Nikhil Siddharth receives Iconic Gold Awards for Karthikeya 2 - Sakshi
Sakshi News home page

Nikhil-Karthikeya 2: కార్తికేయ 2 బ్లాక్‌బస్టర్‌.. హీరో నిఖిల్‌కు అరుదైన అవార్డు

Published Mon, Mar 20 2023 12:24 PM | Last Updated on Mon, Mar 20 2023 12:37 PM

Nikhil Siddharth Receive Iconic Gold Awards For Karthikeya 2 Hit - Sakshi

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ 2 తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా మంచి విజయం అందుకుంది. కార్తికేయ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 121 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగుతో పాటు హిందీలో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు నార్త్‌ ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. ఉత్తరాది, దక్షిణాదిలో అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది కార్తికేయ. దీంతో నిఖిల్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. 

కార్తికేయ-2  చిత్రం టీవీ ప్రీమియర్, OTT స్ట్రీమింగ్‌లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రశంసలు, వసూళ్లు మాత్రమే కాకుండా అవార్డుల విభాగంలోనూ నిఖిల్ తన సత్తాను నిరూపించుకున్నాడు. తాజాగా కార్తికేయ చిత్రంతో, ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికవ్వడం విశేషం. కార్తికేయ - 2 చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించాయి. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంతో చందు మొండేటి కృష్ణ తత్వాన్ని, మహిమను చెప్పడంతో పాటు, పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి అంశం శాస్త్రీయమైనదే నని బలంగా చెప్పాడు.  మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. కాగా నిఖిల్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా మూవీ స్పైతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా 5 భాషల్లో రూపొందుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement