నిఖిల్ చేసిన 'కార్తికేయ2' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగానే 'స్పై' సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు . ఆ స్థాయికి తగ్గట్టుగా కథని ఎంచుకుని 'స్పై' చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక రహస్యాన్ని పాయింట్‌గా చూపిస్తూ .. ఓ గూఢచారి కథతో రూపొందిన చిత్రమిది. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా స్పై ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.28.90 కోట్లు వసూళ్లు చేసింది. నిఖిల్ కెరీర్‌లో సూపర్‌ఫాస్ట్‌గా బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా మరో రికార్డు కూడా స్పై ఖాతాలో చేరిపోయింది. తాజాగా 'స్పై' మూవీ గురించి నిఖిల్ ఒక నోట్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి; నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరంటూ..)
'నాపై నమ్మకం ఉంచి చాలా మంది అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొన్నారు. దీంతో నా కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇదే సమయంలో కొంత బాధగా కూడా ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల కారణంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయలేకపోయాం. చివరకు ఓవర్సీస్లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి.
(ఇదీ చదవండి: Samantha: సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. సినిమాలకు బ్రేక్, చివరి మూవీ ఇదే!)
హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్తికేయ-2తో మీకు దగ్గరయ్యాను కానీ స్పై సినిమాను అందించలేకపోయాను. తర్వాత నా నుంచి రాబోయే 3 సినిమాలను అన్ని భాషల్లోని థియేటర్‌లలో ఖచ్చితంగా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన తెలుగు సినిమా అభిమానులకు కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడను. నాపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందిస్తాను' అని నిఖిల్ లేఖలో తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment