Top Stories
ప్రధాన వార్తలు

చంద్రబాబు‘లూలూ’ గోల్ ‘మాల్’!
సాక్షి, అమరావతి: ‘లూలూ’గ్రూపుపై చంద్రబాబు సర్కారు వల్లమాలిన ప్రేమ చూపింది. లూలూ గ్రూపు చైర్మన్ యూసుఫ్ అలీ జనవరి 17న సీఎం చంద్రబాబుకు రాసిన ఓ లేఖ ఆధారంగా విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుపై ఆ సంస్థకు ధారాదత్తం చేసింది. విశాఖలోని హార్బర్ పార్క్‌లో 13.43 ఎకరాల భూమిలో అభివృద్ధి ప్రాజెక్టుకు టెండర్.. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన (ఆర్ఎఫ్పీ) నోటిఫికేషన్ జారీ చేయకుండానే వ్యవహారాన్ని పూర్తి చేసింది. హార్బర్ పార్క్‌లో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.150 కోట్లకుపైగా పలుకుతోందని విశాఖ వాసులు చెబుతున్నారు. అంటే.. ఏకంగా రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని ‘లూలూ’కు రాసిచ్చేసినట్లు స్పష్టమవుతోంది. బీచ్ పక్కనే ఉన్న హార్బర్ పార్క్‌లో 13.43 ఎకరాల ఖరీదైన భూమి వీఎంఆర్డీఏ(విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) అధీనంలో ఉంది. అత్యంత విలువైన ఈ భూమిలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టాలంటే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా ప్రైవేటు సంస్థను ఎంపిక చేయాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు 33 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వడానికి వీల్లైదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ.. “లూలూ’కు 99 ఏళ్లకు నామమాత్రపు అద్దెపై అప్పగిస్తూ.. ఆ సంస్థ ఛైర్మన్ విధించిన షరతులన్నింటికీ తలూపుతూ ఖరీదైన భూమిని ప్రభుత్వం కట్టబెట్టేసింది. ఈ వ్యవహారంలో రూ.వేల కోట్లు చేతులు మారడం వల్లే నిబంధనలు తుంగలో తొక్కి “లూలూ’పై వల్లమాలిన ప్రేమ చూపించినట్లు స్పష్టమవుతోంది.18 ఏళ్ల అనుబంధం.. ఆగమేఘాలపై పచ్చజెండాటీడీపీ కూటమి అధికారంలోకి రాగానే లూలూ ప్రాజెక్టుకు చంద్రబాబు తిరిగి పచ్చ జండా ఊపారు. గతేడాది సెప్టెంబరు 28న సీఎం చంద్రబాబుతో సమావేశమైన లూలూ గ్రూపు ఛైర్మన్ యూసుఫ్ అలీ విశాఖలో షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్లతో ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ నిర్మాణంపై చర్చించారు. దీనిపై అదే రోజు “ఎక్స్’ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేయగా.. తనకు చంద్రబాబుతో 18 ఏళ్లుగా అనుబంధం ఉందంటూ లూలూ గ్రూప్ ఛైర్మన్ ప్రతిస్పందిస్తూ రీట్వీట్ చేశారు. ఈ క్రమంలో విశాఖ హార్బర్ పార్క్‌లో 13.43 ఎకరాల భూమిని అప్పగిస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతామంటూ ఈ ఏడాది జనవరి 17న సీఎం చంద్రబాబుకు లూలూ గ్రూపు ఛైర్మన్ లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 13న ఎస్ఐపీబీ(స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఆమోదముద్ర వేశారు.ఇలా కలిశారు.., అలా జీవో ఇచ్చేశారు భారీ రాయితీలు.. అత్తెసరు అద్దెతమకు భూమిని 99 ఏళ్ల లీజుకు ఇవ్వాలని.. మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యే వరకూ లేదా మూడేళ్ల వరకూ.. ఈ రెండింటిలో ఏది ముందైతే అంతవరకూ అద్దె మినహాయింపు ఇవ్వాలని లాలూ గ్రూపు ఛైర్మన్ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. పదేళ్లకు ఒకసారి పది శాతం అద్దె పెంచాలని, సాధ్యమైనన్ని అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. వాటన్నింటికీ ప్రభుత్వం తలూపడంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఎకరానికి నామమాత్రంగా రూ.50 లక్షలు అద్దెగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. స్టాంపు డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రాయితీలు తదితర ప్రోత్సాహకాల కింద లూలూ గ్రూప్‌నకు రూ.170 కోట్లకుపైగా ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు చర్చ సాగుతోంది. లాలూ గ్రూప్ కోరికల చిట్టాకు తలూపి అంత లబ్ధి చేకూరుస్తున్నా ఆ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి అద్దె రూపంలో అత్తెసరు ఆదాయం మాత్రమే రానుండటం గమనార్హం. దీన్నిబట్టి ఇందులో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. 2018 ఫిబ్రవరి 16న నాటి టీడీపీ సర్కార్ లూలూ సంస్థకు పీపీపీ పద్ధతిలో షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్లతో ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ నిర్మాణానికి భూమిని నామమాత్రపు లీజుపై కేటాయించి భారీ రాయితీలు కల్పిస్తూ ఏకపక్షంగా కట్టబెట్టింది. దీని వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది.ఆదాయాన్ని ఆర్జించే వీలున్నా..వాస్తవానికి లూలూ మాల్‌కు అప్పగిస్తున్న భూమిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణాలను చేపట్టి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం, అద్దెలకు ఇవ్వడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. అయితే దీన్ని కాదని.. ఓ ప్రైవేట్ సంస్థకు కారుచౌకగా ఏకంగా 99 ఏళ్లకు లీజుకు అత్యంత ఖరీదైన స్థలాన్ని కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక గూడుపు ఠాణీ వ్యవహారాలే కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడకు సమీపంలోనే రహేజా నిర్మిస్తున్న ఇన్ ఆర్బిట్ మాల్ కూడా ఉంది. నిజంగానే షాపింగ్ మాల్ కట్టాలనుకుంటే ప్రభుత్వమే నిర్మించవచ్చు. బ్యాంకు రుణం కూడా పొందే వీలుంది. అలాకాకుండా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాల మాదిరిగా ధారాదత్తం చేయడం, రూ.వందల కోట్ల రాయితీలు కల్పించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ భూమిని ఒకవేళ ప్రైవేట్ పరం చేయాలనుకుంటే టెండర్లు నిర్వహించి బహిరంగ ప్రకటన జారీ చేయాలి. రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని ఖజానాకు జమ చేసి పారదర్శకంగా వ్యవహరించాలి. దీనికి విరుద్ధంగా 99 ఏళ్ల పాటు లీజు.. పలు రాయితీలు కల్పించడం వెనుక గోల్ఙ్‌మాల్’ వ్యవహారాలు దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది.⇒ ఎకరానికి చెల్లించే అద్దె: రూ.50 లక్షలు ⇒ లీజు గడువు: 99 ఏళ్లు⇒ రాయితీల రూపంలో లూలూ పొందే లబ్ధి: రూ.170 కోట్లు(స్టాంపు డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రాయితీలు తదితరాలు)

'కంచె'.. గర్జించె..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములకు సంబంధించి మొదలైన వివాదం క్రమంగా ముదురుతోంది. భూములు తమవంటే తమవేనంటూ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వేర్వేరు వాదనలు వినిపిస్తూ ‘ప్రకటనల యుద్ధానికి’తెరలేపాయి. మరోవైపు వర్సిటీ భూములు కాపాడుకుంటామంటూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలకడమే కాకుండా, ప్రభుత్వ వైఖరిపై విరుచుకు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కంచె గచ్చిబౌలి భూముల వివాదమే హాట్ టాపిక్‌గా మారింది. పూర్వాపరాలు.. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2004 లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ అకాడమీకి అ ప్పగించింది. అయితే ఆ కంపెనీకి సామర్థ్యం లేద ని, కంపెనీ బోగస్ అని ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని రద్దు చేసింది. ఈ రద్దుపై ఐఎంజీ కోర్టును ఆశ్రయించింది. 21 ఏళ్ల పాటు జరిగిన న్యాయపోరాటం త ర్వాత ఆ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రభుత్వం టీజీఐఐసీకు కేటాయించింది. ఆ భూ ములను అభివృద్ధి చేసి పరిశ్రమలకు విక్రయించాల ని టీజీఐఐసీ నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ భూములు హెచ్సీయూవి అంటూ విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో వివాదం మొదలైంది. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు: సర్కారు కొందరు స్థిరాస్తి వ్యాపారులు, రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంటోంది. దీని వెనుక కొన్ని స్థిరాస్తి గుంటనక్కలు ఉన్నా యని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సదరు భూముల తమవేనంటూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఈ భూములు సర్కారువే నంటూ ప్రభుత్వం కూడా అందుకు సంబంధించి రెండు డాక్యుమెంట్లు సోమవారం విడుదల చేసింది. 2004 జనవరి 31న కంచె గచ్చిబౌలి సర్వే నంబర్ 25 లోని 534.28 ఎకరాల హెచ్‌సీయూ భూమిని ప్రభుత్వానికి స్వా«దీనం చేసినట్టుగా ఉన్న, అప్పటి రిజిస్ట్రార్ వై.నర్సింహులు, మరో ముగ్గురు సాక్షులు సంతకాలతో కూడిన ఒక డాక్యుమెంట్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది. అలాగే ఈ భూమికి ప్రత్యామ్నాయంగా 2004 ఫిబ్రవరి 3వ తేదీన అప్పటి యూనివర్సిటీ రిజిస్ట్రార్ నర్సింహులుకు గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 36లో ఉన్న 191.36 ఎకరాలు, సర్వే నంబర్ 37లో ఉన్న 205.20 ఎకరాలు మొత్తం 397.16 ఎకరాల భూమిని ముగ్గురు సాక్షుల సమక్షంలో స్వా«దీనం చేసినట్లుగా ఉన్న మరో డాక్యుమెంటు కూడా బహిర్గతం చేసింది. హెచ్సీయూకు సంబంధం లేదు.. కంచె గచ్చిబౌలిలోని ప్రస్తుత వివాదాస్పద భూమితో సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని సర్కారు వాదిస్తోంది. 21 ఏళ్ల క్రితం ఐఎంజీ భారత్‌కు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం టీజీఐఐసీ ద్వారా వేలానికి ప్రతిపాదించిన భూమిలో చెరువు లేదని, శిలా సంపదకు జీవ వైవిధ్యానికి ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొంటూ సీఎంవో సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘చట్టపరంగా దక్కిన ఈ భూమిపై వివాదాలు సృష్టించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. కంచె గచ్చిబౌలి సర్వే నంబరు 25లోని 400 ఎకరాల భూమిని 2004లో ఐఎంజీ అకాడమీకి కేటాయించారు. పనులు ప్రారంభం కాకపోవడంతో రద్దు చేసి 2006 నవంబర్ 21న ఏపీ యువజన, టూరిజం, సాంస్కృతిక శాఖకు కేటాయించారు. దీనిపై ఐఎంజీ కోర్టుకు వెళ్లడంతో 2024లో మార్చిలో హైకోర్టు, అదే ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చాయి’అని పేర్కొంటోంది.. ఐటీ, ఇతర ప్రాజెక్టుల కోసం టీజీఐఐసీకి.. ఈ భూముల్లో ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గత ఏడాది జూన్‌లో టీజీఐఐసీకు బదలాయించారు. ఆక్రమణలకు గురికాకుండా శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి పంచనామా నిర్వహించి 2024, జులై 1వ తేదీన టీజీఐఐసీకి అప్పగించా రు. ఈ భూమికి సంబందించిన ఉమ్మడి హద్దుల గుర్తింపునకు సహకరించాలని కోరుతూ టీజీఐఐసీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్‌ను కలవడంతో పాటు మెయిల్ కూడా పంపారని, రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024 జూలై 19న సర్వే చేసి హద్దులు నిర్ధారించారని ప్రభుత్వం వాదిస్తోంది. వన్య ప్రాణులు లేవు.. చెరువులు లేవు! ‘టీజీఐఐసీ అభివద్ధి చేస్తున్న 400 ఎకరాల్లో అడవి దున్నలు, నెమళ్లు, చెరువులు లేవు. ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉంది. టీజీఐఐసీ అభివృద్ధి చేసే లే ఔట్లో శిలా సంపద, హరిత స్థలాల పరిరక్షణ కోసం ప్రణాళిక సిద్ధమైంది. మాస్టర్‌ప్లాన్‌లో సుస్థిరాభివద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక (ఈఎంపీ) తయారు చేస్తోంది. ఈ దిశగానే 400 ఎకరాల ప్రభుత్వ భూమిని సాధ్యమైనంత ఎక్కువ ఉపయోగించుకునేలా టీజీఐఐసీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది..’అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.వర్సిటీ అంగీకరించిందనడం అవాస్తవం: రిజిస్ట్రార్‘రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ చెప్తున్నట్లుగా 2024 జూలైలో సదరు భూముల్లో రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదు. ఇప్పటివరకు సదరు భూమి రూపు రేఖలను మాత్రమే ప్రాథమికంగా తనిఖీ చేశారు. భూమి హద్దులు నిర్ణయించేందుకు యూనివర్సిటీ అంగీకరించిందని టీజీఐఐసీ చేస్తున్న వాదనలో నిజం లేదు. భూమి హద్దులు నిర్ధారించేందుకు యూనివర్సిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దేశంలోనే పేరొందిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలని అందిన వినతులను పరిశీలించాలి. రాష్ట్రపతితో నియమితులైన ఆరుగురు సభ్యులతో కూడిన యూనివర్సిటీ సభ్యుల అనుమతితోనే ఏదైనా భూ బదలాయింపు జరుగుతుంది..’అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సోమవారం నాటి ప్రకటనలో స్పష్టం చేశారు. ఇలా రెండు పక్షాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండగా..విద్యార్థులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ఆందోళనకు సంఘీభావం తెలపాలని కోరారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వం భూముల అమ్మకాలకు పూనుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరతీసింది.

అన్యాయాలను ప్రశ్నిస్తే.. పొట్టన పెట్టుకున్నారు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకు శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు.వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని కచ్చితంగా చట్టంముందు నిలబెడతాం. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు.వ్యక్తుల భద్రతకు భరోసా కొరవడిన పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రామగిరి మండల ఉప ఎన్నికలో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వారి బాధ్యతా రాహిత్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించినా, పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ వైఎస్సార్సీపీ నేతల పైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.తదియ ఉ.9.54 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: భరణి ప.3.24 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.2.37 నుండి 4.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.13 వరకు, తదుపరి రా.10.52 నుండి 11.39 వరకు,అమృతఘడియలు: ఉ.10.55 నుండి 12.24 వరకు.సూర్యోదయం : 6.00సూర్యాస్తమయం : 6.09రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.వృషభం.... కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా. శ్రమాధికం. ఆరోగ్యభంగం. మిత్రుల నుండి సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.మిథునం.... కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.కర్కాటకం... ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.సింహం.... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దూరప్రయాణాలు. ఉద్యోగులకు గందరగోళం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన.కన్య... రుణఒత్తిడులు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.తుల..... ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.వృశ్చికం.... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.ధనుస్సు... ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. వృథా ఖర్చులు. ఆలయాలు సందర్శిస్తారు.మకరం... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. బ«ంధువులతో మాటపట్టింపులు.కుంభం... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు. సన్నిహితులు సహాయపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు.మీనం.. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యం.

అమెరికా పర్యటనా?... వద్దు బ్రో!
లీడ్స్ (యూకే): ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశాల జాబితాలో అమెరికా టాప్–3లో ఉండడం పరిపాటి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో వంటి నగరాలు, అక్కడున్న జాతీయ పార్కులు, వినోద కేంద్రాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శిస్తుంటాయి. 2023లో 66.5 మిలియన్ల మంది అమెరికాను సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024లో ఈ సంఖ్య మరింత ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అక్రమ వలసదార్ల పేరిట వేలాది మందిని బలవంతంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో పర్యటించాలని నిర్ణయించుకున్నవారు సైతం పునరాలోచన చేస్తున్నారు. అమెరికా పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. → అమెరికా పర్యాటక రంగం ఈ ఏడాది కనీసం 5.5 శాతం పతనమయ్యే అవకాశం ఉన్నట్లు పరిశోధక సంస్థ ‘టూరిజం ఎకనామిక్స్’ అంచనా వేసింది. ఈ మేరకు ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. పర్యాటక రంగం ఈ ఏడాది 9 శాతం వృద్ధి చెందనున్నట్లు ఇదే సంస్థ గతంలో అంచనా వేయడం గమనార్హం. → ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్‌లు, వాణిజ్య యుద్ధంతో పర్యాటకానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఏడాది టూరిజంపై జనం చేసే ఖర్చు 18 బిలియన్ డాలర్లు తగ్గనున్నట్లు అంచనా. → అమెరికా పర్యాటకానికి కెనడా ప్రజలే అతిపెద్ద వనరు. కెనడా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలను ట్రంప్ విధించడం కెనడా పర్యాటకులకు నచ్చడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కెనడా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. కొన్నిసార్లు ఇది 45 శాతంగా ఉంటోంది. → అమెరికా ప్రయాణాలకు డిమాండ్ తగ్గడంతో విమానాల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని ఎయిర్ కెనడా ప్రకటించింది. అమెరికాకు వెళ్లడానికి జనం ఆసక్తి చూపడం లేదని వెల్లడించింది. → అమెరికాకు ఇప్పటికే ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నవారిలో 36 శాతం మంది వాటిని రద్దు చేసుకున్నారని కెనడియన్ మార్కెట్ రీసెర్చర్ ‘లెగర్’ తెలియజేసింది. → గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కెనడా నుంచి అమెరికాకు ప్యాసింజర్ బుకింగ్‌లు 70 శాతం పడిపోయాయని ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ ‘ఓఏజీ’ ప్రకటించింది. → పర్యాటకుల రాక తగ్గుతుండడం పట్ల యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. కెనడా నుంచి పర్యాటకుల సంఖ్య 10 శాతం తగ్గినా 2.1 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని స్పష్టంచేసింది. 1.40 లక్షలు ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. → అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం మారిపోయిందని, పర్యాటకులకు అది అనువుగా లేదని విదేశీయులు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులు, వలసదార్లతోపాటు స్వలింగ వివాహాల పట్ల ట్రంప్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్లడం క్షేమకరం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. → పశ్చిమ యూరప్ ప్రజల్లో ట్రంప్ ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల ఒక సర్వేలో బ్రిటన్‌లో 53 శాతం, జర్మనీలో 56 శాతం, స్వీడన్లో 63 శాతం, డెన్మార్క్‌లో 74 శాతం మంది ట్రంప్ సర్కారుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాపై ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం 2016 తర్వాత ఇదే మొదటిసారి. → అమెరికాకు పొరుగు దేశం మెక్సికో నుంచి కూడా అధికంగా టూరిస్టులు వస్తుంటారు. ట్రంప్ తొలి హయాంలో మెక్సికో టూరిస్టుల సంఖ్య బాగా తగ్గడం గమనార్హం. అప్పుడు మెక్సికో నుంచి విమాన ప్రయాణాలు 3 శాతం తగ్గాయి. 2025లో కూడా 2024తో పోలిస్తే ఇప్పటికే 6 శాతం తగ్గాయి. → అమెరికాకు వెళ్తే అరెస్టయ్యే, నిర్బంధానికి గురయ్యే ప్రమాదముందని చాలా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. → అమెరికాలో పర్యటన కష్టంగా మారుతోందనే ఉద్దేశంతో అంతర్జాతీయ టూరిస్టులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. బెర్ముడా హోటళ్లలో బుకింగ్‌ల కోసం ఆరా తీస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికా పర్యటనలు రద్దు చేసుకుంటున్నవారు యూరప్ దేశాలను డెస్టినేషన్‌గా ఎంచుకున్నారు. → 2026లో ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికోల్లో జరుగనుంది. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకుల్లో భయాందోళనను తొలగించడానికి అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

నిద్రపై స్క్రీన్ ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: రాత్రిళ్లు నిద్రపోయే ముందు ఎక్కువసేపు ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, టెలివిజన్ ఇలా ఏదైనా స్క్రీన్‌ను ఎక్కువసేపు చూస్తే వెంటనే చాలా మందికి నిద్రపట్టదు. చాలా సేపటి తర్వాత నిద్రలోకి జారుకుంటారు. ఈ సమస్య రానురాను శాశ్వతంగా ఉండిపోయి నిద్రలేమి సమస్యకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇన్సోమ్నియాగా పిలిచే నిద్రలేమి సమస్య బారినపడే అవకాశాలు ఏకంగా 60 శాతం అధికమవుతాయని ఈ కొత్త పరిశోధనలో తేలింది. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ఇటీవల ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకియాట్రీ’అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వేల మందిపై పరిశోధన అధ్యయనంలో భాగంగా నార్వేలో 18 నుంచి 28 ఏళ్ల వయసు ఉన్న 45,000 మందికిపైగా విద్యార్థుల రోజువారీ జీవనశైలి వివరాలను సేకరించారు. రోజూ ఏ సమయానికి నిద్రపోతారు, రాత్రిళ్లు నిద్రపోవడానికి ముందు ఎంతసేపు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్ చూస్తారు, తర్వాత ఎంతసమయానికి నిద్రపడుతుంది, వంటి ఎన్నో వివరాలను రాబట్టారు. డిజిటల్ పరికరాలను వాడేటప్పుడు సినిమాలు చూస్తారా, సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తారా వంటి వివరాలను సేకరించారు. ‘‘సోషల్ మీడియా మాధ్యమాల చూడటం కోసం వెచ్చించి సమయం, ఇతర కార్యక్రమాలను చూడటానికి కేటాయించిన సమయాల్లో పెద్ద తేడాలులేవు. ఏ రకం డివైజ్‌ను వాడారు అన్న దానికంటే అసలు ఎంత సమయం వాడారు అనేదే ఇక్కడ ప్రధానం. స్క్రీన్ ఎక్కువసేపు చూడటం వల్ల అంతసేపు నిద్రను వాయిదావేస్తున్నారు. దాంతోపాటు స్క్రీన్ వాడకం వల్ల తర్వాత సైతం నిద్రపట్టక ఇబ్బందిపడుతున్నారు. ఇలా దాదాపు 30 నిమిషాలకంటే ఎక్కువ సమయం నిద్రలోకిజారుకోవడానికి అవస్థలు పడుతున్నారు. నిద్రపట్టక మధ్యలో బెడ్ మీద నుంచి లేచి వచ్చి కొద్దిసేపు అటూ ఇటూ నడవడం లాంటివి చేస్తున్నారు’’అని నార్వేనియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పరిశోధకుడు, పరిశోధనలో కీలక సభ్యుడు గన్హీల్డ్ జాన్సన్ హెజెట్ల్యాండ్ చెప్పారు. రోజంతా ఇబ్బంది ‘‘ఇలా రాత్రిళ్లు స్క్రీన్ చూసి నిద్రపట్టక కాస్త ఆలస్యంగా నిద్రపోయిన వారు తెల్లారాక సైతం ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నాణ్యమైన నిద్రలేకపోవడంతో తదుపరి రోజంతా దైనందిన జీవిత పనులను సవ్యంగా చేసుకోలేకపోతున్నారు. అధిక స్క్రీన్ వినియోగం అనేది నాలుగు రకాలుగా ఇబ్బందులు పెడుతోంది. తరచూ నోటిఫికేషన్లు టింగ్ టింగ్‌మని వస్తూ నిద్రను పాడుచేస్తాయి. నిద్రపోయే సమయాన్ని స్క్రీన్టైమ్ అనేది మింగేస్తోంది. స్కీన్చూసినంతసేపు నిద్రపోలేని పరిస్థితి ఉండటంతో ఆమేరకు నిద్ర తగ్గుతోంది. అంతసేపు స్కీన్ నుంచి వచ్చే కాంతి ప్రభావానికి లోనవడంతో శరీరంలోని జీవగడియారం సైతం సరిగా పనిచేయదు’’అని జాన్సన్ వివరించారు.ఎన్నో సమస్యలుస్క్రీన్ టైమ్ కారణంగా నిద్ర మాత్రమే తగ్గి కేవలం ఇన్సోమ్నియా బారిన పడతామని భావించకూడదు. అది రోజువారీ జీవితంపైనా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యం మెల్లగా దెబ్బతింటుంది. విద్యా ప్రమాణాలు పడిపోతాయి. సగటున 24 నిమిషాల నిద్రాకాలం తగ్గిపోతుంది. మొత్తంగా విద్యా, ఆరోగ్యం, మానసిక సంబంధ స్థాయిలు దిగజారుతాయి. ఈ సమస్యలు శాశ్వతంగా ఉండకూడదంటే నిద్రకు ఉపక్రమించడానికి కనీసం గంటముందే స్క్రీన్‌ను చూడటం ఆపేయాలి. స్మార్ట్‌ఫోన్‌లో హోమ్‌పేజీపై నోటిఫికేషన్లు కనపడకుండా డిజేబుల్ చేయాలి’’అని జాన్సన్ సూచించారు.

పొమ్మనకుండా పొగ.. సీనియర్లకు లోకేశ్ సెగ
టీడీపీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరికీ వరుసగా తలుపులు మూసుకుపోతున్నాయి. మంత్రి లోకేశ్ అభీష్టం మేరకు.. తనకు బాగా సన్నిహితులైనవారిని కూడా సీఎం చంద్రబాబు దూరం పెట్టేస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, కంభంపాటి రామ్మోహనరావు వంటి వారిని ఇప్పటికే దాదాపు రిటైర్ చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాగంటి బాబు వంటి పలువురు నేతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్నా కొందరి పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు పారీ్టలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధిమిగిలిన సీనియర్లకూ అదే గతి..చంద్రబాబు సమకాలీకుడైన అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారనే సాకుతో ఆయనకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కేంద్ర మంత్రిగా, రాష్ట్రంలో పలుసార్లు మంత్రిగా పనిచేసిన అశోక్ అనుభవం, రాజకీయ నైపుణ్యాలను పట్టించుకోలేదు. దీంతో ఆయన ఇప్పుడు పారీ్టకి దూరంగా ఉంటున్నారు. అదితి కుమార్తె ఎమ్మెల్యేగా విజయనగరానికి పరిమితమయ్యారు.⇒ కంభంపాటి రామ్మోహనరావు ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఢిల్లీలో చంద్రబాబు తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు అవసరం లేకపోవడంతో కంభంపాటి ప్రాధాన్యత తగ్గిపోయింది. మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆయన ప్రయత్నించినా పరిగణనలోకి తీసుకోలేదు.⇒ గోరంట్ల బుచ్చయ్యచౌదరి చిరకాల స్వప్నం మంత్రికావడం. కానీ, క్యాబినెట్లోకి తీసుకోలేదు. సొంత నియోజకవర్గంలో ఆయన చెప్పినవారికి పోస్టింగ్‌లూ ఇవ్వడం లేదు. ⇒ మాజీ హోం మంత్రి చినరాజప్పదీ ఇదే పరిస్థితి. ఉమ్మడి పశ్చిమలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాగంటి బాబుకు అసలు సీటే ఇవ్వలేదు. ఇలా టీడీపీలో చాలామంది సీనియర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ⇒ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్లకు లోకేశ్ జమానాలో తమకు అవకాశాలు వస్తాయా? అనే అనుమానాలు బలంగా మెదులుతున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో బలమైన హామీలు పొందిన పిఠాపురం వర్మ వంటివారికీ నిరాశా నిస్పృహలు తప్పడం లేదు.యనమల.. సాగనంపారిలా..టీడీపీలో అత్యంత సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవినీతి వ్యవహారాలపై లీకులిచి్చ.. తద్వారా యనమల రాజకీయ భవిష్యతుకు చంద్రబాబు తెరదించారనే తీవ్ర చర్చ పార్టీ ముఖ్యుల్లో జరుగుతోంది. 2 నెలల కిందట రాజ్యసభకు వెళ్లే చాన్స్‌ను, 2 వారాల కిందట ఎమ్మెల్సీగా కొనసాగించడానికి వచి్చన అవకాశాన్ని నిరాకరించి రామకృష్ణుడికి దారులను శాశ్వతంగా మూసేయడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారనేది పరిశీలకుల విశ్లేషణ.తన కూతురు దివ్య, అల్లుడు వెంకట గోపీనాథ్ అవినీతిని సాకుగా చూపి.. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదిపారని యనమల తన అంతరంగీకుల వద్ద వాపోతున్నారని సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు ముందు దివ్య, గోపీనాథ్ అవినీతిపై ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. దివ్య తొలిసారి ఎమ్మెల్యే అయినా అవినీతి, అక్రమాలలో స్మార్ట్‌గా దూసుకుపోతూ తన పేరు బయటకు పొక్కకుండా అనుభవజు్ఞరాలిగా సెట్ చేసుకుంటున్నారంటూ పరోక్షంగా రామకృష్ణుడిని తాకేలా తూర్పారపట్టారు. స్వపక్షీయులకు చెందిన మద్యం షాపులు, బెల్టు షాపులు, అనుమతుల్లేని బార్లు, పేకాట క్లబ్బుల నిర్వాహకుల ద్వారా నెలకు రూ.కోటి, మట్టి, గ్రావెల్ దందా ద్వారా రూ.రెండు కోట్లు వెనకేసుకుంటున్నారని, తుని సమీపంలో విమానాశ్రయం ప్రతిపాదనలో భాగంగా 700 ఎకరాలలో సుమారు 300 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్‌కు గాను ఇప్పటికే రూ.12 కోట్లు వెనకేసుకున్నారనేది పబ్లిక్ టాక్. రామకృష్ణుడు, దివ్య ఎక్కడా సీన్లో కనిపించకుండా వారి దగ్గరి బంధువు యనమల రాజేష్ ద్వారా అన్నీ నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఐఆర్ఎస్ అధికారైన దివ్య భర్త వెంకట గోపీనాథ్ ప్రతి శని, ఆదివారాలు తునిలో ఉంటూ అవినీతికి మార్గ నిర్దేశం చేస్తున్నారని చెబుతున్నారు. 2014–19 మధ్య డిప్యుటేషన్‌పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పని చేసినప్పుడు నిధులు దారిమళ్లించడంతో పాటు అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. యనమలను పక్కన పెట్టేయడంలో బాబు, లోకేశ్ తప్పులేదని సమర్థించుకునేందుకు ఇప్పటికీ టీడీపీ అనుకూలురు, వారి సోషల్ మీడియాలో పై అంశాలతో కూడిన వీడియోలు హల్చల్ చేయిస్తుండటం గమనార్హం. యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, మరో కుమార్తె భర్త పుట్టా మహే‹Ùయాదవ్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తుచేస్తూ.. పార్టీ ఏమైనా యనమల కుటుంబ ప్యాకేజీనా అనే కామెంట్లను టీడీపీ వారిచేతే గుప్పిస్తున్నారు. ఇక పార్టీ ఉన్నత స్థాయి ప్రణాళికల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే అనుమానాలు యనమల వర్గీయుల్లో బలంగా ఉన్నాయి.

పోలవరంపై పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: పోలవరం నిర్మాణంలో తాను చేసిన చారిత్రక తప్పిదాలు, విధ్వంస కాండను కప్పిపుచ్చుకుంటూ.. గోదారమ్మ సాక్షిగా.. ప్రాజెక్టు వేదికగా సీఎం చంద్రబాబు మార్చి 27న మరోసారి అసత్యాలను వల్లించారు. ఎద్దు ఈనిందంటే.. దూడను గాటికి కట్టేయడానికి తాడు తెచ్చిన రీతిలో ‘గాడిన పడిన పోలవరం ప్రాజెక్టు’ శీర్షికన ‘ఈనాడు’ సోమవారం పచ్చి అబద్ధాలు అచ్చేసింది. అసలు వాస్తవాలు ఇవీ..⇒ తెలుగు ప్రజల దశాబ్దాల కల పోలవరాన్ని సాకారం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. 2009 నాటికే రూ.5,298.71 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. రిజర్వాయర్, కుడి, ఎడమ కాలువలకు అవసరమైన లక్ష ఎకరాలకుపైగా భూమిని సేకరించారు. కుడి కాలువలో 95 శాతం, ఎడమ కాలువలో 70 శాతం పనులను పూర్తి చేశారు.⇒ కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్ల దాహంతో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016లో సీఎం చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం అంటే.. 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు నీటి పారుదల విభాగం వ్యయంలో మిగిలిన రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం విధించిన షరతుకు అంగీకరించారు. ఆ మేరకే నిధులు ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానించింది. నిజానికి పోలవరం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు వ్యయం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆదిలోనే పోలవరాన్ని చంద్రబాబు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినట్లు స్పష్టమవుతోంది.⇒ గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండా.. నదికి అడ్డంగా నిర్మించాల్సిన ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్ల పొడవున పునాది డయాఫ్రం వాల్ పనులను 2016 నవంబర్‌లో చంద్రబాబు చేపట్టారు. 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. 2017, 2018లో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో.. ఆ వరద ఉద్ధృతికి కోతకు గురై దెబ్బతిందని ఇటీవల కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నియమించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) తేల్చి చెబుతూ నివేదిక ఇచ్చింది. దీన్ని బట్టి పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం సృష్టించింది చంద్రబాబేనన్నది స్పష్టమవుతోంది. ⇒ 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వెంటనే ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేసేలా అడుగులు వేశారు. ఈ క్రమంలో పీపీఏ ఆదేశాల మేరకు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి.. చేసిన పనులకు రక్షణ చర్యలను అధికారులు చేపట్టారు. రామోజీరావు సమీప బంధువుకు చెందిన నవయుగకు నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టిన రూ.2,917 కోట్ల పనులను నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రద్దు చేశారు. ఆ సంస్థకే సీఎం చంద్రబాబు కట్టబెట్టిన జలవిద్యుత్కేంద్రం పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడంతో ఆ కాంట్రాక్టును రద్దు చేసి.. రెండు పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఖజానాకు రూ.838.5 కోట్లను ఆదా చేశారు. ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే మరోవైపు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి 2021 జూన్ 11న స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. జలవిద్యుత్కేంద్రం పనులను పరుగులెత్తించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంలను పూర్తి చేశారు. సీడబ్ల్యూసీ అదనంగా ప్రతిపాదించిన పనులను పూర్తి చేశారు. జలాశయంతో కుడి, ఎడమ కాలువను అనుసంధానం చేసే కనెక్టివిటీస్ పనులను కొలిక్కి తెచ్చారు. చంద్రబాబు సర్కారు చేసిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దారు. ⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీని అనేక మార్లు నాడు సీఎం వైఎస్ జగన్ కోరారు. పోలవరం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు అవసరమని.. అలాంటిది 2013–14 ధరల ప్రకారం రూ.15,667.90 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదని వివరించారు. వీటిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ⇒ డయాఫ్రం వాల్ సహా వరదలకు దెబ్బతిన్న పనులను పునరుద్ధరించేందుకు రూ.2 వేల కోట్లు, తొలిదశ పనుల పూర్తికి రూ.పది వేల కోట్లు వెరసి.. రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ సిద్ధం చేశారు. ప్రాజెక్టును తొలి దశలో పూర్తి చేయడానికి మిగిలిన పనులకు రూ.12,157 కోట్లు.. ఆ తర్వాత రెండో దశ పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని 2024, ఫిబ్రవరి 29న ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు(పీఐబీ) కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్డీఏలో చేరిన చంద్రబాబు ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయకుండా మోకాలడ్డారు. ⇒ 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేసేందుకు రూ.12,157 కోట్లను మంజూరు చేస్తూ 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ప్రాజెక్టులో నీటి నిల్వను 194.6 టీఎంసీల నుంచి 115.44 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసేలా ఎత్తును తగ్గించారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాల్లో కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడం సాధ్యమవుతుంది. దీన్ని బట్టి పోలవరానికి చంద్రబాబు మళ్లీ ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో పోలవరాన్ని గాడిలో పెట్టడం.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్.. ఇక గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడం వల్లే 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ లక్ష్యంగా నిర్దేశించిందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

చిన్న షేర్ల జోష్
తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 5 శాతం లాభపడింది. అయితే అత్యధిక శాతం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో చిన్న షేర్ల ఇండెక్స్ బీఎస్ఈలో 8 శాతం పురోగమించింది. ఇందుకు ప్రధానంగా మార్చి నెల మద్దతిచ్చింది.న్యూఢిల్లీ: పలు ఆటుపోట్ల మధ్య 2024–25లో స్టాక్ మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 3,764 పాయింట్లు(5.1 శాతం) పుంజుకోగా.. బీఎస్ఈలో స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3,472 పాయింట్లు(8 శాతం) ఎగసింది. ఈ బాటలో మిడ్‌క్యాప్ సైతం 2,209 పాయింట్లు(5.6 శాతం) వృద్ధి చెందింది. ఇందుకు ప్రధానంగా మార్చి నెల దన్నుగా నిలిచింది. గతేడాది అక్టోబర్ నుంచి అమ్మకాల బాట పట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత నెలలో ఉన్నట్టుండి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడంతో మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ సాధించాయి. దీంతో పూర్తి ఏడాదికి లాభాలతో నిలిచాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం మిడ్, స్మాల్‌క్యాప్ కౌంటర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నష్టాలకు చెక్ గతేడాది అక్టోబర్ మొదలు వరుసగా 5 నెలలపాటు నష్టాలతో ముగిసిన మార్కెట్లు గత నెలలో బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. తద్వారా గతేడాది నికరంగా లాభాలతో నిలిచినట్లు లెమన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకులు సతీష్ చంద్ర ఆలూరి పేర్కొన్నారు. ప్రధానంగా మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు మార్కెట్లను మించి బలపడినట్లు తెలియజేశారు. అందుబాటు విలువలకు చేరిన పలు షేర్లకుతోడు దేశీయంగా నెలకొన్న ఆశావహ పరిస్థితులు, ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఇందుకు కారణమైనట్లు వివరించారు. దీంతో ప్రస్తుతం చరిత్రాత్మక సగటులకు పలు కౌంటర్లు చేరినట్లు అభిప్రాయపడ్డారు. ఈక్విటీల విలువలు ఖరీదుగా మారడంతో అక్టోబర్ నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లు ‘బేర్’ ట్రెండ్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌పీఐలు పెట్టుబడులవైపు మళ్లడంతోపాటు.. భారీ సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నష్టాలనుంచి బయటపడినట్లు నిపుణులు తెలియజేశారు. ఇది చివరికి మార్కెట్లు సానుకూల ధోరణిలో ముగిసేందుకు దోహదం చేసినట్లు వివరించారు. ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో వడ్డీ రేట్ల కోత సంకేతాలు ఇవ్వడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రీమియం విలువల ఎఫెక్ట్ నిజానికి బుల్ మార్కెట్లలో ప్రధాన ఇండెక్సులతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా ర్యాలీ చేయవలసి ఉన్నట్లు హైబ్రో సెక్యూరిటీస్ వ్యవస్థాపకులు తరుణ్ సింగ్ పేర్కొన్నారు. గతేడాది చిన్న షేర్ల ఇండెక్సులు రెండంకెల స్థాయిలో వృద్ఢి చూపకపోవడానికి మార్కెట్ల ర్యాలీ చాలా ముందుగానే ప్రారంభంకావడంతో షేర్ల ధరలు భారీగా పెరిగాయని, ఇందుకు తగిన స్థాయిలో కంపెనీల పనితీరు లేకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపరచిందని వివరించారు. గత రెండు త్రైమాసికాలలో అంచనాలకంటే దిగువన వెలువడిన ఫలితాలు షేర్ల ప్రీమియం ధరలకు మద్దతివ్వలేకపోయినట్లు తెలియజేశారు. మరోవైపు యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ భారత్‌సహా పలు దేశాలపై ప్రతీకార టారిఫ్‌లకు తెరతీయడం సెంటిమెంటును బలహీనపరచినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పాల్క అరోరా చోప్రా పేర్కొన్నారు. సరికొత్త రికార్డులు గతేడాది(2024) సెప్టెంబర్ 27న సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టం 85,978 పాయింట్లను అధిగమించగా.. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ అదేనెల 24న 49,701ను తాకి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో స్మాల్‌క్యాప్ సైతం 2024 డిసెంబర్ 12న 57,828 పాయింట్ల వద్ద లైఫ్‌టైమ్ గరిష్టానికి చేరింది. నిజానికి బ్లూచిప్స్ లేదా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎఫ్‌పీఐలు అత్యధికంగా కొనుగోలు చేస్తే.. రిటైలర్లు చిన్న షేర్లపట్ల ఆకర్షితులవుతుంటారని విశ్లేషకులు వివరించారు. అయితే ఇకపై ఆయా కంపెనీల ఫలితాల ఆధారంగా స్టాక్ విలువలు సర్దుబాటుకానున్నట్లు తెలియజేశారు. కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశీ ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిస్థితులు, మార్కెట్ల ట్రెండ్‌సహా దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు, ప్రభుత్వ, ప్రయివేట్ పెట్టుబడులు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు వివరించారు.మార్చిలో బూస్ట్ఎఫ్పీఐలు, రిటైలర్ల పెట్టుబడుల దన్నుతో ఒక్క మార్చి నెలలోనే మార్కెట్లు భారీగా టర్న్అరౌండ్ అయ్యాయి. సెన్సెక్స్ 4,217 పాయింట్లు(5.8 శాతం) ఎగసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3,555 పాయింట్లు(8.3%) జంప్‌చేస్తే, మిడ్‌క్యాప్ 2,939 పాయింట్లు(7.6%) బలపడింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీయంగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, విధానాల కొనసాగింపుపై అంచనాలు ఇన్వెస్టర్లలో మార్కెట్లపట్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా గతేడాది పలు ఆటుపోట్ల మధ్య మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి.

పేదల ‘ఉపాధి’కి మళ్లీ ‘ఫాం పాండ్స్’ గండం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఉపాధి హామీ పథకంపై కూటమి కుట్రలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. గత టీడీపీ హయాంలో వివాదాస్పదమైన విధానాలే మళ్లీ ఊపిరిపోసుకుంటున్నాయి. ఇదే జరిగితే తమ ‘ఉపాధి’కి దెబ్బేనని కూలీలు కలవరపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సొంత పొలాల్లో మళ్లీ ఫాం పాండ్స్ నిర్మాణం చేపట్టడమే వీరి ఆందోళనకు కారణం. ఇలా అయితే కోట్లాది రూపాయలు తేలిగ్గా దండుకోవచ్చని పాలకుల పన్నాగం. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేపట్టే చెరువుల పూడికతీత పనులను తగ్గించి ఈ వేసవిలో రైతుల సొంత పొలాల్లో ఫాం పాండ్స్ (పంట కుంటల) పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014–19 మధ్య దాదాపు రూ.మూడున్నర వేల కోట్లతో సుమారు 9 లక్షల ఫాం పాండ్స్ నిర్మాణాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టి తీవ్ర విమర్శలపాలైంది. ఇప్పుడు వాటిలో 10–20 శాతం (అంటే రెండు లక్షలైనా) కూడా కనిపించవేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. అయినా, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ అదే పంథా అనుసరిస్తోంది. ఈ వేసవిలో ఉపాధి హామీ పథకం కింద అప్పట్లాగే రెండున్నర లక్షల ఫాం పాండ్స్ నిర్మించాలని గ్రామీణాభివృద్ధి శాఖాధికారులకు ఆదేశాలిచ్చింది. ముందుగా.. రూ.900 కోట్లతో 1.40 లక్షల ఫాం పాండ్స్‌ను రైతు పొలాల్లో తవ్వుకునేందుకు అనుమతులిచ్చేశారు. మూడునెలల పాటు గ్రామాల్లో దీనినే మొదటి ప్రాధాన్యతగా భావించాలని ప్రభుత్వం సూచించింది. ఫాం పాండ్స్ అంటేనే అవినీతి.. పది మీటర్ల పొడువు, పది మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు చొప్పున ఒక్కో ఫాం పాండ్ నిర్మాణంలో సరాసరి 200 మంది కూలీలు పనిచేయడం ద్వారా వారికి రూ.50 వేల చొప్పున వేతనాలు చెల్లించేలా అధికారులు అంచనాలు సిద్ధంచేశారు. మరో రూ.10 వేలు చొప్పున ఒక్కో ఫాం పాండ్స్‌కు మెటీరియల్ కేటగిరిలో నిధులు అందజేసే అవకాశముంది. అయితే, 200 మంది కూలీలతో తవ్వే ఫాం పాండ్స్‌ను పొక్లెయిన్‌తో తవ్వితే కేవలం రూ.ఐదారు వేలతో పూర్తవుతుంది. దీంతో ఈ పనుల్లో భారీ అవినీతికి అస్కారం ఉందని.. గత చరిత్ర ఇదే చెబుతోందని పలువురు అధికారులు గుర్తుచేస్తున్నారు. ఎందుకంటే.. అప్పట్లో కూలీల ద్వారా తవ్వించాల్సిన ఫాం పాండ్స్‌ను పొక్లెయిన్‌తో తవ్వించి.. తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కూలీల జాబితాను రూపొందించి దానిని స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చి కూలీల వేతనాల పేరుతో ఉపాధి హామీ నిధులను దండుకున్నారని విమర్శలు వచ్చాయి.ఫాం పాండ్స్‌తో పేదలకు దెబ్బేఈ వేసవిలో ఫాం పాండ్స్ పనులకే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల తమ ఉపాధికి గండిపడుతుందని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తంలో రాష్ట్రంలో ఏడాది పాటు ఉపాధి హామీ పథకం ద్వారా 15 కోట్ల పనిదినాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతులిచ్చింది. అయితే, ఇందులో గ్రామాల్లో పనులు దొరకని ఈ వేసవి మూడునెలల కాలంలో 12 కోట్ల పనిదినాల పనుల కల్పనకు అవకాశముండగా, 3–4 కోట్ల పనిదినాలు కేవలం ఫాం పాండ్స్ పనులకే కేటాయించే అవకాశముంది.దీనివల్ల కూటమి నేతలు పొక్లెయిన్ల ద్వారా తవ్వించేసి దొంగ మస్తర్లతో పేదల ఉపాధికి గండికొట్టే ప్రమాదముంది. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి పనుల కల్పనలో తీసుకొచ్చిన మార్పులతో వ్యక్తిగతంగా కాకుండా శ్రమశక్తి సంఘాల వారీగా పనులను కేటాయిస్తున్నారు. ఇది అధికార పార్టీ నేతలకు మరింత మేలు చేసింది. వీరికి అనుకూలంగా ఉండే శ్రమశక్తి సంఘాల పేరుతో ఫాంపాండ్, తవ్వినట్టుగా రికార్డుల్లో చూపించి, పొక్లెయిన్లతో తవ్వించేయడానికి మార్గం వేసింది. దీనివల్ల పనులు దొరక్క తాము పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు.
నిధుల మళ్లింపు కేసులో దోషిగా తేలిన పెన్
వాటర్ డ్రోన్ పరీక్ష సక్సెస్
ఇది నా ఆన.. తోడేసుకోనీయండి
ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?
రేపు ఉపాధ్యాయుల రాష్ట్ర వ్యాప్త ధర్నా
5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది
ఆరు జిల్లాల్లో కరువు
విజయవాడ హైవేపై తగ్గాయి.. మిగతా చోట్ల పెరిగాయి
ఈసారి ఎండలు ఎక్కువే!
స్కూల్ యూనిఫాం.. ఇక పక్కా కొలతలు
కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..
ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?
'కంచె'.. గర్జించె..
ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్?
ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం..
..అణుబాంబులేద్దాం సార్! సందర్భోచితంగా ఉంటుంది.!!
రికెల్టన్, సూర్య మెరుపులు.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్
తెల్లవారితే మారే రూల్స్ ఇవే!
మండే ఎండలతో ముప్పు తోటల సంరక్షణ ఎలా?
నేడు టెన్త్ సోషల్ పరీక్ష
నిధుల మళ్లింపు కేసులో దోషిగా తేలిన పెన్
వాటర్ డ్రోన్ పరీక్ష సక్సెస్
ఇది నా ఆన.. తోడేసుకోనీయండి
ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?
రేపు ఉపాధ్యాయుల రాష్ట్ర వ్యాప్త ధర్నా
5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది
ఆరు జిల్లాల్లో కరువు
విజయవాడ హైవేపై తగ్గాయి.. మిగతా చోట్ల పెరిగాయి
ఈసారి ఎండలు ఎక్కువే!
స్కూల్ యూనిఫాం.. ఇక పక్కా కొలతలు
కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..
ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?
'కంచె'.. గర్జించె..
ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్?
ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం..
..అణుబాంబులేద్దాం సార్! సందర్భోచితంగా ఉంటుంది.!!
రికెల్టన్, సూర్య మెరుపులు.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్
తెల్లవారితే మారే రూల్స్ ఇవే!
మండే ఎండలతో ముప్పు తోటల సంరక్షణ ఎలా?
నేడు టెన్త్ సోషల్ పరీక్ష
సినిమా

కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. 'నాయాల్దీ' వచ్చేసింది!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. నాయాల్ది అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘు రామ్ లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, సోనీ కొమండూరి ఆలపించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆ స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి.. నిజంగానే జరిగితే?
టాలీవుడ్లో రెబల్ స్టార్ పెళ్లి గురించి చర్చ ఇప్పటి నుంచి మొదలైంది కాదు. గత పదేళ్లుగా ఏదో ఒక సందర్భంలో ప్రభాస్ పెళ్లి ముచ్చట వినిపిస్తూనే ఉంటుంది. అలా మరోసారి ఇటీవలే ప్రభాస్ పెళ్లి లొల్లి మొదలైంది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని ఆయన పెళ్లాడబోతున్నారని టాక్ వచ్చింది. కానీ ఈ విషయంపై ఆరా తీస్కే అదంతా ఒట్టి పుకారే తేలిపోయింది. ఈ విషయంపై ఆయన టీమ్ సైతం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలేనని కొట్టిపారేసింది.ఇక ప్రభాస్ అన్న పెళ్లి ముచ్చట వచ్చినప్పుడల్లా ఆ స్టార్ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరు జంటగా పలు సూపర్ హిట్ మూవీల్లో నటించారు. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క శెట్టి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇదేది అంత ఈజీగా అయ్యే పనిలా మాత్రం కనిపించడం లేదు. అందుకే ఓ నెటిజన్ వినూత్న ఆలోచనతో ఓ వీడియోను రూపొందించాడు. అది చూస్తే ఈ జంట ఇంత చూడముచ్చటగా ఉన్నారా? అంటూ కామెంట్స్ చేయకుండా ఉండలేరు. అంతలా ఎడిట్ చేసిన ఓ నెటిజన్ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూసేద్దాం పదండి.నెటిజన్ ఎడిట్ చేసిన ఫోటోలతో ప్రభాస్- అనుష్క శెట్టికి పెళ్లైనట్లు ఊహించుకుని ఓ వీడియోను రూపొందించాడు. పెళ్లి మాత్రమే కాదు.. ఈ జంటకు పిల్లలు పుడితే ఎలా ఉంటారో కూడా ఊహించి మరీ ఫోటోలు ఎడిట్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. అలా ఎడిట్ చేసిన ఫోటోలు చూస్తే ప్రభాస్- అనుష్క జోడీ టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసి ఊహల్లో విహరించండి.Entraa idi entha realistic ga undi 🫠 pic.twitter.com/7JG14Sf4kC— x_tweet's 🌅 (@MididoddiSai1) March 31, 2025

ఓటీటీలోకి ఖుషీ కపూర్ డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అతిలోక సుందరి శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి జాన్వీ కపూర్ హీరోయిన్ గా సెట్ అయిపోయింది. రెండో కూతురు ఖుషీ కపూర్ మాత్రం కష్టపడుతూనే ఉంది. ఇప్పటికే మూడు సినిమాలు చేయగా.. అవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ఈమె లేటెస్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)రీసెంట్ టైంలో 'లవ్ యాపా' మూవీలో ఖుషీ కపూర్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాతోనే ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. 'లవ్ టుడే' హిందీ రీమేక్ ఇది. కంటెంట్ మంచిదే కానీ ఖుషీ-జునైద్ ఇద్దరికి ఇద్దరు పసలేని యాక్టింగ్ చేయడంతో మూవీ డిజాస్టర్ అయింది. రూ.60 కోట్లు పెడితే రూ.10 కోట్ల వసూళ్లు వచ్చాయి.ఇకపోతే లవ్ యాపా మూవీ ఏప్రిల్ 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దాదాపు రెండు నెలల తర్వాత రిలీజ్ అవుతుంది. థియేటర్లలో రిలీజైనప్పుడే ఖుషీ నటనపై విమర్శలు వచ్చాయి. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఖుషీ యాక్టింగ్ ని ఇంకెంత ట్రోలింగ్ చేస్తారో?(ఇదీ చదవండి: లంక మాజీ క్రికెటర్ తో 51 ఏళ్ల మలైకా డేటింగ్?)

యాంకర్ ప్రదీప్ కొత్త సినిమా.. రిలీజైన ట్రైలర్
తెలుగులో కొన్నేళ్ల పాటు పాపులర్ యాంకర్ గా కొనసాగిన ప్రదీప్ మాచిరాజు.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో గతంలో హీరోగానూ నటించాడు. కానీ హిట్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు యాంకరింగ్ ని పక్కనబెట్టి మరో మూవీలో హీరోగా నటించాడు. అదే 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)ట్రైలర్ బట్టి చూస్తుంటే సివిల్ ఇంజినీరింగ్ చేసిన ఓ కుర్రాడు.. ఊహించని విధంగ ఓ పల్లెటూరికి వెళ్తాడు. ఆ ఊరిలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు? ఇందులో హీరోయిన్ పాత్రేంటి? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ లో కామెడీ పర్లేదనేలానే ఉంది. ఏప్రిల్ 11న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రదీప్ సరసన దీపిక పిల్లి హీరోయిన్ కాగా.. నితిన్-భరత్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. మరి ఈ సారైనా ప్రదీప్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ నిర్మాత కన్నుమూత)
న్యూస్ పాడ్‌కాస్ట్

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు మాయం... దాదాపు 2 లక్షల మేర తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య
క్రీడలు

రికెల్టన్, సూర్య మెరుపులు.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. రోహిత్ శర్మ(13) మరోసారి నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. నాలుగేసిన అశ్వినీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి కేవలం 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో అరంగేట్ర పేసర్ అశ్వినీ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. దీపక్ చాహర్ రెండు, బౌల్ట్, శాంట్నర్, హార్దిక్, విఘ్నేష్ తలా వికెట్ సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(26) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IPL 2025: ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్?

ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్?
ముంబై ఇండియన్స్ మరో యువ సంచలానాన్ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ పేస్ బౌలర్ అశ్వనీ కుమార్.. తన తొలి మ్యాచ్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అశ్వనీ కుమార్ నిప్పలు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటర్లను చుక్కలు చూపించాడు. రహానే, రింకూ సింగ్, రస్సెల్ వంటి స్టార్ బ్యాటర్లను ఈ యువ పేసర్ బోల్తా కొట్టించాడు. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేసి తన డెబ్యూను ఘనంగా చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్వినీ కుమార్.. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఎవరీ అశ్వినీ కుమార్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ అశ్వినీ కుమార్..?అశ్వనీ కుమార్ పంజాబ్‌కు చెందిన ఎడమచేతి వాటం పేసర్. 23 ఏళ్ల అశ్వనీ కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పంజాబ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడికి అద్భుతమైన యార్కర్లు, బౌన్సర్లు వేసే సత్తా ఉంది. డెత్ బౌలింగ్‌లో కూడా అతడు రాణించగలడు. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన షేర్ ఈ పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్వనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ సౌట్ల దృష్టిలో పడ్డాడు. ఈ టోర్నీలో డెత్ బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్వని కుమార్‌ను ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గత ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అశ్విని కుమార్ 2022లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున టీ20 అరంగేట్రం చేశాడు. ఆ టోర్నీలో 4 టీ20లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్వనీ పంజాబ్ తరపున 2 ఫస్ట్-క్లాస్, 4 లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు.👉ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగిన అశ్వినీ కుమార్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా అరంగేట్రంలో ముంబై ఇండియన్స్ తరుపన తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా అశ్వినీ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో అల్జారీ జోషఫ్ ఉన్నాడు.చదవండి: PAK vs NZ: 'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు'

కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..
MI vs KKR live Updates And highlights: ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.దూకుడుగా ఆడుతున్న రికెల్టన్10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(45), విల్ జాక్స్(12) ఉన్నారు.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్(31), విల్ జాక్స్(8) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లుముంబై ఇండియన్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్(29), రోహిత్ శర్మ(13) ఉన్నారు.2 ఓవర్లకు ముంబై స్కోర్: 15/02 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(12), రికెల్టన్(1) ఉన్నారు.116 పరుగులకే 10 వికెట్లు..16.2 ఓవర్లో శాంట్నర్ బౌలింగ్‌లో రమణ్ దీప్ సింగ్ వికెట్ కోల్పోయాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 117పరుగులు చేయాల్సి ఉంది. 97 పరుగులకే 9 వికెట్లు.. హర్షిత్ రాణా ఔట్97 పరుగుల వద్ద కేకేఆర్ తన తొమ్మిదవ వికెట్‌ను కోల్పోయింది. హర్షిత్ రాణా (4) పరుగులకే ఔటయ్యాడు. విఘ్నేష్ వేసిన 14వ ఓవర్లో పెవీలియన్ బాట పట్టాడు. 88 పరుగులకే 8 వికెట్లు.. రసెల్ ఔట్88 పరుగుల వద్ద కేకేఆర్ తన ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. రసెల్(5) ఔటయ్యాడు. అశ్వనీ కుమార్ వేసిన 13 ఓవర్ లో రసెల్ పెవిలియన్ చేరాడు. అశ్వనీ కుమార్ వేసిన ఆ ఓవర్ నాల్గో బంతికి రసెల్ బౌల్డ్ అయ్యాడు.80 పరుగులకే 7 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో కేకేఆర్రింకూ సింగ్(17), మనీష్ పాండే(19)లు వరుసగా పెవిలియన్ చేరారు. అశ్వనీ కుమార్ వేసిన 11 ఓవర్ లో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. 11 ఓవర్ మూడో బంతికి రింకూ సింగ్ అవుట్ కాగా, ఆ ఓవర్ చివరి బంతికి పాండే పెవిలియన్ చేరాడు.కష్టాల్లో కేకేఆర్.. 45 పరుగులకే 5 వికెట్లు ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రఘువంశీ(26) రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రహానే.. అశ్వని కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..క్వింటన్ డికాక్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన డికాక్.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 26 పరుగులు చేసింది. క్రీజులోకి రఘువన్షి(9), అజింక్య రహానే(12) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే బిగ్‌షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సునీల్ నరైన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అజింక్య రహానే వచ్చాడు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్.

'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు'
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దారుణ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ జట్టు.. వైట్‌బాల్ సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా పాక్ జట్టు ఆటతీరు ఏ మాత్రం మారలేదు. తొలుత కివీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు వన్డే సిరీస్‌లో కూడా అదే దిశగా కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో రిజ్వాన్ సేన చతకలపడింది. లక్ష్య చేధనలో మంచి ఆరంభం లభించినప్పటికి మిడిలార్డర్ విఫలమం కావడంతో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఫిలిప్స్, కాన్వే, హెన్రి వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ జట్టులో లేనప్పటికి.. పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం గుప్పించాడు. అదేవిధంగా స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ పొజిషన్‌పై కూడా అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు."బాబర్ ఎందుకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలి?. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఓపెనింగ్ చేశాడు. చాలా మంది ఓపెనర్‌గానే బాబర్ రావాలని సూచించారు. అసలు ఎవరా క్రికెట్ ప్రొఫెసర్స్? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారి వాళ్లే బాబర్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇప్పుడు మూడో స్ధానంలో వచ్చి బాబర్ ఎలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు? క్రికెట్ ప్రొఫెసర్స్ ఇప్పుడు బయటకు వచ్చి దేశానికి క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు ఎవరూ బయటకు రారు. ఇలా క్రికెట్ ప్రొఫెసర్స్ అవ్వాలనుకునేవారిని బూట్లతో కొట్టాలి. బాబర్, రిజ్వాన్‌లను ఓపెనర్లుగా చేసిన వారే పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేశారు. పాకిస్థాన్ జట్టు ఫ్రాంచైజీ జట్టుగా మారిపోయింది" అని అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: ఏంటి పరాగ్ బ్రో ఇది.. ఎందుకంత యాటిట్యూడ్? వీడియో వైరల్
బిజినెస్

ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు
ప్రముఖ రిటైల్ కార్పొరేషన్ వాల్‌మార్ట్‌కు చెందిన ఆలిస్ వాల్టన్ 102 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.46 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలుగా నిలిచారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం వాల్‌మార్ట్ షేరు ధర పెరగడం వల్ల ఆమె సంపద గత సంవత్సరంతో పోలిస్టే 46 శాతం పెరిగింది. దాంతో 75 ఏళ్ల ఆలిస్ వాల్టన్ ప్రపంచ మహిళ కుబేరులు జాబితాలో టాప్‌లో నిలిచారు. వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె అయిన ఆలిస్ తన సోదరులు రాబ్, జిమ్ వాల్టన్ మాదిరిగా కాకుండా ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు వారసత్వంగా సమకూరిన అపారమైన సంపదను వ్యక్తిగత అభిరుచులకు, దాతృత్వం కోసం ఖర్చు చేస్తున్నారు. వాల్టన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ అండ్ వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా కంపెనీలో సుమారు 11.5 శాతం వాటాను కలిగి ఉన్నారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.వాల్టన్‌కు చిన్నతనం నుంచే కళలపట్ల ఉన్న ఇష్టంతో వాటిని సేకరించి పరిరక్షిస్తున్నారు. వాల్టన్ తన పదో ఏటే పికాసో రిన్యూవేట్ పెయింటింగ్‌ను రెండు డాలర్లకు కొనుగోలు చేశారు. ఆండీ వార్హోల్, నార్మన్ రాక్వెల్, జార్జియా ఓకీఫ్ వంటి ప్రసిద్ధ అమెరికన్ కళాకారుల ఒరిజినల్ కళాకృతులను ఆమె సేకరించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఆమె 2011లో అర్కాన్సాస్‌లోని బెంటన్విల్లేలో 50 మిలియన్ డాలర్లతో క్రిస్టల్ బ్రిడ్జెస్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఆర్ట్ అని పిలువబడే మ్యూజియంను కూడా ప్రారంభించారు. టెక్సాస్ గుర్రాల సంతానోత్పత్తి వ్యాపారంలోనూ తనకు ప్రవేశం ఉంది. ఆమె 2017లో రాకింగ్ డబ్ల్యు రాంచ్ అని పిలువబడే టెక్సాస్‌లోని గుర్రాల స్థావరాన్ని 16.5 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. ఇది 250 ఎకరాలకు పైగా పచ్చిక బయళ్లు, పశువులు, గుర్రాల పరిరక్షణ కోసం వీలుగా ఉన్న ప్రాంతం. తన సంపదను అభిరుచులు తీర్చుకోవడానికి, కళలను కాపాడేందుకు ఖర్చు చేస్తున్నారు.ఇదీ చదవండి: మరో ఆరు నెలల్లో దేశీయ తొలి మైక్రోకంట్రోలర్‌ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు, పీఏసీలకు మద్దతుగా నిలిచారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2016లో హిల్లరీ క్లింటన్ విక్టరీ ఫండ్‌కు 3,53,400 డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో వాల్టన్ మొదటిస్థానంలో నిలువగా, 67 బిలియన్ డాలర్ల సంపదతో లోరియల్‌కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్, 60 బిలియన్ డాలర్లతో కోచ్ ఇండస్ట్రీస్‌కు చెందిన జూలియా కోచ్ అండ్ ఫ్యామిలీ, 53 బిలియన్ డాలర్ల సంపదతో మార్స్‌కు చెందిన జాక్వెలిన్ మార్స్, 40 బిలియన్ డాలర్ల సంపదతో హెచ్‌సీఎల్‌కు చెందిన రోష్ని నాడార్ అండ్ ఫ్యామిలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మరో ఆరు నెలల్లో దేశీయ తొలి మైక్రోకంట్రోలర్
దేశీయంగా రూపొందిస్తున్న తొలి కమర్షియల్ మైక్రోకంట్రోలర్‌ను మరో ఆరు నెలల్లో ఆవిష్కరించే అవకాశం ఉందని చెన్నైకి చెందిన మైండ్ గ్రోవ్ టెక్నాలజీస్ సంస్థ సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీఆర్ శశ్వత్ తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోటోటైపింగ్ పూర్తి చేసి టెస్టింగ్ తర్వాత అవసరమైన డిజైన్ మార్పులు చేసినట్లు చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి చిప్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.స్మార్ట్ వాచ్‌లు, హెడ్ ఫోన్లు, కనెక్టెడ్ హోమ్ డివైజెస్ (స్మార్ట్ లాక్‌లు, స్పీకర్లు, స్మార్ట్ ఫ్యాన్లు), స్మార్ట్ సిటీ పరికరాలు (విద్యుత్, నీరు, గ్యాస్ మీటర్లు), యాక్సెస్ కంట్రోల్ పరికరాలు (బయోమెట్రిక్స్), థర్మల్ ప్రింటర్లు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలు వంటి పరికరాల్లో ఈ మైక్రోకంట్రోలర్లను ఉపయోగించనున్నారు. ఇది నిర్దిష్ట పరికరాలు లేదా అవి చేసే పనులను నియంత్రించడానికి రూపొందిస్తున్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డుల జారీ ఎలా ఉందంటే..మైక్రో కంట్రోలర్లు అవసరమయ్యే కంపెనీలతో సంస్థ ఒప్పందాలను ఖరారు చేసిన తర్వాత ఏ మేరకు ఉత్పత్తి చేయాలో నిర్ణయిస్తామని శశ్వత్ తెలిపారు. హై-పెర్ఫార్మెన్స్ ఎడ్జ్ కంప్యూటింగ్, వీడియో ప్రాసెసింగ్ అప్లికేషన్ల కోసం ఈ మైక్రోకంట్రోలర్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు. సీసీటీవీ కెమెరాలు, వీడియో రికార్డర్లు, ఎలక్ట్రానిక్ ఆటోమోటివ్ పరికరాలు, స్మార్ట్ టీవీలు.. వంటి డివైజ్‌ల్లో ఈ చిప్‌లను వాడబోతున్నట్లు పేర్కొన్నారు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద చిప్ అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి గత ఏడాది సెప్టెంబర్‌లో అనుమతి లభించిందన్నారు.

ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డుల జారీ ఎలా ఉందంటే..
దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు జారీ చేసే క్రెడిట్ కార్డుల వృద్ధి ఫిబ్రవరిలో మందగించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో సహా ప్రముఖ ఆర్థిక సంస్థలు కొత్తగా జారీ చేసే కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి ఇతర ప్రముఖ బ్యాంకులు కూడా తమ క్రెడిట్ కార్డుల జారీ తగ్గిపోయిందని ఆర్బీఐ తెలిపింది.భారతదేశ క్రెడిట్ కార్డ్ విభాగంలో అధికంగా వినియోగదారులున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిబ్రవరిలో 1,78,000 కార్డులను జోడించింది. దాంతో మొత్తం కార్డుల సంఖ్య 23.6 మిలియన్ల(2.36 కోట్లు)కు చేరంది. ఇది దేశంలో అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీదారుగా తన స్థానాన్ని సుస్థిరం చేసినప్పటికీ, వృద్ధి గత నెలతో పోలిస్తే క్షీణించింది. జనవరిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3,00,000 కొత్త కార్డులను జారీ చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన కార్డుల కంటే జనవరిలో ఇష్యూ చేసిన కార్డులు చాలా ఎక్కువ. ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కూడా ఫిబ్రవరిలో మందకొడిగానే కార్డులను జారీ చేశాయి. ఆర్బీఐ డేటాలో సదరు బ్యాంకుల నెలవారీ కార్డుల చేర్పులకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు వివరించనప్పటికీ రెండు సంస్థలు గతంలో కంటే తక్కువ కార్డులనే జోడించాయని పేర్కొంది.ఇదీ చదవండి: కొత్త లోన్ రూల్.. రేపటి నుంచే..కార్డుల జారీ మందగించడానికి కారణాలు..దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులతో సహా అన్సెక్యూర్డ్ రుణాలు పెరుగుతుండడంపై ఆర్బీఐ ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. ఇది బ్యాంకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు కారణమైంది. దాంతో కార్డుల సంఖ్య తగ్గిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అధిక ప్రొవిజనింగ్ అవసరాలు లేదా కఠినమైన నో-యువర్-కస్టమర్ (కేవైసీ) నిబంధనలు వంటి నియంత్రణ చర్యలు కూడా కార్డుల జారీని ప్రభావితం చేసిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, విచక్షణా వ్యయం(డిసిక్రీషనరీ స్పెండింగ్)లో మందగమనం వంటి ఆర్థిక ప్రతికూలతలు కూడా కార్డుల వినియోగాన్ని తగ్గిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

కొత్త విధానంలో పీపీఎఫ్‌పై ట్యాక్స్ కట్టాల్సిందేనా?
ఒక ఇన్వెస్టర్ ఒక పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను నిలిపివేసి, ఆ పెట్టుబడులను కొనసాగించినట్టయితే.. ఎక్స్పెన్స్ రేషియోని ఆ పెట్టుబడుల నుంచి వసూలు చేస్తూనే ఉంటారా? – అనిల్ మిశ్రామ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను కొనసాగించినంత కాలం వాటి విలువపై ఎక్స్పెన్స్ రేషియోని అమలు చేస్తుంటారు. ఎక్స్పెన్స్ రేషియో అన్నది మ్యూచువల్ ఫండ్ సంస్థ వసూలు చేసే వార్షిక చార్జీ. పెట్టుబడుల నిర్వహణ కోసం అయ్యే వ్యయాలు, ఇతర నిర్వహణ వ్యయాలను చార్జీల రూపంలో వసూలు చేసుకుంటాయి. వార్షిక చార్జీ అయినప్పటికీ.. దీన్ని ఏరోజుకారోజు పెట్టుబడుల విలువ నుంచి మినహాయించుకుంటాయి. మనకు రోజువారీగా మార్పునకు గురయ్యే ఫండ్ యూనిట్ల ఎన్ఏవీ తెలుసుకదా.చార్జీలను మినహాయించుకున్న తర్వాతే ఈ ఎన్ఏవీ ఖరారవుతుంది. సిప్ నిలిపివేశారంటే అప్పటి నుంచి ఆయా పథకంలో మీరు తాజా పెట్టుబడులు పెట్టరనే అర్థం. కానీ, అప్పటికే చేసిన పెట్టుబడులను ఆ ఫండ్ సంస్థ నిర్వహించాలి కదా. అందుకని తమ నిర్వహణలోని మొత్తం ఆస్తులపై (ఏయూఎం) ఎక్స్పెన్స్ రేషియోని వసూలు చేసుకుంటాయి. కాకపోతే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న పథకాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో రాబడులను మరింత వృద్ధి చేసుకోవచ్చు. నేను పన్ను ఆదా కోసం ప్రజా భవిష్యనిధి పథకంలో (పీపీఎఫ్) క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆదాయపన్నులో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలోనూ నేను పీపీఎఫ్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చా? ఈ ప్రయోజనం గరిష్టంగా ఎంత వరకు ఉంటుంది? – బల్లూ నాయక్ఆదాయపన్ను పాత విధానంలో పీపీఎఫ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే పెట్టుబడి గరిష్టంగా రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా వడ్డీ ఆదాయం, గడువు తీరిన తర్వాత చేతికి వచ్చే మొత్తంపైనా పన్ను లేదు. ఒకవేళ కొత్త పన్ను విధానాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్టయితే.. సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్‌లో చేసే పెట్టుబడులపై పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త ఆదాయపన్ను విధానం తక్కువ పన్ను రేట్లతో ఉంటుంది. ఇందులో చాలా వరకు పన్ను మినహాయింపులను తొలగించేశారు.పీపీఎఫ్‌లో పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కూడా కొత్త విధానంలో లేదు. అయితే, కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక పాత విధానమా? అన్నది మీ ఆదాయం, మినహాయింపులను ఎంత మేర క్లెయిమ్ చేసుకోగలరన్న పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. పాత పన్ను విధానంలో పీపీఎఫ్, ఇన్సూరెన్స్, గృహ రుణం చెల్లింపులు.. ఇలా అన్ని రకాల మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అదే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. కొత్త విధానం సులభతరంగా, తక్కువ పన్ను రేట్లతో ఉంటుంది.సమాధానాలు : ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
ఫ్యామిలీ

నగలు నా ఫేవరెట్ కలెక్షన్..: సూపర్‌స్టార్ మహేష్ తనయ సితార
నగలంటే నాకెంతో ఇష్టం.. నగల కలెక్షన్ నా ఫేవరెట్.. దీంతోపాటు నా పేరుతో నగలు ఉన్నాయంటే అంతకంటే ఆనందమేంటి.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు.. సూపర్‌స్టార్ మహేష్‌బాబు తనయి సితార ఘట్టమనేని. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో పంజాగుట్టలోని పీఎంజే జ్యువెలర్స్ 40వ స్టోర్‌ను తన తల్లి నమ్రతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో విభిన్న రకాల కలెక్షన్లను సితార ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను హెవీగా ఉండే జ్యువెలరీతో పాటు సందర్భాన్ని బట్టి లైట్ జ్యువెలరీని కూడా ఇష్టపడుతుంటానని చెప్పారు. తన తండ్రి మహేష్‌బాబు యాడ్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని, తాను బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. తామిద్దరం ఇంట్లో ఎలా ఉంటామో ఆ యాడ్‌లో కూడా అలాగే చేశామని సితార చెప్పుకొచ్చారు. నటి నమత్ర మాట్లాడుతూ.. సితార, తాను ఎప్పటికప్పుడు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకుంటామని చెప్పారు. ఏది నచ్చినా అది కొనేస్తుంటామని, సితార ఎక్కువగా సైలెంట్‌గా ఉండటానికి ఇష్టపడుతుందని నమత్ర తెలిపారు. (చదవండి: 'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..)

ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి
సినీ తారల కీర్తి, సంపద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉండదు. వృత్తిపరంగా వచ్చే ఆదాయంతో పాటు, ఎండార్స్మెంట్లు, ప్రకటనలు తదితర మార్గాల ద్వారా భారీ ఆదాయాన్నే సంపాదిస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్‌కి తోడు సహజంగానే అధిక భద్రత అవసరం ఉంటుంది. అందులోనూ సూపర్ స్టార్లకు మరింత రక్షణ అవసరం. వారి కుటుంబాలకు భద్రతాపరమైన ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత భద్రతకోసం తమతోపాటు పాటు వచ్చే వ్యక్తిగత అంగరక్షకులపై భారీగా ఖర్చు పెడతారు. ఒక్కో సెలబ్రిటీ బాడీగార్డ్ (Bodyguard) సంపాదన కార్పొరేట్ కంపెఈ సీఈవోలకు మించి ఉంటుంది. మరి బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?బాలీవుడ్ ప్రపంచం గ్లామర్ , స్టార్డమ్తో నిండి ఉంటుంది. అందాల ఐశ్వర్యం ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె బయటికి అడుగుపెట్టినప్పుడల్లా నిరంతరం భారీ భద్రత అవసరం. సినిమాలు, రెడ్ కార్పెట్ ప్రదర్శనల నుండి అంతర్జాతీయ ప్రయాణాల వరకు ఐశ్వర్య విశ్వసనీయ బాడీగార్డ్ శివరాజ్. ఆయన అందిస్తున్నసేవలకు నిదర్శనంగా గత కొన్నేళ్లుగా బచ్చన్ కుటుంబ భద్రతా బృందంలో కొనసాగుతున్నాడు. ఐశ్వర్యతో పాటు సినిమా సెట్లు, పబ్లిక్ ఈవెంట్లు , అంతర్జాతీయ పర్యటనలకు శివరాజ్ తోడు ఉండాల్సిందే. మరో విధంగా చెప్పాలంటే శివరాజ్ కేవలం ఒక ప్రొఫెషనల్ గార్డు మాత్రమే కాదు ఆమె కుటుంబానికి అంతకుమించిన ఆత్మీయుడు కూడా. 2015లో శివరాజ్ పెళ్లికి కూడా ఐశ్వర్య హాజరు కావడం విశేషం. ఐశ్వర్యతోపాటు ఆమె కుటుంబాన్ని రక్షించడంలో అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మరి అంతటి నమ్మకమైన అంగరక్షకుడు శివరాజ్ ఉంటే ఐశ్యర్య ఎక్కడ ఎలాంటి షోలకు, ప్రదర్శనకు వెళ్లినా నిశ్చింతగా ఉంటుందట. అంతటి నమ్మకస్తుడైన బాడీగార్డ్ శివరాజ్‌కు నెలకు దాదాపు 7 లక్షల రూపాయల వేతనం లభిస్తుందట. అంటే అతని వార్షిక జీతం సుమారు రూ. 84 లక్షలు. అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న పలువురు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల జీత ప్యాకేజీల కంటే ఈ మొత్తం ఎక్కువ. అంతేకాదు ఐశ్వర్య బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర ధోలే వార్షిక ఆదాయం రూ. కోటి వరకు ఉంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.సెలబ్రిటీ బాడీగార్డ్‌గా ఉండటం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తత, ఓర్పు ఉండాలి. క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి భంగం కలగకుండా, ఆమె రక్షణ బాధ్యతను నిర్వర్తించడం కత్తిమీద సామే. ఈ రిస్క్‌లు , బాధ్యతల నేపథ్యంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన జీతాలు లభించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.1973, నవంబరు ఒకటిన పుట్టిన ఐశ్వర్య రాయ్ 1994లో విశ్వసుందరిగా ఎంపికైంది. మోడల్‌గా, యాడ్ ఫిల్సింలో నటిస్తూ, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనేక హిట్ మూవీలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 2007 ఏప్రిల్‌లో బాలివుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడింది. వీరికి 2011, నవంబరులో కుమార్తె ఆరాధ్య పుట్టింది.

అలా స్ట్రోక్ బారిన పడటంతో ఏకంగా 14 నెలలు..!: జెరోధా సీఈవో నితిన్ కామత్
స్టాక్ ట్రేడింగ్ చేసేవారికి జెరోధా పరిచయం అక్కర్లేని పేరు. ఎందరో దీంట్లో డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసి ట్రేడింగ్ చేస్తుంటారు. ఇక జెరోధా సంస్థ సీఈఓ నితిన్ కామత్ కూడా అందరికి సుపరిచితమే. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ.. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడమే గాక పలు సలహాలు సూచనలు ఇస్తుంటారు. అలాంటి ఆయనే పాకిక్ష పక్షవాతానికి(స్టోక్) గురయ్యినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అంతేగాదు తాను కోలుకోవడానికే పద్నాలుగు నెలలు పట్టిందని అన్నారు. ఆరోగ్యం పట్ల ఇంతలా కేర్ తీసుకునేవాళ్లే స్టోక్ బారినపడితే సామాన్యుల పరిస్థితి ఏంటీ..?, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితా అంటే..ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన నితిన్ కామత్ తాను స్టోక్ అనంతరం ఎలా కోలుకుని యథావిధికి వచ్చారో షేర్చేసుకున్నారు. తాతను గతేడాది మైల్డ్ స్టోక్ బారినపడినట్లు వివరించారు. తండ్రి చనిపోవడం, నిద్రలేమి, అలసట, డీహైడ్రేషన్, అతి వ్యాయమం వంటి వాటి వల్ల ఆ పరిస్థితి ఎదురయ్యిందని పోస్ట్‌లో తెలిపారు. దాన్నంచి ఆరునెలలో కోలుకున్నా కానీ, ముఖంలో ఆ స్ట్రోక్ తాలుకా లక్షణాలు క్లియర్‌గా కనిపించేవన్నారు. ఆ తర్వాత స్పష్టంగా చదవలేకపోవడం, రాయలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నా..కానీ ఆ తర్వాత నెమ్మదిగా మళ్లీ చదవడగలగడం, రాయడం వంటి సామర్థ్యాల్ని పొందగలిగానని అన్నారు. సుమారు 14 నెలలి తన శరీరం సాధారన స్థితికి చేరుకుందని అన్నారు. ఇప్పుడు దాదాపు 85% నా మనస్సు నా వద్దే ఉందన్నారు. అలాగే మునుపటిలో మరింత మెరుగుపడేలా సాధన చేయాల్సి ఉందని కూడా చెప్పారు. అయితే తాను ఇలా పూర్తి స్థాయిలో కోలుకోవడం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారని అన్నారు. అంతేగాదు ఫిట్‌గా ఉండటంపై కేర్ తీసుకోవడమే గాక ఎంతమేర ఏ స్థాయి వరకు వ్యాయమాలు చేస్తే చాలు అన్న అవగాహన కూడా అత్యంత ముఖ్యమని చెప్పారు. అలాకాదని అతిగా వర్కౌట్లు చేస్తే శరీరం మోటారు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూసి స్ట్రోక్ బారినపడే ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చిరించినట్లు తెలిపారు. ఆయన జీరో 1 ఫెస్ట్ అనే జెరోధా వెంచర్ సాయంతో ఆరోగ్య సంపద, అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటి గురించి చర్చించడం వంటివి చేస్తుంటారు. ఇంతకీ ఈ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదరకమైనదా? అంటే..తస్మాత్ జాగ్రత్త..ఉన్నట్టుండి తూలిపడిపోతున్నారా.. రెప్పపాటులోనే కంటి చూపు పోయి అంతా చీకటి అవుతోందా…పెదవులు ఓ పక్కికి లాగినట్టు అవుతున్నాయా? అయితే బీకేర్‌ఫుల్? అది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం కావచ్చు. గుండెపోటు వస్తే కాస్త ఆలస్యం అయితే ప్రాణం పోతుంది కానీ… బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏకంగా బతికినంత కాలం అంగవైకల్యం భారిన పడేసి… మరొకరి మీద ఆధారపడే దీనస్థితికి తీసుకువస్తుంది. అందుకే స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే సత్వరం స్పందించాలని హెచ్చరిస్తుంటారు వైద్యులు.లక్షణాలు..బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కొన్నిసార్లు ప్రాణం పోతుంది. ఇంకొన్నిసార్లు పక్షవాతం బారినపడతారు. తలలోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి రక్తం సరఫరా నిలిచిపోవటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఒక్కసారి స్ట్రోక్ బారిన పడితే నాలుగు గంటలలోపు సరైన చికిత్స అందించకపోతే మనిషి చనిపోవచ్చు లేదా జీవితకాలం వైకల్యం బారిన పడి మంచానికే పరిమితమవుతుంటారు. అందుకే బ్రెయిన్ స్ట్రోక్‌ని అత్యంత ప్రమాదకారిగా చెబుతుంటారు. శరీరంలోని ఓ చేయి బలహీనంగా అనిపించటం, అడుగువేసేందుకు కాళ్లు సహకరించకపోవటం, ఉన్నపళంగా బ్యాలెన్స్ తప్పి పడిపోతుండటం, కళ్లకు ఏమి కనిపించకుండా చీకట్లు కమ్మటం, మూతి ఓ పక్కకు తిరిగిపోతుండటం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.భారత్‌లో ప్రతి నలభై సెకన్లకు ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ భారిన పడుతుండగా… ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు దీని కారణంగానే చనిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్స్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్. ఇందులో మెదడులోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల వచ్చే స్ట్రోక్. దాదాపు 87 శాతం బ్రెయిన్ స్ట్రోక్‌లు ఇలా రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడటం వల్ల వచ్చేవే. రెండోది హిమోరేజిక్ స్ట్రోక్. మెదడులో రక్తస్రావం అయినప్పుడు ఈ తరహా స్ట్రోక్‌లు వస్తాయి. కేవలం 13 శాతం మాత్రమే ఈ తరహా స్ట్రోక్‌లు ఉంటాయి. మనిషి శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా మెదడు నుంచే సంకేతాలు రావాలి. అలాంటి మెదడు రక్తనాళాల్లో రక్తం సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు మనిషి మరణానికి దారి తీయటం లేదా పక్షవాతంతో కాళ్లు, చేతులు పనిచేయక శాశ్వత వైకల్యానికి దారి తీస్తోంది.ఎందువల్ల వస్తుందంటే..ఒక్కసారి స్ట్రోక్ బారినపడితే చాలు మనిషి జీవితం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణాలు అనేకం. మెదడులో రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రధాన కారణాలు కాగా.. కొన్ని రకాల గుండె జబ్బులు, వారసత్వం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, గురక, స్లీప్ ఆప్నియా వంటి అనేక కారణాలు స్ట్రోక్‌కి దారితీస్తున్నాయి. ఇటీవలే వాతావరణ మార్పులు సైతం స్ట్రోక్‌కి కారణమవుతున్నట్టు నిపుణులు గుర్తించారు. అయితే స్ట్రోక్ లక్షణాలని సకాలంలో గుర్తిస్తే బాధితులను కాపాడుకునే అవకాశం ఉంది. స్ట్రోక్ భారిన పడిన వారిని ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులకు తీసుకువెళ్లి.. టెస్టులు చేసి నాలుగు గంటలలోపే కొన్ని రకాల ఇంజక్షన్లు ఇవ్వటం ద్వారా బాధితులు శాశ్వత వైకల్యం భారిన పడకుండా కాపాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నామనే ఆలోచనతో దేన్ని తేలిగ్గా తీసుకోకండి, శరీరం మాట వినండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు. View this post on Instagram A post shared by Nithin Kamath (@nithinkamath) (చదవండి: అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు ట్రిప్‌కి వెళ్లొద్దాం ఇలా..! చక్కటి ఐఆర్సీటీసీ ప్యాకేజ్‌తో)

Ugadi 2025 అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉగాది (Ugadi2025) సంబరాలు (మరాఠీ ప్రజలు జరుపుకునే పండగా గుడిపడ్వా) అంబరాన్ని అంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది వేడుకలను కనులపండువగా నిర్వహించారు. ముఖ్యంగా హిందూ నూతన సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ఇతర కార్యక్రమాల ద్వారా నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మరాఠీ ప్రజలు ఉగాది పండుగ రోజును గుడిపడ్వాగా జరుపుకుంటారు. మరోవైపు ఈ సందర్భంగా తెలుగు ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఉగాది పచ్చళ్లు తయారు చేయడంతో పాటు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను ఏర్పాటు చేయగా మహారాష్ట్ర ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయ పద్ధతుల్లో ఉగాది (గుడిపడ్వా)ను జరుపుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు గుడిపడ్వా రోజున ఓ కర్రకు రాగిచెంబును బోర్లించి దానిపై నూతన వస్త్రం, మామిడి కొమ్మలు, చక్కెర పాకంతో తయారు చేసే చక్కెర బిల్లల హారాలతో అలంకరిస్తారు. వాటిని ఇంటి ముందు, ఎత్తైన స్థలాల్లో కడతారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిని ‘గుడి’లుగా పేర్కొంటారు. ఇలాంటి ‘గుడి’లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అదే విధంగా నూతన సంవత్సరానికి సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. ముఖ్యంగా ముంబైలోని గిర్గావ్, థానే, డోంబివలి, పుణే, నాగ్పూర్లతో పాటు అనేక ప్రాంతాల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు శోభాయాత్రలు ఊరేగింపులు నిర్వహించారు. ఈ శోభాయాత్రలో సంగీత వాయిద్యాలు వాయించడంతోపాటు సంప్రదాయమైన దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు నృత్యం చేశారు. అదే విధంగా ఈ యాత్రలలో బైకులు, అశ్వాలు కూడా కని్పంచాయి. మరోవైపు భారీ రంగోళి (ముగ్గులు)లు వేశారు. రథయాత్రల ద్వారా అనేక అంశాలపై సందేశాలిచ్చే ప్రయత్నం చేశారు. ముంబైలో... ముంబైలోని గిర్గావ్, దాదర్, కాందివలి తదితరాలతోపాటు అనేక ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించారు. ముఖ్యంగా గిర్గావ్లో ఉదయం నిర్వహించిన శోభాయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గిర్గావ్ శోభాయాత్రలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బైకులు, బుల్ల్ట్లపై సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు. దాదర్‌లో సంప్రదాయ దుస్తులతో మహిళలు కత్తులను తిప్పుతూ చేసిన విన్యాసాలు అందిరినీ ఆకట్టుకున్నాయి. అలాగే ములూండ్‌లో కూడా ఈ సారి శోభాయాత్ర జరిగింది. థానేలో... థానేలో కౌపినేశ్వర్ ఆలయం ఆధ్వర్యంలో మాసుందా జలాశయం (తలావ్పాలి) వద్ద శనివారం రాత్రి దీపోత్సవం జరిగింది. దీన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు థానే, డోంబివలి ఫడ్కేరోడ్డుపై బైకుల ర్యాలీలతోపాటు బ్యాండు మేళాలతో శోభాయాత్ర జరిగింది. ముఖ్యంగా డోంబివలిలో అనేక సందేశాలతో ర్యాలీలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తుల కిటకిట.. ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పలు ప్రాంతాల్లో టపాసులు కాల్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇదే తరహా ముంబై, థానే, డోంబివలి, పుణే, భివండీలతోపాటు రాష్ట్రంలోని మందిరాల్లో భక్తుల సందడి కని్పంచింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేవుళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలోని ముంబాదేవి ఆలయంతోపాటు అనేక ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఫొటోలు


గ్రాండ్‌గా మంచు ఫ్యామిలీ ఉగాది వేడుకలు (ఫోటోలు)


ఉగాది లుక్.. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు (ఫోటోలు)


ఉగాది వేడుక చీరలో అందంగా ముస్తాబైన సెలబ్రిటీలు (ఫొటోలు)


ఉగాది వేడుకల్లో రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీంకార (ఫొటోలు)


Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)


సూర్య-జ్యోతిక ఇంట్లో సెలబ్రిటీలు.. ఎందుకో తెలుసా?


న్యూబిగినింగ్స్, కొత్త సంవత్సరాదికి ప్రేమతో : వైష్ణవి చైతన్య ( ఫోటోలు)


బ్లాక్ శారీలో మెరిసిన కీర్తి సురేష్ (ఫొటోలు)


ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)


విజయవాడ : ముద్దులొలికిన సంప్రదాయం..క్యాట్‌వాక్‌లు (ఫొటోలు)
International

దత్తత పర్వంలో... దారుణ కోణం!
దత్తత మాటున దారుణాలు. కొరియా యుద్ధం తాలూకు విషాదంలో మరో చీకటి అధ్యాయం. దీనికి సంబంధించి తాజాగా బహిర్గతమైన విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి. 1950ల్లో యుద్ధం కారణంగా దక్షిణ కొరియా పేదరికంలో కూరుకుపోయింది. జనం తమ సంతానాన్ని పోషించుకోలేని దుస్థితికి దిగజారడంతో వారిని ఆదుకునే సాకుతో ప్రభుత్వం తెచ్చిన పథకం అక్రమాలకు నెలవుగా, అంతులేని విషాదానికి చిరునామాగా మారింది. తొలుత ప్రశంసలు అందుకున్నా విదేశీ దత్తత పథకంలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఎన్నో అక్రమాలు జరిగాయని, లక్షలాది మంది చిన్నారులు సొంతవారికి దూరమై విదేశాల్లో కష్టాల పాలయ్యారని దీనిపై విచారణకు నియమించిన కమిషన్ కుండబద్దలు కొట్టింది. ‘‘ఇది పిల్లల భవిష్యత్తులో క్రూర చెలగాటం. దీనికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి’’ అని సిఫార్సు చేసింది. దత్తత పేరుతో దూర దేశాలకు తరలిపోయిన తమ చిన్నారుల కన్నీటి గాథలు దక్షిణ కొరియన్లను కంటతడి పెట్టిస్తున్నాయిప్పుడు...! విదేశాల్లో మొదలైన కష్టాలు దత్తత తీసుకున్న తల్లిదండ్రుల చెంత హాయిగా పెరిగిన పిల్లలు కొందరే. అత్యధికులు బానిసలుగా బతికారు. సరైన పోషణ, సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హింస, వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. దత్తత తండ్రుల చేతుల్లో అత్యాచారాలకు బలైన అమ్మాయిలు కోకొల్లలు. దత్తత సమయంలో తప్పుడు ఊళ్లు, పేర్లు, అన్నీ మార్చేసిన కారణంగా అసలు తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేదీ పెద్దయ్యాక ఆ పిల్లలకు తెలీకుండా పోయింది. నార్వేలో జీవిస్తున్న 60 ఏళ్ల ఇంగర్ టోన్ ఉయిలాండ్ షిన్ కన్నీటిగాథ ఇలాంటిదే. ‘‘13 ఏళ్ల వయసులో నన్ను దత్తత తీసుకుని నార్వేకు తీసుకొచ్చారు. తిండి, వాతావరణం ఏదీ నాకు సరిపడలేదు. పెంపుడు తండ్రి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. నాకన్నా పెంపుడు కుక్కనే బాగా చూసుకునేవాళ్లు. చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండానే వాళ్లు చనిపోయారు. నేను మాత్రం ఇలా మిగిలిపోయా. చిన్ననాటి జ్ఞాపకాలు, అందమైన బాల్యం, సర్వం కోల్పోయా’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికా, ఆ్రస్టేలియాతో పాటు యూరప్‌లోని ఎన్నో దేశాలకు దత్తు వెళ్లిన ఆయిలాండ్ వంటి చిన్నారుల కన్నీటిగాథలు కోకొల్లలని ‘ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్’ పేర్కొంది. మూడేళ్ల దర్యాప్తు తర్వాత బుధవారం సమగ్ర నివేదిక సమర్పించింది. అంతర్జాతీయ దత్తత చట్టాలు, చిన్నారుల పరిరక్షణపై ‘ది హేగ్ ఒడంబడిక’ను దక్షిణ కొరియా ప్రభుత్వం తుంగలో తొక్కిందని కమిషన్ చైర్పర్సన్ పార్క్‌సన్ యంగ్ మండిపడ్డారు.ఎందుకీ దుస్థితి? 1950వ దశకంలో కొరియా ద్వీపకల్పంలో మొదలైన యుద్ధమే ఈ దత్తత దారుణాలకు ప్రధాన కారణం. దేశ భూభాగంలో ఉత్తరభాగం డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్కే)గా, దక్షిణభాగం రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా రెండు ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినాసరే అమెరికాసహా 17 దేశాలు ద.కొరియాకు మద్దతు ప్రకటించాయి. చైనా, రష్యాలు ఉత్తరకొరియాకు అండగా నిలబడ్డాయి. చాన్నాళ్లు కొనసాగిన ఈ యుద్ధంలో ఒక్క దక్షిణకొరియాలోనే దాదాపు 2,00,000 మందికిపైగా మహిళలు తమ భర్తలను కోల్పోయి వితంతువులుగా మిగిలిపోయారు. మరో 1,00,000 మంది చిన్నారులు అనాథలయ్యారు. వితంతులు తమ పిల్లలను పెంచే స్తోమతలేక అనాథాశ్రమాల్లో చేర్పించారు. దీంతో దేశవ్యాప్తంగా అనాథాశ్రయాల్లో చిన్నారుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. యుద్ధంకారణంగా పేదరికం కోరల్లో చిక్కుకుపోయిన ద.కొరియా సర్కార్‌కు వీళ్ల పోషణ పెద్ద భారంగా తయారైంది. యుద్దంలో ద.కొరియాకు సాయంగా దేశంలో తిష్టవేసిన అమెరికా సైనికులు స్థానిక మహిళలతో సంబంధాలు పెట్టుకోవడంతో లక్షలాది మంది చిన్నారులు జని్మంచారు. ఇలాంటి వాళ్లకు సమాజంలో ఆదరణ కరువైంది. ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. వితంతువుల పిల్లలు, అమెరికన్ల పిల్లలు, అనాథాశ్రయాల్లోని చిన్నారుల బాగోగులు చూసేందుకు ప్రభుత్వం విదేశీ దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీళ్లను దత్తత తీసుకునేందుకు పశ్చిమదేశాల్లోని జంటలు తెగ ఆసక్తి చూపించారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని కొన్ని దేశాల నుంచి దత్తత డిమాండ్లు అధికమయ్యాయి. 1954లో ఈ ధోరణి ఊపందుకుంది. 1948 నుంచి 1960 వరకు సింగ్మాన్ రీ పాలనకాలంలో, తర్వాత పార్క్ చుంగ్ హీ హయాంలో 1961నుంచి 1979 కాలంలో ఈ పోకడ విపరీతంగా పెరిగిపోయింది.వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు దత్తత ప్రక్రియ పూర్తి లోపభూయిష్టమని, తమను అన్యాయంగా, అక్రమంగా విదేశాలకు తరలించారని చాలామంది చిన్నారులు పెద్దయ్యాక ఫిర్యాదులు చేశారు. వాటిపై కమిషన్ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘దత్తత ప్రక్రియ తప్పులతడకగా సాగింది. పేర్లు మార్చేయడం, తల్లిదండ్రులున్నా అనాథ అని పేర్కొనడం వంటి ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. విదేశీ జంటలకు అప్పగింతపై నెలవారీ పరిమితి ఉన్నా ఆ కోటాను ప్రభుత్వమే తుంగలో తొక్కింది. అలా ప్రైవేట్ ఏజెన్సీలు దశాబ్దాలుగా లక్షలాది మంది చిన్నారులను విదేశాలకు తరలించాయి. ఉచితంగా జరగాల్సిన దత్తత ప్రక్రియలో అడుగడుగునా భారీగా నగదు చేతులు మారింది’’ అని కమిషన్ పేర్కొంది. ఎట్టకేలకు 2023లో దత్తత ప్రక్రియలో కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీలకు బదులు విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో దత్తత కార్యక్రమం నడుస్తుందని ప్రకటించింది. కానీ కమిషన్ వెల్లడించిన కఠోర వాస్తవాలపై మాత్రం ప్రభుత్వం పెదవి విప్పలేదు. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తేలినా క్షమాపణ చెప్పలేదు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దారి తప్పిన పథకంపశ్చిమ దేశాల జంటలకు అనాథలను దత్తతనిచ్చే కార్యక్రమం మొదట్లో సవ్యంగా సాగినా రానురాను ఇది అక్రమాలకు నెలవుగా తయారైంది. దత్తత ప్రక్రియ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి చేతులు దులుపుకుంది. దీంతో ఈ ఏజెన్సీలు పశ్చిమదేశాల జంటల నుంచి అత్యధిక మొత్తాలను వసూలుచేసి వాళ్లకు నచ్చిన పిల్లలను విదేశాలకు తరలించడం మొదలెట్టాయి. ఇందుకోసం ఏజెన్సీలు ఎన్నో అక్రమ మార్గాలను ఎంచుకున్నాయి. అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు పిల్లల అసలు పేర్లను మార్చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించేవారు. కుటుంబాలతో ఉంటున్న అందంగా, పుష్టిగా ఉన్న చిన్నారులు కొందరిని కిడ్నాప్ చేసి మరీ విదేశాలకు తరలించారు. కుటుంబాలకు చెందిన పిల్లలను అనాథలుగా ముద్రవేసి విదేశీ జంటలకు అప్పగించారు. ఇలా లక్షలాది మంది చిన్నారులను దేశం దాటించారు.– సాక్షి, నేషనల్ డెస్క్

ఆదిమ గెలాక్సీ చిక్కింది
అనంత విశ్వంలో మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దీన్ని అత్యంత ఆదిమ గెలాక్సీల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఎదుకంటే విశ్వావిర్భావానికి మూల కారణమని భావిస్తున్న బిగ్‌బ్యాంగ్ జరిగిన కేవలం 33 కోట్ల ఏళ్లకే అది పురుడు పోసుకుంది! విశ్వం వయసు 1,380 కోట్ల ఏళ్లని అంచనా. ఈ లెక్కన ఈ గెలాక్సీ ఎంత పురాతనమైనదో అర్థం చేసుకోవచ్చు. దీనికి జేడ్స్–జీఎస్–జెడ్13–1గా సైంటిస్టులు నామకరణం చేశారు. భూమి వయసు 450 కోట్ల సంవత్సరాలన్నది తెలిసిందే. అయితే, ‘‘జేడ్ గెలాక్సీ కేవలం 230 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలోనే వ్యాపించింది. ఆ లెక్కన మన పాలపుంత కంటే ఇది వందలాది రెట్లు చిన్నదే’’ అని సైంటిస్టులు వివరించారు. కానీ దీని గుర్తింపుకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. చీకట్లను చీల్చుకుని...మనకు ఇప్పటిదాకా తెలిసిన అత్యంత పురాతన గెలాక్సీల్లో జేడ్స్ నాలుగోది. కానీ వాటన్నింట్లోకీ ఇది అత్యంత ప్రకాశవంతమైనది మాత్రం ఇదే. తద్వారా అయానీకరణ దశకు జేడ్స్ తొలి రుజువుగా నిలిచిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న సైంటిస్టుల బృందం సంబరపడుతోంది. బిగ్బ్యాంగ్తో పురుడు పోసుకున్న విశ్వం క్షణాల వ్యవధిలోనే శరవేగంగా, అనంతంగా విస్తరించడం మొదలు పెట్టిందన్నది సైంటిస్టుల భావన. నవజాత దశను దాటి కాస్త చల్లబడ్డాక చాలాకాలం పాటు వైశ్విక అంధకార యుగం కొనసాగిందని చెబుతారు. ఆ దశలో విశ్వం మొత్తాన్నీ హైడ్రోజన్ వాయువు దట్టంగా కప్పేయడమే ఇందుకు కారణం. ‘‘దాంతో విశ్వమంతా కేవలం హైడ్రోజన్, హీలియం, కృష్ణరాశితో కూడిన ముద్దగా మిగిలిపోయింది. ఆ తర్వాత విశ్వపు తొలి తారలు, కృష్ణబిలాలు, గెలాక్సీలు పురుడుపోసుకున్నాయి. వాటినుంచి నుంచి అతి శక్తిమంతమైన పరారుణ కాంతి ఉద్గారాలు వెలువడ్డాయి. విశ్వాన్ని చిరకాలంగా కప్పి ఉంచిన తటస్థ హైడ్రోజన్ వాయు మండలాన్ని ఛేదించాయి. తొట్టతొలి వెలుగు కిరణాలుగా నిలిచిపోయాయి’’ అని పెన్హెగన్యూనివర్సిటీ కాస్మిక్ డాన్ సెంటర్‌కు చెందిన ఆస్ట్రో ఫిజిసిస్టు జోరిస్ విట్స్కాక్ వెల్లడించారు. తాజా అధ్యయనానికి ఆయనే సారథ్యం వహించారు. ‘‘అలా విశ్వం అయానీకరణ దశలో తొలిసారిగా వెలుగులు విరజిమ్మడం మొదలైంది. అందుకే దీన్ని విశ్వానికి పొద్దుపొడుపుగా చెబుతుంటారు. జేడ్స్ గెలాక్సీ సరిగ్గా ఆ పరివర్తన దశకు చెందినదని తేలింది’’ అని విట్స్కాక్ వివరించారు. ‘‘ఇప్పటిదాకా మనకు చిక్కిన ఇతర సుదూర గెలాక్సీలకు భిన్నంగా జేడ్స్ అత్యంత స్పష్టంగా కని్పస్తుండటం వెనక కారణం కూడా ఇదే. అందులో అత్యంత శక్తిమంతమైన పరారుణ రేడియేషన్ వంటిది ఉందనేందుకు ఇది నిదర్శనం. అయానీకరణం చెందిన హైడ్రోజన్ దాని చుట్టూ భారీగా పరుచుకుని ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఈ అధ్యయన వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్

డోజ్‌కు త్వరలో మస్క్ గుడ్‌బై?
వాషింగ్టన్: అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సారథ్య పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా వెల్లడించారు. ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావిస్తూ డోజ్‌కు వీడ్కోలు పలకబోతున్న అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఆయన ఇప్పటికే డోజ్ బృందంలోని కీలకమైన ఏడుగురు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సంస్థ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఆరామ్ మొఘాద్దాషీ, స్టీవ్ డేవిడ్, బ్రాడ్ స్మిత్, ఆంటోనీ ఆర్మ్‌స్ట్రాంగ్, జోయీ గిబ్బియా, టోమ్ క్రాస్, టైలర్ హసేన్లతో మస్క్ సమావేశమయ్యారు. వివాదాస్పద నిర్ణయాలతో వరసబెట్టి కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు కుడిభుజంగా వేలమంది కేంద్ర ప్రభుత్వోద్యోగులను మస్క్ సాగనంపడం, వేలకోట్ల విలువైన ప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులను రద్దుచేయడం తెలిసిందే. దాంతో ఆయన తప్పుకున్నాక డోజ్ విభాగం ఉంటుందా, ఉంటే నూతన సారథి ఎవరంటూ చర్చ మొదలైంది. సొంత సమస్యలను పరిష్కరించుకునేందుకే మస్క్ ఇలా హడావుడిగా డోజ్ నుంచి వైదొలగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన టెస్లా కంపెనీ కార్ల పనితీరు, సంస్థలో శ్వేతజాతీయేతర ఉద్యోగుల పట్ల వివక్ష, భాగస్వాముల విభేదాలు, వినియోగదారుల ఫిర్యాదుల వంటి సమస్యలతో మస్క్ సతమతమవుతున్నారు. ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నాకే డోజ్ నుంచి నిష్క్రమించబోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘అమెరికా ఆర్థిక భారాన్ని కనీసం ట్రిలియన్ డాలర్ల మేర తగ్గించాలన్న లక్ష్యం దాదాపు సాధించాం’’అని చెప్పారు.

Myanmar earthquake: కుళ్లుతున్న మృతదేహాలు
మాండలే: భూకంపం తాలూకు విధ్వంసం నుంచి మయన్మార్ ఇంకా తేరుకోలేదు. మౌలిక వనరుల లేమికి భూ ప్రకంపనలు తోడై సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుబడ్డవారి సంఖ్య అపారంగా ఉన్నట్టు సైనిక ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నానాయి. ఇప్పటికే రెండు రోజులు దాటిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. దాంతో రాజధాని నేపిడా మొదలుకుని ఏ నగరంలో చూసినా మృత్యుఘోషే విన్పిస్తోంది. ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న మాండలేలో శిథిలాల కింద కుళ్లిపోతున్న మృతదేహాలతో వీధులన్నీ కంపు కొడుతున్న పరిస్థితి! అంతర్జాతీయంగా అందుతున్న సాయం ఏ మూలకూ చాలడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. చాలా నగరాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. భూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని నేపిడా సమీపంలో శనివారం రెండుసార్లు 4.7, 4.3 తీవ్రతతో భూమి కంపించడం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కూడా 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాంతో జనం భయాందోళనలతో ఇళ్లను వీడి వీధుల్లోకి పరుగులు తీశారు. స్వల్ప స్థాయి ప్రకంపనలు రోజంతా కొనసాగాయి. రోడ్డు, రైలు మార్గాలు, బ్రిడ్జిల వంటివన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థలన్నీ పడకేశాయి. దాంతో సహాయక బృందాలను బాధిత ప్రాంతాలకు తరలించడమే సవాలుగా మారింది. సమాచార వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. వీటికి తోడు 41 డిగ్రీల పై చిలుకు ఎండ ఠారెత్తిస్తోంది. చాలాచోట్ల శిథిలాలను పారలు, చేతులతోనే తొలగించేందుకు స్థానికులు ప్రయతి్నస్తున్నారు! ఇన్ని ప్రతికూలతల మధ్యే ఇప్పటిదాకా 1,700కు పైగా మృతదేహాలను వెలికితీశారు. అయితే సహాయక బృందాలు ఇంకా దేశంలో చాలా ప్రాంతాలకు చేరుకోనే లేదు. తిరుగుబాటుదారుల అ«దీనంలో ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యల ఊసే లేదు. దాంతో అక్కడి మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారమూ లేదు. ఈ నేపథ్యంలో మరణాలు 10 వేలు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు. భారత్ ఆపద్బాంధవ పాత్ర కల్లోల మయన్మార్‌ను ఆదుకోవడంతో భారత్ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తోంది. ఆపరేషన్ బ్రహ్మ పేరిట ఇప్పటికే ఐదు సైనిక విమానాల్లో 60 టన్నుల మేరకు సహాయక సామగ్రిని చేరవేసింది. మరో 40 టన్నుల సహాయక సామగ్రి సముద్ర మార్గాన చేరుకుంటోంది. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రత్యేక సైనిక పారా బ్రిగేడ్ బృందం కూడా తోడైంది. 120 మంది వైద్యులు, వైద్య సిబ్బందితో వాయు మార్గాన తరలించిన తాత్కాలిక ఆస్పత్రి రెండుగా విడిపోయి మాండలే, నేపిడాల్లో రోగులను పెద్ద ఎత్తున ఆదుకుంటోంది.మాండలేలో ఆకలి కేకలు 15 లక్షల జనాభా ఉన్న మాండలేలో విధ్వంసం మాటలకందని రీతిలో ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ నిర్మణాలన్నీ కుప్పకూలడమో, భారీగా పగుళ్లివ్వడమో జరిగింది. దాంతో నగరవాసులు వీధుల్లోనే గడుపుతున్నారు. శిథిలాల కింద చిక్కిన తమవారిని ఎలాగోలా కాపాడుకోవాలని తపిస్తున్నారు. పారలు, పలుగులతో వాటిని తవ్వి తీసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే తిండికి, తాగునీటికి కూడా వాళ్లు అల్లాడిపోతున్న పరిస్థితి! శిథిలాల తొలగింపుకే నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని కేథలిక్ రిలీఫ్ సరీ్వసెస్ మేనేజర్ కారా బ్రాగ్ అభిప్రాయపడ్డారు. ‘‘క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు చాలినన్ని సదుపాయాల్లేవు. ఔషధాలు తదితరాలకు తీవ్ర కొరత ఉంది. తిండికి, తాగునీటికి కొరత తీవ్రతరమవుతోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. నేపిడా, మాండలే విమానాశ్రయాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ నగరాలకు వాయుమార్గాన సహాయక సామగ్రి, సిబ్బంది తరలింపు అసాధ్యంగా మారింది. నేపిడాలో ప్రభుత్వ కార్యాలయాల పునరుద్ధరణకే సైనిక సర్కారు ప్రాధాన్యమిస్తోంది. దాంతో సాధారణ ప్రజల దైన్యాన్ని పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు.థాయ్‌లాండ్‌లో 18కి మృతులు శుక్రవారం నాటి భూకంపంతో తీవ్రంగా దెబ్బ తిన్న థాయ్‌లాండ్‌లో మృతుల సంఖ్య 18కి పెరిగింది. బ్యాంకాక్‌లో కుప్పకూలిన 33 అంతçస్తులు నిర్మాణంలోని భవనం శిథిలాల్లో నుంచి ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికితీశారు.
National

పండుగపూట విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
కులు: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని కులు పరిధిలోగల మణికరణ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతిచెందారు. బలమైన గాలుల కారణంగా ఒక భారీ వృక్షం రోడ్డుపై నిలిపివుంచిన వాహనాలపై పడింది. అదే సమయంలో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు.ఈ ప్రమాదంపై హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు(CM Sukhwinder Singh Sukhu) విచారం వ్యక్తం చేశారు. ప్రమాదప్రాంతంలో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికరణ్ ప్రముఖ మతపరమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆదివారం నాడు రాష్ట్రంలో ‘నవ సంవత్’ ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ఎవరన్నదీ ఇంతవరకూ గుర్తించలేదు. పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించినట్లు కులు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అశ్విని కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆదివారం గురుద్వారా ముందు నిలిపివుంచిన తమ వాహనాలలో కూర్చున్న పర్యాటకులపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?

బిహార్‌లో బీజేపీ ఎన్నికల నగారా
గోపాల్‌గంజ్: హోం మంత్రి అమిత్ షా ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి తిరిగి అధికారం కట్టబెట్టడం ద్వారా ప్రధాని మోదీని బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష ఆర్జేడీకి గట్టిపట్టున్న గోపాల్ గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం అమిత్ షా పాల్గొంటున్న మొదటిసారి సభ ఇదే కావడం గమనార్హం. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్డీదేవి అధికారం చెలాయించిన 15 దశాబ్దాల కాలంలో బిహార్‌లో జంగిల్ రాజ్ నడిచిందని, కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీలు ఒక పరిశ్రమగా మారాయని నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రంలో రక్షణ కొరవడటంతో ముఖ్యమైన వ్యాపారవేత్తలంతా ఆ సమయంలో రాష్ట్రాన్ని వీడారు. దాణా కుంభకోణానికి పాల్పడిన లాలు ప్రసాద్ యాదవ్ పేరు ప్రపంచ దేశాల్లోనే మారుమోగింది, బిహార్‌కు ఆయన తీరని కళంకం తెచ్చారు’అని అమిత్ షా ఆరోపించారు. ‘కుటుంబ రాజకీయాలు చేసే లాలు.. భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. కుమార్తెను పార్లమెంట్‌కు పంపారు. ఆయన ఇద్దరు కుమారులు ఇప్పుడు సీఎం అవ్వాలనుకుంటున్నారు’అని ఎద్దేవా చేశారు. ‘అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా చెప్పుకునే లాలు.. దాణా కూడా బొక్కేశారు. అటువంటి వ్యక్తి రికార్డు స్థాయిలో స్కాములే తప్ప, పేదలకు చేసేదేమీ లేదు’అని మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వరదల సమస్యకు చెక్ పెట్టామని చెప్పారు. లాలు–రబ్డీల జంగిల్ రాజ్ కావాలో, మోదీ, నితీశ్‌ల అభివృద్ధి కావాలో తేల్చుకునే సమయం ఇప్పుడు వచ్చిందని షా అన్నారు. ‘మరికొద్ది నెలల్లో అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో కమలం గుర్తు బటన్‌నే మీరు నొక్కుతారని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకే ఓటేస్తారని నాకు తెలుసు. మోదీ అంటే బిహార్ ప్రజలు ఎప్పుడూ అభిమానం చూపుతూనే ఉన్నారు. ఆయన్ను మళ్లీ మీరు బలపరుస్తారని ఆశిస్తున్నా’అని అమిత్ షా తెలిపారు. బిహార్ అసెంబ్లీకి వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.

సాంస్కృతిక వటవృక్షం
నాగ్‌పూర్/బిలాస్పూర్: మహారాష్ట్ర నూతన సంవత్సర వేడుక గుడీ పడ్వా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాగపూర్‌లో పర్యటించారు. అక్కడి ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. రెషీంబాగ్లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతిమందిర్కు వెళ్లారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవార్‌కు, సంస్థ రెండో సర్సంఘ్చాలక్ మాధవ్‌రావ్ సదాశివరావ్ గోల్వాల్కర్‌కు నివాళులర్పించారు. ఆరెస్సెస్ గొప్పదనాన్ని, సంస్థ నేతల కృషిని ప్రస్తుతిస్తూ సందర్శకుల పుస్తకంలో హిందీలో భావోద్వేగపూరితంగా నోట్ రాశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో కలిసి సంస్థ పంచాంగ కార్యక్రమం (ప్రతిపద)లో పాల్గొన్నారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఈ 11 ఏళ్లలో మోదీ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సంస్థ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ‘‘ఆరెస్సెస్ భారతదేశానికి సాంస్కృతిక వటవృక్షం వంటిది. జాతి ప్రయోజనాలే లక్ష్యంగా మన సంస్కృతిని, ఆధునికతను నిత్యం పరిరక్షిస్తోంది. ఇందుకోసం అసంఖ్యాకులైన ఆరెస్సెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంగా పురోగమిస్తున్న వేళ ఆరెస్సెస్ వందేళ్ల తపస్సు ఇప్పుడు ఫలాలందిస్తోంది. బానిస మనస్తత్వాన్ని, బానిస పాలన చిహ్నాలను, కాలం చెల్లిన చట్టాలను తొలగిస్తూ నూతన న్యాయసంహితతో భారత్ పురోగమిస్తోంది’’ అని మోదీ అన్నారు. మాధవ్ నేత్రాలయకు శంకుస్థాపన నాగపూర్‌లో మాధవ్ నేత్రాలయ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ సెంటర్‌కు అనుబంధంగా నిర్మించబోయే మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. ఆరెస్సెస్ మాజీ చీఫ్ గోల్వాల్కర్‌కు గుర్తుగా ఈ నేత్రాలయను నిర్మించారు. ‘‘గోల్వాల్కర్ స్ఫూర్తితో ఈ నేత్రాలయం లక్షలాది మందికి కంటి బాధలను దూరంచేసింది. కొత్త ఆస్పత్రి కూడా కంటి సమస్యల బాధితులకు వెలుగులను పంచనుంది’’ అన్నారు. దీక్షాభూమిలో అంబేడ్కర్‌కు నివాళి నాగపూర్‌లో అంబేడ్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన చోట నిర్మించిన ‘దీక్షాభూమి’ని కూడా మోదీ సందర్శించారు. రాజ్యంగ నిర్మాతకు నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల డైరీలో మోదీ రాశారు. భారత్‌ను సమ్మిళిత, అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లడమే అంబేడ్కర్‌కు అసలైన నివాళి అన్నారు. తర్వాత నాగపూర్‌లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ ఆయుధాగారాన్ని ప్రధాని సందర్శించారు. అక్కడ మానవరహిత విహంగాల రన్‌వేను ప్రారంభించారు.కాంగ్రెస్ వల్లే నక్సలిజం ప్రబలింది ఛత్తీస్ పర్యటనలో మోదీ ధ్వజం కాంగ్రెస్ ప్రభుత్వాల విఫల విధానాల వల్లే ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల్లో నక్సలిజం ఊపందుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘‘బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఆయా రాష్ట్రాల్లో పెనుమార్పు మొదలైంది. నక్సల్స్ ప్రభావ ప్రాంతాల్లో శాంతి శకం ఆరంభమైంది’’ అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో రూ.33,700 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బిలాస్పూర్ జిల్లా మోహ్భాత్తా గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ‘‘దేశాన్ని 60 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది? అభివృద్ధికి నోచుకోని జిల్లాలను పట్టించుకోవడం మానేసింది. వాటిని ‘వెనుకబడిన జిల్లాలు’గా ప్రకటించి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్ విధానాల వల్లే ఛత్తీస్‌గఢ్ వంటి ఎన్నో రాష్ట్రాల్లో నక్సలిజం విజృంభించింది. అభివృద్ధి పడకేసింది. మావోయిస్టు హింసలో ఎంతోమంది తల్లులు కుమారులను కోల్పోయారు. నక్సలైట్ల బెడదతో అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందలేదు. కాంగ్రెస్ పాలకులు వారినెప్పుడూ పట్టించుకోలేదు. మేమొచ్చాక స్వచ్్ఛ భారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్‌లతో ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్యసాయం అందిస్తున్నాం’’ అని మోదీ అన్నారు. ‘‘ఎవరికైనా ఆశ్రయం కల్పించడాన్ని భారత సంప్రదాయాల్లో గొప్పగా చెబుతారు. ఛత్తస్‌గఢ్‌లో ‘నవరాత్రి’ సందర్భంగా 3 లక్షల పేద కుటుంబాలు సొంతిళ్లలోకి మారుతున్నాయి. ప్రధాన్‌మంత్రి ఆవాస్యోజనతో లక్షలాది ఇళ్లు నిర్మించాం. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. వాజ్‌పేయీ శతజయంతి వేడుకలు, ఛత్తీస్‌గఢ్ ఆవిర్భావ రజతోత్సవాలు ఈ ఏడాదే రావడం యాదృచి్ఛకం’’ అని మోదీ అన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

మన దగ్గరే 'బంగారు' కొండ
సాక్షి, స్పెషల్ డెస్క్: సుమారు 25,000 టన్నులు.. భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఇవి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. బంగారం అంటే మన వాళ్లకు అమితపైన ప్రేమ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండొచ్చు అనే కదా మీ ఆలోచన. అసలు విషయం చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల (ఆర్బీఐలాంటి సెంట్రల్ బ్యాంక్స్) వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ తాజా నివేదికలో వెల్లడించింది. భారతీయుల కుటుంబాల్లో ఉన్న ‘బంగారు కొండ’ ఏపాటితో దీనిని బట్టి అర్థం అవుతుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రాధాన్య ఆస్తిగా మనవారు ఆధారపడిన విధానాన్ని ఈ కొండ నొక్కి చెబుతోంది. భారతీయులు పసిడిని ఇలా విస్తారంగా కూడబెట్టుకోవడం దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో పుత్తడికి ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం.ప్రత్యామ్నాయంగా పుత్తడి..యూఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాలు ఈ టాప్–10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉందంటే.. పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ యెల్లో మెటల్ ఎంతటి కీలకపాత్ర పోషిస్తోందో అవగతం అవుతుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉందనడంలో సందేహం లేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ విలువల హెచ్చుతగ్గులకు దీనిని ఒక విరుగుడుగా ప్రజలు భావిస్తున్నారు. వివాహాలు, పండగలు, మతపర వేడుకలు గోల్డ్ డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. బ్యాంకుల్లో పొదుపు చేస్తే వచ్చే వడ్డీ కంటే బంగారం కొనుగోలు ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందవచ్చన్నది ప్రజల మాట. అందుకే అత్యధిక కుటుంబాల్లో బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా పుత్తడి అవతరించింది. సెంట్రల్ బ్యాంక్స్ సైతం..ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. ఆర్థిక అస్థిరతల నుంచి రక్షణ ఇచ్చే సాధనం బంగారమేనని ఇవి భావిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2024 డిసెంబర్ నాటికి ఆర్బీఐ వద్ద 876.18 టన్నుల నిల్వలు పోగయ్యాయి. తొలిస్థానంలో ఉన్న యూఎస్ఏ 8,133 టన్నులు, రెండోస్థానంలో ఉన్న జర్మనీ వద్ద 3,352 టన్నుల నిల్వలు ఉన్నాయి.
NRI

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.
క్రైమ్

ఇల్లరికం వచ్చిన భర్తను హత్య చేయించిన భార్య
నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అంతమొందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం నాగారం గ్రా మానికి చెందిన అమృతం విఠల్ (38) అనే వ్యక్తి 20 ఏళ్ల కిత్రం సోమేశ్వర్ గ్రామంలోని మేనమామ కూతురు కాశవ్వను పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చాడు. మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఒక్కరికి పెళ్లి అయింది. విఠల్ భార్య కాశవ్వ నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. విఠల్‌ను అంతమొందిస్తే ఏ గొడవా ఉండదని భావించిన కాశవ్వ అదే గ్రామానికి చెందిన అమృతం విఠల్(నిందితుడు), పుల్కంటి విఠల్‌కు విషయం తెలిపింది. శుక్రవారం రాత్రి విఠల్(మృతుడు)ను పొలం వద్దకు తీసుకెళ్లిన అమృతం విఠల్, పుల్కంటి విఠల్ అతిగా మద్యం తాగించి మెడకు టవల్‌తో గట్టిగా బిగించి, పైపులతో కొట్టి చంపారు. అనంతరం విఠల్ మృతదేహాన్ని కొల్లూర్ సబ్‌స్టేషన్ సమీపంలో బాన్సువాడ–బీర్కూర్ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి అన్న బింగి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, విఠల్‌ను తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ అశోక్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ పేర్కొన్నారు.

టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురి అరెస్ట్
నకిరేకల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురిని శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించామని నల్లగొండ జిల్లా నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 21న నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఓ యువకుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాద్యమాల్లో వైరల్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఈ నెల 23న చిట్ల ఆకాష్, బండి శ్రీను, గుడుగుంట్ల శంకర్, బ్రహ్మదేవర రవిశంకర్, ఓ బాలుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు తదుపరి విచారణ అనంతరం శనివారం నకిరేకల్‌కు చెందిన పోగుల శ్రీరాముల, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పళ్ల మనోహర్‌ను శనివారం రిమాండ్‌కు పంపామని, ఓ బాలుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. రిమాండ్ చేసినవారిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు బీజేపీకి చెందిన వారుగా గుర్తించామని పేర్కొన్నారు.

‘హమ్మయ్యా!’ ఆ ఆరుగురు దొరికారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా, సాక్షి: ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. ఐదురోజుల తర్వాత.. శనివారం ఆ పిల్లల ఆచూకీ శనివారం లభ్యమైంది. తల్లిదండ్రులు మందలించారనే వాళ్లు అలా వెళ్లిపోయినట్లు సమాచారం.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ నెల 24వ తేదీన స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు. బడి, ఇల్లు తప్ప ఏం తెలియని చిన్నారులు అలా కనిపించకుండా పోయేసరికి అంతా ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించి.. బంధువులను ఆరా తీసి చివరకు స్థానిక పోలీసులను అశ్రయించారు.ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వాళ్లంతా బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలోనే చదువుతున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు చుట్టుపక్కల గాలించారు. వాళ్ల ఫొటోలను మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. డ్రోన్ సాయంతో పరిసర ప్రాంతాల్లో అన్వేషించారు. నాలుగు రోజులైనా ఆచూకీ తెలియరాకపోవడంతో అంతా కంగారుపడ్డారు.చివరకు పి.గన్నవరం మండలం పెదమాల లంకలో మొక్కజొన్న రైతులకు విద్యార్థులు కనిపించారు. అయితే వాళ్లు ఆకలితో ఉండడంతో భోజనం పెట్టి పంపించి వేశారు. ఈ క్రమంలో సిద్ధాంతం వద్ద ఉన్న లంకలో బాలబాలికను గుర్తించిన పోలీసులు చివరకు ఆలమూరుకు తరలించారు. తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

వీడు మనిద్దరికి పుట్టిన బిడ్డేనా?
అన్నానగర్: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తామిద్దరూ నల్లగా ఉన్నా.. బిడ్డ మాత్రం మంచి రంగుతో జన్మించడంపై సందేహించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ అనుమానం కూడా అదే తీరులో బలపడింది. చివరకు ఆ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హతమార్చాడు. ఊయల తాడు బిగుసుకుని మరణించిందని బుకాయించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలడంతో ఆ కసాయి కటకటాలపాలయ్యాడు. వివరాలు..చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్ జావిద్ (33) పత్తి దుకాణంలో పని చేసేవాడు. అతని భార్య నిలోఫర్. వీరికి పెళ్లయి నాలుగేళ్లైంది. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కుమార్తె పాహిమా ఉంది. గత 26వ తేదీ రాత్రి నీలోఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ ఉపవాసం విరమించేందుకు సమీపంలోని మసీదుకు వెళ్లింది. కుమార్తెతో ఇంట్లోనే జావిద్ ఉండిపోయాడు. ఇఫ్తార్ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన నీలోఫర్‌కు పాహిమా మెడ తొట్టి తాడుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుందని అక్రమ్ జావిద్ తెలిపారు. వెంటనే చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు నార్త్ కోస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయకాంత్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జావిద్‌ను ప్రశ్నిస్తే ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే శుక్రవారం అందిన పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమదైన శైలిలో విచారణ చేసేసరికి తానే బిడ్డను గొంతు నులిమి హతమార్చినట్టు జావిత్ అంగీకరించాడు. తాను, తన భార్య నల్లగా ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం మంచి రంగుతో ఉండడంతో తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలమిచ్చాడు.
వీడియోలు


ప్రపంచం సుఖంగా ఉండాలని ఇతను ఏం చేశాడో చూడండి


బీసీలను టార్గెట్ చేయడం దుర్మార్గం


Pawan Kalyan: నాకు సత్తా లేదు..


హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు


కుప్పంలో బాబుకు షాక్.. వర్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు


కూటమి హయాంలో దేవదేవుడికే నిద్ర లేకుండా పోతుంది: రోజా


HCU భూములమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?: బండి సంజయ్


ధనుష్ దర్శకత్వంలో అజిత్ సినిమా ?


సన్‌రైజర్స్ న్యూ హీరో


కర్నూల్ లో రంజాన్ వేడుకలు.. నల్ల రిబ్బన్లతో నిరసన