ఓటీటీలో దూసుకెళ్తున్న ఐరావతం.. రికార్డ్‌స్థాయిలో వ్యూయింగ్ మినిట్స్‌ | Iravatham Creates a new Record In Disney plus Hot star Viewing minutes | Sakshi
Sakshi News home page

Iravatham: ఓటీటీలో దూసుకెళ్తున్న ఐరావతం.. వ్యూయింగ్ మినిట్స్‌లో సరికొత్త రికార్డ్

Published Thu, Mar 23 2023 9:21 PM | Last Updated on Fri, Mar 24 2023 6:10 AM

Iravatham Creates a new Record In Disney plus Hot star Viewing minutes - Sakshi

ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఐరావతం. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చిన్న సినిమా అయినా ఊహించని రీతిలో ఆదరణ దక్కించుకుంది. ఇప్పటివరకు 200 మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ మినిట్స్‌తో దూసుకెళ్తోంది. ఈ మూవీ నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నూజివీడు టాకీస్‌పై రేఖ పలగని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. 

అసలు కథేంటంటే.. 

శ్లోక అనే బ్యూటీషియన్ కి బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్‌గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులవుతుంది. బర్త్ డే వీడియోలు తీస్తే డెత్ డే వీడియో లు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో  రహస్యాలు బయటకొస్తాయి. ఆ రహస్యాల అల్లికే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథా గమనంలో మనం ఒకటి ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది.మ‌న క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు  త‌న ప్రేమికుడితో వెళ్లిపోతుంది. తీరా ఆ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా. ఇ‍ప్పటి వరకు చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement