రెండు వారాలుగా టాప్‌లో స్ట్రీమింగ్..  ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ‍్రిల్లర్ | iravatham movie first place from two weeks in top ten shows of Hot Star | Sakshi
Sakshi News home page

iravatham movie: ఓటీటీలో దూసుకెళ్తున్న 'ఐరావతం'.. నెంబర్‌వన్‌గా స్ట్రీమింగ్‌

Published Tue, Nov 29 2022 6:37 PM | Last Updated on Tue, Nov 29 2022 7:29 PM

iravatham movie first place from two weeks in top ten shows of Hot Star - Sakshi

ఎస్తేర్ నోహ, అమర్ దీప్, అరుణ్  ప్రధాన పాత్రల్లో ఒక తెల్లటి కెమెరా ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఐరావతం'.  నూజివీడు టాకీస్ పతాకంపై గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రేఖ పలగాని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి, లలిత కుమారి తోట నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ఫ్యూజన్' సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఐరావతం మూవీ ఈ నెల 17 నుంచి రెండు వారాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఎస్తేర్, అమర్ దీప్, తన్వి నెగ్గి అరుణ్ డబుల్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... 'సుహాస్ మాకు ఆటవిడుపుగా ఐరావతం కథ చెప్తే విని కథలోని స్క్రీన్ ప్లే స్ట్రాటజీ నచ్చి మూవీ తీద్దామనుకున్నాం. చివరికి ఈ మూవీ హాట్ స్టార్‌లో అనుకోకుండా  రెండు వారాలుగా టాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మంచి కథని నమ్మినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం.' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...'ఫ్యూజన్ జోనర్‌లో తీసిన ఐరావతం హాట్ స్టార్ ప్రేక్షకులకు నచ్చడం చాలా హ్యాపీ. నిర్మాతలకు థాంక్స్. టెక్నీషియన్స్  థాంక్స్.' అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement