ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలం కోసం ఆయా జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కోతా నైట్‌రైడర్స్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2024లో తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ యాజమాన్యం విడిచిపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్..?
గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్‌కు టైటిల్ అందించిన రెండో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అయితే మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్.. ఇప్పుడు భారత ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టడంతో తమ కెప్టెన్ కూడా మార్చాలని కేకేఆర్ భావిస్తున్నట్లు వినికిడి.
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకోవాలని కేకేఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అందుకు బదులుగా కేకేఆర్ అయ్యర్‌ను ముంబైకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇరు ఫ్రాంచైజీల మధ్య డీల్ కుదిరినట్లు సమాచారం. సూర్యకు అయ్యర్ స్ధానంలో తమ జట్టు పగ్గాలని అప్పగించాలని కేకేఆర్ ప్లాన్ చేస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా గంభీర్ స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మెంటార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment