Nikhil Siddharth Gives Clarity On Clashes With Spy Movie Producer, Deets Inside - Sakshi
Sakshi News home page

Nikhil Siddharth: స్పై నిర్మాతతో గొడవలు.. నిజమేనని అంగీకరించిన హీరో నిఖిల్‌

Published Fri, Jun 23 2023 7:21 PM | Last Updated on Sat, Jun 24 2023 11:38 AM

Nikhil Siddharth Gives Clarity on Clashes with Spy Movie Producer - Sakshi

టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ ప్రస్తుతం ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా బాలీవుడ్‌లోనూ హిట్‌ కొట్టడంతో పాన్‌ ఇండియా లెవల్‌లో తన సినిమాలు రిలీజ్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు స్వయంభు, ద ఇండియా హౌస్‌, స్పై వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. గురువారం స్పై సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ సినిమా నిర్మాతకు, నిఖిల్‌కు మధ్య గొడవలు అవుతున్నాయని కొంతకాలం నుంచి ఓ వార్త వైరల్‌ అవుతోంది.

జూన్‌ 29న స్పై రిలీజ్‌ చేయాలని నిర్మాత రాజశేఖర్‌ రెడ్డి.. ఇప్పుడే రిలీజ్‌ వద్దు, దేశం మొత్తం సినిమా ప్రమోషన్స్‌ చేద్దామని హీరో వాదించుకున్నారట. నిర్మాత ఎంతకూ అందుకు ఒప్పుకోకపోవడంతో నిఖిల్‌ అప్‌సెట్‌ అయ్యాడట. మరోవైపు ఆదిపురుష్‌ హవా తగ్గడంతో  నిర్మాత మరోసారి స్పై రిలీజ్‌ డేట్‌ ప్రకటించాడు. చివరకు నిర్మాత దారిలోకే వచ్చిన నిఖిల్‌ ఆయన చెప్పిన డేట్‌కే కట్టుబడి ఉన్నాడు.

తాజాగా నిఖిల్‌ ఈ గొడవపై స్పందిస్తూ.. 'అవును.. నిర్మాత, నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. కానీ అదంతా సినిమా కోసమే! ఇప్పుడంతా ఓకే. నిర్మాతను నేను ఒకటే కోరాను. రూ.250 పెట్టి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు వినోదం పంచాలి. ఇది మంచి సినిమా. అందుకే ఇంకాస్త సమయం తీసుకుందామని కోరాను. అయితే క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్‌ కాలేదు. ఎందుకంటే కొంచెం క్వాలిటీ తగ్గిపోయినా మార్నింగ్‌షో తర్వాత ప్రేక్షకులు ఉండరు. అందుకే మేం ఆ పని చేయలేదు. ఈ విషయంలో దర్శకనిర్మాతలు నన్ను సంతృప్తి పరిచారు కాబట్టే ఇప్పుడు మీడియా ముందుకు స్వచ్ఛందంగా, ధైర్యంగా వచ్చాను' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు గ్యారీ బీ హెచ్‌ దర్శకత్వం వహించాడు.

చదవండి: పదేపదే అందంగా లేనని చెప్తుంటే: శోభిత ధూళిపాళ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement