Karthikeya 2 Movie
-
70వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు నుంచి ఒక్కటే
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 70వ నేషనల్ సినీ అవార్డ్స్ ప్రదానోత్సవం.. న్యూ ఢిల్లీలోని విజయ్ భవన్లో జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. విజేతలకు అవార్డులని ప్రకటించారు. ఈ వేడుకకు దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.తెలుగు నుంచి 'కార్తికేయ 2'కి ఉత్తమ ప్రాంతీయ చిత్ర కేటగిరీలో పురస్కారం దక్కింది. దర్శకుడు చందు మొండేటి దీన్ని అందుకున్నారు. 'తిరు' చిత్రానికి ఉత్తమ నటిగా నిత్యా మీనన్, 'కాంతార' మూవీకి గానూ ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టి అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రదానం చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి అవార్డ్ ఇవ్వాలి. కానీ లైంగిక ఆరోపణల కేసు కారణంగా దీన్ని రద్దు చేశారు.ఎవరెవరికి ఏ విభాగాల్లో అవార్డులు? ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ) బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి) ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మోహర్)ఉత్తమ ప్రాంతీయ సినిమాలుఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలుఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్) ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్) -
ఒకటి..రెండు..మూడు.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!
ఒకటో సారి... రెండో సారి... మూడోసారి... అంటూ వేలం పాట నిర్వహించడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒకటో భాగం.. రెండో భాగం... మూడో భాగం... ఇలా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సినిమాలు మొదటి భాగం హిట్ అయితే రెండో భాగం తీస్తున్నారు. సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్ అయ్యిందంటే మూడో భాగం రూపొందిస్తున్నారు. మరికొన్నేమో రెండో భాగం షూటింగ్ దశలో ఉండగానే ముందుంది మూడో భాగం అంటూ ప్రకటించేస్తున్నారు. మూడో భాగం సీక్వెల్స్ విశేషాల్లోకి వెళదాం... పుష్ప: ది రోర్ ‘తగ్గేదే లే..’ అంటూ ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. తాము కూడా తగ్గేదే లే అంటూ ఆ సినిమాకి పాన్ ఇండియా హిట్‌ని అందించారు ఆడియన్స్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ వంటివారు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్ కావడంతో సేమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమాని పక్కాగా తీసుకురావాలని అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీమ్ కష్టపడుతున్నారు. లేటుగా వచ్చినా బ్లాక్‌బస్టర్ కొట్టాలనే ఆలోచనతో పని చేస్తోంది టీమ్. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి మూడో భాగం ఉంటుందని, ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరిగిన 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అక్కడ ‘పుష్ప: ది రైజ్’ని ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘అన్నీ అనుకూలంగా ఉంటే ‘పుష్ప’ మూడో భాగం తీసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇలా మూడో భాగంపై ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. అయితే ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్ ఇతర ప్రాజెక్టులు చేశాక ‘పుష్ప’ మూడో భాగం చేస్తారని, ఇందుకు చాలా టైమ్ పట్టవచ్చని టాక్. ఆర్య 3 అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ (2004) హిట్ అయింది. వారి కాంబినేషన్లో ఆ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం అందుకుంది. ఈ సినిమాకి మూడో భాగం కూడా రానుంది. ఓ సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆర్య 3’ సినిమా ఉంటుంది... అయితే ఎప్పుడు సెట్స్‌కి వెళుతుందనేది చెప్పలేను’’ అని పేర్కొన్నారు. నాలుగింతల వినోదం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 2– ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. సేమ్ కాంబినేషన్లో ఈ మూవీకి సీక్వెల్‌గా రెండో భాగం ‘ఎఫ్ 3’ని తెరకెక్కించారు. 2022 మే 27న రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. ‘ఎఫ్–3’కి కొనసాగింపుగా ‘ఎఫ్– 4’ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాతగా ఓ సినిమా ప్రకటన ‘వెంకీఅనిల్03’ (వర్కింగ్ టైటిల్) రావడంతో అందరూ ‘ఎఫ్–4’ అనుకున్నారు. అయితే ఇది ‘ఎఫ్–4’ కాదని చిత్రయూనిట్ స్పష్టత ఇచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందుతోన్న ‘వెంకీఅనిల్03’ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’తో పోలిస్తే ‘ఎఫ్–4’ లో వినోదం నాలుగింతలు ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మూడో కేసు ఆరంభం ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), ‘హిట్: ది సెకండ్ కేస్’(2022) వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ‘హిట్: ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ‘హిట్: ది సెకండ్ కేస్’లో అడివి శేష్ కథానాయకుడిగా నటించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన హీరో నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో తానే లీడ్ రోల్లో నటిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కనిపించబోతున్నారు నాని. 2025 మే 1న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ కొలను స్పష్టం చేశారు. వేసవిలో భారతీయుడు కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 3’ (‘భారతీయుడు). కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా జూలై 12న విడుదలైంది. అయితే తొలి భాగం అందుకున్న విజయాన్ని మలి భాగం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రెండో భాగం సమయంలోనే ‘భారతీయుడు 3’ చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి చేసిందట యూనిట్. 2025 వేసవిలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.కేజీఎఫ్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ (2018) సినిమా పాన్ ఇండియా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చివర్లో రెండో భాగం ఉంటుందని ముందే ప్రక టించింది యూనిట్. యశ్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోనే వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ 2022లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీలో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ ప్రీ ్ర΄÷డక్షన్ పనుల్ని దాదాపు పూర్తి చేశారట ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ పై కర్నాటకలోనే కాదు... పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్‌గా నిలవడంతో సెకండ్ పార్ట్ ‘కార్తికేయ 2’ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. 2022 ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో నిఖిల్, చందు కలయికలో రానున్న ‘కార్తికేయ 3’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కార్తికేయ 3’ ఉంటుందంటూ ఈ ఏడాది మార్చి 16న సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు నిఖిల్. ‘‘చందు మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీ (‘కార్తికేయ 3’) సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. స్పాన్, స్కేల్ పరంగా ‘కార్తికేయ 3’ చాలా పెద్దగా ఉండబోతోంది. డా. కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్’ మూవీ తీస్తున్నారు చందు మొండేటి. అటు నిఖిల్ ‘స్వయంభూ’, ఇటు చందు ‘తండేల్’ పూర్తయ్యాక ‘కార్తికేయ 3’ రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. 'నవ్వులు త్రిబుల్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం ‘టిల్లు స్క్వేర్’ ఈ ఏడాది మార్చి 29న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ. 125 కోట్ల వసూళ్లు సాధించి సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘టిల్లు పాత్రపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ‘టిల్లు క్యూబ్’లో టిల్లు పాత్రను సూపర్ హీరోగా చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మత్తు కొనసాగుతుందిశ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలై, హిట్‌గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూడా రితేష్ రానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి, ద్వితీయ భాగాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అటు ఇంటర్వ్యూలో, ఇటు సక్సెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ రితేష్ రానా ‘మత్తు వదలరా 3’ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. పొలిమేరలో ట్విస్టులు‘సత్యం’ రాజేష్ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్‌గా నిలవడంతో ‘పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్. ‘సత్యం’ రాజేష్, బాలాదిత్య, కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొలిమేర 3’. మొదటి రెండు భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చేతబడితో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రేజీ థ్రిల్లర్‌గా రూపొందిన తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పొలిమేర 3’లో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేష్ తెలిపారు. – డేరంగుల జగన్ -
తీయ ఉత్తమ తెలుగు చిత్రం.. సంచలనం సృష్టించిన కార్తికేయ 2
-
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన భావోద్వేగానికి పట్టం
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్‌గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు.... ⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ) ⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ) ⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ) ⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ) ⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం) ⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ) ⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి) ⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం) ⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1) ⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్) ⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ) ⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ) ⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్మోహర్ – హిందీ) ⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం) ⇒స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం) ⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ) ⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు⇒తెలుగు: కార్తికేయ–2 ⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2 ⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1 ⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 ⇒హిందీ: గుల్మోహర్అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్స్టోన్ మూమెంట్. మా బ్యానర్‌కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్‌ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్‌లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.కెరాడి టు పాన్ ఇండియాకర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్‌లో పని చేశారు. క్లాప్ బాయ్‌గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు.‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. -
నేషనల్ అవార్డ్.. మా బాధ్యత పెంచింది: కార్తికేయ 2 నిర్మాత
70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. రెండవసారి(గతేడాది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రంగా నిలిచింది)నేషనల్ అవార్డు రావడం తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. అవార్డు ప్రకటన వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా రెండు సార్లు నేషనల్ అవార్డులు రావడం గర్వగా ఉందన్నారు. కార్తీకేయ 2లో నటించిన నటీనటులతో పాటు పాటు టెక్నీషియన్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అందరి కష్టానికి ప్రతిఫలమే ఈ అవార్డు’అని అన్నారు.(చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)సంతోషంగా ఉంది: నిఖిల్కార్తికేయ 2కి నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు హీరో నిఖిల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ‘మన ‘కార్తికేయ 2’ జాతీయ అవార్డుకు ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఈ సినిమా విజయాన్ని అందుకోవడానికి, జాతీయ పురస్కారానికి ఎంపికవ్వడానికి కారణం చిత్ర బృందం. నిర్మాతలు, దర్శకుడు చందూ, హీరోయిన్ అనుపమ, డీవోపీ కార్తిక్ ఘట్టమనేని.. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని నిఖిల్ అన్నారు. తమ చిత్రానికి జాతీయ పురస్కారం రావడం పట్ల కార్తికేయ2 చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో కార్తికేయ మంచి వసూళ్లు సాధించడమే కాకుండా అవార్డులు కూడా రావడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. హైదరాబాద్ లోని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కార్యాలయం వద్ద దర్శకుడు చందు మొండేటి, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ , టీజీ విశ్వప్రసాద్ లు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. కార్తికేయ2 తాము ఆశించిన దానికంటే ఎక్కువే ఇచ్చిందని... జాతీయ పురస్కారానికి తమ చిత్రాన్ని ఎంపిక చేసిన ప్రధాని నరేంద్రమోదీ, నేషనల్ అవార్డు జ్యూరీ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్తికేయ3పై ప్రాథమిక ప్రకటన చేసిన దర్శకుడు చందు... స్క్రిప్ట్ వరకు తుది దశకు చేరిందన్నారు. -
జాతీయ అవార్డ్ గెలుచుకున్న సినిమాలు.. ఏయే ఓటీటీల్లో?
70 జాతీయ అవార్డులని కేంద్రం తాజాగా శుక్రవారం ప్రకటించింది. 2022 డిసెంబరు 31లోపు సెన్సార్ పూర్తయిన చిత్రాలకుగానూ పురస్కార విజేతలు ఎవరెవరనేది అనౌన్స్ చేశారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' మాత్రమే ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. మలయాళ, తమిళ సినిమాలదే పూర్తిగా ఆథిపత్యం. ఇంతకీ ఈ మూవీస్ అన్నీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల పూర్తి లిస్ట్)నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్- ఓటీటీఉత్తమ చిత్రంగా నిలిచిన మలయాళ సినిమా 'ఆట్టమ్'.. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టిని నిలబెట్టిన 'కాంతార'.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఉత్తమ నటిగా నిత్యా మీనన్ చేసిన 'తిరు' సన్ నెక్స్ట్లో, మానసి పరేఖ్ 'కచ్ ఎక్స్‌ప్రెస్' షీమారో మీ అనే ఓటీటీలో ఉంది.ప్రాంతీయ చిత్రాల విభాగంలో.. కార్తికేయ 2(తెలుగు) జీ5లో ఉంది. పొన్నియిన్ సెల్వన్-1 (తెలుగు-తమిళ) అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.సౌది వెళ్లక్క సీసీ 225య/2009 (మలయాళ) చిత్రం సోనీ లివ్‌లో ఉంది.వాల్వీ (మరాఠీ).. అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీల్లో ఉంది.కబేరి అంతర్జాన్ (బెంగాలీ).. జియో సినిమా ఓటీటీలో ఉంది.గుల్ మోహర్ (హిందీ).. హాట్ స్టార్‌లో ఉంది.ఉత్తమ దర్శకుడు విభాగంలో సూరజ్ బర్జాత్యాకి అవార్డు వచ్చిన 'ఊంచాయ్'.. జీ5లో ఉంది.విజువల్ ఎఫెక్ట్స్, ప్లే బ్యాక్ సింగర్ తదితర కేటగిరీల్లో విజేతగా నిలిచిన 'బ్రహ్మస్త్ర'.. హాట్‌స్టార్‌లో ఉంది.ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అవార్డ్ గెలిచిన 'కేజీఎఫ్ 2'.. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.ఉత్తమ మేకప్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో గెలిచిన బెంగాలీ మూవీ 'అపరాజితో'.. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.ఉత్తమ బాలనటుడిగా నిలిచిన శ్రీపాథ్ నటించిన 'మలికాపురమ్'.. హాట్‌స్టార్‌లో ఉంది.(ఇదీ చదవండి: 'తంగలాన్' సినిమా రివ్యూ) -
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను వెళ్లడించింది. ఈసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కన్నడ హీరో రిషబ్ శెట్టి (కాంతార) అందుకోనున్నాడు. అయితే, ఉత్తమ నటిగా నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఇద్దరికి సంయుక్తంగా దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆట్టమ్ (మలయాళం) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' నిలిచింది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 అవార్డు దక్కించుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్మొహర్ నిలిచింది.జాతీయ అవార్డ్ విజేతలు వీరేఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మోహర్) ఉత్తమ ప్రాంతీయ సినిమాలుఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలు ఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్)ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్) -
స్వయంభూలో ఎంట్రీ
‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు హీరోయిన్ నభా నటేష్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ఓ కథానాయికగా నటిస్తుండగా, నభా నటేష్ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో నభా నటేష్ గురువారం జాయిన్ అయిన విషయాన్ని ప్రకటించి, ఆమె పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘స్వయంభూ’ చిత్రంలో ఓ లెజెండరీ యోధుడిగా నిఖిల్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ట్రైనింగ్ తీసుకున్నారాయన. నభా నటేష్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఈ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఆమె మారిన విధానం అద్భుతం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్. -
టాలీవుడ్ యంగ్ హీరో సూపర్ హిట్ సిరీస్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 2014లో విడుదలైన కార్తికేయ మూవీతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. దీంతో నిఖిల్ ఈ సిరీస్‌లో మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న కార్తికేయ-3 ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 'సరికొత్త అడ్వెంచర్ సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో మీ ముందుకు రానున్నాం' తాజాగా పోస్ట్ పెట్టారు. దీంతో నిఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ - చందు కాంబోలో మరో అడ్వెంచర్ థ్రిల్లర్ చూసేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2తో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. కాగా.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రానున్న మూడో చిత్రంగా నిలవనుంది. 2014లో విడుదలైన కార్తికేయతో వీరి కాంబో తొలి విజయం అందుకుంది. కార్తికేయ- 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కాగా.. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తండేల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. Dr. Karthikeya In Search of a Brand new Adventure ... Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI — Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024 -
నిఖిల్ 'కార్తికేయ 3'కు ఆ నిర్మాతతో చిక్కులు రానున్నాయా..?
చందూ మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ నటించిన చిత్రం 'కార్తికేయ2' విడుదలై ఏడాది పూర్తి అయింది. అందుకు గుర్తుగా చిత్ర యూనిట్ తాజాగ పార్టీని ఏర్పాటు చేసింది. ఆందులో డైరెక్టర్ చందూ మొండేటితో పాటు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడంతో పార్ట్ 3 కూడా ఉండబోతుందనే వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై అఫిషీయల్‌గా కార్తికేయ3 కథ రెడీ చేశామని త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్ చందూ మొండేటి ప్రకటించారు. (ఇదీ చదవండి: 'భోళా శంకర్'పై చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్) ఈ ప్రకటనే వారికి ఇబ్బందులు తెచ్చాయని తెలుస్తోంది. 2014లో కార్తికేయ సినిమా విడుదలై అప్పుడు సూపర్ హిట్ అయింది. కానీ అప్పట్లో రిలీజ్ సమయంలో చిత్ర యూనిట్‌కు ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చాయట. ఆ సమయంలో వారికి 'భమ్ భోలేనాథ్' సినిమా నిర్మించిన సిరువూరి రాజేష్ వర్మ అనే నిర్మాత ఫైనాన్స్ చేసి రిలీజ్‌కు సాయం చేశారట. ఆప్పుడు ఆయన కార్తికేయ ఫ్రాంచైజ్ హక్కులు అగ్రీమెంట్స్ ద్వారా తీసుకున్నారట. (ఇదీ చదవండి: అందులో అర్ధ నగ్నంగానే నటించాను తప్పేంటి: టాప్ హీరోయిన్) కానీ కార్తికేయ 2 విడుదల సమయంలో నిఖిల్‌తో ఆయనకున్న రేలేషన్‌తో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా NOC ఇచ్చారట. అందుకు గాను ఆ సినిమాలో రాజేష్‌కు థాంక్స్ కార్డు కూడా వేశారు. తాజాగ కార్తికేయ 3 విషయంలో తనకు మాట మాత్రం చెప్పకుండా ప్రకటన చెయ్యడమే కాకుండా ఇంకో ప్రొడ్యూసర్‌తో మూవీ చెయ్యడానికి రెడీ అయిపోవడంతో రాజేష్ అభ్యంతరం తెలుపుతున్నాడట. తన ప్రమేయం లేకుండా ఈ ప్రాజెక్ట్‌పై ఎవరైనా ముందుకు వెళ్తే అన్ని లీగల్ నోటీసులు జారీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారట. -
సైమా అవార్డ్స్- 2023.. రాజమౌళి చిత్రానికి 11 నామినేషన్స్!
సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో అవార్డుల పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2023లో పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్ అయింది. అయితే అవార్డుల నామినేషన్స్‌లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్, ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 11 విభాగాల్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో 10 విభాగాల్లో నామినేషన్స్‌తో సీతారామం చిత్రం నిలిచింది. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన జగపతిబాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) తెలుగులో ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ కార్తికేయ-2, అడవి శేష్ మేజర్‌తో పాటు.. మరో బ్లాక్‌బస్టర్ మూవీ సీతారామం పోటీలో నిలిచాయి. తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్ పొన్నియిన్ సెల్వన్-1 చిత్రానికి దక్కించుకుంది. ఆ తర్వాత కమల్‌హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన విక్రమ్ 9 విభాగాల్లో నామినేషన్స్‌కు ఎంపికైంది . కన్నడలో రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కాంతార, యశ్ యాక్షన్ మూవీ కేజీయఫ్-2 చిత్రాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి. మలయాళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముటి నటించిన భీష్మ పర్వం చిత్రానికి 8 నామినేషన్స్ రాగా, టోవినో థామస్ థల్లుమాల మూవీకి ఏడు నామినేషన్స్ వచ్చాయి. కాగా.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్స్- 2023) ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?) #SIIMA2023 nominations are out. In Telugu RRR Directed by S.S Rajamouli Starring Jr.NTR & Ram Charan has 11 Nominations is leading while Sita Ramam Directed by Hanu Raghavapudi Starring Dulquer Salmaan & Mrunal Thakur with 10 Nominations is close Second. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/M3DsQ7btLQ — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Tamil Mani Ratnam’s Ponniyin Selvan:1 Starring Vikram, Trisha & Aishwarya Rai leads with 10 nominations while Lokesh Kanagaraj’s Vikram Starring Kamal Haasan, Vijay Sethupathi & Fahadh Faasil with 9 Nominations is close Second. #NEXASIIMA… pic.twitter.com/sXAxDz7cuk — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Kannada Kantara Directed by and Starring Rishab Shetty with 11 Nominations, while KGF Chapter 2 Directed by Prashanth Neel, Starring Yash with 11 Nominations are in top position. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/hWh4ZDrw0z — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Malayalam Bheeshma Parvam Directed by Amal Neerad Starring Mammootty is leading with 8 Nominations while Thallumaala Directed by Khalid Rahman & Starring Tovino Thomas and Kalyani Priyadarshan with 7 Nominations is close Second #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/Va8wuh2PRW — SIIMA (@siima) August 1, 2023 -
4 పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న నిఖిల్
-
ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్
-
కార్తికేయ 2 బ్లాక్‌బస్టర్.. హీరో నిఖిల్‌కు అరుదైన అవార్డు
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ 2 తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా మంచి విజయం అందుకుంది. కార్తికేయ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 121 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఉత్తరాది, దక్షిణాదిలో అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది కార్తికేయ. దీంతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. కార్తికేయ-2 చిత్రం టీవీ ప్రీమియర్, OTT స్ట్రీమింగ్‌లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రశంసలు, వసూళ్లు మాత్రమే కాకుండా అవార్డుల విభాగంలోనూ నిఖిల్ తన సత్తాను నిరూపించుకున్నాడు. తాజాగా కార్తికేయ చిత్రంతో, ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికవ్వడం విశేషం. కార్తికేయ - 2 చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించాయి. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంతో చందు మొండేటి కృష్ణ తత్వాన్ని, మహిమను చెప్పడంతో పాటు, పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి అంశం శాస్త్రీయమైనదే నని బలంగా చెప్పాడు. మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. కాగా నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ స్పైతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా 5 భాషల్లో రూపొందుతుంది. -
రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిన అనుపమ పరమేశ్వరన్
తమిళసినిమా: డిమాండ్ అండ్ సప్లై అనేది ఎక్కడైనా అప్లై అవుతుంది. ఇక చిత్ర పరిశ్రమ గురించి చెప్పాలా.. మొదట్లో ఒక్కచాన్స్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడడం, ఆ ఒక్క అవకాశం వచ్చినా తరువాత విజయం కోసం ఆరాటపడడం, అదృష్టం కలిసొచ్చి ఆమెకు ఒక హిట్ వచ్చేస్తే, ఆ తరువాత పారితోషికం పెంచేయడం ఇలా చైన్‌లా జరిగిపోతాయి. ఇది ఇక్కడ ఏ ఒక్కరి గురించి కాదు. అంతా ఇంతే. ఇందుకు అనుపమ పరమేశ్వరన్ అతీతం కాదు. ఆమె కూడా అంతే. ఇప్పటివరకు ఈమె కెరియర్లో ఓ మోస్తరు విజయాలనే చూసింది. మధ్యలో అవకాశాలు కూడా వెన్ను చూపాయి. అలాంటిది తెలుగులో నిఖిల్ సరసన నటించిన కార్తికేయ–2 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఇక రీసెంట్గా అదే హీరోతో జతకట్టిన 18 పేజెస్ చిత్రం కూడా హిట్ టాక్‌ను కొట్టేసింది. ఇంతకంటే ఏం కావాలి మంచి తరుణం మించి పోకూడదనుకుందేమో. తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందని సినీ వర్గాల టాక్. ఎంత అంటే ఇప్పటివరకు రూ.60 లక్షలు పుచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు దానికి రెట్టింపు అంటే రూ.1.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయినా అనుపమ కావాలంటున్నారు నిర్మాతలు. ఇది వారికి కిక్కు అనుపమకు లక్కు అని చెప్పక తప్పదు. అయితే ఈ అమ్మడికి తమిళంలో మాత్రం ఇంకా అలాంటి లక్కు రాలేదనే చెప్పాలి. మొదట్లో ఎక్కువగా ధనుష్ సరసన నటింన కోడి చిత్రం పరవాలేదు అనిపించిన ఆ క్రెడిట్‌ను నటుడు ధనుష్, నటి త్రిష కొట్టుకు పోయారు. ఈమధ్య నటుడు అధర్వతో రొవన్స్ చేసిన తల్లి పోగాదే చిత్రం తెరపైకి వచ్చి పోయింది. అంతే దీంతో ప్రస్తుతం జయంరవి సరసన రెండవ హీరోయిన్గా నటిస్తున్న సైరన్ చిత్రంపైనే అనుపమ పరమేశ్వరన్ ఆశలు పెట్టుకుంది. మరి తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు లక్కు వర్కౌట్ అవుతుందా లేదా వేచి చూడాల్సిందే. -
కార్తికేయ 2 ఫస్ట్ టైమ్ టీఆర్పీ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ వద్ద కార్తికేయ 2 సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే! అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇటీవల బుల్లితెరలోనూ ప్రసారమైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా జీ తెలుగులో ప్రసారం కాగా 7.88 రేటింగ్ అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో 'కార్తికేయ 2'కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సూపర్‌నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. చదవండి: హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది? ఓటీటీలో ల్యాండయిన జిన్నా మూవీ -
కాంతార మరో రికార్డ్.. కార్తికేయ-2ను అధిగమించి..!
రిషబ్‌శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడ్‌లోనూ రిలీజైన ఈ సినిమా మరో రికార్డును సాధించింది. హిందీలో డబ్బింగ్ అయిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఏడో చిత్రంగా నిలిచింది. బాలీవుడ్లో ఇప్పటి దాకా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మొదటి రెండు వారాల కంటే.. మూడో వారం అత్యధిక కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది విడుదలైన డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా 'కాంతార' నిలిచింది. టాలీవుడ్ హీరో నిఖిల్ చిత్రం 'కార్తికేయ2' కలెక్షన్ల రికార్డును అధిగమించింది. ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ‘బాహుబలి2’ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత ‘కేజీయఫ్2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘2.ఓ’, ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలు ఉన్నాయి. అన్ని భాషల్లో కలిపి ‘కాంతార’ రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. #Kantara *#Hindi version*… ⭐️ #Baahubali2, #KGF2, #RRR, #2Point0, #Baahubali, #Pushpa… #Kantara is now the 7th highest grossing *dubbed* #Hindi film ⭐️ Crosses ₹ 50 cr mark [Day 21] ⭐️ Week 3 is higher than Week 1 and Week 2 pic.twitter.com/82lZR0H30j — taran adarsh (@taran_adarsh) November 4, 2022 -
గ్రామాన్ని దత్తత తీసుకున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత
ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాల దర్శకుడు అభిషేక్ అగర్వాల్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. కోవిడ్ సమయంలో చాలా మంది పేదలకు సహాయం చేసిన ఆయన.. తాజాగా మరో అడుగు ముందుకేశాడు.గత రెండు బ్లాక్బస్టర్లతో మంచి లాభాలను ఆర్జించిన ఈ యువ నిర్మాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు. ఈ గ్రామం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన్మస్థలం కావడం గమనార్హం. అభిషేక్ అగర్వాల్- మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. వివిధ ఈవెంట్లు , ఫంక్షన్లలో చాలాసార్లు వీరు కలిసి కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. -
కార్తికేయ 2 హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్: పరుచూరి గోపాలకృష్ణ
కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రళయాన్నే సృష్టించింది. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు 13న రిలీజైన ఈ మూవీ రూ.130 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాలోని బలాబలాలను విశ్లేషించాడు పరుచూరి గోపాలకృష్ణ. 'కష్టేఫలి అన్న సూత్రం నిఖిల్ విషయంలో నిరూపితమైంది. కార్తికేయ 2.. బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది. చందూ మొండేటి... ఈ జానపద కథను సాంఘిక కథగా మలిచి రాసినట్లు అనిపించింది. కథను నమ్మితే ఆ కథ ఎప్పుడూ మనల్ని మోసం చేయదు. సినిమాలో తల్లి సెంటిమెంట్‌ను వాడుకున్నారు. ఇద్దరు కమెడియన్స్‌ను, హీరోయిన్ను హీరో పక్కన పెట్టుకున్నాడు. సామాన్యంగా ఇలాంటి సినిమాల్లో ప్రేమ మిస్ అవుతుంది. తెలివిగా చందూ మొండేటిగారు ఏం చేశారంటే ప్రతి ఫ్రేములోనూ హీరో హీరోయిన్ ఉండేలా జాగ్రత్తగా రాసుకున్నారు. మధ్యలో హీరోయిన్.. హీరోకు ఝలక్ ఇచ్చి వెళ్లిపోయినట్లు చీట్ చేసినా మళ్లీ తిరిగొచ్చినట్లు చేశారు. క్లైమాక్స్‌లో హీరో పాముల మధ్యలో నడుచుకుంటూ వెళ్లి హంసను తీసుకువచ్చి మురళీకి తగిలించి కృష్ణుడి చేతిలో పెట్టేవరకు కూడా అద్భుతమైన స్క్రీన్‌ప్లే రాశారు చందు మొండేటి. నాలాగా చాలా సినిమాలు రాసిన కొద్దిమంది తప్ప మామూలు ప్రేక్షకులు దాన్ని క్యాచ్ చేయలేరు. చివర్లో కార్తికేయ 2కు సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. చందూ మొండేటి అత్యంత సాహసం చేశారు. అతడి కెరీర్లో భారీ మొత్తంలో ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఎవరికీ అమ్ముడుపోకుండా ప్రపంచానికి మంచి జరగాలనే కోరికతో దీన్ని ముగించారు. స్క్రీన్‌ప్లేలో ఎలాంటి దోషం లేదు. కావాలని కామెడీ సీన్స్ చొప్పించలేదు. కార్తికేయ 2ను కోట్లాది మంది చూడటం అంటే మామూలు విషయం కాదు. హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో నాగార్జున ఘోస్ట్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జైలుకు వెళ్లే డిజాస్టర్ కంటెస్టెంట్ ఎవరంటే? -
అమ్మ కోసం అయినా ఆ సినిమా చేస్తా: నిఖిల్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. ఆయన కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘కార్తికేయ 2’. ఈ ఏడాది ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్తికేయ 3పై నిఖిల్ స్పందించాడు. (చదవండి: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న బాలయ్య చిన్న కూతురు) తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ముందు కార్తికేయ సినిమా తీస్తున్నప్పుడు సీక్వెల్ అనుకోలేదు. కానీ ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 ఎప్పుడు తీస్తారు అని అడిగారు. అంటే ప్రేక్షకులు ఆ సినిమాను అంతగా కోరుకున్నారని అర్థమైంది. ఇప్పుడు కార్తికేయ 3 గురించి అడుగుతున్నారు. ఆ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఒకవేళ నేను కార్తికేయ 3 చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ మా అమ్మ మాత్రం నన్ను వదలదు. అమ్మ కోసం అయినా ఆ సినిమా చేయాలి’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు విషయంపై మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వస్తే బాగుంటుంది. కానీ ప్రతి సినిమా ఆస్కార్ కోసం తీయరు. ఇది కేవలం సర్టిఫికేట్ కాదు. మాకు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు అన్నింటికంటే ముఖ్యం. అవే గొప్పవి ’అన్నారు. -
ఓటీటీని షేక్ చేస్తున్న కార్తికేయ 2 మూవీ!
టాలీవుడ్లో రిలీజైన చిన్న చిత్రం కార్తికేయ 2 ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే! నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగులోనే కాదు హిందీలోనూ అత్యధిక వసూళ్లు సాధించి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 13న విడుదలై కొన్ని వారాలపాటు థియేటర్లలో జైత్రయాత్ర నడిపింది. అక్కడ కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లోకి అందుబాటులోకి వచ్చింది. అప్పటిదాకా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన కార్తికేయ 2 ప్రస్తుతం ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 48 గంటల్లోనే 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓటీటీలో దుమ్మురేపుతున్న కార్తికేయ 2 విజృంభణను జీ5 అధికారికంగా ట్విటర్లో వెల్లడించింది. Did you hear this?? 100 Crore + streaming minutes in just 48 hours!! You love it❤️ We love youu!!❤️ Go WATCH #Karthikeya2OnZee5 again!https://t.co/gbvSmBkS5F@actor_Nikhil@anupamahere@Actorysr@harshachemudu@AnupamPKher#karthikeya2#ChoostuneUndipotaaru pic.twitter.com/HUdhjKKoVY — ZEE5 Telugu (@ZEE5Telugu) October 7, 2022 చదవండి: ఆ హీరోతో కలిసి పని చేస్తే ఇక అంతే సంగతులట! ఓటీటీలో అల్లూరి, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
కార్తికేయ- 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లోనూ అత్యధిక వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా `కార్తికేయ 2` నిలిచింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ కార్తికేయ2 డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. -
కార్తికేయ-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్
కార్తికేయ-2 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న హీరో నిఖిల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటిన ఈ సినిమా కంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి.. మొత్తం 125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. నార్త్ ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కార్తికేయ-3 కోసం అప్పుడే అందరిలోనూ ఆసక్తి మొదలయ్యింది. తాజాఆగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కార్తికేయ-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ మొదలుపడతామని, అంతేకాకుండా కార్తికేయ-3ని 3Dలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. మరి ఈ సినిమా ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. -
Karthikeya 2: కేరళలో కార్తీకేయ-2 జోడి.. మలయాళంలోనూ గ్రాండ్ రిలీజ్..!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని సాధించింది. బాలీవుడ్లో ఈ మూవీ కలెక్షన్లతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాను మళయాళంలోనూ విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. మూవీ ప్రమోషన్లలో భాగంగా అఖిల్, అనుపమ కేరళలో సందడి చేశారు. తాజాగా ఈ జంట కొచ్చిన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సందడి చేసింది. ఈనెల 23న మలయాళంలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. (చదవండి: Karthikeya 2 Movie-Nikhil: శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం) కలియుగ సృష్టి రహస్యాలను పొందుపరచిన కృష్ణుని కంకణాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే యువకుని కథతో దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కీలకమైన అతిథిపాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ ఈ మూవీలో నటించారు. ఈ చిత్రానికి నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ వ్యవహరించారు. -
ఆ రెండు సినిమాల ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్.. స్పందించిన జీ5..!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగష్టులో విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని అప్డేట్ల కోసం వెతుకున్నారు. అయితే ‘కార్తికేయ2’ను సైతం దసరా కానుకగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబరు మొదటివారం స్ట్రీమింగ్కు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిన్న చిత్రంగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించింది. రూ.100 కోట్ల క్లబ్‌ను దాటేసింది. (చదవండి: మల్టీప్లెక్స్‌ల్లో 75 రూపాయలకే సినిమా హ్యపీగా చూసేయండి..) ఇక ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం సాధించిన మరో చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం కల్యాణ్‌రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కోసం ఓటీటీలో ఎప్పుడోస్తుందా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదలపై జీ5 స్పందించింది. ‘మీ ఉత్సాహానికి సంతోషంగా ఉంది. దయచేసి వేచి ఉండండి. మరిన్ని వివరాలకు మా సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించండి’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న ప్రచారం చూస్తే కల్యాణ్‌రామ్ ‘బింబిసార’ సెప్టెంబర్ 23న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
కలెక్షన్లలో కార్తీకేయ 2 అదుర్స్.. బాలీవుడ్‌లోనూ తగ్గేదేలే
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ బాలీవుడ్‌లోనూ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ ఏడాది టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం నెల రోజుల్లోనే 31 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సినిమా వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా సక్సెస్ ఊహించని రీతిలో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ నాలుగున్నర కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో నిఖిల్ బాలీవుడ్ సినిమాలు చేయకపోయినా పెద్దమొత్తంలో కలెక్షన్లు రావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నిఖిల్ జంటగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాతో నటించింది. (చదవండి: Karthikeya 2 Movie-Nikhil: శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం) ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని అందుకుంది. తెలుగులో దాదాపు అరవై కోట్లకుపైగా కలెక్షన్లతో విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కలియుగ సృష్టి రహస్యాలను పొందుపరిచిన కృష్ణుడి కంకణాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే ఓ యువకుడి కథతో దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. కీలకమైన అతిథి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కనువిందు చేశారు. -
ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే..
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం అందుకున్న లేటెస్ట్ చిత్రం ‘కార్తికేయ 2’. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌లు జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది. రిలీజైన తొలి షో నుంచే ఈమూవీ హిట్‌టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలకు ఆదరణ కురువైన నేపథ్యంలో తెలుగు చిన్న సినిమా అయిన కార్తికేయ 2 బి-టౌన్ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ఇప్పటికీ థియేటర్లో కార్తీకేయ 2 సందడి చేస్తోంది. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా రూ. 60 కోట్లు షేర్ చేసి రికార్డు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ చేసింది. బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. కాగా ఏ చిత్రంమైన థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజుల తర్వాతే ఓటీటీకి వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి ఈ మూవీ థియేటర్లో విడుదలైన నెల రోజులు కావోస్తున్న నేపథ్యంలో కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్‌కు ముస్తాబవుతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని వినికిడి. ఇక త్వరలోనే ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుందట. మరోవైపు సెప్టెంబర్ 30 నుంచే కార్తికేయ 2 అన్ని భాషల్లో అందుబాటులోకి రానుందని కూడా అంటున్నాయి సినీవర్గాలు. దీనిపై జీ5 త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని సమాచారం. కాగా టి.జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు. #karthikeya2 ott update#nikhil #nikhilsiddhartha #anupamaparmeswaran #anupamkher #adithya #superstar #youngtiger #powerstar #megastar #megapowerstar #rebelastar #stylishstar #naturalstar pic.twitter.com/NxR8MSxFRO — Aniket Nikam Creations (@ANikamCreations) September 10, 2022 -
కర్నూలులో ‘కార్తికేయ’ సందడి (ఫొటోలు)
-
అలాంటి సినిమాలు మాత్రం చేయను: హీరోయిన్ అనుపమ
'ప్రేమమ్' అనే మలయాళ చిత్రంతో మాలీవుడ్‌నే కాదు దక్షిణాది సినిమాను ఆకట్టుకున్న నటి అనుపమా పరమేశ్వరన్. ముఖ్యంగా టాలీవుడ్ ఈ అమ్మడిని బాగానే ఆదరిస్తోంది. కోలీవుడ్‌కు ధనుష్‌కు జంటగా కొడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం సక్సెస్ అయినా ఎందుకనో ఇక్కడ ఈ చిన్నదాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత నటించిన నటుడు అధర్వ సరసన తల్లిపోగాదే చిత్రంలో నటించింది. అదీ ఆమె కేరీర్‌కు పెద్దగా ఉపయోగ పడలేదు. ఇక్కడే కాదు ఇటీవల టాలీవుడ్‌లోనూ అనుపమ నటించిన చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో అవకాశాలు తగ్గాయి. అలాంటి పరిస్థితుల్లో నిఖిల్‌తో నటించిన కార్తీకేయ– 2 చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మళ్లీ అనుపమ పరమేశ్వరన్ పేరు వినిపిస్తోంది. అంతేకాదు కార్తీకేయ 2 చిత్రం బాలీవుడ్‌లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తుండడంతో ఈ అమ్మడికీ అక్కడ అవకాశాలు వస్తున్నాయట. త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ సినిమాల్లో నటించడానికి తనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా హీరోలను పొగుడుతూ, వారి చుట్టూ తిరిగే పాత్రల్లో నటించనని చెప్పింది. తాను నటించే చిత్రాల్లో కథే హీరోగా ఉండాలని చెప్పింది. అలాంటి చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటున్నానని స్పష్టం చేసింది.. మలయాళ చిత్ర పరిశ్రమలో పరిమితుల్లో చిత్రాలను నిర్మిస్తున్నారని, భారీ తనానికి పోకుండా తక్కువ బడ్జెట్లో చిత్రాలను చేస్తున్నారని చెప్పింది. అయితే అక్కడ అద్భుతమైన కథా చిత్రాలు వస్తున్నాయని చెప్పింది. ఇక తెలుగులో భారీ చిత్రాలు నిర్మిస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఓటీటీలు రావడంతో సినిమాలను రీమేక్ చేయకుండానే ప్రేక్షకులు అన్ని భాషా చిత్రాలను చూస్తున్నారని అభిప్రాయపడింది. ఇక నటిగా తనకు మలయాళం, తెలుగు, తమిళం అనే బేధం లేదని, నటిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అన్నట్టు ఈ బ్యూటీ ఇటీవల బాగా వర్కౌట్స్ చేసి చాలా స్లిమ్‌గా తయారైంది. -
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా సోకింది. ఇటీవలె కార్తికేయ-2 ప్రమోషన్స్‌లో భాగంగా చాలా సార్త్, సౌత్ సహా చాలా ప్రాంతాలు చుట్టేసింది. ఈ క్రమంలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు బయటపడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసోలేషన్లోకి వెళ్లిందట. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తికేయ-2 సినిమాతో భారీ హిట్టు కొట్టిన అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. నిఖిల్‌తో ఆమె నటించిన 18 పేజేస్ చిత్రం ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కార్తికేయ-2తో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి హిట్ పెయిర్‌గా నిలుస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
వంద కోట్ల క్లబ్లో చేరే దిశగా కార్తికేయ 2
హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఆగస్టు 13న రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్లో, బాలీవుడ్లో ఓ రేంజ్లో దూసుకుపోతోంది. రోజులు గడిచేకోద్దీ వసూళ్లు తగ్గుతాయి. కానీ ఈ సినిమా మాత్రం ఏరోజుకారోజు అధిక వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్లో చేరేట్లు కనిపిస్తోంది. Thank You🙏🏽 Indian Movie Lovers ki 🙏🏽🙏🏽🙏🏽🔥 #Karthikeya2 #Karthikeya2Hindi pic.twitter.com/CL7a5Uuthj — Nikhil Siddhartha (@actor_Nikhil) August 22, 2022 #Karthikeya2Hindi growth is outstanding. 2nd week numbers- Fri: ₹2.46 cr Sat: ₹3.04 cr Sun: ₹4.07 cr Total: ₹15.32 cr 🔥 At the same time, a film starring Tapsee and directed by Anurag Kashyap #Dobaaraa gets Fri: ₹72 lacs Sat: ₹1.02 cr Sun: ₹1.24 cr Total: ₹2.98 cr pic.twitter.com/vsMVigH3Ii — idlebrain jeevi (@idlebrainjeevi) August 22, 2022 చదవండి: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్, ఐశ్వర్య.. ఫొటో వైరల్ నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే -
కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక
ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలైన ‘కార్తికేయ 2’ చిత్రం ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ముఖ్యంగా బి-టౌన్ థియేటర్లపై ఈ మూవీ దండయాత్ర చేస్తోంది. అక్కడి స్టార్ హీరో సినిమాలను సైతం వెనక్కి నెట్టి భారీగా వసూళ్లు చేస్తోంది. కేవలం 50 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం అక్కడ మూడు వేలకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సినిమాలకు ఆదరణ లేకపోవడంతో థియేటర్ నిర్వాహకులు ఈ సినిమాలు ఆపేసి కార్తికేయ 2ను రన్ చేస్తున్నారు. మొత్తంగా వారం రోజులు గడిచేసరికి ఈ మూవీ రూ.60.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన కార్తికేయ 2 ఊహించని బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో సినీ విశ్లేషకులు, ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. తాజాగా కార్తికేయ 2 భారీ విజయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2 సినిమాల కంటే కార్తికేయ 2 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు. ‘హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రెండవ శుక్రవారం రోజున అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే డబుల్ కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2 కంటే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీంతో బాలీవుడ్ హీరోకలు చురక పెడుతూ వర్మ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కాగా దర్శకుడు చందూ ముండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈచిత్రంలో వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి కీ రోల్ పోషించారు. కాల భైరవ సంగీతం అందించాడు. . @actor_nikhil ‘s #karthikeya2 produced by @abhishekofficl on 2nd Friday doing DOUBLE COLLECTIONS of #AamirKhan ‘s #LSJ and @AkshayKumar ‘s #RakshaBandhan proves on ROI,K2 is BIGGER BLOCKBUSTER than @ssrajamouli ‘s #RRR and @Prashant_neel ‘s #KGF2 ..CONGRATS to @chandoomondeti — Ram Gopal Varma (@RGVzoomin) August 20, 2022 -
కృష్ణాష్టమిని క్యాష్ చేసుకున్న కార్తికేయ 2, కలెక్షన్స్ ఎంతంటే?
దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర.. అప్పుడెప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇది. దీన్ని కొంచెం అటూఇటుగా మార్చి దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద దండయాత్ర.. చెప్పుకోవాల్సి వస్తోందిప్పుడు. అలా ఉంది సౌత్ జోరు. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమాలు హిందీ బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించాయి. ఇటీవలే వచ్చిన మీడియం రేంజ్ మూవీ కార్తికేయ 2 కూడా బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తుండటం విశేషం. కేవలం 50 థియేటర్లతో మొదలైన ఈ చిత్రం ఇప్పుడక్కడ మూడు వేలకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే మామూలు విషయం కాదు. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సినిమాలకు ఆదరణ లేకపోవడంతో థియేటర్ నిర్వాహకులు ఈ పెద్ద సినిమాలు తీసేసి కార్తికేయ 2ను రన్ చేస్తున్నారు. మొత్తంగా వారం రోజులు గడిచేసరికి ఈ మూవీ రూ.60.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కృష్ణాష్టమిని ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక హీరో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. ఆగస్టు 13న రిలీజైన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. 🙏🏽🙏🏽🙏🏽#Karthikeya2 #Karthikeya2Hindi #KrishnaIsTruth pic.twitter.com/npHXzEG4ga — Nikhil Siddhartha (@actor_Nikhil) August 20, 2022 #Karthikeya2 #Hindi emerges first choice of moviegoers... Collects more than #LSC and #RB *yesterday* [Fri]... Mass pockets/single screens are super-strong... Will continue to dominate over the weekend... [Week 2] Fri 2.46 cr. Total: ₹ 8.21 cr. #India biz. HINDI version. pic.twitter.com/E6cKGuG6b8 — taran adarsh (@taran_adarsh) August 20, 2022 చదవండి: హీరో వరుణ్‌తేజ్‌తో రిలేషన్.. నోరు విప్పిన అందాల రాక్షసి అన్ని వారాల తర్వాతే ఓటీటీలోకి రానున్న లైగర్! -
శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. హిందీలో తొలిరోజు కేవలం 50 థియేటర్స్‌లో విడుదల చేస్తే అది ఆరో రోజు వచ్చేసరికి 1000 థియేటర్స్‌లలో విజయవంతంగా ఆడుతోంది. ఇక ఈమూవీ సక్సెస్ నేపథ్యంలో నేడు(శనివారం) హీరో నిఖిల్, కార్తికేయ 2 టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన ఉదయం వీఐపీ దర్శన సమయంలో హీరో నిఖిల్‌తో పాటు డైరెక్టర్ చందు మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఇతర టీం సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులకు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కార్తికేయ 2 మంచి విజయం సాధించడంతో స్వామివారిని దర్శించుకున్నామని మూవీ టీం పేర్కొంది. ఇక నిఖిల్ మాట్లాడుతూ.. ‘కార్తికేయ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా విజయవంతం కావడంతో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాం’ అని తెలిపాడు. Went, Thanked and took the blessings of Tirumala Venkateshwara Swamy for bestowing team #Karthikeya2 with this Success 🙏🏽 @AbhishekOfficl @vishwaprasadtg @Actorysr @chandoomondeti @MayankOfficl @sahisuresh #Karthikeya2Hindi pic.twitter.com/lDCNNXogFf — Nikhil Siddhartha (@actor_Nikhil) August 20, 2022 -
బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కార్తికేయ 2
బాలీవుడ్ స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్'.. రెండూ ఆగస్టు 11న రిలీజైన పెద్ద సినిమాలు. వీటి మధ్య పోటీ ఏమో కానీ వీటితో పోటీపడేందుకు ఆగస్టు 13న థియేటర్లలో రిలీజైంది కార్తికేయ 2. హిందీలో తొలిరోజు కేవలం 50 థియేటర్స్‌లో విడుదల చేస్తే అది ఆరో రోజు వచ్చేసరికి 1000 థియేటర్స్‌లలో విజయవంతంగా ఆడుతోంది. భాష అనే బారికేడ్లను దాటుకుని ఘన విజయం సాధించింది. నేడు కృష్ణాష్టమి సందర్భంగా స్క్రీన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కార్తికేయ 2 బాలీవుడ్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇద్దరు బడా హీరోల సినిమాలను తొక్కేసి మరీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు సినిమా సత్తాను చాటిన కార్తికేయ 2 చిత్రయూనిట్‌పై ప్రేక్షకులు, సినీప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన షంషేరా.. ఎక్కడంటే? -
కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ కొట్టిన డబ్బింగ్ కంపెనీ!
పోస్ట్ ప్రో (Post Pro) ఒక పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ. ఈ కంపెనీని వసంత్ స్థాపించారు. పోస్ట్ ప్రో కంపెనీలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ (ఆల్ లాంగ్వేజెస్ డబ్బింగ్) జరిగిన మొదటి పాన్ ఇండియా సినిమా కార్తికేయ 2. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించినప్పుడు మన నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని భాషల అనువాదాలు ఏకకాలంలో హైదరాబాద్‌లో జరిగేటట్లుగా పోస్ట్ ప్రో కంపెనీని డిజైన్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ కళాకారులను, రచయితలను హైదరాబాద్‌కు రప్పించి నిర్మాతల సౌలభ్యం కోసం కార్తికేయ 2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. దీనివల్ల నిర్మాతకు బడ్జెట్ కంట్రోల్లో ఉండడమే కాకుండా డైరెక్టర్ తన సినిమా అనువాద కార్యక్రమాలను రోజు చూసుకొని అవసరమైన మార్పులు చేసుకోనే వీలు ఉంటుంది, అలాగే చాలా సమయం ఆదా అవుతుంది. కార్తికేయ 2 సినిమాను ఇతర భాషల్లో అనువదించే అవకాశాన్ని ఎంతో నమ్మకంతో పోస్ట్ ప్రో (Post Pro) కంపెనీకి అప్పగించిన నిర్మాతలు టీ. జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్, దర్శకుడు చెందు మొండేటి, హీరో నిఖిల్ సిద్ధార్థ్‌కు వసంత్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రో కంపెనీ పలు భారీ సినిమాలను అనువదించే పనిలో ఉంది. చదవండి: ప్రియుడు మరణించాక కొరియోగ్రాఫర్‌తో డేటింగ్, స్పందించిన నటి థియేటర్, మల్టీప్లెక్స్‌లో టికెట్ రేట్లు తగ్గిస్తాం -
కార్తికేయ 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. మంచి విజయం సాధించిన కార్తికేయకు సీక్వెల్‌గా తెరకెక్కిందీ మూవీ. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలోనూ విజయవంతంగా ఆడుతోందీ చిత్రం. లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ సినిమాలను వెనక్కు నెట్టి కార్తికేయ 2 హౌస్‌ఫుల్ రన్‌తో జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటికే డబుల్ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేస్తుండటం విశేషం. ఇక ఐదురోజుల్లోనే రూ.38 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్ కొల్లగొట్టేదిశగా పయనిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న కార్తికేయ 2 ఇప్పుడప్పుడే ఓటీటీలో వచ్చేలా కనిపించడం లేదు. సుమారు 6 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. #Karthikeya2 [#Hindi] is akin to sunshine in an otherwise gloomy scenario... Day-wise growth is an eye-opener... Sat 7 lacs, Sun 28 lacs, Mon 1.10 cr [holiday], Tue 1.28 cr [partial holiday]. Total: ₹ 2.73 cr. #India biz. HINDI version. pic.twitter.com/sij41RTnS2 — taran adarsh (@taran_adarsh) August 17, 2022 Overseas #Karthikeya2 has Crossed 700k $ dollars and Racing Towards 1 Million… These are the USA THEATRES LIST … plz catch #Karthikeya2 in theatres and do spread the word… 🙏🏽🙏🏽🙏🏽🔥🔥🔥love u all for this terrific response ❤️ pic.twitter.com/4pmEcOrrLn — Nikhil Siddhartha (@actor_Nikhil) August 18, 2022 చదవండి: ఎట్టకేలకు కియారాతో డేటింగ్‌పై నోరు విప్పిన సిద్ధార్థ్, ఏమన్నాడంటే.. భారీ ఆఫర్‌ను వదులుకున్నా.. ఎమోషనల్ అయిన ఛార్మి -
ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు
యంగ్ హీరో నిఖిల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ విడుదలైన తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక కార్తీకేయ-2 మంచి విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. చదవండి: స్పెయిన్‌లో జెండా ఎగురవేసిన నయనతార ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ తాను ఆనందంగా లేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నాకేప్పుడు కూడా స్టేజ్ మీద ఇంత టెన్షన్ ఉండదు. ఈ రోజున స్టేజ్ పైకి వస్తుండగానే షివరింగ్ మొదలైంది. సినిమా హిట్ అయింది కదా.. నువ్వెందుకు హ్యాపీగా లేవని నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఈ సినిమా విజయం సాధించినప్పటికి కార్తీకేయ-2 జర్నీ అయిపోయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది. చదవండి: రీ-రిలీజ్‌కు ముస్తాబవుతున్న చిరు, పవన్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు! ఆ బాధవల్లే నేను ఈ హిట్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు.. నన్ను భరించినందుకు చందూ మొండేటి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, వాళ్ల వరకు ఈ సినిమాను తీసుకెళ్లిన మీడియాకు కృతజ్ఞతలు’ తెలిపింది. ఇక హీరో నిఖిల్ మాట్లాడుతూ.. కార్తీకేయ-2 ఇంతటి విజయం సాధిస్తుందని మేం ఊహించలేదు. అంతట హౌజ్‌ఫుల్స్ పడుతున్నాయి. పూర్తిగా మౌత్ టాక్‌తోనే సినిమా జనాల్లో ఆదరణ దక్కించుకుంటోంది’ అని అన్నాడు. -
50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్
Allu Aravind Speech In Karthikeya 2 Success Meet: క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. మంచి విజయం సాధించిన 'కార్తికేయక'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13న థియేటర్స్‌లలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్‌లలో విడుదల చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయింది. ప్రస్తుతం 700 థియేటర్స్‌లలో ఆడుతుంది. అంటే ఇవాళ భాష అనే బారికేడ్లను దాటుకొని ప్రజల గుండెల్లోకి వెళ్లింది అంటే సినిమాలో సత్తా లేకుంటే అలా జరగదు కదా. ఇలా అన్ని థియేటర్స్‌లలో ఆడదు కదా. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి'' అని తెలిపారు. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్, అనుపమ, టెక్నీకల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అని చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ ''ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు'' అని హీరో నిఖిల్ తెలిపాడు. ''సినిమా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అందరూ కొత్త యాక్టర్స్ లా చాలా బాగా నటించారు. వీరందరికీ ఇది 2.0 అనుకోవచ్చు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను'' అని దర్శకుడు శ్రీ వాస్ పేర్కొన్నాడు. ''మా చిత్ర నిర్మాతల సహకారం మరువలేనిది. నాకింత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ చందు మొండేటి తెలిపాడు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ సిల్క్ స్మిత బయోపిక్కు రానున్న సీక్వెల్.. ఈసారి ఏ హీరోయిన్? బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
వ్యూస్ కోసం అలా రాసి మమ్మల్ని బలిపశుల్ని చెయ్యొద్దు: దిల్‌రాజు ఎమోషనల్
టాలీవుడ్ నిర్మాతలంతా యూనిటీగా ఉంటామని, తమ మధ్య ఎప్పుడైనా ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంటుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. వ్యూస్ కోసమో, లేదా క్లిక్ కోసం తప్పుడు వార్తలు రాస్తూ ఇండస్ట్రీ వాళ్లని బలిపశువు చేయొద్దని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్తికేయ 2 సక్సెస్ మీట్లో దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల తనపై వచ్చిన పుకార్లపై స్పందించాడు. ‘కార్తికేయ2 సినిమా రిలీజ్‌కు ముందు చాలా సార్లు నిఖిల్ నాతో మాట్లాడారు. జులై 8న ‘థాంక్యూ’చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ కుదర్లేదు. దీంతో అదే నెల 22న మా సినిమాను విడుదల చేయాలని భావించాం. ఇదే విషయాన్ని కార్తికేయ2 నిర్మాతల్లో ఒక్కరైన వివేక్‌తో చెప్పాను. ‘మీరు అల్రెడీ జులై 22కు విడుదల చేస్తామని పోస్టర్ వేసుకున్నారు కదా.. మాకు ఏమైనా అవకాశం ఇస్తారా ’అని వివేక్ని అడిగాను. మా హీరో, డైరెక్టర్‌తో మాట్లాడి చెప్తా అన్నారు. (చదవండి: ‘కార్తికేయ 2’ సంచలనం.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!) తర్వాత ఒక్కరోజు నిఖిల్, చందు నన్ను కలిసేందుకు మా ఇంటికి వచ్చారు. మాట్లాడుకొని సినిమా విడుదల తేదిని మార్చుకున్నాం. అక్కడితో సమస్య తీరింది. ఆగస్ట్ 12న కార్తికేయ2 విడుదల చేస్తామని అనుకున్నారు. నేను సపోర్ట్ ఇస్తానని చెప్పాను. ఇలా చర్చలు జరుతుండగానే కొందరు ‘దిల్ రాజు సినిమాను తొక్కేస్తున్నాడు’అంటూ ఏవేవో రాసేశారు. ఇక్కడ ఎవరు ఎవరి సినిమాని తొక్కరు. అది రాసేవాళ్లకి, చదివేవాళ్లకు ఉండాల్సిన మినిమం కామన్సెన్స్. ఇక్కడ ఎవరి సినిమా ఆడినా మేమంతా ఆనందపడతాం. ఒక్క సినిమా సక్సెస్ మాకు ఇంకో సినిమా తీయడానికి ఊపిరి పోస్తుంది. అంతేకానీ మాలో మాకు ఏదో క్రియేట్ చేస్తూ.. మీ క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం మమల్ని బలిపశుల్ని చేయ్యొద్దు. వాస్తవాలు రాయండి. తెలియకుంటే తెలుసుకొని చెప్పండి. సినిమా కోసం నేను ప్రాణం ఇస్తాను. పాడు చేయాలని ఎప్పుడూ అనుకోను. డబ్బులు నష్టపోయి కూడా సినిమాలు విడుదల చేశాను. ఇవన్నీ మీకు తెలియదు’అంటూ దిల్‌రాజు ఎమోషనల్‌గా మాట్లాడారు. -
‘కార్తికేయ 2’ సంచలనం.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
చిన్న సినిమా వచ్చి పెద్ద విజయం అందుకున్న చిత్రం ‘కార్తికేయ 2’. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 15.44 కోట్ల షేర్(26.50 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.11.54 కోట్ల షేర్, 17.80 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజుకి థియేటర్స్ సంఖ్య పెరుగుతుంది. దీంతో ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరుసగా.. 3.50 కోట్లు, 3.81 కోట్లు, 4.23 కోట్లు సాధించి, నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. (చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్, బేబీ బంప్‌తో సర్ప్రైజ్) సిని విశ్లేషకుల సమాచారం ప్రకారం... కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.13.30కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. మూడు రోజుల్లోనే ఆ మార్క్‌ని దాటేసి లాభాల బాట పట్టింది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో ఈ వీకెండ్ వరకు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్తికేయ2 మూడు రోజుల కలెక్షన్స్(ఏరియాల వారిగా) ► నైజాం -రూ.4.06 కోట్లు ► సీడెడ్ - రూ.1.83 కోట్లు ► ఈస్ట్ - రూ.99లక్షలు ► వెస్ట్ - రూ. 73 లక్షలు ► ఉత్తరాంధ్ర -రూ. 1.51 కోట్లు ► గుంటూరు- రూ. 1.14 కోట్లు ► కృష్ణా - రూ. 87 లక్షలు ► నెల్లూరు - రూ.41 లక్షలు ►కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ. 70 లక్షలు ►ఓవర్సీస్- రూ.2.60 కోట్లు ►నార్త్ ఇండియా-రూ.60లక్షలు ►మొత్తం రూ.15.44 కోట్లు(26.50 కోట్లు గ్రాస్) -
అందుకే ముద్దు సీన్స్‌లో నటించాను : హీరోయిన్ అనుపమ
‘‘కార్తికేయ 2’ చూసినవారు బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది. నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. అది మంచి ఎనర్జీ ఇచ్చింది’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ‘‘చందూగారు ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ‘కార్తికేయ 2’లో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది.. అందుకే ఈ చిత్రం కోసం కొన్ని ప్రాజెక్ట్స్‌ను వదులుకున్నాను. కొన్ని చోట్ల హీరోను డామినేట్ చేసేలా నా పాత్ర ఉంది అనడంలో వాస్తవం లేదు.. కథకు తగ్గట్టుగానే నా పాత్ర ఉంది. ‘రౌడీ బాయ్స్’లో కథ డిమాండ్ మేరకే ముద్దు సీన్స్‌లో నటించాను. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. -
బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘కార్తికేయ 2’ .. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్‌టాక్ సంపాదించుకుంది. (చదవండి: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ) దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్స్ లభించనప్పటికీ.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.50 కోట్ల గ్రాస్, రూ.5.05 కోట్ల షేర్ వసూళ్లని రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.5.30 కోట్ల గ్రాస్, రూ.3.50 కోట్ల షేర్ కలెక్షన్స్‌ని రాబట్టి.. నిఖిల్ కెరీర్లోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘కార్తికేయ2’ నిలిచింది. నిఖిల్ గత ఐదు సినిమాల తొలిరోజు వసూళ్లని పరిశీలిస్తే.. అర్జున్ సురవరం రూ.1.38 కోట్లు, కిర్రాక్ పార్టీ రూ.1.65 కోట్లు, కేశవా రూ.1.58 కోట్లు, ఎక్కడికి పోతావు చిన్నవాడా రూ.1.25 కోట్ల షేర్స్ అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ2 తొలిరోజు కలెక్షన్స్(ఏరియాల వారిగా) ► నైజాం - రూ.1.24 కోట్లు ► సీడెడ్ -రూ.40 లక్షలు ► ఈస్ట్ - రూ.33 లక్షలు ► వెస్ట్ - రూ.20 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.45లక్షలు ► గుంటూరు- రూ.44 లక్షలు ► కృష్ణా - రూ.27 లక్షలు ► నెల్లూరు - రూ.17 లక్షలు ► మెత్తం రూ. రూ.3.50 కోట్లు(షేర్) సిని విశ్లేషకుల సమాచారం ప్రకారం... కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాసం ఉండాలి. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘కార్తికేయ 2’ హిట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు: నిఖిల్
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం కార్తికేయ 2. భారీ అంచనాల మధ్య ఈ శనివారం(ఆగస్ట్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో విడుదలైన రోజు సాయంత్రమే చిత్రబృందం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. తమ సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టడం సంతోషంగా ఉందన్నారు. (చదవండి: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ) ‘యూఎస్‌లో కార్తికేయ2కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ కొంచెం టెన్షన్‌గా ఫీలయ్యాను. తెలుగు ప్రేక్షకులు మా సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాను. కానీ మీడియా షో అవ్వగానే నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్ని చోట్ల హౌస్‌ఫుల్ అవుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. నా సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. రేపు, ఎల్లుండి కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఇది ఇలానే కొనసాగుతుందని అనుకుంటున్నాను. చందు మంచి పాయింట్‌ని తీసుకొని సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా కోసం కష్టపడిన టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్’అని అన్నాడు. నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, కార్తికేయ-2 విజయం నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విడుదలైన ప్రతిచోట్ల, ఓవర్సీస్లోనూ మంచి ఆదరణ పొందుతోందని తెలిపారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ.. దర్శకుడు చందు మొండేటి కథ చెప్పిన దానికంటే అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. సినిమాకి అని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతున్నారు. కార్తికేయ 2 సాంకేతిక నిపుణలకు కృతజ్ఞతలు’ అన్నారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. రెండు పాండమిక్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ తో ఆ కష్టం అంతా మర్చిపోయాను. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. -
Karthikeya 2 Movie Review: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ
టైటిల్ : కార్తికేయ2 నటీనటులు : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనమ్, కేఎస్ శ్రీధర్, శ్రీనివాసరరెడ్డి నిర్మాణ సంస్థ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: చందూ మొండేటి సంగీతం : కాల భైరవ సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని విడుదల తేది: ఆగస్ట్ 13, 2022 వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. ఆయన కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘కార్తికేయ’. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే టీమ్‌తో ‘కార్తికేయ2’ తీశాడు. ఎన్నో అవంతరాల తర్వాత నేడు(ఆగస్ట్ 13) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో కార్తికేయ2 పై హైప్ క్రియేట్ అయింది. ఈ భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాలికి ధరించిన కంకణం.. నేటి కలియుగంలోని ఎన్నో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆర్కియాలజిస్ట్ రావు తెలుసుకుంటాడు. ఆ కంకణం గురించి అశ్వేషిస్తున్న రావు హత్య చేయబడతాడు. అదే సమయంలో తల్లి (తులసి)తో కలిసి ద్వారక దర్శనానికి వచ్చిన డాక్టర్ కార్తిక్(నిఖిల్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆర్కియాలజిస్ట్ రావును కార్తిక్‌కే హత్య చేశాడని తప్పుడు కేసు నమోదు చేస్తారు. పోలీసు స్టేషన్లో ఉన్న కార్తిక్‌ని రావు రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) తప్పిస్తుంది. అసలు కార్తిక్‌ని ముగ్ఢ ఎందుకు తప్పించింది? ఆమె కార్తిక్‌తో చెప్పిన విషయం ఏంటి? శ్రీకృష్ణుడి కంకణం కనిపెట్టాలని కార్తిక్ ఎందుకు డిసైడ్ అవుతాడు? ఈ క్రమంలో కార్తిక్‌కు డాక్టర్ శాంతను (ఆదిత్యా మీనన్) నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురయ్యయాయి? అధీరుల తెగకు చెందిన వ్యక్తులు కార్తిక్‌ని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరకు కార్తిక్ కంకణ రహస్యాన్ని కనిపెట్టాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. దర్శకుడు చందూ మొండేటి మొదటి నుంచి చెబుతున్నట్లుగా ‘కార్తికేయ’ చిత్రానికి, కార్తికేయ2 కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం హీరో, అతని తల్లి పాత్రలు అలా ప్రవర్తిస్తాయి. కార్తికేయలో మిస్టరీ, థ్రిల్లర్ అంశాలు ఉంటే.. ఇందులో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దైవం, సైన్స్ రెండింటిని కలిపి ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో మొత్తం సాదాసీదాగా సాగుతున్నప్పటికీ.. సెకండాఫ్‌పై మాత్రం క్యూరియాసిటీ పెంచుతుంది. అధీరుల వంశానికి చెందిన ఓ వ్యక్తి కార్తిక్‌పై దాడి చేయడం.. దానికి కారణం ఏంటో యానిమేషన్ ద్వారా చూపించడం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్రీకృష్ణ కంకణం అన్వేషణని ఆసక్తికరంగా తెరపై చూపించాడు. గోవర్థన గిరి గుహలో లభించిన ఆధారంతో కంకణాన్ని కనిపెట్టడం.. దానిని తీసుకొచ్చేందుకు కార్తిక్ చేసిన ప్రయత్నం రక్తి కట్టిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ పరంగా చూస్తే కార్తికేయ2 చాలా సాదారనమైనది..కానీ కథనం మాత్రం కొత్తగా ఆకట్టుకునేలా ఉంటుంది. కార్తికేయలో మాదిరి ఇందులో భయపడే సీన్స్ పెద్దగా ఉండవు. అలాగే హీరోని ఢీకొట్టేందుకు బలమైన విలన్ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు చప్పగా సాగాయనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే విలన్, అధీరుల తెగకు చిక్కిన ప్రతీసారి హీరో సింపుల్‌గా తప్పించుకోవడం లేదా ఆ సీన్‌ని హడావిడిగా ముంగించి వేరే సీన్లోకి తీసుకెళ్లడంతో థ్రిల్ మూమెంట్స్ మిస్ అవుతారు. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి అనుపమ్ ఖేర్‌తో చెప్పించే డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఫోకస్ అంతా కృష్ణతత్వం మీదే పెట్టినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్ హంగుల కోసం సాంగ్స్, కామెడీని జోడించకుండా ఉత్కంఠభరితంగా కథను నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే... డాక్టర్ కార్తికేయ పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రని అల్రెడీ కార్తికేయ చిత్రంలో పోషించిన అనుభవం ఉండటం అతనికి కలిసొచ్చింది. కార్తికేయ మాదిరే కార్తికేయ 2 కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. ఇక ముగ్ధ పాత్రకి అనుపమ పరమేశ్వరన్ న్యాయం చేసింది. కార్తిక్‌ని కాపాడే రెండు సీన్స్ అనుపమా క్యారెక్టర్ని గుర్తిండిపోయేలా చేస్తాయి. ఇక బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. గుర్తిండిపోయే పాత్ర చేశారు. శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్‌లో ఈలలు వేయిస్తాయి. కార్తిక్ మామగా శ్రీనివాస్‌రెడ్డి, ట్రాలీ డ్రైవర్‌గా వైవా హర్ష తమదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్, సత్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రెండూ బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘కార్తికేయ 2’ మూవీ ట్విటర్ రివ్యూ
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘కార్తికేయ 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 13)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కార్తికేయ 2’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘కార్తికేయ 2’ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. నిఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెబుతున్నారు. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. #Karthikeya2 Overall A Satisfactory Mystery Adventure that works in parts! The main storyline is interesting and has parts that are very engaging. However, the rest runs pretty flat and the thrill factor is very less. Still Decent Attempt and a One time Watch! Rating: 2.75/5 — Venky Reviews (@venkyreviews) August 12, 2022 కార్తికేయ 2 ఓవరాల్‌గా బాగుంది. స్టోరీ అంతా ఇంట్రెస్టింగ్ సాగుతుందని, థ్రిల్ ఫ్యాక్టర్ తక్కువగా ఉన్నప్పటికీ టీమ్ మొత్తం మంచి ప్రయత్నం చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 1st half report : Yaagam modhalu... First half bagundamma.. 😉KALA bhairava bgm irakottadu..👌. Konni..Thrilling elements unay.. cinema ippude modalayyindi... 😁@tollymasti #tollymasti . .#Karthikeya2 #Karthikeya2onAugust13th #Karthikeya2Review @actor_Nikhil @AAArtsOfficial — Tollymasti (@tollymasti) August 13, 2022 ఫస్టాఫ్ బాగుందని, కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీశారని, అసలు కథ సెకండాఫ్ నుంచి మొదలు కాబోతుందని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. #Karthikeya2 Overall A Satisfactory Mystery Adventure that works in parts! The main storyline is interesting and has parts that are very engaging. However, the rest runs pretty flat and the thrill factor is very less. Still Decent Attempt and a One time Watch! Rating: 2.75/5 — ABHI Jr.🌊 (@Govind949477) August 13, 2022 #Karthikeya2 Our rating 2.75/5 1st Half Average 2nd Half Good One Time Watchable 👍 #Karthikeya2 — Movies Box Office (@MovieBoxoffice5) August 13, 2022 #Karthikeya2 one Of the Greatest Movie of my life Mind-blowing amazing 😇Rating 5out of 5👍👍 please Watch #karthikeya2review — Shaktimaan7773 (@RichiBanna20) August 13, 2022 ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుందని చెబుతున్నారు. చందూ మొండేటి కథ హ్యండిల్ చేసిన విధానం బాగుందని అంటున్నారు. విజువల్స్, గ్రిప్పింగ్ నేరేషన్ థ్రిల్లింగ్‌కు గురిచేస్తాయని కామెంట్ చేస్తున్నారు. Very good second half.The thrill factor has been sustained throughout this part and the climax is 🔥.Chandoo made the best film of his career and the storyline is great.Anupam Kher cameo was👌🏼. The film has the potential to click big across languages. Sure shot hit #Karthikeya2 — sharat (@sherry1111111) August 12, 2022 #Karthikeya2 1st half: starts of well, Introduction, Mystery reveal, interval. 2nd half: Screenplay, direction, Visuals, BGM, Songs💥 Very good 1st & 2nd half👍 PERFECT SEQUEL 🔥 4.0/5⭐⭐⭐⭐ Because I love the story@anupamahere@actor_Nikhil @AAArtsOfficial pic.twitter.com/boEejnhdBd — Fancy Cinema (@Fancycinema) August 13, 2022 Koteysav bayya very happy for u #Karthikeya2 Ni script selection ey niku ni carrier lo big plus Abba em testav Anna att #blockbusterkarthikeya2@actor_Nikhil @anupamahere — Yeshwanth (@Yeshwan95181393) August 13, 2022 -
నిర్మాతలు ఆ విషయం చెప్పడం సంతోషంగా ఉంది: నిఖిల్
‘‘కార్తికేయ’ సినిమా చూశాను.. బాగుంది. ఆ సినిమాలానే ‘కార్తికేయ 2’ కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు చిత్రపరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా ముందుకు వెళ్లాలి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘కార్తికేయ 2’ తీసిన స్పిరిట్ నన్ను ఇక్కడికి నడిపించింది. ఇండస్ట్రీకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, సినిమానే దాన్ని అధిగమిస్తుంది.. ఎటువంటి పరిస్థితులకి ఇండస్ట్రీ లొంగలేదు’’ అన్నారు. ‘ ‘కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా మొహమాటానికి కొన్నిసార్లు ఫంక్షన్స్‌కి రావాల్సి ఉంటుంది. కానీ, ‘కార్తికేయ 2’ చాలా బాగుంది’’ అన్నారు ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్. ‘మా సినిమా కచ్చితంగా బాగుంటుంది’’ అన్నారు చందు మొండేటి. ‘‘మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్‌కి వస్తారని ఇటీవల ‘బింబిసార, సీతారామం’ నిరూపించాయి. అలానే మా సినిమాకి కూడా బుకింగ్స్ బాగున్నాయని మా నిర్మాతలు చెప్పడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిఖిల్. -
స్లోగా వెళుతున్నాను అంతే... డౌన్ కాలేదు
‘‘హిస్టరీ వర్సెస్ మైథాలజీగా ‘కార్తికేయ 2’ తీశాం. ఇందులో ప్రతి సీన్‌కు ఒక మీనింగ్ ఉంటుంది. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్నాయి. దేవుడు ఉన్నాడా? లేదా అనేవారికి మా సినిమా నచ్చుతుంది. దేవుడంటే ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు నిఖిల్. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిఖిల్ చెప్పిన విశేషాలు. ► ‘కార్తికేయ’ కంటే ‘కార్తికేయ 2’కి చందూగారు కథ, మాటలు చాలా బాగా రాసుకున్నారు. ఈ సినిమాలో ఫుల్ టైమ్ డాక్టర్‌గా, పార్ట్ టైమ్ డిటెక్టివ్‌గా నటించాను. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి, సాహసం చేసే పాత్ర నాది. ఎక్కడా గ్రాఫిక్స్ పెట్టలేదు. ఈ సినిమా కొంత నార్త్‌లో జరుగుతుంది కాబట్టి అనుపమ్ ఖేర్గారిని తీసుకున్నాం. ► ‘కార్తికేయ 2’ని అన్ని భాషల్లో డబ్ చేశాం. వేరే భాషల్లో నా సినిమా విడుదలవడం ఇదే తొలిసారి. కాలభైరవ మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇందులోని మూడు పాటలు చాలా బాగుంటాయి. సాహస కథలైన టిన్ టిన్ బుక్స్ అంటే నాకు బాగా ఇష్టం.. బాగా చదివేవాణ్ణి. చందూకి కూడా చాలా ఇష్టం. హాలీవుడ్ ‘ఇండియానా జోన్స్’ చిత్రకథల్లా మనకు కూడా ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ తీసి, భారతీయ సినిమా గొప్పతనాన్ని చూపించాలనుకుంటున్నాం. ► ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ అనేది మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ‘బ్యాట్ మేన్’ మూవీలో హీరో, విలన్.. ఇద్దరి పాత్రలు సమానంగా ఉంటాయి. మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా విలన్‌గా చేస్తాను. నేను నటించిన ‘18 పేజెస్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సుధీర్ వర్మతో ఒక సినిమా చేస్తున్నాను. ఈ ఏడాది చివర విడుదలయ్యే నా ‘స్పై’ చిత్రాన్ని మల్టీ లాంగ్వేజ్‌లలో తీస్తున్నాం. నా కెరీర్ స్లోగా పైకి వెళుతోంది తప్ప ఇప్పటివరకు డౌన్ కాలేదు.. ప్రస్తుతం అన్ని విధాలుగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను’’ అన్నారు. -
ఆమె రాసిన లెటర్ చదవగానే కన్నీళ్లు వచ్చాయి: నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కార్తికేయకు సీక్వెల్ ఈ సినిమా వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్‌తో కలిసి నిఖిల్ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో హోస్ట్ నిఖిల్‌కు సంబంధించిన ఓ ఆసక్తిర విషయాన్ని రివీల్ చేశాడు. నిఖిల్‌కు ఓ అమ్మాయి రాసిన లెటర్ గురించి హొస్ట్ ఆరా తీశారు. చదవండి: డైరెక్టర్ చెప్పాడు.. నిజంగానే కాలు విరగొట్టుకున్నా: హీరోయిన్ దీనికి నిఖిల్ స్పందిస్తూ.. ‘అవును అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న. అదే సమయంలో ఓ అమ్మాయి నాకు లెటర్ రాసింది. ఆ ఉత్తరం చదివి భావోద్వేగానికి గురయ్యా. ఆ లేఖ చదవడం పూర్తయ్యేసరికి కళ్లనుంచి నీళ్లోచ్చాయి. తన అభిమానానికి చూసి ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే నేనొక నార్మల్ హీరోని. చిన్నప్పటి నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను అభిమానిస్తూ పెరిగిన నేను ఈ స్థాయికి వచ్చాను. అటువంటి నాకు ఒక ఫ్యాన్ అభిమానిస్తూ లేఖ రాయడం ఆశ్చర్యంగా అనిపించింది. అది చదివేసరిగా నాకు కన్నీళ్లు ఆగలేదు’ అంటూ నిఖిల్ వివరణ ఇచ్చాడు. ఇక చివరగా కార్తికేయ 2లో తనకు నచ్చిన సీన్ క్లైమాక్స్ అని చెప్పాడు. శ్రీ కృష్ణుడు గురించి చెప్పే ఈ సీన్లో నాకు తెలియకుండానే లీనమైపోయా.. ఆ ప్రభావం తనపై పడటంతో తెలియకుండానే ఏడ్చేశానన్నాడు. సహాజంగా వచ్చిన ఈ సీన్ క్లైమాక్స్‌కు హైలెట్‌గా నిలుస్తుందని చెప్పాడు. -
అందుకే ‘కార్తికేయ 2’కి స్వాతిని తీసుకోలేదు : దర్శకుడు క్లారిటీ
‘చిన్నప్పటినుండి నాకు రామాయణం, మహా భారతం పుస్తకాలు ఎక్కువగా చదవేవాన్ని. ఆలా ఇతిహాసాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండడం వలన కృష్ణతత్వం అనే పాయింట్ తీసుకొని కార్తీకేయ సినిమా చేయడం జరిగింది. దేవుడు అంటే ఒక క్రమశిక్షణ.. మనం నమ్మే దంతా కూడా సైన్స్ తో ముడిపడి ఉంటుంది. శ్రీకృష్ణుడు గురించి చెప్పడం అంటే అనంతం. శ్రీకృష్ణుడు ద్వారకాలో ఉన్నాడా లేదా అన్నది ఒక చిన్నపాయింట్ బట్టి ‘కార్తికేయ2’ తీశాను’అని దర్శకుడు చందూ మొండేటి అన్నారు. యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా దర్శకుడు చందూ మొండేటి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటితరానికి అయన గొప్ప తనం గురించి చెప్పబోతున్నాం. శ్రీకృష్ణుడు ను మోటివ్ గా తీసుకొని తీసిన ఈ సినిమాలో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. ఈ మధ్య భక్తి సినిమాలు చూడడానికి ఎవరూ ఆలా రావడం లేదని భక్తి తో పాటు అడ్వెంచర్ తో కూడుకున్న థ్రిల్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఒక కొత్త అనుభూతితో బయటకు వస్తారు. ► కార్తికేయ 1 హిట్ అవ్వడంతో ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కు ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ‘కార్తికేయ 1’లో నిఖిల్ హీరో గా చెయ్యడంతో ‘కార్తికేయ 2’ లో నటించడం చాలా ఈజీగా అయ్యింది. అందులో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తే ఇందులో డాక్టర్ గా నటించాడు. ►శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్, వైవా హర్ష,సత్య వీరందరూ బిజీగా ఉన్నా ఈ కథను, కాన్సెప్ట్, నమ్మి, మాతో ట్రావెల్ అయ్యారు. ‘కార్తికేయ 2’ లో స్వాతికి పాత్ర కు ఎక్కువ స్కోప్ లేదు. అందుకే స్వాతిని తీసుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీకు సెకెండ్ పార్ట్ లో అర్థమై పోతుంది . ► కథ హిమాచల్ ప్రదేశ్ లో నడుస్తున్నందున అక్కడి వారు అయితే బాగుంటుందని బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ ను తీసుకోవడం జరిగింది. అయన సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దేవి పుత్రుడు సినిమాకు ఈ కథకు ఎటువంటి సంబంధాలు లేవు ► ఏ కథకైనా నిర్మాతలు కొన్ని బౌండరీస్ ఇస్తారు. దాన్ని బట్టి ఈ కథను చేయడం జరిగింది. ‘కార్తికేయ 2’ కు బడ్జెట్ లో తీయడానికి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం జరిగింది.అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు మమ్మల్ని నమ్మారు. రెండు ప్యాండమిక్ స్విచ్వేషన్స్ వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకేక్కించారు.ఈ స్క్రిప్ట్ పైన నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ► కార్తికేయ రెండు పార్ట్స్ కూడా అడవెంచర్స్ కాన్సెప్ట్ తో నే తీయడం జరిగింది. ఇందులో కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్ గా ఉంటుంది. అలాగే టెక్నిషియన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వి. యఫ్. ఎక్స్ చాలా బాగా వచ్చింది. ► థియేటర్ ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్ గా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తీసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల పిల్లలు చూస్తే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే వారికి ఇతిహాసాలపై ఒక అవగాహన వస్తుంది ► నేను ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఆడియన్స్ ఈ చిత్రాన్ని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ చేస్తాను.ఈ సినిమా తరువాత నెక్స్ట్ గీతా ఆర్ట్స్ లో ఉంటుంది. రెండు సినిమా కథలు ఉన్నాయి. ఒకటి ప్రేమకథా చిత్రమైంటే ఇంకొకటి సోషల్ డ్రామా, ఈ రెంటిలో ఏ కథ ముందు అనేది ఫైనల్ కాలేదు. గీతా ఆర్ట్స్ తరువాత నాగార్జున గారితో మరో చిత్రం చేయబోతున్నాను. -
ఇది నాకు ఎంతో ప్రత్యేకం: అనుపమ పరమేశ్వరన్
సీతమ్మధార (విశాఖ ఉత్తర): శ్రీ కృష్ణుని ద్వారక ఇతివృత్తంగా కార్తికేయ–2 చిత్రం రూపొందించినట్లు హీరో నిఖిల్ తెలిపారు. సాంకేతికపరంగా అద్భుతమైన విజువల్స్, ఎమోషన్, ప్రేమ, యాక్షన్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. కార్తికేయ–2 చిత్రం ట్రైలర్‌ను శరత్ థియేటర్లో మంగళవారం చిత్రయూనిట్ సభ్యులు విడుదల చేశారు. ప్రేక్షకుల ముందు ట్రైలర్ విడుదల చేసి, కాసేపు ముచ్చటించారు. చదవండి: సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్‌ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ? అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడారు. సుబ్రహ్మణ్య స్వామి కథనంపై రూపొందించిన కార్తికేయ–1 చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఆదరించారన్నారు. ద్వారకలోని శ్రీ కృష్ణుడి గుడి చుట్టూ జరిగే కథాంశం ఆధారంగా కార్తికేయ–2 చిత్రాన్ని రూపొందించామన్నారు. తమ సినిమాను శ్రీకృష్ణుడే ముందుకు నడిపారని, షూటింగ్ సమయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పారు. దర్శకుడు చందూ మొండేటి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఈ నెల 13న చిత్రాన్ని పాన్ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ కార్తికేయ–2, చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. ప్రేక్షకులు చూసినంత సేపు తర్వాత ఏమి జరుగుతుందో అని ఉద్వేగానికి గురవుతారన్నారు. చిత్రనటులు శ్రీనివాసరెడ్డి, హర్ష మాట్లాడుతూ ఇంత గొప్ప చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. -
సందడే సందడి.. ఈ వారం బోలెడన్ని సినిమాలు రిలీజ్!
జూలైలో బోలెడు సినిమాలు రిలీజైనా ఏ ఒక్కటీ సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో వరుస విజయాలు అందుకుంటున్న టాలీవుడ్ జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లైంది. అయితే జూలై ఉసూరుమనిపించినా ఆగస్టు తిరిగి ఊపిరి పోసింది. ఒకేరోజు రిలీజైన బింబిసార, సీతారామం రెండూ దిగ్విజయాన్ని అందుకున్నాయి. ఆ ఊపును కొనసాగించడానికి మేము రెడీ అంటూ మరి కొన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి ఆగస్టు రెండో వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూసేద్దాం.. లాల్ సింగ్ చడ్డా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగచైతన్య ముఖ్య పాత్ర పోషించాడు. హాలీవుడ్ హిట్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చై బాలీవుడ్ ఎంట్రీ, తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రక్షా బంధన్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం రక్షా బంధన్. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్టర్. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతోంది. మాచర్ల నియోజకవర్గం యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కృతీశెట్టి, కేథరిన్ హీరోయిన్స్. హీరోయిన్ అంజలి ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడింది. ఈ మూవీ ఆగస్టు 12న రిలీజవుతోంది. కార్తికేయ 2 నిఖిల్ సూపర్ హిట్ మూవీ కార్తికేయకు సీక్వెల్‌గా వస్తోంది కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలుత ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అదేరోజు మాచర్ల మూవీ వస్తుండటంతో ఒకరోజు వెనక్కి జరిగారు. అంటే కార్తికేయ 2 ఆగస్టు 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు.. హాట్‌స్టార్ ► ది వారియర్ - ఆగస్టు 11 అమెజాన్ ప్రైమ్ ► సోనిక్ ది ఎడ్జ్‌హాగ్ 2 - ఆగస్టు 10 ► ది లాస్ట్ సిటీ - ఆగస్టు 10 ► మలయాన్ కుంజు - ఆగస్టు 11 ► కాస్మిక్ లవ్ - ఆగస్టు 12 ► ఎ లీగ్ ఆఫ్ దైర్ వోన్ - ఆగస్టు 12 ఆహా ► మాలిక్ - ఆగస్టు 12 ► మహా మనిషి - ఆగస్టు 12 ► ఏజెంట్ ఆనంద్ సంతోష్ (నాలుగో ఎపిసోడ్) - ఆగస్టు 12 నెట్‌ఫ్లిక్స్ ► హ్యాపీ బర్త్‌డే - ఆగస్టు 8 ► నరూటో: షిప్పుడెన్ వెబ్‌సిరీస్ - ఆగస్టు 8 ► ఐ జస్ట్ కిల్డ్ మై డాడ్ - ఆగస్టు 9 ► ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 2 - ఆగస్టు 10 ► లాకీ అండ్ కీ సీజన్ 3 - ఆగస్టు 10 ► బ్యాంక్ రాబర్స్: ది లాస్ట్ గ్రేట్ హెయిస్ట్ - ఆగస్టు 10 ► దోతా: డ్రాగన్స్ బ్లడ్: బుక్ 3 - ఆగస్టు 11 ► నెవ్వర్ హావ్ ఐ ఎవర్ సీజన్ 3 - ఆగస్టు 12 ► బ్రూక్లిన్ నైన్-నైన్: సీజన్ 8 - ఆగస్టు 13 ► గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ - ఆగస్టు 14 సోనిలివ్ ► గార్గి - ఆగస్టు 12 జీ5 ► హలో వరల్డ్ వెబ్‌సిరీస్ - ఆగస్టు 12 ► రాష్ట్ర కవచ్ - ఆగస్టు 11 ► బ్యూటిఫుల్ బిల్లో - ఆగస్టు 11 ► శ్రీమతి - ఆగస్టు 12 చదవండి: 'పచ్చళ్ల స్వాతి'గా పాయల్ రాజ్ పుత్ లుక్ చూశారా? సిమ్రాన్ చెల్లెలి సూసైడ్‌కి ఆ కొరియోగ్రాఫర్‌కి సంబంధం ఉందా? -
ఆసక్తిని రేకెత్తిస్తున్న కార్తికేయ-2 ట్రైలర్.. మీరూ ఓ లుక్కేయండి
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2. అనుపమ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కార్తికేయకు సీక్వెల్ ఈ సినిమా. ఇప్పటికే కార్తికేయ-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. శ్రీకృష్ణుడి చరిత్రతో, ద్వారకా నగరి నేపథ్యంతో ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా ఉంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.. 'నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం'అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
తారుమారైన తేదీలు.. ఆలస్యంగా రానున్న సినిమాలు
కరోనా వల్ల సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. 2020లో ముందుగానే విడుదల తేదీ ప్రకటించిన ఏ సినిమా కూడా చెప్పిన తేదీకి దాదాపు రాలేదు. దానికి కారణం లాక్డౌన్. కరోనా కాస్త సద్దుమణిగి, సినిమాల విడుదల జోరు పెరిగినా కానీ రెండేళ్ల కరోనా ప్రభావం సినిమా విడుదలపై ఇంకా ఉంది. ఇప్పటికీ సినిమాల విడుదల తేదీలు తారుమారవుతున్నాయి. దానికి ఒక కారణం కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే సంఖ్య తగ్గడమే అని కొందరు పరిశ్రమ ప్రముఖులు అంటున్నారు. ఏది ఏమైనా సినిమాకి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం కూడా వెలిబుచ్చారు. ఇక విడుదల తేదీలు తారుమారైన చిత్రాల గురించి తెలుసుకుందాం. కాగా సీక్రెట్ ఏజెంట్‌గా అఖిల్ చేపట్టిన ఆపరేషన్ ఏంటి? అనేది తెలియాలంటే ‘ఏజెంట్’ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏజెంట్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కావాల్సి ఉంది. ఇటీవల ‘ఏజెంట్’ ట్రైలర్‌ని కూడా అభిమానుల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని చిత్రబృందం ప్రకటించలేదు. ఇంకోవైపు సమంత లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యశోద’ ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. హరి–హరీశ్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఓ పాట చిత్రీకరించాల్సి ఉండగా మరోవైపు గ్రాఫిక్స్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసినట్లు చిత్రయూనిట్ ఆ మధ్య పేర్కొంది. కొత్త విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. ఇక సముద్రంలోని ద్వారకా నగరంపై నిఖిల్ చేసిన అన్వేషణ కూడా తెరపైకి కాస్త లేట్‌గా రానుంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘కార్తికేయ 2’. ఇందులోనే నిఖిల్ ద్వారకా నగర అన్వేషణ చేశారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఫైనల్‌గా ఒక రోజు ఆలస్యంగా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. కాగా నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ విడుదల తేదీలోనూ మార్పు జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఈ చిత్రం విడుదల కావాల్సింది. అయితే సెప్టెంబరు 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అదే విధంగా వైష్ణవ్ తేజ్ వైభవాన్ని చూడాలంటే సెప్టెంబర్ 2 వరకూ వేచి చూడాలి. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘రంగరంగ వైభవంగా’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదల రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా మూడోసారి ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని తొలుత మే 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా కాలేదు. ఆ తర్వాత జూలై 1న విడుదల అంటూ అనౌన్స్ చేసినా వాయిదా పడింది. ఫైనల్‌గా సెప్టెంబరు 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్ కృష్ణదేవ్ (అడివి శేష్ పాత్ర పేరు) ఓ కేసు విచారణపై శ్రద్ధ పెట్టారు. ఈ విచారణ విశేషాలు తెలియాలంటే ‘హిట్ 2’ రిలీజ్ వరకు వేచి చూడాలి. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్: ది సెకండ్ కేస్’. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘హిట్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘హిట్ 2’ జూలై 29న రిలీజ్ కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ కూడా వాయిదా జాబితాలో ఉంది. నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా జంటగా నాగశేఖర్, భావనా రవి నిర్మించిన ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ విడుదల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేది ఇంకా చిత్రయూనిట్ ప్రకటించలేదు. మరోవైపు బెల్లంకొండ సురేశ్ చిన్న కుమారుడు గణేశ్ హీరోగా పరిచయ మవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇంకా విడుదల తేదీ వాయిదాపడిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. ఒక తేదీకి అనుకున్న సినిమా మరో తేదీకి వాయిదా పడటం అనేది సాధారణ విషయమే. అయితే ఒకేసారి ఇన్ని చిత్రాలు వాయిదా పడటం అంటే విషయమే. -
‘కార్తికేయ 2’ ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
మరోసారి వాయిదాపడ్డ కార్తికేయ 2, ఒకరోజు వెనక్కి!
యంగ్ హీరో నిఖిల్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ఒకటి. దానికి సీక్వెల్‌గా వస్తోందే కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. కానీ అదేరోజు నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా విడుదలవుతుండటంతో నిఖిల్ ఓ మెట్టు వెనక్కు తగ్గాడు. ఒకరోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13న కార్తికేయ 2 విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. 'కంటెంట్‌ను బట్టే నా సినిమాల విడుదల ఉంటుంది. కార్తికేయ 2, స్పై సినిమాలకు ఆ సత్తా ఉంది కాబట్టే పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నాము. సినిమా విడుదల తేదీ మారడమనేది ఒక మిస్టరీ అయింది. రిలీజ్ క్లాష్ లేకుండా ఉండాలని నిర్మాతలు నిర్ణయించారు. అందులో భాగంగానే నా సినిమా రిలీజ్ డేట్ మారుతూ వచ్చింది. నాకు పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులే ముఖ్యం. నటులకు పార్టీలతో పని లేదు. మంచి ఎవరు చేసినా నటులుగా మేము అభినందిస్తాము' అని చెప్పుకొచ్చాడు. The Mystical Adventure #Karthikeya2 hits the big screens on August 13th 💥#Karthikeya2OnAug13 🔥#KrishnaIsTruth@actor_Nikhil @anupamahere @AnupamPKher @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @MayankOfficl @peoplemediafcy @AAArtsOfficial pic.twitter.com/XchDYB3Kad — Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 3, 2022 చదవండి: స్టార్ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు -
సాంగ్ చూపించేశాం మావా...
పాట వినిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.. ఇది ఒకప్పటి ట్రెండ్. పాట చూపించి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది ఇప్పటి ట్రెండ్. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించాలంటే గతంలో ఆడియో, సినిమా పోస్టర్స్‌ని పబ్లిసిటీలో భాగంగా విడుదల చేసేవాళ్లు. పాటలు బాగుంటే సినిమా కూడా బాగుంటుందని థియేటర్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ‘సాంగ్ చూపించేశాం మావా..’ అంటూ పాట వీడియోను కూడా చూపించి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా మేకింగ్ మారినట్లుగానే పబ్లిసిటీలో కూడా కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాల వీడియో పాటలను ఓ లుక్కేద్దాం.. ఐయామ్ రెడీ.. ‘‘నేను రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ నితిన్‌ని ఆటపట్టించారు అంజలి. వీరిద్దరి మధ్య వచ్చే ఈ మాస్ సాంగ్ ‘మాచర్ల నియోజక వర్గం’ లోనిది. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీ శెట్టి, క్యాథరిన్ హీరోయిన్లు. అంజలి స్పెషల్ సాంగ్ చేశారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. మహతి స్వర సాగర్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి..’, ‘అదిరిందే..’ అంటూ సాగే పాటల ఫుల్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ‘మాచర్ల సెంటర్లో మాపటేల నొనొస్తే.. ఐయామ్ రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ అంజలి, నితిన్‌లపై చిత్రీకరించిన సాంగ్, నితిన్, కృతీపై తీసిన ‘అదిరిందే పసిగుండె.. తగిలిందే హై ఓల్టే’ పాటల వీడియోలు మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. పలికిందేదో ప్రాణం.. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం.. ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం’ అంటూ ఉల్లాసంగా పాడారు కల్యాణ్ రామ్. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీతో ఉంటే చాలు..’ అనే ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం..’ అంటూ సాగే ఈ ఫ్యామిలీ సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. అడిగా.. నన్ను నేను అడిగా... ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని..’ అంటూ అనుపమా పరమేశ్వరన్‌ని అడుగుతున్నారు నిఖిల్. ఈ ప్రేమ పాట నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’లోనిది. కాలభైరవ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని, అడిగా.. నిన్ను నేను అడిగా.. నే నిన్నలా నేనని..’ అంటూ సాగే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. నిఖిల్, అనుపమల మధ్య వచ్చే ఈ ఫీల్ గుడ్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవే కాదు... మరికొన్ని చిత్రాల్లోంచి కూడా వీడియో సాంగ్స్ విడుదలయ్యాయి. ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడానికి కొంతవరకైనా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. -
నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్
Chandoo Mondeti About Karthikeya 2 Movie: 2014లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన చందూ మొండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత ప్రేమమ్, సవ్యసాచి, బ్లడీ మేరీ సినిమాలతో తనదైన శైలీలో పలకరించాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇప్పుడు తాజాగా 'కార్తికేయ'కు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో యంగ్ హీరో నిఖిల్, బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్స్‌కు మంచి స్పందన లభించింది. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వినూత్నంగా కాంటెస్ట్ పేరుతో ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్ చందూ మొండేటి, హీరో నిఖిల్. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది చిత్రబృందం. చదవండి: బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన ''నాకు కింగ్ నాగార్జున అంటే చాలం ఇష్టం. ఆయనతో ఓ పోలీస్ కథపై చర్చలు జరుగుతుంటాయి. ఒకవేళ ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ అయితే నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది'' అని చందూ మొండేటి తెలిపారు. అలాగే హోస్ట్ అడిగిన 'నువ్వొక చిన్న సైజు విజయ్ మాల్య అట కదా' అనే ప్రశ్నకు 'ఏంటీ స్కాములా.. దొంగతనం కూడా చేశామంటారు' అని చందూ జవాబివ్వగా.. 'అదంతా ఒకప్పుడు' అని నిఖిల్ అన్నాడు. 'కార్తికేయ 2'లో చాలా పాములుంటాయని, 'భార్యలకు అబద్ధాలు చెప్పకపోతే, ఇన్నికాపురాలు ఉంటాయా' అంటూ చందూ చెప్పుకొచ్చాడు. ' అంటే కొన్నిసార్లు చిరాగ్గా ఉన్న సమయంలో కూడా డు యు లవ్ మీ' అని అంటారని నిఖిల్ చెప్పడంతో ఇంటర్వ్యూ ప్రోమో ముగిసింది. -
‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ కామెంట్స్ వైరల్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. గతంలో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి ఇది సీక్వెల్. ఆగస్ట్ 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్రం. అయితే ఈ ప్రమోషన్లో ఎక్కడ చూసిన నిఖిల్ మాత్రమే కనిపిస్తున్నాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కనిపించడం లేదు. అయితే ఇప్పటికే దీనిపై అనుపమ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ రాత్రి, పగలు వరుసగా షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లే తాను కార్తీకేయ 2 ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇదే ప్రశ్న నిఖిల్‌కు ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎదురైంది. ఈ సందర్భంగా నిఖిల్, అనుపమపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కార్తీకేయ 2 ప్రమోషన్లో అనుపమ కనిపించడం లేదు.. ఎందుకని అడిగిన ప్రశ్నకు నిఖిల్ స్పందిస్తూ.. ‘అనుపమను చూస్తే ఒక్కొసారి ఆశ్చర్యం వేస్తుంది. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత తను ప్రమోషన్స్‌కు ఎందుకు రాదో తెలియదు. సెట్లో చాలా సరదాగా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్లాక మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వదు. కాల్స్‌కు సమాధానం ఉండదు. మళ్లీ మరుసటి రోజు సెట్‌కు రాగానే సరదాగా కలిసిపోతుంది. అసలు తను అర్థం కాదు. తనకి రెండు ముఖాలున్నాయి. రేపు ప్రమోషన్స్ ఉన్నాయని మెసేజ్ పెడితే చూడదు. కనీసం రిప్లై కూడా ఇవ్వదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిఖిల్ కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. నిఖిల్ సమాధానం విన్న పలువురు అనుపమపై మండిపడుతూ ట్రోల్ చేస్తున్నారు. Reply ah ? pic.twitter.com/mVzhfuoqmX — CB (@G__0070) August 1, 2022 -
కార్తికేయ 2 ప్రమోషన్స్‌కు డుమ్మా.. ప్లీజ్, అర్థం చేసుకోండంటున్న బ్యూటీ
సినిమాను తెరకెక్కించడమే కాదు.. దాన్ని అనువైన సమయం చూసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా కష్టమైన పనే. ఏ సినిమాలతో క్లాష్ కాకుండా సరైన తేదీ చూసుకుని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఎన్నో గండాలను దాటుకుని కార్తికేయ 2 ఆగస్టు 12న విడుదల కాబోతోంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. సినిమా రిలీజ్‌కు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. అయితే ఈ ప్రమోషన్స్‌కు హీరోయిన్ అనుపమ డుమ్మా కొడుతోంది. సడన్‌గా అనుపమ ప్రమోషన్స్‌కు ఎందుకు హ్యాండ్ ఇచ్చిందబ్బా? అని నెటిజన్లు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. తాజాగా దీనిపై అనుపమ స్పందించింది. 'కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్‌కు నేను ఎందుకు రాలేకపోతున్నానో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను మరో రెండు సినిమాలకోసం పగలనకా రాత్రనకా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. ఇతర ఆర్టిస్టులతో కాంబినేషన్ సన్నివేశాలను ఎప్పుడో షెడ్యూల్ చేశారు. మరోవైపు కార్తికేయ 2 ప్రమోషన్స్‌కు నేను ప్లాన్ చేసుకున్నా. కానీ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడటంతో షెడ్యూల్ మొత్తం తారుమారైంది. కాబట్టి ఇక్కడ డుమ్మా కొట్టలేని పరిస్థితి. నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. కార్తికేయ 2 టీమ్, మరీ ముఖ్యంగా ఎంతగానో కష్టపడుతున్న నిఖిల్‌గారికి నా ప్రేమాభివందనలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చిందీ మలయాళ బ్యూటీ. చదవండి: అందుకే అమ్మ ఆత్మహత్య చేసుకుంది: దీక్షిత పబ్లిక్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ల లిప్‌లాక్! వీడియో వైరల్?. -
సినిమా రిలీజ్ కాదన్నారు.. వారం క్రితం ఏడ్చేశాను: నిఖిల్
Nikhil Says He Cried About Karthikeya 2 Movie Release Problems: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. 'హ్యాపీ డేస్' సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' రానున్న విషయం తెలిసిందే. ఇందులో నిఖిల్‌కు జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ మూవీ అనేక వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్రబృందం వినూత్నంగా కాంటెస్ట్‌లు కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'కార్తికేయ 2' సినిమా విడుదల విషయంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయని, ఒకానొక సమయంలో ఏడ్చాను అని తెలిపాడు నిఖిల్. ''ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలను ఇటు అటు నెట్టేస్తారని అంటారు కదా.. అలానే మా సినిమాకు జరిగింది. నిజం చెప్పాలంటే ఒక ఐదు రోజుల క్రితం సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 12 అని ప్రకటించేటప్పుడు.. అది కూడా వద్దని చెప్పారు. చదవండి: నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీ కాంటెస్ట్.. గెలిస్తే రూ. 6 లక్షలు ప్రియుడితో బర్త్‌డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ అక్టోబర్‌కు వెళ్లిపోండి. నవంబర్‌కు వెళ్లిపోండి. ఇప్పుడు అప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు. మీకు షోస్ దొరకవు. థియేటర్లు ఇవ్వము. అన్న స్టేజ్ వరకు వెళ్లింది. అప్పుడు నేను ఏడ్చాను. నేను నిజానికి చాలా స్ట్రాంగ్ పర్సన్‌ను. హ్యాపీ డేస్ సినిమా నుంచి ఇప్పటివరకు మూవీ విడుదల కాదు, థియేటర్లు దొరకవు అని ఎప్పుడు అనిపించలేదు. ఒక వారం క్రితం అయితే ఏడ్చేశాను. నువ్ ఎంత కష్టపడినా నీ సినిమా రిలీజ్ అవ్వదురా అని అన్నప్పుడు బాధేసింది. చివరికీ మా నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ సపోర్ట్‌తో పట్టుబట్టి ఆగస్టు 12కే వస్తున్నాం అని ప్రకటించాం'' అని నిఖిల్ పేర్కొన్నాడు. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ -
‘కార్తికేయ 2’కు వినూత్న ప్రచారం.. కాంటెస్ట్‌లో గెలిస్తే బంగారు కృష్ణుడి విగ్రహం
Nikhil Karthikeya 2 Movie Treasure Hunt Promotion: ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో వచ్చి హిట్ కొట్టిన చిత్రం 'కార్తికేయ'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అత్యంత భారీ అంచనాల మధ్య ఆగస్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌ను విభిన్నంగా చేపట్టారు దర్శకనిర్మాతలు. ఇందుకోసం సెపరేటుగా ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మిస్టికల్ టెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు రూ. 6 లక్షల విలువ గల శ్రీకృష్ణుడి బంగారు విగ్రహాలను ప్రైజ్ మనీగా పొందవచ్చని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మొదటి క్లూ విడుదల చేశారు. ఒక్కొక్కటిగా మరికొన్ని క్లూస్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ప్రచారంతో సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేలా చేశారు. చదవండి: ప్రియుడితో బర్త్‌డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ Soo many of u have cracked the first clue and have moved on to the next clue 🕵️♂️ The quest for the Lord Krishna Gold Idol is getting interesting 😃 You can be the lucky winner of #KarthikeyaQuest ❤️ Waiting for the one who finds the Gold Idol first#Karthikeya2 @actor_Nikhil https://t.co/WH4K16ibcy pic.twitter.com/akiO5p3DWv — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యే 'కార్తికేయ 2' సెన్సార్ కార్యక్రమాలు ముగిసాయి. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, కాన్సెప్ట్ చూసి సెన్సార్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ A lot of you have found out the location from the #KarthikeyaQuest’s 1st clue, Congratulations! But the job is half done. Head out to that location to find the clue for the next location which will lead you to the Lord Krishna Gold Idol ❤️ Good Luck!#Karthikeya2 @anupamahere pic.twitter.com/FzG84v2k7e — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 U cud be right. But have u checked the second clue that is placed there at the location ? https://t.co/ekRLdGV4or — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 Hyderabad 🚨 Here's the first clue to win Lord Krishna Gold Idol in the #KarthikeyaQuest ❤️ “Vishwam Oka Poosala Danda… Nidhi nee Bhagyam lo undi ante Bhagyanagarapu Nadiboddu lo unna Janala Poosala Dandani cheruko” Get searching 🔥#Karthikeya2 @actor_Nikhil pic.twitter.com/vzP8CGdnor — People Media Factory (@peoplemediafcy) July 31, 2022 -
‘కార్తికేయ2’ టీమ్‌కి అరుదైన గౌరవం
యంగ్ హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ2’ చిత్రానికి తాజాగా అరుదైన ఆహ్వానం లభించింది. ఈ చిత్ర యూనిట్‌కి ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలని ఆహ్వానం అందింది. కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.. టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఇస్కాన్ మెయిన్ సంస్థానం నుంచి ఆహ్వానం అందడం పట్ల చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు ఇతిహాసాల నేపథ్యంలో, మైథలాజికల్ స్టోరీస్ నేపథ్యంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. భారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి. అయితే భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం కార్తికేయ 2 టీంను వరించడం గమనార్హం.పిపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. -
భారీ ధరకు పలుకుతున్న నిఖిల్ ‘కార్తీకేయ 2’ థియేట్రికల్ రైట్స్
మూడేళ్లు గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది మంచి కమ్‌బ్యాక్‌తో వస్తున్నాడు. నిఖిల్ నటించిన చివరి చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ మూవీ తర్వాత అతడి నుంచి మరే సినిమా రాలేదు. ఈ మూవీ అనంతరం దాదాపు 3 ఏళ్లు బ్రేక్ తీసుకున్న నిఖిల్ వరుస సినిమాలకు సైన్ చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. అందులో ‘కార్తికేయ-2’ ఒకటి. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.6 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కిచన ఈ చిత్రం రూ. 20 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తీకేయ 2 రాబోతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చర్చనీయాంశమైంది. జూలై 22న థియేటర్లోకి రానున్న ఈ మూవీకి థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి రూ.14కోట్ల నుంచి రూ. 20 కొట్లకు పైగానే ఢీల్ కుదిరినట్లు సమాచారం. ఓ చిన్న హీరో సినిమాకు ఈ స్థాయిలో ఢీల్ కుదరమంటే సాధారణ విషయం కాదు. అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే నెల తెలుగు, హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. -
‘కార్తికేయ 2’ ట్రైలర్ ఈవెంట్, వేదికపైనే ఫ్యాన్‌కి నిఖిల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఇది. నిన్న(జూన్ 24) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌తో పాటు హీరోయిన్, డైరెక్టర్ ఇతర నటీనటులు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు వచ్చిన వీరాభిమానికి నిఖిల్ అక్కడిక్కడే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ సదరు అభిమాని ఈవెంట్లో లేచి మాట్లాడుతూ.. నిఖిల్ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన నటించిన ప్రతి సినిమా చూస్తున్నానని చెప్పాడు. ఆయనంటే తనకెంతో ఇష్టమంటూ నిఖిల్‌పై అభిమానం కురిపించాడు. ఇక అతడి అభిమానానికి ఫిదా అయిన నిఖిల్ అతడి వేదిక మీదకు పిలిచాడు. అనంతరం తన గుర్తుగా అక్కడికక్కడే తన ఫ్యాన్‌కు తను పెట్టుకున్న కూలిగ్గ్లాసెస్ బహుమతిగా ఇచ్చాడు. ఈవెంట్ అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సదరు ఫ్యాన్ మహేశ్ దాసరి ట్విటర్లో షేర్ చేశాడు. చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన అతడి ట్వీట్‌పై నిఖిల్ స్పందిస్తూ.. ‘బ్రో.. ఆ గ్లాసెస్‌ను జాగ్రత్త చూసుకోండి. నాపై మీరు చూపించిన ప్రేమకు గుర్తుగా వెంటనే నేను ఇచ్చిన గిఫ్ట్ అది’ అని రాసుకొచ్చాడు. కాగా సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం.. ద్వారకా నగరం అనే ఆసక్తికర కథాంశంతో ఈ కార్తికేయ 2 తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్గా వైవా హర్ష కనిపించనున్నారు. Take good care of the Goggles bro … My spontaneous gift for ur love ❤️🙏🏽 #Karthikeya2 trailer event.. https://t.co/KKTHtuz264 — Nikhil Siddhartha (@actor_Nikhil) June 25, 2022 -
కార్తికేయ 2 ట్రైలర్: ఆజ్యం మళ్లీ మొదలైంది..
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్‌గా వస్తోంది చిత్రం. సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం.. ద్వారకా నగరం అంటూ ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఈసారి డైరెక్టర్ శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారకను ఆధారంగా తీసుకుని సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. శాంతను.. 'ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను ఓ సమిధను మాత్రమే, ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది' అంటూ హీరోకు ఎలివేషన్ ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్‌తో మరోసారి మెప్పించారు. ఈ సినిమాలో కార్తికేయగా నిఖిల్, ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్గా వైవా హర్ష కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 3 Years of Blood Sweat and Much more… TRAILER OF #KARTHIKEYA2 is here…. Watch it and if u like it Please SHARE with ur friends and family …. #LordKrishna India’s Epic Mystical Adventure Zee Cinemalu YouTube - https://t.co/9fYA4X0cHm pic.twitter.com/x0DcBSrIqn — Nikhil Siddhartha (@actor_Nikhil) June 24, 2022 చదవండి: సదా నన్ను నడిపే మూవీ రివ్యూ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్, స్పందించిన వర్మ -
కార్తికేయ 2: ముఖ్య పాత్రల పోస్టర్స్ రిలీజ్
యంగ్ హీరో నిఖిల్; చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ మధ్యే విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్‌తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. దీనిపై ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ భక్తుల సమితి) వైస్ ప్రెసిడెంట్ రామ్‌రధన్ దాస్ కార్తికేయ 2పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో కార్తికేయగా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తుంటే.. ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కనిపిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్ పాత్రలో వైవా హర్ష నటిస్తున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. The World of #karthikeya2 is opening up… Teaser Coming soon ☺️ India's epic mystical adventure🌟🔥releasing on July 22nd @actor_Nikhil @anupamahere @AnupamPKher @harshachemudu @AdityaMenon22 @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 pic.twitter.com/wHgMj4l72B— Nikhil Siddhartha (@actor_Nikhil) June 10, 2022 చదవండి: సీక్రెట్‌గా సింగర్ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన మాజీ భర్త మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన కొత్త పెళ్లికూతురు -
Karthikeya 2 Motion Poster: సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం..
యంగ్ హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ తెరకెక్కుతున్న తాజా చిత్రం కార్తికేయ2. 2014లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘కార్తికేయ’కు సీక్వెల్ ఇది. చాలాకాలంగా నిర్మాణ దశలోనే ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకే రిలీజ్‌కు సిద్దమైంది. జులై 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘కార్తికేయ2’ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. ‘సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం’ అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. (చదవండి: సింగర్ కేకే మరణంపై అనుమానాలు!) ఓ రహస్యాన్ని చేధించేందుకు సముద్రంలో ప్రయాణిస్తున్న నిఖిల్, అనుపమ, శ్రీనివాసరెడ్డిలను ఈ పోస్టర్లో గమనించవచ్చు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఈ మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రంలో నిఖిల్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్ర పోషించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.