collectorate
-
రంగారెడ్డి కలెక్టరేట్లో మోహన్‌బాబు, మనోజ్ విచారణ
-
YSRCP Poru bata: విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
విశాఖపట్నం, సాక్షి: కూటమి సర్కార్‌పై పోరుబాటలో భాగంగా.. ఇవాళ అన్నదాతకు అండగా కార్యక్రమం నిర్వహిస్తోంది వైఎస్సార్సీపీ. ఈ క్రమంలో రాష్ట్రమంతా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. అయితే.. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.విశాఖ కలెక్టరేట్ వద్దకు వైఎస్సార్సీపీ నేతలతో పాటు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది.మరోవైపు.. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు ఆ పార్టీ నేతలు. ‘‘ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తక్షణమే.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి... సూపర్ సిక్స్ అని చెప్పి కూటమి ప్రభుత్వం డక్ ఔట్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి రూ.20,000 ఇవ్వాల్సిందే. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 18 ఏళ్ల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని గుడివాడ అన్నారు. -
సీపీఐ,సీపీఎం ఆందోళన..అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ,సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు,కార్మికులు అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ వినోద్‌కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళకారులు కలెక్టర్ వాహనాన్ని అరగంట సేపు దిగ్భందించారు.ఈ సందర్భంగా పోలీసులు,ఆందోళకారులకు మధ్య వాగ్వాదం,తోపులాటజరిగింది. హామీల అమలులో టీడీపీ,బీజేపీ, జనసేన విఫలమయ్యాయని సీపీఎం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కు రైతుల ఆత్మహత్యలు పట్టవా అని వారు ప్రశ్నించారు.రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీశారు.వైఎస్సార్ వాహనమిత్ర ఇవ్వకపోవడం వల్ల ఆటో,ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం -
చేతిలో సంచి.. అందులో కత్తి.. పుట్టపర్తి కలెక్టరేట్‌కు మహిళ!
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా): అచ్చం ఫ్యాక్షన్ సినిమా మాదిరిగానే ఉంది తాజా ఘటన. చేతిలో సంచి.. అందులో కత్తి పెట్టుకుని ఒక మహిళ ప్రభుత్వ కార్యాలయానికి రావడం ఫ్యాక్షన్ సినిమాను తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పుట్టపర్తి కలెక్టరేట్‌కు ఓ మహిళ కత్తితో రావడం తీవ్ర కలకలం రేపింది. చేతిలో సంచి పట్టుకుని అందులో కొన్ని డాక్యుమెంట్స్‌తో పాటు కత్తిని తీసుకుని కలెక్టరేట్‌కు రావడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా తనకున్న భూ సమస్యతో ఆమె కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే తన భూ సమస్యకు సంబంధించి డాక్యుమెంట్స్ ను సంచిలో తీసుకొచ్చింది ప్రేమలత అనే మహిళ.అయితే సంచిలో కత్తి కూడా ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కర్నీ తనిఖీలు చేసే క్రమంలో ఆమెను కూడా తనిఖీ చేయగా కత్తి బయటపడింది. దాంతో అక్కడున్న పోలీస్ సెక్యూరిటీ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. అసలు ఆమెను కత్తిని ఎందుకు తీసుకొచ్చావ్ అని ప్రశ్నించగా, ఆత్మరక్షణ కోసం అంటూ సమాధానమిచ్చింది. దాంట్లో ఎంత వరకూ వాస్తవం ఉందని పదే పదే ప్రశ్నించిన పోలీసులు.. ఆమెను విడిచిపెట్టి కత్తిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. -
అర్జీలన్నీ అట్టపెట్టెల్లోకే..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితుల అర్జీల పరంపర శుక్రవారం కూడా అనేక ఇక్కట్ల మద్య కొనసాగింది. కలెక్టరేట్‌కు వేలాదిగా బాధితులు శుక్రవారం కూడా అర్జీలతో చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ వీరెవర్నీ కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు. రోజూలాగే మండుటెండలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై, మురుగుకాల్వగట్లపై అవస్థలు పడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకోవడంతో అధికారులు చేసేదిలేక హడావుడిగా బాధితులను లోపలికి అనుమతించారు. అయితే, శుక్రవారం కౌంటర్లలో అర్జీలు తీసుకోబోమని తెగేసి చెప్పారు. అట్టపెట్టెలు ఏర్పాటుచేసి ఎవరికి వారు తమ అర్జీలను అందులో పడేసి వెళ్లిపోవాలన్నారు. మరోవైపు.. అప్పటివరకూ ఎండనపడి వచ్చిన బాధితులు చెట్ల నీడలో సేదతీరుతుండగా పోలీసులొచ్చి వారిని కనికరం లేకుండా తరిమేశారు. తమతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారంతా మండిపడుతూ.. సర్కారుకు శాపనార్ధాలు పెడుతూ వారంతా ఉసూరుమంటూ బయటకొచ్చారు. -
డిక్లరేషన్ కోసం ఢీ
జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతులు వివిధ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా షరతుల్లే కుండా రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్, మూతపడిన చక్కర ఫ్యాక్టరీని తెరిపించాలన్న డిమా ండ్లతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా నలు మూలల నుంచి వేలాదిమంది రైతులు తరలిరాగా.. నిజా మాబాద్ రోడ్డులోని మార్కెట్ యార్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్, పటేల్‌చౌక్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు.దాదాపు 4 గంటల పాటు ఆందో ళన నిర్వహించారు. కథలాపూర్‌కు చెందిన ఒక రైతు సొమ్మ సిల్లి పడిపోవడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కలె క్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి న కలెక్టర్ సత్యప్రసాద్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.అనంతరం రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రూణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో రైతు వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్నె రాజేందర్, బందెల మల్లన్న, బద్దం మహేందర్, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. -
వరద సాయం అందక రెండోరోజు విజయవాడ కలెక్టరేట్‌కు పోటెత్తిన బాధితులు (ఫొటోలు)
-
సాయం అందక.. నిస్సహాయంగా
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) / విజయవాడ స్పోర్ట్స్: ‘‘ఇప్పటికి ఎనిమిది సార్లు అర్జీలు ఇచ్చా.. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. ఇంకెక్కడికని తిరగాలి..? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీళ్ల నుంచి బయటపడ్డాం. సర్వం కోల్పోయాం. మాకు నష్ట పరిహారం రాలేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వక పోవడం ఏమిటి..? ఈ వయసులో పడుతూలేస్తూ కలెక్టరేట్‌కు వచ్చాం. ఇదేం ఖర్మ..? రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నాం. ఆయన (సీఎం చంద్రబాబు) వచ్చి న్యాయం చేయాలి కదా..?’’ విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన వరద బాధితురాలు నక్కా రమాదేవి కన్నీటి వేదన ఇదీ! సరిగ్గా నెల క్రితం బుడమేరు వరద నగరంపై విరుచుకుపడింది. జీవిత కాలం కష్టార్జితం అంతా నీటి పాలైంది. పది రోజులకుపైగా వరద, బురదలోనే బాధితులు మగ్గారు. కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నివ్వెరపోతున్నారు. పొంతన లేని విధంగా సర్వే వివరాలున్నాయి. కొందరి పేర్లు జాబితాలో ఉన్నా పరిహారం అందలేదు. సచివాలయాలకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయమంటున్నారని, ఎమ్మెల్యే కార్యాలయంలోనూ అర్జీలు అందచేసినా కనీస స్పందన లేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డ బాధితులు సోమవారం విజయవాడ కలెక్టరేట్‌కు పోటెత్తారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, ఒంటరి మహిళలు, బాలింతలు చంటి బిడ్డలను చంకనేసుకుని వేల సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వరద నీటిలో చంటి బిడ్డలను పెట్టుకుని పది రోజులు గడిపామని.. కనీసం పిల్లల ముఖాలు చూసైనా పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.చివరి రోజు కావడంతో..బాధితుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని సెప్టెంబర్ 25న ప్రభుత్వం ప్రకటించింది. 30వతేదీ లోగా బాధితులందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొంది. అయితే గడువు ముగుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బులు పడకపోవడం.. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్నారని ప్రచారం జరగడంతో బాధితులంతా కలెక్టరేట్‌కు పోటెత్తారు. ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున చేరుకుని పడిగాపులు కాసినా సీఎం చంద్రబాబు రాలేదు. చివరి రోజు కావడంతో దరఖాస్తుల కోసం బాధితులు పరుగులు తీశారు. ఓవైపు మండే ఎండ.. మరోవైపు కనీస సౌకర్యాల లేక వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులు, గర్భిణులు నానా ఆగచాట్లు పడ్డారు.జాబితాలో చిత్ర విచిత్రాలు..‘‘ప్రియమైన పైడి సాయిదీపక్...! మీ బ్యాంకు ఖాతా ఆధార్ నంబరుతో లింక్ కాకపోవడం వల్ల వరద నష్ట పరిహారం ఖాతాలో జమ కాలేదు. వెంటనే మీ బ్యాంకు అధికారులను సంప్రదించి ఖాతాను ఆధార్‌తో లింకు చేసుకోవాలి..!’’ ఓ బాధితుడి మొబైల్‌కు ప్రభుత్వం పంపిన సందేశం ఇదీ! చిత్రమేమిటంటే సాయిదీపక్ వయసు 8 ఏళ్లు. ఆ చిన్నారికి బ్యాంకులో ఖాతా లేదు. ఇక ఆధార్ లింక్ అయ్యే అవకాశమే లేదు. నష్ట పరిహారం జాబితాలో తప్పులు దొర్లాయనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని దీపక్ తండ్రి వాపోయాడు. ఇలాంటి సందేశమే ఐదేళ్ల మరో బాలికకు కూడా వచ్చింది.పొంతన లేని లెక్కలు..ప్రభుత్వం 90 శాతం మందికి నష్ట పరిహారం అందజేసినట్లు ప్రకటించింది. మిగిలిన 10 శాతం మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలున్నట్లు తేల్చింది. అయితే ప్రభుత్వం చెబుతున్న వివరాలు కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుల్లో ఏ ఒక్కరినీ కదిలించినా తమకు పరిహారం అందలేదని.. ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. బ్యాంకు ఖాతా వివరాలు సరిగానే ఉన్నా.. పరిహారం అందలేదని చెబుతున్నారు.జగన్ ప్రభుత్వమే ఉంటే..కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు బాధితులు గత ప్రభుత్వ పాలన, వలంటీర్ల సేవలను గుర్తు చేసుకుని చర్చించుకోవడం కనిపించింది. ‘‘కరోనా లాంటి విపత్తులోనూ ఇంటింటికీ తిరిగి సేవలందించారు. ఏరోజూ మాకు ప్రభుత్వ సాయం అందలేదని రోడ్డెక్కలేదు. ఇప్పుడు వరదల్లో సర్వం కోల్పోయి పరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అదే వైఎస్ జగన్ ప్రభుత్వమే ఉండి ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు. పారదర్శకంగా అందరికీ సాయం అందేది..’’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున చర్చించుకోవడం గమనార్హం.అమ్మకు రిక్త హస్తం..వాంబే కాలనీ హెచ్ బ్లాక్‌లో ఉంటున్నాం. నా భర్త కూలీ. వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన అధికారులకు అన్ని వివరాలు ఇచ్చాం. జాబితాలో నా పేరుకు బదులు మా ఐదేళ్ల పాప ఉషశ్రీ పేరు వచ్చింది. పాప పేరుతో బ్యాంకు ఖాతా లేనందున డబ్బులు రాలేదు. కలెక్టరేట్లో అడుగుతుంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. – కురిటి సుజాత, వాంబే కాలనీగతంలో ప్రతిదీ ఇంటి వద్దే..జగన్ ప్రభుత్వమే ఉంటే కష్ట కాలంలో మాకు అండగా నిలిచేది. ఆఫీసుల చుట్టూ తిరగకుండా గతంలో ప్రతిదీ ఇంటి వద్దే అందజేశారు. కరోనా లాంటి కష్టంలోనూ ఇబ్బందులు పడనివ్వలేదు. వలంటీర్ల ద్వారా అన్నీ అందించారు. ఇవాళ ఈ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. కాళ్లు అరిగేలా సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం పెడుతున్న కష్టాలు చూస్తుంటే.. జగనన్న ప్రభుత్వం ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. – పాముల పద్మ, వాంబే కాలనీఇదిగో.. అదిగో అంటున్నారుప్రకాష్ నగర్లో అద్దెకు ఉంటున్నా. వరదతో ఇంట్లో సామాన్లు మొత్తం పోయాయి. అధికారులు ఇంటికి వచ్చి రాసుకుని ఫోటోలు తీసుకున్నా డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ ఇప్పటికి పది సార్లు తిరిగాను. ఇదిగో పడతాయి.. అదిగో పడతాయని ఆశ పెట్టి రోజూ తిప్పుకుంటున్నారు. కలెక్టరేట్లో అర్జీ ఇద్దామని వచ్చా. – షేక్ ఫాతిమా, ప్రకాష్నగర్ఏ ఒక్కరూ పట్టించుకోలేదు..కూలీ పనులు చేసుకుని బతికే వాళ్లం. కనీసం సొంత ఇల్లు లేదు. వాంబే కాలనీలో అద్దెకు ఉంటున్నాం. వరద వల్ల చాలా నష్టపోయాం. అపరిశుభ్రతతో పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. ఆదుకోవాలని నాయకుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మాలాంటి వాళ్లకు సాయం అందకుండా చేశారు. కాస్తయినా కనికరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – ఏల్చూరు సతీష్, మల్లీశ్వరి దంపతులుకాళ్లు అరిగేలా తిరిగా..పరిహారం కోసం సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగా. ఇదిగో అదిగో అంటూ రోజుకు నాలుగైదు సార్లు తిప్పారు. ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కలెక్టరేట్లో అర్జీ ఇచ్చేందుకు వచ్చా. సచివాలయంలో ఇప్పటికి పది అర్జీలు ఇచ్చా. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – వెంకాయమ్మ, పైపుల రోడ్డుఈ ఫొటోలో కనిపిస్తున్న వై.సీతకు కళ్లు కనిపించవు. ఆమె భర్త కూడా అంధుడే. గత ఆగస్టు 25న ఇందిరా నాయక్‌నగర్ కాలనీలోని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 30వతేదీన ఆ ఇంటిని వరద ముంచెత్తింది. ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల పిల్లలతో పాటు నీళ్లలోనే గడిపారు. చుట్టుపక్కల వారి సాయంతో ఎట్టకేలకు బయట పడ్డారు. పది రోజులు నీళ్లలో నానడంతో ఇంట్లో వస్తువులన్నీ పాడయ్యాయి. కొత్త ఇంటికి డోర్ నెంబర్ లేదని పరిహారం ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి ఇంటి డాక్యుమెంట్స్ సమర్పించినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అర్జీ ఇచ్చేందుకు భర్తతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. -
భార్యను స్వదేశానికి తీసుకురావాలంటూ వేడుకోలు
అమలాపురం రూరల్: బెహ్రయిన్‌లో తన భార్య ఇబ్బందులు పడుతోందని, స్వదేశానికి తీసుకురావాలంటూ ఓ వ్యక్తి కలెక్టర్‌ను వేడుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడికి చెందిన దుక్కిపాటి పావని ఓ ఏజెంట్ ద్వారా గత నెల 25న బెహ్రయిన్లోని ఓ ఇంట్లో పని నిమిత్తం వెళ్లింది. అక్కడ అనేక అవస్థలు పడుతున్నట్లు ఆమె ఫోన్లో ఆడియో రికార్డింగ్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి తిండి, నీరు లేక అలమటిస్తున్నానని ఆమె పేర్కొంది. తన ఆరోగ్యం క్షీణించిందని తనను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలని పావని వేడుకుంది. ఈ మేరకు భార్య ఆడియో రికార్డింగ్‌తో భర్త దుర్గాప్రసాద్, ఇద్దరు పిల్లలతో వచ్చి సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు. -
కలెక్టర్, పీవో అడవిబాట
దుమ్ముగూడెం: ఇద్దరు ఐఏఎస్‌లు.. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జితేష్ వి.పాటిల్, మరొకరు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్. పోడు సాగు అంశంపై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సూచనలతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడవిబాట పట్టారు. వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో రానుపోను 10కి.మీ. నడిచారు. సమస్య ఏంటంటే...భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం అటవీ రేంజ్ పరిధిలో పలువురు రైతులకు కొన్నాళ్ల క్రితం పోడు పట్టాలు అందాయి. అయితే, ఈ భూమిలో అటవీ అధికారులు తమను సాగు చేసుకోనివ్వడం లేదని, పంటలను ధ్వంసం చేస్తున్నారంటూ 23మంది గిరిజన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న కోర్టు సూచనలతో కలెక్టర్ పాటిల్, పీవో రాహుల్ మంగళవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దుమ్ముగూడెం మండలంలోని ములకనాపల్లి ప్రధానరహదారి వరకు మాత్రమే రహదారి ఉండడంతో వాహనాల్లో వెళ్లారు.అక్కడినుంచి దట్టమైన అడవిలో రెవెన్యూ, అటవీ అధికారులతో కలిసి కాలిబాటన వాగులు, వంకలు దాటుతూ గౌరారం వరకు 5 కి.మీ. వెళ్లి సమస్యపై రైతులు, అటవీ అధికారులతో మాట్లాడారు. అడవిని నరికారని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమించినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పాటిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హక్కు పత్రాల్లో ఉన్నంత మేరకు భూమి సాగు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న సమయాన అటవీ ప్రాంతంలో ఇద్దరు ఐఏఎస్‌లు పర్యటించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సెల్యూట్ కొట్టలేదని.. నెలరోజుల జీతం కోత
ఒంగోలు: చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందంటారు.. కానీ ఆ ఉన్నతాధికారి తన హోదాను మరచి వ్యవహరించారు. కలెక్టరేట్లో ఒక ఉన్నతాధికారి కారిడార్‌లో వెళ్తుండగా మరో విభాగం కార్యాలయ అటెండర్ దాన్ని గమనించలేదు. తాను వస్తుంటే అటెండర్ లేచి సెల్యూట్ కొట్టకపోవడంతో సదరు ఉన్నతాధికారి భగ్గుమన్నారు. అటెండర్ పనిచేసే విభాగం ఉన్నతాధికారిని ఉద్దేశించి ఏకవచనంతో సంబోదిస్తూ ఎక్కడికెళ్లారంటూ హూంకరించారు. 10.40 గంటలు దాటినా ఎందుకు రాలేదంటూ మహిళా అధికారులను సంబోధించిన తీరుకు అక్కడివారు అవాక్కయ్యారు.అటెండర్‌ను చూపిస్తూ ‘‘వీడికి పనీపాటా లేదు.. వీడెందుకు ఇక్కడ.. నెలరోజుల జీతం కోత వేయండి’’ అంటూ కార్యాలయ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అయితే సదరు విభాగానికి చెందిన మహిళా అధికారిణి ఒకరు అప్పటికే అధికారిక విధుల్లో ఉండగా మరో ఉన్నతాధికారి విజయవాడలో ఆన్‌డ్యూటీలో ఉన్నారు. ఇవేమీ గమనించకుండా ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణం ఆ ఉన్నతాధికారిని అటెండరు గుర్తించి సెల్యూట్ కొట్టకపోవడమేనన్న చర్చ నడుస్తోంది. చివరకు అక్కడకు వచ్చిన విజిటర్స్‌ను సైతం మీకు ఇక్కడేం పని అంటూ భగ్గుమన్నారు. ఈ సన్నివేశం ఇలా జరుగుతున్న సమయంలో ఆ మార్గంలో వెళుతున్న మరో విభాగపు ఉద్యోగిపైనా మండిపడ్డారు.నేను ఇక్కడ మాట్లాడుతుంటే మా మధ్యగుండా వెళతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ ఉద్యోగి నీళ్లు నమిలాడు. చివరకు ఆ తంతును గమనిస్తున్న మీడియా ప్రతినిధిపై కూడా ఐడీ కార్డు చూపించాలని, లేకుంటే ఇక్కడనుంచి వెళ్లాలంటూ హెచ్చరించడం కొసమెరుపు. ఇటీవల జరుగుతున్న సమావేశాలన్నింటిలో ఇదే విధంగా ఆయన దూషణలకు దిగుతున్నారంటూ ప్రభుత్వ విభాగాల్లోని పలువురు అధికారుల మధ్య చర్చ సాగుతోంది. -
'30వ తేదీన ఏముంది?' అందరికీ గుర్తుండేలా ‘స్వీప్’ హోర్డింగ్‌లు!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే దిశగా ప్రజలను సన్నద్ధం చేసేందు కోసం స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన వినూత్న ప్రచారం అందరిని ఆలోచింపజేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే తేదీని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో 30వ తేదీన ఏముంది.. అనే శీర్షికన స్థానిక కలెక్టర్‌చౌక్, ఎన్టీఆర్‌చౌక్, రిమ్స్ వంటి ప్రధాన కూడళ్లలో అధికార యంత్రాంగం భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆ తేదీన ఏముందని చర్చించుకుంటూ పోలింగ్ తేదీని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజున తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తుండటంతో ఈ ప్రచారానికి స్పందన లభిస్తోంది. ఇవి కూడా చదవండి: 'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్ -
మహేశ్వరంలో ఉద్రిక్తత.. సబితా క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం
► సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం నేతృత్వంలో బీజేపీ ధర్నా చేపట్టింది. కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాంచాలంటూ కలెక్టరేట్ ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ►లక్డికాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా చేపట్టింది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ►రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లెలగూడలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ముట్టడికి మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్‌ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ సహా బీజేపీ నాయకులు యత్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కార్యాకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ►సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టించాయి. మంత్రి కార్యాలయంలోకి కాషాయ పార్టీ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలతో తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సాక్షి, మెదక్: ప్రజా సమస్యలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి నేడు (శుక్రవారం) తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో మాజీ ఎంపీ విజయశాంతి ధర్నాలో పాల్గొననున్నారు. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొననున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి బాబు మోహన్ ధర్నాలో కూర్చోనున్నారు. ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలంటూ బీజేపీ పిలుపునిచ్చిన కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా హుజూరాబాద్‌లోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. -
కలెక్టరేట్లకు సౌర సొబగులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్‌లలో సోలార్ పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో.. ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్‌ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది. మరో రెండు జిల్లాల్లో... రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది. సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో.. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు. -
కరెంట్ ఇచ్చే పార్కింగ్ షెడ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(ఐడీవోసీ–కలెక్టరేట్)లో మొదటగా ఖమ్మంలో సోలార్షెడ్ ఏర్పాటు చేశారు. ఐడీవోసీలో 38కిపైగా శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా వారి వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి సౌకర్యం లేదు. దీంతో అధికారులు సోలార్ ప్యానళ్లతో కూడిన పార్కింగ్ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.1.78 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికే పూర్తికాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించనున్నారు. 200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్ ప్యానళ్ల ద్వారా రోజుకు 800 నుంచి వెయ్యి యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. ఈ మొత్తాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేసి కలెక్టరేట్ అవసరాలు పోగా మిగిలిన విద్యుత్‌కు మాత్రమే బిల్లు చెల్లించనున్నారు. సోలార్ షెడ్‌తో నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్‌చార్జీలు ఆదా కావడమే కాక ఉద్యోగులకు చెందిన వందలాది వాహనాల పార్కింగ్‌కు సౌకర్యం కల్పించినట్లవుతోంది. సోలార్ ప్లాంట్‌తో ఐడీవోసీ భవనమంతా గ్రీన్ బిల్డింగ్‌గా మారనుంది. ఈవిధంగా రాష్ట్రంలోనే తొలి కలెక్టరేట్‌గా ఖమ్మం ఐడీవోసీ నిలుస్తోంది. -
రైతు రుణమాఫీ కోసం కలెక్టరేట్ల ఎదుట బీజేపీ ఆందోళనలు
-
తీవ్ర ఉద్రిక్తత.. పేదల గుడిసెలు కూల్చివేత
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు తొలగించారు. 255/1 సర్వే నెంబర్ లోని పదెకరాల భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తొలగింపును అడ్డుకునేందుకు పేదలు యత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో అధికారులతో గుడిసెవాసుల వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెళ్ళిపోవాలంటూ గుడిసె వాసుల ఆందోళన చేపట్టారు. గుడిసె వాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగించారు. కాగా అధికారులు పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టడం ఇది నాలుగోసారి. -
అలా వెళ్లి.. కుడి వైపు తిరగండి!
ఖమ్మం: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏ విభాగం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఇబ్బంది పడకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఏ అంతస్తులో ఏ శాఖ ఉంది, ఎలా వెళ్లాలనేది బోర్డుల్లో పేర్కొన్నారు. కింది అంతస్తుల్లో ప్రతీ అంతస్తులోని విభాగాల వివరాలతో బోర్డు ఏర్పాటుచేయగా.. అన్ని అంతస్తుల్లో అక్కడి విభాగాల వివరాలు పొందుపర్చిన బోర్డులు ఏర్పాటుచేశారు. అలాగే, కలెక్టరేట్ రాగానే సమావేశ మందిరానికి వెళ్లే వైపు ఇన్‌వార్డు, ధరణి విచారణ కేంద్రానికి బోర్డులు పెట్టారు. ఇక ప్రభుత్వ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు, ఫొటోలను టీవీల్లో ప్రదర్శిస్తున్నారు. -
‘ధరణి’ని కాదు.. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, నిర్మల్: ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ అవాకులు చవాకులు పేలుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని.. ధరణి పోర్ట్‌లను బంగాళాఖాతంలో వేస్తామన్న దుర్మార్గులను బంగాళా ఖాతంలో పడేయాలని ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. ధరణి ఉండలా, వద్దా? ధరణి తీసేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎలా పడతాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే.. బ్యాంకు నుంచి మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. రైతు చనిపోతే ఏవిధంగా రైతు బీమా వస్తుందని నిలదీశారు. అందుకే ధరణి పోర్టల్ ఉండలా, వద్దా మీరే చెప్పండంటూ ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేదని ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదన్నారు. నిన్న ఉన్న భూమి తెల్లవారే సరికి పహనీలు మారిపోయేవన్నారు. వరాల జల్లు నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయితీలకు రూ 10 లక్షలు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఇవి కాకుండా నిర్మల్ జిల్లాలో 19 మండల కేంద్రాలకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. చదవండి: నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ నిర్మల్‌కు ఇంజనీరింగ్ కళాశాల బాసరా సరస్వతి దేవాలయాన్ని పెద్దగా అభివృద్ధి చేసుకుందామని, అద్భుత ఆలయం నిర్మించుకుందామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఓ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు పేర్కన్నారు. ఒకనాడు మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. 8న చెరువుల పండగ ‘కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం చెబతారు. కాంగ్రెస్ పాలన మనం చూడలేదా. ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ ఎన్ని రోజులు తిరగాలి. మనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. రైతు బంధు, దళిత బంధు రాంరాం అనే వాళ్లు కావాలా? ఒకప్పుడు కరెంట్ ఎప్పుడ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఇప్పుడు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్. సాగు, తాగు నీరుసమస్య తీర్చుకున్నాం. ఈనెల 8న చెరువుల పండగ జరుపుకోవాలి. దేశంలోనూ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ రావాలి ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ మహారాష్ట్ర రైతులు మన దగ్గర అర ఎకరం కొని వాళ్ల పొలాలకు నీళ్లు తీసుకెళ్తున్నారు. మహారాష్ట్రలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుతున్నారు. అధికారానికి దూరమైన వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. త్వరలోనే ఎస్ఆర్ఎస్పీ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తాం. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ పెడతాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రం ఇలాగే సుభిక్షంగా ఉండాలంటే మీ ఆశీస్సులు కావాలి. -
మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న టెన్షన్
-
ప్రజావాణి: ఈ మహిళ పేరు స్వప్న.. తాగడానికి నీరు దొరకలేదు
ఈ మహిళ పేరు స్వప్న. వెల్గటూర్ మండలం ముంజంపల్లి స్వగ్రామం. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రజావాణి వేదిక వద్దకు చేరుకుంది. తాగడానికి సమీపంలో ఎక్కడా నీరు దొరకలేదు. దాహంతో తపించిపోయింది. జగిత్యాల: అసలే ఎండాకాలం. ఎండలు మండిపోతున్నాయి. దాహం కోసం ప్రజలు తపిస్తున్నారు. అయినా, కలెక్టరేట్లో సోమవారం చేపట్టిన ప్రజావాణిలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. కలెక్టరేట్ మొత్తంగా పచ్చదనం పర్చుకుని, ఆహ్లాద వాతావరణం పంచుతూ ఉన్నా.. మౌలిక వసతులు లేవు. దీంతో ప్రజావాణికి హాజరైన అభాగ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్ నుంచి దాదాపు కి.మీ. దూరం కలెక్టరేట్ ఉంది. అక్కడిదాకా ఆటోలు, ప్రైవేట్ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అధిక వ్యయ ప్రయాసలకోర్చి ప్రజావాణికి చేరుకున్నా తాగేందుకు చుక్కనీరు లభించని పరిస్థితి నెలకొంది. సమస్యలు పరిష్కరించండి ప్రజావాణి ద్వారా స్వీకరించే అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. ప్రజా వాణి ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభాగ్యుల నుంచి 54 ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్ లత, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం తూకంలో మోసాలు.. ధాన్యం తూకంలో మోసాలు చోటుచేసుకుంటున్నాయని, కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ప్రజావాణిలో వారు ఒక వినతిపత్రం అందజేశారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఒక్కో విధంగా ధాన్యం తూకం వేస్తున్నారని ఆరోపించారు. మిల్లుకు చేరాక ధాన్యంలో మళ్లీ కోత విధిస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి మోసాలను అరికట్టి, కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, మోహన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, జలేందర్, కంచర్ల అఖిల్, రాకేశ్, తిరుపతిరెడ్డి, రాజు పాల్గొన్నారు. రైతులను ఆదుకోండి ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని, అన్నదాతలను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న నష్టాలపై వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్, మ హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సిరాజొదీ్దన్ మన్సూర్, నాయకుడు వాకాటి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చాలని ‘కలెక్టరేట్’ ఎక్కిన రైతులు
సిద్దిపేట రూరల్: సిద్దిపేట కలెక్టరేట్, కమిషనరేట్ల నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన రైతులు తమకు ప్రభుత్వం చేసిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని కోరుతూ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన సుమారు 100 మంది బాధిత రైతులు తమ గోడును విన్నవించేందుకు ప్రజావాణికి వచ్చారు. అయితే బాధితులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. వారితో మాట్లాడి గొడవ కాకుండా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమను లోపలికి అనుమతించకపోవడంతో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తామని చెప్పిన రైతులు, ఒక్కసారిగా కార్యాలయ భవనంపైకి ఎక్కి న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని భవనంపైనుంచి కిందకి తీసుకువచ్చారు. అనంతరం బాధిత రైతులు మాట్లాడుతూ కొండపాక మండలం దుద్దెడ, రాంపల్లి గ్రామాలకు చెందిన 663, 143 సర్వే నంబర్లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 165 మంది రైతులకు 365 ఎకరాల భూమిని పంపిణీ చేసిందన్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం భూమిని సిద్దిపేట కలెక్టరేట్, కమిషనరేట్ నిర్మాణానికి సేకరించిందని, భూమికి నష్టపరిహారంగా రూ. 20 లక్షలు, కలెక్టరేట్ వద్ద 200 గజాల ఇంటి స్థలం అందిస్తామని అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారని వెల్లడించారు. తమలో కొంతమందికి డబ్బులు ఇచ్చి.. ఇంటిస్థలం పట్టా సర్టిఫికెట్ మాత్రం ఇచ్చారని, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం చేయడంలేదని చెప్పారు. ఈ విషయంపై ఎన్నోసార్లు కలెక్టర్‌కు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసినా అధికారుల్లో మార్పు రాలేదని విచారం వ్యక్తంచేశారు. అనంతరం రైతులను ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వద్దకు అనుమతించగా బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్.. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వారంలోపు సమావేశం నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బాధితులు బయటకు వచ్చాక భవనంపైకి ఎక్కిన ఘటనలో పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
నిరసనలు, ముట్టడి ఇకపై కష్టమే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రూ.1,581.62 కోట్లతో 26 కొత్త సమీకృత జిల్లా కలెక్టరేట్, కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని కలెక్టరేట్లకు ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచి నివేదికల ఆధారంగా భద్రత చర్యలు చేపడుతున్నారు. ప్రధాన ద్వారం ఎదు రుగా, ప్రహరీపైన, చుట్టూ ప్రత్యేక ఇనుప ముళ్లకంచెలను అధికారులు ఏర్పాటు చేస్తుండడంతో సమై క్యాంధ్రలో తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కార్యాలయంలోనూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలను అడ్డుకునేందుకేనా..? ప్రభుత్వ విధానాలపై కొన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడం సర్వసాధారణం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలనో, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలనో, ఏకపక్షంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనో బాధితులు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి కలెక్టరేట్‌ను ముట్టడించి.. లోపలికి చొరబడి సమస్య తీవ్రతను చాటి చెప్పాలనుకుంటారు. దీంతో ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు హనుమకొండ, జనగామలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎత్తయిన ప్రత్యేక ఇనుప కంచెలను నిర్మిస్తుండడం ప్రతిపక్షాలు, ఆందోళనకారుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కలెక్టర్ కార్యాలయాలకు ఇనుప ముళ్లకంచెలు.. మూడంచెల భద్రత జనవరి 5న మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల రైతులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వారంతా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయతి్నంచడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జనవరి 30న నందిపేట గ్రామ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతితో కలసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. బిల్లులపై ఉప సర్పంచ్సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్లకుపైగా ఆగిపోయాయని వారు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం కలెక్టరేట్లో కలకలం రేపింది. ఫిబ్రవరి 13న జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి నిమ్మల నర్సింగరావు, ఆయన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన ఈ దంపతులు.. తమ భూమిని తహసీల్దార్ ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టగా, పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. -
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో సిబ్బంది నిర్లక్ష్యం
-
చిత్తూరు కలెక్టరేట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
-
సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం
సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లా నందిపేట్ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతి సోమవారం కలెక్టరేట్లో ఆత్మహత్యకు యత్నించారు. బిల్లుల(ఎంబీల)పై ఉప సర్పంచ్ సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్ల కుపైగా ఆగిపోయాయంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సమీపంలో ఉన్నవారు వెంటనే దంపతుల నుంచి అగ్గిపెట్టెను లాక్కొని విసిరేశారు. బీజేపీ మద్దతుతో వాణి సర్పంచ్‌గా గెలుపొందడంతో సాకులు చూపి వేధింపులకు గురి చేస్తున్నారని, పంచాయతీ నిధులు మింగేశామని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారని తిరుపతి కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ మారినా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిల్లులు, చెక్ పవర్ ఇప్పించ లేకపోయారని పేర్కొన్నారు. బిల్లులు రాక గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేక ప్రజలకు ముఖం చాటేయాల్సి వస్తోందన్నారు. వడ్డీ సహా మొత్తం రూ.4 కోట్ల వరకు అప్పులు అయ్యాయని.. ఈ దిగులుతో తన భార్య, సర్పంచ్ వాణి ఆస్పత్రి పాలైందన్నారు. అయితే కలెక్టర్ వచ్చే వరకూ కలెక్టరేట్ నుంచి కదిలేది లేదంటూ వాణి, తిరుపతి అక్కడే బైఠాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీపీవో జయసుధ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఉప సర్పంచ్ సంతకాలు పెట్టకపోవడంపై విచారణ చేపడతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
వాళ్లు చెప్పినట్టు వింటే.. తాలిబన్ రాజ్యమే
దేశాన్ని రక్షించేందుకు తెలంగాణ బిడ్డలు ముందుకు రావాలి ప్రజలు అభివృద్ధి వైపు సాగాలంటే సమాజంలో శాంతి, సహనం అవసరం. మతపిచి్చ, కులపిచ్చి పెంచి విద్వేషాలు రెచ్చగొడితే దేశం తిరోగమనం వైపు పయనిస్తుంది. మేధావులు, యువత దీనిపై ఆలోచన చేయాలి. మన చుట్టూ ఏం జరుగుతోందో పరిశీలన చేయాలి. మనం బాగున్నాం కదా, పొరుగింటోళ్లు ఏమైపోతే ఏమిటని అనుకుంటే, ఓ రోజు మనకూ ప్రమాదం వస్తుంది. అందువల్ల ఉద్యమ పంథా, పోరాట రక్తమున్న తెలంగాణ బిడ్డలు ఈ దేశాన్ని రక్షించడానికి ముందుకు రావాలి. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, మహబూబాబాద్/భద్రాద్రి కొత్తగూడెం: ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాలు ఫలిస్తే రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతుంది. సమాజం మరో తాలిబన్లా మారిపోతుంది. ఇక్కడికి పెట్టుబడులు రావు. ఉద్యోగాలు, ఉపాధి లభించవు. మన చుట్టూ జరుగుతున్న విద్వేష రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. దీనిపై సమాజంలో చర్చ జరగాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నూతన కలెక్టరేట్లను, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయా చోట్ల కలెక్టర్లను వారి చాంబర్లలోని కుర్చీల్లో కూర్చోబెట్టి అభినందించారు. తర్వాత రెండు చోట్ల నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. దేశానికే మార్గదర్శకంగా నిలిచాం. దీనికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. రెండు రోజులు చెప్పినా అవి ఒడవవు. తెలంగాణలో గతంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ధైర్యం చేసి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. ప్రజలు సంక్షేమ పథకాల జాతరను అనుభవిస్తున్నారు. గతంలో 600 ఫీట్లు బోరు వేసినా నీరు ఉండేది కాదు. ప్రస్తుతం సమృద్ధిగా నీరు,కరెంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ప్రజలకు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉండేలా సమీకృత కలెక్టరేట్లను నిర్మించుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లో మంత్రుల చాంబర్ కంటే తెలంగాణలో కలెక్టర్ చాంబర్ అద్భుతంగా ఉందని పంజాబ్ మంత్రి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర అసమర్థత వల్లే తగ్గిన ఆదాయం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.5లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు రూ.11.54 లక్షల కోట్లకు చేరింది. మనస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేసి ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లకు చేరేది. కేంద్ర అసమర్థ పనితీరు వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దాదాపు రూ.3 లక్షల కోట్ల నష్టం జరిగింది. అన్ని రాష్ట్రాలను కలిపితే ఈ నష్టం మరెంతో ఉంటుంది. జల వివాదాలు తీర్చడం లేదు దేశవ్యాప్తంగా నదుల్లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నా.. రైతుల పొలాల వద్దకు రావు. కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ 19 ఏళ్లు గడిచినా తీర్పు ఇవ్వలేదు. మనం మొండి పట్టుదలతో తెగించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. నీటి సమస్య లేకుండా చేసుకున్నాం. దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నా నదులపై ఉన్న వివాదాలను తేల్చకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం తాగునీటి సమస్య తీరలేదు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి ఇంకా ఉండటం ఏమిటి? 10 రోజులకోసారి నీళ్లు సరఫరా చేసే దుస్థితికి కారణాలేమిటి? ఇప్పటివరకు కేంద్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌ల అసమర్థత, తప్పుడు విధానాల ఫలితమే ఇది...’’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బిజీ బిజీగా కార్యక్రమాలు సీఎం కేసీఆర్ తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ నూతన కలెక్టరేట్‌ను, జిల్లా గ్రంధాలయాన్ని, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ సమీపంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత కొత్తగూడెం–పాల్వంచ మధ్యలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన సభలో మాట్లాడారు. తర్వాత రోడ్డు మార్గంలో కొత్తగూడెం వెళ్లి బీఆర్ఎస్ జిల్లా ఆఫీసును ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు సత్యవతిరాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, బానోతు హరిప్రియ, చల్లా ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నూకల రాంచంద్రారెడ్డి విగ్రహాలు పెడతాం: కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ఆదర్శ నాయకుడు నూకల రాంచంద్రారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తొలి ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చాలామంది నాయకులకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురువు అయితే.. పీవీకి గురువు నూకల రాంచంద్రారెడ్డి అన్నారు. అలాంటి నేత గురించి ఈ తరం యువతకు తెలపడం ప్రభుత్వ బాధ్యత అని.. మహబూబాబాద్, వరంగల్ పట్టణాల్లో ప్రభుత్వ ఖర్చులతో రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏదైనా ఒక ఇనిస్టిట్యూట్‌కు ఆయన పేరు పెడతామన్నారు. రెండు జిల్లాలకు వరాలు మహబూబాబాద్‌కు కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నామని.. వచ్చే విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక అభివృద్ధి పనుల కోసం మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా 3 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం ప్రత్యేక నిధులనుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధిని మంజూరు చేస్తున్నామని సీఎం చెప్పారు. జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు రూ.40 కోట్ల చొప్పున.. ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. పాలనలో ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతాం: సీఎస్ శాంతికుమారి రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని, పరిపాలనా ఫలాలను ప్రజలకు చేర్చేందుకు ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. తాను జిల్లాలో పనిచేసినప్పుడు కలెక్టర్ కార్యాలయాలు ఇరుకు గదులతో టాయిలెట్స్ కూడా సరిగాలేక ప్రజలు ఇబ్బంది పడేవారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సమీకృత కలెక్టరేట్లు ఇంద్ర భవనాల్లా ఉన్నాయని, వీటిని చూస్తే అసూయగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అడగకుండానే వరాలిచ్చే కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి అడిగితే వరాలు ఇచ్చేవాళ్లు ఉంటారేమోగానీ.. సీఎం కేసీఆర్ మాత్రం అడగకుండానే కష్టాలను అర్థం చేసుకొని వరాలు ఇచ్చే పేదల ఆరాధ్య దైవమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. ఇదే తరహాలో ఆయన మానుకోట ప్రజలపై చల్లని చూపు సారించాలని కోరారు. సీఎం ఆశీస్సులతో మానుకోట అభివృద్ధిలో బంగారు కోట కావాలని ఆకాంక్షించారు. -
మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్.. కొత్త కలెక్టరేట్ ప్రారంభం
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవనాన్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కాగా, జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించగా తర్వాత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, సీఎం కేసీఆర్.. భదాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నారు. కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. -
మానుకోటకు సీఎం కేసీఆర్.. నిఘా పెంచిన పోలీసులు
సాక్షి, మహబూబాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన జిల్లాగా ఏర్పడిన తరువాత నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంతోపాటు, సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మరమ్మతుల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్‌లతోపాటు మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావులతో సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్, కలెక్టర్ కార్యాలయాల ప్రారంభంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కో–ఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నాయకులు, అధికారులు మొత్తం 10వేల మందితో సీఎం సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశానికి ఎవరెవరిని ఆహ్వా నించాలి, ఏ మండలం నుంచి ఎంత మంది వస్తున్నారనే విషయంపై మంత్రులు, అధికారులు చర్చించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం మహబూబాబాద్‌లో గడపనున్నారు. అనంతరం సీఎం మహబూబాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడం జిల్లాకు వెళ్లనున్నారు. పోడు భూములకు పట్టాలిచ్చే విషయంలో జాప్యం చోటుచేసుకోవడం, గిరిజనేతరులకు పట్టాల పంపిణీ విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం, నారాయణపురం గ్రామంలోని కొందరు కైతులకు పట్టాలు ఇవ్వని విషయంపై ఆందోళనలు, నిరసలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు వారిపై గట్టి నిఘా పెట్టారు. -
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బండి సంజయ్‌ను కామారెడ్డి పీఎస్‌కు తరలించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో బారికేడ్లు ఎత్తిపడేశారు. బండి సంజయ్‌ను తరలిస్తున్న వాహనంపై రాళ్ల దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. -
కామారెడ్డిలో రైతుల ఆందోళనపై స్పందించిన కేటీఆర్
-
మనకు మనమే సాటి.. ఎవరూ లేరు పోటీ: సీఎం కేసీఆర్
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాలకు మేలు జరిగేలా కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు. అనేక రంగాల్లో ఇప్పటికే తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. వ్యవసాయం చేస్తున్న రైతుల్లో ధీమా వచ్చేలా చేశామని కేసీఆర్ తెలిపారు. దేశానికే ఆదర్శంగా అనేక పనులుచేసి చూపించామన్నారు. గురుకుల విద్యలో మనకు మనమే సాటి, ఎవరూ లేరు పోటీ అని పేర్కొన్నారు. ఎన్నో అద్భుత విజయాలు సాధించామని, మనందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఎగుర వేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రమంతా గులాబీమయమైంది. ఎటు చూసినా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటనతో మేడిపల్లి జగిత్యాల మధ్య భారీగా టట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జగిత్యాలలో జరిగే సీఎం సభకు బస్సులు, వాహనాల్లో భారీగా జనాలు తరలివస్తుండటంతో అయిదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. -
పింఛన్ తొలగించారని.. దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, యాదాద్రి/ కొండపాక(గజ్వేల్)/ సాక్షి, రంగారెడ్డిజిల్లా /మంచిర్యాల అగ్రికల్చర్: పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర పథకాలు అందడం లేదంటూ.. అధికారులు ఇబ్బందిపెడుతున్నారంటూ.. బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. తమ బాధలు చెప్పుకొనేందుకు కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు వస్తున్నారు. తమ సమస్య ఎప్పుడు తీరుతుందోననే మనస్తాపంతో ఆత్మహత్యా యత్నాలు చేస్తున్నారు. సోమవారం పలు జిల్లా కలెక్టరేట్లలో నలుగురు ఇలాంటి ప్రయత్నాలు చేయడం కలకలం రేపింది. పింఛన్ తొలగించారంటూ.. దివ్యాంగుడు.. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురం గ్రామానికి చెందిన నాగపురి యాదగిరికి ఆగస్టులో ప్రభుత్వం వికలాంగుల పింఛన్ మంజూరు చేసింది. ఒక నెల పింఛన్ తీసుకున్న యాదగిరికి తర్వాతి నెలలోనే ఆపేశారు. తాను కృత్రిమకాలుతో నడుస్తున్నానని, భార్య కూలి పనిచేసి పోషిస్తోందని, తనకు పింఛన్ పునరుద్ధరించి ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే యాదగిరి సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పింఛన్ పునరుద్ధరించడం లేదంటూ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఇది గమనించిన కలెక్టర్ సీసీ సోమేశ్వర్, సిబ్బంది ఆయనను ఆపారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించిన అనంతరం యాదగిరికి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. అయితే యాదగిరి కుమారుడికి ట్రాక్టర్ ఉండటంతో పింఛన్ తొలగించినట్టు అధికారులు చెప్తున్నారు. భూమిని తమకు కాకుండా చేస్తున్నారంటూ.. మహిళ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లికి చెందిన బి.జయశ్రీ తండ్రి సుర్వి భిక్షపతికి ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 67లో 1.35 ఎకరాల భూమి ఉంది. ఆయన భూమిని ముగ్గురు కుమార్తెలకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తమ భూమిపై రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు కన్నేశాయని.. తాము విక్రయించబోమని చెప్తున్నా తహసీల్దార్ అనితారెడ్డితో కలిసి తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయని జయశ్రీ అనే మహిళా రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు మార్చి కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తహసీల్దార్ అనితారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బ్లేడుతో చేతులు కోసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు, కాంగ్రెస్ నేతలు ఆమెను అడ్డుకుని.. అదనపు కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలించి, న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ తిరుపతిరావు హామీ ఇచ్చారు. దుకాణం ఖాళీ చేయాలని వేధిస్తున్నారంటూ.. యువకుడు మంచిర్యాల అగ్రికల్చర్: అద్దె దుకాణం తొలగించొద్దని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్ సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అతడిపై నీళ్లు పోశారు. బాధితుడి వివరాల ప్రకారం.. చెన్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని దుకాణ సముదాయంలో ఓ షటర్‌ను పదేళ్లుగా అద్దెకు తీసుకుని టైర్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం తొలగించాలని మూడు నెలల క్రితం ఎంపీడీవో, ఎంపీపీలు షటర్‌కు తాళం వేయించారు. ఎంపీ, ఎమ్మెల్యేకు గోడు వినిపించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నాడు. సోమవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని చెప్పడంతో కలెక్టరేట్‌కు వచ్చానని తెలిపాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నీళ్లు చల్లి అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు. సంతోష్‌పై నీళ్లు పోస్తున్న పోలీసులు ఇల్లు మంజూరైన అడ్డుకుంటున్నారని ఆత్మహత్య పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సిద్దిపేట జిల్లాలో కలకలం కొండపాక(గజ్వేల్): డబుల్ బెడ్ రూం ఇళ్ల అర్హుల జాబితాలో పేరు వచ్చాక కూడా కేటాయించకుండా అడ్డుకుంటున్నారని మనస్థాపానికి గురైన ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కలెక్టరెట్ కార్యాలయం ఆవరణలో సోమవారం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్న శీలసాగరం రమేశ్ ఆటో డ్రైవర్. పట్టణ శివారులో నిర్మించిన డబుల్ ఇల్లు కోసం భార్య లత పేరిట దరఖాస్తు చేసుకున్నాడు. మూడు పర్యాయాలు లబ్ధిదారుల జాబితాలో లత పేరు వచ్చింది. అయినా ఇల్లును కేటాయించలేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులను అడిగినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. 26వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తూ పురుగుల మందు తాగుతున్న సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలోనే కలెక్టరెట్ ఆవరణలో ఉన్న వాహనాల పార్కింగ్ వద్ద పడిపోయాడు. వెంటనే అక్కడున్న స్థానికులు 108 అంబులెన్స్ సిబ్బంది మహేందర్, శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న రమేశ్‌ను అంబులెన్సులో సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని అంబులెన్సు సిబ్బంది మహేందర్ తెలిపారు. మృతుడి భార్య లత ఇల్లు మంజూరైనా పట్టా ఇవ్వకుండా కౌన్సిలర్ ప్రవీణ్ అడ్డుకుంటుడటంతో డబ్బులు కూడా ఇచ్చామని ఆరోపించింది. తన భర్త మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వేడుకుంది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ భాను ప్రకాష్ తెలిపారు. -
ప్రజావాణిలో ఆందోళనల పెట్రోల్!
గద్వాల రూరల్/ జనగామ/ జనగామరూరల్/ దురాజ్‌పల్లి (సూర్యాపేట)/ కరీంనగర్ అర్బన్: అవి జిల్లా పరిపాలనకు కీలకమైన కలెక్టరేట్లు.. జనం సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది.. ఇంతలో కలకలం.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. మరోచోట ఇంకో రైతు కలెక్టరేట్ భవనం ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యాడు.. ఇంకోచోట ఓ యువతి, మరో యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. తమ చావుతోనైనా అధికారులు కళ్లుతెరుస్తారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజున 3 జిల్లా కలెక్టరేట్లలో జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. భూమిని వేరేవారి పేరిట మార్చారంటూ ‘‘మా పెద్దల నుంచి వచ్చిన భూమిని గ్రామానికి చెందిన కొందరు కాజేశారు. దీనిపై కలెక్టర్‌కు ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. నేను చనిపోయాక అయినా కళ్లు తెరవండి..’’అంటూ జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట లోకేశ్ అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని అగ్గిపెట్టె లాక్కున్నారు.నీళ్లు చల్లి, దుస్తులు మార్చారు. జిల్లాలోని మానవపాడు మండలం కలుకుంట్లకు చెందిన లోకేశ్‌కు వారసత్వంగా ఐదు ఎకరాల భూమి వచ్చింది. కానీ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, కొందరు అధికారులు కుమ్మక్కై ఆ వ్యక్తి పేరిట పట్టా చేశారని లోకేశ్ పేర్కొన్నారు. తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ సమయంలో కలెక్టరేట్లోనే ఉన్న మానవపాడు తహసీల్దార్ యాదగిరి వచ్చి బాధిత రైతుతో మాట్లాడారు. లోకేశ్ భూమి పొరపాటున మరొకరి పేరు మీద మారిందని.. ధరణిలో మార్చే ఆప్షన్ రాగానే భూమిని లోకేశ్ పేరిట నమోదు చేసి పాస్‌బుక్ ఇస్తామని చెప్పారు. ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసినా.. తన తాత పేరిట ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తుల పేరిట అక్రమంగా పట్టా చేశారని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. నిమ్మల నర్సింగరావు అనే రైతు జనగామ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన నర్సింగరావు తాత నిమ్మల మైసయ్య పేరిట 8 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. కొన్నేళ్ల కింద నర్సింగరావు బతుకుదెరువు కోసం ములుగు జిల్లా ఎల్బాకకు వలస వెళ్లారు. దీన్ని అలుసుగా తీసుకుని 2017లో అప్పటి తహసీల్దార్ జె.రమేశ్, వీఆర్వో క్రాంతికుమార్, అదే గ్రామానికి చెందిన ఇద్దరు కుమ్మక్కై తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని నర్సింగరావు ఆరోపించారు. అప్పటి నుంచీ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదన్నారు. దీనిపై సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే.. అది తమ పరిధిలో లేదని, కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఆందోళన చెందిన నర్సింగరావు.. కలెక్టరేట్‌పైకి ఎక్కి ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. ఆర్డీవో మధుమోహన్, ఇతర అధికారులు నచ్చజెప్పడంతో సుమారు రెండు గంటల తర్వాత కిందికి దిగాడు. నర్సింగరావు దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించిన అధికారులు.. దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే భూమి సమస్యపై నర్సింగరావు 2021 డిసెంబర్లో కూడా ఇదే కలెక్టరేట్‌పై ఆత్మహత్యాయత్నం చేశాడని.. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు చెబుతున్నారు. కరీంనగర్ ప్రజావాణికి గట్టి బందోబస్తు ప్రజావాణి సందర్భంగా రైతులు, ప్రజలు పురుగుల మందు, పెట్రోల్ వంటి వాటితో ఆందోళనలకు దిగుతుండటంతో.. కరీంనగర్ జిల్లాలో ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి సందర్భంగా ప్రధాన ద్వారంతోపాటు ఆడిటోరియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అర్జీదారులను తనిఖీ చేశాకే లోపలికి పంపారు. సూర్యాపేట కలెక్టరేట్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం అధికారులు తమ భూసమస్యలు పరిష్కరించడం లేదని, పైగా తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెర్వుకు చెందిన మీసాల అన్నపూర్ణ, ఆమె కుమార్తె స్వాతి కలిసి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. తన భర్త జానయ్య పేరిట ఉన్న 5 గుంటల భూమిని బెజ్జం వెంకన్న అనే వ్యక్తి ఆక్రమించారని.. తన పేరిట ఉన్న 34 గుంటల భూమిని, కుమార్తె స్వాతి పేరిట ఉన్న 25 గుంటల భూమిని సైదులు అనే వ్యక్తి కబ్జా చేశారని అన్నపూర్ణ ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, పైగా తమపైనే అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. ఇక ఇదే గ్రామానికి చెందిన పున్న వీరమ్మ తన కుమారుడు పున్న సైదులుతో కలిసి ప్రజావాణికి వచ్చారు. తమకు 2 ఎకరాల 20 గుంటల భూమి ఉందని.. అందులో సాగు చేయకుండా బెజ్జం పిచ్చయ్య, బెజ్జం దాసు, శెట్టిపల్లి కృష్ణ, శెట్టిపల్లి రాముడు అనే వ్యక్తులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండు ఫిర్యాదుల విషయంలో పోలీసులను ఆశ్రయించాలని అదనపు కలెక్టర్ సూచించారు. దీనితో ఆవేదన చెందిన మీసాల స్వాతి తొలుత ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సిబ్బంది ఆమెను అడ్డుకోగా.. పక్కనే ఉన్న పున్న సైదులు ఆ పెట్రోల్ బాటిల్‌ను తీసుకుని ఒంటిపై పోసుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని కోదాడ డీఎస్పీ వద్దకు పంపారు. -
నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్
సాక్షి,సుభాష్‌నగర్(నిజామాబాద్): సీఎం కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కొత్త కలెక్టరేట్), టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవాలతోపాటు ఇక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. హెలికాప్టర్లో నిజామాబాద్ పోలీస్‌పరేడ్ మైదానానికి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చేరుకుంటారు. 2.10 గంటలకు ఎల్లమ్మగుట్టలోని టీఆర్ఎస్ భవన్‌ను, 2.40 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. 3.05 గంటలకు జీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.00 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. వాతావరణం అనుకూలించని పక్షంలో చివరి క్షణంలోనైనా మార్పులు, చేర్పులకు అవకాశముంటుందని అధికారులు తెలిపారు. సీఎం రాక నేపథ్యంలో నిజామాబాద్ నగరం ఇప్పటికే గులాబీయమమైంది. నగరాన్ని టీఆర్ఎస్ జెండాలు, తోరణాలతో అలంకరించారు. నగరంతోపాటు జాతీయ రహదారి పొడవునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
పెద్దపల్లి జిల్లా: నూతన కలెక్టరేట్ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
మళ్లీ జిల్లా పర్యటనలకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మళ్లీ జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈనెల 25న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 29న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 10న జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ఖరారైనట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది. -
మేడ్చల్ నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన కేసీఆర్
-
తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంతి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. అంతాయిపల్లిలో 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఈ కార్యలయాలను ఏర్పాటు చేశారు. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో , ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైంది. పరిపాలన భవనాన్ని గొప్పగా నిర్మించుకున్నాం. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత అభివృద్ధి. కేవలం 6 నెలల వ్యవధిలో భవనాలు నిర్మించాం. తెలంగాణ వచ్చాక ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. ఇప్పుడున్న 36 లక్షల పెన్షన్లకు తోడు.. మరో పది లక్షల కొత పెన్షన్లు ఇస్తున్నాం. అందరికీ కొత్త కార్డులు ఇస్తున్పాం. 11 వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమే రాష్ట్రంలో అన్ని రంగాలకూ 24 గంటలూ కరెంట్ అందిస్తున్నాం. హైదరాబాద్‌లో కరెంట్ పోదు కానీ.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్ ఉండదు. దేశంలో 75 ఏళ్ల నుంచి జరుగుతున్న అసమర్థ పరిపాలన, చేతకాని, తెలివి తక్కువతనం పరిపాలన వల్లే ఈ ఇబ్బందులు. దేశంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనే. అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. తెలంగాణపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్) ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే తెలంగాణలో చాలా నిధులు ఉన్నాయి. మన రాష్ట్రం ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే. గతంలో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్ష మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2,78,500. దేశంలోనే తెలంగాణ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయి. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం. చేనేత కార్మికులకు కూడా పింఛన్లు అందిస్తున్నాం. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నాం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగాసంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గురుకుల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్ల కొరత తీర్చుకున్నాం. జాతీయ రాజకీయాల్లో మార్పు రావాలి భవనం కట్టాలంటే చాలా కష్టం, కూలగొట్టాలంటే చాలా ఈజీ. మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఏ రకంగానూ మంచిది కాదు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పురావాలి. ఒకసారి దెబ్బతిన్నామంటే మళ్లీ ఏకం కావడం అంత ఈజీ కాదు. చైనా సింగపూర్, కొరియా దేశాల తరహాలో కుల మతాలకు అతీతంగా పనిచేయాలి' అని సీఎం కేసీఆర్ అన్నారు. -
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, మేడ్చల్ జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇకపై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభంతో పరిపాలన అంతా ఒకే చోట నుంచి కొనసాగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 2016 అక్టోబర్ 11న మేడ్చల్–మల్కాజిగిరి ,వికారాబాద్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. దాదాపు ఆరేళ్లుగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిపాలన కీసర మండల కేంద్రం సమీపంలోని అద్దె భవనం నుంచి కొనసాగుతోంది. దీంతో కొన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రజలకు పారదర్శక పాలన, పరిపాలన సులభతరం.. అధికారుల్లో జవాబుదారీ తనం పెంచటం.. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే లక్ష్యంగా 2017 అక్టోబర్ 11న శామీర్‌పేట మండలం, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పునాది వేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాల కార్యాలయాన్ని అంతాయిపల్లిలో 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో ,ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. -
Telangana: అన్ని జిల్లా కలెక్టరేట్లలో పాపన్న జయంతి వేడుకలు: శ్రీనివాస్ గౌడ్
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: బహుజనుల కోసమే పుట్టిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టరేట్లలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరుగుతాయని, రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో, చిక్కడపల్లిలోని కల్లు కంపౌండ్ వద్ద తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ... సర్వాయి పాపన్న కులవృత్తులను ఏకం చేసిన గొప్ప వ్యక్తని కొనియాడారు. కేంబ్రిడ్జి వర్సిటీలో పాపన్న విగ్రహాన్ని పెట్టారని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ నెల 18న ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో జయంతి వేడుకలను నిర్వహిస్తుందని చెప్పారు. సర్వాయి పాపన్న పేరున భవనం త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. బహుజన విప్లవకా రుడు సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం కోసం పయనించాలని పిలుపునిచ్చారు. జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటం గొప్ప పరిణామన్నారు. కార్యక్రమాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీలు మల్లు రవి, వి.హన్మంతరావు, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్కుమార్గౌడ్, విప్లవ గాయని విమలక్క, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, ఎంవి.రమణ, బెల్లయ్యనాయక్, తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలరాజ్‌గౌడ్, గౌడ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
వికారాబాద్‌లో సీఎం కేసీఆర్.. కలెక్టరేట్, టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌లో పర్యటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి చేరుకున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. శాఖలన్నీ ఒకే గూటికి.. వాస్తవానికి కలెక్టరేట్ భవనం ఏడాది క్రితమే పూర్తయ్యింది. సీఎంకు సమయం కుదరకపోవడంతో ప్రారంభోత్సవం కోసం ఇన్నాళ్లు వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా రూ.42 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో శాఖలన్నీ ఒకే గూటికి చేరుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్ భవనంలో కేవలం డజన్ శాఖలు మాత్రమే ఉండగా కీలక శాఖలన్నీ బయటే కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: Hyderabad: పోలీసు ఫోన్ నెంబర్లు మారాయి.. కొత్త నెంబర్లు ఇవే -
నేడు తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నిరసన
-
చిన్నారిని ఇంత వరకు దత్తత తీసుకోలేదు : కరాటే కల్యాణి
అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే కల్యాణి హైదరాబాద్ కలెక్టర్ కార్యాయలంలో విచారణకు హాజరయ్యింది. కల్యాణీతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా సీడబ్లూసీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కరాటే కల్యాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారికి సంబంధించి ఇంత వరకూ ఎలాంటి దత్తత జరగలేదని పేర్కొంది. ఇదే విషయాన్ని కలెక్టర్ ముందు కూడా చెప్పామని వివరించింది. 'ఆర్థికంగా చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉన్నాను. నాపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు' అంటూ కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది. కాగా యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డితో వివాదం, ఆ తర్వాత చిన్నారి దత్తత విషయం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నోటీసులకు స్పందిచకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాల అనంతరం కరాటే కల్యాణి అఙ్ఞాతంలోకి వెళ్లడం, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడం వంటి నాటకీయ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. -
భూమి కబ్జా చేశారంటూ..
ఆదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధురాలు పెట్రోల్ బాటిల్ వెంట తెచ్చుకోవడం కలకలం రేపింది. తన భూమిలో కొందరు అక్రమంగా ఉంటూ కొట్టం నిర్మిస్తున్నారని, తన చేను తనకు దక్కేలా చూడాలని కోరుతూ దరఖాస్తు రాసుకుని ఆదిలాబాద్ పట్టణం బొక్కలగూడకు చెందిన కొమ్ము నాగమ్మ ప్రజావాణికి వచ్చింది. ముందుగా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను కలసి అర్జీ అందజేసింది. అది చదివిన కలెక్టర్ ‘మీ భూమిని మీరే కాపాడుకోవాలి..’అని చెప్పి పంపించారు. దీంతో నిరాశకు లోనైన నాగమ్మ బయటకు వచ్చి అక్కడున్న వారందరికీ తన సమస్య తెలిపింది. ఆమెతో వచ్చిన మరో ఇద్దరు కూడా నాగమ్మ సమస్య పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఇక్కడే చనిపోయేందుకు పెట్రోల్ బాటిల్ తెచ్చుకుందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నాగమ్మకు నచ్చజెప్పారు. దాంతో ఆమె మళ్లీ కలెక్టర్‌ను కలిసేందుకు లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా నాగమ్మ తన సమస్యను పూర్తిగా వివరించింది. ‘నాకు ఖానాపూర్ శివారులో సర్వే నంబర్ 68/93లో 1.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి శిరీష అనే మహిళ అధీనంలో ఉండేది. 2021 జూన్‌లో శిరీష చనిపోయింది. ఆమె బతికి ఉన్నప్పుడే ఈ భూమిని నాకు ఇచ్చేసింది. నేను భూమి పట్టా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకుని ఎవుసం చేసుకుంటున్నా. అయితే శిరీష బంధువులు పోయిన డిసెంబర్లో నా భూమిని కబ్జా చేసుకున్నరు. అక్రమంగా కొట్టం కడుతున్నరు. నేను చేనుకాడికి పోతే చంపుతామని బెదిరిస్తున్నరు. నా భూమి నాకు ఇప్పించుండ్రి’ అని నాగమ్మ వివరించింది. సమస్యను గుర్తించిన కలెక్టర్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
చదివింపులు.. రూ. అరకోటి!
‘‘రాజుగారింట్లో పెళ్లి.. ప్రజలంతా వెళ్లి కానుకలు సమర్పించాలి’’ అంటూ అప్పట్లో రాజ్యంలో దండోరా వేయించేవారు. ఒకప్పుడు రాజరికంలో ఇవన్నీ చెల్లుబాటు అయ్యాయి. కానీ.. ఇదే పద్ధతి ఇప్పుడూ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కరీంనగర్ కలెక్టరేట్లోని ఓ ప్రభుత్వ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్న అధికారి కూడా తన ఇంట్లో జరిగే పెళ్లికి కానుకల సేకరణకు ఇలాగే దాదాపుగా దండోరా వేయించినంత పనిచేశారు. అసలే జిల్లాలో ఓ శాఖకు విభాగాధిపతి.. పైగా అతని ఇంట్లో పెళ్లి.. సిబ్బంది కానుకలు సమర్పించి స్వామి భక్తి చాటుకునేందుకు.. ఇదే అద్భుత అవకాశమని ప్రచారం చేయించారు. ఈ వార్త వినగానే.. 15 మండలాలు, 313 గ్రామపంచాయతీల్లో కలకలం రేగింది. దీనిపై సిబ్బందిలో మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఇదే మంచి తరుణమని తమ స్వామి భక్తి ప్రదర్శించేందుకు సమాయత్తమవగా.. మరికొందరు ఇదెక్కడి తలనొప్పిరా బాబూ అంటూ తల పట్టుకున్నారు. తగ్గేదేలే..! ► సదరు అధికారి ఇంట్లో పెళ్లి వేడుకకు ముందే.. కొందరు ఉద్యోగులు వసూలు చేసే బరువు బాధ్యతలను తమ భుజాలకు ఎత్తుకున్నారు. ► తొలుత జిల్లా కేంద్రంలో లిస్టు రెడీ చేసి ఆ మేరకు నగదు కానుకలను వసూలు చేశారు. ► ఆ తరువాత జిల్లాలోని ఆ విభాగానికి సంబంధించిన 15 మండలాల అధికారులకు, 313 గ్రామపంచాయతీ స్థాయిలో పనిచేసే తమ సిబ్బందికి తలా ఇంత అన్న టార్గెట్ విధించారు. ► కొందరు ససేమీరా అని ఇవ్వలేదు. మండలస్థాయి అధికారుల్లో కొందరు తలా తులం బంగారం ఇచ్చుకోగా.. మిగిలిన గ్రామస్థాయిలో నాలుగుదశల్లో పనిచేసే సిబ్బంది ప్రతీ మనిషి రూ.1000 నుంచి రూ.5000 వరకు సమర్పించుకున్నారు. ► కొందరు గ్రామీణ నేతలు, ప్రజాప్రతినిధులు, చోటా కాంట్రాక్టర్లు సైతం ఈ చదివింపుల మేళాలో పాలుపంచుకోవడం విశేషం. ► కొందరైతే విందుకోసం మేకలు, గొర్రెలు కూడా ఉడతాభక్తి కింద ఇచ్చినట్లు తెలిసింది. ► ఈ క్రమంలోనే కొన్నిచోట్ల సిబ్బంది నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు తెలిసింది. ఎవరో ఇంట్లో పెళ్లికి తామెందుకు డబ్బులు ఇవ్వాలంటూ ఎదురు తిరగడంతో వసూల్ రాజాలు వెనుదిరిగినట్లు సమాచారం. వేధింపులు మొదలు..! ఈ వేడుకకు సహకరించని వారిపై సదరు విభాగాధిపతి కక్షసాధింపులకు దిగినట్లు తెలిసింది. వారి సర్వీసు రికార్డులు తీసి మరీ వేధింపుల పర్వానికి తెరతీసినట్లు సిబ్బంది వాపోతున్నారు. సదరు అధికారి వాస్తవానికి ఈ పాటికే రిటైర్డ్ కావాల్సి ఉంది. కానీ.. ఇటీవల ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వం పెంచడంతో మూడేళ్ల సర్వీసు కలిసి వచ్చింది. దీంతో అదనంగా కలిసి వచ్చిన అవకాశాన్ని ఇలా అక్రమార్జనలకు వాడుతున్నారని సిబ్బంది మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పలువురు సిబ్బందిని సంప్రదించగా.. చాలామంది వెల్లడించేందుకు జంకి వెనకడుగువేశారు. కొందరు మాత్రం నిజమేనని ధ్రువీకరించారు. అయినా.. సదరు అధికారికి వ్యతిరేకంగా తాము ఎలాంటి ప్రకటనా చేయలేమని వాపోయారు. వాస్తవానికి కరీంనగర్ పట్టణంలో ఇలాంటి తంతు కొత్తదేం కాదు, గతేడాది కూడా ఓ నాయకుడి ఇంట్లో పెళ్లి సమయంలోనూ దాదాపుగా ఇదే జరిగింది. ప్రతీ సిబ్బంది తాము నిర్ణయించినంత మొత్తాన్ని వెంటనే అందజేయాలని కొందరు గ్రూపులీడర్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన ఆడియో సందేశం అప్పట్లో వైరల్‌గామారిన సంగతి తెలిసిందే. చదవండి: అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి! కారణం ఏంటంటే.. -
మాజీ జవాన్ నిర్వాకం.. మద్యంమత్తులో కలెక్టరేట్‌కి వచ్చి..!
వేలూరు: వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవాన్ని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఇందులో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఓ మాజీ ఆర్మీ జవాన్ తన భార్యతో కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్ వద్దకు వెళ్లి.. మద్యం మత్తులో సెల్‌ఫోన్‌ను చూస్తూ నిలుచున్నాడు. ఆ సమయంలో వినతిపత్రం ఇవ్వాలని కలెక్టర్ మాజీ జవాన్‌ను కోరగా అందుకు ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. గమనించిన జిల్లా అధికారులు వెంటనే పోలీసులను రప్పించి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అక్కడ మద్యం మత్తులో అతను కింద పడి పోయాడు. అనంతరం పోలీసులు విచారణ జరపగా అతను వేలూరు జిల్లా కన్నియంబాడికి చెందిన మాజీ జవాన్ వేల్మురుగన్ తేలింది. ఇతని కుటుంబ ఆస్తి సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు తేలింది. దీంతో పోలీసులు చేసేది లేక అతన్ని కారులో ఇంటికి పంపించి వేశారు. -
గోడు చెప్పుకోవడానికొచ్చి.. ఉసురు తీసుకోబోయారు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్)/వరంగల్: నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో కలకలం చెలరేగింది. తమ సమస్యలు పరిష్కరించడం లేదని ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. నిజామాబాద్‌లో ఇద్దరు, వరంగల్‌లో ఒకరు ఈ అఘాయిత్యానికి యత్నించగా అధికారులు, పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఓ మహిళ ఫినాయిల్ తాగగా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. లైంగికంగా వేధిస్తున్నారని.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్‌కు చెందిన నాగలక్ష్మి తన కూతురితో కలసి కలెక్టరేట్‌కు వచ్చింది. నామ్‌దేవ్, ఎర్రం గణపతి అనే వ్యక్తులు లైంగికంగా వేధిస్తున్నారని, తన ఆత్మహత్యకు వారే కారణమని సూసైడ్ నోట్ రాసుకుంది. వెంట తెచ్చుకున్న ఫినాయిల్ తాగేసింది. భర్త లేని తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ వారు ఆశచూపినా లొంగకపోవడంతో మంత్రాలు చేస్తున్నానని కాలనీలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నాగలక్ష్మిని జిల్లా ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. వేధించినవారిని విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భూమిని కబ్జా చేశారని.. ప్రభుత్వం తనకు ఇచ్చిన మూడెకరాల వ్యవసాయ భూ మిని కబ్జా చేసిన పెద్దోళ్ల గంగారెడ్డిపై అధికారులు చర్య లు తీసుకోవడం లేదంటూ జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు చెందిన మేకల చిన్న చిన్నయ్య అనే దళిత రై తు నిజామాబాద్ ప్రజావాణికి వచ్చాడు. ఉన్నట్టుండి ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించగా పోలీసులు వారించారు. గంగారెడ్డి గతేడాది జూన్‌లో తన భూమిని ఆక్రమించి దున్నాడని, ప్రశ్నించినందుకు చం పుతానని బెదిరిస్తున్నాడని చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. చిన్నయ్యను పోలీసులు కలెక ్టర్ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు ఇప్పించారు. భాగస్వాములు మోసం చేశారని.. వరంగల్ నగరానికి చెందిన జిన్నింగ్ మిల్స్ వ్యాపారి రఘునందన్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చారు. తన వ్యాపార భాగస్వాములు లెక్కల్లో మోసం చేసి కేవలం రూ.40 లక్షల వరకు బకాయి పడినట్లు చూపుతున్నారని కలెక్టర్‌కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఆ వెంటనే పెట్రోల్‌ను ఒంటిపై పోసుకోవడంతోనే అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని, ఇది ప్రైవేటు సమస్య అయినందున సీపీకి సిఫారసు చేస్తున్నానని తెలిపారు. తర్వాత సుబేదారి పోలీసులు రఘునందన్‌ను బయటకు తీసుకెళ్లారు. -
4 సెక్షన్లుగా కలెక్టరేట్ పాలన
ఏలూరు(మెట్రో): ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, ప్రజల పనులు జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో జిల్లా కలెక్టరేట్ కీలక పాత్ర పోషిస్తోంది. కలెక్టరేట్ అంటే కేవలం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో మాత్రమే అనుకుంటారు. అయితే కలెక్టర్ కార్యాలయంలో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జీ, హెచ్ అనే 8 సెక్షన్లు ఉంటాయి. ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య పరిష్కరించాలన్నా ఈ సెక్షన్లు కీలక పాత్ర పోషిస్తాయి. పథకాలు, సేవలపై ప్రజలు కలెక్టర్‌కు ఏం విన్నవించినా.. వాటిని కలెక్టర్ ఆయా సెక్షన్లకు పంపిస్తారు. పూర్తిస్థాయిలో ఆ ఫిర్యాదు, వినతికి ఒక రూపం తెచ్చాక జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఆమోదముద్ర వేస్తారు. ఈ సెక్షన్లే జిల్లాకు కీలకం.. ప్రస్తుతం జిల్లాల విభజనలో భాగంగా ఇంత వరకు కలెక్టర్ కార్యాలయంలోని 8 సెక్షన్లను నాలుగింటిగా కుదించి పరిపాలన సాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పురపాలన అందించేందుకు ప్రస్తుతం 8 సెక్షన్లను నాలుగింటిగా విభజించారు. ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్ అండ్ ఆడిట్ విభాగాలు గతంలో ఏ, బీ సెక్షన్లుగా ఉండేవి. ప్రస్తుతం ఆ రెండు సెక్షన్లను ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్‌గా మాత్రమే ఉంచారు. అలాగే ఆఫీస్ ప్రొసీజర్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ సర్వీస్ మేటర్, డిసిప్లీనరీ యాక్షన్స్, అకౌంట్స్, ఆడిటింగ్, శాలరీస్, పర్చేజ్, మెయింటెనెన్స్ శాఖలను దీనిలో కలిపారు. అదేవిధంగా ఈ, జీ, ఎఫ్ లలో నిర్వహించే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ ఎక్విజేషన్, ల్యాండ్ రీఫారŠమ్స్ సెక్షన్లను ల్యాండ్ మ్యాటర్ సెక్షన్లుగా ఏర్పాటు చేశారు. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, అసైన్మెంట్, అవుట్‌సైడ్, ప్రొహిబిడెడ్, 22ఏ రిజిస్ట్రేషన్, ఫిషరీస్, సెటిల్మెంట్ రెగ్యులరైజేషన్స్, ఆల్ కోర్ట్ కేసెస్, ఫారెస్ట్ సెటిల్మెంట్స్, ఆర్ అండ్ ఆర్ అంశాలు, ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్ దీనిలో విలీనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం సి సెక్షన్‌ను మాత్రం ఉంచి సి పేరు తొలగించి మెజిస్టీరియల్ సెక్షన్‌గా ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్లో గతంలో సి సెక్షన్లో నిర్వహించే మెజిస్టీరియల్, సినిమాటోగ్రఫీ, కాస్ట్ వెరిఫికేషన్, లా అండ్ ఆర్డర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, లోకాయుక్త, హెచ్ఆర్సీ, ఎన్హెచ్ఆర్సీ, ఆర్టీఐ వంటివి నిర్వహించనున్నారు. డీ, హెచ్ సెక్షన్లను విలీనం చేసి కోఆర్డినేషన్ సెక్షన్‌గా ఏర్పాటు చేశారు. డి, హెచ్లో ఉన్న పనులు నేచురల్ కలామిటీస్, వాటర్ ట్యాక్స్, వెబ్లాండ్ ఇస్యూస్, ఆర్వోఆర్, కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ఈ–గవర్నెన్స్, ఆల్ ఎలక్షన్ వర్క్స్, ప్రొటోకాల్, గ్రీవెన్సెస్, స్పందన, సీఎంపీ వంటి అంశాలను ఏర్పాటు చేసి ఈ సెక్షన్లో పొందుపరిచారు. ఆయా సెక్షన్లలో ఇక నుంచి విధులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విభజనలో భాగంగా ఈ ఏర్పాట్లు చేశాం ఇంతవరకు 8 సెక్షన్లుగా ఉన్న జిల్లా పరిపాలనను ప్రస్తుతం నాలుగు సెక్షన్లుగా ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఈ మేరకు జీవో సైతం విడుదలైంది. ఇక నుంచి 4 సెక్షన్ల ద్వారా ప్రజలకు అందాల్సిన అన్ని సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. నాలుగు సెక్షన్లకు సూపరింటెండెంట్లను నియమించి ఆయా సెక్షన్ల ద్వారా కలెక్టరేట్ పరిపాలన చేపడతాం. – ప్రసన్న వెంకటేష్, కలెక్టర్ -
నాటకాలు ఆపి ధాన్యం కొనండి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బుధవారం ఆందోళనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నాయకులు బైఠాయించారు. అసలు సమస్యను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయని నాయకులు ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆపి ధాన్యం కొనాలని, పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న కార్యకర్తలు.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం, వరంగల్, సిరిసిల్ల కలెక్టరేట్లలోకి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వరంగల్‌లో కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. మహబూబాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ములుగు జిల్లా మంగపేటలో ఎమ్మెల్యే సీతక్క, వనపర్తిలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పెంచిన ధరలు తగ్గించాలంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్నిచోట్ల జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. -
కలెక్టరేట్ ఎక్కడనే నిర్ణయం ప్రభుత్వానిదే
సాక్షి, ఢిల్లీ: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం అభివృద్ధి అడుగుగానే భావించాలని అభిప్రాయపడింది. చిత్తూరు జిల్లా తిరుచానూరులోని పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌గా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆధ్యాత్మిక భవనాన్ని కలెక్టరేట్‌కు ఇవ్వడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషనర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు తెలిపారు. ‘కలెక్టర్ ఎక్కడ కూర్చోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోబోం. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలి కదా. రాష్ట్ర విభజన అయిందంటే కొత్త రాష్ట్రంలో హైకోర్టు ఎక్కడ పెట్టాలి? సెక్రటేరియట్ ఎక్కడ నిర్మించాలి అని చూస్తాం కదా? ఆ ప్రాంతంలో ప్రజల నివాసానికి అనుగుణంగా ఉండాలి కదా? దీనికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. పద్మావతి నిలయాన్ని ప్రభుత్వం అద్దె ప్రాతిపదికనే తీసుకుంది. ఉచితంగా ఏం తీసుకోలేదు కదా? కలెక్టర్ కార్యాలయం వచ్చిందంటే ఆ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కలెక్టర్ ఎక్కడ కూర్చోవాలి.. చెట్టు కింద కూర్చొని పనిచేయి అని మేం చెప్పలేం కదా. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలివేయాలి. ప్రజా ప్రయోజనాల అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో జోక్యం చేసుకోం. ఈ పిటిషన్ కొట్టివేస్తున్నాం..’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు -
‘మన ఊరు–మన బడి’కి ఇక్కడి నుంచే శ్రీకారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు–మన బడి’కి లాంఛనంగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ఇందుకు వేదిక కానుంది. దీంతోపాటు వనపర్తి మండలంలోని చిట్యాలలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు, నాగవరంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, పట్టణంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే నాగవరంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, కలెక్టరేట్ ప్రాంగణంలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన తర్వాత సాయంత్రం మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలంలో జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. పోలీసుల పటిష్ట బందోబస్తు సీఎం పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి వనపర్తికి చేరుకోనుండగా.. సాయంత్రం 5.30 గంటలకు తిరుగు పయనం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎనిమిది మంది ఎస్పీల పర్యవేక్షణలో 1,840 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు లక్ష మందిని బహిరంగసభకు తరలించేలా ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. -
జనగామకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్లోహైదరాబాద్ నుంచి బయలుదేరి 11.35 గంటలకు జనగామ కలెక్టరేట్ ప్రాంగణంలో దిగుతారు. 11.45 గంటలకు కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించి, అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.05 గంటలకు వరంగల్–హైదరాబాద్ హైవే పక్కన యశ్వంతాపూర్ శివారులో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 3.30 గంటలకు అదే ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ప్రసంగం ముగింపు ఉంటుంది. 5.15 గంటలకు హెలికాప్టర్లో సీఎం హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు గురువారం బహిరంగ సభాస్థలిని, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. జన సమీకరణపై కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న కలెక్టరేట్ సముదాయం, పార్టీ కార్యాలయాన్ని కలెక్టర్, పోలీసు కమిషనర్లతో కలిసి సందర్శించారు. సీఎంకు ఘనస్వాగతం పలకాలి: మంత్రులు కరువు జిల్లాగా ఉన్న జనగామను సస్యశ్యామలం చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో మండిపడుతున్న తెలంగాణ ప్రజలు శుక్రవారం జరిగే సభకు భారీ ఎత్తున పోటెత్తనున్నారని చెప్పారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించిన తర్వాత, పార్టీ జిల్లా అధ్యక్షులు పదవీ బాధ్యతలు చేపడతారని, అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. -
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు!
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రధానమైన జిల్లా కార్యాలయాలన్నింటినీ ఒకేచోట ఏర్పాటుచేయడం ద్వారా వాటిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చినట్లవుతుందని భావిస్తోంది. దీనివల్ల భూమి అవసరం, వ్యయం కూడా చాలావరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఏర్పాటుచేసిన కొత్త జిల్లాల్లో పలుచోట్ల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. ఇతర రాష్ట్రాల్లో మరికొన్నిచోట్ల ఇలాంటివే ఉన్నాయి. వాటన్నింటినీ పరిశీలించి మన రాష్ట్ర పరిస్థితులు, అవసరాలను బట్టి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఎలా ఏర్పాటుచేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామ, వార్డు సచివాలయాల తరహాలో.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో అన్ని సేవల్ని ఒకేచోట నుంచి అందిస్తున్నారు. గ్రామ పరిపాలన వ్యవస్థ అంతా అక్కడే కేంద్రీకృతమైంది. ఇదే తరహాలో కొత్త జిల్లాల్లో పరిపాలన విభాగాలాన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతోపాటు డీఈఓ, వ్యవసాయ శాఖ జేడీ, సంక్షేమ శాఖల కార్యాలయాలు వందకు పైనే జిల్లా కేంద్రాల్లో పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాల్లో అవన్నీ వేర్వేరుచోట్ల ఉన్నాయి. బ్రిటీష్ కాలంలో ఏర్పాటైన కలెక్టరేట్లు, కలెక్టర్ బంగ్లాలు, ఎస్పీ కార్యాలయాలు భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. అదే తరహాలో కొత్త జిల్లాల్లో విడివిడిగా కార్యాలయాలు ఏర్పాటుచేస్తే ఎక్కువ భూమి అవసరమవుతుంది. నిర్మాణ వ్యయం కూడా భారీగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో భూమి లభ్యత చాలా తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఒకేచోట కార్యాలయాలన్నీ ఏర్పాటుచేస్తే భూమి సమస్య ఉండదు. అధికారుల క్వార్టర్లు, సమావేశపు గదులు, వాహనాల పార్కింగ్ అంతా ఒకేచోట ఉండాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 13 జిల్లా కేంద్రాలు మినహాయిస్తే కొత్తగా ఏర్పాటుచేసే 13 జిల్లా కేంద్రాల్లో ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో ఇందుకు అవసరమైన భూమిని గుర్తించినట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన కమిటీల్లో రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లకు సంబంధించి సవివర నివేదిక ఇచ్చినట్లు సమాచారం. -
మాకొద్దీ 317 జీఓ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. జీఓలోని లోపాలను సవరించాలని, స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళనకు దిగాయి. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హక్కులను కాలరాసే జీవో ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఎలాంటి సం ప్రదింపుల్లేకుండా జీవోను అమలు చేయడం ఘోరమన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరి పాలేరు తీరులా ఉందని విమర్శించారు. జీవోను సవరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. సొంత జిల్లాలో ఉద్యోగం చేసేందుకు అవకాశం లేకుండా జీవో ఉందని కోదండరాం విమర్శించారు. జిల్లాల వారీగా పెద్ద మొత్తంలో ఖాళీలున్నాయని, ఉద్యోగులను సొంత జిల్లాలకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒంటరి మహిళలు, వికలాంగులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిరసన.. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు హైదరాబాద్‌లో టీచర్ల ఆందోళన జిల్లాల్లో ఆందోళనలు ఇలా.. ♦నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయాల ముందు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. నిజామాబాద్‌లో కలెక్టర్ నారాయణ రెడ్డికి, కామారెడ్డిలో కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిపతం సమర్పించారు. బాన్సువాడలో ఉపాధ్యాయుల సంతకాల సేకరణ చేపట్టారు. ♦కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ♦రంగారెడ్డి కలెక్టరేట్, వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉద్యోగుల అభ్యంతరాలను పట్టించుకోకుండా కేటాయింపులు జరపడంతో పలువురు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ దామాషాలను ఒక్కో జిల్లాలో ఒక్కోలా పాటించారన్నారు. ♦హనుమకొండ, మహబూబాబాద్, జనగామ కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. హనుమకొండలో జరిగిన నిరసనలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. ♦సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు అశోక్ కుమార్ నేతృత్వంలో నిరసన తెలిపారు. మెదక్‌లో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపి అదనపు కలెక్టర్ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ♦ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్ల వద్ద టీచర్లు ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం చేసిన అప్పీళ్లను కూడా పరిశీలించడం లేదని విమర్శించారు. ♦ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట టీచర్లు ధర్నా చేశారు. యూటీఎఫ్‌తో పాటు టీఈజేఎస్, కాంగ్రెస్, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ♦ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. -
సీనియారిటీకీ చెల్లుచీటీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల విభజన, సీనియారిటీ ప్రక్రియ మంటలు రేపుతోంది. జిల్లా కేటాయింపులు, ఆప్షన్లలో హేతుబద్ధత లోపించిందని... భజనపరులు, పైరవీకారులకే సీనియారిటీ జాబితాలో చోటు లభించిందని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద టీచర్లు ధర్నా చేయడంతోపాటు కలెక్టర్‌ను కాసేపు అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. వరంగల్ కలెక్టరేట్లోనూ టీచర్లు నిరసన గళం వినిపించారు. సీనియారిటీకి చెల్లుచీటీ ఇచ్చి అడ్డగోలుగా విభజన చేశారని మండిపడ్డారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలసి క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. సమగ్ర పరిశీలన తర్వాతే జాబితా ప్రకటించాలని కోరారు. మరోవైపు సంఘాల ప్రతినిధులతో మంగళవారం చర్చలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన అంగీకరించారు. ఈ నేపథ్యంలో విభజన ప్రక్రియలో జాప్యం అనివార్యమని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఇదీ జరిగింది... ♦వాస్తవానికి కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన ప్రక్రియ సోమవారంతో పూర్తై కేటాయింపుల ఉత్తర్వులు సైతం సోమవారమే వెలువడాల్సి ఉంది. అయితే ఒకట్రెండు జిల్లాలు మినహా మిగతా చోట్ల ఎక్కడా సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. కానీ కేటాయింపు జాబితా అన్ని చోట్లా ఉద్యోగులకు తెలిసిపోయింది. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం సీనియారిటీ అంశమే తీవ్ర వివాదమైంది. జాబితాలో జూనియర్లు కూడా ముందు వరుసలో ఉన్నట్లు తేలడంతో టీచర్లు ఇప్పుడివి సరిచేయకుంటే తాము శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారుల వల్లే తప్పులు... హడావుడిగా విభజన చేయడంలో అధికారులు పొరపాట్లు చేశారు. ఉద్యోగంలో చేరిన తేదీ, పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకున్నారు. ర్యాంకు రికార్డును పరిగణనలోకి తీసుకొని ఉంటే న్యాయం జరిగేది. ఉద్యోగులు ఎప్పుడు, ఏ ర్యాంకులో కొనసాగారనేదే అసలైన సీనియారిటీ. ఈ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయకుండా హడావిడిగా విభజన ప్రక్రియ చేపట్టడం వల్లే జాబితాలు తప్పులతడకగా మారాయి. – చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇదీ బాధితుల వాదన.. ♦వరంగల్ జిల్లాకు చెందిన తూహిద బేగంకు సీనియారిటీ ఉంది. కానీ తనకన్నా జూనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని ఆమె తెలిపింది. తనను ములుగు జిల్లాకు బదిలీ చేశారని ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లాలో పనిచేస్తున్న అనిత సీనియారిటీలో రెండో స్థానం. కానీ ఆమెకన్నా తక్కువ సీనియారిటీ ఉన్న మరో టీచర్ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ♦హన్మకొండ జిల్లాకు చెందిన పి శంకర్ ఎస్సీ ప్రాధాన్యత క్రమంలో జయశంకర్ భూపాలపల్లి వస్తుందని ఆశించాడు. సీనియారిటీ ప్రకారం ఇది సాధ్యమేనని చెబుతున్నాడు. కానీ ఇప్పుడు తనకన్నా జూనియర్‌కు ఈ స్థానం కేటాయించారని తెలిపాడు. భూపాలపల్లికి చెందిన మహేందర్ సీనియారిటీ ఉన్నా... అతన్ని సిద్ధిపేటకు కేటాయించారు. తనకన్నా జూనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించాడు. ♦కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న టి సరిత భర్త ములుగు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి. ఈ కారణంగా తనను ములుగుకు పంపాలని ఆప్షన్ ఇచ్చింది. తనకన్నా జూనియర్‌కు ఆ స్థానం ఇచ్చి, తనకు అన్యాయం చేశారని ఆమె ఖమ్మం కలెక్టర్ వద్ద మొరపెట్టుకుంది. -
అమ్మ.. భారం కాదు బాధ్యత
సాక్షి, నిజామాబాద్: కనిపెంచిన తల్లి ఎప్పటికీ భారం కాదు. వృద్ధాప్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం తనయుల బాధ్యత. తన తల్లికి వృద్ధాప్య పింఛన్ అందడం లేదని ఓ కొడుకు ఆమెను భూజాలపై ఎత్తుకొని కలెక్టరేట్‌కు వచ్చాడు. కానీ సోమవారం ప్రజావాణికి లేనందున అధికారులు ఫిర్యాదులు స్వీకరించకపోవడంతో వారు నిరాశతో ఇలా వెనుతిరిగారు. కోటగిరి మండలానికి చెందిన శాంతబాయి అనే వృద్ధురాలికి గత 14 సంవత్సరాలుగా పెన్షన్ రావడం లేదు. దీంతో ఆమె కొడుకు ఎన్నో సార్లు అధికారులను కలిసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రజావాణిలో తన గోడును వెళ్లబోసుకుందామని వచ్చాడు. కానీ ప్రజావాణి రద్దుతో నిరాశ చెందారు. చదవండి: శభాష్ ఎస్సై నాగరాజు.. ఆకలి తీర్చి.. ఆరాతీసి -
ఆ అటెండర్ అంధుడే.. కానీ పనిలో మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్
సాక్షి,కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మధు. పుట్టుకతోనే అంధుడు. కలెక్టరేట్లోని సీపీఓ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను విధుల నిర్వహణలో పర్ఫెక్ట్ అండ్ షార్ప్. కొన్ని సందర్భాల్లో కళ్లున్న అటెండర్లు ఫైల్ ఎక్కడ పెట్టారో మర్చిపోవచ్చు కానీ మధు మాత్రం మరచిపోడు. మధు డ్యూటీలో ఉన్నాడంటే పైఅధికారులు అడిగిన తక్షణం ఫైల్ టేబుల్‌పై ఉంటుంది. కార్యాలయం ఉద్యోగులు ఎవరు ఏ ఫైల్ అడిగినా క్షణాల్లో అతని టేబుల్ మీదకు చేరుస్తాడు. కళ్లు కనబడని వ్యక్తి విధులు ఎలా నిర్వర్తిస్తారని పలువురు ఆశ్చర్యపడుతున్నారు. కళ్లు కనిపించని వారికి మనోనేత్రం ఉంటుందనడానికి మధుయే సమాధానం. ఏది ఏమైనా సకలాంగులు చేయలేని పని మధు చేస్తున్నందున అతనికి పలువురు హాట్సాప్ చెబుతుండటం విశేషం. చదవండి: ఎందరికో ఆదర్శం ఈ పట్టభద్రుడు -
దళితుల ఆవేదన.. మృతదేహంతో కలెక్టరేట్‌కు
సాక్షి, మండ్య(కర్ణాటక): అణగారిన వర్గాలు తనువు చాలిస్తే అంత్యక్రియలకు శ్మశానం లేదనే ఆక్రోశంతో మండ్య తాలూకాలోని హుళ్ళెనహళ్ళి గ్రామస్తులు సోమవారం మృతదేహంతో ధర్నా చేశారు. గ్రామవాసి సిద్దాచార్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియలు చేయడానికి శ్మశానం లేకపోయింది. దీంతో బంధువులు, గ్రామస్తులు కలిసి శవాన్ని మండ్యకు తీసుకొచ్చి ఏకంగా కలెక్టరేట్ ముందు పెట్టుకొని ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో దళితుల చనిపోతే అంత్యక్రియలు చేయడానికి రుద్రభూమి లేదని వినతిపత్రం అందజేశారు. దీంతో కలెక్టర్ ఎస్.అశ్వతి, తహసీల్దార్‌తో కలిసి గ్రామానికి వెళ్ళి స్మశానస్థలి కోసం పరిశీలించారు. దాంతో గ్రామస్తులు శాంతించి శవాన్ని తీసుకొని వెళ్లారు. -
కలెక్టరేట్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, సూపర్‌బజార్(ఖమ్మం): రాజకీయ అండతో తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునే యత్నం చేస్తున్నారనే ఆవేదనతో కొత్తగూడెంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పక్కనే ఉన్నవారు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. యువతి బండి హైమావతి తల్లి సరళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెంలోని రామవరం 7వ నంబర్ బస్తీకి చెందిన సరళ భర్త మృతి చెందగా, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. వీరి ఇంటిపక్కనే ఉన్న వంద గజాల స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుడు మోత్కూరి ధర్మారావు అండతో అజయ్‌సింగ్ అనే వ్యక్తి ఆక్రమించే యత్నం చేస్తుండగా, రామవరంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఎలాంటి న్యాయం జరగకపోగా మళ్లీ స్థల ఆక్రమణకు యత్నించడంతో సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణికి సరళ తన చిన్నకుమార్తె హైమావతితో వచ్చింది. అప్పటికి ప్రజావాణి ప్రారంభం కాకపోగా ఆవేదనతో హైమావతి తన వెంట తెచ్చుకున్న హెయిర్ డై తాగింది. దీంతో అక్కడే ఉన్న ఆరోగ్య కార్యకర్త, మరికొందరు ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా, కొత్తగూడెం తహసీల్దార్ రామకృష్ణ ఆస్పత్రికి చేరుకుని యువతితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య -
చెప్పిన పని చేయలేదని గ్రామం నుంచి వెలివేశారు
సాక్షి, తిరువొత్తియూరు( చెన్నై): కట్ట పంచాయితీ చేసి గ్రామం నుంచి వెలివేశారని ఆరోపిస్తూ నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది బుధవారం నాగై కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపింది. సంబంధన్ పేటకు చెందిన పళణి (43), సోదరుడు కందన్ (40), అదే గ్రామానికి చెందిన కరుప్పన్న స్వామి (32), అశోక్ (26) కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ఆత్మాహుతికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. విచారణలో పళని తమ్ముడు ముత్తు (38) భార్య ప్రియ (30) మధ్య విభేదాలు వచ్చినట్లు.. కలిసి ఉండాలని గ్రామ పెద్దలు చెప్పినా ముత్తు నిరాకరించాడని.. దీంతో పంచాయితీ పెట్టి రూ.16 లక్షలు ప్రియకు చెల్లించాలని తీర్పు చెప్పినట్లు తెలిసింది. ముత్తు అదృశ్యం కావడంతో తమ కుటుంబాలను గ్రామం నుంచి వెలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
దూరం నుంచి చూస్తే రైలు..తీరా దగ్గరకు వచ్చి చూస్తే..
సాక్షి, నవరంగపూర్( భువనేశ్వర్): కొంతమంది కళాకారులు తమ చేతి నైపుణ్యం, పనితనంతో చిత్రాలకు ప్రాణం పోస్తారంటారు. ఇలాంటి అనుభూతి కొన్ని సందర్భాల్లోనే మనకి కలుగుతుంది. ప్రస్తుతం ఓ గోడ మీద వేసిన బొమ్మను చూసి ఇలాంటి అనుభూతి కలిగిందని అంటున్నారు ఓ ప్రాంత ప్రజలు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లా కలెక్టరేట్ ప్రహరీగోడపై వేసిన రైలు బొమ్మ నగరవాసులను ఇట్టే ఆకట్టుకుంది. అచ్ఛం రైలుబండి లాగానే వేసిన పెయింటింగ్ అద్భుతంగా ఉంది. ఆ బొమ్మ ఎలా ఉందంటే.. దూరం నుంచి చూసిన వారికి... నవరంగపూర్‌కు రైలు ఎప్పుడు వచ్చిందోనని ఆశ్చర్యం కలగక మానదు. తీరా దగ్గరకు వచ్చి చూడగా, అది రైలుకాదని కేవలం చిత్రమని తెలిసి చాలమంది అచ్చెరువొందారు. శుక్రవారం నగరవాసులు రైలుబొమ్మతో సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. -
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఆ రోజే అన్ని ప్రారంభోత్సవాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సిద్దిపేట పర్యటించనున్నారు. సిద్దిపేట జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయంతోపాటు పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యలాయాలు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, పోలీస్ యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సీఎం సిద్దిపేటకు వస్తుండడంతో అధికారులతోపాటు మంత్రి హరీష్ రావు కూడా ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కాగా జూన్ 20న సీఎం వస్తారని ఇటీవల మంత్రి హరీష్ రావు ప్రకటించిన వెంటనే భవనాలను పరిశీలించడంతో భవనాల ప్రారంభం కూడా త్వరలోనే ఉంటుందని తెలుస్తుంది. అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ ఇక సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉన్నతాధికారుల ఛాంబర్లు, వివిధ శాఖలకు గదుల కేటాయింపు కొలిక్కి వచ్చింది. ఫర్నిచర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి..తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత విశాలంగా సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ భవనా నికి పేరు దక్కనున్నది. నాలుగెకరాల విస్తీర్ణంలో 62.60 కోట్లతో ఈ నూతన భవన సముదాయాన్ని నిర్మించారు. రెండంతస్తుల భవనంలో 600 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వసతులు కల్పించారు.. 40 శాఖలకు 100 గదులను కేటాయించారు. కలెక్టర్ ఆడిషనల్ కలెక్టర్, డీఆర్వోతో పాటు పలువురు జిల్లా స్థాయి అదికారులకు ప్రత్యేక చాంబర్లను నిర్మించారు. సుందరంగా నూతన పోలీస్ కమిషనరేట్.. అత్యాధునిక వసతులతో, సాంకేతికతతో నూతన పోలీస్ కమిషనరేట్ సిద్ధమవుతుంది. దుద్దెడ గ్రామ శివారులో 29 ఎకరాల్లో రూ.19 కోట్లు వెచ్చించి జిల్లా పోలీస్ కమిషనరేట్ నిర్మించారు. అత్యాధునిక హంగులతో, సాంకేతికత, వసతులతో ఈ భవనాన్ని నిర్మించారు.. నూతన కమిషనరేట్ ప్రాంగణంలోనే సీపీ,ఆడిషనల్ డీసీపీలు స్థానిక ఎసీపీకి ప్రత్యేక చాంబర్లు నిర్మించారు. అదే విధంగా సిద్దిపేట పట్టణంలో నూతనంగా ఎమ్మెల్యే క్యాంపును నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 20న ప్రారంభించడానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. -
సమీకృత కలెక్టరేట్ల నిర్మాణ ప్రక్రియ కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యా లయాలు ఒకేచోట అందుబాటులో ఉండేందుకు వీలుగా 2017 అక్టోబర్ నుంచి మొదలుపెట్టిన కలెక్టరేట్ భవనాల నిర్మాణం... ఒకట్రెండు చోట్ల మినహా అన్ని జిల్లాల్లో దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ నెలలో సిద్దిపేట, నిజామాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల కలెక్టరేట్ భవనాలు ప్రారంభానికి సిద్ధంకాగా మరో 6 జిల్లాల్లో వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన కేంద్రాల్లోనూ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, చిన్నచిన్న పనులే పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ప్రారంభించిన ఏడాదిన్నర లోపే ఈ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా స్థల సేకరణలో వివాదాలు, భూసేకరణ, కాంట్రాక్టు పనులకు బిల్లుల మంజూరు, కరోనా లాక్డౌన్, కూలీల కొరత తదితర కారణాల వల్ల జాప్యం జరిగింది. మొత్తంమీద సమీకృత కలెక్టరేట్ భవనాలు త్వరలోనే అందు బాటులోకి రానుండటంతో ప్రజలకు పాలనా సౌలభ్యం కలగనుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. కలెక్టరేట్ భవనాల నిర్మాణంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసం నుంచి అధికారులతో సమీక్షించారు. పెండింగ్ పనులను పూర్తి చేసి త్వరగా ఈ భవనాలనుప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: (ఐటీ ఉద్యోగులు స్కై వాక్ చేస్తూ ఆఫీస్‌లకు..) రాష్ట్రవ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ పురోగతి ఇలా... ►సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ల పనులకు 2017 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2020 డిసెంబర్10న సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. కానీ చివరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ జిల్లా భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ►సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ భవనానికి 2017 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2018లో పనులు ప్రారంభించగా 2019 అక్టోబర్‌లో పనులు పూర్తి కావాలి. కానీ నిర్మాణ స్థలం లోతట్టు ప్రాంతం కావడంతో మట్టి ఎక్కువగా నింపాల్సి వచ్చింది. రూ. 30 కోట్ల వ్యయ అంచనాతో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. చదవండి: (రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ వస్తుందిలా.. ) ►జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో 2017 అక్టోబర్‌లో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. 25.34 ఎకరాల విస్తీర్ణంలో రూ. 30 కోట్లతో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణం 6 నెలల కిందటే పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ►వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కొత్త భవనం మొత్తం మూడంతస్తుల్లో అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఒకేచోట ఉండేలా డిజైన్ చేశారు. సుమారు రూ. 45 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు 99 శాతం పూర్తయ్యాయి. ►కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ పనులు పూర్తయ్యాయి. 2017 అక్టోబర్ 10న దీనికి శంకుస్థాపన జరగ్గా అన్ని పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ►పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు 2018 అక్టోబర్ 11న అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. రూ. 36.60 కోట్ల అంచనాలతో పనులు చేపట్టారు. ఇప్పుడు 95 శాతం పనులు పూర్తయ్యాయి. ►నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ను 2017, అక్టోబర్ 11న అప్పటి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 62 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం భవన నిర్మాణం మొత్తం పూర్తయింది. ఆఫీసుల్లో ఫర్నిచర్ పనులు, అదనపు పనులు, అంతర్గత రోడ్డు పనులు, మొక్కలు నాటడం, ఇతర చిన్నపాటి పనులు కొనసాగుతున్నాయి. మొత్తం పనులు పూర్తి కావడానికి మరో నెల నుంచి 45 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ►వనపర్తి జిల్లా కేంద్రంలో 2017 అక్టోబర్ 11న నూతన కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 17 ఎకరాల్లో రూ. 51.7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సీలింగ్, ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. ►గద్వాల కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 36.80 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రూ. 28 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ నాటికి పనులన్నీ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. ►ఖమ్మం జిల్లాలో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ►జనగామ నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం పనులను 2017 డిసెంబర్ మాసంలో ప్రారంభించారు. ఇందుకోసం రూ. 42 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఏప్రిల్ మొదటి వారానికల్లా 100 శాతం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ►మహబూబాబాద్ జిల్లాలో అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2018 ఏప్రిల్ 4న ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం నాలుగు బ్లాకులుగా రూ. 43 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఏ,బీ బ్లాకులు చివరి దశలో ఉండగా, మిగిలిన రెండు బ్లాకులు స్లాబ్ దశలో ఉన్నాయి. ►మంచిర్యాల జిల్లాలో 2018 ఫిబ్రవరి 27న నస్పూర్ లో ప్రారంభించారు. నస్పూర్‌లో 26.27 ఎకరాల స్థలంలో, 41.54 కోట్ల నిధులు కేటాయించారు. ఇప్పటికి సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ►భూపాలపల్లి జిల్లాలో 2017 అక్టోబర్ 11న రూ. 30.80 కోట్లతో అప్పటి స్పీకర్ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు. మూడేళ్లు గడిచినా ఇక్కడ నిర్మాణం పిల్లర్ల దశలోనే ఉంది. స్థల వివాదంతో పాటు కోర్టు కేసులు, నిర్మాణ స్థలం చెరువులో ఉండడంతో డిజైన్మార్చాల్సి రావడంతో తాత్కాలికంగా పనులకు బ్రేక్ పడింది. ►ములుగు జిల్లా కలెక్టరేట్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. ములుగు మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రెవెన్యూ అధికారులు 70 ఎకరాల స్థలాన్ని గుర్తించినా స్థలం అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతోంది. ►సూర్యాపేట జిల్లా నూతన కలెక్టరేట్ భవనానికి 2018 మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 47.85 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం శ్లాబు పనులు పూర్తవగా ఇంటీరియర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ►మెదక్ పట్టణ శివారులో కొత్త కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణానికి 2018 మే 9న సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో రూ. 48.62 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ఏడాది మార్చి వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ►నిర్మల్ జిల్లా కేంద్రం శివారులోని నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి రూ. 40 కోట్లు కేటాయించారు. 2018 సెప్టెంబర్‌లో భీమన్న గుట్టపై స్థలాన్ని కేటాయించగా అక్కడ నిర్మాణం చేయవద్దంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు స్థానికులు ఆందోళన నిర్వహించారు. దీంతో వేరే చోట 25 ఎకరాలను కేటాయించినా అక్కడ కూడా సమస్య ఉండటంతో తిరిగి 15 ఎకరాల్లోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పరిపాలన సులభతరానికే..: మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి నూతన సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమీకృత కలెక్టరేట్ల భవన నిర్మాణ పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెలలోనే సీఎం చేతుల మీదుగా 10 కలెక్టరేట్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నెల మొదటి వారంలో సిద్దిపేట, నిజామాబాద్, రెండో వారంలో కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మూడో వారంలో వరంగల్, జనగాం, పెద్దపల్లి, నాలుగో వారంలో వికారాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభిస్తామని, అన్ని పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని కోరారు. వనపర్తి, మహబూబాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలని, వచ్చే నెలలో వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఎస్ఈలు, ఈఈలు, వాస్తు నిపుణుడు సుధాకర్‌తేజ పాల్గొన్నారు. -
కరోనాపై కృష్ణాజిల్లా కలెక్టర్ పేరడి పాట
సాక్షి, విజయవాడ: కరోనాపై ప్రజలు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండి వైరస్‌ను నియంత్రించాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినిమా పాటకు కలెక్టర్ ఇంతియాజ్ పేరడి పాటను రాయగా ఆ పాటను చంద్రిక పాడారు. ఈ పాటను శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 36 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వైరస్‌పై ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా నిర్లక్ష్యంగా ఉంటే దాని బారిన పడతారన్నారు. కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. ఈనెల 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ కోవిడ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చదవండి: ఎమ్మెల్యే వంశీకి పాజిటివ్ విజయదశమి శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి అని, ఈ పండుగ ప్రజలందరికి విజయాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. -
కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన
సాక్షి, ఆదిలాబాద్: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీ, పదోన్నతులు, బదిలీలు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఫైన్డ్ పెన్షన్ స్థానంలో సీపీఎస్‌ను పార్లమెంట్ ఆమోదం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రవేశపెట్టిందన్నారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పాత పెన్షన్ విధానం అమలు చేసే అవకాశమున్నా.. ఏకపక్షంగా సీపీఎస్‌నే అమలు చేస్తామంటూ పీఎఫ్ఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ పథకంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్ అయినా.. చనిపోయినా.. వారి కుటుంబాలకు నెలకు రూ.2 వేల కంటే తక్కువ మొత్తంలో పింఛన్ అందుతుందన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉన్న సీపీఎస్‌ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు వెంకట్, శ్రీనివాస్, నరేందర్, అశోక్, దిలీప్, సురేఖ, వెంకటేశ్, స్వామి, మనోజ్, వృకోధర్, తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యల క్రయవిక్రయాలపై ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: రొయ్యల క్రయ విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. క్రయవిక్రయాలు రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశిస్తూ అధికారులు పాటించాల్సిన అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. వారం రోజులుగా హేచరీస్ నిర్వాహకులు, ఎగుమతిదారులు కొనుగోళ్లు నిలిపివేయడం, ఒకవేళ కొనుగోలు చేసినా కిలోకు రూ.80 వరకు తక్కువ రేటును చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని కొందరు రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్న ప్రాంతాలకు ఇద్దరేసి అధికారులను నియమించింది. వారి మొబైల్ నంబర్లు రైతులకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్ కార్యాలయాల్లోని కంట్రోల్ రూమ్‌లు పనిచేయనున్నాయి. రైతులు తమ సమస్యలను ఈ కంట్రోలు రూమ్‌లకు తెలిపితే అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన రేట్లకే ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు రొయ్యలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఐఏఎస్ అధికారిపై అత్యాచార ఆరోపణలు
రాయ్‌పూర్ : ఉన్నతమైన పదవిలో ఉండి పలువురికి ఆదర్శంగా మెలగాల్సిన జిల్లా కలెక్టరే వక్రబుద్ది చూపించాడని ఓ మహిళ ఆరోపించడం ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపింది. సాక్షాత్తూ కలెక్టరేట్లోనే ఐఏఎస్ అధికారి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించడం పెను దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి తనపై జంజ్‌గిర్-చంపా జిల్లా మాజీ కలెక్టర్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ జనక్ ప్రసాద్ పాథక్ అత్యాచారానికి పాల్పడ్డాడని 33 ఏళ్ల మహిళ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నాళ్లుగా తనకు అశ్లీల సందేశాలు పంపిస్తూ లైంగింగా వేధిస్తున్నాడని, మే 15న తనపై కలెక్టరేట్లోనే అత్యాచారం చేశాడని జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. పాథక్ తనకు పంపిన ఫోన్ సందేశాలు, ఫొటోలకు పోలీసులకు ఆమె అందజేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ పారుల్ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 376, 506, 509 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అత్యాచార ఆరోపణలు రావడంతో సదరు కలెక్టర్ జనక్ ప్రసాద్‌ను ఛత్తీస్గడ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరుగా మే 26న ప్రభుత్వం బదిలీ చేసింది. తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలపై స్పందించేందుకు కలెక్టర్ అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పటివరకు కలెక్టర్‌ని అరెస్ట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున మహిళా సంఘాలు నిరసనలు చేపట్టాయి. -
కుటుంబంతో వచ్చి కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం
నెల్లూరు (పొగతోట) : కలెక్టరేట్‌కు బుధవారం కుటుంబంతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. జిల్లాలోని సూళ్లూరుపేటకు చెందిన అరిగెల నాగార్జున రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని కుటుంబం సహా కలెక్టరేట్‌కు వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నానని అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చాడు. అన్నట్లుగానే భార్య భవానీ, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో కలెక్టరేట్‌కు వచ్చి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేశాడు. పెట్రోలు బాటిల్, అగ్గిపెట్ట స్వాధీనం చేసుకునే సమయంలో పోలీసులకు అతనికి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, చుట్టుపక్కల ఉన్న వారు నాగార్జునపై నీళ్లు పోశారు. డీఆర్ఓ, పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని నాగార్జునను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నాగార్జున ఏం చెబుతున్నాడంటే.. మాది చిట్టమూరు మండలం చిల్లమూరు. 110 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాలు మంజూరు చేయించేందుకు రైతుల నుంచి రూ.1.20 కోట్లు డబ్బులు వసూలు చేసి అప్పటి తహసీల్దార్ చంద్రశేఖర్‌కు విడతల వారీగా అటెండర్, వీఆర్ఓల ద్వారా ఇచ్చాను. నగదు ఇచ్చినట్లు నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలకు బదిలీపై వెళ్లి తిరిగి వచ్చి సైదాపురంలో పని చేస్తున్నాడు. ఈ విషయమై అనేక పర్యాయాలు అడిగిన సరైన సమాధానం చెప్పలేదు. ఇంటిపైకి ఇతర వ్యక్తులను పంపించి దౌర్జన్యం చేయించాడు. ఈ విషయంపై జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదు. గత్యంతరంలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. విచారిస్తాం: డీఆర్ఓ దీనిపై డీఆర్ఓ మాట్లాడుతూ నాగార్జున ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాన్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన నాగార్జునపై కేసు నమోదు చేస్తామన్నారు. కాగా నాగార్జున చేస్తున్నవి నిరాధార ఆరోపణలని సైదాపురం తహసీల్దార్ చంద్రశేఖర్ ఖండించారు. గతంలో ఇదే విధంగా బెదిరిస్తే సబ్‌కలెక్టర్‌కు విషయం చెప్పి 15 రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. -
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు!
సాక్షి, ఆదిలాబాద్: కొత్త జిల్లా కలెక్టర్ దేవసేన సోమవారం సాయంత్రం 7గంటల తర్వాత బాధ్యతలు స్వీకరించాక కొద్దిసేపు మాత్రమే జిల్లాలో ఉన్నారు. అనంతరం ఆమె తిరుగు ప్రయాణం అయ్యారు. రెండుమూడు రోజుల పాటు కలెక్టర్ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండరని కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. సాధారణంగా కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మరుసటి రోజు వివిధ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుస్తారు. అయితే మంగళవారం అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎలాంటి సందడి కనబడలేదు. సోమవారం రాత్రి కొద్దిసేపు మాత్రమే జిల్లాలో ఉన్న ఆమె హైదరాబాద్‌కు పయనమయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బదిలీల కంటే ముందు ఆమె హైదరాబాద్‌కు బదిలీ కోసం ప్రయత్నించారని సమాచారం. అయినప్పటికీ ఆదిలాబాద్‌లో పోస్టింగ్ ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ అయిన కలెక్టర్లు వెనువెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఆమె సోమవారం సాయంత్రమే ఇక్కడికి వచ్చి విధుల్లో చేరారు. హైదరాబాద్‌కు చెందిన అల్లమరాజు దేవసేన పరిపాలన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడంతోపాటు ప్రజాసమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించగల తత్వం కలిగి ఉన్నారు. 1997లో గ్రూప్–1కు ఎంపికయ్యారు. హైదరాబాద్ ఆర్డీఓగా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. 2008లో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. అటుపై సెర్ప్ డైరెక్టర్‌గా, ఎన్నికల కమిషన్ డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాగా ఏర్పడిన జనగామ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. అక్కడ ఏడాదిపైగా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. జనగామ కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ సంబంధిత వ్యవహారాల్లో అక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధిని ఎదురించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారనే పేరుంది. దేవసేన 2018 జనవరిలో పెద్దపల్లి కలెక్టర్‌గా వెళ్లారు. అక్కడ ఏడాదికిపైగా పనిచేశారు. ఆమె కృషి ఫలితానికి మూడు జాతీయ అవార్డులూ వరించాయి. -
మచిలీపట్నం కలెక్టరేట్లో కలకలం
జిల్లా పాలనా కేంద్రమైన కలెక్టరేట్ ప్రాంగణం.. సోమవారం కావడంతో ఉదయం నుంచి ‘స్పందన’కు వచ్చిపోయే అర్జీదారులతో కిటకిటలాడుతోంది. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ మాధవీలత, డీఆర్వో ప్రసాద్ తదితర జిల్లా అధికారులంతా అర్జీదారుల నుంచి వినతులు స్వీకరిస్తూ బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కలెక్టరేట్లో కీలక విభాగాధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఇదే ప్రాంగణంలో ఉన్న ఇతర శాఖల కార్యాలయాలకు చెందిన పలువురు సిబ్బంది గతంలో ఏసీబీకి చిక్కినప్పటికీ, జిల్లా ఉన్నతాధికారులు కార్యాలయంలో ఉండగానే కలెక్టరేట్‌కు చెందిన ఓ అధికారి.. ఏసీబీకి చిక్కడం సంచలనం రేపింది. సాక్షి, మచిలీపట్నం/చిలకలపూడి: మచిలీపట్నం కలెక్టరేట్లో భూసంస్కరణల విభాగం అధీకృత అధికారి(ఏఓ)గా పనిచేస్తున్న దాసరి ప్రశాంతి ఓ రైతు నుంచి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కోసం రూ.6లక్షలు డిమాండ్ చేసిన ప్రశాంతి.. తొలివిడతగా రూ.3లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఏఎస్పీ కేఎం మహేశ్వర రాజుతో పాటు బాధిత రైతు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన మోకా రామలింగేశ్వరరెడ్డి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు వద్ద 4.53 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పసుపుకుంకుమ కింద వచ్చినట్టుగా కోర్టు నుంచి పొందిన ఆర్డర్ ఆధారంగా కృష్ణకుమారి అనే ఆమె నుంచి ఈ భూమిని కొనుగోలు చేసి 2.53 ఎకరాలు తన పేరిట, మరో ఎకరం తన తల్లి మోకా జయలక్ష్మి, ఇంకో ఎకరం భూమి తన సోదరి ఆళ్ల జానకీదేవి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పట్టాదార్‌పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్స్ కోసం 2016లో ఏ.కొండూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయగా, ఆ భూమి ల్యాండ్ సీలింగ్‌లో ఉన్నట్టుగా స్థానిక అధికారులు చెప్పారు. దీంతో నూజివీడు ఆర్డీఓను ఆశ్రయించగా, అక్కడ నుంచి కలెక్టరేట్‌కు ఫైల్ చేరింది. అప్పట్లోనే ఈ పని నిమిత్తం రూ.5 లక్షలు ముట్టజెప్పిన రామలింగేశ్వర రెడ్డి 2017 నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ఫైనల్ నోటీసులు జారీ చేస్తున్న సమయంలో ఏఓ ప్రశాంతి బాధిత రైతునకు సమాచారం పంపారు. మీ చేతికి పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కావాలంటే కనీసం రూ.6లక్షలు ఖర్చవుతాయని అందుకు సిద్ధమైతే కలెక్టరేట్ రావాలని సూచించారు. దీనిపై రైతు రామలింగేశ్వరరావు తాను రూ.6 లక్షలు ఇవ్వలేనని స్పష్టం చేయడంతో.. ముందు మీ దగ్గర ఎంత ఉంటే అంత పట్టుకురండి మిగిలిన డబ్బుల సంగతి ఆ తర్వాత చూద్దామని సూచించారు. దీంతో ఆమె అడిగిన డబ్బులు ఇచ్చినా పని అవుతుందో లేదోనన్న ఆందోళనతో రామలింగేశ్వరారవు విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు రూ. 10లక్షలు ఇవ్వాలంటూ.. ఏసీబీ ఏఎస్పీ మహేశ్వరరాజు సూచన మేరకు రూ.3లక్షలు కవర్లో పెట్టి నేరుగా కలెక్టరేట్ పై అంతస్తులో ఉన్న భూసంస్కరణల విభాగానికి సోమవారం మధ్యాహ్నం 1గంట సమయంలో చేరుకున్న రామలింగేశ్వరరెడ్డి సెక్షన్లో అందరూ చూస్తుండగానే డబ్బులతో ఉన్న కవర్‌ను ఆమెకు అందజేసి ఇందులో రూ.3 లక్షలున్నాయి, ఇక ఇవ్వలేను తీసుకుని మా భూమికి పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ ఇప్పించాలని వేడుకున్నారు. రూ.3లక్షలు కాదు కదా, రూ.6లక్షలు ఇచ్చినా కుదరదు. కనీసం రూ.10 లక్షలు ఇస్తే కాని మీ పని అవదు గుర్తించు కోండి అని బదులిచ్చింది. ఈ డబ్బులేమైనా నా ఒక్కదానికే అనుకున్నారా? కలెక్టర్‌ట్‌లోని ఓ ఉన్నతాధికారితో పాటు సంబంధిత విభాగాల అధికారులకు కూడా ముట్టజెప్పాలి తెలుసా అని చెప్పుకొచ్చారు. కవర్ సొరుగులో వేస్తుండగా.. కవర్లో ఉన్న సొమ్ములను తన టేబుల్ సొరుగులో వేస్తుండగా ఏసీబీ ఎఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. టేబుల్ సొరుగులో ఉన్న నగదును స్వా«దీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏఓ ప్రశాంతిని అదుపులోకి తీసుకున్నారు. పట్టాదార్‌పాస్ పుస్తకం, టైటిల్ డీడ్స్ జారీ కోసం తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని, రూ.6లక్షలు డిమాండ్ చేశారని చెప్పడంతో తాము వలపన్ని డబ్బులు సొరుగులో వేసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా మని ఏసీబీ ఏఎస్పీ మహేశ్వరరాజు మీడియాకు తెలిపారు. అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు çపర్చనున్నట్టు చెప్పారు. ఐదేళ్లు నరకం చూశా.. పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కోసం గడిచిన ఐదేళ్లుగా చెప్పులరిగేలా తిరిగా. గతంలో రూ.5 లక్షలు ఇచ్చా. మళ్లీ రూ.6లక్షలు డిమాండ్ చేశారు. ఇక చేసేది లేక ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చా. రెవెన్యూలో సామాన్యులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. – మోకా రామలింగేశ్వరరెడ్డి, బాధిత రైతు గతంలో పట్టుబడినా.. మారని తీరు తహసీల్దార్‌గా ఏ.కొండూరులో పనిచేసిన సమయంలో ఇదే రీతిలో చేతివాటం ప్రదర్శించి ఏసీబీ అధికారులకు దొరికిపోయినా ఆమె తీరులో మాత్రం మార్పు రాలేదు. రేపూడి తండా గ్రామానికి చెందిన బి.గోలిరాజు అనే గిరిజన రైతు తనకు చెందిన రెండెకరాల వ్యవసాయ భూమికి పట్టాదార్‌పాస్‌పుస్తకం జారీ కోసం రూ.8వేలు లంచం తీసుకుంటూ డగా 2014 మే 5వ తేదీన ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెన్షన్‌కు గురయ్యారు. కొంతకాలం ఏ పోస్టింగ్ లేకుండా ఉన్న ఆమె టీడీపీ ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయించుకుని కలెక్టరేట్లోని కీలక విభాగమైన భూసంస్కరణల ఏఓగా పోస్టింగ్ పొందారు. -
ఆరోగ్య సిద్దిపేట లక్ష్యంగా..
సిద్దిపేట జోన్: ‘స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యంగా మరో ముందడుగుకు ఇదొక ప్రయత్నం. ప్రజలకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించి ఆరోగ్య సిద్దిపేటగా మార్చే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి సిద్దిపేటలో రెండు వేల మందికి ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ద్వారా శిక్షణ ఇచ్చి కొత్త ఒరవడితో చరిత్ర సృష్టిద్దాం’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎన్జీవో భవన్లో తినుబండారాల విక్రయాలు, ఆహార నాణ్యతపై పాటించాల్సిన నిబంధనలపై శిక్షణ పూర్తి చేసుకున్న 800 మందికి సామగ్రి, పరికరాలను ఉచితంగా అందజేశారు. మిగతా 1,200 మందికి కూడా శిక్షణ పూర్తి చేసి చరిత్ర సృష్టిద్దామన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణాన్ని పరిశుభ్రతలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపే క్రమంలో దశలవారీగా ప్రగతిని సాధించామన్నారు. దీంతోనే సిద్దిపేటకు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయన్నారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పరిశుభ్రమైన వాతావరణంలో రుచిని, శుచిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఆహార నాణ్యతలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. దేశంలోనే తొలి సారిగా ఒక పట్టణంలో వందశాతం ఆహార విక్రయ యాజమానులకు, కార్మికులకు శుచి, శుభ్రతలపై శిక్షణ ఇచ్చి సిద్దిపేట పట్టణం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు. జనవరి 15 నుంచి మార్చి 15 వరకు మున్సిపల్ అధికారులు స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేట వాలంటీర్లు తినుబండారాల విక్రయశాలలను, హోటళ్లను సందర్శించి పనితీరును పరిశీలిస్తారని తెలిపారు. 20 సూత్రాలలో కనీసం 17 సూత్రాలను అమలు చేసే వారికి గ్రీన్‌కలర్ చిహ్నంతో కూడిన ఓ కార్డును పంపిణీ చేస్తామన్నారు. శిక్షణ పొందిన వారికి డ్రెస్‌కోడ్, ఇతర పరికరాలను, శిక్షణ ధ్రువీకరణ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఎన్జీవో భవన్ నుంచి పట్టణంలో యూనిఫాం ధరించిన ఆహార విక్రయశాలల ప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్‌రావు చైతన్య ర్యాలీలో పాల్గొన్నారు. కాగా కొండపాక మండలం దుద్దెడ శివారులో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఫిబ్రవరి నెలఖారులోగా పూర్తిచేయాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. దీన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టరేట్లో నిర్మాణ పనులను హరీశ్ ఆకస్మికంగా తనిఖీచేశారు. -
అసలేం జరుగుతోంది?
సాక్షి, ఇందూరు (నిజామాబాద్): జిల్లాలో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీ తీరుపై కలెక్టర్ రామ్మోహన్రావు అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరాల్లో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీలో ముందున్న జిల్లా... కొన్ని నెలులుగా ఎందుకు ఒక్కసారిగా వెనుకబడి పోయిందని ఆరా తీశారు. రుణాల ప్రగతి ఇంతగా పడిపోవడానికి గల కారణాలేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో డీఆర్డీఏ, మెప్మా అధికారులు, సిబ్బందితో స్త్రీనిధి రుణాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.207 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.135 కోట్ల రుణాలు మహిళా సంఘాల సభ్యులకు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం 19 శాతంతో రూ.39 కోట్లు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకుల అశ్రద్ద ఉంటే వాటి వివరాలు తెలుపాలని, వారానికోసారి సమీక్షించుకుని సమస్య ఎక్కడుందో దృష్టి పెట్టి రుణాల పురోగతిని సాధించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే జనవరిలో అభివృద్ధి కనిపించాలని, నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడే స్త్రీనిధి రుణాల లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలన్నారు. మంజూరు చేసిన రుణాలకు రికరీకి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. డీఆర్డీవో రమేశ్ రాథోడ్, మెప్మా పీడీ రాములు, స్త్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ న్యాయం చేయడం లేదు..ఉరేసుకుంటున్నా!
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ‘తహసీల్దార్ నాకు న్యాయం చేయడం లేదు.. అందుకే ఉరివేసుకుంటున్నా..’ అని ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న చెట్టెక్కి ఉరేసుకునేందుకు యత్నించడం కలకలం సృష్టించింది. ధర్పల్లి మం డలం దుబ్బాక గ్రామానికి చెందిన అక్కం గంగాధర్‌కు రేకులపల్లిలో వ్యవసాయ భూమి ఉంది. గంగాధర్ తమ్ముడు సంతోష్ పొలం కూడా పక్కనే ఉంది. సంతోష్ తన పొలంలో బోరు వేసినప్పటి నుంచి గంగాధర్ బోరులో నీళ్లు రావడంలేదు. దీనిపై తహసీల్దార్‌కు ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేశానా న్యాయం జరగడం లేదనే ఆవేదనతో గంగాధర్ సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తాడుతో ఉరి వేసు కునేందుకు యత్నించాడు. ప్రజావాణికి వచ్చిన వారంతా చెట్టె క్కిన గంగాధర్‌ను ఎంత సముదాయించినా కిందికి దిగలేదు. గంగాధర్‌కు తెలియకుండా చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి గంగాధర్‌ను పట్టుకుని తాడును విప్పాడు. గంగాధర్‌ను కిందికి దింపి నిజామాబాద్ ఆర్డీఓ వద్దకు తీసుకెళ్లి సమస్య ఏంటో తెలుసుకున్నారు. ధర్పల్లి తహసీల్దార్‌తో మాట్లాడిన ఆర్డీఓ బుధవారం విచారణకు వస్తున్నానని, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికుల బైఠాయింపు
-
గ్రామసభల్లో ఇళ్లపట్టాల అర్హుల జాబితా
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్రామసభలు నిర్వహించి ఇళ్లపట్టాలకు అర్హులైన వారి జాబితాలను ప్రచురించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి జిల్లావ్యాప్తంగా ఈనెల 15 వరకు గ్రామసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇళ్లు లేని వారికి ఇళ్ల పట్టాలను అందజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు గుర్తించిన అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రచురించనున్నట్లు తెలిపారు. ప్రచురించిన అర్హుల జాబితాలో ఏవైనా పొరపాట్లు, అభ్యంతరాలు, అర్హుల పేర్లు నమోదు కాకపోయినా తెలియజేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలోని 1,542 రెవెన్యూ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర శాఖల అధికారులతో సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇళ్లు లేనివారు లక్ష మంది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 వేలు, పట్టణ ప్రాంతాల్లో 40 వేలు ఇళ్లు లేని వారు ఉంటారని జేసీ తెలిపారు. వారందరికీ ఉగాది నాటికి ఇళ్లపట్టాలు అందజేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 వేల మందిలో 47 వేల మందికి, అర్బన్‌లోని 40 వేల మందిలో 15 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూమిని గుర్తించినట్లు తెలివారు. పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత ఉందన్నారు. 570 ఎకరాలు కొనాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఏప్రిల్ నుంచి సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. -
మూడేళ్లయినా ఖరారు కాని జిల్లా కేంద్రం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటై ఈ దసరాతో మూడేళ్లవుతున్నా.. జిల్లా కేంద్రం ఎక్కడ అనేది ఖరారు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు కలెక్టరేట్ సముదాయాలు చివరి దశలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా రూరల్ జిల్లా కేంద్రం ఉండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. -
13 వరకు సెలవులో సిద్దిపేట కలెక్టర్
సాక్షి, సిద్దిపేట: జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఈ నెల 13 వరకు సెలవులో ఉండనున్నారు. చెవినొప్పి ఎక్కువ కావడంతో మరో 11 రోజుల సెలవు కావాలని కోరుతూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధార్ సిన్హాను కోరారు. పరిశీలించిన ఆయన 13 వరకు సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణబాస్కర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.