అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలకలం రేగింది.
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలకలం రేగింది. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవిన్స్‌లో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. జిల్లాలోని గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన హరిత అనే మహిళ భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదును పోలీసులు పట్టనుంచుకోలేదని ఆమె ఆరోపిస్తోంది. దీంతో తనకు న్యాయం జరగలేదని మనస్ధాపంతో గ్రీవెన్స్‌లో ఆత్మహత్యకు యత్నించినట్టు బాధితురాలు తెలిపింది.