Actor Nikhil Siddharth Interesting Comments On Karthikeya 3 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Nikhil Siddharth : అమ్మ కోసం అయినా ఆ సినిమా చేస్తా

Published Sun, Oct 16 2022 3:35 PM | Last Updated on Sun, Oct 16 2022 4:46 PM

Nikhil Siddharth Comments On Karthikeya 3 Movie - Sakshi

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. ఆయన కెరీర్‌లోనే భారీ బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రం ‘కార్తికేయ 2’. ఈ ఏడాది ఆగస్ట్‌ 13న విడుదలైన ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్తికేయ 3పై నిఖిల్‌ స్పందించాడు.

(చదవండి: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న బాలయ్య చిన్న కూతురు)

తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ముందు కార్తికేయ సినిమా తీస్తున్నప్పుడు సీక్వెల్ అనుకోలేదు. కానీ ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 ఎప్పుడు తీస్తారు అని అడిగారు. అంటే ప్రేక్షకులు ఆ సినిమాను అంతగా కోరుకున్నారని అర్థమైంది. ఇప్పుడు కార్తికేయ 3 గురించి అడుగుతున్నారు. ఆ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఒకవేళ నేను కార్తికేయ 3 చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ మా అమ్మ మాత్రం నన్ను వదలదు. అమ్మ కోసం అయినా ఆ సినిమా చేయాలి’ అని చెప్పుకొచ్చాడు.  అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఆస్కార్‌ అవార్డు విషయంపై మాట్లాడుతూ..  ‘ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వస్తే బాగుంటుంది. కానీ ప్రతి సినిమా ఆస్కార్ కోసం తీయరు. ఇది కేవలం సర్టిఫికేట్ కాదు. మాకు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు అన్నింటికంటే ముఖ్యం. అవే గొప్పవి ’అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement