Anupama parmeswaran
-
స్టేజీపైనే డైరెక్టర్‌కు రాఖీ కట్టిన అనుపమ..
-
అలా చేసి ఉంటే సినిమా మరింత బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' చిత్రంపై సమీక్షను వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేసి ఉంటే మరింత బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుందని.. సెకండాఫ్‌లో కాస్త మార్చి ఉండాల్సిందన్నారు. 18 పేజెస్ టైటిల్ విన్నప్పుడే నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూసే దాకా అవీ డైరీలోని పేజీలని ప్రేక్షకులకు తెలియదు. ఒక వ్యక్తికి తన కలల సుందరి కళ్ల ముందు కనపడితే ఎలా ఉంటుందనేదే ఈ చిత్రంలో ప్రధాన కథాంశం. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే విషయాన్ని చక్కగా తెరపై చూపించారు దర్శకుడు సూర్యప్రతాప్. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..' ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన హీరో. అదే సమయంలో నందిని అనే అమ్మాయి డైరీ చదవడం.. చూడకుండానే ఆమెతో ప్రేమలో పడటం. చిన్న చిన్న ట్విస్టులతో ఫస్టాఫ్ తెరకెక్కించారు. ఫస్టాఫ్ అన్నందుకు క్షమించాలి. అందులో ప్రేమను చూపించి.. సెకండాఫ్ వచ్చేసరికి సామాజిక కోణాన్ని పరిచయం చేశారు. అయితే హీరో, హీరోయిన్స్ ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అనే సీన్స్‌ను కాస్తా అర్థమయ్యేలా చూపించి ఉంటే సినిమా బాగుండేది. ఈ విషయాన్ని దర్శకుడు సూర్యప్రతాప్తో చెప్పా. సమయం లేకపోవడం వల్ల కొన్ని సీన్స్‌ను తొలగించినట్లు చెప్పారు.'అని అన్నారు. -
పంజాగుట్టలో డైమండ్ షోరూం ప్రారంభోత్సంలో అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫోటోలు)
-
కార్తికేయ- 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లోనూ అత్యధిక వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా `కార్తికేయ 2` నిలిచింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ కార్తికేయ2 డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. -
Karthikeya 2: కేరళలో కార్తీకేయ-2 జోడి.. మలయాళంలోనూ గ్రాండ్ రిలీజ్..!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని సాధించింది. బాలీవుడ్లో ఈ మూవీ కలెక్షన్లతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాను మళయాళంలోనూ విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. మూవీ ప్రమోషన్లలో భాగంగా అఖిల్, అనుపమ కేరళలో సందడి చేశారు. తాజాగా ఈ జంట కొచ్చిన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సందడి చేసింది. ఈనెల 23న మలయాళంలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. (చదవండి: Karthikeya 2 Movie-Nikhil: శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం) కలియుగ సృష్టి రహస్యాలను పొందుపరచిన కృష్ణుని కంకణాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే యువకుని కథతో దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కీలకమైన అతిథిపాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ ఈ మూవీలో నటించారు. ఈ చిత్రానికి నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ వ్యవహరించారు. -
‘టీచరమ్మ’గా వెండితెరపై బెత్తం పట్టి అలరించిన హీరోయిన్లు
‘ఈ టీచర్ చాలా స్ట్రిక్ట్’ అనిపించుకుంది సావిత్రి ‘మిస్సమ్మ’లో. ‘ఈ టీచర్ భలే చక్కగా పాఠాలు చెబుతుంది’ అని మెచ్చుకోలు పొందింది జమున ‘మట్టిలో మాణిక్యం’లో. ‘పంతులమ్మ’ సినిమాలో లక్ష్మి పిల్లల పాఠాలే కాదు కథానాయకుని జీవితాన్ని కూడా చక్కదిద్దింది. ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ దగ్గరి నుంచి నిన్న మొన్నటి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు టీచర్ అంటే విజయశాంతే. ‘లేడీస్ టైలర్’లో రాజేంద్ర ప్రసాద్ వంటి అల్లరి స్టూడెంట్‌ని బెత్తం దెబ్బలు కొట్టి సరి చేయలేదూ అర్చన. టీచర్ పాత్రకు గ్లామర్ ఉండకపోవచ్చు గాని ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కొందరు హీరోయిన్లకే దక్కింది. అదిగో చాక్‌పీస్ ఒక చేత్తో బెత్తం మరో చేత్తో పట్టుకుని వాళ్లిటు నడిచొస్తున్నారు చూడండి. శిశువుకు అమ్మ తొలి టీచర్. స్కూల్లో ‘టీచరమ్మే’ తొలి టీచర్. నర్సరీల్లో, ఐదు లోపల తరగతుల్లో పిల్లలకు తొలిగా పరిచయం అయ్యేది ఎక్కువగా టీచర్లే. వీరే పిల్లలకు తొలుత ఆత్మీయులవుతారు. బడి పట్ల, పాఠాల పట్ల ఆసక్తి కలిగిస్తారు. ఈమె కూడా అమ్మలాంటిదే కాబట్టి భయం లేకుండా వెళ్లొచ్చు అని పిల్లలకు నమ్మకం కలిగిస్తారు. అయినా సరే ‘గురు దేవా’ అంటే మగ గురువు గుర్తుకొస్తాడు. స్త్రీల వాటా ఈ విషయంలో సమానం అయినప్పటికీ. సినిమాల్లో కూడా హీరోలు వేసిన టీచర్ పాత్రలు ఎక్కువ ఉన్నాయి. హీరోయిన్లకు తక్కువగా ఈ చాన్స్ వచ్చింది. ‘గ్లామర్’ సినిమా కమర్షియల్ సినిమా వచ్చాక ‘టీచర్’ పాత్రలో హీరోయిన్ను గ్లామరస్‌గా చూపించలేము అనే భావనతో నిర్మాత, దర్శకులు హీరోయిన్ను ‘ఒక ఆడి పాడే బొమ్మ’ స్థాయికే కుదించి పెట్టారు. అయితే అప్పుడప్పుడు మంచి టీచర్ పాత్రలు సత్తా ఉన్న నటీమణుల చేతుల్లో పడి మెరిశాయి. వాళ్లు తెర మీద ఉంటే ప్రేక్షకులు బుద్ధిగా చూసే విద్యార్థులయ్యారు. రిజల్ట్ వందకు వంద వచ్చింది. మీకు మీరే మాకు మేమే: సినిమాల్లో హీరోను చూసి హీరోయిన్ జంకడం ఆనవాయితీ. కాని ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి రామారావు జంకుతుంటాడు. దానికి కారణం ఆమె నిజాయితీ, టీచర్‌గా సిన్సియారిటీ. స్కూల్లో పిల్లలకు పాఠాలతో పాటు జమిందారు గారి కుతురికి సంగీతం పాఠాలు కూడా చెప్తుంది సావిత్రి. అంతేనా? కొంచెం నాన్ సీరియస్‌గా ఉన్న ఎన్.టి.ఆర్ తనను అందుకునేంతగా ఎదిగేలా చేసి ఒక రేవుకు చేరుస్తుంది. ‘రావోయి చందమామా మా వింతగాధ వినుమా’... ఆ రోజుల్లో టీచర్లు పాటలు పాడే పాటలు ఇంత శుభ్రంగా వినసొంపుగా ఉండేది. నా మాటే నీ మాటై చదవాలి: ‘మట్టిలో మాణిక్యం’ లో చలం అమాయకుడు. పౌరుషంతో పట్నం వస్తే టీచరైన జమున పరిచయం అవుతుంది. ప్రేమిస్తుంది. మామూలు చదువే కాదు లౌక్యంగా ఉండటానికి అవసరమైన చదువు కూడా చెబుతుంది. పాఠాలను పాటగా మార్చి ఆమె పాడే ‘నా మాటే నీ మాటై చదవాలి నేనంటే నువ్వంటూ రాయాలి’ పాట బాగుంటుంది. ఆ తర్వాతి రోజుల్లో సింగీతం శ్రీనివాసరావు హీరోయిన్ లక్ష్మితో ‘పంతులమ్మ’ సినిమా తీశాడు. ‘పంతులమ్మ’ టైటిల్‌తో ఒక సినిమా వచ్చి హిట్ కావడం విశేషం. భార్య మరణించిన వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక పంతులమ్మ అతని పిల్లలకు పాఠాలు చెబుతూ అతనిలోని ఒక అపోహను తొలగించడం కథ. ‘ఎడారిలో కోయిల’ పాట ఒయాసిస్ లా ఉంటుంది. ఆ తర్వాత ‘శుభలేఖ’ సినిమాలో సుమలత టీచర్‌గా నటించింది. కట్నం అడగడాన్ని ఎదిరించిందని ఆమె ఉద్యోగం పోతుంది. కాని ఆమె వెరవదు. ఈ దుర్యోధన దుశ్శాసన క్లాసులోని రౌడీ పిల్లాణ్ణి సరి చేయడం టీచర్ బాధ్యత. మరి సమాజంలో ఉన్న రౌడీ పిల్లాణ్ణి దండించడం? చట్టం, న్యాయం, వ్యవస్థ విఫలమైతే ఆ బాధ్యత కూడా టీచరే తీసుకుంటుంది. ‘ప్రతిఘటన’లో లెక్చరర్ అయిన విజయశాంతి ఊళ్లో అనేక ఫతుకాలకు కారణం అవుతున్న రౌడీని అంతిమంగా తెగ నరికి నిర్మలిస్తుంది. చాక్‌పీస్ పట్టిన చేతులు గొడ్డలి కూడా పట్టగలవు అని హెచ్చరిస్తుంది. ఈ టీచర్ పాత్ర తెలుగులో వచ్చిన అన్ని టీచర్ పాత్రల కంటే శక్తిమంతమైనది. క్లాసురమ్లో పిచ్చి జోకులు, లెక్చరర్ల మీద పంచ్‌లకు తావు ఇచ్చే పాత్ర కాదు ఇది. ఈ పాత్రను చూడగానే మహా మహా పోకిరి స్టూడెంట్లు కూడా సైలెంటైపోవాల్సిందే. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో’ అని విజయశాంతి పాడుతుంటే ఆ వేదనా శక్తి చసే ప్రతి విద్యార్థిలో పరివర్తన తెస్తుంది. విజయశాంతి ఆ తర్వాత ‘రేపటి పౌరులు’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల్లో కూడా టీచర్‌గా నటించింది. అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి: అతను బెస్తపల్లెలో రౌడీ. ఆమె క్రైస్తవ విశ్వాసాలు కలిగిన టీచర్. అతను హింస. ఆమె దయ. హింసను వీడి దయ వరకూ చేసే ప్రయాణాన్ని ఆ టీచర్ ఆ రౌడీలో ప్రేరేపిస్తుంది. అతని పాపాలన్నీ స్వీయ రక్తంతో ప్రక్షాళనం అవుతాయి. చివరకు అతను ఆమె ప్రేమను పొందుతాడు. రౌడీగా చిరంజీవి, టీచర్‌గా సుహాసిని ‘ఆరాధన’లో నటించారు. ‘అరె ఏమైంది’ పాట ఇప్పటికీ హిట్ ప్రేమమ్ మరికొన్ని: ఇటీవలి కాలంలో ఈ కాలపు హీరోయిన్లు కూడా టీచర్లుగా నటించారు. ‘ఘర్షణ’లో అసిన్, ‘గోల్కొండ హైస్కల్’లో కలర్స్ స్వాతి, ‘హ్యాపీ డేస్’లో కమలిని ముఖర్జీ, ‘రాక్షసుడు’లో అనుపమ పరమేశ్వరన్ టీచర్లుగా కనిపిస్తారు. మన సాయి పల్లవి మలయాళ ‘ప్రేమమ్’లో టీచర్‌గా నటించే పెద్ద క్రేజ్ సాధించింది. ఆ పాత్రను తెలుగులో శృతిహాసన్ చేసింది. -
అందుకే ముద్దు సీన్స్‌లో నటించాను : హీరోయిన్ అనుపమ
‘‘కార్తికేయ 2’ చూసినవారు బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది. నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. అది మంచి ఎనర్జీ ఇచ్చింది’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ‘‘చందూగారు ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ‘కార్తికేయ 2’లో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది.. అందుకే ఈ చిత్రం కోసం కొన్ని ప్రాజెక్ట్స్‌ను వదులుకున్నాను. కొన్ని చోట్ల హీరోను డామినేట్ చేసేలా నా పాత్ర ఉంది అనడంలో వాస్తవం లేదు.. కథకు తగ్గట్టుగానే నా పాత్ర ఉంది. ‘రౌడీ బాయ్స్’లో కథ డిమాండ్ మేరకే ముద్దు సీన్స్‌లో నటించాను. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. -
బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘కార్తికేయ 2’ .. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్‌టాక్ సంపాదించుకుంది. (చదవండి: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ) దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్స్ లభించనప్పటికీ.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.50 కోట్ల గ్రాస్, రూ.5.05 కోట్ల షేర్ వసూళ్లని రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.5.30 కోట్ల గ్రాస్, రూ.3.50 కోట్ల షేర్ కలెక్షన్స్‌ని రాబట్టి.. నిఖిల్ కెరీర్లోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘కార్తికేయ2’ నిలిచింది. నిఖిల్ గత ఐదు సినిమాల తొలిరోజు వసూళ్లని పరిశీలిస్తే.. అర్జున్ సురవరం రూ.1.38 కోట్లు, కిర్రాక్ పార్టీ రూ.1.65 కోట్లు, కేశవా రూ.1.58 కోట్లు, ఎక్కడికి పోతావు చిన్నవాడా రూ.1.25 కోట్ల షేర్స్ అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ2 తొలిరోజు కలెక్షన్స్(ఏరియాల వారిగా) ► నైజాం - రూ.1.24 కోట్లు ► సీడెడ్ -రూ.40 లక్షలు ► ఈస్ట్ - రూ.33 లక్షలు ► వెస్ట్ - రూ.20 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.45లక్షలు ► గుంటూరు- రూ.44 లక్షలు ► కృష్ణా - రూ.27 లక్షలు ► నెల్లూరు - రూ.17 లక్షలు ► మెత్తం రూ. రూ.3.50 కోట్లు(షేర్) సిని విశ్లేషకుల సమాచారం ప్రకారం... కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాసం ఉండాలి. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అందుకే ‘కార్తికేయ 2’కి స్వాతిని తీసుకోలేదు : దర్శకుడు క్లారిటీ
‘చిన్నప్పటినుండి నాకు రామాయణం, మహా భారతం పుస్తకాలు ఎక్కువగా చదవేవాన్ని. ఆలా ఇతిహాసాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండడం వలన కృష్ణతత్వం అనే పాయింట్ తీసుకొని కార్తీకేయ సినిమా చేయడం జరిగింది. దేవుడు అంటే ఒక క్రమశిక్షణ.. మనం నమ్మే దంతా కూడా సైన్స్ తో ముడిపడి ఉంటుంది. శ్రీకృష్ణుడు గురించి చెప్పడం అంటే అనంతం. శ్రీకృష్ణుడు ద్వారకాలో ఉన్నాడా లేదా అన్నది ఒక చిన్నపాయింట్ బట్టి ‘కార్తికేయ2’ తీశాను’అని దర్శకుడు చందూ మొండేటి అన్నారు. యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా దర్శకుడు చందూ మొండేటి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటితరానికి అయన గొప్ప తనం గురించి చెప్పబోతున్నాం. శ్రీకృష్ణుడు ను మోటివ్ గా తీసుకొని తీసిన ఈ సినిమాలో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. ఈ మధ్య భక్తి సినిమాలు చూడడానికి ఎవరూ ఆలా రావడం లేదని భక్తి తో పాటు అడ్వెంచర్ తో కూడుకున్న థ్రిల్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఒక కొత్త అనుభూతితో బయటకు వస్తారు. ► కార్తికేయ 1 హిట్ అవ్వడంతో ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కు ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ‘కార్తికేయ 1’లో నిఖిల్ హీరో గా చెయ్యడంతో ‘కార్తికేయ 2’ లో నటించడం చాలా ఈజీగా అయ్యింది. అందులో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తే ఇందులో డాక్టర్ గా నటించాడు. ►శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్, వైవా హర్ష,సత్య వీరందరూ బిజీగా ఉన్నా ఈ కథను, కాన్సెప్ట్, నమ్మి, మాతో ట్రావెల్ అయ్యారు. ‘కార్తికేయ 2’ లో స్వాతికి పాత్ర కు ఎక్కువ స్కోప్ లేదు. అందుకే స్వాతిని తీసుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీకు సెకెండ్ పార్ట్ లో అర్థమై పోతుంది . ► కథ హిమాచల్ ప్రదేశ్ లో నడుస్తున్నందున అక్కడి వారు అయితే బాగుంటుందని బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ ను తీసుకోవడం జరిగింది. అయన సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దేవి పుత్రుడు సినిమాకు ఈ కథకు ఎటువంటి సంబంధాలు లేవు ► ఏ కథకైనా నిర్మాతలు కొన్ని బౌండరీస్ ఇస్తారు. దాన్ని బట్టి ఈ కథను చేయడం జరిగింది. ‘కార్తికేయ 2’ కు బడ్జెట్ లో తీయడానికి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం జరిగింది.అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు మమ్మల్ని నమ్మారు. రెండు ప్యాండమిక్ స్విచ్వేషన్స్ వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకేక్కించారు.ఈ స్క్రిప్ట్ పైన నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ► కార్తికేయ రెండు పార్ట్స్ కూడా అడవెంచర్స్ కాన్సెప్ట్ తో నే తీయడం జరిగింది. ఇందులో కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్ గా ఉంటుంది. అలాగే టెక్నిషియన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వి. యఫ్. ఎక్స్ చాలా బాగా వచ్చింది. ► థియేటర్ ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్ గా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తీసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల పిల్లలు చూస్తే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే వారికి ఇతిహాసాలపై ఒక అవగాహన వస్తుంది ► నేను ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఆడియన్స్ ఈ చిత్రాన్ని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ చేస్తాను.ఈ సినిమా తరువాత నెక్స్ట్ గీతా ఆర్ట్స్ లో ఉంటుంది. రెండు సినిమా కథలు ఉన్నాయి. ఒకటి ప్రేమకథా చిత్రమైంటే ఇంకొకటి సోషల్ డ్రామా, ఈ రెంటిలో ఏ కథ ముందు అనేది ఫైనల్ కాలేదు. గీతా ఆర్ట్స్ తరువాత నాగార్జున గారితో మరో చిత్రం చేయబోతున్నాను. -
‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ కామెంట్స్ వైరల్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. గతంలో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి ఇది సీక్వెల్. ఆగస్ట్ 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్రం. అయితే ఈ ప్రమోషన్లో ఎక్కడ చూసిన నిఖిల్ మాత్రమే కనిపిస్తున్నాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కనిపించడం లేదు. అయితే ఇప్పటికే దీనిపై అనుపమ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ రాత్రి, పగలు వరుసగా షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లే తాను కార్తీకేయ 2 ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇదే ప్రశ్న నిఖిల్‌కు ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎదురైంది. ఈ సందర్భంగా నిఖిల్, అనుపమపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కార్తీకేయ 2 ప్రమోషన్లో అనుపమ కనిపించడం లేదు.. ఎందుకని అడిగిన ప్రశ్నకు నిఖిల్ స్పందిస్తూ.. ‘అనుపమను చూస్తే ఒక్కొసారి ఆశ్చర్యం వేస్తుంది. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత తను ప్రమోషన్స్‌కు ఎందుకు రాదో తెలియదు. సెట్లో చాలా సరదాగా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్లాక మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వదు. కాల్స్‌కు సమాధానం ఉండదు. మళ్లీ మరుసటి రోజు సెట్‌కు రాగానే సరదాగా కలిసిపోతుంది. అసలు తను అర్థం కాదు. తనకి రెండు ముఖాలున్నాయి. రేపు ప్రమోషన్స్ ఉన్నాయని మెసేజ్ పెడితే చూడదు. కనీసం రిప్లై కూడా ఇవ్వదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిఖిల్ కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. నిఖిల్ సమాధానం విన్న పలువురు అనుపమపై మండిపడుతూ ట్రోల్ చేస్తున్నారు. Reply ah ? pic.twitter.com/mVzhfuoqmX — CB (@G__0070) August 1, 2022 -
Karthikeya 2 Motion Poster: సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం..
యంగ్ హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ తెరకెక్కుతున్న తాజా చిత్రం కార్తికేయ2. 2014లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘కార్తికేయ’కు సీక్వెల్ ఇది. చాలాకాలంగా నిర్మాణ దశలోనే ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకే రిలీజ్‌కు సిద్దమైంది. జులై 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘కార్తికేయ2’ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. ‘సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం’ అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. (చదవండి: సింగర్ కేకే మరణంపై అనుమానాలు!) ఓ రహస్యాన్ని చేధించేందుకు సముద్రంలో ప్రయాణిస్తున్న నిఖిల్, అనుపమ, శ్రీనివాసరెడ్డిలను ఈ పోస్టర్లో గమనించవచ్చు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఈ మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రంలో నిఖిల్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్ర పోషించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. -
డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది అభిమానులను, ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న అనుపమకు తాజాగా సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. కాగా హీరోయిన్స్‌కు లిప్‌లాక్ సీన్స్ ఎంతో క్రేజ్‌ను తెచ్చి పెడతాయి. అది కూడా స్టార్ హీరోతో అయితేనే. సాధారణంగా యంగ్ హీరోలు కానీ డెబ్యూ హీరోలతో లిప్‌లాక్ సీన్ చేసేందుకు హీరోయిన్స్ ఒప్పుకోరు. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ కానీ ఓ డెబ్యూ హీరోతో కిస్ సీన్ చేసి అనుపమ ట్రోల్స్ బారిన పడింది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ చిత్రంతో అగ్ర నిర్మాత దిల్ రాజు నట వారసుడిగా ఆయన సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో హీరోయిన్గా అనపమ నటిస్తోంది. ఇప్పటి వరకు సినిమాల్లో పద్దతిగా కనిపించన అనుపమా రౌడీ బాయ్స్‌లో రెచ్చిపోయి నటించిందట. ఇక బడా నిర్మాత వారసుడి సినిమా కావడంతో ఈ మూవీని దర్శకుడు భారీగానే ప్లాన్ చేశాడు. అతడికి ఎలాగైన సక్సెస్ ఇవ్వాలని దర్శకుడు ఆరాట పడుతున్నాడు. చదవండి: అవును జాకీతో ప్రేమలో ఉన్నా, కానీ అది రూమరే.. నేనే చెప్తా: రకుల్ ఈనేపథ్యంలో రౌడీ బాయ్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు హీరోహీరోయిన్ల మధ్య భారీగానే లిప్‌లాక్ సీన్లు పెట్టారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్లో కూడా కిస్ సీన్స్ చూపించి ఆకట్టుకున్నారు మేకర్స్. కానీ ఇదే సీన్‌పై అనుపమను ట్రోల్ చేస్తూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ‘నీకంటూ వ్యక్తిగత ఇమేజ్ లేదా.. ఎంత రెమ్యునరేషన్ ఇస్తే మాత్రం కొత్త కుర్రాళ్లకు లిప్‌లాక్ ఇచ్చేస్తావా?, కిస్ సీన్ చేయడానికి ఓ స్థాయి ఉండాలి. ఎంత అగ్ర నిర్మాత వారసుడు అయితే మాత్రం.. అది చూసుకోవా? రెమ్యునరేషన్ కోసం ఇంతగా దిగజారాలా’ అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి మరికొందరైతే ఏకంగా ‘నీ నెక్ట్ సినిమా మా హీరో చేయాలని, అతడికి కూడా లిప్‌లాక్ ఇవ్వాల్సిందే’ అంటూ పలువురు హీరోల ఫ్యాన్స్ అనుపమకు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. అనుపమ మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ఈ సినిమాలో 5 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. -
హగ్ అడిగిన అనుపమ..ఫోటో షేర్ చేసిన మెహ్రీన్
►ప్రతీ చీరకు ఓ కథ ఉందంటున్న శిల్పా శెట్టి ► హగ్ అడిగిన అనుపమ ► బిగ్‌బాస్ ఫేం భానుకు విషెస్ తెలిపిన రోహిణి ► సన్ కిస్సింగ్ ఫోటోను షేర్ చేసిన మెహ్రీన్ View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాదే హీరో: దిల్ రాజు
‘‘ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ ‘రౌడీ బాయ్స్’. చాలా కాలం తర్వాత మా బ్యానర్లో వస్తున్న యూత్ ఫిల్మ్ ఇది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్‌తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేసిన అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ బాయ్స్’ సినిమాకి హీరో దేవిశ్రీ ప్రసాద్. కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు రప్పించాలంటే మొదట అందర్నీ మెప్పించేది సంగీతమే. ఆశిష్‌ను హీరోగా లాంచ్ చేస్తున్నామని, మ్యూజిక్ చేయాలని అడిగితే వారం టైమ్ తీసుకుని ఓకే అన్నాడు. దేవిశ్రీ, నా జర్నీలో అన్ని సినిమాలు వేరు.. ఈ ‘రౌడీ బాయ్స్’ వేరు. ఇద్దరి హీరోలకంటే అనుపమా పరమేశ్వరన్ పెద్దగా కనిపిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, తను బాగా చేసింది. దేవిశ్రీ తర్వాత ఈ సినిమాకి తనే సెకండ్ హీరో. దసరాకు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవలే విడుదలైన మా సినిమా టైటిల్ సాంగ్, ఇప్పుడు విడుదలైన టీజర్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు ఆశిష్. ‘‘రౌడీబాయ్స్’ లో మొత్తం 9 పాటలు ఉన్నాయి. పాటలన్నీ ఆడియన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయి’’ అన్నారు హర్ష. ‘‘రౌడీ బాయ్స్’ కి మ్యూజిక్ అందించేందుకు ‘దిల్’ రాజుగారు అడిగిన వెంటనే ఓకే చెప్పాను. ఆశిష్ సినిమాకు మ్యూజిక్ అందించడం నా బాధ్యత. ఈ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుని ఉంటే నేను ధర్నా చేసేవాణ్ణి. ‘రౌడీబాయ్స్’ సినిమాతో కాలేజీ డేస్‌ను గుర్తుచేసుకుంటారు.. యూత్ అంతా కలిసి నవ్వుకుంటూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆశిష్ నటన చూస్తే తొలి సినిమాకే ఇంత బాగా యాక్ట్ చేశాడేంటి? అనిపించింది. ఆశిష్, విక్రమ్ పోటాపోటీగా నటించారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. చదవండి: కావ్య కోసం కొట్టుకున్న 'రౌడీ బాయ్స్' -
హల్చల్: గోపికలా శ్రీముఖి.. పట్టు పరికిణిలో నవ్య స్వామి
► చిన్ని కృష్ణుడిలా చిరంజీవి-మేఘన సర్జా కొడుకు ► కూతురిని కృష్ణని గెటప్‌లో రెడీ చేసిన నటి అంజలి ► జన్మాష్టమి విషెస్ తెలిపిన హీరోయిన్ సదా ► ఆన్ ది వే ఫోటోలు అంటున్న ఆలియా భట్ ► గోపిక గెటప్‌లో యాంకర్ శ్రీముఖి ► గోపికలా ఎంతో అందంగా ముస్తాబైన కాజల్ ► పట్టు పరికిణిలో నవ్య స్వామి ► పీచ్ కలర్ చీరలో మహి నవ్వులు ► లంగా ఓణి అంటే లవ్ అంటున్న హరితేజ ► ఆలోచనల్లో మార్చిపోయానంటున్న అషూ రెడ్డి View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
హల్చల్ : స్విమ్మింగ్ పూల్‌లో సనయా.. సెలబ్రేషన్స్‌లో లాస్య
► సెలబ్రేషన్స్ టైం అంటున్న యాంకర్ లాస్య ► పింక్ కలర్ లెహంగాలో శ్రీముఖి ఫోజులు ► అనుపమ అందాల పరువాలు ► ఉపాసన ఇంట పెళ్లి బాజాలు ► సండే వైబ్స్‌ని ఎంజాయ్ చేస్తున్న సనయా ఇరానీ ► నాగార్జునకు బర్త్‌డే విషెస చెప్పిన దియా మీర్జా ► శ్రావణమాసం ట్రెడిషనల్ లుక్‌లో హరితేజ View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Sanaya Irani (@sanayairani) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) -
హల్చల్ : పరికిణిలో శ్రీముఖి..జడ్జ్ చేయొద్దన్న అనసూయ
► పసుపు రంగు చీరలో ముస్తాబైన నవ్య స్వామి ► పెళ్లికూతురిలా కృతిసనన్ ► నన్ను జడ్జ్ చేయొద్దన్న యాంకర్ అనసూయ ► పరికిణిలో యాంకర్ శ్రీముఖి ► అందమైన కురులతో అనుపమ క్యూట్ లుక్స్ ► నిశ్చితార్థం చేసుకున్న బుల్లితెర నటి అన్షురెడ్డి ► గులాబీ రంగు కుర్తీలో నటి కృష్ణ ముఖర్జీ View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sushma kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by HK (@realhinakhan) -
ఆ అలవాటుకు బానిసయ్యా: అనుపమ
అందం అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్ల జాబితాల ముందు వరుసలో ఉండే అనుపమ పరమేశ్వరన్ అదృష్టం పరంగా మాత్రం కాస్త వెనక ఉందనే చెప్పాలి. కెరీర్ మొదట్లో ‘ప్రేమమ్’, ‘అఆ’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించినా, ఆ ఫేమ్‌ను నిలకడగా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఇటీవల కెరీర్ పరంగా కాస్త స్లో అయ్యింది ఈ అమ్మడు. ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం తన హవాను కొనసాగిస్తోంది ఈ కేరళ బ్యూటీ. తాజాగా అనుపమ ఒకదానికి బానిసలా మారిపోయినట్లు చెప్పగా ఆ వార్త నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఓ వైపు నటన, మరో వైపు క్యూట్ లుక్స్‌తో ఉండే అనుపమకు ఇటీవల సినిమా ఆఫర్లు పెద్దగా లేవనే తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ లో నటిస్తోంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తానొక వ్యక్తిని ప్రేమించినట్లు, చివరకి బ్రేకప్ కూడా జరిగిందంటూ తెలిపిన అనుపమ.. తాజాగా ఇన్‌స్టాలో గిబ్బరిష్ గేమ్‌కు బానిసలా మారిపోయినట్లు తెలిపింది. ఈ ఆటలో కొన్ని విచిత్ర పదాలు మనకు స్క్రీన్‌పై కనపడతాయ్. అందులో మనం పలికే తీరును బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టేయవచ్చు. ఇప్పుడు ఈ ఆటని అనుపమ ఆడటం కాదండోయ్.. దానికి తాను ఎంతగానో బానిస అయినట్లు తెలిపింది. -
హల్చల్: బుట్టబొమ్మ కవ్వింపు, కేక పుట్టిస్తున్న ప్రగ్యా
► దేవకన్యలా నడుచుకుంటూ వస్తున్న తమన్నా, ఇదే సమయం అంటున్న మిల్కీ బ్యూటీ ► బ్లాక్టాప్లో కవ్విస్తున్న బుట్టబోమ్మ ► ‘పార్దు ఇంకోసారి చూసి చెప్పు’ అంటూ అతడులో త్రిషను ఫాలో అవుతున్న మెగా డాటర్ నిహారిక ► పెంపుడు కుక్కతో అలా కుర్చిలో వాలిపోయాయిన సమంత ► ఇదే ఆనందం అంటున్న అనుపమ పరమేశ్వరన్ ► పెద్ద కూతురు బర్త్‌డే పోస్టు షేర్ చేసిన మెగా డాటర్ శ్రీజ ► లేజీ సండే అంటూనే బెడ్‌పై కేకపుట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreeja (@sreeja_kalyan) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) -
Anupama Parameswaran: కేరళ సీఎం ఫండ్‌కు అనుపమ విరాళం
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. సామాన్య జనం నుంచి సినీ రాజకీయ ప్రముఖులను సైతం కరోనా వెంటాడుతోంది. రోజుకు వేలల్లో మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంది. అక్కడ ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఉండటంతో సామాన్య ప్రజలకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వానికి తోడుగా సినీ నటీనటులు, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందిస్తున్నారు. తాజా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ‘చీఫ్ మినిస్టర్స్ డిస్‌స్ట్రెస్ రీలీఫ్ ఫండ్ కేరళ’(సీఎండీఆర్‌ఎఫ్‌కే)కు తన వంతు సాయంగా విరాళం అందించారు. అనుపమ విరాళం ఇచ్చినట్లుగా సీఎండీఆర్‌ఎఫ్‌కే సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఆ సర్టిఫికెట్ ఫొటోను ట్విటర్లో అనుపమ షేర్ చేస్తూ అందరిని విరాళం ఇవ్వాల్సిందిగా పిలుపు నిచ్చారు. ‘నా వంతు విధిని నిర్వర్తించాను.. ప్లీజ్ మీరు కూడా కాస్తా సాయం చేయండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. Have done my part... pls contribute that little you can !!! https://t.co/aExMt4W5h4 pic.twitter.com/BzuM87TliO — Anupama Parameswaran (@anupamahere) April 25, 2021 -
మోనాల్ అందాలు..ఏంజెల్‌ని మర్చిపోయానన్న ఆర్జీవీ
ఆదివారం వీటితో గడిపానంటూ.. తన పెంపుడు కుక్కలతో కలిసి ఉన్న ఫోటోని అభిమానులతో షేర్ చేశాడు యంగ్ హీరో నాగశౌర్య కోపంగా ఉందంటున్న అనుపమ పరమేశ్వరన్ త్వరలోనే తల్లి కాబోతున్నట్లు యాంకర్ సమీర ప్రకటించింది. భర్తతో కలిసి టీ షర్ట్ల మీదే అసలు విషయాన్ని చెప్పింది. ఈ ఏంజెల్ ఎవరో మర్చిపోయానంటూ ఓ ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా నటి, నిర్మాత ఛార్మి ఒక ఫొటో పోస్టు చేసింది. పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న మోనాల్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
ఆకట్టుకుంటున్న ‘రౌడి బాయ్స్’ మోషన్ పోస్టర్
హుషారు దర్శకుడు హర్ష కొనుగంటి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ మూవీతో ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆశిష్‌కు జోడిగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశ్లో ఉన్న ఈ మూవీ మెషన్ పోస్టర్‌ను తాజా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, మేడికల్ కాలేజీ విద్యార్థుల మధ్య సాగే కథే ఈ రౌడీ బాయ్స్. ‘మా బాయ్స్తోటి ఎంట్రీ ఇస్తే అల్లకల్లోలం.. జర ముట్టుకుంటే అంటుకుంటాం అగ్గిపుల్లలం..’ అంటూ సాగే పాటతో విడుదలైన ఈ మోషన్ పోస్టర్ యువతను వీపరితంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా జూన్ 25న ఈ మూవీ విడుదల కానుంది. -
బుమ్రాతో పెళ్లిపై అనుపమ తల్లి క్లారిటీ
టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టు నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆయన పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడని అందుకే అతడు ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ వదులుకున్నట్లు ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ లక్కీ గర్ల్ ఎవరని ఆరా తీశారు బుమ్రా అభిమానులు. గతంలో తన ఫేవరెట్ క్రికెటర్ బుమ్రా అని, అతడంటే ఇష్టమని దక్షిణాది భామ, ప్రముఖ హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బుమ్రా, అనపమాలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వచ్చాయి. ఈ క్రేజీ రూమర్ కాస్తా నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్ స్పందించారు. మాలయాళ పోర్టల్‌తో మాట్లాడుతూ.. వారిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ‘తన కూతురు అనుపమ, బుమ్రాలు కేవలం స్నేహితులు మాత్రమే. వారిపై పెళ్లంటు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఒక తెలుగు సినిమా షూట్ కోసం అనుపమా గుజరాత్ వెళ్లింది తప్ప మరే కారణం లేదు’అని ఆమె స్పష్టం చేశారు. అంతేగాక ఈ వార్తలు రావడంతో అనుపమ, బుమ్రాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరూ అన్‌ఫాలో చేసుకున్నారని కూడా చెప్పారు. ఓ మూవీ షూటింగ్ సమయంలో అనుపమా, బుమ్రాలు తొలిసారిగా ఓ హోటల్లో కలుసుకున్నారని అదే చివరిది అని పేర్కొన్నారు. కేవలం దాన్ని ఆధారంగా చేసుకుని వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సృష్టించడం సరైనది కాదని ఆమె అన్నారు. దీంతో తాజాగా మరో యువతి పేరు తెర మీదకు వచ్చింది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు సంజనా గణేషన్‌ను బుమ్రా పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్ 7 తో కెరీర్ ఆరంభించారు. అయితే ఇది ఎంతవరకు నిజమన్న దానిపై క్లారిటి లేదు. చదవండి: హీరోయిన్ కాదు: బుమ్రాను పెళ్లాడేది ఆమేనా! ఆ హీరోయిన్ని బుమ్రా పెళ్లాడబోతున్నాడా? -
హీరోయిన్ కాదు: బుమ్రాను పెళ్లాడేది ఆమేనా!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్న నాటి నుంచి టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని, ఆ ఏర్పాట్లలో భాగంగానే ఈ ఫాస్ట్‌బౌలర్ సెలవు తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి బుమ్రాను వివాహమాడనున్న ఆ అమ్మాయి ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది ప్రముఖ హీరోయిన్ అనుపమా పరమేశ్వర్‌ను బుమ్రా వధువుగా పేర్కొంటూ ఇప్పటికే గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేసిన సంగతి తెలిసిందే. బుమ్రా తన ఫేవరెట్ క్రికెటర్ అని గతంలో ప్రకటించిన అనుమప.. ఇటీవల అతడి స్వస్థలం గుజరాత్‌ను సందర్శించిన ఫొటోలు షేర్ చేయడంతో ఈ మేరకు వదంతులు ప్రచారమయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మరో యువతి పేరు తెర మీదకు వచ్చింది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు సంజనా గణేషన్‌ను బుమ్రా పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్ 7 తో కెరీర్ ఆరంభించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె, ఐపీఎల్ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రాతో ఏర్పడిన పరిచయం, పరిణయానికి దారి తీసిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య బుమ్రా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడని వినికిడి. అయితే వధువు ఎవరన్న విషయంపై మాత్రం ఇంతవరకు సస్పెన్స్ వీడటం లేదు! అయితే, హాలిడే మూడ్‌లో ఉన్నానంటూ అనుపమ, బుగ్గలకు పసుపు, కుంకుమ రాసుకున్న ఫొటో షేర్ చేయడంతో మెజారిటీ మంది అనుపమే ఆ లక్కీ గర్ల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఆ హీరోయిన్ని బుమ్రా పెళ్లాడబోతున్నాడా? Bumrah & Anupama ?? Something is Fishy 🐱#SarkaruVaariPaata @urstrulyMahesh pic.twitter.com/xdFXpYnfZk — Uday S V P 🔔 (@Udayvarma1882) March 4, 2021 Bumrah and Sanjana?? Reallyyy?? — ROSHNI✨ (@roshni45_) March 3, 2021 I'm following all family members of Kohli (his wife included obviously). Then by twitter logic I-😍🤡 — An (@art_chieverr) March 3, 2021 -
ఎక్కువ చిత్రాలు చేయాలనే ఉంది
‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ఇప్పటివరకూ చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చాయి. కానీ, ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో మా సినిమా ఉంటుంది. ఆ పాయింట్‌ని ఈ యాంగిల్లో కూడా చూడొచ్చా! అనేలా స్టోరీని తీర్చిదిద్దారు. కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో.. ఫైనల్ ఔట్పుట్ చూసినప్పుడూ అంతే ఎంజాయ్ చేశా’’ అని రామ్ అన్నారు. ఆయన హీరోగా అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా రేపు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్ పంచుకున్న విశేషాలు... ∙ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో నాది సాఫ్ట్వేర్ ఇంజినీర్ పాత్ర. పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన యువకుడిగా నటించాను. ∙త్రినాథరావు, రైటర్ ప్రసన్న మధ్య మంచి ర్యాపో ఉంది. త్రినాథరావు ఒక ప్రేక్షకుడిలా సీన్‌ని పరిశీలిస్తుంటారు. ప్రసన్న పాత్రల గురించి సెట్స్‌లో వివరిస్తూ ఉంటారు. ఒక సన్నివేశం చేసేటప్పుడు నేను, డైరెక్టర్, రైటర్ డిస్కస్ చేసుకున్న తర్వాతే షూట్‌కి వెళతాం. ∙త్రినాథరావు ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ మాస్ ఓరియంటెడ్. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ని మిక్స్ చేసి తెరకెక్కించారు. ఆయన గత చిత్రాల్లో హీరోయిన్ తండ్రితో హీరో చాలెంజ్ చేసే స్టైల్లో ఉంటుంది. ఈ సినిమాలో అలా కాకుండా ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ∙సక్సెస్ కావాలని నేను సినిమాలు చేయను. ప్రతి సీన్ సక్సెస్ కావాలని అనుకుంటాను. అలాంటి సమ యాల్లో కథ వర్కవుట్ అయితే సక్సెస్ అవుతాయి. రిలీజ్ తర్వాత ఫలితాన్ని అనలైజ్ చేసుకుంటా. నా దగ్గరి వాళ్లతో డిస్కస్ చేస్తా. ∙ఈ సినిమా ప్రధానంగా ప్రకాష్‌రాజ్, అనుపమ పరమేశ్వరన్, నా మధ్యనే రన్ అవుతుంది. సన్నివేశాల పరంగానే కామెడీ ఉంటుంది. ఇందులోని మెయిన్ పాయింట్, డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉంటాయి. ∙ఓ హీరోగా ఎక్కువ సినిమాలు చేయాలని నాకూ ఉంది. అయితే నన్ను ఎగై్జట్ చేసే కథలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మా పెదనాన్నగారు(‘స్రవంతి’ రవికిషోర్) కూడా కథలు వింటారు. నాకు ఏమాత్రం నచ్చుద్ది అని ఆయనకు అనిపించినా నన్ను కథ వినమంటారు. ∙దర్శకుడు ప్రవీణ్ సత్తారుగారితో కొన్ని కారణాల వల్ల సినిమా ముందుకెళ్ల లేదు. భవిష్యత్‌లో ఓ సినిమా చేస్తా. నా తర్వాతి ప్రాజెక్టు కోసం ప్రస్తుతం కథలు వింటున్నాను. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ∙‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రం తర్వాత ‘దిల్’ రాజుగారితో మరో సినిమా చేయాలనుకున్నా సరైన కథ కుదరలేదు. రాజుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమా బాగా రావాలనే తపన ఉన్న వ్యక్తి. అందుకే సినిమా మేకింగ్‌లో బాగా ఇన్ వాల్వ్ అవుతారు. -
మారొచ్చు ట్రెండు!
నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు ప్రకాశ్‌రాజ్. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘సాక్ష్యం’ సినిమాకు ఆయన వాయిర్ ఓవర్ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడాయన ‘హలో గురు ప్రేమకోసమే...’ సినిమా కోసం హీరో రామ్‌తో కలిసి పాట పాడారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ‘ఫ్రెండ్ కోసం మారొచ్చు ట్రెండు’ అనే పాటను కలిసి పాడారట రామ్ అండ్ ప్రకాశ్‌రాజ్. ఈ పాటను త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా ఈ నెల 18న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అభిలాషకి జరిగినట్లుగానే తేజ్‌కి జరిగింది – సాయిధరమ్ తేజ్
‘‘ఈ సినిమా టోటల్ క్రెడిట్ హీరో సాయిధరమ్ తేజ్‌కే చెందుతుంది. ఎందుకంటే నాకు తేజ్ డేట్స్ ఇచ్చిన ఏడాదిన్నర వరకు మంచి కథలు దొరకలేదు. ఓ రోజు ఫోన్ చేసి ‘నేను ఒక కథ విన్నాను. నాకు నచ్చింది, మీకు న చ్చితే ఆ సినిమా చేద్దాం’ అని తేజ్ అన్నారు. కరుణాకరన్ వచ్చి కథ చెప్పారు. నాకు నచ్చటంతో సినిమా స్టార్ట్ అయ్యింది. యూత్‌ను ఆకట్టుకునే సినిమా ఇది. నా బ్యానర్లో ఎన్నో íß ట్ సినిమాలు నిర్మించాను. వాటికి ఏ మాత్రం తగ్గకుండా మా బ్యానర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీస్ అవుతుంది’’ అన్నారు కేయస్ రామారావు. సాయిధరమ్ తేజ్ , అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యూ’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. పలువురు సినీ పి.ఆర్.ఓ (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్)ల సమక్షంలో సాయిధరమ్, ఇంద్ర ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం సాయిధరమ్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు నటించిన ‘అభిలాష’ సినిమా పబ్లిసిటీ పి.ఆర్.ఓలు, జర్నలిస్టులతో ప్రారంభమైందని విన్నాను. నేను నటించిన ‘తేజ్’ సినిమా ట్రైలర్కూడా పి.ఆర్.ఓల సమక్షంలో జరగటం ఆనందంగా ఉంది. కరుణాకరన్‌గారు మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. కేయస్ రామారావుగారికి కథ నచ్చాకే సినిమాను స్టార్ట్ చేశాం. మంచి సినిమా తీశాం. గోపీసుందర్ సంగీతం, ‘డార్లింగ్’ స్వామి మాటలు, ఆండ్రూ కెమెరా పనితనం, సాహీ సురేశ్ ఆర్ట్ డైరెక్షన్ సినిమాకు ఎస్సెట్స్‌గా నిలుస్తాయి. ప్రతి ఒక్కరికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమాలో లవ్ ఫీల్ ఉంది. కరుణాకరన్‌గారికి మంచి హిట్, కేయస్ రామారావు గారికి బాగా డబ్బు రావాలి’’ అని మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి అన్నారు. -
హీరోయిన్ టార్చర్ పెట్టింది..ఇదిగో ప్రూఫ్
-
‘లవ్ యూ మామయ్య’
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘తేజ్ ఐ లవ్ యూ’. నిన్న (జూన్ 9) జరిగిన ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ రాకతో ఈ ఫంక్షన్‌కు క్రేజ్ ఏర్పడింది. వేడుకలో చిరు ప్రసంగం కూడా అందరిని ఆకట్టుకుంది. కే ఎస్ రామారావు, తనకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకోవడం, తొలిప్రేమ సినిమా గురించి మాట్లాడుతూ పవన్ టాపిక్ తీయడం మెగా అభిమానులను అలరించింది. అయితే ఈ వేడుకకు హాజరైనందుకు చిరంజీవికి మెగా మేనల్లుడు ధన్యవాదాలు తెలియజేశారు. వేడుకలోనే ధన్యవాదాలు తెలిపినప్పటికీ మళ్లీ ఈ రోజు సోషల్ మీడియా వేదికగా తన కృతజ్ఞతలను తెలియజేశారు. ‘ థ్యాంక్యూ సో మచ్ మామయ్య.. మీరు ఫంక్షన్‌కు వచ్చి మా జీవితాల్లో నింపిన ఆనందాలను మా జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఉంటాం. లవ్ యూ మామయ్య- తేజ్ ఐ లవ్ యూ బృందం’ అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. Thank you so much mamayya .... you made our lives special.......your presence gave us memories that we would cherish throughout our lives... love you mamayya ❤️ -team Tej I love you pic.twitter.com/ruq5vBX5bm — Sai Dharam Tej (@IamSaiDharamTej) June 10, 2018 -
లాట్ మొబైల్స్ డిస్కౌంట్ ఆఫర్స్
ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ రిటైల్ సంస్థ ‘లాట్ మొబైల్స్’ తాజాగా బ్లాక్‌బస్టర్ డీల్స్ పేరిట పలు ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు ఈ ఆఫర్లలో భాగంగా మొబైల్ కొనుగోలుపై టీవీలు, టవర్ ఫ్యాన్లు, రైస్కుక్కర్లను ఉచితంగా పొందొచ్చని కంపెనీ తెలిపింది. అలాగే మొబైల్స్‌పై 55 శాతం వరకు, బ్రాండెడ్ యాక్ససరీస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని, 0 శాతం ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొంది. బ్లాక్‌బస్టర్ డీల్స్‌లో భాగంగా 1 జీబీ ర్యామ్ ఫోన్‌ను రూ.2,999లకు, 2 జీబీ ర్యామ్ ఫోన్‌ను రూ.4,999లకు, 3 జీబీ ఫోన్‌ను రూ.5,999లకు, 4 జీబీ ఫోన్‌ను 8,999లకు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. -
స్క్రీన్ టెస్ట్
1. ఓ సినిమా కోసం మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్ చేశారు. ఆ సినిమా ఏదో తెలుసా? ఎ) 1 నేనొక్కడినే బి) బిజినెస్ మేన్ సి) పోకిరి డి) ఖలేజా 2. భారతదేశ విశిష్ట పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్... ఈ మూడు పురస్కారాలను దక్కించుకున్న ఏకైక భార తీయ సినీ నటుడెవరు? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) యన్టీ రామారావు సి) చిరంజీవి డి) అమితాబ్ 3. ‘వీర మహాదేవి’ అనే చిత్రంలో నటిస్తున్న హాట్ గర్ల్ ఎవరో తెలుసా? ఎ) షెర్లిన్ చోప్రా బి) సన్నీ లియోన్ సి) మల్లికా శెరావత్ డి) పూనమ్ పాండే 4. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) శ్రుతీహాసన్ బి) కృతీ సనన్ సి) పూజా హెగ్డే డి) అదితీరావ్ హైదరీ 5. దర్శకుడు కోడి రామకృష్ణ.. దాసరి నారాయణరావు శిష్యుడు. గురువుకు, శిష్యునికి దర్శకులవ్వటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఒక్కరే. ఆ నిర్మాత ఎవరు? ఎ) నాగిరెడ్డి–చక్రపాణి బి) దుక్కిపాటి మధుసూదనరావు సి) కె. రాఘవ డి) డి. రామానాయుడు 6. ‘అవతలి వాళ్లని మనం ఎంత కోరుకుంటున్నామో అది మన కళ్లల్లో కనిపించాలి’.. అనే డైలాగ్ రాసిన రచయితెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఈ డైలాగ్ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలోనిది) ఎ) అబ్బూరి రవి బి) కోన వెంకట్ సి) మేర్లపాక గాంధీ డి) బుర్రా సాయిమాధవ్ 7. బాలీవుడ్లో నానాపటేకర్ నటించిన ‘క్రాంతివీర్’ తెలుగు రీమేక్‌లో నానా స్థానంలో నటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) శోభన్ బాబు బి) మోహన్ బాబు సి) నాగార్జున డి) వెంకటేశ్ 8. ‘ఓ సుబ్బారావో, ఓ అప్పారావో, ఓ వెంకట్రావో, ఓ రంగారావో ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా..’ అనే పాటను రాసింది పాటల రచయిత కాదు ఓ దర్శకుడు. ఆ దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండ రామిరెడ్డి బి) కోడి రామకృష్ణ సి) కె. రాఘవేంద్ర రావు డి) దాసరి నారాయణరావు 9. హీరో కృష్ణతో ఎక్కువ సినిమాల్లో (50 చిత్రాలు) హీరోయిన్గా నటించిన హీరోయిన్ విజయనిర్మల. ఆమె తర్వాత ఆయన సరసన ఓ హీరోయిన్ 45 సినిమాల్లో నటించారు. ఆ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) శారద బి) జయప్రద సి) విజయశాంతి డి) జయసుధ 10. ‘చారులత’ సినిమాలో అవిభక్త కవలలుగా నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) అంజలి బి) ప్రియమణì æ సి) స్నేహ డి) హన్సిక 11. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పటివరకు చేసిన తెలుగు సినిమాలెన్నో ఓ సారి లెక్కెట్టండి? ఎ) 12 బి) 15 సి) 18 డి) 19 12. వేల్ రికార్డ్స్ ఆడియో కంపెనీ అధినేత ఎవరో తెలుసా? చిన్న క్లూ: ఆమె ఓ ప్రముఖ సంగీత దర్శకుని సతీమణి. ఎ) వల్లీ బి) రమా సి) సునీత డి) కౌసల్య 13. ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు బాలీవుడ్లో వచ్చిన ‘క్వీన్’ సినిమా తెలుగు రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. ‘అ’ని నిర్మించింది ఓ ప్రముఖ తెలుగు హీరో. ఎవరా హీరో? ఎ) సందీప్ కిషన్ బి) నాగశౌర్య సి) నాని డి) నాగచైతన్య 14. నాగార్జున, అమల వివాహ తేదీ జూన్ 11. ఏ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది? ఎ) 1990 బి) 1989 సి) 1995 డి) 1992 15. ‘పండగ చేస్కో’ సినిమాలో రామ్ సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. అందులో ఒకరు రకుల్ ప్రీత్‌సింగ్, మరో హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) అనుపమా పరమేశ్వరన్ బి) తమన్నా సి) సోనాల్ చౌహాన్ డి) మాళవికా శర్మ 16. ఈ మధ్యే 75 చిత్రాల క్లబ్లో చేరిన సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) అనూప్ రూబెన్స్ బి) యస్.యస్. తమన్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) సాయి కార్తీక్ 17. ఇటీవల రిలీజైన బాలీవుడ్ చిత్రం ‘రాజీ’ 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) కరీనా కపూర్ బి) కత్రినా కైఫ్ సి) ఆలియా భట్ డి) డయానా పెంటీ 18. 1961లో ఎన్టీఆర్ నటించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఆయన నటుడు కూడా. ఎ) ఎన్టీఆర్ బి) అక్కినేని సి) కాంతారావు డి) యస్వీ రంగారావు 19. ఈ ఫొటోలోని చిన్నారి ఎవరు? ఎ) నిత్యామీనన్ బి) అనుపమా పరమేశ్వరన్ సి) ఆలియా భట్ డి) శోభన 20. ఈ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పుకోండి? ఎ) మిస్సమ్మ బి) గుండమ్మకథ సి) అన్నపూర్ణ డి) దొంగరాముడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) బి 4) సి 5) సి 6) సి 7) బి 8) డి 9) బి 10) బి 11) బి 12) ఎ 13) సి 14) డి 15) సి 16) బి 17) సి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్ లుక్
‘ఉన్నది ఒకటే జిందగీ’తో సక్సెస్ సాధించారు రామ్. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ వంటి హిట్ మూవీస్ తీశారు డైరెక్టర్ త్రినాథ్‌రావు నక్కిన. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మరో లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ తెరకెక్కుతోంది. ఒకప్పటి హిట్ సాంగ్ హలో గురు ప్రేమ కోసమోరా జీవితం...అంటూ సాగే ఆ పాటనే సినిమా టైటిల్‌గా ఎంచుకున్నారు. త్రినాథ్‌రావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్ లుక్‌ను ఈరోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. -
హలో గురు ప్రేమ కోసమే
లైఫ్‌లో లవ్ పార్ట్ సెపరేట్ గురూ! ఆ మజానే వేరు. అందుకే ప్రేమ కోసం ఎంత దాకా అయినా వెళ్లాలి. ఏం చేయడానికైనా తెగించాలి అంటున్నారు హీరో రామ్. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రానికి ‘హలో గురు ప్రేమకోసమే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ చదవగానే ‘హలో గురూ ప్రేమకోసమే రోయ్ జీవితం..’ అని ‘నిర్ణయం’లో నాగార్జున సందడి చేసిన పాట గుర్తొస్తోంది కదూ. ఆ సంగతలా ఉంచితే.. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమా తర్వాత మరోసారి రామ్‌కు జంటగా ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వంశీ పైడిపల్లి క్లాప్ ఇవ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాతలు ఎర్నేని నవీన్, ‘స్రవంతి’ రవికిషోర్ స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కు అందించారు. దర్శకుడు హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘‘రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12న స్టార్ట్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నారు’’ అని చిత్రబృందం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి. -
‘హలో గురు ప్రేమ కోసమే’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది. నాని హీరోగా నేనులోకల్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు . ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (గురువారం) ప్రారంభమైంది. రొమాటింక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కిన ఉన్నది ఒకటే జిందగీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను రామ్ కు జోడిగా నటించిన అనుపమా పరమేశ్వరన్, తాజాగా హలో గురు ప్రేమ కోసమే సినిమాలోనూ రామ్‌తో జోడీకడుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మరోసారి రామ్‌కు జతగా..!
ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. కమర్షియల్ సక్సెస్ లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న రామ్, నెక్ట్స్ సినిమాతో ఆ లోటు కూడా తీర్చేసుకోవాలని భావిస్తున్నాడు. త్వరలో త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో తొలిసారిగా జతకట్టిన ఈ జోడి మరోసారి హిట్ పెయిర్‌గా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. -
స్క్రీన్ టెస్ట్
ఈ ఏడాదిలోఇప్పటివరకు రిలీజైనసినిమాల్లోనిపాటలకుసంబంధించినక్విజ్ ఇది.ఈ వారంస్పెషల్. ► ‘వచ్చిండే పిల్ల మెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కెట్ ఏసిండే ’ అంటూ చంగు చంగున గంతులేసిన మళయాల కుట్టి ఎవరు? ఎ) అనుపమా పరమేశ్వరన్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) నివేధా థామస్ డి) సాయిపల్లవి ► ‘స్వింగ్ జరా’ అనే స్పెషల్ పాటలో తన స్వింగ్‌ను 70 యంయం స్క్రీన్‌పై చూపించిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) అనుష్క బి) తమన్నా భాటియా సి) కాజల్ అగర్వాల్ డి) అంజలి ► ‘నీ కళ్ల లోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా’ అనే పాటను పాడిన అచ్చ తెలుగు పాటగాడెవరో తెలుసా? ఎ) రేవంత్ బి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం సి) దీపు డి) హేమచంద్ర ► ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో‘వాటమ్మా వాటీస్ దిసమ్మా’ అనే పాటను పాడింది, సంగీత దర్శకత్వం వహించింది ఒక్కరే. ఎవరా సంగీత దర్శకుడు? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) అనూప్ రూబెన్స్ సి) జిబ్రాన్ డి) ఆర్పీ పట్నాయక్ ► ‘భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి’ అనే పాటను ఆలపించిన ప్రముఖ గాయకుడు? ఎ) దలేర్ మెహందీ బి) కైలాశ్ ఖేర్ సి) యాసిన్ నిజార్ డి) విజయ్ ప్రకాశ్ ► ‘ఓ సక్కనోడా దాడి చేసినావ దడదడ, కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంతకాలం’ అని బాక్సర్ రిథికాసింగ్ ఏ హీరో వెంటపడుతుంది? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) వరుణ్ తేజ్ డి) సాయిధరమ్ తేజ్ ► ‘పడమటి కొండల్లో వాలిన సూరీడా’ అనే పాటను పాడింది సింగర్ కాలభైరవ. అతను ఏ సంగీత దర్శకుని కుమారుడు? ఎ) యంయం కీరవాణి బి) మణిశర్మ సి) ఇళయరాజ డి) చక్రవర్తి ► ‘డియో డియో డిసక డిసక’ పాటలో దుమ్ము రేపే స్టెప్పులు వేసిన హాట్ గాళ్ ఎవరు? ఎ) రాఖీ సావంత్ బి) సన్నీ లియోన్ సి) బిపాసా బసు డి) మలైకా అరోరా ► ‘అడిగా అడిగా’ అని ‘నిన్ను కోరి’సినిమాలోని సూపర్‌హిట్ పాటనుపాడిందెవరు? (ఈ పాటను తనేపాడినట్లు నాని ప్రమోషన్ సాంగ్లోకూడా నటించారు) ఎ) శ్రీరామచంద్ర బి) దీపు సి) ఆల్ఫాన్స్ జోసఫ్ డి) సిద్ శ్రీరామ్ ► ‘జోగేంద్ర జోగేంద్ర’ అని ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో వచ్చే పాటకు సంగీత దర్శకత్వంవహించిందెవరు? ఎ) కళ్యాణి మాలిక్ బి) అనూప్ రూబెన్స్ సి) యం.యం. శ్రీలేఖ డి) సాయికార్తీక్ ► ‘వేయి నామాల వాడ వెంకటేశుడా’ అంటూ ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కృష్ణమ్మ పాత్రను పోషించిన నటి ఎవరు? ఎ) రెజీనా కసాండ్రా బి) కేథరిన్ థెరిస్సా సి) అనుష్క శెట్టి డి) ప్రగ్యా జైస్వాల్ ► ‘భ్రమరాంభకు నచ్చేశాను’ అనే పాటను నాగచైతన్యఏ హీరోయిన్ని ఉధ్దేశించి పాడతాడు? ఎ) హన్సిక బి) సమంత సి) లావణ్య త్రిపాఠి డి) రకుల్ ప్రీత్ సింగ్ ► ‘నక్షత్రం’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో నటించిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) రాశీ ఖన్నా బి) శ్రియ సి) హెబ్బా పటేల్ డి) చార్మీ ► సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 2017వ సంవత్సరంలో ఎన్ని తెలుగుసినిమాలకు సంగీతం అందించారు? ఎ) 8 బి) 14 సి) 10 డి) 12 ► ‘రాజుగారి గది 2’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? ఎ) యస్.యస్. తమన్ బి) గోపిసుందర్ సి) జిబ్రాన్ డి) మహతి ► చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి సంబంధించి పాటల్లో ఏ పాట వివాదం అయింది? ఎ) నీరు నీరు బి) రత్తాలు రత్తాలు సి) అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు డి) యు అండ్ మి ► ‘సిసిలియా సిసిలియా’ అనే పాట‘స్పైడర్’ సినిమాలోనిది. ఈ పాటకుసంగీత దర్శకత్వం వహించిన తమిళ సంగీత దర్శకుడెవరు? ఎ) ఏ.ఆర్. రహమాన్ బి) హారిస్ జయరాజ్ సి) ఇళయరాజ డి) అనిరుద్ ► ‘గున్న గున్న మామిడి’ అనేపాపులర్ ఫోక్ సాంగ్‌ను ఏతెలుగు కమర్షియల్సినిమాలో వాడారు? ఎ) నిన్ను కోరి బి) నేను లోకల్ సి) రాజా ది గ్రేట్ డి) ఫిదా ► ‘మధురమే ఈ క్షణము’ అనే పాట అర్జున్ రెడ్డి సినిమాలోనిది. ఈ పాట రచయిత ఎవరు? ఎ) చంద్రబోస్ బి) రామజోగయ్య శాస్త్రి సి) శ్రేష్ఠ డి) శ్రీమణి ► ‘బొమ్మోలెగున్నదిర పోరి బొంబొంబాటుగుందిరా నారి’అనే పాటలో నటించిన హీరో ఎవరు? ఎ) శర్వానంద్ బి) మంచు విష్ణు సి) నితిన్ డి) నాగచైతన్య మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) బి 3) డి 4) ఎ 5) ఎ 6) బి 7) ఎ 8) బి 9) డి 10) బి 11) సి 12) డి 13) బి 14) సి 15) ఎ 16) సి 17) బి 18) సి 19) సి 20) సి -
సుప్రీమ్ హీరో కొత్త సినిమా అప్ డేట్
వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, జవాన్ సినిమాతో ఆకట్టుకున్నాడు. బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో గ్యాప్ తీసుకోకుండా తన కొత్త సినిమాను మొదలెట్టేస్తున్నాడు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఈ నెల 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేయస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాకు గోపీసుందర్ సంగీతమందించనున్నాడు. -
గ్లామర్ పాత్రలకూ రెడీ
‘‘నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని. మా కుటుంబంలో ఎవరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. కానీ, నాకు నటనంటే ఇష్టం. ఎలాగైనా నటి కావాలని ప్రయత్నించా. నేను ఇప్పుడీ స్థాయిలో ఉన్నందుకు దేవుడికి థ్యాంక్స్’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. రామ్, అనుపమ, లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో మహా పాత్రలో అలరించిన అనుపమ చెప్పిన విశేషాలు... ► కిశోర్‌గారు చెప్పిన కథ నచ్చింది. నా పాత్ర చనిపోతుందని చెప్పడంతో ముందు జోక్ అనుకున్నా. కానీ, ఆయన నన్ను కన్విన్స్ చేయడం... మంచి పాత్ర కావడంతో ఓకే చెప్పేశా. ఇప్పుడందరూ నా పాత్ర గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే గర్వంగా ఉంది. ► ఇప్పటి వరకూ నేను చేసిన పాత్రల్లో మహా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంది. నా ఒరిజినల్ క్యారెక్టర్‌కి, సినిమాలో పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. మహా పాత్ర చాలా బాగుందని నా గత చిత్రాల దర్శకులు, నా సోషల్ మీడియా ఫాలోయర్లు అభినందిస్తుంటే ఫుల్ హ్యాపీ. ఈ సినిమాలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పా. ఎమోషన్ సన్నివేశాల కోసం గ్లిజరిన్ బాగా వాడాల్సి వచ్చింది. ► కథే సినిమాకు హీరో. కథ బాగుంటే సినిమా చెయ్యడానికి అంగీకరిస్తాను. అలాగే, నా పాత్ర గురించీ ఆలోచిస్తా. అవసరమైతే గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధం. కానీ, నా పాత్ర పట్ల డైరెక్టర్ పూర్తి క్లారిటీగా ఉండి, నన్ను కన్విన్స్ చేయాలి. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కంటే షూటింగ్లో ఎక్కువ ఎంజాయ్ చేసా. రామ్‌తో పనిచేయడం సరదాగా అనిపించింది. ► టాలీవుడ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా, హీరో శర్వానంద్ నా బెస్ట్ ఫ్రెండ్. సాయిపల్లవితో తరచూ మాట్లాడుతుంటా. మరికొంత మంది కథానాయికలతోనూ టచ్‌లో ఉంటున్నా. ► మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నానీతో, కరుణాకరన్ డైరెక్షన్లో సాయి ధరమ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నా. -
'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ రివ్యూ
టైటిల్ : ఉన్నది ఒకటే జిందగీ జానర్ : ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : రామ్ పోతినేని, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : కిశోర్ తిరుమల నిర్మాత : స్రవంతి రవికిశోర్ నేను శైలజ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో రామ్, తరువాత హైపర్ తో మరోసారి తడబడ్డాడు. అందుకే తన కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యతను మరోసారి దర్శకుడు కిశోర్ తిరుమల చేతిలో పెట్టాడు. తొలి సినిమాలో కేవలం ప్రేమ కథ మీదే ఫోకస్ పెట్టిన రామ్, కిశోర్ లు ఉన్నది ఒకటే జిందగీలో లవ్ తో పాటు స్నేహబంధాన్ని కూడా అదే స్థాయిలో చూపించారు. మరి రామ్ నమ్మకాన్ని కిశోర్ నిలబెట్టుకున్నాడా..? ఈ ఇద్దరి కాంబినేషన్ నేను శైలజ మ్యాజిక్ ను రిపీట్ చేసిందా..? కథ : అభి (రామ్ పోతినేని) స్నేహమంటే ప్రాణమిచ్చే కుర్రాడు. స్కూల్ లో తన తో పాటు చదువుకునే వాసు (శ్రీ విష్ణు) అంటే అభికి ప్రాణం. వాసు జోలికి ఎవరు వచ్చిన అభి ఊరుకోడు. అంతేకాదు ఆరేళ్ల వయసులోనే మంచి స్కూల్ లో సీటు వచ్చినా.. వాసు కోసం వదులుకుంటాడు అభి. వారి వయసుతో పాటు వారి స్నేహం కూడా పెరిగి పెద్దదవుతుంది. అభికి వాసుతో పాటు మ్యూజిక్ అంటే కూడా ఇష్టం, సొంతంగా ఓ రాక్ బ్యాండ్ ను తయారు చేసుకోని కన్సర్ట్ లు ఇస్తుంటాడు. (సాక్షి రివ్యూస్) హ్యాపిగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి ఓ ప్రమాదం కారణంగా మహా (అనుపమా పరమేశ్వరన్) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. మహాకు కూడా సంగీతం అంటే ఇష్టముండటంతో పాటు అభి తన కుటుంబ సమస్యల విషయంలో ధైర్యం చెప్పటంతో మహా, అభిలు ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ అదే సమయంలో వాసు కూడా మహాను ఇష్టపడుతున్న విషయం అభికి తెలుస్తుంది. మన మధ్య ఈగోలు రాకూడదన్న ఒప్పందంతో అభి, వాసులు ఒకేసారి మహాకు ప్రపోజ్ చేస్తారు. కానీ మహా మాత్రం వాసుకే ఓకె చెపుతుంది. వాసు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా మహాకే వ్యాల్యూ ఇస్తుండటంతో కోపంతో అభి, వాసుకు దూరంగా వెళ్లిపోతాడు. ప్రాణమైన ఫ్రెండ్ ను కాదని అభి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు..? అభి, వాసు తిరిగి కలుసుకున్నారా..? వీరి కథలో వెడ్డింగ్ ప్లానర్ మేఘన (లావణ్య త్రిపాఠి)కి సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నేను శైలజ సినిమాలో సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న రామ్, ఈసినిమాలో తన మార్క్ ఎనర్జీని కూడా చూపించాడు. ముఖ్యంగా రాక్ స్టార్ లుక్ లో రామ్ బాడీ లాంగ్వేజ్, పర్పామెన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ లో రామ్ నటన కంటతడి పెట్టిస్తుంది. వాసు పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిపోయాడు. ఫ్రెండ్ అంటే ప్రాణమిచ్చే స్నేహితుడిగా, ప్రియురాలు దూరమైన ప్రేమికుడిగా మంచి నటన కనబరిచాడు.(సాక్షి రివ్యూస్) అనుపమా పరమేశ్వరన్ అందంగా హుందాగా కనిపించింది. కళ్లతోనే భావాలను పలికిస్తూ మహా పాత్రకు ప్రాణం పోసింది. సెకండ్ హాఫ్ లో మేఘనగా లావణ్య త్రిపాఠి నటన బబ్లీ బబ్లీగా అలరించింది. గ్లామర్ షోతోనూ లావణ్య మంచి మార్కులు సాధించింది. ఫ్రెండ్స్ గా నటించిన ప్రియదర్శి ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : నేను శైలజ సినిమాతో రామ్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కిశోర్ తిరుమల మరోసారి అదే బాధ్యతను తీసుకొని ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కించాడు. ప్రేమ, స్నేహంల మధ్య కిశోర్ రాసుకున్న కథ మరోసారి యూత్ ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ లో కిశోర్ టాలెంట్ సూపర్బ్ అనిపిస్తుంది. కానీ తొలి భాగం మరింత వేగంగా కథ నడించి ఉంటే బాగుండనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథలో పెద్దగా ట్విస్ట్ లు లేకుండా ఫ్రెండ్స్ మధ్య సరదా సన్నివేశాలతోనే కథ నడిపించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ తో అన్ని మరిచిపోయేలా అందమైన ముగింపునిచ్చి అలరించాడు దర్శకుడు.(సాక్షి రివ్యూస్) సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం. ఇప్పటికే సూపర్ హిట్ అయిన వాట్ అమ్మా, ట్రెండ్ మారినా పాటలు వెండితెర మీద మరింతగా అలరించాయి. ఎమోషనల్ సీన్స్ కు దేవీ తన బెస్ట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో మరికాస్త దృష్టి పెట్టాల్సింది. ప్లస్ పాయింట్స్ : రామ్ నటన ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మగాడు కూడా మదర్ అవ్వొచ్చు.. – కిశోర్ తిరుమల
‘‘జనరల్‌గా నేను రాత్రి 9 గంటల తర్వాత ఎవరికీ ఫోన్ చేయను. వెరీ ఇంపార్టెంట్ అయితే మెసేజ్ చేస్తా. కానీ, ‘వాట్ అమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా’ పాట కోసం అర్ధరాత్రి 12:30, 1గంట అయినా నా డీసెన్సీని పక్కన పెట్టి, శ్రీమణికి ఫోన్ చేసి మాట్లాడేవాణ్ణి’’ అని హీరో రామ్ అన్నారు. రామ్, లావణ్యా త్రిపాఠి, అనుపమా పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్లో చాలా మాట్లాడేశా. కానీ, నలుగురు ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడటం మరచిపోయా. అందుకు పాటల రచయితలు చంద్రబోస్‌గారు, శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌గారు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌గారికి సారీ. సినిమా మాకూ చాలాఫ్రెష్గా అనిపిస్తోంది. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో బాగా సక్సెస్ అయింది. చాలామంది ఫోన్ చేసి, పాటలు బాగున్నాయని చెబుతుండటం రియల్ సక్సెస్’’ అన్నారు. కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా మిక్సింగ్‌లో చూస్తున్నప్పుడు.. కొన్ని సీన్స్ చూస్తే అది హ్యాపీనెస్సా? ఎగై్జట్మెంటా? అన్నది తెలియలేదు. ప్రీ–క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఆ సన్నివేశం, మ్యూజిక్ చూస్తుంటే నాకు తెలియకుండా చేతులు వణికాయి. నాకా టైమ్‌లో అనిపించింది. మామూలుగా జన్మనిచ్చే అదృష్టం ఆ భగవంతుడు మహిళలకి ఇస్తారు. ఒక మంచి సినిమా తీస్తే మనం కూడా జన్మనివ్వొచ్చు. మగాడు కూడా మదర్ అవ్వొచ్చనిపించింది’’ అన్నారు. ‘‘చాలా ఎగై్జటింగ్‌గా ఉన్నాం. యూనిట్ అంతా సంతోషంగా ఉంది. మీ (ప్రేక్షకులు) ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘నా కెరీర్లో మరచిపోలేని మ్యాగీ పాత్రను ఇందులో చేశా. ఈ అవకాశం ఇచ్చినందుకు స్రవంతి రవికిశోర్ సార్‌కి థ్యాంక్స్. షూటింగ్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నట్టే ఉండేది’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. ‘‘23 ఏళ్ల నిరీక్షణ తర్వాత స్రవంతి బ్యానర్లో పాటలు రాసే అవకాశం వచ్చింది’’ అన్నారు చంద్రబోస్. ‘స్రవంతి’ రవికిశోర్, పాటల రచయిత కృష్ణచైతన్య, నటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, కెమెరామేన్ సమీర్ పాల్గొన్నారు. -
చరణ్ సినిమాలో అనుపమకు నో ఛాన్స్
ధృవ లాంటి బిగ్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఓ డిఫరెంట్ సినిమాలో నటించనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరికి ఓకె చెప్పాడు. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. 90లలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హీరోయిన్గా ఎవరిని ఫిక్స్ చేయాలన్న విషయంలో చిత్రయూనిట్ ఆలోచనలో పడింది. ముందుగా రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుందన్న వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం రాశీపై ఫోటో షూట్ కూడా చేసిన యూనిట్ ఆమెను పక్కన పెట్టేశారు. తరువాత 'అ..ఆ..', 'ప్రేమమ్' సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్‌ను ఈ సినిమాకు హీరోయిన్గా తీసుకుంటున్నారన్న వార్త వినిపించింది. చాలా రోజులుగా ఈ సినిమాలో అనుపమనే హీరోయిన్ అన్న ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు కాదన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి హీరోయిన్ ఎంపిక జరగలేదని త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడిస్తామన్నారు యూనిట్. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి వరుస సూపర్ హిట్స్ అందించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.