Karthikeya 2 Movie Expected Release Date In OTT, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Karthikeya 2 In OTT: కార్తికేయ-2 ఓటీటీలో వచ్చేది అప్పుడే.. డేట్‌ ఫిక్స్‌

Published Mon, Sep 26 2022 4:36 PM | Last Updated on Mon, Sep 26 2022 5:19 PM

Karthikeya 2 Is Expected To Stream On Zee5 On This Date - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం​ కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లోనూ అత్యధిక వసూళ్లతో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాలను తెచ్చిపెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్‌ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌లో ఊహించని విజయాన్ని అందుకుంది.

చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా `కార్తికేయ 2` నిలిచింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ కార్తికేయ2 డిజిటల్ రైట్స్‌ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement