'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటోన్న నిఖిల్.. ఫస్ట్ సింగిల్‌ వచ్చేసింది! | Nikhil Siddhartha's Appudo Ippudo Eppudo Movie Hey Taara Song Out Now | Sakshi
Sakshi News home page

Nikhil Siddhartha: 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటోన్న నిఖిల్.. ఫస్ట్ సింగిల్‌ వచ్చేసింది!

Published Fri, Oct 18 2024 3:22 PM | Last Updated on Fri, Oct 18 2024 3:30 PM

Nikhil Siddhartha's Appudo Ippudo Eppudo Movie Hey Taara Song Out Now

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సినిమా టైటిల్‌తో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.  స్వయంభూ సెట్స్‌పై ఉండగానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇ‍చ్చాడు హీరో.  ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ మూవీని సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు.

(ఇది చదవండి: 'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్)

తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హే తారా అంటూ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణచైతన్య లిరిక్స్ అందించగా.. కార్తీక్, నిత్యశ్రీ ఆలపించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఈ మూవీని లవ్‌ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రానికి కార్తీక్ సంగీతమందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement