candiates
-
రెండో లిస్ట్‌లో అయినా గడ్కరీ పేరు ఉంటుందా?
Nitin Gadkari : మహారాష్ట్రలో అధికార కూటమి లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం ఒప్పందం కుదిరిన తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మొదటి స్థానంలో ఉంటుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు లేకపోవడం తెలిసిందే. నాగ్‌పూర్‌లో ఫడ్నవీస్ విలేకరులతో మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రతిపక్షాల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నుండి గడ్కరీకి లోక్‌సభ టిక్కెట్‌ను ఆఫర్ చేయడంపై విరుచుకుపడ్డారు. "గడ్కరీ మా ప్రముఖ నాయకుడు. ఆయన నాగ్‌పూర్ నుండి పోటీ చేస్తారు. అభ్యర్థుల (బీజేపీ) మొదటి జాబితా విడుదలైనప్పుడు మహాయుతి భాగస్వాముల మధ్య (బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ) చర్చలు జరగలేదు. ఈ చర్చలు పూర్తవ్వగానే గడ్కరీ పేరే ముందుగా (అభ్యర్థుల జాబితాలో) వస్తుంది" అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. "ఉద్ధవ్ థాకరే సొంత పార్టీనే చితికిపోయింది. గడ్కరీ వంటి జాతీయ స్థాయి నాయకుడికి అటువంటి పార్టీ అధినేత ఆఫర్ ఇవ్వడం అనేది స్థాయిలేని వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవిని ఆఫర్ చేయడం లాంటిది" అన్నారు. కాగా గురువారం జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ నితిన్ గడ్కరీ మహారాష్ట్ర పౌరుషాన్ని చూపించాలని, ఢిల్లీ ముందు తల వంచేందుకు బదులుగా రాజీనామా చేయాలని అన్నారు. తాము ఆయన్ను ఎంవీఏ తరఫున అభ్యర్థిగా ఎన్నుకుంటామని థాకరే చెప్పారు. -
సీఎం రేసులో బాబా బాలక్‌నాథ్?.. అధిష్టానం నుంచి పిలుపు!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సమిష్టి నాయకత్వంలో పార్టీ పనిచేసింది. సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండానే బీజేపీ.. కాంగ్రెస్‌ను ఓడించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ గెలుపు తర్వాత రాష్ట్రానికి సీఎం ఎవరనేదానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ నేత, బాబా బాలక్‌నాథ్‌ను బీజేపీ కేంద్ర నాయకత్వం ఢిల్లీకి పిలిపించింది. మహంత్ బాలక్‌నాథ్.. నాథ్ శాఖకు చెందిన ఎనిమిదవ ప్రధాన మహంత్. రాజస్థాన్‌లోని అల్వార్ స్థానానికి చెందిన లోక్‌సభ ఎంపీ కూడా. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. అక్కడ ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్‌పై 6173 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజస్థాన్ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు నాటి నుంచి సీఎం అభ్యర్థిగా బాబా బాలక్‌నాథ్ పేరు వినిపిస్తోంది. రాజస్థాన్ కొత్త సీఎం రేసులో ముందంజలో ఉన్న బాబా బాలక్‌నాథ్ నేటి(సోమవారం) మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆయన బీజేపీ హైకమాండ్ నేతలతో భేటీ కానున్నారు. రాజస్థాన్‌లో బాబా బాలక్‌నాథ్‌కు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించవచ్చని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. రాజస్థాన్‌లో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉంటుందని మొదటి నుంచి అంతా భావించారు. అయితే ఫలితాలలో బీజేపీ మెజారిటీ సాధించింది. బీజేపీ 115, కాంగ్రెస్ 69, భారతీయ ఆదివాసీ పార్టీ 3, బీఎస్పీ 2, ఆర్ఎల్డీ 1, ఆర్ఎల్టీపీ 1 సీట్లు గెలుచుకున్నాయి. ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. వీరిలో చాలా మంది బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: భార్యను ఓడించిన భర్త.. అన్నను మట్టికరిపించిన చెల్లి! -
కాంగి‘రేసు’లో ఎట్టకేలకు కదలిక వచ్చింది..
మహబూబ్‌నగర్: కాంగి‘రేసు’లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. ఇందులో ఉమ్మడి పాలమూరు నుంచి ఎనిమిది మందికి చోటు దక్కింది. ఇంకా ఆరు స్థానాలు పెండింగ్‌లో ఉండగా.. ఎవరెవరికి పోటీ చేసే అవకాశం దక్కుతుందనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీటికి సంబంధించి అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తయినప్పటికీ.. బహుముఖ పోటీ నేపథ్యంలో అసమ్మతి పెల్లుబికుతుందనే భయంతో ఆచితూచి వ్యవహరిస్తూ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో రెండో విడత జాబితా ప్రకటించనున్నట్లు ఏఐసీసీ పెద్దలు వెల్లడించగా.. ఆయా స్థానాలపై సస్పెన్స్ వీడనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఐదు పెండింగ్.. ఉమ్మడి పాలమూరులో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు కాగా.. మహబూబ్‌నగర్ పార్లమెంట్లో ఏడు (మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, షాద్‌నగర్), నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఏడు (నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్) ఉన్నాయి. కాంగ్రెస్ తొలి విడతలో ఎనిమిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్‌లో పెట్టిన ఆరు స్థానాల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ నియోజకవర్గంలోని వనపర్తితోపాటు మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో అధికంగా ఐదు (మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట) సెగ్మెంట్లు ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరికి మించి అభ్యర్థులు పోటీ పడుతుండడం.. సామాజిక వర్గ సమీకరణలు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. వర్గాల వారీగా ఇలా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 12 జనరల్ కాగా.. రెండు (అచ్చంపేట, అలంపూర్) ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. తొలివిడతలో కాంగ్రెస్ ప్రకటించిన ఎనిమిది స్థానాల అభ్యర్థులను పరిశీలిస్తే ఆరు జనరల్ స్థానాల్లో ముగ్గురు రెడ్డి, ఒకరు వెలమతోపాటు బీసీ వర్గాలకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. రెండు రిజర్వ్డ్ స్థానాల్లో ఇద్దరు ఎస్సీ అభ్యర్థులను కేటాయించారు. కాంగ్రెస్ పాతకాపులు ముగ్గురే.. ఈసారి తొలి విడతలో ప్రకటించిన అభ్యర్థులు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారిని పరిశీలిస్తే.. రేవంత్‌రెడ్డి (కొడంగల్), చిక్కుడు వంశీకృష్ణ (అచ్చంపేట), సంపత్ (అలంపూర్) మాత్రమే ఉన్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి, షాద్‌నగర్‌లో వీర్లపల్లి శంకర్ బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి) 2014లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి (నాగర్‌కర్నూల్), సరితా తిరుపతయ్య (గద్వాల) ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలో నిలవనున్నారు. 1999లో జూపల్లి కాంగ్రెస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ ఎన్నికలో గెలుపొందారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న క్రమంలో 2011లో కాంగ్రెస్‌కు, మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో చేరారు. బీఆర్ఎస్ నుంచి 2012 ఉప ఎన్నికలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో గెలుపొందారు. 2018లో ఓటమి పాలయ్యారు. వారి దారెటు.. కాంగ్రెస్‌లో పలువురు నేతల చేరికల క్రమంలో ప్రధానంగా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌కు సంబంధించి టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేతలు, వారి అనుచరుల్లో అసంతృప్తి పెల్లుబికింది. కూచుకుళ్లపై నాగం జనార్దన్‌రెడ్డి, జూపల్లిపై చింతలపల్లి జగదీశ్వర్‌రావు నిత్యం ఫైర్ అవుతూ వచ్చారు. నాగం వర్గీయులు ఇటీవల గాంధీభవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన సైతం తెలిపారు. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని.. ఇంకా టికెట్లు ఖరారు కాలేదని నేతలు సముదాయించడంతో వెనుదిరిగారు. ప్రస్తుతం కొల్లాపూర్ టికెట్ జూపల్లి, నాగర్‌కర్నూల్ టికెట్ కూచుకుళ్లకు కేటాయించిన నేపథ్యంలో నాగం, చింతలపల్లి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్ కార్యాలయంలో జగదీశ్వర్‌రావు అనుచరులు ఫ్లెక్సీలు చించివేశారు. తాను ఢిల్లీ నుంచి వస్తున్నానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని జగదీశ్వర్‌రావు వారిని వారించినట్లు తెలుస్తోంది. కొత్తగా చేరిన వారికే పెద్దపీట.. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు తొలిజాబితాలో పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కొల్లాపూర్‌కు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు నాగర్‌కర్నూల్‌కు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి, గద్వాలకు చెందిన జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య చేయి అందుకున్నారు. ఆ తర్వాత కల్వకుర్తి చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరగా.. వీరందరికి తొలి జాబితాలోనే సీట్లు కేటాయించడం విశేషం. -
టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి : కూసుకుంట్ల
-
సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం
-
రాజ్యసభ ఎన్నికలు: టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..
TRS Rajya Sabha Candidates.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరుగ నున్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. బండాప్రకాశ్ ముదిరాజ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ (ఉప ఎన్నిక)కు గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. సుమారు రెండేళ్ల పదవీకాలం ఉన్న ఈ స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)ను కేసీఆర్ ఎంపిక చేశారు. ఇక వచ్చే నెల 21న ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసు కుంటున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల స్థానంలో టీన్యూస్, నమస్తే తెలంగాణ దిన పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, ఫార్మా సంస్థ అధినేత బండి పార్థసారథిరెడ్డిల పేర్లను ఖరారు చేశారు. వారు ఆరేళ్లపాటు పదవిలో ఉం టారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపి కైన ముగ్గురు బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి పార్టీ బీఫారాలు అందజేసి అభినందించారు. రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ వేయనున్నారు. ఏ వర్గం నుంచి ఎందరు? రాష్ట్రంలో మొత్తంగా ఏడు రాజ్యసభ స్థానాలు ఉండగా అందులో మూడు సీట్లకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు కాబట్టి.. రాష్ట్ర శాసనసభలో పూర్తిబలమున్న టీఆర్ఎస్కే మూడు సీట్లు దక్కనున్నాయి. ఈ ముగ్గురినీ పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్ర రాజ్యసభ సభ్యుల్లో వెలమ సామాజికవర్గం నుంచి జోగినపల్లి సంతోష్, దామోదర్‌రావు.. మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి కె.కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర.. రెడ్డి సామాజికవర్గం నుంచి కేఆర్ సురేశ్‌రెడ్డి, బి.పార్థసారథిరెడ్డి.. బీసీల నుంచి బడుగుల లింగయ్య యాదవ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. దీవకొండ దామోదర్‌రావు పుట్టినతేదీ: 1958 ఏప్రిల్ 01 స్వస్థలం: జగిత్యాల జిల్లా ముద్దనూరు ప్రస్తుత నివాసం: హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచారు. – టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, కార్యదర్శిగా (ఆర్థిక వ్యవహారాలు) వివిధ హోదాల్లో పనిచేశారు. – ప్రస్తుతం టీ–న్యూస్, నమస్తే తెలంగాణ సీఎండీగా పనిచేస్తున్నారు. టీటీడీ సభ్యుడిగా ఉన్నారు. – గతంలోనే రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వస్తుందని భావించినా సామాజికవర్గ సమీకరణాల్లో కుదరలేదు. తాజాగా అవకాశమిచ్చారు. వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పుట్టినతేదీ: 1964 మార్చి 22 స్వస్థలం: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి ప్రస్తుత నివాసం: ఖమ్మం జిల్లా బుర్హాన్‌పురం వృత్తి: గాయత్రి గ్రానైట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ – తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మున్నూరుకాపు ఆల్ అసోసియేషన్ జేఏసీ గౌరవ అధ్యక్షుడు – 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. – తర్వాతి పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు లేదా ఖమ్మం జిల్లా నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. – మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన డి.శ్రీనివాస్ పదవీకాలం ముగుస్తుండటంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రకు కేసీఆర్ అవకాశమిచ్చారు. – ఇది ఉప ఎన్నిక స్థానం కావడంతో రవిచంద్ర 2024 ఏప్రిల్ 2వ తేదీ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. బండి పార్థసారథిరెడ్డి పుట్టినతేది: 1954 మార్చి 6 స్వస్థలం: ఖమ్మం జిల్లా కందుకూరు ప్రస్తుత నివాసం: హైదరాబాద్ వృత్తి: హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ – దేశంలోనే టాప్ ఫార్మా సంస్థల్లో ఒకటైన హెటిరో అధినేతగా, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పార్ధసారథిరెడ్డికి మంచి పేరుంది. – గ్రామీణ నేపథ్యం కలిగిన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన మొదట డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్‌లో పరిశోధన శాస్త్రవేత్తగా చేరారు. అక్కడ పనిచేస్తూ పలు ఔషధాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. – 1993లో హెటిరో డ్రగ్స్ కంపెనీని స్థాపించారు. గత మూడు దశాబ్దాల్లో ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కృషి చేశారు. – హెచ్ఐవీ, ఎయిడ్స్ సహా పలు వ్యాధులకు తక్కువ ధరలో ఔషధాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. – ఫార్మారంగంలో ఆయన చేసిన సేవలకు దేశ విదేశాల్లో అనేక అవార్డులు అందుకున్నారు. -
3 నిమిషాల్లో అధ్యక్షుడిని ఒప్పించి టికెట్ సాధించింది.. అసలేం చెప్పిందంటే!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమరం మోగింది. రాజకీయ పార్టీలు గెలుపు కోసం అభ్యర్థుల పేర్లు ఖరారుతో పాటు ఎన్నికల్లో విజయాల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉండగా సమాజ్‌వాదీ అభ్యర్థి రూపాలీ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి అందరినీ ఆకర్షించాయి. తన టికెట్ విషయంలో రూపాలీ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను మూడు నిమిషాల్లో ఒప్పించి టికెట్ సాధించినట్లు తెలిపింది. ( చదవండి: ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్ ) ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌తో జరిగిన భేటీలో రూపాలీ అసలేం చెప్పిందంటే.. ప్రత్యర్థులు జైలులో ఉన్న తన తండ్రిని అవమానించడంతో పాటు ఠాకూర్ కమ్యూనిటీని కించపరిచారని అందుకు వారికి తగిన గుణపాఠం చెప్పదలచుకున్నట్లు తెలిపింది. ఆమె కులతత్వాన్ని విశ్వసించదని, అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వ పథకాలలో పారదర్శకంగా సరైన కేటాయింపులను కోరుకుంటున్నట్లు చెప్పింది. అంతేగాక తాను ఈ సీటు ఖచ్చితంగా గెలిచి తీరుతానని అఖిలేష్‌కి హమి ఇచ్చినట్లు తెలిపింది. రూపాలీ అంత ధీమాగా చెప్పడంతో అఖిలేష్ టికెట్ ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పింది. పైగా రూపాలీ కోసం ముందుగా అనుకున్న అభ్యర్థిని కూడా పక్కన పెట్టారు. రూపాలీ న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని విశ్వవిద్యాలయాల నుంచి రెండు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలను సంపాదించింది. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన ఇషాక్
-
డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీ పోస్ట్‌లు
సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీ పోస్ట్‌లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా రేపటి నుంచి అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 306-1918 ర్యాంక్ వరకు 110 మంది అభ్యర్థులకు రేపు కౌన్సెలింగ్ జరగనుండగా, 1921-8659 ర్యాంక్ వరకు 119 మందికి ఈనెల 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. deovsp.netలో విల్లింగ్ జాబితా, చెక్‌లిస్ట్ అందుబాటులో ఉంచామని డీఈవో లింగేశ్వర్రెడ్డి తెలిపారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
యూఎస్ ఎలక్షన్స్: గెలిచిన కరోనా మృతుడు
వాషింగ్టన్ : కరోనా వైరస్ కారణంగా కన్నుమూసినప్పటికీ అమెరికా ఎన్నికల్లో విజేతగా నిలిచాడో అభ్యర్థి. వివరాలు.. నార్త్ డకోటాకు చెందిన డేవిడ్ ఆండాల్(55) రిపబ్లికన్ పార్టీ తరపునుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌కు పోటీ చేస్తున్నాడు. గత నెలలో ప్రచారంలో ఉండగా కరోనా బారిన పడ్డారు డేవిడ్. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాలుగు రోజుల తర్వాత మృత్యువాతపడ్డారు. అయితే ఎన్నికలకు కొన్ని రోజుల ముందే డేవిడ్ చనిపోవటంతో బ్యాలెట్ల నుంచి అతడి పేరును తొలిగించలేని పరిస్థితి ఏర్పడింది. ( అక్కడ ట్రంప్‌కే అవకాశాలెక్కువ ) దీంతో మంగళవారం అతడి పేరును తీసివేయకుండానే ఓటింగ్ నిర్వహించారు అధికారులు. ఈ నేపథ్యంలో డేవిడ్ ఆండాల్ 5,901.. 35 శాతం ఓట్లు గెలుపొంది ఎన్నికల్లో విజయం సాధించారు. నార్త్ డకోటా నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌కు ఎన్నికైన ఇద్దరు రిపబ్లికన్లలో డేవిడ్ ఒకరు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు, డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లు సాధించారు.( అమెరికా ఎన్నికలు: ఆయన చెప్పినట్లే జరిగింది..!) -
దెందులూరు: పార్టీలో ఉండాలా, ప్రత్యామ్నాయం చూసుకోవాలా?
సాక్షి, దెందులూరు: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు కావస్తున్నా ఆ పార్టీ శ్రేణులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాజయం నమోదు కావటం నియోజకవర్గంలో ఏ ఒక్క పంచాయతీలోనూ టీడీపీ అలికిడి కానరావటం లేదు. ఫలితాల్లో సైతం ప్రతి పంచాయతీలోనూ వైఎస్సార్సీపీ ఆధిక్యతతో పాటు విజయ కేతనం ఎగురవేయటంతో భవిష్యత్తు కార్యక్రమంపై టీడీపీలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. తాము ఇప్పుడేం చేయాలో తెలియక పగలు, రాత్రి తేడాలేకుండా చర్చలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. మరికొందరైతే ఏం చేస్తే బాగుంటుంది? పార్టీలో ఉండాలా, ప్రత్యామ్నాయం చూసుకోవాలా? మౌనంగా ఉండటమా? పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందా? ప్రత్యామ్నాయం చూసుకుంటే వ్యక్తిగత భవిష్యత్తుతో పాటు రాజకీయంగానైనా పరిస్థితి మారుతుందని సమీకరణాల రూపంలో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అన్ని శాఖల వారీగా ఫిర్యాదులు, నాణ్యత, నిధులు దుర్వినియోగం, ఇతర అంశాలు విచారణ విధిగా జరుగుతుందని ప్రకటించటంతో నియోజకవర్గంలో అన్ని శాఖల వారీగా కాంట్రాక్టులు, అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేసినవారు అవాక్కయ్యారు. దెందులూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు, పోలవరం కుడికాలువ గట్లు కొల్లగొట్టడం, మట్టి అక్రమ రవాణా, నాణ్యతలేని రోడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, ఉపాధి ఇతర పనులపై వేల కోట్లలో అవినీతి జరిగిందని గతేడాదే వైఎస్సార్సీపీ నేతలు అప్పటి జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. దీనికి తోడు ఐదేళ్లలో పెట్టిన అక్రమ కేసులు, వేధింపులు, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో వివక్షతతో పాటు ప్రస్తుతం వైఎస్సార్సీపీ పూర్తి ఆధిక్యత సాధించటంతో వచ్చే నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లో పోటీ విషయాన్ని చర్చించటానికి సైతం టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి కనిపించటం లేదు. కలవరపాటులో టీడీపీ నేతలు ఒక్కో పంచాయతీకి లక్షలు ఖర్చు పెట్టగల స్తోమత, వెసులుబాటు టీడీపీ నేతలకు ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజాభిమానం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి మించి ఉండటంతో వారంతా తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు. వైఎస్సార్సీపీ అన్ని స్థాయిల్లోనూ విజయం సాధించటం స్పష్టమని తేటతెల్లం కావటంతో ఇంత వ్యతిరేకతలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సముద్రానికి ఎదురీదటమేనని టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అన్ని చోట్ల టీడీపీ అపజయానికి కారణాలు వేరు వేరు అయినప్పటికీ దెందులూరు నియోజకవర్గంలో సొంతింటిలోనే అసమ్మతి, అసంతృప్తి, పార్టీ ధిక్కారం తారాస్థాయికి చేరటంతో 17 వేలకు పైగా ఓట్ల తేడాతో టీడీపీ పరాజయం పాలైంది. ఇన్ని మైనస్‌లు పార్టీలో ఉండటం వైఎస్సార్సీపీ భారీ మెజారిటీకి కారణం. కొందరి చూపు వైఎస్సార్సీపీ వైపు మళ్లింది. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు ఇన్ని ప్రతికూల పరిస్థితులు టీడీపీలో ఉంటే ఎలా పోటీ చేస్తాం, చేయటం కరక్టేనా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
పార్టీల అభ్యర్థుల ‘లెక్కల’ కుస్తీలు
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ఘట్టం ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటింగ్ తీరు తెన్నులపై ఆరా తీస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ శాతం పెరగడంతో. ఎవరికి అనుకూలమనే కోణంలో బూత్‌ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. బూత్ స్థాయి అనుచరులతో మాట్లాడుతూ.. గెలుపోటములపై అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొనగా, బెట్టింగుల పర్వం కూడా ఊపందుకుంటోంది. ఇదిలా ఉంటే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఈ నెల 11న జరిగే ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దృష్టి సారించింది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఏకంగా 8.1శాతం ఓట్లు అదనంగా పోల్ అవడంతో, పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలమనే కోణంలో పార్టీలు, అభ్యర్థులు విశ్లేషణలు సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు పోలి ంగ్ తీరుతెన్నులపై ఆరా తీస్తూ, అనుచరగణానికి ఆదేశాలు జారీ చేయడంలో అభ్యర్థులు తీరిక లేకుండా గడిపారు. శుక్రవారం రాత్రికి పో లింగ్ బూత్‌లు, మండలాల వారీగా ఓటింగ్ వివరాలు చేతికి అందడంతో అభ్యర్థులు.. బూత్‌ల వారీ విశ్లేషణలపై దృష్టి సారించారు. బూత్‌ల వా రీగా పోలైన ఓట్ల సంఖ్య, అందులో తమకు అనుకూలంగా పడే ఓట్ల సంఖ్యను విశ్లేషించుకుంటూ కీలక అనుచరులతో శనివారం తెల్లవారుజాము వరకు కసరత్తు చేశారు. తమకు పడే ఓట్ల సం ఖ్యపై ఓ అంచనాకు వచ్చిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది. పక్షం రోజులు గా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నేతలు శనివారం విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తూనే, తమను కలిసేందుకు వచ్చిన అనుచరులతో పోలింగ్ వివరాలపై ఆరా తీశారు. ఓట్ల లెక్కింపునకు మరో రెండు రోజులు ఉండడంతో అభ్యర్థులు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తూనే, ఫలితాలపై లెక్కలు వేసుకుంటున్నారు. జోరుగా సాగుతున్న బెట్టింగులు పోలింగ్ ఘట్టం ముగియడంతో శుక్రవారం సాయంత్రం మీడియాలో వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలి తాలపై నాయకులు, సామాన్యులనే తేడా లేకుం డా చర్చల్లో మునిగి తేలుతున్నారు. పోలీసులు, పాత్రికేయులు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి నుంచి వివరాల సేకరణకు అభ్యర్థులతో పాటు, వివిధ రంగాలకు చెందిన వారు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు ఫలితా లపై ఎవరికి వారుగా విశ్లేషణలు చేస్తూ, బెట్టింగులకు దిగుతున్నారు. ఇందులో విదేశీ పర్యటనలు, హోటళ్లలో విందులు, నగదు తదితర కోణాల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా స్థానిక పరిస్థితులు, వివిధ వర్గాలు ఓ టింగ్ వేసిన తీరు, ఇతర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు తరలివచ్చి ఓటేసిన వారు.. ఇలా రకరకాల కోణాల్లో ఫలితం ఎలా ఉంటుందనే కోణంలో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో నిమగ్నం శుక్రవారం రాత్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఈవీఎంలు చేరుకోగా, శనివారం పటిష్ట బందోబస్తు నడుమ కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఐదు కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. ఒక్కో లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.హనుమంతరావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఆదివారం గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో తులి దశ శిక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. -
కాలంతో పరుగెడుతున్న అభ్యర్థులు..
సాక్షి, అచ్చంపేట: మరో నాలుగు రోజులు చెమటోడ్చి కష్టపడితే ఐదేళ్ల పాటు హాయిగా వీఐపీ హోదాలో దర్జాగా అనుభవించవచ్చు. శాసనసభలో కీలక వ్యక్తులుగా చట్టాల రూపకల్పనలో ప్రధాన ప్రాత వహిస్తూ అధికార దర్పంతో హాయిగా బతుకొచ్చు. కాలం కలిసి వస్తే మంత్ర పదవులు దక్కొచ్చు. అలాంటి రాజకీయ జీవితం అనుభవించే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ముందుస్తు పోరులో ప్రత్యర్థుల ముందు ఎలాగైనా గెలవాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఓ పక్కా ఉష్ణోగ్రతలు పడిపోయి గ్రామాలన్నీ మంచు దప్పటి పరుచుకుని ఉంటే తెలతెల్లవారంగానే చలికి వణికుతున్నప్పటికీ అవేమి లెక్క చేయకుండా అభ్యర్థులు మరింత వేడిగా ప్రచారం వేగం పెంచారు. ఉదయమే ఇంటి నుంచి బయలుదేరి ఎప్పడో తెల్లవారు జామున ఇంటికి చేరకుంటున్నారు. అభ్యర్థుల రోజువారి దినచర్య అత్యంత బిజీ షెడ్యూల్లో గడిపేస్తున్నారు. అలసట, విశ్రాంతి అనే పదాలకు చోటు లేకుండా ముందుస్తు సంగ్రామంలో మందుకు సాగుతున్నారు. సమయం వృథా కాకుండా.. రోజులో ఉన్న 24గంటల్లో ఆ రోజును సంపూర్ణగా ఉపయోగించుకునేందుకు అభ్యర్థులు తమ షెడ్యూల్‌ను ప్రతీ నిమిషం జాగ్రత్తగా ప్లాన్ వేస్తున్నారు. కేవలం నిద్రపోయే సమయం తప్పా... మిగతా సమయాన్ని మొత్తం ప్రచారం పర్వానికే వినియోగిస్తున్నారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల కుస్తీకి సిద్ధమవుతున్నారు. బిజీ షెడ్యూల్లో అభ్యర్థులకు నెలరోజుల నుంచి కంటి నిండ నిద్రేకరువైయింది. గ్రామాల్లోని ప్రజలంతా ఉదయమే వ్యవసాయం పనులకు వెళ్లతుండడంతో వారిని కలిసేందుకు వీలైనంత త్వరగా ఇంటి నుంచి బయల్దేరుతున్నారు. ఉదయం లేనినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేలాది మందిని ప్రత్యక్షంగా పలకరిస్తున్నారు. అభ్యర్థులు ఇంటి ముందు నెల రోజులుగా నిత్యం జనంతో కోలహాలం కనిపిస్తోంది. ఉదయం లేచే సరికే వందలాది మంది అభ్యర్థులతో మాట్లాడేందుకు క్యూలో ఉంటున్నారు. దీంతో నిద్రలేచింది మొదలు ప్రచార తంతు ప్రారంభమువుతోంది. కింద స్థాయి నేతలతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాల్లో పరిస్థితిపై ఆరా తీసేందుకు కొంత సయమం కేటాయించాల్సి వస్తోంది. రోజు ఏదో ఒక చోటికి వెళ్లడం దినచర్యలో తప్పని సరిగా మారింది. దీంతో నియోజకవర్గ మొత్తం చుట్టి రావడం లక్ష్యంగా ఉండడంతో ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతానికి తమ కార్యకర్తలను పురమాయించి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో వెళ్లే రాకపోకల సమయంలోనూ వాహనాల్లో ప్రయాణం చేస్తూనే ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై చర్చిస్తూ సమయాన్ని పొదుపుగా వాడుతున్నారు. అలాగే చేరికలు ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ప్రొత్సహించేందుకు స్థానిక లీడర్ల సాయంతో ఆ కార్యక్రమంలో ప్రతిరోజు చేరికల కోసం ప్రత్యేకంగా కొంత టైం కేటాయిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ఎవరైనా పార్టీ చెందిన ముఖ్య నేతలు వస్తే జనం సమీకరణలు తదితర ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం రోజులో ఎంతో కొంత సమయం కేటాయించాల్సి వస్తోంది. ఒక్కోసారి ఉదయం ఇంట్లో అల్పాహారం తీసుకుని బయల్దేరితే మధ్యాహ్న భోజనం ఎప్పుడు తినేది వేళాపాల ఉండడం లేదు. ఒక్కోసారి రోజులో ఒకసారే మాత్రమే తిన్న రోజులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కార్యక్రమాలు అనుకున్న సమయానికి అన్ని జరగకపోతే ఆరోజంతా షెడ్యూల్ మొత్తం మారిపోతుంది. కొంత మంది అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కూడా సరిగా మాట్లాడలేని పరిస్థితి. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా ఫోన్లో గంటల కొద్ది మాట్లాడేస్తున్నారు. -
ఇక సభల హోరే..
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరపడింది. జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలుపుకొని మొత్తం 62 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలారు. పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా 16 మంది పోటీ పడుతుండగా, అందోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎనిమిది మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఇక ఎన్నికలకు కొద్దిరోజులే మిగిలుండడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించనున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీలు ఇక ప్రచార వ్యూహంపై దృష్టి కేంద్రీకరించాయి. వీలైనంత మేరకు విస్తృతంగా జనాల్లోకి వెళ్లేలా అభ్యర్థులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తుండగా మిగిలిన పార్టీల్లో ఎలా ముందంజ వేయాలా అన్న సమాలోచనలు జరుపుతున్నారు. పటాన్చెరులో మహా కూటమి తరఫున కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన నేతలు కొందరు నామినేషన్ల స్క్రూటినీ అనంతరం స్వతంత్రులుగా బరిలో మిగిలిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన సి.అంజిరెడ్డి, కొలన్ బాల్‌రెడ్డి, సపాన్‌దేవ్, శశికళ, షేక్ అబ్దుల్ ఘనీతో పాటు టీడీపీ టికెట్ ఆశించిన ఎడ్ల రమేశ్, కరికె సత్యనారాయణ బరి నుంచి తప్పుకున్నారు. బీజేపీ టికెట్ ఆశించిన గాలి వెంకటగిరి కూడా పార్టీ బుజ్జగించడంతో తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకున్నారు. తన అభ్యర్థిత్వం ప్రకటించింది మొదలు శరవేగంతో కదిలిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తులను బుజ్జగించడంలో సఫలమయ్యారు. అందోలులో బీఎస్పీ తరపున నామినేషన్ వేసిన అల్లారం రత్నయ్య చివరి నిమిషంలో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఇక ప్రచార పర్వంలోకి..! నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ముగియడంతో వివిధ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. నాలుగు ప్రధాన పక్షాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్పీతో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో మిగిలారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 28న సంగారెడ్డి జిల్లా పరి«ధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 25న నారాయణఖేడ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల షెడ్యూలు ఖరారు కానప్పటికీ, అభ్యర్తులు తమ నియోజకవర్గాల్లో ప్రచార షెడ్యూలును సిద్ధం చేసుకుంటున్నారు. నియోజవకవర్గం బరిలో ఉన్న అభ్యర్థులు జహీరాబాద్ (ఎస్సీ) 14 పటాన్చెరు 16 సంగారెడ్డి 14 అందోలు (ఎస్సీ) 08 నారాయణఖేడ్ 10 మొత్తం 62 -
ఏ–ఫారం.. బీ–ఫారం అంటే?
సాక్షి,హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తరుచుగా ఏ–ఫారం, బీ–ఫారం పేర్లు వింటుంటాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే వీటి అవసరం ఉంటుంది. అవి ఏమిటో..ఎలా ఇస్తారో తెలుసుకుందాం. ఏ–ఫారం అంటే.. పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో వారికి బీ–ఫారం అందజేస్తారు. బీ–ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ‘ఏ’ ఫారం. ఎవరిని పార్టీ ఎంపిక చేసి ఏ–ఫారం అందిస్తుందో వారికి మాత్రమే బీ–ఫారం అందిస్తారు. ఏ–ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ఏ–ఫారంను ఎన్నికల అధికారులకు అందజేస్తారు. బీ–ఫారం అంటే... గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనని గుర్తించేలా ఇచ్చేదే ‘బీ’ ఫారం. నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ ఫారాన్ని దాఖలు చేస్తేనే పార్టీకి సంబంధించి ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేకంగా నియమితులైన ప్రతినిధుల ద్వారా బీ–ఫారాన్ని అందిస్తారు. -
లెక్క చెప్పాల్సిందే..
ఎన్నికలంటేనే బోలెడంత ఖర్చు. అయితే ఆ ఖర్చు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పరిమితి దాటొద్దు అంటోంది ఎన్నికల కమిషన్. వెచ్చించే ప్రతీ పైసాకు లెక్క చెప్పాల్సిందేనంటోంది. ఖర్చు చేసే మొత్తాన్ని కూడా నిర్దేశించింది. అంతేకాదు అభ్యర్థి దేనికెంత వెచ్చించాలో కూడా హద్దులు గీసింది. హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అభ్యర్థి ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతా నుంచే ఆ మొత్తాన్ని తీయాల్సుంటుంది. ప్రతీ అభ్యర్థి పోలింగ్ ముగిసే లోపు మూడుసార్లు వివరాలను బిల్లులతో సహా సమర్పించాలి. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి అభ్యర్థి ఖర్చు పెట్టే ప్రతీ పైసాను లెక్కించనున్నారు. సాక్షి, నారాయణఖేడ్ : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. టికెట్ దక్కిన వారు ప్రచారంలో నిమగ్నం కాగా మరికొందరు టికెట్ల వేటలో ఉన్నారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. అభ్యర్థులు తమ విజయం కోసం చేసే ఖర్చుల పద్దు కూడా పెద్దగా ఉండే అవకాశం ఉంది. అయితే గరిష్టంగా ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలి అన్న మొత్తాన్ని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రతీ అభ్యర్థి రూ.28లక్షలకు మించి ఖర్చు చేయొద్దని ఆదేశించింది. వాహనాలు, భోజనాలు, పార్టీ జెండాలు తదితర వస్తువులకు లెక్కలు రూపొందించింది. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి అభ్యర్థి ఖర్చు పెట్టే ప్రతీ పైసా లెక్కించనున్నారు. బ్యాంకు ఖాతాతోనే ఖర్చు.. అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి తన ఎన్నికల ఏజెంట్ పేరున బ్యాంకులో జాయింట్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థి సొంత డబ్బు అయినా, పార్టీ, లేదా దాతలు ఇచ్చిన డబ్బులు అయినా సరే అందులోనే వేసి రోజువారీగా డబ్బులు తీసి ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు కూడా రూ.28లక్షలకు మించకూడదు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో అధికారులు ప్రతీ అభ్యర్థికి ఒక పుస్తకాన్ని అందజేస్తారు. అందులో ఒక పేజీలో నగదు వివరాలు, రెండో పేజీలో బ్యాంకు ఖాతాలోని నిల్వ, మూడో పేజీలో ఖర్చుల వివవరాలు రాయాలి. అభ్యర్థి లేదా అతను నియమించుకొన్న ఏజెంట్ ఏ రోజుకారోజు ఆ వివరాలను ఆ పుస్తకంలో రాయాల్సి ఉంటుంది. మూడు సార్లు లెక్కచూపాలి.. ప్రతీ అభ్యర్థి పోలింగ్ ముగిసే లోపు మూడు సార్లు ఖర్చుల వివరాలను బిల్లులతో సహా ఎన్నికల అధికారి కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో సమర్పించాలి. వీటి ఆధారంగా ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఎంత ఖర్చు చేయవచ్చన్నది వారు సూచిస్తారు. అభ్యర్థి చూపని ఖర్చు ఏదైనా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకు వస్తే వారు ఆ ఖర్చును అభ్యర్థి ఖర్చు ఖాతాలో రాసి లెక్కిస్తారు. నిర్ణీత సమయాల్లో ఖర్చులకు సంబందించిన లెక్కలు చూపనట్టయితే అభ్యర్థులకు ఇచ్చిన వాహనాల అనుమతి, ప్రదర్శనలు, సభలు రద్దుచేసే అధికారికి ఉంటుంది. ప్రతీ అభ్యర్థి పోలింగ్ ముగిసే లోపు మూడు సార్లు ఖర్చుల వివరాలను బిల్లులతో సహా ఎన్నికల అధికారి కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో సమర్పించాలి. వీటి ఆధారంగా ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఎంత ఖర్చు చేయవచ్చన్నది వారు సూచిస్తారు. అభ్యర్థి చూపని ఖర్చు ఏదైనా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకు వస్తే వారు ఆ ఖర్చును అభ్యర్థి ఖర్చు ఖాతాలో రాసి లెక్కిస్తారు. నిర్ణీత సమయాల్లో ఖర్చులకు సంబందించిన లెక్కలు చూపనట్టయితే అభ్యర్థులకు ఇచ్చిన వాహనాల అనుమతి, ప్రదర్శనలు, సభలు రద్దుచేసే అధికారికి ఉంటుంది. మాధ్యమాల ఖర్చు లెక్కలోకే.. పత్రికలు, టీవీ ఛానెళ్లలో ఇచ్చే ప్రకటనలు, చెల్లింపు వార్తల ఖర్చులను అభ్యర్థుల ఖర్చు ఖాతాలోనే జమ చేస్తారు. ఈ ఖర్చులను పరిశీలించేందుకు జిల్లా ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మానిటరింగ్ సెల్ వీటిని పర్యవేక్షిస్తుంది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన ఖర్చుల రేట్లు.. లైడ్ స్పీకర్, ఆంప్లిఫైర్, మూక్రోఫోన్ రోజుకు రూ.800 బహిరంగ సభ వేధిక రూ.2,500 ప్లాస్టిక్ కటౌట్ ఏర్పాటుకు రూ. 5 వేలు, వాల్‌పోస్టర్‌కు రూ.10, ప్లాస్టిక్ జెండా రూ.8, కొత్త జెండా రూ.12 హోర్డింగ్ ఏర్పాటుకు రూ.15వేలు, హోర్డింగ్ ఏర్పాటుకు మున్సిపాలిటీ అనుమతికి రూ.500 చెక్కతో తయారు చేసిన కటౌట్ రూ.5వేలు ఫోటో, వీడియో గ్రాఫర్‌కు రోజుకు రూ.3వేలు స్వాగత ద్వారా ఏర్పాటుకు రూ.2,500, టెంట్ సైజును బట్టి( రూ.400 నుండి రూ.800 కార్పెట్ రూ.250, సైడ్‌వాల్ రూ.80, భోజనం చేసే విస్తర్లు (ప్లేట్లు) రూ.3, టీ రూ.6, టిఫిన్ రూ. 15 విశ్రాంతి తీసుకునే ఇంటి అద్దె రూ. 2 వేలు, టోపీ రూ.50, కండువా రూ.10, ఎన్నికల గుర్తుతో ఉన్న టీ షర్టు రూ.150 డ్రైవర్లకు రోజుకు రూ.800 రోజుకు రూ.1,600, టెంపో, ట్రాక్టర్‌కు రూ.2,500, కారుకు రూ.3వేలు, సుమో, క్వాలీస్‌కు రూ.3,500, ఆటోకు రూ.1000, రిక్షా, మోటారు సైకిల్‌కు రూ.500 -
విద్యావంతులకే ఓటు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): బాల్కొండ శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారిలో ఒక్కరు మినహా అందరూ ఈ నియోజకవర్గం ప్రజలు విద్యావంతులకే పెద్దపీట వేశారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బాల్కొండ నియోజకవర్గానికి 1952లో తొలిసారి ఎన్నిక జరుగగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన అనంత్‌రెడ్డి అప్పట్లో హెచ్ఎల్సీ చదివారు. హెచ్ఎల్సీ ఉత్తీర్ణత చెందడం అప్పట్లో చాలా గొప్ప విషయమని మన పూర్వీకులు చెబుతున్నారు. హెచ్ఎల్సీ అంటే 12వ తరగతి అని అర్థం. అలాగే 1957 విజయం సాధించిన తుమ్మల రంగారెడ్డి కూడా హెచ్ఎల్సీ వరకు చదివి రాజకీయాల్లో ప్రవేశించారు. 1962, 1967, 1972, 1978 వరుసగా ఎమ్మెల్యేగా ఎంపికైన అర్గుల్ రాజారాం నిజాం కళాశాలలో బీఏ చదివారు. అప్పట్లో బీఏ చదవడం అంటే ఇప్పడు పీహెచ్‌డీతో సమానం అని పాత తరం వారు చెబుతున్నారు. ప్రసిద్ధ నిజాం కళాశాలలో బీఏ చదవడం సాధారణ విషయం కాదని కూడా ఎంతో మంది చెబుతున్నారు. అర్గుల్ రాజారాం మరణం తరువాత 1981లో నిర్వహించిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైన సుశీలా బాయి మాత్రం సామాన్య గృహిణి ఆమె ప్రాథమిక విద్యను మాత్రమే పూర్తి చేశారు. 1983, 1985 ఎన్నికలలో గెలిచిన మధుసూదన్‌రెడ్డి కూడా హెచ్ఎస్సీ పూర్తి చేశారు. ఆయన ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించి తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నారని పలువురు తెలిపారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన సురేశ్‌రెడ్డి నిజాం కళాశాలలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. అమెరికాలో పర్యావరణ శాస్త్రంలో ఎంఎస్ చదవడానికి సిద్ధం అవుతున్న సమయంలో ఎమ్మెల్యేగా ఎంపిక కావడంతో ఇక్కడే స్థిరపడిపోయారు. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడంతో పాటు సందర్భోచితంగా ప్రసంగాలు ఇస్తూ అందరి మన్నలను అందుకున్నారు. సురేశ్‌రెడ్డి వాక్చాతుర్యం వల్లనే ఆయనకు స్పీకర్ పదవి దక్కిందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో పీఆర్పీ తరపున విజయం సాధించిన ఈరవత్రి అనిల్ ప్రసిద్ధ సీబీఐటీ కళాశాలలో బీఈ పూర్తి చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించి అక్కడ కొంత కాలం స్థిరపడి రాజకీయాల్లో చేరడానికి స్వదేశానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. అలాగే 2009 ఎన్నికల్లో విజయం సాధించిన ప్రశాంత్‌రెడ్డి బీఈ సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడు. ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ఉన్నత విద్యావంతులు ఉన్నట్లే ఓటమి పాలైన వారిలోనూ ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉండడం గమనార్హం. 1994లో ఓటమి పాలైన బద్దం నర్సారెడ్డి 1966లో బీఏ పూర్తి చేశారు. 2004లో సురేశ్‌రెడ్డి చేతిలో ఓటమి చవి చూసిన వసంత్‌రెడ్డి హోమియో వైద్య డిగ్రీని పూర్తి చేశారు. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన శనిగరం శ్రీనివాస్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన అప్పట్లో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వదేశానికి వచ్చారు. ఓటమి పాలు కావడంతో మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన వేముల సురేందర్‌రెడ్డి కూడా ఎంఏ చదువును పూర్తి చేశారు. పలు సబ్జెక్టులలో ఎంఏ పట్టాలను అందుకున్న సురేందర్‌రెడ్డి ఉన్నత విద్యావంతుడు కావడం విశేషం. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మల్లికార్జున్‌రెడ్డి వైద్య విద్యను పూర్తి చేశారు. ఆయన అపోలో ఆస్పత్రిలో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా ఎంతో మంది బాల్కొండ బరిలో పోటీ చేసి గెలిచిన, ఓటమిపాలైన వారిలో ఉన్నత విద్యావంతులు ఉండటం విశేషంగా చెప్పవచ్చు. -
అభ్యర్థి ఎన్నికల ఖర్చు సమర్పించాల్సిందే
ఈ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న అభ్యర్థుల ఖర్చులకు రోజూ లెక్క చెప్పాల్సిందే. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రచారంలో వాడే ద్విచక్రవాహనాలనుంచి ప్రతి వాహనం, వేదికలు, ఫ్లెక్సీల ఏర్పాటు అన్నీ అభ్యర్థి ఖాతాలోకి వెళ్లనున్నాయి. ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసే దగ్గరి నుంచి ఎన్నికల వరకు ప్రచారం, ఇతరత్రాఖర్చులు కలుపుకుని మొత్తం రూ.28 లక్షలు మించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏయే పద్దు కింద ఎంత మొత్తంలో వ్యయం చేయాలనే విషయాలను కూడా స్పష్టం చేసింది. సాక్షి,దురాజ్‌పల్లి (సూర్యాపేట)/ఆలేరు : ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనలను అమలు చేసేందుకు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన నియమ నిబంధనలు ఈనెల 12న నామినేషన్ల ప్రారంభం నుంచే అమలులోకి రానుంది. ఇప్పటికే జిల్లాలో డబ్బు, మద్యం అక్రమ రవాణాకు యంత్రించేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసు యంత్రాంగం వాహనాల తనిఖీని ముమ్మరంగా చేపడుతోంది. నామినేషన్ ముందు పెడుతున్న ఖర్చు పార్టీ ఖాతాలోకి రానుంది. పరిమితి దాటితే.. ఆదాయ పన్ను చట్టానికి లోబడి రూ. 49,999 వరకు జరిపే లావాదేవీలకు పాన్‌కార్డు అవసరం ఉండదు. రూ. 50వేలకు మించి జరిపే ప్రతి లావాదేవీపైన ఖాతాదారుడు పాన్‌కార్డు సమర్పించడం తప్పనిసరి. అంతే కాకుండా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సరైన ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీరో ఖాతాల్లో ఉన్నఫలంగా నగదు జమ అయితే వీటి మీద దృష్టి పెడతారు. కనీసం రూ. 2లక్షల నుంచి ఆపై డబ్బు జమ అయిన వెంటనే పరిశీలన చేస్తారు. అలాగే నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థులకు అధికారులు ఒక పుస్తకాన్ని అందజేస్తారు. అందులోని ఒక పేజీలో నగదుకు సంబంధించిన వివరాలు, 2వ పేజీలో ఖాతాలో నిలువ, 3వ పేజీలో ఖర్చు వివరాలను రాయాలి. ప్రతిఒక్కరూ మూడు సార్లు ఖర్చుల వివరాలను బిల్లులతో సహా ఎన్నికల అధికారి కార్యాలయంలోని అకౌంటెంట్ విభాగంలో చూపించాలి. నిర్ణీత సమయాల్లో చూపించకపోతే అభ్యర్థులకు ఇచ్చిన వాహనాల అనుమతి, ప్రదర్శన సభలను రద్దు చేస్తారు. దీంతో పాటుగా ప్రసార సాధనాలకు ఇచ్చే ప్రకటనలు, చెల్లింపు వార్తల ఖర్చులను కూడా అభ్యర్థుల ఖర్చుల ఖాతాల్లోనే జమ చేస్తారు. ప్రతి పైసా లెక్క.. శాసనసభకు పోటీ చేసే ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసే దగ్గరి నుంచి ఎన్నికల వరకు ప్రచారం, ఇతరత్రాఖర్చులు కలుపుకుని మొత్తం రూ.28 లక్షలు మించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏయే పద్దు కింద ఎంత మొత్తంలో వ్యయం చేయాలనే విషయాలను కూడా స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ఖర్చును మూడురోజులు, లేదా వారానికోసారి లేదా పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ వరకు కూడా లెక్క చూపే అవకాశం ఉండేది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అభ్యర్థి తాము చేస్తున్న ఖర్చును రోజువారీగా తప్పని?సరిగా చూపించాలనే నిబంధన అమలులోకి వచ్చింది. ఖర్చుల వివరాల ప్రతులను జిల్లా ఎన్నికల అధికారికి విధిగా ఎప్పటికప్పుడు సమర్పి?ంచాల్సిందే. అంతేకాకుండా ఈ వివరాలను ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వెబ్సైట్లో కూడా ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేస్తే వాటికి సంబంధించిన ఆధారాలను కూడా అఫడివిట్‌లో నామినేషన్ సమయంలో విధిగా నమోదు చేయాలని పేర్కొంది. రోజూవారీ కిరాయిల బిల్లు, ఇతర ఖర్చులను కూడా విచ్చలవిడిగా చూపించే అవకాశం లేదు. దేనికి ఎంత బిల్లు చెల్లించాలో ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ బిల్లులు చూపితే అనుమతించబడదు. -
బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లతో బీజేపీ మరో జాబితా విడుదల చేసింది. రెండో విడత జాబితాలో 28 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశం అయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన సమావేశం ఏర్పాటు అయింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్‌తో పాటు పలువురు అగ్రనాయకులు పాల్గొన్నారు. (బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా) తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే 177 మంది, మిజోరంకు పోటీ చేసే 24 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సెక్రటరీ జేపీ నడ్డా లేఖ విడుదల చేశారు. రెండో విడత అభ్యర్థుల జాబితా సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి పేరు 1 ఆసిఫాబాద్(ఎస్టీ) అజ్మీరా ఆత్మారాం నాయక్ 2 ఖానాపూర్(ఎస్టీ) సాట్ల అశోక్ 3 నిర్మల్ డాక్టర్ ఐండ్ల సువర్ణా రెడ్డి 4 నిజామాబాద్ అర్బన్ యెండల లక్ష్మీనారాయణ 5 సిర్పూర్ డాక్టర్ శ్రీనివాసులు 6 జగిత్యాల మూడుగంటి రవీందర్ రెడ్డి 7 రామగుండం బల్మూరి వనిత 8 సిరిసిల్ల మల్లాగారి నర్సాగౌడ్ 9 కూకట్ పల్లి మాధవరం కాంతా రావు 10 సిద్ధిపేట నైని నరోత్తం రెడ్డి 11 రాజేంద్రనగర్ బద్దం బాల్ రెడ్డి 12 శేరిలింగం పల్లి జి. యోగానంద్ 13 మలక్ పేట్ ఆలె జితేంద్ర 14 చార్మినార్ టి. ఉమా మహేంద్ర 15 చాంద్రాయణగుట్ట సయ్యద్ షాహజాదీ 16 యాకుత్‌పురా చర్మాని రూప్‌రాజ్ 17 బహదూర్‌పురా హనీఫ్ అలీ 18 దేవరకొండ అగ్గని నర్సింహులు సాగర్ 19 వనపర్తి కొత్త అమరేందర్ రెడ్డి 20 నాగర్ కర్నూల్ నేదనూరి దిలిప్ చారి 21 నాగార్జున్ సాగర్ కంకనాల నివేదిత 22 ఆలేరు దొంతిరి శ్రీధర్ రెడ్డి 23 స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ) పెరుమాండ్ల వెంకటేశ్వర్లు 24 వరంగల్ వెస్ట్ ఎం ధర్మారావు 25 వర్ధన్నపేట(ఎస్సీ) కొంత సారంగ రావు 26 ఇల్లెందు(ఎస్టీ) మోకాళ్ల నాగ స్రవంతి 27 వైరా(ఎస్టీ) భూక్యా రేష్మా భాయి 28 అశ్వారావు పేట డాక్టర్ భూక్యా ప్రసాద రావు -
మండలి వేడి
మరో పదిరోజుల్లో శాసనమండలి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రచార పర్వంలో ముందుండగా.. తొలిసారి అభ్యర్థిని నిలిపిన కాంగ్రెస్‌లో సమన్వయ లోపం కనిపిస్తోంది. 32మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నా ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టి సారించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్‌ను పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిపిన టీఆర్ఎస్ బహుముఖ ప్రచారంపై దృష్టి సారించింది. ఓటర్ల నమోదులో టీఆర్ఎస్ క్రియాశీలంగా వ్యవహరించకపోవడంతో ప్రస్తుతం విస్తృత ప్రచారం ద్వారా గట్టెక్కాలనే ప్రయత్నంలో ఉంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ప్రచార వ్యూహం సిద్ధం చేశారు. ఇప్పటికే మూడు విడతలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవీప్రసాద్ తిరిగి 13, 14, 16 తేదీల్లో జిల్లాకు రానున్నారు. గతంలో వాయిదాపడిన జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు పార్టీ యంత్రాంగంపై ఆధారపడుతూనే వివిధవర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సీపీఐ ఇప్పటికే మద్దతు ప్రకటించగా, జేఏసీ భాగస్వామ్య సంఘాలు బృందాలుగా ప్రచారం చేస్తున్నాయి. ఫ్లెక్సీలు, పోస్టర్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. బహిరంగ సభలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో హాల్ మీటింగ్స్ ద్వారా మద్దతు కూడగట్టే దిశగా టీఆర్ఎస్ వ్యూహం సాగుతోంది. చాపకింద నీరులా బీజేపీ రెండుసార్లు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాంచందర్‌రావు పోటీ చేశారు. వరుసగా మూడో పర్యాయం ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటరు నమోదు ప్రక్రియ నుంచే చురుగ్గా వ్యవహరిస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రచారం చాపకింద నీరులా కనిపిస్తోంది. పార్టీ, అనుబంధ సంఘాల నేతలు ప్రచార బాధ్యతను భుజాలపై వేసుకుని పనిచేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మూడు పర్యాయాలు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ప్రైవేటు కాలేజీలు, బార్ అసోసియేషన్లు, రిటైర్డు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు లక్ష్యంగా ప్రచారం సాగుతోంది. హాల్ మీటింగ్స్‌ను విస్తృతంగా జరిపేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒంటరి పోరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల బరిలో తొలిసారిగా అభ్యర్థిని నిలిపిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మాత్రం సమన్వయ లోపం కనిపిస్తోంది. పార్టీ ముఖ్యనేతలు కొందరు.. తమను సంప్రదించకుండా పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ నుంచి సమన్వయకర్తలను నియమించినా ఇప్పటివరకు సమష్టిగా ప్రచారం జరిగిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అయితే అభ్యర్థి రవికుమార్ గుప్తా మాత్రం కలిసి వచ్చే పార్టీ నేతలతో పాటు విద్యాసంస్థలు, బార్ అసోసియేషన్లు లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. వీలైనచోట హాల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నుంచి నలుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో ఉన్నా ప్రచారంలో కనిపిం చడం లేదు. స్వతంత్ర అభ్యర్థి రాకొండ సుభాష్‌రెడ్డి పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల మద్దతుతో ప్రచారం నిర్వ హిస్తున్నారు. -
సందడేది..?
సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ఎక్కడా కనిపించడంలేదు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో మొత్తం 33మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో జిల్లాకు చెందిన ఐదుగురున్నారు. మార్చి 2వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. దీంతో బరిలో ఎందరు నిలుస్తారనేది స్పష్టత రానుంది. బరిలో ప్రధాన పార్టీలు... మేధావివర్గం ఎన్నికలుగా భావించే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గతంలో ప్రధాన రాజకీయపార్టీలు దూరంగా ఉండేవి. కానీ ఈసారి ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను రంగంలోకి దించడంతో ఆసక్తిగా మారింది. 2007, 2009లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అధికారికంగా అభ్యర్థిని నిలబెట్టింది. 2007ఎన్నికల్లో టీఆర్ఎస్ కూడా అభ్యర్థిని నిలబెట్టింది. ఆ తర్వాత 2009లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నాగేశ్వర్‌కు మద్దతిచ్చింది. ఈసారి టీఆర్ఎస్ ఫేవరెట్‌గా ఎన్నికల బరిలో నిలిచింది. అంతేకాదు ఉద్యోగ సంఘాల నాయకుడైన దేవీప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొట్ట మొదటిసారిగా తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన వ్యక్తి పాలమూరు వాసే కావడం గమనార్హం. జిల్లానుంచి బరిలో నిలిచిన వారిలో ఐదుగురు ఉన్నారు. వారిలో ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్‌గుప్త కాగా.. మిగతా వారు స్వతంత్ర అభ్యర్థులుగా.. కృపాచారి(ఖిల్లాగణపురం), బంగారయ్య (నాగర్‌కర్నూల్), ఎండీ అబ్దుల్ అజీజ్ ఖాన్ (అమిస్తాపూర్), లక్ష్మణ్‌గౌడ్(వనపర్తి) ఉన్నారు. చడీ చప్పుడు లేదు... ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసినా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం ఎక్కడా మొదలు కాలేదు. అయితే బీజేపీ మాత్రం సుమారు 6నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించి చాపకింద నీరులా ఓటర్ల నమోదు కార్యక్రమంలో కూడా పాల్గొంది. ఇక కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఓటరు నమోదు కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నాయి. కానీ తీరా షెడ్యూల్ రాగానే అభ్యర్థులను బరిలో దించాయి. కొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలవాలనే ముందుచూపుతో ఓటరు నమోదులో మొగ్గుచూపారు. దీంతో ఓటర్ల సంఖ్య జిల్లాలో రెట్టింపు అయ్యింది. గతంలో 32వేల ఓటర్లు ఉండగా ప్రస్తుతం 66వేలకు చేరుకుంది. జిల్లా నేతలకు పరీక్ష... ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధానపార్టీల నేతలకు సవాల్‌గా మారింది. టీఆర్ఎస్ పార్టీ టీఎన్జీఓ అధ్యక్షడు దేవీప్రసాద్‌ను అభ్యర్థిగాప్రకటించింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, తదితర నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరందరూ ఎంత మేరకు సమన్వయంతో పనిచేస్తారనే అంశం మీదే అధికారపార్టీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించినా పార్టీ అంతర్గతంగా అసంతృప్తులు చెలరేగుతున్నాయి. తమను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని జిల్లా నేతలు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ టికెట్టు పొందిన తర్వాత రవికుమార్ ఇటీవలి కాలంలో ఒక మాజీ మంత్రి మద్దతు కోరేందుకు వెళితే... అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత గుర్తొచ్చామా? అంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే పీసీసీ మాత్రం మొట్ట మొదటిసారిగా అభ్యర్థిని రంగంలోకిదించినందున గెలుపు కోసం ఒక కమిటీ వేసింది. అయితే, నేతలు ఎంత మేరకు సమన్వయంతో పనిచేస్తారనే మున్ముందు తేలనుంది. బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో ముందు పక్కా వ్యూహంతో పనిచేస్తోంది. ఆరు నెలల నుంచి పనులు ప్రారంభించినా.. రెండు, మూడు నెలలుగా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను సంసిద్ధులను చేస్తోంది. గెలుపులను నిర్ణయించేది వీరే..! పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ప్రధానంగా గెలుపోటముల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఉద్యోగులు, కీలకపాత్ర పోషించనున్నారు. ఈ వర్గాల మద్దతు కూడగట్టుకునే వారికే మాత్రమే సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా నుంచి రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నేతలు టీఆర్ఎస్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. వారికి చివరకు నిరాశ ఎదురవడంతో కాస్త అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వారు ఎంతవరకు సహరిస్తారనేది తేలాల్సి ఉంది. మరోవైపు విద్యార్థి, యువజన సంఘాలు కూడా కీలకం కానున్నాయి. వీటిని ఏ విధంగా సమన్వయం చేస్తారనేది మున్ముందు తేలాల్సి ఉంది. -
డీపీసీ ఏకగ్రీవం
మహబూబ్‌నగర్ టౌన్: జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బుధవారం అధికారికంగా ప్రకటించారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు ఒక అవగాహనకు వచ్చి స్థానాలను పంచుకోవడంతో సభ్యుల ఎన్నికకు పోటీ లేకుండా పోయింది. జిల్లాలో 21స్థానాలకు 39మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే వాటిని పరిశీలనలో 8మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక మిగిలిన 31మందిలో ఉపసంహరణ రోజు 10మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పోటీలో 21మంది మాత్రమే నిలిచారు. దీంతో సభ్యుల ఎన్నికకు పోటీ లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ప్రకటించారు. -
మ్యాచ్ ఫిక్సింగే..!
మహబూబ్‌నగర్ టౌన్: జిల్లాలో డీపీసీ(జిల్లా ప్రణాళిక మండలి)సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామీణ సభ్యుల కోటాలో 21 మంది ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని జాబితా విడుదల చేశారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా, ఒకేసారి 10మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం, 21 స్థానాలకు 21మంది అభ్యర్థులు మిగలడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో 21స్థానాలకు ఎన్నికలు నిర్వహిం చగా అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలుచేశారు. మొ త్తం 39మంది అభ్యర్థులు బరిలో ఉండటం తో ఎన్నికలు జరుగుతాయని అందరూ భా వించారు. ఇదిలాఉండగా, లోపాయికారి ఒప్పందంతో ఏకగ్రీవానికి సరిపడా 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 39 మంది నామినేషన్లు 21 స్థానాలకు 39మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. అయితే నామినేషన్ల పరిశీలనలో ఎనిమంది మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరిలో నలుగురు అభ్యర్థులు రిజర్వేషన్లలో కాకుండా, జనరల్ స్థానాల్లో నామినేషన్లు దాఖలుచేసి డిక్లరేషన్‌పత్రంలో మాత్రం బీసీ కులమని పేర్కొన్నారు. మరో నలుగురు అభ్యర్థులు రిజర్వేషన్ల కింద కులం సర్టిఫికేట్లు దాఖలు చేయని కారణంగా ఎనిమిది మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా యి. బాలకిష్టన్న(ఆత్మకూర్ జెడ్పీటీసీ), భాస్కర్(మల్దకల్), కవితమ్మ(ధన్వాడ), శకావత్ భీముడు(వంగూర్), హన్మంత్(కొల్లాపూర్), ఖగ్‌నాథ్‌రెడ్డి(ఇటిక్యాల), చంద్రావతి(అయిజ), నవీన్‌కుమార్‌రెడ్డి(కొత్తూ రు), రాజేశ్వర్‌రెడ్డి(గోపాల్పేట్), హైమావతి(మిడ్జిల్) తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎంపికైన అభ్యర్థులకు బుధవారం కలెక్టర్ జీడీ ప్రియదర్శిని నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. అభివృద్ధి పనులపై డీపీసీ ముద్ర గ్రామ, మండల, జిల్లాస్థాయిలో రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి జిల్లా ప్రణాళిక మండలి(డీపీసీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో జరిగే అభివృద్ధి పనులపైనా సమీక్షించే అధికారం డీపీసీకి ఉంటుంది. జిల్లా ప్రణాళిక మండలిలో మొత్తం 30 స్థానాలు ఉండగా, జెడ్పీచైర్మన్ అధ్యక్షులుగా, కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఒక మైనార్టీతో పాటు మరో ముగ్గురు నిష్ణాతులను ప్రభుత్వం డీపీసీ సభ్యులుగా నామినేట్ చేస్తుంది. -
డిపాజిట్.. దిగమింగారు
అడ్డదారిలో సంపాదనకు అలవాటుపడిన అధికారులు చివరకు ఎన్నికల డిపాజిట్ సొమ్మునూ వదల్లేదు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు చెల్లించిన కోటి రూపాయలకు పైగా డిపాజిట్ డబ్బులు దిగమింగారు. ఫలితాలు వెలువడిన నెలరోజుల్లోగా డిపాజిట్ తిరిగి చెల్లించాల్సి ఉన్నా నెలల తరబడి అభ్యర్థులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. చాలామంది అభ్యర్థులకు తాము చెల్లించిన మొత్తం తిరిగి వస్తుందనే అవగాహన లేకపోవడం స్వాహారాయుళ్లకు వరంగా మారింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని 1,329 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 13,566 వార్డు సభ్యుల పదవులకు గత యేడాది జూలై చివరి వారంలో ఎన్నికలు జరిగాయి. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా సుమారు 45వేలకు మంది అభ్యర్థులు పోటీ చేశారు. సర్పంచ్‌లుగా పోటీ చేసిన జనరల్ అభ్యర్థులు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వేయి రూపాయల చొప్పున సుమారు రూ.60 లక్షలు డిపాజిట్ చెల్లించారు. వీరితో పాటు వార్డు సభ్యులుగా పోటీ చేసిన జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.250 చొప్పున రూ.1.50 కోట్ల మేర డిపాజిట్‌గా చెల్లించారు. ఎన్నికల్లో డిపాజిట్ సాధించినా, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నా అభ్యర్థులకు డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు పోలైన ఓట్లలో ఎనిమిదో వంతు సాధిస్తే డిపాజిట్ దక్కుతుంది. డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థులకు సంబంధించిన మొత్తాన్ని సంబంధిత గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాలి. డిపాజిట్ల చెల్లింపు, జప్తు ప్రక్రియ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ నియమించిన రిటర్నింగ్ అధికారి లేదా ప్రత్యేక అధికారి ఈ ప్రక్రియను పర్యవేక్షించి ఎన్నికల సంఘానికి నివేదిక పంపాలి. అయితే ఎన్నికలు జరిగి సుమారు యేడాది కావస్తున్నా అభ్యర్థులకు డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించలేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. జిల్లాలో 64 మండలాలకు గాను సుమారు 50 మండలాల్లో పంచాయతీ ఎన్నికల డిపాజిట్ సొమ్మును అధికారులే స్వాహా చేసినట్లు ప్రాథమిక అంచనా. గోప్యత పాటిస్తున్న అధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన కొందరు ఎంపీడీఓలు, ఈఓ పీఆర్డీలు డిపాజిట్ సొమ్ము స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొందరు ఎంపీడీఓలు బదిలీపై వెళ్లగా, మరికొందరు మాత్రం తిరిగి చెల్లిస్తామని దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారు. డిపాజిట్ సొమ్ము తిరిగి వస్తుందనే విషయంపై చాలా మంది అభ్యర్థులకు అవగాహన లేకపోవడం కూడా అక్రమార్కులకు వరంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడం, చాలా మంది తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన వారే కావడంతో డిపాజిట్ సొమ్ముపై అవగాహన లేకుండా పోయింది. మరికొన్ని చోట్ల కాళ్లరిగేలా డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించాలంటూ అభ్యర్థులు అధికారులు చుట్టూ తిరుగుతున్నా దాటవేస్తున్నారనే పిర్యాదులు అందుతున్నాయి. సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా విజయం సాధించిన వారు ఒకవేళ డిపాజిట్ కోసం పట్టుబట్టినా ‘ఇనాం’ కింద తీసుకున్నామంటూ తిప్పి పంపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు డిపాజిట్ సొమ్ము కోటిన్నర రూపాయల మేర అధికారుల జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీకి ఏ రకమైన బకాయిలూ ఉండకూడదని ఎన్నికల సంఘం నిబంధన విధించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కుళాయి, ఇంటి పన్ను తదితరాలను గ్రామ పంచాయతీకి చెల్లించారు. అయితే పంచాయతీ అధికారులు ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్ష్యాలివే! అచ్చంపేట మండలంలో 20 గ్రామ పంచాయతీలకు 44 మంది, 196 వార్డులకు 395 మంది అభ్యర్థులు పోటీ చేశారు. డిపాజిట్ రూపంలో రూ.1.57లక్షలు చెల్లించగా ఏ ఒక్కరికీ ఇప్పటివరకు నయా పైసా తిరిగి చెల్లించలేదు. ఉప్పునుంతల మండలంలో 15 పంచాయతీలకు 35 మంది, 148 వార్డులకు 332మంది పోటీ చేశారు. వీరు డిపాజిట్ రూపంలో చెల్లించిన రూ.1.37లక్షలు అభ్యర్థులకు తిరి గివ్వకుండా అధికారులే భోంచేశారు. బాలానగర్ మండలంలో 31 పంచాయతీలు, వాటి పరిధిలోని వార్డులకు సంబంధించి అభ్యర్థులు రూ.3,39,250 డిపాజిట్‌గా చెల్లించారు. వీటిని అప్పటి ఎంపీడీఓ, ఈఓ పీఆర్డీ, కార్యాలయ సూపరింటెండెంట్ సొం తానికి వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ ఉద్యోగ సంఘం నేత ఈ అంశంపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడంతో విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్, జెడ్పీ సీఈఓను ఆదేశించింది. దీంతో జూన్ మూడో తేదీలోపు డిపాజిట్ సొమ్ము తిరిగి ఇస్తానని అప్పటి ఎంపీడీఓ లిఖిత పూర్వకంగా ఇచ్చినా నేటికీ అభ్యర్థులకు మాత్రం డిపాజిట్ సొమ్ము తిరిగి దక్కలేదు. -
లెక్క..కుదరడం లేదు..!
ఎన్నికలు పూర్తయినా అభ్యర్థులు వాటికి చేసిన ఖర్చుల వివరాలు కొలిక్కి రావడం లేదు. కొంతమంది సమర్పించినా అవి మమ అనిపించేలా ఉన్నాయి. అధికులు అధికారుల నోటీసులకు స్పందించడమే లేదు. దీంతో వ్యయ పరిశీలకులు జిల్లాలోనే మరో అయిదురోజుల పాటు మకాం వేసి నిగ్గు తేల్చాలని కంకణం కట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధార ణ ఎన్నికల వ్యయ పరిశీలకులు జిల్లాలో మూడు రోజులుగా మకాం వేసినా అభ్యర్థుల ఖర్చుకు సంబంధించిన లెక్కలు తే లడం లేదు. రెండు లోక్‌సభ, 14 అసెం బ్లీ స్థానాల్లో 164 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ఇప్పటి వరకు 127 మం ది ఎన్నికల వ్యయానికి సంబంధించి లె క్కలు సమర్పించగా, మరో 37 మంది అ భ్యర్థులుస్పందించడం లేదు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు, కొడంగల్, దేవరకద్ర, అచ్చంపేట, కల్వకుర్తి అ సెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు వ్యయ వివరాలు సమర్పించారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ఎనిమిది మంది, షాద్‌నగర్‌లో ఆ రుగురు అభ్యర్థులు లెక్కలు సమర్పిం చాల్సి వుంది. నోటీసులు ఇచ్చినా స్పం దించని అభ్యర్థుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎన్నికల సంఘం దృ ష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 22వ తేదీ వరకు జిల్లాలోనే మకాం వేసి అభ్యర్థులు సమర్పించిన వ్యయ వివరాలను పద్దుల వారీ గా తనిఖీ చేస్తామని పరిశీలకులు ప్రకటించారు. చాలా మంది అభ్యర్థులు స మర్పించిన వివరాలు అసమగ్రంగా ఉం డటంతో రెండు రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ వివరాలు సరిచూసేందుకు ఈ నెల 14న జిల్లాకు వచ్చిన నలుగురు ఐఆర్ఎస్ అధికారుల బృందం వచ్చిన విషయం తెలి సిందే. తొలుత ఈ నెల 16 వరకే ప్రక్రియ పూర్తి చేయాలని వ్యయ పరిశీలకుల బృం దం భావించినప్పటికీ అభ్యర్థుల నుంచి స్పందన లేకపోవడంతో 22 వరకు జిల్లాలోనే మకాం వేయనున్నారు. పొంతన లేని తీరుపై ఆరా మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో పో టీ చేసిన బీజేపీ అ భ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి రూ.21.11 లక్షలు వ్యయం చేసినట్లు లెక్కలు సమర్పించారు. అయితే మీడియాలో ప్రకటన రూపం లో రూ.25.95లక్షలు ఖర్చు చేసినట్లు వ్యయ పరిశీలకులు గు ర్తించారు. ఇందులో రూ.18.72 లక్షలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారానికి ఖర్చు చేసినందున వివరాలు సమర్పిం చాలని నో టీసులు జారీ చేశారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రూ. 33.50 లక్షలు, ఎంపీ జితేందర్‌రెడ్డి రూ.43.16లక్షలు ఖర్చు చే సినట్లు లెక్కలు సమర్పిం చారు. అయితే జైపాల్‌రెడ్డి రూ.18లక్షలు, జితేందర్‌రెడ్డి రూ.22.18 లక్షలు మీ డియా ప్రచారానికి ఖర్చు చేసినట్లు వ్య య పరిశీలకులు గుర్తించారు. పూర్తి వివరాలు అందజేయాలంటూ అభ్యర్థులకు నోటీసులు జారీ చేసి రెండు రోజుల గడువు విధించారు.