first
-
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటోన్న నిఖిల్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సినిమా టైటిల్‌తో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్వయంభూ సెట్స్‌పై ఉండగానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.(ఇది చదవండి: 'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్)తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హే తారా అంటూ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణచైతన్య లిరిక్స్ అందించగా.. కార్తీక్, నిత్యశ్రీ ఆలపించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఈ మూవీని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రానికి కార్తీక్ సంగీతమందించారు. -
త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ (ఆటోమేటెడ్ పీపుల్ మూవర్-ఏపీఎం) సర్వీసు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది. ఎయిర్ ట్రైన్ అనేది మెట్రో తరహాలోని డ్రైవర్ లేని రైలు.ప్రయాణికులు ఇప్పటివరకూ విమానాశ్రయంలోని మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు, లేదా విమానాన్ని డీబోర్డింగ్ చేశాక క్యాబ్‌ను ఎక్కేందుకు బస్సు సర్వీస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ. రెండువేల కోట్లతో 7.7 కి.మీ. పొడవున ఎయిర్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. 🚨 Delhi airport to get India's first air train by 2027, connection terminals 1, 2, and 3. pic.twitter.com/z9Qsiok9t9— Indian Tech & Infra (@IndianTechGuide) September 24, 2024ఎయిర్ ట్రైన్ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్మెంట్లను కలిగి ఉంటుంది. ఇది ట్రాక్‌లపై నడుస్తుంది. నిర్ణీత ట్రాక్‌లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళుతుంది. దీంతో వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. విమానాశ్రయంలోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్ స్థలాలు, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు మొదలైన వాటిని చేరుకోవడానికి ఎయిర్ ట్రైన్స్ ఉపయోగపడతాయి. ఇది కూడా చదవండి: చైనా క్షిపణి ప్రయోగం.. అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పు -
ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్ ఇతనే..
ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదైనా కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ విడుదలైంది. దీంతో ముంబైలోని యాపిల్ స్టోర్‌కు కస్టమర్లు పోటెత్తారు. స్టోర్ తెరవక ముందు నుంచే బారులు తీరారు.ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు స్థానిక స్టోర్‌లో ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్‌గా మారాడు. ఇందు కోసం ముందు రోజే ఆయన ముంబైలోని బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు చేరుకున్నాడు. 21 గంటల పాటు లైన్లో వేచి ఉన్నాడు. ముందు రోజు రాత్రి ఉజ్వల్ అక్కడికి చేరుకోగానే పదుల సంఖ్యలో జనం క్యూలో అతనితో చేరారు. ఉదయానికి వందల మంది వచ్చేశారు. యాపిల్ స్టోర్ తలుపులు తెరుచుకోగానే ఉజ్వల్ మొదటి కస్టమర్‌గా లోపలికి అడుగుపెట్టాడు.యాపిల్ అభిమాని అయిన ఉజ్వల్ ఐఫోన్ తొలి కస్టమర్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారి ముందు వరుసలో ఉంటుంటాడు. గత సంవత్సరం ఐఫోన్ 15 విడుదలైనప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మొదటి వ్యక్తిగా 17 గంటలు వేచి ఉన్నాడు. యాపిల్ ఉత్పత్తుల పట్ల అతనికున్న క్రేజ్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తోంది. -
Teachers' Day 2024 : ప్రపంచంలో తొలి పాఠశాల ఎలా ప్రారంభమయ్యింది?
మనిషి జీవితంలో గురువు పాత్ర అమోఘమైనది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి కూడా. అయితే ప్రపంచంలోని మొట్టమొదటగా పాఠశాల ఎలా ప్రారంభమయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రపంచంలోని మొట్టమొదటి ప్రొఫెషనల్ టీచర్‌గా కన్ఫ్యూషియస్ గుర్తింపు పొందారు. 551 బీసీలో చైనాలో జన్మించిన తత్వవేత్త కన్ఫ్యూషియస్ ఒక ప్రైవేట్ ట్యూటర్‌గా జీవితం ప్రారంభించారు. కొంతమంది గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ను మొదటి గురువుగా పరిగణించినప్పటికీ, కన్ఫ్యూషియస్‌ను కూడా అదేవిధంగా భావిస్తారు. కన్ఫ్యూషియన్ చైనాలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడని చెబుతారు. ఆయన స్వతహాగా సంగీతం, చరిత్ర, గణితం నేర్చుకున్నాడు. ఆ కాలంలో రాజకుటుంబంలోని పిల్లలకు మాత్రమే విద్యనభ్యసించే అవకాశం ఉండేది. అయితే కన్ఫ్యూషియస్ విద్య అనేది అందరికీ చేరాలని కోరుకున్నాడు. అందుకే అతను ట్యూటర్‌గా మారి, అందరికీ విద్యను బోధించడం ప్రారంభించారు.3,000 బీసీ నాటికే ఈజిప్టులో పాఠశాల విద్య ప్రారంభమైంది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తెలిపిన వివరాల ప్రకారం ఈజిప్టులో రెండు రకాల అధికారిక పాఠశాలలు నెలకొల్పారు. ఒకటి క్లరికల్ పనులు నేర్చించేందుకు, మరొకటి పండిత శిక్షణ కోసం కేటాయించారు. ఐదేళ్ల వయసు గల పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పించేవారు. వారికి 16-17 ఏళ్లు వచ్చేవరకూ విద్యను బోధించేవారు. -
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా చరిత్రకెక్కిన సాధనా సక్సేనా
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా సాధనా సక్సేనా నాయర్ ( Sadhna Saxena Nair) రికార్డు సృష్టించారు. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళా డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఆగస్టు 1న (గురువారం) ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు.ఈ నియామకానికి కంటే ముందు ఆమె ఆర్మీ బలగాల డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారి కూడా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయరే కావడం గమనార్హం. ర్యాంకులో ఎయిర్ మార్షల్‌గా పదోన్నతి కల్పించి మరీ ఆమెను ఆ పదవిలో నియమించారు. గతంలో ఆమె ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన ఎయిర్ మార్షల్ సాధనా సక్సేనా నాయర్ 1985లో వైద్యురాలిగా ఆర్మీలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎయిర్ మార్షల్ హోదాకు చేరుకున్నారు. డిసెంబరు 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో నియమితులయ్యారు. 1986లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా చేరారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ , స్విట్జర్లాండ్‌లోని MME (మిలిటరీ మెడికల్ ఎథిక్స్)తో CBRN (కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్) వార్ఫేర్లో శిక్షణ పొందారు.వైద్య విద్యపై ఆసక్తితో ఆర్మీలో పనిచేస్తూనే ఆమె ఫ్యామిలీ మెడిసిన్‌లో పీజీ చేశారు. న్యూ ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా ర్మీ మెడికల్ సర్వీసెస్‌కు డీజీగా ఎంపికయ్యారు. ఆమె అందించిన సేవలకు గాను విశిష్ట సేవా పతకాన్ని (VSM) అందుకున్నారు. మెరిటోరియస్ సర్వీస్ కోసం ఆమెకు AOC-in-C (వెస్ట్రన్ ఎయిర్ కమాండ్),చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ప్రశంసలు లభించాయి. జనరల్ ఆఫీసర్ ఎయిర్ మార్షల్ కేపీ నాయర్ (రిటైర్డ్)ని వివాహం చేసుకున్నారు. నాయర్ కుటుంబంలోని మూడు తరాలు గత 70 ఏళ్లుగా సాయుధ దళాలలో పనిచేశారు. -
తొలి ఆషాడం.. పుట్టింటికి వచ్చిన హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ (ఫొటోలు)
-
కొడుకు ఫేస్ రివీల్ చేసిన సింగర్ గీతామాధురి.. ఎంత ముద్దొచ్చేస్తున్నాడో! (ఫొటోలు)
-
వారణాసిలో తొలి హైడ్రోజన్ క్రూయిజ్
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్‌ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది. మొదట ఈ హైడ్రోజన్ క్రూయిజ్‌ను నమో ఘాట్‌కు తీసుకువచ్చి, తరువాత రామ్‌నగర్‌లోని మల్టీమోడల్ టెర్మినల్‌కు తరలించారు. ఈ క్రూయిజ్ కొచ్చిలోని షిప్‌యార్డ్‌లో అనేక సౌకర్యాలతో నిర్మితమయ్యింది.ఈ క్రూయిజ్‌లో 50 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. కాలుష్యాన్ని ఉత్పత్తి చేయకుండా గంగానదిలో నడిచే తొలి క్రూయిజ్ ఇది. ఈ క్రూయిజ్ వారణాసి- చునార్ మధ్య నడుస్తుంది. దీనిని పర్యాటక శాఖ పర్యవేక్షించనుంది.ఈ క్రూయిజ్ నిర్వహణ కోసం వారణాసిలోని రామ్‌నగర్ మల్టీ మోడల్ టెర్మినల్‌లో తాత్కాలిక హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ క్రూయిజ్‌లో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా అమర్చారు. తద్వారా హైడ్రోజన్ ఇంధనం తగ్గినప్పుడు, క్రూయిజ్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడపవచ్చు. వారణాసి తర్వాత అయోధ్య, మథురలలో కూడా ఈ క్రూయిజ్‌ను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
CNG-Powered Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ (ఫొటోలు)
-
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
మోదీ 3.0 కేబినెట్ తొలి భేటీ.. కీలక నిర్ణయాలివే..
సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడ్డాక తొలి కేబినెట్ భేటీ బుధవారం(జూన్18) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారు. నూనె గింజలు, పప్పులకు మద్దతు ధర ఎక్కువగా పెంచారు. కందిపప్పునకు క్వింటాలుకు 552 రూపాయల ధర పెంచగా వరి, రాగి, జొన్న , పత్తి తదితర పంటలకు నూతన మద్దతు ధర ప్రకటించారు. -
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
తొలి డిజిటల్ బెగ్గర్ కన్నుమూత!
రాజు భికారీ పేరెప్పుడైనా మీరు విన్నారా? బీహార్‌లోని బెట్టియా రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకునేవాడు ఈయన. మామూలు బిచ్చగాడైతే ఎవరూ పట్టించుకోకపోదురు కానీ... ఈయన దేశంలోనే తొలి డిజిటల్ బెగ్గర్! పాపం.. గుండెపోటుతో కాలం చేయడంతో ఈయన గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏమిటబ్బా ఈ డిజిటల్ బెగ్గర్ కథ అనుకుంటున్నారా? మరి చదివేయండి.బెట్టియా రైల్వే స్టేషన్లో చాలాకాలంగా రాజు భికారీ ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఎందుకంటే.. మెడలో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం క్యూర్ కోడ్లతో కూడిన ట్యాగ్లు వేలాడుతూండేవి. వచ్చి పోయే వారిని డబ్బులు అడుక్కునేవాడు. అయితే పేమెంట్ మాత్రం డిజిటల్ పద్ధతిలోనే చేయాలి. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిచ్చం వేయాలన్నమాట. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా స్ఫూర్తితో తానీ కొత్త తరహా భిక్షాటనకు పూనుకున్నానని బతికుండా రాజు భికారీ చెప్పుకునేవాడు.డిజిటల్ పద్ధతులు రాక ముందే.. అంటే దాదాపు 32 ఏళ్లుగా రాజు భికారీకి భిక్షాటనే జీవనోపాధి. మోడీ అంటే అభిమానం ఎక్కువ. ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవాడట. అంతకు ముందు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను తన తండ్రిగా చెప్పుకునేవాడు రాజు. అప్పట్లో ఆయనకు బెట్టియా రైల్వే స్టేషన్ క్యాంటీన్ నుంచే రోజుకు రెండు పూటల ఆహారం దొరికేది కూడా.డిజిటల్ పద్ధతిలో అడుక్కోవడం మొదలుపెట్టిన తరువాత కూడా లాలూ అంటే అభిమానం పోలేదు కానీ.. మతిస్థిమితం సరిగ్గా లేకుండా పోయింది. ఆరోగ్యమూ అంతకంత క్షీణించడం మొదలైంది. చివరకు బెట్టియా రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్లు చూపిస్తూ అడుక్కుంటూండగానే... గుండెపోటు వచ్చింది.!! -
అందాల దీవుల్లో అడుగు పెట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
దేశంలోనే అగ్రగామి ప్రైవేటు బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్డీఎఫ్సీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో అడుగుపెట్టింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తొలి బ్రాంచ్ ఏర్పాటు చేసింది. లక్షద్వీప్‌లో ఇప్పటివరకు ఏర్పాటైన మొదటి ప్రైవేటు బ్యాంకు ఇదే. భారత్‌కు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో కొలువు దీరిన అందమైన ద్వీపాల సమాహారం.. లక్షద్వీప్. ఇటీవల మాల్దీవుల వివాదం నేపథ్యంలో లక్షద్వీప్‌కు విపరీతమైన ప్రచారం లభించింది. ప్రధాని మోదీ కూడా స్వయంగా లక్షద్వీప్‌లో అడుగుపెట్టి టూరిజాన్ని ప్రోత్సహిస్తూ పర్యాటకులు ఇక్కడికి రావాలని ప్రకటనలు చేశారు. ఫలితంగా ఈ దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిన లక్షద్వీప్ ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు, స్థానికులు, పర్యాటలకు పర్సనల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తమ బ్రాంచిని ఏర్పాటు చేసినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. 2023 డిసెంబర్ 31 నాటికి, హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 3,872 నగరాలు, పట్టణాల్లో 8,091 బ్రాంచ్‌లు, 20,688 ఏటీఎంలు ఉన్నాయి. -
త్వరలో తొలి స్లీపర్ వందేభారత్.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
దేశంలోని తొలి స్లీపర్ వందేభారత్ త్వరలో పట్టాలపై పరుగులు తీయనుంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్- న్యూఢిల్లీ మధ్య స్లీపర్ వందే భారత్‌ను నడపడానికి ఈశాన్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇండియన్ రైల్వే టైమ్ టేబుల్ కమిటీ (ఐఆర్టీటీసీ) ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జైపూర్‌లో సమావేశం కానుంది. దీనిలో ఈ రైలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రైల్వే జోన్ల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.. కొత్త రైళ్లను నడపడం, ట్రిప్పులను పెంచడం, రూట్లను మార్చడం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈశాన్య రైల్వే రూపొందించిన ప్రతిపాదన ప్రకారం నూతన స్లీపర్ వందేభారత్ రైలు వారానికి మూడు రోజులు నడవనుంది. గోరఖ్‌పూర్ నుంచి రాత్రి వేళల్లో ఈ రైలును నడపాలని ప్రతిపాదించారు. ఈ రైలు గోరఖ్‌పూర్ నుండి న్యూఢిల్లీకి 12 గంటల్లో చేరుకుంటుంది. ఈ సమావేశంలో ఈ రైలుకు ఆమోదం లభిస్తే 2024, జూలై నుంచి ఈ రైలు రాకపోకలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోరఖ్‌పూర్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా రైలు నడపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం గోరఖ్‌పూర్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు వందే భారత్ రైలు నడుస్తోంది. నూతన ప్రతిపాదనల ప్రకారం స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. అంటే గోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవచ్చు. -
శాంతి స్వరూప్ కన్నుమూత
రామంతాపూర్, సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రచార సాధనమైన దూర దర్శన్ చానల్లో తొలి తెలుగు యాంకర్‌గా ప్రసి ద్ధులు, తెలుగు ప్రజలకు తన కంచు కంఠంతో వార్తలు చెప్పిన జయంత్ శాంతి స్వరూప్ (74) కన్నుమూశారు. శుక్రవా రం ఉదయం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ దూరదర్శన్ సీనియర్ యాంకర్ రోజా రాణిని వివాహమాడారు. ఆమె కొన్ని సంవత్స రాల క్రితమే చనిపోయారు. శాంతి స్వరూప్‌కు ఇద్దరు కుమారులు మేగాన్‡్ష, అగ్నేయ. 1978లో దూరదర్శన్ కేంద్రంలో యాంకర్‌గా చేరిన ఆయన 1983 నుంచి తెలుగులో వార్తలు చదవ డం మొదలుపెట్టారు. 2011లో పదవీ విరమణ చేశారు. టెలిప్రాంప్టర్ర్ లేని రోజుల్లోనే వార్తలను ముందుగానే మననం చేసుకుని తెర ముందు పొల్లు పోకుండా తప్పులు లేకుండా అనర్గళంగా చదివి తెలుగు ప్రజలకు వార్తలు అందించారు. శాంతి స్వరూప్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవా ర్డుతో పాటు పలు సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. భూపాల్ గ్యాస్ దుర్ఘటన కవ రేజ్‌ను వీక్షకులకు కళ్ళకు కట్టినట్లుగా అందించిన ఆయన రాతి మేఘం, క్రికెట్ మీద క్రేజ్, అర్ధాగ్ని అనే నవలలు కూడా రాశారు. ఆయన పార్ధివ దేహాన్ని రామంతాపూర్ టీవీ కాలనీలోని స్వగృహానికి తరలించి అక్కడి నుంచి అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంచుకంఠం మూగబోయిందనీ, తొలితరం న్యూస్ రీడర్‌గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మృతి బాధాకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంతాపాన్ని ప్రకటించారు. శాంతి స్వరూప్ సేవలు చిరస్మరణీయం తెలుగులో వార్తలు చదివిన తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించా రు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడి యా రంగంలో చిరస్మరణీయమని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థించారు. శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యూస్‌రీడర్‌గా తనదైన ముద్ర శాంతి స్వరూప్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్త లను చదివే తొలితరం న్యూస్ రీడర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన శాంతి స్వరూప్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే పేలిన జపాన్ తొలి ప్రైవేటు రాకెట్..!
టోక్యో: వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ లాంచ్ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది. ఈ రాకెట్ నింగిలోకి ఎగిరితే జపాన్ చరిత్రలోనే తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి ఎగిరిన రికార్డు క్రియేట్ అయ్యేది. JUST IN: Space One rocket in Japan explodes after takeoff during its “inaugural launch.” The Kairos rocket was attempting to make Space One the first Japanese company to put a satellite in orbit. (Reuters) The 59 ft, four-stage solid-fuel rocket was launched from the Kii… pic.twitter.com/BJAAWXGsCy — Collin Rugg (@CollinRugg) March 13, 2024 ఈ రాకెట్‌ను స్పేస్ వన్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్ రాకెట్ ప్రభుత్వానికి చెందిన సాటిలైట్ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్ మార్చ్ 9వ తేదీనే లాంచ్ కావల్సి ఉండగా పలు కారణాల వల్ల లాంచింగ్ వాయిదాపడింది. రాకెట్ పేలిపోవడంతో స్పేస్ వన్ కంపెనీ షేర్లు జపాన్ స్టాక్మార్కెట్లో ఒక్కరోజే 13 శాతం పడిపోయాయి. ఇదీ చదవండి.. చైనాలో భారీ పేలుడు -
తొలి వేద గడియారం సిద్ధం.. అందుబాటులోకి ఎప్పుడంటే..
ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రూపొందింది. దీనిని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా కాళిదాస్ అకాడమీలో ప్రారంభించనున్నారు. వేద గడియారానికి సంబంధించిన ఇన్స్టలేషన్, టెస్టింగ్ వర్క్ పూర్తయింది. భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారంలో ఒక గంట అంటే 48 నిమిషాలు. ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. ఉజ్జయినిలో క్రేన్ సాయంతో దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ పై దీనిని అమర్చారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి ఒకటిన ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ వాచ్ కానుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయం (ఐఎస్టీ), గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) మాత్రమే కాకుండా పంచాంగంతో పాటు ముహూర్తాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలే కాకుండా సూర్య , చంద్ర గ్రహణాల గురించి కూడా తెలియజేస్తుంది. కాగా వేద క్లాక్ రీడింగ్ కోసం మొబైల్ యాప్ రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, టెలివిజన్ తదితర పరికరాలలో వినియోగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వేద గడియారాన్ని వ్యవస్థాపించేందుకు ఉజ్జయినిలోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో 85 అడుగుల ఎత్తైన టవర్‌ను నిర్మించారు. -
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్ సర్కార్ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్ విడుదల చేస్తు న్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. రక్తహీనత నివారణ చర్యల్లో భేష్ రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్‌తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. డిజిటల్ వైద్య సేవల్లో ఫస్ట్ ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం, భవిష్యత్‌లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఆరోగ్య ధీమా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కు టుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. దీంతో ఏపీలోని 95 శాతం కుటుంబా లకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జనా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించింది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి తీసుకున్న చర్యలివీ ► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం ►గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు ►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు ► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. -
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్‌ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
భారత్‌లో తొలి క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యిందో తెలుసా!
కేక్ అనేది మన సంప్రదాయ వంటకం కాదు. బ్రిటీష్ వాట్ల నుంచి వచ్చిందే. అయితే మన దేశంలో మొట్టమొదటి క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యింది? ఎవరు తయారు చేశారో వింటే ఆశ్చర్యపోతారు. పైగా ఆ కాలంలో కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు కూడా అందుబాటులో కూడా ఉండేవి కాదు. అయితే కేరళకు చెందిన ఒక వ్యక్తి బ్రిటీష్ వాళ్లు మెచ్చుకునేలా తయారుచేశాడు. ఇప్పుడు అతని షాపే ఫ్లమ్ కేక్ తయారీలో నెంబర్ వన్‌గా లాభాలు ఆర్జిస్తోంది కూడా. 1883లో క్రిస్మస్ సందర్భంగా బర్మా నుంచి వచ్చిన ఔత్సాహిక స్థానిక వ్యాపారవేత్త మాంబల్లి బాపు భారతదేశంలో తొలి క్రిస్మస్ కేక్‌ని తయారు చేశారు. దాల్చిన చెక్క తోటను అభివృద్ధి చేస్తున్న బ్రిటీష్ వ్యవసాయాధికారి మర్డోక్ బ్రౌన్ సూచనలతో తయారు చేసినట్లు బాపు మనవడు చెబుతున్నాడు. తన ముత్తాత మాంపల్లి బాపు బర్మాలో వ్యాపారావేత్త. అతను ఈజిప్టులో బ్రిటీష్ దళాలకు పాలు, టీ, రొట్టే వంటివి రవాణ చేసేవాడని, ఆ తర్వాత 1880లో కేరళలలోని తన సొంతూరు తలస్సేరికి వచ్చిన వెంటనే బేకరీని స్థాపించాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే దూరంగా ఉన్న కోలకతాలో ఉన్న ఒకేఒక్క బేకరీ మాత్రమే బ్రిటీష్ ప్రజల అవసరాలను తీర్చేది. ఆ లోటుని బాపు బిస్కట్స్ ఫ్యాక్టరీ తీర్చింది. కాబట్టి బాపు రాయల్ బిస్కట్స్ ఫ్యాక్టరీ భారతీయులచే స్థాపించబడిన తొలి బేకరిగా మారింది. బర్మాలో ఉండగా బాపు తొలుత బిస్కెట్ తయారీలో మంచి శిక్షణ పొందాడు. ఆ బ్రిటీష్ రైతు మర్డోక్ బ్రౌన్ ఇంగ్లండ్ నుంచి తెచ్చిన రిచ్ ప్లం కేక్‌తో బాపు బిస్కెట్ ఫ్యాక్టరీకి వెళ్లాడు. కేక్ ముక్కను రుచి చూడమని బాపుని కోరాడు. అంతేగాక ఇదే మాదిరిగా కేక్‌ని తయారీ చేయాలని చెప్పాడు కడా. ఈ తయారీనే తనకు భారతదేశ పాకశాస్త్ర చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరస్తుందని ఊహించని బాపు అందుకు ఒప్పుకున్నాడు. మర్డోకో ఆ కేక్ తయారీకి కావాల్సిన బ్రౌన్ కోకో, ఖర్జూరం, ఎండుద్రాక్ష, వివిధ డ్రై ఫ్రూట్స్‌ని అందించాడు. అలాగే పక్కనే ఉన్న పుదుచ్చేరి నుంచి బ్రాందీని కూడా కొనుగోలు చేసి తయారు చేయమని చెప్పాడు మర్డోక్. ఆ రోజుల్లో కిణ్వన ప్రక్రియ కోసం అందుబాటులో ఈస్ట్ లేదు. అందుకని 14 కిలోమీటర్లు ప్రయాణించి మాహేకి వెళ్లి బ్రాందీని కొనుక్కోవాల్సి వచ్చేది. దీంతో వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు బాపు జీడిపప్పు, యాపిల్, అరటి రకమైన కడలిపాజమ్ని ఉపయోగించి స్థానికంగా తయారుచేసిన మద్యంతో ఆ సమస్యను భర్తీ చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అలా కేక్ తయారీకి స్థానికంగా తయారైన మద్యంతోనే తయారు చేయడం మొదలు పెట్టాడు బాపు. అయితే బాపు చేసిన కేక్‌ని రుచి చూసిన మర్డోకో బ్రౌన్ వావ్! ఇదే ది బెస్ట్ కేక్ అని కితాబి ఇచ్చి మరీ డజనులు కొద్దీ కేకులను కొనుక్కుని మరీ వెళ్లాడు. ఇప్పుడూ ఆ షాపే భారతదేశంలో అతిపెద్ద ప్లం కేక్ మార్కెట్‌ని కలిగి ఉంది. ఈ వ్యాపారంలో మాంపల్లి కుటుంబానికి ప్రధాన వాటా కూడా ఉందని బాపు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడి కుటుంబ సభ్యులంతా కేరళలో అగ్రశ్రేణి బేకరీలను నిర్వహిస్తున్నారు. వారంతా కేరళలో.. కొచ్చిలోని కొచ్చిన్ బేకరీ, తిరువనంతపురంలోని శాంత బేకరీ, కోజికోడ్‌లోని మోడరన్ బేకరీ, కొట్టాయంలోని బెస్ట్ బేకింగ్ కో. తలస్సేరిలోని మాంబల్లి బేకరీలతో బాపు వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. అంతేగాదు ప్రతీ బేకరీలో బాపు బ్రౌన్కేక్ను అందచేసిన పేయింటింగులతో కస్టమర్లను స్వాగతిస్తూ చారిత్రక ఘట్టాన్ని తెలియజేస్తున్నారు. (చదవండి: జీసస్ రియల్ లుక్ ఎలా ఉండేదంటే..? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా..
తెలంగాణలో తొలి ఉద్యోగం నాకే రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. గాంధీ భవన్ వెళ్లినప్పుడు ఆయన నాకు ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఆయన నెరవేరుస్తుండడం హ్యాపీగా ఉంది.. :::రజిని అధికారంలోకి గనుక వస్తే.. అంటూ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సర్కార్ ఏర్పాటు అవుతున్న తరుణంలో వాటిని నెరవేర్చేందుకు సిద్ధమైపోయింది. రేపు డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణం ముఖ్యమంత్రిగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ హామీలు నెరవేర్చడంపైనా ఆయన స్పష్టమైన ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. తొలి ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో తొలి ఉద్యోగం రజినీ అనే యువతికి దక్కనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని అధికార యంత్రాంగాన్ని రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం అని స్వయంగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడా గ్యారెంటీని నెరవేర్చేందుకు రెడీ అయిపోయారు. అక్టోబర్ 17వ తేదీన.. నాంపల్లికి చెందిన రజిని అనే ఓ దివ్యాంగురాలు గాంధీభవన్‌కు వెళ్లి రేవంత్‌రెడ్డిని కలిశారు. రజిని రెండేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతోంది. పీజీ చేసిన తనకు ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రావట్లేదని తన బాధను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పింది. అప్పుడు రేవంత్ రెడ్డి .. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం నీకే ఇస్తాం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార సభ ఉంటుంది. ఆ సభకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ వస్తారు. ఆ సభలోనే మొదటి ఉద్యోగం నీకేనమ్మా. ఇది నా గ్యారెంటీ’’ అంటూ రేవంత్ ఆమెకు హామీ ఇచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు మీద స్వయంగా ఆయన రజినీ పేరు రాసి.. కింద సంతకం కూడా చేశారు. As PCC President of Telangana , promised first job to Rajini, a physically challenged girl from Nampally as soon as #Congress comes to power. I filled the Congress guarantee card with Rajini's name. Rajini, who completed post graduation expressed her grief that she is not… pic.twitter.com/JFSha8a56M — Revanth Reddy (@revanth_anumula) October 17, 2023 నెలన్నర తర్వాత.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో తొలి ఉద్యోగం రజినికే దక్కబోతోంది. కానీ, ప్రమాణ స్వీకారమే రెండు రోజులు ముందుగానే జరుగుతోంది. -
రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..!
సక్సెస్‌కి మారుపేరుగా నిలవాలంటే జెండర్‌తో పని ఏముంది. పట్టుదల ఉండాలి...దానికి తగ్గ కృషి, వీటన్నింటికీ మించిన సంకల్పం ముఖ్యం. దీనికి ఆత్మ విశ్వాసాన్ని, కఠోర శ్రమను జోడించి సక్సెస్‌తో సలాం చేయించుకుంటూ ఈ విషయంలో మేమేం తక్కువ కాదంటోంది మహిళా శక్తి. వివక్షల్నీ, అడ్డంకుల్నీ అధిగమించి వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా శక్తికి, సాధికారతకు, నిదర్శనంగా నిలిచారు ముగ్గురు ధీర వనితలు. దేశం గర్వించేలా భారత నారీశక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. అక్షతా కృష్ణమూర్తి అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)తో కలిసి మార్స్ రోవర్‌ను నిర్వహించే తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ డా. అక్షతా కృష్ణమూర్తి. పెద్ద పెద్ద కలలు కనడం పిచ్చితనమేమీ కాదు.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. ఆశయ సాధనలో అలుపెరుగక పనిచేస్తూ పొండి... విజయం మీదే, నాదీ గ్యారంటీ అంటారామె. అంగారక గ్రహంపై రోవర్‌ను ఆపరేట్ చేయనున్న తొలి భారతీయ మహిళగా అవతరించిన తన సక్సెస్ జర్నీని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 13 ఏళ్ల క్రితమే నాసాలో పని చేయాలనేది ఆమె కల. భూమి ,అంగారక గ్రహంపై సైన్స్ అండ్ రోబోటిక్ ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించాలనేది చిరకాల డ్రీమ్. అలా అమెరికా ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో లక్ష్యాన్ని సాధించేంతవరకు ఎవరేమన్నా పట్టించుకోలేదు. View this post on Instagram A post shared by Dr. Akshata Krishnamurthy | Rocket Scientist (@astro.akshata) కానీ ఇది అంత సులువుగా ఏమీ జరగలేదు. పీహెచ్డీ డిగ్రీనుంచి నాసాలో ఫుల్ టైం ఉద్యోగం వచ్చేదాకా ఎంతో కష్టపడ్డాను అని చెప్పారు. ఈ రోజు, అంగారక గ్రహంనుంచి అనేక శాంపిల్స్‌ను భూమికి తీసుకురావడానికి రోవర్‌తో సహా పలు కూల్ స్పేస్ మిషన్లలో పని చేస్తున్నాను అని పేర్కొన్నారు. అక్షత MIT (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుండి పీహెచ్డీ ఏశారు. నాసాలో చేరిన అతికొద్ది మంది భారతీయుల్లో ఆమె కూడా ఒకరు. నాసాలో ప్రధాన పరిశోధకురాలిగా గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. మహిళా ఆర్మీ డాక్టర్ కెప్టెన్ గీతిక కౌల్ సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లోని భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. స్నో లెపార్డ్ దళానికి చెందిన కెప్టెన్ గీతికా కౌల్ చరిత్ర సృష్టించారు. హిమాలయాల ఉత్తర భాగంలో ఉన్న సియాచిన్ బాటిల్ స్కూల్లో కఠినమైన ఇండక్షన్ శిక్షణను సక్సెస్‌ఫుల్‌గా ప పూర్తి చేసి మరీ ఈ కీలకమైన మైలురాయిని సాధించారు. అనేక అడ్డంకులను ఛేదించి అంకితభావంతో, దేశానికి సేవ చేయడం స్ఫూర్తిదాయకం. స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసిన మరో మహిళా శక్తి స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి. మిజోరాంలో గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి కీలక పదవిలో పాధిని ఎంపిక చేశారు. 2015 బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన Sqn లీడర్ మనీషా పాధిని భారత సాయుధ దళాల నుండి భారతదేశపు తొలి మహిళా సహాయకురాలుగా (ఎయిడ్-డే-క్యాంప్) నియమించారు.అధికారికంగా ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు. Sqn లీడర్ మనీషా పాధి మూడు కీలక పదవులను కూడా నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పూణే, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, భటిండాలో పనిచేశారు. ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన మనీషా తండ్రి ఇన్స్పిరేషన్. ఆమె భర్త మేజర్ దీపక్ సింగ్ కర్కీ ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నారు. భువనేశ్వర్‌లోని CV రామన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా 2015లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఏఐఎఫ్‌లో చేరారు. Squadron Leader Manisha Padhi appointed as Aide-De-Camp(ADC) to the Governor of Mizoram. Sqn Leader Manisha is India’s first Woman Indian Armed Forces officer to be appointed as Aide-De-Camp(ADC) to the Governor in the country: Governor of Mizoram (Source: Office of Governor of… pic.twitter.com/3wsWuI5hBW — ANI (@ANI) December 4, 2023 ఏడీసీ అంటే? గవర్నర్‌కు వ్యక్తిగత సహాయకురాలిగా అధికారిక పర్యటనలలో కూడా రాజ్యాంగ అధికారంతో వెంట ఉంటారు. ప్రతి గవర్నర్‌కు ఇద్దరు ADCలు ఉంటారు, ఒకరు సాయుధ దళాల నుండి , మరొకరు పోలీసు అధికారి. మిజోరంలో,రెండో ఏడీసీ రాష్ట్ర పోలీసు అధికారిగా జోనున్ తారా ఉన్నారు. -
కాలేయ మార్పిడితో బతికిన బాలుడు.. డాక్టర్ అయ్యాడు!
Indias 1st Child Liver Transplantee: పాతికేళ్ల క్రితం కాలేయ మార్పిడితో పునర్జన్మ పొందిన బాలుడు ఇప్పుడు అదే వైద్యరంగంలో డాక్టర్ అయ్యాడు. అవయవ మార్పిడి అద్భుత విజయానికి సజీవ సాక్ష్యంగా నిలిచాడు. భారతదేశపు మొట్టమొదటి విజయవంతమైన పీడియాట్రిక్ కాలేయ మార్పిడి గ్రహీత అయిన తమిళనాడుకు చెందిన సంజయ్ కందసామి వైద్య విద్యను అభ్యసించి డాక్టరుగా సొంతూరు కాంచీపురంలో విజయవంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ 1998లో 20 నెలల చిన్నారిగా ఉన్నప్పుడు కందసామికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడిని నిర్వహించింది. తద్వారా దేశంలోనే మొట్టమొదటి పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంటీగా కందసామి నిలిచాడు. ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషిని దగ్గర నుంచి చూసి తాను కూడా వైద్యుడు కావాలనుకున్నానని కందసామి మీడియా ప్రకటనలో తెలిపారు. డాక్టరుగా తాను కూడా రోగుల ప్రాణాలు కాపాడటంలో భాగం కావాలని, జీవితంలో ఎటువంటి సవాలునైనా అధిగమించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలవాలని భావించినట్లు పేర్కొన్నారు. దేశంలో మొదటి బాలుడు తమిళనాడులోని కాంచీపురానికి చెందిన కందసామి బైలరీ అట్రేసియా అనే కాలేయ రుగ్మతతో జన్మించాడు. ఇది లివర్ ఫెయిల్యూర్‌కి దారితీయడంతో కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో కందసామి తండ్రి కాలేయాన్ని ఇచ్చేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో నిపుణుల బృందం మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. దేశంలో లివర్ ప్లాంటేషన్ చేయించుకున్న మొట్టమొదటి బాలుడు కందసామే. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నవారు దీర్ఘకాలం సాఫీగా జీవించవచ్చు అనేదానికి కందసామి ఒక అద్భుతమైన ఉదాహరణని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో గ్రూప్ మెడికల్ డైరెక్టర్, సీనియర్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబల్ అన్నారు. కందసామి కాలేయ మార్పిడి ఆపరేషన్ తన కెరీర్లో గర్వించదగిన క్షణాలలో ఒకటిగా పేర్కొన్నారు మరో డాక్టర్, మేదాంత లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ఏఎస్ సోయిన్. కందసామి విజయవంతమైన ఆపరేషన్ తర్వాత అపోలో ఆసుపత్రి వైద్యులు ఇప్పటి వరకు 4,300 కాలేయ మార్పిడి ఆరరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఇందులో 515 మంది పిల్లలు ఉండటం గమనార్హం. -
అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్!
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి (Infosys founder NR Narayana Murthy) ‘వారానికి 70 గంటల పని’ వ్యాఖ్యల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అసలే పని ఒత్తిడితో సతమతమవుతూ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించలేకపోతుంటే మళ్లీ అధిక పని గంటల సలహాలేంటని చాలా మంది ఉద్యోగులు కస్సుమంటున్నారు. ఇక వ్యాపారాధినేతలు, కంపెనీల ప్రముఖలలో కొందరు ఈ సలహాను సమర్థిస్తుంటే మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అలా నారాయణమూర్తి ‘70 గంటల పని’ భావనను వ్యతిరేకిస్తున్నవారిలో తాజాగా మరో ప్రముఖురాలు చేరారు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS) కంపెనీ ఫస్ట్‌గ్లోబల్‌గ్రూప్ ఫౌండర్, చైర్పర్సన్, ఎండీ దేవినా మెహ్రా (Devina Mehra) ‘వారానికి 70 గంటల పని’ భావనను తప్పుపట్టారు. సుదీర్ఘ పని గంటల వల్ల ఉత్పాదకత పెరుగుతుందని ఆమె విశ్వసించడం లేదు. అంతేకాదు ఈ సలహాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు కూడా. అది వెర్రితనం ‘వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత తగ్గుతుంది. ఇది ప్రపంచమంతటికీ బాగా తెలుసు. కాబట్టి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పడం వెర్రితనం అవుతుంది. నా ఉద్దేశంలో ఈ భావన పనికిరాదు’ అని చెప్పారు దేవినా మెహ్రా. వారానికి 70 గంటలు పనికే కేటాయిస్తే వాళ్లు ఇతర బాధ్యతలను ఏం నిర్వర్తించగలరని ఆమె పశ్నించారు. వర్క్‌ఫోర్స్‌లో చాలా మంది మహిళలకు వర్క్‌తోపాటు ఇతర బాధ్యతలూ ఉంటాయని, సుదీర్ఘ పని గంటల వాతావరణంలో అలాంటి మహిళలు పని చేయలేరని మెహ్రా వివరించారు. యువత ఆఫీస్‌లో అత్యధిక సమయాన్ని వెచ్చించాల్సిన పనిలేదని, అయితే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఒక యజమానిగా తాను అవుట్‌పుట్‌పై దృష్టి పెడతాను కానీ, పని గంటల సంఖ్యపై కాదని ఆమె స్పష్టం చేశారు.