Minutes
-
రేటు తగ్గించే పరిస్థితి లేదు
ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపోను తగ్గించే పరిస్థితి ప్రస్తుతం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఉద్ఘాటించింది. అదే జరిగితే.. ధరలు తగ్గుదలకు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ప్రయోజనం లేకుండా పోతాయని అభిప్రాయపడింది. ధరల కట్టడే ఆర్బీఐ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేసింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమీక్షా సమావేశం మినిట్స్ ఈ అంశాలను వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల ప్రారంభ సమీక్ష సహా గడచిన ఐదు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం... రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతంగా ఉండాలని కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్నప్పటికీ తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. తగిన స్థాయిలో వర్షపాతం నమోదయితే.. 2024–25 క్యూ1,క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 5 శాతం, 4 శాతం, 4.6 శాతం, 4.7 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదవుతని పాలసీ సమీక్ష అంచనా వేసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థను ప్రభావితం చేస్తోందని, వస్తువుల ధరలపై ఇది తీవ్ర ఒత్తిడి తెస్తోందని, ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని కమిటీ అభిప్రాయపడింది. -
ఆహార ధరల పెరుగుదలే ప్రధాన ఆందోళన
ముంబై: ఆహార ధరల పెరుగుదలే వ్యవస్థలో ప్రధాన ఆందోళనకర అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిలో కఠిన ద్రవ్య విధానవైపే మొగ్గుచూపాలని ప్రస్తుతానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (6.5 శాతం) యథాతథంగానే కొనసాగించాలని ఎండీ పాత్ర, శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, రాజీవ్ రంజన్‌లతో సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఓటు వేశారు. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మినిట్స్ గురువారం విడుదలయ్యాయి. ‘మా పని (ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం) ఇంకా ముగియలేదు. కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరల ప్రాతిపదికన మొదటి రౌండ్ ద్రవ్య విధాన నిర్ణయాలు ఉంటాయి. అదే సమయంలో, విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలు, ఆందోళనల ప్రాతిపదికన రెండవ–రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మేము సిద్ధంగా ఉండాలి. దీనికి తక్షణం కఠిన విధానమే సరైందని కమిటీ భావిస్తోంది’’ అని దాస్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. 2022 నుంచి 250 బేసిస్ పాయింట్లు పెంపు ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని ఈ నెల తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. తాజాగా వెలువడిన మినిట్స్ కూడా ఇదే విషయాన్ని సూచించింది. అంచనాలకు అనుగుణంగానే... ఆర్బీఐ ఆందోళనకు అనుగుణంగానే పాలసీ తదనంతరం వెలువడిన జూలై నెల ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడం గమనార్హం. ఆర్బీఐ కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్‌లో 6 శాతం అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్సా్గ పరిగణించాల్సి ఉంటుంది. జూలైలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. 2022 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతం ఉంటే, ఈ ఏడాది జూన్‌లో 4.87గా నమోదయ్యింది. జూలైలో మళ్లీ తీవ్ర రూపం దాలి్చంది. వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూలైలో 11.51%గా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు 4.55%. జూలై 2022లో ఈ రేటు 6.69%గా ఉంది. ఒక్క కూరగాయల ధరలు జూలై లో ఏకంగా 37.43% ఎగశాయి. తృణ ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 13 శాతం పెరిగాయి. కీలక అంచనాలు ఇవీ... వృద్ధి తీరు: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ1లో 8%, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6%గా అంచనా. ద్రవ్యోల్బణం ధోరణి: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2%, క్యూ3లో 5.7%, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం. -
చంద్రయాన్ 3.. 'టెర్రర్ టైం' గురించి తెలుసా?
చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడిపై ఇస్రో ల్యాండర్ అడుగుపెట్టే క్షణం కోసం భారత్‌తో పాటు యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన చంద్రయాన్ 3 అడుగు దూరంలోనే ల్యాండింగ్ కోసం వేచి ఉంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపురూప ఘట్టం ఆవిషృతమౌతుందని ఇస్రో వర్గాలు ఇప్పటికే తెలిపారు. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో సఫలమైతే భారత్ అజేయంగా నిలుస్తుంది. సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 20 నిమిషాలు చాలా కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం మాడ్యూల్‌లోని సాంకేతికతను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ప్రదేశంలో దిగడానికి సూర్యదయం కాగానే ప్రక్రియను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 5.45 తర్వాత అసలైన ప్రక్రియ ప్రారంభమైతుందని అంచనా వేస్తున్నారు. ఒకసారి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చివరి '20 మినెట్ టెర్రర్'గా అభివర్ణించారు. Chandrayaan-3 Mission: The mission is on schedule. Systems are undergoing regular checks. Smooth sailing is continuing. The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement! The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY — ISRO (@isro) August 22, 2023 చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీల దూరంలో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి నిమిషాలు కీలకం. చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ల్యాండర్ తన ఇంజన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత 11 నిమిషాల పాటు రన్ బ్రేకింగ్ దశ ప్రారంభం అవుతుంది. ఈ దశలో ల్యాండర్ చంద్రునికి సమాంతరంగా ఉంటుంది. క్రమంగా ఫైన్ బ్రేకింగ్ దశలోకి వస్తుంది. అక్కడ ల్యాండర్ 90 డిగ్రీల వంపు తిరుగుతుంది. ఈ దశలోనే గతంలో చంద్రయాన్ 2 కూలిపోయింది. ఈ దశల అనంతరం చంద్రునికి కేవలం 800 మీటర్ల ఎత్తులో ల్యాండర్ వేగం సున్నాకు చేరుతుంది. చివరకు 150 మీటర్లకు చేరుకోగానే సరైన ప్రదేశం కోసం ల్యాండర్ వెతుకుతుంది. సరైన స్థలంలో సెకనుకు 3 మీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలాన్ని తాకుతుంది. ఈ విధంగా చివరి 20 నిమిషాల టెర్రర్ టైంకు తెరపడి మిషన్ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత చంద్రునిపై ల్యాండర్ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుందని ఇస్రో వెల్లడించింది. ఇదీ చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ.. -
స్టేషన్‌కు వచ్చి చూస్తే రైలు లేదు.. రాలేదనుకుంటా? అంతలోనే షాక్!
ముంబయి: గోవా ఎక్స్‌ప్రెస్ రైలు 45 మంది ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని మన్మాడ్ స్టేషన్లోకి 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. రైలును అందుకోవడానికి నిర్ణీత సమయానికి స్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులు విషయం తెలుసుకుని తెల్లబోయారు. వాస్కోడగామ-హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని మన్మాడ్కు ఉదయం 10.35కి రావాల్సి ఉంది. కానీ అది రూటు మార్చుకుని ఉదయం 9.05 గంటలకే స్టేషన్‌కు చేరుకుంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్టేషన్లో నిలిచి, వెంటనే పరుగులు తీసింది. తీరిగ్గా నిర్ణీత సమయానికి గోవా ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్యాసింజర్లు స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. స్టేషన్ మేనేజర్ని నిలదీశారు. తమ ప్రయాణానికి మరో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. రైల్వే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి డాక్టర్ శివరాజ్ మనస్పూరే తెలిపారు. గోవా ఎక్స్‌ప్రెస్ ఎప్పుడూ వచ్చే బెళగామి--మిరాజ్-దౌండ్ మార్గంలో కాకుండా రోహా-కల్యాణ్-నాసిక్ రోడ్ మార్గంలో మళ్లించారని పేర్కొన్నారు. అందుకే మన్మాడ్ స్టేషన్‌కి సమయానికి ముందే వచ్చేసిందని వెల్లడించారు. మన్మాడ్ స్టేషన్లో స్టాప్ లేకున్నా గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ప్రయాణికులను తరలించారు. అక్కడి నుంచి జల్గాన్లో వరకు ప్రయాణికులను తీసుకువెళ్లారు. బాధిత ప్రయాణికుల కోసం జల్గాన్లో గోవా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
Odisha Train Accident: నిమిషాల వ్యవధిలోనే..మూడు రైళ్లు..
ఒడిశా ఘోర రైలు ప్రమాదం ఎలా జరిగిందనేది సర్వత్రా.. అందరి మదిలోను మెదులుతున్న ప్రశ్న. ఐతే ఆ ఘటన గురించి ప్రత్యక్షసాక్షులు, అధికారుల కథనం మేరకు..ఈ భారీ విషాదం నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు తెలుస్తోంది. కోరమాండల్ షాలిమర్ ఎక్స్‌ప్రెస్ అనే ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడం తోపాటు గూడ్స్ రైలుని ఢీ కొట్టింది. అదే సమయంలో అటుగా వస్తున్న యశ్వంత్‌పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ అనే మరోరైలు పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో రెండు ప్యాసింజర్ రైళ్లు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిపారు. మూడవ రైలు అదే సైట్లో ఆపి ఉంచిన గూడ్స్ రైలు ప్రమాదం బారిన పడినట్లు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 6.50 నుంచి 7.10 గంటల మధ్య నిమిషాల వ్యవధిలో ఈ పెను ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ఇక కార్యాచరణ వైఫల్యంపై ప్రశ్నల నేపథ్యంలో రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అలాగే క్రాష్ జరిగిన ప్రదేశంలో సీసీఫుటేజ్ విజ్యువల్స్‌లో పట్టాలపై రైలు కోచ్‌లు చిన్నాభిన్నామై పోతున్నట్లుగా మెలిపెట్టే దృశ్యాలు కనిపించాయి. (చదవండి: చెల్లచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలు..జీవితంలో మర్చిపోలేని భయానక దృశ్యం) -
ఓటీటీలో దూసుకెళ్తున్న ఐరావతం.. రికార్డ్‌స్థాయిలో వ్యూయింగ్ మినిట్స్
ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఐరావతం. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చిన్న సినిమా అయినా ఊహించని రీతిలో ఆదరణ దక్కించుకుంది. ఇప్పటివరకు 200 మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తోంది. ఈ మూవీ నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నూజివీడు టాకీస్‌పై రేఖ పలగని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. అసలు కథేంటంటే.. శ్లోక అనే బ్యూటీషియన్ కి బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్‌గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులవుతుంది. బర్త్ డే వీడియోలు తీస్తే డెత్ డే వీడియో లు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయటకొస్తాయి. ఆ రహస్యాల అల్లికే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథా గమనంలో మనం ఒకటి ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది.మన కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు తన ప్రేమికుడితో వెళ్లిపోతుంది. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా. ఇప్పటి వరకు చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
తడబడిన ట్విటర్.. నిమిషాల్లో వేల పిర్యాదులు
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ వినియోగంలో నిన్న (గురువారం) కొంత అంతరాయం ఏర్పడింది. భారతదేశంలో ఈ సైట్లోకి లాగిన్ అవ్వడంతో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు వినియోగదారులు తెలిపారు. దీని వల్ల వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్స్ రెండూ ప్రభావితమయ్యాయి. నివేదికల ప్రకారం, రాత్రి 10:18 గంటల సమయంలో చాలా మంది ట్విటర్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపైన సుమారు 5,400 మంది ఫిర్యాదులు చేశారు. డౌన్‌డిటెక్టర్ (Downdetector) ప్రకారం.. భారతదేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నుంచి ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న ట్విటర్ వినియోగదారులు కొంత సమయం ఈ ప్లాట్‌ఫారమ్ ఆపరేట్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఇందులో సుమారు 56 శాతం ఫిర్యాదులను స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నుంచి, 37 శాతం వెబ్సైట్ వినియోగదారులు, 8 శాతం సర్వర్ కనెక్షన్లో సమస్యలను నివేదించారు. (ఇదీ చదవండి: డామినర్ 400 పై భారీ డిస్కౌంట్.. బజాజ్ ప్రేమికులకు పండగే) ట్విటర్ వినియోగంలో అంతరాయం ఏర్పడిన కొద్ది నిమిషాలలోనే మళ్ళీ యధావిధిగా పని చేయడం ప్రారంభించింది. ఆ తరువాత వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ సైట్ మునుపటి మాదిరిగానే పనిచేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ట్విటర్ సంస్థ భారతదేశంలోని మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేసింది. ఈ రెండు కార్యాలయాల్లో ఉన్న సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులను తగ్గించుకుంటూ సోషల్ మీడియా సేవల్ని అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. -
5 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కారు చార్జ్!
వాషింగ్టన్: భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఉద్దేశించిన ఒక అధునాతన సాంకేతికత సాయంతో విద్యుత్ కారును కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయొచ్చని నాసా ఆర్థికసాయంతో పరిశోధన చేసిన ఒక అధ్యయన బృందం ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోడ్డు వెంట ఉన్న చార్జింగ్ స్టేషన్లో దాదాపు 20 నిమిషాలు, ఇళ్లలో అయితే గంటల తరబడి విద్యుత్ కార్లను చార్జ్ చేయాల్సి వస్తోంది. దాంతో ఇప్పటికీ భారత్‌లో కొందరు విద్యుత్ వాహనాలకు యజమానులుగా మారేందుకు సంసిద్ధంగా లేరు. ప్రస్తుతమున్న అధునాతన చార్జర్లు 520 ఆంపియర్ల కరెంట్‌నే బదిలీచేయగలవు. వినియోగదారులకు ఎక్కువగా అందుబాటులో ఉన్న చార్జర్లు అయితే కేవలం 150 ఆంపియర్లలోపు విద్యుత్‌నే పంపిణీచేయగలవు. అయితే, నూతన ఫ్లో బాయిలింగ్, కండన్సేషన్ ఎక్స్పరిమెంట్తో ఇది సాధ్యమేనని అమెరికాలోని పురŠూడ్య విశ్వవిద్యాయంలోని పరిశోధకులు చెప్పారు. అయితే, 1,400 ఆంపియర్ల విద్యుత్ ప్రసరణ సామర్థ్యముండే చార్జింగ్ స్టేషన్లలో ఇది సాధ్యమేనని నాసా పేర్కొంది. ఇంతటి ఎక్కువ ఆంపియర్ల విద్యుత్ ప్రసరణ సమయంలో వేడి బాగా ఉద్భవిస్తుంది. దీనికి చెక్‌పెట్టేందుకు ద్రవ కూలెంట్‌ను ముందుగా చార్జింగ్ కేబుల్ గుండా పంపించారు. ఇది కరెంట్‌ను మోసుకెళ్లే కండక్టర్లో జనించే వేడిని లాగేస్తుంది. దీంతో 4.6 రెట్లు వేగంగా చార్జింగ్ చేయడం సాధ్యమైంది. కరెంట్ ప్రసరించేటపుడు వచ్చే 24.22 కిలోవాట్ల వేడిని ఈ విధానం ద్వారా తొలగించగలిగారు. ‘కొత్త పద్ధతి కారణంగా చార్జింగ్ సమయం బాగా తగ్గుతుంది. ఎక్కువ సేపు చార్జింగ్ జంజాటం లేదుకాబట్టి ఎక్కువ మంది ఎలక్టిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతారు’ అని పరిశోధకులు వ్యాఖ్యానించారు. భారరహిత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ రెండు ఫేజ్‌ల ఫ్లూయిడ్ ఫ్లో, వేడి బదిలీ ప్రక్రియను పరీక్షించనున్నారు. -
3 నిమిషాల్లో అధ్యక్షుడిని ఒప్పించి టికెట్ సాధించింది.. అసలేం చెప్పిందంటే!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమరం మోగింది. రాజకీయ పార్టీలు గెలుపు కోసం అభ్యర్థుల పేర్లు ఖరారుతో పాటు ఎన్నికల్లో విజయాల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉండగా సమాజ్‌వాదీ అభ్యర్థి రూపాలీ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి అందరినీ ఆకర్షించాయి. తన టికెట్ విషయంలో రూపాలీ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను మూడు నిమిషాల్లో ఒప్పించి టికెట్ సాధించినట్లు తెలిపింది. ( చదవండి: ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్ ) ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌తో జరిగిన భేటీలో రూపాలీ అసలేం చెప్పిందంటే.. ప్రత్యర్థులు జైలులో ఉన్న తన తండ్రిని అవమానించడంతో పాటు ఠాకూర్ కమ్యూనిటీని కించపరిచారని అందుకు వారికి తగిన గుణపాఠం చెప్పదలచుకున్నట్లు తెలిపింది. ఆమె కులతత్వాన్ని విశ్వసించదని, అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వ పథకాలలో పారదర్శకంగా సరైన కేటాయింపులను కోరుకుంటున్నట్లు చెప్పింది. అంతేగాక తాను ఈ సీటు ఖచ్చితంగా గెలిచి తీరుతానని అఖిలేష్‌కి హమి ఇచ్చినట్లు తెలిపింది. రూపాలీ అంత ధీమాగా చెప్పడంతో అఖిలేష్ టికెట్ ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పింది. పైగా రూపాలీ కోసం ముందుగా అనుకున్న అభ్యర్థిని కూడా పక్కన పెట్టారు. రూపాలీ న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని విశ్వవిద్యాలయాల నుంచి రెండు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలను సంపాదించింది. -
2 నిమిషాల్లో కోటి రూపాయల పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ: నవీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ తాజాగా తమ మొబైల్ యాప్ ద్వారా 2 నిమిషాల్లోనే ఆన్లైన్ ఆరోగ్య బీమా పాలసీని జారీ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ. 2 లక్షల నుంచి రూ. 1 కోటి ద్వారా కవరేజీ ఉండేలా ఈ పాలసీలను తీసుకోవచ్చని సంస్థ ఎండీ రామచంద్ర పండిట్ తెలిపారు. క్యాష్‌లెస్ క్లెయిమ్స్‌కు 20 నిమిషాల లోపే ఆమోదముద్ర లభిస్తుందని ఆయన వివరించారు. నెట్వర్క్యేతర ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే పూర్తి పత్రాలను అందించడాన్ని బట్టి నాలుగు గంటల్లోపు క్లెయిమ్స్‌ను సెటిల్ చేస్తామని పేర్కొన్నారు. బేస్ సమ్ అష్యూర్డ్‌పై ప్రభావం పడకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల కోసం రూ. 20 వేల వరకూ అదనపు కవరేజీ ఉండేలా ఎక్స్ట్రా కేర్ కవర్ కూడా ఉంటుందని పండిట్ పేర్కొన్నారు. -
నిండు సభలో అడ్డంగా దొరికారు
నెల రోజుల కిందట సీఈఓ ఏమన్నారు? జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టిన పోలవరం అథారిటీ సీఈఓ దినేష్‌కుమార్ సరిగ్గా నెల రోజుల కిందట.. అంటే ఫిబ్రవరి 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి వచ్చిన అథారిటీ.. ఆ పనులు జరుగుతున్న తీరుపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రాసిన లేఖ అది. ఇప్పుడు జరుగుతున్న తరహాలో పనులు జరిగితే.. ప్రాజెక్టు పూర్తిచేయడానికి ప్రతిపాదిత సమయానికన్నా చాలా ఎక్కువ కాలం పడుతుందని.. ప్రాజెక్టుతో పాటు, దాని ప్రయోజనాలు నెరవేరటంలోనూ తీవ్ర జాప్యం జరుగుతందని ఆ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంతో పాటు.. పోలవరం అథారిటీ లేవనెత్తిన మరిన్ని అంశాలను ‘సాక్షి’ మంగళవారం నాడు ప్రచురించిన తన కథనంలో వివరించింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేపధ్యంలో.. దీని నిర్మాణ బాధ్యతలు కూడా కేంద్రం చేతుల్లోకి వెళతాయని.. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తికాకపోతే ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేసే అవకాశం ఉంటుందని.. కాబట్టి ఈ పనుల బాధ్యత కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని అధికార వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని ‘సాక్షి’ వెల్లడించింది. ‘మినిట్స్’ చూపుతూ చంద్రబాబు ఏం చెప్పారు? ఈ కథనమంతా అసత్యమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు శాసనసభలో మండిపడ్డారు. ఆ క్రమంలో పోలవరం అథారిటీ తొలి సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను సభలో చూపించారు. ‘నిన్ననే.. అంటే మార్చి 16వ తేదీన ఢిల్లీలో పోలవరం అథారిటీ సమావేశం జరిగిందని.. ఆ మినిట్సే మాకు పంపార’ని చెప్పారు. దాని ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్టులను కొనసాగించేందుకు, రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేపట్టేందుకు ఆ అథారిటీ అనుమతించిందని, ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే నిధులను తిరిగి ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ‘సాక్షి’ అసత్యాలు రాస్తోందంటూ నిప్పులు చెరుగుతూ ఈ మాటలు అన్నారు. నెల రోజుల్లోనే సీఈఓ వైఖరి మారిందంటే అర్థమేమిటి? చంద్రబాబు చెప్పిన ఈ మాటలే.. ‘సాక్షి’ చెప్పిందే వాస్తవమని నిరూపిస్తున్నాయి. నెల రోజుల కిందట.. ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన పోలవరం అథారిటీ సీఈఓ.. సరిగ్గా నెల రోజుల్లోనే.. ‘ప్రస్తుత కాంట్రాక్టునే కొనసాగించాల’ని ఎందుకన్నారు? దీని వెనుక ఉన్న ఒత్తిడిలు ఏమిటి? వాస్తవానికి నెల రోజుల కిందట పోలవరం అథారిటీ సీఈఓ రాసిన లేఖకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం అథారిటీకి కానీ, కేంద్ర జలవనరుల శాఖకు కానీ ఎటువంటి సమాచారం, సమాధానం ఇచ్చిందీ తెలియదు. ఏం సంప్రదింపులు జరిపిందీ చంద్రబాబు చెప్పలేదు. కానీ.. ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్టును కొనసాగించేలా, అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. అందుకే.. సీఈఓ నెల రోజుల్లోనే తన వైఖరిని మార్చుకున్నట్లు అర్థమవుతోంది. సరిగ్గా ‘సాక్షి’ చెప్పిన విషయమిదే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా తన చేతుల్లోనే ఉంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడులు తీసుకొస్తోందనే చెప్పింది. అదే నిజమని.. సీఈఓ వైఖరి నెల రోజుల్లోనే మారిపోవటం స్పష్టం చేస్తోంది. అది నిర్ణయం కాదు.. సీఈఓ సూచన మాత్రమే అంతేకాదు.. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రస్తుత కాంట్రాక్టును కొనసాగించాలన్న మాట.. పోలవరం అథారిటీ తీసుకున్న నిర్ణయం కానే కాదు. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు అమలు విధివిధానాలపై చర్చల సందర్భంగా సీఈఓ చేసిన ఒక సూచన మాత్రమే. అది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సమావేశం మినిట్స్‌లో పేర్కొన్న ‘తీర్మానాలు’లోనూ ఈ అంశం లేదు. అంటే.. ఇది అథారిటీ నిర్ణయమంటూ చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్ధం. అథారిటీ భేటీ 16న ఢిల్లీలో జరగలేదు... ఈ పోలవరం అథారిటీ మార్చి 16వ తేదీన ఢిల్లీలో సమావేశమైందని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. ఈ మాటలు విని ఢిల్లీ వర్గాలే విస్తుపోయాయి. ఎందుకంటే.. పోలవరం అథారిటీ సమావేశం ఢిల్లీలో జరగలేదు. ఈ నెల 16వ తేదీనా జరగలేదు. వాస్తవానికి ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లోనే పోలవరం అథారిటీ తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశం మినిట్స్‌ను ఈ నెల 16వ తేదీన (సోమవారం నాడు) కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వశాఖకు పంపించారు. అంటే.. ఈ సమావేశం జరిగిన తేదీ, ప్రదేశం పైనా చంద్రబాబు నిందు సభలో చెప్పినవి అసత్యాలే. వ్యయం రీయింబర్స్ తీర్మానానికీ వక్రీకరణ... ఇక.. పోలవరం అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు బదిలీ చేసే విధానంపైనా చర్చలు జరగాలని, అవసరమైతే ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఈ సమావేశంలో ప్రతిపాదించారు. దీనిపై ఎటువంటి చర్చా జరగలేదు. ఈ ప్రతిపాదనను బట్టే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిధులను తమకు బదిలీ చేయాలని కోరుతున్నట్లు స్పష్టమవుతోంది. కానీ.. చంద్రబాబు మరో అంశాన్ని చూపుతూ.. ప్రాజెక్టు నిధులను రాష్ట్రానికి బదిలీ చేయటానికి పోలవరం అథారిటీ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి.. ఈ అథారిటీ ఏర్పడిన తర్వాత ప్రస్తుత సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని ఏపీ సర్కారుకు రీయింబర్స్ చేయాలని మాత్రమే అథారిటీ తీర్మానం చేసింది. ఈ రీయింబర్స్ అంశాన్ని.. పాలక మండలి చైర్మన్ అయిన జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆమోదానికి నివేదించాలని నిర్ణయించింది. కానీ.. ఈ తీర్మానాన్ని చంద్రబాబు వక్రీకరిస్తూ.. మొత్తం ప్రాజెక్టు వ్యయానికి అయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి రీయింబర్స్ చేయటానికి పోలవరం అథారిటీ నిర్ణయం తీసుకుందని అసెంబ్లీలో అసత్యాలు చెప్పుకొచ్చారు. కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకునే అధికారం సీఈఓకు... నిజానికి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నియంత్రణలపై.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వశాఖతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు పోలవరం అథారిటీ సీఈఓకు అధికారమిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అధారిటీ చేసిన తీర్మానాలను పోలవరం ప్రాజెక్టు అధారిటీ గవర్నింగ్ బాడీ ఆమోదం తెలిపాలి. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో గవర్నింగ్ బాడీ ఉంటుంది. గవర్నింగ్ బాడీ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం గానీ, పోలవరం అధారిటీ గానీ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్కడా అనుమతించలేదు. కానీ.. అనుమతించేసిందని నిండు సభలో బల్ల గుద్ది చెప్పుకోవటం ఒక్క బాబుకే చెల్లింది! -న్యూఢిల్లీ, సాక్షి