spy
-
బీజేపీపై నిఘాకు కెమెరాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న జరిగే ఎన్నికల సమయంలో బీజేపీ అక్రమాలకు పాల్పడితే రికార్డు చేసేందుకు వీలుగా స్పై, బాడీ కెమెరాలను మురికివాడల్లోని ప్రజలకు అందజేసినట్లు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ చారిత్రక విజయం సాధించబోతోందన్నారు. బీజేపీ ఘోర పరాజయం తప్పదన్నారు. ఇది తెలిసే ఆ పార్టీ అనుచిత చర్యలకు దిగుతోందని విమర్శించారు. బీజేపీ గూండాల అక్రమాలను రికార్డు చేసేందుకు మురికివాడల్లోని ప్రజలకు నిఘా కెమెరాలను అందించినట్లు చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని పోలీసులకు పట్టించేందుకు వీలుగా సమాచారం అందిన 15 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకునేలా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. స్లమ్ ఏరియాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసే ఉద్దేశంతో వారి వేలికి నల్ల సిరా పూసి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని తెలిపారు. బీజేపీ వాళ్ల నుంచి డబ్బులైతే తీసుకోండి, కానీ, వేలికి సిరా పూయనివ్వకండని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు. -
బషర్ అసద్‌పై విష ప్రయోగం?
లండన్: రష్యాలో ఆశ్రయం పొందిన సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్(59)పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆదివారం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు రష్యా మాజీ గూఢచారిగా భావిస్తున్న జనరల్ ఎస్వీఆర్ అనే ఆన్లైన్ ఎకౌంట్లో ఈ విషయం బయటకు పొక్కిందని ‘ది సన్’పేర్కొంది. అసద్‌కు తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడంతో వైద్యం అందించారని తెలిపింది. అసద్‌పై హత్యా ప్రయత్నం జరిగిందనేందుకు ఇదే ఉదాహరణ అని సన్ పేర్కొంది. డిసెంబర్ మొదటి వారం కుటుంబం సహా వెళ్లిన అసద్ మాస్కోలోని సొంత అపార్టుమెంట్లోనే ఉంటున్నారు. అక్కడే ఆయనకు వైద్యం అందుతోందని, సోమవారానికి పరిస్థితి కుదుటపడిందని సన్ తెలిపింది. -
యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!
ప్రపంచ నం.1 కంపెనీగా పేరున్న యాపిల్ ఉద్యోగుల పట్ల కఠిన విధానాలు అమలు చేస్తుందని ఓ ఉద్యోగి ఆరోపించారు. ఉద్యోగుల వ్యక్తిగత ఐప్యాడ్, ఐఫోన్ వంటి పరికరాలతో నిబంధనలకు విరుద్ధంగా తమ కార్యకలాపాలపై రహస్యంగా నిఘా వేస్తోందని తెలిపారు. 2020లో కంపెనీలో చేరిన అమర్ భక్త అనే ఉద్యోగి ఈమేరకు సంస్థపై ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన కాలిఫోర్నియాలో కంపెనీపై కేసు దాఖలు చేశారు.అక్కడ ఉద్యోగం సాఫీగా ఉండదు..‘ఉద్యోగుల గోప్యత హక్కును యాపిల్ హరిస్తోంది. సిబ్బంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వారిపై ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిఘా ఉంచుతోంది. దీన్ని ఉద్యోగులు అంగీకరించాలని కంపెనీ ఒత్తిడి చేస్తుంది. యాపిల్ సంస్థలో పని వాతావరణం సాధారణంగా బయట అనుకున్నంత సాఫీగా ఉండదు. అదో జైలు జీవితం లాంటిది. యాపిల్ ఉద్యోగులు కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను పని కోసం మాత్రమే ఉపయోగించాలి. అలాగని వ్యక్తిగత అవసరాల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు వాడాలనుకుంటే మాత్రం కంపెనీ ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్‌తోనే వాటిని వినియోగించాలి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తలు‘వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించే పరికరాల్లో ఈమెయిల్‌లు, ఫొటోలు, వీడియో.. వంటి ఆప్షన్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాకు లింక్ చేసిన ప్రతి డేటాను యాక్సెస్ చేసేందుకు యాపిల్‌కు అనుమతి ఉంటుంది. యాపిల్ ఉద్యోగులు వారి పని పరిస్థితులు, తమ వేతనాల గురించి బయట ఎవరితో మాట్లాడనివ్వకుండా కంపెనీ జాగ్రత్త పడుతోంది. ఉద్యోగులు ఈమేరకు ఏవిధంగానూ స్పందించకుండా ఉండడంతోపాటు రాజకీయ కార్యకలాపాలకు పరిమితం అయ్యేలా కట్టడి చేస్తోంది’ అని అన్నారు.సమాచారం తొలగించమని ఆదేశాలు‘కంపెనీకి సంబంధించి ఉద్యోగులు తమ అనుభవాలను పాడ్‌క్యాస్ట్‌లు వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ మాట్లాడకుండా యాపిల్ నిషేధించింది. ఈమేరకు ఏదైనా కార్యకలాపాలు సాగిస్తే వెంటనే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కంపెనీకి సమాచారం వెళ్తుంది’ అని చెప్పారు. ప్రస్తుతం తాను చేసిన పనికి సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి తీసివేయమని కంపెనీ ఆదేశించించినట్లు భక్త పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..యాపిల్ స్పందన ఇదే..యాపిల్ దీనిపై స్పందిస్తూ దావాలోని అంశాలు నిరాధారమైనవని, అవాస్తవాలని కొట్టిపారేసింది. పని ప్రదేశాల పరిస్థితులను చర్చించడానికి ఉద్యోగుల హక్కులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. తమ బృందాలు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలను పరిరక్షిస్తూ, ఉత్తమ ఉత్పత్తులు, సేవలను అందించడంపై కంపెనీ దృష్టి సారించిందని స్పష్టం చేసింది. -
నకిలీ ‘సీఐఏ’ ఏజెంట్ ఎన్ఆర్ఐపై బిగుస్తున్న ఉచ్చు : నవ్వుతూనే ముంచేశాడు!
భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల వ్యవహారం మరింత ముదురు తోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగింది. అమెరికా పౌరుడిగా చెప్పుకుంటూ, సీఐఏ ఏజెంట్ అని నమ్మించి వివిధ దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార నాయకులను మోసగించడం, తీవ్రమైన తప్పిదాలకు పాల్పడటం ఆరోపణల కేసులో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది.నకిలీ సీఐఏ ఏజెంట్‌గా శ్రీవాస్తవ ఏకంగా ప్రెసిడెంట్ జో బిడెన్‌ను కలిశారని, డెమోక్రటిక్ పార్టీకి 10 లక్షల డాలర్ల పైగా విరాళం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడం అక్కడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. 'నకిలీ సీఐఏ ఏజెంట్' స్కామ్‌లో శ్రీవాస్తవ, అనేక సంవత్సరాలుగా మోసపూరిత కార్యకలాపాలతో అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలను ఎఫ్‌బీఐ విచారిస్తోంది.ఘోరమైన అబద్ధాలతో వాషింగ్టన్ రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీను బురిడీ కొట్టించాడు. వ్యాపార వేత్తలను నమ్మించి, తనఫౌండేషన్కు భారీనిధులను దక్కించుకున్నాడు. అయితే ఇండియాలోని లక్నోకు చెందిన శ్రీవాస్తవ కాలేజీ డ్రాపౌట్ అని కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా రిపోర్ట్ చేసింది.శ్రీవాస్తవ మోసపూరిత కార్యకలాపాలు అంతర్జాతీయ లావాదేవీలకు కూడా విస్తరించాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సూడాన్, లిబియాతో సహా ఆఫ్రికాలోని నాయకులను తప్పుదారి పట్టించాడు . అమెరికా ప్రభుత్వ మద్దతు పొందేందుకు తప్పుడు వాగ్దానాలు చేశాడు. వాషింగ్టన్లో, అతను తన చర్యలను చట్టబద్ధం చేయడానికి ఉన్నత అధికారులతో సంబంధాలను మెయింటైన్ చేశాడు. మిస్టర్ జీగా పాపులర్ అయిన శ్రీవాస్తవ బాధితుల్లో నాటో మాజీ కమాండర్ జనరల్ వెస్లీ క్లార్క్ వంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇంకా అట్లాంటిక్ కౌన్సిల్ థింక్ ట్యాంక్, అనేక డెమొక్రాటిక్ నిధుల సేకరణ కమిటీలు, అనేకమంది సెనేటర్లు , కాంగ్రెస్ సభ్యులతో సహా అనేక ఉన్నత స్థాయి వ్యక్తులను మోసగించాడు. నేటర్ మార్క్ వార్నర్, ప్రతినిధి పాట్రిక్ ర్యాన్, జెనీవాకు చెందిన వస్తువుల వ్యాపారి, ఇంకా అనేక మంది ఆఫ్రికన్ నాయకులు ఇండోనేషియా అధ్యక్షుడు కూడా శ్రీవాస్తవ మోసానికి గురి కావడం గమనార్హం. అంతేకాదు తనపై కథనాలను రాసిన మీడియాను కూడా పరువు నష్టం దావాతో బెదరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో కొందరు ఆయనకు దూరం కాగా, మరికొందరు సంబంధాలను తెంచుకున్నారు.మరోవైపు శ్రీవాస్తవ, అతని భార్య షరోన్‌పై కాలిఫోర్నియాలో రెండు వేర్వేరు మోసం కేసులు నమోదైనాయి. అలాగే లీజు గడువు ముగిసిన తర్వాత 12 మిలియన్ల డార్లు శాంటా మోనికా ఇంటిని ఖాళీ చేయడం లేదని, అద్ద కూడా చెల్లించలేదని ఆరోపిస్తూ ఇంటి యజమాని స్టీఫెన్ మెక్‌ఫెర్సన్, శ్రీవాస్తవపై దావా వేశారు. శ్రీవాస్తవ,అతని భార్య షారోన్ ఆధ్వర్యంలో ‘ది గౌరవ్ & షారన్ శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్’ను కూడా ఉంది. ఆహారం , ఇంధన భద్రత వంటి ప్రపంచ సమస్యలపై ఇది దృష్టి సారిస్తుంది. అయితే తాజా అరోపణల నేపథ్యంలో ఈ ఫౌండేషన్ చట్టబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కాగా శ్రీవాస్తవ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యాపారి నీల్స్ ట్రూస్ట్కు అనుమానం రావడంతో ఈ భారీ స్కాం బట్టబయలైంది. అయితే ఇవన్నీ కట్టుకథలని శ్రీవాస్తవ న్యాయవాది కొట్టి పారేశారు. కాలిఫోర్నియాలో వ్యాజ్యాలతో సహా కొన్ని ఖచ్చితమైన ఆధారాలున్నప్పటికీ, శ్రీవాస్తవ అతని న్యాయవాదులు అన్ని ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నారు. -
శత్రు దేశాల గూఢచారి మిత్రులు
ఒకరిది భారత్, మరొకరిది పాకిస్తాన్. ఒకరిది ‘రా’, ఇంకొకరిది ‘ఐఎస్ఐ.’ వారిద్దరూ ఒకప్పుడు వైరి దేశాల గూఢచార సంస్థల అధిపతులు. ఇద్దరూ కలిసి తాజాగా ‘కోవర్ట్: ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్’ అనే పుస్తకం రాశారు. వాళ్లమధ్య అసలీ స్నేహం ఎలా మొదలైంది? ఇంతకీ ఈ పుస్తకంలో ఏం ఉంది? చాలానే ఉన్నాయి. గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితుల అన్వేషణ అది. అంతేకాదు, భారత్–పాక్ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానం కూడా పుస్తకంలో కనిపిస్తుంది.బహుశా జాన్ లి కరే(గూఢచర్య కథాంశాల బ్రిటన్ రచయిత) కూడా దీనినొక ఏమాత్రం నమ్మదగని అసంభవంగా భావించి ఉండేవారు. సి.ఐ.ఎ.(అమెరికా నిఘా సంస్థ), కె.జి.బి.(రష్యా నిఘా సంస్థ)ల అధినేతలు కలిసి పని చేసేందుకు ఒక అంగీకారానికి రావటమే ఇది. కానీ నమ్మేందుకు కష్టంగా ఉన్నా, దక్షిణాసియాలో ఇటువంటిదే ఒకటి ఇంకా ఎవరూ గుర్తించకుండా, ఎవరి గమనింపునకూ రాకుండా సంభవించింది. భారత్–పాకిస్తాన్ల గూఢచారి సంస్థలైన ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్), ఐ.ఎస్.ఐ. (ఇంటర్–సర్వీసెస్ ఇంటిలిజెన్స్)ల మాజీ అధిపతులు స్నేహితులుగా మారి తాము ఉమ్మడిగా కలిసి రాసిన పుస్తకాలకు పరస్పరం సహకరించుకున్నారు. అమర్జీత్ సింగ్ దులత్, జనరల్ అసద్ దుర్రానీ తమ తాజా పుస్తకం ‘కోవర్ట్: ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్’ను ఈ నెలలో ఆవిష్కరించారు (నీల్ క్రిషణ్ అగర్వాల్ మరో సహ రచయిత). వారి మొదటి పుస్తకానికి ‘ద స్పై క్రానికల్స్’ అని సముచితమైన పేరే పెట్టారు. ఈ అనుబంధం ఎలా మొదలైంది? చూస్తుంటే బ్యాంకాక్‌లోని ఛావ్ ప్రాయా నదిపై ఒక చిన్న నౌకలో మొదలైనట్లుంది. ఉగ్రవాదంపై ఒక అనధికార చర్చా కార్యక్రమానికి వాళ్లిద్దరూ ఆ నౌకలోని ఆహ్వానితులు. దులత్‌ని మాట్లాడమని ఆహ్వానించారు. ఇలాంటి చర్చా కార్యక్రమాలకు ఆయన కొత్త కనుక సంకోచంగా, అనాసక్తిగా ఉండిపోయారు. దుర్రానీ ఆ సంగతి గమనించి దులత్‌కు మద్దతుగా నిలిచారు. ఆ సందర్భం గురించి దులత్... తమ మధ్య ‘కెమిస్ట్రీ’ కుదిరిందని అంటారు. ఆ తర్వాత అనతికాలంలోనే వారిద్దరూ స్నేహితులైపోయారు. ‘కోవర్ట్’ పుస్తకం ఆ ఇద్దరి మధ్య సారూప్యాలను, వైరుధ్యాలను వెల్లడిస్తుంది. చిన్నతనంలో దుర్రానీ ‘‘ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడేవారు’’. పెద్దయ్యాక కూడా ‘‘సమూహంలో భాగం కావాలని కోరుకోలేదు’’. చిన్నవాడిగా ఉన్నప్పుడు దులత్‌కు కొద్ది మంది స్నేహితులు ఉండేవారు. వారిలో ‘‘ఎక్కువగా పనివాళ్ల పిల్లలు’’. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ‘‘తనకై తను ఉండగలగటం, తనను తను కాపాడుకోవటం నేర్చుకున్నారు’’. ఇక భవిష్యత్తు ఐఎస్ఐ చీఫ్... స్కూల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచేవాడు. ‘‘నేను ఎల్లప్పుడూ దాదాపు ప్రతి సబ్జెక్టులో మొదటి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరిగా ఉండేవాడిని’’ అంటారాయన. దులత్ అందుకు విరుద్ధం. ఆయన ‘‘చాలా సగటు విద్యార్థి’’. కానీ ఈ భవిష్యత్తు ‘రా’ అధిపతి క్రీడల్లో తన తఢాకా చూపించారు. స్కూల్లో ఆయన ‘‘ప్రతి ఆటా ఆడాడు’’. ఒంటరి దుర్రానీకి ‘‘సైక్లింగ్ అంటే చాలా ఇష్టం’’. కానీ ‘‘లాహోర్ వంటి నగరంలో సైకిల్ తొక్కేందుకు దూరపు స్థలం ఉండేది కాదు’’. వ్యక్తిగతంగా దుర్రానీ ఎలా ఉండేవారో, అలాంటి వ్యక్తిగానే ఆయన ఎదగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ‘‘నేను భిన్నం, నేను నాలా ఉండే స్వభావం నాది’’, ‘‘నా గుణం ఎప్పుడూ కూడా కాస్త తిరుగుబాటు ధోరణితో ఉంటుంది’’ అంటారు దుర్రానీ. దులత్ ప్రధానంగా తల్లిదండ్రుల మాట వినటానికీ, విద్యాబుద్ధులు నేర్పిన క్రమశిక్షణ ప్రకారం నడచుకోటానికీ సిద్ధంగా ఉంటారు. ‘‘తగిన పనులు, తగని పనులు అని ఉంటాయి’’ అనే నమ్మకంతో ఆయన పెరిగాడు. ఇది ఆయనకు స్పష్టమైన నైతిక దిశా నిర్దేశం చేసిందని నేను అనుకుంటాను. దుర్రానీ సైన్యంలో చేరారు. ‘‘ఆ కారణంగా నేనెప్పుడైనా పశ్చాత్తాపం చెందానని నేను అనుకోను’’ అంటారు. దులత్ పోలీస్ అయ్యారు. ఎందుకంటే, ‘‘అంతకన్నా మెరుగైన సర్వీసులలోకి వెళ్లలేకపోయాను’’ అని ఆయన అంగీకరిస్తారు. అయితే యాదృచ్ఛికమో లేదా అనుకోని అదృష్టమో ఇద్దరూ కూడా ఇంటిలిజెన్స్ సంస్థల వైపు మళ్లారు. ‘‘అనుకోకుండా నేను అక్కడికి చేరాను’’, ‘‘ఆ విషయాన్ని ఒప్పుకుంటాను’’ అంటారు దుర్రానీ నవ్వుతూ. ‘‘ఇంటిలిజెన్స్ అంటే ఏంటో తెలియకుండానే’’ దులత్ ఇంటిలిజెన్స్ బ్యూరోలో చేరారు. అయినప్పటికీ ఇద్దరూ అత్యున్నత స్థాయికి చేరుకుని, తమ తమ దేశ ప్రజల చేత ఐఎస్ఐ, ‘రా’ సంస్థల అత్యుత్తమ మాజీ అధిపతులుగా గుర్తింపు పొందారు. కనుక వారు విధిని నమ్ముతారని నేను అనుకోవచ్చా? జేమ్స్ బాండే ఇలాంటి మూఢ నమ్మకాలను ఎప్పుడూ ఎకాఎకిన కొట్టిపడేయలేదు. వీళ్లు మాత్రం అలా ఎందుకు చేస్తారు?‘‘కుండబద్దలు కొట్టటం’’ అని దులత్ ఎప్పుడూ అంటుండే దుర్రానీలోని ‘‘నిర్మొహమాటాన్ని’’ దులత్ ఇష్టపడతారు. దుర్రానీ ఉన్నదున్నట్లు బహిరంగంగా మాట్లాడతారు. పాకిస్తాన్ ఆర్మీని విమర్శించటానికి కూడా సంకోచించరు. అలాగే ఆయన భారతీయ సైన్యాన్ని ప్రశంసిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అది మరింత కష్టమైన పని. ఆయన అనిన ఒక మాటను మీకు వదిలేసి, నా ముగింపు సరైనదేనా పరిశీలించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ‘‘భారతదేశంలో ప్రజలు ప్రతిభ ద్వారా పైకి ఎదిగి ఐ.బి. (ఇంటిలిజెన్స్ బ్యూరో) ని, ‘రా’ను చేజిక్కించుకుంటారు. కానీ మా దగ్గర దేశాధ్యక్షుడు, లేదా సైన్యాధ్యక్షుడికి నచ్చిన వ్యక్తి అటువంటి పదవులను చేపట్టవచ్చు. కనుక ఒక మంచి ఐఎస్ఐ చీఫ్ ఎవరు అవగలరు అనే దానికి ఎల్లవేళలా మేము అనుసరించే ఒక ప్రమాణం ఉండదు.’’ రహస్యాలను అలా ఉంచండి – ‘కోవర్ట్’ పుస్తకంలో వీరు ‘రా’, ‘ఐఎస్ఐ’ అంతర్గత కార్యకలాపాల పనితీరును బహిర్గతం చేయలేదు. ‘ద స్పై క్రానికల్స్’ లోనూ వాటి గురించి లేదు. బదులుగా ఈ తాజా పుస్తకం, ‘‘గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితులను అన్వేషిస్తుంది’’. రెండు సూత్రాల మీద ఇది దృష్టి సారించింది. వారు ఎలాంటి మనుషులు? వారు అలా ఎందుకు చేయవలసి వచ్చింది? అనేవి ఆ రెండూ. అంతేకాదు, భారత్–పాక్ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానాన్ని కూడా వివరించింది. వారి అభిప్రాయాలు కూడా తరచూ ఒకేలా ఉన్న విషయం కూడా. చూస్తుంటే, గూఢచారులు చాలా అరుదుగా విభేదిస్తారని అనిపిస్తోంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అమెరికాకు ‘స్పేస్ ఎక్స్’ నిఘా ఉపగ్రహాలు!
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ కేవలం అంతరిక్ష ప్రయోగాలే కాదు, నిఘా ఉపగ్రహాల తయారీకి సైతం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్పేస్ ఎక్స్‌తో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘ఎన్ఆర్ఓ’ డీల్ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 2021లోనే ఒప్పందం కుదిరిందని, ఈ కాంట్రాక్టు విలువ 1.8 బిలియన్ డాలర్లు అని తెలియజేశాయి. దీనిప్రకారం ఎలాన్ మస్క్ సంస్థ వందలాది నిఘా ఉపగ్రహాలను తయారు చేసి, ఎన్ఆర్ఓకు అప్పగించాల్సి ఉంటుంది. అమెరికా భద్రతా సంస్థలు, ఎలాన్ మస్క్ కంపెనీ మధ్య బలపడుతున్న బంధానికి ఈ ఒప్పందమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ ఉపగ్రహాలు. భూగోళంపై ప్రతి ప్రాంతంపై డేగ కన్నేస్తాయి. అమెరికా సైనిక ఆపరేషన్లకు తోడ్పాటునందిస్తాయి. లక్ష్యాలను కచ్చితంగా గుర్తించడానికి సహకరిస్తాయి. వీటితో అమెరికా ప్రభుత్వానికి, సైన్యానికి చాలా ప్రయోజనాలే ఉంటాయిని నిపుణులు పేర్కొంటున్నారు. -
Russia: మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ ఏజెంట్‌ను అరెస్టు
లక్నో: రష్యా రాజధాని మాస్కో లోని భారత దౌత్య కార్యాలయంలో కీలక విధుల్లో ఉంటూ పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐకి కీలక సమాచారం చేరవేస్తున్న ఓ అధికారి ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఏటీఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా షామహియుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన సతేంద్ర సివాల్ విదేశాంగ శాఖ ఉద్యోగి. ఇతడు మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఐబీఎస్ఏ)గా పనిచేస్తూ 2021 నుంచి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో టచ్‌లో ఉంటూ రక్షణ శాఖ కార్యకలాపాలు, విదేశాంగ శాఖ వ్యవహారా లు, భారత సైన్యం కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేస్తు న్నాడు. కీలక సమాచారం అందిస్తే భారీగా ప్రతిఫలం ముట్టజెపుతామంటూ పలువురు ఇతర అధికారులను సైతం తన వైపు తిప్పుకునేందుకు సతేంద్ర ప్రయత్నిస్తున్నట్లు యూపీ ఏటీఎస్‌కు ఉప్పందింది. దీంతో, ఏటీఎస్ బృందం ఇతడి కదలికలు, కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచింది. ఆ మేరకు నిబంధనల ప్రకారం ఇతడిని ఇటీవల మీరట్‌లోని ఫీల్డ్ యూనిట్‌కు రప్పించి అధికారులు విచారించారు. నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించడంతో సతేంద్ర సివాల్‌పై ఐపీసీ సెక్షన్ 121ఏతో పాటు అధికార రహస్యాల చట్టం–1923 కింద కేసులు నమోదు చేసినట్లు ఏటీఎస్ వివరించింది. ఇదీ చదవండి: రాష్ట్ర హోదా కోసం లఢక్‌లో భారీ నిరసనలు -
సచిన్ పైలట్‌పై గెహ్లాట్ ‘స్పై’..? బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
జైపూర్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాజస్థాన్ కేర్‌టేకర్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను ఒక్కొక్కటిగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ హత్య కేసులో గెహ్లాట్‌పై బీజేపీ ఆరోపణలు చేస్తోంది.మరోవైపు గెహ్లాట్ దగ్గర ఐదేళ్లు ఓఎస్డీగా పనిచేసిన శర్మ కొత్త బాంబు పేల్చాడు. రాజస్థాన్ ప్రభుత్వం 2020లో సంక్షోభంలో పడినప్పుడు రాష్ట్రంలో మరో సీనియర్ నేత సచిన్‌పైలట్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు ఆయన కదలికలపై గెహ్లాట్ నిఘా ఉంచారని చెప్పారు. తాజాగా ఓఎస్డీ శర్మ చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ విచారణకు డిమాండ్ చేస్తోంది. ఇదే విషయమై ప్రస్తుతం రాజస్థాన్ సీఎం రేసులో ఉన్న దియాకుమారి స్పందించారు. ‘సచిన్ పైలట్‌పై నిఘా పెట్టడం, ఆయన ఫోన్ ట్యాప్ చేయడం వంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి.స్వయంగా సీఎం ఓఎస్డీ చెప్పాడంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఇలా గూఢచర్యం చేయడం చట్ట విరుద్ధం’ అని దియాకుమారి వ్యాఖ్యానించారు. దియాకుమారి ఆరోపణలపై ఓఎస్డీ శర్మ స్పందించారు. సాధారణంగా రాజకీయ సంక్షోభాలు ఏర్పడినపుడు అందుకు కారణమైన వారిని ఫాలో చేస్తాం. వారు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడుతున్నారో తెలుసుకుంటాం. సంక్షోభాన్ని నివారించేందుకు ఇలాంటివి సహజమే’అని శర్మ వ్యాఖ్యానించారు. ఇదీచదవండి..బీజేపీ సీఎంలు ఎవరో..? -
ఆమె నియంత హిట్లర్‌కు గూఢచారి.. తన నృత్యాలతో కవ్విస్తూ..
‘మాతా హారీ’.. ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన గూఢచారి. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢచారిగా పనిచేసిన మాతా హారీ యూరప్‌ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్‌కు గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణలతో ఆమెను హత్య చేశారు. ఆమె గూఢచార విద్యలో ఆరితేరినదే కాకుండా అందగత్తె, డ్యాన్సర్. నెదర్లాండ్‌లో 1876లో జన్మించిన మాతాహారి అసలు పేరు గెర్ట్రూడ్ మార్గరెట్ జెలె. గూఢచర్యం ఆమె వృత్తి. మాతాహారీకి పలు దేశాల సైన్యాధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన అపరిమితమైన కోరికలను తీర్చుకునేందుకు ఆమె 1905లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకుంది. ఆమె తన అందచందాలతో కొద్దికాలంలోనే అధికారులకు సన్నిహితురాలిగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్ అంతా పర్యటించేది. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేవరకూ ఆమె ఒక డాన్సర్, స్ట్రిప్పర్గానే ఉంది. ఆమె నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథమహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్ కోసం, ఫ్రాన్స్ కోసం ఆమె గూఢచర్యం చేసేదని చెబుతుంటారు. మాతాహారీ హత్య అనంతరం 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతాహారీ జర్మనీకి గూఢచర్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడయ్యింది. గూఢచర్యం చేస్తున్నదన్న ఆరోపపణల మేరకు ఆమెను 1917లో అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్ మాత్రమేనని కోర్టు తీర్పుచెప్పింది. అయితే ఆ తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు. ఇది కూడా చదవండి: బర్త్‌డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టుజుట్టూ పట్టుకున్న యువతులు! -
పాక్ యువతి ట్రాప్‌లో డీఆర్డీఓ సైంటిస్ట్.. కీలక రహస్యాల చేరవేత..
పుణె: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాక్ ఏజెంట్‌కు రక్షణ రంగ రహస్యాలను లీక్ చేశాడని దర్యాప్తులో తేలింది. అలియాస్ జరా దాస్‌గుప్తాగా పరిచయమైన పాకిస్థాన్ యువతి కురుల్కర్తో వాట్సాప్ చాట్ ద్వారా మిస్సైల్ సిస్టమ్‌లోని నిగూఢమైన రహస్యాలను రాబట్టింది. డీఆర్డీఓలో ఓ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న కురుల్కర్ని మే 3న ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కస్టడిలో ఉన్నారు. ప్రదీప్ కురుల్కర్కు పాక్ యువతి జరా దాస్‌గుప్తాగా పరిచయమైంది. యూకేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పి ప్రదీప్‌కు దగ్గరైంది. అనంతరం వాట్సాప్ చాట్, కాల్స్, అశ్లీల వీడియోలతో పాక్ యువతి ప్రదీప్ కురుల్కర్‌ను లోబరుచుకుంది. దర్యాప్తులో జరా దాస్ ఐడీ పాకిస్థాన్‌గా గురించినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, యూసీవీ, అగ్ని క్షిపణి లాంఛర్తో పాటు మిలిటరీ బ్రిగేడ్ సిస్టమ్‌కు సంబంధించిన అనేక రహస్యాలను ప్రదీప్ కురుల్కర్ జరా దాస్‌గుప్తాకు షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరివురూ 2022 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకు టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కురుల్కర్‌పై అనుమానంతో దర్యాప్తు చేపట్టగా.. 2022 ఫిబ్రవరిలో ఆమె నెంబర్‌ను ఫోన్ నుంచి డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి రాగా.. అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Violence On Elections Voting: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి.. -
నిఖిల్‌ని చూసి గర్వపడుతున్నా
‘‘స్పై థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత సులభం కాదు.. అది ఒక సవాల్. ఎందుకంటే ఇలాంటి హాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో చూసేస్తున్నారు. కానీ, ‘స్పై’ టీజర్, ట్రైలర్ చూశాక చాలా బాగా అనిపించింది. అంతర్జాతీయ స్థాయి విలువలకు ఏ మాత్రం తగ్గలేదు. రాజశేఖర్, చరణ్ తేజ్‌ల ప్యాషన్ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యామీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పై’. ఈడీ ఎంటర్టైన్ మెంట్స్‌పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాపీడేస్’ తో కెరీర్ మొదలుపెట్టి, ‘స్వామిరారా, కార్తికేయ’ తో ఓ ట్రెండ్ సెట్ చేసి, ‘కార్తికేయ 2’ తో బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు.. తనని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ‘కార్తికేయ 2’ తో ఒక ట్రెండ్ ఎలా సెట్ చేశాడో.. ‘స్పై’ చిత్రంతో ఆ ట్రెండ్ దాటి తర్వాతి స్థాయికి వెళతాడనే నమ్మకం ఉంది’’ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ–‘‘సుభాష్ చంద్రబోస్ వంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఉన్న సినిమా ‘స్పై’. నాలుగురోజుల కిందట ఈ మూవీ ఫైనల్ కాపీ చూశాక ‘థ్యాంక్యూ గ్యారీ’ అన్నాను.. అంత బాగా ఈ మూవీ తీశాడు. ఇలాంటి సినిమా చేసినందుకు యూనిట్ అంతా గర్వపడుతున్నాం. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్‌తో ‘స్పై’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు కె.రాజశేఖర్ రెడ్డి. గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ–‘‘డాక్టర్ అయిన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ, నా తల్లితండ్రులు ఒప్పుకుని, నన్నుప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ‘స్పై’ చాలా బాగా తీశావంటూ నిఖిల్‌గారు నన్ను హత్తుకోవడంతో సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది’’ అన్నారు. ఈ వేడుకలో ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్, సంగీత దర్శకుడుశ్రీచరణ్ పాకాల, కెమెరామేన్ వంశీ పచ్చిపులుసు, యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ, నటీనటులు సాన్య ఠాకూర్, ఆర్యన్ రాజేష్ పాల్గొన్నారు. -
ఈ వారం థియేటర్‌తో పాటు ఓటీటీల్లో చూడదగిన మూవీస్ ఇవే
‘ఆదిపురుష్’ విడుదలైన తర్వాత రెండు వారాల వరకు థియేటర్లో ప్రేక్షకులను రప్పించే సినిమాలు ఏవీ విడుదల కాలేదనే చెప్పవచ్చు. ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్ వల్ల కొన్ని సినిమాలను వాయిదా కూడా వేసుకున్నారు. అందువల్ల గత వారంలో పెద్ద చిత్రాలేవి విడుదల కాలేదు. దాదాపు అన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా సినీ ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ జూన్ 30న బాక్సాఫీస్ వద్ద మళ్లీ సందడి కొనసాగనుంది. ఈ వారం థియేటర్లోనే కాకుండా ఓటీటీలోనూ వెబ్‌సిరీస్‌లతో పాటు పలు కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. నిఖిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా 'స్పై' జూన్ 29న గురువారం విడుదల కానుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీతో పాటు ఆయన జీవితానికి సంబంధించిన ఎప్పుడూ వినని అంశాలతో సినిమాను తెరకెక్కించారు. నిఖిల్ ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీలో ఆర్యన్ రాజేశ్, ఐశ్వర్య మేనన్, సన్యా ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. కె.రాజశేఖర్‌రెడ్డి కథని సమకూర్చడంతోపాటు, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా 'వివాహభోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సామజ వరగమన'. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం జూన్ 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో చిరంజీవి విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆయన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 2008లో 'ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ క్రిస్టల్ స్కల్' అప్పట్లో పెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా దాదాపు 14ఏళ్ల తర్వాత అదే సీరిస్‌లో 'ఇండియానా జోన్స్' కొత్త చిత్రం జూన్ 30న థియేటర్లోకి రాబోతోంది. అడ్వెంచర్ సినీ ప్రియులకు ఈ సినిమా పండుగే అని చెప్పవచ్చు. ఈ వారం థియేటర్/ ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ ఇవే డిస్నీ+హాట్‌స్టార్ • వీకెండ్ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్) జూన్ 28 • ది నైట్ మేనేజర్ (సిరీస్2) జూన్30 నెట్ ఫ్లిక్స్ • లస్ట్ స్టోరీస్ 2 (హిందీ) జూన్ 29 • అఫ్వా (హిందీ) జూన్30 అమెజాన్ ప్రైమ్ • జాక్ ర్యాన్ (వెబ్‌సిరీస్ 4) జూన్ 30 థియేటర్లో • నిఖిల్ 'స్పై' జూన్ 29 • 'ఇండియానా జోన్స్' జూన్ 29 • శ్రీ విష్ణు 'సామజ వరగమన' జూన్ 30 • 'లవ్ యూ రామ్' జూన్ 30 • పాయల్ రాజ్‌పుత్ 'మాయా పేటిక' జూన్ 30 ఆహా • అర్థమయ్యిందా అరుణ్‌కుమార్ (తెలుగు సిరీస్) జూన్ 30 -
'నేనో ఇంజనీర్ని.. హీరోయిన్ అవుతాననుకోలేదు'
‘‘ఓ నటిగా నా కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. అసలు నేను హీరోయిన్ అవుతానని ఊహించలేదు. నేను ఇంజనీర్ని, నా బ్రదర్ డాక్టర్. స్టార్టింగ్‌లో కొన్ని యాడ్స్ చేశాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తున్నాను. ఈ ప్రయాణం నాకు హ్యాపీగా ఉంది’’ అన్నారు ఐశ్వర్యా మీనన్. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘స్పై’. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ) ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్ర కథానాయిక ఐశ్వర్యా మీనన్ మాట్లాడుతూ– ‘‘తెలుగులో హీరోయిన్గా నేను చేసిన తొలి చిత్రం ‘స్పై’. ఈ చిత్రంలో నా క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. ‘రా’ ఏజెంట్‌గా కనిపిస్తాను. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. గన్ను సరిగ్గా పట్టుకోవడం, షూటింగ్.. ఇలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ప్రేమకథలే కాదు.. యాక్షన్ సన్నివేశాల్లో కూడా నేను బాగా నటించగలననే విషయం నాకు ‘స్పై’తో తెలిసొచ్చింది. యాక్షన్ సినిమాలు కూడా చేయగలననే కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత రహస్యాల ఆధారంగా అనేది ఈ సినిమా బేస్‌లైన్ మాత్రమే. డ్రామా వేరుగా ఉంటుంది. (ఇదీ చదవండి: హీరో అర్జున్ కూతురు పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?) గ్యారీగారు ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు నన్నే అనుకున్నారట. దీంతో ఆయన స్ట్రయిట్‌గా వచ్చి నాకు కథ చెప్పారు. నేను చూసిన తొలి తెలుగు సినిమా ‘హ్యాపీ డేస్’. అలాగే నిఖిల్ చేసిన ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాలు కూడా చూశాను. ఆయన ప్రతి సినిమాను ఫాలో అవుతుంటాను. ప్రజెంట్ యూవీ క్రియేషన్స్‌లో కార్తికేయ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్నాను’’ అన్నారు. View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
హీరో నిఖిల్ 'స్పై' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Spy Trailer:యాక్షన్ సీన్లతో నిఖిల్ దుమ్ములేపాడు
నిఖిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా 'స్పై' ట్రైలర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీతో పాటు ఆయన జీవితానికి సంబంధించిన ఎప్పుడూ వినని అంశాలతో సినిమాను తెరకెక్కించారు. నిఖిల్ ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీలో ఆర్యన్ రాజేశ్, ఐశ్వర్య మేనన్, సన్యా ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. కె.రాజశేఖర్‌రెడ్డి కథని సమకూర్చడంతోపాటు, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్నారు. చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు.. దాస్తుంది అంటూ ట్రైలర్ ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. నిఖిల్ ఒక స్పై ఏజెంట్‌గా మంచి యాక్షన్ సీన్లతో మెప్పించాడు. బీజీఎమ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. జూన్ 29న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. -
ఒటీటీ నుంచి వస్తున్న మొదటి స్పై థ్రిల్లర్ మూవీ ఇదే..
వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ ప్లాట్‌ఫాం జీ 5. ఇప్పుడు సరికొత్త యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్‌తో ఆకట్టుకోవటానికి సిద్ధమవుతోంది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, ఛత్రపతి శేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణంగా నటించబోయే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) 8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిపబ్లిక్ బ్యానర్‌పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్టెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చిత్రీకరించని సరికొత్త లొకేషన్స్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న హీరోయిన్ లిప్‌లాక్ వీడియో) -
'స్పై' రిలీజ్ డేట్ ఫిక్స్.. పట్టించుకోని హీరో నిఖిల్!
ప్రస్తుతం ఎక్కడచూసినా 'ఆదిపురుష్' హడావుడి నడుస్తోంది. టాలీవుడ్ లో మాత్రం 'స్పై' మూవీ రిలీజ్ విషయంలో హీరో-నిర్మాత మధ్య గొడవ జరుగుతోందా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. కానీ హీరోగా నటించిన నిఖిల్ మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. దీంతో ఏం జరుగుతుందా అని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ అసలేంటి గొడవ? 'హ్యాపీడేస్'తో నటుడిగా మారిన నిఖిల్.. అప్పటి నుంచి పలు సినిమాలు చేస్తూ వచ్చాడు. కేవలం తెలుగుకే పరిమితమైన ఇతడు.. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తెలుగులో ఏ యంగ్ హీరోకి సాధ్యం కాని విధంగా 'స్వయంభు', 'ద ఇండియా హౌస్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!) వీటికంటే ముందు 'స్పై' మూవీ చేశాడు. కొన్నాళ్ల ముందు టీజర్ రిలీజ్ చేయగా ఆలోవర్ ఇండియా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ జూన్ 29న ఈ సినిమాని రిలీజ్ చేద్దామని నిర్మాత భావిస్తుంటే.. హీరో నిఖిల్ మాత్రం డేట్ వాయిదా వేద్దామని, దేశం మొత్తం ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేద్దామని అడిగారట. దానికి నిర్మాత రాజశేఖర్ రెడ్డి ఒప్పుకోలేదని టాక్. ఇప్పటికే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక.. దాన్ని మార్చితే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోరు. ఇలా ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'స్పై' రిలీజ్ డేట్ విషయంలో మార్పు లేదని క్లారిటీ ఇస్తూ మరోసారి పోస్టర్స్ విడుదల చేశారు. వీటిని హీరో నిఖిల్ ఎక్కడా ప్రమోట్ చేయలేదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. దీంతో ఈ గొడవ ఇంకా క్లియర్ కాలేదా అని డౌట్ వస్తుంది. మరి నిర్మాత చెప్పినట్లు జూన్ 29నే ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందా? లేదా వాయిదా పడుతుందా అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ అందులో) -
స్పై వస్తున్నాడు
నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. కె. రాజశేఖర్ రెడ్డి కథ అందించి, నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు గ్యారీ బీహెచ్. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన అంశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ‘‘భారతదేశ అత్యుత్తమమైన రహస్య కథగా ‘స్పై’ మూవీ ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం,కన్నడ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను జూన్ 29న విడుదల చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా, ఆర్యన్ రాజేష్ ఓ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్. -
4 పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న నిఖిల్
-
ఆ సిల్లీ బెలూన్ ప్రతిదాన్ని మార్చేసింది! త్వరలో అన్ని సమసిపోతాయ్: బైడెన్
అమెరికా రక్షణ స్థావరంలోని గగన తలంలపై ఎగిరిన చైనా గుఢాచారి బెలూన్ కారణంగా ఇరు దేశాల సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. అంతకమునుపు నవంబర్‌లో ఇండోనేషియాలో బాలిలో జరిగిన జీ 20 సదస్సులలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడ బైడైన్ చర్చలు జరిపారు. అవి జరిగిన నెలరోజుల్లోనే చైనాతో సంబధాలు క్షీణించాయని ప్రకటించారు బైడెన్. ఫిబ్రవరిలో అమెరికా గగనతలంలో ఎగిరిన స్పై బెలూన్‌తో ఒక్కసారిగా సంబంధాలు భగ్గుమన్నాయి. ఒకరకంగా ఈ స్పై బెలూన్ కారణంగా రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య దౌత్యపరమైన విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. ఈ సంఘట కారణంగానే.. అమెరికా చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునే అంశంతో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ పర్యటనను కూడా అనూహ్యంగా రద్దు చేసింది. ఈ మేరకు జపాన్‌లోని హిరోషిమాలో జరగతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అనంతరం బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చైనా యూఎస్‌ల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించగా..బాలి సమావేశంలో తాము ఇరువురం(బైడెన్, జిన్‌పింగ్) సమావేశమయ్యి, చర్చించాలని అనుకున్నాం కానీ ఆ సిల్లీ బెలూన్ ప్రతిదీ మార్చేసింది. ఆ స్పై బెలూన్ రెండు కార్లు రవాణ చేసే పరికరాలను తీసుకెళ్లగల సామర్థ్యం కలది. దీన్ని తాము కాల్చడంతోనే అంతా ఒక్కసారిగా మారిపోయిందని, ఇవన్నీ త్వరలో సమసిపోవాలనే భావిస్తున్నా. అలాగే తమ చర్యని కూడా సమర్థించుకునే యత్నం చేశారు బైడెన్. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ యథావిధికి వచ్చేలా చేయగలిగినదంతా చేస్తానని బైడెన్ చెప్పారు. (చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!) -
అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి.. లేట్‌గా అయినా లేటెస్ట్గా
కొన్ని సినిమాలు లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంటాయి. రిలీజ్లు కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకపోవడమే ఈ వాయిదాలకు ఓ కారణం. మరో కారణం ఒకేసారి ఎక్కువ చిత్రాలు విడుదలైతే, థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడటం. కారణాలేమైనా అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి అన్నట్లుగా ఇటీవల పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. ఒకటికి మించి ఎక్కువసార్లు వాయిదా పడిన సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలు, వాటి కొత్త విడుదల తేదీల గురించి తెలుసుకుందాం. ► వేసవికి రావాల్సిన ‘భోళా శంకర్’ ఆగస్టుకు షిఫ్ట్ అయ్యాడు. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమాను ముందు ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆగస్టు 11కు రిలీజ్‌ను వాయిదా వేశారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ► ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆదిపురుష్’ చిత్రం సిల్వర్ స్క్రీన్‌పైకి రావాల్సింది. కానీ మెరుగైన వీఎఫ్ఎక్స్ కోసం జూన్ 16కు వాయిదా వేశారు. ఈ మైథలాజికల్ ఫిల్మ్‌లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ దత్తా, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. టి. సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నుంచి ‘జై శ్రీరామ్..’ అనే తొలి పాటను విడుదల చేశారు. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ► మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు. ఫైనల్‌గా జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ► విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ‘ఖుషి’ సినిమాను సెప్టెంబరు1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ► నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వలో రాజశేఖర్ రెడ్డి, చరణ్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. కానీ రిలీజ్ 2023 సమ్మర్‌కు వాయిదా పడింది. అయితే ఈ వేసవికి ‘స్పై’ రాలేదు. ఫైనల్‌గా జూన్ 29న విడుదల కానుంది. ► బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ 2022 డిసెంబరులో రిలీజ్ కావాలి. కానీ రాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ వీలుపడలేదు. తాజాగా జూన్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ఇది. ► దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్గా ఈ సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసినప్పటికీ మరోమారు వాయిదా పడి, జూన్ 2న రిలీజ్‌కు రెడీ అవుతోంది. డేట్ ఫిక్స్ కాని చిత్రాలు ► వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఎన్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఓ సందర్భంలో వెల్లడించింది. అయితే జూలైలో విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ► అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి. మహేశ్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. కానీ రిలీజ్ కాలేదు. ► ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘డీజే టిల్లు స్క్వైర్’ సెట్స్‌పై ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లుగా యూనిట్ ప్రకటించింది. అయితే ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజ్ అయ్యేందుకు రెడీ కానున్నట్లు టాక్. మల్లిక్‌రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ► శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవరగమన’ ఈ నెల 18న రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. రెబా మౌనిక హీరోయిన్గా ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు. ► తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను– మాన్’. ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయాలను కున్నారు. కానీ వాయిదా పడింది. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. -
స్పైకి కథే హీరో
‘‘ఈ మధ్య ప్రేక్షకులు ఇష్టపడుతున్నది మంచి కథనే. హీరో, ఎంటర్టైన్మెంట్ ఎంత ఉన్నా కథ అనే సోల్ లేకపోతే బ్లాక్ బస్టర్ అవ్వదు. ‘స్పై’ మూవీకి కథే హీరో’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘స్పై’. ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ – ‘‘సుభాష్ చంద్రబోస్‌గారి గురించి, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి, ఆ సంస్థ సేవల గురించి చాలామందికి తెలియదు. దేశానికి తెలియాల్సిన ఆ విషయాలతో పాటు వినోదాత్మకంగా ఈ మూవీ ఉంటుంది’’ అన్నారు. ‘కార్తికేయ 2’ తర్వాత ఓ పార్టీకి అనుకూలంగా మీరు ‘స్పై’ చేస్తున్నారనే ప్రచారంపై మీ స్పందన అని అడగ్గా – ‘‘కృష్ణుడంటే నాకు నమ్మకం. అందుకే ‘కార్తికేయ 2’ చేశాను. ఇప్పుడు ఓ భారతీయుడిగా ‘స్పై’ చేశాను. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు’’ అన్నారు నిఖిల్. ‘‘డైరెక్టర్‌గా నా తొలి సినిమా నిఖిల్‌తో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు గ్యారీ బీహెచ్. ‘‘స్పై’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు’’ అన్నారు చరణ్ తేజ్ ఉప్పలపాటి. సంగీత దర్శకులు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు, మాటల రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు. -
అందుకే అమిత్ షా పిలిచినా వెళ్లలేదు : హీరో నిఖిల్
కార్తికేయ-2, 18 పేజెస్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు హీరో నిఖిల్. ఆయన తాజాగా మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ తో రానున్నారు. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జూన్ 28న ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో మీడియా ప్రతినిథులు అడిగిన పలు ప్రశ్నలకు నిఖిల్ సమాధానమిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొన్న కార్తికేయ 2, ఇప్పుడు స్పై.. మీరు ఓ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాలు తీస్తున్నారా? అమిత్ షా మిమ్మల్ని కలవాలని పిలిచారంట కదా ఓ మీడియా ప్రతినిథి అడగ్గా.. నిఖల్ మాట్లాడుతూ.. 'అమిత్ షా నుంచి నాకు ఆహ్వానం అందింది. కానీ ఇలాంటి సినిమాలు చేస్తున్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని ఉద్దేశంతో నేను వెళ్లలేదు. నన్ను ఆహ్వానించినందుకు అమిత్ షాకు థ్యాంక్స్. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేయడం లేదు. ఒక భారతీయుడిగా సినిమాలు చేస్తున్నాను' అంటూ నిఖిల్ వివరించారు. -
Spy Teaser Press Meet : ‘స్పై’టీజర్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నేతాజీ జీవిత రహస్యాలతో...
‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించి మీరు ఎప్పుడూ వినని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందుకే మొదటి టీజర్‌ని నేతాజీ విగ్రహం వద్ద విడుదల చేయాలనుకున్నాం. ఇక్కడ టీజర్‌ను విడుదల చేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాం. నేతాజీ జీవితంపై సాగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రం ఇది’’ అన్నారు నిఖిల్. స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ జీవితంలోని రహస్యాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘స్పై’. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర రిలీజ్ చేశారు. నేతాజీ మరణం తాలూకు మిస్టరీని ఛేదించే స్పై పాత్రలో నిఖిల్ కనిపిస్తారు. ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలుగా, ప్రత్యేక పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపించనున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్. -
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
Spy Balloon: భారత్ గగనతలంపై స్పై బెలూనా? పైగా అమెరికా కంటే..
అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ వ్యవహారం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా రక్షణ వ్యవస్థకు సమీపంలో ఆ స్పై బెలూన్ ఉందంటూ కూల్చివేసింది. ఈ ఘటన జరిగిన నాలుగు వారాల తర్వాత భారత గగనతలంపై కూడా ఈ స్పై బెలూన్ ప్రత్యక్ష్యం అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అదీకూడా అమెరికా గగనతలంలో ప్రత్యక్ష కావడానికి ముందే గతేడాది ఈ స్పై బెలూన్ భారత్ గగనతలంలో కనిపించినట్లు అధికారుల చెబుతున్నారు. ఐతే తాము అది ఏమిటనేది గుర్తించలేకపోవడం, సరైన సమాచారం కూడా లేకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. గతేడాది అండమాన్ నికోబార్ దీవులు భూభాగంలోని గగనతలంపై ఈ స్పైబెలూన్‌ని చూసినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిని తాము వాతావరణ బెలూన్లుగా భావించామని, అదీగాక అలాంటి వాతావరణ బెలూన్లు గాలుల కారణంగా పాకిస్తాన్ వైపు నుంచి బారత్ గగనతలంలోకి వస్తుంటాయని చెప్పారు. పైగా ఆ బెలూన్ ఏంటి అని తెలుసుకునేలోపే సముద్ర గగనతలం వైపుకి వెళ్లిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా చైనా నిఘా బెలూన్ వ్యవహారంతో తాము ఒక్కసారిగా అప్రమత్తమైనట్లు తెలిపారు. ఇక ఇలాంటి బెలూన్లు అండమాన్ లేదా మరే ఇతర ప్రాంతాల్లో కనిపించినా.. జాగ్రత్తగా పరిశీలించడమే గాక అది గూఢచర్యానికి చెందినదని తెలిస్తే కూల్చివేస్తామని చెప్పారు అధికారులు. ఆ నిఘా బెలూన్ కనిపించిన దీవులు భారత క్షిపణి పరీక్ష ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఒక్కసారిగా భారత రక్షణ వ్యవస్థ ఒక్కసారిగా అప్రమత్తమైంది. (చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్) -
అమెరికా గగనతలంలో మరో బెలూన్ కలకలం
-
గాలిబుడగల నిఘానేత్రాలు
గాలిబుడగలు సైతం గందరగోళం సృష్టించి, దేశాల మధ్య సంబంధాల్లో ఊహించని మార్పులు తీసుకువస్తాయని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేశాయి. చైనా దేశపు నిఘా నేత్రంగా అనుమా నిస్తున్న భారీ బెలూన్ తన గగనతలంలో తిరగడం గమనించిన అమెరికా ఫిబ్రవరి 4న దాన్ని వివిధ యుద్ధ విమానాలతో చుట్టుముట్టి, క్షిపణి ప్రయోగంతో వ్యూహాత్మకంగా తన ప్రాదేశిక సముద్ర జలాలపై పేల్చివేసిన వైనం అంతర్జాతీయంగా ఒక సంచలనం. అంతకు మించి గత నవంబర్‌లో జీ–20 దేశాల బాలీ సదస్సు వేళ షీ జిన్‌పింగ్, బైడెన్ల భేటీతో ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయని ఆశిస్తున్న చైనా – అమెరికా దౌత్య సంబంధాల్లో ఇది పెద్ద కుదుపు. డ్రాగన్ దొంగ ఎత్తులపై మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ ఓ మేలుకొలుపు. చైనా సహా కట్టెదుటి ముప్పును గమనించిన ఏ సార్వభౌమ దేశమైనా చేసే పనినే అమెరికా చేసింది కాబట్టి తప్పు పట్టలేం. నిజానికి, చైనా గాలిబుడగ అనుమానాస్పదంగా కొద్ది రోజులుగా పయనిస్తోంది. కెనడా మీదుగా మోంటానా రాష్ట్రంలోకి ప్రవేశించింది. అమెరికా అణ్వస్త్ర క్షిపణి ప్రయోగ క్షేత్రాలు మూడింటిలో ఒకటి అక్కడే ఉంది. సైనిక, వ్యూహాత్మక స్థలాలను కనిపెట్టడానికి చైనా దీన్ని సాధనంగా వాడుతోందని భావించిన అమెరికా, అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశంతో అదను చూసి పేల్చేసింది. గతంలో అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనూ ఈ గాలిబుడగల మూడో కన్ను పలుచోట్ల అగ్రరాజ్యపు వినువీధుల్లో విహరించింది. తెంపరిగా పేరున్న ట్రంప్ వాటిపై చర్యకు అప్పుడు తెగించలేదు. ఇప్పుడు దేశీయంగా అనేక ఒత్తిళ్ళలో ఉన్న బైడెన్ మటుకు 3 స్కూల్ బస్సుల పరిమాణంలోని ఆ గాలిబుడగను పేల్చేశారు. మొదట అనిష్టంగా ఉన్నా, ఆఖరికి అది తమ బెలూనే అని చైనా విదేశాంగ శాఖ ఒప్పుకుంది. కాకపోతే, దాన్ని గూఢచరానికి వాడుతున్నామన్న వాదనను మాత్రం తోసిపుచ్చింది. అది వాతా వరణ పరిశోధనకు వాడే పౌర వైమానిక నౌక అనీ, దారితప్పి పొరపాటున అటు వచ్చిందనీ బుకాయించింది. విచారం వ్యక్తం చేసింది. నమ్మలేని ఆ మాటలు అటుంచితే, డ్రాగన్ ఇలా నిఘా బెలూన్లను వాడినట్టు తైవాన్, 2020, 2021ల్లో జపాన్ లాంటి దేశాల నుంచి గతంలోనూ ఆరోపణ లొచ్చాయి. భారత్‌పైనా ఇలాంటి ప్రయోగాలే సాగాయి. అవి చైనావేనన్న అధికారిక సాక్ష్యాధారాలు దొరక్కపోతేనేం... గత ఏడాది జనవరిలో అండమాన్, నికోబార్ దీవులపై గాలిబుడగలు తిరిగాయి. నిఘా ఉపగ్రహాలతో పోలిస్తే ఇవి చౌకే కాదు, లక్షిత భూ ఉపరితలానికి దగ్గరగా వెళ్ళి మరింత స్పష్టమైన ఛాయాచిత్రాలు తీయగలవు. సాధారణంగా వాణిజ్య విమానాలు ప్రయాణించే మార్గం కన్నా రెట్టింపు ఎత్తు దాటి, 80 వేల నుంచి లక్షా 20 వేల అడుగుల ఎత్తున నిఘా సాధనాలతో ఈ నిఘా బెలూన్లు వెళుతుంటాయి. కీలక సమాచారాన్ని సేకరించడానికీ, ఇతర సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికీ వీటిని వినియోగిస్తుంటారు. ఈ బెలూన్లలో సౌరవిద్యుత్‌తో నడిచే కెమెరా, రాడార్ లాంటివి ఉంటాయి. గాలి వీచే దిశ, వేగాన్ని బట్టి ఎంత ఎత్తులో ప్రయాణించాలనేది ఎప్పటికప్పుడు మారుస్తూ బెలూన్లను లక్షిత ప్రాంతానికి చేరేలా మార్గదర్శనం చేస్తారు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో చౌకగా గూఢచర్యం నిర్వహించే విధానంగా అమెరికా, సోవియట్ యూనియన్లు ఈ నిఘా గాలిబుడగల పద్ధతిని వాడాయి. ఇటీవల సైతం ఇలాంటి చైనా నిఘా బుడగలు అనేకం ప్రపంచపు పెద్దన్న వియత్తలంలో విహారం సాగించాయి. అయితే, తాజా బెలూన్ దీర్ఘకాలంగా అక్కడక్కడే తిరుగుతుండడంతో, పేల్చివేతకు గురైంది. తప్పు చేసినా సరే తననెందుకు తప్పుపడుతున్నారన్నట్టుంది చైనా వైఖరి. అమెరికా గగనతలంపైనే అయినా, తమ బెలూన్ను పేల్చినందుకు సదరు అగ్రరాజ్యం ఇంతకింత ఫలితం అనుభవిస్తుందని బెదిరిస్తోంది. ఈ ఘటనతో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ఈ 6న జరగాల్సిన తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. గత కొన్నేళ్ళలో ఒక ఉన్నత స్థాయి అమెరికా దౌత్యవేత్త చైనాకు వెళ్ళడం ఇదే తొలిసారి. తీరా అదీ రద్దయింది. పర్యటనపై ఇరుపక్షాలూ ప్రణాళిక ఏదీ వేసుకోలేదని బీజింగ్ బింకంగా చెబుతోంది కానీ, జరగాల్సిన దౌత్యనష్టం జరిగిపోయింది. స్నేహానికి చేయి చాస్తూనే, చాటున చేయదలుచుకున్నది చేసేయడంలో చైనా జగత్ కిలాడీ అని మళ్ళీ ఋజువైంది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని తాము గౌరవిస్తామంటూ తాజా ఘటన అనంతరమూ చైనా ప్రకటించింది. కానీ, డ్రాగన్ గత చరిత్ర, నేటికీ మారని నైజం తెలిసినవారెవరూ ఆ మాటలను విశ్వసించలేరు. భారత్ సహా తన అగ్రరాజ్య హోదాకు అడ్డనుకున్న ప్రతి దేశంతో సున్నం పెట్టు కోవడం, తైవాన్ లాంటివి తనవేనంటూ దాడులకు దిగడం చైనాకు నిత్యం అలవాటే. అమెరికా లాగా తానూ ప్రపంచ పోలీసు పాత్ర పోషించాలనే తహతహ చైనాలో చిరకాలంగా కనపడుతున్నదే. ఆ దుగ్ధ లేకపోతే ఇలాంటి నిఘా నేత్రాల పనేమిటి? ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలో ఎంత బల మైన శక్తి రాజ్యమైనప్పటికీ, చైనా తన హద్దులు దాటి పరాయిగడ్డపై తన బెలూన్లను తిప్పాలనుకుంటే అది ఉపేక్షనీయం కాదు. ప్రపంచం అందుకు మౌనంగా అనుమతించాలనీ, అంగీకరించాలనీ బీజింగ్ కోరుకుంటే అంతకన్నా హాస్యాస్పదం లేదు. నిఘా సహా అనేక అంశాల్లో చైనా పాలకుల ఎలుక తోలు నైజం తెలిసిందే కాబట్టి, భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి నక్కజిత్తులను సహించేది లేదని మాటల్లోనూ, చేతల్లోనూ చూపాలి. ఎందుకంటే, సమ యానికి ముకుతాడు వేయకుంటే డ్రాగన్ దూకుడు ఆగదని అమెరికా సహా అందరికీ తెలిసిందే. -
నాపై గూఢచర్యం జరుగుతోంది.. కంగనా సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది కంగనా. తనపై ఎవరో గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. నా ప్రతి కదలికను గమనిస్తున్నారని పేర్కొంది. తన వ్యక్తిగత, వృత్తి పరమైన సమాచారాన్ని కూడా లీక్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీనిపై తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో సుదీర్ఘమైన నోట్ రాసింది. అయితే ఆమె ఆరోపణలు బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ గురించేనని బీ టౌన్లో చర్చ నడుస్తోంది. కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాస్తూ.. 'నేను ఎక్కడికెళ్లినా నన్ను ఫాలో అవుతున్నారు. నాపై గూఢచర్యం చేస్తున్నారు. వీధుల్లో మాత్రమే కాకుండా నా బిల్డింగ్ పార్కింగ్, నా ఇంటి టెర్రస్‌లో కూడా వారు నన్ను పట్టుకోవడానికి జూమ్ లెన్స్‌లు ఏర్పాటు చేశారు. ఛాయా చిత్రకారులు నక్షత్రాలను సందర్శిస్తారని అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో వారు నటీనటులు ఇలాంటి పనులు ప్రారంభించారు. ' అంటూ రాసుకొచ్చింది. కంగనా రాస్తూ..' ఉదయం 6:30 గంటలకు నా ఫోటోలు తీశారు. వారికి నా షెడ్యూల్ గురించి ఎలా తెలుస్తోంది. ఈ చిత్రాలను వారు ఏం చేస్తారు? నేను తెల్లవారుజామున కొరియోగ్రఫీ ప్రాక్టీస్ సెషన్‌ను ముగించా. నా వాట్సాప్ డేటా, వృత్తిపరమైన ఒప్పందాలు, వ్యక్తిగత వివరాలు కూడా లీక్ అవుతున్నాయని నేను కచ్చితంగా నమ్ముతున్నా. ఒకప్పుడు నా ఆహ్వానం లేకుండా నా ఇంటి వద్దకు వచ్చి నన్ను బలవంతం చేశాడు. ఇప్పుడు అతని భార్యను నిర్మాతగా మారాలని.. మరిన్ని మహిళా ఓరియంటెడ్ సినిమాలు చేయమని.. నాలాగా దుస్తులు ధరించేలా ఇంటి ఇంటీరియర్లను తయారు చేయమని బలవంతం చేస్తున్నాడు. వారు నా స్టైలిస్ట్, హోమ్ స్టైలిస్ట్‌లను కూడా నియమించుకున్నారు. అతని భార్య ఇలాంటి ప్రవర్తనను ప్రోత్సహిస్తోంది. నా ఫైనాన్షియర్లు, వ్యాపార భాగస్వాములు ఎటువంటి కారణం లేకుండా చివరి నిమిషంలో ఒప్పందాలను విరమించుకున్నారు. అతను నన్ను ఒంటరిని చేసి, మానసిక ఒత్తిడికి గురిచేయడానికి ప్రయత్నిస్తున్నాడని నేను భావిస్తున్నా.' అని ఆమె రాసుకొచ్చింది. అతను ఆమెను ప్రత్యేక అంతస్తులో ఉంచి.. వారిద్దరూ ఒకే భవనంలో విడివిడిగా నివసిస్తున్నారు. ఈ ఏర్పాటుకు ఆమె నో చెప్పాలని.. అంతే కాకుండా అతనిపై ఓ కన్ను వేసి ఉంచాలని నేను సూచిస్తున్నా. అతను నా డేటా మొత్తాన్ని ఎలా పొందుతున్నాడు. అతను ఇబ్బందుల్లో పడితే, ఆమెతో పాటు బిడ్డ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఆమె తన జీవితానికి బాధ్యత వహించాలి. అతను ఎలాంటి చట్టవిరుద్ధమైన పనుల్లో పాల్గొనకుండా చూడాలి. ప్రియమైన నీపై, నీ బిడ్డపై నాకు చాలా ప్రేమ ఉంది .' అంటూ పరోక్షంగా ఆలియా భట్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్, అలియా భట్ గురించేనా? కంగనా తన పోస్ట్‌లో ఎలాంటి పేర్లు వెల్లడించనప్పటికీ.. ఆమె రణబీర్ కపూర్, అలియా భట్ గురించే రాసినట్లు తెలుస్తోంది. రణబీర్‌తో తన పెళ్లికి అలియా తెల్లటి సబ్యసాచి చీరను ధరించింది. అలాగే కంగనా తన సోదరుడి వివాహానికి కూడా అదే దుస్తులను ధరించింది. అలియా, రణబీర్‌లు కూడా బాంద్రాలో వేర్వేరు అంతస్తులలో రెండు ఫ్లాట్ల్లో నివసిస్తున్నారు. నవంబర్ 2022లో వారిద్దరికీ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. కంగనా ఇన్స్టాగ్రామ్ కథనాలు నెటిజన్లను షాక్‌కి గురిచేస్తున్నాయి. ఇది చూసి చాలామంది అభిమానులు కంగనా పేర్కొన్న మిస్టరీ మ్యాన్ రణ్‌బీర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. కంగనా తదుపరి ఎమర్జెన్సీ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. రజనీకాంత్ తమిళ చిత్రానికి సీక్వెల్ 'చంద్రముఖి 2'లో కూడా తాను నటిస్తానని కంగనా ప్రకటించింది.ఆ తర్వాత 'తేజస్'లో కనిపించనుంది, ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషించనుంది. ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు. -
చైనా బెలూన్ పేల్చివేత
వాషింగ్టన్/బీజింగ్: అమెరికా గగనతలం మీదుగా ఎగురుతూ కొద్ది రోజులుగా కలకలం రేపుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ను అగ్రరాజ్యం కూల్చివేసింది. అట్లాంటిక్ సముద్రంపైకి వచ్చేదాకా వేచి చూసి అత్యాధునిక ఎఫ్–22 యుద్ధ విమానంతో దాన్ని పేల్చేసింది. అమెరికా అణుక్షిపణుల్ని భద్రపరిచిన మోంటానా స్థావరంపై ఈ చైనా బెలూన్ ఎగురుతూ కన్పించడం, అది ఇరు దేశాల మద్య చిచ్చు రేపడం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు దక్షిణ కరోలినాకు ఆరు మైళ్ల దూరంలో అట్లాంటిక్ సముద్ర జలాల్లో దాన్ని కూల్చివేశామని రక్షణ శాఖ ప్రకటించింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దక్షిణ కరోలినా మిర్టిల్ బీచ్ సమీపంలో సముద్ర జలాల్లో 11కి.మీ. మేరకు పడిపోయిన బెలూన్, దాని విడి భాగాల కోసం రెండు నేవీ నౌకలు, ఇతర భారీ నౌకల సాయంతో అన్వేషిస్తున్నారు. బెలూన్ని కూల్చివేసే మిషన్‌ను బైడెన్ స్వయంగా పర్యవేక్షించారు. ‘‘దాన్ని పేల్చివేసినప్పుడు ఎలాంటి నష్టం జరగకూడదని ఒత్తిడి ఎదుర్కొన్నాను. సైనిక సిబ్బంది విజయవంతంగా పని పూర్తి చేశారు. వారికి అభినందనలు’’ అన్నారు. నిబంధనల ఉల్లంఘన: చైనా అమెరికా తమ బెలూన్ను కూల్చివేయడంపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా చేసిన పనికి తగిన సమయంలో దీటుగా బదులిస్తామని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలలో పేర్కొంది. అది పౌర వినియోగం కోసం ప్రయోగించిన బెలూన్ మాత్రమేనని పునరుద్ఘాటించింది. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన బెలూన్ను అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా కూల్చేసినందుకు తమ నుంచి త్వరలోనే గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. ఇలా కూల్చేశారు... ► దాదాపు మూడు స్కూలు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ తొలిసారిగా జనవరి 28న అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది. ► దాదాపు 60 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ అమెరికా నిఘా కంటికి చిక్కింది. వెంటనే కెనడా వైపుగా వెళ్లి 30వ తేదీన తిరిగి అమెరికాలోకి ప్రవేశించింది. ► అణ్వాయుధ క్షిపణి ప్రయోగశాల తదితరాలున్న మొంటానాపై కూడా తిరుగుతుండటంతో కలకలం రేగింది. ► బెలూన్ కూల్చివేతకు మల్టిపుల్ ఫైటర్, రీ ఫ్యూయలింగ్ యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. వర్జీనియాలోని లాంగ్లీ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి దూసుకెళ్లిన ఎఫ్22 ఫైటర్ జెట్ పని పూర్తి చేసింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ఏఐఎం–9ఎక్స్ సూపర్‌సానిక్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని ప్రయోగించింది. వేడిని అనుసరిస్తూ దూసుకెళ్లే ఆ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది. ► ముందుజాగ్రత్తగా సమీప విల్మింగ్టన్, మిర్టిల్ బీచ్, చార్లెస్టన్ ప్రాంతీయ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. ► బెలూన్‌కు అమర్చిన నిఘా పరికరాలను అమెరికా సేకరించి పరిశీలించనుంది. సముద్రంలో 47 అడుగుల లోతుకు పడిపోయిన సె¯్సర్లు తదితర విడి భాగాల కోసం నేవీ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ ఆస్కార్ ఆస్టిన్, డాక్ లాండింగ్ షిప్ యూఎస్ఎస్ కార్టర్ హాల్ వంటివాటితో పాటు నేవీ డైవర్లు గాలిస్తున్నారు. (చదవండి: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత) -
చైనా నిఘా బెలూన్ వ్యవహారం.. ఆకాశంలో మరొకటి!
వాషింగ్టన్: అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైంది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్ సంచరించడంతో తీవ్రంగా పరిగణించిన అమెరికా.. తమ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ‘చైనా పర్యటన’ను వాయిదా వేయించింది. అయితే.. అది నిఘా బెలూన్ కాదని చైనా వివరణ ఇచ్చేలోపే.. ఇప్పుడు మరో బెలూన్ వ్యవహారం వెలుగు చూసింది. లాటిన్ అమెరికా రీజియన్ గగనతలంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో బెలూన్ను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ధృవీకరించింది. ఒక బెలూన్ లాటిన్ అమెరికా దిశగా ప్రయాణిస్తున్నట్లు మేం నివేదికలను పరిశీలించాం. ఇది చైనీస్ నిఘా బెలూన్‌గానే భావిస్తున్నాం అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే.. అది చైనాదేనా? లేదా మరేదైనా దేశం నుంచి ప్రయోగించారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు.. ఆ బెలూన్ సంచారాన్ని గమనిస్తే అది అమెరికా వైపుగా పయనిస్తున్నట్లు కనిపించడం లేదని ఓ భద్రతాధికారి చెప్తున్నారు. అయినప్పటికీ రాబోయే రోజుల్లో దాని సంచారం ఎటువైపు ఉందో ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని పెంటగాన్ పేర్కొంది. అంతకు ముందు అమెరికా గగనతలంలో మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఓ బెలూన్.. సంచరించడం కలకలం రేపింది. గురువారం ఏకంగా మోంటానా(అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి ఉంది)లో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అయితే అత్యంత ఎత్తులో ఎగరడం వల్ల విమానాల రాకపోకలకు దానివల్ల అంతరాయమేమీ కలగలేదు. అయినప్పటికీ కీలక సమాచారం లీక్ అయ్యే ఛాన్స్ ఉండడంతో.. అమెరికా జాగ్రత్త పడింది. దానిని పేల్చినా.. కూల్చినా.. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోననే ఆందోళనతో కేవలం నిఘా మాత్రమే పెట్టింది అమెరికా రక్షణ శాఖ. ఈ బెలూన్ వ్యవహారాన్ని పెంటగాన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి తీసుకెళ్లింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. కానీ, ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. -
వెండితెరపై దేశం కోసం పోరాడుతున్న రీల్ గుఢాచారులు
దేశం కోసం కొందరు గూఢచారులు ‘మేరా భారత్ మహాన్’ అంటూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అయితే ఇవి సిల్వర్ స్క్రీన్ గూఢచారుల కథలు. భారత రాజ్యాంగం అమలులోకొచ్చిన రోజు (జనవరి 26)న స్వాతంత్య్రం కోసం ప్రాణాలను లెక్కచేయని సమర యోధులను గుర్తు చేసుకుంటూ... సిల్వర్ స్క్రీన్‌పై దేశం కోసం పోరాడే ఈ రీల్ గూఢచారుల గురించి తెలుసుకుందాం. ఓ రహస్యాన్ని ఛేదించేందుకు ‘డెవిల్’గా గూఢచార్యం చేస్తున్నారు కల్యాణ్ రామ్. నవీన్ మేడారం దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘డెవిల్’. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. 1945లో బ్రిటిష్ పరిపాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేమ, ద్రోహం, మోసం.. ఈ మూడు అంశాలు ఏ విధంగా ఓ గూఢచారి జీవితాన్ని ప్రభావితం చేశాయన్నదే ఈ సినిమా ప్రధానాంశం. మరోవైపు దేశం కోసం అజ్ఞాతంలో ఉండనున్నారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో అజ్ఞాత గూఢచారి పాత్రలో కనిపిస్తారట విజయ్ దేవరకొండ. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇక 2018లో ‘గూఢచారి’గా కనిపించి సక్సెస్‌ఫుల్‌గా మిషన్‌ను పూర్తి చేసిన అడివి శేష్ మళ్లీ ఓ కొత్త మిషన్‌ను ఆరంభించారు. ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ 2’ (గూఢచారి 2)లో హీరోగా నటిస్తున్నారు. సిరిగినీడి వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు యాక్షన్ ‘ఏజెంట్’గా మారారు అఖిల్. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. దేశం కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కానుంది. కాగా మంచు పర్వతాల్లో తుపాకులను దాచిపెట్టారు హీరో నిఖిల్. ఎందుకంటే దేశం కోసం గూఢచారిగా మారారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘స్పై’. దేశానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను కనిపెట్టి, దేశద్రోహులను ఓ స్పై ఏ విధంగా మట్టుపెట్టాడన్నదే ఈ సినిమా అని తెలుస్తోంది. ‘స్పై’ను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా గూడఛారులుగా కనిపించనున్నారు. కోలీవుడ్ లోనూ కొందరు హీరోలు దేశం కోసం సాహసాలు చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంగా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ చేస్తున్నారు కమల్ అండ్ శంకర్. పూర్తి దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో, ఈ కాలంతోపాటు 1920 కాలం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిసింది. ఇక దర్శకుడిగా ‘తుపాకీ’, ‘స్పైడర్’ వంటి స్పై మూవీస్‌ను తీసిన ఏఆర్ మురుగదాస్ నిర్మాతగా ప్రస్తుతం ‘1947, ఆగస్టు 16’ అనే సినిమా నిర్మించారు. గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఎన్ఎస్ పొన్‌కుమార్ దర్శకుడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే మరో తమిళ హీరో అరుణ్ విజయ్ నటించిన సినిమా ‘బోర్డర్’. మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం ఇది. ఎ. వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఇక విష్ణు విశాల్ హీరోగా మను ఆనంద్ దర్శకత్వంలోవచ్చిన ‘ఎఫ్ఐఆర్’ చిత్రం ఉగ్రవాదం నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ఐఆర్ 2’ని ప్రకటించారు విష్ణు విశాల్. కాగా గత ఏడాది విడుదలైన ‘విక్రమ్’ సినిమాలో కమల్‌హాసన్, ‘సర్దార్’లో కార్తీ రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్స్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు సీక్వెల్స్ రానున్నాయి. బాలీవుడ్లో అయితే స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్స్‌కు కొదవే లేదు. ఇప్పటికే ‘టైగర్ జిందా హై’, ‘ఏక్తా టైగర్’ వంటి స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్స్‌లో నటించిన సల్మాన్ ఖాన్ ఈ ఫ్రాంచైజీలోనే తాజాగా ‘టైగర్ 3’ సినిమా చేస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే స్పై బ్యాక్‌డ్రాప్‌లో సౌత్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ‘జవాన్’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు షారుక్ ఖాన్. ఈ ఏడాది జూన్ 2న ‘జవాన్’ విడుదల కానుంది. మరోవైపు కథానాయిక సారా అలీఖాన్ ‘ఆయే వతన్.. మేరే వతన్’ అనే మూవీ చేస్తున్నారు. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఓ కాలేజీ విద్యార్థిని స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలా పాల్గొంది? అన్నదే ఈ సినిమా కథ. అలాగే దేశ విభజన నాటి అంశాల నేపథ్యంలో ‘లాహోర్: 1947’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ‘ఘాయల్’, ‘దామిని’, ‘ఘాతక్’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి కాంబినేషన్లో ఈ సినిమా రూపొందనుంది. ఇక దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రీసెంట్గా స్పై బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా స్పై ఫిల్మ్ ‘పఠాన్’ థియేటర్స్‌లో ఉంది. కాగా ‘వార్’ తర్వాత హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ చేస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్. ఇది కూడా స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ అట. అలాగే హీరో ప్రభాస్‌తో కూడా సిద్ధార్థ్ ఓ స్పై బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ చేస్తారని టాక్. ఇక హీరో జాన్ అబ్రహాం కూడా ‘టెహ్రాన్’ అనే స్పై ఫిల్మ్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొన్ని బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. -
జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు
ఉన్నత స్థానంలో పనిచేసిన వ్యక్తి తన జ్ఞాపకాలను రాస్తే అవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతాయి. అందునా ఆయన ఒక గూఢచార సంస్థకు అధిపతి అయితే? అప్పుడు మామూలుగా మనం ఎప్పటికీ తెలుసుకోలేని వ్యక్తులు, వారి కథనాలు మన ముందుకు వస్తుంటాయి. ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’(రా)కు అధిపతిగా పనిచేసిన ఎ.ఎస్.దులత్ తనను తాను ఒక దయ్యంగా అభివర్ణించుకుంటారు. నీడలా ఉండి చేయాల్సిన పని అది కాబట్టి. అందుకే ఆయన తన పుస్తకానికి ‘ఎ లైఫ్ ఇన్ ద షాడోస్’ అనే పేరుపెట్టారు. ఇందులో ప్రిన్స్ చార్లెస్‌కు ఇందిరా గాంధీ ఇచ్చిన ఆతిథ్యం నుంచి, తన భద్రతాధికారి పట్ల మార్గరేట్ థాచర్ చూపిన ఔదార్యం దాకా ఎన్నో విషయాలున్నాయి. ఇంకా ఢిల్లీలో సిక్కులను చంపుతున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకుడు అర్జున్ సింగ్ ప్రతిస్పందన విశేషమైన ప్రాధాన్యత కలిగినది. రెండు అంశాలు జ్ఞాపకాలను తప్పనిసరిగా చదివేలా చేస్తాయి– సుప్రసిద్ధ వ్యక్తులను గురించిన వృత్తాంతాలు, వారి గురించిన పదునైన వ్యాఖ్యలు. రచయిత ఎప్పుడైతే ఒక ‘దయ్యమో’– ఒక జీవితకాలం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నతస్థానంలో ఉండి ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’కు అధిపతిగా పనిచేసిన తర్వాత ఆయన తనను తాను అలాగే అభివర్ణించుకున్నారు– మామూలుగా అయితే మనం ఎప్పటికీ తెలుసుకోలేని వ్యక్తులు, వారి కథనాలు మన ముందుకు వస్తుంటాయి. ఇదే ఎ.ఎస్. దులత్(అమర్జీత్ సింగ్ దులత్) రాసిన ‘ఎ లైఫ్ ఇన్ ద షాడోస్’ పుస్తకాన్ని అంత సరదాగా మలిచింది. 1980లలో ఢిల్లీ సందర్శించే ప్రముఖులకు దులత్ భద్రతా అనుసంధాన అధికారిగా ఉండేవారు. అలాంటి ప్రముఖులలో ఒకరు ప్రిన్స్ చార్లెస్. ఈ బ్రిటన్ యువరాజును ఇందిరాగాంధీ భోజనానికి ఆహ్వానించారు. అయితే అదంత బాగా సాగలేదు. ‘‘ఎవరో చితక బాదినట్టిగా భారత ప్రధాని నివాసం నుంచి చార్లెస్ బయటపడ్డారు!’’ అని దులత్ రాశారు. ‘‘యువర్ హైనెస్(మహాశయా), భోజనం ఎలా అయ్యింది?’’ అని అడిగాను. ‘‘నన్ను అడగొద్దు,’’ అంటూ ఊపిరి పీల్చుకుంటున్న రీతిలో చార్లెస్ కారు ఎక్కారు. ‘‘ఆ మహిళ నిన్ను గడ్డ కట్టించేయగలదు. నీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాయకులను నేను కలిశాను, కానీ ఈ మహిళ ఒక్క మాట కూడా మాట్లాడదు!’’ మార్గరేట్ థాచర్ (బ్రిటన్ మాజీ ప్రధాని) భిన్నమైన ముద్ర వదిలేసి వెళ్లారు. ఈ ఉక్కు మహిళ తన సిబ్బందని ఎంతో జాగ్రత్తగా చూసుకునే బాస్‌గా ఉండేవారు. థాచర్ భద్రతాధికారి గోర్డాన్ కేథార్న్ ఒక రాత్రి ఆమె గది బయట చలిలో గడుపుతానని చెప్పినప్పుడు థాచర్ ఎలా స్పందించారో దులత్ రాశారు. ‘‘గోర్డాన్, రాత్రి ఇక్కడే గడపటం గురించి నీవు సీరియస్‌గానే అంటున్నావా?’’ అని ఆమె అడిగారు. ‘‘అవును మేడమ్, అఫ్కోర్స్, నిజంగానే’’ అన్నాడు గోర్డాన్. అప్పుడు ప్రధాని ఇలా అన్నారు: ‘‘అయితే ఒక నిమిషం ఉండు. బయట చలిగా ఉంది. డెనిస్ స్వెటర్లలో ఒకటి నీకు తెచ్చిస్తాను.’’(డెనిస్– డెనిస్ థాచర్. ఆమె భర్త.) ఆ ప్రయాణంలో థాచర్ కారు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. అద్దాల్లోంచి బయటికి చూస్తూ ఆమె కేథార్న్ కారు వెంట జాగింగ్ చేయడాన్ని గమనించారు. ముందు సీట్లో డ్రైవర్ పక్కనే కూర్చున్న దులత్ను మనం అతడికి లిఫ్ట్ ఇద్దామా అని అడిగారు. దులత్ అంగీకరించి, కేథార్న్ లోపలికి వచ్చేలా తన డోరు తెరిచారు. ‘‘నో, నో, నువ్వు అసౌకర్యానికి గురి కావొద్దు,’’ అని వెంటనే థాచర్ అన్నారు. ‘‘అతడు మాతో వెనక కూర్చుంటాడు’’. దులత్ ఏమంటారంటే – ‘‘ఇలాంటి దృశ్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక భద్రతాధికారికి అసౌకర్యం కలిగించడం కంటే కూడా, బ్రిటన్ దేశపు ప్రధాని వెనక సీట్లో ముగ్గురితో సర్దుకుని కూర్చోవడానికి సిద్ధపడ్డారు.’’ దులత్ ఉపాఖ్యానాల్లో ఎక్కువగా జ్ఞానీ జైల్ సింగ్ గురించి ఉన్నాయి. దులత్ రాశారు: ‘‘1982 నుంచి 1987 మధ్య ఆయన చేసిన ప్రతి విదేశీయానంలోనూ నేను వెంట ఉన్నాను.’’ అయితే రాష్ట్రపతి వారి సమక్షంలో లేనప్పుడు నిజమైన సరదా జరిగినట్టుంది. ‘‘ఎప్పుడు మేం కొత్త దేశంలో అడుగు పెట్టినాసరే, ఒకవేళ రాష్ట్రపతితో ప్రయాణిస్తున్న కార్యదర్శి రమేశ్ భండారీ అయితే, ఆయన నాతో అనేవారు, ‘పార్టీ నా రూములో’’’. హోనోలూలూ(అమెరికా నగరం) నుంచి తిరిగివస్తూ, కాసేపటి కోసం హాంకాంగ్‌లో ఆగినప్పుడు ‘‘మేము ఎంత అలసిపోయామంటే, ఒక చక్కటి మసాజ్ స్వర్గ తుల్యంగా ఉంటుందనిపించింది... సమీపంలో ఎక్కడైనా మసాజ్ సెంటర్ ఉందా అని హోటల్ ఫ్రంట్ డెస్క్‌లో ఉన్నవారిని అడిగాను... తీరా నేను పరుగెత్తుకెళ్లి కనుక్కున్నదల్లా అప్పటికే అక్కడికి మంత్రి పదవి కోసం వేచి చూస్తున్న, సరదా మనిషి అయిన ఎన్.కె.పి.సాల్వే నాకంటే ముందు చేరుకున్నారని!’’ ముఖ్యమైన వ్యక్తుల గురించి దులత్‌కు తెలియవచ్చిన విషయాలు చాలా విశేష ప్రాధాన్యత కలిగినవి. 1984లో సిక్కులను హత్య చేస్తున్న కాలంలో కాంగ్రెస్ నేత(అప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి) అర్జున్ సింగ్‌ను దులత్ కలిశారు. ‘‘ఒక ముఖ్యమంత్రిగా భోపాల్‌లోని సిక్కులను మీరు కలిసి వారి భయాలను నివృత్తి చేయాలని నేను సూచించాను... కానీ ఆయన కరాఖండీగా నిరా కరించారు. ఆయన ఎలాంటి అంతఃగర్భితమైన సందేశాన్ని వ్యక్తపరి చారంటే, రాజ్యం– భారత ప్రభుత్వం– తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ తరుణంలో సిక్కులు ఇంకేమిటో కాదు, అభద్రతను ఫీల్ కావాలి.’’ తన మాజీ సహచరుల్లో ఒకరైన, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు c(అజీత్ డోభాల్) గురించి కూడా దులత్ రాశారు. వారిద్దరూ నార్త్ బ్లాక్‌లోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలోని పార్కింగ్ ప్లేసులో మొట్టమొదటిసారి కలిశారు. అప్పట్లో దోవల్ యువకుడు, దులత్ కంటే మూడేళ్లు జూనియర్. ‘‘ఆ రోజుల్లోనే అతడిని చూసినప్పుడల్లా తన కెరియర్లో ఎంతో అత్యున్నత స్థానా నికి వెళుతున్న మనిషి ఇక్కడున్నాడు అనిపించేది. దోవల్ ప్రతి ఒక్కరికీ స్నేహితుడు, అదేసమయంలో ఎవరి స్నేహితుడూ కాదు. ప్రతిరోజూ అలా వ్యవహరించడం అనేది మనలో చాలామందికి ఎంతో కష్టమైన మార్గం.’’ ఏమైనా దోవల్ మారారని దులత్ నమ్ముతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన బీజేపీ సీనియర్ నేత ఎల్.కే.ఆడ్వాణీ వీరా రాధకుడు, అలాగే పాకిస్తానీయులతో చర్చలకు సిద్ధంగా ఉండేవారు. ఇప్పుడు మాత్రం ‘‘వారితో చర్చలకు, సర్దుబాటకు ససేమిరా అంటు న్నారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా కఠిన వైఖరి మీద, నిర్దాక్షిణ్యత మీద, లక్ష్యాలను చేరుకోవడం మీద ఉంది. పాత రోజుల్లో నాకు తెలిసిన దోవల్ ఎన్నడూ నరేంద్ర మోదీపై దృష్టి పెట్టేవారు కాదు. ఆయన దృష్టి అంతా తనకు అభిమాన నేత అయిన ఆడ్వాణీ పైనే ఉండేది.’’ ‘‘అజిత్ గురించి చాలావరకు ప్రశంసించిదగిన కథనాలు నా వద్ద ఎన్నో ఉన్నాయి,’’ అని దులత్ కొనసాగిస్తారు. నేననుకోవడం అవి ఆయన వాటిని సీక్వెల్ కోసం పదిలపరుచుకుంటున్నట్టున్నారు. వాటి గురించి దోవల్ ఏమనుకుంటారోగానీ, వాటిని చదవడానికి నేను మాత్రం వేచి ఉండలేను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
విదేశాంగశాఖలో హనీట్రాప్ కలకలం.. సైనిక రహస్యాల కోసం పాక్ పన్నాగం
న్యూఢిల్లీ: భారత సైనిక సమాచారం కోసం పాకిస్థాన్ హనీట్రాప్ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. గూఢచర్యం ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూఢిల్లోని జవహర్లాల్ నెహ్రూ భవన్ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎమ్ఈఏ డ్రైవర్ పాక్ హానీ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాకిస్థానీ నిఘా ఏజెన్సీకి చెందిన మహిళ డ్రైవర్‌ను ముగ్గులోకి దింపి అతనితో సన్నిహితంగా ఉంటూ సైన్యానికి సంబంధించిన కీలక సేకరించినట్లు గుర్తించారు. కొన్నిసార్లు పాకిస్థాన్ మహిళ పూనమ్ శర్మ, మరికొన్ని సార్లు పూజాగా పరిచయం చేసుకున్న ఆ దేశ గూఢచారి వలలో చిక్కుకున్న డ్రైవర్.. దేశ రక్షణ సమాచారం, డాక్యుమెంట్లను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో 46 ఏళ్ల భాగ్‌చంద్ అనే వ్యక్తిని, రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో పుట్టిన ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి 1998లో ఢిల్లీకి రాగా.. 2016లో మన దేశ పౌరసత్వాన్ని పొందారు. ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. పాకిస్థాన్‌లోని తన బంధువుల ద్వారా భాగ్‌చంద్ తన హ్యాండ్లర్లతో టచ్‌లో ఉండేవాడని తెలిపారు. చదవండి: షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో! -
భారత్‌కు హామీ ఇచ్చిన శ్రీలంక...చైనా నౌకకు చెక్!
కొలంబో: భారత్ ఒత్తిడి మేరకు నిఘా నౌక పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకోమని చైనాను శ్రీలంక అభ్యర్థించింది. ఈ మేరకు యువాన్వాంగ్ 5 చైనీస్ పోర్ట్ ఆఫ్ జియాంగిన్ నుంచి ఆ నిఘా నౌక శ్రీలంకకు సమీపంలోని మార్గ మధ్యలో ఉంది. ఆ నౌక గురువారం చైనీస్ ఆధ్వర్యంలో శ్రీలంక నౌకాశ్రయమైన హంబన్‌టోటాకు చేరుకుంటుందని మెరైన్ ట్రాఫిక్ పేర్కొంది. ఇది పరిశోధనలకు సంబంధించిన నిఘా నౌకగా అనుమానిస్తోంది భారత్. ఇది రెండు రకాలగా ఉపయోగపడే గూఢచారి నౌక, పైగా దీన్ని అంతరిక్ష ఉపగ్రహ ట్రాకింగ్‌తోపాటు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలలోనూ వినియోగిస్తారు. అయితే ఈ నౌక తమ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు చైనా ఉపయోగిస్తుందేమోనని భారత్ తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ విషయమై కొలంబోలో ఫిర్యాదు చేసింది కూడా. అదీగాక భారత్‌కి పొరుగున ఉన్న శ్రీలంక నుంచి చైనా బలపడుతుందేమోనని అనుమానిస్తోంది. ఐతే శ్రీలంక విదేశాంగ మంత్రిత్వశాఖ భారత భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు ఎలాంటి అవాంతరం తలెత్తకుండా చూడటమే కాకుండా తగిన చర్యలను కూడా తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా రాయబార కార్యాలయానికి ఈ నౌక పర్యటన వాయిదా వేసుకోవాలంటూ వ్రాత పూర్వకంగా అభ్యర్థించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రీలంక సముద్ర జలాల్లో భారత్‌కి కుట్ర తలపెట్టేలా ఎలాంటి వివాదాస్పద పర్యటన కొనసాగదని ఆ దేశ అధ్యక్షుడు విక్రమశింఘే రణిల్ భారత్‌కి హామీ ఇచ్చారు. అంతేకాదు ఆ చైనా నౌక ఇంధనం నింపడానికి, సరఫరా చేయడానికి వస్తుందని చెబుతోంది శ్రీలంక. (చదవండి: Gotabaya Rajapaksa: ప్లీజ్ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక) -
ఈ దసరాకు బరిలో దిగే చిత్రాలివే.. తలపడనున్న చిరు-నాగ్
ఈ ఏడాది దసరా పండగ బాక్సాఫీస్ ఫైట్‌కి రంగం సిద్ధం అవుతోంది. దసరా బరిలో నిలిచేందుకు హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ చిత్రంతో దసరాకు వచ్చేందుకు రెడీ అయ్యారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు మోహన్‌రాజా దర్శకుడు. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక పాత్రలు చేస్తున్నారు. సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చిత్రబృందం పేర్కొంది. కానీ విడుదల తేదీ ప్రకటించలేదు. ఇక రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకుని పండగ బరిలో నిలిచారు హీరో నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘ది ఘోస్ట్’లో నాగార్జున హీరోగా నటించారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 5న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన చిత్రం ఇది. ఇంకోవైపు నిఖిల్ కూడా దసరా బరిలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘స్పై’. ఈ సినిమాను దసరా సందర్భంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. కె. రాజశేఖర్ రెడ్డి కథ అందించి, నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అలాగే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలు కూడా దసరాకు రిలీజవుతాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రబృందాలు రిలీజ్ గురించి స్పష్టత ఇవ్వలేదు. ఇక దసరా పండక్కి ఓ నాలుగు రోజుల ముందే రవితేజ ‘రావణాసుర’ రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా సెప్టెంబరు 30న విడుదలవుతుంది. అనుకున్న ప్రకారం రిలీజైతే దసరా పండక్కి కొన్ని థియేటర్స్‌లో అయినా ‘రావణాసుర’ ఉంటాడు. సేమ్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పొన్నియిన్ సెల్వన్’ కూడా సెప్టెంబరు 30నే రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా దసరా సమయానికి కొన్ని థియేటర్స్‌లో ప్రదర్శనకు ఉండే చాన్సెస్ లేకపోలేదు. ఈ చిత్రంలో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్ ప్రధాన తారలుగా నటించారు. దసరా పండగ సందర్భంగా మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్‌కి గురి పెడుతున్నాయి. -
ఇమ్రాన్ ఖాన్ని హత్య చేసేందుకు స్కెచ్...పట్టుబడ్డ ఉద్యోగి
spying attempt on Pakistan’s former Prime Minister: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ని హత్య చేసేందుకు పథకం రచిస్తున్నారంటూ...ఇటీవల పలురకాల వదంతులు వ్యాపించాయి. ఐతే ఆయన పదవీచ్యతుడు కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు పుట్టిస్తున్న పుకార్లుగా పాకిస్తాన్ కొట్టిపారేసింది. కానీ అది నిజమే అనేలా ప్రస్తుతం ఖాన్ పై గూఢచర్య ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఒక ఉద్యోగి ప్రధాని ఖాన్ గదిని శుభ్రం చేసే నిమిత్తం వచ్చి అయనపై నిఘా కోసం ఒక రహస్య పరికరాన్ని అమర్చడానికి యత్నించాడు. ఈక్రమంలోనే ఆ ఉద్యోగి పట్టుబడ్డాడు. దీంతో బనిగాలా భద్రతా బృందం సదరు ఉద్యోగిని ఫెడరల్ పోలీసులకు అప్పగించారు. అంతేకాదు పాక్ మాజీ ప్రధాని పరిసర ప్రాంతాలలో భద్రతా ఏజెన్సీలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని పలువురు పీటీఐ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పీటీఐ నాయకుడు షెహబాజ్గిల్ మాట్లాడుతూ..ఈ విషయమై ప్రభుత్వంతో సహా సంబంధిత అన్ని ఏజెన్సీలకు సమాచారం ఇచ్చాం. పట్టుబడిన ఉద్యోగి ఈ రహస్య పరికరాన్ని అమర్చేందకు డబ్బులు ఇచ్చారంటూ కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడన్నారు. ఈ చర్య హీనమైనది అంటూ...ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు మానుకోవల్సిందిగా సూచించారు షహబాజ్ గిల్. (చదవండి: మానవాళి భవిష్యత్తు ‘గుట్టు’ నేనే..) -
మంచులో కప్పేసిన డబ్బాలో నుంచి తుపాకీలు తీసిన నిఖిల్
‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’ వంటి సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం స్పై. ఈ స్పై థ్రిల్లర్ మూవీలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ఐశ్వర్యా మీనన్ కథానాయిక. సోమవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజయ్యాయి. ఇందులో మంచు కొండల్లో హీరో నిఖిల్ ఒంటరిగా నడుస్తూ కనిపించాడు. ఆ తర్వాత మంచుతో కప్పేసిన ఓ బాక్స్‌ను తెరిచి అందులో ఉన్న తుపాకీలను బుల్లెట్లుతో సహా నింపుకుని సమరానికి రెడీ అయ్యాడు. మరి ఈ బుల్లెట్ల వర్షం ఎవరి మీదైనా కురిపించడానికా? తనను తాను కాపాడుకోవడానికా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! శ్రీచరణ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్ జులియన్ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే ఏడాది దసరాకు స్పైను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. చదవండి: మూడు రోజుల్లోనే రూ.150 కోట్లు సాధించిన విక్రమ్ కరణ్ జోహార్ బర్త్ డే: బాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా -
Sakshi Cartoon: భారత్‌లోకి పాక్ ‘గుఢాచారి’పావురం
భారత్‌లోకి పాక్ ‘గుఢాచారి’పావురం -
నిఖిల్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చేసింది, బుల్లెట్ల మధ్యలో హీరో!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న 19వ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. గూడఛారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఈ సినిమాకు స్పై అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ గన్ చేతపట్టుకుని బుల్లెట్ల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే ఏడాది దసరాకు స్పైను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. స్పై చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్ జులియన్ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. అలాగే మరో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. The sentinel is geared up for the Task!Unfolding & Presenting 𝐒𝐏𝐘🔥#SPY ATTACKING PAN INDIAN THEATRES this DASARA 2022😎స్పై - स्पाई - ஸ்பை - ಸ್ಪೈ - സ്പൈ@Ishmenon @Garrybh88 @AbhinavGomatam @tej_uppalapati @julian_amaru #EDEntertainments #KRajashekarreddy pic.twitter.com/MBRlUsb7it— Nikhil Siddhartha (@actor_Nikhil) April 17, 2022 చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? -
మావోయిస్టుల ఫోన్లలో స్పైవేర్!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులపై పోలీసులు గూఢచర్య ఆపరేషన్లు చేస్తున్నారని.. ఫోన్లలో స్పైవేర్ చొప్పించి లొకేషన్, ఫొటోలు సేకరిస్తున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ పత్రికలో ఆరోపించింది. ఆ వివరాల ఆధారంగానే భారీగా ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని పేర్కొంది. అంతేగాకుండా ఇన్ఫార్మర్లు, కొరియర్లను లోబర్చుకుని.. వారి ద్వారా మావోయిస్టులపై విష ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ప్రతి ఆరు నెలలకోసారి అధికార పత్రికను విడుదల చేస్తుంది. అందులో భాగంగా తాజా పత్రికలో పలు సంచలన ఆరోపణలు చేసింది. హ్యాకర్లతో స్పైవేర్.. పోలీసులు హ్యాకర్ల సాయంతో తమ ఫోన్లలో రహస్యంగా నిఘా యాప్స్ (స్పైవేర్)ను ఇన్స్టాల్ చేస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. లొకేషన్, ఫోటోలు, వీడియోలను సంగ్రహించి.. కూంబింగ్ బృందాలకు పంపి ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పార్టీ ఇన్ఫార్మర్లు, కొరియర్ల ఫోన్లలోనూ స్పైవేర్‌తో నిఘా పెట్టినట్టు తెలిపింది. కొరియర్లను భయపెట్టి.. మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పనిచేస్తున్న వారిని పోలీసులు రహస్యంగా అరెస్ట్ చేసి బెదిరిస్తున్నారని.. వారు ప్రాణభయంతో కోవర్టులుగా మారిపోతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. కొరియర్లు మావోయిస్టుల కోసం తెచ్చే పళ్లు, డ్రైప్రూట్స్, మందులు, ఇతర ఆహార పదార్థాల్లో పోలీసులు విషం కలుపుతున్నారని ఆరోపించింది. దీనివల్ల మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని, కొందరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో వాజేడు– వెంకటాపురం దళంపై ఇలాంటి విష ప్రయోగమే జరిగిందని, దళంలోని కీలక నేతలు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని వెల్లడించింది. పక్కా ప్రణాళికలతో దాడులు మావోయిస్టులను నిర్మూలించే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి సమాధాన్–2022ను చేపట్టిందని మావోయిస్టు పార్టీ పత్రికలో తెలిపింది. ఇందులో భాగంగా నిర్దిష్టమైన ప్రణాళికతో పదిరకాల ఎత్తుగడలకు శ్రీకారం చుట్టిందని వెల్లడించింది. ఆ వ్యూహాలను మొదట తెలంగాణ నుంచే అమల్లోకి తెచ్చారని. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 4న ములుగులో ఛత్తీస్గడ్, తెలంగాణ డీజీపీలతోపాటు కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్, సీఆర్పీఎఫ్ డీజీ, ఆ జోన్ ఐజీల, ఇతర కీలక అధికారులు సమావేశమయ్యారని పేర్కొంది. ప్రధానంగా గెరిల్లా బేస్‌గా ఉన్న దండ కారణ్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో.. దానికి ఆనుకుని ఉన్న మావోయిస్టు మద్దతు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. అందులో భాగంగానే తెలంగాణ–ఛత్తీస్గడ్ సరిహద్దు గ్రామమైన భట్టిగూడెం వద్ద 5వేలమంది కోబ్రా, డీఆర్జీ, గ్రేహౌండ్స్ బలగాలతో దాడికి పాల్పడ్డారని.. కానీ తెలంగాణ కమిటీ తప్పించుకోగలిగిందని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అడవుల్లో కూంబింగ్ చేస్తున్న ఓ గ్రేహౌండ్స్ టీమ్‌ను చూసిన మరో గ్రేహౌండ్స్ గ్రూప్.. మావోయిస్టులు అనుకుని కాల్పులు జరిపిందని గుర్తుచేసింది. ఆ ఘటనలో ఓ ఎస్సై మృతిచెందాడని, మరో హెడ్ కానిస్టేబుల్ దాడి భయంతో గుండెపోటుతో చనిపోయాడని పేర్కొంది. మావోయిస్టుల కోసమే ఆ ఓఎస్డీలు! గతంలో మావోయిస్టులపై దాడుల్లో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ అధికారులను కీలక విభాగాల్లో ఓఎస్డీలుగా నియమిస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకాలను వేగవంతం చేశారని.. అందులో సాంకేతిక నైపుణ్యం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని తమ పత్రికలో వెల్లడించింది. మావోయిస్టు పార్టీని పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతోనే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలంటూ పోలీస్ శాఖలో వేలాది మందిని నియమిస్తున్నట్టు ఆరోపించింది. -
పెగాసస్‌తో నిఘా పెట్టడం ఎలా?.. జనాల ఆసక్తి !
కోలికోడ్ (కేరళ): ఓవైపు పెగాసస్ స్పై వేర్ పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తుంటే... మరోవైపు ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఇతరుల ఫోన్లపై నిఘా వేయాలనుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఆన్లైన్లో, యాప్‌స్టోర్‌లో పెగసెస్ అని కనిపిస్తే చాలు డౌన్‌లోన్ చేసేస్తున్నారు. ఇతరుల ఫోన్లు, వారి ఆంతరంగిక విషయాల్లో తలదూర్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. స్టడీ మెటీరియల్ యాప్ కేరళలోని కోజికోడ్‌లో పెగాసస్ పేరుతో ఓ కోచింగ్ సెంటర్ ఉంది. దీని నిర్వాహకులు కేరళ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం చాన్నాళ్ల కిందట పెగసెస్ అనే పేరుతో ఓ ఆన్లైన్ యాప్‌ని రూపొందించారు. ఉద్యోగార్థులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు. అయితే గత నాలుగు రోజులుగా ఈ పెగసెస్ యాప్ డౌన్లోడ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతకు ముందు వారానికి వెయ్యి డౌన్లోడ్లు ఉంటే పెగసెస్ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత మూడు రోజుల్లోనే వేల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. కేరళలోనే కాదు సౌత్, నార్త్ తేడా లేకుండా ఇండియా అంతటా ఈ యాప్‌ని డౌన్లోడ్ పెరిగిపోయింది. నిఘా ఎలా ? పెగాసస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నదే ఆలస్యం... వెంటనే తమ టార్గెట్ వ్యక్తుల ఫోన్లపై ఎలా నిఘా వేయాలా అని డౌన్లోడ్ చేసుకున్న వారు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఆ యాప్‌లో కేవలం పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్ ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఏకంగా యాప్ రూపొందించిన కోచింగ్ సెంటర్ నిర్వహకులకే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు డౌన్‌లోడర్లు. పెగాసెస్ యాప్‌ను ఎలా మేనేజ్ చేయాలో... ఎలా నిఘా వేయాలో చెప్పాలంటూ ఒకరి తర్వాత ఒకరుగా కోచింగ్ సెంటర్లకు ఫోన్ల పరంపర పెరిగిపోయింది. సంబంధం లేదు దేశం నలుమూలల నుంచి ఒక్కసారిగా ఫోన్లు పెరిగిపోవడంతో... అందరికీ సమాధానం చెప్పలేక కోచింగ్ సెంటర్ నిర్వాహకులు మీడియా ముందుకు వచ్చారు. ఇజ్రాయిల్ స్పై వేర్ పెగాసస్‌కు తమకు ఎటువంటి సంబంధం లేదని, తమది కేవలం ఎగ్జామ్ మెటీరియల్ యాప్ మాత్రమే నంటూ వివరణ ఇచ్చారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర వేదికల్లోనూ ఇదే విషయాన్ని తెలియజేశారు. పెగసెస్ పేరు, యాప్ లోగోగా రెక్కల గుర్రం ఉండటంతో చాలా మంది తమది స్పై వేర్‌గా పొరపడినట్టు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వాల మధ్యనే టార్గెట్ పర్సన్ ఫోన్లోకి అత్యంత చాకచక్యంగా చొరబడి.. నిఘా ఉంచే సాఫ్ట్వేర్ పెగాసస్. ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఈ సాఫ్ట్వేర్ లావాదేవీలు సార్వభౌమత్వం కలిగిన రెండే దేశాల మధ్యనే జరుగుతున్నాయి తప్పితే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఈ సాఫ్ట్వేర్ యాక్సెస్ ఇవ్వలేదు. అయినా పెగాసస్‌తో ఇతరుల ఫోన్‌పై నిఘా వేయోచ్చు అనే ఒకే ఒక్క కారణంతో నెట్లో పెగాసెస్ గురించి మన వాళ్లు వెతికేస్తున్నారు. పెగాసెస్ పేరు కనిపిస్తే చాలు డౌన్లోడ్ చేసేస్తున్నారు. -
ప్లాన్ ఐఎస్ఐది... ఫైనాన్స్ చైనాది!
సాక్షి, సిటీబ్యూరో: అక్రమంగా సరిహద్దులు దాటుతూ పశ్చిమ బెంగాల్లో బీఎస్ఎఫ్ అధికారులకు గత గురువారం పట్టుబడిన చైనా జాతీయుడు హాన్ జున్వే వెనుక పెద్ధ కథ ఉన్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. భారత సైనిక రహస్యాలు సేకరించడానికి పాకిస్తాన్ చేస్తున్న కుట్రలకు చైనా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వివరిస్తున్నాయి. దీనికోసమే అనేక మంది తమ ఏజెంట్లను భారత్‌కు పంపి, నకిలీ గుర్తింపు కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచేలా, సిమ్‌కార్డులు ఖరీదు చేసేలా చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. తాను 2010లో హైదరాబాద్, 2014లో ఢిల్లీ వచ్చి వెళ్లినట్లు హాన్ జున్వే అంగీకరించడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆపరేషన్ క్రాస్ కనెక్షన్‌తో మొదలు... ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), మిలటరీ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా ఆపరేషన్ క్రాస్ కనెక్షన్ పేరుతో గతేడాది డిసెంబర్లో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీలో సిగ్నల్ మ్యాన్‌గా పని చేసి, ఆరోగ్య కారణాల నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఉద్యోగ విరమణ చేసిన సౌరబ్ శర్మను వెతికి పట్టుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. 2014లో ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్‌కు చెందిన పాకి ఇంటెలిజెన్స్ ఆపరేటింగ్ తో (పీఐఓ) ఇతడికి పరిచయం ఏర్పడింది. వారి వల్లో పడి 2016 నుంచి ఐఎస్ఐ కోసం పని చేయడం ప్రారంభించిన సౌరబ్ శర్మ మిలటరీకి సంబంధించిన అత్యంత సున్నిత సమాచారాన్ని సైతం చేరవేశారు. ప్రతిఫలంగా ఇతడికి పెద్ద మొత్తాలే అందుతూ వచ్చాయి. ఈ విషయం సౌరవ్ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత గుర్తించిన మిలటరీ ఇంటెలిజెన్స్ అతడి స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ కావడంతో అక్కడి ఏటీఎస్‌కు చేరవేసింది. గతేడాది డిసెంబర్ నుంచి వేటాడటం మొదలెట్టిన సంయుక్త బృందాలు ఈ ఏడాది జనవరి మొదటి వారంలో సౌరవ్‌ను పట్టుకున్నాయి. ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసిన సున్ జీ యంగ్, యూ యున్ ఫూ, లే టెంగ్ లీ నగదు లావాదేవీలపై ఆరా తీయగా... సౌరవ్ విచారణలో ఐఎస్ఐ నుంచి ఇక్కడి దేశ ద్రోహులకు నగదు ఎలా అందుతోందనే విషయాన్నీ నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఒకప్పుడు హవాలా ద్వారా అందేదని, అది ఎక్కడ నుంచి వస్తోందో మాత్రం తనకు తెలియదని చెప్పాడు. గతేడాది నుంచి మాత్రం నకిలీ గుర్తింపు పత్రాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలు, వేరే వారి పేర్లపై ఉండే సిమ్‌కార్డులు ఉపకరిస్తున్నాయని బయటపెట్టాడు. ఈ వ్యవహారాల వెనుక మాత్రం చైనీయులు ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో దర్యాప్తు కొనసాగించిన ఏటీఎస్ అధికారులు జనవరి 18న 14 మంది ఉత్తరప్రదేశ్ వాసుల్ని అరెస్టు చేశారు. కరోనా వేళా ఆన్లైన్లో ఖాతాలు తెరిచి.. వీరిలో కీలక నిందితుడైన మురాదాబాద్ వాసి ప్రేమ్ సింగ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చైనీయులకు గతేడాది జూలై నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఈ గ్యాంగ్ మొత్తం 1500 ప్రీయాక్టివేటెడ్ (వేరే వారి పేర్లపై ఉండే) సిమ్‌కార్డులు అందించారు. కరోనా ప్రభావంతో గత సంవత్సరం నుంచి బ్యాంకులు ఆన్లైన్ కేవైసీ దాఖలు చేసి ఖాతాలు తెరుచుకునే అవకాశం ఇచ్చాయి. దీంతో చైనీయులు నకిలీ పత్రాలు వినియోగించి భారతీయుల పేర్లతో అనేక బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఓటీపీల కోసం సిమ్‌కార్డులు... ఏటీఎం కేంద్రాల్లో డెబిట్ కార్డు లేకుండా నగదు డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం ఓటీపీ పొందడానికి ఖాతాలో లింకై ఉన్న ఫోన్ నెంబర్ అవసరం. ఈ నెంబర్లుగా వినియోగించడానికే చైనీయులు భారీ మొత్తం వెచ్చించి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు ఖరీదు చేస్తున్నట్లు ప్రేమ్‌సింగ్ వెల్లడించాడు. ఇతడిచ్చిన సమాచారం ఆధారంగా ఏటీఎస్ అధికారులు జనవరి 24న అక్కడి గౌతమ్‌బుద్ధ నగర్ నుంచి యూ యున్ ఫూ, లే టెంగ్ లీలను అరెస్టు చేశారు. దీనికి కొనసాగింపుగా రెండు రోజుల తర్వాత హర్యానాలో ఉంటున్న సున్ జీ యంగ్ అనే మరో చైనీయుడిని పట్టుకున్నారు. ఇతడి విచారణలోనే హాన్ జున్వే పేరు వెలుగులోకి వచ్చింది. చదవండి: వర్మకు షాక్: ‘దిశ ఎన్కౌంటర్’ విడుదలకు బ్రేక్ -
పాకిస్తాన్ పావురం విడుదల
జమ్మూకశ్మీర్: గత ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో కలకలం రేపిన పావురం కేసు ఒక కొలిక్కి వచ్చింది. అన్నివిధాల పావురాన్ని పరీక్షించిన అనంతరం దానిని ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్లకి ఉపయోగించలేదని నిర్థారించుకున్న తరువాత పోలీసులు విడిచిపెట్టారు. గత ఆదివారం పాకిస్తాన్ నుంచి వచ్చిన పావురం బోర్డర్‌కు దగ్గరలో ఉన్న గీత దేవి చద్వాల్ అనే మహిళ ఇంటిపై వాలింది. అయితే ఆ పావురం కాలికి ఒక రింగ్ ఉండటం గీత గమనించింది. దీంతో అనుమానం వచ్చిన ఆమె దానిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు అప్పగించింది. వారు పావురం గురించి స్థానిక హిరా నగర్ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. గతంలో ఇలాంటి పావురాల ద్వారానే పాకిస్తాన్ సమాచారం చేరవేసిన సందర్భాలు చాలా ఉండటంతో పోలీసులు పావురాన్ని అదుపులోకి తీసుకొని అన్ని విధాల తనిఖీ చేశారు. అయితే ఆ పావురాన్ని ఎలాంటి రహస్య సమాచారం కోసం పంపలేదని నిర్థారించుకున్న తరువాత దానిని స్థానిక పోలీసులు విడుదల చేశారు. (పాక్ నుంచి పావురం.. ఆ కోడ్ ఏంటి?) దీనికి సంబంధించి అధికారులు మాట్లాడుతూ.. ఇది అంతర్జాతీయ సరిహద్దు కావడంతో పాటు చాలా సున్నితమైన ప్రదేశం. రహస్య సమాచారం చేరవేసుకోవడం అనేది ఈ ప్రాంతంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సహజంగా మేం పక్షలను అనుమానించం. అవి వాటి పని అవి చేసుకొని వెళుతూ ఉంటాయి అని తెలిపారు. దీనిపై పావురం యజమాని పాకిస్తానీ హబిబుల్లా మాట్లాడుతూ అది అమాయకపు పావురం. దానిని వదిలిపెట్టమని భారత్‌ని కోరుతున్నాను అని తెలిపారు. ఇక ఆ పావురం కాలికి ఉన్న ఉగరం పై ఉన్న నంబర్లను ఉగ్రవాదులు వాడే సీక్రెట్ కోడ్ గా మొదట భావించగా దీనిపై స్ఫందించిన హబిబుల్లా ఉంగరంపై ఉన్న నంబరు తన ఫోన్ నంబర్ అని అంతే కానీ దాంట్లో ఎలాంటి సీక్రెట్ కోడ్ లేదని తెలిపారు. అదేవిధంగా పావురాల రేస్‌లో పాల్గొందని తెలిపారు. బోర్డర్‌కు దగ్గరలోనే నివాసం ఉండటంతో పావురం భారత్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు. మొత్తం మీద పావురానికి సంబంధించి పూర్తి విచారణ చేసిన తరువాతే దానిని విడిచి పెట్టామని జమ్మూ కశ్మీర్ పోలీసు అధికారులు తెలిపారు. (‘పాకిస్తాన్‌కు తలొగ్గిన మాజీ సీఎంలు’) -
గూఢచర్యం ఎలా చేయాలో చెప్పే స్కూళ్లు!
బెర్లిన్: ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో గూఢచారుల రాజధానిగా పేరొందిన బెర్లిన్ నగరంలో కొత్తగా గూఢచార్యం ఎలా చేయాలో చెప్పేందుకు.. జర్మనీ దేశ నిఘూ వర్గాలు పాఠశాలలను ప్రారంభిస్తున్నాయి. ఇక తమ స్పై(వేగు) స్కూల్లో సైబర్‌దాడులను ఎలా అరికట్టాలో నేర్పించడంతో పాటు హ్యాకింగ్, ఉగ్రమూకలను ఏరి పారేయడం, కెమిస్ట్రీ ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి ఏజెంట్లకు శిక్షణ ఇస్తామని జర్మన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ క్రమంలోనే సెంటర్ ఫర్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ట్రైనింగ్‌ను గూఢాచార సంస్థల అధిపతులు మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. కాగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీగా విడిపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగావకాశాలు, మెరుగైన విద్య కోసం తూర్పు జర్మన్లు 1950-60 మధ్య కాలంలో పశ్చిమ జర్మనీకి వలసపోయారు. అందులో వందలాది మంది ప్రొఫెసర్లు, వైద్యులు, వ్యాపారవేత్తలు ఉండటంతో తూర్పు జర్మనీ ఆర్థిక వ్యవస్థ (బ్రెయిన్ డ్రైన్) బలహీనపడింది. ఈ క్రమంలో వలసలను కట్టడి చేసేందుకు తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో బెర్లిన్ గోడను నిర్మించింది. 1980లో సోవియట్ ఆధిపత్య ధోరణి పతనం కావడంతో.. తూర్పు జర్మనీలో ఆంక్షలు సడలి రాజకీయ సరళీకరణ ప్రారంభమైంది. దీంతో నవంబర్ 9, 1989 న బెర్లిన్ గోడను కూల్చివేశారు. ఈ క్రమంలో ఇటీవల బెర్లిన్ గోడ కూలి 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవటంతో అక్కడి ప్రజలు ఘనంగా వేడుకలు చేసుకున్నారు. -
రాజస్థాన్‌లో పాక్ గూఢచారి అరెస్ట్
జైపూర్ : గూఢచర్యం చేసేందుకు పాకిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడిన ఓ వ్యక్తిని బీఎస్ఎఫ్ సిబ్బంది రాజస్తాన్‌లోని బర్మేర్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతని పేరు కిషోర్ అని, పాకిస్తాన్‌కు చెందిన వాడిగా గుర్తించామని తెలిపారు. బీఎస్ఎఫ్, భారత ఆర్మీ కార్యకలాపాలపై కీలక సమాచారం తెలుసుకునేందుకు తన మేనమామే తనను భారత్‌కు పంపినట్లు సదరు వ్యక్తి వెల్లడించినట్లు పేర్కొన్నారు. సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్ల కింది నుంచి పాకుకుంటూ అతడు చొరబడినట్లు బీఎస్ఎఫ్ అనుమానం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లోని ఖోఖ్రాపర్ వరకు రైలులో వచ్చానని.. అక్కడి నుంచి తాను సరిహద్దు దాటేందుకు పాక్ ఆర్మీ తనకు సాయపడిందని విచారణలో తెలిపాడు. మూడు రోజుల పాటు అతడిని విచారించారు. దర్యాప్తు సమయంలో అతడు పదే పదే మాట మారుస్తుండడంతో తదుపరి విచారణ నిమిత్తం జైపూర్‌కు తరలిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. కాగా సెస్టెంబర్ మొదటివారంలో కశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను భారత ఆర్మీ అదుపులోకి తీసుకొని విచారించగా లష్కరే-ఇ-తొయిబాకు చెందిన 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ(ఐఎస్ఐ)తో కలిసి పాక్ ఆర్మీ ఎల్వోసీ వద్ద దాడులకు తెగబడేందుకు 12కు పైగా లాంచింగ్ ప్యాడ్స్‌తో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందింది. -
గూఢచర్యానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ‘స్పై రింగ్’కు (గూఢచార్యనికి సంబంధించిన కార్యక్రమాలు) పాల్పడుతున్న ఓ చైనా దేశీయున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైనా దేశీయుడైన చార్లీ పెంగ్(39) 5 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చాడు. గుర్గావ్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫారిన్ కరెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో చార్లీ పెంగ్ ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు అతని మీద నిఘా పెట్టారు. చార్లీ గూఢచార్యానికి పాలపడుతున్నట్లు తెలియడంతో పోలీసులు అతని నివాసం మీద దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అతని ఆధార్ కార్డ్, పాస్‌పోర్టు, 3. 5 లక్షల రూపాయల దేశీయ కరెన్సీ, 2000 అమెరికన్ డాలర్లు, 2 వేల థాయ్ కరెన్సీతో పాటు ఓ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక అతను మణిపూర్‌కు చెందిన మహిళను వివాహం చేసుకుని పాస్‌పోర్ట్ పొందినట్లుగా పోలీసులు తెలిపారు. -
భారత్‌పై గూఢచర్యం.. పాక్ భారీ స్కెచ్
ఇస్లామాబాద్: భారతదేశంపై గూఢాచర్యానికి పాకిస్థాన్ భారీ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. సుమారు 4.7 బిలియన్ రూపాయల ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమైంది. వచ్చే ఏడాదికల్లా వాటి నిర్మాణం పూర్తి చేసి ప్రయోగించాలని పాక్ నిఘా వ్యవస్థ నిర్ణయించింది. ఈ మేరకు పాక్ రక్షణ నిపుణుడు మరియా సుల్తాన్ ఇంటర్వ్యూను డాన్ పత్రిక ప్రచురించింది. ‘భారత కదిలికలపై పాక్ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ఇంత కాలం ఇండియా పరిమిత పరిధిలో ప్రయోగాలు చేసుకునేంది. కానీ ఈ మధ్య అమెరికా సహకారంతో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఈ సమయంలో పాక్ త్వరపడాల్సిన అవసరం ఉంది. విదేశీ శాటిలైట్లపై ఎంతో కాలం ఆధారపడలేం. అందుకే ఈ భారీ ప్రయోగానికి పాక్ రక్షణ రంగం సిద్ధమైంది’ అని మరియా పేర్కొన్నారు. దేశీయ సూపర్‌కో ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. పాక్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం తొలిదశలో రూ. 100 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా కేటాయింపులు ఉంటాయని తెలిపింది. ఈ మెగా ప్రాజెక్టులో మొత్తం నాలుగు శాటిలైట్లను రూపకల్పన చేయనున్నారు. అందులో పాక్ శాట్-ఎంఎం1 ఒక్కదాని కోసమే రూ. 135 కోట్లను కేటాయించగా... మిగతా మూడు శాటిలైట్ల కోసం రూ.255 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇదిగాక సుమారు రూ. 100 కోట్లతో కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్లలో స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. -
విషప్రయోగం నుంచి కోలుకున్న యులియా
లండన్ : విష ప్రయోగానికి గురైన రష్యన్ మాజీ గుఢాచారి కుమార్తె యులియా కోలుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం డిచార్జ్ అయ్యారు. యులియా తండ్రి సెర్గీ స్క్రిప్పల్ రష్యన్ ఆర్మీ అధికారిగా పనిచేస్తూనే బ్రిటన్‌కు డబుల్ ఏజెంట్‌గా వ్యవహరించారన్న వార్తల మధ్య.. గత నెల 4వ తేదీన తండ్రీకూతుళ్లపై విషప్రయోగం జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నాలుగు వారాల పాటు మృత్యువుతో పోరాడిన యులియా పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు ఆమెను ఆస్పత్రి నుంచి డిచార్జ్ చేశారు. కాగా, భవిష్యత్తులో కూడా యులియా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఆవకాశం ఉండటంతో బ్రిటిష్ అధికారులు ఆమెను ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్టు తెలిసింది. ఇప్పటికి ప్రాణాపాయం తప్పినా, చికిత్స కొనసాగించడం ఆవసరమని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేశామని వైద్యులు పేర్కొన్నారు. అటు యులియా తండ్రి సెర్గీ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారు. వీరిపై విషప్రయోగం వెనుక రష్యన్ మిలటరీ ప్రమేయం ఉందని బ్రిటన్ ఆరోపిస్తున్నది. అయితే రష్యా మాత్రం ఈ ఘటనలతో తమకే సంబంధంలేదని తెలిపింది. -
పాక్‌కు గూఢచర్యం.. భారత సైన్యంలో పెను కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : భారత నిఘా వర్గాల్లో ఓ వార్త కలకలం రేపింది. పాక్‌కు గూఢచర్యం ఆరోపణలతో ఓ ఉన్నతాధికారిని భద్రతా బలగాలు గురువారం అర్ధరాత్రి దాటాక అదుపులోకి తీసుకున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కెప్టెన్ అరుణ్ మార్వా ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. గత కొన్ని నెలలుగా ఐఎస్ఐకి ఆయన కీలక సమాచారాన్ని అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఐఎస్ఐ అధికారికి అరుణ్ తన వాట్సాప్ ద్వారా ఫోటోలు, కొన్ని పత్రాలను పంపించారు. కీలకమైన సమాచారాన్నే ఆయన పాక్ నిఘా సంస్థకు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం అరుణ్‌ని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేపట్టారు. -
ఆ మచ్చ నేను భరించలేను
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు గూఢాచర్యం చేసిందన్న ఆరోపణలు రావటంతో మనస్తాపం చెందిన ఓ పాత్రికేయురాలు రాజీనామా చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఛానెల్ రిపబ్లికన్ టీవీలో శ్వేతా కోఠారి సీనియర్ కరస్పాండెంట్‌గా విధులు నిర్వహించేవారు. ఈ క్రమంలో ఛానెల్ ను వీడుతున్నట్లు చెబుతూ తన ఫేస్ బుక్‌లో ఆమె ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. గూఢాచర్యం చేశానన్న ఆరోపణలు వాస్తవం కాదు. ఆ మచ్చ నేను భరించలేను. అందుకే ఛానెల్ వీడుతున్న అని ఆమె తెలిపారు. కాగా, శ్వేతా కోఠారి.. కాంగ్రెస్ నేత శశిథరూర్ కు తమ ఛానెల్లోని సమాచారం అందవేసిందన్న అనుమానంతో ఎడిటర్ ఆమెపై నిఘా పెట్టాడంట. ఆమె కదలికలను గమనించి తనకు సమాచారం చేరవేయాలని సిబ్బందికి సూచించాడంట. అంతేకాదు ఆమె ఆర్థిక పరిస్థితులపై కూడా ఆరాతీశాడని చెబుతున్నారు. ఈ విషయాలను ఓ సహోద్యోగి ద్వారా తెలుసుకున్న ఆమె.. ఆ ఆరోపణలను నిర్ధారించుకున్నాకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయితే సోషల్ మీడియాలో శశిథరూర్‌ను ఆమె ఫాలో కావటం.. పైగా శశిథరూర్‌కు సంబంధించి ఛేంజ్.ఓఆర్జీ పిటిషన్‌పై శ్వేత సంతకం చేయటంతోనే అర్నాబ్ ఆ నిర్ణయానికి వచ్చి ఉంటాడని భావిస్తున్నట్లు ఆమె అంటున్నారు. కాగా, సంస్థలో ఇలా వేధింపులు ఎదుర్కుంటున్న సిబ్బంది చాలా మందే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించటం గమనార్హం. ఇక శ్వేతా కొఠారి తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని శశిథరూర్ ట్విట్టర్ వేదికగా హర్షించారు. తనకు గూఢాచారులను నియమించుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన.. నిజాయితీపరులైన పాత్రికేయులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ట్వీట్ చేశారు. Congratulations on standing up for your own integrity: https://t.co/QaNyocjFT7 I don't employ spies, but i do respect serious journalists. https://t.co/VtlaqsXMpk — Shashi Tharoor (@ShashiTharoor) October 13, 2017 -
గూఢచారి 100
15 అక్టోబర్ 1917, పారిస్ నిలబడి ఉంది మాతాహరి. నలభై ఏళ్ల అందమైన ‘గూఢచారి’! ఆమె ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో ఫ్రెంచి ఆర్మీ ఫైరింగ్ స్క్వాడ్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన వెనుక మరికొంత మంది ఫైరింగ్ సిబ్బంది ఉన్నారు. క్షణాలు గడుస్తున్నాయి. మతాహరి కళ్లు వాళ్లందరి వైపు అమాయకంగా చూస్తున్నాయి. మరికొన్ని క్షణాలు గడిచాయి. ఆ తర్వాత.. కాలం కొన్ని లిప్తలు స్తంభించింది. ఒక్కసారిగా ఫైరింగ్ ఆఫీసర్ ఆమెపై కాల్పులు జరిపాడు. మొదట మాతాహరి తల వాలిపోయింది. క్రమంగా ఆమె తన మోకాళ్ల మీద ఒరిగిపోయింది. అలా వాలిపోతూ, ఒరిగిపోతూ ఫైరింగ్ ఆఫీసర్ కళ్లలోకి చూసింది! ఫైరింగ్ ఆఫీసర్ ఆమె దగ్గకు వచ్చి రివాల్వర్‌తో మళ్లీ ఒకసారి ఆమె నుదుటిపై కాల్చి, మరణించిందని నిర్థారించుకుని వెళ్లిపోయాడు. 2017... వందేళ్ల తరువాత మాతాహరిని ఫ్రాన్స్ ప్రభుత్వం అన్యాయంగా చంపేసిందని.. ఈ రంగస్థల నటి అందమైనదే కానీ దేశాలను వణికించేటంతటి తెలివితేటలున్న గూఢచారి కాదనీ.. ఫ్రాన్స్ ఆర్మీ తన తప్పిదాలను, అసమర్థతలను కప్పిపుచ్చుకోడానికి మాతహరిని పొట్టనపెట్టుకుందని ఈ వందేళ్లుగా చరిత్రకారులు ఘోషిస్తూనే ఉన్నారు. ఆ ఘోషను భరించలేక ఫ్రాన్స్ ఆర్మీ ఆనాటి మాతాహరి విచారణ పత్రాలను తప్పనిసరై నేడో రేపో ప్రపంచానికి బహిర్గతం చెయ్యబోతోంది. ఈ సందర్భంగా.. చరిత్రలో మంచికో, చెడ్డకో ప్రఖ్యాతిగాంచిన కొందరు గూఢచారుల గురించి తెలుసుకుందాం. బయటపడేవరకు ‘స్పై’ ఎవరో, మామూలు ‘గై’ ఎవరో నరమానవుyì కి తెలీదు. బయటపడ్డాకైనా స్పై కనిపించడు. ఉంటే జైల్లో ఉంటాడు లేదంటే సమాధి కింద ఉంటాడు! శత్రువుకు దొరికి బతికి బట్టకట్టిన స్పైలు ఎవరూ ప్రపంచ చరిత్రలోనే లేరు! డేంజరస్ అండ్ డెడ్లీ జాబ్ అది! అయినా అంత డేంజరస్ పనిని స్పైలు ఎందుకు ఎంచుకుంటారు? డబ్బు కోసం. కాకుంటే.. దేశం కోసం! నవలల్లో, సినిమాల్లో డైనమిక్ స్పైలను చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. నిజానికి రియల్ లైఫ్‌లోని స్పైలు అంతకంటే చురుగ్గా, దుస్సాహసాలు చేస్తూ ఉంటారు. అలాంటి ఓ టాప్ టెన్ స్పైలు వీళ్లు. రిచర్డ్ సార్జ్ (49), సోవియట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కోడ్ నేమ్ రామ్సే. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్నలిస్టుగా జపాన్లోకి, జర్మనీలోకి ఎంటర్ అయ్యాడు. జపాన్, జర్మనీ కలిసి రష్యాకు వ్యతిరేకంగా పన్నుతున్న వ్యూహాలను కనిపెట్టి రష్యాకు చేరవేశాడు. 1941లో జపాన్ అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఉరి తీసింది. ఏం చేరవేశాడు?: ∙సోవియట్ యూనియన్‌పై హిట్లర్ దాడి చేయబోతున్నాడని. ∙సమీప భవిష్యత్తులో జపాన్ సోవియట్ యూనియన్‌పై దాడి చేసే అవకాశాలు లేవని. సిడ్నీ రెయిలీ (52) బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ‘ఏస్ ఆఫ్ స్పైస్’ అని పేరు. అంటే.. మేటి గూఢచారి అని. పూర్తి పేరు సిగ్మండ్ జార్జీవిచ్ రోజెన్బ్లమ్. పుట్టింది రష్యాలో. ఇతడు ఒక దేశానికే స్పైలా పని చేయలేదు! నిన్న గడపిన ట్లు నేడు, నేడు గడిపినట్లు మర్నాడు గడపలేదు. భోగిలా జీవించాడు. జేమ్స్ బాండ్ పాత్ర కల్పనకు ఇతడూ ఒక ఇన్స్పిరేషన్. ఏం చేరవేశాడు?: చేరవేయడం అన్నది చిన్నమాట. పెద్ద పెద్ద ప్లాన్లే వేశాడు. సోవియట్ నాయకుడు లెనిన్ హత్యకు ప్లాన్ ఇతడిదే. కానీ ఆ ప్లాన్ విఫలమైంది. తెలివిగా తప్పించుకున్నాడు. ∙1925లో సోవియట్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం దొరికిపోయాడు. వెంటనే రష్యా అతడికి మరణశిక్ష విధించింది. సిడ్నీ గుండెల్లోకి బులెట్ పేల్చి చంపేశారు. ది కేంబ్రిడ్జ్ ఫైవ్ (ఐదుగురి బృందం) రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసిన ఐదుగురు సోవియట్ స్పైల గ్రూప్ ఇది! వీళ్లు అయిదుగురూ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చదువుకున్నారు. ‘ది కేంబ్రిడ్జ్ ఫైవ్’ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఈ ఐదుగురిలో కిమ్ ఫిల్బీ మోస్ట్ పాపులర్. గ్రూపులోని మిగతా సభ్యులు.. డొనాల్డ్ డ్యూవర్ట్ మక్లీన్, గై బర్జెస్, ఏంథోనీ బ్లంట్. చివరి వ్యక్తి ఎవరో ఇప్పటికీ ప్రపంచానికి తెలీదు. కేంబ్రిడ్జిలో ఉన్నప్పుడు మార్క్సిస్టులుగా మారిన ఈ ఐదుగురూ ఆ ప్రభావంతోనే సోవియట్‌కు అనుకూలంగా వివిధ దేశాలలో స్పయింగ్ చేశారు. వీళ్లలో ఒక్కరు కూడా శత్రుదేశాలకు చిక్కలేదు. చివరి వరకు మాస్కోలోనే సురక్షితంగా ఉండి వయసుతోపాటు వచ్చే అనారోగ్యాలతో మరణించారు. ఏం చేరవేశారు?: ∙అమెరికా, బ్రిటిష్ దేశాలలోని గూఢచారుల వివరాలు సేకరించి సోవియట్ యూనియన్‌కి అందించేవారు. సోవియెట్ యూనియన్ ఆ గూఢచారులను హతమార్చేది. ఆల్డ్రిచ్ ఏమ్స్ (76) సి.ఐ.ఎ. ఆఫీసర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. రష్యాకు, అమెరికాకు మధ్య పైకి కనిపించని యుద్ధం (కోల్డ్ వార్) జరుగుతున్నప్పుడు స్వదేశానికి వ్యతిరేకంగా సోవియట్ యూనియన్‌కు గూఢచారిగా పనిచేశాడు ఈ అమెరికన్ ఆఫీసర్! ‘నా దగ్గర అమెరికా రహస్యాలు ఉన్నాయి. వాటిని మీకు ఇస్తే నాకు ఎంత ఇస్తారు?’ అని కె.జి.బి.(రష్యా గూఢచార సంస్థ)తో బేరం కూడా కుదుర్చుకున్నాడు. ఆల్డ్రిచ్ ఎంత సంపాదించినా, అతడి విలాసవంతమైన జీవితానికి అది సరిపోయేది కాదు. చివరికి దేశద్రోహానికి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేశారు. అమెరికా అతడికి జీవిత ఖైదు విధించింది. ఏం చేరవేశాడు?: ∙రష్యాలో గూఢచర్యం చేస్తున్న దాదాపు 100 మంది అమెరికన్ సీక్రెట్ ఏజెంట్ల వివరాలు రష్యాకు వెల్లడించాడు. మిస్టర్ అండ్ మిసెస్ రోజెన్బర్గ్స్ (అమెరికన్ పౌరులు!) వీళ్లిద్దరూ భార్యాభర్తలు. భర్త పేరు జూలియస్ రోజెన్బర్గ్స్. భార్య ఎథెల్. వీళ్లిద్దరూ చరిత్రలోనే ప్రసిద్ధి చెందిన ఏజెంట్ కపుల్. జూలియస్ రష్యా గూఢచార సంస్థ కె.జి.బి.లోని అత్యున్నస్థాయి అజ్ఞాత స్పైలలో ముఖ్యుడు. ఇంకా చాలమందిని ఇతడే స్పైలుగా కె.జి.బి.లో నియమించాడు. భార్య, భార్య సోదరుడు సార్జెంట్ డేవిడ్ గ్రీన్ గ్లాస్‌లతో కలిసి అమెరికా వైమానిక, అణు పరిశోధన వివరాలను కూడా కె.జి.బి.కి అందించాడు. గ్రీన్గ్లాస్ పోలీసులకు చిక్కినప్పుడు నిజాలన్నీ చెప్పేశాడు. భార్యాభర్తలు అరెస్ట్ అయ్యారు. 1953లో అమెరికా ప్రభుత్వం వీరిని ఎలక్ట్రిక్ ఛెయిర్లో కూర్చోబెట్టి మరణశిక్ష అమలు చేసింది. ఏం చేరవేశారు?: ∙సోవియట్ యూనియన్‌కి స్వదేశీ అణు రహస్యాలను అందించారు. ∙అమెరికా రాడార్లు, జెట్ ఇంజన్ల టెక్నాలజీని కూడా రష్యాకు పాస్ చేశారు. క్లాస్ ఫోక్స్ (76) సోవియట్ గూఢచారి జర్మనీలో పుట్టాడు. కెరియర్ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడి లాస్ అలామోస్ లేబరేటరీలో థియరిటికల్ఫిజిక్స్ డివిజన్లో చేరాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటన్, కెనడాల ఉమ్మడి ప్రయోజనాల కోసం మాన్‌హట్టన్ పేరుతో ఆ ల్యాబ్‌లో జరుగుతున్న అణ్యాయుధాల పరిశోధనా వివరాలను రహస్యంగా సేకరించి పెట్టుకున్నాడు. ఫోక్స్ మొదట్లో అణు బాంబు తయారు చేయడం కోసం బ్రిటిష్ ప్రాజెక్టులో పని చేశాడు. మాన్హటన్ ప్రాజెక్ట్‌లో చేరాక, సోవియట్ స్పైగా మారాడు. 1950లో అరెస్ట్ అయ్యాడు. జైలుకు వెళ్లొచ్చాడు. జర్మనీలో స్థిరపడ్డాడు. ఏం చేరవేశాడు?: ∙మాన్హటన్ ప్రాజెక్టు గురించి సోవియెట్ యూనియన్‌కు కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. డ్యుసన్ పోపోవ్ (69), బ్రిటిష్ ఏజెంట్ జగద్విఖ్యాతి చెందిన జేమ్స్‌బాండ్ పాత్రకు ఇన్స్పిరేషన్ ప్రధానంగా ఇతడేనని అంటారు. పోపోవ్ సెర్బియాలో పుట్టాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎం.ఐ.16 (బ్రిటన్ గూఢచార సంస్థ)లో పనిచేశాడు. జర్మనీలో ఇతడి కోడ్ నేమ్ ఇవాన్. బ్రిటన్ పెట్టుకున్న కోడ్ నేమ్ ట్రై సైకిల్. ఏ దేశానికి ఇతడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడో తెలీదు! బ్రిటన్ తరఫున జర్మనీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ గూఢచారి మీద కూడా రానన్ని పుస్తకాలు, డాక్యుమెంటరీలో పోపోవ్ మీద వచ్చాయి. ఏం చేరవేశాడు? : ∙పెరల్ హార్బర్‌పై జపాన్ దాడి చేయబోతున్నదనే సమాచారం ఇచ్చి ఎఫ్.బి.ఐ.ని హెచ్చరించింది ఇతడే. ఇసబెల్లా బాయ్డ్ (56), అమెరికన్ స్పై బెల్ బాయ్డ్గా ప్రసిద్ధి. అమెరికా అంతర్యుద్ధంలో ఈమె కాన్ఫెడరేట్ ఆర్మీ గూఢచారిగా పనిచేశారు. బెల్ తండ్రికి హోటల్ ఉండేది. అందులో కూర్చొని ఈమె తన ఆపరేషన్స్‌ని నిర్వహించేవారు. బెల్ 1862లో ఒకసారి అరెస్ట్ అయ్యారు. కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటికి వచ్చాక ఇంగ్లండ్ వెళ్లిపోయారు. తర్వాత మళ్లీ అమెరికా వచ్చారు. 1900లో చనిపోయారు. ఏం చేరవేశారు?: అమెరికా అంతర్యుద్ధంలో కాన్ఫెడరేషన్ ఆర్మీ తరఫున ప్రత్యర్థి వర్గమైన ‘యూనియన్ ఆర్మీకి’కు వ్యతిరేకంగా సమాచారాన్ని సేకరించి కాన్ఫెడరేషన్‌కి లబ్ధి గలిగేలా చేశారు. మాతా హరి (41) జర్మనీ గూఢచారి మాతా హరి స్టేజ్ ఆర్టిస్ట్. డాన్సర్. పారిస్‌లో సంపన్న పురుషుల కలలరాణి. మాతా హరి ‘క్వీన్ ఆఫ్ స్పైస్’. మనం అనడం కాదు. ఆ పేరుతోనే ఆమె ప్రసిద్ధి. జన్మస్థలం నెదర్లాండ్స్. అసలుపేరు మార్గరీటా గీర్ట్రూడ జెల్లె యాక్లియోడ్. దేశాధినేతలతో సంబంధం ఉన్న ధనవంతులను వశపరుచుకుని విలువైన రహస్య సమాచారాన్ని సేకరించడంలో మాతాహరి ఎక్స్పర్ట్. 1917లో ఫ్రెంచి నిఘా వర్గాలు... ఈమె తమ దేశంలో జర్మనీ స్పైగా పనిచేస్తున్నట్లు కనిపెట్టి అరెస్ట్ చేశాయి. విచారణ జరిపి మరణశిక్ష విధించారు. తుపాకీతో ఆమె నుదుటిపై కాల్చి చంపడం ద్వారా ఆ శిక్ష అమలయింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆమె పంపిన చిన్న మెసేజ్ వల్ల మాతాహరి గూఢచర్యం బయటపడింది. ఏం చేరవేశారు?: ∙యాభై వేల మంది ఫ్రెంచి సైనికుల మరణానికి కారణమైన అత్యంత కీలక సమాచారాన్ని జర్మనీకి అందించారని ఒక ఆరోపణ. ∙పారిస్‌లోని రాజకీయ ప్రముఖుల అక్రమ సంబంధాల çసమాచారాన్ని జర్మనీకి అందించేవారని మరో ఆరోపణ. నేతన్ హేల్, అమెరికన్ సోల్జర్ ‘నా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి నాకు ఒకటే జన్మ ఉండడం నాకు దిగులనిపిస్తుంది’ అనే మాట నేతన్ హేల్దే. తొలి అమెరికన్ స్పైగా ప్రఖ్యాతి చెందిన నేతన్ తనను ఉరితీయబోతుండగా అన్నమాటలివి. అమెరికా విప్లవ పోరాటంలో ఇతడు కాంటినెంటల్ ఆర్మీ కెప్టెన్‌గా పని చేశాడు. బ్రిటన్ వ్యతిరేక గూఢచారుల సమావేశానికి టీచర్ వేషంలో వెళ్లినప్పుడు బ్రిటిష్ ఆర్మీకి పట్టుబడ్డాడు. విచారణ జరిపి అనంతరం నేతన్ను ఉరితీశారు. అప్పుడు అతడి వయసు 21 సంవత్సరాలు మాత్రమే. ఏం చేరవేశాడు? : ∙అమెరికా బ్రిటన్ అధీనంలో ఉన్నప్పుడు అమెరికా సైనికుడిగా బ్రిటన్ ప్రయోజనాలను దెబ్బతీయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి, బ్రిటన్‌పై పోరాడుతున్న స్వదేశీ విప్లవయోధులకు అందించేవాడు. -
'48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపో..'
న్యూఢిల్లీ: గూఢచర్యం నిర్వహిస్తున్నాడనే కారణాలతో భారత్‌లోని పాక్ హైకమిషన్‌లో పనిచేస్తున్న మొహమ్మద్ అక్తర్‌ను పోలీసులు అరెస్టు చేయగా అతడిని 48గంటల్లో భారత్ విడిచిపెట్టి వెళ్లాలని భారత విదేశాంగ శాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం తెలియజేశారు. పాక్ హైకమిషన్ కార్యాలయంలో అక్తర్ వీసా సెక్షన్లో పనిచేస్తున్నాడని, అతడి దౌత్య పరమైన రక్షణ ఉందని వికాస్ స్వరూప్ చెప్పారు. ఈ కారణంతోనే అరెస్టు చేయడం లేదని అన్నారు. కమిషన్‌లో పనిచేస్తున్న అతడు గోప్యంగా మరో ఇద్దరు ఉద్యోగుల నుంచి భారత రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలను సేకరిస్తూ గూఢచర్యం నిర్వహిస్తున్నాడని, ఇలాంటి చర్యలకు దిగిన అతడికి ఇక భారత్‌లో పనిచేసే అవకాశం లేదని, 48గంటల్లో దేశం నుంచి పంపించాలంటూ ఇప్పటికే పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్‌కు చెప్పినట్లు తెలిపారు. అక్తర్‌ను అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించామని, అతడిపై ఏ అధికారి కూడా చేయి చేసుకోలేదని, పాక్ చేసేవి కేవలం ఆరోపణలు మాత్రమే అని అన్నారు. ఇప్పటికే అక్తర్ కు సహాయం చేసిన పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారత రక్షణ శాఖకు సంబంధించిన కీలక పత్రాలను సదరు ఉద్యోగులు దొంగిలించి అక్తర్‌కు అందించినట్లు తెలుస్తోంది. -
బ్రిటన్ను టార్గెట్ చేసిన ఐఎస్ఐఎస్!
లండన్: బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా యూకే భద్రతా విభాగం ప్రకటించింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దేశంలో దాడులకు సన్నాహాలు చేసుకుంటున్నారనీ, వీటిని నియంత్రించడానికి నిఘా విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని బ్రిటన్ భద్రతా విభాగం ఎమ్ఐ5 డైరెక్టర్ జనరల్ ఆండ్రూ పార్కర్ గురువారం ప్రకటించారు. బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ దాడులు జరగడానికి గల అవకాశాలు ఇంత ఎక్కువగా ఎన్నడూ చూడలేదని తెలిపిన పార్కర్, గత సంవత్సరం ఉగ్రవాదులు దాడి కోసం చేసిన ఆరు ప్రయత్నాలను విఫలం చేశామని తెలిపారు. సిరియా నుండి ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఉగ్రవాదులు బ్రిటన్‌లో దాడులు జరపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. దేశం నుండి సుమారు 750 మంది ఉగ్రవాదులు సిరియాకు వెళ్లడం, బ్రిటన్‌లో దాడికి గల అవకాశాలను పెంచుతుందని హెచ్చరించారు. టీనేజ్ పిల్లల నుండి వయోజనుల వరకు అందరినీ ఇస్లామిక్ ఉగ్రవాదులు అంతర్జాలం ద్వారా ప్రభావితం చేస్తున్నారని, యువత త్వరగా వారి ఉచ్చులో పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆధునిక సమాచార వ్యవస్థ ద్వారా ద్వేషాన్ని రగిలించడంలో ఐఎస్ఐఎస్ ఆరితేరిందని పార్కర్ తెలిపారు. బ్రిటన్‌లో నిఘా వ్యవస్థకు సంబంధించిన చట్టాలలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందనీ, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చట్టాలలో వెసులుబాటు చేయాల్సిన అవసరం అని పార్కర్ తెలిపారు.