
నిఖిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా 'స్పై' ట్రైలర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీతో పాటు ఆయన జీవితానికి సంబంధించిన ఎప్పుడూ వినని అంశాలతో సినిమాను తెరకెక్కించారు. నిఖిల్ ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీలో ఆర్యన్ రాజేశ్, ఐశ్వర్య మేనన్, సన్యా ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. కె.రాజశేఖర్‌రెడ్డి కథని సమకూర్చడంతోపాటు, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్నారు.
చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు.. దాస్తుంది అంటూ ట్రైలర్ ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. నిఖిల్ ఒక స్పై ఏజెంట్‌గా మంచి యాక్షన్ సీన్లతో మెప్పించాడు. బీజీఎమ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. జూన్ 29న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment