Nikhil Siddhartha
-
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ
నిఖిల్ సీనీ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘స్వామిరారా’ ఒక్కటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కేశవ’ కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రమే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. హ్యాట్రిక్ మూవీ అంటే మంచి హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం వస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. చిత్రబృందం కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. చడీ చప్పుడు లేకుండా నేడు(నవంబర్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చినీ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రిషి(నిఖిల్) ఇండియాలో ఉన్నప్పుడు తార(రుక్మిణి వసంత్)ని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. స్నేహితుడు బయాజ్(వైవా హర్ష) చేసిన ఓ మిస్టేక్ కారణంగా అతన్ని ప్రేమ విఫలం అవుతుంది. దీంతో రిషి లండన్ వెళ్లిపోతాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్)తో పరిచయం ఏర్పడి,అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని గుడికి వెళ్తారు. సరిగ్గా పెళ్లి సమయానికి తులసి కనిపించకుండా పోతుంది. అసలు తులసి ఎవరు? ఆమె ఎక్కడికి వెళ్లింది? తార లండన్ ఎందుకు వచ్చింది? లోకల్ డాన్ బద్రీనారాయణ(జాన్ విజయ్) రిషిని ఎందుకు వెంబడించాడు? బద్రీ అనుచరుడు మున్నా(అజయ్)కి తులసికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తారతో రిషి ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు రిషి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అలాంటి హీరో నుంచి ఓ కొత్త సినిమా వస్తుందంటే సహజంగానే భారీ హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో అది ముందు నుంచి జరగలేదు. అసలు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తుందనే విషయం కానీ, అందులో నిఖిల్ హీరోగా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. పైగా చిత్రబృందం కూడా పెద్దగా ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాలను వదిలారు. దీన్ని బట్టే సినిమాపై మేకర్స్‌కి కూడా నమ్మకం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవుతాడు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కొత్త విషయం ఒక్కటైనా ఉందా అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఆసక్తి గొలిపే సంఘటన కానీ, మలుపు తిప్పే ట్విస్టులు కానీ, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కానీ లేకుండా దర్శకుడు చాలా ‘జాగ్రత్తగా’కథనాన్ని నడిపించాడు.రొటీన్ లవ్‌స్టోరీకి క్రైమ్ థ్రిల్లర్‌ని జోడించి ఓ డిఫరెంట్ స్టోరీని చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే అది తెరపై చూస్తే మాత్రం దర్శకుడు కొత్తగా ఏం చెప్పాలనుకునే విషయం మాత్రం అర్థం కాదు. నిఖిల్ సినిమా కదా కనీసం ఒక్కటి రెండు సీన్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయేమో అని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. సినిమా ప్రారంభం అయినా పది నిమిషాలకే ఇది రోటీన్ స్టోరీ అని అర్థం అయిపోతుంది. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడు ఈజీగా పసిగట్టగలడు. ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ అంటూ కథను ముందు , వెనక్కి తిప్పుతూ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారిందే తప్పా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది.సత్య, సుదర్శన్ పాత్రలతో ఓ ప్రత్యేక ట్రాక్‌ని నడిపిస్తూ కథను చెప్పించారు. అందులో ఆరు నెలలు వెనక్కి వెళ్లడం, మళ్లీ రెండేళ్ల క్రితం జరిగిన స్టోరీ చెప్పడం.. గందరగోళానికి గురి చేసిందే తప్ప ప్రేక్షకుడిని కథలో లీనం చేయలేకపోయింది. మధ్య మధ్య వచ్చే పాటలు, యాక్షన్ సీన్స్ అన్ని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇక సెండాఫ్లో కథనం చాలా సింపుల్‌గా సాగుతుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కార్తిక్ పాత్రలో నిఖిల్ చక్కగా నటించాడు.అయితే ఈ కథను ఆయన ఎలా ఒప్పుకున్నాడనేదే అర్థం కాదు. తార పాత్రకి రుక్మిణీ న్యాయం చేసింది. అయితే నటించగానికి పెద్ద స్కోప్‌లేని పాత్ర ఆమెది. ఇక దివ్యాంశ కౌశిక్‌కి ఓ మంచి పాత్ర లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న తులసి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. హర్ష కామెడీ అంతగా పండలేదు. సత్య, సుదర్శన్ సినిమాలో ఉన్నారే కానీ.. వారి స్థాయిలో నవ్వించలేకపోయారు. జాన్ విజయ్, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తీక్ పాటలు, సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'అనంతం'.. టీజర్ రిలీజ్ చేసిన టాలీవుడ్ హీరో!
వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం తాజా చిత్రం "అనంతం". ఈ సినిమాలో రుచిత సాధినేని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ఆరుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ లక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీని టీజర్ విడుదల చేశారు మేకర్స్. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్ అద్భుతంగా ఉందని నిఖిల్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.నిర్మాతలు మాట్లాడుతూ - 'మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్‌కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను నిర్మించాం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్గా మూవీ ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించి థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తాం' అని అన్నారు. -
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటోన్న నిఖిల్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సినిమా టైటిల్‌తో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్వయంభూ సెట్స్‌పై ఉండగానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.(ఇది చదవండి: 'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్)తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హే తారా అంటూ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణచైతన్య లిరిక్స్ అందించగా.. కార్తీక్, నిత్యశ్రీ ఆలపించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఈ మూవీని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రానికి కార్తీక్ సంగీతమందించారు. -
'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తాజాగా దసరా సందర్భంగా ఆయుధ పూజకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్.అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ చూస్తుంటే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లండన్ వెళ్లి తెల్లపిల్లను పడేసి ప్రపంచమంతా చుట్టేద్దామనుకున్నాడు అనే డైలాగ్ వింటే లవ్ అండ్ యూత్‌ఫుల్ స్టోరీ అని అర్థమవుతోంది. 90 శాతం మంది అబ్బాయిలు మందు తాగడానికి కారణం అమ్మాయిలేరా అనే నిఖిల్ డైలాగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతే కాకుండా హర్ష చెముడు కామెడీ ఈ సినిమాకు ప్లస్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.Did an Experimental Screenplay based breezy film with @sudheerkvarma @rukminitweets @itsdivyanshak @SVC_official @harshachemudu Here is the teaser 👇🏼 https://t.co/hHtdfqcEDe @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @Rip_Apart @NavinNooli @JungleeMusicSTH— Nikhil Siddhartha (@actor_Nikhil) October 11, 2024 -
టాలీవుడ్ మూవీ సెట్లో ఆయుధ పూజ.. వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం స్వయంభూ. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విజయదశమి సందర్భంగా మూవీ టీమ్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. సినిమా షూటింగ్ సెట్లో ఆయుధ పూజ నిర్వహించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ చిత్రంలో ఉపయోగించే ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ దీపావళికి నిఖిల్ సైతం థియేటర్లలో సందడి చేయనున్నాడు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అభిమానులను పలకరించనున్నారు.Worshipping the tools of our livelihood ✨Ayudha Pooja celebrations from the sets of #Swayambhu ❤🔥Team #Swayambhu wishes everyone a Happy Dussehra 🔥@actor_Nikhil @iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 @DOPSenthilKumar @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar… pic.twitter.com/mhHMczqmgd— Nikhil Siddhartha (@actor_Nikhil) October 11, 2024 -
స్వయంభూ సెట్లో నిఖిల్ బర్త్‌డే సెలబ్రేషన్స్..
'కార్తికేయ 2', '18 పేజీస్' సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ గతేడాది 'స్పై' చిత్రంతో బోల్తా పడ్డాడు. ఈసారి ఎలాగైనా మరో బంపర్ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. ప్రస్తుతం అతడు పాన్ ఇండియా చిత్రం 'స్వయంభూ'లో నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో శ్రీకర్, భువన్ నిర్మిస్తున్నారు. ‘బాహుబలి, ఆర్‌ర్‌ఆర్’ వంటి చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.శనివారం (జూన్ 1) నాడు నిఖిల్ బర్త్‌డేను స్వయంభూ సెట్లో సెలబ్రేట్ చేశారు. స్వయంభూ సినిమాలోని నిఖిల్ గెటప్స్‌తో కేక్‌ను ముస్తాబు చేశారు. నభా ఆ కేకుపై క్యాండిల్స్ పెట్టి వెలిగించింది. యుద్ధవీరుడి గెటప్‌లో నిఖిల్ కేక్ ముందు కత్తితో నిలబడ్డాడు. ఆ తర్వాత హీరోయిన్‌తో పాటు అక్కడున్నవారికి కేక్ తినిపించాడు. ఈ వీడియోను నిర్మాణ సంస్థ పిక్సెల్ స్టూడియో ట్విటర్లో విడుదల చేసింది. A sweet surprise for @actor_Nikhil on the sets of #Swayambhu ✨The team celebrated his birthday on the sets with all the cast and crew extending their heartfelt wishes to Nikhil ❤🔥@iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar pic.twitter.com/eUolNTQfE9— Pixel Studios (@PixelStudiosoff) June 2, 2024 చదవండి: రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి -
టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!
యంగ్ హీరో నిఖిల్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన ఫ్యామిలీ, రీసెంట్గా పుట్టిన కొడుకు కోసం ఓ త్యాగం చేశాడు. ఇకపై కొన్ని విషయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఫిక్సయ్యాడు. తాజాగా తన కొడుకు గురించి చెబుతూ ఇదంతా బయటపెట్టాడు. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: హీరోయిన్‌కి చేదు అనుభవం.. సొంత భాషలో మాట్లాడినందుకు ఏకంగా!) 'హ్యాపీడేస్' సినిమాలో ఓ నటుడిగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. 'స్వామి రారా', 'కార్తికేయ' చిత్రాలతో పేరు సంపాదించాడు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం 'స్వయంభు' అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. నిఖిల్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2020లో పల్లవి అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీళ్లకు బాబు పుట్టాడు. తాజాగా తన కొడుక్కు ధీర సిద్ధార్థ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఎప్పుడో ఓసారి అయినా నైట్ పార్టీలకు వెళ్లేవాడినని, ఇకపై మాత్రం టైమ్ అంతా తన కొడుక్కే ఇస్తానని చెప్పుకొచ్చాడు. పిల్లలు పుడితే తల్లిదండ్రులు మారతారని అంటారు. బహుశా నిఖిల్ కూడా కొడుకుతో టైమ్ స్పెండ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనమాట. (ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు) -
ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం: టాలీవుడ్ హీరో ఆగ్రహం
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇండియా ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రదర్శనకు ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గు పడాలని సిద్దార్థ్ విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చాలంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇండియన్ ఫుట్‌బాల్ కౌన్సిల్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నిఖిల్ తన ట్విట్లో రాస్తూ..'ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ని ఇప్పుడే చూశా. మన భారత జట్టు అత్యంత తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి ప్రదర్శన పట్ల ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నా. క్రీడల్లో మనం మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ హీరోకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తున్నారు. అంతే కాకుండా కార్తికేయ-3 కూడా ఉంటుందని నిఖిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. కాగా.. ఇటీవలే సిద్ధార్థ్‌కు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. Just watched the Most Frustrating Football Match of our Indian Team at the #FIFAWorldCupQualifiers The @IndianFootball association should be Ashamed for this embarrassing display. The Most Populous country in the World 🇮🇳 We deserve better.. CHANGE THE SYSTEM @ianuragthakur… pic.twitter.com/Lt9S1P2ltw — Nikhil Siddhartha (@actor_Nikhil) March 21, 2024 -
నిఖిల్ 'కార్తికేయ'.. ముచ్చటగా మూడోసారి
హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందూ మొండేటిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’(2014) సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే వీరి కాంబోలో వచ్చిన ద్వితీయ సినిమా ‘కార్తికేయ 2’ (2022) పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. దీంతో ‘కార్తికేయ 3’ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పడింది. నిఖిల్, చందూ కలయిక ముచ్చటగా మూడోసారి రిపీట్ అవుతోంది. ‘కార్తికేయ 3’ సినిమా రూపొందనున్నట్లు స్పష్టత ఇచ్చారు నిఖిల్. ‘‘దర్శకుడు చందూ మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీకి (కార్తికేయ 3) సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. ‘కార్తికేయ 3’ స్పాన్, స్కేల్ పరంగా చాలా పెద్దగా ఉండబోతోంది. డా.కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అన్నారు మేకర్స్. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు చందూ మొంటేటి. -
హీరో నిఖిల్ కుమారుడి నామకరణ వేడుక
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ తెగ సంతోషించాడు. ఏడాది క్రితం నాన్న చనిపోయాడని, ఆయనే మళ్లీ తన కొడుకుగా తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యాడు. కుమారుడిలోనే తండ్రిని చూసుకుని మురిసిపోయాడు. తాజాగా నిఖిల్ ఇంట అతడి తనయుడి బారసాల వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. నిఖిల్-పల్లవి దంపతులు తమ కుమారుడికి కొత్త బట్టలు వేసి తొట్లె(ఊయల)లో వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ దంపతులు బాబుకు ఏ పేరు పెట్టి ఉంటారా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కాగా నిఖిల్ - పల్లవి 2020వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్వయంభూ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. చదవండి: స్టేజీపై హీరోయిన్‌కు హారతి.. వామ్మో.. బానే ఎక్స్‌ట్రాలు కొడ్తున్నాడే! -
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. సీమంతం ఫోటో వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సీమంతం వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. కాగా.. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. నిఖిల్ తన ట్విటర్లో రాస్తూ.. 'నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నిఖిల్ అభిమానులు తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నిఖిల్. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన 'స్వయంభూ' సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv — Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024 -
బంజారాహిల్స్‌లో సందడి చేసిన హీరో నిఖిల్ సిద్దార్థ్ (ఫొటోలు)
-
'సలార్' రెండో ట్రైలర్‌తో ప్రభాస్ రెడీ
రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సూపర్ కాంబినేషన్లో సలార్ రానుంది. ఇండియా రేంజ్లో అత్యంత భారీ యాక్షన్ చిత్రంగా డిసెంబర్ 22న విడుదల కానుంది. రెండు రోజుల క్రితం వరకు ఎలాంటి ప్రచారం లేకుండా ఉన్న సలార్ టీమ్ ఒక్కసారిగా దూకుడు పెంచేసింది. ప్రభాస్ నుంచి నిర్మాత విజయ్ కిరగందూర్ వరకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై జోరు పెంచుతున్నారు. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌తో భారీ బజ్ క్రియేట్ చేసిన సలార్ తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందులో ప్రభాస్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌గా నేడు (డిసెంబర్ 17) విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గెట్ రెడీ ఫర్ వైలెంట్ అని హోంబలే ఫిల్మ్స్ తన ఎక్స్ పేజీలో క్లూ ఇచ్చింది. కానీ రెండో ట్రైలర్ ఉంటుందని ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మొదటి ట్రైలర్లో ప్రభాస్,పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య స్నేహాన్ని చూపిన మేకర్స్ రెండో ట్రైలర్లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మొదటి టికెట్‌ను టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కొన్నారు. మరోవైపు యంగ్ హీరో నిఖిల్ కూడా 100 టికెట్లు కొన్నట్లు తెలిపాడు. డిసెంబర్ 22న హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్లో ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూస్తానని ఆయన చెప్పాడు. ఈ టికెట్స్ అన్నీ కూడా తనవైపు నుంచి ఫ్రీగానే ఇస్తానని ఆయన చెప్పడం విశేషం. -
ఉచితంగా 'సలార్' టికెట్స్.. తెలుగు యంగ్ హీరో బంపరాఫర్
స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. అభిమానులు దగ్గర నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు టికెట్స్ కోసం తెగ ట్రై చేస్తారు. ఇక ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ నుంచి 'సలార్' మూవీ వస్తుందంటే.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తీరాల్సిందేనని వీరాభిమానులు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు యంగ్ హీరో బంపరాఫర్ ప్రకటించాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ అర్జున్ ఎలిమినేట్!) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ మూవీ 'సలార్'. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. మరో వారంలో అంటే ఈ డిసెంబరు 22న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఇంకొన్ని చోట్ల అవుతున్నాయి. మరోవైపు యంగ్ హీరో నిఖిల్.. ప్రభాస్ వీరాభిమానుల కోసం 100 టికెట్స్ ఉచితంగా ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు. డిసెంబరు 22న అర్థరాత్రి ఒంటి గంటకు శ్రీరాములు థియేటర్లో 'సలార్' మిడ్ నైట్ షో పడనుంది. ఇప్పుడు ఇక్కడే 100 మంది ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూస్తానని యువ హీరో నిఖిల్ చెప్పాడు. ఈ టికెట్స్ అన్నీ కూడా తనవైపు నుంచి ఫ్రీగానే ఇస్తానని మాటిచ్చాడు. మరి ఆ అదృష్టవంతులు మీరు కూడా కావొచ్చేమో. కాస్త ట్రై చేయండి. (ఇదీ చదవండి: ప్రభాస్ గొప్పతనం గురించి చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్) -
తండ్రి కాబోతున్న హీరో నిఖిల్
-
తండ్రి కాబోతున్న యంగ్ హీరో నిఖిల్
'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన స్టార్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో సందడి చేస్తున్నారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందిన నిఖిల్.. తాజాగా 'స్వయంభూ' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే దీని కోసం ఆయన తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. అయితే నిఖిల్ సతీమణి పల్లవి ప్రెగ్నెట్ అని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. కొద్దిరోజుల క్రితం నిఖిల్ తన భార్యతో ఒక ఫ్యామిలీ ఈవెంట్‌కు వెళ్లగా అక్కడ ఆమె బేబీ బంప్‌తో కనిపించారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఈ విషయంపై వారిద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇప్పటికే మరో హీరో శర్వానంద కూడా తండ్రి కాబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
‘స్వయంభూ’ కోసం వియత్నామ్ వెళ్లిన హీరో నిఖిల్
హీరో నిఖిల్ సిద్ధార్థ వియత్నామ్లో వాలిపోయారు. ఏదో వెకేషన్‌కి వెళ్లుంటారేమో అనుకుంటే పొరబడినట్టే. తన తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ కోసం నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు వియత్నామ్ వెళ్లారాయన. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న మూవీ ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యుద్ధం నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో యోధునిగా కనిపించనున్నారు నిఖిల్. ఈ పాత్రకు సంబంధించి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు. సైగాన్లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్లు ‘స్వయంభూ’ యూనిట్లో భాగంగా ఉండి యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్‌కి శిక్షణ ఇస్తారు. నెల రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు నిఖిల్. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే
యంగ్ హీరో నిఖిల్.. 'కార్తికేయ 2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఒక్క దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో నెక్స్ట్ మూవీస్ లైనప్‌ని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. అలా చేసిన సినిమా 'స్పై'. ట్రైలర్‌తో ఇది అంచనాలు పెంచినప్పటికీ.. థియేటర్లలో ఫెయిలైంది. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) 'స్పై' కథేంటి? జై(నిఖిల్).. 'రా' ఇంటెలిజెన్స్‌లో సీక్రెట్ ఏజెంట్. శ్రీలంకలో ఓ మిషన్‌లో ఉండగా స్వదేశంలోని ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. 'రా' చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్‌పాండే).. గతంలో చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్‌లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ. అందులో స్ట్రీమింగ్ కంటెంట్ వీక్ కావడంతో 'స్పై' సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. జూన్ 27న థియేటర్లలోకి వస్తే.. తొలి వీకెండ్‌కే తట్టాబుట్టా సర్దేసుకుంది. దీంతో అందరూ ఆ చిత్రాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 'స్పై' స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కాబట్టి ఆడుతూ పాడుతూ ఈ మూవీని చూసేయొచ్చు. #SpyMovie now streaming in @PrimeVideo #NikhilSiddharth #Spy pic.twitter.com/FRJmfwcRf3 — Matters Of Movies (@MattersOfMovies) July 26, 2023 (ఇదీ చదవండి: ప్రభాస్ కొత్త సినిమా.. ఆ స్టార్ హీరో డైరెక్షన్లో!) -
స్పై సినిమా ఎఫెక్ట్.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్
నిఖిల్ చేసిన 'కార్తికేయ2' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగానే 'స్పై' సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు . ఆ స్థాయికి తగ్గట్టుగా కథని ఎంచుకుని 'స్పై' చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక రహస్యాన్ని పాయింట్‌గా చూపిస్తూ .. ఓ గూఢచారి కథతో రూపొందిన చిత్రమిది. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా స్పై ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.28.90 కోట్లు వసూళ్లు చేసింది. నిఖిల్ కెరీర్లో సూపర్‌ఫాస్ట్‌గా బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా మరో రికార్డు కూడా స్పై ఖాతాలో చేరిపోయింది. తాజాగా 'స్పై' మూవీ గురించి నిఖిల్ ఒక నోట్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి; నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరంటూ..) 'నాపై నమ్మకం ఉంచి చాలా మంది అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొన్నారు. దీంతో నా కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇదే సమయంలో కొంత బాధగా కూడా ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల కారణంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయలేకపోయాం. చివరకు ఓవర్సీస్లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. (ఇదీ చదవండి: Samantha: సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. సినిమాలకు బ్రేక్, చివరి మూవీ ఇదే!) హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్తికేయ-2తో మీకు దగ్గరయ్యాను కానీ స్పై సినిమాను అందించలేకపోయాను. తర్వాత నా నుంచి రాబోయే 3 సినిమాలను అన్ని భాషల్లోని థియేటర్లలో ఖచ్చితంగా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన తెలుగు సినిమా అభిమానులకు కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడను. నాపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందిస్తాను' అని నిఖిల్ లేఖలో తెలిపాడు. -
'స్పై' తొలిరోజు కలెక్షన్స్.. నిఖిల్ సరికొత్త రికార్డ్
యంగ్ హీరో నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఇప్పుడు 'స్పై' అనే పాన్ ఇండియా చిత్రాన్ని మరో ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. జూన్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. మిశ్రమ స్పందన అందుకుంటోంది. అయినాసరే తొలిరోజు వసూళ్లలో రచ్చ చేసింది. హీరో నిఖిల్ అయితే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. 'స్పై' కథేంటి? రీసెర్ట్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లో జై(నిఖిల్) ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్ లో ఉండగా.. రా చీఫ్ శాస్త్రి ఆదేశాల మేరకు స్వదేశానికి తిరిగొస్తాడు. ఐదేళ్ల క్రితం జోర్డాన్ లో ఖాదిర్ ఖాన్(నితిన్ మెహతా)ని చంపే క్రమంలో ఏజెంట్ సుభాష్ వర్దన్ ప్రాణాలు కోల్పోతాడు. అతడి చావు వెనక రహస్యం తెలుసుకోమని జైకి ఫైల్ అప్పగిస్తారు. ఆ తర్వాత ఏజెంట్ జై ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏం జరిగిందనేది మెయిన్ స్టోరీ. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) తొలిరోజు వసూళ్లు 'కార్తికేయ 2' సక్సెస్ వల్ల నిఖిల్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా అనేసరికి ప్రేక్షకులు చాలా అంచనాలు పెంచుకున్నారు. కానీ 'స్పై' ఆ విషయంలో ఫెయిలైంది. రొటీన్ రెగ్యులర్ కథతో థియేటర్లలోకి వెళ్లిన ఆడియెన్స్ ని నిరాశపరిచింది. అయినాసరే అడ్వాన్ బుకింగ్స్ చాలా బాగా జరగడంతో తొలిరోజు ఏకంగా రూ.11.7 కోట్లు వసూళ్లని సాధించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ హీరో నిఖిల్ ఓ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సరికొత్త రికార్డ్ 'కార్తికేయ 2'తో తొలిరోజు రూ.8.50 కోట్లు సొంతం చేసుకున్న నిఖిల్.. 'స్పై' చిత్రంతో మరో మూడు కోట్లకు పైగా ఎక్కువగా సాధించాడు. తద్వారా తన కెరీర్ లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లని అందుకున్నాడు. తొలిరోజు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి గానీ ఈ వీకెండ్ గడిస్తే గానీ అసలు సంగతి తెలియదు. అంతవరకు మనం వేచి చూడాల్సిందే. (ఇదీ చదవండి: 'స్పై' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే) Thank you 🙏🏽 ❤️ For this much love from you all🙏🏽 #Spy #SpyMovie pic.twitter.com/pBXqct6bw9 — Nikhil Siddhartha (@actor_Nikhil) June 30, 2023 -
'స్పై' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ కొత్త సినిమా 'స్పై'. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీపై రిలీజ్ కు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఇదే సమయంలో 'స్పై' ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది కూడా తెలిసిపోయింది. దీంతో ఓటీటీ ఆడియెన్స్ అలెర్ట్ అయిపోయారు. మరి ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. 'స్పై' కథేంటి? ఈ సినిమాలో నిఖిల్ పాత్ర పేరు జై. 'రా' ఇంటెలిజెన్స్‌లో ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్ పూర్తి చేసి, స్వదేశానికి తిరిగొస్తాడు. రా చీఫ్ శాస్త్రి, ఇతడికి ఐదేళ్ల క్రితం జోర్డాన్ లో చనిపోయిన ఏజెంట్ సుభాష్ ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావు వెనక కారణం తెలుసుకోమంటాడు. అలా ఈ మిషన్ లో భాగమైన ఏజెంట్ జైకి బోలెడన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. చివరకు ఏమైంది? అసలు ఈ స్టోరీకి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీకి సంబంధమేంటి? తెలియాలంటే థియేటర్లలో ఈ మూవీని చూడాల్సిందే. ఆ ఓటీటీలోనే తెలుగు ప్రేక్షకులకు దాదాపుగా తెలిసిన కథతోనే 'స్పై' తీశారు. చూస్తున్నంతసేపు అలా సాగుతూనే వెళ్తుంది తప్ప పెద్దగా గొప్పగా ఏం అనిపించదు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. మూవీ ప్రారంభంలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. బహుశా 5-6 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆగస్టు తొలి లేదా రెండోవారంలో 'స్పై' సినిమా ఓటీటీలోకి రావొచ్చని అంచనా. పూర్తి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. (ఇదీ చదవండి: 'స్పై' సినిమా రివ్యూ) -
SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ
టైటిల్: స్పై నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మేనన్, అభినవ్ గోమఠం, జిషుసేన్ గుప్తా తదితరులు నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్టైన్మెంట్స్ కథ-నిర్మాత: రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం: గ్యారీ బీహెచ్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ విడుదల తేదీ: 29 జూన్ 2023 నిడివి: 2h 15m టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా పేరు తెగ కలవరిస్తున్నారు. హీరో నిఖిల్ కూడా ఇందులో ఉన్నాడు. తెలుగులో చిన్నహీరోగా పలు హిట్స్ కొట్టిన నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. అది దైవభక్తి నేపథ్యం. ఇప్పుడు దేశభక్తి కాన్సెప్ట్ తో తీసిన 'స్పై' సినిమాలో నటించాడు. విడుదలకు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం! కథేంటి? జై(నిఖిల్).. 'రా' ఇంటెలిజెన్స్ లో ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్‌ని పూర్తిచేసి స్వదేశానికి తిరిగొస్తాడు. ఈ క్రమంలో 'రా' చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్‌పాండే).. ఓ మిషన్ లో భాగంగా చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్‌లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏం తెలుసుకున్నాడు? ఈ కథలో ఖాదిర్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్(జిషుసేన్ గుప్తా) ఎవరు? చివరకు మిషన్ సక్సెస్ అయిందా లేదా అనేదే 'స్పై' స్టోరీ. ఎలా ఉందంటే? సాధారణంగా స్పై సినిమాలు అనగానే కథ ఎలా ఉంటుందనేది మనకు తెలుసు. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన సూపర్‌స్టార్ కృష్ణ 'గూఢచారి 116' నుంచి అడివి శేష్ 'గూఢచారి' వరకు ఈ తరహా మూవీస్ చూస్తూనే ఉన్నాం. ఓ ఏజెంట్ ఉంటాడు... రా డిపార్ట్మెంట్.. దానికి ఓ చీఫ్.. ఆయన సదరు హీరో అనబడే ఏజెంట్‌కి ఓ మిషన్ అప్పగిస్తాడు. ఫైనల్ గా అది పూర్తి చేసి, విలన్ ని చంపాడా లేదా అనేదే స్టోరీ. సరిగా ఈ టెంప్లేట్‌ని ఉన్నది ఉన్నట్లు నిఖిల్ 'స్పై' సినిమా ఫాలో అయిపోయింది. పైపెచ్చు కొత్తదనం అస్సలు లేదు. ఫస్టాప్ విషయానికొస్తే.. జోర్డాన్ లో ఆయుధాలని స్మగ్లింగ్ చేసే విలన్ ఖాదిర్ ఖాన్ ని మన రా ఏజెంట్ సుభాష్ కాల్చి చంపేస్తాడు. ఆ వెంటనే సుభాష్ ని ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే శ్రీలంకలో జై పాత్రలో నిఖిల్ ఎంట్రీ, ఓ మిషన్ పూర్తి చేసి.. స్వదేశానికి వచ్చేయడం. ఇక్కడొచ్చిన తర్వాత సుభాష్ ని ఎవరు చంపేశారో తెలుసుకోమని నిఖిల్ కు మిషన్ అప్పజెప్తారు. అలా నేపాల్ వెళ్తాడు. అక్కడ ఏజెంట్ వైష్ణవి(ఐశ్వర్య మేనన్) వీళ్ల టీమ్ తో కలుస్తుంది. ఈమెకి జై పాత్రతో గతంలో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. అది చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఓ మంచి సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ లో ఖాదిర్ ఖాన్ కోసం వెళ్తే.. ఏజెంట్ జై టీమ్ కి బోలెడన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అలానే మన దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్ మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ అది ఎవరి చేతికి చిక్కింది? ఫైనల్ గా జై ఏం తెలుసుకున్నాడు? ఎవరిని చంపాడు లాంటివి తెలుసుకోవాలంటే మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. టీజర్, ట్రైలర్ చూసి ఇదో మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇందులో దేశభక్తి అనే కోటింగ్ తప్ప రొటీన్ రెగ్యులర్ స్పై తరహా సినిమానే. ఏ మాత్రం కొత్తదనం లేదు. అలానే చాలాచోట్ల సినిమాటిక్ లిబర్టీ విపరీతంగా తీసుకున్నారు. ఓ సీన్ లో ఓ అమ్మాయి చిన్నప్పటి ఫొటో దొరుకుతుంది. దాన్ని ఫోన్ లో ఫొటో తీసి 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో జై టీమ్ కనిపెట్టేస్తారు. అది కూడా కేవలం నిమిషాల్లో. ఈ సీన్ చూడగానే.. ఆడియెన్స్ మరీ అంతా పిచ్చోళ్లగా కనిపిస్తున్నారా అనే డౌట్ వస్తుంది. అలానే జై ఏజెంట్ కావడానికి, సుభాష్ చంద్రబోస్ ఫైల్ లో ఏముందనేది చూపించలేదు. పోనీ యాక్షన్ సీన్స్ అయినా కొత్తగా ఉన్నాయా అంటే అదీలేదు. బోరింగ్ కే బోరింగ్ అన్నట్లు తయారయ్యాయి. ఎవరెలా చేశారు? ఏజెంట్‌గా నిఖిల్ ఫెర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తను ఇప్పటివరకు చేయని జానర్ కావడం వల్లనో ఏమోగానీ మంచి ఈజ్ తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. అభినవ్ గోమఠం.. ఏజెంట్ కమల్ పాత్రలో యాక్షన్ కంటే కామెడీనే ఎక్కువ చేశాడు. కొన్నిసార్లు ఆ కామెడీ ఓకే అనిపించినప్పటికీ.. మరికొన్నిసార్లు స్టోరీని సైడ్ ట్రాక్ పట్టించినట్లు అనిపించింది. హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో ఓకే. ఏదో ఉందంటే ఉందంతే. నిఖిల్ పక్కన ఉండటం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. మిగతా వాళ్లు పర్వాలేదనిపించారు. రానా.. కాసేపు అలా కనిపించి అలరించాడు. పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్ లాంటి మంచి నటులు ఉన్నప్పటికీ.. వాళ్లందరికీ ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. ఈ సినిమా టెక్నికల్ పరంగా అయినా బాగుందా అంటే పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేదు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నప్పటికీ.. విశాల్ చంద్రశేఖర్ పాటలు థియేటర్ నుంచి బయటకొచ్చాక గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ పర్లేదు. గ్రాఫిక్స్ అయితే కొన్నిచోట్ల తేలిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు. డైరెక్టర్ గ్యారీ బీహెచ్.. స్వతహాగా ఎడిటర్. కానీ ఈ సినిమాలోని ఫస్టాప్ లో కొన్ని సీన్లు అలానే ఉంచేశారు. వాటి వల్ల ల్యాగ్ అనిపించింది. వాటిని ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'స్పై'.. రెగ్యులర్ రొటీన్ బోరింగ్ డ్రామా. పెద్దగా థ్రిల్ పంచదు, అలా అని ఇంటెన్స్ స్టోరీ కూడా ఉండదు. స్పై సినిమాలను ఇష్టపడేవాళ్లకు అంతో ఇంతో ఈ చిత్రం నచ్చుతుంది. -చందు, సాక్షి వెబ్ డెస్క్ -
నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నారు: హీరో నిఖిల్
టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన ఫోన్ డేటాను సేకరించారు. అందులో అతడు ఓ హీరోయిన్‌తో పాటు అషూ రెడ్డి, సురేఖా వాణి, ఆమె కూతురితో కలిసి దిగిన ఫోటోలు, వారితో సంభాషణలు జరిపినట్లుగా వందలాది ఫోన్ కాల్స్ ఉన్నాయి. వీరితో పాటు బడాబాబులు కూడా ఆయన జాబితాలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాలపై హీరో నిఖిల్ సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక శాఖ విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన 'పరివర్తన' కార్యక్రమానికి నటుడు ప్రియదర్శితో కలిసి నిఖిల్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది సిగరెట్ తాగమని ఆఫర్ చేశారు. మరికొందరైతే చాలాసార్లు డ్రగ్స్ తీసుకోమని అడిగారు. కానీ ఒక్కసారి దానికి అలవాటు పడితే జీవితంలో మంచి రోజులు అనేవే ఉండదు. జీవితం సర్వనాశనమవుతుంది. అలాంటివాటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరూ ఇదే పని చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల జీవితం ఎంతో అందమైనది. డ్రగ్స్ అంటే జీవితానికి చరమగీతం పాడటమే! అది దృష్టిలో పెట్టుకుని దానికి దూరంగా ఉండండి. సరదాగా పార్టీలకు వెళ్లినా దయచేసి డ్రగ్స్ తీసుకోవద్దు. త్వరలోనే రాష్ట్రం మాదక ద్రవ్యాల రహిత తెలంగాణగా మారాలని కోరుకుంటున్నా' అన్నాడు నిఖిల్. చదవండి: చైతూను మెచ్చుకోవాల్సిందే, సమంతలో ఆ క్వాలిటీ నచ్చుతుంది: శోభిత -
అవును, నిర్మాత నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం: నిఖిల్
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా బాలీవుడ్‌లోనూ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా లెవల్లో తన సినిమాలు రిలీజ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు స్వయంభు, ద ఇండియా హౌస్, స్పై వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. గురువారం స్పై సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా నిర్మాతకు, నిఖిల్‌కు మధ్య గొడవలు అవుతున్నాయని కొంతకాలం నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. జూన్ 29న స్పై రిలీజ్ చేయాలని నిర్మాత రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడే రిలీజ్ వద్దు, దేశం మొత్తం సినిమా ప్రమోషన్స్ చేద్దామని హీరో వాదించుకున్నారట. నిర్మాత ఎంతకూ అందుకు ఒప్పుకోకపోవడంతో నిఖిల్ అప్సెట్ అయ్యాడట. మరోవైపు ఆదిపురుష్ హవా తగ్గడంతో నిర్మాత మరోసారి స్పై రిలీజ్ డేట్ ప్రకటించాడు. చివరకు నిర్మాత దారిలోకే వచ్చిన నిఖిల్ ఆయన చెప్పిన డేట్‌కే కట్టుబడి ఉన్నాడు. తాజాగా నిఖిల్ ఈ గొడవపై స్పందిస్తూ.. 'అవును.. నిర్మాత, నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. కానీ అదంతా సినిమా కోసమే! ఇప్పుడంతా ఓకే. నిర్మాతను నేను ఒకటే కోరాను. రూ.250 పెట్టి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు వినోదం పంచాలి. ఇది మంచి సినిమా. అందుకే ఇంకాస్త సమయం తీసుకుందామని కోరాను. అయితే క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే కొంచెం క్వాలిటీ తగ్గిపోయినా మార్నింగ్‌షో తర్వాత ప్రేక్షకులు ఉండరు. అందుకే మేం ఆ పని చేయలేదు. ఈ విషయంలో దర్శకనిర్మాతలు నన్ను సంతృప్తి పరిచారు కాబట్టే ఇప్పుడు మీడియా ముందుకు స్వచ్ఛందంగా, ధైర్యంగా వచ్చాను' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహించాడు. చదవండి: పదేపదే అందంగా లేనని చెప్తుంటే: శోభిత ధూళిపాళ -
4 పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న నిఖిల్