‘‘ఓ నటిగా నా కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. అసలు నేను హీరోయిన్ అవుతానని ఊహించలేదు. నేను ఇంజనీర్‌ని, నా బ్రదర్ డాక్టర్. స్టార్టింగ్‌లో కొన్ని యాడ్స్ చేశాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తున్నాను. ఈ ప్రయాణం నాకు హ్యాపీగా ఉంది’’ అన్నారు ఐశ్వర్యా మీనన్. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘స్పై’. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ)
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్ర కథానాయిక ఐశ్వర్యా మీనన్ మాట్లాడుతూ– ‘‘తెలుగులో హీరోయిన్‌గా నేను చేసిన తొలి చిత్రం ‘స్పై’. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. ‘రా’ ఏజెంట్‌గా కనిపిస్తాను. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. గన్‌ను సరిగ్గా పట్టుకోవడం, షూటింగ్.. ఇలా కొత్త విషయాలు నేర్చుకున్నాను.
ప్రేమకథలే కాదు.. యాక్షన్ సన్నివేశాల్లో కూడా నేను బాగా నటించగలననే విషయం నాకు ‘స్పై’తో తెలిసొచ్చింది. యాక్షన్ సినిమాలు కూడా చేయగలననే కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత రహస్యాల ఆధారంగా అనేది ఈ సినిమా బేస్‌లైన్ మాత్రమే. డ్రామా వేరుగా ఉంటుంది.
(ఇదీ చదవండి: హీరో అర్జున్ కూతురు పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?)
గ్యారీగారు ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు నన్నే అనుకున్నారట. దీంతో ఆయన స్ట్రయిట్‌గా వచ్చి నాకు కథ చెప్పారు. నేను చూసిన తొలి తెలుగు సినిమా ‘హ్యాపీ డేస్’. అలాగే నిఖిల్ చేసిన ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాలు కూడా చూశాను. ఆయన ప్రతి సినిమాను ఫాలో అవుతుంటాను. ప్రజెంట్ యూవీ క్రియేషన్స్‌లో కార్తికేయ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment