SPY Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. బయట అడుగుపెట్టే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. ఇలాంటి టైంలో ఎవరైనా ఏం చేస్తారు. మంచిగా తిని పడుకుంటారు. బోర్ కొడితే కొత్తగా వచ్చిన సినిమా లేదంటే వెబ్ సిరీస్ చూస్తారు. అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఈ వీకెండ్(జూలై 27) బోలెడన్ని కొత్త మూవీస్ రిలీజ్‌కి రెడీ అయిపోయాయి. వాటిలో 'సామజవరగమన', 'స్పై', 'నాయకుడు' లాంటి చిత్రాలతో పాటు పలు సిరీసులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) శుక్రవారం(జూలై 28) రిలీజయ్యే సినిమాలు-సిరీసులు అమెజాన్ ప్రైమ్ ద ఫ్లాష్ - ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) స్పై - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ ఏ ఫెర్ఫెక్ట్ స్టోరీ - స్పానిష్ వెబ్ సిరీస్ కెప్టెన్ ఫాల్ - ఇంగ్లీష్ సిరీస్ D.P. సీజన్ 2 - కొరియన్ సిరీస్ హిడ్డెన్ స్ట్రైక్ - ఇంగ్లీష్ సినిమా హౌ టూ బికమ్ ఏ కల్ట్ లీడర్ - ఇంగ్లీష్ సిరీస్ మిరాక్యూలస్: లేడీ బగ్ & క్యాట్ నోయిర్, ద మూవీ - ఫ్రెంచ్ మూవీ ద టైలర్ సీజన్ 2 - టర్కిష్ సిరీస్ ద విచర్ సీజన్ 3: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నాయకుడు - తెలుగు డబ్బింగ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద లేడీ ఆఫ్ సైలెన్స్: ద మటవిటస్ మర్డర్స్ - స్పానిష్ మూవీ (స్ట్రీమింగ్) ప్యారడైజ్ - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది) టుడే వుయ్ ఆల్ టాక్ అబౌట్ ద డే - ఇండోనేసియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద మర్డరర్ - థాయ్ మూవీ (స్ట్రీమింగ్) హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ఆహా సామజవరగమన - తెలుగు సినిమా ఈ-విన్ పోలీస్ స్టోరీ: కేస్ 1: నైట్ ఔల్స్ - తెలుగు సినిమా జియో సినిమా వన్ ఫ్రైడే నైట్ - హిందీ సినిమా అప్పత - తమిళ చిత్రం కాల్‌కూట్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) సోనీ లివ్ ట్విస్టెడ్ మెటల్ - ఇంగ్లీష్ సిరీస్ మనోరమ మ్యాక్స్ కొళ్ల - మలయాళ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే
యంగ్ హీరో నిఖిల్.. 'కార్తికేయ 2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఒక్క దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో నెక్స్ట్ మూవీస్ లైనప్‌ని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. అలా చేసిన సినిమా 'స్పై'. ట్రైలర్‌తో ఇది అంచనాలు పెంచినప్పటికీ.. థియేటర్లలో ఫెయిలైంది. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) 'స్పై' కథేంటి? జై(నిఖిల్).. 'రా' ఇంటెలిజెన్స్‌లో సీక్రెట్ ఏజెంట్. శ్రీలంకలో ఓ మిషన్‌లో ఉండగా స్వదేశంలోని ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. 'రా' చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్‌పాండే).. గతంలో చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్‌లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ. అందులో స్ట్రీమింగ్ కంటెంట్ వీక్ కావడంతో 'స్పై' సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. జూన్ 27న థియేటర్లలోకి వస్తే.. తొలి వీకెండ్‌కే తట్టాబుట్టా సర్దేసుకుంది. దీంతో అందరూ ఆ చిత్రాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 'స్పై' స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కాబట్టి ఆడుతూ పాడుతూ ఈ మూవీని చూసేయొచ్చు. #SpyMovie now streaming in @PrimeVideo #NikhilSiddharth #Spy pic.twitter.com/FRJmfwcRf3 — Matters Of Movies (@MattersOfMovies) July 26, 2023 (ఇదీ చదవండి: ప్రభాస్ కొత్త సినిమా.. ఆ స్టార్ హీరో డైరెక్షన్లో!) -
స్పై సినిమా ఎఫెక్ట్.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్
నిఖిల్ చేసిన 'కార్తికేయ2' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగానే 'స్పై' సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు . ఆ స్థాయికి తగ్గట్టుగా కథని ఎంచుకుని 'స్పై' చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక రహస్యాన్ని పాయింట్‌గా చూపిస్తూ .. ఓ గూఢచారి కథతో రూపొందిన చిత్రమిది. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా స్పై ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.28.90 కోట్లు వసూళ్లు చేసింది. నిఖిల్ కెరీర్లో సూపర్‌ఫాస్ట్‌గా బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా మరో రికార్డు కూడా స్పై ఖాతాలో చేరిపోయింది. తాజాగా 'స్పై' మూవీ గురించి నిఖిల్ ఒక నోట్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి; నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరంటూ..) 'నాపై నమ్మకం ఉంచి చాలా మంది అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొన్నారు. దీంతో నా కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇదే సమయంలో కొంత బాధగా కూడా ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల కారణంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయలేకపోయాం. చివరకు ఓవర్సీస్లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. (ఇదీ చదవండి: Samantha: సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. సినిమాలకు బ్రేక్, చివరి మూవీ ఇదే!) హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్తికేయ-2తో మీకు దగ్గరయ్యాను కానీ స్పై సినిమాను అందించలేకపోయాను. తర్వాత నా నుంచి రాబోయే 3 సినిమాలను అన్ని భాషల్లోని థియేటర్లలో ఖచ్చితంగా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన తెలుగు సినిమా అభిమానులకు కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడను. నాపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందిస్తాను' అని నిఖిల్ లేఖలో తెలిపాడు. -
స్పై మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
‘‘స్పై’కి నా కెరీర్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. మా సినిమాని ఇంతగా ఆదరించి, నా కెరీర్‌ని మరో మెట్టు పైకి ఎక్కిస్తూ మంచి ఓపెనింగ్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇకపైనా మరిన్ని మంచి చిత్రాలు ఇస్తానని మాట ఇస్తున్నా’’ అని నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘స్పై’. కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్ మాట్లాడుతూ–‘‘స్పై’కి ఇంత పెద్ద ఓపెనింగ్స్ (రూ. 11 కోట్ల 7లక్షలు) రావడం హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ సంతోషంగా ఉన్నారు’’ అన్నారు. ‘‘మాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు గ్యారీ బీహెచ్. -
'స్పై' తొలిరోజు కలెక్షన్స్.. నిఖిల్ సరికొత్త రికార్డ్
యంగ్ హీరో నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఇప్పుడు 'స్పై' అనే పాన్ ఇండియా చిత్రాన్ని మరో ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. జూన్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. మిశ్రమ స్పందన అందుకుంటోంది. అయినాసరే తొలిరోజు వసూళ్లలో రచ్చ చేసింది. హీరో నిఖిల్ అయితే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. 'స్పై' కథేంటి? రీసెర్ట్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లో జై(నిఖిల్) ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్ లో ఉండగా.. రా చీఫ్ శాస్త్రి ఆదేశాల మేరకు స్వదేశానికి తిరిగొస్తాడు. ఐదేళ్ల క్రితం జోర్డాన్ లో ఖాదిర్ ఖాన్(నితిన్ మెహతా)ని చంపే క్రమంలో ఏజెంట్ సుభాష్ వర్దన్ ప్రాణాలు కోల్పోతాడు. అతడి చావు వెనక రహస్యం తెలుసుకోమని జైకి ఫైల్ అప్పగిస్తారు. ఆ తర్వాత ఏజెంట్ జై ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏం జరిగిందనేది మెయిన్ స్టోరీ. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) తొలిరోజు వసూళ్లు 'కార్తికేయ 2' సక్సెస్ వల్ల నిఖిల్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా అనేసరికి ప్రేక్షకులు చాలా అంచనాలు పెంచుకున్నారు. కానీ 'స్పై' ఆ విషయంలో ఫెయిలైంది. రొటీన్ రెగ్యులర్ కథతో థియేటర్లలోకి వెళ్లిన ఆడియెన్స్ ని నిరాశపరిచింది. అయినాసరే అడ్వాన్ బుకింగ్స్ చాలా బాగా జరగడంతో తొలిరోజు ఏకంగా రూ.11.7 కోట్లు వసూళ్లని సాధించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ హీరో నిఖిల్ ఓ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సరికొత్త రికార్డ్ 'కార్తికేయ 2'తో తొలిరోజు రూ.8.50 కోట్లు సొంతం చేసుకున్న నిఖిల్.. 'స్పై' చిత్రంతో మరో మూడు కోట్లకు పైగా ఎక్కువగా సాధించాడు. తద్వారా తన కెరీర్ లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లని అందుకున్నాడు. తొలిరోజు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి గానీ ఈ వీకెండ్ గడిస్తే గానీ అసలు సంగతి తెలియదు. అంతవరకు మనం వేచి చూడాల్సిందే. (ఇదీ చదవండి: 'స్పై' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే) Thank you 🙏🏽 ❤️ For this much love from you all🙏🏽 #Spy #SpyMovie pic.twitter.com/pBXqct6bw9 — Nikhil Siddhartha (@actor_Nikhil) June 30, 2023 -
SPY Public Talk: స్పై మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
'స్పై' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ కొత్త సినిమా 'స్పై'. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీపై రిలీజ్ కు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఇదే సమయంలో 'స్పై' ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది కూడా తెలిసిపోయింది. దీంతో ఓటీటీ ఆడియెన్స్ అలెర్ట్ అయిపోయారు. మరి ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. 'స్పై' కథేంటి? ఈ సినిమాలో నిఖిల్ పాత్ర పేరు జై. 'రా' ఇంటెలిజెన్స్‌లో ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్ పూర్తి చేసి, స్వదేశానికి తిరిగొస్తాడు. రా చీఫ్ శాస్త్రి, ఇతడికి ఐదేళ్ల క్రితం జోర్డాన్ లో చనిపోయిన ఏజెంట్ సుభాష్ ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావు వెనక కారణం తెలుసుకోమంటాడు. అలా ఈ మిషన్ లో భాగమైన ఏజెంట్ జైకి బోలెడన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. చివరకు ఏమైంది? అసలు ఈ స్టోరీకి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీకి సంబంధమేంటి? తెలియాలంటే థియేటర్లలో ఈ మూవీని చూడాల్సిందే. ఆ ఓటీటీలోనే తెలుగు ప్రేక్షకులకు దాదాపుగా తెలిసిన కథతోనే 'స్పై' తీశారు. చూస్తున్నంతసేపు అలా సాగుతూనే వెళ్తుంది తప్ప పెద్దగా గొప్పగా ఏం అనిపించదు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. మూవీ ప్రారంభంలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. బహుశా 5-6 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆగస్టు తొలి లేదా రెండోవారంలో 'స్పై' సినిమా ఓటీటీలోకి రావొచ్చని అంచనా. పూర్తి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. (ఇదీ చదవండి: 'స్పై' సినిమా రివ్యూ) -
SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ
టైటిల్: స్పై నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మేనన్, అభినవ్ గోమఠం, జిషుసేన్ గుప్తా తదితరులు నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్టైన్మెంట్స్ కథ-నిర్మాత: రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం: గ్యారీ బీహెచ్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ విడుదల తేదీ: 29 జూన్ 2023 నిడివి: 2h 15m టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా పేరు తెగ కలవరిస్తున్నారు. హీరో నిఖిల్ కూడా ఇందులో ఉన్నాడు. తెలుగులో చిన్నహీరోగా పలు హిట్స్ కొట్టిన నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. అది దైవభక్తి నేపథ్యం. ఇప్పుడు దేశభక్తి కాన్సెప్ట్ తో తీసిన 'స్పై' సినిమాలో నటించాడు. విడుదలకు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం! కథేంటి? జై(నిఖిల్).. 'రా' ఇంటెలిజెన్స్ లో ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్‌ని పూర్తిచేసి స్వదేశానికి తిరిగొస్తాడు. ఈ క్రమంలో 'రా' చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్‌పాండే).. ఓ మిషన్ లో భాగంగా చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్‌లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏం తెలుసుకున్నాడు? ఈ కథలో ఖాదిర్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్(జిషుసేన్ గుప్తా) ఎవరు? చివరకు మిషన్ సక్సెస్ అయిందా లేదా అనేదే 'స్పై' స్టోరీ. ఎలా ఉందంటే? సాధారణంగా స్పై సినిమాలు అనగానే కథ ఎలా ఉంటుందనేది మనకు తెలుసు. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన సూపర్‌స్టార్ కృష్ణ 'గూఢచారి 116' నుంచి అడివి శేష్ 'గూఢచారి' వరకు ఈ తరహా మూవీస్ చూస్తూనే ఉన్నాం. ఓ ఏజెంట్ ఉంటాడు... రా డిపార్ట్మెంట్.. దానికి ఓ చీఫ్.. ఆయన సదరు హీరో అనబడే ఏజెంట్‌కి ఓ మిషన్ అప్పగిస్తాడు. ఫైనల్ గా అది పూర్తి చేసి, విలన్ ని చంపాడా లేదా అనేదే స్టోరీ. సరిగా ఈ టెంప్లేట్‌ని ఉన్నది ఉన్నట్లు నిఖిల్ 'స్పై' సినిమా ఫాలో అయిపోయింది. పైపెచ్చు కొత్తదనం అస్సలు లేదు. ఫస్టాప్ విషయానికొస్తే.. జోర్డాన్ లో ఆయుధాలని స్మగ్లింగ్ చేసే విలన్ ఖాదిర్ ఖాన్ ని మన రా ఏజెంట్ సుభాష్ కాల్చి చంపేస్తాడు. ఆ వెంటనే సుభాష్ ని ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే శ్రీలంకలో జై పాత్రలో నిఖిల్ ఎంట్రీ, ఓ మిషన్ పూర్తి చేసి.. స్వదేశానికి వచ్చేయడం. ఇక్కడొచ్చిన తర్వాత సుభాష్ ని ఎవరు చంపేశారో తెలుసుకోమని నిఖిల్ కు మిషన్ అప్పజెప్తారు. అలా నేపాల్ వెళ్తాడు. అక్కడ ఏజెంట్ వైష్ణవి(ఐశ్వర్య మేనన్) వీళ్ల టీమ్ తో కలుస్తుంది. ఈమెకి జై పాత్రతో గతంలో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. అది చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఓ మంచి సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ లో ఖాదిర్ ఖాన్ కోసం వెళ్తే.. ఏజెంట్ జై టీమ్ కి బోలెడన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అలానే మన దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్ మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ అది ఎవరి చేతికి చిక్కింది? ఫైనల్ గా జై ఏం తెలుసుకున్నాడు? ఎవరిని చంపాడు లాంటివి తెలుసుకోవాలంటే మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. టీజర్, ట్రైలర్ చూసి ఇదో మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇందులో దేశభక్తి అనే కోటింగ్ తప్ప రొటీన్ రెగ్యులర్ స్పై తరహా సినిమానే. ఏ మాత్రం కొత్తదనం లేదు. అలానే చాలాచోట్ల సినిమాటిక్ లిబర్టీ విపరీతంగా తీసుకున్నారు. ఓ సీన్ లో ఓ అమ్మాయి చిన్నప్పటి ఫొటో దొరుకుతుంది. దాన్ని ఫోన్ లో ఫొటో తీసి 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో జై టీమ్ కనిపెట్టేస్తారు. అది కూడా కేవలం నిమిషాల్లో. ఈ సీన్ చూడగానే.. ఆడియెన్స్ మరీ అంతా పిచ్చోళ్లగా కనిపిస్తున్నారా అనే డౌట్ వస్తుంది. అలానే జై ఏజెంట్ కావడానికి, సుభాష్ చంద్రబోస్ ఫైల్ లో ఏముందనేది చూపించలేదు. పోనీ యాక్షన్ సీన్స్ అయినా కొత్తగా ఉన్నాయా అంటే అదీలేదు. బోరింగ్ కే బోరింగ్ అన్నట్లు తయారయ్యాయి. ఎవరెలా చేశారు? ఏజెంట్‌గా నిఖిల్ ఫెర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తను ఇప్పటివరకు చేయని జానర్ కావడం వల్లనో ఏమోగానీ మంచి ఈజ్ తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. అభినవ్ గోమఠం.. ఏజెంట్ కమల్ పాత్రలో యాక్షన్ కంటే కామెడీనే ఎక్కువ చేశాడు. కొన్నిసార్లు ఆ కామెడీ ఓకే అనిపించినప్పటికీ.. మరికొన్నిసార్లు స్టోరీని సైడ్ ట్రాక్ పట్టించినట్లు అనిపించింది. హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో ఓకే. ఏదో ఉందంటే ఉందంతే. నిఖిల్ పక్కన ఉండటం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. మిగతా వాళ్లు పర్వాలేదనిపించారు. రానా.. కాసేపు అలా కనిపించి అలరించాడు. పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్ లాంటి మంచి నటులు ఉన్నప్పటికీ.. వాళ్లందరికీ ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. ఈ సినిమా టెక్నికల్ పరంగా అయినా బాగుందా అంటే పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేదు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నప్పటికీ.. విశాల్ చంద్రశేఖర్ పాటలు థియేటర్ నుంచి బయటకొచ్చాక గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ పర్లేదు. గ్రాఫిక్స్ అయితే కొన్నిచోట్ల తేలిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు. డైరెక్టర్ గ్యారీ బీహెచ్.. స్వతహాగా ఎడిటర్. కానీ ఈ సినిమాలోని ఫస్టాప్ లో కొన్ని సీన్లు అలానే ఉంచేశారు. వాటి వల్ల ల్యాగ్ అనిపించింది. వాటిని ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'స్పై'.. రెగ్యులర్ రొటీన్ బోరింగ్ డ్రామా. పెద్దగా థ్రిల్ పంచదు, అలా అని ఇంటెన్స్ స్టోరీ కూడా ఉండదు. స్పై సినిమాలను ఇష్టపడేవాళ్లకు అంతో ఇంతో ఈ చిత్రం నచ్చుతుంది. -చందు, సాక్షి వెబ్ డెస్క్ -
SPY Review: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!
యంగ్ హీరో నిఖిల్ నటించిన 'స్పై' థియేటర్లలోకి వచ్చేసింది. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంతో గూఢచారి కథతో తీసిన ఈ సినిమాకు విడుదల ముందే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని అందుకుందని అమెరికాలో ప్రీమియర్స్ చూసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తమ అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో పంచుకుంటున్నారు. ఇక 'స్పై' సినిమాలో రా ఏజెంట్ గా నిఖిల్ అద్భుతంగా నటించాడని, యాక్షన్ సీన్స్ బాగున్నాయని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ కూడా అదిరిపోయాయని అంటున్నారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టిన నిఖిల్.. మరోసారి సక్సెస్ అందుకున్నాడని అభిమానులు చెబుతున్నారు. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'సాక్షి' బాధ్యత వహించదు. (ఇదీ చదవండి: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి!) Just finished watching #spyMovie the first half was very good going into story... The second half NXT level some goosebumps scenes are erupted.... The main asset of the movie @actor_Nikhil acting was outstanding.. And director was narrated some new scenes to engage the audience pic.twitter.com/xBmiVPA4v3 — Rakesh (@Rakesh68529974) June 29, 2023 #SPYMovie 🎬 Review : #SPY is Overall a Good Honest SPY Action Thriller from @actor_Nikhil & Team 💥💥💥 pic.twitter.com/JnMK7Zvdos — Mee Cinema (@Mee_Cinema) June 29, 2023 #SPYMovie received good positive talk from the USA premiere and box office winner. congratulations to @actor_Nikhil and team.. 3 వరుస హిట్స్ తో రచ్చ చేస్తున్న #NikhilSiddhartha 🔥 pic.twitter.com/ppMGDUQl8x — Veera Reddy @For The People (@VeeraReddyForT1) June 29, 2023 @actor_Nikhil anna Dil Le Lo Mera...💖😘 The Movie is Blockbuster 📝🔥#SPYMovie⭐⭐⭐⭐ pic.twitter.com/5GnFwy6jAq — Darling Fan⭐ (@s42359) June 29, 2023 crossed the expectations set on the movie... Especially @actor_Nikhil acting is very good.. Everyone can go and watch this movie.#spy #SPYMovie #SPYReview #SPYMovieReview #NikhilSiddhartha pic.twitter.com/jcexlfIHE5 — Vayalpad Tabrej (@Tabrej1411) June 29, 2023 -
‘స్పై’మూవీ ప్రీ రిలీజ్లో హీరోయిన్ సానియా ఠాకూర్ (ఫొటోలు)
-
నిఖిల్ సిద్ధార్థ్ ‘స్పై’మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
స్పై మూవీ టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ
-
Iswarya Menon Latest Photos: ‘స్పై’ మూవీ హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ (ఫొటోలు)
-
అవును, నిర్మాత నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం: నిఖిల్
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా బాలీవుడ్‌లోనూ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా లెవల్లో తన సినిమాలు రిలీజ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు స్వయంభు, ద ఇండియా హౌస్, స్పై వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. గురువారం స్పై సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా నిర్మాతకు, నిఖిల్‌కు మధ్య గొడవలు అవుతున్నాయని కొంతకాలం నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. జూన్ 29న స్పై రిలీజ్ చేయాలని నిర్మాత రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడే రిలీజ్ వద్దు, దేశం మొత్తం సినిమా ప్రమోషన్స్ చేద్దామని హీరో వాదించుకున్నారట. నిర్మాత ఎంతకూ అందుకు ఒప్పుకోకపోవడంతో నిఖిల్ అప్సెట్ అయ్యాడట. మరోవైపు ఆదిపురుష్ హవా తగ్గడంతో నిర్మాత మరోసారి స్పై రిలీజ్ డేట్ ప్రకటించాడు. చివరకు నిర్మాత దారిలోకే వచ్చిన నిఖిల్ ఆయన చెప్పిన డేట్‌కే కట్టుబడి ఉన్నాడు. తాజాగా నిఖిల్ ఈ గొడవపై స్పందిస్తూ.. 'అవును.. నిర్మాత, నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. కానీ అదంతా సినిమా కోసమే! ఇప్పుడంతా ఓకే. నిర్మాతను నేను ఒకటే కోరాను. రూ.250 పెట్టి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు వినోదం పంచాలి. ఇది మంచి సినిమా. అందుకే ఇంకాస్త సమయం తీసుకుందామని కోరాను. అయితే క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే కొంచెం క్వాలిటీ తగ్గిపోయినా మార్నింగ్‌షో తర్వాత ప్రేక్షకులు ఉండరు. అందుకే మేం ఆ పని చేయలేదు. ఈ విషయంలో దర్శకనిర్మాతలు నన్ను సంతృప్తి పరిచారు కాబట్టే ఇప్పుడు మీడియా ముందుకు స్వచ్ఛందంగా, ధైర్యంగా వచ్చాను' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహించాడు. చదవండి: పదేపదే అందంగా లేనని చెప్తుంటే: శోభిత ధూళిపాళ