కలెక్టరేట్, న్యూస్‌లైన్: నేడు జిల్లా వ్యాప్తంగా 15పట్టణ కేంద్రాల్లో వీఅర్వొ, వీఆర్‌ఏ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఇందుకుగాను, కట్టుదిట్టమైన భద్రతతోపాటు, ఏర్పాట్లన్నింటిని పూర్తిచేశారు.
గతంలో లేని విధంగా ఈసారి ఒక్కో పోస్ట్‌కు 800కుపైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక జిల్లాలో ఖాళీ పోస్టుల విషయానికొస్తే 103వీఆర్వో పోస్ట్‌లకు గాను 80,674 మంది, వీఆర్‌ఏ పోస్ట్‌లకుగాను 1986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో రెండింటికి దరఖాస్తు చేసుకొన్న వారు 806మంది ఉన్నారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 5డివిజన్ కేంద్రాలతోపాటు, 10పట్టణప్రాంతాల్లో 243 పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీఅర్వొవీఆర్‌ఏ రెండు పరీక్షలు రాసే అభ్యర్థులకైతే జిల్లా కేంద్రంలోనే 8పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పటిష్టమైన భద్రత.....
ప్రతీ పరీక్ష కేంద్రం దగ్గర పటిష్టమైన పోలీస్ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. అపరిసర ప్రాంతాలకు ఎవ్వరు రావొద్దని ఇది వరకే ఆదేశాల్ని పేర్కొంటూ, అధికారులకు సూచించారు. ఇక పరీక్షలు ముగిసేంత వరకు 144సెక్షన్ అమల్లో ఉంటోంది.
తెల్లవారు జామున 2గంటలకు ప్రశ్నాల తరలింపు...
జిల్లా కేంద్రంలోని డీటీవో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను ఈ తెల్లవారు జామున 2గంటలకు లైజాన్ అధికారుతోపాటు, పటిష్టమైన బందోబస్తు మధ్య తరలించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేసి అధికారులను అందుబాటులో ఉంచారు.
ప్రశాంత మనస్సుతో పరీక్షల్ని రాయండి..
వీఆర్వో, వీఅర్‌ఏ పరీక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తోంది, ఇందుకుగాను అభ్యర్థులంతా దళారుల మాటల్ని నమ్మి మోసపోకుండా, సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొని ప్రశాంత మనస్సుతో పరీక్షల్ని రాయండి. ఇందుకుగాను ఆర్టీసీ బస్సు సదుపాయంతోపాటు, పటిష్టమైన పోలీస్ బందోస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి నిర్వాహణకు విద్యాశాఖ, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని కోరారు.
- మంత్రి డికె అరుణ
ప్రలోభాలకు లోనుకావద్దు.....
పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులంతా, దళారుల ప్రలోభాలకు లోనుకావద్దు, పూర్తిగా పారదర్శకంగానే పరీక్షలు జరుగుతాయి. ప్రతిభను నమ్ముకొని, పరీక్షలో విజయం సాధించాలి. ప్యాడ్ తప్పనిసరి, అభ్యర్థులంతా ప్రలోభాలకు లొంగొద్దు, ప్రతిభను నమ్ముకోవాలి. అభ్యర్థులంతా ప్యాడ్లు, బాల్‌పెన్నులు తప్పనిసరిగా తీసుకొని రావాలి.
- రాంకిషన్, డీఆర్వో
పరీక్షకు రెడీ
Published Sun, Feb 2 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement