
PC: BCCI/IPL.com
ముంబై ఇండియన్స్ మరో యువ సంచలానాన్ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ పేస్ బౌలర్ అశ్వనీ కుమార్.. తన తొలి మ్యాచ్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అశ్వనీ కుమార్ నిప్పలు చేరిగాడు.
తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటర్లను చుక్కలు చూపించాడు. రహానే, రింకూ సింగ్, రస్సెల్ వంటి స్టార్ బ్యాటర్లను ఈ యువ పేసర్ బోల్తా కొట్టించాడు. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేసి తన డెబ్యూను ఘనంగా చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్వినీ కుమార్.. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఎవరీ అశ్వినీ కుమార్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.
ఎవరీ అశ్వినీ కుమార్..?
అశ్వనీ కుమార్ పంజాబ్‌కు చెందిన ఎడమచేతి వాటం పేసర్. 23 ఏళ్ల అశ్వనీ కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పంజాబ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడికి అద్భుతమైన యార్కర్లు, బౌన్సర్లు వేసే సత్తా ఉంది. డెత్ బౌలింగ్‌లో కూడా అతడు రాణించగలడు. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన షేర్ ఈ పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్వనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ సౌట్ల దృష్టిలో పడ్డాడు. ఈ టోర్నీలో డెత్ బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్వని కుమార్‌ను ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గత ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అశ్విని కుమార్ 2022లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున టీ20 అరంగేట్రం చేశాడు. ఆ టోర్నీలో 4 టీ20లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్వనీ పంజాబ్ తరపున 2 ఫస్ట్-క్లాస్, 4 లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు.
👉ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగిన అశ్వినీ కుమార్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా అరంగేట్రంలో ముంబై ఇండియన్స్ తరుపన తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా అశ్వినీ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో అల్జారీ జోషఫ్ ఉన్నాడు.
చదవండి: PAK vs NZ: 'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు'