Nikhil Siddharth
-
రామ్ చరణ్ నిర్మాణ సంస్థలో టాలీవుడ్ హీరో.. షూటింగ్ ప్రారంభం!
టాలీవుడ్ హీరో హీరో నిఖిల్ సిద్ధార్థ్, సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ' ది ఇండియా హౌస్'. ఈ సినిమాకు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సంస్థ వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.ఈ మూవీ షూటింగ్‌ను హంపిలోని విరూపాక్ష ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ శివుని ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను 1905లో జరిగిన పీరియాడిక్ కథాచిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 𝙏𝙝𝙚 𝙨𝙥𝙖𝙧𝙠 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙧𝙚𝙫𝙤𝙡𝙪𝙩𝙞𝙤𝙣 𝙞𝙨 𝙞𝙜𝙣𝙞𝙩𝙚𝙙 🔥#TheIndiaHouse commences on an auspicious note with a pooja ceremony at the Virupaksha Temple, Hampi with the blessings of Lord Shiva 🔱Stay tuned for more updates ❤️🔥#JaiMataDi #RevolutionIsBrewing pic.twitter.com/qZyTjqIP62— V Mega Pictures (@VMegaPictures_) July 1, 2024 -
టాలీవుడ్ యంగ్ హీరో సూపర్ హిట్ సిరీస్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 2014లో విడుదలైన కార్తికేయ మూవీతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. దీంతో నిఖిల్ ఈ సిరీస్‌లో మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న కార్తికేయ-3 ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 'సరికొత్త అడ్వెంచర్ సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో మీ ముందుకు రానున్నాం' తాజాగా పోస్ట్ పెట్టారు. దీంతో నిఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ - చందు కాంబోలో మరో అడ్వెంచర్ థ్రిల్లర్ చూసేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2తో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. కాగా.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రానున్న మూడో చిత్రంగా నిలవనుంది. 2014లో విడుదలైన కార్తికేయతో వీరి కాంబో తొలి విజయం అందుకుంది. కార్తికేయ- 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కాగా.. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తండేల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. Dr. Karthikeya In Search of a Brand new Adventure ... Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI — Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024 -
హీరో నిఖిల్ కుమారుడి నామకరణ వేడుక
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ తెగ సంతోషించాడు. ఏడాది క్రితం నాన్న చనిపోయాడని, ఆయనే మళ్లీ తన కొడుకుగా తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యాడు. కుమారుడిలోనే తండ్రిని చూసుకుని మురిసిపోయాడు. తాజాగా నిఖిల్ ఇంట అతడి తనయుడి బారసాల వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. నిఖిల్-పల్లవి దంపతులు తమ కుమారుడికి కొత్త బట్టలు వేసి తొట్లె(ఊయల)లో వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ దంపతులు బాబుకు ఏ పేరు పెట్టి ఉంటారా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కాగా నిఖిల్ - పల్లవి 2020వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్వయంభూ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. చదవండి: స్టేజీపై హీరోయిన్‌కు హారతి.. వామ్మో.. బానే ఎక్స్‌ట్రాలు కొడ్తున్నాడే! -
ప్రత్యేకంగా నీ బ్యాటింగ్ కోసమే వచ్చా బ్రో: విశ్వక్ సేన్
ఇటీవల సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మ్యాచులు హైదరాబాద్‌లో నిర్వహించారు. మార్చి 1,2,3 తేదీల్లో వరుసగా మ్యాచులతో టాలీవుడ్ స్టార్స్.. ఇతర సినీ ఇండస్ట్రీ టీమ్స్ కూడా సందడి చేశాయి. ఉప్పల్ స్డేడియం వేదికగా ఈ మ్యాచులు జరిగాయి. అయితే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మన తెలుగు వారియర్స్ టీమ్‌లో స్టార్ బ్యాటర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా మన యంగ్ నిఖిల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విశ్వక్సేన్తో ఫన్నీగా సంభాషిస్తూ కనిపించారు. అదేంటో మీరు ఓ లుక్కేయండి. ఇటీవల జరిగిన ఉప్పల్ మ్యాచ్‌లో యంగ్ హీరోలు నిఖిల్, విశ్వక్ సేన్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిఖిల్ బ్యాటింగ్ చూసేందుకు స్టేడియానికి వచ్చానని విశ్వక్ సేన్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. 'నిఖిల్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు.. నేను ప్రత్యేకంగా నిఖిల్ బ్యాటింగ్ కోసమే వచ్చా. బ్యాటింగ్ టిప్స్ బాగా తెలుసు. ఇటీవలే రిజల్ట్ కూడా వచ్చింది' అంటూ విశ్వక్ సేన్ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను నిఖిల్, విశ్వక్ సేన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. విశ్వక్ సేన్ నటించిన చిత్రం గామి ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. Thanks a lot bro , nice batting bro . 🤗❤️ https://t.co/sXv26lAY7d — VishwakSen (@VishwakSenActor) March 2, 2024 -
తండ్రైన యంగ్ హీరో నిఖిల్.. ఫోటో వైరల్
యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. (చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?) నిఖిల్ సినీ కెరీర్ విషయాకొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. Our Unique Star ⭐️@actor_Nikhil and his wife #Pallavi are now blessed with a BABY BOY❤️ Warmest congratulations to the glowing couple on this delightful addition to their family 🤗✨#NikPal pic.twitter.com/ihRleHFUY8 — Team Nikhil Siddhartha Telangana ✊ (@TS_Team_Nikhil) February 21, 2024 -
భారత్-చైనా సంబంధాల ఇతివృత్తంతొ ‘చైనా పీస్’
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "చైనా పీస్". రిపబ్లిక్ డే సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ చిత్రం ఫస్ట్ లుక్, హై కాన్సెప్ట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. లిప్‌స్టిక్ , యుఎస్ బీ డ్రైవ్ ఇమేజ్ కాంబినేషన్ ని మిక్స్ చేస్తూ ఆసక్తికరంగా చూపిస్తూ ఒక మిసైల్ ని పోలివున్న ఈ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది. దేశభక్తి, భారతదేశం-చైనా సంబంధాల ఇతివృత్తంతో ఈ కథ ఉండబోతుందని పోస్టర్ సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హర్షిత, శ్రీషా నూలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. -
Swayambhu: హనుమాన్ భక్తుడిగా నిఖిల్!
నిఖిల్ హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.‘స్వయంభూ’ సినిమా అప్డేట్ను షేర్ చేశారు నిఖిల్. ‘‘నాన్‌స్టాప్‌గా మా సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో నేను హనుమాన్ భక్తుడి పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ జై శ్రీరామ్. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నాం. దసరా లేదా దీపావళికి ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు నిఖిల్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. #Swayambhu shooting in full swing with key sequences being shot 💥💥@actor_Nikhil will be seen as a devotee of Lord Hanuman in the film ❤️🔥@iamsamyuktha_ @krishbharat20 @RaviBasrur @manojdft @TagoreMadhu @bhuvan_sagar @PixelStudiosoff @TimesMusicHub @jungleemusicSTH pic.twitter.com/rMyTKrghZJ — Kakinada Talkies (@Kkdtalkies) January 16, 2024 -
నిన్న అఖిల్...ఈ రోజు నిఖిల్...మీరు మారిపోయారయ్యా
-
ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
‘‘స్పై’కి నా కెరీర్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. మా సినిమాని ఇంతగా ఆదరించి, నా కెరీర్‌ని మరో మెట్టు పైకి ఎక్కిస్తూ మంచి ఓపెనింగ్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇకపైనా మరిన్ని మంచి చిత్రాలు ఇస్తానని మాట ఇస్తున్నా’’ అని నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘స్పై’. కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్ మాట్లాడుతూ–‘‘స్పై’కి ఇంత పెద్ద ఓపెనింగ్స్ (రూ. 11 కోట్ల 7లక్షలు) రావడం హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ సంతోషంగా ఉన్నారు’’ అన్నారు. ‘‘మాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు గ్యారీ బీహెచ్. -
నిఖిల్‌ని చూసి గర్వపడుతున్నా
‘‘స్పై థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత సులభం కాదు.. అది ఒక సవాల్. ఎందుకంటే ఇలాంటి హాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో చూసేస్తున్నారు. కానీ, ‘స్పై’ టీజర్, ట్రైలర్ చూశాక చాలా బాగా అనిపించింది. అంతర్జాతీయ స్థాయి విలువలకు ఏ మాత్రం తగ్గలేదు. రాజశేఖర్, చరణ్ తేజ్‌ల ప్యాషన్ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యామీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పై’. ఈడీ ఎంటర్టైన్ మెంట్స్‌పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాపీడేస్’ తో కెరీర్ మొదలుపెట్టి, ‘స్వామిరారా, కార్తికేయ’ తో ఓ ట్రెండ్ సెట్ చేసి, ‘కార్తికేయ 2’ తో బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు.. తనని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ‘కార్తికేయ 2’ తో ఒక ట్రెండ్ ఎలా సెట్ చేశాడో.. ‘స్పై’ చిత్రంతో ఆ ట్రెండ్ దాటి తర్వాతి స్థాయికి వెళతాడనే నమ్మకం ఉంది’’ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ–‘‘సుభాష్ చంద్రబోస్ వంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఉన్న సినిమా ‘స్పై’. నాలుగురోజుల కిందట ఈ మూవీ ఫైనల్ కాపీ చూశాక ‘థ్యాంక్యూ గ్యారీ’ అన్నాను.. అంత బాగా ఈ మూవీ తీశాడు. ఇలాంటి సినిమా చేసినందుకు యూనిట్ అంతా గర్వపడుతున్నాం. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్‌తో ‘స్పై’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు కె.రాజశేఖర్ రెడ్డి. గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ–‘‘డాక్టర్ అయిన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ, నా తల్లితండ్రులు ఒప్పుకుని, నన్నుప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ‘స్పై’ చాలా బాగా తీశావంటూ నిఖిల్‌గారు నన్ను హత్తుకోవడంతో సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది’’ అన్నారు. ఈ వేడుకలో ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్, సంగీత దర్శకుడుశ్రీచరణ్ పాకాల, కెమెరామేన్ వంశీ పచ్చిపులుసు, యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ, నటీనటులు సాన్య ఠాకూర్, ఆర్యన్ రాజేష్ పాల్గొన్నారు. -
ఈ వారం థియేటర్‌తో పాటు ఓటీటీల్లో చూడదగిన మూవీస్ ఇవే
‘ఆదిపురుష్’ విడుదలైన తర్వాత రెండు వారాల వరకు థియేటర్లో ప్రేక్షకులను రప్పించే సినిమాలు ఏవీ విడుదల కాలేదనే చెప్పవచ్చు. ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్ వల్ల కొన్ని సినిమాలను వాయిదా కూడా వేసుకున్నారు. అందువల్ల గత వారంలో పెద్ద చిత్రాలేవి విడుదల కాలేదు. దాదాపు అన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా సినీ ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ జూన్ 30న బాక్సాఫీస్ వద్ద మళ్లీ సందడి కొనసాగనుంది. ఈ వారం థియేటర్లోనే కాకుండా ఓటీటీలోనూ వెబ్‌సిరీస్‌లతో పాటు పలు కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. నిఖిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా 'స్పై' జూన్ 29న గురువారం విడుదల కానుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీతో పాటు ఆయన జీవితానికి సంబంధించిన ఎప్పుడూ వినని అంశాలతో సినిమాను తెరకెక్కించారు. నిఖిల్ ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీలో ఆర్యన్ రాజేశ్, ఐశ్వర్య మేనన్, సన్యా ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. కె.రాజశేఖర్‌రెడ్డి కథని సమకూర్చడంతోపాటు, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా 'వివాహభోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సామజ వరగమన'. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం జూన్ 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో చిరంజీవి విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆయన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 2008లో 'ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ క్రిస్టల్ స్కల్' అప్పట్లో పెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా దాదాపు 14ఏళ్ల తర్వాత అదే సీరిస్‌లో 'ఇండియానా జోన్స్' కొత్త చిత్రం జూన్ 30న థియేటర్లోకి రాబోతోంది. అడ్వెంచర్ సినీ ప్రియులకు ఈ సినిమా పండుగే అని చెప్పవచ్చు. ఈ వారం థియేటర్/ ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ ఇవే డిస్నీ+హాట్‌స్టార్ • వీకెండ్ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్) జూన్ 28 • ది నైట్ మేనేజర్ (సిరీస్2) జూన్30 నెట్ ఫ్లిక్స్ • లస్ట్ స్టోరీస్ 2 (హిందీ) జూన్ 29 • అఫ్వా (హిందీ) జూన్30 అమెజాన్ ప్రైమ్ • జాక్ ర్యాన్ (వెబ్‌సిరీస్ 4) జూన్ 30 థియేటర్లో • నిఖిల్ 'స్పై' జూన్ 29 • 'ఇండియానా జోన్స్' జూన్ 29 • శ్రీ విష్ణు 'సామజ వరగమన' జూన్ 30 • 'లవ్ యూ రామ్' జూన్ 30 • పాయల్ రాజ్‌పుత్ 'మాయా పేటిక' జూన్ 30 ఆహా • అర్థమయ్యిందా అరుణ్‌కుమార్ (తెలుగు సిరీస్) జూన్ 30 -
నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నారు: హీరో నిఖిల్
టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన ఫోన్ డేటాను సేకరించారు. అందులో అతడు ఓ హీరోయిన్‌తో పాటు అషూ రెడ్డి, సురేఖా వాణి, ఆమె కూతురితో కలిసి దిగిన ఫోటోలు, వారితో సంభాషణలు జరిపినట్లుగా వందలాది ఫోన్ కాల్స్ ఉన్నాయి. వీరితో పాటు బడాబాబులు కూడా ఆయన జాబితాలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాలపై హీరో నిఖిల్ సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక శాఖ విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన 'పరివర్తన' కార్యక్రమానికి నటుడు ప్రియదర్శితో కలిసి నిఖిల్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది సిగరెట్ తాగమని ఆఫర్ చేశారు. మరికొందరైతే చాలాసార్లు డ్రగ్స్ తీసుకోమని అడిగారు. కానీ ఒక్కసారి దానికి అలవాటు పడితే జీవితంలో మంచి రోజులు అనేవే ఉండదు. జీవితం సర్వనాశనమవుతుంది. అలాంటివాటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరూ ఇదే పని చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల జీవితం ఎంతో అందమైనది. డ్రగ్స్ అంటే జీవితానికి చరమగీతం పాడటమే! అది దృష్టిలో పెట్టుకుని దానికి దూరంగా ఉండండి. సరదాగా పార్టీలకు వెళ్లినా దయచేసి డ్రగ్స్ తీసుకోవద్దు. త్వరలోనే రాష్ట్రం మాదక ద్రవ్యాల రహిత తెలంగాణగా మారాలని కోరుకుంటున్నా' అన్నాడు నిఖిల్. చదవండి: చైతూను మెచ్చుకోవాల్సిందే, సమంతలో ఆ క్వాలిటీ నచ్చుతుంది: శోభిత -
అవును, నిర్మాత నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం: నిఖిల్
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా బాలీవుడ్‌లోనూ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా లెవల్లో తన సినిమాలు రిలీజ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు స్వయంభు, ద ఇండియా హౌస్, స్పై వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. గురువారం స్పై సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా నిర్మాతకు, నిఖిల్‌కు మధ్య గొడవలు అవుతున్నాయని కొంతకాలం నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. జూన్ 29న స్పై రిలీజ్ చేయాలని నిర్మాత రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడే రిలీజ్ వద్దు, దేశం మొత్తం సినిమా ప్రమోషన్స్ చేద్దామని హీరో వాదించుకున్నారట. నిర్మాత ఎంతకూ అందుకు ఒప్పుకోకపోవడంతో నిఖిల్ అప్సెట్ అయ్యాడట. మరోవైపు ఆదిపురుష్ హవా తగ్గడంతో నిర్మాత మరోసారి స్పై రిలీజ్ డేట్ ప్రకటించాడు. చివరకు నిర్మాత దారిలోకే వచ్చిన నిఖిల్ ఆయన చెప్పిన డేట్‌కే కట్టుబడి ఉన్నాడు. తాజాగా నిఖిల్ ఈ గొడవపై స్పందిస్తూ.. 'అవును.. నిర్మాత, నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. కానీ అదంతా సినిమా కోసమే! ఇప్పుడంతా ఓకే. నిర్మాతను నేను ఒకటే కోరాను. రూ.250 పెట్టి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు వినోదం పంచాలి. ఇది మంచి సినిమా. అందుకే ఇంకాస్త సమయం తీసుకుందామని కోరాను. అయితే క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే కొంచెం క్వాలిటీ తగ్గిపోయినా మార్నింగ్‌షో తర్వాత ప్రేక్షకులు ఉండరు. అందుకే మేం ఆ పని చేయలేదు. ఈ విషయంలో దర్శకనిర్మాతలు నన్ను సంతృప్తి పరిచారు కాబట్టే ఇప్పుడు మీడియా ముందుకు స్వచ్ఛందంగా, ధైర్యంగా వచ్చాను' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహించాడు. చదవండి: పదేపదే అందంగా లేనని చెప్తుంటే: శోభిత ధూళిపాళ -
