
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమరం మోగింది. రాజకీయ పార్టీలు గెలుపు కోసం అభ్యర్థుల పేర్లు ఖరారుతో పాటు ఎన్నికల్లో విజయాల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉండగా సమాజ్‌వాదీ అభ్యర్థి రూపాలీ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి అందరినీ ఆకర్షించాయి. తన టికెట్ విషయంలో రూపాలీ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను మూడు నిమిషాల్లో ఒప్పించి టికెట్ సాధించినట్లు తెలిపింది. ( చదవండి: ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్ )
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌తో జరిగిన భేటీలో రూపాలీ అసలేం చెప్పిందంటే.. ప్రత్యర్థులు జైలులో ఉన్న తన తండ్రిని అవమానించడంతో పాటు ఠాకూర్ కమ్యూనిటీని కించపరిచారని అందుకు వారికి తగిన గుణపాఠం చెప్పదలచుకున్నట్లు తెలిపింది. ఆమె కులతత్వాన్ని విశ్వసించదని, అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వ పథకాలలో పారదర్శకంగా సరైన కేటాయింపులను కోరుకుంటున్నట్లు చెప్పింది. అంతేగాక తాను ఈ సీటు ఖచ్చితంగా గెలిచి తీరుతానని అఖిలేష్‌కి హమి ఇచ్చినట్లు తెలిపింది.
రూపాలీ అంత ధీమాగా చెప్పడంతో అఖిలేష్ టికెట్ ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పింది. పైగా రూపాలీ కోసం ముందుగా అనుకున్న అభ్యర్థిని కూడా పక్కన పెట్టారు. రూపాలీ న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని విశ్వవిద్యాలయాల నుంచి రెండు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలను సంపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment