Actor Nikhil Shocking Comments On His Co Star Anupama Parameswaran, Details Inside - Sakshi
Sakshi News home page

Hero Nikhil: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Published Tue, Aug 2 2022 10:19 AM | Last Updated on Tue, Aug 2 2022 11:32 AM

Actor Nikhil Shocking Comments On His Co Star Anupama Parameswaran - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రస్తుతం కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. గతంలో నిఖిల్‌ నటించిన కార్తికేయ మూవీకి ఇది సీక్వెల్‌. ఆగస్ట్‌ 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్రం. అయితే ఈ ప్రమోషన్లో ఎక్కడ చూసిన నిఖిల్‌ మాత్రమే కనిపిస్తున్నాడు. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కనిపించడం లేదు. అయితే ఇప్పటికే దీనిపై అనుపమ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: సెట్‌లో ఓవరాక్షన్‌ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్‌

రాత్రి, పగలు వరుసగా షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లే తాను కార్తీకేయ 2 ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇదే ప్రశ్న నిఖిల్‌కు ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎదురైంది. ఈ సందర్భంగా నిఖిల్‌, అనుపమపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కార్తీకేయ 2 ప్రమోషన్‌లో అనుపమ కనిపించడం లేదు.. ఎందుకని అడిగిన ప్రశ్నకు నిఖిల్‌ స్పందిస్తూ.. ‘అనుపమను చూస్తే ఒక్కొసారి ఆశ్చర్యం వేస్తుంది.

చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత

తను ప్రమోషన్స్‌కు ఎందుకు రాదో తెలియదు. సెట్‌లో చాలా సరదాగా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్లాక మెసేజ్‌ చేస్తే రిప్లై ఇవ్వదు. కాల్స్‌కు సమాధానం ఉండదు. మళ్లీ మరుసటి రోజు సెట్‌కు రాగానే సరదాగా కలిసిపోతుంది. అసలు తను అర్థం కాదు. తనకి రెండు ముఖాలున్నాయి. రేపు ప్రమోషన్స్‌ ఉన్నాయని మెసేజ్‌ పెడితే చూడదు. కనీసం రిప్లై కూడా ఇవ్వదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిఖిల్‌ కామెంట్స్‌ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. నిఖిల్‌ సమాధానం విన్న పలువురు అనుపమపై మండిపడుతూ ట్రోల్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement