లో రికార్డు స్థాయిలో జియో సినిమా రికార్డు స్థాయిలో డిజిటల్ వీక్షకులను సొంతం చేసుకుంది. -
ఓటీటీలోకి వచ్చేసిన అవతార్-2.. ఇక నుంచి ఉచితంగానే!
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్-2: ది వే ఆఫ్ వాటర్'. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా డిసెంబర్16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!) అయితే ఇప్పటికే ఈ సినిమా రెంటల్ పద్ధతిలో ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నుంచి ఇండియాలో ఫ్రీగా చూసేందుకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ కన్నడ, మళయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికి వరకు ఈ విజువల్ వండర్‌ను చూడడం మిస్సయిన వారు చూసేయండి. (ఇది చదవండి: రెండో పెళ్లిపై దారుణ ట్రోల్స్.. స్పందించిన ఆశిష్ విద్యార్థి) -
ఈ వారం థియేటర్/ఓటీటీ అలరించే చిత్రాలివే!
ఈ ఏడాది వేసవిలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు చిత్రాలు థియేటర్లతోపాటు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనూ చిన్న సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో ఓటీటీలో అలరించే చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. దగ్గుబాటి హీరో అహింస ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇది చదవండి: చాలా రోజుల తర్వాత అలాంటి చిత్రాన్ని చూశా: రాజమౌళి ప్రశంసలు) థ్రిల్లింగ్ కథతో.. స్టూడెంట్‌గా థియేటర్స్‌కు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బెల్లకొండ గణేశ్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లకొండ గణేశ్ హీరోగా ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూండెట్ సార్!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఆసక్తి రేకెత్తించే ఐక్యూ సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ముఖ్య తారలుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ స్టూడెంట్’ అనేది ఉపశీర్షిక. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. కామెడీతో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా, పావని కరణం హీరోయిన్గా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూన్ 2న విడుదలవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ చక్రవ్యూహం సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న చిత్రం "చక్రవ్యూహం" ది ట్రాప్. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ చివరిసారిగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. (ఇది చదవండి: భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?) ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే! నెట్‌ఫ్లిక్స్ ఫేక్ ప్రొఫైల్ -వెబ్‌సిరీస్- మే 31 ఎ బ్యూటిఫుల్ లైఫ్ -హాలీవుడ్- జూన్ 1 న్యూ ఆమ్స్టర్ డామ్ -వెబ్‌సిరీస్- జూన్ 1 ఇన్ఫినిటీ స్టోర్మ్ -హాలీవుడ్- జూన్ 1 స్కూప్ -హిందీ సిరీస్- జూన్ 2 మ్యానిఫెస్ట్ -వెబ్‌సిరీస్- జూన్2 జీ 5 విష్వక్ -తెలుగు- జూన్ 2 డిస్నీ+ హాట్‌స్టార్ సులైకా మంజిల్ -మలయాళం- మే 30 బుక్ మై షో ఈవిల్ డెడ్ రైజ్ -హాలీవుడ్- జూన్ 2 జియో సినిమా అసుర్ 2 -హిందీ సిరీస్- జూన్ 1 -
ప్రముఖ ఓటీటీలో బిచ్చగాడు-2.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన ఆ చిత్రానికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిన్న(శుక్రవారం)తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించి హీరోగా నటించారు. కావ్య థాపర్ విజయ్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కూడా హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత అంటే జూన్ మూడోవారం లేదా చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. -
ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (అవతార్- 2). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం పలు ఓటీటీల్లోనూ రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. తాజాగా సినీ ప్రియులకు చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి అద్దె చెల్లించకుండానే చూసేలా ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. (ఇది చదవండి: సల్మాన్‌తో రిలేషన్లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్) రెంట్ చెల్లించకుండానే ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్కు అందుబాటులో రానున్నట్లు ప్రకటించింది. ఈ విజువల్ వండర్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని భాషల్లో విడుదల కానుందన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. (ఇది చదవండి: చెర్రీ ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి.. మనసులు గెలిచారు భయ్యా!) కాగా.. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలో సందడి చేసింది. తొలి భాగం అవతార్లానే పలు రికార్డులు సృష్టించిన ఈ సీక్వెల్ 2023 మార్చి 28 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలైన మూవీఎస్ ఎనీ వేర్, యాపిల్ టీవీ, ప్రైమ్ వీడియో, వుడు, ఎక్స్ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్ మూవీ అండ్ టీవీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చింది. -
ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నా థియేటర్ల కంటే ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. అసలే సమ్మర్ హాలీడేస్ కావడంతో కుటుంబమంతా ఇంట్లో కూర్చుని ఎంచక్కా సినిమాలు చూసేస్తున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసమ సరికొత్త సినిమాలు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ చిత్రాలేలో ఓ లుక్కేద్దాం. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' లవ్ స్టోరీ ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవసరాల కాంబినేష్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మే 5వ తేదీ నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కిరణ్ అబ్బవరం మీటర్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం మీటర్. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా అతుల్య రవి నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో కనిపించారు. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాగా.. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 16 ఆగస్టు 1947’న ఏం జరిగింది? గౌతమ్ కార్తీక్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సమర్పణలో రూపొందించిన చిత్రం 'ఆగస్టు 16.. 1947'. ఈ చిత్రంలో రేవతి శర్మ, పుగాజ్, రిచర్డ్ ఆష్టన్, జాసన్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. టెంట్ కొట్ట ఓటీటీ ఫ్లాట్‌ఫాం వేదికగా మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్‌లు/ చిత్రాలివే నెట్‌ఫ్లిక్స్ శాంక్చురీ - మే 4 ది లార్వా ఫ్యామిలీ-యామినేషన్- మే 4 తూ ఝూటీ మై మక్కార్ -హిందీ- మే 5 3-తెలుగు- మే 5 అమృతం చందమామలో -తెలుగు- మే 5 యోగి -తెలుగు- మే5 రౌడీ ఫెలో -తెలుగు- మే 5 తమ్ముడు -తెలుగు- మే 5 జీ 5 ఫైర్ ఫ్లైస్ -హిందీ సిరీస్- మే 5 షెభాష్ ఫెలూద -బెంగాలీ- మే 5 డిస్నీప్లస్ హాట్‌స్టార్ కరోనా పేపర్స్ -మలయాళ మూవీ- మే 5 సాస్ బహూ ఔర్ ఫ్లమింగో -హిందీ- మే 5 -
ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా చూడొచ్చు!
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ ఈ ఏడాది డిసెంబర్ నెల చివరి నాటికి దేశం మొత్తం 5జీ సేవల్ని అందించాలని భావిస్తోంది. సంస్థ ప్రణాళికల్లో భాగంగా రాబోయే వారాల్లో దేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య 300కి చేరుతుంది. ఈ తరుణంలో ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్‌లో యూజర్లు అన్లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. తద్వారా 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నగరాల్లో యూజర్లు నెట్‌వర్క్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. వీటితో పాటు అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఉచితంగా అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్‌ఫామ్స్ ఎయిర్టెల్ రూ. 499 ప్లాన్ : ఈ ప్లాన్‌లో వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీతో 5జీ అన్ లిమిడెట్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అంతేకాదు 3 నెలల పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్, ఎక్స్ట్రీమ్యాప్స్ బెన్ఫిట్స్, వింక్ సబ్స్క్రిప్షన్ ఇలా అనేక ఆఫర్లు పొందవచ్చు. ఒకవేళ 5జీ లేకపోతే 4జీ యూజర్లు ప్రతిరోజు 3జీబీ డేటాను వినియోగించుకోవచ్చు ఎయిర్టెల్ రూ. 839 ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీతో 5జీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంస్ఎస్లు పంపుకోవచ్చు. 3నెలల పాటు డిస్నీప్లస్‌హాట్ స్టార్, ఎక్స్ట్రీమ్ యాప్ బెన్ఫిట్స్, రివార్డ్స్ మినీ సబ్స్క్రిప్షన్, వింక్ సబ్‌స్క్రిప్షన్‌ను సొంతం చేసుకోవచ్చుకోవచ్చు. 4జీ యూజర్లు రోజుకు 2జీబీ డేటాను వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తుంది ఎయిర్టెల్ సంస్థ. ఎయిర్టెల్ రూ.699 ప్లాన్ : ఈ సరికొత్త ప్లాన్‌లో ఎయిర్టెల్ అన్ లిమిటెడ్ 5జీ డేటా, 100 ఎస్ఎంఎస్లను 56 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. వీటితో పాటు డిస్నీప్లస్‌హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ బెన్ఫిట్స్ పొందవచ్చు. 4జీ యూజర్లు ప్రతి రోజు 3జీబీ డేటా పొందవచ్చు. ఎయిర్టెల్ రూ.999ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. 84రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఎక్స్ట్రీమ్ యాప్ బెన్ఫిట్స్, వింక్ సబ్స్క్రిప్షన్, రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. 4జీ యూజర్లు 2.5 జీబీ డేటాను సొంతం చేసుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. చదవండి👉 ‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్ -
పలు ఓటీటీలోకి అవతార్ 2.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్.. కానీ!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2). గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు జేమ్స్ కామెరూన్. ఇన్నాళ్లు థియేటర్ ఆడియన్స్ అలరించిన ఈ చిత్రం.. ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు సిద్దమైంది. ఇదిలా ఉంటే రేపు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై ‘అవతార్’ టీమ్ అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంతవరకు చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు సిద్ధం అవ్వండి’ అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. కానీ ఒక్క హాట్‌స్టార్‌లోనే కాకుండా రేపు ఈ మూవీ పలు ఓటీటీల్లో సందడి చేసేందుకు రేడీ అయ్యింది. మూవీఎస్ ఎనీ వేర్, యాపిల్ టీవీ, ప్రైమ్ వీడియో, వుడు, ఎక్స్ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్ మూవీ అండ్ టీవీల్లో ‘అవతార్2’ స్ట్రీమింగ్ కానుంది. అయితే అవతార్ చూడలంటే మత్రం కొన్ని కండిషన్ పెట్టారు మేకర్స్. తొలుత ఈ మూవీని అద్దె ప్రాతిపదికన అందుబాటులో తెస్తున్నారు. ఈ సినిమా చూడాలంటే వారు ప్రీ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్నీ మూవీస్ ఇన్సైడర్స్ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉంచారు. ఈ మూవీ అద్దె 19.99 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,600. మార్చి 28వ తేదీ ఉదయం 9.30గంటల నుంచి ‘అవతార్2’ చూడొచ్చు. ఒకసారి మూవీని ప్రీఆర్డర్ చేసిన తర్వాత 48 గంటల్లోగా క్యాన్సిల్ చేసుకోవచ్చు(యూకే, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఉండేవారికి 14 రోజుల వెసులుబాటు). అయితే సినిమా చూడటం, డౌన్లోడ్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయడం కుదరదు. ‘అవతార్2’ 4కె అల్ట్రా హెచ్డీ, డాల్బీ అట్మాస్ ఆడియోతో రానుంది. కాగా ‘అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్ కామెరూన్. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2)ను తెరకెక్కించాడు. పార్ట్ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు జేమ్స్ కామెరూన్. -
ఓటీటీలో దూసుకెళ్తున్న ఐరావతం.. రికార్డ్‌స్థాయిలో వ్యూయింగ్ మినిట్స్
ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఐరావతం. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చిన్న సినిమా అయినా ఊహించని రీతిలో ఆదరణ దక్కించుకుంది. ఇప్పటివరకు 200 మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తోంది. ఈ మూవీ నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నూజివీడు టాకీస్‌పై రేఖ పలగని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. అసలు కథేంటంటే.. శ్లోక అనే బ్యూటీషియన్ కి బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్‌గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులవుతుంది. బర్త్ డే వీడియోలు తీస్తే డెత్ డే వీడియో లు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయటకొస్తాయి. ఆ రహస్యాల అల్లికే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథా గమనంలో మనం ఒకటి ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది.మన కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు తన ప్రేమికుడితో వెళ్లిపోతుంది. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా. ఇప్పటి వరకు చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మెగా డాటర్ సుస్మిత చిత్రం!
నటుడు సంతోష్ శోభన్, నటి గౌరి జి. కిషన్ జంటగా నటించిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రం ‘శ్రీదేవి.. శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా గత నెలలో విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, తాజాగా ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 30 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా వెల్లడించింది. కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పల్లెటూరులో జరిగిన అందమైన ప్రేమకథాగా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ శ్రీదేవి ఓ ఫ్యాషన్ డిజైనర్. తన మేనత్తపై ప్రతీకారంతో అరకు వెళ్లిన ఆమె అక్కడ హీరో శోభన్ బాబును కలుసుకుంటుంది. ఆ తర్వాత శ్రీదేవి జీవితం ఎలా మారింది? అత్తపై ఆమె ప్రతీకారం తీర్చుకుందా? గతంలో తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు వంటి ఆసక్తికర సంఘటనలతో ఈ చిత్రం రూపొందింది. Sreedevi Shobhan Babu la entertainment flick March 30 nundi! 🍿🎬#SrideviShobanBabuOnHotstar premieres only on #DisneyPlusHotstar.@santoshsoban @Gourayy @sushkonidela #VishnuLaggishetty @dimmalaprasanth @GoldBoxEnt @NagaBabuOffl @SyedKamran @Saranyapotla pic.twitter.com/pdXiCWOgPj — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) March 15, 2023 -
ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసిన ది లెజెండ్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
తమిళ బడా వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. 53 ఏళ్ల శరవణన్ గతేడాది ‘ది లెజెండ్’ అనే పాన్ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో రిచ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. 50వ ఏటా హీరోగా మారిన శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆయనే స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమాకి స్టార్ టెక్నికల్ టీమ్‌ను నియమించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కి రెడీ అయ్యింది. విడుదలైన ఏడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత గతేడాది జూలైలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు(మార్చి 3న) ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ది లెజెండ్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. కాగా ఇందులో శరవణన్ సరసన లక్ష్మిరాయ్, బాలీవుడ్ బ్యూటీ, పాపులర్ మోడల్ ఊర్వశి రౌటేలా హీరోయిన్లుగా నటించారు. శరవణన్ స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమాని జేడీ-జెర్రీ దర్శకద్వయం తెరకెక్కించగా.. రఘువరన్ బిటెక్ ఫేమ్ ఆర్. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ, హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. చదవండి: కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ Streaming Blasting from 12:30PM⚡️ 💥💫✨#Legend streaming in @DisneyPlusHS from Today 12.30 PM#LegendinDisneyHotstar#Tamil #Telugu #Malayalam #Hindi @yoursthelegend #Legend #TheLegend #LegendSaravanan @DirJdjerry @Jharrisjayaraj @thinkmusicindia @onlynikil #NM pic.twitter.com/FmRgRncylT — Legend Saravanan (@yoursthelegend) March 3, 2023 -
ఓటీటీకి ‘యాంగర్ టేల్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం టాలీవుడ్లో ఓటీటీ సినిమాల సందడి కనిపిస్తోంది. తాజాగా మరో వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. దర్శకుడు వెంకటేశ్ మహా, సుహాస్, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘యాంగర్ టేల్స్’. ప్రభల తిలక్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎన్నో ఆశలతో ఉన్న నలుగురు వారికి నచ్చని జీవితం ఎదురైతే వారి మానసిక సంఘర్షణ ఏంటి? దాని వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నటుడు సుహాస్ ఈ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం. -
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య టెస్ట్ .. ఆగ్రహంలో క్రికెట్ లవర్స్
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ సమయంలో క్రికెట్ లవర్స్ అసహనానికి గురయ్యారు. అందుకు స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సేవల్లో అంతరాయమే కారణమని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీప్లస్ హాట్ స్టార్ సేవలు డౌన్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఇతర ఆన్ లైన్ సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలు, వాటికి పరిష్కార మార్గాలు చూపే డౌన్‌డిటెక్టర్ సంస్థ 500 మందికిపై యూజర్లు ఈ అంతరాయంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వినియోగదారులు లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తలెత్తిన ఎర్రర్ మెసేజ్ స్క్రీన్షాట్లను ట్విటర్లో షేర్ చేసినట్లు నివేదించింది. డౌన్డిటెక్టర్లోని అవుట్‌టేజ్ మ్యాప్ ప్రకారం..ఢిల్లీ, జైపూర్, లక్నో, కోల్‌కతా, నాగ్‌పూర్, హైదరాబాద్, ముంబై, చండీగఢ్‌ల నుంచి యూజర్లు ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి.ఈ సాంకేతిక సమస్యలపై డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాజమాన్యం స్పందించింది. మా యాప్‌లు, వెబ్ సేవల్లో ఊహించని విధంగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. సమస్యను పరిష్కరించేలా ఐటీ నిపుణుల బృందం పనిచేస్తుందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. -
ఓటీటీలోకి బాలయ్య 'వీరసింహారెడ్డి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా వీరసింహారెడ్డి ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్ భారీగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో వీరిసింహారెడ్డి మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయొచ్చు. కాగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్,మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. Seema Simham vetaa shuru🦁💥#VeeraSimhaReddyOnHotstar premieres @ 6 PM on February 23 only on #DisneyPlusHotstar It’s time for #VSRHungamaOnHotstar! Ready na? pic.twitter.com/hfMMJ6jROX — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 12, 2023 -
నా భర్త విడాకులకు కారణం నేను కాదు: హన్సిక ఎమోషనల్
డిసెంబర్ 4, 2022న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన బ్యూటీ హన్సిక మోత్వాని. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే తాజాగా వీరి ప్రేమ పెళ్లిని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హన్సిక తన పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో రిలీజ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీత్ చేసింది. అయితే హన్సిక పెళ్లికి ముందు జరిగిన అనుభవాలను లవ్ షాదీ డ్రామాలో వెల్లడించింది. సోహైల్‌ను పెళ్లి చేసుకునే వరకు అత్యంత సీక్రెట్‌గా ఉండేందకు ప్రయత్నించినట్లు తెలిపింది హన్సిక. కానీ మీడియాకు ఎలా లీకవుతున్నాయో అని తీవ్ర అసహనానికి గురైంది. ఇంకా తన జీవితంలో హన్సిక తల్లి ఆమెకు అన్ని విధాలా వెన్నెముకలా నిలిచిందని చెప్పుకొచ్చింది బ్యూటీ. అయితే పెళ్లికి కొన్నిరోజుల ముందే సోహైల్‌కు గతంలోనే వివాహమైందని, అతడు తన భార్య నుంచి విడిపోవడానికి తానే కారణమని ఎన్నో వార్తలు బయటకు వచ్చిన విషయాన్ని హన్సిక ఈ వీడియోలో ప్రస్తావించింది. తన పెళ్లికి ముందు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. హన్సిక మాట్లాడుతూ.. 'నా పెళ్లి అయ్యే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా. నాకు తెలియకుండానే పెళ్లి వార్తలు బయటకొచ్చాయి. అది నాకు నచ్చలేదు. ఒక సెలబ్రిటీగా నేను చెల్లించుకుంటున్న మూల్యం. సోహైల్ గురించి రాసినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా. అలాంటి టైంలో అమ్మ, నా సోదరుడి సలహాతో ఫస్ట్ టైం మా ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశా. సోహైల్ పారిస్‌లో ప్రపోజ్ చేసిన ఫొటోలు చూసి అందరూ కంగ్రాట్స్ అన్నారు. అప్పుడు నాకెంతో ఆనందంగా అనిపించింది. అన్ని ఓకే అనుకున్నాక తిరిగి షూటింగ్స్ కోసం చెన్నై వెళ్లా. అప్పుడే సోహైల్‌కు గతంలోనే పెళ్లి అయ్యిందని వార్తలొచ్చాయి. ఆ పెళ్లిలో నేను పాల్గొన్న ఫొటోలు షేర్ చేస్తూ.. సోహైల్ తన భార్య నుంచి విడిపోవడానికి నేనే కారణమని రాశారు. నిజంగా ఆతని గతం నాకు తెలుసు. కానీ.. విడాకులతో నాకు సంబంధం లేదు' అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న లవ్ షాదీ డ్రామాలో హన్సిక పెళ్లికి ముందు సంఘటనలను చూపించారు. -
ఇతనా నా లైఫ్ పార్ట్నర్.. హన్సిక ఎమోషనల్
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలే వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లిని ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే హన్సిక ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది ఈ జంట. హన్సికన తన పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో రిలీజ్ చేయనుంది. ట్రైలర్ చూస్తే కతురియాతో పెళ్లికి ప్రపోజ్ చేసినప్పుడు ఇన్ని రోజులు తన చుట్టే తిరిగిన ఇతనేనా లైఫ్ పార్టనర్ అని అనిపించిందని హన్సిక అన్నారు. తాను చాలా ఎమోషనల్ పర్సన్ అంటూ ట్రైలర్లో చెప్పుకొచ్చారు. అలాగే సోహెల్‌ను పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో హన్సిక చేసిన పోరాటం ఏంటో ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. హన్సిక జీవితంలో ఈ ఎమోషనల్ జర్నీని లవ్ షాదీ డ్రామా పేరుతో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil) -
అప్పుడే ఓటీటీకి వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..!
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే థియేటర్లో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వీర సింహారెడ్డి ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. చదవండి: సీనియర్ నటి ఖుష్బుకు చేదు అనుభవం ఈ తాజా బజ్ ప్రకారం త్వరలోనే ఈమూవీ ఓటీటీకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను డిస్నిప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం డిస్నిప్లస్ హాట్‌స్టార్ మేకర్స్‌తో భారీ ధరకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీర సింహారెడ్డి ఓటీటీ హక్కుల కోసం హాట్ స్టార్ భారీగానే డబ్బులు చెల్లించినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు హాట్‌స్టార్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. చదవండి: వేణుకి రూ. 20 కోట్ల పైగా ఆస్తులు.. కానీ నేను అద్దే ఇంట్లో ఉంటున్నా: వేణు మాధవ్ తల్లి -
పెళ్లైన వ్యక్తితో హన్సిక ప్రేమ.. తల్లిని ఎలా ఒప్పించిందంటే..
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలె వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లికి మొదట్లో కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక తన వెడ్డింగ్ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనికి సోహైల్‌కు ఇది వరకే పెళ్లై, విడాకులు తీసుకోవడం కారణమని తెలుస్తుంది. ఇక పెళ్లకి ముందు కూడా సోహైల్ గురించి వచ్చిన వార్తలు తనను ఇబ్బంది పెట్టినట్లు చెబుతూ హన్సిక బాగా ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంంది. మొత్తంగా హన్సిక కూడా సాధారణ అమ్మాయిలానే ప్రియుడితో పెళ్లికి ఒప్పించడానికి చాలానే కష్టపడినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. -
బాలకృష్ణ వీర సింహారెడ్డి ఓటీటీ పార్ట్నర్ ఇదే? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
నందమూరి బాలకృష్ణ-శృతి హాసన్ జంటగా నటించి లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు గురువారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: రాహుల్‌కు కంగ్రాట్స్ చెప్పిన అషురెడ్డి, మరోసారి తెరపైకి ఎఫైర్ రూమర్స్ ఇదిలా ఉంటే ఇక థియేటర్లో రిలీజ్ అయిన చిత్రాలు ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరసింహరెడ్డి డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డిస్నిప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడనేది కూడా హాట్‌స్టార్ ప్రకటించాల్సి ఉంది. చదవండి: పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఉపాసన, ట్వీట్ వైరల్ ఇక హిట్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీకి వస్తుండగా.. మరికొన్ని చిత్రాలు నాలుగు వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వీరసింహారెడ్డి మాత్రం 6 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీకి రానుందని తెలుస్తోంది. కాగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ విలన్ కాగా ఆయనకు భార్యగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ప్రముఖ హనీరోజ్‌లు ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. -
ఓటీటీలో దూసుకెళ్తున్న ఐరావతం.. రికార్డ్ స్థాయిలో వ్యూయింగ్ మినిట్స్
ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన చిత్రం ఐరావతం. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఊహించని రీతిలో ఆదరణ దక్కించుకుంది. రీసెంట్గా వచ్చి సైలెంట్ హిట్‌గా నిలిచింది. నవంబర్ 17 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. నూజివీడు టాకీస్‌పై రేఖ పలగని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేవలం ఒక్క నెలలోనే 100 మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్ మినిట్స్ సాధించింది. అసలు కథేంటంటే..: శ్లోక అనే బ్యూటీషియన్ బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్‌గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులవుతుంది. బర్త్ డే వీడియోలు తీస్తే డెత్ డే వీడియోలు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయట పడుతుంటాయి. ఆ రహస్యాలే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథలో మనం ఒకటి ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది. హీరో పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి మరో ప్రేమికుడితో వెళ్లిపోతుంది. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా. ఓటీటీలో చూసి ఈ సినిమా ఎంజాయ్ చేయండి. -
ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ బట్టర్ఫ్లై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. ఓ వైపు గ్లామర్ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తుంది. ఈ ఏడాది ‘కార్తికేయ-2’ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ రీసెంట్గా ‘18పేజెస్’తో మరో విజయం ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 18 పేజెస్ మూవీ సక్సెస్‌ని ఆస్వాదిస్తోన్న అనుపమ మరో చిత్రం బటర్ ఫ్లై. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. చదవండి: షారుక్ పఠాన్ చిత్రానికి సెన్సార్ బోర్డు షాక్, మూవీ టీంకు బోర్డు ఆదేశం.. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత రాత్రి నుండి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ ఏడాది ప్రథమార్థంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో హాట్‌స్టార్ నుండి మంచి ఆఫర్ రావడంతో మేకర్స్ ఓటీటీ వైపు మొగ్గుచూపారు. ఘంటా సతీష్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిహాల్ కోదత్య్, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటించారు. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరవళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చదవండి: మరో వివాదంలో రష్మిక, సౌత్ ఇండస్ట్రీపై అవమానకర వ్యాఖ్యలు -
‘అవతార్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్‌కు పండగే
విజువల్ వండర్ అవతార్-2 ప్రస్తుతం థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. ఇప్పటివరకు సుమారు 5వేల కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 3D, 4DX టెక్నాలజీతో అందుబాటులో ఉన్న అవతార్-2 సినిమా టికెట్ రేట్స్ కూడా భారీగానే ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రిలీజ్ డేట్ నుంచి 234 రోజుల తర్వాతే అవతార్ 2 ఓటీటీలోకి అందుబాటులో రానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ సినిమాని ఓటీటీ చూడాలనుకునే ప్రేక్షకులు అప్పటిదాకా వేచిచూడాల్సిందే. -
నేరుగా ఓటీటీకి ‘బటర్‌ఫ్లై’ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బటర్‌ఫ్లై'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 29 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. గంటా సతీశ్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్‌తో కలిసి నటించిన చిత్రం ‘18 పేజీస్’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. -
హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న అంజలి 'ఫాల్' వెబ్‌సిరీస్
తమిళసినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఫాల్. ఎస్పీబీ చరణ్, నటి సోనియాఅగర్వాల్, సంతోష్ ప్రతాప్, నమిత కృష్ణమూర్తి, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్ సీరీస్‌ను డిస్నీ హాట్‌స్టార్ సంస్థ నిర్మించింది. దీని ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు సిద్ధార్థ్ రామస్వామి దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో డిస్నీ హాట్‌స్టార్ సంస్థ నిర్వాహకులు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నటి అంజలి మాట్లాడుతూ తాను ఇందులో దివ్య అనే పాత్రలో నటించానని చెప్పారు. ఇది రొటీన్ పాత్రలకు భిన్నంగా, కాస్త చాలెంజింగ్‌గా ఉంటుందన్నారు. థ్రిల్లర్ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఇందులో నటించిన నటినటీలందరికీ ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పూరి్ణమా భాగ్యరాజ్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. ఆమె మంచి కథలను చెప్పేవారని, తన లవ్‌స్టోరీ కూడా దాచుకోకుండా చెప్పారన్నారు. డిస్నీ హాట్‌స్టార్ సంస్థలో తాను నటించిన రెండవ వెబ్ సిరీస్ ఇది అని చెప్పారు. చాలా కంఫర్టబుల్‌గా చూసుకునే సంస్థ ఇది అని తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ రామస్వామి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అని పేర్కొన్నారు. తనే చాయాగ్రాహకుడు కావడంతో సన్నివేశాల చిత్రీకరణలో చాలా పర్ఫెక్ట్గా ఉండేవారన్నారు. టెక్నికల్‌గా కూడా తమకు నటించడం చాలా ఈజీ అయ్యిందన్నారు. వన్ మోర్ టేక్ అన్నదే చేసేవారు కాదని చెప్పారు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
రెండు వారాలుగా టాప్‌లో స్ట్రీమింగ్.. ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ్రిల్లర్
ఎస్తేర్ నోహ, అమర్ దీప్, అరుణ్ ప్రధాన పాత్రల్లో ఒక తెల్లటి కెమెరా ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఐరావతం'. నూజివీడు టాకీస్ పతాకంపై గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రేఖ పలగాని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి, లలిత కుమారి తోట నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ఫ్యూజన్' సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఐరావతం మూవీ ఈ నెల 17 నుంచి రెండు వారాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఎస్తేర్, అమర్ దీప్, తన్వి నెగ్గి అరుణ్ డబుల్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... 'సుహాస్ మాకు ఆటవిడుపుగా ఐరావతం కథ చెప్తే విని కథలోని స్క్రీన్ ప్లే స్ట్రాటజీ నచ్చి మూవీ తీద్దామనుకున్నాం. చివరికి ఈ మూవీ హాట్ స్టార్‌లో అనుకోకుండా రెండు వారాలుగా టాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మంచి కథని నమ్మినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం.' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...'ఫ్యూజన్ జోనర్లో తీసిన ఐరావతం హాట్ స్టార్ ప్రేక్షకులకు నచ్చడం చాలా హ్యాపీ. నిర్మాతలకు థాంక్స్. టెక్నీషియన్స్ థాంక్స్.' అని అన్నారు. -
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో చేతులు కలిపిన తనిష్క్
హైదరాబాద్: ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో రిటైల్ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ చేతులు కలిపింది. వివాహ వేడుకల వేళ ఓటీటీ వేదికగా ‘ద గ్రేట్ ఇండియన్ బ్రైడ్’ పేరుతో సరికొత్త షోను విడుదల చేయనుంది. దేశంలో భిన్న సంస్కృతి, విభిన్న ప్రాంతాలకు చెందిన ఐదుగురు వధువులు తనిష్క్ కో-బ్రాండ్ రివా రూపొందించిన వివాహ ఆభరణాలను ధరించి తమ పెళ్లి నాటి అనుభూతులను నటి శ్రియా పిల్గాంకర్తో పంచుకోనున్నారు. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?) ప్రతి సంప్రదాయానికి ఆభరణం రివా అనే ట్యాగ్‌లైన్‌తో కంటెంట్‌ను అత్యంత సృజనాత్మకంగా డిజైన్ చేశామని టైటాన్ మార్కెటింగ్ జీఎం రంజనీ కృష్ణస్వామి తెలిపారు. ‘‘టైటాన్ వంటి సుప్రసిద్ధ బ్రాండ్‌తో కలిసి పనిచేయడంతో పాటు వినూత్న కథనం ద్వారా సబ్స్క్రైబర్లతో మా బంధం మరింత బలపడుతుంది’’ అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) -
నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న విక్కీ కౌశల్ సినిమా
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన తాజా చిత్రం ‘గోవిందా నామ్ మేరా’. శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మించాడు. కియారా అద్వానీ, భూమి పడ్నేకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు నేరుగా ఓటీటీలో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. దీంతో ఈ చిత్రం థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
ఓటీటీ యూజర్లకు జియో భారీషాక్!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఓటీటీ యూజర్లకు భారీషాక్ ఇచ్చింది. ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భాగస్వామ్యంతో కొన్ని ఓటీటీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందించింది. అయితే ఇప్పుడు ఆ ప్లాన్లను తొలగించినట్లు తెలుస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్లను అక్టోబర్‌లో తొలగించిన జియో.. తాజాగా రూ.1499, రూ.4199 ప్రీపెయిడ్ ప్లాన్లను సంబంధిత ప్లాట్ ఫామ్ అన్నింటి నుంచి తొలగించింది. ఇప్పటికే ఈ ప్లాన్లు యాక్టీవేట్ యూజర్లు వినియోగించుకోవచ్చు. కానీ కొత్తగా ఆ ప్లాన్లు తీసుకోవాలనుకునే వారికి అందుబాటులో ఉండవని ఓటీటీ నివేదికలు చెబుతున్నాయి. కాగా, జియో - డిస్నీప్లస్ హాట్ స్టార్ మధ్య కుదరిన ఓటీటీల ఒప్పందం నుంచి జియో ఎందుకు తొలగిందో చెబుతూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకుంటూ వచ్చిన డిస్నీ+హాట్‌స్టార్.. 2023 ఐపీఎల్ ప్రసార హక్కులను కోల్పోయింది. ఈసారి రిలయన్స్ గ్రూప్‌కే చెందిన వయాకామ్ 18 ఆ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హాట్‌స్టార్ ప్లాన్లను జియో తొలగించినట్లు సమాచారం. -
ఐటీలో మొదలై అక్కడి వరకు.. ఉద్యోగులపై వేటుకు రెడీగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ!
అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం.. ఇవన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇప్పటికే వరుసగా ఒకదాని తర్వాత మరొకటి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు తొలగింపులను ప్రకటించగా తాజాగా స్టీమింగ్ దిగ్గజం డిస్నీ ఉద్యోగాలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ప్రస్తుతం కంపెనీ ఖర్చలను తగ్గించే పనిలో ఉన్నాం. ఆ ప్రక్రియపైనే మా సిబ్బంది పని చేస్తున్నారు. ఇటీవల ఆశించిన ఫలితాలు పొందలేకపోయాం, పైగా అంతర్జాతీయంగా పరిణామాలు కూడా తిరోగమనంవైపు సూచిస్తున్నాయి. అందుకే మేము కొంత సిబ్బంది తగ్గించాలని అనుకుంటున్నాం, అయితే ఆ సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఉద్యోగులపై వేటు మాత్రమే కాకుండా వ్యాపార పర్యటనలను పరిమితం చేయాలని ఆయన సంస్థలోని ముఖ్య అధికారులను కోరారు. అవసరమైన ప్రయాణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం కఠినమైన, అసౌకర్య నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం డిస్నీలో దాదాపు 190,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వసూళ్ల పరంగా డిస్నీ ఇటీవల పెద్దగా రాణించలేదు. నివేదికల ప్రకారం, కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి, కొత్తగా వచ్చిన ఫలితాలను చూస్తే 52 వారాల కనిష్టానికి చేరాయి. గతంలో, వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్‌తో సహా స్ట్రీమింగ్ కంపెనీలు ఈ సంవత్సరం వాల్యుయేషన్స్ మందగించడంతో తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకున్నాయి. ప్రస్తుతం డిస్నీ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్లాన్ ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
వాట్ ఏ ప్లాన్.. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌తో పాటు మరిన్ని ఓటీటీలు!
కరోనా దెబ్బకు ఓటీటీ మార్కెట్ విపరీతంగా పుంజుకుంది. వందల కోట్లలో ఓటీటీ వేల కోట్లుకు చేరింది. ఈ క్రమంలో ఓటీటీల సంస్థలు కస్టమర్లను పెంచుకునే పనిలో పడ్డాయి. అందుకోసమే ప్రత్యేకంగా సిరీస్‌లు, సినిమాలు, ప్రత్యేక కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నాయి. కంటెంట్ వరకు అంతా బాగున్న కస్టమర్లు పైసలు పెట్టి సబ్స్క్రైబర్లుగా మార్చడం కోసం మొబైల్ ఓన్లీ ప్లాన్స్‌ను (Mobile Only Plans) కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందిస్తున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం. అమెజాన్ ప్రైమ్ వీడియో అమెజాన్ ఇటీవల ప్రైమ్ వీడియో కోసం మొబైల్-మాత్రమే సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ .దీని ధర రూ. 599, ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ మొబైల్ డివైజ్ సబ్స్క్రైబర్లకు ప్రైమ్ వీడియో యాక్సెస్‌ను మాత్రమే అందిస్తుంది. ఇది ఉచిత డెలివరీలు, అమెజాన్ మ్యూజిక్ మొదలైన ఇతర ప్రైమ్ మెంబర్షిప్ ప్రయోజనాలను ఉండవని గమనించుకోవాలి. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌తో సహా అనేక రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది, దీని ధర నెలకు రూ.149. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫాంలో SD (480p) క్యాలిటీ అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ డిస్ని+హాట్‌స్టార్ (Disney+ Hotstar) మొబైల్ డివైజ్ కోసం నెలవారీ, వార్షిక ప్లాన్లను అందిస్తుంది. దీని ధర మూడు నెలలకు రూ.149, సంవత్సరానికి రూ.499. ఈ రెండు ప్లాన్లు యాడ్-సపోర్టుతో వస్తాయి. ఒకేసారి ఒక డివైజ్‌లో మాత్రమే లాగిన్ చేయగలరు. వూట్ సెలెక్ట్ మొబైల్ ప్లాన్ Voot Select సంవత్సరానికి రూ. 299 ఖరీదు చేసే ఒక మొబైల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఒక డివైజ్‌కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. SD 720p స్ట్రీమింగ్‌ను అవకాశం ఉంటుంది. సోనీలైవ్ మొబైల్ ప్లాన్ సోనీలైవ్ మొబైల్ ప్లాన్ సంవత్సరానికి రూ.599తో ఉంది. ఇది ఒక మొబైల్ డివైజ్‌లో మాత్రమే 720p స్ట్రీమింగ్కు అవకాశం ఉంటుంది. జీ5 జీ5లో మొబైల్ ప్లాన్ అందుబాటులో లేదు. అయితే, ఇది సంవత్సర వ్యాలిడిటీ, మూడు నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది. వాటి ధర రూ.999( సంవత్సరం) , రూ. 399 (3 నెలలు). చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తెలుగులో సమర్పించాడు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున, మౌనీ రాయ్‌లు కీలకలు పాత్రలు పోషించిన బ్రహ్మస్త్ర ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. ఇప్పటికే ఈమూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ఢీల్కు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌కు అరుదైన వ్యాధి, అప్పుడు మెదడు పని చేయదట! నవంబర్ 4న ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకువస్తున్నట్లు హాట్‌స్టార్ ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఈ మూవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం హిందీలోనే కాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లజ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ. 270 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని పూర్తిగా 5 భాగాలుగా రూపొందించనున్నట్లు గతంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెలిపాడు. ఇందులో మొదటి పార్ట్ శివ పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందట. చదవండి: ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు మూవీ తెలుసా? -
Ind Vs Ban: చరిత్ర తిరగరాసిన భారత్-బంగ్లా మ్యాచ్.. పాక్‌తో మ్యాచ్‌ను సైతం తలదన్నేలా..!
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా అడిలైడ్ వేదికగా నిన్న (నవంబర్ 2) జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ టోర్నీ డిజిటల్ ప్రసారదారు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ మ్యాచ్ హాట్‌స్టార్ హిస్టరీలో నమోదైన గత రికార్డులన్నింటినీ తిరగరాసింది. హాట్‌స్టార్ పెయిడ్ వర్షెన్ అయ్యాక అత్యధిక వ్యూస్ దక్కించుకున్న మ్యాచ్‌గా భారత్-బంగ్లా సమరం రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌ను ఒకానొక సందర్భంలో 19 మిలియన్ల మంది వీక్షించారు. హాట్‌స్టార్ చరిత్రలో ఇదే అత్యథిక వ్యూయర్షిప్ రికార్డు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు హాట్‌స్టార్ అత్యధిక వ్యూయర్షిప్ రికార్డు.. ఇదే వరల్డ్‌కప్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ పేరిట నమోదై ఉండింది. ఆ మ్యాచ్‌ను దాదాపు 18 మిలియన్ల మంది వీక్షించారు. హాట్‌స్టార్ చరిత్రలో అత్యధిక వ్యూయర్షిప్ దక్కించుకున్న మ్యాచ్‌ల జాబితాలో మూడో స్థానంలో కూడా భారత్ ఆడిన మ్యాచే ఉంది. Hotstar's peak viewership in 2022: India Vs Bangladesh (T20 WC) - 19M. India Vs Pakistan (T20 WC) - 18M. India Vs Pakistan (Asia Cup) - 14M. — Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2022 ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌ను 14 మిలియన్ల మంది చూశారు. మొత్తంగా నరాలు తెగే ఉత్కంఠ నడుమ, చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన భారత్-బంగ్లా సమరం డిజిటల్ ఫ్లాట్‌ఫాం రికార్డులు బద్ధలు కొట్టడంతో పాటు క్రికెట్ లవర్స్‌కు పొట్టి క్రికెట్ అసలుసిసలు మజాను అందించింది. ఈ మ్యాచ్ చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాక్ మ్యాచ్‌ను సైతం తలదన్నేలా వ్యూయర్షిప్ దక్కించుకుందంటే.. ఏ రేంజ్లో ఉత్కంఠ కొనసాగిందో అర్ధం చేసుకోవచ్చు. కాగా, వర్షం అంతరాయం నడుమ రసవత్తరంగా సాగిన భారత్-బంగ్లా సమరం.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మరో హైఓల్టేజీ మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి, సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్..ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లి (44 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్ 16 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లా టార్గెట్‌ను 16 ఓవర్లలో 151 పరుగులుగా నిర్ధేశించారు. -
హాట్‌స్టార్‌లో అంజలి 'ఝాన్సీ' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్
తమిళసినిమా: నటి అంజలి కూడా వెబ్‌సిరీస్ ప్రపంచంలోకి చేరిపోయింది. ఈమె టైటిల్ పాత్ర పోషిస్తున్న ఝాన్సీ వెబ్‌సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ను ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నటుడు కృష్ణ నిర్మించారు. గణేష్ కార్తీక్ కథ, కథనాన్ని రూపొందించగా తిరు దర్శకత్వం వహించారు. ఒక సంఘటనలో గతాన్ని మరచిపోయిన యువతి తనెవరో, తన గతం ఏమిటో తెలియకుండా జీవిస్తుంది. ఆమెకు ఒక డాక్టర్ గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఆమెకు గతం గుర్తుకొచ్చిందా? ఆ తరువాత ఏం చేసిందన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన వెబ్ సిరీస్ ఝాన్సీ. ఇది గురువారం నుంచి డిస్నీహాట్ స్టార్‌లో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది తాను నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదని త్వరలో బెల్‌బాటం చిత్రం విడుదలకు సిద్ధమవుతుందని చెప్పారు. అయితే తనకు నిర్మాత కావాలన్నది చిరకాల కల అని చెప్పారు. ఇది తమ సంస్థలో రూపొందించిన మూడో వెబ్‌సిరీస్ అని తెలిపారు. దీనికి తిరువూరు బొక్క ఎపిసోడ్ కన్నా దర్శకత్వం వహించమని కోరగా ఆయన వెంటనే అంగీకరించారని చెప్పారు. ఝాన్సీ వెబ్ సిరీస్ చాలా బాగా వచ్చిందని, అయితే తాను ఇందులో నటించలేదని చెప్పారు. ఈ వెబ్‌సిరీస్‌కి సహకరించిన డిస్నీ హాట్ స్టార్ సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నిర్మాత తెలిపారు. -
T20 WC 2022: గత రికార్డులన్నీ బ్రేక్ చేసిన ఇండియా-పాక్ మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో విరాట్ వీరోచితంగా పోరాడి టీమిండియాకు మరపురాని విజయాన్నందించాడు. ఈ మ్యాచ్ పలు వ్యక్తిగత రికార్డులకు వేదిక కావడంతో పాటు వ్యూయర్షిప్ పరంగా గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఈ సండే ధమాకా అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంటపండించగా.. డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ హాట్ స్టార్ గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. ఇవాల్టి మ్యాచ్‌ను డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఏకంగా కోటి 80 లక్షల మంది వీక్షించారు. డిజిటల్ ప్లాట్‌ఫాం చరిత్రలో ఇదే అత్యధికం. ఈ ఏడాది ఆసియా కప్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌కు కోటి 30 లక్షల వ్యూస్ లభించగా.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్ చేసి డిజిటల్ ప్లాట్‌ఫాంపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే, టీ20 క్రికెట్లో అసలుసిసలైన మజా ఇవాళ (అక్టోబర్ 23) జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో దొరికింది. చివరి నిమిషం నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ సమరంలో టీమిండియా.. దాయాది పాక్‌ను 4 వికెట్ల తేడాతో మట్టికరిపించి, ఆసియా కప్-2022, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ విశ్వరూపం (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రదర్శించి ఛేదనలో రారాజు తనేనని మరోసారి ప్రపంచానికి చాటాడు. కోహ్లి వీరోచిత పోరాటానికి హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన (40, 3/30) తోడవ్వడంతో భారత్ చిరకాలం గుర్తుండిపోయే అపురూప విజయాన్ని సాధించింది. చదవండి: Ind Vs Pak: విరాట్ వీరోచిత పోరాటం.. సలాం కొడుతున్న క్రీడాలోకం -
‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. చదవండి: సుకుమార్-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్ చిచ్చు! అసలేం జరిగింది? భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళి సందర్భంగా బ్రహ్మస్త్ర మూవీ వచ్చేవారంలో ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 23 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సినీవర్గాల నుంచి సమాచారం. త్వరలోనే దీనిపై హాట్‌స్టార్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. -
అంజలి ‘ఝాన్సీ’ వెబ్‌సిరీస్ ట్రైలర్ చూశారా?
అందాల ముద్దుగుమ్మ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలి తాజాగా ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. 'ఒక మనిషి జీవితంలో అన్నింటికంటే పెద్ద శిక్ష.. తనెవరో తనకే తెలియకపోవడం' అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సిరీస్‌ను తిరు డైరెక్ట్ చేస్తున్నాడు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై కృష్ణ నిర్మిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా అక్టోబర్ 27న ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇటీవలె మాచర్ల నియోజకవర్గం సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెస్మరైజ్ అంజలి శంకర్-రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. -
ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో!
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) తన యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు జియో యూజర్లు రీచార్జ్ చేసుకుంటే కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చేది. కానీ తాజాగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లలో డిస్నీ+ హాట్ స్టార్‌ని తొలగించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి జియో అధికారిక వెబ్సైట్లో కొన్ని ప్లాన్‌లో ఉన్న ఓటీటీ ఆఫర్‌ను చూపించడం లేదు. కస్టమర్లు ఇప్పుడిక డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ యాక్సెస్ పొందాలంటే కేవలం రెండు ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అనగా రూ.1499, రూ.4199 రీచార్జ్‌తో మాత్రమే ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. జియో యూజర్లు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను(T20 World Cup) డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడాలంటే ప్రత్యేక రీచార్జ్ చేసుకోవాల్సిందే మరి. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఓటీటీని తొలగించిన ప్లాన్లలో యూజర్లు ఇది వరకే కొనుగోలు చేసి ఉంటే దాని దాని వ్యాలిడిటీ తేదీ వరకు డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) యాక్సెస్ ఉంటుంది. ఆ రెండు ప్లాన్లు ఇవే.. రూ. 1,499 ప్లాన్‌లో.. ఇందులో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్, 2GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. రూ.4,199 ప్లాన్‌లో.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ఇతర ప్లాన్ రూ. 4,199 రీఛార్జ్ ప్యాక్. ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్లతో పాటు రోజువారీగా 3GB డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. రెండు ప్లాన్లు ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అందిస్తుంది. చదవండి: ఏముంది భయ్యా ఆ జీన్స్ ప్యాంట్లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్! -
ఓటీటీ ప్రియుల కోసం వోడాఫోన్ చవకైన ప్లాన్.. రూ.151తో డేటా, 3 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
టెలికాం రంగంలో పోటీ విపరీతంగా పెరుగుతోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు అదిరిపోయే ఆఫర్లతో పాటు ట్రెండ్‌ని కూడా ఫాలో అవుతూ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ) తమ వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కరోనా కారణంగా ప్రజలు ఓటీటీలకు అలవాటు పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కేటగిరి కస్టమర్లను దృష్టిలో వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఓటీటీ( OTT) ప్రయోజనాలతో వస్తుంది. ఓటీటీ ప్రియుల కోసం ప్రత్యేక ప్లాన్.. ఓటీటీ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే కస్టమర్లకు ఈ రీచార్జ్ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్‌లోని బెనిఫిట్స్‌పై ఓ లుక్కేద్దాం.. వీఐ కొత్త రూ.151 ప్రీపెయిడ్ యాడ్-ఆన్ ప్యాక్‌ని ప్రకటించింది. ఈ చవకైన రీచార్జ్ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఇందులో ప్రధానంగా మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఈ ప్యాక్‌తో కస్టమర్లు మొత్తం 8GB డేటాను కూడా పొందుతారు. అయితే ఈ రీచార్జ్ ప్లాన్‌పై కాలింగ్, ఉచితంగా ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. అధిక డేటాతో హాట్ స్టార్, డిస్నీ సబ్స్క్రిప్షన్ కోరుకునే కస్టమర్లకు ఈ రీచార్జ్ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పువచ్చు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
ఓటీటీలో సినిమాల జాతర.. ఈ ఒక్కరోజే 14 చిత్రాల సందడి
ప్రస్తుతం బిగ్స్క్రీన్పై చిన్న సినిమాల హావా నడుస్తోంది. మరోవైపు ఓటీటీలో మాత్రం పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ ఒక్కరోజే(శుక్రవారం) ఓటీటీలో దాదాపు 14 సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందులో నేరుగా ఓటీటీకి వచ్చే చిత్రాలు ఉండగా.. థియేట్రల్లోకి వచ్చిన ఇప్పుడు ఓటీటీ వేదిగా సందడి చేసేందుకు మరికొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. ఈక్రమంలో నేడు ఒక్కరోజే ఓటీటీకి వచ్చేస్తున్న ఆ చిత్రాలేవో ఇక్కడ ఓ లుక్కేయండి! డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar): బబ్లీ బౌన్సర్ – తెలుగు, హిందీ నెట్ ఫ్లిక్స్(Netflix): జంతారా – సిరీస్ 2(హిందీ) లౌ(Lou) – ఇంగ్లీష్ ఎ జాజ్ మెన్స్ బ్లూస్ – ఇంగ్లీష్ ఎథెనా – ఫ్రెంచ్ ది గర్ల్స్ ఎట్ ది బ్యాక్ -సిరీస్ 1 – స్పానిష్ ఆహా(AHA): ఫస్ట్ డే ఫస్ట్ షో – తెలుగు డైరీ – తమిళం సన్ నెక్ట్(Sun Nxt): తిరు – తెలుగు, తమిళం వూట్(Voot): షుగర్ లెస్ – కన్నడ సోనీలివ్(SonyLIV): చల్లే ముండియాన్ – పంజాబీ జీ5(Zee5): కళాపురం – తెలుగు అతిథి భూతో భవ – హిందీ సోరియా ద ఫింద్ – పంజాబీ -
ఓటీటీలోకి వచ్చేసిన లైగర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. ఇప్పుడు లైగర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈరోజు(సెప్టెంబర్22)నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. కథేంటంటే..తల్లి కల కోసం కరీంనగర్ నుంచి ముంబై చేరిన ఒక సాదా సీదా కుర్రాడు ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఫైటర్ అయిన ఒక ఇన్స్పిరేషన్ ఈ చిత్రం. పు పాన్ ఇండియా సినిమాగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, సంభాషణలు, ప్రతి పాత్ర తీర్చిదిద్దిన పధ్ధతి, సంగీతం, విజయ్ దేవరకొండ నటన.. అన్నిటినీ ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, లవ్ అన్నీ సమపాళ్లలో కలిసిన ఈ సినిమా చూడడం కుటుంబం మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా "లైగర్". డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే. "లైగర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3dywSjk -
ఫ్లాప్ ఎఫెక్ట్.. అప్పుడే ఓటీటీకి లైగర్, ఆ రోజు నుంచి అక్కడ స్ట్రీమింగ్!
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందనుకు మూవీ టీం అంచనాలను తలకిందులు చేసింది. ఫలితంగా ఈ చిత్రం ఘోరపరాజయం పొందింది. మైక్ టైసన్ వంటి ప్రపంచ చాంపియన్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి నిరూపించింది. చదవండి: నా పాటంటేనా? నేను బాగుంటానని ఇష్టపడుతున్నారా?: సునీత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చింది. ఇదిలా ఉంటే ఏ చిత్రమైన థియేట్రికల్ రిలీజ్ అనంతరం రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. అలాగే లైగర్ కూడా ఓటీటీలోకి రాబోతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించి ఉంటే ఓటీటీకి వచ్చేందుకు కనీసం రెండు నుంచి మూడు నెలలు పట్టేది. ఇటీవల వచ్చిన చిన్న సినిమా రేంజ్‌ను కూడా ఈ మూవీ దాటలేకపోయింది. దీంతో అనుకున్న సమయాని కంటే ముందే లైగర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ కాగా లైగర్ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 22 నుంచి లైగర్‌ను స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్-పూరీ కనెక్ట్స్‌పై బాలీవుడ్ నిర్మాత కరన్ జోహార్-చార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించారు. -
నేరుగా ఓటీటీలోకి తమన్నా కొత్త చిత్రం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
అందానికి మరో పేరు ఉంటే అది తమన్నానే అవుతుంది. అంతగా తన అందాలతో ఉత్తరాది, దక్షిణాది అన్న భేదం లేకుండా యావత్ సినీ ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అవకాశాలు కాస్త తగ్గినా, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమ్మడు ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం బల్లీ బౌన్సర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 23వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రముఖ దర్శకుడు మదూర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, జంగిల్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. కాగా గీత రచయిత డాక్టర్ కృతిక రాసిన వసమాన అనే పాటను గాయకుడు రోషన్ శబాస్టియన్ పాడారు. కాగా ఈ పాటను శనివారం విడుదల చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందనే సంతాషాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇందులో నటుడు సౌరబ్ శుఖియా, అభిషేక్ బజాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. డ్రామా, కామెడీ, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం విడుదల కోసం నటి తమన్నా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కారణం లేడీ బౌన్సర్ పాత్రలో తొలిసారిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించ డమే. అయితే పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హింది భాషల్లో థియే టర్లో కాకుండా డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అవ్వడం విశేషం. -
బబ్లీ చాన్స్ రావడం నా అదృష్టం
‘‘తెలుగు సినిమా అంటే గర్వంగా ఫీలవుతాను. ఎందుకంటే నా ప్రయాణం తెలుగు నుంచే మొదలైంది. రాజమౌళి, సుకుమార్‌గార్లతో పాటు చాలామంది దర్శకులు మన భారతీయ మూలాలకు చెందిన కథలనే తీసుకుంటుంటారు. ఇప్పటికీ మన భారతీయ సినిమాను ఎమోషన్సే నడిపిస్తున్నాయి’’ అన్నారు తమన్నా. మధూర్ భండార్కర్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తమన్నా మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో హరియానాకు చెందిన యువతిగా నటించాను. తొలిసారి లేడీ బౌన్సర్ కాన్సెప్ట్‌తో ఉన్న ఈ సినిమా చేసే చాన్స్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మధూర్ బండార్కర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉత్తరాదిలో కొంతమంది లేడీ బౌన్సర్స్ స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నాను. లేడీ బౌన్సర్‌గా తమన్నా ది బెస్ట్ అనిపించింది’’ అన్నారు మధూర్ భండార్కర్. -
వావ్.. సూపర్ ప్లాన్‌ని తీసుకొచ్చిన జియో.. అదిరిపోయే బెనిఫిట్స్, ఓటీటీ కూడా!
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లను ఆకర్షించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అందుకే టెలికాం రంగంలో టాప్ పోజిషన్లో కొనసాగుతోంది. తాజాగా మరో అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది జియో. ఇందులో అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజువారి డేటా అనేక బెనిఫిట్స్‌తో పాటు ఓటీటీ(OTT) ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ప్రత్యేకంగా ప్రతిరోజూ 3GB డేటా ప్రయోజనాలను అందిస్తోంది. అదిరిపోయే ప్లాన్లు.. - రూ. 419 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడీటీతో 84GB డేటాను అందిస్తుంది. ఇందులో 3GB రోజువారీ డేటా పరిమితి, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్‌కి 3 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. - రూ. 601 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, 3GB రోజువారీ పరిమితితో మొత్తం 90GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇది జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అదనపు 6GB డేటాను కూడా అందిస్తుంది. కస్టమర్లు ఈ ప్లాన్‌తో రూ.499 విలువైన ఒక సంవత్సర డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. - రూ. 1,199 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడీటీ, 3GB రోజువారీ డేటా పరిమితితో మొత్తం 252GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, జియో యాప్ సబ్స్క్రిప్షన్ తోపాటు రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా 3 నెలల (90 రోజులు) అందిస్తుంది. - రూ. 4,199 ప్లాన్: ఈ వార్షిక ప్లాన్‌లో 3GB రోజువారీ డేటా పరిమితితో 1095GB డేటాను అందిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS తో పాటు జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. దానితో పాటుగా ఈ ప్లాన్ ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను రూ. 1499తో అందిస్తుంది. ఇది OTTలోని అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌కు ఉచితంగా చూడవచ్చు. చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో ఎలాన్ మస్క్ .. ఆ ఫొటోకు వేలంలో ఊహించని ధర.. ఎంతంటే? -
ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే..
కరోనా కాలంలో ఓటీటీలకు ప్రేక్షకాదరణ బాగా పెరిగింది. ఇక థియేటర్లో వచ్చిన చిత్రాలను మళ్లీ చూడాలనుకుంటే ఓటీటీలే వేదికగా నిలుస్తున్నాయి. దీంతో తమకు నచ్చిన సినిమాను ఎప్పుడైనా, ఎక్కడైన చూసే వేసులుబాటు కల్పిస్తున్నాయి ఓటీటీలు. ఈ నేపథ్యంలో ఇటీవల బిగ్స్క్రీన్పై సందడి చేసిన పలు చిత్రాలు ఈ రోజు(సెప్టెంబర్ 16న) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటితోపాటు పలు వెబ్‌సిరీస్‌లు కూడా అలరించబోతున్నాయి. అలా ఈ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరి అవేంటో చూద్దామా! ‘సోనిలివ్’లో రామారావు ఆన్‌డ్యూటీ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా నటించారు. జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక చాలా గ్యాప్ అనంతరం నటుడు వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. థియేటర్లో పెద్దగా ఆడని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. సోనీలివ్‌లో ఈ రోజు నుంచే రామారావు ఆన్‌డ్యూటీ స్ట్రీమింగ్ అవుతుంది. ‘హాట్‌స్టార్’లో విక్రాంత్ రోణ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్ రోణ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో జులై 28న గ్రాండ్‌గా రిలీజై సూపర్ హిట్ కలెక్షన్లను రాబట్టింది. అనూప్ భండారీ దర్శకత్వం వహించగా జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈరోజు(శుక్రవారం)నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. మరి బిగ్ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్: దహన్ – సిరీస్ 1(హిందీ) అమెజాన్ ప్రైమ్: గుడ్ నైట్ మమ్మీ – ఇంగ్లీష్ ఆహా: మోసగాళ్లు(తెలుగు) కిరోసిన్(తెలుగు) సోనీ లివ్: కాలేజీ రొమాన్స్ – సిరీస్ 3(హిందీ) జీ5: టైంపాస్ 3 – మరాఠీ నెట్ ఫ్లిక్స్: జోగి – హిందీ అటెన్షన్ ప్లీజ్ – హిందీ ఫైండింగ్ హబ్బీ 2 – ఇంగ్లీష్ ఫేట్: ది వింక్స్ సాగా – సిరీస్ 2(ఇంగ్లీష్) స్కాండల్: బ్రింగింగ్ డౌన్ వైర్ కార్డ్ – డాక్యుమెంటరీ సిరీస్(ఇంగ్లీష్) శాంటో – సిరీస్ 1(స్పానిష్) లవ్ ఈజ్ బ్లైండ్ – సిరీస్ 2(ఇంగ్లీష్) జిమ్నాటిక్స్ అకాడమీ: ఏ సెకండ్ ఛాన్స్ – సిరీస్ 2(ఇంగ్లీష్) డు రివెంజ్ – ఇంగ్లీష్ ఐ యూజ్డ్ టు బి ఫేమస్ – ఇంగ్లీష్ ది బ్రేవ్ వన్స్ – ఇంగ్లీష్ డ్రిఫ్టింగ్ హోమ్ – జాపనీస్ మరి ఇంకేందుకు ఆలస్యం ఇంట్లోనే ఎంచక్కా మీకు నచ్చిన ఈ కొత్త సినిమాలను ఓటీటీల వేదికగా చూసి ఎంజాయ్ చేయండి. -
ఓటీటీలోకి వచ్చేసిన 'విక్రాంత్ రోణ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Vikrant Rona OTT : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్ రోణ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో జులై 28న గ్రాండ్‌గా రిలీజై సూపర్ హిట్ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అనూప్ భండారీ దర్శకత్వం వహించగా జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించింది. సిల్వర్‌స్ర్కీన్‌పై భారీ విజయవంతమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈరోజు(శుక్రవారం)నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. మరి బిగ్ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. The wait is over 🕛 Inspector #VikrantRona is here! Watch #VikrantRonaOnHotstar Streaming Now ▶️ https://t.co/ok2CxJAI9h@KicchaSudeep @anupsbhandari @nirupbhandari @JackManjunath @Asli_Jacqueline @neethaofficial @AJANEESHB @williamdaviddop @shaliniartss pic.twitter.com/0pSL5HRcDR — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 15, 2022 #VikrantRona is streaming now on #DisneyplusHotstar #VikrantRonaOnDisneyplusHotstar pic.twitter.com/Z2psTtmuBq — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) September 15, 2022 -
ఓటీటీ చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ‘మహాభారత్’
మహాభారతం నిజంగా ఒక మహాగ్రంథం. అది చదవడం మొదలు ఎన్నటికీ పూర్తికానంతగా రచన జరిగింది. లెక్కలేనన్ని పాత్రలు, పాత్రధారులు మనకు కనిపిస్తారు. ప్రతి ఒక్క పాత్రకు దానికంటూ ఒక విశిష్టత ఉంటుంది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ గ్రంధాన్ని తెరకెక్కించాలని ఎన్నో నిర్మాణ సంస్థలు, దర్శకులు సన్నాహాలు చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. అయితే ఇది సినిమా కంటే ముందు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ‘మహాభారత్’ రాబోతుంది. అల్లు ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. ‘గ్రేటెస్ట్ ఇతిహాసం- మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడుతుంది. ఒక అద్భుతమైన దృశ్యం కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్‌లో 'మహాభారత్' రాబోతుంది’ అని అడిస్నీ+ హాట్‌స్టార్ సంస్థ ట్వీట్ చేసింది. అల్లు ఫ్యామిలీ ఇటీవలే అల్లు ఎంటర్టైన్మెంట్స్ను ప్రారంభించింది. ఇప్పటికే వారు మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సిరీస్‌కు సహ నిర్మాతలుగా కనిపిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. The greatest epic ever written- retold at a scale never seen before! Stay tuned for an ethereal spectacle- #Mahabharat, is coming soon only on @DisneyPlusHS #HotstarSpecials #Mahabharat #MahabharatOnHotstar @alluents & @MythoStudios pic.twitter.com/5yhs7HvuCC — Disney Star (@starindia) September 10, 2022 -
‘విక్రాంత్ రోణ’ తెలుగు వెర్షన్ ఈ ఓటీటీలోనే? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘విక్రాంత్ రోణ’. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జూలైలో విడుదలై మంచి విజయం సాధించింది. భారీ వసూళ్లను ఇండియన్ బాక్సాఫీసు షేక్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ కన్నడ వెర్షన్‌కు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5(zee5)లో ఈ నెల 2(సెప్టెంబర్ 2న) నుంచి ఈ మూవీ కన్నడ వెర్షన్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చారు. చదవండి: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం, సింగర్ దుర్మరణం ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ తాజాగా బయటకు వచ్చింది. సెప్టెంబర్ 16 నుంచి తెలుగు వెర్షన్ డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంజునాథ్ గౌడ్ నిర్మాత. ఇందులో నిరూప్ భండారి, నీతా అశోక్, రవిశంకర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్నోఅంచాల మధ్య జూలై 28న కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, యలయాళ భాషల్లో విడుదలైంది. కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరడం విశేషం. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్ నోట్ -
డిస్నీ–స్టార్ సంచలన నిర్ణయం.. ఐసీసీ టోర్నీల టీవీ హక్కులను..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లకు సంబంధించి భారత్‌లో టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను మూడు రోజుల క్రితం సుమారు రూ. 24 వేల కోట్లకు డిస్నీ–స్టార్ సొంతం చేసుకుంది. అయితే మంగళవారం ఆ సంస్థ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. క్రికెట్ మ్యాచ్ ప్రసారాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తాము గెలుచుకున్న హక్కుల నుంచి టీవీ హక్కులు ‘జీ’ సంస్థకు (సబ్ లీజ్) బదలాయించింది. దీని ప్రకారం 2024–27 మధ్య కాలంలో ఐసీసీ పురుషుల క్రికెట్ టోర్నీలు, అండర్–19 టోర్నీలు ‘జీ’ చానల్స్‌లో ప్రసారం అవుతాయి. ఇదే కాలానికి డిజిటల్ హక్కులను మాత్రం స్టార్ తమ వద్దే అట్టి పెట్టుకుంది. మరోవైపు మహిళల వరల్డ్ కప్ హక్కులను (టీవీ, డిజిటల్) కూడా పూర్తిగా స్టార్ ఉంచుకుంది. వేలంలో తమతో పోటీ పడి ఓడిన ‘జీ’తో స్టార్ ఒప్పందం చేసుకోవడం విశేషం. భారత్‌లో టీవీ ప్రసారాల ద్వారా క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఇది తమకు లభించిన గొప్ప అవకాశమని ‘జీ’ సంస్థ సీఈఓ పునీత్ వ్యాఖ్యానించారు. ఒకే మార్కెట్‌ను ఇద్దరు పోటీదారులు పంచుకోవడం ఇదే మొదటిసారి. భారత్‌లో మ్యాచ్‌లకు సంబంధించి ఐసీసీ వేలం నిబంధనల్లో విజేత తమ హక్కులను మరొకరికి ఇచ్చుకోవచ్చనే క్లాజ్ కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే వేలం ఖాయం కావడానికి ముందే స్టార్–జీ మధ్య ఒప్పందం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. -
రికార్డులు తిరగరాసిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్
IND VS PAK: ఆసియా కప్ 2022లో భాగంగా నిన్న జరిగిన దాయాదుల సమరం ప్రేక్షకులకు అసలుసిసలైన క్రికెట్ మజాను అందించడంతో పాటు వ్యూయర్షిప్ పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో (డిస్నీ హాట్ స్టార్) ఈ మ్యాచ్‌ను కోటి మందికి పైగా (13 మిలియన్లు) వీక్షించినట్లు సమాచారం. డిస్నీ హాట్ స్టార్ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో అత్యధికంగా వీక్షించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌గా కూడా నిలిచింది. 1.3 Crores highest peak viewership was recorded during IND vs PAK game on hotstar.#AsiaCup #AsiaCup2022 #INDvsPAK pic.twitter.com/S1PrTUhbs1 — Dr. Cric Point 🏏 (@drcricpoint) August 28, 2022 ఓటీటీలో ఇప్పటివరకు అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన మ్యాచ్ రికార్డు ఐపీఎల్ మ్యాచ్ పేరిట ఉంది. 2019 ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 18 మిలియన్ల మంది వీక్షించారు. ఓటీటీ చరిత్రలో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానం కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పేరిటే ఉండింది. అదే సీజన్లో ఆర్సీబీ-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌కు 12 మిలియన్ల వ్యూయర్షిప్ లభించింది. తాజాగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్ ఈ రికార్డును బద్దలు కొట్టిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నిన్న (ఆగస్ట్ 28) పాక్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో భారత్..దాయాదిపై పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచింది. హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించగా.. భువీ, కోహ్లి, జడేజాలు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: పాక్ ఓటమికి అది కూడా ఒక కారణమే..! -
ICC media rights: రూ. 24 వేల కోట్లకు...
దుబాయ్: భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అన్ని మ్యాచ్‌ల హక్కులను డిస్నీ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. శుక్రవారం వేలం నిర్వహించగా... దీనిని ఐసీసీ శనివారం అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల కాలానికి (2024–2027) ఈ హక్కులు వర్తిస్తాయి. టీవీ, డిజిటల్ హక్కులు రెండింటినీ సొంతం చేసుకున్న డిస్నీ... ఇందు కోసం సుమారు 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 24 వేల కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. ఈ మొత్తంపై ఐసీసీ ప్రకటనలో వెల్లడించకపోయినా... గత హక్కులతో పోలిస్తే భారీ పెరుగుదల వచ్చినట్లు మాత్రం పేర్కొంది. హక్కుల కోసం డిస్నీతో పాటు సోనీ, వయాకామ్, జీ సంస్థలు కూడా పోటీ పడినా... వారెవరూ కూడా రూ. 20 వేల కోట్లకు మించి ఇచ్చేందుకు సిద్ధపడలేదని తెలిసింది. ఐసీసీ ఇచ్చిన హక్కుల్లో పురుషుల, మహిళల వన్డే, టి20 వరల్డ్‌కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీతో పాటు అండర్–19 ప్రపంచకప్ కూడా ఉంటాయి. డిస్నీ స్టార్ వద్ద ఇప్పటికే ఐపీఎల్, బీసీసీఐ, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మ్యాచ్‌లతో పాటు ఆస్ట్రేలియా బోర్డు డిజిటల్ హక్కులు కూడా ఉన్నాయి. అమెరికా, ఇంగ్లండ్‌లలో హక్కుల కోసం క్రిస్మస్కు ముందు ఐసీసీ మరోసారి వేలం నిర్వహించే అవకాశం ఉంది. -
లైగర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!.. ఎప్పుడంటే
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓటీటీ రైట్స్‌ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది.సినిమా రిలీజ్‌కు ముందే ఈ డీల్ కుదుర్చుకుంది.సాధారణంగా కొత్త సినిమాలు 50రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నాయి. దీన్ని బట్టి అక్టోబర్ తొలివారంలో లైగర్ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ ఏం చేశాడో తెలుసా? -
ICC Media Rights Auction: ఎన్ని వేల కోట్లో!
దుబాయ్: క్రికెట్‌కు కామధేనువు భారత మార్కెట్ నుంచి భారీగా ఆర్జించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. వచ్చే ఎనిమిదేళ్లలో (2023–2031 మధ్య) జరిగే ఐసీసీ టోర్నీలను భారత్‌లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. ఐపీఎల్ వేలం ద్వారా బీసీసీఐ జాక్‌పాట్ కొట్టడంతో ఇప్పుడు అదే తరహాలో ఐసీసీ వేలం నిర్వహించనుంది. టీవీ, డిజిటల్, టీవీ అండ్ డిజిటల్ అంటూ మూడు వేర్వేరు కేటగిరీల కోసం వేలం జరుగుతుంది. నాలుగేళ్ల కాలానికి లేదా ఎనిమిదేళ్ల కాలానికి హక్కులను కేటాయిస్తారు. 2023–2031 మధ్య పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 22 ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. వన్డే, టి20 ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ, అండర్–19 వరల్డ్‌కప్‌లు కూడా ఇందులో భాగమే. హక్కులను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా ఐదు కంపెనీలు బరిలో నిలిచాయి. డిస్నీ స్టార్, సోనీ, జీ, వయాకామ్, అమెజాన్ సంస్థలు వేలంలో పెద్ద మొత్తం చెల్లించేందుకు పోటీ పడనున్నాయి. మొత్తంగా ఒక్క భారత మార్కెట్ నుంచి ఐసీసీ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆశిస్తోంది. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్‌న్యూస్ -
ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడో తెలుసా?
OTT Releases: 18 Movies And Web Series: కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడగలవు అని ఇటీవల కాలంలో చాలా బాగా అర్థమైపోయింది సినీ విశ్లేషకులకు. అది థియేటర్ అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినా.. మంచి కథ, కథనంతో వచ్చే చిత్రాలనే సినీ ప్రియులు ఆదరిస్తున్నారు. అందుకు సీతారామం, బింబిసార, కార్తికేయ 2 చిత్రాలే నిదర్శనం. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిన్న సినిమా, పెద్ద చిత్రం అనే తేడా లేకుండా ఓటీటీలోనూ రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కంటే ఓటీటీల్లోనే ఎక్కువగా రిలీజవతున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీలో కేవలం ఆగస్టు 19న ఏకంగా 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఆ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, ఓటీటీలు ఏంటీ? అని ఓ లుక్కేద్దామా ! నెట్‌ఫ్లిక్స్ ►ది నెక్ట్స్ 365 డేస్ ►ది బిస్ బాస్ (డ్యాక్యుమెంటరీ సిరీస్) ►ది గర్ల్ ఇన్ ది మిర్ర్ (వెబ్ సిరీస్) ►కియో (వెబ్ సిరీస్) ►గ్లో అప్ (వెబ్ సిరీస్) ►ది కప్ హెడ్ షో (వెబ్ సిరీస్) ►ది అసిస్టెంట్ (వెబ్ సిరీస్) ►ద్విండిల్ ►ఎకోస్ (వెబ్ సిరీస్) జీ5 ►దురంగ (వెబ్ సిరీస్) ►యానై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ►హెవెన్ ఆహా ►హైవే ►జీవీ2 సోనీ లివ్ ►తమిళ్ రాకర్స్ వూట్ ►బైరాగి లయన్స్ గేట్స్ ప్లే ►మైనస్ వన్ (వెబ్ సిరీస్) హాయ్ చోయ్ ►కారాగార్ (వెబ్ సిరీస్) -
'డేజావు' కాన్సెప్ట్‌తో నవీన్ చంద్ర 'రిపీట్'.. నేరుగా ఓటీటీలో
Naveen Chandra Repeat Movie Sneak Peek Video Out: థియేటర్, ఓటీటీ అని సంబంధం లేకుండా తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలను అన్నింటినీ చేసుకుంటూ పోతున్నాడు నటుడు నవీన్ చంద్ర. ఇటీవలే పరంపర రెండో సీజన్లో సీరియస్ పాత్రలో అదరగొట్టిన ఈయన తాజాగా మరో కొత్త సినిమాతో అలరించబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిపీట్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతోంది. ఆగస్టు 25 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్ ఇటీవల ప్రకటిస్తూ ట్రైలర్ కూడా విడుదల చేసింది. తాజాగా రిపీట్ స్నీక్ పీక్ పేరిట మూడున్నర నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్ చేశారు. ''ఈ వీడియోలో ఒక రైటర్ ఏదో సీరియస్‌గా రాస్తుంటాడు. ఎదురుగా చిరాకుగా ఉన్న ఒకామె అతన్ని చూసి ఏం రాశాడో చదవమని ఒకరికి సైగ చేస్తుంది. ఆ పేపర్ తీసుకున్న వ్యక్తి చదివాక వెంటనే ఆమె విక్రమ్‌కి కాల్ చేయండి అని అంటుంది. ఫోన్ కాల్ మాట్లాడిన విక్రమ్‌కు ఒక బ్రిడ్జి కింద నీటిలో అమ్మాయి మృతదేహం దొరుకుతుంది.'' అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ రైటర్ ఎవరు? అతను రాసినట్లుగా ఎందుకు జరిగింది? పోలీసులు అతని మాటలు ఎందుకు నమ్మారు? అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 25 వరకు ఆగాల్సిందే. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ ఇక సినిమా విషయానికొస్తే అరవింద శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రిపీట్'. నవీన్ చంద్ర, మధుబాల, అచ్యుత్ కుమార్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళ్ మూవీ 'డేజావు'కు రీమేక్‌గా రానుంది. ఈ సినిమాలో డేజావు (ప్రస్తుతం జరుగుతున్న విషయం ఇంతకుముందే జరిగినట్లుగా అనిపించే అనుభూతి) ప్రధానాంశంగా ఉండి, ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందని డైరెక్టర్ అరవింద శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం
ముంబై: భారత్‌లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్–18, సోనీ, జీ నెట్వర్క్ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి. టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు. అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్‌లలో పాల్గొనే భారత క్రికెట్ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు. -
డిస్నీప్లస్ హాట్ స్టార్ లో "వారియర్" స్ట్రీమింగ్..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "ది వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో రామ్ కి జోడీగా యంగ్, టాలెంటెడ్, మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తున్నారు. పందెం కోడి, ఆవారా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం సినిమాలు అందించిన దర్శకుడు లింగుస్వామి ఈ విభిన్నమైన కథకి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలిపి ఒక పండగ భోజనంలా వడ్డించారు. డాక్టర్ నుంచి పోలీస్ గా మారడం అనే ఆలోచన తెలుగు ప్రేక్షకులకు కొత్త. దర్శకుడు లింగుసామి ఆ ప్రయత్నాన్ని కమర్షియల్ సక్సెస్ చేశారు. ఇక డీఎస్పీ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎక్కడవిన్నా ఈ పాటలు మారుమోగిపోతున్నాయి. ప్రేక్షకులకు నచ్చే మరెన్నో విషయాలు వున్న ఈ మంచి ఫామిలీ ఎంటర్ టైనర్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మిస్ కాకుండా చూడండి. స్ట్రీమింగ్ ఇప్పటికే మొదలైంది. "వారియర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సినిమా చూపిస్త మావా.. వడివడిగా ఓవర్ ది టాప్ అడుగులు
కంటికి కనిపించని కరోనాను తీసుకువచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన 2020.. మానవాళి జీవన శైలిని సమూలంగా మార్చివేసింది. అనేక అలవాట్లను, పోకడలను పరిచయం చేసింది. వర్క్ ఫ్రం హోంలు, ఆన్లైన్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్‌లు లాంటి వాటన్నింటినీ అలవాటు చేసింది. అదే సంవత్సరం మరో పరిణామానికి నాంది పలికింది. అది స్ట్రీమింగ్ సర్వీసుల వెల్లువ. మనం ఓటీటీ సర్వీసుగా పిలుచుకునే ఈ సేవల విజృంభణకు కరోనా కూడా ఓ ప్రధాన కారణమయ్యింది. థియేటర్ల మూత, బయట తిరగలేని పరిస్థితి, వర్క్ ఫ్రం హోంలతో ఇంటికి పరిమితమైన జనాభాకు వినోదం అందించేందుకు ఓ కొత్త మార్గాన్ని ఆవిష్కరించిందీ ఓటీటీ సర్వీసు. కేబుల్ కనెక్షన్, బ్రాడ్కాస్ట్ పరికరాలు, శాటిలైట్ కనెక్షన్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ ద్వారా మన దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ లాంటి ఎలాంటి పరికరం ద్వారా అయినా వినోదాన్ని అందించేదే ఈ స్ట్రీమింగ్ సర్వీసు. సినిమాతో మొదలై టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్ట్రీమింగ్ల వరకు విస్తరించిన ఈ ఓటీటీ రంగం త్వరలో టెలివిజన్ రంగాన్ని మించి పోయే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పేరుకు తగ్గట్టుగా ఓటీటీ (ఓవర్ ది టాప్) అన్ని వినోద రంగాల్ని అధిగమించబోతోంది. వీడియో వచ్చి రేడియోను మరిపించినట్లుగా ఓటీటీ ఇప్పుడు డిష్ చానళ్లను కనుమరుగు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కేబుల్ కనెక్షన్లకు స్వస్తి చెప్పి ఓటీటీ సర్వీసుల్లో సభ్యులుగా చేరిపోయారు. ఓటీటీ సేవల విస్తృతి గమనిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. 2019 నాటికి 190 కోట్ల మంది సభ్యులు కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ 2020కి 210 కోట్లు, 2021 నాటికి 220 కోట్లు లెక్కన 2025 నాటికి 270 కోట్ల సభ్యులను సమకూర్చుకోబోతోంది. ఇది ఆఫ్రికా ఖండం జనాభాకు దాదాపుగా రెట్టింపు కాబోతోంది. సభ్యత్వ రుసుము ద్వారా ఈ సంస్థలు ఆర్జిస్తున్న ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. 2019లో 8,300 కోట్ల డాలర్లు ఉండగా 2020 నాటికి అది 9,900 కోట్ల డాలర్లకు పెరిగి 2025 నాటికి 16700 కోట్ల డాలర్లకు పెరగనున్నట్లు అంచనా. అంటే శ్రీలంక, నేపాల్ జీడీపీలను కలిపినా ఈ మొత్తం ఎక్కువే. దీనంతటకూ కారణం బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ పెరగడం, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, చెల్లించే రుసుము తక్కువ కావడం కొన్ని కారణాలైతే విపరీతంగా పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు మరో పెద్ద కారణం. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కడున్నా నచ్చిన సినిమా లేదా సీరియల్‌ను వీక్షించే వీలుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 664 కోట్లు స్మార్ట్ ఫోన్లు అంటే.. 83.89 శాతం మంది వద్ద ఫోన్లు ఉన్నట్లు జోరాం అనే సంస్థ నివేదిక. 2026 నాటికి 130 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ కనెక్షన్ పొందనున్నట్లు మొబైల్ ట్రేడింగ్ సంస్థ జీఎస్ఎమ్ఏ అంచనా. లెక్కలేనన్ని చానల్స్ సినిమా, మ్యూజిక్, వెబ్‌సిరీస్, స్పోర్ట్స్ లాంటి అన్ని రకాల వినూత్న వినోద క్రీడా రంగాలకు సంబంధించి ఓటీటీ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని చానెల్స్‌లో చిన్న పిల్లలకు కూడా వినోదం అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 300కుపైగా ఓటీటీ చానెల్స్ ఉన్నాయి. అమెరికా జనాభా 75శాతం మంది రెండు లేదా ఆపైన ఓటీటీ చానల్స్ సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. ఒక్క నెట్‌ఫ్లిక్స్‌కే అమెరికా జనాభాలో 30శాతం మంది సభ్యులు. కోవిడ్ పుణ్యమా అని కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. జర్మనీలోని బూట్సాస్ అనే మ్యూజిక్ నైట్ క్లబ్ ఏకంగా బాట్సాస్ లైవ్ అనే ఓటీటీ చానెల్ ప్రారంభించి సభ్యుల కోసం లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. పికాక్ అనే సంస్థ టోక్యో ఒలింపిక్స్ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ చానెల్ ప్రారంభించి అన్ని రకాల క్రీడా పోటీలను లైవ్‌గా ప్రసారం చేసింది. ఎన్ని చానెల్స్ ఉన్నా ఓటీటీ రంగంలోకి తొలి అడుగు వేసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికీ టాప్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కి నెలవారీ ఫీజు చెల్లించే 22.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియోకు 20.5 కోట్లు, స్పాటిఫైకి 18 కోట్లు , డిస్నీ ప్లస్‌కి 13 కోట్లు, హెచ్‌బీవో మ్యాక్స్‌కి 8.5 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. అక్కడ ఫ్లాప్.. ఇక్కడ హిట్... పాత సినిమాలు, టీవీ సీరియల్స్ కొనుగోలు చేసి ప్రసారం చేయడం ద్వారా వ్యాపారం ప్రారంభించిన ఈ స్ట్రీమింగ్ చానల్స్ ఇప్పుడు సొంత సినిమాలు, సీరియల్స్ నిర్మిస్తు న్నాయి. టీవీలో ఫ్లాప్ అయిన సీరియల్స్ ఓటీటీలో బంపర్‌హిట్ అవుతున్నాయి. స్పానిష్ థ్రిల్లర్‘మనీహైస్ట్’ టీవీలో ఫ్లాప్ షోగా ముద్ర వేయించుకుని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ చానల్లో ప్రత్యక్షమై బ్రహ్మాండంగా హిట్టయ్యింది. నెట్‌ఫ్లిక్స్ 2020లో సొంత సినిమాలు, సీరియల్స్ కోసం 1,700 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఈ సంస్థ దగ్గర ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ కలిపి 6,000 టైటిల్స్ ఉన్నాయి. అందులో 40 శాతం సొంత ప్రొడక్షనే. డిస్నీ దగ్గర అయితే 2500 టీవీ సీరియల్స్‌కు సంబంధించిన 55,000 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత టామ్ హంక్స్, ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ కలసి రెండో ప్రపంచయుద్ధంపై హెచ్‌బీవో కోసం సిరీస్ నిర్మిస్తున్నారు. దీనికోసం బ్రిటన్‌లో ఇప్పటికే ఒక కృత్రిమ వైమానిక స్థావరాన్ని నిర్మించారు. విలీనపర్వం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో పోటీ పడేందుకు వివిధ టీవీ, ఓటీటీ సంస్థలు విలీనబాట పడుతున్నాయి. మీడియా రంగంలో మెగా సంఘటనగా పేర్కొంటున్న అతి పెద్ద విలీనం ఈ ఏడాది చివరికి జరగబోతోంది. ఏటీ అండ్ టీ, హెచ్‌బీవో, సీఎన్ఎన్, వార్నర్ మీడియా, డిస్కవరీ, యానిమల్ప్లానెట్, టీఎల్సీ కలసి ఒకే గొడుగు కిందకి రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే హాలీవుడ్ మెగా సంస్థ ఎంజీఎంను కొనుగోలు చేసింది. బ్రిటన్‌లో బీబీసీ, ఐటీవీ, చానెల్ఫోర్ కలసి ‘బ్రిట్బాక్స్’ అనే స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. జర్మనీలో డిస్కవరీ, మరో మాస్ మీడియా సంస్థతో కలసి జోయిన్గా అవతరించాయి. స్పెయిన్‌లో అట్రెస్ మీడియా, మీడియా సెల్, ఆర్టీవీ కలసి లవ్స్ టీవీనీ ఏర్పాటు చేశాయి. నెట్‌ఫ్లిక్స్ వీడియో, గేమింగ్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు నైట్స్కూల్ స్టూడియోను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్
న్యూఢిల్లీ: వినియోగదారులకు కోసం టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్రీడం ఆఫర్‌ను లాంచ్ చేసింది. రూ. 2,999 ల వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఇందులో అపరిమిత కాలింగ్, 365 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. (Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?) రూ. 2,999 ల వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్, ఆఫర్లు 75 జీబీ అదనపు డేటా ప్రయోజనం ఏడాది డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ జియో సెక్యూరిటీ జియో సినిమా JioTV JioCloud అజియోపై రూ. 750 తగ్గింపు నెట్‌మెడ్స్‌పై రూ. 750 తగ్గింపు ఇక్సిగోపై రూ.750 తగ్గింపు ఇది కూడా చదవండి: CAG Report: 21వేల ట్రస్టులకు కోట్లాది రూపాయల టాక్స్ మినహాయింపులు -
డిస్నీ–స్టార్‌తో సీఏ ఒప్పందం
మెల్బోర్న్: భారత ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ‘డిస్నీ–స్టార్’తో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సుదీర్ఘ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే క్రికెట్ మ్యాచ్‌ల్ని భారత్‌లో ఏడేళ్లపాటు ప్రసారం చేసే ఒప్పందాన్ని డిస్నీ స్టార్‌తో కుదుర్చుకుంది. వచ్చే సీజన్ (2023–24) నుంచి ఒప్పందంలో భాగంగా ఆసీస్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్), మహిళల బీబీఎల్ టోర్నమెంట్లను భారత్‌లో డిస్నీ–స్టార్ నెట్వర్క్ ప్రసారం చేస్తుంది. ప్రస్తుతం సోనీ నెట్వర్క్ వద్ద సీఏ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులున్నాయి. 2017–18 సీజన్ నుంచి సోనీ చానెళ్లు ఆస్ట్రేలియా మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్నాయి. క్రికెట్ క్రేజ్ ఉన్న భారత్‌లో తమ మ్యాచ్‌ల ఆదరణ మరింత పెరిగేందుకు స్టార్ నెట్‌వర్క్‌తో ఒప్పందం దోహదం చేస్తుందని సీఏ సీఈఓ నిక్ హాక్లీ తెలిపారు. -
ఓటీటీ హావా.. ఈ ఒక్క రోజే ఏకంగా 13 సినిమాలు సందడి
ప్రస్తుతం ఓటీటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లోనే హాయిగా ఈ డిజిటల్ స్క్రీన్‌పై కొత్త కొత్త సినిమాలన్ని చూసేయచ్చు. అందుకే చాలా మంది ప్రేక్షకులు ఓటీటీకిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతూ సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. ప్రతి వారం ఏదోక కొత్త, పెద్ద సినిమాలను పలు ఓటీటీ సంస్థలు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఒక వారంలో పదికి పైగా సినిమాలు రిలీజ్ అవ్వడం చూశాం. కానీ, నేడు ఒక్కరోజే 13 సినిమాలు/వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుండటం విశేషం. అందులో తెలుగుతో పాటు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు సైతం ఉన్నాయి. మరి ఈ రోజు (జూలై 22న) స్ట్రీమింగ్ కాబోతున్న 13 సినిమాలు/వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం! నెట్ ఫ్లిక్స్: F3 – తెలుగు మూవీ ది గ్రే మ్యాన్ మూవీ: ఇంగ్లీష్‌తో పాటు 5 భారతీయ భాషల్లో బ్లౌన్ అవే (ఇంగ్లీష్ సిరీస్, సీజన్ 3) అమెజాన్ ప్రైమ్ వీడియో: ఎనీథింగ్ పాసిబుల్: (ఇంగ్లీష్ మూవీ) జీ5 నోడి స్వామి ఇవను ఇరోదే హీగే (కన్నడ మూవీ) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇన్ ది సూప్: ఫ్రెండ్కాషన్ (కొరియన్ సిరీస్) ఘర్ వ్వాపసీ: (హిందీ సిరీస్) సోనీ లివ్: మీమ్ బాయ్స్ (తమిళం సిరీస్) డాక్టర్ అరోరా (హిందీ సిరీస్) F3 : తెలుగు మూవీ ఆహా: ఏజెంట్ ఆనంద్ సంతోష్: తెలుగు సిరీస్) వూట్: ఫిజిక్స్ టీచర్ (కన్నడమూవీ) మాస్టర్ చెఫ్ (US సిరీస్ సీజన్ 11) ఎంఎక్స్ ప్లేయర్: రుహనీయత్ (హిందీ సిరీస్ సీజన్ 2) చదవండి: Samantha Coffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్’గా తమన్నా.. -
Parampara 2 Review: ఎమోషనల్ ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా 'పరంపర 2'..
టైటిల్: 'పరంపర 2' వెబ్ సిరీస్ నటీనటులు: నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఇషాన్, ఆకాంక్ష సింగ్, ఆమని,రవి వర్మ, బిగ్‌బాస్ దివి తదితరులు కథ: హరి ఏలేటి మాటలు: హరి ఏలేటి, కృష్ణ విజయ్ ఎల్ సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్ ఎడిటింగ్: తమ్మిరాజు సంగీతం: నరేష్ కుమరన్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల విడుదల తేది: జులై 21, 2022 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎపిసోడ్స్ 5 గతేడాది విడుదలై సినీ లవర్స్‌ను, నెటిజన్లను విశేషంగా అలరించిన తెలుగు వెబ్ సిరీస్‌లలో ఒకటి 'పరంపర'. డిసెంబర్ 24, 2021న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌లోని రివేంజ్, ఎమోషన్స్‌ను ఇంకాస్తా పెంచుతూ రెండో సీజన్‌ను తాజాగా విడుదల చేశారు. యంగ్ హీరో నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన 'పరంపర 2' వెబ్ సిరీస్ జులై 21న విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: తను ప్రేమించిన అమ్మాయి రచన (ఆకాంక్ష సింగ్) పెళ్లి సురేష్ (ఇషాన్)తో జరగడం సహించలేని గోపి కృష్ణ ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు. పెళ్లిలో లైసెన్స్ లేని తుపాకీని వాడినందుకు గోపికి మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. అయితే బాబాయి నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) క్షమాపణ చెబితే బయటకు తీసుకువస్తానని గోపి తండ్రి మోహన్ రావు (జగపతి బాబు)కు చెబుతాడు. తండ్రి సారీ చెప్పమని అడిగిన గోపి ఇష్టపడడు. తర్వాత పరిచయమైన రత్నాకర్ (రవి వర్మ) ద్వారా బెయిల్‌పై బయటకొస్తాడు గోపి. అలా వచ్చిన గోపి ఏం చేశాడు? బాబాయి నాగేంద్ర నాయుడిపై రివేంజ్ తీసుకున్నాడా? తన తండ్రి స్థానాన్ని అతనికి దక్కేలా చేశాడా? గోపిని నాగేంద్ర నాయుడు, సురేష్ ఏ మేరకు ఎదుర్కోగలిగారు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'పరంపర 2' చూడాల్సిందే. విశ్లేషణ: పరంపర సీజన్ 2 అర్థం కావాలంటే ముందుగా సీజన్ 1 కచ్చితంగా చూడాల్సిందే. లేకుంటే ఆ పాత్రల ఎమోషన్‌ను అర్థం చేసుకోలేరు. ఇక మొదటి సీజన్‌తో పోల్చి చూస్తే సిరీస్ నిడివిని చాలా వరకు తగ్గించేశారు. దీంతో తొలి సీజన్లోలాగా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫాస్ట్‌గా స్టోరీ వెళ్తుంది. స్క్రీన్‌ప్లే, నేరేషన్ రేసీగా ఉన్న తొలి సీజన్ చూసిన ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది. డైరెక్ట్‌గా రెండో సీజన్ చూసేవాళ్లకు మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే మొదటి సీజన్‌లోని లోపాలని సరిచేసుకునేలా రెండో సీజన్ నిడివి విషయంలో డైరెక్టర్స్, రైటర్స్ విజయం సాధించారనే చెప్పవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినా తర్వాత నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక చివరి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా మూడో సీజన్ గురించే ఇచ్చే లీడ్ ఆకట్టుకునేలా ఉంది. ఎమోషన్స్‌తో కాకుండా ఆలోచనతో నాగేంద్ర నాయుడిని పడగొట్టేందుకు గోపి వేసే ప్లాన్స్ బాగున్నాయి. అయితే గోపి, నాగేంద్ర నాయుడి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ రన్నౌతుంటుంది. ఈ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఇలాంటి తరహా సినిమాలు ఇప్పటికే చాలా రావడంతో కొంచెం రొటీన్ కథలా ఫీల్ అవ్వాల్సివస్తుంది. హరి ఏలేటి, కృష్ణ విజయ్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మాటలు తక్కువ ఉన్నా భావం ఎక్కువగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్స్ మిస్ చేశారనిపిస్తుంది. ఎస్పీ పరశురామ్, జెన్నీ మిస్సింగ్‌లపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వాటిగురించి తర్వాతి సీజన్లో చెప్పొచ్చేమో. ఇది చదవండి: ఇప్పుడే ప్రారంభమైన అసలు 'పరంపర'.. మొదటి సీజన్ రివ్యూ.. ఎవరెలా చేశారంటే? నవీన్ చంద్ర కెరీర్‌కు ఈ పాత్ర ఎంతో ఉపయోగపడేలా ఉంది. గోపి పాత్రకు నవీన్ చంద్ర పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్, ఆవేశం, ఆలోచనలను కళ్లతో చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఇక జగపతి బాబు, శరత్ కుమార్‌లు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. సింపుల్‌గా మంచి వ్యక్తిగా ఉంటూనే కొడుకు కోసం ఏమైన చేసే తండ్రిగా పవర్ఫుల్ నటన కనబర్చారు జగపతి బాబు. కొన్ని సీన్లలో ఆయన స్టైలిష్ యాక్టింగ్ అలరిస్తుంది. అలాగే శరత్ కుమార్ కూడా స్టైలిష్ లుక్‌లో విలన్‌గా మెప్పించారు. ఇక ఆకాంక్ష సింగ్, ఆమని, ఇషాన్, కస్తూరి తమ పాత్రల పరిధిమేర నటించారు. రెండో సీజన్లో రవి వర్మ, బిగ్‌బాస్ దివి పాత్రలు కొత్తగా వచ్చాయి. రవి వర్మ పాత్ర కనిపించింది కాసేపైన ఎఫెక్టివ్‌గా ఉంటుంది. దివి పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే స్టోరీ రొటీన్‌గా ఉన్న ఆసక్తికరమైన పొలిటికల్ మూమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్ డ్రామాతో 'పరంపర 2' ఆకట్టుకుంటుంది. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
పరంపర సీజన్-2 వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పరంపర..గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌కు కొనసాగింపుగా రెండవ సీజన్ రాబోతుంది. పరంపర-2గా వస్తున్న వెబ్‌సిరీస్ జులై21 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న "పరంపర సీజన్ 2" ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఎవరికోసమో మొదలుపెట్టిన యుద్ధం.. దేనికోసం అనే ప్రశ్న దగ్గర ఆగితే.. దానికి అసలైన సమాధానమే "పరంపర" సీజన్ 2. పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం ఈ సీజన్-2. ప్రేమ, ప్రతీకారాల మధ్య నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే "పరంపర" సీజన్ 2 చూడాల్సిందే. సో డోంట్ మిస్. పరంపర సీజన్-2ని డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://bit.ly/3cue9Vc -
తండ్రి కోసం కొడుకు చేసే యుద్ధమే ఈ సిరీస్: నవీన్ చంద్ర
Naveen Chandra About His Role In Parampara 2: హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్.. ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. నవీన్ చంద్ర 'గోపీ' పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'పరంపర'. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ విశేషాలను పంచుకున్నారు నవీన్ చంద్ర. - పరంపర వెబ్ సిరీస్ మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది. తొలి భాగంతో పాటు సెకండ్ సీజన్ కూ అప్పుడే సన్నాహాలు ప్రారంభించాం. అందుకే ఇంత త్వరగా సెకండ్ సీజన్ ను మీ ముందుకు తీసుకురాగలిగాం. దీనికి ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ముందు చూపే కారణం. ఫస్ట్ సీజన్ హిట్టయితే తప్పకుండా సెకండ్ సీజన్ కు క్రేజ్ ఉంటుందని వాళ్లు సరిగ్గానే అంచనా వేశారు. - ఈ వెబ్ సిరీస్ లో గోపి అనే పాత్రలో నటించాను. పొలిటికల్ రివేంజ్ డ్రామా ఇది. నా క్యారెక్టర్ ఈ సెకండ్ సీజన్ లోనే పవర్ ఫుల్ గా మారుతుంది. ఫస్ట్ సీజన్ లో శరత్ కుమార్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ సీజన్ లో నేను అతని మీద పైచేయి సాధిస్తాను. తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు ప్రతిష్టలను తిరిగి నాన్నకు ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే ఈ వెబ్ సిరీస్. తండ్రిని పరాజితుడిగా చూడలేకపోతాడు గోపి. నాన్న కోల్పోయినవన్నీ తిరిగి ఇప్పించేందుకు ఫైట్ చేస్తుంటాడు. - ఈ వెబ్ సిరీస్ లో ఆరేడు పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నాకు ఇలాంటి కథలంటే చాలా ఇష్టం. హీరోకు స్కోప్ ఉండి మిగతా పాత్రలు తేలిపోతే అందులో ఆసక్తి ఉండదు. అన్ని క్యారెక్టర్స్‌కు నటించేందుకు అవకాశం ఉండాలి. అప్పుడే కథ బాగుంటుంది. మొదటి సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సిరీస్ ను ఇంకా జాగ్రత్తగా అన్ని ఎమోషన్స్ కలిపి చేశాం. - రామ్ చరణ్ మా సిరీస్ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. స్టార్స్ తో ప్రమోషన్ చేస్తే దాని రీచింగ్ వేరుగా ఉంటుంది. కోవిడ్ వల్ల థియేటర్స్ కు దూరమైన ప్రేక్షకులు ఓటీటీని ఎక్కువగా ఆదరించడం మొదలుపెట్టారు. మధ్యలో మళ్లీ థియేటర్లకు వెల్లారు. ఇప్పుడు ఓటీటీపై ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్ ఎక్కడున్న వాళ్ల ఆదరణ దక్కుతుందని నా నమ్మకం. - నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదులుకోను. నా మొదటి చిత్రం 'అందాల రాక్షసి'తో గుర్తింపు దక్కింది. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత వీర రాఘవ'లో నటించినప్పుడు మరోసారి ఫేమ్ అయ్యాను. ఎన్టీఆర్ ఆ సినిమా ఫంక్షన్ స్టేజీ మీదే నా పాత్ర గురించి, నెను ఎంత బాగా నటించాను అనేది చెప్పారు. అది ఇండస్ట్రీలో బాగా రీచ్ అయ్యింది. - నేను విలన్ పాత్రల్లో నటించినా మీ విలనీ బాగుంది అంటారు. గ్రే క్యారెక్టర్స్ చేసినా బాగుంటుంది అని చెబుతుంటారు. ప్రేక్షకుల నుంచి వచ్చేది స్పందన నిజాయితీగా ఉంటుంది. నేను అది ఎక్కువగా తీసుకుంటాను. సోషల్ మీడియా ద్వారా కూడా అన్నా, మీ క్యారెక్టర్ బాగుంది అని కామెంట్స్ చేస్తుంటారు. 'విరాటపర్వం'లో నా రోల్ పెంచాల్సింది అనే కామెంట్స్ వచ్చాయి. - నటుడిని అయ్యేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నాలో నటన మీద ఎలాంటి ఇష్టం ఉందో, ఇప్పటికీ అదే ఆసక్తి , ఉత్సాహం ఉన్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా వెబ్ సిరీస్ ఏది చేసినా నటుడిగా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాను. -
ఓటీటీలోనూ 'విక్రమ్' సరికొత్త రికార్డు..
Kamal Haasan Vikram New Record In OTT: ఉలగ నాయగన్ కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత 'విక్రమ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పవర్ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. జులై 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైన 'విక్రమ్' రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో 'బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్' సాధించిందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న 'ఓపెనింగ్ వ్యూస్' రికార్డును ఈ మూవీ తిరగరాసిందని తెలిపారు. ఇంకా హైయెస్ట్ స్ట్రీమింగ్‌తో (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో) ఈ సినిమా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విజయం పట్ల కమల్ హాసన్ కూడా స్పందించారు. ''డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా 'విక్రమ్' ప్రతీ ఇంటికి చేరడం ఆనందంగా ఉంది. ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విక్రమ్ బృందానికి శుభాకాంక్షలు'' అని తెలిపారు. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. Consider this your sign to watch #VikramOnHostar now! pic.twitter.com/Me6UamDUhn — Disney+ Hotstar (@DisneyPlusHS) July 12, 2022 Thank you for all your love. You can now enjoy Vikram on @DisneyPlusHS . https://t.co/5HSjLWiBHO@Dir_Lokesh @RKFI @turmericmediaTM @DisneyPlusHS @disneyplusHSTam @DisneyPlusHSTel @DisneyplusHSMal — Kamal Haasan (@ikamalhaasan) July 7, 2022 -
ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ !
Did Kajol Taking 5 Crore Remuneration: అందంతో పాటు అభినయంతో అభిమానుల మనసును కొల్లగొట్టింది బాలీవుడ్ దివా కాజోల్. 90 దశకంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన కాజోల్ హిందీ చిత్రపరిశ్రమను ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ 47 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు అందంలో పోటీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో వివాహం తర్వాత సైతం అడపాదడపా సినిమాలు చేస్తూనే ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ఇప్పటికే వెండితెరపై మెరిసిన స్టార్ హీరోయిన్లందరూ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కాజోల్ కూడా చేరిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అందిస్తోన్న ఓ థ్రిల్లర్ షోతో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టనుంది. కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉన్న ఈ షో సోమవారం (జులై 11) ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ షోలో ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్ల పారితోషికాన్ని తీసుకోనుందట కాజోల్. ఈ విషయంపై బాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ థ్రిల్లర్ షోకు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా కాజోల్ ప్రస్తుతం నటి రేవతి డైరెక్షన్లో తెరకెక్కనున్న 'సలామ్ వెంకీ' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. చదవండి: ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ -
కోల్పోయిన జీవితం తిరిగి కావాలి.. స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో 'పరంపర 2'
Parampara 2 Web Series Trailer: తెలుగు వెబ్ సిరీస్‌లలో ఘన విజయం సాధించిన వాటిలో 'పరంపర' ఒకటి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సిరీస్ అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా 'పరంపర సీజన్ 2' వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్సరీస్ సీజన్ 2 ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి, టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్‌కు ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. 'ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర నుంచి లాక్కున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి' అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య హోరాహోరి ఘర్షణ ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు జెనరేషన్స్కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందగా, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ ఆశాభావం తెలిపింది. పొలిటికల్, రివేంజ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'పరంపర 2' జులై 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలో కమల్ హాసన్ 'విక్రమ్'.. ఎప్పుడు ? ఎక్కడంటే ?
Kamal Haasan Vikram Movie OTT Release Date Announced: ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సూపర్ హిట్ కమ్‌బ్యాక్ ఇచ్చిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య కీలక పాత్రల్లో నటించడంతో చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం జూన్ 3న విడుదలై అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 'పద చూస్కుందాం' అంటూ రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టింది. రోబో 2.0 తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన రెండో తమిళ చిత్రంగా విక్రమ్ రికార్డు సృష్టించింది. 'విక్రమ్' వేట థియేటర్లలో పూర్తి కాగా ఇప్పుడు ఓటీటీల్లో కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 8 నుంచి 'విక్రమ్' స్ట్రీమింగ్ కానున్నాడు. చదవండి: 'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే.. ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ A super hit addition to your watchlist coming soon! 😍 Vikram: Hitlist streaming from July 8 in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. #VikramOnDisneyPlusHotstar 🔥😎 pic.twitter.com/bCO3KfVcOK — Disney+ Hotstar (@DisneyPlusHS) June 29, 2022 -
దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ.. 'O2' రివ్యూ
టైటిల్: ఓ2 (O2-ఆక్సిజన్) నటీనటులు: నయన తార, రిత్విక్ జోతిరాజ్, భరత్ నీలకంఠన్ తదితరులు దర్శకత్వం: జీఎస్ విక్నేష్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ: తమిళ ఎ అళగన్ విడుదల తేది: జూన్ 17, 2022 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) లేడీ సూపర్ స్టార్ నయన తార ఇటీవల ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలైంది. పెళ్లికి ముందు విఘ్నేష్ దర్శకత్వంలో వచ్చిన 'కణ్మని రాంబో ఖతిజా' సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా 'ఓ2 (O2, ఆక్సిజన్)' సినిమాతో నేరుగా ఓటీటీలో సందడి చేస్తోంది. జీఎస్ విక్నేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నయన తార పెళ్లి తర్వాత విడుదలకావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగినట్లుగా ఓ2 (O2) ఉందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథ: ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. పార్వతి (నయన తార) కొడుకు వీర (రిత్విక్ జోతిరాజ్) ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుంటాడు. ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే వీరకు ఊపిరి అందదు. వీరిద్దరు అవయవ దానానికి సంబంధించిన ఆపరేషన్ కోసం చిత్తూరు నుంచి కొచ్చిన్‌కు బస్సులో వెళతారు. బస్సు ప్రయాణిస్తున్న దారిలో వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడి రోడ్డుతో సహా మట్టిలోకి కూరుకుపోతుంది. ఈ బస్సు జర్నీలో లేచిపోవాలనుకునే ప్రేమ జంట, మాజీ ఎమ్మెల్యే, పోలీసు ఇలా ఉంటారు. ఈ ప్రమాదం నుంచి ఎవరు బతికారు ? ఆక్సిజన్ దొరకనప్పుడు మనుషుల మానసిక స్థితి ఎలా ఉంటుంది ? ఆ స్థితిలో వారు ఏం చేయడానికి సిద్ధపడతారు ? తన కొడుకు వీరను పార్వతి ఎలా కాపాడుకుంది ? అనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఓ2 (O2) చూడాల్సిందే. విశ్లేషణ: మానవ మనుగడకు ప్రాణదారం ఆక్సిజన్. ఈ సందేశంతో ఆక్సిజన్ దొరక్కపోతే మనుషుల మానసిక స్థితి ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. మట్టిలో కూరుకుపోయిన ఒక బస్సు, అందులో విభిన్న మనసత్వాలు ఉన్న వ్యక్తులు ఎలా బతికి బయటపడ్డారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాయింట్‌ను తెరకెక్కించడంలో డైరెక్టర్ కొంతవరకే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మట్టిలో బస్సు కూరుకుపోయాక వచ్చే సీన్లు బాగున్నాయి. అయితే బస్సు లోయలో పడిపోయిందనే విషయం రెస్క్యూ టీమ్‌కు తెలియడం, తర్వాత వారి చర్యలు అంతా ఆసక్తిగా అనిపించవు. అక్కడక్కడా స్క్రీన్ ప్లే కాస్తా స్లో అయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి తరహాలో వచ్చే సౌత్ ఇండియా సినిమాల్లో క్లైమాక్స్‌ను ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ సన్నివేశాలను మరింత గ్రిప్పింగ్‌గా, కొన్ని మలుపులతో కథ రాసుకుంటే ఇంకా బాగుండేది. ఎవరెలా చేశారంటే? నయన తార నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొడుకును కాపాడుకునే తల్లిగా నయన తార అదరగొట్టింది. అలాగే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వీర పాత్రలో మాస్టర్ రిత్విక్ జోతిరాజ్ నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లలో రిత్విక్ యాక్టింగ్ హత్తుకునేలా ఉంటుంది. మిగతా నటీనటుల నటన కూడా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే బస్సులోని సీన్లు విజువల్‌గా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్‌గా తమిళ్ ఎ. అళగన్ పనితనం చక్కగా కనిపిస్తుంది. 'దేవుడిచ్చిన లోపాన్ని కూడా.. తల్లి సరిచేయగలదు' అనే డైలాగ్ ఎమోషనల్‌గా హత్తుకుంటుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌ను చూసిన అనుభూతి కలుగుతుంది. -సంజు (సాక్షి వెబ్ డెస్క్) -
రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్
Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇటీవల ఈ షోను ఇక కొనసాగించనని కరణ్ జోహార్ ప్రకటించి అభిమానులను షాక్‌గు గురిచేశాడు. కానీ తాజాగా ఆదివారం (జూన్ 19) ఈ షో 7వ సీజన్‌ను టెలీకాస్ట్ చేస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేసి ఆశ్చర్యపరిచాడు కరణ్ జోహార్. ఈ వీడియోలో రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్, సైఫ్ అలీ ఖానా, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తదితరులు ఉన్నారు. అలాగే ఈ టీజర్లో 'ఇప్పుడు రాబోయే సీజన్ మరింత పెద్దది, మెరుగైనది, ఇంకా మరింత అందమైనది' అని కరణ్ జోహార్ ఉత్సాహంగా చెప్పడం మనం చూడొచ్చు. కాపీ విత్ కరణ్ సీజన్ 7 ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 7 నుంచి ప్రసారం కానుంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
నేరుగా ఓటీటీలోకి జాన్వీ కపూర్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?
అందాల తార, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ మొదటి సినిమా 'ధడక్'తోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తన నటనతో, అందచందాలతో కోట్లాదిమంది మనసులు కొల్లగొట్టింది. అంతేకాకుండా యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా జాన్వీ కపూర్ నటించిన చిత్రం 'గుడ్ లక్ జెర్రీ'. లేడీ సూపర్ స్టార్ నయన తార నటించిన 'కోలమావు కోకిల' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది ఈ మూవీ. 'కోకోకోకిల' అనే టైటిల్‌తో తెలుగులోనూ డబ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది జాన్వీ. 'గుడ్ లక్ జెర్రీ' ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఒక పోస్టర్లో తుపాకీ పట్టుకుని, మరో దాంట్లో భయంతో లంచ్ బాక్స్ టేబుల్ వెనుక దాక్కున్న జాన్వీ కపూర్‌ను మనం చూడొచ్చు. ఈ మూవీ నేరుగా ప్రమఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను పూర్తిగా పంజాబ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ సేన్ గుప్త దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ నటించారు. 'గుడ్ లక్ జెర్రీ'ని సన్డియల్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
నేరుగా ఓటీటీకి నయనతార మూవీ, అప్పటి నుంచే స్ట్రీమింగ్
లేడీ సూపర్ స్టార్ నయన తార గ్యాప్ లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తోంది. అనామిక, కర్తవ్యం వంటి హీరోయిన్ సింట్రిక్ పాత్రల్లో మెప్పించిన నయన్ ఇటీవల 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు ఆమె తాజాగా 'ఓ2' (O2) సినిమాతో ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు రెడీ అయ్యింది. జీఎస్.విక్నేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. మే 17న ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సిద్దమైంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ థ్రిల్లర్ డ్రామా. ఈ చిత్రంలో నయనతార ఎనిమిదేళ్ళ బాబుకు తల్లిగా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. చదవండి: మాజీ భర్త హృతిక్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్‌పై సుసానే ఆసక్తికర కామెంట్ రిత్విక్, లీనా, మనోహర్, అడకులం మురుగదాస్ కీలకపాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కాగా ఇటీవల నయన్ తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం రిలీజ్ అవుతున్న నయన్ తొలి సినిమా ఇదే కావడంలో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ విభిన్న కథలతో ప్రేక్షకుల అలరించిన నయన్ ఈ మూవీతో ఎంతమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. కాగా నయనతార ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్', 'గోల్డ్' తదితర చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: ఆ నిర్మాత నన్ను నా ఫ్యామిలీని బెదిరించాడు: చాందిని చౌదరి -
ముగ్గురు ఖైదీలు, మూడు దొంగతనాలు.. '9 అవర్స్' రివ్యూ
టైటిల్: 9 అవర్స్ (వెబ్ సిరీస్) నటీనటులు: తారక రత్న, మధుశాలిని, అజయ్, రవిప్రకాశ్, వినోద్ కుమార్, బెనర్జీ, సమీర్ తదితరులు మూల కథ: మల్లాది కృష్ణమూర్తి 'తొమ్మిది గంటలు' నవల సమర్పణ, స్క్రీన్‌ప్లే: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి విడుదల తేది: జూన్ 2, 2022 (డిస్లీ ప్లస్ హాట్‌స్టార్) ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'తొమ్మిది గంటలు' నవల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ '9 అవర్స్'. ఈ వెబ్ సిరీస్‌కు క్రిష్ స్క్రీన్‌ప్లే అందించగా, నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తర్వాత తారక రత్న ఈ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. హాట్‌స్టార్‌లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ '9 అవర్స్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: ఈ వెబ్ సిరీస్ కథ 1985 కాలంలో జరుగుతుంది. ముగ్గురు చొప్పున తొమ్మిది మంది మూడు బ్యాంక్‌లను దొంగతనం చేసేందుకు వెళ్తారు. ఈ మూడు దొంగతనాలకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని ముగ్గురు ఖైదీలు ఒక్కో బ్రాంచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే వాటిలో రెండు దొంగతనాలు విజయవంతగా పూర్తి చేస్తారు. కానీ కోఠి బ్రాంచ్‌లో రాబరీ జరుగుతున్నట్లు పోలీసులకు తెలియడంతో దొంగలు చిక్కుల్లో పడతారు. మరీ ఆ దొంగలు పోలీసుల నుంచి ఎలా బయటపడ్డారు ? బంధీలుగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు, కస్టమర్లు తప్పించుకోడానికి ఏం చేశారు ? ఈ దొంగతనాల వెనుక అసలు ఎవరున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: 1985లో జరుగుతున్న దొంగతనం బ్యాక్‌డ్రాప్‌కు తగినట్లుగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఒకేసారి మూడు చోట్ల మూడు దొంగతనాలు జరగడం అనే అంశం ఆసక్తిగా ఉంటుంది. జైలు నుంచి వెళ్లిన ఖైదీలు 9 గంటల్లో మూడు రాబరీలు చేసుకుని మళ్లీ జైలుకు రావాలి. అయితే ఈ 9 గంటలను 9 ఎపిసోడ్స్‌గా మలిచారు. ఒకేసారి మూడు రాబరీలు చేయాలన్న కాన్సెప్ట్ బాగున్నా సిరీస్ ప్రారంభం ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్‌గా ఉంటాయి. బ్యాంకు ఉద్యోగులు, దొంగతనానికి వచ్చిన వారి జీవిత కథలు ఒక్కో ఎపిసోడ్లో చూపించారు. అవి అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తాయి. భర్త చనిపోతే వితంతు పరిస్థితి ఎలా ఉంటుంది ? భార్యభర్తల బంధం తదితర అంశాలను ఆకట్టుకునేలా చూపించారు. అప్పడప్పుడు వచ్చే ట్విస్ట్‌లు చాలా ఆకట్టుకుంటాయి. బంధీలుగా ఉన్న ఉద్యోగులు బయటపడే మార్గాలు, పోలీసుల అంచనాలను పటాపంచలు చేసే దొంగల తెలివి చాలా బాగా చూపించారు. ఈ సీన్లు బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా సాగుతున్న కథనంలో అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు కావాలని జొప్పించినట్లే ఉంటాయి. సిరీస్‌లో అనేక అంశాలను టచ్ చేశారు. అందుకే కథనం చాలా స్లోగా అనిపిస్తుంది. అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. టైటిల్ 9 అవర్స్ కాబట్టి ఎపిసోడ్లను కూడా 9గా చేశారు. అదే మైనస్ అయింది. అలా కాకుండా 5 ఎపిసోడ్స్‌లో సిరీస్ ముగిస్తే సూపర్ థ్రిల్లింగ్‌గా ఉండేది. ఎవరెలా చేశారంటే? చాలా కాలం తర్వాత తారక రత్నకు మంచి పాత్రే దొరికందని చెప్పవచ్చు. కానీ ఆ పాత్ర హైలెట్‌గా నిలిచే సన్నివేశాలు ఎక్కడా లేవు. జర్నలిస్ట్‌గా మధుశాలిని పాత్ర కూడా అంతంతమాత్రమే. కానీ రాబరీలో బంధీలుగా ఉన్న పాత్రధారులు ఆకట్టుకున్నారు. దొంగతనంలో కూడా తన కామవాంఛ తీర్చుకునే సహోద్యోగి పాత్రలో గిరిధర్ మెప్పించాడు. అజయ్, వినోద్ కుమార్, బెనర్జీ, ప్రీతి అస్రానీ, సమీర్, అంకిత్ కొయ్య, రవివర్మ, జ్వాల కోటి, రవిప్రకాష్ వారి నటనతో బాగానే ఆకట్టుకున్నారు. ఒక్కొక్క అంశాన్ని, జీవిత కథలను చెప్పే కథనం స్లోగా సాగిన మలుపులు, రాబరీ ప్లానింగ్ ఆశ్చర్యపరుస్తాయి. ఓపికతో చూస్తే మంచి డీసెంట్ వెబ్ సిరీస్ ఇది. అయితే ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు అనే తదితర విషయాలపై ముగింపు ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ రానున్నట్లు తెలుస్తోంది. -
ఈవారం అలరించే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
Upcoming Theater OTT Movies Web Series In June 1st Week 2022: థియేటర్ల వద్ద సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ 'అఖండ'తో మొదలైన మూవీ పండుగ మే 27న విడుదలైన 'ఎఫ్ 3' (F3)తో కంటిన్యూ అవుతోంది. ఈ నెలలో 'సర్కారు వారి పాట', 'ఎఫ్3' విజయంగా దూసుకుపోతున్నాయి. ప్రతి వారం ఓ కొత్త సినిమా ప్రేక్షకులను కచ్చితంగా పలకిస్తుండంగా.. జూన్ మొదటి వారంలో అలరించే సినిమాలు, సిరీస్‌లు ఏంటో లుక్కేద్దామా ! 1. మేజర్ డిఫరెంట్ కథలు, సినిమాలతో అలరించే అడవి శేష్ మేజర్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. 36/11 ఉగ్రదాడుల్లో ప్రజల ప్రాణాలు కాపాడి అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ప్రివ్యూలు వేసిన విషయం తెలిసిందే. 2. విక్రమ్ ముగ్గురు విలక్షణ నటులందరు కలిసి ఉర్రూతలూగించేందుకు వస్తుంది 'విక్రమ్'. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య అతిథిగా మెరవబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన 'విక్రమ్' జూన్ 3న తమిళ, తెలుగు భాషల్లో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. 3. పృథ్వీరాజ్ బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాజ్‌పుత్ యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ ఆధారంగా రూపొందిన చిత్రం 'పృథ్వీరాజ్'. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో రిలీజవనుంది. ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్‌లు ఇవే.. 1. 9 అవర్స్ (వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జూన్ 2 2. జనగణమన (మలయాళం)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 2 3. అశోకవనంలో అర్జున కల్యాణం- ఆహా, జూన్ 3 4. ది పర్ఫెక్ట్ మదర్ (వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 3 5. సర్వైవింగ్ సమ్మర్ (వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 3 6. ది బాయ్స్ (వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో, జూన్ 3 7. ఆశ్రమ్ (హిందీ వెబ్ సిరీస్-సీజన్ 3)- ఎంఎక్స్ ప్లేయర్, జూన్ 3 8. బెల్ఫాస్ట్ (హాలీవుడ్)- బుక్ మై షో, జూన్ 3 చదవండి: రీల్స్‌తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు.. -
రీల్స్‌తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు.. 'ఎస్కేప్ లైవ్' రివ్యూ
టైటిల్: ఎస్కేప్ లైవ్ (హిందీ వెబ్ సిరీస్) నటీనటులు: సిద్ధార్థ్, ఆకాంక్ష సింగ్, సుమేధ్ ముద్గాల్కర్, రిత్విక్ సాహోర్, ఆద్య శర్మ, ప్లబితా, రోహిత్ చందేల్, జావేద్ జాఫెరి తదితరులు దర్శకత్వం: సిద్ధార్థ్ కుమార్ తవారీ విడుదల తేది: మే 20 (7 ఎపిసోడ్స్) & మే 27 (2 ఎపిసోడ్స్) ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ టాలీవుడ్లో లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. 'బొమ్మరిల్లు'తో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత 'మహాసముద్రం' సినిమాతో అలరించాడు. ఈ యంగ్ హీరో తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఓటీటీ డెబ్యుగా వచ్చిన వెబ్ సిరీస్ ఎస్కేప్ లైవ్. సిద్ధార్థ్ కుమార్ తివారి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్ నిర్మించింది. మే 20న విడుదలైంది. రీల్స్, సోషల్ మీడియాతో వచ్చే డబ్బు కోసం యువత ఏం చేస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ 'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కృష్ణ స్వామి తల్లి, చెల్లితో కలిసి నివసిస్తాడు. తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యతలను తీసుకుంటాడు. తన అర్హతకు తగిన ఉద్యోగం దొరక్కపోవడంతో 'ఎస్కేప్ లైవ్' అనే వీడియో షేరింగ్ యాప్‌లో మోడరేటర్‌గా జాయిన్ అవుతాడు. ఎస్కేప్ లైవ్ యాప్ తన పాపులారిటీ పెంచుకునేందుకు ఒక కాంటెస్ట్ నిర్వహిస్తుంది. యాప్ యూజర్స్ వివిధ రకాల వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే వారికి డైమండ్స్ వస్తాయి. అవి క్యాష్ రూపంలో వారి అకౌంట్‌కు చేరతాయి. ఈ క్రమంలోనే ఒక డేట్ వరకు ఎక్కువ డైమండ్స్ గెలుచుకున్న వారికి రూ. 3 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటిస్తారు ఎస్కేప్ లైవ్ నిర్వాహకులు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న యాజర్స్ ఆ డబ్బు కోసం ఎంతకు తెగించారు ? యాప్ కాన్సెప్ట్ నచ్చని కృష్ణ ఏం చేశాడు ? ఆ సమయంలో కృష్ణ ఎదుర్కున్న పరిస్థితులు ఎంటీ ? అందులో పాల్గొన్న ఐదుగురు కంటెస్టెంట్లు చివరికి ఏమయ్యారు ? ఆ రూ. 3 కోట్లను ఎవరు గెలుచుకున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: ప్రస్తుతం యూత్ ఫాలో అవుతున్న రీల్స్, టకా టక్, జోష్, మోజో, చింగారీ వంటితదితర యాప్స్ యూత్‌ను, పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ సిద్ధార్థ్ కుమార్ తివారీ. నిత్యం సమాజంలో చూసే అనేక విషయాలను సిరీస్ ద్వారా చూపించారు. సోషల్ మీడియాతో మనీ, ఫేమ్ సంపాదించుకోవాలనుకున్న యువత ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది ? చివరికీ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు డైరెక్టర్. ఆయన అనుకున్నది ప్రేక్షకులకు చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా ఇందులో ఒక పాత్రలో కూడా నటించారు సిద్ధార్థ్ కుమార్ తివారీ. సిరీస్‌లోని 5 ప్రధాన పాత్రలు, వారి నేపథ్యాన్ని చూపిస్తూ ప్రారంభించారు. అది కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. కానీ కథ పరంగా అలా చూపించడం తప్పదు. ఇక ఎస్కేప్ లైవ్ యాప్ కాంటెస్ట్ కోసం ఐదుగురు చేసే ప్రయత్నాలు, వారి జీవిత కథలు ఆకట్టుకుంటాయి. యాప్ ఎదుగుదల కోసం కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయనే విషయాలు బాగా చూపించారు. సిరీస్‌లో అక్కడక్కడా వచ్చే అశ్లీల సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అవి రియల్ లైఫ్‌లో జరిగే సంఘటనలని ఒప్పుకోక తప్పదు. నైతికత విలువలతోపాటు జెండర్ వివక్షతను చూపించారు. మంచి థ్రిల్లింగ్‌గా సాగుతున్న స్టోరీలో అక్కడక్కడా కుటుంబంతో ఉన్న ప్రధాన పాత్రల సన్నివేశాలు (ఎపిసోడ్ 5) కొద్దిగా బోర్ కొట్టిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోపాటు అప్పుడప్పుడు వచ్చే పాటలు ఆకట్టుకున్నాయి. ఎవరెలా చేశారంటే? సిద్ధార్థ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన యువకుడిగా, యాప్ నిర్వాహకులు చేస్తున్న పని నచ్చని, దాన్ని ఆపాలనే సిటిజన్‌గా బాగా నటించాడు. అయితే మిగతా ఐదు ప్రధాన పాత్రలతో పోల్చుకుంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ డెప్త్ తక్కువగా అనిపిస్తుంది. తన సిస్టర్ బాయ్‌ఫ్రెండ్ విషయంలో సిద్ధార్థ్ చేసే పని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక మిగతా క్యారెక్టర్లైనా డ్యాన్స్ రాణి (బేబీ ఆద్య శర్మ), ఫెటీష్ గర్ల్ (ప్లబితా), ఆమ్చా స్పైడర్ (రిత్విక్ సాహోర్), రాజ్ కుమార్ రోహిత్ చందేల్ నటన సూపర్బ్‌గా ఉంది. ముఖ్యంగా ఆద్య శర్మ డ్యాన్స్‌లు బాగా ఆకట్టుకుంటాయి. ఇక సైకో వ్యక్తిగా డార్క్ ఏంజిల్ పాత్రలో సుమేధ్ ముద్గాల్కర్ అదరగొట్టాడు. సిరీస్‌కు అతడి యాక్టింగ్ హైలెట్ అని చెప్పవచ్చు. రాధా క్రిష్ణ సీరియల్లో కృష్ణుడిగా సుమేధ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇందులో రాధగా నటించిన మల్లికా సింగ్ కూడా సిద్ధార్థ్ చెల్లెలుగా శ్రీని పాత్రలో అలరించింది. పోలీస్ ఆఫిసర్‌గా ఆకాంక్ష సింగ్ పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఫైనల్‌గా సిరీస్ గురించి చెప్పాలంటే కొంచెం ఓపిక తెచ్చుకోనైన సరే కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. చివరి ఎపిసోడ్లో కొన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వకుండా రెండో సీజన్ కూడా వస్తుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
O2 Teaser: ఇంకో 12 గంటల వరకు బతికి ఉండవచ్చు..
Nayanatara O2 Movie Teaser Released Will Stream On Disney Plus Hotstar: స్టార్ హీరోయిన్ నయన తార గ్యాప్ లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తోంది. అనామిక, కర్తవ్యం వంటి హీరోయిన్ సింట్రిక్ పాత్రల్లో మెప్పించిన నయన్ ఇటీవల 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీతో ప్రేక్షకులను నవ్వించింది. తాజాగా 'ఓ2' (O2) సినిమాతో ఆడియెన్స్‌ను థ్రిల్‌కు గురి చేయనుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. నయనతార, ఇతర ప్రయాణికులు కలిసి కొచ్చిన్‌కు వెళ్తున్న బస్సు లోయలో పడిపోతుంది. అందులో ఉన్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశారనేదే సినిమా కథగా తెలుస్తోంది. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించని ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, జీఎస్ వెంకటేశ్ దర్శకత్వం వహించారు. కాగా నయనతార ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్', 'గోల్డ్' తదితర చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
డిస్నీ హాట్‌స్టార్‌లో 6 కొత్త వెబ్ సిరీస్‌లు.. ఎప్పుడంటే ?
These 6 Marvel Series Will Stream On Disney Plus Hotstar: మార్వెల్ సంస్థ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఎమ్‌సీయూ నుంచి వచ్చే ప్రతి మూవీ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే పేరు ఉంది. ఇటీవల మార్వెల్ నుంచి 28వ చిత్రంగా వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంతేకాకుండా మరోవైపు మిస్ మార్వెల్ (Ms Marvel) సిరీస్‌తో బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే తర్వాత వచ్చే ఎమ్‌సీయూ సినిమాల కోసం అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. వారికోసం మార్వెల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇదివరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రదర్శించనున్నారు. ఏకంగా 6 మార్వెల్ సిరీస్‌లు మే 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సిరీస్‌లు ఏంటో చూసేయండి. చదవండి: ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన Top 10 OTT ఒరిజినల్స్ ఇవే.. 1. డేర్ డెవిల్ (Daredevil) 2. జెస్సికా జోన్స్ (Jessica Jones) 3. ఐరన్ ఫిస్ట్ (Iron Fist) 4. పనిషర్ (Punisher) 5. ల్యూక్ కేజ్ (Luke Cage) 6. డిఫెండర్స్ (Defenders) -
ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన Top 10 OTT ఒరిజినల్స్ ఇవే..
Top 10 OTT Originals Of The Week By Ormax Media: ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్‌లు, సినిమాలకు ఆదరణ పెరిగిపోతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్, మూవీస్‌కు జై కొడుతున్నారు మూవీ లవర్స్. ఇంతకుముందు కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూసేవారు. థియేటర్లలో రిలీజైన వెంటనే చూసేందుకు పోటీపడేవారు ప్రేక్షకులు. ఇప్పుడు థియేటర్లలో వచ్చే సినిమాలను చూస్తూనే ఓటీటీల్లో వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఓ సర్వే చేసి ఒక జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఇండియాలో టాప్ 10 ఓటీటీ ఒరిజినల్స్ అందించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో తెలిపింది. మే 6 నుంచి 12 వరకు ఎక్కువ బజ్ ఉన్న వెబ్ సిరీస్, సినిమాల ఆధారంగా సర్వే నిర్వహించి ఈ జాబితాను ప్రవేశపెట్టింది. ఇందులో ఇప్పటికే విడుదలైనవాటితోపాటు వచ్చే వెబ్ సిరీస్‌లు, ఒక సినిమాను పేర్కొంది. చదవండి: OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు.. 1. మూన్ నైట్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 2. గిల్టీ మైండ్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) 3. పంచాయత్ సీజన్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో) (మే 20) 4. మాయి (నెట్‌ఫ్లిక్స్) 5. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 (నెట్‌ఫ్లిక్స్) (మే 27) 6. లండన్ ఫైల్స్ (వూట్) 7. రుద్ర (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 8. గుల్లక్ సీజన్ 3 (సోనీ లివ్) 9. హోమ్ శాంతి (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 10. థార్ (నెట్‌ఫ్లిక్స్) Ormax Stream Track: Top 10 OTT originals in India, including upcoming shows/ films, based on Buzz (May 6-12) #OrmaxStreamTrack #OTT pic.twitter.com/edep0uTvxa — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఈ హాలీవుడ్ అపరిచితుడు మాములోడు కాదు.. -
మిత్రా శర్మను మెచ్చుకున్న జీవిత, రాజశేఖర్..
Bigg Boss Non Stop Telugu OTT: Mithra Sharma Will Top 5 Contestants: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారనుంది. హౌజ్ కంటెస్టెంట్స్ అందరూ టాప్ 5లో చేరండంపైనే దృష్టి పెట్టారు. ఇంటి సభ్యుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న వాళ్లలో మిత్రా శర్మ ఒకరు. సాధారణంగా కంటెస్టెంట్‌గా చేరిన మిత్రా శర్మ ఇంటి సభ్యులకు మంచి పోటీ ఇస్తుంది. గత 70 రోజులకుపైగా జరిగిన రియాలిటీ షోలో రకరకాల టాస్కుల్లో పార్టిస్పేట్ చేస్తూ పర్వాలేదనిపించింది. ప్రత్యర్థుల ఆరోపణలకు సరైనా సమాధానాలు చెబుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లో ఒకరిగా మారింది. అంతేకాకుండా ఇటీవల ఇంటిలోకి అతిథులుగా వచ్చిన సినీ తారలు, సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది. శేఖర్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శకురాలు జీవిత బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒక యాక్టింగ్ స్కూల్లో సీటు వస్తే ఎలా స్పందిస్తారు.. సీటు రాకపోతే ఎలా ఫీలవుతారు అనే థీమ్ ఆధారంగా నటించి చూపమన్నారు. దీంతో తనదైన శైలిలో రకరకాల భావాలు పలికిస్తూ నటించి చూపించింది మిత్రా శర్మ. ఓ దశలో భావోద్వేగంతో మిత్రా శర్మ నటించి చూపించిన తీరు చూసి జీవిత, రాజశేఖర్ మాత్రమే కాకుండా ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం మిత్రా శర్మను జీవిత, రాజశేఖర్ అభినందిస్తూ.. ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆదివారం రోజున టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోనుంది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి తుదివారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో మిత్రా శర్మ టాప్ 5లో చోటు సంపాదించడానికి అన్ని అర్హతలను సాధించినట్లుగా తెలుస్తోంది. మరీ ఈ ఆదివారం ఏమవుతుందో వేచి చూడాలి. -
ఓటీటీలో సినిమాల జాతర.. ఈ శుక్రవారం 13 చిత్రాలు
OTT Releases: 13 Upcoming Movies Web Series On May 20 2022: మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు థియేటర్లలో సందడి చేయగా, ప్రస్తుతం సర్కారు వారి పాట అలరిస్తోంది. ఇదిలా ఉంటే థియేటర్లలో ప్రతి వారం ఏదో ఒక సినిమా సందడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. కరోనా, లాక్డౌన్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల సందడి నెలకొంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ చిత్రాలు అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే శుక్రవారం (మే 20) ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో థియేటర్లలో విడుదలైన మూవీస్తోపాటు నేరుగా ఓటీటీల్లోకి రిలీజ్ అవుతున్నాయి. మరీ ఆ సినిమాలేంటో చూద్దామా ! 1. 12th మ్యాన్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2. ఎస్కేప్ లైవ్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 3. ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం..)- జీ5 4. ఆచార్య- అమెజాన్ ప్రైమ్ వీడియో 5. భళా తందనాన- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 6. జాంబీవ్లి- జీ5 7. చిప్ అండ్ డేల్: రెస్క్యూ రేంజర్స్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 8. పంచాయత్ (సీజన్ 2)- అమెజాన్ ప్రైమ్ వీడియో 9. మై నెక్స్ట్ గెస్ట్- నెట్‌ఫ్లిక్స్ 10. లవ్ డెత్ రోబోట్స్- నెట్‌ఫ్లిక్స్ 11. ది లాడ్జ్- నెట్‌ఫ్లిక్స్ 12. జాకస్ 4.5- నెట్‌ఫ్లిక్స్ 13. నైట్ స్కై సీజన్ 1- అమెజాన్ ప్రైమ్ వీడియో చదవండి: OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆరోజు యాక్టింగ్‌ను వదిలేస్తా : హీరో సిద్దార్థ్
లవర్ బాయ్ ఇమేజ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్. చాలాకాలం తర్వాత మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. తాజాగా ఎస్కేప్ లైవ్ అనే హిందీవెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్ (Disney + Hotstar)లో మే 20 నుంచి ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'ఈ సిరీస్‌లో నాది రెగ్యులర్ రోల్ కాదు. ఈ పాత్రలో నన్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. మంచి ఆఫర్లు వస్తే మళ్లీ బాలీవుడ్‌కు తిరిగొస్తా. ఢిపరెంట్ రోల్స్ వచ్చే వరకు యాక్టింగ్ చేస్తా. లేదంటే వేరే ఉద్యోగం చూసుకుంటా' అని సిద్దార్థ్ పేర్కొన్నాడు. -
OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు..
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మూవీ లవర్స్‌కు ఫేవరేట్‌గా మారిపోయాయి. కరోనాతో లాక్డౌన్ ఏర్పడిన సమయంలో ఎంటర్టైన్మెంట్కు ప్రత్యమ్నాయంగా నిలిచిన ఈ ఓటీటీల హవా ఇంకా జోరుగా సాగుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించడంలో తగ్గేదే లే అంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది నెట్‌ఫ్లిక్స్. ఎప్పుడూ సరికొత్త హంగులతో ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కొత్తదనంతో ఆకట్టుకునేందుకు ముందుంటుంది. అయితే సినీ ప్రియులు మాత్రం ప్రతి జోనర్‌ను విడిచిపెట్టకుండా చూస్తారు. కానీ కొందరు ప్రేక్షకులు పర్టిక్యూలర్ జోనర్స్ మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, ఫాంటసీ, స్కై ఫై, టైమ్ ట్రైవేల్, సూపర్ హీరోస్ వంటి జోనర్స్‌ను ఇష్టపడితే కొందరికి వెన్నులో వణుకు పుట్టించే హారర్ చిత్రాలు చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వారికోసమే శుక్రవారం (మే 13) అతిగా భయపెట్టే 6 హారర్ సినిమాలను చూడమని సజ్జెస్ట్ చేస్తూ టైటిల్స్ తెలిపింది నెట్‌ఫ్లిక్స్. 'ఈ 13 తేదిన భయపడేందుకు ఈ సినిమాలు చూడండి' అని ట్వీట్ చేసింది. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. #WhatToWatchOnNetflix 🎥: 1. Bulbbul 2. The Conjuring 3. The Conjuring 2 4. The Haunting Of Hill House 5. Hereditary 6. Insidious: The Last Key — Netflix India (@NetflixIndia) May 13, 2022 నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా మరో ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా హారర్ మూవీస్‌ను సజ్జెస్ట్ చేసింది. తన ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న హారర్ సినిమాల టైటిల్స్‌ను సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. వీటిలో ది పాస్ట్, అమరికన్ హారర్ స్టోరీస్, ది హిల్స్ హ్యావ్ ఐస్ 2, లెట్స్ ప్లే, లిఫ్ట్‌తోపాటు పలు హారర్ మూవీస్ ఉన్నాయి. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటీటీకి శ్రీవిష్ణు ‘భళా తందనాన’, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Bhala Thandanana Streaming On Disney Plus Hotstar: యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఎందుకంటే అతడు ఎంచుకునే కథలు, మూవీ టైటిల్స్ కాస్తా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దీంతో అతడి సినిమాల్లో ఓ మెసెట్ ఉంటుందని ప్రేక్షకుడి అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా నటించిన మూవీ ‘భళా తందనాన’. మే 6న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. చదవండి: కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు డిస్నీప్లజ్ హాట్‌స్టార్ ఈ సినిమా విడుదల కానుందని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. మే 20 నుంచి ఈ మూవీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్. వెండితెరపై పెద్ద ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్‌పై ఏంతమేర ఆకట్టుకుందో చూడాలి. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. Bhala re Bhala! Mee screen ki vachestundi #BhalaThandhanana #BhalaThandanaOnHotstar@sreevishnuoffl @CatherineTresa1 @chaitanyahead @SaiKorrapati_ #manisharma @SrikanthVissa @dopsureshragutu #GarudaRam #MarthandVenkatesh @PeterHeinOffl @VaaraahiCC @MangoMusicLabel pic.twitter.com/rnETXyzBrR — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 13, 2022 -
ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..
Siddharth OTT Debut Escaype Live Will Streaming On Disney Plus Hotstar: టాలీవుడ్లో లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. బొమ్మరిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఇటీవల మహాసముద్రం సినిమాతో అలరించాడు. ఈ హీరో తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్ నిర్మించిన 'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్‌తో సందడి చేయనున్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు సిద్ధార్థ్ కుమార్ తివారి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ డిస్లీ ప్లస్ హాట్‌స్టార్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. 'పోటీ చేస్తున్న అమ్మాయిలకు వజ్రాలు బెస్ట్ ఫ్రెండ్స్. మరీ ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు ?' అని ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్, డైరెక్టర్ గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ 'కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాను. తివారితో కలిసి పనిచేయడం నటుడిగా అద్భుతమైన అనుభవం. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తూ ప్రేరణ పొందాను. తివారితో స్క్రిప్ట్, పాత్రల అభివృద్ధి గురించి జరిపిన చర్చలు నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. నేను ఏం చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను. ఆయన ఆశించిన దానికి నేను ఇంకా ఏం ఇవ్వాలి అని నేను అనుకునేవాన్ని. నేను అనుకున్నదంతా చేయగలనని తివారి నన్ను నమ్మారు.' అని చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ ఒక యాప్‌లో నిర్వహించే పోటీ ఆధారంగా తెరకెక్కించిన కల్పిత కథ అని సమాచారం. చదవండి: భయపెట్టేందుకు వచ్చేస్తున్న మహారాష్ట్ర జాంబీలు.. చూసేందుకు సిద్ధమా ! Diamonds are a g̶i̶r̶l̶'̶s̶ contestant's best friend! 💎💎 Who do you think will win?#HotstarSpecials #EscaypeLive all episodes streaming from May 20. Created and directed by Siddharth Kumar Tewary @sktorigins pic.twitter.com/vC2JZsuS88 — Disney+ Hotstar (@DisneyPlusHS) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఈ హాలీవుడ్ అపరిచితుడు మాములోడు కాదు.. 'మూన్ నైట్' రివ్యూ
టైటిల్: మూన్ నైట్ (వెబ్ సిరీస్) నటీనటులు: ఆస్కార్ ఐజాక్, మే కాలమావీ, ఈధన్ హాక్ తదితరులు నిర్మాత: కెవిన్ ఫీజ్ డైరెక్టర్స్: మహమ్మద్ దియాబ్, జస్టిన్ బెన్సన్, ఆరన్ మూర్హెడ్ సంగీతం: హెషాం నజీ సినిమాటోగ్రఫీ: గ్రెగరీ మిడిల్టన్, ఆండ్రూ డియాజ్ పలెర్మో ఎపిసోడ్లు: ఆరు విడుదల తేది: మార్చి 25-మే 6, 2022 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) హాలీవుడ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో (ఎమ్‌సీయూ) వచ్చే చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ యూనివర్స్ నుంచి ఇప్పటివరకు అనేక చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. ఇటీవల విడుదలైన 'డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్'ను కలుపుకొని మొత్తంగా 28 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూవీస్తోపాటు మార్వెల్ పలు వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించింది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చింది 'మూన్ నైట్' వెబ్ సిరీస్. అయితే ఇదివరకు వచ్చిన వాండా విజన్, ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్, వాట్ ఇఫ్, హాక్ ఐ సిరీస్‌లలోని క్యారెక్టర్లను మార్వెల్ సినిమాల్లో చూపించారు. కానీ మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్‌తో మార్వెల్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. ఎప్పటిలానే మార్వెల్ సినిమాలు, సిరీస్‌లపై భారీ అంచనాలు ఉంటాయి. మరి ఈ హైప్ మధ్య విడుదలైన మూన్ నైట్ ఏ మేరకు అలరించాడో రివ్యూలో చూద్దాం. కథ: స్టీవెన్ గ్రాంట్ (ఆస్కార్ ఐజాక్) ఒక సాధారణ వ్యక్తి. ఈజిప్టులోని ఒక మ్యూజియంలో పనిచేస్తాడు. అతను ఒక్కోసారి సడెన్‌గా బ్లాంక్ అయిపోతుంటాడు. లేచి చూసేసరికి విభిన్న ప్రదేశాల్లో ఉంటాడు. తిరిగి తను నివసించే చోట లేచేసరికి కొన్ని రోజులు గడిచిపోతాయి. స్టీవెన్‌కు నిజమేదో, కల ఏదో తెలియకుండా ఉంటుంది. ఈ క్రమంలో అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో అతన్ని స్టీవెన్‌కు బదులు మార్క్ స్పెక్టర్ అని పిలుస్తారు. మొదట్లో అతన్ని మార్క్ అని ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాదు. తర్వాత అతనికి మార్క్ స్పెక్టర్ పేరుతో పాస్‌పోర్టులు ఉండటాన్ని కనుగొంటాడు. క్రమక్రమంగా అతనికి మల్టిపుల్ డిజార్డర్ ఉన్నట్లు గ్రహిస్తాడు స్టీవెన్. అతను బ్లాంక్ అయిన ప్రతిసారి మార్క్ స్పెక్టర్ అనే వ్యక్తిలా మారిపోతున్నట్లు గుర్తిస్తాడు. అంతేకాకుండా అతనికి ఒక భార్య లేలా (మే కాలమావీ) ఉన్నట్లు తెలిసి షాక్ అవుతాడు. అయితే అతని శరీరం స్టీవెన్ గ్రాంట్దా లేక మార్క్ స్పెక్టర్దా ? అతను ఈజిప్టు చంద్ర దేవుడి అవతారమైన మూన్ నైట్‌గా ఎందుకు మారాడు ? అలా మారడానికి కారణం ఎవరు? అతని బాధ్యత ఏంటి ? దాన్ని నిర్వర్తించాడా ? స్టీవెన్ గ్రాంట్‌లో ఇంకెంతమంది వ్యక్తులు ఉన్నారు ? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: ఆరు ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్‌కు ముగ్గురు డైరెక్టర్లు మహమ్మద్ దియాబ్, జస్టిన్ బెన్సన్, ఆరన్ మూర్హెడ్ దర్శకత్వం వహించారు. సిరీస్ ప్రారంభంలో హీరోతోపాటు ప్రేక్షకుడికి కూడా అతనికి ఏం జరుగుతుంది ? అతను బ్లాంక్ అయినప్పుడు వేరే ప్రదేశాలకు ఎందుకు వెళ్తున్నాడు ? అది కల? నిజమా ? అని విషయాలను సస్పెన్స్డ్గా చాలా బాగా చూపించారు. యాక్షన్ సీన్స్, 'మూన్ నైట్'గా మార్క్ మారడం వంటి సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. సీన్లు బోర్ కొట్టించకుండా తెరకెక్కించడంలో డెరెక్టర్స్ సక్సెస్ అయ్యారు. అయితే మూన్ నైట్ సూపర్ హీరోను మరింత పవర్‌ఫుల్‌గా చూపిస్తే బాగుండేదనిపించింది. అక్కడక్కడ వయలెన్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. పలుచోట్ల ఊహించిన దానికంటే తక్కువగా హీరోయిజం ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లో వచ్చే క్లైమాక్స్ సీన్.. తర్వాతి ఎపిసోడ్ ఎలా ఉంటుందో అనే ఉత్సుకతను పెంచేలా ఉంది. ఎవరెలా చేశారంటే? ఇక ఈ సిరీస్‌లో నటించిన యాక్టర్స్ సూపర్బ్‌గా అలరించారు. ముఖ్యంగా మల్టిపుల్ డిజార్డర్‌తో బాధపడుతున్న స్టీవెన్ గ్రాంట్ పాత్రలో ఆస్కార్ ఐజాక్ మార్వలెస్‌గా చేశాడనే చెప్పవచ్చు. ఇటు స్టీవెన్ గ్రాంట్‌గా, అటు మార్క్ స్పెక్టర్‌గా ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అనిపించేలా అదరగొట్టాడు. స్టీవెన్ గ్రాంట్ సాప్ట్ అండ్ ఇంటలిజెంట్ క్యారెక్టర్ కాగా మార్క్ స్పెక్టర్ వయలెంట్ క్యారెక్టర్‌గా ఉంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు ఎంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఐదో ఎపిసోడ్లో వచ్చే ఎమోషనల్ సీన్లలో ఐజాక్ నటన హైలెట్ అని చెప్పవచ్చు. మార్క్ భార్యగా, పురావస్తు పరిశోధకురాలిగా లేలా ఎల్ ఫౌలి క్యారెక్టర్లో మే కాలమావి కూడా చక్కగా ఒదిగిపోయింది. తను చేసే యాక్షన్ సీన్స్ బాగుంటాయి. సిరీస్ లాస్ట్ ఎపిసోడ్లో తాను కూడా ఓ సూపర్ హీరోగా మారడం విశేషం. ఇక విలన్‌గా అర్థర్ హారో పాత్రలో ఈథన్ హాక్ నటన కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంటుంది. మంచి పవర్ఫుల్ విలన్‌గా తన ముద్ర వేశాడు. ఈ సిరీస్‌లో యాక్షన్ సీన్స్‌తోపాటు యాక్టర్స్ నటనే ప్రధాన బలం. హెషాం నాజీ అందించిన సంగీతం, గ్రెగరీ మిడిల్టన్, ఆండ్రూ డియాజ్ పలెర్మో సినిమాటోగ్రఫీ సిరీస్‌కు మరింత ప్లస్ అయ్యాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే 'అపరిచితుడు' తరహాలో ఉండే ఒక సూపర్ హీరో సిరీస్ ఇది. -
ఎయిర్టెల్, జియో యూజర్లకు బంపరాఫర్!
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, రిలయన్స్ జియోలు యూజర్లకు బంపరాఫర్లు ప్రకటించాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్‌లు ఫ్రీగా వీక్షించేలా ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి. ఎయిర్టెల్,జియోలు అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్లతో ఐపీఎల్ మ్యాచ్‌లు,మూవీస్, షోస్‌తో పాటు న్యూస్‌ను ఫ్రీగా చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం టెలికాం సంస్థలు తెచ్చిన ప్లాన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ►జియో ఇప్పటికే రూ.2999, రూ.1066, రూ.799, రూ.4199,రూ.601 ప్లాన్లపై డిస్నీ ప్లస్ హాట్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుండగా తాజాగా మరికొన్ని ప్లాన్లను యూజర్లకు పరిచయం చేసింది. ►జియో రూ.151: ఈ ప్లాన్‌లో యూజర్లు కేవలం ఇంటర్నెట్ డేటాను వినియోగించుకోవచ్చు. మొత్తం 8జీబీ డేటాతో పాటు అదనంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. ►జియో రూ.333: ప్రీపెయిడ్ ప్లాన్ ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్లు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు,1.5జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. 28రోజుల వ్యాలిడిటీతో డిస్నీ హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. ►జియో రూ.583: జియో నుండి 3వ కొత్త డిస్నీ ప్లాన్ ధర రూ.583 . అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్లు, 1.5జీబీ డేటాను అందిస్తోంది. ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ►జియో రూ.783 ప్లాన్: 84రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 1.5జీబీ డేటా, ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను అందిస్తుంది. కొత్త ఎయిర్ టెల్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాన్లు ►ఎయిర్టెల్ రూ.399, రూ.839 విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది . ►ఎయిర్టెల్ రూ.399 ప్లాన్: 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇది మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, ఒక నెల ఉచిత అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, అపోలో 24|7 సర్కిల్ లను వినియోగించుకోవచ్చు. ►ఎయిర్టెల్ రూ.839 ప్లాన్: 84రోజుల వ్యాలిడిటీతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్లు, 3నెలల ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ మొబైల్ ప్యాక్, రూ.100 ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాల్ని పొందవచ్చు. చదవండి👉అదిరిపోయే బంపరాఫర్, ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పొందండిలా! -
మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ '12th మ్యాన్'.. నేరుగా ఓటీటీలోకి
12th Man: Jeethu Joseph Mohanlal Locked Thriller Trailer Released: క్రైమ్ థ్రిల్లర్ జానర్స్తో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను తెరకెక్కించే మలయాళ దర్శకులలో జీతు జోసేఫ్ ముందుంటారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన మరో క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించారు. విలక్షణ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది '12th మ్యాన్' చిత్రం. (చదవండి: వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40) ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ విడుదల చేసింది. 11 మంది స్నేహితులు వెకేషన్‌కు వెళ్లినప్పుడు వారితో 12వ మనిషి కలుస్తాడు. ఆ 12వ మనిషి ఎవరు ? మిగతా 11 మందికి అతనికి ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలతో ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్‌తోపాటు, లాక్డ్ థ్రిల్లర్‌లా ఉంది. ఈ మూవీ కూడా దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్! 12th Man Official Trailer Out Now!!! Watch Here👉 https://t.co/5oyPiQhpH3#12thMan streaming from May 20 on @DisneyPlusHS #12thManOnHotstar @Mohanlal @aashirvadcine @KurupSaiju @Iamunnimukundan @JeethuJosephDir @12thManMovie @sethusivanand @SshivadaOffcl @DisneyplusHSMal pic.twitter.com/tUxENWUIKz — DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) May 3, 2022 -
‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్
Record Deal For Digital, Audio Rights To Liger Movie: విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'లైగర్'. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్ర చేయనుండడం విశేషం. దీంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మైక్ టైసన్ విజయ్ తండ్రిగా కనిపించనున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్‌కు ముందే భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. చదవండి: లెటేస్ట్ అప్డేట్: ఈ నెలలోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్! ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్, ఆడియో రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. లైగర్ ఆడియో హక్కులను సోనీ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వినికిడి. దీని కోసం సోనీ రూ. 14 కోట్లు చెల్లించినట్లు సమాచారం. విజయ్ కెరీర్లో ఇది అది పెద్దం మొత్తం అని చెప్పాలి. అలాగే ఓటీటీ హక్కులను డిస్నీప్లస్ హాట్‌స్టార్ భారీ డీల్‌కు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే శాటిలైట్ హక్కులను ఇప్పటికే స్టార్ నెట్వర్క్ పొందిందట. ఇక త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. చదవండి: ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయిన బిందు! అయితే విజయ్ దేవరకొండకు ఉన్న స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకొని మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు కూడా సమాచారం. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైం కళ్లు చెదిరే డీల్‌కు సొంతం చేసుకుందంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మించాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను మణిశర్మ అందిస్తుండగా.. పాటలకు తనిష్క్ బాగ్చీ స్వరాలు కూర్చనున్నాడు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్‌లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తాజాగా హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే4 నుంచి ప్రసారం కానుంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’.విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే6న విడుదల కానుంది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంతో సుమ పల్లెటూరి మహిళ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంటులూరి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. 'మహానటి' కీర్తి సురేష్ సెల్వ రాఘవన్‌తో కలిసి నటించిన తాజా చిత్రం 'సాని కాయిధం' . చిన్ని పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. అరుణ్ మథేశ్వరం ఈ చిత్రానికి దర్శకత్వం వహిచారు. ఇందులో కీర్తి సురేష్ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో అలరించనుంది. థియేరట్‌లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మే6న చిన్ని స్ట్రీమింగ్ కానుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్గా నటించింది. సుధీర్ చంద్ర నిర్మించారు. పెళ్లి కోసం పాట్లు పడే మధ్యతరగతి అబ్బాయిగా విశ్వక్ సేన్ నటించినట్లు తెలుస్తోందినీ సినిమా మే6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెజాన్ ప్రేమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(కన్నడ)- మే5 ద వైల్డ్(వెబ్‌సిరీస్2)- మే6 నెట్‌ప్లిక్స్ రాధేశ్యామ్(హిందీ)-మే4 థార్(మిందీ)-మే6 40 ఇయర్స్ యంగ్(హాలీవుడ్)-మే4 ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్(వెబ్‌సిరీస్)-మే6 డిస్నీ+హాట్‌స్టార్ హోమ్ శాంతి(హిందీ సిరీస్)-మే6 స్టోరీస్ ఆన్ది నెక్ట్స్ పేజ్(హిందీ సిరీస్)-మే6 జీ5 ఝండ్(హిందీ)-మే6 -
ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు..
Upcoming Theatre OTT Movies Web Series In April Last Week 2022: మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సందడి పండుగల కనువిందు చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' వసూళ్ల పరంపర కొనసాగుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత తాజాగా విడుదలయ్యే చిత్రాలపై పడింది సినీ ప్రియుల కన్ను. మూవీ లవర్స్ కోసమే అన్నట్లుగా ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఒక పెద్ద సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. అలాగే ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దామా ! 1. ఆచార్య మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అందులోనూ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌తోపాటు ఆయన కొడుకు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ అంటే.. ఆ అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29 నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు 'ఆచార్య'. 'ధర్మస్థలి' అనే ప్రాంతం చుట్టూ తిరిగే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే. 2. కణ్మనీ రాంబో ఖతీజా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, నయనతారలతో ఆడిపాడేందుకు సిద్ధమయ్యాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. చిరంజీవి 'ఆచార్య' సినిమా కంటే ఒక్క రోజు ముందుగా థియేటర్లలో తన ప్రేమాయణంతో సందడి చేయనున్నాడు ఈ హీరో. అంటే ఏప్రిల్ 28న ఈ మూవీ విడుదల కానుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'కాతు వాక్కుల రెండు కాదల్'ను తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా'గా రిలీజ్ చేస్తున్నారు. 3. రన్ వే 34 బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ కలిసి నటించిన చిత్రం 'రన్ వే 34'. ఈ సినిమాతో సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు అజయ్ దేవగణ్. ఇందులో టాలీవుడ్ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ అలరించనున్నారు. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్, అజయ్ దేవగణ్ పైలట్లుగా నటించగా, అమితాబ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా అలరించనున్నారు. 4. హీరోపంతీ 2 బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన తాజా చిత్రం హీరోపంతీ 2. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తారా సుతారియా హీరోయిన్గా నటించింది. రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియద్వాలా నిర్మించారు. లైలా అనే విలన్ రోల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ తన యాక్టింగ్ మార్క్‌ను చూపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల విడుదలకు సిద్ధంగా ఉంది. ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. నెట్‌ఫ్లిక్స్ గంగుబాయి కతియావాడి-ఏప్రిల్ 26 (తెలుగు) 365 డేస్: దిస్ డే-ఏప్రిల్ 27 (హాలీవుడ్) మిషన్ ఇంపాజిబుల్-ఏప్రిల్ 29 (తెలుగు) ఓ జార్క్-ఏప్రిల్ 29 (వెబ్ సిరీస్) ఆక్వాఫినా ఈజ్ నోరా ఫ్రమ్ క్వీన్స్-ఏప్రిల్ 29 (హాలీవుడ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనుపమ: నమస్తే అమెరికా-ఏప్రిల్ 25 (హిందీ) బ్యారీ-ఏప్రిల్ 25 (వెబ్ సిరీస్, సీజన్ 3) మిషన్ సిండ్రెల్లా-ఏప్రిల్ 29 (హిందీ) జీ5 నెవర్ కిస్ యువర్ బెస్ట్‌ఫ్రెండ్-ఏప్రిల్ 29 (హిందీ) అమెజాన్ ప్రైమ్ వీడియో అన్డన్-ఏప్రిల్ 29 (కార్టూన్ సిరీస్) వూట్ బేక్డ్-ఏప్రిల్ 25 (వెబ్ సిరీస్, సీజన్ 3) ది ఆఫర్-ఏప్రిల్ 28 (వెబ్ సిరీస్) చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైంపాస్
Top 5 Best Movies On Disney Plus Hotstar For April 2022: ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లు ప్రారంభమైన వెబ్ సిరీస్‌లు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాల కోసం ఓటీటీల బాట పడుతున్నారు సినీ ప్రియులు. పెద్ద సినిమాలను అటు థియేటర్లలో వీక్షిస్తూ.. మరోవైపు ఓటీటీలో వచ్చే చిత్రాలపై కూడా ఓ కన్ను వేస్తున్నారు. ఓటీటీలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. అలాంటి ఓటీటీల్లో ఒకటి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలై డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో దూసుకుపోతున్న టాప్ 5 చిత్రాలపై ఓ లుక్కేద్దామా.! డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాలను చూసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. 1. భీష్మ పర్వం అమల్ నీరద్ దర్శకత్వం వహించిన మలయాళ గ్యాంగ్‌స్టర్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం భీష్మ పర్వం. ఈ మూవీలో ప్రముఖ సీనియర్ నటుడు మమ్ముట్టి నటించారు. సముద్రపు ఎగుమతిదారునిగా మారిన గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించి మెప్పించాడు మమ్ముట్టి. ఓ గ్యాంగ్‌స్టర్‌కు ఎదురయ్యే చావు బెదిరింపుల చుట్టూ తిరిగుతుంది ఈ మూవీ కథ. మార్చి 3, 2022న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. 2. తానక్కరన్ (పోలీసోడు) విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తమిళ పోలీసు డ్రామా చిత్రం 'తానక్కరన్'. తెలుగులో 'పోలీసోడు' అనే టైటిల్‌తో నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 1997లో జరిగిన పోలీసు శిక్షణకు సంబంధించిన నిజ జీవితపు సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి తమిజా దర్శకత్వం వహించగా.. జిబ్రాన్ స్వరాలు సమకూర్చారు. 3. ప్రవీణ్ తాంబే ఎవరు ? శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్ర పోషించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ప్రవీణ్ తాంబే ఎవరు?. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్ తాంబే జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. జయప్రద్ దేశాయి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 1, 2022న నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. 4. డెత్ ఆన్ ది నైలు ఈ సినిమా ప్రసిద్ధ రచయిత్రి అగాథా క్రిస్టీ రాసిన 'డెత్ ఆన్ ది నైలు' నవల ఆధారంగా తెరకెక్కించారు. వండర్ వుమెన్ గాల్ గాడోట్, బాలీవుడ్ యాక్టర్ అలీ ఫాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కెన్నెత్ బ్రానాగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11, 2022న యూకే, యూఎస్ఏలలో విడుదలైంది. ఓ హత్యకు సంబంధించిన దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుంది. 5. ది కింగ్స్‌మన్ కింగ్స్‌మన్ సిరీస్‌లో మూడో చిత్రంగా వచ్చింది ఈ మూవీ. రాల్ఫ్ ఫియెన్నెస్, గెమ్మ ఆర్టెర్టన్, రైస్ ఇఫాన్స్, టామ్ హోలాండర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నిటించారు. మాథ్యూ వాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మొదటి ప్రపంచ యుద్దం, కింగ్స్‌మన్ సంస్థ మూలానికి సంబంధించిన సంఘటనల చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. కరోనా కారణంగా అనేక వాయిదాల తర్వాత డిసెంబర్ 22, 2021న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు..
Top 10 Best Telugu Web Series As Per IMDB Rating: కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్కు సరైన వేదికలుగా మారాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విభిన్నమైన కథలతో మూవీ లవర్స్‌కు ఎంతో చేరువయ్యాయి. ఓటీటీల్లో స్ట్రీమ్ అయిన చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లంటే పెట్టింది పేరుగా బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్ సిరీస్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ సీన్ మారింది. వెబ్ సిరీస్‌లు తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. తెరకెక్కించడమే కాకుండా తెలుగు నేటివిటికి తగినట్లుగా మలిచి మంచి హిట్ కూడా అందుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి ఓటింగ్ తీసుకుని వాటికి రేటింగ్ నిర్ణయిస్తుంది ఐఎమ్‌డీబీ వెబ్సైట్. ఈ రకంగా ఐఎమ్‌డీబీ రేటింగ్‌ను బట్టి ప్రేక్షకులను మెచ్చిన టాప్ 10 తెలుగు వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా ! చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. 1. లూజర్-8.8 రేటింగ్ (జీ5) 2. కుడి ఎడమైతే-8.4 రేటింగ్ (ఆహా) 3. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ-8.4 రేటింగ్ (జీ5) 4. కొత్త పోరడు-8.3 రేటింగ్ (ఆహా) 5. తరగతి గది దాటి-8 రేటింగ్ (ఆహా) 6. గాడ్ ఆఫ్ ధర్మపురి-7.8 రేటింగ్ (జీ5) 7. పరంపర-7.6 రేటింగ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 8. మస్తీస్-7.2 రేటింగ్ (ఆహా) 9. చదరంగం-7.1 రేటింగ్ (జీ5) 10. బ్యూటీ అండ్ ది బేకర్-7 రేటింగ్ (ఆహా) చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. -
అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు..
Top 10 Best Zombie Web Series And TV Shows In OTT: కరోనా వ్యాప్తి, దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం కళ్లారా చూశాం, అనుభవించాం కూడా. దగ్గు, తుమ్ములతోనే కరోనా వైరస్ వ్యాప్తి చెంది మన ఆరోగ్యాన్ని క్షిణించేలా చేసి మెలిమెల్లిగా చంపుతుంది. ఒక వైరస్ సోకిన వ్యక్తి మరో మనిషిని చంపి నరమాంస భక్షుకుల్లా పీక్కుతింటే. ఆ వైరస్ క్షణాల్లో సోకి మనుషులంతా చనిపోతే. ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది కదా. అదే 'జాంబీ' వైరస్. ఈ జాంబీ వైరస్ కాన్సెప్ట్‌తో వచ్చినవే 'జాంబీస్' చిత్రాలు. 'జాంబీ రెడ్డి' సినిమాతో జాంబీస్ అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అదంతా సక్సెస్ సాధించలేదు. కానీ ఒళ్లు గగుర్పొడిచేలా ఈ జాంబీస్ మూవీస్, వెబ్ సిరీస్ చాలానే ఉన్నాయి. ఇది వరకు సినిమాల్లో చూపించిన ఈ కరోనా వైరస్‌ను ప్రత్యక్షంగా అనుభవించాం. అయితే త్వరలోనే 'జాంబీ' వైరస్‌ను చూసే పరిస్థితి కూడా రావొచ్చనే భయాందోళనలు కలుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ జాంబీ వైరస్ బయటకు వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్, టీవీ షోలను చూడాల్సిందే. ఈ జాంబీస్ మిమ్మల్ని నిద్రలోనూ వెంటాడతాయంటే అతిశయోక్తి కాదు. చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. 1. ది వాకింగ్ డెడ్ (నెట్‌ఫ్లిక్స్) 2. ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ (నెట్‌ఫ్లిక్స్) 3. గేమ్ ఆఫ్ థ్రోన్స్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 4. బేతాల్ (నెట్‌ఫ్లిక్స్) 5. కింగ్డమ్ (నెట్‌ఫ్లిక్స్) 6. ది రిటర్న్డ్ (నెట్‌ఫ్లిక్స్) 7. బ్లాక్ సమ్మర్ (నెట్‌ఫ్లిక్స్) 8. ఐ జాంబీ (నెట్‌ఫ్లిక్స్) 9. అమెరికన్ గాడ్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) 10. ఆష్ Vs ఎవిల్డెడ్ (నెట్‌ఫ్లిక్స్) -
అభిషేక్ బచ్చన్ అలరించిన ఓటీటీ చిత్రాలు ఇవే..
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తనదైన నటనతో విభిన్న కథలను ఎంచుకుంటూ బిజీగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల బిగ్ బుల్, బాబ్ బిస్వాస్ చిత్రంతో అలరించిన అభిషేక్ తాజాగా 'దస్వీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన తాజాగా నటించిన 'దస్వీ' మూవీ చదువు గొప్పతనం, పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ నెల 7న నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే గత రెండు సంవత్సరాలుగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ ఒక వెబ్ సిరీస్, 4 సినిమాల్లో నటించాడు. ఇవన్ని నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ కావడం విశేషం. కాగా అభిషేక్ తన నటనతో మెప్పించిన ఆ వెబ్ సిరీస్, సినిమాలేంటో చూసేద్దాం ! చదవండి: ముఖ్యమంత్రి పదో తరగతి చదివితే.. 'దస్వీ' రివ్యూ 1. దస్వీ నిరాక్షరాస్యుడైన రాజకీయ నాయకుడు జైలు శిక్ష సమయంలో చదువుకున్న విలువ గురించి ఎలా తెలుసుకున్నాడేది పూర్తి వినోదభరితంగా చూపించిన మూవీ 'దస్వీ'. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి, నిరక్షరాస్యుడైన గంగారామ్ చౌదరి పాత్రలో అభిషేక్ బచ్చన్ తన నటనతో మెప్పించాడు. అభిషేక్ బచ్చన్‌తోపాటు యామీ గౌతమ్, నిమ్రత్ కౌర్ నటించిన ఈ మూవీ ఏప్రిల్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్, జియో సినిమాలలో స్ట్రీమింగ్ అవుతోంది. 2. బాబ్ బిస్వాస్ 2012లో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ 'కహాని' డైరెక్టర్ సుజోయ్ ఘోష్ కథ అందించిన సీరియల్ కిల్లర్ క్రైమ్ డ్రామా చిత్రం 'బాబ్ బిస్వాస్'. ఈ సినిమాకు సుజోయ్ ఘోష్ కుమార్తె దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. అభిషేక్ బచ్చన్.. బాబ్ బిస్వాస్ పాత్రలో నటించిన ఈ చిత్రం జీ5లో డిసెంబర్ 3, 2021 నుంచి ప్రసారం అవుతోంది. 3. ది బిగ్ బుల్ ప్రముఖ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ 'ది బిగ్ బుల్'. ఇందులో హేమంత్ షా అనే లీడింగ్ రోల్లో అభిషేక్ బచ్చన్ నటించాడు. ఏప్రిల్ 8, 2021 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హర్షద్ మెహతా ఫైనాన్షియల్ కుంభకోణానికి ప్రేరణగా వచ్చిన 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత ఈ మూవీ వచ్చింది. 4. లూడో రాజ్ కుమార్ రావు, ఆదిత్య రాయ్ కపూర్, పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్‌లతోపాటు అభిషేక్ బచ్చన్ నటించిన డార్క్ క్రైమ్ కామెడీ చిత్రం 'లూడో'. ఈ మూవీకి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 12, 2020 నుంచి ప్రదర్శించబడుతున్న ఈ చిత్రంలో 'బటుకేశ్వర్ బిట్టు తివారీ' అనే గూండా పాత్రలో అలరించాడు అభిషేక్ బచ్చన్. 5. బ్రీత్: ఇన్టు ది షాడోస్ జూలై 10, 2020న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సైకలాజికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'బ్రీత్: ఇన్టు ది షాడోస్'. ఈ వెబ్ సిరీస్‌తోనే అభిషేక్ బచ్చన్ ఓటీటీలోకి అరంగేట్రం చేశాడు. ఇందులో అతి భయంకరమైన కిడ్నాపర్ నుంచి తన కుమార్తెను రక్షించడానికి ఎంతకైనా తెగించే డాక్టర్ అవినాష్ సబర్వాల్ పాత్రలో ఆకట్టుకున్నాడు అభిషేక్ బచ్చన్. ఇది 2018లో వచ్చిన 'బ్రీత్' సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కింది. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. -
ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు..
కరోనా మహామ్మారి రాకతో కేంద్రప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అనేక వ్యవస్థలు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అనేక సంస్థలతోపాటు ఎంటర్టైన్మెంట్కు మూల స్థంభాలైన థియేటర్లు కూడా మూతపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఏ ఒక్కరూ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే గడపాల్సిన పరిస్థతి. అప్పుడే ప్రతీ సినీ ప్రేక్షకుడికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినోదపు ప్లాట్ఫామ్ల్లా దర్శనమిచ్చాయి. పెద్ద హీరోల నుంచి చిన్న సినిమాలు వరకు అన్ని ఈ ఓటీటీల్లోనే రిలీజయ్యాయి. చదవండి: రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఓటీటీ సిత్రాలు.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్‌లతో ఓటీటీలు కళకళలాడాయి. దీంతో మూవీ లవర్స్ అందరూ బయటకు వెళ్లే పనిలేకుండా అరచేతిలో, ఇంటి హాల్లోనే సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఆస్వాదించారు. ఇప్పటికీ కూడా థియేటర్లలో విడుదలైన పెద్ద హీరోల సినిమాలను సైతం ఒక నెలలోపే ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓటీటీలకు ఎలాంటి క్రేజ్ ఉందనేది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓటీటీల్లో మూవీ లవర్స్ కచ్చితంగా మిస్ అవ్వకూడని టాప్ 6 పర భాష చిత్రాలేంటో చూద్దాం. 1. ప్రవీణ్ తాంబే ఎవరు ?, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2. 83, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ 3. డ్యూన్, అమెజాన్ ప్రైమ్ వీడియో 4. ఇరుది పక్కమ్ (తమిళం), అమెజాన్ ప్రైమ్ వీడియో 5. పడా (మలయాళం), అమెజాన్ ప్రైమ్ వీడియో 6. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్, బుక్ మై షో చదవండి: టాలీవుడ్ టూ హాలీవుడ్.. ఓటీటీల్లో రచ్చ చేస్తున్న సినిమాలు ఇవే -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో రెండోవారం కూడా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్ నటనకు ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ చూసేందుకు సినీప్రియులు ఎగబడుతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం దూకుడు చూస్తుంటే మరి కొన్ని రోజుల దాకా దీని ప్రభంజనం ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ సినిమాను కొద్దిగా ఇరకాటంలో పెట్టేందుకు ఈ వారం వచ్చేస్తున్నాయి మరికొన్ని చిత్రాలు. అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఓసారి చూద్దామా ! 1. గని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయి మంజ్రేకర్ జోడీగా వస్తున్న క్రీడా నేపథ్యం ఉన్న సినిమా 'గని.' కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న 'గని' ఏప్రిల్ 8న ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. బాబాయి పవన్ కల్యాణ్ 'తమ్ముడు' సినిమా స్ఫూర్తితో ఈ చిత్రం చేసినట్లు వరుణ్ చెబుతున్నాడు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి భారీతారగణంతో వస్తున్న 'గని' ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. 2. మా ఇష్టం (డేంజరస్) సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్లో రూపొందిన క్రైమ్ డ్రామా చిత్రం 'మా ఇష్టం (డేంజరస్)'. అప్సరారాణి, నైనా గంగూలీ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఏప్రిల్ 8న విడుదల కానుంది. స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. వర్మ చేసిన ఈ ప్రయోగాన్ని ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు.. 1. స్టాండప్ రాహుల్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్గా వచ్చిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. శాంటో మోహన వీరంకి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో మార్చి 18న విడదలైంది. కాగా ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ చస్వీ (హిందీ) ఏప్రిల్ 7 ఎత్తర్కుం తునిందావన్ (ఈటీ, తమిళం) ఏప్రిల్ 7 ఎలైట్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 8 మెటల్ లార్డ్స్ (హాలీవుడ్) ఏప్రిల్ 8 ది ఇన్‌బిట్విన్ (హాలీవుడ్) ఏప్రిల్ 8 అమెజాన్ ప్రైమ్ వీడియో మర్డర్ ఇన్ అగోండా (హిందీ) ఏప్రిల్ 8 నారదన్ (మలయాళం) ఏప్రిల్ 8 జీ5 ఎక్ లవ్ యా (కన్నడ) ఏప్రిల్ 8 అభయ్ 3 (హిందీ) ఏప్రిల్ 8 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ది కింగ్స్ మెన్ (హాలీవుడ్) ఏప్రిల్ 8 -
షూటింగ్లో స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాను: హీరో
మండుటెండల కారణంగా షూటింగ్లో స్పృహతప్పి పడిపోయే స్థితికి చేరుకున్నానని నటుడు విక్రమ్ ప్రభు పేర్కొన్నారు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం టాణాక్కారన్. ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, పి.గోపీనాథ్, తంగ ప్రభాకరన్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. నటుడు తమిళ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 8 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. గురువారం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు విక్రమ్‌ప్రభు మాట్లాడుతూ షూటింగ్‌ను మండుటెండల్లో నిర్వహించినట్లు చెప్పారు. ఒక సమయంలో తానే స్పృహ కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. -
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉచితంగా ఐపీఎల్-2022 మ్యాచ్‌లను ఇలా చూడండి..!
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ టీ20 లీగ్ ఐపీఎల్- 15వ ఎడిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లు 29 మే 2022 వరకు కొనసాగుతాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్ లేదా డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా వీక్షించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అభిమానుల కోసం పలు దిగ్గజ టెలికాం సంస్థలు జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సరికొత్త బండిల్ రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటితో ఐపీఎల్-2022 మ్యాచ్‌లను ఉచితంగా చూడడమే కాకుండా ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తోంది. టెలికాం సంస్థలే కాకుండా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థలు కూడా పలు ఆఫర్లను అందిస్తున్నాయి. ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్ సేవలను జియో అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్ రూ. 499 ప్లాన్: 2GB డేటా/రోజు: అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 28 రోజుల చెల్లుబాటు రూ. 601 ప్లాన్: 3GB డేటా/రోజు + 6GB అదనపు డేటా, అపరిమిత కాల్లు, 100 SMS/రోజు, 28 రోజుల చెల్లుబాటు రూ. 659 ప్లాన్: 1.5GB డేటా/రోజు, 56 రోజుల చెల్లుబాటు. రూ. 799 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 56 రోజుల చెల్లుబాటు రూ. 1066 ప్లాన్: 2GB డేటా/రోజు + 5GB అదనపు డేటా, అపరిమిత కాల్లు, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు రూ. 3,199 ప్లాన్: 2GB డేటా/రోజు + 10GB అదనపు డేటా, అపరిమిత కాల్లు, 100/రోజు, 365 రోజుల చెల్లుబాటు రూ. 1,499 ప్లాన్: రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్లు, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు రూ. 4,199 ప్లాన్: రోజుకు 3GB డేటా, అపరిమిత కాల్లు, 100 SMS/రోజు, 365 రోజుల చెల్లుబాటు ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్ సేవలను వోడాఫోన్ ఐడియా అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్ రూ. 601 ప్లాన్: 3GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 28 రోజుల చెల్లుబాటు రూ. 901 ప్లాన్: 3GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 70 రోజుల చెల్లుబాటు రూ. 3,099 ప్లాన్: 1.5GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 365 రోజుల చెల్లుబాటు ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్ సేవలను ఎయిర్టెల్ అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్ రూ. 838 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 56 రోజుల చెల్లుబాటు, ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైం, ఎయిర్టెల్ వీంక్ సేవలను ఉచితంగా పొందవచ్చును. రూ. 839 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు రూ. 2,999 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు ► డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవలను ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ స్లైస్ అందిస్తోంది. ఇది కేవలం స్లైస్ స్పార్క్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌పై రూ. 250 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తోంది. ► టైమ్స్ ప్రైమ్ సబ్స్క్రైబర్లు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. టైమ్స్ ప్రైమ్ తన కొత్త కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. టైమ్స్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు రూ. 1,199 చెల్లించడంతో కస్టమర్లు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్కి ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు. ► హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులు GyFTR వెబ్‌సైట్‌ని ఉపయోగించి డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని ప్రత్యేక తగ్గింపు రేటుతో కొనుగోలు చేయవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కొనుగోలుపై ఫ్లాట్ 15 శాతం తగ్గింపును అందిస్తోంది. ► ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో తరచుగా ఆన్లైన్ షాపింగ్ చేసేవారైతే, మీ కొనుగోళ్లకు రివార్డ్‌లుగా సూపర్కాయిన్స్ను అందిస్తోంది. ఈ SuperCoins తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ పొందడానికి రీడీమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు 299 Flipkart SuperCoinsతో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు. చదవండి: అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్..! ట్రయంఫ్ నుంచి..! -
జీపుపై పవన్ కల్యాణ్ కూర్చున్న కటౌట్.. భీమ్లానాయక్ ఎలివేషన్ !
Pawan Kalyan Bheemla Nayak Movie Elevation: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా ముఖ్య పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదలై విజయం సాధించింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించిన భీమ్లా నాయక్.. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషీయమ్కు రీమేక్‌గా వచ్చింది. ఇప్పుడు భీమ్లా నాయక్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న భీమ్లానాయక్ మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ సందర్భంగా డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవర్‌స్టార్ అభిమానులు ఓ వినూత్నమైన ఎలివేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటుచేశారు. మార్చి 25 సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ‘భీమ్లానాయక్’ సినిమాలో ఏ విధంగా అయితే పవన్ కల్యాణ్ జీపుపై కూర్చుంటాడో అదే తరహాలో జీపుపై పవన్ కటౌట్‌ను ఆవిష్కరించారు. ఓ క్రేన్‌కు వేలాడదీసిన ఈ జీపు నెక్లెస్ రోడ్లో అన్ని వైపులా కనిపించేలా చేయడంతో పాటుగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలతో వీక్షకులలో ఆసక్తిని రేకిత్తించారు. -
డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియాకు సునీల్ రాయన్ రాజీనామా!
డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియా అధ్యక్షుడు సునీల్ రాయన్ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. గూగుల్ క్లౌడ్ ఫర్ గేమ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన తర్వాత 2020 జూన్ నెలలో ఆయన కంపెనీ ఆయన కంపెనీలో చేరారు. వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా అండ్ స్టార్ ఇండియా అధ్యక్షుడు కె మాధవన్ జారీ చేసిన అంతర్గత మెమోలో రేయాన్ రాజీనామా గురించి సిబ్బందికి తెలియజేశారు. "సునీల్ రాయన్ వ్యక్తిగత కారణాల వల్ల కంపెనీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్'కు నాయకత్వం వహించడానికి అమెరికా నుంచి భారతదేశానికి రావలనే ఉద్దేశ్యంతో సునీల్ 2020 ప్రారంభంలో మాతో చేరారు. కరోనా మహమ్మారి వల్ల ఆ ప్రణాళికలను నిలిచిపోయాయి. అతను జట్టును రిమోట్‌గా నడిపించారు" అని మెమోలో పేర్కొన్నారు. ఏదేమైనా, ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో సునీల్, తన కుటుంబం అమెరికాలో ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాయన్ నాయకత్వంలో హాట్‌స్టార్ బృందం గత రెండేళ్లలో "అద్భుతమైన విజయాలు" సాధించిందని మాధవన్ అన్నారు. సునీల్ రాయన్ మే వరకు కంపెనీలో పనిచేస్తారు. సునీల్ రాయన్ ఇంతక ముందు మెకిన్సే అండ్ కంపెనీ, ఐబీఎం, ఐగేట్ మాస్టెక్, ఇన్ఫోసిస్ సంస్థలలో కూడా పనిచేశారు. (చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి ఏథర్ గుడ్‌న్యూస్.. సీబిల్ స్కోర్ లేకున్నా రుణాలు!) -
ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్,అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్! ఐపీఎల్ అభిమానులకు పండగే!
దేశంలో ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్‌ను వీక్షించేందుకు జోష్ మీద వున్న క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా బండిల్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లతో పాటు ఉచితంగా ఓటీటీ సేవల్ని ఉచితంగా అందిస్తుంది. కొద్దిరోజుల క్రితం రిలయన్స్ జియో ఉచితంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ను ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. తాజాగా ఎయిర్టెల్ డిస్నీ+హాట్‌స్టార్‌ను వీక్షించవచ్చు. ఇందులో అదనంగా మరో 3రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ను ఉచితంగా చూసే అవకాశం అందిస్తున్నట్లు ఎయిర్టెల్ ప్రతినిధులు తెలిపారు. ఎయిర్టెల్ అందిస్తున్న ఉచిత డిస్నీ+హాట్‌స్టార్ సేవలు ఎయిర్టెల్ రూ.499ప్లాన్: ఈ ప్లాన్‌ను ఎంచుకున్న యూజర్లకు ప్రతిరోజు 2జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ రూ.599 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 3జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ బెన్ఫిట్ పొందవచ్చు. ఎయిర్టెల్ రూ.839 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెన్ఫిట్స్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినొచ్చు. ఎయిర్టెల్ రూ.2,999 ప్లాన్: ఈ ప్లాన్‌లో యూజర్లు 365రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ డేటా , ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెన్ఫిట్స్ పొందవచ్చు. ఎయిర్టెల్ రూ.3359ప్లాన్: ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు ప్రతిరోజు 2జీబీ డేటా, దీంతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ బెన్ఫిట్ పొందవచ్చు. చదవండి: 'ఆఫర్లు మావి..ఛాయిస్ మీది', పోటీపడుతున్న టెలికాం దిగ్గజాలు!