హీరో నిఖిల్ 'స్పై' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రామ్ చరణ్ కొత్త బ్యానర్.. ఆ యంగ్ హీరోతోనే తొలి సినిమా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన స్నేహితుడు విక్రమ్ రెడ్డి ఇటీవలే వి మెగా పిక్చర్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్తవారికి ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ ప్రారంభించినట్లు వెల్లడించారు. తాజాగా ఈ బ్యానర్లో తొలి చిత్రాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా పాన్ ఇండియా మూవీని ప్రకటిస్తున్నందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కార్తికేయ సిరీస్‌తో సూపర్ హట్స్ సొంతం చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా.. 'ది ఇండియా హౌస్' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.లండన్‌లో స్వాతంత్య్రం రాకముందు ఏం జరిగిందనే నేపథ్యంలో ది ఇండియా హౌస్‌ను తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: కేఎల్ రాహుల్‌పై దారుణ ట్రోల్స్.. గట్టిగానే కౌంటరిచ్చిన అతియా శెట్టి!) On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film - THE INDIA HOUSE headlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna! Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV — Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023 -
స్పైకి కథే హీరో
‘‘ఈ మధ్య ప్రేక్షకులు ఇష్టపడుతున్నది మంచి కథనే. హీరో, ఎంటర్టైన్మెంట్ ఎంత ఉన్నా కథ అనే సోల్ లేకపోతే బ్లాక్ బస్టర్ అవ్వదు. ‘స్పై’ మూవీకి కథే హీరో’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘స్పై’. ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ – ‘‘సుభాష్ చంద్రబోస్‌గారి గురించి, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి, ఆ సంస్థ సేవల గురించి చాలామందికి తెలియదు. దేశానికి తెలియాల్సిన ఆ విషయాలతో పాటు వినోదాత్మకంగా ఈ మూవీ ఉంటుంది’’ అన్నారు. ‘కార్తికేయ 2’ తర్వాత ఓ పార్టీకి అనుకూలంగా మీరు ‘స్పై’ చేస్తున్నారనే ప్రచారంపై మీ స్పందన అని అడగ్గా – ‘‘కృష్ణుడంటే నాకు నమ్మకం. అందుకే ‘కార్తికేయ 2’ చేశాను. ఇప్పుడు ఓ భారతీయుడిగా ‘స్పై’ చేశాను. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు’’ అన్నారు నిఖిల్. ‘‘డైరెక్టర్‌గా నా తొలి సినిమా నిఖిల్‌తో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు గ్యారీ బీహెచ్. ‘‘స్పై’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు’’ అన్నారు చరణ్ తేజ్ ఉప్పలపాటి. సంగీత దర్శకులు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు, మాటల రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు. -
కార్తికేయ 2 బ్లాక్‌బస్టర్.. హీరో నిఖిల్‌కు అరుదైన అవార్డు
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ 2 తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా మంచి విజయం అందుకుంది. కార్తికేయ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 121 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఉత్తరాది, దక్షిణాదిలో అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది కార్తికేయ. దీంతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. కార్తికేయ-2 చిత్రం టీవీ ప్రీమియర్, OTT స్ట్రీమింగ్‌లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రశంసలు, వసూళ్లు మాత్రమే కాకుండా అవార్డుల విభాగంలోనూ నిఖిల్ తన సత్తాను నిరూపించుకున్నాడు. తాజాగా కార్తికేయ చిత్రంతో, ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికవ్వడం విశేషం. కార్తికేయ - 2 చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించాయి. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంతో చందు మొండేటి కృష్ణ తత్వాన్ని, మహిమను చెప్పడంతో పాటు, పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి అంశం శాస్త్రీయమైనదే నని బలంగా చెప్పాడు. మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. కాగా నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ స్పైతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా 5 భాషల్లో రూపొందుతుంది. -
ఆహాలో 18 పేజెస్, స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్.గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు మంచి వసూళ్లే వచ్చాయి. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అటు ఆహా, ఇటు నెట్‌ఫ్లిక్స్ రెండూ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! అయితే ముందుగా 18 పేజెస్ ఆహాలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరింకెందుకాలస్యం.. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు వచ్చే శుక్రవారం ఫ్యామిలీతో కలిసి 18 పేజెస్ వీక్షించేయండి. ఇక సినిమా విషయానికి వస్తే.. సుకుమార్ కథ అందించగా ఆయన శిష్యుడు, కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్యప్రతాప్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. Mee intrigue ki therapadabothundhi😅 Suku"Mark" magic ki ready ga undandi!#18PagesOnAHA | Premieres Jan 27 #18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap @GopiSundarOffl #BunnyVas @idineshtej @NavinNooli @lightsmith83 @GA2Official @SukumarWritings @adityamusic pic.twitter.com/g33HqN6RCL — ahavideoin (@ahavideoIN) January 20, 2023 చదవండి:గర్భవతిగా పూజా.. స్విమ్మింగ్ పూల్‌లో ముద్దులాట అంబానీ ఇంట్లో ఫంక్షన్‌కు ఆ డ్రెస్‌లో వెళ్తావా? -
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ‘18 పేజెస్’ వారం రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో మొదటి రోజే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ సినిమా విడుదలై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికి థియేటర్లో అదే జోరు కొనసాగుతోంది. ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమా ఇప్పటివరకు (వారం రోజులకు) రూ. 20 కోట్ల గ్రాస్ సాధించి విజయంతంగా ముందుకు సాగుతుంది. కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అంధించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందినిల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. చదవండి: బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్, గొంతు కలిపిన చిరు, రవితేజ -
ఆ సినిమాతో పోల్చడం సంతోషం
‘‘ఫీల్ గుడ్ సినిమా ఆడదు.. ప్రేమ కథలు ఇంటికి (ఓటీటీ) వచ్చినప్పుడు చూద్దాంలే’ అని ప్రేక్షకులు అను కుంటున్న తరుణంలో ‘సీతారామం’ వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లయిమాక్స్‌కి ఉన్న ఫీలింగ్ మా ‘18 పేజెస్’కి వచ్చిందని చాలామందిపోల్చి చెబుతుంటే సంతోషంగా ఉంది. మా సినిమా చూస్తే ఒక నవలను చదివిన అనుభూతి కలిగేలా దర్శకుడు మలిచాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘మా సినిమా మొదటిరోజు వసూళ్ల కంటే మూడో రోజు ఎక్కువ ఉన్నాయి. ఈ చిత్రం విషయంలో మేం లాభాల్లో ఉన్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు ‘మాకు మేమే ప్రేమలో పడిన అనుభూతి వస్తోంది’ అంటున్నారు. అది మాకు పెద్ద ప్రశంస’’ అన్నారు సూర్యప్రతాప్. ‘‘2022లో టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్‌లో మా ‘18 పేజెస్’ ఉంటుంది. కెరీర్ వైజ్‌గా నా జీవితంలో ఇది బెస్ట్ ఇయర్’’ అన్నారు నిఖిల్. ‘‘శతమానం భవతి’లో నేను చేసిన నిత్య ΄ాత్రకి ఎంత మంచి పేరొచ్చిందో ‘18 పేజెస్’లో నందిని ΄ాత్రకి కూడా అంతే పేరొచ్చింది’’ అన్నారు అనుపమ. ∙ నిఖిల్, అనుపమ, అల్లు అరవింద్, బన్నీ వాసు, సూర్యప్రతాప్ -
సక్సెస్‌ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ నేను మంచి కథలు, మంచి సినిమాల్లో నటించాను. కానీ నటనలో నాకు ఉన్న ప్రతిభకు సరైన పేరు రాలేదని ఫీలవుతుంటాను. అయితే ‘18 పేజెస్’ రిలీజ్ తర్వాత కేవలం ఈ సినిమా గురించే కాకుండా నా నటన గురించి కూడా మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిఖిల్ చెప్పిన విశేషాలు. ► ‘18 పేజెస్’ చిత్రం ఎలా ఉంటుంది? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన క్రేజీ లవ్‌స్టోరీ ఇది. 18 పేజెస్ ఆధారంగా నందినీతో సిద్ధు ఏ విధంగా ప్రేమలో పడతాడు? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది? అన్నదే కథ. ఈ సినిమా క్లయిమాక్స్‌ని ఊహించలేకపోయాను. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం కూడా ఉంది. హిట్టయినా కాకపోయినా మేం ఓ మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ భావిస్తారనే గ్యారంటీ ఇవ్వగలను. ► థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లవ్‌స్టోరీ కాకుండా.. ఈ సినిమాలో వేరే అంశాలేమైనా? కొన్ని సామాజిక అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఎవరో ఒక అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని అతను ఆమెపై యాసిడ్‌తో దాడి చేయడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటివి వార్తల్లో చూస్తున్నాం. ఓ అమ్మాయికి ఎలాంటి గౌరవం దక్కాలి? ఆమె పట్ల ప్రవర్తన ఎలా ఉండాలి? పెద్దల పట్ల యువత తీరు ఎలా ఉంటే బాగుంటుంది? అనే అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత బ్రేకప్ను కూడా పాజిటివ్‌గా తీసుకుంటారు. ► ఈ చిత్రంపై దర్శకుడు సుకుమార్ మార్క్ ఎంత? వంద శాతం ఆయన మార్క్ కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల క్యారక్టరైజేషన్స్, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉన్న ఇలాంటి లవ్‌స్టోరీని నేనిప్పటివరకు చేయలేదు. ప్రతి సీన్ చాలెంజింగ్‌గా అనిపించింది. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హీరో అయ్యారు. ఏమైనా ఒత్తిడి ఫీలవుతున్నారా? పాన్ ఇండియా హీరో అన్న ప్రతిసారీ నాకు ఒత్తిడే. నాకు తెలిసి సక్సెస్‌ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు. ► మీ తర్వాతి చిత్రాలు? నెక్ట్స్ ఇయర్ ఓ స్పై మూవీతో రాబోతున్నాను. దర్శకుడు చందు మొండేటి ‘కార్తికేయ 3’ కోసం పరిశోధన చేస్తున్నారు. నా ‘యువత’ సినిమా రిలీజైన ఐదు రోజులకు సుకుమార్‌గారు లక్ష రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆయనతో సినిమా ఎప్పుడో చెప్పలేను. ► మనతో పని చేసేవారు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలను కూడా పొగుడుతుంటారు. రియల్ పర్సన్స్‌ను కలిసినప్పుడు మనకు రియాలిటీ అర్థమవుతుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా ద్వారా రియల్ పీపుల్‌ను కలిసే చాన్స్ నాకు లభించింది. సోషల్ మీడియాలో నాకో ఫేక్ ప్రొఫైల్ ఉంది. నెటిజన్ల కామెంట్స్ చదువుతూ నిజాలు తెలుసుకుంటుంటాను. నా సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే విషయాలను నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంటాను. ► అనుకోకుండా యాక్టర్ అయ్యాను. ఊహించని విధంగా హిట్స్ పడ్డాయి. అలాగే ఊహించని రీతిలో జాతీయ స్థాయిలో ఆడియన్స్ దృష్టిలో పడ్డాను. ఇదంతా ఎలా జరిగిందో ఆలోచించుకుంటూ ఉంటాను. -
నిఖిల్ సిద్ధార్థ్ '18 పేజిస్' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
కార్తికేయ 2 ఫస్ట్ టైమ్ టీఆర్పీ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ వద్ద కార్తికేయ 2 సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే! అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇటీవల బుల్లితెరలోనూ ప్రసారమైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా జీ తెలుగులో ప్రసారం కాగా 7.88 రేటింగ్ అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో 'కార్తికేయ 2'కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సూపర్‌నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. చదవండి: హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది? ఓటీటీలో ల్యాండయిన జిన్నా మూవీ -
18 Pages: ‘నన్నయ్య రాసిన కావ్యమాగితే..’ ఆకట్టుకుంటున్న క్లాసీ మెలోడీ
నిఖిల్ సిద్దార్థ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. "జీఏ 2" పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నన్నయ్య రాసిన’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగేనా నన్నయ్య రాసిన కావ్యమాగితే, తిక్కన తీర్చేనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా .. అని శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు. -
18 పేజేస్ చివరి షెడ్యూల్లో పాల్గొన్న నిఖిల్.. ఫోటో వైరల్
నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే కార్తికేయ-2తో హిట్టు కొట్టిన ఈ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఇదే కాకుండా గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా ఆయన కథను అందించిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ 18 పేజెస్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి GA2 పిక్చర్స్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభం కాగా, నిఖిల్ ఈ షూటింగులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.