సూర్యాపేట అర్బన్, న్యూస్‌లైన్,జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తించి వారి కుటుంబా లకు టికెట్లు కేటాయించి ప్రజల ఆదరాభిమానాలను పొందాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్ కోరారు. సూర్యాపేట పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి ప్రమేయం లేని ఆర్.కృష్ణయ్యను తెలంగాణ ముఖ్యమంత్రిగా శాలిగౌరా రం ప్రాజెక్టు రాచకాల్వ టీడీపీ ప్రకటించడం సరికాదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1400 మం దిలో 1100 మంది బీసీలే అమరుల య్యారన్నారు. రాజకీయ పార్టీలు అమరుల త్యాగాలను వారిని పట్టించుకోకుండా అగ్రవర్ణాల వారికి పెద్దపీట వేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ తా ళ్లపల్లి రామకృష్ణగౌడ్, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మే కల రంజిత్‌కుమార్, నాయకులు దేవరకొండ నరేష్‌చారి, వసంత సత్యనారాయణపిళ్లే, ఉయ్యాల నర్సయ్యగౌడ్, ఆవుల అంజయ్యయాదవ్, శాతరాజు రాము, నర్సింహ, కుశలవ, నరేష్, బత్తుల కౌసల్యయాదవ్, కొమ్ము వెంకన్న పాల్గొన్నారు.
అమరుల కుటుంబాలకు టికెట్లు ఇవ్వాలి
Published Mon, Mar 24 2014 1:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement