‘మాతా హారీ’.. ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన గూఢచారి. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢచారిగా పనిచేసిన మాతా హారీ యూరప్‌ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్‌కు గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణలతో ఆమెను హత్య చేశారు. ఆమె గూఢచార విద్యలో ఆరితేరినదే కాకుండా అందగత్తె, డ్యాన్సర్.
నెదర్లాండ్‌లో 1876లో జన్మించిన మాతాహారి అసలు పేరు గెర్ట్రూడ్ మార్గరెట్ జెలె. గూఢచర్యం ఆమె వృత్తి. మాతాహారీకి పలు దేశాల సైన్యాధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి.
తన అపరిమితమైన కోరికలను తీర్చుకునేందుకు ఆమె 1905లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకుంది. ఆమె తన అందచందాలతో కొద్దికాలంలోనే అధికారులకు సన్నిహితురాలిగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్ అంతా పర్యటించేది.
మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేవరకూ ఆమె ఒక డాన్సర్, స్ట్రిప్పర్‌గానే ఉంది. ఆమె నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథమహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్ కోసం, ఫ్రాన్స్ కోసం ఆమె గూఢచర్యం చేసేదని చెబుతుంటారు.
మాతాహారీ హత్య అనంతరం 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతాహారీ జర్మనీకి గూఢచర్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడయ్యింది. గూఢచర్యం చేస్తున్నదన్న ఆరోపపణల మేరకు ఆమెను 1917లో అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్ మాత్రమేనని కోర్టు తీర్పుచెప్పింది. అయితే ఆ తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు.
ఇది కూడా చదవండి: బర్త్‌డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టుజుట్టూ పట్టుకున్న యువతులు!
Comments
Please login to add a commentAdd a comment