NRI
-
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమాదంలో 26 ఏళ్ల భారత సంతతికి వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్ దుర్మరణం పాలయ్యారు. యూఏఈలోని రస్ అల్ ఖైమా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కోపైలట్ ఇద్దరూ చనిపోయారని యుఎఇ ప్రభుత్వ విభాగమైన జెనెరల్ సివిల్ ఏమియేషన్ అథారటీ ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేసింది.చనిపోయిన ఇద్దరిలో 26 ఏళ్ల పాకిస్థానీ మహిళ కాగా మరొకరు సులేమాన్ అల్ మాజిద్. ఇతను విమానంలో కోపైలట్‌గా ఉన్నాడు. సులేమాన్ దుబాయ్‌లోనే పుట్టి పెరిగాడు. విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బెంగుళూరుకి చెందిన ఇతని కుటుంబం యూఏఈ దేశానికి వలస వెళ్లింది. యూకే దేశంలోని డుర్హాం కౌంటీ, డార్లింగ్టన్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్‌లో ఫెలో డాక్టర్‌గా ఉద్యోగం చేసేవాడు. బిట్రీష్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, హానరరీ సెక్రటరీ, నార్తరన్ రెసిడెంట్ డాక్టర్స్ కమిటీలో కో-చైర్మన్ పదవులు చేపట్టాడు. అలాగే యూకేలో డాక్టర్‌గా ఉన్న సమయంలోజూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంచాలని ఉద్యమం చేసినట్టు సోషల్‌మీడియా ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.సులేమాన్ తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని సరదాగా కొంత సమయం గడిపాడు. ఆ తరువాత తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఒక ప్రైవేట్ ఏమియేషన్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ముందుగా సులేమాన్ సరదాగా గాల్లో విహరించేందుకు క్లబ్ విమానంలో వెళ్లాడు. పైలట్ ఒక పాకిస్తానీ మహిళ ఉన్నారు. అయితే వీరి విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కాంటాక్ట్ మిస్ అయింది. కోవ్ రొటానా హోటల్ సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఆస్పత్రి తరలించారు. కానీ ఇద్దరూ చనిపోయారు. సులేమాన్ అకాల మరణంపై తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఉన్నాం. త్వరలోనే అతడికి పెళ్లి కూడా చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. తమకు సర్వస్యం అయిన సులేమాన్ లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్ఆర్ఐకు జైలు, జరిమానా
మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి సింగపూర్ కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. క్యూలో నిలబడమని చెప్పినందుకు సింగపూర్‌లోని ఒక కేఫ్‌లోని కేఫ్‌లోని క్యాషియర్‌పై (Cafe Cashier) దాడి చేశాడు. ఘటనలో భారత సంతతికి చెందిన రిషి డేవిడ్ రమేష్ నంద్వానీ (Rishi David Ramesh Nandwani ) దోషిగా తేలాడు. దీంతో సింగపూర్ కోర్ట్( Singapore Court ) నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 4000 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.సింగపూర్‌లోని హాలండ్ విలేజ్‌లోని ప్రాజెక్ట్ అకాయ్ కేఫ్లొ అక్టోబర్ 31న ఈ ఘటన జరిగింది. కేఫేలో ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చాడు రిషి. దాదాపు మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో అక్కడంతా పిల్లలతో సహా కస్టమర్లు కిక్కిరిసి ఉన్నారు. ఈ సమయంలో క్యూలో తప్పుగా నిలబడటం గమనించిన మహిళా క్యాషియర్, రిషీని వెనక్కి వెళ్లమని సూచించింది. దీంతో అతను వెళ్లలేదు సరికదా అసహనంతో రెచ్చిపోయాడు. ఆ దేశం, అక్కడి ప్రజల గురించి అభ్యంతరకరంగా వ్యాఖానించాడు. ఆమెపై దుర్భాషలాడాడుతూ, అసభ్యమైన పదజాలంతో దూషించాడు. ఆవేశంతో కౌంటర్లో ఉన్న టిప్ బాక్స్ తీసుకుని ఆమెపైకి విసిరాడు. దీంతో ఆమె పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రెండుగంటల్లోనే రిషిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రిషీ దురుసుగా ప్రవర్తించినట్లు తేల్చారు.వీడియో లింక్ ద్వారా రిషిని కోర్టులో హాజరుపరిచారు. కేఫ్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా క్యాషియర్‌కు అసభ్యకరమైన సైగలు, దూషణలు చేస్తూ ఉన్న వీడియోను కోర్టులో ప్లే చేశారు. కేఫ్‌లో బాధితురాలి భద్రతకు హాని కలిగించే అవమానకరమైన పదాలను ఉపయోగించడం , అసభ్యకరమైన చర్యకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఛానల్ న్యూస్ ఆసియా ప్రకారం, శిక్ష సమయంలో రెండు అదనపు ఛార్జీలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం డిసెంబరు 30 జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. -
సుచీర్ బాలాజీ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ కేసులో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఈ యువ టెక్ పరిశోధకుడి మృతిపై మిస్టరీ వీడడం లేదు. ఓపక్క అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు ప్రకటించగా.. మరోవైపు తల్లిదండ్రులు బాలాజీ రమణమూర్తి, పూర్ణిమరావ్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అది హత్యేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘రెండో అటాప్సీ రిపోర్ట్‌ను మేం చదివాం. తలకు గాయంతో మా అబ్బాయి విలవిలలాడిపోయినట్లు సంకేతాలున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అందులో మరిన్ని వివరాలు అది హత్య అనే చెప్తున్నాయి’’ అని తల్లి పూర్ణిమరావ్ అంటున్నారు... ‘‘ఏఐ ఇండస్ట్రీలో టాప్-10 వ్యక్తుల్లో నా బిడ్డ ఉంటాడు. అలాంటివాడు ఓపెన్ఏఐ(OpenAI) కంపెనీని.. ఉన్నపళంగా ఎందుకు ఏఐ ఇండస్ట్రీని వదిలేస్తాడు. న్యూరా సైన్స్, మెషిన్‌లెర్నింగ్ వైపు ఎందుకు మళ్లాలనుకుంటాడు?. ఓపెన్ఏఐ మా అబ్బాయిని అణచివేసి ఉండొచ్చు.. బెదిరించి ఉండొచ్చు.. అనేదే మా అనుమానం’’ అని పూర్ణిమ చెబుతున్నారు . ‘‘లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మిత్రుడి పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగి వచ్చినట్లు మా వాడు చెప్పాడు. వచ్చే నెలలో లాస్ వెగాస్ టెక్ షోలో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు అని తండ్రి రమణమూర్తి బాలాజీతో జరిగిన చివరి సంభాషణను వివరించారు. వాడెంతో సంతోషంగా ఉన్నాడు. అలాంటివాడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.సుచీర్ కెరీర్ ఎంపిక విషయంలో ఏనాడూ మేం అడ్డు చెప్పలేదు. వాడి పరిశోధనలకు ఏఐ ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించాం. ఏఐ మానవాళికి మేలు చేస్తుందనుకుంటే.. అది మరింత ప్రమాదకారిగా మారబోతుందని సుచీర్ గుర్తించాడు. చాట్‌జీపీటీ లోపాలను ఎత్తి చూపాడు. కళాకారుల, జర్నలిస్టుల శ్రమను దోపిడీ చేయడం అనైతిక చర్యగా భావించాడు. వాడి పోరాటం ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా జరిగింది కాదు. కేవలం మానవత్వానికి మద్దతుగా నిలిచాడు. అందుకే వాడి అభిప్రాయంతో మేం ఏకీభవించాం... కానీ, ఏదో జరిగింది. మా దగ్గర శవపరీక్ష నివేదిక ఉంది. అందులో బలవనర్మణం కాదని స్పష్టంగా ఉంది. ఇక తెలుసుకోవాల్సింది.. దీనికి కారకులెవరు? ఎందుకు చేశారనే?.. మా అబ్బాయి మృతిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరగాలి. ఇప్పటికే ఇక్కడి భారత అధికారులను కలిశాం. ఈ విషయంలో భారత ప్రభుత్వ మద్దతు కోరుతున్నాం. ఇక్కడ బలైంది నా బిడ్డ మాత్రమే కాదు. ఓ మేధావి జీవితం అర్ధాంతంగా ముగిసింది. టెక్ ఇండస్ట్రీ ఓ విలువైన జీవితం పొగొట్టుకుంది. ఓపెన్ ఏఐ ఇప్పుడు మాకు మద్దతుగా నిలుస్తాని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది’’ అని సుచీర్ పేరెంట్స్ ప్రకటించారు.కార్నిఫోలియా ఎన్నారై దంపతులు బాలాజీ రమణమూర్తి-పూర్ణిమలకు సుచీర్ బాలాజీ(Suchir Balaji) జన్మించాడు. బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే కిందటి ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడు. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. అయితే సుచీర్ ఎత్తిచూపిన లోపాలను తాము ఇదివరకే సవరించామని ఓపెన్ఏఐ ప్రకటించుకుంది. మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన అపార్ట్మెంట్లో నవంబర్ 26వ తేదీన సుచీర్ శవమై కనిపించాడు. అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. తమ ప్రాథమిక విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ అతని పేరెంట్స్‌తో పాటు పలువురు బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇంతకు ముందు.. ఇలాన్ మస్క్(Elon Musk)కు సైతంసుచీర్ బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొసమెరుపు ఏంటంటే.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-శామ్ అల్ట్మన్ కలిసి ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. అప్పటి నుంచి ఇలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు వైరం కొనసాగుతోంది.చదవండి👉🏾 బాలాజీ తల్లి ట్వీట్, మస్క్ ఏమన్నారంటే.. -
యూకే స్టూడెంట్ వీసా.. మరింత భారం!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టూడెంట్స్ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో ఉన్నత చదువులకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు బ్రిటన్ చేదువార్త చెప్పింది. స్టూడెంట్ వీసా కావాలంటే మునుపటి కన్నా ఎక్కువ సొమ్ములు చూపించాలని అంటోంది.ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు ఇక నుంచి అధిక నిధులు సమకూర్చుకోవాల్చిందే. యూకే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మెయింటెనెన్స్ మనీగా చూపించాల్సిన మొత్తాన్ని బ్రిటన్ 11.17 శాతం పెంచేసింది. 2025, జనవరి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇక నుంచి విద్యార్థి వీసా దరఖాస్తుదారులు తమ బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.14.4 లక్షలు (13,347 పౌండ్లు) మెయింటెనెన్స్ మనీగా చూపించాల్సి ఉంటుంది. 28 రోజుల పాటు వారి బ్యాంక్ ఖాతాలో ఈ నగదు ఉండాలి. ఇప్పటివరకు ఈ మొత్తం రూ. 12.9 లక్షలు (12,006 పౌండ్లు)గా ఉంది. బ్రిటన్‌లో పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘మెయింటెనెన్స్ మనీ’ కూడా పెంచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.లండన్‌లో వెలుపల చదవాలనుకున్న విద్యార్థులకు కూడా మెయింటెనెన్స్ మనీ 11.05 శాతం వరకు పెరిగింది. లండన్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని యూనివర్సిటీల్లో చదివేందుకు విదేశీ విద్యార్థులు ఇప్పటివరకు 9,207 పౌండ్లు మెయింటెనెన్స్ మనీగా చూపించేవారు. ఇక నుంచి ఈ మొత్తం 10,224 పౌండ్లకు పెరుగుతుంది. 2025, జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని బ్రిటీష్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ పేర్కొంది.యూకే స్టూడెంట్ వీసాల నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులు మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తమ ఆర్థిక వ్యవహారాలను మరింత సూక్ష్మంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నిర్వహణ ఖర్చుల భారం నుంచి ఉపశమనం పొందాలంటే స్కాలర్షిప్లు సంపాదించాలని సలహాయిస్తున్నారు. విదేశాల్లో చదువు పూర్తైన తర్వాత బాగా సెటిలయితే తాము పెట్టిన పెట్టుబడి సద్వినియోగం అయినట్టేనని కెరీర్ మొజాయిక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా జవేరీ పేర్కొన్నారు.చదవండి: హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!విదేశాల్లో ఉన్నత చదువు కోసం స్టూడెంట్ వీసా పొందేందుకు కొంత మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాలో చూపించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు, నిర్వహణ ఖర్చుల కోసం తగినంత డబ్బును వారి బ్యాంక్ ఖాతాలో చూపించాలి. లండన్‌లో చదవాలకునే విదేశీ విద్యార్థులు 20 వేల పౌండ్లు ‘మెయింటెనెన్స్ మనీ’ అవసరమవుతుంది. ఒకవేళ వీసా అప్లై చేయడానికి ముందే 5 వేల పౌండ్లు చెల్లిస్తే.. మిగతా 15 వేల పౌండ్లు బ్యాంకు ఖాతాలో 28 రోజుల పాటు ఉండాలి. -
ఖతార్‌లో తెలుగు ప్రవాసికి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం
ఖతార్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (SIGTA) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన తెలుగు ప్రవాసి వెంకప్ప భాగవతుల "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డును గెలిచారు. ఖతార్‌లోని తెలుగు, భారత సమాజానికి ఆయన అందించిన అసాధారణ కృషి, ప్రేరణాత్మక నాయకత్వం, వివిధ రంగాల్లో కనబరచిన విశిష్ట ప్రతిభా పాటవాలు, , సేవలకు గౌరవంగా ఈ అవార్డు ఆయనను వరించింది."సౌత్ ఐకాన్ అవార్డు" అనేది SIGTA కార్యక్రమంలో అందించబడే అత్యున్నత గౌరవం. విదేశాల్లో నివసిస్తూ తమ మాతృభూమి సాంస్కృతిక వారసత్వం మరియు నైతిక విలువలను పరిరక్షించడంలో, వాటిని ప్రోత్సహించడంలో విప్లవాత్మకమైన కృషి చేసిన ప్రవాసులకు ఈ అవార్డు ప్రకటించబడుతుంది. ఖతార్‌లోని ప్రపంచ ప్రఖ్యాత AL MAYASA థియేటర్ (QNCC) లో జరిగిన ఈ ఘనమైన వేడుకకు 2,500 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల ప్రముఖులు, వ్యాపార, వినోద, సాంస్కృతిక, సేవా, సామాజిక రంగాల నుండి ప్రతిష్టాత్మక వ్యక్తులు పాల్గొని తమ అభినందనలు తెలిపి, ఈ కృషికి ఎంతో గౌరవం అర్పించారు.ఖతార్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు భాష, కళలు, సాంస్కృతిక వారసత్వం , సామాజిక సేవలలో చేసిన అసాధారణ కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యి, అందరి మన్ననలు పొందారు వెంకప్ప భాగవతుల.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డు పొందడం గర్వకారణంగా , గౌరవంగా భావిస్తున్నాను అని, ఇది తన బాధ్యతను మరింత పెంచింది" అని పేర్కొన్నారు అన్నారు వెంకప్ప భాగవతుల. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు సంబంధించి, SIGTA కార్యవర్గం, జ్యూరీ సభ్యులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "ఈ గుర్తింపు నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది. ఈ అవార్డును నా కుటుంబసభ్యులకు, ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులకు, నాకు ప్రేరణగా నిలిచే నా మిత్రులకు, అలాగే ఖతార్‌లోని తెలుగు సమాజానికి అంకితం చేస్తున్నాను." అని ఆయన అన్నారు. -
హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!
హెచ్–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటికి అనుకూలంగా మాట్లాడడం.. ఆయన మద్దతుదారుల్ని షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో.. టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్(Elon Musk) కాస్త మెత్తబడ్డారు. హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని ప్రకటించిన ఆయన.. ఇప్పుడు స్వరం మార్చారు. ఈ పాలసీలో భారీ సంస్కరణలు అవసరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించేవే హెచ్–1బీ(H1B) వీసాలు. అయితే.. ఈ వీసా వ్యవస్థ సజావుగా నడవడం లేదని.. దానికి భారీ సంస్కరణలు అవసరమని తాజాగా ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వ్యక్తి చేసిన పోస్టుకు ఆయన బదులిచ్చారు.Easily fixed by raising the minimum salary significantly and adding a yearly cost for maintaining the H1B, making it materially more expensive to hire from overseas than domestically. I’ve been very clear that the program is broken and needs major reform.— Elon Musk (@elonmusk) December 29, 2024హెచ్–1బీ వీసా మీద సౌతాఫ్రికా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు ఇలాన్ మస్క్. అయితే ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులుగా ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ని నియమించారు. అయితే.. అమెరికా ఫస్ట్ అమలుకు ట్రంప్ ఏరికోరి నియమించిన ఈ ఇద్దరే బీ1 వీసా విధానానికి మద్దతు ప్రకటించడం.. ట్రంప్ మద్దతుదారులకు ఏమాత్రం సహించడం లేదు. దీనికి తోడు.. 👉తాజాగా.. వైట్‌హౌస్ ఏఐ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఇటీవల నియమించారు. అయితే నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది.👉మరోవైపు నెట్టింట జోరుగా చర్చ నడిచింది. అయితే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు ఇలాన్ మస్క్ సూచిస్తూ వస్తున్నారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా.👉ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. కౌంటర్‌గా కొందరు వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఒకానొక టైంలో సహనం నటించిన మస్క్.. బూతు పదజాలం ప్రయోగించిన సందేశం ఉంచారు.👉ఇక.. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే.. విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని.. అమెరికాను మరోమారు గొప్ప దేశంగా తయారు చేస్తానని(Make America Great Again) తన ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు అప్పుడు సంకేతాలిచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇటు డెమోక్రాట్లలో.. అటు రిపబ్లికన్లలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. -
సామాజిక చైతన్య సాహిత్యంపై తానా సదస్సు
ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో భాగంగా డిసెంబర్ 29న జరిగిన - 75వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సామాజిక చైతన్య సాహిత్యం – దశ, దిశ” (అభ్యుదయ, దిగంబర, పైగంబర, విప్లవ సాహిత్యాలు) ఘనంగా జరిగింది. విశిష్టఅతిథులుగా – అభ్యుదయ సాహిత్యం: డా. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి- సుప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, అధ్యక్షులు: అరసం, వేల్పుల నారాయణ - ప్రముఖ రచయిత, అధ్యక్షులు: తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ కార్యదర్శి: అఖిలభారత అరసం; దిగంబర సాహిత్యం: (దిగంబర కవులు) నిఖిలేశ్వర్ (శ్రీ కుంభం యాదవరెడ్డి) – దిగంబర కవి, ప్రముఖ కథారచయిత, అనువాద రచయిత, విమర్శకులు; నగ్నముని (మానేపల్లి హృషీ కేశవరావు) – దిగంబర కవి, ప్రముఖ కవి, నాటకరచయిత, నాస్తికులు; పైగంబర సాహిత్యం: (పైగంబర కవులు) కిరణ్ బాబు (రావినూతల సుబ్బారావు) - పైగంబర కవి, రచయిత, సంపాదకులు; వోల్గా (డా. పోపూరి లలితకుమారి) – పైగంబర కవి, ప్రముఖ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమ ప్రతీక, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత; రజాహుస్సేన్ - కవి, రచయిత, పాత్త్రికేయుడు, సాహిత్య విమర్శకుడు; విప్లవ సాహిత్యం: (విప్లవ రచయితల సంఘం - విరసం): అరసవిల్లి కృష్ణ, విప్లవ కవి. అధ్యక్షులు: విరసం. సాహిత్యం కాలంతో పాటు ప్రవహించే ఓ వాహిక.. కాలగతిలో సామాజిక పరిణామాలకు అనుగుణంగా సాహిత్య ఉద్యమాలు రూపుదిద్దుకుంటాయి. వాటి ప్రభావం సామాజిక మార్పులకు దోహదపడుతుందని వక్తలు ఉద్ఘాటించారు. ’తానా ప్రపంచసాహిత్య వేదిక ఆధ్వర్యంలో “సామాజిక చైతన్యం, సాహిత్యం, దశ, దిశ” అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగిన అంతర్జాల సాహిత్య చర్చాకార్యక్రమంలో తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ఉద్యమాలపై సంపూర్ణ చర్చ జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సామాజిక చైతన్యావసరాన్ని వివరించారు. సమాజంలో ఎక్కువమంది నిశ్శబ్దంగా ఉండడంవల్ల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. జనం చైతన్యంతో ప్రతిఘటించినప్పుడే, అరాచకాలు అరికట్టబడతాయని చెప్పారు. జనాన్ని చైతన్యవంతం చేసే బాధ్యత కవులు, రచయితలపై వుందన్నారు. ఈ కార్యక్రమంలో అరసం, విరసం, దిగంబర, పైగంబర కవిత్వోద్యమాలపై కూలంకష చర్చజరిగింది. అరసం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, తెలంగాణ అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ ప్రసంగించారు. అరసం ఆవిర్భావం, వికాసం గురించి డా. రాచపాళెం ప్రసంగించారు. అరసం అందరిదీ కాకున్నా, అత్యధికులకు సంబంధించిందని ఆన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికోసం అరసం ఆవిర్భవించిందన్నారు. వేల్పుల నారాయణ మాట్లాడుతూ అరసం ఆవశ్యకతను, ఆచరణను వివరించారు. దిగంబరకవిత్వ ఆవిర్భావ వికాసాలు, సిద్ధాంతాల గురించి నిఖిలేశ్వర్, నగ్నముని ప్రసంగించారు. దిగంబర కవిత్వం చారిత్రక అవసరంగా ఆవిర్భవించిందని, సాహిత్యంలో ఓ దశాబ్ది నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసిందన్నారు. దిగంబరులు ఆరుగురు ఆరు రుతువుల్లా సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు. దిగంబరుల కవిత్వంలో అభివ్యక్తి, భాష గురించి వచ్చిన విమర్శల్ని ఆయన తిప్పి కొట్టారు. నాటి యువతలో జడత్వాన్ని వదిలించడానికి ఆ మాత్రం ట్రీట్మెంట్ తప్పలేదన్నారు. నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి..లేపకు.. పీక నులిమి గోతిలోకి లాగుతాడు.. ప్రభందాంగనల తొడలు తాడి మొద్దులు తాకితే కాళ్ళు విరగ్గొట్టు.. కుచములు ఎవరూ ఎక్కని పర్వతాగ్రములు తలను ఢీకొని బద్దలు కొట్టు. భావకవుల నపుంసక హావభావాలకు సవాలు; అభ్యుదయ కవీ నల్ల మందు తిని నిద్రపోయావ్”!! అంటూ తన స్వీయ కవిత చదివి వినిపించారు. నిఖిలేశ్వర్.. ఇందులో శృంగార మేంలేదని, నిద్రపోతున్న యువతను తట్టిలేపడానికి ఈ మోతాదులో వ్రాయాల్సి వచ్చిందన్నారు. నిద్రపోతున్న తెలుగు సాహిత్యాన్ని మేల్కొలపటంలో దిగంబర కవిత్వం పాత్ర తక్కువేం కాదని నగ్నముని అన్నారు. దిగంబరకవిగా అరెస్ట్ అయి ప్రభుత్వోద్యోగాన్ని కూడా కోల్పాయనన్నారు. సిద్ధాంత ప్రాతిపదికనే జనచైతన్యం కోసం దిగంబరకవులు. కవిత్వం రాశారన్నారు. అభివ్యక్తిలో, భాషలో విమర్శలకు గురైనా…దిగంబర కవిత్వం నాటి సమాజంలో సంచలనం కలిగించిందన్నారు. పైగంబర కవి ఓల్గా మాట్లాడుతూ.. నాటి సాహిత్య, సామాజిక పరిస్థితులకు మేల్కొల్పుగా పైగంబర కవిత్వం ఆవిర్భవించిందన్నారు. పైగంబర కవులు మానవతకు పెద్దపీటవేశారని చెప్పారు. మరో పైగంబరకవి కిరణ్ బాబు..పైగంబర కవిత్వ ఆవిర్భావ వికాసాలను వివరంగా తెలియజేశారు. “మేము పైగంబరులం మాది ఒక తపస్సు మా కవితా దీపికలు విడదీస్తవి గాఢ తమస్సు ప్రపంచం సమస్యల కీకారణ్యంలా వుంది ఎటుచూసినా ఘోర నిబిడ నిశీథి ఎటుపోయేందుకు దారి చూపదు”.. 1970 నాటి సామాజిక పరిస్థితుల్ని చూసి, తట్టుకోలేక అయిదుగురు కవులు పైగంబరులుగా పేరుపెట్టుకొని కవిత్వం రాశారని కిరణ్ తెలిపారు. దేవిప్రియ, సుగమ్ బాబు, కమలాకర్, ఓల్గా తాను పంచపాండవుల్లా కవిత్వాయుధాలు పట్టి మానవత్వాన్ని తట్టి లేపేందుకు కలంపట్టామని చెప్పారు. విరసం తరపున అరసవిల్లికృష్ణ మాట్లాడారు. విరసం ఆవిర్భావ, వికాసాలను అరసవెల్లి వివరించారు. విరసం చారిత్రక అవసరంగా ఏర్పడిందన్నారు. సాహితీ విమర్శకులు ఎ.రజాహుస్సేన్ మాట్లాడుతూ పైగంబర కవిత్వంపై సాధికార విమర్శ పుస్తకం తేవడం తన అదృష్టమన్నారు. పైగంబర కవులతో, తన సాన్నిహిత్యాన్ని వివరించారు. దేవిప్రియ ఆత్మ కథ రాస్తానని ప్రకటించినా, చివరకు రాయకుండానే దూరమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ శుభాకాంక్షలందజేశారు. అమెరికామ్రేడ్స్ గా పిలువబడే లెనిన్ వేముల, కిరణ్మయి గుంట (వేముల) అనంత్ మల్లవరపు బృందం సందర్భోచితం గా పాటలు గానం చేసి, కవితా పఠనం చేశారు. కార్యక్రమం ఆసక్తికరంగా తెలుగు సాహిత్యంలోని వివిధ ఉద్యమాల ఆవిర్భావం, వికాసం, వాటి ఆనుపానులగురించి చక్కటి చర్చ జరిగింది. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె లో వీక్షించవచ్చును.https://www.youtube.com/live/j00sevVGbzE?si=gXSmem5xRkW3EJuX -
రూపాయి పడింది... ఫీజు భారం పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతుండటంతో, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారితో పాటు కొత్తగా ఎమ్మెస్ కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. యూఎస్ వెళ్లేందుకు అన్ని సన్నాహాలూ చేసుకున్న విద్యార్థులు అంచనాలు తారుమారవడంతో ఆందోళన చెందుతున్నారు. 2022 ఫాల్ సీజన్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్)లో డాలర్ విలువ రూ.79 కాగా ఇప్పుడది రూ.85.03కు ఎగబాకడం గమనార్హం. 2014లో డాలర్ (Dollar) విలువ రూ. 60.95 మాత్రమే కావడం గమనార్హం. రూపాయి (Rupee) విలువ తగ్గిపోవడంతో విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం గణనీయంగా పెరిగిపోతోంది. ట్యూషన్ ఫీజు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన భారానికి తగిన మొత్తం ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చు కోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రూపాయితో పోల్చు కుంటే డాలర్ విలువ గత రెండేళ్లలోనే 8 శాతం పెరగడం విద్యార్థులపై పెనుభారం మోపుతోంది. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలకు (part time jobs) అవకాశాలు సన్నగిల్లడంతో విద్యార్థులు భారత్‌లోని తల్లిదండ్రుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. 2025లో రూ.5.86 లక్షల కోట్ల భారంభారత్ నుంచి ఏటా సగటున 13 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. వీరిలో 38 శాతం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు కాగా 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో 2024లోఇది 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ. 4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2025లో ఇది రూ.5.86 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజుకే అదనంగా రూ. 2.40 లక్షల వ్యయంస్ప్రింగ్ (మార్చి నుంచి జూన్) సీజన్లో చదువుకు సన్నాహాలు మొదలు పెట్టినప్పుడు వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా విద్యార్థులు అంచనా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వసతి ఖర్చులు దీనికి అదనం కాగా.. మొత్తం మీద అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడదని రూ. 52 లక్షల వరకు వెళుతుందని అంచనా. ఉపాధి భరోసా ఏదీ?అమెరికా వెళ్లే విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం వెతుక్కుంటాడు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. చదవండి: త్వరలో హైదరాబాద్ – డాలస్ విమానంఇక్కడ అమెరికాతో పోల్చుకుంటే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు తెర్చారు. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. దీంతో విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితి ఊహించలేదు అమెరికా వస్తున్పప్పుడు రూ. 50 లక్షల వరకు అప్పు చేశా. రూపాయి విలువ పతనంతో ట్యూషన్ ఫీజు మొత్తం పెరిగింది. ప్రస్తుతం వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకే గదిలో నలుగురం ఉంటున్నాం. అయినా ఇబ్బందిగానే ఉంది. పార్ట్ టైం ఉద్యోగం చేసినా పెద్దగా ఆదాయం ఉండటం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. – పాయం నీలేష్ (అమెరికాలో ఎంఎస్ విద్యార్థి)వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా..యూఎస్ వెళ్లడానికి బ్యాంక్ లోన్ ఖాయమైంది. కానీ ఈ సమయంలోనే రూపాయి పతనంతో యూనివర్సిటీకి చెల్లించాల్సిన మొత్తం పెరిగింది. బ్యాంకు వాళ్లు అదనంగా లోన్ ఇవ్వనన్నారు. మిగతా ఖర్చుల కోసం నాన్న అప్పుచేసి డబ్బులు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. అమెరికా వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా. – నీలిమ (అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్న విద్యార్థిని)2014లో డాలర్ విలువ రూ.60.952022 (ఫాల్ సీజన్)లో రూ.792024 డిసెంబర్లో రూ.85.032025లో రూ.9 లక్షల వరకు అదనపు భారం! -
హైదరాబాద్‌లో గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభం
అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అందిస్తోన్న గెహిస్ ఇమ్మిగ్రేషన్ మరియు ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్.. నూతన బ్రాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సంస్థ ప్రిన్సిపల్, ఫౌండర్ నరేష్ ఎం గెహి, తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్,మోడల్ అండ్ సోషలైట్ సుధా జైన్ , తదితరులు ముఖ్యతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలోని నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటు చేసినట్లు ఎన్.ఎం గెహి తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే వారికి ఎదురయ్యే ఇమిగ్రేషన్ సమస్యలతో పాటు అక్కడ నివసిస్తూ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డ వారికి తమ సంస్థ సేవలు అందిస్తుందని వివరించారు.భారత్, అమెరికా మధ్య అంతరాన్ని తగ్గించే ఈ ప్రయాణం గేహిస్ ఇమ్మిగ్రేషన్‌కు ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఆవిష్కరణలు, అవకాశాలు అమెరికాకు అందించడంలో భారతదేశం ఎపుడు అగ్రగామిగా ఉంటుందన్నారు. ఇమ్మిగ్రేషన్, అంతర్జాతీయ న్యాయ సేవల కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైనా వారికి అందుబాటులో ఉండటానికి మరిన్ని ప్రదేశాలలో సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నరేష్ ఎం గెహి పేర్కొన్నారు.గెహిస్ లీగల్ సర్వీసెస్ ముంబాయి తర్వాత రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం గర్వకారణమని అద్దంకి దయాకర్ అన్నారు. తెలుగువారు అత్యధికంగా అమెరికాలో నివసిస్తున్నారని, అలాంటివారికి అక్కడ తలెత్తే సమస్యలకు సరైన సలహాలు అందిస్తూ పరిష్కారాల కోసం పనిచేస్తున్న గెహిస్ సంస్థ సేవలను వినియోగించుకోవాలని కోరారు.(చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్) -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్
దుబాయ్‌లో పనిచేస్తున్న హైదరాబాదీ వాచ్మెన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. హైదరాబాద్‌కి చెందిన 60 ఏళ్ల నాంపల్లి రాచమల్లయ్య దుబాయ్‌లోని అబుదాబిలో గత మూడు దశాబ్దాలుగా బిల్డింగ్ వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి అప్పుడప్పుడూ బిగ్‌టికెట్ కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే తన స్నేహితులతో కలిసి యథావిధిగా టికెట్‌ని కొనుగోలు చేశాడు. ఈసారి అనూహ్యంగా రాజమల్లయ్య కొనుగోలు చేసిన టికెట్‌కి లాటరీ తగలడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇటీవల అనౌన్స్ చేసిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా లో విజేతగా నిలిచాడు రాజమల్లయ్య. ఈ లక్కీ డ్రాలో రాజమల్లయ్య సుమారు రూ. రెండు కోట్లు(రూ. 2,32,76,460) పైనే గెలుచుకున్నాడు. తాను ఇలా లాటరీ టిక్కెట్‌ని గత ముప్పైఏళ్లుగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఎట్టకేలకు అదృష్ట వరించిందని సంతోషంగా చెబుతున్నాడు రాజమల్లయ్య. ఈ ప్రైజ్ మనీని తాను టికెట్ కొనడానికి సాయం చేసిన స్నేహితులతో పంచుకుంటానని, అలాగే మిగతా మొత్తాన్ని కుటుంబం కోసం ఉపయోగిస్తానని తెలిపాడు రాజమల్లయ్య. View this post on Instagram A post shared by Big Ticket (@bigticketauh) (చదవండి: టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!) -
Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు
లారా లూమర్.. సోషల్ మీడియాలో ఈవిడ చేస్తున్న క్యాంపెయిన్ గురించి తెలిస్తే సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవడం ఖాయం. అమెరికా ఉద్యోగాల్లో సొంత మేధోసంపత్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న ఈ అతి మితవాద ఇన్ఫ్లుయెన్సర్.. భారతీయులపై మాత్రం తీవ్ర అక్కసు వెల్లగక్కుతోంది. ఈ క్రమంలో చీప్ లేబర్ అంటూ భారతీయులను, ఇక్కడి పరిస్థితులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్‌ను కృత్రిమ మేధ (ఏఐ) రంగ సలహాదారుగా నియమించారు. అయితే ఈ నియామకాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారతీయులను ఉద్దేశించి లారా లూమర్ వివాదాస్పద పోస్టులు చేశారు. అమెరికా ఫస్ట్ నినాదానికి శ్రీరామ్ కృష్ణన్ ద్రోహం చేస్తున్నాడని, గ్రీన్‌కార్డుల విషయంలో అతని వైఖరి భారత్‌లాంటి దేశాలకు మేలు చేసేలా ఉంటుందని.. తద్వారా అమెరికాలోని STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) గ్రాడ్యుయేట్స్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని చెబుతోందామె. అదే టైంలో..హెచ్1బీ వీసాల విషయంలోభారతీయులపై వివక్షాపూరితంగా ఆమె చేసిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, ఉషా వాన్స్లాంటి వాళ్లు అమెరికా ఫస్ట్ నినాదానికి కట్టుబడి ఉండాలని ఆమె కోరుతున్నారు. ‘‘నేను ఓటేసింది అమెరికాను మరోసారి గొప్పగా తయారు చేస్తారని. అందుకోసం హెచ్1బీ వీసాలను తగ్గిస్తారని.అంతేగానీ పెంచుకుంటూ పోతారని కాదు. భారత్‌లో అంత మేధోసంపత్తి ఉంటే అక్కడే ఉండిపోవచ్చు కదా.అమెరికాకు వలస రావడం దేనికి?. అంత హైస్కిల్ సొసైటీ అయితే.. ఇలా చెత్తకుప్పలా ఎందుకు తగలడుతుంది?( తాను పోస్ట్ చేసిన ఓ ఫొటోను ఉద్దేశిస్తూ..)..@VivekGRamaswamy knows that the Great Replacement is real. So does @JDVance. It’s not racist against Indians to want the original MAGA policies I voted for. I voted for a reduction in H1B visas. Not an extension. And I would happily say it to their face because there’s nothing… https://t.co/vO2e33USE1 pic.twitter.com/EH4hpJxiNH— Laura Loomer (@LauraLoomer) December 24, 2024మీకు భారతీయుల్లాంటి చీప్ లేబర్ కావాలనే కదా వీసా పాలసీలను మార్చేయాలనుకుంటున్నారు. ఆ విషయం మీరు ఒప్పుకుంటే.. నేనూ రేసిస్ట్ అనే విషయాన్ని అంగీకరిస్తా. మీలాంటి ఆక్రమణదారులు నిజమైన ట్రంప్ అనుచరుల నోళ్లు మూయించాలనుకుంటారు. కానీ, ఏం జరిగినా నేను ప్రశ్నించడం ఆపను. అసలు మీకు అమెరికాను మరోసారి గొప్పగా నిలబెట్టాలనే(Make America Great Again) ఉద్దేశమూ లేదు. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు’’ అని తీవ్ర స్థాయిలో సందేశాలు ఉంచారు. ఇంతకు ముందు.. భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ చేసినప్పుడు కూడా లారా లూమర్ ఈ తరహాలోనే జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను లక్ష్యంగా చేసుకుని..టెక్ బిలియనీర్లు మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో ఎక్కువసేపు గడుపుతూ.. తమ చెక్ బుక్‌లను విసిరేస్తున్నారు. అలాంటివాళ్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీలను తిరగరాయాలనుకుంటున్నారు. తద్వారా.. భారత్, చైనా లాంటి దేశాల నుంచి అపరిమితంగా బానిస కూలీలు రప్పించుకోవచ్చనేది వాళ్ల ఆలోచన అయి ఉండొచ్చు అంటూ ఆ పోస్టులోనే ఆమె ప్రస్తావించారు.Quite the change of tune. Wonder if he got “the call”. pic.twitter.com/o1Gp8dNYyo— Laura Loomer (@LauraLoomer) December 28, 2024కాంట్రవర్సీలకు జేజేమ్మ!31ఏళ్ల వయసున్న లారా ఎలిజబెత్ లూమర్.. పోలిటికల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జర్నలిస్ట్ కూడా. మొదటి నుంచి ఈమె శైలి వివాదాస్పదమే. గతంలో అక్కడి ప్రత్యక్ష ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసి ఓడారామె. ఆపై కొన్ని క్యాంపెయిన్లను ముందుండి నడిపించారు. తాను ఇస్లాం వ్యతిరేకినంటూ బహిరంగంగా ప్రకటించి.. ఆ మతంపై చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలూ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు.. తన ద్వేషపూరితమైన పోస్టుల కారణంగా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్‌లు, పేమెంట్స్ యాప్స్, ఆఖరికి ఫుడ్ డెలివరీ యాప్‌లు కూడా ఆమెపై కొంతకాలం నిషేధం విధించాయి.కిందటి ఏడాది ఏప్రిల్‌లో ఆమెను ఎన్నికల ప్రచారకర్తగా నియమించుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే.. రిపబ్లికన్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. అధ్యక్ష రేసు బైడెన్ తప్పుకున్న తర్వాత అదే రిపబ్లికన్లు ట్రంప్‌ను ప్రొత్సహించి లూమర్ను ప్రచారకర్తగా నియమించారు. ఆ టైంలో ట్రంప్‌తో ఆమెకు అఫైర్ ఉన్నట్లు కథనాలు రాగా.. ఆమె వాటిని ఖండించారు. ఒకరకంగా చూసుకుంటే.. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో ఈమెకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వొచ్చు. అలాంటి లూమర్ ఇప్పుడు.. ట్రంప్ పాలనలో కీలకంగా మారబోతున్న ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను తీవ్రంగా విమర్శిస్తోంది. మస్క్ సొంత ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగానే ఆమె తీవ్ర పదజాలంతో సందేశాలు పోస్ట్ చేస్తుండడం గమనార్హం. ‘‘ఎలాన్ మస్క్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషీయెన్సీ(DOGE) బాధ్యతలు అప్పగించడం సుద్ధ దండగ. అతనొక స్వార్థపరుడు. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్(MAGA) పేరుతో ఇమ్మిగ్రేషన్ పాలసీలలో తలదూర్చాలనుకుంటున్నాడు. తద్వారా అమెరికన్ వర్కర్లకు హాని చేయాలనుకుంటున్నాడు. వివేక్ రామస్వామి చేస్తున్న క్యాంపెయిన్ ఎందుకూ పనికి రానిది. రిపబ్లికన్లు అతిత్వరలో వీళ్లను తరిమికొట్టడం ఖాయం. మస్క్, రామస్వామిలు ట్రంప్‌కు దూరం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు’’ అని విమర్శించిందామె. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ ఆమెపై వెటకారంగా ఓ పోస్ట్ చేసి వదిలేశాడు..@VivekGRamaswamyThe technocratic state is more dangerous than the administrative state.Your silence on the censorship of those who wanted to put a limit on the power of big tech is deafening.DOGE can’t be allowed to be utilized as a vanity project to enrich Silicon Valley. https://t.co/81EYNTLkqx— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే.. మస్క్ తేలికగా తీసుకుంటున్నా లూమర్ మాత్రం తన విమర్శల దాడిని ఆపడం లేదు. మస్క్ పచ్చి స్వార్థపరుడని, చైనా చేతిలో పావు అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో మస్క్ ఎక్కువసేపు గడుపుతున్నాడని.. తనకు లాభం వచ్చే పనులు ట్రంప్‌తో చేయించుకునేందుకు ప్లాన్లు వేసుకుంటున్నాడని, తన స్నేహితుడు జీ జిన్‌పింగ్(చైనా అధ్యక్షుడు) కోసమే ఆరాటపడుతున్నాడంటూ తిట్టిపోసింది.ఎగిరిపోయిన బ్లూ టిక్.. మరో చర్చతప్పుడు సమాచారం, విద్వేషపూరిత సందేశాలు పోస్ట్ చేస్తోందన్న కారణాలతో.. గతంలో లారా లూమర్(Laura Loomer) ట్విటర్ అకౌంట్‌పైనా నిషేధం విధించారు. అయితే ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలుచేసిన కొన్నాళ్లకే..ఫ్రీ స్పీచ్ పేరిట చాలా మంది అకౌంట్లు పునరుద్ధరణ అయ్యాయి. అందులో ట్రంప్ అకౌంట్ కూడా ఉందన్నది తెలిసిందే. I mean right after @elonmusk called me a troll today, my account verification was taken away, my subscriptions were deactivated and I was banned from being able to buy premium even though I was already paying for premium.Clearly retaliation. https://t.co/fVskKH9Trg— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే తాజాగా లారా ఎలిజబెత్ లూమర్ హెచ్1బీ వీసాల వ్యవహారంతో ఎలాన్ మస్క్‌నే టార్గెట్ చేయడంపై.. ఆమెపై ఎక్స్(పూర్వపు ట్విటర్) చర్యలకు ఉపక్రమించింది. ఆమె అకౌంట్ నుంచి బ్లూ టిక్ ఎగిరిపోవడంతో పాటు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది.ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరో పోస్ట్ చేశారు. ట్విటర్(ఇప్పుడు ఎక్స్) కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి వాక్ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతోన్న మస్క్.. ఇప్పుడు తోక ముడిచారా? అని ఆమె ప్రశ్నించారు. -
ఈ తెలుగాయన ఆఫ్రికాని జయించాడు!
విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అనుకోవటం వేరు.. విజయాన్ని అందుకోవడం వేరు!. ఆటంకాలకు అవకాశాలుగా మార్చుకుని.. పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించిన గాథల్లో మోటపర్తి శివరామ వర ప్రసాద్(MSRV Prasad) సక్సెస్‌కు చోటు ఉంటుంది. ఆయన ఎదుగుదలా క్రమమే ‘అమీబా’గా ఇప్పుడు పాఠకుల ముందుకు వచ్చింది.చీకటి ఖండంగా పేరున్న ఆఫ్రికాలో.. అదీ అననుకూల పరిస్థితుల నడుమ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఓ తెలుగోడి ఆత్మకథే అమీబా. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) దీనిని రచించడం ఇక్కడ ఒక విశేషం కాగా.. తెలుగులో ఇది తొలిక్రైసిస్ మేనేజ్మెంట్ బుక్ కావడం మరో ప్రత్యేకత. నవ సాహితి బుక్ హౌజ్ పబ్లికేషన్స్ అచ్చేసిన ఈ బయోగ్రఫీ బుక్.. ఈ మధ్యే జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులు పాల్గొన్న ఓ ఈవెంట్లో లాంఛ్ అయ్యింది.పశ్చిమ గోదావరిలో కొవ్వలి అనే కుగ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి మోరపాటి జన్మించారు. ఆటంకాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సాగిన ఆయన ప్రయాణం.. ప్రస్తుతం సంపద విలువను రూ. 12 వేల కోట్లకు చేర్చింది. Warangal NIT లో మెటలర్జి చదివారు. గుజరాత్ లో పని చేసి, హైదరాబాద్‌లో ఫౌండ్రి పెట్టారు. తర్వాత ఆ వ్యాపారాన్ని ఘనాలో విస్తరించాడు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ స్టీల్, సిమెంట్, కెమికల్స్, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్, గార్మెంట్స్ పరిశ్రమలను స్థాపించారాయన. వాటి ద్వారా 20 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. శ్రమ, ముందు చూపు, జ్ఞానం.. తన విజయానికి కారణాలని చెప్తున్నారు. అన్నట్లు.. సారధి స్టూడియోకు ప్రస్తుతం చైర్మన్ ఈయనే. మోటపర్తి శివరామ వర ప్రసాద్ విజయ ప్రయాణం.. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, చాతుర్యం వంటి వాటికి నిదర్శనం. ఉద్యోగి సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది.:::డాక్టర్ జయప్రకాష్ నారాయణAMOEBA.. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుని.. నిర్దేశించని ప్రాంతాలను జయించిన వ్యక్తికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనం. గొప్ప విజయాల్ని అందుకోవాలనుకునేవాళ్లెందరికో ఆయన జీవితం ఓ ఆశాజ్యోతి. :::రచయిత యండమూరి వీరేంద్రనాథ్రూ.400 జీతగాడిగా(మెటాలర్జిస్ట్గా) మొదలైన ఓ తెలుగు ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం.. ఇప్పుడు సాధన సంపత్తి, అపారమైన సంపద, ఓ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించడం ఎంతైనా స్ఫూర్తిదాయకం కాదంటారా?. -
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో వందేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ శతాబ్దిక (1924 -2024 ) వార్షికోత్సవము సందర్భముగా నిర్వహించిన అతిరుద్ర మహాయాగము అత్యంత ఘనంగా జరిగింది. ఈ యాగం మార్గశిర కృష్ణ షష్ఠి డిసెంబర్21, 2024 నుంచి కృష్ణ ఏకాదశి డిసెంబర్ వరకు 6 రోజుల పాటు ఘనంగా పిజిపి హాల్, పెరుమాళ్ దేవాలయ ప్రాంగణములో26, 2024 వరకు నిర్వహించారు. గత 5 రోజుల నుంచి అత్యంత విశేష ముగా యాగాలు నిర్వహించగా, కృష్ణ ఏకాదశి డిసెంబర్ 26, 2024 రోజున మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. సభ నిర్వహించిన అతి రుద్రం కార్యక్రమం మొదటిది, సింగపూర్‌లో రెండవది. సింగపూర్‌లో మొట్టమొదటి మహారుద్రం సభ 80వ వార్షికోత్సవాలలో భాగంగా 2004లో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు . ఈ సందర్భముగా కార్యక్రమములో ఏర్పాటు చేసిన మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీల లోహిత, ఈశాన, విజయ, భీమ, దేవ దేవ, భవోద్భవ, ఆదిత్యమఖ మొదలైన ఏకాదశ(11) కలశ రుద్రఘన మండపముల వద్ద 121 ఋత్విక్యరేణ్యులు ఏక కాలము నందు రెండు ఏకాదశ రుద్రములు పారాయణ చేశారు. సుమారు 11 మంది ఋత్విక్కులు రుద్ర హావనము చేస్తూ..ఐదు రోజుల పాటు ప్రతి రోజు 2662 రుద్రముల పారాయణ చేశారు. మహా పూర్ణాహుతి అయిన ఆరవ రోజు 1331 రుద్రమల పారాయణంతో 16,896 రుద్రములు నిర్వహించారు. ఇది ఒక అతిరుద్రం ప్లస్ ఒక మహారుద్రం ప్లస్ ఏడు ఏకాదశ రుద్రాలకు అవసరమైన సంఖ్య కంటే కొంచెం ఎక్కువ. అనంతరము ఏకాదశ కలశ మండపములవద్ద రుద్రముతో అభిమంత్రించిన 121 కలసములతో శ్రీ శ్రీ శ్రీ పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వర మహా స్వామి వారికి అభిషేకము తదనంతరం రుద్రార్చన మహా పూర్ణాహుతులతో అత్యంత వైభవోపేతముగా జరిపించారు. ఈ ఆరు రోజులు సాయంత్రం, వేద పురోహితులు క్రమార్చన చేశారు, తరువాత సామవేద జపం అవధారయాలు జరిగాయి.అతిరుద్రం 2024 నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్‌డీబీబీఎస్ నిర్వహణ కమిటీలో - L కార్తికేయన్, డాక్టర్ I స్వామినాథన్, N ఆనంద్ చంద్రశేఖర్, బాలాజీ ఉన్నారు. రామస్వామి, గణేష్ రాధాకృష్ణన్, ఈశ్వర్ శ్రీనివాసన్, రాజా రామన్, ఎస్ కృష్ణన్, కె సాయిరామ్, కె రామ ప్రసాద్ మరియు వేణు మాధవ్ మల్లవరపు సభ్యులుగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే వివిధ దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 22 మంది గౌరవనీయులైన పండితులు పాల్గొనగా, వారిలో ముగ్గురు హైదరాబాద్‌లోని స్కందగిరి నుండి విచ్చేసారు. సింగపూర్ నుంచి 121 మందికి పైగా ఋత్విక్కులతో పాటు, 4 దశాబ్దాలుగా నివాసి సభ పురోహితులచే వేద సంప్రదాయాలలో శిక్షణ పొందారు. ఇందులో గత దశాబ్దముగా పరమేశ్వరుని సేవలో ఎన్నో వైదిక కార్యక్రమములు చేస్తున్న సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజము అతిరుద్రం తొలి రోజు మధ్యాహ్న భోజనం స్పాన్సర్ చేయడంతో పాటు అతిరుద్రం మహాయాగంలో చల్లా శ్రీ ప్రదాయ, చల్లా శ్రీకాంత్, అనంత్ బొమ్మకంటి, ధర్మారావు అక్కిపెద్ది, గంటి చంద్రశేఖర్, వాడాలి ప్రసాద్, బాలాజీ గరిమెళ్ళ, రాఘవేంద్ర దేవరకొండ, గిరి పిండిప్రోలు, వాసు జనపాటి, కృష్ణ అయ్యగారి, గోవర్ధన్, జగన్, ఫణీన్ద్ర, రమేష్ నేమాని, సుబ్రమణ్యం, గణపతి శాస్త్రి ఆకెళ్ళ, రామ సంతోష్ శ్రీకర్ ఆకెళ్ళ, కామేశ్వర రావు భమిడిపాటి, వెంకట రమణ పమిడిఘంటం, వంశీకృష్ణ శిష్ట్లా, రత్నకుమార్ కవుటూరు తదితరులు పాల్గొన్నారు.ప్రతిరోజు వేలాదిగా భక్తుల శివనామ స్మరణలో పిజిపి హాల్ ప్రాగణం మార్మోగింది. భక్తులకు ఋత్విక్కులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించి వేడుకలకు పవిత్రతను చేకూర్చారు. ప్రతిరోజు అన్ని పురోహితులకు సమారాధనై భోజనం వడ్డించబడింది. తిరుచ్చి నుంచి పాల్గొన్న పురోహితులలో ఒకరు కంచి మఠం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్ ఆశీర్వదించిన ప్రసాదాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్‌కు అందజేశారు.సభ అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్, కార్యక్రమ డైరెక్టర్ రాజారామన్, సభ కార్యదర్శి ఆనంద్ చంద్రశేఖర్, అందరి వాద్యార్లకు (పురోహితులు), ఋత్విక్లకు, దాతలకు, స్వచ్ఛంద సేవకులకు, అన్ని సహాయక సంస్థలకు (శ్రీ శ్రీనివాస్ పెరుమాళ్ ఆలయం, పిజిపి హాల్, శ్రీ శివన్ ఆలయం, హిందూ ఎండోమెంట్ బోర్డు, కవిత స్టోర్ & ట్రేడింగ్, ఇతర మౌలిక సదుపాయాల ప్రదాతలు) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఈ కార్యక్రమం గొప్ప విజయాన్ని సాధించింది అని నిర్వాహకులు తెలియజేశారు, పరమశివుడు చాలా సంతోషించాడు, అందుకు నిదర్శనమే ఈ 6 రోజుల కార్యక్రమంలో 3వ రోజు భారీ వర్షం కురిసింది అని నిర్వహకులు ఆనందం వ్యక్తంజేశారు.(చదవండి: టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు) -
డల్లాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
ఐనవోలు: మండలంలోని జగ్గయ్యగూడెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గొలమారి క్రాంతికుమార్ రెడ్డి(35) అనారోగ్యంతో ఈనెల 17న అమెరికాలోని డల్లాస్‌లో మృతి చెందాడు. గొలమారి జోజిరెడ్డి–లూత్‌మేరి దంపతుల కుమారుడు క్రాంతి అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాడు. అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. తీవ్ర జ్వరం రావడంతో డల్లాస్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. జ్వరానికి తోడు ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతతో మృతి చెందాడు. కాగా.. క్రాంతికి మూడేళ్ల క్రితం తెలంగాణకు చెందిన ప్రియాంకతో వివాహమైంది. ఆమె కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వీరికి ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. క్రాంతికుమార్ రెడ్డి మెదక్ జిల్లాలోని వర్గల్లో నవోదయ విద్యాలయంలో చదువుకున్నాడు. ఇక్కడ చదివిన కొందరు అమెరికాలో స్థిరపడ్డారు. మిత్రుడి మృతి వార్త తెలుసుకున్న స్నేహితులు క్రాంతి మృతదేహాన్ని స్వగ్రామానికి చేరేలా సహకరించారు. గురువారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా.. కుటుంబ సభ్యులు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. -
పార్వతీపురంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో తో కలిసి మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. తాజాగా పార్వతీపురంలో నాట్స్, గ్లో సంస్థలు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఇందులో ముఖ్యంగా విద్యార్ధుల ఆరోగ్యంపై దృష్టి సారించాయి. గిరిజన విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందించాయి. గిరిజనుల సంక్షేమానికి తన వంతు చేయూత అందించేందుకు నాట్స్ ముందు ఉంటుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. గ్లో సంస్థ సహకారంతో గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్) -
చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదం తో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. చికాగోలో పేదవారి కోసం ముందడుగు వేసింది. గడ్డ కట్టే చలిలో పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారి కోసం వింటర్ క్లాత్ డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్ ద్వారా చలికాలంలో వేసుకునే స్వెట్టర్లు, కోట్లు సేకరించింది. చిన్ననాటి నుంచే విద్యార్ధుల్లో సామాజిక సేవ అనేది అలవాటు చేసేందుకు ఈ వింటర్ డ్రైవ్‌ని నాట్స్ ఎంచుకుంది. చికాగో నాట్స్ సభ్యులు, తెలుగు కుటుంబాలకు చెందిన వారు ఈ వింటర్ క్లాత్ డ్రైవ్‌లో స్వెట్టర్లు, కోటులు, బూట్లు విరాళంగా ఇచ్చారు.. నాట్స్ చికాగో బృందం ఇలా సేకరించిన వాటిని చికాగోలోని అరోరా ఇల్లినాయిస్లో ఉన్న గుడ్ విల్ సంస్థకు విరాళంగా అందించింది. గుడ్‌విల్ సంస్థ నిరాశ్రయులకు, పేదలకు చలికాలంలో వారికి కావాల్సన సాయం చేస్తుంటుంది. నాట్స్ నిర్వహించిన వింటర్ క్లాత్ డ్రైవ్‌లో పాల్గొన్న చిన్నారులను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సేవా పథం వైపు నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. థ్యాంక్స్ గివిండే సందర్భంగా నాట్స్ చికాగో విభాగం చేపట్టిన వింటర్ క్లాత్ డ్రైవ్ సామాజిక సేవలో నాట్స్ వేసిన మరో ముందడుగు అని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. ఈ డ్రైవ్‌లో పాల్గొన్న నాట్స్ చికాగో బృంద సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్ కార్యక్రమాన్ని నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్లు హవేల మద్దెల, బిందు వీడులమూడి, లక్ష్మి బొజ్జ, రోజా సీలంశెట్టి, చంద్రిమ దాడి, సిరిప్రియ బాచు, భారతి కేశనకుర్తి, భారతి పుట్ట, సింధు కాంతంనేని, ప్రియాంకా పొన్నూరు, వీర తక్కెలపాటి, అంజయ్య వేలూరు, ఈశ్వర్ వడ్లమన్నాటి తదితరులు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో నిర్వహించారు. వింటర్ క్లాత్ డ్రైవ్ విజయంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లు సుమతి నెప్పలాలి, రాధ పిడికిటి, బిందు బాలినేని, రామ్ కేశనకుర్తి, పాండు చెంగలశెట్టి, ప్రదీప్ బాచు, బాల వడ్లమన్నాటి, వీర ఆదిమూలం, రాజేష్ వీడులమూడి, శ్రీకాంత్ బొజ్జ, గోపీ ఉలవ, గిరి మారిని, వినోత్ కన్నన్, అరవింద్ కోగంటిలకి చికాగో నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బాలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యూల్ నీల, కిరణ్ మందాడి, రవి తుమ్మల, కిషోర్ నారె, మురళి మేడిచర్ల, రాజేష్ కాండ్రు మరియు బోర్డ్ సభ్యులుగా ఉన్న ముర్తి కోప్పాక, మహేశ్ కాకర్ల, శ్రీనివాస్ అరసాడ , శ్రీనివాస్ బొప్పాన, డా. పాల్ దేవరపల్లిలు ఈ వింటర్ క్లాత్ డ్రైవ్‌కు తమ మద్దతు, సహకారం అందించినందుకు నాట్స్ చికాగో విభాగం ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు) -
‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలి
అల్వాల్ (సికింద్రాబాద్): ఎన్నారై అల్లుడు, అతని కుటుంబీకుల వేధింపులు భరించలేక..ఇంటికి తిరిగి వచ్చేసిన కూతురి వేదన చూసి కుంగిపోయిన ఓ తండ్రి కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ విషాద ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రాంనగర్ ప్రాంతానికి చెందిన జగన్మోహన్రెడ్డి (60) ఆర్టీసీ ఉద్యోగి. 2021లో తన కుమారై సేహ్న (30)కు సూరారం ప్రాంతానికి చెందిన నవీన్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన వెంటనే నవీన్‌రెడ్డి, స్నేహలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్లారు. మార్చి 2024లో నవీన్‌రెడ్డి, స్నేహ దంపతులకు ఒక పాప పుట్టింది. డెలివరీ సమయంలోనే స్నేహ అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త నవీన్‌రెడ్డి భార్యను నెలన్నర పసిపాపతో సహా అల్వాల్ రీట్రీట్ కాలనీలో ఉంటున్న స్నేహ తండ్రి జగన్మోహన్రెడ్డి వద్దకు పంపించేశాడు. ఈ క్రమంలో నవీన్ తల్లిదండ్రులు మహేందర్‌రెడ్డి, పద్మలు వీరిని వేధించారు. అనారోగ్యానికి గురయ్యావంటూ నిందించారు. అనంతరం చిన్నారిని బలవంతంగా సూరారం తీసుకెళ్లారు. ఈ విషయంపై మాట్లాడేందుకు జగన్మోహన్రెడ్డి, స్నేహలు సూరారం వెళ్లి పాపను తమకు ఇచ్చేయాలని కోరారు. దీనికి నిరాకరించిన నవీన్ కుటుంబ సభ్యులు దూషించారు. వారి వేధింపులు భరించలేక అనారోగ్యానికి గురైన కుమార్తెను తీసుకొని జగన్మోహన్రెడ్డి ఈ నెల 12వ తేదీన నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఆమెకు చూపించి.. తిరిగి వస్తూ బోయిన్‌పల్లిలో బిర్యానీ కొనుగోలు చేసి..దాంట్లో విషం కలుపుకొని కారులో కూర్చొని తిన్నారు. ఇంటికి వచ్చిన అనంతరం వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం జగన్మోహన్రెడ్డి మృతి చెందగా కూతురు స్నేహ కోలుకుంది. కూతురు జీవితం చిన్నాభిన్నం అయిందన్న వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అల్వాల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: ఊహించని విధంగా మరణం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు.. -
సింగపూర్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా జూంలో జాయిన్ అయ్యి ప్రసంగించారు. ఈ వేడుకలలో సింగపూర్ వైస్సార్సీపీ కన్వీనర్ మురళి కృష్ణ రెడ్డి, అడ్వైసర్ కోటి రెడ్డి, మలేషియా కన్వీనర్ భాస్కర్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, సందీప్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, చంద్ర, కృష్ణారెడ్డి, సుధీర్, సుహాస్, యుగంధర్, దొరబాబు, సత్యనారాయన రెడ్డి, శ్రీనాథ్, శ్రీని, మధుతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు.సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా జగనన్న నిలిచారని ప్రవాసులు కొనియాడారు. విద్య, వైద్యం, పోర్టులు వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిరాని ప్రశంసించారు. -
ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-28 ఎన్నికల ఫలితాలు : సరికొత్త చరిత్ర
అమెరికన్ తెలుగు అసోసియేషన్ -బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు రికార్డ్ సృష్టించాయి. ఆటా చరిత్రలోనే ఫస్ట్ టైం నాన్ స్లేట్ మెంబర్స్ ఆధిక్యం కనబరిచారు. లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 9 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు గాను, ఆటా ఎలక్షన్ కమిటీ రికమెండ్ చేసిన నలుగురు స్లేట్ అభ్యర్థులు గెలుపొందారు. ఐదుగురు నాన్ స్లేట్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించి.. ప్రత్యేకతను చాటారు. స్లేట్ నుంచి గెలిచిన వారిలో న్యూజెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం , అట్లాంటా వాసి శ్రీధర్ తిరుపతి , హ్యూస్టన్ వాసి శ్రీధర్ కంచరకుంట్ల , వర్జీనియా వాసి సుధీర్ బండారు ఉన్నారు.నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజిల్స్ వాసి విజయ్ రెడ్డి తూపల్లి , చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర RV రెడ్డి విజయం సాధించించారు. నాన్ స్లేట్ నుంచి గెలిచిన వారిలో విజయ్ కుందూర్ - న్యూజెర్సీ, విష్ణు మాధవరం- వర్జీనియా, శ్రీనివాస్ శ్రీరామ - అట్లాంటా ఉన్నారు.న్యూ జెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. సంతోష్ కోరం ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ నుంచి రెండు వైపులా ఓటర్లను ఆకర్షించి.. తన ప్రత్యేకతను చాటుకున్నారు.నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజిల్స్ వాసి విజయ్ రెడ్డి తూపల్లి, చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర RV రెడ్డి విజయ ఢంకా మోగించారు. వీరి గెలుపుతోనే ఆటా చరిత్రలోనే మొట్టమొదటిసారి నాన్ స్లేట్ అభ్యర్థుల హవా కనబడింది. గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో ముగ్గురు కాశీ విశ్వనాథ రెడ్డి కొత్త, రామ్ మట్టపల్లి, శ్రీధర్ బాణాల.. స్లేట్ నుంచి గెలిచారు. ప్యాట్రన్ కేటగిరీలో ఒకరు స్లేట్ నుంచి, ఇద్దరు నాన్ స్లేట్ నుంచి గెలిచారు. శారద సింగిరెడ్డి, రవీందర్ కె. రెడ్డి, వెన్ రెడ్డి ప్యాట్రన్ కేటగిరీలో విజయం సాధించారు. న్యూ జెర్సీ , అట్లాంటా, వర్జీనియా నుండి ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ అభ్యర్థులు గెలపొందడం విశేషం. ఈ ఎన్నికల్లో గెలిచిన వారందిరికీ ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందనలు తెలిపారు. -
అట్లాంటాలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా
అమెరికాలోని అట్లాంటాలో వైయస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరైనారు. జగన్ అన్న పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ పార్టీ అభిమానులతోపాటు, ,విదేశాల్లో ఉన్న మన తెలుగు ఎన్నారైలు కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నారని నాగార్జునరెడ్డి వెల్లడించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను, సూపర్.6. ప్రజలు గమనిస్తున్నారని,వారి లోపాలను.. మోసాలను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వివరించాలని అన్నారు. జగనన్న 2019లో 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఎన్నికల ముందు నవరత్నాలు. . పథకాలను అమలు చేస్తానని వాగ్దానం చేసి అధికారులు వచ్చిన తర్వాత నవరత్నాలు పూర్తిగాఅమలు చేసిన ఘనత జగనన్నదే అన్నారు. కులం,మతం, ప్రాంతం, పార్టీ లు చూడకుండా..అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అన్నీ అందాయని, టిడిపి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు అన్నారు. ఇప్పుడు విజన్ 2047.. అని కొత్త రాగం పాడుతున్నారని విమర్శించారు. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు.. ఇక్కడి తెలుగు ఎన్నారైలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ,దినకర్, ఉదయ్, ముఖ్య అతిథులుగా వెంకట్రామిరెడ్డి గిరీష్ రెడ్డి , సందీప్ పాల్గొన్నారు. -
మెల్బోర్న్లో ఘనంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
వైయస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో YSR కేడర్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ నాయకులు వై ఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, కుంచె రమణారావు లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో ఎప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి సాధనలను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కృషిని ప్రశంసించారు.ఆస్ట్రేలియా - టీం మెల్బోర్న్ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, నాగార్జున.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న స్ఫూర్తి అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. -
ట్రంప్ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్‌గా 'శ్రీరామ్ కృష్ణన్'ను నియమించారు. గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్‌లో పనిచేసిన కృష్ణన్.. ఇక వైట్ హౌస్ ఏఐ & క్రిప్టో జార్‌గా ఉండే 'డేవిడ్ సాక్స్'తో కలిసి పని చేయనున్నారు.''దేశానికి సేవ చేయడం, ఏఐలో అమెరికా నాయకత్వానికి సన్నిహితంగా పనిచేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు'' అంటూ.. శ్రీరామ్ కృష్ణన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.🇺🇸 I'm honored to be able to serve our country and ensure continued American leadership in AI working closely with @DavidSacks. Thank you @realDonaldTrump for this opportunity. pic.twitter.com/kw1n0IKK2a— Sriram Krishnan (@sriramk) December 22, 2024''శ్రీరామ్ కృష్ణన్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా నియమించినందుకు సంతోషిస్తున్నాము" అని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు.I am pleased to announce the brilliant Team that will be working in conjunction with our White House A.I. & Crypto Czar, David O. Sacks. Together, we will unleash scientific breakthroughs, ensure America's technological dominance, and usher in a Golden Age of American Innovation!…— Trump Posts on 𝕏 (@trump_repost) December 22, 2024ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?చెన్నైలో పుట్టిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు.విండోస్ అజూర్ వ్యవస్థాపక సభ్యుడిగా మైక్రోసాఫ్ట్‌లో కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్.. తరువాత మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్ వంటి వాటిలో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. కాగా ఇప్పుడు ఈయన వైట్ హౌస్‌లో పనిచేయనున్నారు. -
విదేశాల్లోనూ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను అనేక దేశాల్లోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అక్కడి బే ఏరియా, డల్లాస్, అట్లాంటా, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో ఎన్నారైలు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీఎత్తున కేక్‌లు కట్‌చేసి.. విందు భోజనాలతో ఘనంగా నిర్వహించారు. అలాగే.. బ్రిటన్‌లోనూ అంగరంగ వైభవంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. లండన్ ఈస్ట్ హాంలో వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్చింతా ప్రదీప్, ఓబుల్‌రెడ్డి పాతకోట అధ్యక్షతన నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో ఆ దేశం నలుమూలల నుంచి జగన్ అభిమానాలు భారీఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రదీప్ మాట్లాడుతూ.. ఒకటే జీవితం, ఒక్కటే రాజకీయ పార్టీ, ఒక్కడే నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పడంతో జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ విమలారెడ్డి తనయుడు యువరాజ్‌రెడ్డి ఆన్లైన్లో యూకేలోని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నారైలకు అభినందనలు : చెవిరెడ్డిఅనేక దేశాల్లో భారీఎత్తున వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్నారైలను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. జగన్ పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని.. జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు.సింగపూర్‌లోనూ సంబరాలు..వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సింగపూర్‌లో కూడా ఆదివారం ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సింగపూర్ వైఎస్సార్సీపీ కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి, అడ్వైజర్ కోటిరెడ్డి, మలేసియా కన్వీనర్ భాస్కర్‌రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు. సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా.. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా.. విద్య, వైద్యం, పోర్టులు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారని జగన్‌ను కొనియాడారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! దుబాయ్‌లో అత్యంత వైభవంగా..ఇక యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరావు, వైఎస్సార్సీపీ ఎన్నాౖరె కమిటీ సలహాదారు ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ యూఏఈ కో–కన్వీనర్ మైనర్ బాబు, తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్‌లోని హోటల్ విస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఆ దేశం నలుమూల నుంచి అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు. అనంతరం.. కారుమూరి నాగేశ్వరావు తదితర వక్తలు జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా శక్తివంచన లేకుండా పనిచేసి వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించుకుని.. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేద్దామని పిలుపిచ్చారు. మరోవైపు.. కెనడా, ఖతార్, నెదర్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా (మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్), జర్మనీ తదితర దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారుగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన విద్యార్థి బండి వంశీ(25) శనివారం రాత్రి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మాదన్నపేటలో కల్లుగీత వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే బండి రాజయ్య–లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి చిన్న కుమారుడు వంశీ సుమారు రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల(ఎంఎస్) కోసం అమెరికాకు వెళ్లాడు. కాంకోర్డియా సెయింట్ పాల్ విశ్వవిద్యాలయం చదువుతూ.. 8580 మాగ్నోలియా ట్రైల్ ఈడెన్ ప్రెయిరీ అపార్ట్మెంట్, రూం నంబర్ 206, మిన్నెసోటా 55344లో ఉంటున్నాడు. శనివారం రాత్రి అపార్ట్మెంట్ కింద ఉన్న సెల్లార్లో పార్కుచేసి కారులో వంశీ ఉరి వేయబడి అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో.. పక్క అపార్ట్మెంట్లో ఉంటున్న కంఠాత్మకూర్ వాసి విషయాన్ని ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులకు తెలుపగా వారు వంశీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వంశీ మృతితో మాదన్నపేటలో విషాదం అలుముకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వంశీ మృతదేహాన్ని త్వరితగతిన స్వస్థలానికి తెప్పించాలని, మృతికి కారకులను చట్టపరంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ఇదిలా ఉండగా.. వంశీ మృతి విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు.మృతదేహాన్ని తెప్పించేందుకు కృషి చేస్తా : ప్రణవ్అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వంశీ మృతదేహాన్ని ప్రభుత్వ పరంగా వీలైనంత త్వరితగతిన స్వగ్రామానికి తెప్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ తెలిపారు. ఆయన మాదన్నపేటకు వెళ్లి వంశీ తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..
చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మార్పులు వీసా ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవతం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అపాయింట్‌మెంట్‌ని ఒకసారి రీషెడ్యూల్ చేయవచ్చు. అయితే మీరు రెండోసారి రీషెడ్యూల్ చేసినా లేదా అపాయింట్‌మెంట్‌ని మిస్ చేసినా.. మీకు మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ అవసరం. దీనికోసం మీరు మళ్ళీ సుమారు రూ. 15,730 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.రెండోసారి రీషెడ్యూల్ చేసిన సమయానికి వెళ్తే మళ్ళీ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అపాయింట్మెంట్ రోజున మీరు తప్పకుండా సమయానికి చేరుకోవాలి. అప్పుడే వీసా ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని యూఎస్ ఎంబసీ తెలిపింది.హెచ్-1బీ వీసా నిబంధనలలో మార్పులుయూఎస్ హెచ్-1బీ వీసాను చాలామంది దుర్వినియోగం చేస్తున్న కారణంగా.. దీనిని నిరోధించడానికి కొన్ని మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై నిపుణులు మాత్రమే ఈ వీసాను పొందవచ్చు.2025 జనవరి 17 నుంచి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు తమ విద్యార్హత నేరుగా వారు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించుకోవాలి. ఈ నిబంధన ప్రకారం.. ఎలాంటి స్పెషలైజేషన్ లేని వారు హెచ్-1బీ వీసా పొందడం కష్టం.సింపుల్‌గా చెప్పాలంటే, ఐటీ ఫీల్డ్ ఉద్యోగాల కోసం.. మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉంటే మాత్రమే మీకు హెచ్-1బీ వీసా లభిస్తుంది. అంతే కాకుండా.. ఇప్పుడు హెచ్-1బీ వీసా పొడిగింపు ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మునుపటి ఆమోదాల ఆధారంగా పొడిగింపు అభ్యర్థనను ప్రాసెస్ చేయనున్నారు. ఇలా చేయడం వల్ల పేపర్ వర్క్ తగ్గడం మాత్రమే కాకుండా.. నిర్ణయాలు త్వరగా వచ్చేస్తాయి. కంపెనీలు కూడా హెచ్-1బీ ప్రోగ్రామ్ నిబంధనలను అనుసరిస్తున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది.ఇంటర్వ్యూ మినహాయింపులో మార్పులుఇంటర్వ్యూ మినహాయింపులో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో యూఎస్ వీసా కోసం అప్లై చేసుకున్న వ్యక్తి ఇకపై ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి పాత రికార్డులు ఉపయోగించనున్నారు. ఈ రూల్ తరచుగా యూఎస్ వెళ్లాలనుకునే వారికి ప్రయోజనం చేకూర్చుతుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలుమార్పులు ఎందుకంటే?హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో చేసిన ఈ మార్పులు.. టెక్ పరిశ్రమతో సహా కీలక పరిశ్రమల అవసరాలను తీర్చడానికి యూఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చూపిస్తుంది. సిలికాన్ వ్యాలీ.. ఇతర యూఎస్ టెక్ హబ్‌లకు నైపుణ్యం కలిగిన కార్మికులకు భారతదేశం ప్రధాన వనరు. కాబట్టి.. ఈ మార్పులు బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి మాత్రమే కాకుండా, ఐటీ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతాయి.