
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్-మాట బోర్డు మీటింగ్ డల్లాస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట 2025-26 పదవీకాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మాట అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దగి బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ గూడూరు, సెక్రటరీగా విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్ గా శ్రీధర్ గూడాల నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు, శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, అడ్వైజరీ కౌన్సిల్ మెంబెర్ జితేందర్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ బోర్డు మీటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీ, సలహా మండలి, బోర్డు, గౌరవ సలహాదారులు సహా 250 మందికి పైగా మాట ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.ఈ సందర్భంగా భవిష్యత్ లక్ష్యాలను నూతన అధ్యక్షుడు వెల్లడించారు. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కృతి, సమానత్వం ప్రధాన సూత్రాలుగా మాట సంస్థ ఏర్పడిందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా మాట తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన అడ్వైజరీ కౌన్సిల్ , న్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరక్టర్స్, స్టాడింగ్ కమిటీ మెంబర్స్, RVP’s, RC’s గౌరవ సలహాదారులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment