Mata
-
న్యూజెర్సీలో మాటా ఫ్రీ హెల్త్ క్యాంప్
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ ను ప్రారంభించింది. న్యూజెర్సీ, ఎడిసన్‌లోని సాయి దత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్‌కి విశేష స్పందన వచ్చింది. ఫ్లు ఇంజెక్షన్ తోపాటు Free Medication అందజేశారు. వాలంటీర్లు, డాక్టర్లు పాల్గొని సేవలందించారు.ఈ సందర్భంగా మాటా తరుపున చేస్తున్న సేవా కార్యక్రమాలను సంస్థ సభ్యులు వివరించారు. అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్‌లో అతి తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాటా అన్నారు. మూడు వేల మంది సభ్యులతో ప్రారంభించి.. అనేక రాష్ట్రాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఫ్రీ హెల్త్ క్లినిక్ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, డాక్టర్లందరికీ మాటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాటా సంస్థని పలువురు అభినందించారు. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు మాటా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు
బుర్హాన్పూర్: మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు.శరన్నవరాత్రులలో రేణుకా మాత ఆలయ సమీపంలో ప్రతీయేటా జాతర నిర్వహిస్తారు. ఈ జాతర 9 రోజుల పాటు ప్రతీరోజూ ఉదయం 5:00 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఆలయంలో అమ్మవారికి మూడుసార్లు హారతి నిర్వహిస్తారు. నవరాత్రులలో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలువుతుంది. రేణుకా మాత ఆలయ పూజారి జై శుక్లా మాట్లాడుతూ తమ కుటుంబం ఏడు తరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నదన్నారు. ఈ ఆలయం సుమారు వెయ్యేళ్లనాటిదని, పెళ్లికానివారు రేణుకామాతను దర్శించుకుంటే వారికి త్వరగా వివాహమవుతుందనే నమ్మకం స్థానికుల్లో ఉన్నదన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని పలు జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు. ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ! -
ఎడిసన్ లో ఘనంగా MATA బోనాల జాతర
-
‘మాట’తో చేస్తున్న సేవకు ఆనందంగా ఉంది: శ్రీనివాస్ గనగోని
మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్ ) ప్రారంభించిన పదినెలల్లోనే 22 బ్రాంచిలు ఏర్పాటు చేసి దాదాపు 5000 మందితో అనేక సేవ కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అసోసియేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని. మాట అధ్వర్యంలో ఫిబ్రవరి 17 నుంచి వివిధ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 10 వరకు ఈ సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న కంటి కాటరాక్ట్ ఆపరేషన్ల క్యాంప్ నేటితో(ఫిబ్రవరి 28) ముగియనుంది. ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ.. ఇండియాలో ఈ నెల 17న వరంగల్‌లో 500 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు మరియు జనరల్ మెడిసిన్ ట్రీట్మెంట్లు చేశాము. 18న ఆశలపల్లిలో మరో 300 మందికి క్యాన్సర్ టెస్ట్‌లతో పాటు జనరల్ టెస్ట్‌లు కూడా చేసి మందులను ఉచితంగా పంచిము. అలాగే 19న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శంకర్ నేత్రాలయ వారితో కలిసి కంటి ఆపరేషన్లకు సంబంధించి 2300మంది వరకు టెస్ట్‌లు చేశాము. దాదాపు 200 మందికి ఆపరేషన్లు నిర్వహించి 100 మందికి ఉచిత కళ్లజోళ్లను పంపిణి చేశాము. మరో 250 మందిని చెన్నైకి పంపించి వైద్యం చేయిస్తున్నాం. ఇదంతా చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని అన్నారు. ఫెస్టివల్స్ ఫర్ జోయ్ అధ్యక్షురాలు, ప్రముఖ యాంకర్ సుమ కనకాల మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంతో మానవత్వం ఉండాలి. అలాంటి మానవత్వం ఉన్న ఎంతో మంది కలిసి చేయబట్టే దాదాపు 2000మందికి పైగా ఈ రోజు ఐ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయగలిగారని, దాదాపు 195 ఆపరేషన్లు జరిగినందుకు శంకర్ నేత్రాలయ టీమ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ–‘‘ గతంలో నన్ను అందరూ సుమ భర్త అని ఎవరన్నా అంటుంటే చిరగ్గా ఉండేదని ఇప్పుడు సుమ ఇలాంటి మంచిపనులు చేస్తున్నందుకు సుమ భర్త అంటుంటే ఎంతో గర్వంగా ఉందని కాలర్ ఎగరేసుకుని మరి సుమ భర్తనే అని చెప్పుకోవాలి అనిపిస్తుంది’’ అన్నారు. కార్యక్రమంలో శంకర్ నేత్రాలయ ప్రతినిధి అరుల్, డాక్టర్ విజయ్ భాస్కర్ బొలగం, ప్రవాసాంధ్రుడు ప్రదీప్ సామల టివి ఫెడరేషన్ సభ్యులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మాట చికాగో చాప్టర్ కిక్ ఆఫ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
-
మాట బోర్డు మీటింగ్ విజయవంతం
-
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్
-
ఆమె నియంత హిట్లర్‌కు గూఢచారి.. తన నృత్యాలతో కవ్విస్తూ..
‘మాతా హారీ’.. ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన గూఢచారి. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢచారిగా పనిచేసిన మాతా హారీ యూరప్‌ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్‌కు గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణలతో ఆమెను హత్య చేశారు. ఆమె గూఢచార విద్యలో ఆరితేరినదే కాకుండా అందగత్తె, డ్యాన్సర్. నెదర్లాండ్‌లో 1876లో జన్మించిన మాతాహారి అసలు పేరు గెర్ట్రూడ్ మార్గరెట్ జెలె. గూఢచర్యం ఆమె వృత్తి. మాతాహారీకి పలు దేశాల సైన్యాధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన అపరిమితమైన కోరికలను తీర్చుకునేందుకు ఆమె 1905లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకుంది. ఆమె తన అందచందాలతో కొద్దికాలంలోనే అధికారులకు సన్నిహితురాలిగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్ అంతా పర్యటించేది. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేవరకూ ఆమె ఒక డాన్సర్, స్ట్రిప్పర్గానే ఉంది. ఆమె నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథమహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్ కోసం, ఫ్రాన్స్ కోసం ఆమె గూఢచర్యం చేసేదని చెబుతుంటారు. మాతాహారీ హత్య అనంతరం 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతాహారీ జర్మనీకి గూఢచర్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడయ్యింది. గూఢచర్యం చేస్తున్నదన్న ఆరోపపణల మేరకు ఆమెను 1917లో అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్ మాత్రమేనని కోర్టు తీర్పుచెప్పింది. అయితే ఆ తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు. ఇది కూడా చదవండి: బర్త్‌డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టుజుట్టూ పట్టుకున్న యువతులు! -
ఘనంగా ‘మన అమెరికన్ తెలుగు అసొసియేషన్’ ప్రారంభోత్సవం
ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ తెలుగు ప్రజల నుంచి మరో అసొసియేషన్ ప్రారంభమయింది. ‘మన అమెరికన్ తెలుగు అసొసియేషన్’ (మాట) పేరుతో న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్ పాలెస్ వేదికగా లాంచింగ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అమెరికాలో వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన 2500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. 2 వేల మంది లైఫ్ మెంబర్లతో 20 నగరాల్లో చాప్టర్లను ప్రకటించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షించడం, అమెరికాలో ఉంటోన్న తెలుగు వారికి అండగా నిలవడం, మహిళా సాధికారతతో పాటు యువతను ప్రోత్సహించడం, సీనియర్ సిటిజన్లకు మరింత మెరుగైన సంరక్షణను అందించడం లక్ష్యంగా మన అమెరికన్ తెలుగు అసొసియేషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మాట కోర్ టీంలో శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, శ్రీ అట్లూరి, శ్రీధర్ చిల్లర, దాము గెడల, స్వాతి అట్లూరి, జితేందర్ రెడ్డి, స్టాన్లీ రెడ్డి, పవన్ దర్శి, ప్రసాద్ కూనిశెట్టి, శేఖర్ వెంపరాల, హరి ఇప్పనపల్లి, గంగాధర్ ఉప్పల, కిరణ్ దుగ్గడి, విజయ్ భాస్కర్ కలాల్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో మాట ఫౌండర్లయిన శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల సంస్థ లక్ష్యాలను వివరించారు. అలాగే యూత్ టీంకు సంబంధించిన విజన్‌ను లక్ష్మీ మోపర్తి తెలియజేశారు. వడ్డేపల్లి కృష్ణ రాసిన ‘మాట’ స్వాగత గీతాన్ని స్వాతి అట్లూరి నేతృత్వంలోని బృందం ప్రదర్శించగా, పార్థసారథి మ్యూజిక్ అందించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత, అనిరుధ్ తమ సంగీతంతో ఆహుతులను అలరించారు. -
ఇన్స్టాగ్రామ్ స్టార్‌కి కరోనా..
టెహ్రాన్ : ఇన్స్టాగ్రామ్ స్టార్‌గా పాపులర్ అయిన సహర్ తబారా కరోనా వైరస్ బారిన పడింది. 22 ఏళ్ల ఇరానియన్ స్టార్ అయిన ఈమె ప్రస్తుతం టెహ్రాన్‌లోని సినా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంది. హాలీవుడ్ నటి ఏంజెలినీ జోలీలా తన రూపురేఖలను మార్చుకునేందుకు 50 కిపైగానే ఆపరేషన్లు చేయించుకుంది. అవి బెడిసికొట్టి ఉన్న అందం కాస్తా వికృతంగా తయారు అయింది. సోషల్ మీడియా స్టార్ సహార్ తబార్ అసలు పేరు ఫతేమే ఖిష్వండ్. చూడటానికి వింతగా కనిపించే ఆమె ముఖాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన తర్వాత ఒక్కసారిగా ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. అయితే దైవదూషణ, హింసను ప్రేరేపించడం, యువకులను అవినీతికి ప్రోత్సహించడం, తగని మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందడం వంటి ఆరోపణలపై గతేడాది అక్టోబరులో తబార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్నప్పటికీ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించినట్టు ఇరాన్‌లోని మానవ హక్కుల సంఘం పేర్కొంది. -
మాతా, శిశు సంరక్షణకు హెల్త్ బాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మాతా, శిశు సంరక్షణకు సంబంధించి అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) ప్రపంచంలోనే తొలి హెల్త్ ఇంపాక్ట్ బాండ్‌ను ఆవిష్కరించింది. ఈ ’ఆరోగ్య అభివృద్ధి బాండ్ల’ పథకాన్ని తొలుత మాతా, శిశు మరణాల రేటు అత్యధికంగా ఉంటున్న రాజస్తాన్‌లోని 14 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. రాజస్తాన్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్ పేరిట ఆవిష్కరించిన ఈ పథకాన్ని ’ఉత్కృష్ట’ ఇంపాక్ట్ బాండ్‌గా వ్యవహరించనున్నట్లు యూఎస్ఏఐడీ అడ్మినిస్ట్రేటర్ మార్క్ గ్రీన్ వెల్లడించారు. వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం ద్వారా మాతా, నవజాత శిశువుల మరణాలను నివారించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ బాండ్ విధానం పనిచేస్తుందని గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా గ్రీన్ గురువారమిక్కడ తెలిపారు. ముందుగా ప్రైవేట్ పెట్టుబడులతో రాజస్తాన్‌లోని ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. నిర్దేశిత ప్రమాణాలు, లక్ష్యాలు సాధిస్తేనే యూఎస్ఏఐడీ ఆ పెట్టుబడులను తిరిగి చెల్లిస్తుందని గ్రీన్ చెప్పారు. యూఎస్ఏఐడీ, మెర్క్ ఫర్ మదర్స్, ది యూబీఎస్ ఆప్టిమస్ ఫౌండేషన్, హెచ్ఎల్ఎఫ్పీపీటీ, పీఎస్ఐ సంస్థల భాగస్వామ్యంతో ఇది అమలవుతుంది. ప్రాథమికంగా 35 లక్షల డాలర్ల నిధులు.. ఐదేళ్ల వ్యవధిలో సుమారు 10 వేల మంది దాకా మహిళలు, నవజాత శిశువుల ప్రాణాలు కాపాడవచ్చని అంచనా వేస్తున్నట్లు గ్రీన్ వివరించారు. ఈ బాండ్ కోసం యూబీఎస్ ఆప్టిమస్ ఫౌండేషన్ ప్రా«థమికంగా సుమారు 35 లక్షల డాలర్ల వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చనుంది. హెచ్ఎల్ఎఫ్పీపీటీ, పీఎస్ఐ ఈ నిధులతో దాదాపు 440 ప్రైవేట్ హెల్త్‌కేర్ సెంటర్స్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి వెచ్చిస్తాయని గ్రీన్ చెప్పారు. మరోవైపు క్షయ వ్యాధిపై అవగాహన పెంచేందుకు, 2025కల్లా క్షయ వ్యాధిరహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు మరో 10 లక్షల డాలర్లు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. ఫీడ్ ది ఫ్యూచర్ పేరిట ఆఫ్రికాలోని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు తోడ్పాటునిచ్చేందుకు 20 లక్షల డాలర్లు వెచ్చించనున్నట్లు గ్రీన్ చెప్పారు. అటు డిజిటల్ టెక్నాలజీని మహిళలకు కూడా మరింతగా చేరువ చేసే దిశగా వచ్చే ఏడాది తొలినాళ్లలో ఉమెన్ కనెక్ట్ చాలెంజ్ మొదలైనవి ప్రకటించనున్నట్లు గ్రీన్ వివరించారు. అంచనాలు మించిన జీఈఎస్.. మూడు రోజులపాటు జరిగిన జీఈఎస్‌కి అంచనాలను మించిన స్పందన లభించిందని మార్క్ గ్రీన్ హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా లభించిన ఆదరణ, యువ ఎంట్రప్రెన్యూర్స్ ఉత్సాహంగా పాలుపంచుకున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన చెప్పారు. స్వయం సమృద్ధి సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్న భారత్‌తో అమెరికాకు దృఢమైన బంధం ఉందని గ్రీన్ పేర్కొన్నారు. సుమారు 60 ఏళ్ల క్రితం అమెరికా నుంచి ఆహారపరమైన సాయం అందుకున్న స్థాయి నుంచి ప్రస్తుతం భారత్ సమాన భాగస్వామి స్థాయికి ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం కావడానికి జీఈఎస్ దోహదపడగలదని యూఎస్ఏఐడీ సీనియర్ డిప్యూటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ మిషెలీ బెకరింగ్ తెలిపారు. -
మాటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
హాప్కిన్స్: బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాలను మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్(మాటా) హప్కిన్స్ లో ఈ నెల 8న ఘనంగా నిర్వహించింది. ఈ మేరకు మాటా ఓ ప్రకటన విడుదల చేసింది. హాప్కిన్స్ నగరంలోని హాప్కిన్స్ హైస్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకలకు 800మందికి పైగా హాజరయైనట్లు తెలిపింది. శనివారం మధ్యాహ్నం గణపతి పూజతో ప్రారంభమైన వేడుకలు సాంస్కృతిక కార్యకమాలతో ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. 160 మంది అతిథులు భారతదేశం నుంచి ఈ వేడుకలకు హాజరైనట్లు వివరించారు. బతుకమ్మ కోలాటం, 23 గ్రూపులు ఇచ్చిన డ్యాన్స్ ప్రదర్శనలు వేడుకలకు హైలెట్ గా నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బతుకమ్మ కమిటీ, వాలంటీర్లు కవిత కపిడి, అశ్మిని గునుగంటి, మాలతి కూర, హారిక అర్ర, శివాని రాచర్ల, అనూష కదర్ల, శిరీష కాకుమాను, రజిత గీనుగలకు నిరంజన్ ధన్యవాదాలు తెలిపారు. విద్యలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన నలుగురు విద్యార్ధలకు మాటాతో కలిసి మహిపతి ఫౌండేషన్ అవార్డులు ప్రధానం చేసింది. రాకేష్ కంజుల, ఆదిత్య తుర్లపాటిలు కలిసి మాటా-2016 చారిటీ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మనమాటా-మనఊరు పేరుతో మారుమూల గ్రామాల్లో వసతులు కల్పించేందుకు మాటా నడుంబిగించింది. జీడికల్లు జెడ్ పీపీఎస్ఎస్, లింగాల ఘాన్ పూర్ మండలాల్లో స్కూళ్లకు మౌలిక వసతులను కల్పించింది. ఈ సందర్భంగా 2017 బోర్డు మెంబర్లు ప్రెసిడెంట్: నిరంజన్ అల్లంనేని, ఉపాధ్యక్షుడు: సక్రూ నాయక్, ప్రధాన కార్యదర్శి: శ్రీనివాస్ గడ్డం, జాయిట్ సెక్రటరీ: రాజా ముదిగంటి, ట్రెజరర్: రమేష్ కోమాకుల తదితరులను ప్రేక్షకులకు మాటా ప్రస్తుత చైర్మన్ మహేందర్ గింగువా పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి మహిపతి ఫౌండేషన్ చైర్మన్ నాగేందర్ మహిపతి, హిందూ టెంపుల్ ఆఫ్ మిన్నెసోటా చైర్మన్ అక్షయ పండా, తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిత చిమటలు హాజరయ్యారు. వేడుకలు విజయవంతకావడానికి కృషి చేసిన మాటా బోర్డు ఉపాధ్యక్షులు నిరంజన్ అల్లంనేని, జనరల్ సెక్రటరీ రాకేష్ కంజుల, జాయింట్ సెక్రటరీ సక్రూ నాయక్, ట్రెజరర్ బుచ్చిరెడ్డి ముదిరెడ్డి, బోర్డు మెంబర్లు రమేశ్ కోమాకుల, రాజశేఖర్ బాచిగారి, సారథి తాళ్ల, శ్రీనివాస్ గడ్డం, యుగంధర్ పట్టూరి, నాగేందర్ నెళ్లా, రాజా ముదిగంటి, భవానీ రాం చెప్పుకూరి, రాజ్ కుమార్ కౌకోటి, అశ్విని గునుగంటి, శ్రీనివాస్ బాచిగారి, శివాని రాచర్ల, మాలతి కూర, అనుష కాదర్ల, కవిత కపిడి, ఆదిత్య తుర్లపాటి, శ్రీపాద్ దేవరాజు, అమర్ చిన్నోల, రవి భీమ, మురళి లక్కరాజులను మాటా బోర్డు చైర్మన్ మహేందర్ గింగువా అభినందించారు. -
మిన్నెసోటాలో ఘనంగా బోనాల పండుగ
మిన్నెసోటా(యూఎస్): మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్(మాట) ఆధ్వర్యంలో బోనాలు, వనభోజనాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు కుటుంబాల కోలాహలంతో హేలాండ్ పార్క్ కళకళలాడింది. మాట అధ్యక్షులు మహేందర్ గినుగ, వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అల్లంనేని, బుచ్చిరెడ్డి ముదిరెడ్డిల పర్యవేక్షణలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మాట వారు పచ్చని పందిరిలో అమ్మవారిని పీఠంపై ఉంచి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని తెలుగు వారందరూ పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలు తెచ్చిన వారందరు అమ్మవారిని పూజించి, దీవెనలు అందుకున్నారు. అనంతరం మాటవారు ఏర్పాటు చేసిన విందు భోజనం అందరూ ఆరగించారు. -
అమ్మతనానికి అడ్డు‘కోత’
నకిరేకల్ పట్టణానికి చెందిన ప్రసన్న గత నెల 26వ తేదీన ప్రసవం కోసం స్థానిక ఏరియాస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకున్నారు. తీరా అక్కడ పనిచేస్తున్న ఓ ప్రైవేట్ క్లినిక్ మధ్యవర్తి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని..ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఆమె సూచించిన ఆస్పత్రికి వెళ్లగా.. అవసరం లేకున్నా ప్రసన్నకు సిజేరియన్ చేశారు. రూ.21 వేల బిల్లు చేతికిచ్చారు. * అవసరం లేకున్నా ఆపరేషన్లు * ఏటా ఏడు వేలకుపైగా సిజేరియన్లు * పెరుగుతున్న మాత,శిశు మరణాలు * ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల వర్షం సూర్యాపేట : జిల్లాలోని దాదాపు 90 శాతం ప్రభుత్వాస్పత్రులు, 24 గంటల పీహెచ్‌సీలు, కమ్యూనిటీహెల్త్ సెంటర్లలో ఇదే పరిస్థితి. గర్భిణులకు శస్త్ర చికిత్సల పేరిట కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వపరంగా అందజేయాల్సిన ‘జాతీయ ఆరోగ్య గ్రామీణ మిషన్’లో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గర్భిణులు ప్రైవేటు వైద్యసేవల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. మాత, శిశు మరణాలను తగ్గించడానికి ఏటా రూ.కోట్లలో నిధులు విడదలవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించి ప్రభుత్వ ఆస్పత్రులకు రప్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేసి అమ్మతనాన్ని తెలిపే పురిటినొప్పులను చెరిపేస్తున్నారు. ధరలు ఏవీ..? ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి ఇష్టానుసారంగా తయారైంది. రక్తం గ్రూపు తెలుసుకోవడం నుంచి పెద్దస్థాయి శస్త్ర చికిత్సల వరకు ఏయే సేవలకు ఎంత రుసుం చెల్లించాలనే వివరాలు జిల్లాలో ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కన్పించడం లేదు. ఫలితంగా కాసులకు కక్కుర్తి పడి కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు సిజేరియన్లు చేయడానికే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వెలిశాయంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అనుభవం లేని వైద్యులు ఆపరేషన్లు చేస్తుండడంతో అవి వికటించి మాత,శిశు మరణాలు సైతం పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు ఎటా సగటున 7500 మంది స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సగటున ఏడాదికి 3 వేల సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు పోటీగా రెట్టింపు సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్తండాకు చెందిన బుజ్జికి నెలలు పూర్తిగా నిండడంతో స్థానిక పీహెచ్‌సీకి కాన్పుకోసం వెళ్లింది. పరిస్థితి విషమించిందని, ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. ఆటోలో వెళ్తుండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. -
‘పౌష్టికం’ కాదు సుమా!
* అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం కందిపప్పు * వాస్తవమేనంటున్న అధికారులు రాయవరం : మాత, శిశు మరణాలను అరికట్టడంతో పాటు, ఆరోగ్యవంతమైన శిశువులను సమాజానికి అందించాలనే లక్ష్యంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహారాన్ని అందజేస్తోంది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, శిశువులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకమైన పౌష్టికాహారం అందుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటూరులో అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకమైన కందిపప్పు సరఫరా అయినట్టు సమాచారం. ఇంకా అనేక కేంద్రాలకు ఇలా నాసిరకమైన కందిపప్పు అందినట్టు తెలుస్తుంది. అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు పప్పుతో కూడిన భోజనం వండి పెడుతున్నారు. కేంద్రం పరిధిలో నమోదైన బాలింతలు, గర్భిణులకు మూడు కిలోల బియ్యం, కిలో కందిపప్పును అందజేస్తున్నారు. ఒక కేంద్రం పరిధిలో సుమారుగా 15 నుంచి 20 మంది వరకు బాలింతలు, గర్భిణులు ఉన్నారు. ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు అర కిలో కందిపప్పు, బియ్యం మూడు కిలోలు అందజేస్తున్నారు. ఒక్క రాయవరం మండలంలోని 54 అంగన్వాడీ కేంద్రాల్లో 946 మంది గర్భిణులు, 475 మంది బాలింతలు, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 1,863 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 1,930 మంది ఉన్నారు. ప్రజాప్రతినిధుల దృష్టికి.. ఇటీవల ఈ-పాస్ విధానంలో అంగన్వాడీ కేంద్రాలకు సరకులను అందజేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు అందుతున్న కందిపప్పు పుచ్చిపోవడంతో పాటు పెంకి పురుగులు ఉన్నట్టు చెబుతున్నారు. కందిపప్పు నాసిరకంగా ఉన్నట్టు పలువురు ప్రజాప్రతినిధుల దృష్టికి రావడంతో, వారు ఐసీడీఎస్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. పురుగులు ఉన్న మాట వాస్తవమే.. దీనిపై రాయవరం ఐసీడీఎస్ పీఓ కె.వెంకటనరసమ్మను ‘సాక్షి’ వివరణ కోరగా, నాసిరకమైన కందిపప్పు వ్యవహారంపై వెంటూరు గ్రామానికి వెళ్లి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించానని పేర్కొన్నారు. పెంకి పురుగులు ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని ప్రాజెక్టు డెరైక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లినట్టు ఆమె తెలిపారు. -
ఇక రోజూ గుడ్డు
⇒ గర్భిణులు, బాలింతలు, శిశువులకు ⇒ 15 నుంచి అమలు కానున్న ‘వన్ ఫుల్ మీల్’ పథకం ⇒ మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం ⇒ క్షేత్రస్థాయిలో సిబ్బంది అంకితభావంతో పని చేయాలి ⇒ ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట సూచన ఇందూరు : మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ‘ఇందిరమ్మ అమృతహస్తం’ పథకం ద్వారా ‘వన్ ఫుల్ మీల్’ను ప్రవేశ పెడుతున్నా మని ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట తెలిపారు. నిర్లక్ష్యం చేయకుం డా క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలని సీడీపీఓలు, సూపర్వైజర్లను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాలు లక్షల, కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా ఐసీడీఎస్ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదన్నారు. మొన్నటి వరకు జిల్లాలోని పది ప్రాజెక్టులలో ఆరింట ‘అమృతహస్తం’ అమలైందని, ఇకపై అన్ని ప్రాజెక్టులలో అమలవుతుందన్నారు. దీనిని పకడ్బందీగా చేపట్టేలా అంగన్వాడీ కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. గతంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నెలలో 25 రోజులు మాత్రమే గుడ్లు అందజేసేవారని, ప్రస్తుతం పౌష్టికాహార పరిమాణం పెరిగిందన్నా రు. రోజూ గుడ్డుతోపాటు బాలింతలు, గర్భిణులకు 200 మిల్లీలీటర్ల పాలు కూడా ఇస్తామన్నారు. వీటికోసం అంగన్ వాడీ కార్యకర్తల ఖాతాలోకే నేరుగా ముందస్తు నిధులను జమచేస్తామని చెప్పారు. శిశువులు మూడు కిలోల బరువుతో, రక్తహీనత లేకుం డా జన్మించేలా చూడాలని సూచించారు. సూపర్వైజర్లు గ్రామాలను సందర్శించి, కమిటీలను ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. ఈ కొత్త కార్యక్రమం అమలు తీరును నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఆర్జేడీ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వన్ ఫుల్ మీల్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అందరూ కంకణబద్ధులు కావాలని కోరారు. గ్రేడింగ్ విధానంతో పని తీరు పరిశీలన ఇక ముందు అంగన్వాడీల పనితీరును మెరుగు పరచడానికి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నామని కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు, కార్యకర్తల పనితీరు మెరుగుపడటమే కాకుండా బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందన్నారు. ప్రతీ కార్యకర్త అంగన్వాడీ కేంద్రంలో ఆరు నుంచి ఏడు గంటల సేపు పిల్లలతో గడపాలని, పిల్లలకు నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు. గర్భిణులకు పౌష్టికాహారం సమృద్ధిగా అంది స్తే బిడ్డలు మూడు కిలోల బరువుకు తగ్గకుండా పుడతారన్నారు. ఈ నెల 15 నుంచి అమలయ్యే ‘వన్ ఫుల్ మీల్’ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, స్వరూ పా న్ని హైదరాబాద్ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సదస్సులో ఐసీడీఎస్ పీడీ రాములు తదితరులు పాల్గొన్నారు. -
రెండు పూటలా అంగన్వాడీ కేంద్రాలు
=నవంబరు 1 నుంచి అమలుకు సన్నాహాలు =సహాయకులుగా లింక్ వర్కర్ల నియామకం నర్సీపట్నం, న్యూస్‌లైన్: మాతా, శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలను నవంబర్ 1 నుంచి రెండు పూటలా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అదనపు బాధ్యతలతో సతమతమవుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు సాయంగా లింక్‌వర్కర్ల నియామకానికి సన్నాహాలు చేస్తోంది. మాతా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 22 ప్రాజెక్టుల్లో 4,874 అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఏజెన్సీలోని కేంద్రాల్లో అమృతహస్తం, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు మధ్యాహ్నం వరకే పనిచేస్తున్న ఈ కేంద్రాలను నవంబరు 1 నుంచి రెండు పూటలా నిర్వహించనున్నారు. రెండు పూటలా సాధ్యమేనా? జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,874 కేంద్రాలకు ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నవి 997 మాత్రమే. ఇతర శాఖల ప్రభుత్వ భవనాల్లో 637 కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనంతో పాటు రెండు పూటలా కేంద్రం నిర్వహణ సాధ్యమేనా? అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వసతులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు ఆరోగ్య కార్యకర్త విధులతో పాటు ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్లను చేర్పించడం, ఎన్నికల్లో ఓటర్ల స్లిప్పులు పంచడం, ఎన్నికల విధి నిర్వహణ తదితర బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్య కార్యకర్తగా న్యాయం చేయలేకపోతున్నారు. వీరిని ఇతర పనులకు వినియోగించరాదన్న నిబంధనలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అంగన్వాడీ కార్యకర్తలకు సహాయంగా ఒక్కో కేంద్రానికి ఒక్కొక్క లింక్ వర్కర్‌ను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరు రిజిస్టర్ల నిర్వహణ బాధ్యతలతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు సహకరిస్తారు. దీనిపై ఐసీడీఎస్ పీడీ రాబర్ట్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా జీవో ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు అదనపు బాధ్యతలను అప్పగించరాదని స్పష్టం చేశారు. వీరికి సహాయకులుగా లింక్ వర్కర్లను నియమించి కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్టు పేర్కొన్నారు.